Hyderabad District Latest News
-
గన్ మిస్ ఫైర్
అమెరికాలో ఉప్పల్ యువకుడి మృతి ● పుట్టిన రోజు నాడే విషాద ఘటన ● కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు ఉప్పల్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఉప్పల్ బ్యాంక్ కాలనీకి చెందిన యువకుడు తన హంటింగ్ లైసెన్స్డ్ గన్ మిస్ ఫైర్ కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థి పుట్టిన రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో మృతుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కుమారుడు ఇక తిరిగిరాడనే విషయాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. బీబీనగర్ పోచంపల్లి మండలం పెద్దరావుల పల్లి గ్రామానికి చెందిన వ్యాపారి పాల్వాయి సుదర్శన్ రెడ్డి, దీప దంపతులు ఉప్పల్ బ్యాంక్ కాలనిలో నివాసముంటున్నారు. వీరి ఒక్కగానొక్క కుమారుడు పాల్వాయి అరుణ్ రెడ్డి (24) గత ఏడాది డిసెంబర్లో అమెరికాలోని జార్జియా స్టేట్ అట్లాంటా పట్టణంలోని కెనిస్వా యూనివర్సిటీలో ఉన్నత విద్య కోసం వెళ్లాడు. ఈ నెల 13న తన గదిలోనే స్నేహితుల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నాడు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అరుణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అదే రోజు ఉదయం 10 గంటల సమయంలో తన హంటింగ్ లైసెన్స్డ్ గన్ను శుభ్రం చేస్తుండగా మిస్ ఫైర్ కావడంతో తూటా అరుణ్ ఛాతీలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తండ్రి సుదర్శన్ రెడ్డి తెలిపారు. తన కుమారుడికి ఆర్మీలో చేరాలనే కోరిక ఉండేదని, అందులో భాగంగానే గన్ పేల్చడంలో శిక్షణ కూడా పొందుతున్నాడన్నారు. అమెరికాలో గన్ కొనుగోలు చేసిన విషయం తనకు తెలియదన్నారు. సాధారణంగా తర్ఫీదు పొందిన వారికి హంటింగ్ కోసం గన్ కొనడానికి లైసెన్స్ ఇస్తారని తెలిపారు. అలా లైసెన్స్ ఇవ్వడం వల్లే తన కుమారుడు అసువులు బాశాడని సుదర్శన్ విలపించారు. గురువారం రాత్రి మృతదేహాన్ని అమెరికా నుంచి ఉప్పల్‌లోని స్వగృహానికి తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు. -
కళా కాంతులు
లోక్‌మంథన్‌లో మాదాపూర్‌లోని శిల్పారామంలో గురువారం ప్రారంభమైన లోక్‌మంథన్‌లో సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత, సమాలోచనలు ఆకట్టుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల సంప్రదాయ క్రీడలు, అల్లికలు, వివిధ కళలను ప్రదర్శించారు. నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఉత్సవంలో చర్మ వాయిద్యాల ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 350కి పైగా పురాతన సంప్రదాయ సంగీత వాద్యాలు ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. సందర్శకులతో పాటు నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు వీటిని ఉత్సాహంగా తిలకించారు. – మాదాపూర్ -

ఫుడ్ ఫెస్టివల్స్‌తో మత్స్యకారులకు ప్రోత్సాహం
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఖైరతాబాద్: ఫుడ్ఫెస్టివల్స్ ఏర్పాటుతో మత్స్యకారులకు ప్రోత్సాహం దక్కుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా గురువారం తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఐమాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన ఫుడ్‌ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి ఫెస్టివల్స్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆల్ఇండియా ఫిషర్మెన్ కాంగ్రెస్ జాతీయ చైర్మన్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఫెర్నాండో, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు, నాయకులు అన్వేష్‌రెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, బెల్లయ్య నాయక్, ప్రీతం నాగరికరీ, ముత్తినేని వీరయ్య పాల్గొన్నారు. -
లే అవుట్ అనుమతుల్లో వేగం
సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణాలు, లే అవుట్ అనుమతుల్లో వేగం పెంచినట్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు 1,884 ఫైళ్లను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. గత ఏడాది ఇదే కాలంలో 1,356 ఫైళ్లను పరిష్కరించగా ఈసారి 14.4 శాతం అదనంగా పరిష్కారం అయ్యాయన్నారు. 39 శాతం ఫైళ్లు అదనంగా వచ్చాయన్నారు. గత సంవత్సరం ఇదే కాలంలో దరఖాస్తుదారులు టీజీబీ పాస్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎలాంటి జాప్యానికి తావు లేకుండా 10 రోజుల్లోనే పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. ఏ రోజుకారోజు ఫైళ్ల పురోగతిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. వారానికోసారి పెండింగ్ ఫైళ్లపై సమీక్ష నిర్వహించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. -
ఫుడ్ ఫెస్టివల్స్‌తో మత్స్యకారులకు ప్రోత్సాహం
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఖైరతాబాద్: ఫుడ్ఫెస్టివల్స్ ఏర్పాటుతో మత్స్యకారులకు ప్రోత్సాహం దక్కుతుందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా గురువారం తెలంగాణ ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆధ్వర్యంలో ఐమాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన ఫుడ్‌ఫెస్టివల్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి ఫెస్టివల్స్‌ను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఆల్ఇండియా ఫిషర్మెన్ కాంగ్రెస్ జాతీయ చైర్మన్ ఆర్మ్‌స్ట్రాంగ్ ఫెర్నాండో, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కాంగ్రెస్ సీనియర్ నేత హన్మంతరావు, నాయకులు అన్వేష్‌రెడ్డి, నిర్మలా జగ్గారెడ్డి, బెల్లయ్య నాయక్, ప్రీతం నాగరికరీ, ముత్తినేని వీరయ్య పాల్గొన్నారు. -
No Headline
హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ సాక్షి, సిటీబ్యూరో: భవన నిర్మాణాలు, లే అవుట్ అనుమతుల్లో వేగం పెంచినట్లు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సర్ఫరాజ్ అహ్మద్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు 1,884 ఫైళ్లను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. గత ఏడాది ఇదే కాలంలో 1,356 ఫైళ్లను పరిష్కరించగా ఈసారి 14.4 శాతం అదనంగా పరిష్కారం అయ్యాయన్నారు. 39 శాతం ఫైళ్లు అదనంగా వచ్చాయన్నారు. గత సంవత్సరం ఇదే కాలంలో దరఖాస్తుదారులు టీజీబీ పాస్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత ఎలాంటి జాప్యానికి తావు లేకుండా 10 రోజుల్లోనే పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. ఏ రోజుకారోజు ఫైళ్ల పురోగతిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. వారానికోసారి పెండింగ్ ఫైళ్లపై సమీక్ష నిర్వహించి సత్వరమే పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. -
ప్రముఖులకు గగనతల
సాక్షి, సిటీబ్యూరో: ముష్కరమూకలు తెలివి మీరుతున్నాయి.. ఓ పక్క ఉగ్రవాదులు, మరోపక్క తీవ్రవాదులు గగనతల దాడులకు కుట్రలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పారాగ్లైడర్లు, డ్రోన్లతో పాటు అనధికారికంగా వినియోగించే అన్ని రకాలైన ఎగిరే వస్తువులపై నిషేధం విధించాల్సిందిగా కేంద్ర నిఘా వర్గాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఈ హెచ్చరిక వెనుక అనేక కారణాలున్నాయి. దేశ వ్యాప్తంగా పోలీసులకు పట్టుబడిన ఉగ్రవాదుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలపై నిఘా వర్గాలు ఆధారాలు సేకరించాయి. ఈ నేపథ్యంలో ముష్కర సంస్థల గగనతల దాడుల వ్యూహం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రత్యేకంగా ఎంపిక చేసిన క్యాడర్‌కు గగనతల దాడుల్లో శిక్షణ ఇస్తున్నట్లు వీరు వెల్లడించారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చెందిన ఓ వింగ్ ఈ ఉగ్రవాదులకు పారాచూట్ జంపింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. పాక్ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని ఉగ్రవాద సంస్థలు చైనా, యూఏఈకి చెందిన కంపెనీల నుంచి పారాగ్లైడర్ల తయారీకి ఉపకరించే ఉపకరణాలు, పాకిస్థాన్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి డ్రోన్లు ఖరీదు చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వీటికి తోడు గతంలో స్పెయిన్‌లో జరిగిన గగనతల పరికరాలు, ఉపకరణాల కొనుగోళ్లకు సంబంధించి నిఘా వర్గాలు సేకరించిన ఆధారాలు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు 10 లక్షల పాక్ రూపీలను వెచ్చించి స్పెయిన్‌లో పారాగ్లైడర్ ఉపకరణాలను ఖరీదు చేసినట్లు నిఘా వర్గాలకు ఆధారాలు లభించాయి. వీటిలో ఇద్దరు ప్రయాణించే సౌకర్యం ఉందని, ఇవి దాదాపు 150 కేజీల బరువును 70 కిమీ మేర నిర్విరామంగా మోసుకుపోయే సామర్థ్యం కలిగి ఉన్నట్లు గుర్తించాయి. వీరు ఈ ఉపకరణాలను వివిధ మార్గాల్లో భారత్‌కు తరలించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నాయి. వీటిని వినియోగించి టార్గెట్లపై గగనతల దాడులు చేయడంతో పాటు పేలుడు పదార్థాలు, ఆయుధాల రవాణాకూ వినియోగించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అనధికారిక పారాగ్లైడర్లు, డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా పని చేసే తేలికపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌లు, చిన్న పరిమాణం కలిగిన మానవరహిత విమానాలను పూర్తి స్థాయిలో నిషేధించాలని, అనుమతి ఉన్న వాటినీ సాధ్యమైనంత వరకు నియంత్రించాలని అన్ని రాష్ట్రాలనూ హెచ్చరించాయి. మరోపక్క మావోయిస్టులు మినీ హెలీకాఫ్టర్ల తయారీపై దృష్టి పెట్టినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఛత్తీస్గడ్, బీహార్, కేరళలో జరిగిన ఆపరేషన్ల సందర్భంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తక్కువ బరువు, సామర్థ్యం కలిగినవి రూపొందించి వినియోగించడానికి మావోయిస్టులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడైంది. వీటికి సంబంధించిన ఓ డిజైన్ బీహార్‌లోని గయ ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అధికారులకు లభించింది. ఇప్పటి వరకు విధ్వంసాల కోసం మావోయిస్టులు ఎక్కువగా మందుపాతరలనే ప్రయోగిస్తున్నారు. వీటికి భిన్నంగా రిమోట్ కంట్రోల్ బాంబుల తయారీకీ ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. వీటినీ గగనతలం ద్వారా వినియోగించే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నేటి సాయంత్రం వరకు అత్యంత అప్రమత్తం... రాజధానిలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కొత్వాల్ సీవీ ఆనంద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఐఎస్ఐ డివిజన్ బుధవారం నగర పోలీసులకు ఓ వర్తమానం పంపింది. రాష్ట్ర సచివాలయానికి మూడు కిలోమీటర్ల పరిధిలో, సున్నిత విభాగాలకు కార్యాలయాలకు 2 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఎగరడంపై నిషేధం విధించాలని స్పష్టం చేసింది. వీటిని పరిగణలోకి తీసుకున్న సీపీ గగనతలంలో ఎగిరే వాటిపై నిషేధం విధించారు. శుక్రవారం సాయంత్రం వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫొటోలు, వీడియోల చిత్రీకరణ కోసమూ వీటిని వాడకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పర్యటన ముగిసే వరకు గగనతలంపైనా పటిష్ట నిఘా ఉంచాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నిఘా హెచ్చరికలు నగరంలో డ్రోన్లు, పారాగ్లైడర్ల సంచారంపై నిషేధం పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు -
ఇదేం వి‘చిత్రమో’
