inter college athletics championship
-
సురేశ్, కావ్యలకు స్వర్ణాలు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఇ. సురేశ్, పి.కావ్య సత్తా చాటారు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో 800మీ. పరుగులో వీరిద్దరూ స్వర్ణా లను సాధించారు. పురుషుల 800మీ. పరుగులో వివేకానంద ప్రభుత్వ కాలేజీకి చెందిన సురేశ్ విజేతగా నిలవగా... కె. అజయ్ కుమార్ (ఎస్పీ కాలేజి), ఎం. రాము (జీసీపీఈ) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. మహిళల విభాగంలో పి. కావ్య (ఎస్.ఎన్. వనిత), ఎన్. సుచిత్ర (సెయింట్ ఆన్స్), ఎ. కీర్తి (భవన్స్ కాలేజి) వరుసగా స్వర్ణ, రజత, కాంస్యాలను గెలుచుకున్నారు. నిజాం కాలేజి ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ టోర్నీ ప్రారంభోత్స వంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఎల్. రామచంద్రారావు ముఖ్య అతిథులుగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్ ఎల్.బి. లక్ష్మీకాంత్ రాథోడ్, ఓయూ ఐయూటీ సెక్రటరీ ప్రొఫెసర్ బి. సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు లాంగ్ జంప్: 1. పి. శ్రీకాంత్ రెడ్డి (లయోలా), 2. ఆర్. సతీశ్ (జీసీపీఈ), 3. తేజ (బీజేఆర్). షాట్‌పుట్: 1. జె. సంధ్య (జీసీపీఈ), 2. ఎం. అంబిక (జీసీపీఈ), 3. ఎం. సుమన (బీవీసీ). మహిళల 4–400మీ. రిలే : 1. సెయింట్ ఆన్స్, 2. జీసీపీఈ, 3. భవన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి. పురుషుల 4–400మీ. రిలే: 1. నిజాం కాలేజి, 2. జీసీపీఈ, 3. హిందీ మహావిద్యాలయ. షాట్‌పుట్: 1. అలెక్స్ జోసెఫ్ (బీవీసీ), 2. శ్రీశైలం (ఎస్డీసీపీఈ), 3. మోహన్‌లాల్ (ఓయూ పీజీ కాలేజి). లాంగ్‌జంప్: 1. ఎస్కే హిజ్రత్ (ఓసీపీఈ), 2. ఇరిన్ దిల్నా (సెయింట్ పాయ్స్), 3. రమా వాసవి (వెస్లీ డిగ్రీ కాలేజి). 400మీ. హర్డిల్స్: 1. బి. మమత (నిజాం కాలేజి), 2. హఫీజా బేగం (సెయింట్ ఆన్స్), 3. పి. ప్రియ (జీసీపీఈ). 200మీ. పరుగు: 1 జి. నిత్య (సెయింట్ ఆన్స్), 2. ఆర్. భవాని (కేశవ్ మెమోరియల్), 3. దివ్యశ్రీ (డీవీఎం). -
చాంపియన్స్ సెయింట్ ఆన్స్, జీసీపీఈ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సెయింట్ ఆన్స్ మహిళా కాలేజి (మెహదీపట్నం), ప్రభుత్వ వ్యాయామ విద్య కాలేజి (జీసీపీఈ, దోమల్‌గూడ) జట్లు సత్తా చాటాయి. గచ్చిబౌలిలో జరిగిన ఈ టోర్నీలో ఈ రెండు జట్లు టీమ్ చాంపియన్‌షిప్‌ను ౖకైవసం చేసుకున్నాయి. మహిళల విభాగంలో సెయింట్ ఆన్స్ (57 పాయింట్లు), జీసీపీఈ (29 పాయింట్లు), లయోలా అకాడమీ (22 పాయింట్లు) వరుసగా తొలి మూడు స్థానాలను సాధించాయి. పురుషుల విభాగంలో జీసీపీఈ 52 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకోగా, నిజాం కాలేజి (28 పాయింట్లు), హెచ్జీపీఎం కాలేజి (27 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమ్లాన్ బోర్గెహెన్ (అవినాశ్ కాలేజి), జి. నిత్య (సెయింట్ ఆన్స్) ‘బెస్ట్ అథ్లెట్’ పురస్కారాలను అందుకున్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు 100 మీ. పరుగు: మహిళలు: 1. జి. నిత్య, 2. ఎస్. సుజాత, 3. ఎం. తేజస్విని; పురుషులు: 1. అమ్లాన్ బోర్గెహెన్, 2. కె. రాము, 3. ఎం. అరుణ్. 