East godavari
-
తీవ్ర విషాదం.. కరెంట్ షాక్‌తో నలుగురు యువకులు మృతి
సాక్షి,తూర్పుగోదావరి: ఉండ్రాజవరం మండలం తాటిపర్రులో విషాదం చోటుచేసుకుంది. పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ప్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాకుతో నలుగురు యువకులు మృతి మృతిచెందారు. మరో యువకుడు కోమటి అనుమంతురావు అనే వ్యక్తికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. మృతులు గొల్ల వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. కాగా, తాటి పర్రు విషాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ
తూర్పుగోదావరి, సాక్షి: నిడదవోలు టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. కంసాలిపాలెంలో మంత్రి కందుల దుర్గేష్‌కు నిరసన సెగ తగిలింది. తమను పట్టించుకోవటం లేదని మంత్రిని టీడీపీ నేతులు నిలదీశారు. మంత్రి దుర్గేష్ ఎదుటే టీడీపీ, జనసేన నేతలు ఘర్షణకు దిగారు. -
తూ.గో.: టీ పొడి అనుకుని పురుగుల మందు కలపడంతో..
తూర్పు గోదావరి, సాక్షి: రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. టీ పొడి అనుకుని ఓ వృద్ధురాలు పాలలో పురుగుల మందు కలపడంతో.. భర్తతో సహా ప్రాణం విడిచింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అప్పాయమ్మ(70)కు కళ్లు సరిగ్గా కనిపించవు. దీంతో టీ పొడి అనుకుని పురుగుల మందును పాలలో కలిపింది. ఆ టీ తాగి భర్త వెలుచూరి గోవింద్(75), ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.వెంటనే రాజమండ్రి ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆ దంపతులు కన్నుమూశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. -
AP: దేవరపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏడుగురు మృతి
సాక్షి,తూర్పుగోదావరిజిల్లా: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో మంగళవారం(సెప్టెంబర్10) అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా ఒకరు గాయపడ్డారు. బొర్రంపాలెం నుంచి జీడిగింజల లోడుతో తాడిమల్ల వెళుతున్న డీసీఎం వాహనం దేవరపల్లి మండలం చిలకావారి పాకల వద్ద అదుపు తప్పిబోల్తా పడింది. జీడి గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటికి తీశారు. మృతులను నిడదవోలు మండలం తాడిమళ్ల వాసులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో డీసీఎంలో 10 మంది ఉన్నారు. డీసీఎం కేబిన్‌లో ఉన్నవారికి మాత్రం ఏమీ కాలేదు.ఇదీ చదవండి.. మాకు అడ్డొస్తే చంపేస్తాం -
మట్టిలో మాణిక్యం..! ఈ బుడ్డాడు మామూలోడు కాదు
-
రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి
కొవ్వూరు: దేచెర్ల గ్రామ సమీపంలోని చెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరపల్లి మండలం గౌరీపట్నం జెడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు బడుగు రాజారత్న (47) మృతి చెందారు. ఏడాదిన్నర కుమార్తెకు అనారోగ్యంగా ఉండడంతో సెలవులో ఉన్న ఆమె శనివారమే విధులకు హాజరయ్యారు. అయితే కుమార్తె ఏడుస్తోందని సమాచారం రావడంతో స్వస్థలమైన రాజమహేంద్రవరం బయలుదేరారు. గౌరీపట్నంలో ఎక్స్‌ప్రెస్‌లు ఆపకపోడంతో ఐ.పంగిడి వెళ్లి రాజమహేంద్రవరానికి బస్సు ఎక్కాలని భావించారు. అదే పాఠశాలలో ఉపాధ్యాయుడు కేదాటి ఫణిశేఖర్‌ను సాయం కోరడంతో ఆయన రాజారత్నను తీసుకుని మోటారుసైకిల్‌పై ఐ.పంగిడి బయలుదేరారు. దేచెర్ల చెరువు సమీపంలో బురద మట్టి కారణంగా వాహనం అదుపు తప్పింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. ఆ సమయంలో వెనుక వస్తున్న లారీ.. రాజారత్న తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. రాజారత్న భర్త రాజేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై కర్రి శ్రీహరిరావు తెలిపారు. -
‘చంద్రబాబు కన్నా డ్రామా చేసేవారే నయం’
సాక్షి, రాజమండ్రి: వరద బాధితులను ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘వరద బాధితులకు ప్రభుత్వం నిత్యవసరాలు పంపిణీ చేయటం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం లేదు. వరద ప్రాంతాల్లో కేవలం ఫొటోలు దిగి ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు. వరద సహాయక చర్యలు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో పరిహారం, రేషన్, అందించడంలో ముందుంది. ఇంతవరకు ఏరియల్ సర్వే కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో జరగలేదు. బ్రిడ్జిలంక దగ్గర ఉన్న వరద బాధితులను రాజమండ్రి తీసుకొచ్చి షో చేశారు. ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి. నీటి మునిగిన జాతీయ రహదారులను వెంటనే పునరుద్ధరించి, రాకపోకలకు అంతరాయం లేకుండా చేయాలి. లైఫ్ జాకెట్ లేకుండా వరద నీటిలో పడి చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. .. వాలంటీర్లకు పదివేల రూపాయలు స్టైఫండ్ ఇస్తానని చెప్పి వ్యవస్థనే నిర్మూలించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నిరుద్యోగ భృతి ఊసేత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీలు ఎత్తెస్తాడేమో అనిపిస్తుంది. తల్లికి వందనం పథకానికి మంగళంపాడే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కన్నా డ్రామాలాడే వాడే నయం. ప్రజలను దారుణంగా వంచిస్తున్నారు. సంపద సృష్టిస్తామన్నారు.. ఇప్పటివరకు ఏమి సృష్టించలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా తల్లికి వందనం కోసం ఎదురుచూస్తున్నారు. రైతు భరోసా ఎక్కడుంది. సహాయం కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. .. ఇసుక కొండలు ఏమైపోయాయి. ఇసుక గుట్టలను స్థానిక ఎమ్మెల్యేలు మింగేశారు. నాలుగు రోజుల్లోనే బకాసురుల్ల మింగేశారు. స్థానిక ఎమ్మెల్యే నాలుగు రోజుల్లోనే రూ. 10 కోట్లఇసుక మింగేశారు. ఉచిత ఇసుక ఎవరికిచ్చారు? రాజమండ్రి వ్యాప్తంగా సెటిల్మెంట్ బ్యాచ్‌లే నడిపిస్తున్నాయి. పేకాట క్లబ్ నడుపుకుంటామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. వాళ్లే దగ్గరుండి నడిపిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం. పేకాట క్లబ్బుల్లో ఎమ్మెల్యే వాటా ఎంతో చెప్పాలి? జిల్లా పోలీసు అధికారులను పేకాట డబ్బులు నడుపుకుంటామని ఎమ్మెల్యేలే అడుగుతున్నారు. ఇదెక్కడి ప్రభుత్వం. గతంలో వేలకోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇసుక వల్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఉచిత ఇసుక పేరుతో ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రతి వ్యాపారి వద్దకు వెళ్లి కమిషన్ కట్టమని ఒత్తిడి తీసుకొస్తున్నారు’అని భరత్ అన్నారు. -
గోదారి సీనుంటే.. బొమ్మ బ్లాక్‌బస్టరే..
