Harish Rao
-
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ కామెంట్
సాక్షి, హైదరాబాద్: దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని కాంగ్రెస్ పార్టీ...దేశంలో ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేతగానీ, అసమర్థత కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు.ఈ మేరకు ఎక్స్‌లో కేటీఆర్ స్పందిస్తూ.. ‘ప్రాంతీయ పార్టీల కృషిని విస్మరిస్తూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి నీ స్పీచ్‌లు, బ్యాగులు, ఛాపర్లు కూడా మీ పార్టీని ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయి. ఆయన అసత్య ప్రచారాన్ని మరాఠా ప్రజలు నమ్మలేదుఇకనైనా తెలంగాణలో గెలిపించి ప్రజల కోసం.. వాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చటం కోసం పనిచేయాలి. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుపై దృష్టి పెట్టాలి. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనే కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు.. బీజేపీ తక్కువ కాదు’అని కేటీఆర్ పేర్కొన్నారు.హేమంత్ సోరేన్ కు శుభాకాంక్షలు: హరీష్ రావు‘మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యింది. ెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు. తెలంగాణలో మహిళలకు ₹ 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో రూ.3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపెట్టాయి. తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబై, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్ర లో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టం. బీజేపీ పార్టీ.. హేమంత్ సోరేన్ పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలని ప్రజలు హర్శించడం లేదని తేలిపోయింది. విజయం సాధించిన హేమంత్ సోరేన్ కు శుభాకాంక్షలు.’ అని తెలిపారు -
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసింది
-
ఎనుముల కాదు.. ‘ఎగవేతల’ రేవంత్‌రెడ్డి: హరీష్‌రావు సెటైర్లు
సాక్షి, ఖమ్మం జిల్లా: చింతకాని మండలంలోని మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్ పర్యటించారు. భూ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడిన బోజెడ్ల ప్రభాకర్‌రావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సభలో హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్పు వచ్చిందని.. అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోయాయన్నారు.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసింది. ఆరు లక్షల తులాల బంగారం కళ్యాణలక్ష్మీకి బాకీ పడింది. భద్రాద్రి రాములోరి సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. పాలకుడే మాట తప్పితే.. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ఈ ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకున్నా.. కాంగ్రెస్‌లో పనిచేసేది తక్కువ.. లొల్లి మాత్రం ఎక్కువ’’ అంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు.‘‘ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చారు.. అమలు చేశారా?. ఏడాది పాలనలో ఆత్మ విమర్శలు చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు కేసీఆర్ రైతుబంధు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అమలు చేయని మోసపూరిత పార్టీ కాంగ్రెస్. ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి.’’ అంటూ హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‘‘లచ్చగూడెంలో విద్యుత్ షాక్‌తో మరణించిన ప్రసాద్ అనే రైతుకు ఎక్స్‌గ్రేషియా అడిగినందుకు అక్రమ కేసులు బనాయించారు. అక్రమంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు పెడితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా పనిచేపిస్తాం. అధికారం చేపట్టిన దగ్గర నుంచి అవ్వతాతలకు 4 వేల పెన్షన్ ఇవ్వాల్సిందే’’ అని హరీష్‌రావు డిమాండ్ చేశారు. -
