IPL 7
-
నువ్వా.. నేనా.. తేలేది నేడే!!
ఒకటిన్నర నెలలకు పైగా మురిపించిన క్రికెట్ సమరం.. ముగింపు దశకు వచ్చేసింది. అడుగడుగునా సంచలనాలు నమోదు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ఎక్కడలేని మజాను అందించింది. దిగ్గజాలు అనుకున్న ధోనీసేన క్వాలిఫయర్ దశలో పంజాబ్ చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కసారిగా విరుచుకుపడి ఏకంగా 122 పరుగులు చేయడంతో సురేష్ రైనా 87 పరుగులు చేసినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ తన లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. అలాంటి అరివీర భయంకరమైన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టును లీగ్ దశలో ఓడించిన ఏకైక టీమ్.. కోల్‌కతా నైట్ రైడర్స్. గౌతమ్ గంభీర్ సారథ్యంలోని ఈ జట్టు మరోసారి ఐపీఎల్ కప్పును అందుకోడానికి ఉరకలెత్తే ఉత్సాహంతో మంచి దూకుడుమీద ఉంది. కాగా, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ విజేతగా నిలవలేక, నీరసించిన పంజాబ్.. తొలిసారి ఫైనల్ దశకు చేరుకోవడంతో ఈసారి అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని మంచి పట్టుదలతో ఉంది. దానికితోడు.. వీరేంద్ర సెహ్వాగ్ మంచి దూకుడుమీద ఉండటం.. కేవలం 58 బంతుల్లోనే అరివీర భయంకరంగా సిక్సులు, ఫోర్ల వరదతో 122 పరుగులు చేసిన అనుభవం ఉండటంతో కాస్త ఆశాభావంతో కూడా కనిపిస్తోంది. రాత్రి 8 గంటలకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మొదలయ్యే ఈ మ్యాచ్ ఎంతటి నరాలు తెగే ఉత్కంఠను సృష్టిస్తుందో చూడాలి మరి!! -
'ముంబై 200 పైగా పరుగులు చేస్తుందనుకున్నా'
ముంబై: ఐపీఎల్ 7 లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించడానికి కారణం బౌలర్లనేని సురేష్ రైనా అభిప్రాయపడ్డాడు. ముంబైను పరుగులు చేయకుండా బౌలర్లు నిలువరించిన కారణంగానే తమ జట్టు విజయం సాధించదన్నాడు. ఆ గెలుపు ఘనత అంతా కూడా వారిదేనని తెలిపాడు. 'ఆది నుంచి స్కోరు బోర్డుపై మంచి రన్ రేట్ తో ఉన్న ముంబై 200 పరుగులు చేస్తుందని భావించాను. ముంబై పటిష్టంగా ఉన్న దశలో మా బౌలర్లు రాణించారు. మిడిల్ ఆర్డర్ లో ఉన్న రోహిత్ శర్మ, పొలార్డ్ , సిమ్మన్స్ లను కట్టడి చేసి విజయం సాధించాం' అని రైనా తెలిపాడు. ఈ మ్యాచ్ లో కేవలం 33 బంతులు ఎదుర్కున్న రైనా 54 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. డేవిడ్ హస్సీ-రైనా నెలకొల్పిన 89 పరుగుల నాల్గో వికెట్టు భాగస్వామ్యంతో చెన్నై ఘన విజయం సాధించి క్వాలిఫయర్ 2 కు అర్హత సాధించింది. రేపటి క్వాలిఫయర్ మ్యాచ్ లో చెన్నై-పంజాబ్ జట్ల మధ్య మరో ఆసక్తికర పోరు జరుగనుంది. -
వికెట్లు తీస్తా.. విమాన టికెట్ పట్టేస్తా!