తాళ్లపూడి: వయ్యారి గోదారి పరవళ్లు.. ఒంపులు తిరిగిన గోదారి గట్లు.. ఆపైనుండే గుడి గోపురాలు.. నీటి మధ్య ఇసుక తిన్నెలు.. లంకలు.. సూర్యోదయాస్తమయ వేళల్లో గోదారమ్మ నుదుటిన అలదుకునే సిందూరం.. పావన నదిపై నీలి మేఘాలంకరణలు.. ఇలా ఒకటా రెండా.. ఎన్నని చెప్పేది గోదారోళ్ల సౌభాగ్యం. భౌతిక నేత్రంతో చూసే భాగ్యం ఇక్కడివారిదైతే.. ఇవే దృశ్యాలను వెండితెరపై చూసి అచ్చెరువొంది.. జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రాంతాలను సందర్శించాలని భావించేవారెందరెందరో.. కొంత కళాత్మక దృష్టి.. ఒకింత భావుకత.. మరికొంత రసరమ్యమైన మనసు.. వీటికి తోడు భావగర్భితమైన కెమెరా కన్ను.. చాలు.. ఓ సుందర దృశ్య కావ్యాన్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి. ఇలాంటి మనసున్న దర్శక, నిర్మాతలెందరో మన గోదావరిని అమ్మగా.. కొంటె కోణంగిగా.. వయ్యారిభామగా.. పడుచు పిల్లగా.. మరెన్నో విధాలుగా వెండి తెరపై ప్రపంచానికి చూపించి వారి జీవితాలను సార్థకం చేసుకున్నారు. ఎన్నో వైవిధ్యమైన కథలకు నేపథ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాలను ఎన్నుకుని ఎనలేని కీర్తిని గడించారు. తెలుగు సంస్కృతికి ప్రతీకలు గోదావరి జిల్లాలు. ఇక్కడి ప్రజల వాడుక భాషే ‘చిత్ర’ భాషగా వ్యవహరిస్తారు. ఇక్కడి ఆచార వ్యవహారాలే ప్రామాణికంగా భావిస్తారు. దర్శక దిగ్గజాల్లో ఒకరైన నాటి ఆదుర్తి సుబ్బారావు నుంచి నేటి శేఖర్ కమ్ముల వరకూ ఎందరో గోదావరి అందాలతో వారి చిత్రాలను సుసంపస్నం చేసుకున్నారు. కళాతపస్వి కె.విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు వంటి అగ్ర దర్శకులే కాక.. ఈ ప్రాంతానికే చెందిన వంశీ తీసిన చాలా సినిమాలు గోదావరి నది నేపథ్యంగా సాగినవే. వారిలో చాలా మందికి పాపికొండల నుంచి అంతర్వేది వరకూ ఎన్నో ప్రాంతాల్లో కనీసం ఒక్క సన్నివేశమైనా చిత్రీకరిస్తే చాలు.. ఆ చిత్రం హిట్టు కొట్టేస్తుందనేది గట్టి నమ్మకం కొవ్వూరు పరిసరాల్లో.. ముఖ్యంగా కొవ్వూరు మండలంలోని గోష్పాద క్షేత్రం, కుమారదేవం, ఆరికిరేవుల, తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం పరిసర ప్రాంతాల్లో గోదావరి తీరాన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్టే. వేగేశ్వరపురంలో గోదావరి ఒడ్డున ఉన్న ఆంజనేయుని ఆలయం రేవు, బల్లిపాడు ఇసుక ర్యాంపు లంకలు, మలకపల్లిలోని కుంటముక్కల వారి గృహంలో అనేక సినిమాల్లో చాలా సన్నివేశాలే చిత్రీకరించారు. 👉వేగేశ్వరపురంలో చిరంజీవి నటించిన రక్తసింధూరంలోని ఓ పాటను, రామ్‌చరణ్, సమంత నటించిన రంగస్థలంలోని పలు సన్నివేశాలను తాడిపూడి, వేగేశ్వరపురం గోదావరి లంకల్లో చిత్రీకరించారు. 👉 నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తాళ్లపూడిలోనే తీశారు. 👉 సాయికుమార్, ఆయన కుమారుడు ఆది కథా నాయకుడిగా నటించిన చుట్టాలబ్బాయ్ చిత్రంతో పాటు, మంచు మనోజ్, రెజీనా నటించిన శౌర్య చిత్రంలో పలు కీలక సన్నివేశాలను ఇక్కడే తెరకెక్కించారు. 👉 నాగార్జున, అనుష్క నటించిన ఢమరుకం చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను గోదావరి నది ఒడ్డున ఆంజనేయస్వామి గుడి వద్ద తీశారు. ప్రత్యేకంగా రుషుల కోసం ఒక సెట్ వేసి వారం రోజుల పాటు ఇక్కడ షూటింగ్ చేశారు. 👉 సుమంత్ నటించగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి, వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ నటించిన సరదాగా కాసేపు చిత్రంలో కారులో వెళ్లే పాటను ఇక్కడే చిత్రీకరించారు. 👉 జగపతిబాబు, ప్రియమణి నటించిన పెళ్లైన కొత్తలో చిత్రంలో వారి స్నానపు సన్నివేశాన్ని ఇక్కడే తెరకెక్కించారు. 👉 ప్రక్కిలంకలో కృష్ణ నటించిన పాడిపంటలుతో పాటు, చంద్రమోహన్ నటించిన సిరిసిరిమువ్వ ఈ ప్రాంతంలో చిత్రీకరించినవే. 👉 శ్రీకాంత్, చార్మి నటించిన చిత్రంలోని ఓ పాటను, శివాజీ హీరోగా నటించిన మిస్టర్ ఎర్రబాబులో మిత్రులతో కలిసి కథానాయికను ఆయన పరిచయం చేసుకునే సన్నివేశాన్ని, సునీల్‌పై హాస్య సన్నివేశాలను, ఆలీ నటించిన ఆషాఢం పెళ్లికొడుకులో ఒక పాటను ఇక్కడి ఇసుక తిన్నెల్లో ప్రత్యేకంగా సెట్ వేసి చిత్రీకరించారు. 👉 కేవలం సినిమాలే కాకుండా కొన్ని ధారావాహికలు సైతం ఇక్కడి గోదారి ప్రాంతాల్లో చిత్రీకరించారు. హిట్ చిత్రాల భవనం సుమారు 110 ఏళ్ల క్రితం మలకపల్లిలో ఆ గ్రామానికి చెందిన కుంటముక్కల వీరభద్రరావు, వెంకటాద్రి, జానకిరామయ్య లోగిలిని అత్యాధునికంగా నిర్మించారు. ఈ గృహంలో సినిమా తీస్తే హిట్ గ్యారెంటీ అని చిత్రరంగ ప్రముఖుల్లో గట్టి నమ్మకం. 👉 జంధ్యాల దర్శకత్వంలో 1985లో వచ్చిన సీతారామకల్యాణం చిత్రం ఎక్కువ భాగం ఈ ఇంట్లోనే తీశారు. 👉 ఆ చిత్రం విజయం సాధించడంతో సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో డి.సురే‹Ùబాబు నిర్మాతగా బి.గోపాల్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన బొబ్బిలిరాజా చిత్రంలోని కీలక సన్నివేశాలను కూడా ఈ ఇంట్లోనే తెరకెక్కించారు. 👉 అలాగే క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన సీతారామయ్య గారి మనవరాలు, బాలకృష్ణ నటించిన సీతారామ కల్యాణం, నరేష్ నటించిన ప్రేమచిత్రం.. పెళ్లి విచిత్రం, ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో శోభన్‌బాబు నటించిన ఏవండీ ఆవిడ వచ్చింది, ఇంకా.. సీతారత్నం గారి అబ్బాయి, తాళి తదితర చిత్రాలన్నీ విజయం సాధించాయి. 