400 మీ. మహిళలు: 1. పి. సుష్మితా రాణి, 2. కె. ప్రత్యూష, 3. ఎన్. సుచిత్ర; పురుషులు: 1. శ్రవణ్ కుమార్, 2. డీఎస్ రాహుల్, 3. పి. యశ్వంత్ సాయి. 1500 మీ. మహిళలు: 1. ఎన్. సుచిత్ర, 2. బి. సంధ్య, 3. కె. మౌనిక; పురుషులు: 1. వి. మారుతి, 2. బి. వెంకటప్ప, 3. కె. నరేశ్. 3000 మీ. స్టీపుల్ చేజ్: 1. వి. శ్రీనివాస్, 2. బి. ప్రశాంత్, 3. బి. రంగయ్య. 10000 మీ. మహిళలు: 1. ఆర్. కలైవాణి, 2. పి. రజిత, 3. పి. తేజస్వి; పురుషులు: 1. బి. రమేశ్, 2. పి. మహిపాల్, 3. బి. రంగయ్య. హ్యామర్ త్రో: 1. కె. నాగ అనూష, 2. యాస్మిన్, 3. ఎం. అంబిక; పురుషులు: 1. అన్వేష్, 2. అంకిత్ పాథక్, 3. జె. అమరేందర్. ట్రిపుల్ జంప్ మహిళలు: 1. హిజ్రత్, 2. మోహన రవళి, 3. డి. మానస; పురుషులు: 1. పీఎన్. సాయికుమార్, 2. శ్రీకాంత్ రెడ్డి, 3. ఆర్. సతీశ్. హైజంప్: 1. సీహెచ్ మోహన రవళి, 2. పి. స్రవంతి, 3. బి. ఉషారాణి. జావెలిన్ త్రో పురుషులు: 1. రత్నాకర్, 2. కృష్ణారెడ్డి, 3. ఆర్. శ్రీనివాస్. 4–100మీ. రిలే పురుషులు: 1. జీసీపీఈ, 2. నిజాం కాలేజి, 3. లయోలా అకాడమీ; మహిళలు: 1. జీసీపీఈ, 2. నిజాం కాలేజి, 3. లయోలా అకాడమీ. -
ఓవరాల్ చాంప్ భవన్స్ అరబిందో కాలేజి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ మీట్లో భవన్స్ శ్రీ అరబిందో జూనియర్ కాలేజి సత్తా చాటింది. గచ్చిబౌలిలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో బాలుర, బాలికల విభాగాల్లో ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. భవన్స్ కాలేజి వరుసగా ఐదోసారి ఈ టోర్నీలో ఓవరాల్ చాంపియన్‌గా నిలవడం విశేషం. ఈసారి 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలను భవన్స్ కాలేజి జట్లు సాధించాయి. భవన్స్ కాలేజి తరఫున రాహుల్ శర్మ (800 మీ. పరుగు), వి. సనత్ రెడ్డి (110 మీ. హర్డిల్స్), సూరజ్ (400 మీ. హర్డిల్స్), అజయ్ జోషి (డిస్కస్ త్రో), పి. శ్రీచరణ్ రెడ్డి (హైజంప్), బి. అనంతు (హ్యామర్ త్రో), సచిన్ పిళ్లై (5 కి.మీ నడక), బాలుర 4–100 మీ. రిలే, 4–400 మీ. రిలే, జి. దివ్యశ్రీ (200 మీ.), ఐశ్వర్య (400 మీ.), ఎన్. అపూర్వ (లాంగ్‌జంప్), ప్రణీత (3 కి.మీ నడక) పసిడి పతకాలను గెలుచుకున్నారు. ఇతర ఈవెంట్ల విజేతల వివరాలు బాలురు: 100 మీ. పరుగు: 1. జి. చైతన్య, 2. ఎ. సాయి చందు, 3. షాన్వాజ్ అహ్మద్; బాలికలు: 1. హర్షిత, 2. జి. దివ్యశ్రీ, 3. బి. శ్రీలత. 200 మీ. పరుగు: 1. ఆర్. శశివర్ధన్, 2. ఎ. సాయి చందు, 3. జె. నరేశ్; బాలికలు: 1. జి.దివ్యశ్రీ, 2. కిరణ్మయి, 3. అంజలి సింగ్. 400 మీ. పరుగు: 1. ఆర్.శశివర్ధన్, 2. జె. నరేశ్, 3. బి. దివాకర్; బాలికలు: 1. ఎ.కీర్తి, 2. కె. గంగోత్రి, 3. అంజలి సింగ్. 800 మీ. పరుగు: 1. రాహుల్ శర్మ, 2. బి. శ్రీశైలం, 3. భరత్ కుమార్; బాలికలు: 1. ఎ. కీర్తి, 2. ఎ. తరుణి, 3. ప్రాచి బజాజ్. 