కోల్ కతా: వేగవంతమైన బౌలింగ్ తో ప్రత్యర్థులను కట్టడి చేస్తున్న పర్వందీర్ సింగ్ అవానా... త్వరలో టీం ఇండియా బయల్దేరనున్న ఇంగ్లండ్ టూర్ పై ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు జట్టుకు అవానా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దీనికి గాను అతను కోచ్ జో డావ్స్ వద్ద సరదాగా ఓ జోక్ ను కూడా పేల్చాడు. ఇంకా మిగిలి ఉన్న ఐపీఎల్ మ్యాచ్ ల్లో నన్ను ఆడనివ్వండి. ప్రతి మ్యాచ్ లో ఐదేసి వికెట్లు తీస్తా. ఇంగ్లండ్ ఫ్లైట్ ఎక్కుతా ' అంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు. స్పీడ్‌స్టార్ పోటీల ద్వారా అత్యంత వేగవంతమైన బౌలర్‌గా పర్వీందర్ అవానా తొలి సారి వెలుగులోకి వచ్చాడు. సీనియర్ స్థాయిలో కూడా అతను అదే వేగాన్ని నమ్ముకున్నాడు. ఒక వేగాన్ని మాత్రమే నమ్ముకుంటే సరిపోదని భావించిన ఈ పేసర్.. తన బౌలింగ్ లోపాల్నిపంజాబ్ కోచ్, అతని సహచరుడు మిచెల్ జాన్సన్ ల వద్ద సరిదిద్దుకునే పనిలో పడ్డాడు. తనకు ఖాలీగా ఉన్న సమయంలో వారితోనే ఎక్కువ సమయం గడుపుతూ బౌలింగ్ కు పదునుపెట్టేందుకు యత్నిస్తున్నానని అవానా తెలిపాడు. -
ఢిల్లీ డేర్ డెవిల్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
మొహాలీ: పంజాబ్ కింగ్స్ ఎలెవన్ తన చివరి లీగ్ మ్యాచ్ ను విజయం ముగించింది. ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఢిల్లీ విసిరిన 116 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఆటగాళ్లు కేవలం 13.5 ఓవర్లలో ఛేదించారు. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(9) పరుగులు చేసి విఫలమైనప్పటికీ, వాహ్రా (47) పరుగుల చేసి జట్టు గెలుపుకు చక్కటి పునాది వేశాడు.అనంతరం మ్యాక్స్ వెల్ (0)కే పెవిలియన్ చేరినా, మిల్లర్ (47) పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు టాస్ గెలిచిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోని అగర్వాల్ వికెట్టును కోల్పోయింది. కాగా మరో ఓపెనర్, కెప్టెన్ పీటర్ సన్(58) బాధ్యాతయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. అనంతరం దినేష్ కార్తీక్(13), నిషామ్ (12) పరుగుల మినహా ఎవరూ రెండెంకల స్కోరును దాటకపోవడంతో ఢి్లీ 18.1 ఓవర్లలో 115 పరుగులకు చాపచుట్టేసింది. పంజాబ్ బౌలర్లలో అవానా, మన్వీర్ సింగ్, జాన్సన్, పటేల్ కు తలో రెండు వికెట్లు దక్కాయి. -
పంజాబ్ కింగ్స్ విజయలక్ష్యం 116
మొహాలీ: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 116 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆదిలోని అగర్వాల్ వికెట్టును కోల్పోయింది. కాగా మరో ఓపెనర్, కెప్టెన్ పీటర్ సన్(58) బాధ్యాతయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లాడు. అనంతరం దినేష్ కార్తీక్(13), నిషామ్ (12) పరుగుల మినహా ఎవరూ రెండెంకల స్కోరును దాటకపోవడంతో ఢి్లీ 18.1 ఓవర్లలో 115 పరుగులకు చాపచుట్టేసింది. పంజాబ్ బౌలర్లలో అవానా, మన్వీర్ సింగ్, జాన్సన్, పటేల్ కు తలో రెండు వికెట్లు దక్కాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో ముందు వరుసలో ఉన్న పంజాబ్.. ప్లే ఆఫ్ దశలో రెండో స్థానంలో ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. -
పఠాన్ విధ్వంసం: సన్ రైజర్స్ ఆశలు గల్లంతు
కోల్ కతా: విధ్వంసకరమైన ఆట ఎలా ఉంటుందో యూసఫ్ పఠాన్ మరోమారు రుచి చూపించాడు. ఆదిలోనే ఇచ్చిన అవకాశాన్ని సన్ రైజర్స్ ఆటగాళ్లు నేలపాలు చేయడంతో.. పఠాన్ రెచ్చిపోయాడు. అవతలి ఎండ్ నుంచి బౌలింగ్ ఎవరు చేస్తున్నారన్న సంగతిని పక్కను పెట్టిన యూసఫ్.. 15 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా ఐపీఎల్ రికార్డులను తిరగరాశాడు. యూసఫ్ పఠాన్ తనదైన శైలిలో ప్రత్యర్థిపై విరుచుకుపడటంతో ఈ మ్యాచ్ కూడా 14.2 ఓవర్లలోనే ముగిసింది. కేవలం 22 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పఠాన్ 7 సిక్స్ లు, 5 ఫోర్లు సాయంతో 72 పరుగులు చేశాడు. దీని ఫలితంగా మూడో స్థానంలో ఉన్నకోల్ కతా రెండో స్థానానికి చేరుకుంది. సొంతగడ్డపై జరిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఘన విజయాన్ని సాధించింది. ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ సన్ రైజర్స్ తో తలపడిన కోల్ కతా 4 వికెట్ల తేడాతో గెలుపుని సొంతం చేసుకుంది. దీంతో సన్ రైజర్స్ పెట్టుకన్న ప్లే ఆఫ్ ఆశలకు చుక్కెదురైంది. సన్ రైజర్స్ విసిరిన 161 పరుగుల లక్ష్యంతోబ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతాకు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. గౌతం గంభీర్ (28), రాబిన్ ఉతప్ప (41) పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులెత్తించారు.