'బ్రేకప్సే మనల్ని బలంగా తయారు చేస్తాయి'
లాస్ ఎంజెల్స్: హృదయాన్నిబద్ధలు చేసే సంఘటనలే మనమేమిటో నిరూపించుకునేలా చేస్తాయని ప్రముఖ హాలీవుడ్ నటుడు జేక్ గిలెన్హాల్ చెప్పాడు. బ్రేకప్స్ తనను బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయని అన్నాడు. ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో ఒక్కో విధంగా హార్ట్ బ్రేకప్స్ అవుతాయని, ఎవరి అనుభవం వారికి తెలుస్తుందని పేర్కొన్నాడు.
సామాజిక సంబంధాలైన, రాజకీయ సంబంధాలపరంగా చూసుకున్నా, తమ అనుకున్నవారితో ఉండే సంబంధాలైనా బ్రేకప్ సమయంలో వాటిని ఎదుర్కొన్నప్పుడు సరిగ్గా వాటిని గమనిస్తే వ్యక్తి మరింత బలంగా తయారవడం ఖాయమని వివరించాడు. హృదయం ముక్కలైనప్పుడు దాని గురించే ఆలోచించడం కాకుండా ఒక్కసారి వెనుదిరిగి చూస్తే మనమేమిటి అనే విషయాన్ని ఆ సందర్భం గుర్తు చేస్తుందని తెలిపాడు. అందుకే బ్రేకప్స్ మంచి చేసేయే తప్ప హానీ చేసాయి కాదన్నట్లు ఆయన అభిప్రాయపడ్డాడు.