రూ.150 కోట్లతో రంగుల బొమ్మలు జూ పార్కుకు అయిదోసారి ఐఎస్ఓ సర్టిఫికెట్ పెరిగిన చలి సాక్షి, సిటీబ్యూరో: నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో చలి పెరిగింది. తెల్లవారుజామున పొగ మంచు కమ్మేస్తోంది. పగటిపూట గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రాత్రి వేళ కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గురువారం రాత్రి చలి తీవ్రత పెరిగింది. సగటున కనిష్ట ఉష్ణోగ్రత 15.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శివార్లలో మాత్రం అత్యల్పంగా సగటున 12.4 డిగ్రీల సెల్సియస్ రికార్డు అయింది. గురువారం పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రత 28.8 డిగ్రీలుగా నమోదైంది. నగరంలో సక్రమంగా లేని నడక మార్గాలు ● పలుచోట్ల పాదచారులకు ప్రమాదాలు ● జంక్షన్ల సుందరీకరణతోనే సరిపెట్టొద్దు ● ఫుట్పాత్లకూ ప్రాధాన్యం ఇవ్వాలి ● గ్రేటర్లో 9 వేల కి.మీ పైగా రోడ్లు ● 900 కి.మీ. మేరనైనా కనిపించని కాలిబాటలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో పలు జంక్షన్లు, రోడ్ల పక్కన గోడలు, ఫ్లై ఓవర్ల స్తంభాలు తదితర ప్రాంతాల్లో చూడచక్కని బొమ్మలు రంగుల హంగులతో చూపరులను కట్టి పడేస్తున్నాయి. నగరం అందంగా కనిపించేందుకు ఈ పనులు చేస్తుండటంపై ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ.. వీటితో పాటు పాదచారులు నడిచేందుకు నడక మార్గాలను ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్లు వెలువడుతున్నాయి. గ్రేటర్ నగరంలో 9 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లున్నప్పటికీ కనీసం 900 కిలోమీటర్ల మేరనైనా పాదచారులు నడిచేందుకు కాలిబాటలు (ఫుట్‌పాత్‌లు) లేవు. నగర అందాన్ని మాత్రం పట్టించుకుంటున్న అధికారులు, సంబంధిత యంత్రాంగం దాంతో పాటు ప్రజల సదుపాయాల్ని కూడా పట్టించుకుంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సుందరీకరణల కోసమే 224 ప్రాంతాల్లో దాదాపు రూ. 150 కోట్లతో పనులు చేపట్టారు. వీటిల్లో రూ.5.35 కోట్ల విలువైన రంగుల హంగుల సుందరీకరణ పనులు పూర్తికాగా, 209 ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. ప్రజలను ఆకట్టుకునేలా ప్రత్యేకమైన థీమ్‌లతో చిత్రాలు వేస్తున్నామని, జంక్షన్లు, సెంట్రల్ మీడియన్లలో ప్రత్యేక ఆక ర్షణగా శిల్పాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీఆర్ఎంపీ మార్గాల్లోనూ లేవు.. సమగ్ర రోడ్డు నిర్వహణ ప్రాజెక్ట్ (సీఆర్ఎంపీ) కింద ప్రైవేటు ఏజెన్సీలకు రోడ్ల నిర్వహణ బాధ్యతలప్పగించిన ప్రాంతాల్లో అన్ని రోడ్లకూ ఫుట్‌పాత్‌లు కూడా ఉండాల్సినప్పటికీ.. ఆయా మార్గాల్లో సైతం ఇవి లేకుండాపోయాయి. అంతేకాదు.. సంబంధిత మార్గాల్లో పారిశుద్ధ్యం, పచ్చదనం పనుల బాధ్యతలు కూడా సదరు ఏజెన్సీలవే. కానీ.. సదరు ఏజెన్సీలు ఆ పనులు చేయకున్నా, జీహెచ్ఎంసీ అధికారులు కూడా పట్టించుకోవడంలేదు. వచ్చే నెలాఖరుతో ఆయా ఏజెన్సీల నిర్వహణ గడువు తీరిపోనుంది. తిరిగి మళ్లీ సమగ్ర నిర్వహణ బాధ్యతలు ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించేందుకు సిద్ధమవుతున్న యంత్రాంగం.. గడువు ముగిసిపోతున్నా చేయని పనుల్ని మాత్రం పట్టించుకోలేదు. ● సీఆర్ఎంపీ పరిధిలో 525 మార్గాల్లో 812 కిలోమీటర్ల మేర రోడ్లు ఉండగా, వాటిలో 650 కిలోమీటర్ల మేర నడిచేందుకు సదుపాయంగా ఫుట్‌పాత్‌లు నిర్మించలేదు. ఇలా ఇటు సీఆర్ఎంపీ మార్గాల్లో కాంట్రాక్టు ఏజెన్సీలు కానీ, మిగతా ప్రాంతాల్లో అటు జీహెచ్ఎంసీ కానీ ఫుట్‌పాత్‌లు నిర్మించలేదు. పాదచారులను గురించి పట్టించుకోలేదు. నడకదారులు లేక పాదచారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నగరంలో రోడ్డు ప్రమాదాల బాధితుల్లో 40 శాతానికి పైగా పాదచారులే ఉండటం గమనార్హం. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయినవారూ ఉన్నారు. ‘స్మార్ట్’ కళ్లద్దాలతో ఆత్మవిశ్వాసం: గవర్నర్ రాంగోపాల్‌పేట్: కంటిచూపు కరువైనవారి జీవితాల్లో వెలుగులు నింపాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గురువారం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ఏఐ బేస్డ్ స్మార్ట్ విజన్ గ్లాసెస్ (దృష్టి) ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపేలా స్మార్ట్ కళ్లద్దాలు ఇవ్వడం ఎంతో అభినందనీయమన్నారు. స్మార్ట్ గ్లాసులు అంధుల రోజువారీ జీవితాల్లోనూ ఎంతో ఉపయోగంగా ఉంటాయని, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. స్మార్ట్ కళ్లద్దాలు రూపొంందించడంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలను గవర్నర్ అభినందించారు. వ్యక్తుల ముఖాల గుర్తింపుతో పాటు వారితో ధైర్యంగా మాట్లాడేందుకు ఈ కళ్లద్దాలు ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. కిమ్స్ ఎండీ డాక్టర్ భాస్కర్‌రావు మాట్లాడుతూ కిమ్స్ ఫౌండేష్ రీసెర్చ్ సెంటర్ రూపొందించిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలతో అంధులు తమచుట్టు పక్కల ప్రాంతాల్లో సులభంగా తిరగడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో కేఎఫ్ఆర్సీ చైర్మన్ డాక్టర్ భుజంగరావు తదితరులు పాల్గొన్నారు. ఫుట్‌పాత్ లేకపోవడంతో రోడ్డు పక్కనుంచి వెళ్తున్న ఓ పాదచారిబహదూర్పురా: నెహ్రూ జూలాజికల్ పార్కు వరుసగా అయిదోసారి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ఐఎస్ఓ) గుర్తింపు సర్టిఫికెట్ గుర్తింపు పొందింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.శివయ్య ఐఎస్ఓ–9001:2015 సర్టిఫికెట్ 2024–2025ను గురువారం జూపార్కు కార్యాలయంలో తెలంగాణ జూపార్కుల డైరెక్టర్ డాక్టర్ సునీల్ హిరేమత్, జూపార్కు క్యూరేటర్ జె.వసంత బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా క్యూరేటర్ వసంత మాట్లాడుతూ.. మెరుగైన నిర్వహణ, ప్రణాళికాబద్ధమైన పెంపకం, సహకార పరిశోధన సామర్థ్యంతో పాటు వన్యప్రాణుల సంతానోత్పత్తి వంటివి తనిఖీ చేసిన అనంతరం ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను అందజేస్తారని తెలిపారు. వీటన్నింటిపై జూ పార్కు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో కనబర్చడంతో అయిదోసారి కూడా ఈ గౌరవం జూ పార్కుకు దక్కిందన్నారు. గత అయిదేళ్లలో రోడ్డు ప్రమాదాల్లో మరణించిన పాదచారులు ఇలా.. సంవత్సరం మరణాలు 2019 95 2020 72 2021 94 2022 123 2023 121 -
కనెక్షన్ లైన్ కట్..!