అనంతరం కాస్త తడబడినట్లు కనిపించిన కోల్ కతా తరువాత తేరుకుని అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. సన్ రైజర్స్ బౌలర్లలో కరణ్ శర్మ నాలుగు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడిన హైదరాబాద్ బ్యాటింగ్ చేపట్టింది. హైదరాబాద్ కు ఆదిలోనే డేవిడ్ వార్నర్(4) ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తో జతకలిసిన నమాన్ ఓజా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ధావన్(29), ఓజా(26) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం వేణు గోపాలరావు(27), సమీ (29), హోల్డర్( 16) పరుగులు చేయడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. -
కోల్ కతా నైట్ రైడర్స్ విజయలక్ష్యం 161
కోల్ కతా:ఐపీఎల్ 7 లో భాగంగా కోల్ కతాతో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన కోల్ కతా ముందుగా హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ కు ఆదిలోనే డేవిడ్ వార్నర్(4) ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మరో ఓపెనర్ శిఖర్ ధావన్ తో జతకలిసిన నమాన్ ఓజా స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ధావన్(29), ఓజా(26) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం వేణు గోపాలరావు(27), సమీ(29), హోల్డర్(16) పరుగులు చేయడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరిన కోల్ కతాకు ఈ మ్యాచ్ లో విజయం అవసరం కాకపోయినా, హైదరాబాద్ మాత్రం ఈ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సి అవశ్యం ఏర్పడింది. -
రాజస్థాన్ రాయల్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం
మొహాలీ: ఐపీఎల్ 7లో భాగంగా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలివన్ 16 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పంజాబ్ విసిరిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఆదిలోనే చుక్కెదురైంది. ఓపెనర్ నాయర్(11) పరుగులకే పెవిలియన్ కు చేరి రాజస్థాన్ అభిమానులను నిరాశపరిచాడు. అనంతరం రహానే(23) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. రహానే అవుటయిన వెంటనే వాట్సన్ (0) కే పెవిలియన్ కు చేరి రాజస్థాన్ కు మరో షాక్ ఇచ్చాడు. అప్పటికే రనే రేట్ పెరిగిపోవడంతో రాజస్థాన్ భారీ షాట్లకు పోయి వరుస వికెట్లు కోల్పోయింది. చివర్లో రాజస్థాన్ ఆటగాళ్లలో బ్రాడ్ హోడ్జ్(31), ఫలక్ నర్ (35) పరుగులు చేసి గెలుపుపై ఆశలు రేకెత్తించారు. కాగా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో రాజస్థాన్ 163 పరుగుల మాత్రమే పరిమితమైంది. పంజాబ్ బౌలర్లలో పటేల్ కు మూడు వికెట్లు లభించగా, రిషి ధావన్, కరణ్ వీర్ సింగ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్ గెలిచిన రాజస్థాన్.. తొలుత పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఇన్నింగ్స్ ను సెహ్వాగ్, వాహ్రాలు ధాటిగా ఆరంభించారు. అయితే సెహ్వాగ్ (18; 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. అనంతరం వాహ్రాకు జతకలిసిన రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరివురూ బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. వాహ్రా(25), మార్ష్(40) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. చివర్లో సాహా(27), మిల్లర్(29), బెయిలీ(26) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. నేటి మ్యాచ్ లో ఓటమి పాలైన రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టం చేసుకుని మరోమ్యాచ్ వరకూ ఆగాల్సిన పరిస్థితి కొనితెచ్చుకుంది. -
ఐపీఎల్ 7: రాజస్థాన్ రాయల్స్ విజయలక్ష్యం 180
మొహాలీ: ఐపీఎల్ 7లో భాగంగా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలివన్ 180 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన రాజస్థాన్.. తొలుత పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఇన్నింగ్స్ ను సెహ్వాగ్, వాహ్రాలు ధాటిగా ఆరంభించారు. అయితే సెహ్వాగ్ (18; 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగుల వద్ద పెవిలియన్ కు చేరాడు. అనంతరం వాహ్రాకు జతకలిసిన మార్ష్ రాజస్థాన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. వీరివురూ బాధ్యతాయుతంగా ఆడి స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. వాహ్రా(25), మార్ష్(40) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. చివర్లో సాహా (27), మిల్లర్(29), బెయిలీ(26) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. రాజస్థాన్ ప్లే ఆఫ్ ఆశలను మెరుగుపరుచుకోవాలంటే నేటి మ్యాచ్ లో గెలవాల్సిన అవసరం ఉంది. -