బోనస్‌ను బోగస్ చేసిన కాంగ్రెస్ సర్కార్: హరీష్ రావు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు సాయం చేయలేని ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒక్కటేనని ఘాటు విమర్శలు చేశారు. అలాగే, ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు గురువారం ఉదయం ఖమ్మంలోని పత్తి మార్కెట్‌ను సందర్శించారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లో ఒకటి ఖమ్మం పత్తి మార్కెట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్‌ను బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం మద్దతు ధర వచ్చే పరిస్థితి కూడా లేదు.మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారం రూ.6,500 మద్దతు ధర దాటడం లేదు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీసం మద్దతు ధరకు కూడా పండించలేని పరిస్థితి ఉంది. రూ.500 బోనస్ దేవుడే ఎరుగు, కానీ మద్దతు ధరకు వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నారు. రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది?. రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, ఏ ఒక్క వర్గాన్నీ ఆదుకోలేదు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పత్తి మద్దతు ధర రూ.7,500 ఉండాల్సి ఉండగా, కేవలం రూ.6,500 మాత్రమే రైతులకు అందిస్తున్నారు. ఇవి మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఇచ్చిన లెక్కలే. ఖమ్మం పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి.శంకర్ రమాదేవి అనే రైతులు ఎనిమిది ఎకరాల్లో పత్తి పండిస్తే, కనీసం ఐదు క్వింటాళ్ల పంట కూడా రాలేదని, వచ్చిన దానికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో రూ.11,000కు పత్తి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు సగానికి సగం పత్తి ధర పడిపోయింది? ఇది దళారుల దోపిడీ వల్లే. రూ.7,520 మద్దతు ధరను పత్తి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు కనీసం రూ.500 బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దళారులు రూ.6,500కు పత్తి కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రాలకు రూ.7,500కు అమ్ముతున్నారు.మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింది. గత సంవత్సరం రూ.23,000 మద్దతు ధర వస్తే, ఈసారి రూ.13,000 కూడా రావడం లేదు. మాయమాటలు చెప్పి రైతులను నట్టేట ముంచడం మంచిది కాదు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. రూ.15,000 రైతు భరోసాను ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. రూ.15,000 కౌలు రైతులకు ఇస్తామని ఇవ్వలేదు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.ఒకరిపై ఒకరు పైచేయి కోసం పాకులాటమే తప్ప, ప్రజా సమస్యల కోసం పనిచేయడం లేదు. నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు ఖమ్మం జిల్లాలో పండితే, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఒక రైతుకైనా వడ్లకు బోనస్ వచ్చిందా?. సకాలంలో మిల్లులు అనుసంధానం చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం దళారుల పాలైంది. సీసీఐ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్టామని చెబుతున్నా, వాస్తవానికి సీసీఐ కేంద్రాలు కనబడటం లేదు.ముఖ్యమంత్రి పత్తి కొనుగోలుపై సమీక్ష చేయడం లేదు. మద్యం అమ్మకాలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.. కానీ పత్తి, వరి కొనుగోళ్లపై సమీక్ష ఎందుకు చేయడం లేదు. మద్దతు ధరకు ధాన్యం కొనకపోతే, ఎవరికీ మెమోలు జారీ చేయడం లేదు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారేమో?. ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్ని రకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు. -
దమ్ముంటే కబ్జా నిరూపించు..: హరీశ్‌రావు
వట్పల్లి (అందోల్): రంగనాయక్ సాగర్ వద్ద ఇరిగేషన్ భూములను తాను ఆక్రమించలేదని, రైతుల వద్ద 13 ఎకరాల పట్టా భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు చెప్పారు. దమ్ముంటే కబ్జాలను నిరూపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. గురువారం అందోల్ మండల పరిధిలోని మాసాన్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు విలేకరులతో మాట్లాడారు. పేదల భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేసే అలవాటు తమకు లేదని, అటువంటి చరిత్ర రేవంత్దేనన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించగా, పౌరసరఫరాల శాఖ కమిషనర్ మాత్రం 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారని, దీంతో మిగతా 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దళారుల పాలైందని అన్నారు. ఈ సీజన్లో 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే పరిస్థితిలేదన్నారు. బోనస్ మాట దేవుడెరుగు మద్దతు ధర కంటే రూ.500 తక్కువకు రైతులు ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యం అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత, గిరిజనుల భుములను కంపెనీల పేరుమీద కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ ప్రశ్నించేవారి గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలు జరిగేదాకా కేసీఆర్ నాయకత్వంలో ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, టీజీటీపీసీ మాజీ చైర్మన్ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