సిల్ట్ చాంబర్లు లేకుంటే సాక్షి,సిటీబ్యూరో: వాణిజ్య భవన సముదాయాలు సిల్ట్ చాంబర్లు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని లేనిపక్షంలో సీవరేజ్ పైప్‌లైన్ కనెక్షన్లను తొలగించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి సంబందిత అధికారులను అదేశించారు. గురువారం ఆయన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మోహిదీపట్నం, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో డీ–సిల్టింగ్ పనులను పరిశీలించారు. మెహిదీపట్నం అంబా థియేటర్ వద్ద ప్రధాన రహదారిపై తరచూ పొంగుతున్న మ్యాన్ హోళ్లను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లోని హోటళ్ల యాజమానులు తమ సీవరేజ్ పైప్ లైన్లను నేరుగా జలమండలి సీవరేజ్ నెట్వర్క్ కు అనుసంధానం చేసినందునే వాటి నుంచి వచ్చే ఆహార, వ్యర్థ పదార్థాలు మ్యాన్ హోళ్లలో చేరి సమస్య ఎదురవుతుందన్నారు. ఈ నేపథ్యంలో హోటళ్లు, బేకరీలు, ఫుడ్ కోర్టులు, వాణిజ్య భవనాల యజమానులకు సిల్ట్ చాంబర్లు నిర్మించుకోవాలని నోటీసులు జారీ చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే వారి సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్లను తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీజీఎం వినోద్ భార్గవ, జీఎం, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు. సిల్ట్ చాంబర్ల ఏర్పాటు తప్పనిసరి డీ–సిల్టింగ్ స్పెషల్ డ్రైవ్ పనుల పరిశీలన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి -
విదేశాల్లో న్యూ ఇయర్ వేడుకలకు ప్రణాళికలు
సాక్షి, సిటీబ్యూరో: నయా సాల్ జోష్ వచ్చేసింది. కొత్త సంవత్సర వేడుకల కోసం నగర వాసులు సరికొత్త పర్యాటక ప్రాంతాలపై ఆసక్తి చూపుతున్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యటనల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. వీరి అభిరుచికి అనుగుణంగా పలు ట్రావెల్స్ సంస్థలు సైతంటూరిస్ట్ డెస్టినేషన్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. సాధారణంగా ప్రతీ ఏటా ఎక్కువ మంది పర్యాటకులు సందర్శించే ప్రాంతాలతో పాటు ఈసారి టర్కీ, కెన్యా, అజర్ బైజాన్, మాల్దీవులు వంటి విదేశాలకు, గోవాతో పాటు కొచ్చిన్, కశ్మీర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఆన్లైన్ అరైవల్ వీసా ఉన్న దేశాలకు కూడా పర్యాటకులు వెళ్తున్నారు. దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు సైతంసిటీ టూరిస్టుల జాబితాలో చేరాయి.ఇప్పటినుంచే బుకింగ్‌లు షురూ..హైదరాబాద్ నుంచి ఏటా డిసెంబర్ చివరి వారంలో ఏదో ఒక నచ్చిన ప్రదేశానికి వెళ్లి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికే సిటీజనులు.. ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ వేడుకలకు ‘చలో టూర్’ అంటున్నారు. డిసెంబర్ చివరి వారంలో రానున్న వరుస సెలవులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే టూర్ బుకింగ్ చేసుకుంటున్నారు. ఈసారి గోవాతో పాటు కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లను సైతం ఎంపిక చేసుకుంటున్నారు. మరోవైపు విదేశీ టూర్లలో బ్యాంకాక్, మలేసియా, మాల్దీవులు, సింగపూర్, దుబాయ్ తదితర దేశాలకు యథావిధిగా డిమాండ్ ఉంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సుమారు లక్ష మందికి పైగా ప్రయాణికులు బయలుదేరి వెళ్లనున్నట్లు అంచనా. దీంతో చార్జీలు బాగా పెరగనున్నాయి.చార్జీలు తడిసి మోపెడు..సాధారణంగా హైదరాబాద్ నుంచి బ్యాంకాక్‌కు వెళ్లి వచ్చేందుకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఏకంగా రూ.60 వేలు దాటినట్లు ట్రావెల్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి. వారం, పది రోజులు నుంచే బ్యాంకాక్‌కు బుకింగ్‌లు బాగా పెరిగినట్లు బంజారాహిల్స్‌కు చెందిన ఒక సంస్థ ప్రతినిధి తెలిపారు. ‘కౌలాలంపూర్ పెట్రోనాట్స్ దగ్గర ఏటా నూతన సంవత్సర వేడుకలు అద్భుతంగా జరుగుతాయి. రంగు రంగుల బాణసంచా కాల్చుతారు. దీంతో ఆకాశమంతా హరివిల్లులు విరబూస్తాయి. ఆ వేడుకలను చూసేందుకు ఇంటిల్లిపాది వెళ్తున్నాం’ అని కుషాయిగూడ ప్రాంతానికి చెందిన రాఘవ చెప్పారు. ప్రస్తుతం మలేసియాకు రూ.12,000 నుంచి ఏకంగా రూ.25,000 వరకు చార్జీలు పెరిగాయి. హైదరాబాద్ నుంచి దుబాయ్‌కు కూడా పెద్ద సంఖ్యలోనే వెళ్తున్నారు. దుబాయ్‌కు సాధారణంగా రూ.16,000 వరకు ఉంటుంది. ఇప్పుడు రూ.36,000 వరకు పెరిగిందని ట్రావెల్స్ సంస్థలు పేర్కొంటున్నాయి. -
డ్రైనేజీ సమస్యలపై నివేదికలివ్వండి
