jet
-
వాయువేగంతో.. నీటిపై: సరికొత్త ఎలక్ట్రిక్ సర్ఫ్‌బోర్డ్ (ఫోటోలు)
-
ఇలాంటి సైబర్ ట్రక్ ఎప్పుడైనా చూశారా? (ఫోటోలు)
-
పర్సనల్ జెట్‌ప్యాక్‌లు వచ్చేస్తున్నాయి..
ప్రస్తుతం కారు ఉండటం అనేది చాలా సాధరణం అయిపోయింది. అదే కారు లాగే ‘పర్సనల్ ఫ్లైట్’ ఉంటే... అమ్మో అది రూ. కోట్లతో కూడుకున్న వ్యవహారం. అంబానీ వంటి అపర కుబేరులకే అది సాధ్యమవుతుంది కానీ ఇతరులకెలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? పర్సనల్ వాహన రంగంలో సరికొత్త శకం రాబోతోంది. కారు కొన్నంత సులువుగా, కారు ధరకే ‘పర్సనల్ ఫ్లైట్’లు కొనుక్కునే కాలం ఎంతో దూరంలో లేదు. ఇదేదో సైన్స్ ఫిక్షన్ కాదు. ఇలాంటి ప్రయత్నం ఇప్పటికే మొదలుపెట్టేసింది ఓ విదేశీ ఏవియేషన్ స్టార్టప్ కంపెనీ. కాలిఫోర్నియా కేంద్రంగా ఉన్న జెట్సన్ అనే కంపెనీ జెట్సన్ వన్ పేరుతో ఈ ప్రత్యేక ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ లాండింగ్ (eVTOL) ఎయిర్‌క్రాఫ్ట్‌లను తయారు చేస్తోంది. అంటే ఇది విద్యుత్‌శక్తి సాయంతో ఎగురుతుంది. ఇందు కోసం ప్రముఖ సెలబ్రిటీ ఆర్టిస్ట్, టెక్ విజనరీ విలియమ్ నుంచి 15 మిలియన్ డాలర్ల నిధులను సైతం పొందింది. కారు కంటే వేగంగా.. జెట్సన్ వన్ వాహనం కారు కంటే వేగంగా పయనించగలదు. గంటకు 63 మైళ్లు అంటే 101 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. అలాగే 15,00 అడుగుల ఎత్తు వరకూ ఎగరగలదు. ఇది ఆకాశ ఫార్ములా వన్ రేసింగ్ కారు. అల్యూమినియం, కార్బన్ ఫైబర్‌తో దీన్ని తయారు చేశారు. ఇందులో ఎనిమిది శక్తివంతమైన మోటర్లు ఉంటాయి. ఇవి సమాన మొత్తంలో ప్రొపెల్లర్లను నడుపుతాయి. చూడటానికి డ్రోన్లాగా ఉండే ఈ వాహనాలను ఇటీవల అమెరికాలో పరీక్షించారు. అక్కడ వీటిని నడపడానికి పైలట్ లైసెన్స్ కూడా అక్కర్లేదు. ఆర్డర్ల స్వీకరణ జెట్సన్ వన్ పర్సనల్ జెట్ప్యాక్లకు ఈ కంపెనీ ఆర్డర్లు స్వీకరిస్తోంది. వీటి కోసం ఇప్పటికే 300 మంది ఆర్డర్ చేశారు. ఇందు కోసం ఒక్కొక్కదానికి 98,000 డాలర్లు (సుమారు రూ.81.5 లక్షలు) చెల్లించారు. అంటే ఒక ప్రీమియం కారు ధర కంటే తక్కువే. -
వైరల్ వీడియో: విమానం ఎక్కుతూ కిందపడబోయిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్‌లోకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతూ కింద పడబోయారు. ఉక్రెయిన్, పోలాండ్లను సందర్శించేందుకు వెళ్లిన బైడెన్ తన పర్యటనను ముగించుకుని అమెరికాకు తిరుగపయనమైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. విమానం మెట్లు ఎక్కేందుకు ప్రయత్నిస్తూ బైడెన్ జారిపడడం ఇది మూడోసారి. రష్యా మిలిటరీ ఆపరేషన్ కారణంగా గత కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌లో ఉద్రిక్త వాతావారణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై తన మద్దతును తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో బైడెన్ కీవ్‌లో ఆకస్మికంగా పర్యటించి యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. యుద్ధం మొదలైన తర్వాత ఆయన ఉక్రెయిన్‌లో అడుగుపెట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ముందస్తు సమాచారం ప్రకారం బైడెన్ పోలాండ్‌లో పర్యటిస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆయన ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ప్రత్యక్షమై అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. బైడెన్ పర్యటన ముందు జనవరిలో యూఎస్ సెనేటర్ల బృందం ఒకటి కీవ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. Biden, once again, falls up the stairs on AF1…after the White House Doctor stated that, “Joe Biden remains a healthy, vigorous, 80-year-old male…who’s fit…” pic.twitter.com/IaVq64QF4k — Liz Churchill (@liz_churchill8) February 22, 2023 చదవండి India Buying Russian Oil: భారత్‌ని నిందించలేం! అది మా పని కాదు! -
ఘోర అగ్ని ప్రమాదం...భవనంపైకి దూసుకెళ్లిన మిలటరీ విమానం