హరీశ్‌రావు కొన్న భూములపై విచారణ: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ దగ్గర రైతులను బెదిరించి అప్పటి మంత్రి హరీశ్‌రావు భూములు కొనుగోలు చేశారని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ రిజర్వాయర్ కోసం తొలుత భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేశారని.. దీనివల్ల రైతుల భూములు పోతాయని బెదిరించి హరీశ్ ఆ భూములు కొన్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. హరీశ్ భూములు కొన్నాక భూసేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేశారని దుయ్యబట్టారు. రైతుల నుంచి చట్టబద్ధంగా భూములు కొన్నానని... ధరణిలో రికార్డు కోసం ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లాలని చెబుతున్న హరీశ్‌రావు.. భూసేకరణ నోటిఫికేషన్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించట్లేదని పొంగులేటి ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్‌లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో పొంగులేటి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఒకసారి నోటిఫికేషన్ జారీ అయ్యాక దాన్ని రద్దు చేయలేరని.. గతంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ శివార్లలో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ ఇప్పటికీ మనుగడలో ఉందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆరెస్టు చేయట్లేదంటూ ప్రశ్నిస్తున్న కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి.. అందుకు వీలుగా గవర్నర్ చేత అనుమతి ఇప్పించాలని సూచించారు. పక్కా ఆధారాలతోనే ముందుకు వెళ్తున్నామని, తొందరపడి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన తమకు లేదని మంత్రి చెప్పారు. డిసెంబర్ 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 9 నుంచి ప్రారంభం అవుతాయని మంత్రి పొంగులేటి చెప్పారు. ఈ సమావేశాల్లో రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) చట్టాన్ని తీసుకొస్తామన్నారు. అలాగే కులగణన, రైతు రుణమాఫీ, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలను చర్చించే అవకాశం ఉందని చెప్పారు. డిసెంబర్ 9న అసెంబ్లీ సమావేశాల అనంతరం సచివాలయంలో తెలుగుతల్లి విగ్రహావిష్కరణ, సోనియాగా>ంధీ జన్మదిన వేడుకలతోపాటు బహిరంగ సభను నిర్వహించనున్నట్లు వివరించారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌తో నాటి ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందంతోపాటు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి జస్టిస్ మదన్ బి. లోకూర్ ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చర్చంచనున్నట్లు సమాచారం. కేంద్రం స్పష్టత ఇస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం.. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు కాస్త అస్పష్టంగా ఉన్నాయని, వాటిపై స్పష్టత కోరుతున్నామని మంత్రి పొంగులేటి చెప్పారు. కేంద్రం నుంచి స్పష్టత వస్తే ఇందిరమ్మ ఇళ్లలో వేగం పెరుగుతుందన్నారు. ఒకసారి లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైతే పథకం వేగం పుంజుకుంటుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. మంత్రివర్గ విస్తరణ! మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాల తర్వాత రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. మంత్రులుగా ఎవరెవరికి అవకాశం ఉంటుందన్న ప్రశ్నకు ఆయన నేరుగా స్పందించలేదు. తాను మంత్రిని మాత్రమేనని, మంత్రి పదవులు ఇప్పించే స్థాయిలో లేనని వ్యాఖ్యానించారు. -
ఇరిగేషన్ భూములు కబ్జా చేశానని నాపై తప్పుడు ఆరోపణలు: హరీష్
-
కబ్జాల చరిత్ర రేవంత్ రెడ్డిదే: హరీష్ రావు
సాక్షి, సంగారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. భూ కబ్జాలకు పాల్పడుతున్నానంటూ సీఎం రేవంత్ తప్పుడు ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు. బ్లాక్మెయిల్ రాజకీయాలకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపుతున్నాడని, కబ్జాల చరిత్ర ఆయనదేనని మండిపడ్డారు. గురువారం అందోల్ మండలం మాసాన్‌పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని తనపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశారని మండిపడ్డారు.పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీదని ధ్వజమెత్తారు. రైతుల పట్టా భూములను ధరణి ద్వారా13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వివరించారు. ఒక గుంట కానీ, ఒక ఎకరా కానీ ఇరిగేషన్ భూమి కానీ, ప్రభుత్వ భూమి కానీ తీసుకున్నట్టు నా చరిత్రలో లేదని స్పష్టం చేశారు. ఏ భూమిని అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ భూమిలోనే ఉన్నానని, రంగనాయకసాగర్ దగ్గరికి రా.. కలిసి భూమిని కొలుద్దామని సవాల్ విసిరారుజ‘నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు రేవంత్ రెడ్డి.. నీ సమక్షంలోనే సర్వే చేద్దాం. నువ్వు ఎన్ని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసినా భయపడేది లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రేవంత్ రెడ్డి రైతులకు తొమ్మిది హామీలను అమలు చేస్తామని ప్రకటించారు. ఇందులో ఏ ఒక్క హామీనైనా నెరవేర్చగలిగాడా?’ అని ప్రశ్నించారు. -