వార్నర్, ధావన్ ల బాదుడు:సన్ రైజర్స్ విజయం
రాంచీ: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ విసిరిన 186 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన సన్ రైజర్స్ ఆది నుంచి విరుచుకుపడింది. ఓపెనర్లు శిఖర్ థావన్, డేవిడ్ వార్నర్ లు మంచి ఆరంభాన్నివ్వడంతో హైదరాబాద్ గెలుపు సునాయాసమైంది. డేవిడ్ వార్నర్(90) పరుగులతో చెన్నై బౌలర్లపై ఎదురుదాడి చేయగా, థావన్ (64) పరుగులతో నాటౌట్ మిగిలి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.హైదరాబాద్ ఆటగాళ్లలో ఫించ్ (7), ఓజా(19) పరుగులు చేశారు. దీంతో సన్ రైజర్స్ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుని ఖాతాలో మరోగెలుపును నమోదు చేసుకుంది. అంతకుముందు టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా చెన్నై ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన చైన్నైకు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. డుప్లెసిస్ (19) పరుగులతో ఫర్వాలేదనిపించినా, స్మిత్ (48; 28 బంతుల్లో 4సిక్స్ లు, 4 ఫోర్లు)తో హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అనంతరం సురేష్ రైనా (4) పరుగులకే పెవిలియన్ చేరాడు. వరుస వికెట్లు కోల్పోయి రన్ రేట్ మందగించిన తరుణంలో డేవిడ్ హస్సీ(50), ధోని (57) పరుగులతో ఆదుకున్నారు. వీరివురు నాటౌట్ గా చివరి వరకూ క్రీజ్ లో ఉండటంతో చెన్నై నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 185 పరుగులు చేసింది. సన్ రైజర్స్ ప్లే ఆఫ్ అవకాశాలు: తదుపరి దశకు చేరాలంటే మిగిలిన ఒక లీగ్ మ్యాచ్‌ల్లో గెలుపుతో పాటు రేసులో ఉన్న మిగిలిన జట్ల ఫలితాలపై సన్‌రైజర్స్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 14 పాయింట్లు సాధించిన రాజస్థాన్ తాను ఆడే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. అదే సమయంలో ముంబై జట్టు కచ్చితంగా ఒక్కో మ్యాచ్‌లో ఓడాలి. దీంతో పాటుగా హైదరాబాద్ రన్‌రేట్ కూడా మెరుగుపడాలి. -
సన్ రైజర్స్ హైదరాబాద్ విజయలక్ష్యం 186
రాంచీ:ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా చెన్నై ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ఆరంభించిన చైన్నైకు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. డుప్లెసిస్ (19) పరుగులతో ఫర్వాలేదనిపించినా, స్మిత్ (48; 28 బంతుల్లో 4సిక్స్ లు, 4 ఫోర్లు)తో హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అనంతరం సురేష్ రైనా (4) పరుగులకే పెవిలియన్ చేరాడు. వరుస వికెట్లు కోల్పోయి రన్ రేట్ మందగించిన తరుణంలో డేవిడ్ హస్సీ(50), ధోని (57) పరుగులతో ఆదుకున్నారు. వీరివురు నాటౌట్ గా చివరి వరకూ క్రీజ్ లో ఉండటంతో చెన్నై నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి 185 పరుగులు చేసింది. -
చెన్నైసూపర్ కింగ్స్ పై బెంగళూర్ ఛాలెంజర్స్ విజయం
రాంచీ:ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ చెన్నై తో జరిగిన కీలక మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై విసిరిన 139 పరుగుల లక్ష్యాన్ని బెంగళూర్ ..ఇంకా ఒక బంతి మాత్రమే మిగిలి ఉండగా విజయం సాధించి ప్లే ఆఫ్ ఆశలను నిలుపుకుంది. బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఓపెనర్లు ఓపెనర్ పార్ధీవ్ పటేల్ (10) పరుగులు చేసి పెవిలియన్ చేరినప్పటికీ, క్రిస్ గేల్ (46) పరుగులతో ఆదుకున్నాడు. అనంతరం విరాట్ కోహ్లి(27) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మ్యాచ్ చివర్లో ఏబీ డివిలియర్స్(28) పరుగులను దూకుడుగా చేయడంతో బెంగళూర్ గెలుపొందింది. చెన్నై బౌలర్లలో అశ్విన్ ,డేవిడ్ హస్సీలకు తలో రెండు వికెట్లు లభించగా, జడేజాకు ఒక వికెట్టు దక్కింది. అంతకుముందు టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్లు స్మిత్ (9), మెక్ కలమ్(19) ఆదిలోనే పెవిలియన్ కు చేరి అభిమానులకు షాకిచ్చారు. అనంతరం సురేష్ రైనా , డేవిడ్ హస్సీలు బాధ్యాతయుతంగా ఆడటంతో చెన్నై తేరుకుంది. హస్సీ(25) పరుగులతో ఫర్వాలేదనిపించినా, కెప్టెన్ ధోని (7) పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కాగా రైనా(62; 48 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్స్) చివరివరకూ క్రీజ్ లో ఉండి చెన్నై 138 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. బెంగళూర్ బౌలర్లలో ఆరూన్ కు రెండు వికెట్లు లభించగా, మురళీధరన్, అహ్మద్ లకు తలో వికెట్టు లభించింది. -
ఐపీఎల్ 7: బెంగళూర్ విజయలక్ష్యం 139
