Fighting dominant
-
‘కాలజ్ఞాని’ కుటుంబంలో కలహాలు
బ్రహ్మంగారి మఠం: వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఆధిపత్య పోరు నెలకొంది. పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల కరోనాతో శివైక్యం చెందిన విషయం తెలిసిందే. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది. అయితే గోవిందస్వామి మేజర్ అయ్యేంతవరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో సమస్య మరింత జటిలం అయ్యింది. ఈ నేపథ్యంలో సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకుగాను రాష్ట్రంలోని వివిధ మఠాల నుంచి 7గురు పీఠాధిపతులు బుధవారం బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. వీరిలో శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి భవానీ శంకరానంద స్వామి, బనగానపల్లె రవ్వలకొండ పీఠాధిపతి జ్ఞానేశ్వర్ స్వామి, రుద్ర పీఠాధిపతి అతిదేనందేశ్వర స్వామి, రంగనాథ స్వామి, మారుతి మహానంద స్వామి, ఆత్మానంద భారతీ స్వామి, శివ స్వామి ఉన్నారు. వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి శివైక్యం చెందిన అనంతరం స్వామి పెద్ద భార్య కుమారులు, రెండో భార్య కుమారుల మధ్య నెలకొన్న మఠాధిపత్య పోరును పరిష్కరించేందుకు తాము ఇక్కడికి వచ్చినట్లు పీఠాధిపతులు తెలిపారు. మఠంలో రెండు రోజుల పాటు ఉండి ఈ మఠం సిద్ధాంతాలు పూర్తిగా తెలుసుకున్న తరువాత మఠాధిపతి నియామకం గురించి చర్చిస్తామని చెప్పారు. వీరభోగవసంత వెంకటేశ్వరస్వామి రెండో భార్యకు రాసిచ్చిన వీలునామాలో ఏముందనే విషయాన్ని కూడా తాము పరిశీలించి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని చెప్పారు. అలాగే మఠాధిపతులు, లేక పీఠాధిపతుల ఎంపికలో దేవదాయ శాఖ పాత్ర ఎంతవరకు ఉంటుందనేది పరిశీలిస్తామన్నారు. నూతన మఠాధిపతి నియామకం శాస్త్రీయ పద్ధతిలో జరుగుతుందని గుంటూరు జిల్లా శ్రీశైవక్షేత్ర పీఠాధిపతి భవానీ శంకరానంద స్వామి తెలిపారు. -
కలహాల కాంగ్రెస్..!
ఆధిపత్యం, వర్గ పోరు, గ్రూప్ తగాదాలకు పెట్టింది పేరైన కాంగ్రెస్‌లో.. సమస్య సమసిపోకపోగా అధికమవుతోంది. ఇటీవల భువనగిరిలో నిర్వహించిన పార్టీ సమన్వయ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సమక్షంలోనే శ్రేణులు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగడం.. కాంగ్రెస్ మార్క్ రాజకీయం మరోమారు బయటపడింది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనూ నేతలు ఎవరికి వారే వ్యవహరిస్తున్న తీరు.. నియోజకవర్గాల వారీగా వారిని సమన్వయం చేయడం పార్టీకి సవాల్‌గా మారింది. సాక్షి, యాదాద్రి : కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. 2014 ఎన్నికల సమయం నాటి పరిస్థితులు, ఇప్పటి పరిణామాలు చూస్తుంటే పెద్ద తేడా లేనట్లు కనిపిస్తోంది. ఈనెల 16వ తేదీన భువనగిరిలో జరిగిన పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎండీ సలీం అహ్మద్ సమక్షంలో జరిగిన వివా దాలు జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితికి అద్దంపట్టింది. శక్తి యాప్ నిర్వహణ, బూత్‌కమిటీల పనితీరును బలోపేతం చేయడం కోసం తీసుకుంటున్న చర్యలు, ఇంకా ఏమేం చేస్తే వచ్చే ఎన్నికల్లో విజ యం సాధించడానికి వీలు కలుగుతుందన్న విషయాలను వివరించడానికి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ నేతలు వర్గాలుగా విడిపోయి బల ప్రదర్శనకు దిగారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , కోమటిరెడ్డి వర్గీయులుగా విడిపోయి గొడవలకు దిగడంతో పరిశీలకుని ముందే రసాభాసగా మారింది. అన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితిజిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మార్కు వర్గపోరు, గ్రూప్ తగాదాలు, అధిపత్య పోరాటాలు సమసిపోలేదు సరికదా మరింత పెరిగాయి. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్టీని నియోజకవర్గాల వా రీగా ఐక్యం చేయడం సవాల్‌గా మారింది. ఇలాం టి గొడవలతోనే గత ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్‌తోపాటు 7అసెంబ్లీ నియోజకవర్గాలో కాం గ్రెస్ ఓటమి చవిచూసింది. గత ఎన్నికల నాటి గ్రూపు రాజకీయాలతో జరిగిన నష్టం నుంచి పా ర్టీ గుణపాఠం నేర్చుకుంటుందా? ఇదే తంతు కొ నసాగిస్తుందా అని పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా.. భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం ఉంది. భువనగి రి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ జిల్లా జనగామ, రంగారెడ్డి జిల్లా ఇబ్ర హీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్ష నిర్వహించారు. భువనగిరిలో నియోజకవర్గంలో.. భువనగిరి నియోజకవర్గ ఇంచార్జ్ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి రాజగో పాల్‌రెడ్డి వర్గీయుల మధ్యన విభేదాలున్నాయి. ఇంటింటికీ కాంగ్రెస్ కార్యక్రమంతో అనిల్‌కుమార్‌రెడ్డి కొంతకాలంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వరీ ్గయులు, అనిల్‌కుమార్‌రెడ్డి వర్గీయుల మధ్యన వి భేదాలున్నాయి. సమీక్ష సమావేశంలో భువనగిరి బీబీనగర్‌కు చెందిన స్థానిక నేతలు పరస్పరం ఘర్షణకు దిగడంతో అర్ధాంతంగా నిలిచిన సమీక్ష సమావేశాన్ని చివరగా ముగించారు. అలాగే జిల్లాపరిషత్ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, సర్పం చ్ల పోరం భువనగిరి నియోజకవర్గం కన్వీనర్ పచ్చిమట్ల శివరాజ్‌గౌడ్, అందెల లింగంయాదవ్, పంజాలరామాంజనేయలు గౌడ్లు ఎవరికి వారే తమ వాదనలు విన్పించి వచ్చే ఎన్నికల్లో పోటి చేయడానికి తమకుఅవకాశం ఇవ్వాలని కోరారు. నకిరేకల్ నియోజకవర్గంలో.. కాంగ్రెస్ వర్గాలు విడిపోయి ఎవరికి వారే పోటా పోటీగా పనిచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతోపాటు, కొండెటే మల్లయ్య, ప్రసన్నరాజులు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుంచే రంగం సిద్దం చేసుకుం టున్నారు. రిజర్వుడు నియోజకర్గంలో కోమటిరెడ్డి వర్గీయుడైన నియోజకవర్గం ఇంచార్జ్ చిరుమర్తి లింగయ్యకు పోటీగా ప్రసన్న రాజు, కొండేటి మల్లయ్యలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ కార్యక్రమాలతోపాటు వ్యక్తిగతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే అధిష్టానంఎవరికి సీటు ఇస్తుందో గాని సమీక్ష సమావేశంలో విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు, నాయకులు విడిపోయి తన్నుకున్నారు. మునుగోడు నియోజకవర్గంలో.. నియోజకవర్గ ఇంచార్జ్ పాల్వాయి స్రవంతి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య విభేదాలు ఉన్నాయి. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురైన స్రవంతి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేం దుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రాజగోపాల్‌రెడ్డి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన ని ఇప్పటికే ప్రకటించడంతో ఇరువురి మధ్యన వి భేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. వీరితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడొకరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే నియోజకవర్గంలో కార్యక్రమాలు ప్రారంభించారు. జనగామ నియోజకవర్గంలో.. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు రాజగోపాల్‌రెడ్డి వర్గీయుల మధ్యన విభేదాలు ఉన్నాయి. సమీక్ష సమావేశం రోజున జనగామకు చెందిన మాజీ మన్సిపల్చైర్మన్లు వేముల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి పొన్నాల పార్టీని పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశా>రు. సమీక్ష సమావేశంలో పాల్గొనకుండానే పొన్నాల అక్కడి నుంచి అలిగి వెళ్లిపోయారు. మరో వైపు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కోటి రూపాయలతో జనగామలో వృద్ధాశ్రమం కట్టిం చారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో.. మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కేమ మల్లేషం మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల నాటినుంచే వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కేమ మల్లేషంపై మల్రెడ్డి రంగారెడ్డి పరిశీలకుడికి ఫిర్యాదు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గంలో.. రిజర్వుడు నియోజకవర్గమైన తుంగతుర్తిలో 2014 లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి ద యాకర్, 2009లో పోట చేసి ఓడిపోయిన మామి డి నర్సయ్య వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి సి ద్ధంగా ఉన్నారు. వీరిద్దరూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే వర్గాలుగా విడిపోయిన నాయకులు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల నాటికి మరికొందరు అశావాహులు తెరమీదికి వచ్చే అవకాశం ఉంది. -
కొండా సురేఖ వర్సస్ నన్నపునేని..
సాక్షి, వరంగల్ రూరల్: వరంగల్ నగరంలోని ఇక్బాల్ మినార్ కూల్చివేత వ్యవహారంతో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. ఇంతకాలం చాప కింద నీరులా విస్తరిస్తున్న అసమ్మతి, ఆధిపత్య పోరు బయటపడ్డాయి. అధికార పార్టీకి చెందిన నేతలు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరగా భూపాలపల్లి, మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇదే తరహా పరిస్థితి ఉంది. ఉద్యమ కాలం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన, తొలి ప్రభుత్వం ఏర్పాటు వరకు టీఆర్ఎస్కు ఉమ్మడి వరంగల్ జిల్లా వెన్నుదన్నుగా నిలిచింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జాయింట్ యాక్షన్ కమిటీల ఏర్పాటు ఈ జిల్లా నుంచే మొదలైంది. ప్రస్తుతం ఇందుకు విరుద్ధంగా అధికార పార్టీ నేతల మధ్యే వర్గపోరు పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. కొండా వర్సస్ నన్నపునేని.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కొండా సురేఖ, మేయర్ నన్నపునేని నరేందర్ మధ్య గత రెండేళ్లుగా వర్గపోరు నడుస్తోంది. కొంతకాలం వారి మధ్య విభేదాలు సమసిపోయినట్లు కనిపించినా, గత ఆరు నెలలుగా ఇవి పరస్పర ఆరోపణలు, దూషణల వరకు వెళ్లాయి. ముఖ్యంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్, రంజాన్ ఇఫ్తార్ విందులు వీరి మధ్య పొలిటికల్ హీట్‌ను మరింత పెంచాయి. ఇరువర్గాలకు చెందిన అనుచరులు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించి బలప్రదర్శన చేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఆ దశను దాటి ఏకంగా ఎదుటి వర్గంపై బాహటంగా విమర్శలు చేసే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. వరంగల్ పోచమ్మమైదాన్‌లో ఇక్బాల్ మినార్ను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి వరకు రోడ్డుపై ఎమ్మెల్యే కొండా సురేఖ ఆధ్వర్యంలో బైఠాయించారు. మరుసటి రోజు వరంగల్‌లోని ఓ గార్డెన్లో ముస్లిం నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘మేయర్ నరేందర్ నువ్వో బచ్చా’ అంటూ నేరుగా ఎమ్మెల్యే ఎదురుదాడికి దిగారు. శనివారం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో మేయర్ నరేందర్ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ 2014లో తాను త్యాగం చేస్తే నే సురేఖకు టికెట్ వచ్చిందని, సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్కు నష్టం చేకూర్చితే నరసింహా అవతారం ఎత్తుతానని స్వరం పెంచారు. ఇదిలా ఉండగా మరోవైపు కొండా కుటుంబం నుంచి తమకు ప్రాణ హానీ ఉందని, తమకు రక్షణ కల్పిం చాలంటూ ఈ నెల 20న 15 డివిజన్ కార్పొరేటర్ శారదజోషి నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కొండా, నన్నపునేని మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరినా ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. మరో నాలుగు నియోజకవర్గాల్లో ఇదే తీరు.. మహబూబాబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రస్తు త ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత మధ్య గత మూడేళ్లుగా వర్గపోరు నడుస్తోంది. కవిత పార్టీకి వచ్చిన కొత్తలోనే ఆమె రాకను వ్యతిరేకిస్తూ శంకర్‌నాయక్ ఘాటైన వ్యా ఖ్యలు చేశారు. దీనిపై పార్టీ పెద్దలు ఎమ్మెల్యేను వివరణ అడిగారు. అయినా అక్కడి పరిస్థితిలో మార్పు రాలేదు. పార్టీపరంగా ఇరువర్గాలు వేర్వేరుగానే కార్యక్రమాలు చేపడుతున్నాయి. భూపాలపల్లి నియోజకవర్గంలో విచిత్రంగా త్రిముఖ పోరు నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే స్పీకర్ మధుసూదనాచారి ఉండగా గండ్ర సత్యనారాయణరావు టిక్కెట్ హామీతో పార్టీ చేరినట్లు ప్రచారం జరిగింది. వారిలో టిక్కెట్ ఎవరికి దక్కుతుందో అనే ఊగిసలాట కొనసాగుతుండగానే భూపాలపల్లి టికెట్ కొండా సుస్మిత పటేల్‌కే అంటూ కొండా దంపతులు ప్రకటించడం సంచలనంగా మారింది. స్టేషన్‌ఘన్‌పూర్‌లో తొలుత కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్యకు చెందిన అనుచరుల మధ్య కొంతకాలం వర్గపోరు నడిచింది. ఆ తర్వాత అంతా సద్దుమణిగిన తర్వాత తెరపైకి రాజాçరపు ప్రతాప్ వచ్చారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యేకు పోటీగా రాజారపు ప్రతాప్ కార్యక్రమాలు చేపట్టడంపై రాజయ్య వర్గం ఫైర్ అవుతోంది. ఒకటి తర్వాత ఒకటిగా గ్రూపు రాజకీయాలు, వర్గపోరు బహిర్గతమవుతున్నా పార్టీపరంగా అధిష్ఠానం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు చేపట్టడం లేదు. దీంతో ఈ వర్గపోరు ఎక్కడి వరకు వెళ్తుందనేది ఆసక్తిగా మారింది. -
