East Godavari District Latest News
-
రెండు రోజులకే కూలిన గడ్డర్
కొవ్వూరు: రోడ్డు కం రైల్వే వంతెనపై భారీ వాహనాలను నియంత్రించే ఉద్దేశంతో రెండు రోజుల క్రితం ఏర్పాటు చేసిన గడ్డర్ కూలిపోయింది. గు రువారం అర్ధరాత్రి వంతెనపై నుంచి వచ్చిన భా రీ వ్యాన్ ఢీకొట్టడంతవిది కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కూలిన గడ్డర్‌ను రైల్వే సీఐ సైదయ్య, ఎస్సై ఎల్.విశ్వనాథం పరిశీలించారు. ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి గడ్డర్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పునాది పటిష్టంగా లేనందువల్లనే గడ్డర్ కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. రుడా చైర్మన్‌గా రేపు బాధ్యతల స్వీకరణ సాక్షి, రాజమహేంద్రవరం: ప్రజా ప్రయోజనాలే ధ్యే యంగా పని చేస్తానని రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) చైర్మన్‌గా నియమితులైన బొడ్డు వెంకట రమణ చౌదరి చెప్పారు. ఈ బాధ్యతలు ఆదివారం స్వీకరిస్తానని తెలిపారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుడా పరిధిలోని నియోజకవర్గాల్లో అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. రుడా విస్తరణ, చేపట్టిన పనులు, చేపట్టాల్సిన పనులపై ఇప్పటికే మున్సిపల్ కమిషనర్‌తో చర్చించానని చెప్పారు. రుడా ప్రక్షాళనకు నాంది పలకనున్నట్లు స్పష్టం చేశారు. రుడా చైర్మన్‌గా కొనసాగుతూనే టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తానని చెప్పారు. మద్యం షాపు వద్దని ముస్లింల రాస్తారోకో ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): మద్యం షాపు ఏర్పాటును నిరసిస్తూ ముస్లింలు శుక్రవారం రాస్తారోకో చేశారు. వెంటనే తొలగించకపోతే ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. దానవాయిపేట మసీదులో శుక్రవారం నమాజ్ అనంతరం మసీద్ కమిటీ సభ్యులు రోడ్డుపై బైఠాయించారు. స్థానిక గోరక్షణపేట నీళ్ల ట్యాంకుల ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటుకు సన్నాహా లు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సమీపంలోనే వినాయక ఆలయం, మసీదు, చర్చి స్థలం ఉన్నాయి. అందరూ పవిత్రంగా భావించే ఈ ప్రాంతంలో మద్యం షాపు ఏర్పాటును స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్లకు వినతి పత్రాలు ఇచ్చారు. కానీ షాపు ఏర్పాట్లు ఆగకపోవడంతో ముస్లింలు నిరస న తెలిపారు. మహమ్మద్ ఆరిఫ్, కరీం ఖాన్, మహమ్మద్ షబ్బీర్, సయ్యద్ గౌస్, ఎండీ ఆరిఫ్, సయ్యద్ అబ్దుల్ షరీఫ్ పాల్గొన్నారు. -
పోస్టులే లేవు.. భర్తీ చేసేశారు
● జీజీహెచ్‌లో అవినీతి బాగోతం ● పోస్టుకు రూ.5 లక్షల వసూలు! ● నేడు విచారణ నివేదిక కాకినాడ క్రైం: నోటిఫికేషన్ పడితే ఉద్యోగాల పేరుతో సొమ్ములు దండుకునే సంఘటనలు చూస్తుంటాం. కానీ, లేని ఉద్యోగాలు ఉన్నట్టుగా నమ్మించి, అమ్మేసి సొమ్ము చేసుకున్న ఘనులు కాకినాడ జీజీహెచ్‌లో తిష్ట వేశారు. కలెక్టర్ దృష్టికి వెళ్లిన ఈ అవినీతి బాగోతంపై శనివారానికి విచారణ పూర్తి చేసి, నివేదిక రూపొందించే పనిలో అధికారులున్నారు. ఇప్పటికే నర్సింగ్ పోస్టుల విక్రయాల అవినీతి ఆరోపణల్లో పీకల్లోతు కూరుకుపోయిన జీజీహెచ్‌లోని ఒక అధికారితో పాటు ఒక ఏడీ స్థాయి అధికారి ఈ బాగోతానికి బాధ్యులని ప్రాథమికంగా గుర్తించారు. వైద్య సేవల పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలు, కేడర్ల వారీగా నియామకాలపై వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డీఎస్‌వీఎల్ నరసింహం ఇటీవల జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను నివేదిక కోరిన సందర్భంలో ఈ అవినీతి బాగోతాలు వెలుగు చూశాయి. 2008లో ఆర్థిక శాఖ విడుదల చేసిన జీఓ–487 ప్రకారం వివిధ కేడర్లలో 620 పోస్టులు ఖాళీగా ఉండగా, 2016లో మరో 160 స్టాఫ్ నర్సు పోస్టులు మంజూరయ్యాయి. 2018లో మంజూరైన 2 ఓబీజీ (ఆబ్‌స్ట్రిక్స్ ఇన్ గైనకాలజీ) యూనిట్లలో 11 మంది ఎంఎన్ఓలు (ఔట్సోర్సింగ్), 12 మంది ఎఫ్ఎన్ఓలు (ఔట్సోర్సింగ్), 9 మంది హెడ్ నర్సులు, ఆరుగురు మెడికల్ ఆఫీసర్లు, 21 మంది స్టాఫ్ నర్సుల నియామకాలకు ఏర్పాట్లు చేశారు. ఈ నియామకాల అనంతరం మిగులు పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జీఓలు 62, 63, 140 విడుదల చేసి, మిగులు పోస్టులను అప్పటికే ఖాళీగా ఉన్న పోస్టుల స్థానంలో భర్తీ చేయాలని ఆదేశాలిచ్చారు. కొత్త పోస్టులు సృష్టించి.. ఆ సమయంలో జీజీహెచ్‌లో చక్రం తిప్పుతున్న ఓ అధికారి మిగులు పోస్టుల భర్తీ చేపట్టకుండా సమాంతరంగా కొత్త పోస్టులు సృష్టించి నియామకాలు చేపట్టారు. ఒక్కో పోస్టుకు రూ.5 లక్షలు వసూలు చేసి 40 పోస్టింగ్‌లు ఇచ్చినట్టు జీజీహెచ్ కోడై కూస్తోంది. ఎంఎన్ఓ, ఎఫ్ఎన్ఓ, డార్క్ రూమ్ అసిస్టెంట్లు, ఎలక్ట్రీషియన్ గ్రేడ్–2, రేడియోగ్రాఫర్లు, ఫార్మసిస్టు పోస్టులను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేశారు. ఉదాహరణకు ఫార్మసిస్టు విభాగంలో 17 రెగ్యులర్ పోస్టులున్నాయి. పడకల సంఖ్య ఆధారంగా మరో 10 పోస్టులు మంజూరు చేశారు. అలా 27 పోస్టులుంటే 31 మందికి అక్కడ పోస్టింగ్‌లు ఇచ్చారని ప్రాథమికంగా తేల్చారు. రోస్టర్ ఊసే లేదు ఈ నియామకాల్లో రోస్టర్ ఊసే లేదు. వాచ్ రిజిస్టర్ లేదు. కేడర్ స్ట్రెంగ్త్ వివరాల నమోదూ లేదు. ఇవేవీ లేకుండా భర్తీ చేయడంలో కీలకంగా వ్యవహరించిన అధికారిని ఉన్నతాధికారులు విచారించినట్టు తెలిసింది. నియామక ప్రక్రియలో బాధ్యులైన వారి సంతకాలను ఈ అంశంపై పరిశీలన జరుపుతున్న బృందం గుర్తించింది. ఈ వ్యవహారంపై ఈ నెల 17నే కలెక్టర్, డీఎంఈలకు నివేదిక పంపాల్సి ఉన్నా కారణాంతరాలతో జాప్యం జరిగింది. జీతాల నిలుపుదల ఇదిలా ఉండగా అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. బాధ్యులపై చర్యలు తీసుకునే వరకూ అక్రమంగా నియమితులైన వారి జీతాలు నిలుపు చేస్తామని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. దీనిపై కలెక్టర్, డీఎంఈలకు సిఫారసు చేస్తామంటున్నారు. నర్సింగ్ ఉద్యోగాల భర్తీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారే ఈ ఉద్యోగాల భర్తీలో అవినీతిపై కూడా విచారణను ఎదుర్కోవాల్సి రావడం చర్చనీయాంశంగా మారింది. -
లక్ష్యాలు సాధించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో రెండో వంద రోజుల కార్యాచరణ అమలుకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని అధికారులను కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. వివిధ శాఖల ప్రగతి లక్ష్యాల పురోగతిపై తన చాంబర్లో గురువారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వరితో పాటు ఇతర అంతర పంటలను, భూసార పరీక్షలను ప్రోత్సహించాలని సూచించారు. కౌలు రైతులకు, రైతులకు రుణ లక్ష్యాలను పూర్తి చేయాలని చెప్పారు. మామిడి, అరటి, కోకో పండ్ల తోటల ప్రగతిపై కూడా కలెక్టర్ సమీక్షించారు. పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన అంతర్గత, అనుసంధాన రహదారులతో పాటు నిడదవోలు – పట్టెంపాలెం రోడ్డు అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. ఆర్అండ్బీ చేపట్టిన పనుల పురోగతిపై సమీక్షిస్తూ జిల్లాలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి రూ.10 కోట్లతో 120 పనులు మంజూరయ్యాయని, 46 పనులకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. 19 గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయని, 6 పనులు పూర్తయ్యాయని చెప్పారు. మత్స్య, పశు సంవర్ధక శాఖల ప్రగతిపై కూడా కలెక్టర్ సమీక్షించారు. షార్ట్ సర్క్యూట్‌తో తాటాకిల్లు దగ్ధంరాజమహేంద్రవరం రూరల్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో తాటాకిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. వివరాలు.. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలో శ్రీలక్ష్మీ నగర్లో విజయ సిరమిక్స్ యజమానికి చెందిన రెండు పోర్షన్ల తాటాకిల్లు ఉంది. దానిలో చుచుకొండ సత్యవతి, బిడిగి పద్మ నివసిస్తున్నారు. వీరిద్దరూ సిరామిక్ ఫ్యాక్టరీలో కూలి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా తాటాకిల్లు నుంచి మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సత్యవతి పోర్షన్లో ఆధార్ కార్డులు, బ్యాంకు పుస్తకాలు, ఓటరు గుర్తింపు కార్డు, ఇన్స్యూరెన్స్ బాండ్లు, బంగారం చెవి దుద్దులు, వెండి పట్టీలు, ఆమె కుమారుడు హేమాద్రి నాయుడి ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, సెల్ఫోన్లు కాలిపోయాయి. అలాగే పద్మ, ఆమె కుమారుడు రమేష్‌కు చెందిన దుస్తులు, బ్యాంకు పుస్తకాలు, ఆధార్ కార్డులు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల వరకూ ఆస్తినష్టం సంభవించిందని అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాసరావు తెలిపారు. -
అవినీతి మార్గం!