రాంచీ: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో జరుగుతున్నమ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 139 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నై ఓపెనర్లు స్మిత్ (9), మెక్ కలమ్(19) ఆదిలోనే పెవిలియన్ కు చేరి అభిమానులకు షాకిచ్చారు. అనంతరం సురేష్ రైనా , డేవిడ్ హస్సీలు బాధ్యాతయుతంగా ఆడటంతో చెన్నై తేరుకుంది. హస్సీ(25) పరుగులతో ఫర్వాలేదనిపించినా, కెప్టెన్ ధోని (7) పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కాగా రైనా(62; 48 బంతుల్లో 6ఫోర్లు, 1 సిక్స్) చివరివరకూ క్రీజ్ లో ఉండి చెన్నై 138 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయడంలో తోడ్పడ్డాడు. బెంగళూర్ బౌలర్లలో ఆరూన్ కు రెండు వికెట్లు లభించగా, మురళీధరన్, అహ్మద్ లకు తలో వికెట్టు లభించింది. లీగ్ లు చివరి దశకు చేరుకున్న తరుణంలో ఈ మ్యాచ్ లో బెంగళూర్ కు విజయం అనివార్యం. ఇందులో బెంగళూర్ గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలను మెరుగుపరుచుకుంటుంది. -
పంజాబ్ కింగ్స్ కు కోల్ కతా షాక్
కటక్: వరుస విజయాలతో దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ కు కోల్ కోతా నైట్ రైడర్స్ షాకిచ్చింది. ఐపీఎల్ - 7 లో భాగంగా ఇక్కడ జరిగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ విసిరిన 150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా ఇన్నింగ్స్ ను గంభీర్, ఉతప్పలు ఆరంభించారు. కోల్ కతా 6.2 ఓవర్ల ముగిసే సరికి వికెట్టు నష్టపోకుండా 63 పరుగులు చేసి పటిష్ట స్థితిలోకి చేరింది. ఆ తరుణంలో ఉతప్ప (46) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అనంతరం గంభీర్(63), పాండే (36) పరుగులు చేయడంతో కోల్ కతా మరో వికెట్టు పడకుండా 18 ఓవర్లో లక్ష్యాన్ని ఛేదించింది. అంతకముందు టాస్ ఓడి పంజాబ్ బ్యాటింగ్ చేసింది. పంజాబ్ ఓపెనర్ మన్ దీప్ సింగ్ (0)కే పెవిలియన్ కు చేరినప్పటికీ, వీరేంద్ర సెహ్వాగ్ (72) పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం మ్యాక్స్ వెల్ (14), సాహా(15), మిల్లర్ (13), బెయిలీ(12) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో చావ్లాకు మూడు వికెట్లు, మోర్కెల్ కు రెండు వికెట్లు దక్కాయి. -
పంజాబ్ కు ధీటుగా బదులిస్తున్న కోల్ కతా
కటక్: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కోతా నైట్ రైడర్స్ ధీటుగా బదులిస్తోంది. పంజాబ్ విసిరిన 150 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్ కతా ఇన్నింగ్స్ ను గంభీర్, ఉతప్పలు ఆరంభించారు. కోల్ కతా 6.2 ఓవర్ల ముగిసే సరికి వికెట్టు నష్టపోకుండా 63 పరుగులు ఆటను కొనసాగిస్తోంది. ప్రస్తుతం గంభీర్(13), ఉతప్ప(46) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. అంతకముందు టాస్ ఓడి పంజాబ్ బ్యాటింగ్ చేసింది.పంజాబ్ ఓపెనర్ మన్ దీప్ సింగ్ (0)కే పెవిలియన్ కు చేరినప్పటికీ, వీరేంద్ర సెహ్వాగ్ (72) పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం మ్యాక్స్ వెల్ (14), సాహా(15), మిల్లర్ (13), బెయిలీ(12) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. కోల్ కతా బౌలర్లలో చావ్లాకు మూడు వికెట్లు, మోర్కెల్ కు రెండు వికెట్లు దక్కాయి. -
ముంబై ఇండియన్స్ పై చెన్నై విజయం
ముంబై: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో చెన్నైఇన్నింగ్స్ ను ఓపెనర్లు మెక్ కల్లమ్, స్మిత్ లు ధాటిగా ఆరంభించారు. మెక్ కల్లమ్(13) పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. అనంతరం స్మిత్ కు రైనా జతకలవడంతో చెన్నై స్కోరు బోర్డు వేగంగా ముందుకు కదిలింది. ఈ తరుణంలో రైనా (19) పరుగుల వద్ద అవుటయ్యి అభిమానులకు షాకిచ్చాడు. తరువాత డుప్లెసిస్ (31), స్మిత్ (57) పరుగులతో చెన్నైను విజయం దిశగా తీసుకువెళ్లారు. వీరివురూ అవుటయ్యాక ధోని(22)పరుగులతో నాటౌట్ గా నిలిచి చెన్నై ను విజయతీరాలకు చేర్చాడు. ముంబై బౌలర్లలో ప్రవీణ్ కుమార్, మలింగాలకు తలో రెండు వికెట్లు లభించగా, పొలార్డ్ కు ఒక వికెట్టు దక్కింది. -
బెంగళూర్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
