200 ఉద్యోగాల భర్తీని నేడు జాబ్మేళా
వరంగల్ : దివ్య శ్రీ రియలటర్స్ (ప్రైయివేట్)లిమిటెడ్ సంస్దలో 200 ఉద్యోగాల భర్తీ కి ఈనెల 22 వ తేదీన జాబ్మేళా నిర్వహించనున్నట్టు వరంగల్ రూరల్ జిల్లా ఉపాధి అధికారి వి.నిరూపమ తెలిపారు. వరంగల్ ములుగు రోడ్ లోని ప్రభుత్వ ఐ.టి.ఐ. ఆవరణ లోని వరంగల్ రూరల్ జిల్లా ఉపాధి అధికారి కార్యాలయంలో ఈ జాబ్మేళా జరగనుంది. సేల్స్ ఎగ్జిక్యూటీవ్లు,టీం లీడర్ ఉద్యోగాలకు 200 మంది అభ్యర్దులు కావాలని ఆమె సూచించారు. అభ్యర్దులు 10 వతరగతి ఉత్తీర్ణులై,18–25 సంవత్సరాల వయస్సు కలిగిన పురుష అభ్యర్దులు అర్హులని ఆమె తెలిపారు.
జీతం 10,000 రుపాయలతో పాటు,వసతి తో కలిపి చెల్లిస్తారని వి.నిరూపమ సూచించారు. అభ్యర్దులు హైదరాబాద్ లో పనిచేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఎంపికైన అభ్యర్దులకు వససతి కల్పనతో పాటు, ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారని ఆమె సూచించారు.ఆసక్తి ,అర్హత కలిగిన అభ్యర్దులు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లు ,బయోడేటా తో ఈ నెల 22 వతేది ఉదయం 10.30గంటలకు నిర్వహించే జాబ్మేళా కు హజరుకావాలని జిల్లా ఉపాధి అధికారి వి.నిరూపమ కోరారు. మిగతా వివరాలకు 0870–2427146 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని ఆమె సూచించారు.