తిమ్మాపురంలో ఏడీబీ రోడ్డు శ్మశాన వాటిక వద్ద నుంచి రాజీవ్‌గాంధీ కళాశాలకు వెళ్లే మార్గంలో నిర్మించిన సిమెంటు రోడ్డుకాకినాడ రూరల్: అధికారం చేతిలో ఉంటే ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటే పొరపాటే. ఇది ప్రజాస్వామ్యం.. ఎవరో ఒకరు పాలకుల తప్పులను బట్టబయలు చేయడానికి.. వాటికి అడ్డుకట్ట వేయడానికి ముందుకు వస్తూనే ఉంటారు. అటువంటి సంఘటనే ఇది. అధికారం అండతో ఓ నేత నిబంధనలకు విరుద్ధంగా.. ఏకంగా అధికారుల పైనే ఒత్తిడి తెచ్చి.. ఏకంగా ఓ ప్రైవేటు కళాశాలకు ఉపాధి హామీ పథకం నిధులతో సిమెంటు రోడ్డు నిర్మాణం చేయించారని, దీనిపై విచారణ చేయాలని అధికార కూటమిలోని ఓ పార్టీ నేత సాక్షాత్తూ కలెక్టర్‌కే ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాలివీ.. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలో రూ.77.5 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో ఇటీవల 1,244 మీటర్ల పొడవైన సిమెంటు రోడ్డు నిర్మించారు. మూడు పనులుగా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఏడీబీ రోడ్డు శ్మశాన వాటిక నుంచి రాజీవ్ గాంధీ కళాశాల వరకూ రూ.21.5 లక్షలు, ఆ కళాశాల ఎంట్రన్స్ నుంచి ఊర చెరువు వరకూ రూ.22.5 లక్షలు, తిమ్మాపురం నుంచి ఊర చెరువు దుర్గమ్మ గుడి వరకూ రూ.33.5 లక్షలతో ఈ రోడ్డు నిర్మించారు. ఈ పనులు జరిగిన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. జనావాసాలు లేని ఈ మార్గంలో కేవలం ప్రైవేటు కళాశాల యాజమాన్యానికి లబ్ధి చేకూర్చేలా రోడ్డు నిర్మాణం చేపట్టారని, తద్వారా ఉపాధి నిధులు పక్కదారి పట్టాయని అధికార కూటమిలోని బీజేపీ నేత ఒకరు విమర్శిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఈ రోడ్డు నిర్మించాలంటే మొదట గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలి. కానీ, అటువంటిదేమీ జరగలేదు. అయినప్పటికీ ఓ నియోజకవర్గ స్థాయి నేత పంతం పట్టి మరీ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈ రోడ్డు వేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా రెడీమేడ్ కాంక్రీటుతో కాంట్రాక్టర్ రహదారి నిర్మించడం విమర్శలకు తావిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులను ఆగమేఘాల మీద చేపట్టి, పూర్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ సొంత పార్టీ జనసేనకు చెందిన పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన నియోజవర్గంలోనే ఉపాధి నిధులు దుర్వినియోగమవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తిమ్మాపురానికి చెందిన అధికార కూటమిలోని బీజేపీకి చెందిన నాయకుడు కాళ్ళ ధనరాజు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. కాకినాడ రూరల్‌లో ప్రైవేటు కళాశాలకు సిమెంటు రోడ్డు పంచాయతీ తీర్మానం లేకపోయినా నిర్మాణం నియోజకవర్గ నేత ఒత్తిడి తెచ్చారని విమర్శలు ఉపాధి నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు అవకతవకలపై కలెక్టర్‌కు బీజేపీ నేత ఫిర్యాదు -
తీర్మానం చేయలేదు
మా గ్రామంలో ప్రైవేటు కళాశాలకు సిమెంటు రోడ్డు నిర్మించారు. గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వకపోయినా పనులు చేపట్టారు. ప్రజాధనం దుర్వినియోగానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి. – బెజవాడ సత్యనారాయణ, సర్పంచ్, తిమ్మాపురం రోడ్డు నిర్మాణంలో అవకతవకలు తిమ్మాపురంలో సుమారు రూ.77.5 లక్షల ఉపాధి హామీ నిధులతో సిమెంటు రోడ్డు నిర్మించారు. జనావాసాలు లేకపోయినా రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ పనులకు బయట నుంచి ప్లాంట్ కాంక్రీటు తీసుకువచ్చారు. ప్లాంట్ కాంక్రీట్‌లో 20 ఎంఎం కంకర ఉండదు. దీనివలన రోడ్డు త్వరగా ఛిద్రమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి. – కాళ్ళ ధనరాజు, బీజేపీ నాయకుడు, తిమ్మాపురం -
ఆపేదెవరు?
కోటిలింగాల–2 ర్యాంపు వద్ద పడవ పక్కనే డ్రెడ్జింగ్ బోటు● బరి తెగిస్తున్న ఇసుక మాఫియా ● యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు ● నిబంధనలకు తిలోదకాలు ● కోటిలింగాల రేవు–2 వద్ద ఆగని డ్రెడ్జింగ్ ● పడవలు కనపడకుండా నయా దందా ● అధికారులను లెక్క చేయని ఇసుకాసురులుసాక్షి, రాజమహేంద్రవరం: కూటమి నేతల అండదండలతో ఇసుక మాఫియా బరి తెగిస్తోంది. నిబంధనలను గోదావరిలో తొక్కి నదిని ఇష్టమొచ్చినట్లు తవ్వేయడం.. అక్రమంగా ఇసుక తరలించి రూ.లక్షలు దండుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. అడ్డగోలు వ్యవహారానికి తెగబడుతూ.. గుట్టు చప్పుడు కాకుండా రూ.కోట్ల విలువ చేసే ఇసుకను లారీలు, ట్రాక్టర్లలో రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. కూటమి నేతల అధికార బలాన్ని ఎదిరించలేకో.. మామూళ్లకు లొంగిపోయో అధికారులు, పోలీసులు.. తప్పు జరుగుతోందని తెలిసినా మిన్నకుండిపోతున్నారు. ఇటీవల జిల్లాలో పలు ర్యాంపుల్లో జరుగుతున్న అక్రమాలు బహిర్గతమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆపేవారు.. అడ్డుకునే వారు లేకపోవడంతో ఇసుకాసురులు గోదావరి నదిని గుల్ల చేసేస్తున్నారు. కోటిలింగాల రేవును కొల్లగొట్టేస్తున్నారు! రాజమహేంద్రవరం నగరంలోని కోటిలింగాల రేవు–2 ర్యాంపులో ఇసుకను అధికార కూటమి నేతలు ఇద్దరు కొల్లగొట్టేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా డ్రెడ్జింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ అక్రమ తవ్వకాలను ఇప్పటి వరకూ రాత్రి 11 గంటలకు ప్రారంభించే వారు. అధికారం అండగా ఉండగా తమను అడ్డుకునేదెవరనుకున్నారో ఏమో కానీ.. తాజాగా పట్టపగలే దోపిడీ మొదలు పెట్టేశారు. రాత్రుళ్లు అయితే అనుమానం వస్తుందనే తలంపుతో పగటి సమయంలోనే యథేచ్ఛగా డ్రెడ్జింగ్ చేపడుతున్నారు. కోటిలింగాల రేవు–2 నుంచి ప్రతి రోజూ సుమారు 100 లారీలకు పైగా ఇసుక ఇతర జిల్లాలకు తరలిపోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాత్రి సమయాల్లో ఇసుక వెలికితీత, లోడింగ్, అన్లోడింగ్ పూర్తిగా నిషేధం. అయితే, కోటిలింగాల రేవు–2 ర్యాంపులో ఇటువంటి నిబంధనలు ఏమాత్రం అమలు కావడం లేదు. పత్రికల్లో కథనాలు వచ్చిన రోజు మాత్రం ఇసుక తవ్వకాలు ఆపేస్తున్నారు. తిరిగి మరుసటి రోజు నుంచే మొదలు పెట్టేస్తున్నారు. ఆకస్మిక తనిఖీలేవీ? అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తే ఇసుక అక్రమార్కుల భరతం పట్టే అవకాశం దక్కేది. కానీ, అధికారులు మీడియాలో కథనాలు వచ్చిన తర్వాత తాపీగా ర్యాంపుల వద్దకు వెళ్తున్నారే తప్ప.. రహస్యంగా, ఆకస్మికంగా తనిఖీలకు వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు వస్తున్న విషయం ముందుగానే తెలుసుకుంటున్న ఇసుకాసురులు వెంటనే అప్రమత్తమవుతున్నారు. తాత్కాలికంగా డ్రెడ్జింగ్ నిలిపివేస్తున్నారు. దీంతో ఆ సమయంలో అధికారులు అక్కడకు వెళ్తున్నా ప్రయోజనం ఉండటం లేదు. డ్రెడ్జింగ్ పడవకు ఇరువైపులా నాటు బోట్లు గోదావరిలో డ్రెడ్జింగ్ నిషేధం. కానీ, ఇక్కడ డ్రెడ్జింగ్ చేసి మరీ ఇసుక తోడేస్తున్న మాఫియా ఎవ్వరికీ అనుమానం రాకుండా ఏర్పాట్లు చేసుకుంటోంది. డ్రెడ్జింగ్ బోటు బయటకు కనిపించకుండా ఇరువైపులా నాటు పడవలను ఉంచుతోంది. ఈవిధంగా దోచేస్తున్న ఇసుకకు 6 యూనిట్లకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. ఒక్క కోటిలింగాల రేవు–2లోనే రోజుకు 100 ట్రిప్పులకు పైగా ఇసుకను విశాఖ, హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాలకు తరలిస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. ఇదంతా తెలిసినా మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వేమగిరిలో వివాదం ఇసుక దందా ఏ స్థాయిలో జరుగుతోందో చెప్పడానికి ఇటీవల కడియం మండలం వేమగిరి–1 ర్యాంపులో జరిగిన ఘటనే సాక్ష్యంగా నిలుస్తోంది. ఈ ర్యాంపు వివాదం న్యాయస్థానంలో ఉన్నా లెక్క చేయకుండా రాత్రి వేళ యథేచ్ఛగా ఇసుక తవ్వి తరలించేశారు. ఈ వ్యవహారం చర్చనీయాంశం కావడంతో పాటు ఇసుక తవ్వుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై స్పందించిన అధికారులు ఇక్కడ తవ్వకాలు తాత్కాలికంగా ఆపేశారు. అంతలోనే వేమగిరి–2 ర్యాంపులో తవ్వకాలు జోరందుకున్నాయి. దీనికి సైతం అగ్రిమెంట్ లేదని తెలుస్తోంది. అసలు ఇక్కడ ఏ ర్యాంపునకు అనుమతులు ఉన్నాయి.. ఎవరు తవ్వుతున్నారనే విషయాలు అంతుచిక్కనివిగా ఉన్నాయి. ఎవరిని ప్రశ్నించినా తమకు అనుమతులు ఉన్నాయనే చెబుతున్నారు. అధికారులు మాత్రం దీనిపై స్పందించడం లేదు. టన్ను టన్నుకూ కుమ్ముడే.. ప్రభుత్వం ఎంతగా గొప్పలు చెబుతున్నా.. ఉచిత ఇసుక ఏ ఒక్కరికీ అందడం లేదు. వేమగిరి – కడియపులంక ర్యాంపు–1లో ఇసుకను అధిక ధరలకు విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం టన్ను ఇసుక ధర రూ.61 నిర్ణయించగా 20 టన్నుల లారీకి వినియోగదారు రూ.1,220 మాత్రమే చెల్లించాలి. దూరాన్ని బట్టి లారీ కిరాయి అదనం. కానీ, ఇక్కడ మాత్రం టన్ను ఇసుకకు రూ.350 చొప్పున 20 టన్నులకు రూ.7 వేలు వసూలు చేస్తున్నారు. నిర్ణీత ధరకంటే రూ.5,780 అధికంగా కొల్లగొడుతున్నారు. ర్యాంపులో ఇస్తున్న రశీదులో లారీ యజమాని పేరు, ఫోన్ నంబర్, డ్రైవర్ పేరు, ఫోన్ నంబర్, లారీ నంబర్, ఎక్కడి నుంచి ఎక్కడికి రవాణా అవుతోంది, ఎన్ని టన్నులు, టైమ్ తదితర అన్ని వివరాలూ ఉంటున్నాయి. కానీ చెల్లించిన ధర మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇది దోపిడీకి సంకేతం కాదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఉచిత ఇసుకంటే ఇదేనా? ఇసుక దోపిడీ ఆగడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. జేగురుపాడుకు చెందిన ఓ వినియోగదారుడు వేమగిరి ర్యాంపులో 20 టన్నుల ఇసుక కొనుగోలు చేయగా.. 10 టన్నులకు మాత్రమే బిల్లు ఇచ్చారు. మిగిలిన 10 టన్నుల ఇసుకకు సంబంధించిన బిల్లులు ఏమైనట్లు? ఆ డబ్బులు ఎవరికి చేరాయి? ఇసుకను పారదర్శకంగా అందిస్తున్నామని ప్రభుత్వాధినేతలు, అధికారులు చెబుతున్నారు. ర్యాంపులో ఇస్తున్న రశీదును ఒకసారి పరిశీలిస్తే పారదర్శకత ఎంత ఉందో అర్థమవుతుంది. ప్రభుత్వం దళారీ వ్యవస్థను అరికట్టాలి. వినియోగదారుకు ఇచ్చే రశీదులో చెల్లించిన సొమ్ము కూడా ప్రింట్ చేసేలా చర్యలు తీసుకోవాలి. – యాదల సతీష్‌చంద్ర స్టాలిన్, సర్పంచ్, జేగురుపాడు, కడియం మండలం -
రత్నగిరిపై ఘనంగా పడిపూజ
● ఆలయ ప్రాంగణంలో ప్రతిధ్వనించిన సత్యదేవుని నామం ● వేలాదిగా తరలివచ్చిన స్వాములుఅన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సత్య స్వాముల పడిపూజ (సత్యదేవ అనుగ్రహ పూజ) శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రత్నగిరిపై సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం వద్ద రాత్రి ఏడు గంటలకు దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, అడ్డతీగలకు చెందిన పవనగిరి స్వామీజీ జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గణపతి పూజతో పండితులు పడి పూజకు శ్రీకారం చుట్టారు. వేదస్వస్తి పలికారు. సత్యదేవునికి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, శంకరులకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్య స్వాములతో పూజ చేయించారు. స్వామి, అమ్మవార్లకు వేదాశీస్సులు, మంగళహారతితో రాత్రి ఏడు గంటలకు ఈ పూజ వైభవంగా ముగిసింది. సత్యదీక్ష పడిపూజ, దీక్ష విరమణ ఏర్పాట్లు చాలా బాగున్నాయని పవనగిరి స్వామీజీ అన్నారు. వేద పండితులు గొల్లపల్లి గణపతి ఘనపాఠి, యనమండ్ర శర్మ, ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, అర్చకులు సుధీర్, దత్తుశర్మ, వైదిక కార్యక్రమాల పర్యవేక్షకుడు కామేశ్వరశర్మ, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు నాగాభట్ల రవిశర్మ, అంగర సతీష్, పాలంకి పట్టాభి తదితరులు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చి న సత్య స్వాములు ‘జై సత్యదేవ’ అంటూ భక్తితో చేసి న నామస్మరణ రత్నగిరి అంతటా ప్రతిధ్వనించింది. నేడు సత్య దీక్షల విరమణ సత్య దీక్షలు 27, 18, 9 రోజుల పాటు చేసిన స్వాములు సత్యదేవుని జన్మనక్షత్రం మఖ సందర్భంగా శనివారం దీక్ష విరమించనున్నారు. ఈ సందర్భంగా వేలాదిగా స్వాములు రత్నగిరికి రానుండడంతో అధికారులు వార్షిక కల్యాణ మండపం వద్ద దీక్ష విరమణకు ఏర్పాట్లు చేశారు. అక్కడే హోమ గుండం కూడా ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల నుంచి వచ్చిన సుమారు వెయ్యి మంది గిరిజన సత్య స్వాములు శుక్రవారం సాయంత్రం సత్యదేవుని వ్రతాలాచరించారు. వారికి దేవస్థానం ప్రసాదాలు బహూకరించింది. నేడు జన్మనక్షత్ర పూజలు సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా శనివారం తెల్లవారుజామున స్వామి, అమ్మవారు, శంకరుల మూలవిరాట్టులకు పంచామృతాభిషేకం నిర్వహించనున్నారు. వేకువన ఒంటిగంటకే స్వామివారి ఆలయం తెరచి పూజలు చేస్తారు. స్వామి, అమ్మవార్ల అభిషేకాల అనంతరం ఉదయం 5 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. దీక్ష విరమించిన స్వాములకు మాత్రం తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రత్యేక దర్శనాలు కల్పించనున్నారు. -
పతకమే ధ్యేయంగా ఆడాలి
అమలాపురం రూరల్: కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఈ నెల 26 నుంచి 27 వరకు 27వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల సపక్ తక్రా చాంపియన్ షిప్ పోటీలు జరగుతాయని అంబేడ్కర్ కోనసీమ జిల్లా సేపక్ తక్రా క్రీడ అధ్యక్షుడు జవ్వాది తాతబాబు, కార్యదర్శి కేతా సాయిదుర్గ ప్రసాద్ తెలిపారు. వారం రోజులుగా జిల్లా టీమ్‌కు ఎంపికై న వివిధ ప్రాంతాలకు చెందిన బాల బాలికలకు కోచ్ యాండ్ర గౌతమ్ ఆధ్వర్యంలో అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. శిక్షణ ముగింపు సభ శుక్రవారం నిర్వహించారు. క్రీడాకారులను ఉద్దేశించి తాతబాబు మాట్లాడుతూ పతకమే ధ్యేయంగా ఆడి మంచి క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా క్రీడాకారులను వాకర్స్ సభ్యులు డాక్టర్ వై.నరసింహారావు, తొట రాము, కూచిమంచి కృష్ణ, కొమ్ముల సురేష్ అభినందిచారు. టీం మేనేజర్ జీవీ బాబు, అసోసియేషన్ సభ్యులు మనగాల మన్యం, సైదుల రమణ ,బుల చిరంజీవి, పీవీ రావు పాల్గొన్నారు. -
కోడ్‌ను వెక్కిరిస్తున్న ఫ్లెక్సీలు