రచ్చ రచ్చ.. రసాభాస
ఎండాడలో గంట ముందే ముగిసిన జన్మభూమి సమస్యలు చెబుదామని వచ్చిన వారిపై టీడీపీ కార్యకర్తల దాడి రుషికొండలో తమ్ముళ్ల బాహాబాహీ అధికార పార్టీలో ఆధిపత్య పోరు, అంతర్గత కుమ్ములాటలు జన్మభూమి సాక్షిగా బహిర్గతమయ్యాయి. అధికారుల ఎదుటే బాహాబాహీకి దిగడం, రక్తాలు వచ్చేలా కొట్టుకోవడంతో బిత్తరపోయారు ప్రజలు. టీడీపీ మహిళా నాయకురాలిపై అదే పార్టీకి చెందిన నాయకుడు అసభ్యంగా ప్రవర్తించడం.. ఆమె భర్త తిరగబడడం.. ఇలా ఒకటేమిటి.. అడ్డూ అదుపూ లేని టీడీపీ నాయకుల ఆగడాలకు వేదికైంది ఆరో వార్డు పరిధి రుషికొండలోని జన్మభూమి సభ. ఇక అదే వార్డులోని ఎండాడ సభ ఇందుకు భిన్నంగా ఏమీ జరగలేదు. ఇక్కడ విశేషమేమంటే సమస్యలు చెప్పడానికి వచ్చిన ప్రజలపైనే దాడి చేశారు టీడీపీ కార్యకర్తలు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారి కూడా అధికార పార్టీ నాయకులకే వత్తాసు పలకడం శోచనీయం. ప్రజలపై దాడిని ఖండించిన వైఎస్సార్ సీపీ నాయకులతో గొడవకు దిగి అక్కడి సభనూ రచ్చరచ్చ చేశారు. మొత్తానికి ఎందుకు నిర్వహించారో తెలియకుండానే ముగించేశారు అధికారులు. – సాగర్‌నగర్ (విశాఖ తూర్పు) జీవీఎంసీ ఆరోవార్డు పరిధిలో మంగళవారం జరిగిన జన్మభూమి–మా ఊరు సభలు రసాభాసగా ముగిశాయి. ఎండాడలో గంటన్నర ఆలస్యంగా మొదలైన సభను గంట ముందుగానే ముగించేశారు. మధురవాడ జోనల్ కమిషనర్ పి.ఎం. సత్యవేణి ఫిర్యాదులిచ్చిన స్థానికులతో అతిగా వ్యహరించడంతో స్థానికులు వారిపై తిరగబడ్డారు. అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కటై సమస్యలు చెప్పే అవకాశం ఇవ్వకుండా రచ్చరచ్చ చేశారు. నిర్మాణం పూర్తయినా ప్రారంభించని ఎన్టీఆర్ సుజలం వాటర్ ప్లాంట్ విషయమై వైఎస్సార్ సీపీ నాయకులు లొడగల రామ్మోహన్, లొడగల అప్పారావు, ఉప్పులూరి గోపి, నల్ల రవి, సుంకర హరిబాబు, చిర్రా రామ్మోహన్ సభలో జోనల్ కమిషనర్ సత్యవేణిని ప్రశ్నించారు. దీంతో జెడ్సీ వ్యంగ్యంగా మాట్లాడటంతో లొడగల అప్పారావు, ఇతర నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిపై దాడి రాజీవ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి రాజీవ్‌నగర్ రోడ్డు దుస్థితి, సాగర్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో రోగుల పరిస్థితి, రోడ్లు, అంతర్గత డ్రైనేజీల దుస్థితిపై అధికారులను నిలదీశారు. దీంతో శ్రీనివాసరావుపై టీడీపీకి చెందిన వెంకటరమణ అనే చోటా కార్యకర్త, వార్డు కమిటీ అధ్యక్షుడు చెట్టుపల్లి గోపి దాడికి ప్రయత్నించగా వైఎస్సార్ సీపీ నాయకులు అడ్డు తగిలారు. దీంతో ఇరువర్గాల మధ్య పది నిమిషాలు తోపులాట, వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ఈ గొడవలు భరించలేక జన్మభూమి ప్రత్యేక అధికారి మోహన్‌రావు గంటన్నర ముందుగానే వేదిక దిగిపోయారు. అనంతరం ఒకరు తర్వాత ఒకరుగా వివిధ శాఖల అధికారులంతా వెళ్లిపోవడంతో వేదిక ఖాళీ అయిపోయింది. ఉదయం 10.30కు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 12 గంటలకే ముగిసిపోయింది. దీంతో సమస్యలను చెప్పుకునేందుకు వచ్చిన స్థానికులు బిత్తరపోయి, సభ నిర్వహణను విమర్శిస్తూ వెళ్లిపోయారు. -
బీజేపీలో ముదిరిన ఆధిపత్యపోరు
కేఎస్ గీ బీఎస్‌వై ‘సంగొళ్లిరాయణ్ణ బిగ్రేడియర్’ ఏర్పాటుపై యడ్డి గరంగరం వచ్చేనెల 26న ‘హింద’ సమావేశాలు బెంగళూరు : భారతీయ జనతా పార్టీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, ఆ పార్టీ సీనియర్‌నేత కే.ఎస్ ఈశ్వరప్ప మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో యడ్డీ వద్దంటున్నా కే.ఎస్ ఈశ్వరప్ప ‘సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్’ పేరుతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. యడ్యూరప్ప బీజేపీ రాష్ట్రాధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దాదాపు నెలరోజులకు పార్టీ వివిధ విభాగాలకు అధ్యక్షులను, పార్టీ జిల్లా ఇన్ చార్జులను నియమించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ పార్టీలోని కొంతమంది సీనియర్ నాయకులకు, యడ్యూరప్పకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ముఖ్యంగా కే.ఎస్ఈశ్వరప్ప తన వర్గీలకు పదవుల కేటాయింపులో అన్యాయం జరిగిందని గుర్రుగా ఉన్నారు. అప్పటి నుంచి అడపాదడపా యడ్యూరప్పకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే యడ్యూరప్ప సూచనలను లెక్కచేయకుండా సామాజికంగా వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసమంటూ ‘హింద’ సమావేశాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అందులో భాగంగా సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్ పేరుతో ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ సంఘం ఆధ్వర్యంలో హింద కార్యక్రమాలు, సభలు, సమావేశాలు ఏర్పాటు చేయలని గురువారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్రిగేడియర్ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించడమే కాకుండా ప్రత్యేక పతాకానికి కూడా తుది రూపును ఇచ్చారు. ఈ పతాకంలో పసుపుపచ్చని వస్త్రం పై కత్తి, డాలు పట్టుకుని ఉన్న క్రాంతి వీర సంగోళ్లి రాయణ్ణ చిత్రం ముద్రించబడి ఉంటుంది. ఇక వచ్చేనెల 26న మావేరిలో హింద బృహత్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇక వైపున యడ్యూరప్ప ఏ సమావేశమైనా బీజేపీ ఆధ్వర్యంలోనే జరగాలని పట్టుబడుతుండగా కే.ఎస్ ఈశ్వరప్ప మాత్రం కాంత్రివీర సంగొళ్లి రాయణ్ణ బ్రిగేడ్ ఆధ్వర్యంలో ‘హింద’ సమావేశాలను నిర్వహించడానికి సమాయత్తం కావడం కమల వర్గంలోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. బీజేపీ హయాంలో రామరాజ్యం సాధ్యమయ్యిందా?! సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్ సంఘం రూపకల్పన అనంతరం కే.ఎస్ ఈశ్వరప్ప తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీజేపీ హయాంలో రామరాజ్యం వచ్చిందా? లేదు కదా? అటు వంటి రాజ్యం కోసం తనవంతు కృషి చేస్తున్నానన్నారు. అందువల్లే సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్ ఏర్పాటైందన్నారు. ఇందులో తాను సభ్యుడిని కాదని అయితే ‘బ్రిగేడియర్’ సభ్యులు పిలస్తే రూపకల్పనలో పాలుపంచుకున్నానన్నారు. బీజేపీలో యువమోర్చా, రైతుమోర్చ తదితర విభాగాలు ఉన్నమాట వాస్తవమే అయినా వారి వల్లే పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కాదన్నారు. ఆ విభాగాల్లో సభ్యులు కాని వేలమంది ఉదాహరణకు ఐఏఎస్, ఐపీఎస్‌లు సంగొళ్లిరాయణ్ణ బ్రిగేడియర్లో సభ్యులుగా ఉన్నారన్నారు. వారి వల్ల పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి తన వ ంతు ప్రయత్నం చేస్తున్నానన్నారు. తనకు పార్టీ పెద్దల మద్దతు కూడా ఉందన్నారు. -
అది కాంగ్రెస్ గుంపుల పంచాయితీ
రైతు గర్జన సభపై ఇంద్రకరణ్‌రెడ్డి ధ్వజం హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్‌లో రైతు గర్జన సభ జరిపింది తమ పార్టీలోని ఆధిపత్య పోరు, గుంపుల పంచాయితీ వల్లేనని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆ పార్టీపై ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి పట్టించుకోని కాంగ్రెస్ నాయకులు రైతు గర్జన పేరుతో రైతులను మరో సారి వంచించారని, ఆత్మద్రోహం చేసుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీలు పురాణం సతీశ్, డాక్టర్ భూపతిరెడ్డిలతో కలసి బుధవారం ఆయన టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తలాపునే గోదావరి ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించకుండా, జనానికి కనీసం తాగునీరు అందకుండా చేశారని కాంగ్రెస్‌ను దుయ్యబట్టారు. అభివృద్ధికి అడ్డుపడే ఏ పార్టీకీ తెలంగాణలో పుట్టగతులు ఉండవని మంత్రి హెచ్చరించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి అక్రమంగా సంపాదించిన సొమ్ముతోనే జిల్లాలో కాంగ్రెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. దశాబ్దాల తరబడి ప్రజలను ముంచిన వారే ప్రతిపక్షంలోకి రాగానే పునీతులై నట్లు ప్రభుత్వంపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. -
పలమనేరులో ఇక అంతర్గత పోరు
► ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తున్న నేతలు ► ఆధిపత్య పోరు తప్పదంటున్న విశ్లేషకులు ► బాబు బుజ్జగింపు తాత్కాలిక ఊరటే.. పలమనేరు టీడీపీలో అంతర్గత పోరుకు మళ్లీ బీజం పడింది. రాజకీయ ప్రయోజనాల నేపథ్యంలో ఇకపై ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరాటం ఖాయమని తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి తాజాగా టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, సెగ్మెంట్ పరిధిలోని కొంత మంది మండల స్థాయి నాయకులు ఆయనతో వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరడం వంటి తాజా రాజకీయ పరిణామాలు నియోజకవర్గ టీడీపీలో పెరిగే అసమ్మతి, అంతర్గత పోరును తేటతెల్లం చేస్తున్నాయి. ఎమ్మెల్యే అమరనాథరెడ్డి చేరికను జీర్ణించుకోలేని టీడీపీ నేతల పరిస్థితి ఇరకాటంలో పడింది. మనసులోని మాటలను, భవిష్యత్ ఆందోళనను పార్టీ అధినేత చంద్రబాబుకు వివరంగా చెప్పుకునే పరిస్థితి లేక సతమతం అవుతున్నారు. తిరుపతి: తిరుపతిలో జరిగిన మహానాడుకు ముందు నుంచే ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి టీడీపీలో చేరతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. పలమనేరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి సుభాశ్‌చంద్రబోస్ మొదటి నుంచీ ఆయన రాకను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు పార్టీని వీడి ఇప్పుడు మళ్లీ పార్టీలోకి రావడాన్ని ఆయన బహిరంగంగా అంగీకరించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ అప్పటి నుంచీ బోస్ పలమనేరు నియోజకవర్గం పార్టీ కేడర్‌కు దగ్గరగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే చేరిక బోస్ వర్గానికి ఇబ్బందికరంగా మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందో, లేదోనన్న అనుమానాలు బోస్‌తో పాటు ఆయన సన్నిహితుల్లో పెరిగాయి. దీన్ని ముందుగానే పసిగట్టిన పార్టీ అధిష్టానం బోస్‌తో పాటు పార్టీలోని నియోజకవర్గ ముఖ్య నాయకులను బుధవారమే విజయవాడకు పిలిపించుకుని బుజ్జగించడం జరిగింది. అయినప్పటికీ బోస్ వర్గీయుల్లో ఆందోళన తగ్గలేదు. ప్రస్తుతానికి నేతల మధ్య ఉన్న విభేదాలు బయటకు కనిపించకపోయినప్పటికీ సమీప భవిష్యత్తులో వర్గపోరు ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా. అగమ్యగోచరంలో మండల నాయకులు... తాజా రాజకీయ పరిణామాలు పలమనేరు నియోజకవర్గం టీడీపీ నాయకులను అగమ్యగోచరంలో పడేశాయి. ప్రధానంగా పలమనేరు రూరల్, పెద్దపంజాణి, గంగవరం, బెరైడ్డిపల్లి మండలాల్లోని టీడీపీ నేతలను ఇరకాటంలో పడేస్తున్నాయి. సెగ్మెంట్లో కీలకంగా మారిన బోస్, ఎమ్మెల్యేల్లో ఎవరికి విధేయులుగా మసలాలో తెలియక సతమతమవుతున్నారు. పలమనేరు రూరల్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు బాలాజీనాయుడు మొదటి నుంచీ బోస్‌కు విధేయుడిగానే ఉన్నారు. ఈయన కాకుండా మండలంలో పార్టీనేతగా ఉన్న జెడ్పీటీసీ భర్త వెంకటరత్నం ఇకపై ఎమ్మెల్యే వెంట నడిచే అవకాశాలున్నాయి. బెరైడ్డిపల్లి మండలంలో పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కదిరప్ప, యువనేత సుబ్బులుతో పాటు ఇటీవలనే టీడీపీలో చేరిన క్రిష్ణవేణి జైకుమార్‌లు బోస్ వెంట పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే మండలంలో ఉన్న టీడీపీ సీనియర్ నేత శ్రీనివాసులురెడ్డి రెండేళ్లుగా బోస్‌తో కాస్తంత దూరంగా ఉంటున్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు రాధ కిషోర్‌గౌడ్ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డితో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మండలంలో మూడు గ్రూపులు కనిపిస్తున్నాయి. వీరంతా కలిసి పార్టీ కార్యక్రమాల్లో ఏ మేరకు పాల్గొంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గంగవరం, పెద్ద పంజాణి మండలాలతో పాటు మిగతా చోట్ల ఎమ్మెల్యేతో పాటు పార్టీలోకి కొత్తగా వచ్చిన నాయకులు అందరూ ఆయన వెంటే నడిచే వీలుంది. ఇదే జరిగితే సుభాష్‌చంద్రబోస్ వర్గం రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని సమాచారం. మారిన రాజకీయ పరిణామాలు నియోజకవర్గ నేతల్లో ఆధిపత్య పోరును కచ్చితంగా పెంచుతాయని పరిశీలకులు భావిస్తున్నారు. అక్కడి నుంచే వచ్చి... మళ్లీ అక్కడికే.... వైఎస్సార్సీపీలో కొనసాగుతూ ఎమ్మెల్యేతో వెళ్లిన వివిధ మండలాల నాయకులందరూ ఎన్నికలకు ముందు టీడీపీలోనే ఉన్నారు. అప్పట్లో ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్న వీరంతా మళ్లీ ఎమ్మెల్యేతో టీడీపీలోకి వెళ్లారు. బెరైడ్డిపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాధ, మున్సిపల్ కౌన్సిలర్లు గుల్జార్ఖాజా, వాణికిషోర్లు అమరనాథ్‌రెడ్డితో పాటే పార్టీలు మారారు. దీన్నిబట్టి వీరంతా టీడీపీలోనే కొనసాగితే ముందు ముందు ఎమ్మెల్యేతోనే ఉంటారని బోస్ వర్గం అంచనా వేస్తోంది. -
ఆధిపత్య పోరు..!