👉 ఇదే గ్రామంలో దివంగత కుంటముక్కల భాస్కరరావు గృహానికి 140 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రేమవిజేత అనే చిత్రం, రజనీకాంత్ నటించిన తమిళ సినిమా, జగదాంబ టూరింగ్ టాకీస్ తదితర సినిమాల్లో చాలా సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించారు. అప్పట్లో డి.రామానాయుడు ఇక్కడి గ్రంథాలయానికి రూ.30 వేల విరాళం అందజేశారు. దీంతో గ్రామస్తులు ఆ భవనానికి మరమ్మతులు చేసి, రామానాయుడు గ్రంథాలయంగా పేరు పెట్టారు. రామచరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తాజాగా నిర్మిస్తున్న గేమ్ చేంజర్ చిత్రంలోని కీలక సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు.150 ఏళ్ల నాటి సినిమా చెట్టుకుమారదేవం గ్రామంలో గోదావరి ఒడ్డున ఉన్న నిద్రగన్నేరు చెట్టుకు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇక్కడ సుమారు 200 పైగా సినిమాల షూటింగ్‌లు జరిగాయి. దీంతో, దీనికి ‘సినిమా చెట్టు’గా పేరొచ్చింది. ఇక్కడ సినిమా తీస్తే తప్పకుండా హిట్ అవుతుందన్న సెంటిమెంట్ చిత్రసీమలో స్థిరపడిపోయింది. ఈ నమ్మకంతోనే ఒక్క సీన్ అయినా ఈ చెట్టు కింద తీస్తారు. మొదటిగా కృష్ణ హీరోగా 1975లో పాడిపంటలు ఈ చెట్టు వద్ద చిత్రీకరించారు. ఏఎన్ఆర్, ఎన్టీఆర్, చిరంజీవి, శోభన్‌బాబు, బాలకృష్ణ, మోహన్‌బాబు, సుమన్, మహే‹Ùబాబు, రామ్‌చరణ్, రాజశేఖర్, నాని తదితర హీరోలతో పాటు, దర్శకులు వంశీ, రాఘవేంద్రరావు, క్రాంతికుమార్, సుకుమార్ ఈ చెట్టు కింద ఏదో ఒక సన్నివేశాన్ని చిత్రీకరించడం సెంటిమెంట్‌గా భావిస్తారు.షూటింగ్‌ల అడ్డా.. గోష్పాద క్షేత్రం కొవ్వూరు గోష్పాద క్షేత్రం పలు హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. జూనియర్ ఎనీ్టఆర్, భూమిక నటించిన హిట్ చిత్రం సింహాద్రిలో ఇంటర్వెల్ సీన్ ఇక్కడే తీశారు. అలాగే సుకుమార్ దర్శకత్వంలో 100 పర్సంట్ లవ్‌తో పాటు గుండెల్లో గోదారి, బెండు అప్పారావు ఆర్ఎంపీ తదితర అనేక చిత్రాలు ఇక్కడ తీశారు. ఇలా గోదావరి తీరంలో ఏటా చాలా చిత్రాల షూటింగులు జరుగుతూనే ఉంటాయి. -
కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు కన్నుమూత
సాక్షి, తూర్పుగోదావది: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత పెండ్యాల వెంకట కృష్ణ బాబు మృతిచెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. నేడు తెల్లవారుజామున కృష్ణబాబు చనిపోయినట్లు వైద్యులు, కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.కృష్ణబాబు మృతదేహాన్ని కుటుంబ సభ్యులు స్వగ్రామం దొమ్మేరుకు తరలించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. కాగా 1953లో పాలకొల్లులో జన్మించిన కృష్ణబాబు.. కొవ్వూరు నియోజకవర్గంలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 నుంచి 1994 వరకు(1983,1985, 1989, 1994) నాలుగుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1999లో ఓటమి చెందిన ఆయన తిరిగి 2004లో అయిదవసారి కొవ్వూరు ఎమ్మెల్యేగా గెలిచారు.ఇక 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో కొవ్వూరు ఎస్సీ రిజర్వ్ కావడంతో ప్రత్యక్ష రాజకీయాలకు కృష్ణబాబు దూరంగా ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదీర్ఘకాలం రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతగా కృష్ణబాబు పేరొందారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే కృష్ణబాబు ప్రస్తుతం స్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న పలువురు నేతలు సంతాపం తెలియజేస్తున్నారు. -
‘నన్ను కించపరుస్తూ గెలవాలనుకుంటున్నారా?’: మంత్రి తానేటి వనిత
తూర్పుగోదావరి, సాక్షి: నల్లజర్లలో టీడీపీ శ్రేణులు తనపై దాడికి యత్నించడంపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. దళితురాలినైన తనను కించపరుస్తూ.. రౌడీయిజంతో గెలవాలనుకోవడం ఎంత వరకు సబబని ప్రత్యర్థులను ఆమె నిలదీశారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం సాయంత్రం గోపాలపురం నియోజకవర్గంలో పర్యటించాం. ఎన్నికల ప్రచారం ముగించుకుని స్థానిక నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నాం. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. మా నేతలపై రాళ్లతో దాడి చేయడంతో పాటు వాహనాలను సైతం ధ్వంసం చేశారు. వందమంది ఒకేసారి మూకుమ్మడిగా వచ్చి ప్రచార రథంపై ఉన్న బాక్సులను, అక్కడున్న బైకులను ధ్వంసం చేశారు.హోం మంత్రిపైనే దాడికి యత్నం అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. దళితురాలినైన నన్ను కించపరుస్తూ.. రౌడీయిజం ప్రదర్శిస్తూ, దాడి చేసి గెలవాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్?. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రచార కార్యక్రమంలో మేము ముందు ఉండటం.. మాకు ప్రజల ఆదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేక పోతున్నారు. గోపాలపురంలో వైఎస్సార్సీపీ గెలవబోతుందనే నిజాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఆ కడుపు మంటతోనే దాడులకు తెగబడ్డారు.టీడీపీ శ్రేణుల దాడుల్లో.. మా కార్యకర్తలు నలుగురికి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. ఒకరికి తల పగలటంతో కుట్లు సైతం పడ్డాయి. టీడీపీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తూ.. దాడులు చేయిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. కేసు దర్యాప్తు చేస్తున్నారు అని హోం మంత్రి తానేటి వనిత అన్నారు. -
