Cyclone Michaung
-
అభిమానులతో సూర్య విందు.. ఎందుకో తెలుసా..?
గత ఏడాది డిసెంబర్ నెలలో తమిళనాడును మిచాంగ్ తుపాను ముంచెత్తింది. ఆ సమయంలో సూర్య పిలుపు మేరకు నష్టపోయిన వారికి అండగా నిలిచిన ఫ్యాన్స్ అందరినీ సూర్య కలుసుకున్నారు. భారీ వర్షాల కారణంగా తిరునల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి సహా దక్షిణాది జిల్లాలు దెబ్బతిన్నాయి. దీంతో చాలామంది సామాన్య ప్రజలు తినేందుకు ఆహారంతో పాటు దుస్తులు లేక తీవ్రమైన అవస్థలు పడ్డారు. ఆ సమయంలో ప్రభుత్వం కూడా తక్షణమే అనేక సహాయకచర్యలు ప్రారంభించింది. సామాన్య ప్రజల ఇబ్బందులను చూసి చలించిన కోలీవుడ్ బ్రదర్స్ సూర్య, కార్తీలు వెంటనే రూ. 10 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. తుపాను తగ్గే వరకు ఆ ప్రాంతాల్లో నిత్యం అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు.. ఇవన్నీ చేయాలంటే సరైన వర్కర్స్ కావాలి.. అప్పుడు సూర్య తన ఫ్యాన్స్‌కు పిలుపునిచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఆయన అభిమానులు తుపాను తగ్గేవరకు పలు సేవలు చేశారు. అభిమానులు చేసిన సేవను గుర్తించిన సూర్య.. వారందరీని ఒక్కసారి కలుసుకోవాలని ఆహ్వానించి ఒక పార్టీ ఏర్పాటు చేశారు. చెన్నైలోని త్యాగరాయర్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో, చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో తుపాను కారణంగా నష్టపోయిన ప్రజల కోసం పనిచేసిన సూర్య అభిమానుల సంఘంలోని సభ్యులందరినీ స్వయంగా సూర్య కాల్ చేసి పిలిచారు. వారందరికి శాఖాహార విందును ఆయన ఏర్పాటు చేశారు. తన అభిమానులకు స్వయంగా సూర్యనే వడ్డించడం విశేషం. అలాగే వారితో కలిసి ఫోటో దిగుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు నటుడు సూర్య. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సూర్య 'కంగువా'లో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఐమ్యాక్స్, 3డీ వెర్షన్లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. దిశా పఠానీ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ దేవోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఇది విడుదల కానుంది. -
రైతులకు అండగా కొడాలి నాని మరియు పేర్ని నాని
-
గాయం మానేలా సాయం
-
ఆంధ్రప్రదేశ్‌లో తుపాను బాధితులకు గతంలో కంటే వేగంగా, మిన్నగా, ముందే అందిన సాయం..ఇంకా ఇతర అప్డేట్స్
-
గాయం మానేలా సాయం
సాక్షి, అమరావతి: విపత్తుల సమయంలో బాధితులు కోరుకునేది తక్షణం ఆదుకునే ఆపన్న హస్తాన్ని! మానవత్వంతో ఉదారంగా సాయం అందించే ఔదార్యాన్నే! కల్లబొల్లి కబుర్లు.. కెమెరాల ముందు డ్రామాను కానేకాదు! ఆర్భాటాలు.. హడావుడి.. డొల్ల ప్రచారంతో ఏం ఒరుగుతుంది? సహాయ చర్యల్లో నిమగ్నం కావాల్సిన అధికార యంత్రాంగాన్ని సొంత ప్రచారం కోసం తన చుట్టూ తిప్పుకున్న పెద్ద మనుషులు నీతి సూక్తులు బోధించడం దయ్యాలు వేదాలు వల్లించడం కాదా? పెత్తందారులు అందుకు వంత పాడటంలో ఏమైనా ఔచిత్యం ఉందా? అధికార యంత్రాంగానికి ముందుగానే నిధులిచ్చి దిశా నిర్దేశం చేస్తూ సీఎం జగన్ ఎప్పటికప్పుడు సహాయ చర్యలను పర్యవేక్షించడంతో పెత్తందారుల బృందానికి దిక్కు తోచడం లేదు. తుపాన్ బాధిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు రానివారికి సైతం రూ.2,500 చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయాన్ని అందచేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించడం గమనార్హం. ఈ విధానాన్ని తొలిసారిగా తీసుకొచ్చారు. తన పర్యటనలతో సహాయ చర్యలకు అడ్డు పడకుండా యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో మోహరించి తగినంత సమయం ఇచ్చాక నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారి కష్ట నష్టాలను సీఎం తెలుసుకుంటున్నారు. ప్రభుత్వ సాయం అందిందో లేదో వారినే ఆరా తీసుకున్నారు. గతం కంటే మిన్నగా, వేగంగా, ఎంతో మెరుగ్గా సహాయ చర్యలను అమలు చేస్తూ సాయం అందచేస్తున్నారు. నాడు ఈవెంట్‌లా.. నేడు భరోసానిస్తూ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితుల సమస్యలు సావధానంగా ఆలకిస్తూ అక్కడిక్కడే వాటి పరిష్కారానికి ఆదేశాలు ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తే రెడ్ కార్పెట్ పరామర్శ అంటూ ‘ఈనాడు’ తన అక్కసు మరోసారి చాటుకుంది. రైతులు, బాధితులను ఓదార్చుతూ.. ధైర్యం చెబుతూ సాగిన సీఎం పర్యటన ఎల్లో మీడియాకు రుచించలేదు. తుపాను పరిస్థితులను సమర్థంగా ఎదుర్కోవడంతోపాటు శరవేగంగా సహాయ చర్యలు చేపట్టడం, పరిహారం అందించే విషయంలో మీనమేషాలు లేకుండా తక్షణమే ప్రభుత్వం స్పందించడం ఓ వర్గం మీడియాకు మింగుడు పడలేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విపత్తులు వస్తే చురుగ్గా కదిలేవారంటూ తన అసలు రంగును బయట పెట్టుకున్న ఎల్లో మీడియా తుపానులు, వరదలు, చివరకు పుష్కరాలను కూడా పబ్లిసిటీ కోసం టీడీపీ అధినేత వినియోగించుకున్న విషయాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించింది. ఓపక్క ప్రజలు అవస్థ పడుతుంటే అధికార యంత్రాంగాన్నంతా తన వెంట తిప్పుకుని, ఫొటో