మైనార్టీ సంక్షేమ శాఖలోకార్యదర్శి వర్సెస్ డెరైక్టర్ అధికార ఉత్తర ప్రత్యుత్తరాలపై మెమో జారీ చేసిన కార్యదర్శి తీవ్రంగా పరిగణించి ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాసిన డెరైక్టర్ ఉపముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా ఆగని వివాదం గాడి తప్పుతున్న మైనార్టీ సంక్షేమం సిటీబ్యూరో: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం దేవుడెరుగు గానీ....శాఖ కార్యదర్శి , డెరైక్టర్ల మధ్య ఆధిపత్య పోరు పరిపాలన యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు లక్ష్యానికి చేరుకోగా పోగా, వాటిపై అధికారుల్లో కనీసం జవాబు దారీతనం కరువైంది. కొంత కాలంగా ఇరువురి మధ్య రగులుతున్న అంతర్గత వివాదానికి ఇటీవల ఒక అధికారి సర్వీస్ పొడిగింపు ప్రతిపాదనల వ్యవహారం మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో మైనార్టీ సంక్షేమ విభాగాలపై డెరైక్టర్ అజమాయిషీ లేకుండా చేసేవిధంగా కార్యదర్శి మెమో జారీ చేయడం సంచలనం సృష్టించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన డెరైక్టర్ ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖను రాయడం చర్చనీయాంశంగా తయారైంది. సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ జోక్యం చేసుకున్నా వివాదానికి తెర పడనట్లు తెలుస్తోంది. ప్రచ్ఛన్న యుద్దం.. మైనార్టీ సంక్షేమ శాఖపై ప్రత్యేకంగా మంత్రి ప్రాతినిధ్యం లేక పోవడం ఉన్నత స్థాయి అధికారుల మధ్య ఆధిపత్యం పోరుకు దారి తీసినట్లయింది. గత ఏడాది కాలంగా కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, డెరైక్టర్ ఎంజే అక్బర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల కార్యదర్శి ‘‘ 2014 అక్టోబర్ 28న లేఖ నంబర్ 1501/2014-2 ద్వారా జారీ అయినా మెమో (మైనార్టీ సంక్షేమ విభాగాల ద్వారా ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలు, ఉత్తర ప్రత్యుత్తరాల అంశం)’ పై తిరిగి కార్లిఫికేషన్ ఇస్తూ అదే నంబర్‌తో మరో మెమో జారీ చేయడం కలకలం రేపింది. ఈ మెమోలో ‘ మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ శాఖాపరమైన అధిపతి. డెరైక్టర్ నిధుల పంపిణీ, పాలసీ సంబంధించిన అంశాలకు పరిమితం. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇండిపెండెంట్ సంస్థ. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తోంది. ఇతర కార్పొరేషన్ల మాదిరిగా ఇండిపెండెంట్‌గా కార్యకలాపాలు కొనసాగించాలి, అంటూ పేర్కొనడం మైనార్టీ విభాగాలపై డెరైక్టర్ ఆజమాయిషి లేకుండా చేసినట్లయింది. ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ... రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి జారీ చేసిన మెమోపై తీవ్రంగా స్పందించిన డెరైక్టర్ ఒక అడుగు ముందుకువేసి ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాశారు. ఈ నెల 9వ తేదిన లేటర్ నెంబర్ సీ /49సీఎండబ్ల్యు/ఎడిఎంఎన్/2016 ద్వారా గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలు , మెమోలు, ఆదేశాలను కోడ్ చేస్తూ సుమారు ఏడు పేజీల సుద్ఘీ లేఖాస్త్రాన్ని సంధించడం శాఖలో సంచలనం సృష్టించింది. ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 2014 అక్టోబర్ 28న జారీ చేసిన మెమోకు కార్లిఫికేషన్గా ఇటీవల జారీ అయినా మెమో భిన్నంగా ఉందని, ఇది పరిపాలన యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొనడం కారద్యర్శిపై ఎదురుదాడికి దిగినట్లయింది. వాస్తవంగా 2014లో మైనార్టీ సంక్షేమ శాఖ సహయ కార్యదర్శి ఒక మెమో జారీ చేస్తూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీ కిస్ట్రియన్(మైనార్టీ) కార్పొరేషన్లు ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలు,అధికార ఉత్తర ప్రత్యుత్తరాలు డెరైక్టర్ ద్వారా సమర్పించాలని, నేరుగా సంబంధిత శాఖ కార్యదర్శి, ప్రభుత్వానికి పంపవద్దని సూచించిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం మైనార్టీ కమిషనరేట్ (డెరైక్టరేట్) ఏర్పాటు నేపథ్యంలో జారీ చేసిన జీవో నంబర్ 37,161,130.345 లతో పాటు జారీ అయినా మెమోల్లో గల మైనార్టీ సంక్షే మ శాఖ డెరైక్టరేట్‌కు గల అధికారాలు, విభాగాల ద్వారా అమలయ్యే పథకాలపై పర్యవేక్షణ, తదితర అంశాలను డెరైక్టర్ లేఖలో వివరించారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత కూడా జారీ కాబడిన మెమోలోని అంశాలను కోడ్ చేస్తూ... ఇటీవల కార్లిఫికేషన్ ఇచ్చిన మెమోను అనుసరించి తగిన పరిష్కా రం చూపాలని లేఖలో విజ్ఞప్తి చేయడం కార్యదర్శిని సవాల్ చేసినట్లయింది. దీంతో ఇరువురి మధ్య వివాదం మరింత పెరిగినట్లయింది. -
అక్రమదందా!
ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కాసులు కురిపిస్తున్న అక్రమ ఇసుక ఆరు నెలల్లో రూ.25 కోట్ల అక్రమార్జన అక్రమ రీచ్‌ల కోసం ఆధిపత్య పోరు కొన్నదానికంటే కొట్టుకొచ్చిన జాంపండుకు రుచి ఎక్కువ అంటారు... అదెంత నిజమో తెలీదు కాని జిల్లాలో అక్రమంగా తవ్వుకొచ్చిన ఇసుకకు మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇది ఏకంగా ఇద్దరు టీడీపీ ప్రజాప్రతినిధులు ఇసుక అక్రమ తవ్వకాల కోసం సిగపట్లు పట్టుకునేంతవరకు వెళ్లింది. వరహా నదిలో తామే అక్రమంగా తవ్వుకుంటామంటే... కాదు కాదు మేమే తవ్వుకుంటామంటూ వివాదానికి దిగుతున్నారు. ఎందుకంటే ఆ అక్రమార్జన విలువ నెలకు రూ.4 కోట్ల పైమాటే మరి. విశాఖపట్నం : యలమంచిలి, ఎస్.రాయవరం సరిహద్దుల్లోని వరహా నది ఇసుక జిల్లాలో ఇద్దరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కాసుల పంట పండిస్తుండటంతో పాటు వారిద్దరి మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. అధికారికంగా జిల్లాలో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేయలేదు. కానీ యలమంచిలి, ఎస్.రాయవరం మండలాల సరిహద్దుల్లో గార్లపూడి, రామచంద్రాపురం, గొట్టివాడ సమీపం తదితర చోట్ల అధికార టీడీపీ నేతలు అక్రమ ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేశారు. యలమంచిలి నియోజకవర్గానకి చెందిన ప్రజాప్రతినిధి పార్టీ మండల స్థాయి నేతకు బాధ్యతలు అప్పగించి జేసీబీలతో అక్రమంగా ఇసుక తవ్వకాల దందాకు తెరతీశారు. దాంతో ఈ రీచ్‌లపై పాయకారావుపేట నియోజకవర్గ టీడీపీ ప్రజాప్రతినిధి కన్ను పడింది. తమ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఇసుకను యలమంచిలి నియోజకవర్గ నేతలు తవ్వుకుపోవడమేమిటని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ప్రజాప్రతినిధి ఎస్.రాయవరం మండల ప్రజాప్రతినిధిని ఇన్చార్జిగా పెట్టి జేసీబీలతో అక్రమ తవ్వకాలు ప్రారంభించారు. ఈ వ్యవహారం అంతా రాత్రి పూట జరుగుతోంది. చీకటిపడిన తరువాత భారీ సంఖ్యలో వాహనాలతో ఇసుకను తవ్వుకుపోతున్నారు. ఆరు నెలల్లో రూ.25 కోట్లు కొల్లగొట్టారు రెండు నియోజకవర్గాల నేతలు ఆరునెలలుగా ఇష్టానుసారంగా అక్రమ తవ్వకాలు జరిపేస్తున్నారు. రెవెన్యూ వర్గాల అంచనా ప్రకారం రోజుకు దాదాపు 50 లారీలు, 100 ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. లారీ ఇసుక లోడ్‌ను రూ.20 వేలు, ట్రాక్టరు ఇసుక లోడ్‌ను రూ.4వేల చొప్పున విక్రయిస్తున్నారు. ఆ ప్రకారం రోజుకు రూ.14 లక్షల వరకు సొమ్ము చేసుకుంటున్నారు. అంటే నెలకు రూ.4.20 కోట్ల చొప్పున గత ఆరు నెలలుగా రూ.25 కోట్ల వరకు భారీ దోపిడీకి పాల్పడ్డారని తెలిసింది. ముందుముందు ఈ అక్రమ ఇసుక దందాతో ఇంకెంతగా అక్రమార్జనకు పాల్పడతారన్నది ఊహింప శక్యం కాకుండా ఉంది. ఇసుకపై ఆధిపత్యం కోసం విభేదాలు ఇసుక అక్రమార్జన పూర్తిగా తమకే చెందాలని ఎవెరికి వారు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు. అందుకే ఒకరివర్గంపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వీరిద్దరి ఒత్తిడితో పోలీసులు కొన్ని కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై ఇద్దరికీ సన్నిహితుడైన జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద పంచాయతీ పెట్టినట్లు తెలిసింది. ఇసుక ఆదాయం అంతా తనకు చెందాలంటే కాదు తనకే చెందాలని ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. పాయకారావుపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధి ఈ వ్యవహారంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కీలక నేత సహకారాన్ని కూడా కోరినట్లు తెలిసింది. ఆయన ద్వారా ఈ వివాదం తనకు అనుకూలంగా పరిష్కరించుకోవాలన్నది ఎత్తుగడ వేశారు. దాంతో ఇద్దరు ప్రజాప్రతినిధుల అక్రమ ఇసుక దందా వివాదం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది. -
మాగంటి వర్సెస్ మొడియం
పోలవరం టీడీపీలో వర్గపోరు ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు బాబు వ్యూహం మాజీ ఎమ్మెల్యేను పార్టీలోకి తెచ్చేందుకు కసరత్తు నియోజకవర్గంలో మారనున్న సమీకరణాలు పోలవరం : జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల మధ్య వర్గ విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొంతకాలం క్రితం వరకు ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య కుమ్ములాటలు ఎక్కువగా ఉండగా ఇటీవల ఎమ్మెల్యేలు, పార్టీలోని ప్రధాన నాయకుల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఇందుకు ప్రధాన కారణంగా ఇసుక తవ్వకాలు, సెటిల్మెంట్లు కావడం గమనార్హం. కొవ్వూరు నియోజకవర్గంలో నాయకులు, ఎమ్మెల్యేల మధ్య విభేదాలు రచ్చకెక్కగా తాజాగా పోలవరంలో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకు ఎంపీ వ్యూహం పోలవరం నియోజకవర్గంలో ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుల మధ్య ఆధిపత్య పోరు తీవ్రరూపం దాల్చింది. ఎంపీ, ఎమ్మెల్యే మధ్య గతేడాది ఇసుక ర్యాంపుల అజమాయిషీ విషయంలో ఏర్పడిన విభేదాలు క్రమేణా తీవ్రస్థాయికి చేరాయి. ఇటీవల కొయ్యలగుడెం మండలంలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మొడియంను ఉద్దేశించి ఎంపీ మాగంటి బాబు తీవ్రవ్యాఖ్యలు చేయటంతో అవి రచ్చకెక్కాయి. ఒక దశలో వీరి పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో మొడియంకు చెక్ పట్టేందుకు ఎంపీ బాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన పూనెం సింగన్నదొరను టీడీపీలో చేర్పించేందుకు రంగం సిద్ధం చేశారు. అధిష్టానం వద్ద పలుకుబడి కలిగిన కొయ్యలగూడెంకు చెందిన ఒక నాయకుడి ద్వారా సింగన్నదొరను పార్టీలో చేర్పించేందుకు సిద్ధం చేసినట్టు సమాచారం. 2019 ఎన్నికల్లో సింగన్నదొరకు లేదా ఆయన కుమారుడికి సీటు ఇస్తామని ఆశ చూపించి పార్టీలోకి రప్పిస్తున్నట్టు సమాచారం. గ్రామాల్లో పర్యటిస్తున్న సింగన్నదొర ఈ నేపథ్యంలో సింగన్నదొర తన కుమారుడితో కలిసి బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో టీడీపీ నాయకులను కలిసి మద్దతు కోరినట్టు సమాచారం. అయితే నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మొడియం ఆధిపత్యానికి గండికొట్టాలనే లక్ష్యంతో ఎంపీ మాగంటి బాబు ఆయనను రంగంలోకి తెస్తున్నారు. మొదటి నుంచి టీడీపీలోనే ఉన్న సింగన్నదొర పదేళ్ల కిందట చంద్రబాబు వైఖరి నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ అభ్యర్థి బాలరాజుకు మద్దతు పలికారు.ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో సింగన్నదొర మళ్లీ టీడీపీలో చేరేందుకు సిద్ధపడడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చంద్రబాబు వైఖరి నచ్చకే పార్టీని వీడిన ఆయన ఎంపీ బాబు కోసం టీడీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ధపడడం ఆ పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నారు. ఆయన వచ్చిన అనంతరం నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని తమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. -
అధికార పార్టీలో ఆధిపత్య పోరు!
