gold mine collapse
-
ఘోరం: సూడాన్‌లో బంగారు గని కూలి 38 మంది మృతి
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ కోర్డోఫాన్ ప్రావిన్స్‌లో బంగారు గని కూలిపోవడంతో 38 మంది మరణించారు. ప్రమాదంలో మరో 8 మంది వరకు గాయపడ్డారని, వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు సూడాన్ ప్రభుత్వ మినరల్ రిసోర్సెస్ కంపెనీ తెలిపింది. సూడాన్ రాజధాని ఖార్టూమ్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుజా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అయితే ఈ గనిని గత కొంతకాలం క్రితమే ప్రభుత్వం మూసివేసింది. సూడాన్ ప్రభుత్వం గనుల్లో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడమే వరుస ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా, సూడాన్ దేశం 2020లో సుమారు 36.6 టన్నుల బంగారాన్ని వెలికితీసింది. -
బంగారు గని కూలి 12 మంది మృతి
జకర్తా: ఇండోనేసియాలో అక్రమ తవ్వకాలు జరుపుతుండగా బంగారు గని కూలడంతో కనీసం 12 మంది మరణించారు. మంగళవారం జావా ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మరణించవారందరూ మైనర్లు. భద్రత చర్యలు తీసుకోకపోవడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. గని కూలడంతో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయి ఉంటారని తెలిపారు. 10 నుంచి 30 మీటర్ల లోతున కూరుకుపోయినట్టు చెప్పారు. నెల రోజుల క్రితం స్థానిక యంత్రాంగం ఈ గనిని మూసివేసింది. అయితే మైనర్లు అక్రమంగా తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదం జరిగింది. -
బంగారు గనిలో ప్రమాదం: 12 మంది మృతి
జకర్తా: బంగారు గనిలో జరిగిన ప్రమాదంలో 12 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటన ఇండోనేషియా పశ్చిమ భాగంలోని జావా ప్రాంతంలో చోటుచేసుకుంది. బోగోర్ జిల్లాలో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కారణాలు తెలియరాలేదని ఓ పోలీస్ అధికారి ఉజ్వల్ ప్రాణ సిగిత్ తెలిపారు. బంగారు గనిలో తవ్వకాలు జరుపుతుండగా మట్టిపెళ్లలు కూలిపడటంతో ఊపిరాడక 12 మంది మృతిచెందారు. అయితే, అక్కడ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని గత నెలలో మైనింగ్ జరుగుతున్న గనిని ప్రభుత్వం మూసివేసిన విషయం విదితమే. కానీ, కొందరు మైనర్ బాలురు ఇందులో అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారు. మృతిచెందిన వారిలో మైనర్లు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.