ప్రభుత్వ స్కూల్లో ఫుడ్‌పాయిజన్.. హరీశ్‌రావు ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్‌పై మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు ఆగ్రహం వ్వక్తం చేశారు. తాజాగా నారాయణపేట ప్రభుత్వ పాఠశాలలో భోజనం తిని 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై బుధవారం(నవంబర్20) ఒక ప్రకటన విడుదల చేశారు. అవి గురుకులాలా లేక నరక కూపాలా? ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విష వలయాలా? అని ప్రశ్నించారు.‘నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. రాష్ట్రంలోని గురుకులాల్లో,ప్రభుత్వ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతున్నది.పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం.రేవంత్ ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుతున్నది? మీ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి? ఆస్పత్రి పాలైన విద్యార్థులను హైదరాబాదుకు తరలించి మెరుగైన వైద్యం అందించాలి’అని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
KCR మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో MLA హరీష్ రావు స్పీచ్
-
11 నెలల పాలనలో బూతులు తప్ప నీతులు లేవు
సాక్షి, హైదరాబాద్: చేతకాని వాడికి మాటలెక్కువ. చేవలేనోడికి బూతులు ఎక్కువ అనే రీతిలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. వరంగల్ వేదికగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపట్ల ఆయన ‘ఎక్స్’వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘11 నెలల పాలనలో సీఎం నోటి వెంట బూతులు తప్ప నీతులు రాలేదు. కాంగ్రెస్ విజయోత్సవ సభ అని పేరు పెట్టుకొని 11 నెలల్లో చేసింది చెప్పుకోవడానికి లేక పిచ్చి మాటలు వదిలిండు. అశోక్ నగర్ నుంచి లగచర్ల దాకా, రైతుల నుంచి లంబాడీల బిడ్డల దాకా ఆయన చేసిన ఘోరాలు సమసిపోవు’అని హరీశ్ వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ నామస్మరణ చేసినంత మాత్రాన నీ పాపం పోదు. తొక్కుకుంటూ వచ్చానని గప్పాలు కొడుతున్నవు. నీ వదరుబోతు తనంతో రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదు’అని పేర్కొన్నారు. కాంగ్రెస్ జరపాల్సింది అపజయోత్సవాలు నిర్వహించాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ కవులకు అవమానం: కాళోజీ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఏటా ఇచ్చే పురస్కారాన్ని కవి, రచయిత నలిమెల భాస్కర్‌కు ప్రదానం చేయకపోవడం శోచనీయమని హరీశ్‌రావు విమర్శించారు. 2024 సంవత్సరానికి గాను నలిమెల భాస్కర్‌కు ప్రభుత్వం కాళోజీ సాహితీ పురస్కారాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కాళోజీ జయంతి సందర్భంగా సాహితీవేత్తలకు పురస్కారాలు అందజేసి గౌరవించే సంస్కృతిని ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా విస్మరించి కవులను అవమానించిందన్నారు. -
విజయోత్సవాలు కాదు.. అపజయోత్సవాలు చేయండి: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను విజయవంతంగా మోసం చేసిందని.. విజయోత్సవాలను కాకుండా అపజయోత్సవాలు నిర్వహించాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ వేదికగా అన్ని వర్గాల ప్రజలకు క్షమాపణ చెప్పాలని.. వరంగల్ డిక్లరేషన్, మహిళలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పది నెలల్లో రాష్ట్రాన్ని పదేళ్ల వెనక్కి తీసుకువెళ్లారని.. ‘ఎవరనుకున్నరు ఇట్లవునని.. ఎవరనుకున్నరు ఇట్లవునని’ ప్రజాకవి కాళోజీ నినదించినట్లు కాంగ్రెస్ చేతిలో ప్రజలు దగాపడ్డారన్నారు. రైతులు దారుణంగా మోసపోయారని రోరపించారు. ఆ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, అపజయాలను కప్పిపుచ్చుకునేందుకు వరంగల్ వేదికగా విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు.ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారు రేవంత్ రెడ్డి? