నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష జరిపిన పాక్
ఇస్లామాబాద్: నౌకలను విధ్వంసం చేసే క్షిపణిని పాకిస్తాన్ విజయవంతంగా పరీక్షించింది. బుధవారం ఉత్తర అరేబియా సముద్రంలో ఉపరితలం నుంచి ఉపరితలంపై లక్ష్యాన్ని ఛేదించే నౌక విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు ఆ దేశ నేవీ ప్రకటించింది. పీఎన్ఎస్ అస్లాట్ అనే యుద్ధనౌక నుంచి నేవీ చీఫ్ అడ్మిరల్ ముహమ్మద్ జకుల్లా సమక్షంలో దీన్ని ప్రయోగించారు. ఇది ఎక్కువ కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించిందని నేవీ తెలిపింది.