అమాత్య పదవిపై ఆశతో స్కెచ్‌లు రాజప్ప చాపకిందకు నీరు తెచ్చేందుకు యత్నాలు కాపు ఉద్యమం వేదికగా వ్యూహాలు పావులు కదుపుతున్న ఇద్దరు నేతలు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య కొన్నాళ్లుగా సాగుతున్న ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఇప్పటివరకూ తెరవెనుక ఎత్తులు వేసుకుంటున్నవారి మధ్య విభేదాలు.. ఇప్పుడు బహిరంగంగానే సాగుతూండటంతో ప్రజలు విస్తుపోతున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాపు ఉద్యమంకంటే కూడా.. తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న విభేదాలే పార్టీ అధినేత చంద్రబాబుకు తలబొప్పి కట్టించాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ నాయకుల మధ్య అంతర్గత పోరు కొత్తేమీ కాదు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో అది మరింత తీవ్రమైంది. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలని మంత్రులు.. వారికి మద్దతుగా నిలిచిన ఓ ఎమ్మెల్సీ, ఓ ఎమ్మెల్యే మధ్య సాగుతున్న ఈ పోరుకు కాపు ఉద్యమం ఒక వేదికగా మారింది. తనకన్నా జూనియర్ అయిన నిమ్మకాయల చినరాజప్పకు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి పదవులు ఇవ్వడం రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి తొలినుంచీ ఇబ్బందికరంగానే మారింది. తనకు శిష్యుడే అయినప్పటికీ ప్రొటోకాల్ ప్రకారం రాజప్పకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడం యనమలకు కంటగింపుగా మారిందనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. ఇదే సమయంలో వారి వెనుక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరడంతో ఆధిపత్య పోరు ముదురుపాకాన పడింది. శాంతిభద్రతల సమస్య తలెత్తినప్పుడు హోం మంత్రి మీద విమర్శలు రావడం సహజం. కాపుగర్జన సభ సందర్భంగా తుని విధ్వంస ఘటనకు దారి తీసిన పరిస్థితులు, దీనిపై హోం మంత్రిగా చినరాజప్ప స్పందించిన తీరు.. ఆయన సొంత సామాజికవర్గంలోనే తీవ్ర ఆగ్రహాన్ని రేపింది. ముద్రగడపై రాజప్ప నేరుగా విమర్శలు చేయడాన్ని చాలామంది బహిరంగంగానే తప్పు పట్టారు. ఇదే అదనుగా టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగించారు. దీంతో టీడీపీలో ఆధిపత్య పోరు మరోమారు బహిర్గతమైంది. మంత్రిగిరీకోసం.. జిల్లాలో చినరాజప్పతో తొలినుంచీ విభేదాలున్న ఓ నాయకుడు, వచ్చే ఎన్నికల నాటికి ఆయనను పెద్దాపురం నియోజకవర్గం నుంచి ఖాళీ చేయించేందుకు యత్నిస్తున్నారు. అలాగే, రాజప్పను మంత్రివర్గం నుంచి తొలగిస్తే అదే సామాజికవర్గం కోటాలో తనకు అవకాశం వస్తుందని మరో ఎమ్మెల్యే ఆశిస్తున్నారు. వీరిద్దరూ కాపు ఉద్యమాన్ని వేదికగా చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయనను ఆ పదవి నుంచి ఎప్పటికైనా తప్పిస్తారనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఇదే జరిగితే ఆ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని ఓ సీనియర్ నేత ఆశిస్తున్నారు. అయితే ఇందుకు చినరాజప్ప అడ్డంకిగా మారారని, ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయనను తప్పిస్తే అదే సామాజికవర్గానికి చెందిన తనకు లైన్ క్లియర్ అవుతుందన్నది సదరు నేత ఆలోచనగా ఉన్నట్లు టీడీపీలోనే ఓ వర్గంవారు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాపు ఉద్యమాన్ని ఉధృతం చేయడంలోను, రాజప్ప దిష్టిబొమ్మలు దహనం చేయించే కార్యక్రమంలోను తెరవెనుక ఆ నేత కీలక పాత్ర పోషించారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక హోంమంత్రి పదవిపై ఎప్పటినుంచో మోజుపడుతున్న ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి సైతం ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకున్నారని సమాచారం. -
రెండు కుటుంబాల మధ్యే పోరు
ఖేడ్ ఉప ఎన్నిక మరోమారు రెండు కుటుంబాల ఆధిపత్య పోరుకు తెర తీసింది. ఈ ఉప ఎన్నికలో ముగ్గురి మధ్యే ప్రధాన పోరు జరుగుతోంది. 1952 నుంచి ఒక్క పర్యాయం మినహా ఎక్కువ పర్యాయాలు మూడు కుటుంబాలకు చెందిన నాయకులే ఇక్కడ ఎన్నికవుతూ వచ్చారు. కాగా ఈమారు మాత్రం రెండు కుటుంబాల మధ్య పోరు సాగుతుంది. వీరిలో ప్రధానంగా ఇద్దరు అన్నదమ్ములు తలపడుతున్నారు. నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి ఈనెల 13న జరగనున్న ఎన్నికలో 8మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరిలో ప్రధానంగా మూడు పార్టీల మధ్యే పోరు కొనసాగుతుంది. టీఆర్ఎస్ తరఫున భూపాల్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున సంజీవరెడ్డి, టీడీపీ తరఫున విజయపాల్‌రెడ్డి పోటీచేస్తున్నారు. టీఆర్ఎస్, టీడీపీ అభ్యర్థులు ఇద్దరూ స్వయానా అన్నదమ్ములు. ఇప్పటివరకు నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో షెట్కార్, వెంకట్‌రెడ్డి, కిష్టారెడ్డి కుటుంబాలే ఎన్నికవుతూ వచ్చాయి. ఒక్కసారి మాత్రం స్వతంత్ర అభ్యర్థి రాంచెందర్రావుదేశ్ పాండే గెలుపొందారు. ఇప్పటి వరకు గెలపొందింది వీరే.. నియోజకవర్గం అనాదిగా కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువ పర్యాయాలు కాంగ్రెస్ పార్టీనే గెలుపొందింది. ఈ మారు కాంగ్రెస్ కోటను బద్దలుకొట్టేందుకు టీఆర్ఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు 14మార్లు ఎన్నికలు జరగగా 10మార్లు కాంగ్రెస్ , రెండు పర్యాయాలు స్వతంత్రులు, రెండు పర్యాయాలు టీడీపీ గెలిచింది. -
మంత్రుల మధ్య ఆధిపత్య పోరు
డీఆర్ఓ పోస్టు కోసం జోరుగా పైరవీలు తాజాగా తెరపైకి కిషోర్‌కుమార్ నాలుగు నెలలుగా ఖాళీగా ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) నియామకం కోసం ఉత్కంఠ కొనసాగుతోంది. ఒకటో కృష్ణుడు.. రెండో కృష్ణుడు అంటూ నెలకో పేరు తెరపైకి వస్తున్నా... భర్తీ మాత్రం జరగడం లేదు. మంత్రుల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు తోడు ఉన్నతాధికారుల వైఖరి కూడా కొత్త డీఆర్ఓ రాకకు బ్రేకులేస్తున్నాయి. విశాఖపట్నం : డీఆర్ఓ పోస్టు కోసం జిల్లాలో గతంలో పనిచేసిన పలువురు అధికారులు తమదైన రీతిలో పైరవీలు సాగించారు. ఏజేసీగా పనిచేసిన జేఎల్ నరసింహారావు, జెడ్పీ సీఈఓగా పని చేసిన మహేశ్వరరెడ్డి కూడా ఈ పోస్ట్ కోసం ప్రయత్నం చేశారు. మంత్రులతో పాటు జిల్లా ఉన్నతాధికార్లు సైతం మోకాలడ్డడంతో నరసింహారావు చివరకు ఆర్ అండ్ ఆర్ ఎస్డీసీ పోస్టుతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. డీఆర్ఓగా వచ్చేందుకు మహేశ్వరరెడ్డి ఆశించినప్పటికీ ఇటీవలే బదిలీపై వెళ్లడంతో ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక కడప జేసీ-2గా పనిచేస్తున్న సి.చంద్రశేఖరరెడ్డిని విశాఖ డీఆర్ఓగా నియమిస్తూ ఆగస్టు 14న ఉత్తర్వులు వెలువడ్డాయి. మంత్రి అయ్యన్న సిఫార్సుతో జరిగిన చంద్రశేఖరరెడ్డి నియామకానికి మంత్రి గంటా శ్రీనివాసరావు మౌఖిక ఆదేశాలతో బ్రేకు పడింది. ఇంతలో విశాఖ ఆర్డీఓ వెంకటేశ్వర్లును డీఆర్ఓగా గత నెల 15న ప్రభుత్వం నియమించింది. మంత్రి అయ్యన్న చేసిన ఈ ప్రయత్నానికి గంటా మరోసారి అడ్డుపుల్ల వేయడంతో 24 గంటలు తిరక్కుండానే ఈ ఉత్తర్వులను అబియన్స్‌లో పెడుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వు విడుదల చేసింది. చివరకు చంద్రశేఖరరెడ్డి రాక పట్ల గంట సుముఖంగానే ఉన్నారని అనుకున్నంతలోనే.. ఆయనను హైదరాబాద్ భూపరిపాలనా విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి. కిషోర్ కోసం గంటా యత్నాలు : తాజాగా వుడా కార్యదర్శిగా పనిచేసి ఇటీవలే బదిలీపై వెళ్లిన జి.కిషోర్‌కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ఈయ న్ని డీఆర్ఓగా తీసుకొచ్చేందుకు మంత్రి గంటా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే సిటీపై ఆధిపత్యం చలాయిస్తున్న మంత్రి గంటా డీఆర్ఓగా కిషోర్ వస్తే ఆయన్ని అడ్డం పెట్టుకుని రూరల్‌లో కూడా తన హవా సాగిస్తారన్న ఆందోళన అయ్యన్న వర్గంలో వ్యక్తమవుతోంది.తరచూ విశాఖలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు జరుగుతుండడంతో ప్రధాని మొదలు కేంద్ర, రాష్ర్ట మంత్రులు, నెలకు రెండు మూడుసార్లు ముఖ్యమంత్రి పర్యటనలతో ప్రొటోకాల్ చూసే బాధ్యత డీఆర్ఓపై ఉంది. అలాంటి కీలకమైన పోస్ట్ ద్వారా జిల్లాపై పట్టు సాధించేందుకు ఇరువురు మంత్రులు వేస్తున్న ఎత్తులు పై ఎత్తుల వల్ల ఈ పోస్టు నాలుగు నెలలుగా ఖాళీగానే ఉండిపోయింది. -
గంటాకు వద్దు.. అయ్యన్నకు ముద్దు
మాతృసంస్థకు సరెండర్ చేసిన గంటా సీఈఓగా అందలమెక్కించిన అయ్యన్న ఎస్ఎస్ఏ పీవో వ్యవహారం మంత్రుల మధ్య ఆగని ఆధిపత్య పోరు విశాఖపట్నం: ఏ అధికారిపైనైనా ఆరోపణలొస్తే ఏం చేస్తారు? అంతగా ప్రాధాన్యత లేని పోస్టులో వేస్తారు! లేదా బదిలీ చేస్తారు. మన విశాఖ జిల్లాలో అయితే అలా చేయరు. ఒక మంత్రి అతనిపై చర్య తీసుకుంటే మరో మంత్రి ఆ అధికారికి అడ్డగోలుగా కొమ్ముకాస్తారు. అందలమెక్కిస్తారు. ఒకే ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య ఆధిపత్య పోరుకు అద్దం పడుతున్న తాజా వ్యవహారం ఇదీ! సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి నగేష్ విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓఎస్డీ కూడా. నగేష్ చాన్నాళ్లుగా జోడు పదవుల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. స్వచ్ఛ విద్యాలయ పథకం కింద సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)లో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో చాలా వరకు నిర్మాణం పూర్తయినట్టు ఎస్ఎస్ఏ అధికారులు మంత్రి గంటాకిచ్చిన నివేదికలిచ్చారు. వారం రోజుల క్రితం గంటా ఆనందపురం మండలంలో ఓ స్కూలుకు ఆకస్మిక తనిఖీకెళ్లినప్పుడు అక్కడ మరుగుదొడ్డి నిర్మాణం జరగకపోవడంతో పీవో నగేష్, ఈఈ భానుప్రసాద్‌లను వారి మాతృసంస్థలకు సరెండర్ చేశారు. దీంతో నగేష్ తన మాతృసంస్థ సహకారశాఖకు వెళ్లిపోతారని అంతా అనుకున్నారు. కానీ మూడ్రోజులు తిరక్కుండానే శ్రీకాకుళం జిల్లా సీఈవోగా నియమితులయ్యారు. దీంతో అంతా ముక్కున వేలేసుకున్నారు. అయ్యన్నకు సన్నిహితంగా.. ఎప్పట్నుంచో మంత్రులు అయ్యన్న, గంటా వీలు చిక్కినప్పుడల్లా ఎవరు సత్తా వారు చాటుకుంటున్నారు. సాక్షాత్తూ మంత్రి గంటా తన ఓఎస్డీని సరెండర్ చేస్తే ఆయనకు అయ్యన్నపాత్రుడు శ్రీకాకుళం సీఈవో పోస్టు ఇప్పించినట్టు తెలుస్తోంది. గంటా తొలుత ఏరికోరి తెచ్చుకున్న నగేష్ కొన్నాళ్లుగా అయ్యన్నతో సన్నిహితంగా మెలుగుతుండడం కూడా ఈ పరిస్థితికి కారణమంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరుగుదొడ్ల అవకతవకలపై గంటా స్పందించి సరెండర్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో నగేష్ వెనువెంటనే మంత్రి అయ్యన్నను ఆశ్రయించడం, ఆయన ఎస్ఎస్ఏ పీవోకంటే కీలకమైన శ్రీకాకుళం జెడ్పీ సీఈవోగా ఉత్తర్వులు వచ్చేలా కృషి చేయడం చకచకా జరిగిపోయాయి. ఈ వ్యవహారంలో తనకు సన్నిహితుడు ఆ జిల్లా మంత్రి కె.అచ్చెన్నాయుడు కూడా సహకరించడంతో అయ్యన్న పంతం నెగ్గించుకోవడానికి వీలు చిక్కిందంటున్నారు. మరోవైపు ఎస్ఎస్ఏ పీవోతో పాటు సరెండర్ చేసిన ఈఈ ఇప్పటికీ అదే విధుల్లో కొనసాగుతుండడం విశేషం. ఈయన కొనసాగడానికి గుంటూరు జిల్లా మంత్రి సహకరించినట్టు తెలుస్తోంది. -
‘కారు’..వార్..!