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. ఇదే వరంగల్ వేదికగా ఇచ్చిన రైతు డిక్లరేషన్ కు ఏడాది అయినా అతీగతీ లేదని విమర్శించారు. డిక్లరేషన్‌లో చెప్పిన మొట్టమొదటి హామీ రూ.2లక్షల రుణమాఫీ ఇంకా పూర్తి చేయలేదన్నారు. రైతులు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేల భరోసా దిక్కులేదని.. ఉపాధిహామీ రైతు కూలీలకు ఏడాదికి ఇస్తామన్న 12వేలు ఇవ్వనేలేదన్నారు. పది రకాల పంటలకు ఇస్తామన్న బోనస్ బోగస్ చేశారని విమర్శించారు. ఆనాడు కాంగ్రెస్ ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. ఇందుకేనా మీ వరంగల్ విజయోత్సవ సభ రేవంత్ రెడ్డి? అంటూ నిలదీశారు. కాంగ్రెస్ పది నెలల పాలనలో రాష్ట్రాభివృద్ధి పదేండ్ల వెనక్కి వెళ్లిందని.. కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, నేడు తిరోగమనం బాట పట్టిందని విమర్శలు గుప్పించారు. -
‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్) సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
రేవంత్ హిట్ వికెట్
తుర్కయాంజాల్: పేదల ఇళ్ల జోలికెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి హిట్ వికెట్ అయ్యారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌లోని జేబీ క్రికెట్ గ్రౌండ్స్‌లో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాధవరం నర్సింహారావు ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ చాంపియన్ ట్రోఫీ– 2024 క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి హరీశ్ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్క పేదవాడి ఇల్లు కూల్చకుండానే తాము అభివృద్ధి చేశామన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చివేస్తూ సెల్ఫ్ బౌల్డ్ అయిందన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కళాశాలల యాజమా న్యాలు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరితే.. 8 శాతం కమీషన్ అడుగుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒకేఒక్కడు కేసీఆర్: హరీశ్ రావు‘సహజంగా ఎవరైనా పవర్లో ఉన్న పార్టీ కోసం సినిమా తీస్తారు. కానీ, అధికారంలో లేకపోయినా కేసీఆర్‌పై సినిమా తీశాడంటే అది రాకేష్‌లో ఉన్న ప్రేమ అనుకోవచ్చు, లేకుంటే దమ్ము, ధైర్యం అనుకోవచ్చు. ముఖ్యమంత్రులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకేఒక్కడు కేసీఆర్. ఆ అవకాశం ఇంకొకరికి లేదు’ అని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అన్నారు. ‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘కేసీఆర్’ (కేశవ చంద్ర రమావత్) ప్రీ రిలీజ్ వేడుకలో హరీశ్‌రావు మాట్లాడారు. ‘కేసీఆర్‌పై రాకేష్ ఒక అద్భుతమైన సినిమా తీయడం చాలా సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాదు.. ఈ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు అద్భుతంగా అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు. రజనీకాంత్ ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు.. 22 ఏళ్ల తర్వాత నేను ఇక్కడికి వచ్చాను.. నేను హైదరాబాద్‌లో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా? అని అన్నారు. అంటే కేసీఆర్‌గారు పల్లెల్నీ అభివృద్ధి చేశారు. హైదరాబాద్‌నీ అభివృద్ధి చేశారు.’ అని చెప్పారు. -
రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ మాట అన్నారు: మూవీ ఈవెంట్లో హరీశ్ రావు
జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనన్య కృష్ణన్ కథానాయికగా నటించారు. రాకింగ్ రాకేష్ నిర్మించిన ఈ మూవీ త్వరలో విడుదల కానుంది. తాజాగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి, తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..'ముఖ్యమంత్రులు వస్తు ఉంటారు. పోతుంటారు కానీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది మాత్రం ఒకే ఒక్కడు కేసీఆర్. ఆయన పేరు మీద సినిమా తీయడం సంతోషం. కేసీఆర్ అంటే ఒక చరిత్ర. తెలంగాణను సాధించడమే కాదు అద్భుతంగా 10 సంవత్సరాలు పరిపాలించారు. రజనీకాంత్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. నేను హైదరాబాద్‌లో ఉన్నానా? న్యూయార్క్‌లో ఉన్నానా అని. కేసీఆర్ పల్లెలను, హైదరాబాద్‌ను ఎంతో అభివృద్ధి చేశారు. మనం చూసే భౌతికమైన అభివృద్దే కాదు. సామాజిక పరంగా సంస్కృతి పరంగా తెలంగాణని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఒక దశ దిశను చూపించారు. దేశానికి తెలంగాణ దిక్సూచిగా నిలబడింది అంటే కేసీఆర్ చేసిన కృషి. అధికారంలో ఉన్న పార్టీ వారి మీద సినిమాలు తీస్తారు. కానీ అధికారంలో లేకపోయినా రాకేష్ ప్రేమతో, దమ్ము ధైర్యంతో ఈ సినిమా తీశారు' అంటూ ప్రశంసలు కురిపించారు. కాగా.. లంబాడీ వర్గానికి చెందిన ఓ యువకుడి నిజ జీవితం నుంచి స్ఫూర్తితో ఈ సినిమాను రూపొందించారు. -