కె.గంగవరం: మండల పరిధిలోని కోటిపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఇంకా అమలులోకి రానట్టే ఉంది! గ్రామం నడిబొడ్డునే ఏర్పాటు చేసిన రాజకీయ నాయకులు ఫ్లెక్సీలే దీనికి నిదర్శనం. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్, ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ కార్యదర్శి కె.హర్షవర్థన్ శుక్రవారం కోటిపల్లిలో పర్యటించారు. ఆయన వచ్చి వెళ్లారు కానీ అధికారులు మాత్రం గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మాత్రం తొలగించలేదు. ప్రతి గ్రామంలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ నేతల ఫ్లెక్సీలను తొలగించిన సంగతి తెలిసిందే. కానీ కోటిపల్లిలో మాత్రం అధికారుల నిర్లక్షమో లేక ప్రజాప్రతినిధుల పట్ల అంకితా భావమో తెలి యని పరిస్థితి ఉందని స్థానికులు అంటున్నారు. రేపు ఉమ్మడి జిల్లా హేతువాద మహాసభ అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా హేతువాద సంఘం వార్షిక మహాసభను ఆదివారం అమలాపురంలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఈ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేవీవీ సత్యనారాయణ, డి.రాజశేఖర్‌లు తెలిపారు. మహాసభలో హేతువాదం, మానవ వాదం అధ్యయన తరగతులతో పాటు గ్రంధ ఆవిష్కరణ జరుగుతుందని పేర్కొన్నారు. మహాసభకు హైదరాబాద్‌కు చెందిన భారత హేతువాత సంఘం అధ్యక్షుడు డాక్టర్ గుమ్మా వీరన్న, భారత చైర్మన్ మేడూరి సత్యనారాయణ తదితర సంఘ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న హేతువాదులు, అభ్యుదయ వాదులు మహాసభకు హాజరుకావాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎనిమిది మంది బైండోవర్ అల్లవరం: అల్లవరం తహసీల్దార్ కార్యాలయంలో ఎనిమిది మందిపై బైండోవర్ కేసులను శుక్రవారం నమోదు చేశారని ఎకై ్సజ్ సీఐ వీటీవీవీ సత్యనారాయణ తెలిపారు. వివిధ మద్యం కేసుల్లో ముద్దాయిలైన బోడసకుర్రుకు చెందిన పి.సూర్యప్రకాష్, ఆవాల రవితేజ, గుబ్బల సత్యనారాయణ, అల్లవరానికి చెందిన టి.జానకిరామారావు, ఆర్.ఆదినారాయణమూర్తి, డి.రావులపాలానికి చెందిన ఎ.సూర్యనారాయణ, బెండమూర్లంకకు చెందిన కె.నాగేశ్వరరావు, శిరగట్లపల్లికి చెందిన ఎస్.మీరమ్మలను మండల ఎగ్జికూటివ్ మేజిస్ట్రేట్ నరింహరావు ముందు హాజరుపరచగా వీరికి రూ.లక్ష చొప్పున పూచీకత్తు విధించారని ఎకై ్సజ్ సీఐ తెలిపారు. -
ఎస్సీ ప్రాంతాల్లో నిర్బంధంగా విద్యుత్ బిల్లుల వసూళ్లు
కట్టకపోతే కరెంట్ కట్ రౌతులపూడి: మండలంలోని పలు గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో గృహ విద్యుత్ బిల్లుల నిర్బంధ వసూలుకు అధికారులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం మండలంలోని ఎ.మల్లవరం, బీబీ పట్నం తదితర గ్రామాల్లో విద్యుత్ అధికారులు ఎస్సీ గృహవిద్యుత్ వినియోగదారులు ఇళ్లు సందర్శించి నిర్బంధంగా వసూళ్లు చేపట్టారు. రూ.ఐదు వేలుకు పైగా విద్యుత్ బిల్లులు ఉన్న గృహవినియోగదారుల నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా విద్యుత్ బిల్లుల మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఐదేళ్లు ఒక్క రూపాయి కూడా విద్యుత్ బిల్లులు చెల్లించలేదన్నారు. ఒకేసారి ఆ మొత్తాన్ని చెల్లించాలని, లేకుంటే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని అధికారులు హుకుం జారీచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలీనాలీ చేసుకుని జీవనం సాగించే తాము అధిక మొత్తంలో విద్యుత్ బిల్లులు ఎలా చెల్లించాలని వారు వాపోతున్నారు. కనీసం వాయిదాల పద్ధతిలో నెలనెలా చెల్లించే అవకాశం కల్పించాలని కోరినా పట్టించుకోవడం లేదన్నారు. ఇలా నిర్ధాక్షిణ్యంగా విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తే తామంతా చీకట్లోనే జీవించే పరిస్థితి దాపురిస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కనెక్షన్లు తొలగించారంటూ నిరసన తొండంగి: మండలంలోని గోపాలపట్నం విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద తొండంగికి చెందిన వినియోగదారులు తమ విద్యుత్ కనెక్షన్లు తొలగించారని శుక్రవారం నిరసన తెలిపారు. బాధితుల వివరాల ప్రకారం తొండంగి ఎస్సీపేటకు చెందిన 20 విద్యుత్ వినియోగదారుల విద్యుత్ కనెక్షన్లను విద్యుత్‌శాఖ అధికారులు తొలగించారు. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడంపై విద్యుత్‌శాఖ సిబ్బంది తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సబ్‌స్టేషన్ వద్ద వినియోగదారులు నిరనన తెలిపారు. అయితే పాతబకాయిల కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కనెక్షన్లు సిబ్బంది తొలగించారని విద్యుత్ శాఖ ఏఈ ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో బకాయిల చెల్లింపునకు 20 రోజుల గడువు ఇవ్వడంతోపాటు విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించేందుకు అంగీకరించారు. -
పిచ్‌ను పరిశీలించిన డీఈవో
అమలాపురం టౌన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 68వ అంతర్ జిల్లాల (రాష్ట్ర స్థాయి) అండర్–14 క్రికెట్ పోటీల వేదిక అయిన అమలాపురం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో రూపుదిద్దుకుంటున్న పిచ్‌ను డీఈవో ఎస్కే సలీమ్ బాషా శుక్రవారం పరిశీలించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో అమలాపురంలో జరగనున్న ఈ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై ఫిజికల్ డైరెక్టర్లు, వ్యాయామ ఉపాధ్యాయులతో డీఈవో బాషా ఆ క్రీడా స్థలంలోనే చర్చించారు. అమలాపురం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం, బాలయోగి స్టేడియం, కిమ్స్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజులపాటు ఏకకాలంలో జరిగే ఈ పోటీలకు రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి హాజరయ్యే క్రీడాకారులకు తగిన వసతులపై కూడా వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా జెడ్పీ బాలురు ఉన్నత పాఠశాల ఫిజకల్ డైరెక్టర్లు జి.గోవింద్, తోట రవిలకు క్రికెట్ పిచ్ తయారీపై డీఈవో సూచనలు, సలహాలు ఇచ్చారు. జిల్లా క్రికెట్ కోచ్ రాయుడు సతీష్ ఆధ్వర్యంలో క్రికెట్ పిచ్ తయారవుతోంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి అడబాల విజయ శ్రీనివాస్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి బీవీవీఎస్ఎన్ మూర్తి డీఈవో బాషాతో కలిసి క్రికెట్ పిచ్‌ను పరిశీలించారు. -
గుడిమెళ్లంకలో శృంగేరి జగద్గురువుల విజయయాత్ర
రేపు శృంగేరి పీఠాధిపతి శ్రీవిదు శేఖర మహాస్వామి గ్రామానికి రాక అమలాపురం టౌన్: మలికిపురం మండలం గుడిమెళ్లంక గ్రామంలో ఈ నెల 24, 25 తేదీల్లో జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీవిదు శేఖర మహాస్వామి విజయ యాత్ర జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మానేపల్లి అయ్యాజీ వేమా తెలిపారు. విజయయాత్ర కోసం శృంగేరి పీఠాధిపతి శ్రీవిదు శేఖర మహాస్వామి గుడిమెళ్లంక గ్రామానికి విచ్చేస్తున్నారని పేర్కొన్నారు. అమలాపురం ప్రెస్ క్లబ్ భవనంలో ధార్మిక సంస్థల ప్రతినిధులు మంగళంపల్లి సాయిరామ్, మంగళంపల్లి కార్తీక్ శర్మ, గొవ్వాల నాగరాజుతో కలిసి మాజీ ఎమ్మెల్యే వేమా శుక్రవారం ఈ యాత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గుడిమెళ్లంక గ్రామంలో 25వ తేదీన జరిగే ఉమా లక్ష్మణేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణకు శంకుస్థాపన సందర్భంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా వారు విజయ యాత్ర, శంకుస్థాపనకు సంబంధించిన బ్రోచర్లను విడుదల చేశారు. -