టీఆర్ఎస్లో ముదురుతున్న వర్గపోరు ఉద్యమ కార్యకర్తల ఊసెత్తని నేతలు రెండు, మూడువర్గాలుగా గులాబీదళం పార్టీ పెద్దలకు అందుతున్న ఫిర్యాదులు సంస్థాగత ఎన్నికల్లోనూ వర్గపోరుదే పైచేయి టీఆర్ఎస్లో వర్గపోరు తారాస్థారుుకి చేరింది. కొత్తగా వచ్చిన వారి ఆధిపత్యంతో పాతవారు సతమతమవుతున్నారు. ఉద్యమకారుల ఊసేలేకుండా పోరుుంది.. చివరికి తమకే సభ్యత్వ పుస్తకాలు ఇవ్వటం లేదని పార్టీ పెద్దలకు ఉద్యమనేతలు ఫిర్యాదు చేసే వరకు పరిస్థితి వచ్చింది. ఓవైపు జలగం, తుమ్మల వర్గీయుల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది..మరోవైపు ఉద్యమనేతలు, కార్యకర్తలు సంబంధిత నేతల తీరు సరిగా లేదని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు, ఫ్లెక్సీల చించివేత, బాహాబాహీ, నిరసనలు, నిరాహారదీక్షలు, గ్రామాల్లో ిపికెటింగ్ల వరకు పరిస్థితి వెళ్లింది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం : టీఆర్ఎస్లో వర్గపోరు ఊపందుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి జెండామోసిన వారికి దిక్కేలేకుండా పోరుుంది. కొత్తగా వచ్చిన వారి ఆధిపత్యంతో పాతనేతలు, కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు జరుగుతున్న అన్యాయూన్ని పార్టీ పెద్దలు, మంత్రు ఓలు ఈటెల రాజేందర్, హరీశ్‌రావు దృష్టికి శనివారం తీసుకెళ్లినట్లు సమాచారం.మంత్రి తుమ్మల, బాలసాని లక్ష్మీనారాయణ తీరు ఏమాత్రం సరిగా లేదని హైదరాబాద్ వెళ్లి మరీ పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జలగం, తుమ్మల వర్గీయులు పరస్పరం విమర్శలు, ఫ్లెక్సీల చించివేత, నిత్యవివాదాల్లో మునిగితేలుతున్నారు. ఆధిపత్య పోరు ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారికి ప్రస్తుతం మొండిచేయే ఎదురవుతోంది. జిల్లాపార్టీ, ఖమ్మం నగరంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాల గురించి పార్టీ సీనియర్ నేతలకు సమాచారం ఉండటం లేదంటున్నారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పార్టీలో చేరిన కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, కొన్ని నెలల క్రితం పార్టీ తీర్థం పుచ్చుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మీనారాయణ వర్గీయులు ఆధిపత్యపోరు సాగిస్తున్నారు. మంత్రితో పాటు జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, డీసీఎంఎస్ చైర్మన్ ఎగ్గడి అంజయ్య తదితరులు పార్టీలో చేరారు. వీరికి కొద్దిరోజుల ముందే ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, వైరా ఎమ్మె ల్యే బానోతు మదన్ఆల్ టీఆర్ఎస్ గూటికి చేరారు. ఆ తర్వాత సీపీఎం, కాంగ్రెస్, సీపీఐ, టీడీపీల నుంచి పలువురు నాయకులు పెద్ద ఎత్తున గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలోకి వచ్చిన వారందర్నీ స్వాగతించిన అధిష్టానం... ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలన్న అంశంలో మాత్రం స్పష్టత ఇవ్వలేకపోవడంతో ఆధిపత్యపోరు తారాస్థారుుకి చేరింది. ఈ ఆధిపత్యపోరే పలుమార్లు వివాదాలకు దారి తీసింది. వివిధ సందర్భాల్లో చోటు చేసుకున్న వివాదాలు.. పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీచేసిన పల్లా రాజేశ్వరరెడ్డి విజయూన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో ఫిబ్రవరి 27న ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన పార్టీ నేతలు, ద్వితీయశ్రేణి నాయకులు పార్టీలో కొందరు నేతలు అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఒకదశలో బాహాబాహీకి దిగారు. పార్టీకి తాము చేసిన సేవలను గుర్తించకుండా కరివేపాకులా ఉపయోగించుకుని పడేస్తున్నారంటూ ఆందోళనకు పూనుకున్నారు. ముందునుంచి పార్టీలో ఉంటున్న తమను పట్టించుకునేవారే కరువయ్యూరని టీఆర్ఎస్ బోనకల్ మండల మాజీ అధ్యక్షుడు శ్రీనివాసరావు నిరాహారదీక్షకు పూనుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద ఆందోళన చేస్తున్న ఆయనతో మంత్రి హరీశ్‌రావు శనివారం మాట్లాడారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇవ్వడంతో ఆయన ఆందోళన విరమించారు. గతనెల 27, 28 తేదీల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా కూడా వివాదం తలెత్తింది. సీఎం కు స్వాగతం పలుకుతూ కొత్తగూడెంలో తుమ్మల వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను స్థానిక ఎమ్మెల్యే జలగం వెంకట్రావు వర్గీయులు చించివేశారు. దీనిపై తుమ్మల వర్గీయులు జలగం అనుచరులపై పాల్వం చ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్టేషన్ ఎదుట కొద్దిసేపు ఆందోళన కూడా నిర్వహించారు. తాము చేసిన ఫిర్యాదుకు రశీదు ఇవ్వాలని జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్, మంత్రి తుమ్మల అనుచరుడు బరపటి వాసుదేవరావు డిమాండ్ చేశారు. ఈ ఫ్లెక్సీల వివాదం ఇప్పటికీ రగులుతూనే ఉంది. ఇదే పరిస్థితి ఖమ్మం, సత్తుపల్లి, మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లోనూ ఉంది. ఇక వైరా నియోజకవర్గంలో మరో విచిత్ర పరిస్థితి నెలకొంది. వైఎస్సార్సీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ వర్గీయులు, ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు, ఆది నుంచి పార్టీలోనే కొనసాగుతున్న నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ‘వైఎస్సార్సీపీని వీడి తప్పు చేశాను..’ అని టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సమయంలో సభావేదిక మీదే ఎమ్మెల్యే మదన్‌లాల్ వ్యాఖ్యానించటం సంచలనం కలిగించింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో తుమ్మల, జలగం వర్గీయుల మధ్య వివాదం నడుస్తోంది. మరోవైపు ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు వర్గీయులు కూడా ఆధిపత్యపోరుతో ఇబ్బంది పడుతున్నారు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం వందనం గ్రామంలోనూ వర్గపోరు నెలకొంది. టీడీపీ నుంచి వచ్చిన వారు, సీపీఎం నుంచి టీఆర్ఎస్లో చేరిన వారి మధ్య గొడవ జరిగింది. సీపీఎం, సీపీఐ నుంచి వచ్చిన వారు ఒకటిగా, టీడీపీ నుంచి వచ్చిన వారు మరో వర్గంగా ఏర్పడి పరస్పరదాడులకు దిగారు. గ్రామంలో పికటింగ్ ఏర్పాటు చేసే వరకు పరిస్థితి వచ్చింది. భద్రాచలం, సత్తుపల్లి, పాలేరు, ఇల్లెందు..ఇలా ఏ నియోజకవర్గంలో చూసినా వివాదాలే నెలకొన్నారుు. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో సైతం వర్గపోరు అడుగడుగునా బహిర్గతమయ్యే పరిస్థితి కనపడుతోంది. సభ్యత్వ నమోదులోనూ ఈ వర్గపోరు బయటపడింది. సభ్యత్వ పుస్తకాలు ఒకవర్గం వారి వద్ద ఉంటే.. మరో వర్గం తమకు ప్రత్యేక పుస్తకాలు ఇస్తే తప్ప సభ్యత్వం నమోదు చేయమని భీిష్మించిన పరిస్థితి ఉంది. ఇక జిల్లాస్థాయిలోముఖ్య నేతల మధ్య కూడా సక్యత లేదనే అభిప్రాయూలు వెల్లడవుతున్నారుు. ఇదిలావుండగా పార్టీలో తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగల రాజేందర్, వివిధ నియోజకవర్గాలకు చెందిన సీనియర్ నేతలు కంచర్ల చంద్రశే ఖర్ (కొత్తగూడెం), అబ్దుల్నబీ (ఖమ్మం), బత్తుల సోమయ్య (పాలేరు), పాలడుగు శ్రీనివాస్ (సత్తుపల్లి) నేతృత్వంలో ఉద్యమనేతల బృందం మంత్రులు రాజేందర్, హరీశ్‌రావును శనివారం హైదరాబాద్‌లో కలిసి వివరించినట్లు తెలిసింది. పార్టీలో తుమ్మల, బాలసాని ఏకపక్షధోరణితో వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు ఈ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు మంత్రులు వారికి భరోసా ఇచ్చినట్లు సమాచారం. -
మంత్రుల మధ్య మాడుగుల చిచ్చు
జిల్లా అధికారులకు శిరోభారం మాడుగులలో కార్యక్రమాలు ఆపకుంటే కలెక్టర్‌పై సభాహక్కుల నోటీసు ఇస్తానన్న ఎంపీ ఉన్నతాధికారులతో చర్చిస్తున్న యువరాజ్ పట్టువీడని గంటా..గవిరెడ్డి విశాఖపట్నం : అధికార తెలుగుదేశం పార్టీలో ఆదిపత్య పోరు పతాకస్థాయికి చేరుకుంది. ఇద్దరు మంత్రుల మధ్య నెలకొన్న కోల్డ్ వార్ అధికారులకు తలనొప్పిగా తయారైంది. తాజాగా మాడుగలలో అయ్యన్నవర్గం తలపెట్టిన ప్రారంభోత్సవాలు...శంఖుస్థాపన లను అడ్డుకోవాలని మంత్రి గంటా వర్గం వేస్తున్న ఎత్తుగడలు అధికారులకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. జిల్లా యంత్రాంగంపై, మరో వైపు పార్టీలోనూ పట్టు సాధించేందుకు రాష్ర్ట మంత్రులు సీహెచ్.అయ్యన్నపాత్రుడు గంటా శ్రీనివాసరావు పావులు కదుపుతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్ష పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరువర్గాలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. వీరి ఆదిపత్యపోరు పార్టీఅధినేతకే కాదు..అధికారులకు తలనొప్పిగా మారింది. నెలరోజుల క్రితం తనకు చెప్పకుండా నియోజకవర్గంలో మంత్రి గంటా పర్యటించడాన్ని మాడుగల పార్టీ ఇన్చార్జి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. గంటా వర్గీయుడైన విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తన అనుచరులతో మాడుగల నియోజకవర్గంలో గవిరెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయించడంతో టీడీపీలో అంతర్గత పోరు రోడ్డెక్కింది. ఆ తర్వాత పార్టీ జిల్లా కార్యాలయాన్ని వేదికగా చేసుకుని తులసీరావుపై గవిరెడ్డి బహిరంగంగా అవినీతి ఆరోపణలు గుప్పించారు. విశాఖ డెయిరీని అడ్డం పెట్టుకుని రూ.500కోట్లకు పైగా తులసీరావు దోచుకున్నారని..తక్షణమే సీబీఐతో విచారణ చేయించి సచ్చీలత నిరూపించుకోవాలంటూ గవిరెడ్డి ఏకంగా చంద్రబాబుకే సవాల్ విసిరారు. తర్వాత ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంత్రి గంటాతో కలిసి మరోసారి గవిరెడ్డికి సమాచారం ఇవ్వకుండా మాడుగులలో పర్యటించడమే కాకుండా వివిధ అభివృద్ధి కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. ఈ విషయంలో గంటా విజ్ఞతకే వదిలేస్తున్నట్టుగా ప్రకటించిన గవిరెడ్డి తన పట్టు నిరూపించుకునేందుకు ఈనెల 27వ తేదీన నియోజకవర్గంలో మంత్రి అయ్యన్నతో భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. నాలుగు మండలాల్లో ఒకే రోజు రూ.8.31కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..ప్రారంభోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలకు బ్రేకు వేయడం ద్వారా పట్టు నిరూపించుకోవాలని గంటా వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టింది. కలకలం రేపిన ఎంపీ లేఖ పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పుడు తన నియోజకవర్గ పరిధిలో ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు తలపెడతారంటూ ఏకంగా కలెక్టర్ ఎన్.యువరాజ్‌కు ఎంపీ ముత్తంశెట్టి నోటీసు ఇచ్చారు. కార్యక్రమాలను అడ్డుకోకపోతే పార్లమెంటులో సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు తెలిసింది. సమావేశాలు జరుగుతున్నప్పుడు రాష్ర్టమంత్రులతో అభివృద్ధి కార్యక్రమాలు తలపెట్టకూడదన్న వాదనపై అయ్యన్న వర్గం విబేధిస్తుంది. అలా అయితే ఎక్కడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగవని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ నెల 27న తలపెట్టిన అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు ఆగబోవని అయ్యన్న వర్గీయులు తేల్చి చెబుతున్నారు.దీంతో ఏర్పాట్లు చేయాలో వద్దో తెలియక అధికారులు తల పట్టుకుంటు న్నారు. -