● సమస్య పరిష్కారం కోసం నిధులు ఇస్తాం ● పరిసరాల్లో చెత్త, చెదారం, పిచ్చి మొక్కలు తొలగించాలి ● హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశాలు సాక్షి,సిటీబ్యూరో: డ్రైనేజీల కారణంగా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. డీఈవో, డిప్యూటీ ఈఓ, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, ఈఈ ఐడీసీ, హెచ్ఎండబ్ల్యూఎస్, తహసీల్దార్లు పాఠశాలలను తనిఖీ చేసి చేపట్టాల్సిన పనులపై శుక్రవారం సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని సూచించారు. గురువారం ఆయన పాతబస్తీలోని పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు, చెట్లు తొలగించాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల అసంపూర్తి పనులను పూర్తిచేయాలని, అందుకు అవసరమైన నిధులపై ప్రతిపాదనలు అందజేయాలన్నారు. పాఠశాల ఆవరణలో వర్షపు నీరు, డ్రైనేజీ నీరు నిల్వ ఉండకుండా వారం రోజుల్లోగా చర్యలు తీసుకోవాలన్నారు. బహుద్దూర్పూర లోని దారుల్ షిఫా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా పాఠశాల ఆవరణలో మురికి నీరు నిల్వ ఉండకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ నీళ్లు పాఠశాలలోకి రాకుండా వెంటనే తగు చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించారు అనంతరం అంధుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఆయన వెంట డీఈవో రోహిణి తదితరులు ఉన్నారు. -
No Headline
సభను అడ్డుకుంటాం: బీఆర్ఎస్వీ ఓయూ ఆర్ట్స్ కాలేజీ వేదికగా డిసెంబరు 18, 21 తేదీల్లో నిర్వహించనున్న కృతజ్ఞత మహాసభలను అడ్డుకుంటామని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.గదరాజు చందు పేర్కొన్నారు. గురువారం ఓయూలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా విద్యాశాఖ మంత్రిని నియమించలేదన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో కాలేజీల మూతపడుతున్నాయన్నారు. ఉద్యోగాల భర్తీ పేరుతో మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి పాలనపై రాష్ట్రంలో ఎక్కడ కృతజ్ఞత సభ పెట్టినా అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో జీడీ అనీల్, జంగయ్య, రవి, కొంపెల్లి నరేష్, మిథున్ ప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -

ఎట్టకేలకు కదలిక
● రెండున్నరేళ్లుగా నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టు ● స్థానిక అభ్యంతరాలతో నిలిచిపోయిన పనులు ● ప్రజాప్రతినిధులతో చర్చించిన అనంతరం పరిష్కారం ● వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తాం: జలమండలి ఎండీ పాతబస్తీ సీవరేజీ నెట్వర్క్ పనులు చకచకా సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీ సీవరేజీ నెట్వర్క్ ప్రాజెక్టు పనుల్లో కదలిక వచ్చింది. మూసీ నదికి ఉత్తరం వైపున మురుగు నీటి పారుదల వ్యవస్థ ఆధునికీకరణ కోసం చేపట్టిన జోన్– 3 సీవర్ నెట్వర్క్ ప్రాజెక్టు పనులు రెండున్నరేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా జలమండలి ఎండీ అశోక్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులపై దృష్టి సారించి చర్యలకు ఉపక్రమించారు. పాతబస్తీలోని గోషామహల్, నాంపల్లి, కార్వాన్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో సీవరేజీ వ్యవస్థను ఆధునికీకరించడానికి మురుగు నీటి పారుదల ప్రాజెక్టును జలమండలి చేపట్టింది. దాదాపు రూ.297 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులో మొత్తం 129.32 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. కొంత మేరకు పనులు సాగిన అనంతరం స్థానిక సమస్యల కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయాయి. మూడు ప్రాంతాల్లో.. ఓల్ట్‌సిటీ ప్రాజెక్టులో మూడు ప్రాంతాల్లో దాదాపు 2.1 కిలోమీటర్ల మేరకు స్థానిక అభ్యంతరాలు, ఇతరత్రా సమస్యలతో పనులు నిలిచిపోయాయి. స్థానికులు, ప్రజాప్రతినిధులతో చర్చించి పనులు చేపట్టేలా తాజాగా జలమండలి ఎండీ ఆదేశాలు జారీ చేశారు. మరో 7 కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణ పనులను వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు.. పాతబస్తీ పరిధిలోని టోలిచౌకి, గోల్కొండ, లంగర్‌హౌస్, సెవెన్ టూంబ్స్, జూబ్లీహిల్ (కొంత భాగం), మెహిదీపట్నం. నానల్‌నగర్, ఆసిఫ్‌నగర్, విజయనగర్ కాలనీ, ఎన్ఎండీసీ కాలనీ, మాసబ్‌ట్యాంక్, రెడ్‌హిల్స్, లక్డీకాపూల్, బజార్‌ఘాట్, నాంపల్లి మల్లేపల్లి, బేగం బజార్ ప్రాంతాలు. పాతబస్తీలో ప్రస్తుతం సీవరేజీ ఔట్ లెట్ లేని లైన్లను జోన్–3 సీవరేజీ నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసేలా జలమండలి ప్రణాళికలు రూపొందిస్తోంది. పాతబస్తీలో సీవరేజీ పనులను పరిశీలిస్తున్న జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రాజెక్టు స్వరూపం జోన్–3 మురుగు నీటిపారుదల వ్యవస్థలో తొమ్మిది పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి. జోన్ పరిధిలోకి మొత్తం 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఎన్–1 నుంచి ఎన్–7 వరకు ఎన్–11 ,ఎన్–31 పరీవాహక ప్రాంతాలు వస్తాయి. ప్రస్తుతం 355.78 కిలోమీటర్ల పొడవైన సీవరేజీ నెట్వర్క్ కలిగి ఉంది. మొత్తం కొత్త నెట్వర్క్: 129.32 కిలోమీటర్లు ఆర్సీసీ ట్రంక్ సీవర్స్ పైపులైన్ 400–1200 ఎంఎం డయా: 36.14 కి.మీ ఎస్‌డబ్ల్యూజీ నెట్వర్క్ 200–300 ఎంఎం డయా: 93.18 కి. మీ మురుగు ప్రవాహం అంచనా: 2036 నాటికి 127.42 ఎంఎల్డీ 2051 నాటికి 153.81 ఎంఎల్డీ -