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
-
CM Jagan : ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
సాక్షి, తూర్పుగోదావరి: సీఎం జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో స్పందన లభిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా యాత్ర కొనసాగుతోంది. గోదావరి జిల్లాల్లో జన జాతరను తలపిస్తోంది. పల్లెల నుంచి పట్టణాల వరకూ తరలివచ్చిన జన సందోహంతో రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. నడినెత్తిన సూరీడు 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతతో నిప్పులు చెరుగుతున్నా లెక్క చేయకుండా మహిళలు, వృద్ధులు, చిన్నారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూడాలని, ఆయనతో మాట కలపాలని రోడ్డుకు ఇరువైపులా బారులు తీరుతున్నారు. ఆయనకు అప్యాయంగా స్వాగతం పలుకుతున్నారు. కాకినాడ జిల్లాలో జరుగుతున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో దారిపొడవునా సీఎం వైఎస్ జగన్ కోసం జనం వేచి చూసి మరీ స్వాగతం పలికారు. సాయంత్రం కాకినాడ అచ్చంపేట జంక్షన్ లో ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభ జరగనుంది దిక్కులు నాలుగే. కానీ ‘తూర్పు’ ఓ ప్రత్యేకత ఉంటుంది! ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేది ఈ దిక్కునే మరి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘తూర్పు’ గోదావరి స్పెషాలిటీ ఏంటన్నది.. మనమిప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు... ఈ జిల్లాపై పట్టు అధికారానికి మెట్టు అని చరిత్ర ఇప్పటికే చాలాసార్లు చెప్పింది! అలాంటి ‘తూర్పు’లో జగనన్న ‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కొత్త చరిత్రను లిఖిస్తోంది బస్సు యాత్ర ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు! కాదూ కూడదు.. మాకు రుజువు కావాలంటున్నారా? చాలా సింపుల్... సీఎం జగన్ బస్సు యాత్రను దగ్గరగా ఫాలో కండి.. అభిమానంతో ఉప్పొంగిపోతున్న ప్రజలను చూడండి. ఇవ్వాళ రంగంపేటలో మొదలైన యాత్ర, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు చేరుకుంటుంది. ఇక్కడ కొద్దిసేపు భోజన విరామం. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్ , కత్తిపూడి బైపాస్ , తుని బైపాస్ , పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్లకు రాత్రి వరకు చేరుకుంటారు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి. సీఎంను కలవడానికి ప్రజలు పోటీ పడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సామర్లకోట వద్ద పెద్దాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ బస్సుయాత్రకు జనం ఆత్మీయ స్వాగతం పలికారు. సామర్లకోటలో మిట్టమధ్యాహ్నపు మండుటెండల్లోనూ అభిమానం ఏమాత్రం తగ్గలేదు. మేమంతా సిద్ధమంటూ ముఖ్యమంత్రి కోసం జనం బారులు తీరారు. పెద్దాపురం పాండవుల మెట్ట వద్ద 12:20గంటలకు బస్సు యాత్ర చేరుకుంది. స్థానికులకు అభివాదం చేసిన సీఎం జగన్.. కొద్దిసేపు వారిని కలిసారు. మధ్యాహ్నం 12.37గంటల నుంచి12.48 వరకు సామర్లకోట ఫ్లైఓవర్ పై బస్సు యాత్ర సాగింది. సామర్లకోట ఉన్డూరు క్రాస్ కు 12.48 గంటలకు చేరుకున్నారు సీఎం జగన్. సామర్లకోట అచ్చంపేట ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద మహిళలు కోరడంతో ముఖ్యమంత్రి జగన్ బస్సును కొద్దిసేపు నిలిపివేశారు. కిందికి దిగి మహిళలతో కొద్దిసేపు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం జగన్. కాకినాడ జిల్లాలో కొందరు మహిళలు సీఎం జగన్ బస్సు యాత్రకు గుమ్మడికాయలతో దిష్టితీసి స్వాగతం పలికారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసుకోవాలని, క్షేమంగా ఉండాలని సీఎం జగన్‌ను దీవించారు. -
మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. రేపటి షెడ్యూల్ ఇలా
సాక్షి, తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర ఉద్యమంలా కొసాగుతోంది. యాత్రలో భాగంగా సీఎం జగన్ పర్యటిస్తున్న ప్రాంతమంతా జన కెరటాన్ని తలపిస్తోంది. అడుగడుగునా జనం ప్రభంజనం మాదిరి కదిలివస్తోంది. జై జగన్ అంటూ ఉవ్వెత్తున నినాదిస్తున్నారు. మేమంతా సిద్ధం 18వ రోజు శుక్రవారం (ఏప్రిల్ 19) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. బస్సు యాత్రలో భాగంగా సీఎం జగన్ ఉదయం 9 గంటలకు ఎస్టీ రాజపురం రాత్రి బస నుంచి బయలుదేరుతారు. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం ఉందురు క్రాస్, కాకినాడ బైపాస్ మీదుగా సాయంత్రం 3:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం పిఠాపురం బైపాస్, గొల్లప్రోలు బైపాస్, కత్తిపూడి బైపాస్, తుని బైపాస్, పాయకరావుపేట బైపాస్ మీదుగా గొడిచర్ల క్రాస్ రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
ఉమ్మడి ‘తూర్పు’లో అభివృద్ధి వికాసం