బెల్ట్ షాపుపై ఎకై ్సజ్ అధికారుల దాడి
● జనసేన పార్టీ కార్యకర్తపై కేసు నమోదు ● 126 మద్యం, నాలుగు బీరు సీసాలు స్వాధీనం కరప: మండలంలోని పెనుగుదురులో ఒక మద్యం బెల్టు షాపుపై ఎస్టీఎఫ్ (స్పెషల్ టాస్క్‌ఫోర్స్), తాళ్లరేవు ఎకై ్సజ్‌శాఖ అధికారులు దాడి చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 126 మద్యం సీసాలు (180 ఎంఎల్), నాలుగు బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎకై ్సజ్ అధికారులు తెలిపిన మేరకు... పెనుగుదురులో బెల్ట్ షాపు నిర్వహిస్తున్నట్టు మంగళగిరిలోని డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్కు సమాచారం అందింది. అక్కడి అధికారుల ఆదేశాల మేరకు ఎస్టీఎఫ్, మంగళగిరి ఎన్ఫోర్స్మెంట్ సభ్యుల బృందం గురువారం పెనుగుదురులో దాడి చేసింది. బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న జనసేన పార్టీ కార్యకర్త పప్పుల ఆదివిష్ణు మల్లేశ్వరరావును అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 126 మద్యం, నాలుగు బీరు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపించారు. స్థానిక ఎమ్మెల్యే, నాయకులు జనసేన పార్టీ కార్యకర్తపై కేసు నమోదు చేయకుండా వదిలేయాలని ఎంతగా ఒత్తిడి తీసుకొచ్చినా ఫలించలేదు. కరపలోని జనసేన పార్టీ నాయకులకు చెందిన మద్యం దుకాణం నుంచి మద్యం సీసాలు తీసుకున్నట్టు అధికారులు గుర్తించారు. బెల్ట్ షాపునకు మద్యం సీసాలు అమ్మిన షాపుపై కేసు నమోదు చేస్తారో, అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి వదిలేస్తారోనని గ్రామంలో చర్చించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ బెల్ట్ షాపు నిర్వహిస్తే రూ.5 లక్షలు అపరాధ రుసుం వసూలు చేస్తామని చెప్పారని, అది అమలులో చూపించాలని మహిళలు కోరుతున్నారు. ఈ దాడిలో ప్రొహిబిషన్, ఎకై ్సజ్ శాఖ తాళ్లరేవు సీఐ కె.కోటేశ్వరరావు, ఎస్ఐ వై.నాగేంద్రకృష్ణ, ఎస్టీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఒడ్డున వడిదొడుకులు
రూ.3 కోట్ల అంచనా వ్యయం బీచ్ వద్ద నుంచి సాగరసంగమం వరకూ తీరం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా కాంక్రీట్ వాల్ కమ్ రోడ్ నిర్మాణానికి రూ.కోటి 50 లక్షలతో ప్రతిపాదనలు సిద్థం చేసినట్టు పర్యాటక శాఖ గతంలో పేర్కొంది. అయితే లైట్‌హౌస్ వద్ద నుంచి పల్లిపాలెం వరకూ కాంక్రీట్ వాల్ పొడిగింపు నిర్మాణంతో ఈ మొత్తం రూ.3 కోట్లకు చేరింది. దీనిపై పరిశీలిస్తామని కూడా ఆ శాఖ అప్పట్లో వెల్లడించింది. ● అంతుచిక్కని భౌగోళిక మార్పులతో అంతర్వేది సాగరం ● తరచూ తీరం వైపునకు పోటెత్తుతున్న కెరటాలు ● 500 ఎకరాల్లో సరుగుడు తోటల కనుమరుగు ● ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు సఖినేటిపల్లి: అంతుచిక్కని భౌగోళిక మార్పులతో తరుచూ అంతర్వేది వద్ద సముద్రం.. తీరం వైపునకు పోటెత్తుతున్న తీరుకు ఆ ప్రాంతవాసులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా అమావాస్య, పౌర్ణమి, ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో పోటెత్తే సముద్రం, సాధారణ రోజుల్లో కూడా తీరం వైపునకు ఉరకలు వేస్తుండడంతో కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని వారు చెబుతున్నారు. రాజోలు దీవిలో... రాజోలు దీవిలోని కరవాక, కేశనపల్లి, చింతలమోరి, కేశవదాసుపాలెం తదితర ప్రాంతాల్లోని సముద్ర తీరాలకు భిన్నంగా అంతర్వేది వద్ద తీరం వైవిధ్యంగా ఉంటుందని ఇక్కడి ప్రజలు అంటున్నారు. ఇతర ప్రాంతాల్లోని తీరాల్లో ఒక్క ప్రకృతి వైపరీత్యాల్లో మాత్రమే అలజడిగా ఉండే సముద్రం, సాధారణ రోజుల్లో ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నారు. అయితే కేవలం అంతర్వేది వద్ద మాత్రం ప్రకృతి వైపరీత్యాలతో పాటు, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో తీరం వైపునకు కెరటాల ఉధృతి ఉంటోందని వారు చెబుతున్నారు. వైవిధ్యానికి కారణాలు ఇవే! రాజోలు దీవిలో ఇతర ప్రాంతాల్లో తీరంలోని పరిస్థితులకు భిన్నంగా అంతర్వేది వద్ద గోచరిస్తుండడానికి స్థానికులు చెబుతున్న కారణాలు.. ● అంతర్వేది.. గోదావరి, సాగరం సంగమ ప్రదేశం కావడంతో అమావాస్య, పౌర్ణమిలకు పోటెత్తే ఉప్పునీరు సాధారణ రోజుల్లో కూడా ఎగదన్నుతోంది. ● రోజూ పోటు సమయంలో సముద్రం నీరు గోదావరి వైపునకు పోటెత్తడం, ఎగువ ప్రాంతాల నుంచి జిల్లాకు చిట్ట చివరనున్న అంతర్వేదికి చేరే గోదావరి నీటి ప్రవాహం తోడవ్వడంతో నీటి మట్టం రెట్టింపు అవుతోంది. ● సముద్ర గర్భంలో అప్పటికప్పుడు వచ్చే మార్పులకు సముద్రం నీరు బిగపెట్టడంతో (సంగమం వద్ద గోదావరి నీరు సముద్రంలోకి రానీయకుండా), ఆ సమయంలో గోదావరి ప్రవాహం దిశ మళ్లీ సమీప సరుగుడు తోటలను ముంచెత్తుతోంది. ● విపత్తుల సమయాల్లో సంగమంకు పశ్చిమ వైపు బియ్యపుతిప్ప గ్రామం వద్ద ఇసుక మేటలు ఏర్పడతాయి. దీంతో కెరటాల ఉధృతి ప్రభావం సంగమంకు రెండో వైపు అంతర్వేది తీరంపై పడడంతో భూములకు, సరుగుడు తోటలకు సముద్రపు కోత పెద్ద సమస్యగా మారింది. ● అంతర్వేది లైట్‌హౌస్ వద్ద తీరం మలుపు తిరిగి ఉండడంతో సంగమంకు పశ్చిమ వైపుకంటే తూర్పువైపునున్న అంతర్వేది వద్ద నీటి ప్రవాహ వేగం తీవ్రంగా ఉండడంతో ఆ ప్రాంతానికి ఉప్పునీరు చొచ్చుకు వస్తోంది. ● 2001, 2008 సంవత్సరాల్లో లైట్హౌస్కు సమీపంలోని పల్లిపాలెం గ్రామ రక్షణకు నిర్మించిన గ్రోయన్లు, వాటి మధ్య రివిట్మెంట్ పూర్తిగా కోత కారణంగా చతికిలబడి పోటునీరు అడ్డుఅదుపూ లేకుండా పల్లపు ప్రాంతాలను ముంచెత్తుతోంది. ● గతానికి ఇప్పటికీ సముద్రం సుమారు 500 మీటర్లు ముందుకు చొచ్చుకు రావడంతో తరచూ పోటు సమయంలో సమీప ప్రాంతాల్లో ఉగ్రరూపం చూపిస్తోంది. ● గతంలో కొత్తలైట్హౌస్ వద్ద నుంచి సరుగుడు తోటలు విస్తారంగా ఉండేవి. సంద్రం కోత కారణంగా కొద్ది సంవత్సరాలుగా సుమారు 500 ఎకరాల్లో సరుగుడు తోటలు సముద్ర గర్భంలో కలిసిపోయాయి. పశ్చిమం వైపున దిబ్బలు సాగర సంగమంకు పశ్చిమంవైపున బియ్యపుతిప్ప వద్ద సముద్రం ఇసుక దిబ్బలు వేస్తుండడం, ఆ కారణంగా తూర్పువైపున నీటి ప్రవాహ వేగం పెరగడం వల్ల లైట్‌హౌస్ వద్ద తరచూ నీరు పోటెత్తుతోంది. సముద్రం పోటు నీరుకు గోదావరి నీటి ప్రవాహం తోడవ్వడంతో ఇక్కడ నీటిమట్టం పెరిగిపోతోంది. – కొల్లాటి నరసింహస్వామి, మాజీ సర్పంచ్, పల్లిపాలెం పెరిగిన కెరటాల ఉధృతి లైట్‌హౌస్ వద్ద తీరం ఒంపు తిరిగి ఉండడంతో సముద్రం కెరటాల వడి మరింత పెరిగింది. దీంతో అమావాస్య, పౌర్ణమిలతో పాటు సాధారణ రోజుల్లోనూ సముద్రం పోటెత్తి తీరం వరకూ చేరుతోంది. – చొప్పల చిట్టిబాబు, మాజీ సర్పంచ్, పల్లిపాలెం -
తేరేగింపు!