ప్రముఖులకు గగనతల
సాక్షి, సిటీబ్యూరో: ముష్కరమూకలు తెలివి మీరుతున్నాయి.. ఓ పక్క ఉగ్రవాదులు, మరోపక్క తీవ్రవాదులు గగనతల దాడులకు కుట్రలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో పారాగ్లైడర్లు, డ్రోన్లతో పాటు అనధికారికంగా వినియోగించే అన్ని రకాలైన ఎగిరే వస్తువులపై నిషేధం విధించాల్సిందిగా కేంద్ర నిఘా వర్గాలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. ఈ హెచ్చరిక వెనుక అనేక కారణాలున్నాయి. దేశ వ్యాప్తంగా పోలీసులకు పట్టుబడిన ఉగ్రవాదుల విచారణలో వెలుగులోకి వచ్చిన అంశాలతో పాటు అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలపై నిఘా వర్గాలు ఆధారాలు సేకరించాయి. ఈ నేపథ్యంలో ముష్కర సంస్థల గగనతల దాడుల వ్యూహం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రత్యేకంగా ఎంపిక చేసిన క్యాడర్‌కు గగనతల దాడుల్లో శిక్షణ ఇస్తున్నట్లు వీరు వెల్లడించారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి చెందిన ఓ వింగ్ ఈ ఉగ్రవాదులకు పారాచూట్ జంపింగ్‌లో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. పాక్ కేంద్రంగా పని చేస్తున్న కొన్ని ఉగ్రవాద సంస్థలు చైనా, యూఏఈకి చెందిన కంపెనీల నుంచి పారాగ్లైడర్ల తయారీకి ఉపకరించే ఉపకరణాలు, పాకిస్థాన్‌కు చెందిన ఓ కంపెనీ నుంచి డ్రోన్లు ఖరీదు చేసినట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. వీటికి తోడు గతంలో స్పెయిన్‌లో జరిగిన గగనతల పరికరాలు, ఉపకరణాల కొనుగోళ్లకు సంబంధించి నిఘా వర్గాలు సేకరించిన ఆధారాలు మరింత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన కొందరు వ్యక్తులు 10 లక్షల పాక్ రూపీలను వెచ్చించి స్పెయిన్‌లో పారాగ్లైడర్ ఉపకరణాలను ఖరీదు చేసినట్లు నిఘా వర్గాలకు ఆధారాలు లభించాయి. వీటిలో ఇద్దరు ప్రయాణించే సౌకర్యం ఉందని, ఇవి దాదాపు 150 కేజీల బరువును 70 కిమీ మేర నిర్విరామంగా మోసుకుపోయే సామర్థ్యం కలిగి ఉన్నట్లు గుర్తించాయి. వీరు ఈ ఉపకరణాలను వివిధ మార్గాల్లో భారత్‌కు తరలించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నాయి. వీటిని వినియోగించి టార్గెట్లపై గగనతల దాడులు చేయడంతో పాటు పేలుడు పదార్థాలు, ఆయుధాల రవాణాకూ వినియోగించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే అనధికారిక పారాగ్లైడర్లు, డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ ద్వారా పని చేసే తేలికపాటి ఎయిర్‌క్రాఫ్ట్‌లు, చిన్న పరిమాణం కలిగిన మానవరహిత విమానాలను పూర్తి స్థాయిలో నిషేధించాలని, అనుమతి ఉన్న వాటినీ సాధ్యమైనంత వరకు నియంత్రించాలని అన్ని రాష్ట్రాలనూ హెచ్చరించాయి. మరోపక్క మావోయిస్టులు మినీ హెలీకాఫ్టర్ల తయారీపై దృష్టి పెట్టినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఛత్తీస్గడ్, బీహార్, కేరళలో జరిగిన ఆపరేషన్ల సందర్భంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న పత్రాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తక్కువ బరువు, సామర్థ్యం కలిగినవి రూపొందించి వినియోగించడానికి మావోయిస్టులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడైంది. వీటికి సంబంధించిన ఓ డిజైన్ బీహార్‌లోని గయ ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్) అధికారులకు లభించింది. ఇప్పటి వరకు విధ్వంసాల కోసం మావోయిస్టులు ఎక్కువగా మందుపాతరలనే ప్రయోగిస్తున్నారు. వీటికి భిన్నంగా రిమోట్ కంట్రోల్ బాంబుల తయారీకీ ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. వీటినీ గగనతలం ద్వారా వినియోగించే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నేటి సాయంత్రం వరకు అత్యంత అప్రమత్తం... రాజధానిలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కొత్వాల్ సీవీ ఆనంద్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలను పరిగణలోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఐఎస్ఐ డివిజన్ బుధవారం నగర పోలీసులకు ఓ వర్తమానం పంపింది. రాష్ట్ర సచివాలయానికి మూడు కిలోమీటర్ల పరిధిలో, సున్నిత విభాగాలకు కార్యాలయాలకు 2 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్డ్ మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ ఎగరడంపై నిషేధం విధించాలని స్పష్టం చేసింది. వీటిని పరిగణలోకి తీసుకున్న సీపీ గగనతలంలో ఎగిరే వాటిపై నిషేధం విధించారు. శుక్రవారం సాయంత్రం వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని, అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫొటోలు, వీడియోల చిత్రీకరణ కోసమూ వీటిని వాడకూడదని స్పష్టం చేశారు. రాష్ట్రపతి పర్యటన ముగిసే వరకు గగనతలంపైనా పటిష్ట నిఘా ఉంచాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నిఘా హెచ్చరికలు నగరంలో డ్రోన్లు, పారాగ్లైడర్ల సంచారంపై నిషేధం పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు -
కనెక్షన్ లైన్ కట్..!