సాక్షి ప్రతినిధి, కాకినాడ:/సాక్షి, రాజమహేంద్రవరం/అమలాపురం: తూర్పు గోదావరికి రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకతే వేరు. గడచిన ఐదేళ్ల ప్రగతితో ఆ జిల్లా స్వరూపమే మారిపోయింది. పట్టణాలతో పోటీపడేలా పల్లెల్లో సైతం పారిశ్రామికీకరణకు పునాదులు పడ్డాయి. రూ.299.40 కోట్లతో రోడ్లు, భవన నిర్మాణాలు చేపట్టారు. రూ.229.40తో పనులు మొదలయ్యాయి. మరో 33 రోడ్లను రూ.42.87 కోట్లతో మరమ్మతులు చేశారు. రెండో దశలో రూ.26.37 కోట్లతో పనులు చేపట్టారు. కత్తిపూడి–ఒంగోలు జాతీయ రహదారి విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. వశిష్ఠ నదిపై వంతెన నిర్మాణానికి రూ.580.42 కోట్ల నిధులు మంజూరయ్యాయి. కోనసీమ రైల్వే లైన్ కల సాకారమవుతోంది. దీనికోసం ఈ ఏడాది రూ.300 కోట్లు నిధులు వచ్చాయి. అయినవిల్లి మండలంలో రూ.300 కోట్లతో 440/132 కేవీ మెగా విద్యుత్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. పి.గన్నవరం మండలం ఉడిమూడిలంక, గంటి పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక ప్రజలు గోదావరిపాయ దాటాల్సిన అవసరం లేకుండా రూ.49.50 కోట్లతో వంతెన పనులు మొదలయ్యాయి. ముమ్మిడివరం– ఐ.పోలవరం సరిహద్దులో వృద్ధ గౌతమీ, గౌతమీ నదీ పాయల మధ్య పశువుల్లంక మొండి రేవు వద్ద రూ.49 కోట్లతో వంతెనను సీఎం జగన్న్పూర్తి చేయడంతో 16 గ్రామాల్లోని 8 వేల మందికి సౌకర్యం కలిగింది. 2023, 2024 సంవత్సరాల్లో ఖరీఫ్, రబీ సీజన్లలో రికార్డు స్థాయిలో దిగుబడి సాధించారు. గతేడాది ఎకరాకు 32 బస్తాలు దిగుబడి వస్తే ఈ ఏడాది 38 నుంచి 45 బస్తాలు పండించారు. ఏటా ఖరీఫ్ సీజ¯న్లో 3.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రాజమహేంద్రి రాత మారింది ♦ రూ.423 కోట్లతో నాలుగున్నరేళ్లలో నగర రూపురేఖలు మారిపోయాయి. ♦ నవరత్నాలుతో జిల్లా వ్యాప్తంగా 33 పథకాలతో ప్రజలకు మేలు జరిగింది. రికార్డు స్థాయిలో రూ.25,436 కోట్లు వెచ్చించారు. ♦ నాడు–నేడులో 1069 పాఠశాలల భవనాలకు రూ.369.89 కోట్లు వెచ్చించారు. ♦ గృహాల కోసం 68,518 మందికి రూ.1233.34 కోట్లు వెచ్చించారు. 336 గ్రామ సచివాలయాలకు రూ.108.47 కోట్లు విడుదలయ్యాయి. ♦ డిసెంబర్ నాటికి ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూ.25,436 కోట్లు వెచ్చించింది. ♦ రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో ఏర్పాటైన మెడికల్ కళాశాలలో 150 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ♦ 1.46 లక్షల మంది ఇంటి పట్టాలు అందుకున్నారు. తొలి దశలో రూ.113.48 కోట్లతో 63,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ♦ అనపర్తి బలభద్రపురంలో రూ.2500 కోట్లతో గ్రాసిమ్ కాస్టిక్ సోడా పరిశ్రమతో 2500 మందికి ఉపాధి లభించింది. ♦ గోకవరం మండలం గుమళ్లదొడ్డి వద్ద రూ.260 కోట్లతో ఇథనాల్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయి. 210 మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. ♦ కొవ్వూరు మండలం ఇసుకపట్ల పంగిడి వద్ద రూ.1,350 కోట్లతో త్రివేణి రెన్యువబుల్స్ ఆధ్వర్యంలో సోలార్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటైంది. దీని ద్వారా 2400 మందికి ఉద్యోగాలు దక్కాయి. ♦ నల్లజర్ల మండలం పోతవరంలో రూ.50 కోట్లతో జాగృతి బయోటెక్ ప్రైవేటు సంస్థ బయోటెక్నాలజీ కంపెనీ అందుబాటులోకి రానుంది. ♦ ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు నాడు–నేడులో రూ.9.21 కోట్లు మంజూరు ♦ గడప గడపకు మన ప్రభుత్వంలో ఎదురైన సమస్యల్లో రూ.72.88 కోట్ల నిధులతో 1,102 పనులకు పరిష్కారం. ♦‘నాడు– నేడు’ మొదటి విడతలో రూ.104.96 కోట్లతో 436 పాఠశాలలు, రెండో విడతలో రూ.257 కోట్లతో 761 పాఠశాలలు, 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి. ♦ పేదలందరికీ ఇళ్లు రెండు విడతల్లో 34,454 ఇళ్లకు రూ.62,017 కోట్లు కేటాయింపు. ♦ జల జీవన్ మిషన్‌లో రూ.515.93 కోట్లతో ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణం. ♦ జగనన్న కాలనీల్లో 209 లే అవుట్లలో కుళాయిల కోసం రూ.45.75 కోట్లు కేటాయింపు. ♦ ఇంటింటికీ గోదావరి జలాలందించేందుకు రూ.1,650 కోట్లు కేటాయింపు ఫుడ్ ప్రాసెసింగ్, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు, హేచరీల్లో కల్పిస్తున్న ఉపాధి ఇలా 2019– 20లో 265 యూనిట్లతో 1707 మందికి 2020–21లో 119 యూనిట్లతో 978 మందికి 2021–22లో 720 యూనిట్లతో 4254 మందికి 2022–23లో 2412 యూనిట్లతో 9455 మందికి -
‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 18వరోజు షెడ్యూల్ ఇలా
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. జననాయకుడికి అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. నుదిటిపై గాయం మానకపోయినా.. సడలని ఉక్కు సంకల్పంతో మరింత దృఢ నిశ్చయంతో సీఎం జగన్ తన బస్సుయాత్రను ముందుకు సాగిస్తున్నారు. మేమంతా సిద్ధం 17వ రోజు గురువారం (ఏప్రిల్ 18) షెడ్యూల్‌ను వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం బుధవారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9 గంటలకు తేతలి రాత్రి బస నుంచి బయలుదేరుతారు. తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవి చౌక్, పేపర్ మిల్ సెంటర్ దివాన్ చెరువు, రాజానగరం మీదుగా ST రాజపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
అనపర్తిలో ఆగ్రహ జ్వాల! స్పందించని బాబు తీరు..