కొత్తపేట: ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ రథం వెనుక రథం పయనమవుతున్నాయి. వాటి ముందు కొందరు యువకులు రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులకు, గృహస్తులకు రాకపోకలు సాగిస్తున్న వాహనాదారులకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఇంతకీ ఆ రథాల యాత్ర ఏమిటనుకుంటున్నారా? కొత్తపేట మండలం మోడేకుర్రు శివారు గొలకోటివారిపాలెంలో పంచముఖ ఆంజనేయస్వామి వారి ఆలయ చతుర్థ వార్షికోత్సవం ఈ నెల 25న జరగనుంది. ఆలయ నిర్మాణకర్త గొలకోటి మాచరరావు (ఈవెంట్స్ మాధవ్) ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీన్ని పురస్కరించుకుని కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాలతో పాటు అమలాపురం ప్రాంతాల్లో వృషభ, గజ, అశ్వ, హంస, ఒంటె వాహన రథాల ఊరేగింపుతో ప్రజలను ఆహ్వానిస్తూ చేపట్టిన కార్యక్రమం ఆకట్టుకుంది. దారి పొడవునా ఆ వాహనాలతో అనేకమంది సెల్ఫీలు తీసుకున్నారు. -
చెల్లని చెక్కు కేసులో ఆరునెలల జైలు
రూ.3లక్షల నష్ట పరిహారం విధింపు కాకినాడ లీగల్: చెల్లని చెక్కు ఇచ్చిన వ్యక్తికి ఆరునెలల జైలు, రూ.3 లక్షల పరిహారం విధిసూ్త్ కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కాకినాడ చెందిన జి.హేమంత్ వద్ద నుంచి కాకినాడకే చెందిన డి.వినోద్‌కుమార్ 2021లో రూ. 3 లక్షల అప్పు తీసుకున్నాడు. బాకీ తీర్చేందుకు 2022లో రూ.3 లక్షల చెక్కు ఇచ్చారు. చెక్కును హేమంత్ బ్యాంక్‌లో వేయగా బౌన్స్ కావడంతో కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణలో వినోద్‌కుమార్ పై నేరం రుజువు కావడంతో ఆరునెలల జై లు, రూ.3 లక్షల పరిహారం విధిస్తూ తీర్పు చెప్పారు. -
కిక్కో..కిక్కు
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విధానం పుణ్యమా అని పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతోంది. ఎక్కడ పడితే మద్యం షాపులు పెట్టడం.. వీటికి అనుబంధంగా బెల్టు షాపులు తిరిగి ప్రారంభం కావడంతో మందు బాబులకు అందుబాటులోనే మద్యం లభిస్తోంది. దీంతో వారు తెగ తాగేస్తున్నారు. వెరసి మద్యం వ్యాపారం ‘మూడు పెగ్గులు.. ఆరు గ్లాసులు’ అన్న చందంగా సాగుతోంది. ప్రభుత్వం నూతన లిక్కర్ పాలసీ ప్రారంభించి 2 నెలలు కూడా పూర్తిగా గడవకముందే.. చాగల్లు, రాజమహేంద్రవరలోని ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) డిపోల పరిధిలో ఏకంగా రూ.245 కోట్ల విలువైన మద్యం, బీర్లను మద్యం షాపులకు, బార్లకు సరఫరా చేశారు. దీనినిబట్టి మద్యం వ్యాపారం ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు మేలు చేసేలా గత ప్రభుత్వ విధానం మద్యపాన ప్రియులను ఆ వ్యసనం నుంచి తప్పించి, వారి ఆరోగ్యాన్ని, కుటుంబ ఆర్థిక స్థితిగతులను మెరుగు చేసే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మద్యం పాలసీ రూపొందించి, అమలు చేసింది. ఇందులో భాగంగా ప్రైవేటు మద్యం దుకాణాలకు మంగళం పాడింది. వాటికి అనుబంధంగా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్టు షాపులను పూర్తిగా అరికట్టింది. షాపుల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. వాటిని ప్రభుత్వమే నిర్వహించేది. అది కూడా నిర్ణీత సమయంలో మాత్రమే మద్యం విక్రయించే వారు. మద్యం ధరలు పెంచడం ద్వారా మద్యపాన ప్రియులు ఈ వ్యసనానికి దూరమయ్యేలా చేసేందుకు ప్రయత్నించింది. తద్వారా సమాజానికి మేలు జరగాలని ఆకాంక్షించింది. కూటమి హయాం.. ప్రైవేటు పరం.. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి పాలకులు నూతన మద్యం పాలసీ రూపొందించి, గత ప్రభుత్వ లక్ష్యాన్ని నీరుగార్చారు. మద్యం వ్యాపారాన్ని తిరిగి ప్రైవేటుకు కట్టబెట్టారు. షాపుల సంఖ్యను విపరీతంగా పెంచేశారు. వాటిని దక్కించుకున్న కూటమి నేతలు మద్యం సిండికేట్ వ్యాపారానికి తెర తీశారు. గత నెల 16 నుంచి ప్రైవేటు షాపుల ద్వారా పూర్తి స్థాయిలో మద్యం విక్రయాలు ప్రారంభించారు. ఈ షాపులకు, బార్ అండ్ రెస్టారెంట్లకు రాజమహేంద్రవరం రూరల్, చాగల్లులో ఉన్న 2 ఐఎంఎల్ డిపోల నుంచి అవసరమైన సరకు సరఫరా చేస్తున్నారు. అడ్డూ అదుపూ లేని విక్రయాలు జిల్లా వ్యాప్తంగా 125 మద్యం షాపులకు అబ్కారీ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో సింహభాగం దక్కించుకున్న కూటమి నేతల నేతృత్వంలోని సిండికేట్ ధనార్జనే ధ్యేయంగా ఒక్కో దుకాణానికి అనుబంధంగా కనీసం 30కి పైగా బెల్టు షాపులు ఏర్పాటు చేసింది. ఎవరు ఎక్కడ పెట్టుకోవాలి, ఒక్కో బెల్టు షాపునకు ఎంత డిపాజిట్ చెల్లించాలి, అబ్కారీ శాఖకు ప్రతి నెలా ఎంత ముట్టజెప్పాలనే విషయాలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరీ వ్యాపారులకు, బెల్టు దుకాణాల నిర్వాహకులకు దిశానిర్దేశం చేసింది. పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా ఇప్పటికే బెల్టు షాపులు ప్రారంభించేశారు. వైన్ షాపుల నుంచి గరిష్ట అమ్మకం ధర(ఎంఆర్పీ)కు కొనుగోలు చేస్తున్న బెల్టు వ్యాపారులు క్వార్టర్ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.30 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. అడ్డుకోని అబ్కారీ! విచ్చలవిడిగా బెల్టు షాపులు ఏర్పాటు చేయడమే కా కుండా.. వాటి ద్వారా అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నా అబ్కారీ శాఖ అడ్డుకుంటున్న దాఖలా లు లేవు. కొందరు మద్యం షాపుల నిర్వాహకులు అనధికారికంగా పర్మిట్ రూములు ఏర్పాటు చేసి, విక్రయా లు సాగిస్తున్నా పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో పర్యటించి, దాడులు చేస్తున్న దాఖలాలు కానరావడం లేదు. మద్యం సిండికేట్ల ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తు న్నాయి. విచ్చలవిడి మద్యం విక్రయాలకు, బెల్టు షాపులకు అబ్కారీ అధికారులు వెంటనే కళ్లెం వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. విక్రయాల్లో నయా దందా! డోర్ డెలివరీ ద్వారా మద్యపాన ప్రియులకు వారి చెంతనే మద్యం అందించే నయా దందాకు సిండికేట్ తెర తీసింది. ఫలానా రకం మద్యం కావాలని ఎవరైనా ఫోన్ చేస్తే చాలు.. వైన్ షాపుల యజమానులు వెంటనే బెల్టు షాపుల ద్వారా నిమిషాల వ్యవధిలోనే కోరుకున్న బ్రాండ్ మద్యం అందిస్తున్నారు. పండగలు, పుట్టిన రోజు, పెళ్లి రోజు తదితర ఫంక్షన్లకు ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు వస్తున్నాయి. దీనికి గాను ఎంఆర్పీ కంటే ఒక్కో బాటిల్‌పై రూ.30 నుంచి రూ.50 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ దందాను ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శ వస్తోంది.చాగల్లులోని ఐఎంఎల్ డిపో రెండు ఐఎంఎల్ డిపోల పరిధిలో భారీగా అమ్మకాలు 2 నెలల్లోనే రూ.245 కోట్ల విక్రయాలు మద్యం షాపులు, బార్లలో మద్యం ఏరులు తోడవుతున్న బెల్ట్ షాపులు -
స్క్రీనింగ్‌కు శ్రీకారం
●● ఇంటి వద్దనే క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు ● 14న ప్రారంభించిన వైద్య, ఆరోగ్య సిబ్బంది ● 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు ● తద్వారా వ్యాధి లక్షణాల గుర్తింపు ● నెలాఖరు వరకూ సర్వేరాజమహేంద్రవరం రూరల్: జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా ‘క్యాన్సర్‌పై విజయం.. స్క్రీనింగ్‌తో సాధ్యం’ అనే కార్యక్రమానికి వైద్య, ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. దీని కోసం ఆ శాఖ సిబ్బంది ఈ నెల 14 నుంచి ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ) సర్వేతో పాటు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక యాప్ రూపొందించింది. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అధికారులు.. సర్వే జరుగుతున్న తీరును నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వే ప్రకారం చాలా మంది క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తిస్తున్నారు. ఇది క్యాన్సర్ రోగుల మరణాలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ముందస్తుగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రాథమిక దశలోనే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించడం ద్వారా బాధితుల మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ఈ సర్వే చేపట్టారు. ఆయుష్మాన్ భారత్ సమగ్ర ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా 8 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగించనున్నారు. స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారిలా.. ఒక వ్యక్తిలో క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు చేసే పరీక్షలనే క్యాన్సర్ స్క్రీనింగ్ అని పిలుస్తున్నారు. క్యాన్సర్ ముందస్తు నిర్ధారణకు, నివారణకు ఈ పరీక్షలు ఉపయోగపడతాయి. క్యాన్సర్ లక్షణాలు ప్రాథమిక స్థాయిలో గుర్తించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది. ఈ యాప్‌లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరి బీపీ, సుగర్, రక్తహీనత, ఆహారపు అలవాట్లు తదితర అంశాలను నిక్షిప్తం చేస్తారు. జిల్లాలో 6,48,295 కుటుంబాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన వారు 15,10,336 మంది ఉన్నారు. వీరందరికీ 512 బృందాల ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ బృందాల్లో ఏఎన్ఎం, ఎంఎల్‌హెచ్‌పీ, ఆశా కార్యకర్తలు ఉంటారు. ప్రతి బృందం రోజుకు ఐదు ఇళ్లను సందర్శించి, అవసరమైన వివరాలు యాప్‌లో నమోదు చేస్తుంది. తద్వారా అవసరమైన వారికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. 2 శాతం పూర్తి జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ రెండు శాతం పూర్తయింది. దీని ద్వారా క్యాన్సర్ లక్షణాలను ముందస్తుగా గుర్తించవచ్చు. ముఖ్యంగా మహిళలు గర్భాశయ, రొమ్ము క్యాన్సర్లతో బాధ పడుతున్నారు. వారు ఈ పరీక్షల ద్వారా సత్ఫలితాలు పొందవచ్చు. – డాక్టర్ జి.హరిశ్చంద్ర, ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ శాటిలైట్ సిటీలో క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది -
శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024
పూటుగా తాగించేశారు ● రాజమహేంద్రవరం రూరల్ ఐఎంఎల్ డిపో పరిధిలో జిల్లాలోని రాజానగరం, రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌తో పాటు అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని 134 మద్యం షాపులు, 27 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటన్నింటికీ ఈ డిపో ద్వారానే మద్యం, బీర్లు సరఫరా చేస్తున్నారు. నూతన పాలసీ ప్రారంభమైన అక్టోబర్ నెలలో వివిధ రకాల మద్యం 1.17 లక్షల కేసులు, బీరు 44,300 కేసులు సరఫరా చేశారు. వీటి విలువ రూ.103 కోట్లు. ఈ నెలలో 16వ తేదీ నాటికి రూ.50.62 కోట్ల విలువైన 63,600 మద్యం కేసులు, 24,000 బీరు కేసులు సరఫరా చేశారు. ఈ నెల ముగిసేనాటికి మరో రూ.10 కోట్లు పైగా విక్రయాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ● చాగల్లు ఐఎంఎల్ డిపో పరిధిలో జిల్లాలోని కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలుతో పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఏలూరు జిల్లాల్లోని 111 షాపులు, 10 బార్లకు మద్యం సరఫరా అవుతోంది. ఇక్కడి నుంచి గత నెలలో 43,743 మద్యం కేసులు, 13,354 బీరు కేసులు సరఫరా చేశారు. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.49.13 కోట్ల ఆదాయం లభించింది. ఈ నెల 16వ తేదీ వరకూ 60,577 మద్యం కేసులు, 18,661 బీరు కేసుల విక్రయాల ద్వారా రూ.43.82 కోట్ల రాబడి వచ్చింది. ఈ సమాచారాన్ని బట్టి మద్యం పాలసీ ప్రారంభమైన తొలి నెలలోనే మందుబాబులతో తెగ తాగించేశారని అర్థం చేసుకోవచ్చు. -
మత్స్యకారుల జీవనోపాధి పెంచడమే లక్ష్యం
ధవళేశ్వరం: మత్స్యకారుల జీవనోపాధి పెంచడమే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద ప్రపంచ మత్స్య దినోత్సవం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి కలెక్టర్ 35 లక్షల చేప పిల్లలను గోదావరిలోకి వదిలారు. అనంతరం మాట్లాడుతూ, మత్స్యకారుల్లో సాంకేతికతతో కూడిన వృత్తి నైపుణ్యాన్ని పెంచి, మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. మత్స్య సంపదను పెంపొందించడంతో పాటు ఆక్వా పరిశ్రమలు, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆక్వా ఉత్పత్తుల పట్ల కొంత మంది విద్యార్థులకు మెళకువలు నేర్పాలన్నారు. విదేశాల్లో డ్రై ఫిష్‌కు చాలా డిమాండ్ ఉందని, అందుకు అనుగుణంగా మత్స్య ఉత్పత్తుల మార్కెట్ సామర్థ్యాన్ని పెంపొందించుకునే సోలార్ డ్రై దిశగా అవకాశాలను మెరుగుపరచుకోవాలన్నారు. అనంతరం మత్స్యకారులను కలెక్టర్ ఘనంగా సన్మానించారు. చేప పిల్లల ఉత్పత్తి, పెంపకంలో శిక్షణ పొందిన 75 మంది విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వి.కృష్ణారావు, తహసీల్దార్ పీవీ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డీఎఫ్‌సీఎస్ ఎం.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. 26న బాల్రంగ్ పోటీలు రాజమహేంద్రవరం రూరల్: పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యాన పాఠశాల విద్యార్థులకు బాల్రంగ్ పోటీలు నిర్వహించనున్నారు. బొమ్మూరు డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఏఎం జయశ్రీ గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఇందిరాగాంధీ మానవ్ సంగ్రహాలయ, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖలు సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహించనున్నాయన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి జిల్లాకు ఒక టీమ్‌ను ఎంపిక చేస్తారన్నారు. జిల్లా స్థాయి పోటీలు ఈ నెల 26న బొమ్మూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ ప్రాంగణంలో జరగనున్నాయని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే విద్యార్థులు స్థానిక సంప్రదాయ జానపద నృత్యం, కళలు, తప్పెటగుళ్లు, కర్రసాము, చెంచుల వేట, థింసా, జాలరి, బంజారా తదితర కళలను ప్రదర్శించవచ్చని వివరించారు. ప్రదర్శన సమయం 10 నిమిషాలకు మించరాదన్నారు. గత ఏడాది బాల్రంగ్ పోటీల్లో పాల్గొన్న వారు ఈ ఏడాది పోటీల్లో పాల్గొనేందుకు అనర్హులని పేర్కొన్నారు. ప్రత్యక్ష సంగీత వాయిద్యం మాత్రమే అనుమతిస్తారని, క్యాసెట్లు, సీడీలు అనుమతించబోరని జయశ్రీ స్పష్టం చేశారు. టీమ్‌లో గరిష్టంగా 16 మంది విద్యార్థులు మాత్రమే పాల్గొనవచ్చన్నారు. వివరాలకు డైట్ అధ్యాపకుడు ఎం.రాజేష్‌ను 94906 48110 మొబైల్ నంబర్లో సంప్రదించాలని జయశ్రీ తెలిపారు. నకిలీ విత్తనాలపై రైతుల రగడ అన్నదేవరపేటలో కంపెనీ ప్రతినిధులను నిర్బంధించిన వైనం తాళ్లపూడి (కొవ్వూరు): నకిలీ వరి విత్తనాలతో మోసపోయిన అన్నదేవరపేట రైతులు కంపెనీ ప్రతినిధులను నిర్బంధించారు. నాసిరకం విత్తనాలు ఇచ్చి మోసం చేశారంటూ గురువారం క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసేంత వరకూ కదలనివ్వబోమని అన్నారు. అసలేం జరిగిందంటే.. కొద్ది రోజుల కిందటి నుంచి నకిలీ విత్తనాలపై తాళ్లపూడి వ్యాపారిని రైతులు నిలదీస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారి సూచనల మేరకు కంపెనీ ప్రతినిధులు గురువారం అన్నదేవరపేటకు వచ్చారు. క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ, విత్తనాలు కొనుగోలు చేసిన బిల్లులు తీసుకు రావాలని సూచించారు. పలువురు కంపెనీ ప్రతినిధులకు బిల్లులు అందజేశారు. బిల్లుతో పాటు విత్తనాల సంచులను తీసుకు రావాలని మళ్లీ తెలపడంతో కంపెనీ ప్రతినిధులు, రైతులకు వాగ్వాదం జరిగింది. సుమారు రెండు నెలల కిందట ఇచ్చిన విత్తనాల సంచులు తమ వద్ద ఎలా ఉంటాయంటూ రైతులు మండిపడ్డారు. అనంతరం కంపెనీ ప్రతినిధుల వాహనానికి అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. తమకు నష్ట పరిహారం చెల్లించేంత వరకూ వెళ్లనివ్వబోమని భీష్మించారు. ఇలా సుమారు మూడు గంటలకు పైగా రోడ్డుపైనే రైతులు నిర్బంధించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. భూములు గోపాలపురం మండలంలో ఉండడంతో అక్కడి స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని రైతులకు తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ సూచించారు. ఈ మేరకు కంపెనీ ప్రతినిధులను తీసుకుని అన్నదేవరపేట రైతులు గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, ఫిర్యాదు చేశారు. విఘ్నేశ్వరుని హుండీ ఆదాయం లెక్కింపు అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని దేవదాయ శాఖ అధికారులు ఎం.రాధాకృష్ణ, ఉప్పలపాటి జానికమ్మ పర్యవేక్షణలో గురువారం లెక్కించారు. 60 రోజులకు గాను రూ.29,57,711 లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. అలాగే ఏడు గ్రాముల బంగారం, 743 గ్రాముల వెండి, 17 విదేశీ నోట్లు ఉన్నాయన్నారు. -
హైవేలపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఎస్పీ డి.నరసింహ కిశోర్ తెలిపారు. హైవే పోలీస్ స్టేషన్ల పరిధిలోని మోరంపూడి, పిడింగొయ్యి, జేఎన్ రోడ్డు, ఏవీ అప్పారావు రోడ్డు, లాలాచెరువు పాయింట్లను ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగాల ఇన్స్పెక్టర్లతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. ప్రమాదాలు, నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమైన హైవే జంక్షన్లలో సీసీ కెమెరాలు, స్పీడ్ కంట్రోల్ ట్రాఫిక్ బోర్డులు, లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారి భద్రతపై జిల్లావ్యాప్తంగా ప్రజలకు, విద్యార్థినీ విద్యార్థులకు ప్రతి రోజూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు అనుసూరి శ్రీనివాసరావు (స్పెషల్ బ్రాంచి), కాశీ విశ్వనాథ్ (బొమ్మూరు), జి.ఉమామహేశ్వరరావు (సోషల్ మీడియా అండ్ సైబర్ క్రైమ్), ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు నబీ, చింతా సూరిబాబు, ఎస్సై అయ్యప్పరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రాధాన్యం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్లాలని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేలా, రైతులు సొంతంగా చదువుకుని అవగాహన పొందేలా రూపొందించిన పుస్తకాలను తన చాంబర్లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి సంక్షిప్త మార్గదర్శిని, రైతుల విజయగాథలు, పురుగు, తెగుళ్ల యాజమాన్య దీపిక, పెరటి తోటల పెంపకం, ఫార్మర్ ఫీల్డ్ స్కూల్, ప్రకృతి వ్యవసాయంలో మహిళా సంఘాల పాత్ర తదితర పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.మాధవరావు, ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి తాతారావు తదితరులు పాల్గొన్నారు. నేడు సత్య స్వాముల పడిపూజఅన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం వద్ద శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు సత్య స్వాముల పడిపూజ నిర్వహించనున్నారు. సత్య దీక్షలు ఆచరించిన వేలాది మంది స్వాములు సత్యదేవుని జన్మనక్షత్రం మఖ సందర్భంగా శనివారం స్వామివారి సన్నిధిలో దీక్ష విరమించనున్నారు. ఈ దీక్షల విరమణకు ముందు రోజు సత్య స్వాములతో రత్నగిరిపై ఏటా పడిపూజ చేయడం ఆనవాయితీ. పూజలో పాల్గొనే భక్తులకు ఫలహారం ఏర్పాటు చేశారు. ఈ పూజలకు వెయ్యి మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు తెలిపారు. ఈఓ కె.రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు పడిపూజ ఏర్పాట్లను దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు, ఈఈ రామకృష్ణ, ఏఈఓ కొండలరావు, డీఈ రాంబాబు తదితరులు గురువారం పరిశీలించారు. ఆ కాలేజీకి అనుమతుల్లేవు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సీతానగరం మండలం చినకొండేపూడిలోని సహస్ర కుందన కళాశాలకు ఎటువంటి అనుమతులూ లేవని ప్రాంతీయ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారి ఎన్‌ఎస్‌ఎల్‌వీ నరసింహం గురువారం తెలిపారు. ఆ కళాశాలలో విద్యార్థులెవ్వరూ చేరవద్దని, దానిలో చదివిన వారిని ఇంటర్ బోర్డు పరీక్షలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. -
సరికొత్త రికార్డు దిశగా..