సిల్ట్ చాంబర్లు లేకుంటే సాక్షి,సిటీబ్యూరో: వాణిజ్య భవన సముదాయాలు సిల్ట్ చాంబర్లు తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలని లేనిపక్షంలో సీవరేజ్ పైప్‌లైన్ కనెక్షన్లను తొలగించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి సంబందిత అధికారులను అదేశించారు. గురువారం ఆయన 90 రోజుల స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మోహిదీపట్నం, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో డీ–సిల్టింగ్ పనులను పరిశీలించారు. మెహిదీపట్నం అంబా థియేటర్ వద్ద ప్రధాన రహదారిపై తరచూ పొంగుతున్న మ్యాన్ హోళ్లను పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లోని హోటళ్ల యాజమానులు తమ సీవరేజ్ పైప్ లైన్లను నేరుగా జలమండలి సీవరేజ్ నెట్వర్క్ కు అనుసంధానం చేసినందునే వాటి నుంచి వచ్చే ఆహార, వ్యర్థ పదార్థాలు మ్యాన్ హోళ్లలో చేరి సమస్య ఎదురవుతుందన్నారు. ఈ నేపథ్యంలో హోటళ్లు, బేకరీలు, ఫుడ్ కోర్టులు, వాణిజ్య భవనాల యజమానులకు సిల్ట్ చాంబర్లు నిర్మించుకోవాలని నోటీసులు జారీ చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే వారి సీవరేజ్ పైపు లైన్ కనెక్షన్లను తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సీజీఎం వినోద్ భార్గవ, జీఎం, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు. సిల్ట్ చాంబర్ల ఏర్పాటు తప్పనిసరి డీ–సిల్టింగ్ స్పెషల్ డ్రైవ్ పనుల పరిశీలన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి -
రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న ముఠా నాయకుడి అరెస్టు
● పరారీలో మరో నలుగురు నిందితులు ● 216 గ్రాముల బంగారం స్వాధీనం సికింద్రాబాద్: రైళ్లలో ప్రయాణిస్తూ విలువైన బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును సికింద్రాబాద్ రైల్వే పోలీసులు రట్టు చేశారు. గురువారం ముఠా నాయకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో నలుగురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. జీఆర్పీ డీఎస్పీ ఎస్ఎన్ జావెద్, ఇన్స్పెక్టర్లు బీ.సాయీశ్వర్‌గౌడ్, బీఎస్ సారస్వత్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... నార్త్‌వెస్ట్ ఢిల్లీకి చెందిన రణ్‌బీర్‌సింగ్ డ్రైవర్‌గా పని చేసేవాడు. మద్యం, మాదకద్రవ్యాలకు బానిసైన అతను రైళ్లలో చోరీలకు పాల్పడుతున్నాడు. ఢిల్లీ రైల్వేస్టేషన్ పరిధిలో పలు దొంగతనాలు చేసిన అతను అక్కడి పోలీసులకు పట్టుబడి జైలుకు వెళ్లి వచ్చాడు. జైలులో పరిచయమైన మరి కొందరితో కలిసి ముఠాగా ఏర్పడిన అతను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా చోరీలు చేస్తున్నాడు. ఈనెల 21న ఉదయం తన బృందంతో కలిసి దొంగతనాలు చేసేందుకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ 10వ ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్న రణ్‌బీర్‌సింగ్ అనూహ్యంగా పోలీసులకు పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో ఇక్కడ నాలుగు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. చోరీ సొత్తును కరిగించి బంగారాన్ని ముఠా సభ్యులందరూ సమానంగా పంచుకునేవారమని నిందితుడు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. అతడి నుంచి రూ. 21 లక్షల విలువైన 216 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. జట్టు సభ్యులైన హరియాణాకు చెందిన షంషీర్, సుమిత్, సత్వీర్, జగదీశ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. -

18న ఓయూలో కృతజ్ఞత మహాసభ
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ క్యాంపస్ ఆర్ట్స్ కాలేజీ ఎదుట డిసెంబర్ 18న కృతజ్ఞత మహాసభను నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కోటూరి మానవత రాయ్ తెలిపారు. గురువారం ఆర్ట్స్ కాలేజీ ఎదుట సభ విజయవంతం కోసం రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగాల భర్తీతో పాటు విద్యార్థులకు 40 శాతం కాస్మొటిక్, డైట్ చార్జీల పెంపు, స్కిల్ వర్సిటీ ఏర్పాటు స్పోర్ట్స్ వర్సిటీ స్థాపనకు చర్యలు తీసుకుందన్నారు. విద్యార్థి, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ మహాసభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బైరి నాగరాజుగౌడ్, రెడ్డి శ్రీను, భీమ్రావ్ నాయక్, పట్ల నాగరాజు, క్రాంతి, నగేష్ పాల్గొన్నారు. -
రూ.22 లక్షల హవాలా నగదు పట్టివేత
ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ సుల్తాన్‌బజార్: అక్రమంగా తరలిస్తున్న రూ.22 లక్షల హవాలా నగదును స్వాధీనం చేసుకున్న సుల్తాన్‌బజార్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోఠి గుజరాతి గల్లీలో ముగ్గురు వ్యక్తులు రూ.22 లక్షల నగదు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆర్కే.కాంప్లెక్స్ వద్ద మాటు వేసిన పోలీసులు యాక్టివాపై నగదు తీసుకెళుతున్న మొగల్పురాకు చెందిన మహ్మద్ అబ్దుల్ ఖయ్యూమ్, గుజరాతీ గల్లీకి చెందిన ఉత్తమ్‌కుమార్, హనుమాన్టేక్డీకి చెందిన లలిత్సింగ్లను అదుపులోకి తీసుకున్నారు. నగదుకు సంబందించి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళా న్యూస్‌రీడర్‌కు వేధింపులు నిందితుడిపై కేసు నమోదు బంజారాహిల్స్: తనను వెంటాడి వేధింపులకు గురిచేస్తున్నాడని, తన ప్రతిష్ఠ దెబ్బతినేలా వ్యవహరిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని మహిళా న్యూస్ రీడర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు ఓ యువకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఓ టీవీ చానల్లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న యువతికి ఐదేళ్ల క్రితం హరీష్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఏడాది క్రితం హరీష్ మరో యువతిని వివాహం చేసుకోవడంతో బాధితురాలు అతడితో మాట్లాడటం ఆపేసింది. అయితే హరీష్ కొంతకాలంగా ఆమెను వెంబడిస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, తన సహోద్యోగుల ఎదుట దుర్బాషలాడుతూ తన ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తున్నాడంటూ బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితం తన కార్యాలయానికి వచ్చిన హరీష్ కిందికి వెళ్లి మాట్లాడుకుందామంటూ బలవంతంగా బయటికి తీసుకువచ్చి లిఫ్ట్‌లో ఎక్కిన తర్వాత కొట్టడమే కాకుండా కారు రెడీగా ఉంచండి..అంటూ తన స్నేహితులకు చెప్పాడన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నిందితుడు తన వెంట పడుతున్నాడని, వేధింపులకు గురిచేస్తున్నాడని, ఫోన్ చేస్తూ అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు హరీష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ అదుపు తప్పి యువకుడి మృతి దుండిగల్: బైక్ అదుపు తప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు మృతి చెందిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. వరంగల్ జిల్లా, సముద్రాల గ్రామానికి చెందిన దేవేందర్‌రెడ్డి– శ్రీలత దంపతులు నగరానికి వలస వచ్చి డి.