షూట్లు నిర్వహిస్తూ, డ్రోన్లతో చిత్రీకరిస్తూ సహాయ చర్యలను పక్కనపెట్టిన సంగతి ఎవరికి తెలియదు? విపత్తుల వేళ కనీసం నిధులు కూడా ఇవ్వకుండా, పరిహారం సరిగా అందించకుండా వైపరీత్యాలను సైతం ఓ ఈవెంట్‌లా మార్చి హంగామా చేసిన చంద్రబాబును గొప్ప వ్యక్తిగా చూపించేందుకు ఈనాడు తన పైత్యాన్నంతా రంగరించి కథనాలు అల్లింది. పటిష్ట వ్యవస్థ.. తొలిసారి ‘టీఆర్ 27’ గతానికి భిన్నంగా విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి జగన్ పటిష్ట వ్యవస్థను నిర్మించడంతో తక్షణమే ఫలితాలు అందుతున్నాయి. కరోనా సమయంలో అత్యంత వేగంగా వ్యాక్సిన్లు పంపిణీ చేయడమే దీనికి నిదర్శనం. సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను అన్ని శాఖలకు అనుసంధానించి తుపాన్లు లాంటి వైపరీతాల్యపై ముందే అప్రమత్తం చేస్తున్నారు. తాజాగా మిచాంగ్ తుపాను తీవ్రత పెరిగిన వెంటనే 420కిపైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల్లో ప్రజలను తరలించారు. భోజనం, మంచినీటితోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఇబ్బంది లేకుండా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను నెలకొల్పారు. శిబిరాలకు రాని వారికి వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా నిత్యావసరాలు సమకూర్చారు. ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, లీటర్ వంట నూనె అందించారు. సీఎం జగన్ ముందుగానే రెండు దఫాలు కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది పడకుండా ఉదారంగా సాయం అందించాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ‘టీఆర్ 27’ కింద అప్పటికప్పుడు ప్రభావిత జిల్లాలకు రూ.28 కోట్లు విడుదల చేశారు. తుపానుకు నాలుగు రోజుల ముందు నుంచే జరుగుతున్న ఈ సన్నద్ధత అందరికీ తెలిసినా ఈనాడు, చంద్రబాబుకు మాత్రం కనపడకపోవడాన్ని ఏమనాలి? నిధులిచ్చి.. సర్వం సిద్ధం చేసి విపత్తు వేళ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ముందుగానే నిధులిచ్చి సర్వం సిద్ధం చేసిన సీఎం జగన్ సహాయ చర్యలు నిరాటంకంగా కొనసాగేందుకు తగినంత సమయం ఇచ్చారు. పరిస్థితి కొంత కుదుట పడ్డాక క్షేత్రస్థాయిలో పర్యటించి స్వయంగా బాధితుల వద్దకు వెళ్లారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించారు. ఆర్థిక సాయం విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించారు. అప్పటివరకు పునరావాస కేంద్రాలకు వచ్చిన కుటుంబాలకు మాత్రమే రూ.2,500 చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందిస్తుండగా అక్కడకు రాని వారికి సైతం ఇళ్లకు వెళ్లి మరీ పరిహారం ఇవ్వాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. సహాయ చర్యల కోసం అప్పటికే రూ.28 కోట్లు విడుదల చేయగా అదనపు సాయం వల్ల రెట్టింపు మొత్తం విడుదల చేయాల్సి వచ్చినా భరించేందుకు సిద్ధమయ్యారు. ప్రతి బాధిత కుటుంబానికి సాయం అందాల్సిందేనని నిర్దేశించి వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. ఈనాడు చెబుతున్నట్లుగా ఓ ప్రభుత్వాధినేత తూతూమంత్రంగా పర్యటిస్తే ఇలా స్పందించడం సాధ్యమవుతుందా? ప్రజల ఇబ్బందులను స్వయంగా చూశాక ప్రత్యేక ఆర్థిక సాయాన్ని ప్రతి కుటుంబానికి ఇవ్వాలని సీఎం అప్పటికప్పుడే నిర్ణయించారు. చంద్రబాబు హయాంలో అసలు ఈ ప్రత్యేక సాయం అనేదే లేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచే విపత్తుల సమయంలో ప్రత్యేక సాయాన్ని అందించే విధానాన్ని ప్రారంభించారు. ఓదార్చి.. ఊరడిస్తూ బాధిత ప్రాంతాల పర్యటనలో సీఎం జగన్ ప్రజలకు దూరంగా ఉన్నారంటూ ఈనాడు తప్పుడు కథనాలను ప్రచురించింది. తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటనల్లో సీఎం జగన్ స్వయంగా బాధితులను ఓదార్చారు. రైతన్నలతో మాట కలిపి వారి పరిస్థితి అడిగి తెలుసుకుని ఊరడించారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోనని, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటానని ధైర్యం చెప్పారు. ఖరీఫ్ సీజన్ ముగిసే లోగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, 80 శాతం రాయితీతో శనగ విత్తనాలు అందచేస్తామని హామీ ఇచ్చారు. కొందరు ఇచ్చిన అర్జీలపై అప్పటికప్పుడే అధికారులకు ఆదేశాలిచ్చారు. హామీకి మించి ‘భరోసా’ వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50 వేలు అందిస్తామన్న మేనిఫెస్టో హామీకి మించి సీఎం జగన్ ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్ల పాటు రూ,67,500 అందచేస్తుండటం గమనార్హం. భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేద కౌలురైతులతో పాటు అటవీ, దేవదాయ భూ సాగుదారులకు సైతం రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 2019–20 నుంచి ఏటా సగటున 52.57 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటివరకు రూ.31,005.04 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందించారు. దురదృష్టవశాత్తూ ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతన్నలకు అందించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. ఇప్పటి