ఆలయంలో ఆధిపత్య పోరు
తిరుమలలో అన్ని విభాగాల్లోనూ నిర్లక్ష్యం గాడితప్పిన ఆలయ నిర్వహణ మూలాలు పట్టించుకోని అధికారులు పట్టించుకోకపోతే చర్యలు తప్పవంటున్న టీటీడీ ఈవో తిరుమల: భక్తుల కోర్కెలు తీర్చే కోనేటిరాయుని సన్నిధిలో ఆధిపత్య పోరు సాగుతోంది. దీని వల్ల ఆలయ నిర్వహణ గాడితప్పింది. దాదాపుగా అన్ని విభాగాల్లోనూ నిర్లక్ష్యం తాండవిస్తోంది. ఎవరి పనులు వారు చేయకుండా ఆధిపత్యకోసం ఆరాటపడుతున్నారు. దీని ప్రభావం ఆలయ నిర్వహణపై స్పష్టంగా కనిపిస్తోంది. బుధవారం తెల్లవారుజామున బంగారు వాకిలి తాళం మొరాయించడంతో ఈవో నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అంతా అయోమయంలో పడాల్సి వచ్చింది. తిరుమల ఆలయంలో కేవలం ఆలయ విభా గం కాకుండా విజిలెన్స్, ఇంజనీరింగ్, వాటికి అనుబంధ విభాగాలు ఉన్నాయి. అంతర్గతంగా ఆయా విభాగాల్లోనూ, ఇతర విభాగాల మధ్య పెత్తనం సాగుతోంది. చాలామంది అసలు విధులను పక్కన బెట్టి కొసరు పనులపై అధిక దృష్టిసారిస్తున్నారన్న విమర్శలున్నాయి. రోజురోజుకీ ఇలాంటి పరిస్థితి పెరుగుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక పర్వదినాల్లో పైపైన అన్ని విభాగాలు కలసి పనిచేస్తున్నట్టు కనిపించినా అంతర్గతంగా పోరు ఉంది. విభాగాల మధ్యనే కాదు ఒకే విభాగంలో ఉండే పైఅధికారంటే కింది అధికారికి పొసగటం లేదు. ఎవర్ని కదిలించి నా ఒకరిపై ఒకరు ఫిర్యాదుల వర్షం కురిపిస్తుండడం ఇటీవల పెరిగిపోయింది. సమ యం దొరికితే చాలు ఆయా విభాగాల అధికారులు ఈవో, జేఈవో స్థాయిలోని అధికారులకు వారివారి సమస్యలు, ఆధిపత్య పోరు విషయాలను చెబుతుంటారు. మూలాలు పట్టించుకోని విభాగాధిపతులు రోజుకు లక్షమంది భక్తులు వచ్చే ఆలయ నిర్వహణలో సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిపై ఆయా విభాగాధిపతులు పట్టించుకుంటే ఆ సమస్యలు అప్పటికప్పుడే తీరిపోతాయి. అయితే, ఇక్కడి అధికారులు మాత్రం సమస్యల్ని పక్కన పెట్టి ఇతర పెత్తనాల్లో బిజీగా ఉండడం వల్లే సమస్యలు పెరిగిపోతున్నాయి. బుధవారం వేకువజాము కీలకమైన బంగారు వాకిలి (ద్వారం) తాళం మొరాయిం చింది. ఇది యాంత్రికలోపం అయినప్పటికీ.. ఆ సమయంలో శ్రీలంక అధ్యక్షుడితో పాటు ఈవో కూడా ఆలయంలోనే ఉన్నారు. కీలకమైన సమయంలో మొరాయించడం వల్ల ఈవో, జేఈవో నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ హైరానా పడాల్సి వచ్చింది. పట్టించుకోకపోతే చర్యలు తప్పవు : ఈవో బుధవారం ఘటన నేపథ్యలో ఆలయ అధికారులపై టీటీడీ ఈవో సాంబశివరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకోకుండా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా పనిచేయాలన్నారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆలయ నిర్వహణ విషయంలో తానే జోక్యం చేసుకుంటానని చెప్పారు. -
డిప్యూటీ-మాజీ డిప్యూటీ మధ్య రగడ
స్టేషన్లో చిచ్చు డిప్యూటీ-మాజీ డిప్యూటీ మధ్య రగడ సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీలో ఆధిపత్య పోరు అధికారులకుసంకటంగా మారిన పరిస్థితి లింగాలఘణపురం : స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇన్నాళ్లు తమ వెంట ఉండే ద్వితీయ శ్రేణి నాయకులకు రాజకీయ అవకాశాలు కల్పించే విషయంలో వివాదాలు ఉండేవి. తాజాగా ప్రభుత్వ పథకాలు, పరిపాలన అంశాల్లో కూడా పోరు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి పదవి మార్పు తర్వాత తన నియోజకవర్గంలో ఎవరు వేలు పెట్టినా సహించేదిలేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య పదేపదే ప్రకటిస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే ఇటీవల సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ లబ్ధిదారుల విషయంలో ఇదే జరిగింది. వ్యవసాయ శాఖ 50 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను సన్న, చిన్నకారు రైతులకు అందిస్తోంది. ఇటీవల జిల్లాకు 94 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. వ్యవసాయశాఖలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్, మహబూబాబాద్, మరిపెడ, నర్సంపేట, ములుగు, పరకాల, ఏటూరునాగారం డివిజన్లు ఉన్నాయి. గ్రామీణ మండలాలకు సగటున రెండు చొప్పున కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ట్రాక్టరుపై గరిష్టంగా రూ.5 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. నిబంధనల ప్రకారం.. ఆయా గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి సర్పంచ్, ఎంపీటీసీ.. మండల స్థాయిలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, తహశీల్దార్, ఎంపీడీవో, ఏవోల ఆమోదంతో సబ్సిడీ పరికరాల పంపిణీ ప్రాధాన్యత కల్పించాలి. మరో ఉదాహరణ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని మండలాలకు రెండు చొప్పున ట్రాక్టర్లు కేటాయించారు. తనకు దగ్గరగా ఉండే ఒక రైతుకు సబ్సిడీ ట్రాక్టర్ పంపిణీ అయ్యేలా చూడాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సిఫారసు లేఖ ఇచ్చారు. పథకానికి సంబంధించి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నట్లుగా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీడీవోలతోనూ సంతకాలు చేసి ఆమోదం తెలిపారు. ఇక రేపోమాపో ట్రాక్టర్ వచ్చేస్తుందనే ధీమాతో దరఖాస్తు చేసుకున్న రైతు ఓ ట్రాక్టర్ కంపెనీ యజమానిని వెంటబెట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. విషయం తెలిసిన మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే టి.రాజయ్య ఆగ్రహం ఆ దరఖాస్తును వెనక్కి తీసుకరావాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. మాజీ ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మధ్య అధికార యంత్రాంగం బిక్కుబిక్కుమంటున్నారు. ఏం చేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. సబ్సిడీ ట్రాక్టర్లకు సంబంధించి మార్చి 30లోగా లబ్ధిదారుల ఎంపిక చేసి పంపిణీ పూర్తి చేయాలి. ప్రజాప్రతినిధుల సిఫారసులతో తాము ఏం చేసే పరిస్థితి లేదని వ్యవసాయశాఖ అధికారులు వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలోని రైతులకు కనీసం సమాచారం లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేల పైరవీకారులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేయాలని నిర్ణయించిన జాండీర్, సుబోటో, న్యూహోలాండ్, ఎస్కర్ట్ కంపెనీల షోరూం యజమానులకు మాత్రమే ఈ పథకంపై సమాచారం ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఈ సబ్సిడీ ట్రాక్టర్ల పంపిణీ కేటాయింపులో సిఫారసులు చేస్తుండడంతో అర్హులైన ఎందరో రైతులకు ప్రభుత్వ పథకాల గురించి సమాచారం తెలియడం లేదు. దీంతో ప్రభుత్వ పథకాల ఉద్దేశం నెరవేరడం లేదు. -
అధ్యక్షా..!
జిల్లా టీడీపీ పీఠం కోసం హోరాహోరీ టీడీపీ తమ్ముళ్ల వీధిపోరాటాలు గవిరెడ్డి స్థానంలో లాలం కోసం గంటా వ్యూహం ఎదురుదాడికి దిగనున్న అయ్యన్న వర్గం జిల్లా టీడీపీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడు వైఖరిని నిరసిస్తూ కె.కోటపాడులో ఆయన దిష్టిబొమ్మను దహనం చేస్తున్న అదే పార్టీ నాయకులు విశాఖపట్నం: టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి!... మంత్రులు గంటా, అయ్యన్నల తాజా వర్గపోరుకు కేంద్ర బిందువు ఇదీ. ప్రతి అవకాశాన్ని తమ ఆధిపత్య పోరుకు వేదికగా మార్చుకునే మంత్రులు గంటా, అయ్యన్న వర్గాల కన్ను తాజాగా జిల్లా పార్టీ అధ్యక్ష పీఠంపై పడింది. అసలు విషయాన్ని బయటపడనీయకుండా ఇరువర్గాలు సై అంటే సై అంటున్నాయి. మాడుగుల నియోజకవర్గంలో ఇన్చార్జి, జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడుకు సమాచారం లేకుండా మంత్రి గంటా పర్యటన... దాంతో ఆగ్రహించిన గవిరెడ్డి మంత్రి గంటా, డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావులపై విరుచుకపడటం.. గవిరెడ్డికి వ్యతిరేకంగా ఆయన దిష్టిబొమ్మలను అడారి వర్గం దహనం చేయడం... ఇవన్నీ ఆ ఆధిపత్య పోరులోని పరిణామాలే. గవిరెడ్డికి పొగబెడుతున్న గంటా: జిల్లాలో ఎంపీ అవంతితోపాటు నలుగురైదుగురు ఎమ్మెల్యేలు తన వర్గంతో ఉన్నప్పటికీ జిల్లా పార్టీపై పట్టు లేకపోవడం మంత్రి గంటాకు ఇబ్బందికరంగా మారింది. అందుకే ప్రస్తుత జిల్లా పార్టీ అధ్యక్షుడు గవిరెడ్డి రామానాయుడును ఆ పదవి నుంచి సాగనంపాలని ఆయన భావించారు. జెడ్పీ చైర్మన్ లాలం భావాని భర్త భాస్కరరావును జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేయాలన్నది ఉద్దేశం. వాస్తవానికి లాలం భవాని, భాస్కరరావులు మొదటి నుంచి అయ్యన్న వర్గీయులుగానే ఉండేవారు. ఎక్కువమంది ఎమ్మెల్యేలు గంటాకు సన్నిహితంగా ఉండటంతోపాటు భవిష్యత్తు రాజకీయ ప్రయోజనాల దృ ష్ట్యా ఆ భార్యాభర్తలు వ్యూహం మార్చారు. కొంతకాలంగా వారి ద్దరూ మంత్రి గంటాకు సన్నిహితంగా మారారు. ఈ నేపథ్యం లోనే జిల్లా పార్టీ అధ్యక్షుడు రామానాయుడును వివాదాస్పద వ్యక్తిగా ముద్ర వేసేందుకు గంటా వర్గం రంగంలోకి దిగింది. అందుకు విశాఖ డెయిరీ కార్యక్రమాన్ని సాధనంగా చేసుకుంది. మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రామానాయుడుకు కనీస సమాచారం ఇవ్వకుండానే కోటపాడు మండలంలో విశాఖ డెయిరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమానికి మంత్రి గంటా, డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు, జెడ్పీ చైర్మన్ లాలం భవాని, లాలం భాస్కరావు హాజరయ్యారు. తద్వా రా రామానాయుడుకు పార్టీలో ఇబ్బందికర పరిస్థితులు కల్పించారు. గంటా, అడారిలపై గవిరెడ్డి ఫైర్: ఈ పరిణామం సహజంగానే మంత్రి అయ్యన్న వర్గానికి ఆగ్రహం తెప్పించింది. గవిరెడ్డి వెంటనే స్పందించి గంటా,ఆడారిలపై విరుచుకుపడ్డారు. ఆ అదను కోసమే ఎదరుచూస్తున్న గంటా వర్గం కూడా ఎదురుదాడికి దిగింది. అడారి తులసీరావు అనుచరులుగవిరెడ్డికి వ్యతిరేకంగా కె.కోటపాడు మండలంలో గురువారం ధర్నా నిర్వహించారు. ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. గవిరెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. దాంతో వివాదాన్ని రాజేసి తెగేవరకు లాగేందుకు యత్నించారు. అధ్యక్షుడికి మార్చాలని ప్రతిపాదన గంటా వ్యూహం లక్ష్యాన్ని చేరింది. తాజా పరిణామాల ద్వారా గవిరెడ్డి రామానాయుడును తీవ్ర వివాదాస్పద నేతగా మారిపోయారు. దాంతో జిల్లాలో ఓ మంత్రి, ఓ ఎంపీ, కొందరు ఎమ్మెల్యేలకు ఆమోదయోగ్యంకాని నేతగా బయటపడిపోయారు. ఇలాంటి వివాదాస్పద నేత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సరిపోరని గంటా వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేయనుంది. అందుకు అధినేత చంద్రబాబు సమ్మతించగానే లాలం భాస్కరావును జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించాలనే ప్రతిపాదనను తెరపైకి తేవాలన్నది గంటా వర్గం వ్యూహం. మరి దీనిపై అయ్యన్న ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. -