BRS సోషల్ మీడియా ఇంచార్జ్ దిలీప్ అరెస్ట్
-
హరీశ్‌రావు పక్కచూపులు చూస్తున్నారు: పీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
సాక్షి,హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్‌రావుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. గత పదేళ్లో ఎంత అభివృద్ధి చేశారో హరీశ్‌రావు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామన్నారు. ఈ మేరకు మహేష్‌గౌడ్ సోమవారం(నవంబర్ 18) సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ఉండదన్నారు. హరీశ్‌రావు వేరే దారి వెతుక్కుంటున్నారన్నారు. ఆయన ఇప్పటికే పక్క చూపులు చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్లో మిగిలేది కేసీఆర్,కేటీఆర్,కవితలేనని మహేష్‌గౌడ్ ఎద్దేవా చేశారు.మహేష్‌కుమార్‌గౌడ్ ఇంకా ఏమన్నారంటే...కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదుసీఎం రేవంత్‌ని వ్యతిరేకించినా అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదుకాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు...ఆ విషయం తెలుసుమీకు ఆ హక్కుంది...మేము మీకు అండగా ఉంటాంజనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తాంస్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలిఅధికారంలోకి వచ్చి 11 నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయిబీజేపీ,బీఆర్ఎస్ కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై కుట్ర పన్నుతున్నాయికార్యకర్త కూడా సీమని కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందికార్యకర్తలు నారాజ్ అయితే మేం కుర్చీ దిగాల్సిందేమరోసారి మనం అధికారంలోకి రావాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలికేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుందిబంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యిందికాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయికాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదుహరీష్ రావుకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్మీరు పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండిమేము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తాంవచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదుహరీశ్రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడుచివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరు -
గురుకులాల్లో మృత్యుఘోష
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో విద్యార్థులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత టి. హరీశ్‌రావు ధ్వజమెత్తారు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని, ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని ఒక ప్రకటనలో ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా బీసీ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం మరో విద్యారి్థని ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందని అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోతుంటే, వారిని కాపాడాల్సిన ప్రభు త్వం చోద్యం చూడడం శోచనీయమని విమర్శించా రు. వాంకిడిలోని గురుకుల పాఠశాల విద్యారి్థని గత 17 రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్నదని, బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యారి్థని బలవన్మరణానికి కారణం ఎవర ని ప్రశ్నించారు. గత 11 నెల ల్లో సగటున నెలకు ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిన గురుకులాలు, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోజురోజుకు దిగజారిపోతున్నా యని అన్నారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించి, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే గురుకులాలు నరకకూపాలుగా మారాయని ధ్వజమెత్తారు. విద్యాశాఖతోపాటు సంక్షేమ శాఖ, గిరిజన శాఖ, మైనార్టీ శాఖల నిర్వహణలో ముఖ్యమంత్రి నిర్లక్ష్యం అభం శుభం తెలియని విద్యార్థుల పాలిట శాపంగా మారిందని విమర్శించారు. గురుకులాల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని బాలల దినోత్సవం నాడు సీఎం ప్రగల్బాలు పలకడం తప్ప, ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని విమర్శించారు. -
కేటీఆర్ ఇంటికి హరీష్, బీఆర్ఎస్ శ్రేణులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ ఇంటికి హరీష్ రావు సహా బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకుంటున్నారు. దీంతో, ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.లగచర్ల ఘటనకు సంబంధించిన కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు ఉంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ అనుమానంతో కేటీఆర్ ఇంటికి భారీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో, నందినగర్‌లోని కేటీఆర్ నివాసం గులాబీమయం అయ్యింది. -