వరకు 1,270 రైతు కుటుంబాలకు రూ.88.90 కోట్ల పరిహారం చెల్లించారు. ఇందులో 485 మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. టీడీపీ హయాంలో 2014–19 మధ్య జరిగిన రైతు ఆత్మహత్యలపై పునర్విచారణ జరిపి 474 మందికి రూ.23.70 కోట్ల పరిహారం చెల్లించారు. వీరిలో కూడా 212 మంది కౌలు రైతులున్నారు. దళారీలు లేకుండా ధాన్యం సేకరణ ధాన్యం సేకరణలో దళారీ వ్యవస్థను, మిల్లర్ల జోక్యాన్ని ప్రభుత్వం పూర్తిగా నివారించింది. నాలుగున్నరేళ్లలో వ్యవసాయ క్షేత్రాల నుంచి ఆర్బీకేల ద్వారా 33.59 లక్షల మంది రైతుల నుంచి 3.16 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.60 వేల కోట్లు చెల్లించింది. పైగా గోతాలు, కూలీలు, రవాణా ఖర్చులు (జీఎల్టీ) రూపంలో ఎకరాకు రూ.10 వేల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. ఇలా ఎమ్మెస్పీకి అదనంగా క్వింటాకు రూ.252 వరకూ చెల్లిస్తోంది రూ.3 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధితో మార్కెట్లో ధరలు పతనమైన ప్రతీసారి జోక్యం చేసుకొని రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. ఇలా 21.55 లక్షల మంది నుంచి రూ.7,712.32 కోట్ల పంట ఉత్పత్తులు కొనుగోలు చేసింది. ఆర్బీకేలతో రైతు ముంగిట్లో సేవలు దేశంలో మరెక్కడా లేని విధంగా గ్రామ స్థాయిలో ఏర్పాటైన 10,778 ఆర్బీకేల ద్వారా రూ.1,208.60 కోట్ల రాయితీపై 41.46 లక్షల క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేశారు. రూ.1,259 కోట్ల విలువైన 11.39 లక్షల టన్నుల ఎరువులు, రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులను పంపిణీ చేశారు. నాణ్యమైన ఎరువులను రైతుల ముంగిటికే తీసుకెళ్లడం ద్వారా బస్తాకి రూ.20–రూ.30 వరకు హమాలీ, రవాణా ఖర్చులు మిగులుతున్నాయి. టీడీపీ హయాంలో సగటున 153.95 లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులొస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలో 165.87 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. దేశంలోనే తొలిసారి ఎల్రక్టానిక్ క్రాపింగ్ (ఈ క్రాప్) ప్రామాణికంగా వాస్తవ సాగు దారులకు సంక్షేమ ఫలాలను అందచేస్తున్నారు. ప్రతి అడుగులో అన్నదాత సంక్షేమమే సీజన్ చివరిలో పంట నష్టపరిహారం వైపరీత్యాలతో పంట నష్టపోయిన రైతన్నలకు అదే సీజన్ చివరిలో పెట్టుబడి రాయితీని (ఇన్పుట్ సబ్సిడీ) సీఎం జగన్ అందచేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో 22.85 లక్షల మందికి రూ.1,976.45 కోట్ల పరిహారాన్ని అందించారు. విపత్తులతో పంటలు నష్టపోతే 80 శాతం సబ్సిడీతో సరి్టఫై చేసిన విత్తనాలిస్తున్నారు. రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. టీడీపీ ఐదేళ్లలో 30.85 లక్షల మందికి రూ.3,411.20 కోట్ల పరిహారం ఇవ్వగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇప్పటివరకు 54.48 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల బీమా పరిహారం అందచేసింది. అంతేకాకుండా చంద్రబాబు 6.19 లక్షల మందికి ఎగ్గొట్టిన రూ.715.84 కోట్ల పంటల బీమా పరిహారాన్ని ౖసైతం సీఎం జగన్ చెల్లించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద రూ.లక్ష లోపు పంట రుణం తీసుకొని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు పూర్తి వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. టీడీపీ హయాంలో 40.60 లక్షల మంది రైతులకు రూ.685 కోట్ల వడ్డీ రాయితీనిస్తే సీఎం జగన్ 73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్లు (గత సర్కారు బకాయిలతో కలిపి ) వడ్డీ రాయితీని అందించారు. పరిహారం పెంచారిలా... విపత్తులతో వ్యవసాయ భూముల్లో మేట వేసే మట్టి, ఇసుక తొలగించేందుకు చంద్రబాబు హయాంలో హెక్టారుకి రూ.12 వేలు ఇవ్వగా సీఎం జగన్ ప్రభుత్వం రూ.18 వేలకు పెంచింది. దెబ్బతిన్న వర్షాధార పంటలకు హెక్టారుకి గతంలో రూ.6,800 ఉన్న పరిహారాన్ని రూ.8,500కి పెంచింది. నీటిపారుదల భూములైతే ఇన్పుట్ సబ్సిడీ గతంలో రూ.13,500 ఇవ్వగా ఇప్పుడు రూ.17 వేలు అందిస్తున్నారు. ప్రధానంగా వరి, వేరుశనగ, పత్తి, చెరుకు తదితర పంటలకు గతంలో హెక్టార్‌కు రూ.15 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.17 వేలకు పెంచారు. ఉద్యాన పంటలకు రూ.7,500 నుంచి రూ.17 వేలకు పెంచారు. మామిడి, నిమ్మజాతి పంటలకు రూ.20 వేల నుంచి రూ.22,500కి, మల్బరీకి రూ.4,800 నుంచి రూ.6 వేలకు పెంచి ప్రభుత్వం అందచేస్తోంది. గతంలో గేదెలు, ఆవులు మరణిస్తే పరిహారంగా రూ.30 వేలు నిర్ణయించగా ఇప్పుడు రూ.37,500 ఇస్తున్నారు. గొర్రెలు, మేకలైతే గతంలో రూ.3 వేల చొప్పున పరిహారం వర్తించగా ఇప్పుడు రూ.4 వేలు ఇస్తున్నారు. మత్స్యకారుల బోట్లు పాక్షికంగా దెబ్బతింటే బాబు హయాంలో రూ.4,100 ఇవ్వగా ఇప్పుడు సీఎం జగన్ రూ.6 వేలకి పెంచారు. వలలు పాక్షికంగా దెబ్బతింటే ఇచ్చే పరిహారాన్ని రూ.2,100 నుంచి రూ.3 వేలకి పెంచారు. బోట్లు పూర్తిగా దెబ్బతింటే కొత్త బోట్ల కోసం ఇచ్చే సాయాన్ని రూ.9,600 నుంచి రూ.15 వేలకి పెంచారు. పూర్తిగా దెబ్బతిన్న వలలకు రూ.2,600 మాత్రమే ఉన్న సాయాన్ని రూ.4 వేలకి పెంచి అందిస్తున్నారు. రూ.5,942.05 కోట్లు ఎగ్గొట్టిన చంద్రబాబు చంద్రబాబు హయాంలో కరువు వచ్చినా.. వరదలొచ్చినా.. అకాల వర్షాలు కురిసి పంటలు నష్టపోతే రెండేళ్ల దాకా పరిహారానికి దిక్కు లేని దుస్థితి. 