తూర్పుగోదావరి: నోటి దగ్గర కూడు లాగేసుకుంటే ఎలా ఉంటుంది? చిన్న పిల్లలకు చాక్లెట్ ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసేసుకుంటే వారికి ఎంత కోపం వస్తుంది? సరిగ్గా అనపర్తిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో అనపర్తి నుంచి రామకృష్ణారెడ్డి పేరు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ఇప్పటికే నియోజకవర్గంలో ప్రచారం ఆరంభించారు. తదనంతర పరిణామాల్లో టీడీపీ, జనసేనకు బీజేపీతో పొత్తు కుదిరింది. చంద్రబాబు వెళ్లి బీజేపీ నేతలతో బేరసారాలు సాగించడమే కాకుండా.. వారడిగిన స్థాయిలో సీట్లు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే అనపర్తి సీటును బీజేపీకి సమర్పించుకున్నారు. దీంతో తాజాగా ఇక్కడి నుంచి విపక్ష కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన ములగపాటి శివరామకృష్ణంరాజు పేరు ప్రకటించారు. కనీసం రామకృష్ణారెడ్డికి మాటమాత్రంగా కూడా ఈ విషయం చెప్పలేదు. ఈ పరిణామాలు అనపర్తి టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. రామకృష్ణారెడ్డికి ఇచ్చినట్టే ఇచ్చి టికెట్టు లాగేసుకోవడంతో వారు భగ్గుమంటున్నారు. నాలుగు రోజులుగా రచ్చ వాస్తవానికి అనపర్తి టికెట్టుపై నియోజకవర్గ టీడీపీలో నాలుగు రోజులుగా రచ్చ జరుగుతోంది. ఈ సీటును బీజేపీకి కేటాయిస్తున్నారంటూ వార్తలు రావడంతో కొద్ది రోజులుగా టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నారు. దీనిపై అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకూ ఎన్నికల ప్రచారం చేయవద్దంటూ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను వారు అడ్డుకున్నారు. తొలిగా బిక్కవోలు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రామకృష్ణారెడ్డిని ప్రచారం చేయవద్దంటూ నిలిపివేశారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా స్థాయి పదవులకు రాజీనామాలు చేస్తూ సోమవారం రాజమహేంద్రవరంలో ఉన్న టీడీపీ జోన్–2 కో ఆర్డినేటర్ రావు వెంకట సుజయ కృష్ణ రంగారావుకు లేఖలు అందజేశారు. అలాగే మంగళవారం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ధర్నా చేశారు. బుధవారం పెదపూడిలో నిరసన చేపట్టారు. అదే రోజు సాయంత్రం బీజేపీ అభ్యర్థిగా శివరామ కృష్ణంరాజు పేరు ప్రకటించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అదే రోజు రాత్రి ఇద్దరు యువకులు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు. ఈ క్రమంలో రామవరంలోని ఆయన నివాసానికి టీడీపీ శ్రేణులు గురువారం పెద్ద ఎత్తున చేరుకున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికై నా టీడీపీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసి, రామకృష్ణారెడ్డికే టికెట్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నలభై సంవత్సరాలుగా నియోజకవర్గంలో టీడీపీని మోస్తున్న నల్లమిల్లి కుటుంబానికి చంద్రబాబు అన్యాయం చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. కట్టప్ప రాజకీయాలు చేయద్దంటూ చంద్రబాబును తీవ్రంగా దూషించారు. టీడీపీ ఎన్నికల ప్రచార కరపత్రాలు, పార్టీ జెండాలను కుప్పగా పోసి తగులబెట్టారు. వారిని రామకృష్ణారెడ్డి వారించారు. నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఇన్నాళ్లూ తాను పడిన కష్టం నిష్ప్రయోజనంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో తిరిగి ప్రజలు, కార్యకర్తల అభీష్టం మేరకు తగు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ఇంత తంతు జరుగుతున్నప్పటికీ చంద్రబాబు కానీ, ఇతర పెద్దలు కానీ స్పందించకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఇంటి ముందు నిరసన తెలపండి అనపర్తి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి దిగజారుడు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనపర్తి సీటు రామకృష్ణారెడ్డికి టీడీపీ అధిష్టానం కేటాయించకపోతే ఆ పార్టీ శ్రేణులు టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలే తప్ప, రామవరంలో చేస్తే ఉపయోగమేమిటని, ఇది హాస్యాస్పదంగా ఉందని అన్నారు. విలేకర్లతో మాట్లాడుతున్న ఏఎంసీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి పొత్తుల్లో భాగంగా అనపర్తి ఎమ్మెల్యే సీటు బీజేపీకి కేటాయించడం ఆయా పార్టీల అంతర్గత వ్యవహారమని, చంద్రబాబు నిర్ణయమని అన్నారు. తనకు టికెట్టు రాకుండా స్థానిక వైఎస్సార్ సీపీ కుట్రలు చేస్తోందని రామకృష్ణారెడ్డి ఆరోపించడం.. ఆడలేక మద్దెల ఓడు సామెతను గుర్తు చేస్తోందని విమర్శించారు. రాజకీయంగా తనకు తగిలే ఎదురు దెబ్బను వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఆపాదించడం రామకృష్ణారెడ్డికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. తనకు టికెట్టు రాకుండా వైఎస్సార్ సీపీ నేతలు రూ.20 కోట్లకు బేరసారాలు నడిపారంటూ ఆయన పేర్కొనడం విడ్డూరంగా ఉందని, ఎవరైనా అధిక మొత్తంలో నగదు ముట్టజెపితే అమ్ముడుపోయే స్థితిలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారా అని కృష్ణారెడ్డి ప్రశ్నించారు. మూడేళ్ల కిందట బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో చేసిన అసత్య ప్రమాణం, ఇటీవల అనపర్తి గ్రామ దేవత శ్రీ వీరుళ్లమ్మ అమ్మవారికి సంబంధించి అవహేళనగా మాట్లాడిన ఫలితమే నేడు రామకృష్ణారెడ్డికి పట్టిన దుస్థితి అని చెప్పారు. రానున్న రోజుల్లో ఆయన మరిన్ని కర్మఫలాలు అనుభవించక తప్పదని కృష్ణారెడ్డి అన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ వారా కుమారి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి చిర్ల వీర రాఘవరెడ్డి కూడా పాల్గొన్నారు. ఇవి చదవండి: బాబు పొత్తు ధర్మం చిత్తు చిత్తు? -