ఉమా vs నాని
టీడీపీలో కొనసాగుతున్న ఆధిపత్య పోరు పరిటాలలో తాజాగా బయటపడిన విభేదాలు పైలాన్ తరలింపు విషయంలో ఇరు వర్గాల ఘర్షణ విజయవాడ : తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతోంది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని), రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వారితో పాటు ఇరు వర్గాల మధ్య కూడా చిచ్చు రేగుతోంది. ఇటీవల ఉమా తీరుపై బహిరంగంగా విమర్శలు చేసిన కేశినేని నానిని సీఎం పిలిపించి మాట్లాడిన విషయం తెలిసిందే. పార్టీలోని అంతర్గత వ్యవహారాలు బయటపెట్టవద్దని వారించి పంపించినట్లు సమాచారం. అయితే, ఇటీవల ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుపై కూడా ఎంపీ కేశినేని నాని కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అంటే మంత్రి ఉమామహేశ్వరరావు ఒక్కరే కాదని, చాలా మంది ప్రజాప్రతినిధులు ఉన్నారని, వారి గురించి కూడా ఆలోచించాలని హితవు పలికారు. టీడీపీలో ఎంతోకాలం నుంచి ఉంటున్నవారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారంటూ అందరినీ కలుపుకొని పోవాలని కోరారు. చాపకింద నీరులా ఉమా తీరు.. మరోపక్క మంత్రి ఉమా వ్యవహారం మాత్రం చాపకింద నీరులా సాగుతోంది. ఎవరెన్ని చెబుతున్నా, సీఎం వద్ద ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా తన పని తాను చేసుకుపోతున్నారు. జిల్లా అధికారులు మంత్రి ఉమా కనుసన్నల్లోనే నడుస్తున్నారు. ఆయన చెప్పిందే వేదంగా భావించి అడుగులు వేస్తున్నారు. దీనిని నానితో పాటు జిల్లాలోని ఇద్దరు మంత్రులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. బీజేపీ నాయకుడు, మంత్రి కామినేని శ్రీనివాసరావు ఇప్పటికే తన శాఖలో జోక్యం చేసుకోవద్దంటూ మంత్రి దేవినేనిని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇక కొల్లు రవీంద్ర కూడా ఇదే పద్ధతుల్లో ఉన్నా ఆయనకు అధికారులు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ సాగుతోంది. పేలుడు ఘటనపై నర్మగర్భంగా వ్యాఖ్యలు... నగరంలోని కేఎల్‌రావు నగర్లో జరిగిన పేలుడులో చనిపోయిన, గాయపడిన కుటుంబాల వారికి సాయం అందజేసేందుకు బుధవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి ఉమా మాట్లాడుతూ గ్యాస్ లీక్ వల్ల ఘటన జరిగినట్లు నిర్ధారణ కాలేదని చెప్పడం గమనార్హం. ఈ ఘటనపై త్వరలోనే నిజాలు వెల్లడవుతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఏదో ఉందనేది ఆయన మాటల్లో నర్మగర్భంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కేశినేని నాని వద్ద కార్గో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తి నివసిస్తున్న ఇంట్లోనే పేలుడు సంభవించినందున ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చనే చర్చ జరుగుతోంది. తాజాగా పరిటాలలో రెండు వర్గాల ఘర్షణ బుధవారం కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో మంత్రి దేవినేని ఉమా, ఎంపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాల వారు తోపులాటలతో బాహాబాహీకి దిగారు. ఆ తరువాత రెండు వర్గాల వారు మాట్లాడుకొని ఎంపీ వర్గీయులే వెనుదిరగాల్సి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు పాదయాత్రకు గుర్తుగా పరిటాలలో ఈ పైలాన్‌ను కేశినేని నాని సొంత ఖర్చులతో నిర్మించి ప్రారంభింపజేశారు. ప్రజలను మరింత ఆకర్షించే ప్రాంతంలో పైలాన్ ఏర్పాటుచేసేందుకు చంద్రబాబు వద్ద నాని అనుమతి తీసుకున్నారు. 65వ నంబరు జాతీయ రహదారి ఆంజనేయస్వామి విగ్రహం వద్ద కూడలి వద్ద పైలాన్‌ను ఏర్పాటు చేసేందుకు బుధవారం పాత ప్రదేశంలో ఉన్న పైలాన్‌ను తరలించేందుకు ఎంపీ వర్గీయులు ప్రయత్నించారు. దీనిని మంత్రి వర్గీయులు అడ్డుకోగా, ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రతి విషయంలోనూ మంత్రిదే పైచేయిగా మారుతోందని ఎంపీ వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి నారాయణపై వ్యతిరేకత మరోవైపు టీడీపీ శ్రేణుల్లో మంత్రి నారాయణపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కార్పొరేట్ రంగం నుంచి పార్టీలోకి వచ్చిన నారాయణను ఏకంగా మంత్రిని చేసి కార్యకర్తలకు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం రాత్రి ప్రాంతంలో గుడివాడలో చోటుచేసుకున్న పరిణామం మంత్రిని సైతం కలవరపరిచింది. 11 గంటల తరువాత గుడివాడవీధుల్లో మంత్రి తనిఖీలు చేశారు. ఇప్పటికి మూడుసార్లు గుడివాడ వచ్చిన నారాయణ పార్టీ ఆఫీసుకు రాకుండా వెళ్లిపోతున్నారని, ఇటువంటి వ్యక్తులకు మంత్రి పదవులిస్తే ఇలాగే ఉంటుందని మండల ముఖ్య నాయకులు కొందరు వ్యాఖ్యానించడం గమనార్హం. సుమారు 50 మంది కార్యకర్తలు నారాయణను నిలదీసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న నారాయణ పార్టీ కార్యాలయానికి అర్ధరాత్రి వెళ్లి కార్యకర్తలకు నచ్చజెప్పి.. అక్కడి నుంచి సర్దుకున్నారు. -
తమ్ముళ్ల అధిపత్య పోరు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు ఫ్లెమింగో ఫెస్టివల్‌కు శాపంగా మారింది. పక్షుల పండగను నియోజకవర్గ అభివృద్ధికి వేదిక చేసుకోవాల్సిన తమ్ముళ్లు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఫెస్టివల్‌కు ఉన్న ప్రాధాన్యతన తగ్గించారనే ప్రచారం జరుగుతోంది. సూళ్లూరుపేటలో శుక్రవారం ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు నారాయణ, పీతల సుజాత, పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అతిథిదులుగా హాజరయ్యారు. అట్టహాసంగా ప్రారంభం కావాల్సిన ఈ వేడుకలు తమ్ముళ్ల మధ్య విభేదాల కారణంగా ‘తుస్సు’ మంది. ఫ్లెమింగో ఫెస్టివల్ ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. తమ్ముళ్ల మధ్య విభేదాలతో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైంది. అప్పటివరకు విద్యార్థులు ఎండలో వేచి ఉండాల్సి వచ్చింది. తీరా మంత్రులు వేదికపైకి చేరుకునేసరికి ప్రాంగణంలో ఉన్న వారంతా వెళ్లిపోయారు. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఏటా జరిగే ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున జనం తరలివస్తారు. అయితే తమ్ముళ్ల విభేదాలను తెలుసుకున్న జనం ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలకు రావటానికి ఆసక్తిచూపలేదని తెలిసింది. అందుకు జనం లేక వెలవెలబోయిన ప్రాంగణమే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే... ప్రారంభోత్సవ సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, మరికొందరు టీడీపీ నేతలకు చురకలంటించారు. వార్డు కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిఫల్చైర్మన్ల పేర్లు చెప్పిన ఎమ్మెల్సీ వాకాటి స్థానిక జెడ్పీటీసీ సభ్యుడు వేనాటి రామచంద్రారెడ్డి పేరు చెప్పలేదు. ఆయన పేరును కూడా చెప్పమని వేదికమీద ఉన్న కొందరు గుర్తుచేసినా.. ‘నాకు తెలుస య్యా.. ప్రత్యేకంగా చెబుతాను’ అని చెప్పి చివర్లో చెప్పకుండానే తన ప్రసంగాన్ని ముగించారు. ఫ్లెక్సీల ఏర్పాట్లలో ముదిరిన వివాదం... ఫ్లెమింగో ఫెస్టివల్‌ల్లో తమ్ముళ్లు తమ ప్రాభవాన్ని పెంచుకునేందుకు పోటీపడుతున్నారు. అందులోభాగంగా సూళ్లూరుపేట మొత్తం ఎటువైపు చూసినా టీడీపీ నేతలు పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలోనే ఎమ్మెల్సీ వాకాటి, జెడ్పీటీసీ సభ్యుడు వేనాటి మధ్య వివాదం తలెత్తిందనే ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా పోటాపోటీగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల ఫొటోలను కలిపేసుకున్నారు. అదేవిధంగా కలెక్టర్ జానకి, ఇటీవల బదిలీ అయిన రేఖారాణి జేసీగా ఫోటోలు ముద్రించి ఉండటం గమనార్హం. వేడుకలు నిర్వహిస్తున్న ప్రాంగణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే విషయంలో ఇరువర్గాలు పోటీపడ్డారు. పండగకు మూడురోజుల ముందు నుంచి ఈ వివాదం నడుస్తుండగా.. గురువారం రాత్రి వారి మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించే పనిలో పండగ నిర్వహణను గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిలో ఓ వర్గానికి ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ మద్దతు పలుకుతున్నారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి నారాయణ తొలుత గంగాప్రసాద్ అతిథిగృహానికి వెళ్లటం వేనాటి వర్గం జీర్ణించుకోలేకపోయింది. మంత్రు లు నేరుగా ప్రభుత్వ అతిథిగృహానికి చేరుకుంటారని జెడ్పీటీసీ సభ్యుడు వేనాటి తన అనుచరులతో భారీ స్వాగతం ఏర్పాటు చేశారు. అయితే మంత్రి నారాయణ ముందుగా గంగాప్రసాద్‌ను కలిసి ప్రభుత్వ అతిథిగృహానికి రావటంతో వేనాటి వర్గం నిరుత్సాహానికి గురయ్యారు. వేనాటి వర్గానికి మంత్రి వార్నింగ్ ఫ్లెక్సీ ఏర్పాట్లలో వేనాటి వర్గం ఎక్కువ చేస్తుందని మరోవర్గం వారు మంత్రికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో మంత్రి నారాయణ జెడ్పీటీసీ సభ్యుడు వేనాటి కుమారుడు సుమంత్‌రెడ్డిని పిలిపించుకుని కారులో కూర్చొబెట్టి తీవ్రంగా హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. ‘పార్టీలో ఉండాలనుకునే వారు ఉండండి.. లేదంటే వెళ్లిపొండి’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడినట్లు టీడీపీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే టీడీపీ నేతల మధ్య వివాదాలు ఫ్లెమింగో ఫెస్టివల్‌కు శాపంగా మారిందని విహం గ వీక్షకులు తిట్టుకుంటూ వెళ్లటం కనిపించింది. -
చిత్తూరు టీడీపీలో బ్యానర్ల రగడ..!