బెంగళూర్: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ విసిరిన199 భారీ పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన బెంగళూర్ ఆదిలోనే కీలక వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ క్రిస్ గేల్(4), విరాట్ (0) కే పెవిలియన్ చేరడంతో బెంగళూర్ కష్టాలను కొనితెచ్చుకుంది. కేవలం 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన బెంగళూర్ ఇక తేరుకోలేకపోయింది. బెంగళూర్ ఆటగాళ్లలో ఒక్క డివిలియర్స్ (53) పరుగుల మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో బెంగళూర్ కు ఓటమి తప్పలేదు. చివర్లో స్టార్క్ (29) పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో సందీప్ శర్మ కు మూడు వికెట్లు లభించగా, బాలాజీ, శివం శర్మలకు తలో రెండు వికెట్లు దక్కాయి. అంతకముందు టాస్ గెలిచిన బెంగళూర్ తొలుత పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (30), మన్ దీప్ సింగ్(29) పరుగులు చేసి పంజాబ్ కు చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మ్యాక్స్ వెల్ (25;2 సిక్స్ల్ లు, 2 ఫోర్లు)తో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. తరువాత మరో హిట్టర్ మిల్లర్ బెంగళూర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ (66;3 సిక్స్ లు, 8 ఫోర్లు)తో పంజాబ్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు.చివర్లో సాహా(17), మిచెల్ జాన్సన్ (16) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. బెంగళూర్ బౌలర్లలో స్టార్క్, హర్సాల్ పటేల్, చాహాల్ కు తలో రెండు వికెట్లు లభించాయి. -
బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ లక్ష్యం 199
బెంగళూర్:ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 199 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన బెంగళూర్ తొలుత పంజాబ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (30), మన్ దీప్ సింగ్(29) పరుగులు చేసి పంజాబ్ కు చక్కటి ఆరంభాన్నిచ్చారు. అనంతరం మ్యాక్స్ వెల్ (25;2 సిక్స్ లు, 2 ఫోర్లు)తో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు.తరువాత మరో హిట్టర్ మిల్లర్ బెంగళూర్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న మిల్లర్ (66;3 సిక్స్ లు, 8 ఫోర్లు)తో పంజాబ్ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. చివర్లో సాహా(17), మిచెల్ జాన్సన్ (16) పరుగులు చేయడంతో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది. బెంగళూర్ బౌలర్లలో స్టార్క్, హర్సాల్ పటేల్, చాహాల్ కు తలో రెండు వికెట్లు లభించాయి. -
హైదరాబాద్ పై రాజస్థాన్ రాయల్స్ ఘోర పరాజయం
అహ్మదాబాద్:సొంతవేదికపై జరిగిన తొలి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఘోర పరాజయాన్నిచవిచూసింది. ఐపీఎలో 7 లో భాగంగా ఇక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. సన్ రైజర్స్ విసిరిన 135 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఆదిలోనే అజాంకే రహానే(0)కే పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. అనంతరం శ్యామ్ సన్ (16), నాయర్ (12), వాట్సన్ (11), బిన్ని (12) ఇలా ఒక్కొక్కరూ తక్కువ పరుగులకే పరిమితమై రాజస్థాన్ ఓటమికి కారణమైయ్యారు. కాగా, ఈ మ్యాచ్ స్మిత్ (22) పరుగులు చేసి రాజస్థాన్ ఆటగాళ్లలో టాప్ స్కోర్ గా నిలిచాడు. కడవరకూ పోరాడిన రాజస్థాన్ 102 పరుగులకే పరిమితమై మరో పరాజయం మూటగట్టుకుంది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ నాలుగు వికెట్లు లభించగా, స్టెయిన్ కు రెండు వికెట్లు లభించాయి. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ 135 పరుగులు చేసింది. టాస్ గెలిచిన ఓపెనర్ ఫించ్ (9) పెవిలియన్ కు చేరి హైదరాబాద్ అభిమానులకు షాకిచ్చాడు. అనంతరం శిఖర్ థావన్ తో కలిసిన రాహుల్ జట్టు స్కోరును ముందుకు తీసుకువెళ్లే యత్నం చేశారు. కాగా శిఖర్(33), రాహుల్ (18) పరుగులకు పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ స్కోరు మందగించింది.తరువాత వచ్చిన ఆటగాళ్లలో నమాన్ ఓజా(17),ఇర్ఫాన్ పఠాన్(21)లు ఫర్వాలేదనిపించారు. దీంతో హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది. రాజస్థాన్ బౌలర్లలో వాట్సన్, భాటియాలకు తలో మూడు వికెట్లు లభించాయి. -
రాజస్థాన్ రాయల్స్ విజయలక్ష్యం135
అహ్మదాబాద్: ఐపీఎల్ 7 లో భాగంగా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 135 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేయాల్సిందిగా హైదరాబాద్ ను ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఫించ్ (9) పెవిలియన్ కు చేరి హైదరాబాద్ అభిమానులకు షాకిచ్చాడు. అనంతరం శిఖర్ థావన్ తో కలిసిన రాహుల్ జట్టు స్కోరును ముందుకు తీసుకువెళ్లే యత్నం చేశారు. కాగా శిఖర్(33), రాహుల్ (18) పరుగులకు పెవిలియన్ చేరడంతో హైదరాబాద్ స్కోరు మందగించింది. తరువాత వచ్చిన ఆటగాళ్లలో నమాన్ ఓజా(17),ఇర్ఫాన్ పఠాన్(21)లు ఫర్వాలేదనిపించారు. దీంతో హైదరాబాద్ సన్ రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 9వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ ఆటగాళ్లలో ఏడుగరు సింగిల్ డిజిట్ కే పరిమితవడం గమనార్హం. రాజస్థాన్ బౌలర్లలో వాట్సన్, భాటియాలకు తలో మూడు వికెట్లు లభించాయి. -
పంజాబ్ బల్లే..బల్లే...