అన్నదాతలకు అండగా రైతుభరోసా కేంద్రాలు
-
జవహర్ వద్దు అంటూ టీడీపీ నేతల నినాదాలు
-
అందుకే చంద్రబాబు, పవన్ భయపడుతున్నారు: మంత్రి వేణు
సాక్షి, తూర్పుగోదావరి: కుల గణనపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. కులగణనకు అనుకులమా? వ్యతిరేకమా స్పష్టం చేయాలని, అవగాహన రాహిత్యంతో పవన్ కులగణనపై వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో సమగ్ర కుల గణన చేస్తున్నాం. బీహార్‌లో కులగణనపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుగుణంగానే కులగణన జరుగుతుంది. రాష్ట్ర పౌరుల సామాజిక, విద్యా, నివాస స్థితి తెలుసుకోవడంలో తప్పేముంది?. చంద్రబాబు, పవన్ కుల గణనతో భయపడుతున్నారు. అందుకే ఇలాంటి ప్రశ్నలు చేస్తున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కులగణన ఎక్కడ జరగలేదు. ఏపీలో మాత్రమే సాహసోపేతంగా చేస్తున్నాం’’ అని మంత్రి వేణు పేర్కొన్నారు. సామాజిక, న్యాయ, రూప శిల్పం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ రోజున రాష్ట్రంలో కులగణన చేపట్టాం. రాష్ట్రంలో 67 శాతం కుల గణన పూర్తైంది. కోటి 20 లక్షల కుటుంబాలకు ఇప్పటికే కులగణన పూర్తయింది. కులగణన జరిగితే బీసీలు టీడీపీకి దూరమవుతారని చంద్రబాబు భయపడుతున్నారు. చంద్రబాబు.. జనసేన కార్యకర్తలను మోసం చేయడానికే టికెట్లు ముందు ప్రకటించారు. చంద్రబాబు ఎనౌన్స్ చేసే సీట్ల సంఖ్యకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ అదే సంఖ్య ప్రకటించే ధైర్యం ఉందా?’’ అంటూ మంత్రి ప్రశ్నించారు. ‘‘15 లేదా 20 సీట్లలో పవన్ కళ్యాణ్ దిగజారి పోటీ చేస్తారు. అంతకు మించి ఏమీ లేదు. సీఎం జగన్‌ని ఓడించడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడు తప్పితే ప్రజలపై చిత్తశుద్ధి లేదు’’ అంటూ మంత్రి వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: పొత్తులో కొత్త ‘డ్రామా’.. పవన్ మరో నాటకం -
Prabhala Teertham 2024 Photos: కోనసీమ జిల్లాలో కన్నుల పండువగా ప్రభల తీర్థం (ఫొటోలు)
-
తూర్పుగోదావరి: టీడీపీ మూడు ముక్కలు.. భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ముద్దిపాటి వర్సెస్ మళ్లపూడి బాపిరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు వర్గాల మధ్య ముసలం పుట్టింది. నియోజకవర్గం ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజును మార్చాలంటూ కార్ ర్యాలీ చేపట్టారు. 500 కార్లతో గోపాలపురం నుంచి అమరావతికి టీడీపీ నాయకులు బయలుదేరారు. చంద్రబాబు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోపాలపురం నియోజకవర్గంలో టీడీపీని మూడు ముక్కలు చేశారంటున్న నేతలు.. ఒంటెద్దు పోకడలతో మద్దిపాటి వ్యవహరిస్తున్నారంటూ మండి పడుతున్నారు. మద్దిపాటిని అభ్యర్థిగా ప్రకటిస్తే రెబల్ అభ్యర్థిని బరిలోకి దింపుతామని నేతలు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు -
East Godavari: జైత్రయాత్రలా సామాజిక బస్సు యాత్ర
సాక్షి, తూర్పుగోదావరి: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సుయాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. 42వ రోజు బస్సు యాత్రకు జనం ఉప్పెనలా తరలివచ్చారు. రాజానగరంలో ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బస్సుయాత్ర జరిగింది. మధ్యాహ్నం రెండు గంటలకు కోరుకొండ మండలం దోసకాయపల్లిలో వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కోరుకొండ వరకూ బస్సుయాత్ర సాగింది. మధ్యాహ్నం మూడు గంటలకు కోరుకొండ బూరుగపూడి గేట్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు హాజరయ్యారు. ఊసరవెల్లి చంద్రబాబు: మంత్రి మేరుగ నాగార్జున ఊసరవెల్లి మాటలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను చంద్రబాబు వాడుకుని వదిలేశారు. రాజ్యాంగబద్ధమైన అవకాశాలు రాకుండా చేశారు. చంద్రబాబు హయాంలో బీసీ ఎస్సీలపై అనేక దాడులు పాల్పడ్డారు. కులం, మతం, వర్గం, పార్టీ తారతమ్యం లేకుండా అందరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారు. పేదల పిల్లలకు కార్పొరేట్ విద్య చదివించేందుకు అవకాశం కల్పించిన ప్రభుత్వం ఇది. ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి 25 లక్షల రూపాయలు ఖర్చు చేసే ఏకైక ప్రభుత్వమిది. పేదలకు 31 లక్షలు ఇళ్ల పట్టాలిచ్చిన నాయకుడు సీఎం జగన్ మాత్రమే ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ జగన్‌కే జనం పట్టం: మంత్రి తానేటి వనిత బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు సీఎం జగన్ హయాంలో సామాజిక న్యాయం జరిగింది. అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరుగుతుంది. రాష్ట్రంలో సంక్షేమ పాలన అందించి పేదరికాన్ని దూరం చేశారు. సంక్షేమ కార్యక్రమాలతో పేదలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు బురద జల్లుతున్నారు. పిల్లలకు అందించే ట్యాబులపై కూడా బురద జల్లుతున్నారు. జగనన్న అందిస్తున్న పాలనలో కంటెంట్ ఉంది.. అందుకే ఆయన కటౌట్‌తో సాధికార బస్సు యాత్రలు చేయగలుగుతున్నాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్ జగన్‌కే జనం పట్టం కడతారు ఇది ప్రజలు గ్రహించాలి: ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణ కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్న చంద్రబాబు కావాలా.. ప్రేమను పంచుతున్న జగన్ కావాలా అన్న విషయాన్ని జనం తెలుసుకోవాలి. మరో ఐదేళ్లు జగనన్నకు అవకాశం ఇస్తే విద్య, వైద్యం మౌలిక సదుపాయాలు అద్భుతంగా రూపొందుతాయి. -