2014–15లో కర్నూలు జిల్లాలో అక్టోబర్, డిసెంబర్లో వర్షాలు కురిస్తే 2016 జూలైలో పంట నష్టపరిహారం అరకొరగా విదిల్చారు. 2014లో కర్నూలు జిల్లాలో కరువు వస్తే 2017లో కరువు భృతి నిచ్చారు. 2018 ఖరీఫ్‌లో భారీగా పంట నష్టం జరిగితే పూర్తిగా ఎగ్గొట్టారు. ఐదేళ్లలో 24.80 లక్షల మందికి రూ.2,558.07 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఎగ్గొట్టిన చరిత్ర చంద్రబాబుదే. ఇవే కాకుండా సబ్సిడీ విత్తనాల కింద రూ.282.71 కోట్లు, సున్నా వడ్డీ పంట రుణ రాయితీ రూ.1,180.66 కోట్లు, పంటల బీమా పరిహారం రూ.715.84 కోట్లు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.23.70 కోట్లు, యాంత్రీకరణ కోసం రూ.221.07 కోట్లు, ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు కలిపి ఏకంగా రూ.5,942.05 కోట్లు ఎగ్గొట్టిన ఘనత కూడా చంద్రబాబుదే. -
రైతాంగానికి తుపాను కష్టం..వేల హెక్టార్లలో పంట నష్టం
-
పంటనష్టంపై రేపటినుంచి క్షేత్రస్థాయిలో పరిశీలన
-
AP: వారంలో లెక్కలు.. 25న లబ్ధిదారుల జాబితా
సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాన్ ప్రభావంతో వాటిల్లిన పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ఎన్యుమరేషన్ బృందాలు సోమవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి. తుపాన్ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురియగా కొన్నిచోట్ల గరిష్టంగా 30 నుంచి 40 సెంటిమీటర్ల వర్షం పడింది. తుపాన్ తీరం దాటే సమయంలో 100–150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఈ ప్రభావంతో వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు ఆక్వా, పాడి రంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా వ్యవసాయ పంటలకు సంబంధించి లక్ష ఎకరాల్లో పంటలు ముంపునకు గురికాగా మరో లక్షన్నర ఎకరాల్లో నేల కొరిగినట్లు అంచనా వేశారు. 76 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు ముంపు బారిన పడినట్లు అంచనాలున్నాయి. అత్యధికంగా 53 వేల ఎకరాల్లో మిరప, 11 వేల ఎకరాల్లో అరటి, 5 వేల ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. తుపాను తీరం దాటిన తర్వాత వర్షాలు తెరిపిచ్చి ఉష్ణోగ్రతలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాన్ ప్రారంభం నుంచి ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేస్తూ యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా వ్యవసాయ, ఉద్యాన పంట నష్టాన్ని చాలా వరకు నియంత్రించగలిగారు. కోతలు పూర్తయిన చోట తేమతో సంబంధం లేకుండా ఆగమేఘాలపై ధాన్యాన్ని కొనుగోలు చేయగా పొలాల్లో నిలిచిన నీరు కిందకు దిగిపోయేందుకు ఆర్బీకే సిబ్బంది సాయంతో క్షేత్ర స్థాయిలో చర్యలు చేపట్టారు. సంక్రాంతిలోగా ఇన్పుట్ సబ్సిడీ వాస్తవ నష్టాన్ని అంచనా వేసేందుకు రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన శాఖల సిబ్బందితో సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఎన్యుమరేషన్ బృందాలు సోమవారం నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నాయి. బృందాలు వారం రోజుల పాటు గ్రామ స్థాయిలో పర్యటించి వాస్తవంగా జరిగిన పంట నష్టం అంచనాలను రూపొందిస్తాయి. ఈ జాబితాలను సామాజిక తనిఖీల కోసం ఈనెల 18వతేదీ నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. 25వ తేదీన లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. ఇంకా ఎవరైనా అర్హులు పొరపాటున మిగిలిపోతే వారికి కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ 31వతేదీన సవరించిన తుది జాబితాలను ప్రదర్శిస్తారు. అర్హత పొందిన బాధిత రైతులకు సంక్రాంతి లోగా పంట నష్ట పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దెబ్బతిన్న బోట్లు, వలలు.. తుపాన్ ప్రభావంతో 15 బోట్లు పూర్తిగా, 72 బోట్లు పాక్షికంగా దెబ్బ తినగా 1,753 వలలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 700 ఎకరాల్లో రొయ్యలు, చేపల చెరువుల్లో పంట టోర్నడోల ప్రభావంతో కొంత మేర నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. తుపాన్ ప్రభావిత జిల్లాల్లో పశువులు, మేకలు, గొర్రెలు మృతి చెందినట్లు నివేదికలున్నాయి. ఆయా విభాగాల వారీగా ప్రత్యేకంగా నియమించిన బృందాలు కూడా వాస్తవ నష్టాన్ని అంచనా వేసేందుకు రేపటి నుంచి రంగంలోకి దిగనున్నాయి. అత్యంత పారదర్శకంగా... పంట నష్టం అంచనాల కోసం నియమించిన ఎన్యుమరేషన్ బృందాలు సోమవారం నుంచి వారం రోజుల పాటు పర్యటించనున్నాయి. నష్టపోయిన ప్రతి ఎకరాను గుర్తించేందుకు అత్యంత పారదర్శకంగా పంట నష్టం అంచనాలు రూపొందిస్తారు. సామాజిక తనిఖీలో భాగంగా పంట నష్టం జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తాం. ఏ ఒక్క రైతు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. –చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ -
‘మా ప్రభుత్వానికి రైతు శ్రేయస్సే ముఖ్యం’
సాక్షి, తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): రైతు శ్రేయస్సే తమ ప్రభుత్వానికి ముఖ్యమని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మరోసారి స్పష్టం చేశారు. తుపాను కారణంగా దెబ్బతిన్న రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. ఈరోజు(శనివారం) తణుకు పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మంత్రి కారుమూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. తుపాను నష్ట నివారణ చర్యలపై ఈ సమీక్షా సమావేశం నిర్వహించగా, రైతులు, నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు. ‘మిచాంగ్ తుపాను రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. నేను తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చాలా చోట్ల పర్యటించి చూశాను. అన్ని శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి రైతులను ఆదుకునే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. రైతులకు వెంటనే సబ్సిడీ అందించే విధంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారు. ఏ ఒక్క రైతు నష్టపోకూడదు.. ఇబ్బంది పడకూడదు అని సీఎం జగన్ ఆదేశాలివ్వడం జరిగింది. తుపాను సమయంలో అధికారులంతా చాలా బాగా కష్టపడ్డారు. రంగుమారిన, మొక్క వచ్చిన ధాన్యాన్ని కూడా కొనే విధంగా సీఎం జగన్ ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తాం. రైతు శ్రేయస్సే మా ప్రభుత్వానికి ముఖ్యం’ అని తెలిపారు. -
రైతాంగానికి తుపాను కష్టం
-
మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
ఆంధ్రప్రదేశ్‌లో తుపానుతో దెబ్బతిన్న జిల్లాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నగదు, నిత్యావసర సరకులతో ఆదుకుంటామని బాధితులకు భరోసా..ఇంకా ఇతర అప్డేట్స్
-
చెన్నైని వదలని వర్షాలు..మళ్లీ అలర్ట్ ఇచ్చిన ఐఎండీ
చెన్నై: మిచౌంగ్ తుపాను ప్రభావం నుంచి ఇంకా కోలుకోని చెన్నై నగరానికి వాతావరణ శాఖ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. రానున్నఐదు రోజుల్లో చెన్నై, పాండిచ్చేరిలో భారీ వర్షాలు కురవచ్చని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. నగరంలో స్కూళ్లు,కాలేజీలు శుక్రవారం కూడా మూసివేయనున్నారు. మిచౌంగ్ తుపాను కారణంగా చెన్నైలో 20 మంది మృత్యువాత పడ్డారు. మిచౌంగ్ తుపాను ఏపీలో తీరం దాటినప్పటికీ చెన్నైలోనూ తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటికీ కురుస్తున్న వర్షాల వల్ల చెన్నైలో తుపాను సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇతర జిల్లాల నుంచి 9 వేల మంది అధికారులను చెన్నైలో సహాయక చర్యలకుగాను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించింది. చెన్నైతో పాటు నీలగిరి,కోయంబత్తూరు, తిరుప్పూర్, దిండిగల్, థేనీ,పుదుక్కొట్టై, తంజావూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదీచదవండి..సహజీవనం ప్రమాదకరమైన జబ్బు -
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంట నష్ట నివారణ చర్యలు
-
సాయం..శరవేగం
-
తుఫాన్ కు ఎదురొడ్డి నిలిచిన జగన్ ప్రభుత్వం
-
సీఎం ఆదేశాలతో సహాయక చర్యలు ముమ్మరం
-
తుఫాను వల్ల నష్టపోయిన బాధితుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని అధికారులకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం..ఇంకా ఇతర అప్డేట్స్
-
పంట.. నీటిపాలు
సాక్షి, హైదరాబాద్/ఖమ్మంవ్యవసాయం/సూపర్‌బజార్(కొత్తగూడెం): వర్షాలతో చేతికొచ్చిన పంటలన్నీ నేలపాలయ్యాయి. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి, మిర్చితోపాటు టమాటా, వంగ, బీర, బెండ తోటలు కూడా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఉన్న వరి తడిసిపోవడంతో మొలకలొచ్చే పరిస్థితి ఏర్పడింది. కల్లాల్లో ఉన్న మిర్చి తడిసి నష్టం వాటిల్లింది. కోత దశలో ఉన్న వరి పంట కూడా నేల రాలింది. నష్టంపై వ్యవసాయశాఖ అంచనా వేస్తోందని అధికారులు చెబుతున్నారు. రంగుమారుతున్న పత్తి.. ప్రస్తుతం పత్తి తీతలు కొనసాగుతున్నాయి. ఈదురుగాలులు, వానలతో పత్తి నేలరాలిపోతోంది. రంగు మారి నాణ్యత కోల్పోతుండగా, కాయలోకి నీరు దిగి పత్తి నల్లబడుతోంది. పత్తి తీతకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. కూలీల ఖర్చు కూడా పెరుగుతుంది. వర్షానికి తడిసిన పత్తి బరువు కూడా తగ్గుతుంది. ఇక పత్తిలో ఉన్న గింజ మొలకెత్తే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం రెండో తీతలో ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు చేతికందే దశలో ఉంది. తుపాను కారణంగా ఈ పత్తి చేతికందుతుందా లేదా అనేది రైతుల్లో ఆందోళనగా ఉంది. ఒకవేళ తుపాను ప్రభావం తగ్గినా ప్రస్తుత పరిస్థితుల్లో చేతి కందే పత్తి బరువు తగ్గి 4 క్వింటాళ్లకు ఒక క్వింటా నష్టం జరుగుతుందని రైతులు చెబుతున్నారు. నేలవాలుతున్న వరి.. వానకాలం వరి కోతలు సగమే పూర్తయ్యాయి. ఇంకా ఆయా జిల్లాల్లో కోతలు కొనసాగుతున్నాయి. వరి కోత, నూర్పిడి దశలో ఉంది. పలు ప్రాంతాల్లో ధాన్యం