వడ్లు కొనమంటే నోట్ల లోడ్ ఎత్తుతున్నారు
మర్రిగూడ: రాష్ట్రంలో రైతుల వడ్ల లోడ్ ఎత్తమంటే సీఎం రేవంత్‌రెడ్డి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నోట్ల కట్టల లోడ్ ఎత్తుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. గత సంవత్సరం నల్లగొండ జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో వరి సాగైతే ఈ సంవత్సరం కృష్ణా నదిలో పుష్కలంగా నీరు రావడం వల్ల 5.50 లక్షల ఎకరాల్లో వరి సాగైందన్నారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం వల్ల నల్లగొండలో కనీసం 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదని మండిపడ్డారు. హరీశ్‌రావు బుధవారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదని, రైతులకు అవసరమైనన్ని గన్నీ బ్యాగులను అందించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని హరీశ్‌రావు అన్నారు. ప్రభుత్వం రైతులను పట్టించు కోకపోవడంతో రైతులు రూ.1,800కే దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి మద్దతు ధరతోపాటు రూ.500 బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇప్పటివర కు నల్లగొండ జిల్లాలో ఒక కిలో సన్న వడ్లనూ కొన్న పాపాన పోలేదన్నారు. వడ్లు కొనకపోతే అధికారులను ఎందుకు కొనట్లేదని అడగడం లేదు కాని మ ద్యం తక్కువ అమ్మిన ఎక్సైజ్ అధికారులకు మా త్రం మెమోలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదన్నారు. పక్క రాష్ట్రం నుంచి దళారులు వచ్చి తెలంగాణ రైతుల వద్ద తక్కువ రేటుకు ధాన్యాన్ని కొంటున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి రాజ్యంలో రైతులు రోదిస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులను సమీకరించి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కాగా, గతంలో ధాన్యం కొనుగోలులో జరిగిన అవకతవకల్లో రూ.48 లక్షలు అవినీతి చోటుచేసుకోగా.. కొనుగోలు డబ్బులు నేటికీ రైతుల ఖాతాలో జమ కాలేదని రైతు మోదుగు రాజేందర్.. హరీశ్‌రావుకు చెబుతుండగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను ఖండించిన కేటీఆర్
-
ఇది ట్రైలర్ మాత్రమే.. సినిమా ముందుంది: హరీశ్‌రావు
సాక్షి,జగిత్యాల: రైతు సీఎం కేసీఆర్ అయితే,బూతుల సీఎం రేవంత్‌రెడ్డి అని మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు విమర్శించారు. కోరుట్ల నుంచి జగిత్యాల వరకు కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న హరీష్‌రావు మాట్లాడారు.‘ఎమ్మెల్యే సంజయ్ రైతుల కష్టాలు చూసిండు కాబట్టే పాదయాత్ర చేపట్టిండు. ధాన్యం దళారుల పాలైపోయింది. రూ.500 బోనస్ ఇస్తానన్నాడు. బోనస్‌తో కలిపి 2820 రూపాయలు క్వింటాలుకు అందాల్సి ఉంటే పద్దెనిమిది,పందొమ్మిది వందలకే దళారులకు అమ్ముకుంటున్రు.వడ్లు కొన్న 24 గంటల్లో పైసలు పడాలని నాడు కేసీఆర్ చెబుతుండే.ఈ కాంగ్రెస్ ప్రభుత్వానివి మాటలెక్కువ,పని తక్కువ. ఎన్నికల సమయంలో కూడా రైతుల విషయంలో రాజకీయం చేసిన్రు, రైతుబంధు విషయంలో ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసిన్రు. ఈ సర్కారు వచ్చాక ఒక్క విడత కూడా రైతుబంధు పడలే. దాన్ని ప్రశ్నించడానికే మా సంజయ్ పాదయాత్ర చేసిండు.అసెంబ్లీ ఎన్నికలప్పుడు బాండ్ పేపర్లు రాసిచ్చిండు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఒట్లు పెట్టిండు రేవంత్. రైతు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తా అన్నడు. రుణమాఫీ అయిందా..?రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు కొందరు రైతుల మిత్తీ పెరిగి ఇబ్బందులు పడుతున్నారు.రైతుబంధుకు, రుణమాఫీకి డబ్బుల్లేవంటగానీ మూసీకి మాత్రం లక్షా యాభై వేల కోట్ల ఖర్చు పెడతానంటుండు రేవంత్ రెడ్డి. 24 గంటల కరెంట్ ఇచ్చి చూపిన ఘనత కేసీఆర్‌ది. మా సంజయ్ పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమే..రేపు ముందర ఉంది 70 ఎంఎం సినిమా.జగిత్యాల జైత్రయాత్ర స్ఫూర్తిగా దండోరా ప్రకటించాం’అని హరీశ్‌రావు అన్నారు.ఇదీ చదవండి: ఢిల్లీలో హీట్.. ఇటు కేటీఆర్..అటు రేవంత్.. గవర్నర్ కూడా -
మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ డబ్బు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డబ్బును మహారాష్ట్రకు పంపే పనిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బిజీగా ఉన్నారని.. కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఎన్నికల కోసం డబ్బులు రేవంతే సమకూర్చుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణలో రుణమాఫీ చేశామని, రైతు బంధు, వరికి బోనస్ ఇచ్చామంటూ మహారాష్ట్రలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. రాష్ట్రంలో రోడ్ల మీద ఉన్న వడ్ల కుప్పలే రేవంత్ అసమర్థ పాలనకు నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర మంత్రులు రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి, గాలిమోటార్లలో రాష్ట్రాలు పట్టి తిరుగుతున్నారని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సీఎం రేవంత్ నోరు విప్పితే అన్నీ అబద్ధాలే. ఆ అబద్ధాల ప్రవాహాన్ని మహారాష్ట్రలో కొనసాగించారు. తెలంగాణలో మోసం చేసినట్టు అక్కడి ప్రజలనూ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండు లక్షల ఉద్యోగాల కల్పనపై మహారాష్ట్రలో పచ్చి అబద్ధాలు చెప్పారు. విద్యార్థులను వీపులు పగలకొట్టించిన చరిత్ర కాంగ్రెస్ సర్కార్‌దే. తెలంగాణలో 40 లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అవాస్తవాలు చెప్పారు. 2023 డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారు. 42 లక్షల మందికి రూ.31 వేలకోట్లు రుణమాఫీ చేస్తామని రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా 7 నెలలు ఆలస్యం చేసి రైతులపై వడ్డీల భారం మోపారు. ఇంకా 22 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేయాల్సి ఉంది. తెలంగాణలో పోలీసు కానిస్టేబుళ్లు రోడ్ల మీదికి వచ్చే పరిస్థితి నెలకొంది. హాస్టళ్లలో విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నారు. గ్యారంటీలు గ్యారేజ్‌కు పోయాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది పూర్తవుతున్నా ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలు గెలిచాక గ్యారేజీకి పోయాయి. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ ఇచ్చారు. ఏ హామీలు అమలు చేశారో, ఎక్కడ చర్చిద్దామో చెప్పండి. బహిరంగ చర్చకు నేను సిద్ధం. మహిళలకు అభయ హస్తం ఏదీ? మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామని అభయ హస్తంలో చెప్పిన మొదటి హామీకే దిక్కులేదు. మహారాష్ట్రలో మాత్రం కోతలు కోస్తున్నారు. ఆ హామీ మేరకు ప్రభుత్వం ఒక్కో మహిళకు రూ.27,500 బాకీ ఉంది. రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు, రైతుకూలీలకు రూ.12 వేలు, వరికి రూ.500 బోనస్ వంటి ఎన్నో హామీలిచ్చారు. ఒక్కటి కూడా అమలు చేయలేదు. హామీలను ఎగవేయటమే కాంగ్రెస్ నైజంగా మారింది. సోనియమ్మ మాట.. రాహుల్ గాంధీ మాట అంటూ కాంగ్రెస్ నాయకులు హామీలిచ్చారు. ఇప్పుడా గాం«దీలు ఎక్కడికి పోయారో తెలియదు. రైతుల ధాన్యం కొనేదెవరు? రాష్ట్రంలో మద్దతు ధరకు వరి ధాన్యం కొనకపోవటంతో రైతులు నష్టపోతున్నారు. క్వింటాల్ వడ్లు రూ.1,900కే వడ్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. రేవంత్‌రెడ్డి అసమర్థ పాలనకు రోడ్లపై వరికుప్పలే సాక్ష్యం. పైగా బోనస్ ఇచ్చామంటూ మహారాష్ట్రలో బోగస్ మాటలు మాట్లాడారు. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి రేవంత్. జీవో 29 పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేశారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాటతప్పారు. ప్రశ్నించిన నిరుద్యోగులను పోలీసులతో అణచివేసే ప్రయత్నం చేశారు. ఉద్యోగాల భర్తీలో వైఫల్యంపై మహారాష్ట్రలో ఎందుకు మాట్లాడలేదు. పైగా కేసీఆర్ ఇచ్చనా ఉద్యోగాలను తాను ఇచ్చినట్టు రేవంత్ చెప్పుకోవడం సిగ్గుచేటు..’’అని హరీశ్‌రావు మండిపడ్డారు. -
సీఎం రేవంత్ రెడ్డి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు
-
కేసీఆర్‌పై ఆ మంత్రి వ్యాఖ్యలు అప్రజాస్వామికం: హరీశ్‌రావు
సాక్షి,మెదక్‌జిల్లా: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. శనివారం(నవంబర్ 9) నర్సాపూర్‌లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికం.రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసిన మంత్రులు, ముఖ్య మంత్రి గాలిమెటార్లలో తిరుగుతున్నారు. మూసీ దుస్థితికి కారణం కాంగ్రెస్,తెలుగుదేశం పాలనే. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మూసీ నది సమస్యలపై పాదయాత్రకు తాను సిద్ధం. మూసి కంపు కంటే రేవంత్‌రెడ్డి నోటీ కంపు ఎక్కువ. కేటీఆర్‌పై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ప్రజాబలంతోనే కాంగ్రెస్ కుట్రలను ఎదుర్కొంటాం’అని హరీశ్‌రావు అన్నారు. కాగా, మూసీ పాదయాత్ర సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో శుక్రవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: ప్రధాని మోదీ ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు: సీఎం రేవంత్