తూర్పు గోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండు కార్లు ఢీకొట్టాయి. విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. రెండుకార్లలో కలిపి మరో 8మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతులను దివ్యప్రియ(25), రమాదేవి (50), గనిష్క (19 నెలలు)గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకటరావు సైతం సహాయక చర్యలో పాల్గొన్నారు. చదవండి: TS: వాహనదారులకు హెచ్చరిక.. ఆ వెబ్సైట్లో చలాన్లు కడితే ఇక అంతే.. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తున్న ఎర్టిగా కారు టైర్ పంచర్ కావడంతో రాంగ్ రూట్లో దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న మరో ఎర్టీగా కారును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 19 నెలల చిన్నారి సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు… pic.twitter.com/C48xYsOfY2— Telugu Scribe (@TeluguScribe) January 2, 2024 -
తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు
సాక్షి, తూర్పుగోదావరి: తెలుగు రాష్ట్రాల్లో ‘కొత్త’ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. ఏపీలో తాజాగా రెండు కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. 85 ఏళ్ల మహిళకు కోవిడ్ సోకినట్టు సమాచారం. శాంపిల్‌ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్‌కు అధికారులు పంపించారు. ఏలూరులో కరోనా మరో కేసు నమోదైంది. కొత్త వేరియంట్ నేపథ్యంలో ఆరుగురికి ర్యాoడమ్ టెస్టులు చేసిన వైద్యులు.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వైద్యుడికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించారు. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్‌ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు వైద్యులు పంపించారు. పాజిటివ్ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని, ప్రజలు ఆందోళన పడొద్దని డీఎం అండ్ హెచ్ఓ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి వేరే రాష్ట్రాలకు ఎక్కడికి వెళ్లి రాలేదని స్పష్టం చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో ఇద్దరు చిన్నారులు కరోనా బారినపడ్డారు. నాలుగైదు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. 14 నెలల చిన్నారికి కరోనా సోకింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వ్యాప్తితో ఎంజీఎం సిబ్బంది అప్రమత్తమయ్యారు. మాస్క్ లేనిదే ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. కోవిడ్ పేషెంట్లకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలో కొత్తగా 6 కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. 16 కేసులు హైదరాబాద్‌లోనే నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. -
సామాజిక న్యాయానికి చాంపియన్..సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి : ఏ ముఖ్యమంత్రి జగనన్నలాగా సామాజిక న్యాయం పాటించలేదని హోం మంత్రి తానేటి వనిత కొనియాడారు. జ్యోతిరావు పూలే, బాబూ జగ్జీవన్‌రామ్ ఆశయాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆచరణలో చూపారన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌లతో కలిసి వనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ ఉండకూడదని అమ్మ ఒడి పథకాన్ని సీఎం జగన్ తీసుకువచ్చారు. గతంలో మన పిల్లల కోసం ఆలోచించిన సీఎంను చూశారా? సీఎం జగన్మోహన్ రెడ్డి మన బిడ్డల చదువులు, ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. మహిళా సాధికారత కోసం చేయూత, కాపు నేస్తం, ఇచ్చారు. అగ్ర వర్ణాల్లో ఉన్న పేదలను గుర్తించిన సీఎం మన జగనన్న 32లక్షల ఇళ్ళ స్థలాలు ఉచితంగా ఇచ్చారు. మహిళకు పుట్టింటి కానుకగా ఇంటి స్థలాన్ని ఇచ్చారు’అని వనిత చెప్పారు. గ్రామ సచివాలయం వ్యవస్థతో జగనన్న పాలన మన ముంగిటకు చేర్చారు. ప్రజల్లోకి వెళ్ళలేక ప్రతి పక్షాలు.. చిన్న పిల్లల ట్యాబ్‌లపై బురద చల్లుతున్నారు. ట్యాబ్‌లను సైతం రాజకీయలకు వాడుకుంటున్నారు. మీ పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదవవచ్చు కానీ పేదలు చదవ కూడదా...?దళితులకు పెద్ద పీట వేస్తూ నన్ను హోం మంత్రిని చేశారు’అని వనిత తెలిపారు. మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ.. ‘మహిళా సాధికారితకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారు.చంద్ర బాబు ఒక అబద్ధం. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచాడు. వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తే దానిలో కోతలు పెట్టాడు. రైతులు, డ్వాక్రా మహిళలను రుణమాఫీ పేరు చెప్పి మోసం చేశాడు. 2లక్షల 60వేల కోట్ల రూపాయలను పేదలకు ఇచ్చింది సీఎం జగన్మోహన్ రెడ్డి’అని అన్నారు. మంత్రి కారుమూరి మాట్లాడుతూ.. ‘ఏపీలో 11శాతం ఉన్న పేదరికాన్ని ఆరు శాతానికి సీఎం జగన్మోహన్రెడ్డి తగ్గించారు. దోపిడీ దారులు చంద్రబాబు హయాంలో ఉండేవారు. సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో అమ్మ ఒడితో పిల్లలను బడిబాట పట్టేలా చేశారు. రూ.65వేల కోట్లు పిల్లల విద్యకు ఖర్చు పెట్టారు. పెత్తందారులు, ఎల్లో మీడియా, చంద్రబాబు పేద పిల్లల విద్య పై విషం చిమ్ముతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేసింది సీఎం జగన్మోహన్రెడ్డి’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదీచదవండి..అమరావతిపై బాబుకు వైఎస్ఆర్సీపీ ప్రశ్నలు