● కార్తికంలో ఇప్పటి వరకూ 93 వేల వ్రతాలు ● మరో 60 వేలు జరిగే అవకాశం ● 2022 కార్తికంలో అత్యధికంగా వ్రతాలుఅన్నవరం: ఇంట్లో వివాహమైనా.. గృహప్రవేశమైనా.. ఇతర ఏ శుభకార్యమైనా.. సత్యనారాయణస్వామి వారి వ్రతం ఆచరించడం తెలుగు రాష్ట్రాల్లోని హిందూ భక్తులకు ఆనవాయితీ. ఒక్కోసారి ఏ శుభకార్యమూ లేకపోయినా పర్వదినాలు.. పుట్టిన రోజు.. పెళ్లి రోజు వంటి సందర్భాల్లో కూడా సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు. తాము కోరుకున్న కోర్కెలను ఆ స్వామి తీరుస్తాడని, తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే సత్యదేవుని వ్రతమాచరించని హిందువుల ఇల్లు ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ఇలా ఇంటి వద్ద వ్రతం చేసుకున్నా.. ఏడాదిలో కనీసం ఒకసారైనా రత్నగిరికి వచ్చి.. భక్తవరదుడైన సత్యదేవుని వ్రతమాచరించే భక్తులు చాలా అధికంగా ఉంటారు. అందునా కార్తికం వంటి పవిత్ర మాసాల్లో మరింత మంది అన్నవరం సత్యదేవుని దర్శించి వ్రతం చేసుకుంటూంటారు. నాలుగో వంతు వ్రతాలు కార్తికంలోనే.. హరిహరాదులకు ప్రీతికరమైన కార్తిక మాసమంతా పర్వదినాలే. దీంతో ఈ మాసంలో సత్యదేవుని వ్రతాలాచరిస్తే మరింత పుణ్యం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ నమ్మకంతోనే వ్రతాలాచరించేందుకు రత్నగిరికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సంవత్సరం మొత్తం సుమారు ఏడు లక్షలు వ్రతాలు జరుగుతుండగా.. వీటిలో దాదాపు నాలుగో వంతు వ్రతాలు ఈ ఒక్క నెలలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత కార్తిక మాసంలో రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో రికార్డు స్థాయిలో వ్రతాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఈ పవిత్ర మాసం ప్రారంభమై గురువారం నాటికి 21 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ 93 వేల వ్రతాలు జరిగాయి. ఈ మాసం ముగియడానికి మరో తొమ్మిది రోజుల సమయం ఉంది. ఆలోగా మరో 60 వేల వ్రతాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దేవస్థానం చరిత్రలో 2022 సంవత్సరం కార్తిక మాసంలో అత్యధికంగా 1,42,378 సత్యదేవుని వ్రతాలు జరిగాయి. ఆ రికార్డును ప్రస్తుత కార్తిక మాసంలో జరుగుతున్న వ్రతాలు అధిగమిస్తాయని భావిస్తున్నారు. సత్యదేవుని సన్నిధిలో సుమారు 300 మంది వ్రత పురోహితులు, 12 మంది వ్రత పురోహిత సూపర్వైజర్ల పర్యవేక్షణలో ఈ వ్రతాలు చేయిస్తున్నారు. ఆ వ్రతాలే అత్యధికం రత్నగిరిపై రూ.300, రూ.1,000, రూ.1,500, రూ.2,000 టికెట్లతో సత్యదేవుని వ్రతాలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో ప్రతి రోజూ జరుగుతున్న వ్రతాల్లో దాదాపు 70 శాతం రూ.300 టికెట్టు పైనే జరుగుతున్నాయి. సామాన్య భక్తులు ఎక్కువగా రూ.300 టికెట్టు వ్రతాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుత కార్తిక మాసంలో ఇప్పటి వరకూ 93 వేల వ్రతాలు జరగగా వాటిలో దాదాపు 65 వేలు రూ.300 వ్రతాలే కావడం గమనార్హం. దేవస్థానంలో 18 వ్రత మండపాలు ఉండగా, వాటిలో ఎనిమిదింటిని రూ.300 వ్రతాల నిర్వహణకే కేటాయించారు. మిగిలిన మూడు టికెట్లపై వ్రతాలు 10 మండపాల్లో జరుగుతున్నాయి. వ్రతాల ద్వారా అధిక ఆదాయం ఏటా సత్యదేవునికి వస్తున్న ఆదాయంలో దాదాపు 25 శాతం వ్రతాల ద్వారానే సమకూరుతోంది. గత ఏడాది వ్రతాల ద్వారా రూ.38 కోట్లు పైగా ఆదాయం రాగా, ఇందులో ఒక్క కార్తికంలోనే సుమారు రూ.7 కోట్లు వచ్చింది. ఈ ఏడాది కార్తిక మాసంలో రూ.8 కోట్లు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన 93 వేల వ్రతాల ద్వారా రూ.6 కోట్లు పైగా వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. సత్యదేవుని వ్రతాలాచరిస్తున్న భక్తులువ్రతాలకు విస్తృత ఏర్పాట్లు కార్తిక మాసంలో రత్నగిరికి వస్తున్న భక్తుల్లో అత్యధిక శాతం మంది సత్యదేవుని వ్రతాలు ఆచరిస్తున్నారు. వీరికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా విస్తృత ఏర్పాట్లు చేశాం. పర్వదినాల్లో వేకువజామున ఒంటి గంట నుంచే వ్రతాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. అదనపు వ్రత మండపాలతో పాటు తోపులాట, తొక్కిసలాట జరగకుండా కంపార్టుమెంట్లు ఏర్పాటు చేశాం. కార్తిక పౌర్ణమి పర్వదినం నాడు 10 వేల వ్రతాలు జరిగినా భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. – కె.రామచంద్ర మోహన్, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం -
మెడికల్ షాప్, క్లినిక్ సీజ్
కొత్తపల్లి: ఉప్పాడలోని సింధూ మెడికల్స్ జనరల్ స్టోర్స్, క్లినిక్‌ను గురువారం వైద్య బృందం తనిఖీ చేసి సీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని సుబ్బంపేటకు చెందిన ఓ బాలికకు జ్వరంతోపాటు వాంతులు కావడంతో ఉప్పాడలోని ఆర్ఎంపీ వైద్యుడు మామిడి సూరిబాబు వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ బాలికకు ఇంజక్షన్, సిలెన్లు, ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ ఎక్కకపోవడంతో మాత్రలు ఇచ్చి ఇంటికి తీసుకు వెళ్లమన్నారు. తర్వాత కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా బాలిక మార్గ మధ్యంలోనే బుధవారం మృతి చెందింది. ఆర్ఎంపీ వైద్యం వికటించడంతో తమ కుమారై మృతి చెందిందని మైలపల్లి మల్లేశ్వరి ఆరోపించింది. గురువరాం జిల్లా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సుబ్బరాజు, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ మురళీ, జిల్లా గణాంకాధికారి విజయలక్ష్మిలు మెడికల్ షాపును తనిఖీ చేశారు. బాలిక కుటుంబ సభ్యులు, ఆర్ఎంపీ వైద్యుడి వాంగ్మూలం రికార్డు చేశారు. ఆర్ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్, మెడికల్ షాపును సీజ్ చేశారు. కార్యక్రమంలో కొత్తపల్లి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుష్మ, గ్రామ రెవెస్యూ అఽధికారి సురేష్ ఉన్నారు. -
ఇక భారీ వాహనాలకు బ్రేక్
కొవ్వూరు: రోడ్డు కం రైలు వంతెనపై భారీ వాహనాలకు బ్రేక్‌లు వేశారు. వీటి రాకపోకలను నియంత్రించేందుకు శాశ్వతంగా భారీ గడ్డర్లు ఏర్పాటు చేశారు. గతంలో కొవ్వూరు– రాజమహేంద్రవరం ప్రవేశ ద్వారం వద్ద ఆర్అండ్బీ అధికారులు గడ్డర్లు ఏర్పాటు చేయించారు. ఇవి భారీ వాహనాల రాకపోకలతో పలుమార్లు దెబ్బతిన్నాయి. వాటిని తిరిగి ఏర్పాటు చేయించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఇప్పుటికే పలుమార్లు గడ్డర్లు దెబ్బతిన్న నేపథ్యంలో వంతెన ప్రవేశ ద్వారంలో శాశ్వతంగా భారీ వాహనాలు రాకుండా రైల్వే శాఖ అధికారులు గురువారం రెండు వైపులా శాశ్వత గడ్డర్లను ఏర్పాటు చేయిస్తున్నారు. క్రేన్ల సాయంతో వీటిని పెట్టారు. ఇటీవల కాలంలో వంతెన పైనుంచి భారీ వాహనాలు వెళ్తుండడంతో భద్రత దృష్ట్యా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.రోడ్డు కం రైలు వంతెనపై గడ్డర్ల ఏర్పాటు -
మెడికల్ షాప్, క్లినిక్ సీజ్
కొత్తపల్లి: ఉప్పాడలోని సింధూ మెడికల్స్ జనరల్ స్టోర్స్, క్లినిక్‌ను గురువారం వైద్య బృందం తనిఖీ చేసి సీజ్ చేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని సుబ్బంపేటకు చెందిన ఓ బాలికకు జ్వరంతోపాటు వాంతులు కావడంతో ఉప్పాడలోని ఆర్ఎంపీ వైద్యుడు మామిడి సూరిబాబు వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ బాలికకు ఇంజక్షన్, సిలెన్లు, ఆక్సిజన్ పెట్టారు. ఆక్సిజన్ ఎక్కకపోవడంతో మాత్రలు ఇచ్చి ఇంటికి తీసుకు వెళ్లమన్నారు. తర్వాత కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్తుండగా బాలిక మార్గ మధ్యంలోనే బుధవారం మృతి చెందింది. ఆర్ఎంపీ వైద్యం వికటించడంతో తమ కుమారై మృతి చెందిందని మైలపల్లి మల్లేశ్వరి ఆరోపించింది. గురువరాం జిల్లా ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సుబ్బరాజు, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ మురళీ, జిల్లా గణాంకాధికారి విజయలక్ష్మిలు మెడికల్ షాపును తనిఖీ చేశారు. బాలిక కుటుంబ సభ్యులు, ఆర్ఎంపీ వైద్యుడి వాంగ్మూలం రికార్డు చేశారు. ఆర్ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్, మెడికల్ షాపును సీజ్ చేశారు. కార్యక్రమంలో కొత్తపల్లి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సుష్మ, గ్రామ రెవెస్యూ అఽధికారి సురేష్ ఉన్నారు.