కల్లాల్లో ఆరబెడుతున్నారు. కోత దశలో ఉన్న వరి ఈదురుగాలులు, తుపాను కారణంగా కంకి బరువుకు నేలవాలుతోంది. గాలులకు ఆరిపోయి ఉన్న కంకుల నుంచి గింజలు నేలరాలిపోతున్నాయి. ఇక నేలవాలిన కంకులు తేమ కారణంగా మొలకొచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇక నేలవాలిన వరిని యంత్రాలు కోయటం అంతగా సాధ్యం కాదు. కూలీలతో వరికోతలు జరిపించాల్సి ఉంటుంది. దీంతో రైతులకు ఖర్చులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఓ వైపు పంట నేలవాలి కొంత దెబ్బతినగా, మరో వైపు కూలీల ఖర్చులు పెరిగి పెట్టుబడులు మరింతగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కల్లాల్లో ఆరబెట్టిన రైతులు రాశులుగా చేసి టార్పాలిన్లను కప్పి రక్షించుకునే పనిలో ఉన్నారు. తేమతో ఉన్న ధాన్యం రాశులు నాణ్యత కోల్పోతాయని రైతులు దిగులు చెందుతున్నారు. రెండు రోజులు తుపాను కొనసాగితే రాశుల్లో మొలకొచ్చే ప్రమాదం కూడా ఉందని రైతులు చెబుతున్నారు. మిర్చిని అదే పరిస్థితి... కాత దశలో ఉన్న మిర్చి పైర్లు నేలవాలే ప్రమాదం ఉంది. మిర్చి కాయబరువుతో చెట్టు పడిపోతుందని రైతులు చెబుతున్నారు. అక్కడక్కడ తొలి కోతలు కూడా సాగుతున్నాయి. కోసిన మిర్చి ఆరబెట్టకుండా రాశులుగా కల్లాల్లో ఉంచితే తేమబారిన పడి నాణ్యత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. తేమతో ఉన్న కాయకు నల్లమచ్చ ఆశించే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వానలు మాత్రం రైతులను నష్టపరుస్తున్నాయే తప్పా ప్రయోజనం కలిగించటం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీగానే నష్టం ఖమ్మం జిల్లాలో 53,903 మంది రైతులకు చెందిన 82,191 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఇందులో అధికంగా వరి 59,307 ఎకరాల్లో నష్టపోయినట్టు చెబుతున్నారు. ► భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 7,450మంది రైతులకు సంబంధించిన 13,608 ఎకరాల్లో వరి, వేరుశనగ, మొక్కజొన్న, మిర్చి, పత్తి పంటలు ధ్వంసమైనట్లు అంచనావేశారు. ప్రస్తుతం అధికారులు అంచనాల్లో నిమగ్నం కాగా.. ఒకటి, రెండు రోజుల్లో పంట నష్టంపై స్పష్టత రానుంది. ► వాజేడు మండలంలో ప్రత్యేకాధికారి సర్ధార్ సింగ్ ఆధ్వర్యంలో అధికారులు ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ ప్రాంత ప్రజలను కాపాడేందుకు ఏటూరునాగారంలో పోలీస్ విపత్తు దళం ముళ్లకట్ట వద్ద హైపవర్ బోటులో రీహార్సల్ చేపట్టింది. చనిపోయిన 13వేల బాతులు...గుండెపోటుతో యజమాని మృతి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టాపురానికి ఏపీలోని జగ్గయ్యపేట మండలానికి చెందిన పేరం ఆదిలక్ష్మి (67) కుటుంబ సభ్యులతో కలిసి బాతులను తీసుకొచ్చి పెంచుతున్నారు. తుపాన్ ప్రభావంతో తడిచిన 13వేల బాతు పిల్లలు మృతి చెందడంతో యజమాని ఆదిలక్ష్మి గుండెపోటుతో మృతి చెందారు. పరిహారం ఇవ్వాలి: తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని తక్షణం అంచనా వేసి నష్టపోయిన ఆహార పంటలకు ఎకరాకు రూ. 20 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ. 40 వేలు చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, టి.సాగర్ కోరారు. వేలాది ఎకరాల్లో పంటలు తడిసి ముద్దయ్యాయి: కూనంనేని రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. పత్తి, మిర్చికి ఎకరాకు రూ. 40 వేలు, వరికి ఎకరాకు రూ. 20 వేలు, కూరగాయలకు ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వాలన్నారు. -
సీఎం జగన్ ఆదేశాలు.. సాయం శరవేగం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: తుపాను ప్రభావానికి గురైన జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం వేగంగా సహాయక చర్యలు చేపట్టింది. తుపాను ప్రారంభం కాక ముందు నుంచే కట్టుదిట్టంగా ముందస్తు ఏర్పాట్లు చేయడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. ఎనిమిది జిల్లాల్లో 320 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. 20,572 మందిని తరలించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 124 శిబిరాల్లో 6,077 మందికి ఆశ్రయం కల్పించారు. తిరుపతి జిల్లాలో 36 కేంద్రాల్లో 3,386 మందికి, పశ్చిమగోదావరి జిల్లాలో పన్నెండు కేంద్రాల్లో 5,113, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 37 కేంద్రాల్లో 910, బాపట్ల జిల్లాలో 74 కేంద్రాల్లో 3,888, గుంటూరులో 14 శిబిరాల్లో 1,111, కోనసీమ జిల్లాలో 36 శిబిరాల్లో 910, పశ్చిమ గోదావరిలో 32 శిబిరాల్లో 5,113, తూర్పు గోదావరిలో 3 కేంద్రాల్లో 87 మందికి పునరావాసం కల్పించారు. బాధితులందరికీ భోజనం, మంచి నీటి సౌకర్యం కల్పించారు. వారికి అక్కడే నిత్యావసరాలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాలు ఇళ్లకు వెళ్లే ముందు ఆర్థిక సాయంగా రూ.1000 నుంచి రూ.2500 అందిస్తున్నారు. తుఫాను ప్రభావిత గ్రామాల్లో 6 ఎస్డీఆర్ఎఫ్, 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు, ఉలవపాడు, బాపట్ల, నాయుడుపేటలో ఈ బృందాలు సేవలు అందిస్తున్నాయి. అధికార యంత్రాంగం దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించడంతో రాకపోకలు యధాతథంగా కొనసాగుతున్నాయి. వర్షం తెరిపి ఇవ్వడంతో రైతులు ముంపునకు గురైన పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఆర్బీకే సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరోవైపు రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యలతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆపదలో ఉన్న రైతులను గుర్తించడమే కాకుండా, వారి వద్ద నుంచి ధాన్యం కొనుగోలు వెంటనే కొనుగోలు చేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. సీఎం ఆదేశాల మేరకు తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. బాపట్ల జిల్లా రావికంపాడులో రైతులతో కలసి వర్షపు నీటిని పొలం నుంచి బయటకు మళ్లిస్తున్న ఆర్బీకే సిబ్బంది.. యుద్ధ ప్రాతిపదికన కదిలిన యంత్రాంగం ► ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాత్రింబవళ్లు 3 వేల మందికి పైగా విద్యుత్ అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తూ సరఫరాను పునరుద్ధరించారు. బాపట్ల జిల్లాలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు బాధితులకు సహాయం అందించే పనుల్లో నిమగ్నమయ్యారు. 353 విద్యుత్ స్తంభాలను శాఖ అధికారులు తిరిగి పునరుద్ధరించారు. కూలిపోయిన 282 చెట్లను రోడ్లపై నుంచి తొలగించారు. 261 గ్రామాలలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. 74 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి, 3,888 మందికి పునరావాసం కల్పించారు. బుధవారం ఉదయం నుంచే ఉపాధి హామీ కూలీలతో వరి పంట పొలాల్లోని నీటిని బయటకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. 93 చోట్ల హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పశువులకు సైతం వైద్య సేవలు అందిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు వచ్చిన ఒక్కో కుటుంబానికి రూ.2,500 పంపిణీ చేశారు. 25 కేజీల బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు పరిహారం పంపిణీ చేస్తున్నారు. మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు బాధితులకు ధైర్యం చెప్పారు. తిరుపతి జిల్లా కోట మండలం రొయ్యలగుంతల వద్ద చిక్కుకున్న వారిని తీసుకువస్తున్న రెస్క్యూ టీం ► తిరుపతి జిల్లాలో నిర్వాసితుల కోసం 80 పునరావాస కేంద్రాలు, 80 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 25 వేల కుటుంబాలకు ప్రభుత్వ సాయం పంపిణీ చేస్తున్నారు. రూ.వెయ్యి నుంచి రూ.2,500 నగదుతో పాటు ఐదు రకాల వస్తువులు పంపిణీ చేస్తున్నారు. దైవాలదిబ్బ సమీపంలో రొయ్యలగుంతల వద్ద కాపలాదారులుగా పని చేస్తున్న 18 మంది వరద ఉధృతిలో చిక్కుకుపోయారు. గూడూరు ఆర్డీఓ కిరణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది సాయంతో 18 మందిని ఒడ్డుకు చేర్చారు. నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కేరోజా తన చారిటబుల్ ట్రస్టు ద్వారా తన సోదరుడు రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ట్యాంకర్ల ద్వారా తాగు నీరు సరఫరా చేశారు. ► కాకినాడ జిల్లాలో సుడిగాలికి దెబ్బతిన్న పిఠాపురం మండలం పి.దొంతమూరు, కొత్తపల్లి మండలం కొండెవరంలలో 100 కుటుంబాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతి సదుపాయాలు కల్పించారు. కోనసీమ జిల్లాలో సహాయ, పునరావస చర్యలు వేగమందుకున్నాయి.అమలాపురం మున్సిపాలిటీతోపాటు పలు గ్రామాల్లో రోడ్డుకు అడ్డుగా పడిన చెట్లను తొలగిస్తున్నారు. వరి చేలల్లో మంపు నీరు దిగేందుకు ఉపాధి హామీ పథకం కూలీలు డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. కూనవరం డ్రెయిన్ మొగ వద్ద ముంపునీరు దిగేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. తద్వారా సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టు పరిధిలోని ముంపు నీరు వేగంగా సముద్రంలోకి దిగనుంది. అయినవిల్లి మండలం మాగాంలో దెబ్బతిన్న వరిచేలను కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ప్రత్యేకాధికారి జయలక్ష్మిలు బుధవారం పరిశీలించారు. అమలాపురం పట్టణంలో 28,29,14,11 వార్డులలో ముంపు బాధితులకు వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు భోజనాలు అందించారు. మరోవైపు ధాన్యం కొనుగోలును కొనసాగించారు. 17 శాతం తేమ అధికంగా ఉన్నా, రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 3వ తేదీ నుంచి బుధవారం వరకు 14,278 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. -
మిచాంగ్ గుణపాఠం