110 మీ. హర్డిల్స్ బాలురు : 1. వి. సనత్ రెడ్డి, 2. బి. దివాకర్, 3. సిద్ధార్థ్. 100 మీ. హర్డిల్స్ బాలికలు: 1. కసక్, 2. ఐశ్వర్య, 3. అపూర్వ. 400 మీ. హర్డిల్స్: 1. సూరజ్, 2. జె. నరేశ్, 3. బి.దివాకర్; బాలికలు: 1. ఐశ్వర్య, 2. పి. సౌమ్య, 3. కె. మాధురి. షాట్‌పుట్: 1. బి. వంశీ, 2. కె. శ్రీను, 3. పి. రోహిత్; బాలికలు: 1. శ్రీ రజిత, 2. టి. సింధు ప్రీతి, 3. బి. అనూష. డిస్కస్ త్రో: 1. అజయ్ జోషి, 2. పి. వంశీ, 3. గౌతమ్; బాలికలు: 1. నిఖిత, 2. టి. సింధు ప్రీతి, 3. శ్రీ రజిత. లాంగ్‌జంప్: 1. షాన్వాజ్ అహ్మద్, 2. శ్రీచరణ్, 3. ఆర్. శామ్యూల్; బాలికలు: 1. ఎన్. అపూర్వ, 2. టి. శ్రీలక్ష్మి, 2. అరుణ జ్యోతి, 3. కిరణ్మయి. ట్రిపుల్ జంప్: 1. ఆర్. శామ్యూల్, 2. శ్రీచరణ్, 3. వి. సనత్ రెడ్డి; బాలికలు: 1. బి. శ్రీలత, 2. టి. శ్రీలక్ష్మి, 3. శ్రీబృంద. హైజంప్: 1. పి. శ్రీచరన్ రెడ్డి, 2. ఆర్. శామ్యూల్, 3. సూర్య; బాలికలు: 1. కసక్, 2. ఎన్. అపూర్వ, 3. ఆపేక్ష. జావెలిన్ త్రో: 1. పి. వంశీ, 2. పి. రోహిత్, 3. అజయ్ జోషి; బాలురు: 1. బి. సింధుప్రీతి, 2. జేఎన్ భవాని, 3. డి. భవాని. హ్యామర్ త్రో: 1. బి. అనంతు, 2. కె. మదన్, 3. సి. వశీ; బాలికలు: 1. కె. రుషిత, 2. డి. రుషిత, 3. బి. అనూష. 1500 మీ.: 1. పవన్ తేజ, 2. టి. రాజేశ్, 3. కె. శ్రీధర్; బాలికలు: 1. ఎ. కీర్తి, 2. కె. గంగోత్రి, 3. శ్రావణి. 3 కి.మీ వాక్ బాలికలు: 1. ఎం. ప్రణీత, 2. తేజశ్రీ, 3. సుజన్. 5 కి.మీ వాక్: 1. సచిన్, 2. బి.రోహిత్ కుమార్, 3. మహేశ్‌బాబు. 4–100 మీ. రిలే:1. భవన్స్ కాలేజి, 2. ఓబుల్ రెడ్డి కాలేజి, 3. హెచ్‌పీఎస్. బాలికలు: 1. భవన్స్ కాలేజి, 2. టీఎస్డబ్ల్యూఆర్ఐఎస్, 3. ఓబుల్ రెడ్డి. 4–400 మీ. రిలే: 1. భవన్స్ కాలేజి, 2. రైల్వేస్ కాలేజి, 3. ఓబుల్ రెడ్డి; బాలికలు: 1. భవన్స్ కాలేజి, 2. కస్తూర్బా జూనియర్ కాలేజి. -
రైల్వే జట్టుకు అథ్లెటిక్స్ టీమ్ టైటిల్
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ సమాఖ్య ఇంటర్ కాలేజి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రైల్వే జూనియర్ కాలేజి సత్తాచాటింది. బాలుర విభాగంలో ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది. వ్యక్తిగత విభాగంలో 15 పాయింట్లు సాధించిన పి.గోపాల్ చాంపియన్‌షిప్‌ను సొంతం చేసుకున్నాడు. 800 మీ. 1500 మీ. 400 మీ హర్డిల్స్‌లో అతను అగ్రస్థానంలో నిలిచాడు. 400 మీటర్లలో సాయిరామ్ రెండో స్థానంలో; లాంగ్‌జంప్, ట్రిపుల్ జంప్‌లో దుర్గాప్రసాద్ మూడో స్థానంతో సంతృప్తిపడ్డాడు. భరత్ కుమార్ 200 మీటర్లలో రెండో స్థానంలో; 800 మీటర్లలో మూడో స్థానంలో నిలిచాడు. హైజంప్‌లో రూడీ స్టాన్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 4ఁ100 మీ. రిలేలో పరమేశ్, సాయిరామ్, రాకేష్, గోపాల్ బృందం విజేతగా నిలవగా; దుర్గా ప్రసాద్, సాయిరామ్, హేమంత్ సావిన్ కుమార్ల జట్టు మూడో స్థానంతో సరిపెట్టుకుంది.