నిన్న నాని బ్యానర్లపై ఇంకు చల్లారు నేడు మేయర్ బ్యానర్ల చించివేత తెలుగు తమ్ముళ్ల మధ్య ఆధిపత్య పోరు చిత్తూరు (అర్బన్): చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు రోజు రోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఒక్కసారిగా బట్టబయలైంది. పైకి ఒకరినొకరు పలకరించుకున్నా లోలోపల మాత్రం ఒకరితో ఒకరికి పొసగడం లేదు. ఫలితంగా నేతలు బ్యానర్లను చించుకునే వరకు వచ్చారు. నగరంలోని ఎంజీఆర్ వీధిలో మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్‌కు సంబంధించిన ఫ్లెక్సీ బ్యానర్‌ను బుధవారం చించివేశారు. ఇది ముమ్మాటికీ పార్టీలోని తమ ప్రత్యర్థి వర్గం చేసిన పనేనంటూ మేయర్ అనుచరులు బహిరంగంగానే చెబుతున్నారు. నెల రోజుల క్రితం చిత్తూరు నగరంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పులి వర్తి నాని జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన అనుచరులు నగరంలో పెద్దఎత్తున ఫెక్ల్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిని సహించలేని అదే పార్టీలోని కొందరు వ్యక్తులు గాంధీ విగ్రహం వద్ద ఉన్న నాని డిజిటల్ ఫ్లెక్సీపై ఇంకు చల్లారు. పక్కనే ఉన్న మరో బ్యానర్‌ను చించివేశారు. దీనిపై టీడీపీలోని ఇరువర్గాల నాయకుల్లో అం తర్గత విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. అప్పట్లో ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావించినప్పటికీ పార్టీలోని పెద్దలు సర్దుబాటు చేశారు. అయితే బుధవారం కార్పొరేషన్ మేయర్ అనురాధ, ఆమె భర్త మోహన్‌కు సంబంధించి డిజిటల్ ఫ్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. దీనిపై మేయర్ వర్గం గుర్రుగా ఉంది. చిత్తూరు నగరంలో ఎమ్మార్పీకే మద్యం అమ్మాలని రెండు రోజుల క్రితం ఎక్సైజ్ ఈఎస్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. మద్యం విక్రయాల్లో టీడీపీ నాయకుల సిండికేట్ ఉండటంతో పార్టీలోని ఓ వర్గం వ్యక్తులు ఇలా ఫ్లెక్సీ బోర్డులను చించేశారని మేయర్ వర్గం ఆరోపిస్తోంది. దీనికి తోడు చిత్తూరు నగరంలో నిషేధిత లాటరీ టికెట్ల విక్రయాలను అరికట్టడానికి పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజే మేయర్ దంపతుల ఫ్లెక్సీను చించివేయడం టీడీపీ అంతర్గత కుమ్ములాటను బహిర్గతం చేసినట్టయింది -
నామినేటెడ్ కోసం... ఆధిపత్య పోరు
ముఖ్య నేతల చుట్టూ తెలుగు తమ్ముళ్ల ప్రదక్షిణలు కీలక పోస్టులపై కన్ను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం నామినేటెడ్ పదవుల భర్తీలో టీడీపీ ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. తమ వర్గం వారికే పదవులు ఇప్పించుకోవాలని ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పదవులు ఆశిస్తున్న తెలుగు తమ్ముళ్లు సిఫార్సుల కోసం తమకు అనుకూలంగా ఉండే నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విజయవాడ : గత పదేళ్లుగా అధికారానికి దూరమైన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు నామినేటెడ్ పోస్టులపై దృష్టిసారిస్తున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయించాలని ఆ పార్టీ నేతలు స్థానిక ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర సదస్సులో చంద్రబాబు పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ హయాంలో ఉన్న వివిధ కమిటీలను రద్దు చేయడంతో ద్వితీయ శ్రేణి నేతలు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు. జిల్లాలో రెండు కీలకమైన చైర్మన్ పదవులు ఉండేవి. ఉడా రద్దు కావడంతో వీజీటీఎం పాలకవర్గం పోస్టులు పోయాయి. దీంతో ప్రస్తుతం నేతలంతా దుర్గగుడి, మార్కెట్ యార్డు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులపై దృష్టి సారించారు. సీఎం దృష్టికి సిఫార్సులు తీసుకెళ్లే యత్నాల్లో ఉన్నారు. దుర్గగుడి చైర్మన్ పదవి కోసం యత్నాలు.. . కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సిఫార్సు మేరకు విజయవాడకు చెందిన బీజేపీ నేత వీరమాచినేని రంగప్రసాద్‌కు దుర్గగుడి చైర్మన్ పదవి ఇస్తారని జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పటివరకు చంద్రబాబు నుంచి ఆ మేరకు గ్రీన్ సిగ్నల్ రాక పోవడంతో టీడీపీ నేతలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ నగర ఉపాధ్యక్షుడు ముష్టి శ్రీనివాస్, సీనియర్ నేతలు యలమంచిలి గౌరంగబాబు, గుడిపాటి పద్మశేఖర్ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురికి ఎంపీ కేశినేని శ్రీనివాస్ ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోపక్క మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గరిమెళ్ల నానయ్య చౌదరి పేరు సిఫార్సు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేతలంతా తమ శక్తి మేరకు రాష్ట్రస్థాయిలో పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఎంపీ, ఎమ్మెల్యేల సిఫార్సులతో జిల్లాలో ముఖ్య దేవాలయాల పాలక మండళ్ల పదవులు దక్కించుకునే ప్రయత్నాలు మరికొంతమంది నేతలు చేస్తున్నారు. మార్కెట్‌యార్డు చైర్మన్ పదవుల కోసం పోటాపోటీ మార్కెట్ యార్డు చైర్మన్ పదవులపై అనేక మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఆయా పదవులు దక్కించుకునేందుకు తమకు సన్నిహితంగా ఉండే ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయిస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉండేవారికి నామినేటెడ్ పదవులు ఇప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన మాట నెగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నందిగామలో కేవీ సాంబశివరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావు (బుజ్జి)లలో ఒకరికి ఇవ్వాలని మంత్రి సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. మైలవరంలో విషయంలో ఆయన పూర్తి గుమ్మటంగా ఉన్నప్పటికీ రాయల లీలాప్రసాద్‌కు సిఫార్సు చేయవచ్చని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ పదవిపై ఉమా అనుచరులు మరికొందరు కూడా కన్నేశారు. తిరువూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి కొరివి రామారావు, తాళ్లూరు రామారావుల పేర్లు ఎంపీ కేశినేని నాని సిఫార్సు చేయగా, ఆళ్లవాళ్ల రమేష్ రెడ్డి పేరు మంత్రి ఉమా సిఫార్సు చేస్తున్నారని సమాచారం. జగ్గయ్యపేట మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కోసం చంద్రబాబు సొంత సామాజిక వర్గంలోనే ఆధిపత్య పోరు జరుగుతోంది. ఈ పదవి కోసం మల్లెల గాంధీ, నరిసింహారావుతో పాటు మరో ఇద్దరు పోటీ పడుతున్నట్లు తెలిసింది. బందరు పరిధిలో నేతల చుట్టూ ప్రదక్షిణలు... బందరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు ఎవరికివారు తమ వర్గం వారికి నామినేటెడ్ పదవులు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బందరుకు చెందిన ఒక మాజీ చైర్మన్ తాను ముగ్గురినీ ఒప్పించగలనంటూ కొంతమంది ద్వితీయశ్రేణి నేతల వద్ద డబ్బులు దండుకుంటున్నారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పోస్టులకు పేర్ల సిఫార్సు విషయంలో ముగ్గురు నేతలు గుమ్మటంగానే ఉన్నారు. దీంతో నేతలంతా స్థానిక ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
గీత + రామకృష్ణ
సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. మున్సిపాల్టీలో తన మాటే చెల్లుబాటు కావాలనే ధోరణిలో ఎమ్మెల్యే, మున్సిపాల్టీలో ఆమె పెత్తనమేంటనే ఆలోచనలో చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తీవ్రస్థాయిలో విభేదించుకుంటున్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ కమిషనర్ చాంబర్లో బుధవారం జరిగిన సమావేశమే అందుకు సాక్ష్యమని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. జరుగుతున్న పరిణామాలను తట్టుకోలేకనే అత్త మీద కోపం దుత్త మీద చూపించారన్న సామెత చందంగా ఎమ్మెల్యేపై ఉన్న కోపాన్ని 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామారావుపై చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ప్రదర్శించారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మీసాల గీత, మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ మధ్య తొలి నుంచి అభిప్రాయ భేదాలు కొనసాగుతున్నాయి.దీంతో కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఎవరికి వారు తమ వ్యవహారాలను చక్క బెట్టుకుంటున్నారు. అయితే ఎమ్మెల్యే గీత మాత్రం కాస్త వెనక్కి తగ్గారు.. మున్సిపాల్టీలో పెద్దగా జోక్యం చేసు కోలేదు. విజయనగరం మండలమే తన నియోజకవర్గంగా పరిమితమైపోయారు. ఈ విషయాన్ని అంగీకరించేలా ఆమె బుధవారం మున్సిపల్ కమిషనర్ చాంబర్లో జరిగిన సమావేశంలో మీసాల వ్యాఖ్యలు చేశారు. విజయనగరం నియోజకవర్గంలో మండలం 25 శాతమేనని, మిగతా 75శాతం మున్సిపాల్టీయేనని, నియోజకవర్గ ప్రజల్ని పట్టించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే సమావేశమంతా వాడీవేడీగా సాగింది. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్నీ తలపెట్టలేదు, పట్టణమంతా రెండు నెలలుగా అంధకారంలో ఉన్నా పట్టించుకోలేదు, పారిశుద్ధ్య నిర్వహణ బాగోలేదు, కొత్త పనులెందుకు ప్రారంభించలేదు ? ఎస్సీ, ఎస్టీ రుణ లబ్ధిదారుల ఎంపిక విషయమై నాకెందుకు చెప్పలేదు ? అంటూ కమిషనర్ సహా ఇతర అధికారులను గట్టిగా నిలదీశారు. పరోక్షంగా చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ పనితీరును ప్రశ్నించినట్టు మాట్లాడారు. ఈ సమయంలో చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఆమె పక్కనే దిగాలుగా, దీర్ఘాలోచనతో ఆద్యంతం కూర్చున్నారు. ‘ఇకపై ఏ పని జరిగినా చెప్పే చేయాలి., ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు.’ అంటూ అందర్ని ఉద్దేశించి ఆమె హెచ్చరించారు. అయితే, ఆకస్మికంగా ఇలా ఎమ్మెల్యే మాట్లాడడం వెనుక ఏదో వ్యూహం ఉందనే వాదన విన్పిస్తోంది. మున్సిపాల్టీలో జోక్యం చేసుకోకపోవడం వల్లే తననెవరూ గుర్తించడం లేదని, ఇలాగే వదిలేస్తే ఎమ్మెల్యేనన్న విషయాన్ని మరిచిపోతారని, ప్రసాదుల రామకృష్ణదే హవా అనే వాదన ప్రజల్లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే అకస్మాత్తుగా ఎమ్మెల్యే గీత సీరియస్‌గా స్పందించినట్టు తెలుస్తోంది. అసలు కారణం ఏంటంటే..? ఎమ్మెల్యే గీత ఒక్కసారిగా సీరియస్ అవ్వడానికి వేరే కారణం ఉన్నట్లు తెలుస్తోంది. మిమ్స్ వ్యర్థ జలాలు పట్టణానికి రక్షిత మంచినీరిందించే ట్యాంకుల్లో కలుస్తున్నా పట్టించుకోవడం లేదన్న విషయంలో అటు ఎమ్మెల్యే, ఇటు మున్సిపల్ చైర్మన్ మధ్య వివాదం నెలకొన్నట్లు తెలిసింది. ఈ విషయంలో ఎమ్మెల్యేపై చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ తనదైన శైలిలో స్పందించినట్టు సమాచారం. దీంతో ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని ఎమ్మెల్యే భావించి... హుటాహుటిన మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి తమ పవరేంటో తెలియజేసే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. మొత్తానికి ఎమ్మెల్యే బుధవారం నిర్వహించిన సమావేశంతో చైర్మన్ అసంతృప్తికి గురైనట్టు తెలిసింది. ఇదే సమయంలో ‘వీధి లైట్లు వెలగడం లేదని, పనిచేసేవాళ్లు తక్కువ, జీతాలు తీసుకున్నోళ్లు ఎక్కువని, వార్డులో పనులు జరగడం లేదని, జీతాలు బిల్లును తిరస్కరించాలని మున్సిపాల్టీలో తీర్మానం చేస్తే ఆ తర్వాత ఆమోదించేశారు.’ అని 24వ వార్డు కౌన్సిలర్ రొంగలి రామరావు ప్రశ్నించగా చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ కోపోద్రిక్తులయ్యారు. అటు ఎమ్మెల్యే, ఇటు అధికారుల సమక్షంలోనే ‘ నీ అంతు చూస్తానంటూ రొంగలి రామారావుపై విరుచుకుపడ్డారు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను...ఎవరు అడుగుతారో చూస్తానంటూ... ఘాటుగా స్పందించారు. దీంతో కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ వ్యాఖ్యలన్నీ పరోక్షంగా ఎమ్మెల్యేనుద్దేశించి మాట్లాడారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కాగా, తనను అంతు చూస్తానని చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ అన్నారని, తనకు ప్రాణ భయం ఉందని, ఈ విషయాన్ని అశోక్ గజపతిరాజుతో పాటు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని ‘సాక్షి ప్రతినిధి’కి ఫోన్ చేసి రొంగలి రామారావు చెప్పారు. -
మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య ఆధిపత్య పోరు
అమలాపురం :మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీల మధ్య అమలాపురం నియోజకవర్గంలో నెలకొన్న ఆధిపత్య పోరు మరింత ముదిరింది. ఫ్లెక్సీల ఏర్పాటుతో మొదలైన వివాదం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (ఆల్డా) చైర్మన్ యాళ్ల దొరబాబుల మధ్య ఉన్న ఆధిపత్య పోరు పార్టీ కార్యకర్తల వరకూ విస్తరించింది. తమకు అనుకూలంగా వ్యవహరించలేదనే కారణంగా అధికారపార్టీ నాయకులు అల్లవరం ఎస్సైపై బదిలీ వేటు వేయించగా, దీనిపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం వంటి పరిణామాలతో మిత్రభేదం మరింత తీవ్రతరమైంది.అల్లవరం మండలం బెండమూర్లంకకు చెందిన దొరబాబు ఇటీవల బీజేపీలో చేరారు. ఇందుకు మద్దతు తెలుపుతూ దొరబాబు అనుచరులు కొమరగిరిపట్నం సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా వాటిని తొలగించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఫ్లెక్సీల వ్యవహారంలో ఎమ్మెల్యే ఆనందరావు, దొరబాబు వ్యక్తిగత పట్టుదలలకు పోవడంతో అది కాస్తా రెండు పార్టీల కార్యకర్తలు ఒకరిని ఒకరు సవాలు చేసుకునేందుకు దారి తీసింది. ఫ్లెక్సీల ఏర్పాటుకు అనుమతి ఉందని పోలీసులు తొలగింపునకు వెనకడుగు వేయగా, టీడీపీ నేతలే వాటిని తొలగించారు. ఈ నేపథ్యంలో అల్లవరం ఎస్సై రాజేష్‌కుమార్‌ను జిల్లాలో కొత్తగా చేరిన మోతుగూడెం స్టేషన్‌కు బదిలీ చేశారు. హడావిడిగా జరిగిన ఈ బదిలీకి ఫ్లెక్సీ వివాదంలో తమకు అనుకూలంగా వ్యవహరించలేదన్న అధికారపార్టీ నేతల కక్షసాధించే కారణమని బీజేపీ వారు భావిస్తున్నారు. బీజేపీని అణచాలని చూస్తున్నారు.. ఎమ్మెల్యే ఆనందరావు తీరుపై జిల్లా బీజేపీ నాయకులు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని శనివారం భీమవరంలో కలిసి ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీల విషయంలో ఆనందరావు బీజేపీ నాయకుల పట్ల వ్యవహరించిన తీరు, కార్యకర్తలపై కేసులు పెట్టించడం వంటి విషయాలను దొరబాబు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వి.నాయుడు తదితరులు కేంద్ర మంత్రికి వివరించారు. మిత్రపక్షమై ఉండీ ఎమ్మెల్యే తమను శత్రువులుగా చూస్తున్నారని నిరసించారు. మోదీ ఫొటో ఉన్న ఫ్లెక్సీలను ధ్వంసం చేయడమే కాక గ్రామంలో బీజేపీకి క్యాడర్ లేకుండా చేసేం దుకు, పార్టీని ఎదగనివ్వకుండా అణచేసేందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ దుశ్చర్యలను అడ్డుకున్నందుకే ఎస్సైకి అన్యాయంగా బదిలీ చేశారని చెప్పారు. జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో, ఫోటోలను అందజేశారు. ఎమ్మెల్యే ప్రత్యేకించి ఓ సామాజికవర్గాన్ని కించపరిచేలా మాట్లాడారని ఆరోపించారు. తాము చెప్పిన దానిపై టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని వెంకయ్యనాయుడు హామీ ఇచ్చినట్టు ఆల్డా చైర్మన్ దొరబాబు స్థానిక విలేకరులకు తెలిపారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ ఫిషర్మెన్ సెల్ కన్వీనర్ కర్రి చిట్టిబాబు, యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, మత్స్యకార సంఘ నాయకుడు మల్లాడి హనుమంతరావు, పార్టీ నాయకులు పాలూరి సత్యానందం, బసవా చినబాబు, బసవా సింహాద్రి ఉన్నారు. రగడను పట్టించుకోని రాజప్ప మిత్రుల మధ్య రగులుతున్న చిచ్చును చల్లార్చేందుకు టీడీపీ జిల్లా నాయకులు కనీసంగా ప్రయత్నించకపోవడం గమనార్హం. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గమైన అమలాపురంలో బీజేపీ, టీడీపీ నేతలు ఆధిపత్య పోరుకు దిగుతున్నా ఆయన జోక్యం చేసుకోకపోవడం క్యాడర్‌ను విస్మయానికి గురి చేస్తోంది.