బద్రీనాథ్‌లో కూలిన హెలికాఫ్టర్
లక్నో: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో శనివారం ఉదయం ఓ ప్రయివేట్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తి కూలిపోయింది. బద్రినాథ్ నుంచి హరిద్వార్‌కు భక్తులను తీసుకొని వెళ్తున్న హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా....ఇద్దరు పైలెట్లతో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సాంకేతిక కారణాలతోనే హెలీకాప్టర్ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఇంజినీరు కుటుంబానికి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ సంతాపాన్ని ప్రకటించారు.