పోచంపల్లి సారెగూడెంలో నివాసమంటున్నారు. వారి కుమారుడు చంద్రశేఖర్‌రెడ్డి(23) మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నాడు. బుధవారం రాత్రి అతను విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా స్థానిక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలోని సర్వీస్ రోడ్డులో బైక్ అదుపు తప్పి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు సూరారంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి దారుణ హత్య సంతోష్‌నగర్: పాత గొడవల కారణంగా ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన సంఘటన సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాత్రి ఓవైసీ కాలనీ ఫజల్ కేఫ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు సంతోష్‌నగర్ ఎంబీ హట్స్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సాబేర్ ఖాన్ కుమారుడు మహ్మద్ మోహిత్ ఖాన్ (18)పై కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు ఓవైసీ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాత గొడవల కారణంగానే ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. సంతోష్‌నగర్ ఏసీపీ మహ్మద్ గౌస్, సంతోష్‌నగర్ ఇన్స్పెక్టర్ కె.సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నకిలీ ఆర్టీఓ ఆటకట్టు ఉప్పల్: ఉప్పల్ పోలీసులు నకిలీ ఆర్టీఓ ఆట కట్టించారు. కారులో తిరుగుతూ సెంట్రింగ్ మిల్లర్లను భయపెట్టి వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ హనుమసాయినగర్ ప్రాంతానికి చెందిన ప్రేమ్ కుమార్ రెడ్డి స్థానికంగా కట్టెల మిషన్ నడుపుతున్నాడు. నాలుగు నెలలుగా అతను ప్రతి రోజు తెల్లవారుజామున ఆర్టీఓ అవతారం ఎత్తేవాడు. కారులో తిరుగుతూ రోడ్డుపై వెళుతున్న సెంట్రింగ్ మిల్లర్లను అడ్డగించి తాను ఆర్టీఓనని కాగితాలు చూపించాలంటూ, బండి ఓవర్ లోడ్ ఉందంటూ పలు రకాలు బెదిరించి అందిన కాడికి వసూలు చేస్తున్నాడు. ఉప్పల్, బోడుప్పల్, చంగిచర్ల, మేడిపల్లి, నాగోల్ తదితర ప్రాంతాల్లో మాటు వేసి వసూళ్ల దందాకు తెరలేపాడు. ఒకసారి తానే ఆర్టీఓను అంటూ..మరోసారి సార్ కారులో ఉన్నాడంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. అతడి వైఖరిపై అనుమానం వచ్చిన సెంట్రింగ్ మిల్లర్ల యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఘా ఉంచిన ఉప్పల్ పోలీసులు గురువారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. బ్రెజా కారు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఆర్టీఓను అరెస్టు చేసినట్లు సమాచారం అందడంతో బాధితులు పెద్ద సంఖ్యలో ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌కు తరలి వచ్చారు. గతంలో ఆర్టీఓ అధికారులు తనకు చలానా వేసి వేధించడంతోనే తానూ రంగంలోకి దిగినట్లు నిందితుడు పేర్కొనడం గమనార్హం. భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి ఫిలింనగర్: నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి కార్మికుడు మృతి చెందిన సంఘటన ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..బీహార్‌కు చెందిన మహ్మద్ తయీమ్మియా (36) రెండేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి షేక్‌పేట బృందావన్ కాలనీలో తన గ్రామానికే చెందిన మహ్మద్ ఖయూమ్ మియా వద్ద ఉంటున్నాడు. గురువారం అతను ఎస్ఏ కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనంలో ముఖేష్ అనే వ్యక్తితో కలిసి ఐదో అంతస్తులో రూఫ్ వర్క్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఇద్దరూ జారి లిఫ్ట్ గుంతలో పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని అత్తాపూర్‌లోని జర్మెంటైన్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తయీమ్మియా మృతి చెందాడు. ముఖేష్ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడి సోదరుడు ఖయూమ్మియా ఫిర్యాదు మేరకు పోలీసులు బిల్డర్, కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ● కారులో తిరుగుతూ దందాలు ● నాలుగు నెలలుగా సెంట్రింగ్ మిల్లర్లను బెదిరించి వసూళ్లు -
‘నూతన జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ భేష్’
సాక్షి, సిటీబ్యూరో: భారతీయ విద్యా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ప్రభుత్వ ఆధ్వర్యంలోని కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్ ఈ మార్పునకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని ప్రముఖ బ్రిటిష్ రచయిత్రి, విద్యావేత్త కై ్లర్ హార్స్‌బర్గ్ అన్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌కు చెందిన కై ్లర్ ప్రస్తుతం భారత్‌లోని ప్రధానమైన 9 నగరాల్లో సరళంగా ఆంగ్ల భాషా బోధన అనే అంశంపై వర్క్ షాప్‌లను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె గురువారం విద్యా మంత్రిత్వ శాఖ నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్‌లో భాగంగా నగరంలో ఉపాధ్యాయులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కై ్లర్ హార్స్‌బర్గ్ మాట్లాడుతూ., భారత్‌లోని ఉపాధ్యాయులకు వారి తరగతి గదులను ఆనందంగా, ఆకర్షణీయంగా మార్చడానికి వినూత్న పద్ధతులపై శిక్షణ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. బాష ఒక విద్యావేత్త, రచయితగా అనేక అవకాశాలను అందిస్తుందని, సంస్కృతులను అనుసంధానం చేసే వేదికగానూ పనిచేస్తుందన్నారు. ఈ వేదిక 21వ శతాబ్దపు నైపుణ్యాలు, ఉన్నత స్థాయి ఆలోచలను (హాట్స్) అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ వర్క్ షాప్‌లో భాగంగా నూతన ఆక్స్ ఫర్డ్ మోడ్రన్ ఇంగ్లిష్ 2025 ఎడిషన్‌ను ప్రారంభించారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఇండియా రీజినల్ సేల్స్ డైరెక్టర్ సంత్యేంద్ర భదౌరియా మాట్లాడుతూ., 1478 నాటి అతిగొప్ప చరిత్రతో ‘ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ఎడ్యుకేషనల్’ పబ్లిషింగ్‌లో గ్లోబల్ లీడర్‌గా పేరు తెచ్చుకుందన్నారు. -
లబ్ధిదారులకు సబ్సిడీ త్వరగా అందించాలి: కలెక్టర్
సాక్షి, సిటీబ్యూరో: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు వివిధ శాఖల ద్వారా అందించిన వాహనాలకు సంబంధించిన సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో టీజీ ప్రైడ్ స్కీమ్ కింద ట్రాన్స్‌పోర్టు, ప్యాసింజర్, గూడ్స్ వాహనాలకు సంబంధించిన సబ్సిడీపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుండి సబ్సిడీ అందగానే వెంటనే లబ్ధిదారులకు చెల్లించాలని సూచించారు. యువత అభిరుచి మేరకు వివిధ పారిశ్రామిక రంగాల్లో శిక్షణ అందించి వారి ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం పవన్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్, డీటీడబ్ల్యూఓ కోటాజీ, ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, ఐపిఓ హేమ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.