ప్రకృతి వైపరీత్యాలు విరుచుకుపడినప్పుడల్లా మనిషి చేసిన, చేస్తున్న పాపాలు బయటపడతాయి. అంతవరకూ పాలకులు రూపొందించిన విధానాల్లోని వైఫల్యాలు బట్టబయలవుతాయి. తీవ్ర తుపానుగా పరిగణించిన మిచాంగ్ నాలుగురోజుల పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వణికించింది. దాని ధాటికి చెన్నై నుంచి తమిళ తీరప్రాంతాలతో మొదలుపెట్టి దక్షిణాంధ్ర జిల్లాలన్నీ తడిసిముద్దయ్యాయి. కోస్తా జిల్లాలు సైతం వర్షాలతో సతమతమయ్యాయి. పంటలు దెబ్బ తిన్నాయి. చెన్నైలో గత 47 ఏళ్లలో ఎప్పుడూ చూడనంత స్థాయిలో భారీ వర్షం కురిసింది. నగరం నగరమంతా వరదనీటిలో తేలియాడింది. వివిధ ఘటనల్లో మొత్తం 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతవరకూ 2015 నాటి కుంభవృష్టే రికార్డు. ఈ ఏడాది చిన్నా పెద్దా స్థాయిలో దేశం ఆరు తుపాన్లనూ, వాటి దుష్పరిణామాలనూ చవిచూసింది. మొన్న జూన్‌లో గుజరాత్, మహా రాష్ట్రల్లో బిపర్జయ్ తుపాను సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు. ఆకాశాన్నంటే భవంతులతో, రోడ్లపై నిరంతరం రివ్వుమంటూ దూసుకుపోయే వాహనాలతో, అరచేతిలో ఇమిడే సెల్‌ఫోన్‌తో దేన్నయినా క్షణాల్లో పొందగల వెసులుబాటు వగైరాలతో అత్యద్భుతంగా కనబడే నగరాలు, పట్టణాలు చినుకుపడితే నరకాన్ని తలపిస్తాయి. అటువంటిది కనీవినీ ఎరుగని రికార్డు స్థాయి కుంభవృష్టి పడితే ఇక చెప్పేదేముంది? కేవలం ఆది, సోమ వారాల్లో రాత్రింబగళ్లు కురిసిన వర్షపాతం ఏకంగా 35 సెంటీమీటర్లంటే పరిస్థితి ఎలావుందో ఊహించుకోవచ్చు. శివారుల్లో వున్న చెరువులు, రిజర్వాయర్లు, అడయార్, కూవమ్ నదులు, బకింగ్‌హామ్ కాల్వ పూర్తిగా నిండి వరద జలాలు చెన్నై నగరాన్ని ముంచెత్తాయి. ఫలితంగా అన్ని హైవేలు, సబ్‌వేలు మూతబడక తప్పలేదు. వందలాది వాహనాలు కొట్టుకుపోయాయి. ప్రముఖులు నివాసం ఉండే పొయెస్ గార్డెన్ రోడ్డు ఏడడుగుల మేర కుంగిపోయి అందులో ట్రాన్స్ఫార్మర్లు, వాహనాలు కూరుకుపోయాయంటే పరిస్థితి ఎలా ఉన్నదో ఊహించుకోవచ్చు. వాతావరణ విభాగం చెబుతున్న ప్రకారం మిచాంగ్ గత తుపానులకు భిన్నమైనది. సాధారణంగా తీరానికి సుదూరంగా తుపాను తిరుగాడుతుంది. కానీ ఈసారి తీరానికి 90 కిలోమీటర్ల దూరంలోనే మిచాంగ్ లంగరేసింది. పైగా అది చాలా నెమ్మదిగా... అంటే గంటకు 5–7 కిలోమీటర్ల మధ్య వేగంతో కదిలింది. తుపాను వేగం సాధారణంగా గంటకు 10–18 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. తీరానికి దగ్గరగా వుండి మందకొడిగా కదలటం వల్ల విడవకుండా భారీ వర్షాలు కురిశాయి. 2015లో చెంబరామ్బాక్కమ్ సరస్సు, పూండి రిజర్వాయర్ల నుంచి ఒక్కసారి భారీయెత్తున నీటిని విడుదల చేసిన పర్యవసానంగా చెన్నై నీట మునిగింది. ఈసారి అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఒక క్రమపద్ధతిలో నీరు వదిలినా మిచాంగ్ తీవ్రత కారణంగా ఇంచుమించు అప్పటి పరిస్థితే ఏర్పడింది. తీరానికి ఆవల ఉండాల్సిన సముద్రం నగరబాట పట్టిందా అన్నంతగా వరద పోటెత్తింది. అభివృద్ధి పేరు మీద అన్నిటినీ ఒకేచోట కేంద్రీకరిస్తే వృత్తి ఉద్యోగాల కోసం, చిన్నా చితకా వ్యాపారాల కోసం దూరతీరాల నుంచి సైతం జనం అక్కడికి చేరుకుంటారు. జనాభా అపరిమితంగా పెరుగుంది. నగరీకరణ, పట్టణీకరణ జరుగుతున్నప్పుడు ఆ వంకన భూబకా సురులు ప్రవేశిస్తారు. సరస్సులు, చెరువులు మాయమవుతాయి. కాల్వలు కుంచించుకు పోతాయి. పచ్చటి చెట్లు నేలకొరుగుతాయి. ఎటుచూసినా కాంక్రీట్ కీకారణ్యాలే విస్తరిస్తుంటాయి. మన దేశంలోనే కాదు... వేరే దేశాల్లో ఇదే పరిస్థితి. అయితే ఆ దేశాల్లో కాస్త ముందే మేల్కొని అభివృద్ధి వికేంద్రీకరణ వైపు కదిలారు. కానీ మన దగ్గర ప్రకృతి విలయాలు కళ్ల ముందే కనబడుతున్నా ఆ అంశంపై పాలకులు దృష్టి సారించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణానికి చేసిన ప్రయత్నం ఇందుకు ఉదాహరణ. వికేంద్రీకరణతో పాటు విపత్తులు ముంచుకొచ్చినప్పుడు తలెత్తగల సమస్యలను ముందే గుర్తించి అందుకు తగ్గట్టు మౌలిక సదుపాయాలు ఏర్పరిస్తే ఇబ్బందులు తగ్గుతాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ స్థితిగతులు మారాయి. కర్బన ఉద్గారాలు అపరిమితంగా పెరిగిన పర్యవసానంగా భూగోళం వేడెక్కడం, ఆ వేడిమిలో 90 శాతం సముద్రాలకే పోవటం వల్ల వాటి జలాలు వేడెక్కుతున్నాయి. తుపానులకు అదే ప్రధాన వనరు. ఈ పరిస్థితుల్లో నగరీకరణ, పట్టణీకరణలపై పునరాలోచించటం, ఇప్పటికే ఉన్న నగరాలు, పట్టణాల్లో ప్రస్తుత స్థితిని మెరుగుపరచటానికి అనుసరించాల్సిన విధానాలకు రూపకల్పన చేయటం అవసరం. పారిస్ ఒడంబడికకు అనుగుణంగా అహ్మదాబాద్‌లోని అర్బన్ మేనేజ్మెంట్ సెంటర్ ఈ విధానాలకు తుదిరూపం ఇచ్చింది. తమిళనాడు సర్కారు దాని ఆధారంగా చెన్నైకు మొన్న జూన్‌లో సవివరమైన ప్రణాళికను రూపొందించింది. 2050కల్లా ఆ నగరాన్ని కర్బన ఉద్గారాల బారి నుంచి రక్షించటానికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక విధానాన్ని ప్రకటించింది. నీటి కొరత నివారణ, పునరుత్పాదక ఇంధన వనరుల పెంపు, విద్యుత్‌తో నడిచే బస్సులు వందశాతం ఉండేలా చూడటం, నగరంలో హరితవనాల్ని 35 శాతానికి విస్తరించటం, పకడ్బందీ పారిశుద్ధ్యం, చెన్నై వరద ముంపు బారిన పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవటం అందులో కొన్ని. నగర విస్తరణకూ, కాలనీల నిర్మాణానికీ విచ్చలవిడి అనుమతులీయటం విరమించుకుంటే, డ్రైనేజీ వ్యవస్థల పునర్వ్యవ స్థీకరణకు చర్యలు తీసుకుంటే ప్రతి నగరమూ మెరుగవుతుంది. మిచాంగ్ వంటి తీవ్ర తుపానుల వల్ల జరిగే నష్టం కనిష్ఠస్థాయికి పరిమితమవుతుంది. పాలకులు ఈ దిశగా ఆలోచించాలి. -
ధైర్యంగా ఉండండి.. ప్రతీ రైతునూ ఆదుకుంటాం
-
రాజమండ్రిలో భారీ వర్షాలతో రోడ్లన్నీ జలమయం
-
రైతుల ధాన్యం తడవకుండా టార్పాలిన్లు సరఫరా