కోల్‌కతాపై 23 పరుగులతో గెలుపు వరుసగా నాలుగో విజయం రాణించిన సందీప్, అక్షర్ పటేల్ మ్యాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించలేదు. డేవిడ్ మిల్లర్ మెరుపులు మెరిపించలేదు. చివరికి భారీ స్కోరు కూడా నమోదు కాలేదు. అయినా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తమ జైత్రయాత్రను కొనసాగించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించి, సగర్వంగా గెలిచి వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది. అబుదాబి: ఐపీఎల్-7లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జోరు కొనసాగుతోంది. తొలుత వీరేంద్ర సెహ్వాగ్ (30 బంతుల్లో 37; 3 ఫోర్లు, 1 సిక్స్) బ్యాట్‌తో రాణించగా... సందీప్ శర్మ (3/21), అక్షర్ పటేల్(2/16), మిచెల్ జాన్సన్ (2/22) అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ముకుతాడు వేశారు. ఫలితంగా పంజాబ్ 23 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. శనివారం షేక్ జాయెద్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. రిషి ధావన్ (18 బంతుల్లో 19 నాటౌట్; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. కోల్‌కతా స్పిన్నర్లు పీయూష్ చావ్లా, సునీల్ నరైన్ చెరో మూడు వికెట్లు తీసుకుని పంజాబ్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత కోల్‌కతా 18.2 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. సూర్యకుమార్ యాదవ్ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మూడు వికెట్లు తీసిన పంజాబ్ పేసర్ సందీప్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. నరైన్, చావ్లా మ్యాజిక్ తొలుత బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ రెండో ఓవర్లోనే పుజారా వికెట్‌ను చేజార్చుకుంది. ఆరంభంలోనే అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న సాహా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తక్కువ స్కోరుకే కలిస్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. సెహ్వాగ్, మ్యాక్స్‌వెల్ ధాటిగా ఆడటంతో పంజాబ్ జట్టు పవర్ ప్లే ముగిసే సరికి రెండు వికెట్లు కోల్పోయి 51 పరుగులు చేసింది. ఏడో సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ అభిమానులను నిరాశపరుస్తూ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర మోర్కెల్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఇక వరుసగా రెండు ఫోర్లు కొట్టి జోరుమీదున్నట్లు కనిపించిన మిల్లర్‌ను చావ్లా అవుట్ చేశాడు. ఆ తర్వాత అదే మ్యాజిక్‌ను కొనసాగిస్తూ కెప్టెన్ జార్జ్ బెయిలీని, ఓపెనర్ సెహ్వాగ్‌ను డగౌట్‌కి పంపాడు. సెహ్వాగ్ 37 పరుగులతో రాణించాడు. మిస్టరీ స్పిన్నర్ నరైన్ తన స్పిన్ మాయాజాలంతో బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో తొలి రెండు బంతుల్లో అక్షర్ పటేల్, మిచెల్ జాన్సన్‌లను అవుట్ చేశాడు. నాలుగో బంతికి బాలాజీని వెనక్కి పంపాడు. చివరికి పంజాబ్ స్కోరు 130 దాటింది. చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన కోల్‌కతాకు సందీప్ శర్మ ఆరంభంలోనే షాకిచ్చాడు. వరుస ఓవర్లలో మనీష్ పాండే, గౌతమ్ గంభీర్‌లను అవుట్ చేశాడు. కెప్టెన్ గంభీర్ వన్‌డౌన్‌లో బరిలోకి దిగినప్పటికీ ఫామ్‌లోకి రాలేకపోయాడు. సున్నా దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గౌతీ ఒక పరుగుకే వెనుదిరిగాడు. కలిస్‌ను బాలాజీ అవుట్ చేయడంతో కోల్‌కతా 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఫలితంగా పవర్ ప్లేలో 24 పరుగులు మాత్రమే సాధించింది. ఆ తర్వాత బౌలర్లు అదే జోరు కొనసాగించారు. దీంతో 12 పరుగుల తేడాతో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ క్రిస్ లిన్, యూసుఫ్ పఠాన్, రాబిన్ ఉతప్ప వెనుదిరిగారు. సూర్యకుమార్ యాదవ్ చివర్లో మెరుపులు మెరిపించినా... లక్ష్యాన్ని చేధించలేకపోయింది. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: పుజారా రనౌట్ 8; సెహ్వాగ్ (బి) చావ్లా 37; సాహా ఎల్బీడబ్ల్యూ (సి) కలిస్ 14; మ్యాక్స్‌వెల్ (బి) మోర్నీ మోర్కెల్ 15; మిల్లర్ (సి) మోర్నీ మోర్కెల్ (బి) చావ్లా 14; బెయిలీ (సి) మోర్నీ మోర్కెల్ (బి) చావ్లా 11; రిషి ధావన్ నాటౌట్ 19; అక్షర్ పటేల్ (స్టంప్డ్) ఉతప్ప (బి) నరైన్ 7; మిచెల్ జాన్సన్ (బి) నరైన్ 0; బాలాజీ ఎల్బీడబ్ల్యూ (బి) నరైన్ 0; సందీప్ శర్మ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు): 132 వికెట్ల పతనం: 1-9; 2-28; 3-58; 4-74; 5-101; 6-103; 7-126; 8-126; 9-126. బౌలింగ్: ఉమేశ్ 4-0-28-0; మోర్నీ మోర్కెల్ 4-0-26-1; కలిస్ 4-0-32-1; నరైన్ 4-0-24-3; పీయూష్ చావ్లా 4-0-19-3. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: మనీష్ పాండే ఎల్బీడబ్ల్యూ (బి) సందీప్ శర్మ 8; కలిస్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) బాలాజీ 9; గంభీర్ (సి) పటేల్ (బి) సందీప్ శర్మ 1; క్రిస్ లిన్ (బి) అక్షర్ పటేల్ 13; ఉతప్ప రనౌట్ 19; యూసుఫ్ పఠాన్ ఎల్బీడబ్ల్యూ (బి) రిషి ధావన్ 3; సూర్య కుమార్ (సి) జాన్సన్ (బి) సందీప్ శర్మ 34; పీయూష్ చావ్లా (స్టంప్డ్) సాహా (బి) అక్షర్ పటేల్ 0; నరైన్ (బి) జాన్సన్ 6; ఉమేశ్ (బి) జాన్సన్ 2; మోర్నీ మోర్కెల్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 109 వికెట్ల పతనం: 1-13; 2-19; 3-19; 4-50; 5-59; 6-62; 7-65; 8-85; 9-103; 10-109. బౌలింగ్: సందీప్ 4-1-21-3; జాన్సన్ 3.2-0-22-2; బాలాజీ 3-0-21-1; రిషి ధావన్ 4-0-24-1; అక్షర్ 4-0-16-2. -
బెంగళూర్ పై రాజస్థాన్ రాయల్స్ ఘోర పరాజయం
-
బెంగళూర్ పై రాజస్థాన్ రాయల్స్ విజయం
అబుదాబి: ఐపీఎల్ 7 టోర్నీ ఆరంభంలో ఆకట్టుకున్న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ వరుస ఓటములతో సతమతమవుతోంది. ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ రాయల్స్ ఛాలెంజర్స్ ఆరు వికెట్ల తేడాతో ఘోర ఓటమి మూటగట్టుకుంది. ఏమాత్రం పోరాడని బెంగళూర్ ఇటు బ్యాటింగ్ లోనూ, అటు బౌలింగ్ లోనూ విఫలమై ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసి బెంగళూర్ 71 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించి ముందుగానే ఓటమిని ఖాయం చేసుకుంది. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన రాజస్థాన్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్లు అజాంకే రహానే(23) పరుగులు చేసి ఫర్వాలేదనిపించినా, కరుణ్ నాయర్ (8) పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం శ్యాంసన్ (2) పరుగులకే పెవిలియన్ కు చేరడంతో రాజస్థాన్ కాస్త తడబడినట్టి కనిపించింది. కాగా మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు వాట్సన్(24), అభిషేక్ నాయర్(11) పరుగులు చేసి జట్టుకు విజయాన్నందించారు. కేవలం 12.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ మరో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. మొన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూర్ ఆటగాళ్లు 70 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ప్రత్యర్థికి నిర్దేశించింది. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (1), తకావాలే (0)కు పరిమితమై ఆదిలోనే బెంగళూర్ ను కష్టాల్లోకి నెట్టారు. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి(21)పరుగులు చేసి జట్టుకు మరమ్మత్తులు చేశాడు. కాగా యువరాజ్ సింగ్(3),డివిలియర్స్(0),రానా(3), మోర్కెల్ (7) ఇలా వరుసుగా క్యూకట్టడంతో బెంగళూర్ బ్యాటింగ్ లో చేతులెత్తేసింది. చివర్లో స్టార్క్(18), రాంపాల్ (13) పరుగులు చేయడంతో బెంగళూర్ 15 ఓవర్లలో 70 పరుగులకే పరిమితమైంది. బెంగళూర్ ఆటగాళ్లలో 8మంది సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమనార్హం. రాజస్థాన్ బౌలర్లలో టాంబే నాలుగు వికెట్లు తీసి బెంగళూర్ పతనాన్ని శాసించగా, రిచర్డ్ సన్ కు రెండు వికెట్లు దక్కాయి. -
70 పరుగులకే ఆలౌటయిన బెంగళూర్
అబుదాబి:మొన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో తృటిలో విజయాన్ని చేజార్చుకున్న బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ ఇంకా ఆ షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు. ఐపీఎల్ 7 లో భాగంగా శనివారం ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూర్ ఆటగాళ్లు 71 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించారు. ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (1), తకావాలే(0)కు పరిమితమై ఆదిలోనే బెంగళూర్ ను కష్టాల్లోకి నెట్టారు. అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లి(21)పరుగులు చేసి జట్టుకు మరమ్మత్తులు చేశాడు. కాగా యువరాజ్ సింగ్(3),డివిలియర్స్(0),రానా(3), మోర్కెల్ (7) ఇలా వరుసుగా క్యూకట్టడంతో బెంగళూర్ బ్యాటింగ్ లో చేతులెత్తేసింది. చివర్లో స్టార్క్(18), రాంపాల్ (13) పరుగులు చేయడంతో బెంగళూర్ 15 ఓవర్లలో 70 పరుగులకే పరిమితమైంది. బెంగళూర్ ఆటగాళ్లలో 8మంది సింగిల్ డిజిట్ కే పరిమితమవడం గమనార్హం. రాజస్థాన్ బౌలర్లలో టాంబే నాలుగు వికెట్లు తీసి బెంగళూర్ పతనాన్ని శాసించగా, రిచర్డ్ సన్ కు రెండు వికెట్లు దక్కాయి. -
ఢిల్లీ డేర్ డెవిల్స్ పై సన్ రైజర్స్ 4 పరుగులతో గెలుపు