రష్యా మిలటరీ విమానం తొమ్మిది అంతస్తుల భవనంపైకి దూసుకురావడంతో ఒక్కసారిగా అగ్నికీలలు చుట్టుముట్టాయి. ఈ ఘటన ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న రష్యాలోని యెయిస్క్ ప్రాంతంలో సంభవించింది. ఈ సుఖోయ్-34 విమానం మిలటరీ ఎయిర్‌ఫీల్డ్ నుంచి ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది ఒక మీడియం రేంజ్ సూపర్సోనిక్ జెట్ ఫైర్‌బాల్‌గా పేలినట్లు ఆ ప్రాంతీయ గవర్నర్ వెనియామిన్ కొండ్రాటీవ్ తెలిపారు. సుమారు ఐదు అంతస్తుల్లో దాదాపు 2 వేల చదరపు మీటర్లు మంటలు వ్యాపించినట్లు వెల్లడించారు. టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు పైలెట్లు నివేదించినట్లు పేర్కొన్నారు. అందులోని విమాన సిబ్బంది విమానం అపార్టమెంట్ కాంప్లెక్స్ వైపుకి దూసుకొచ్చేలోపు బయటకొచ్చేసినట్లు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా 13 మంది మృతి చెందగా, 19 మంది తీవ్రంగా గాయపడ్డారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సమాచారం రష్యా అధ్యక్షుడి పుతిన్‌కి తెలియజేసినట్లు పేర్కొంది. అలాగే మిలటరీ విమానంలో గాయపడ్డవారికి తక్షణ సాయం అందించాలని క్రెమ్లిన్ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. Watch the moment of military #plane #crash at a residential building in #Yeysk , #Russia. pic.twitter.com/TEunPX3KQl — Gaurav Kumar Singh (@GKSinghJourno) October 17, 2022 In the Krasnodar Territory of Russia, a military plane crashed on a residential building in Yeysk. According to preliminary data, the pilot managed to eject. Eyewitnesses report that after the plane crash, a residential building is on fire from the first to the ninth floor. pic.twitter.com/NytFaAB8Up — Ey Villan (@NeutralNews111) October 17, 2022 (చదవండి: ఉక్రెయిన్‌పై ఇరాన్ డ్రోన్ బాంబులు.. 8 మంది మృతి) -
భారత గగనతలంలో ఇరాన్ విమానానికి బాంబు బెదిరింపు
-
విమానం గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపు...దెబ్బకు నాన్ స్టాప్‌గా ప్రయాణించిన విమానం
ఇరాన్ విమానం భారత్ గగనతలంలో ఉండగా బాంబు బెదిరింపులు కాల్స్ వచ్చాయి. ఈ ఘటన ఇరాన్‌లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళుతున్న మహాన్ ఎయిర్ విమానంలో చోటుచేసుకుంది. దీంతో అప్రమత్తమైన భారత వైమానికదళం అధికారులు ఢిల్లీ విమానాశ్రయాన్ని అలర్ట్ చేసింది. అంతేగాదు ఆ విమానంలోని ఫైలెట్‌కి జైపూర్ లేదా చండీగఢ్‌లలో ల్యాండ్ అయ్యేలా రెండు ఆప్షన్లు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే పైలెట్ ఆ రెండు విమానాశ్రయాల్లోకి విమానాన్ని మళ్లించడానికి ఇష్టపడ లేదని భారత వైమానికి దళం పేర్కొంది. అంతేగాదు ఆ పైలెట్ బాంబు బెదిరింపులతో విమానాన్ని ఎక్కడ ల్యాండ్ చేసేందుకు ఇష్టపడలేదని చెప్పారు. దీంతో టెహ్రాన్ ఎయిర్పోర్ట్ రంగంలోకి దిగి పైలెట్‌ని బాంబు భయాన్ని వీడమని కోరడంతో సదరు ఫైలెట్ చైనాలోని తన గమ్యస్థానం వైపుకు ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇదిలా ఉండగా ఆ విమానాన్ని రెండు యుద్ధ విమానాలు సురక్షిత దూరం నుంచి అనుసరించినట్లు భారత వైమానిక దళం పేర్కొంది. ఆ విమానం చైనా గగనతలంలోకి ప్రవేశించిందని ప్లైట్ ట్రాకింగ్ వైబ్‌సైట్ ఫ్లైట్ రాడార్ చూపించినట్లు వైమానిక దళం తెలిపింది. సదరు ఇరాన్ విమానానికి ఉదయం 9.20 గం.ల ప్రాంతంలో బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత గగనతలంలో ఉండగా ఈ బెదిరింపులు రావడంతో భారత వైమానిక దళం అప్రమత్తమై మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీల సంయుక్తంగా తగిన చర్యలు చేపట్టింది. అంతేగా భారత గగనతలం అంతటా భారతవైమానిక దళం ఈ విమానంపై గట్టి నిఘా పెట్టిందని కూడా అధికారులు తెలిపారు. ఐతే ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి ఈ బాంబు బెదిరింపుల గురించి లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తెలియజేసినట్లు సమాచారం. (చదవండి: ప్రచండ్ హెలికాఫ్టర్.. ప్రపంచంలోనే పవర్ఫుల్.. ‘మేడ్ ఇన్ ఇండియా’) -
వంటనూనెతో నింగిలోకి..
వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ... ప్రపంచంలోనే అతిపెద్ద ప్యాసింజర్ విమానం జెట్‌ఇంధనంతోకాకుండా వంటనూనెతో నింగిలోకి ఎగిరింది. అది ఎప్పుడు ఎక్కడ టేకాఫ్ అయింది... ఇదెలా సాధ్యమనే ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం... –సాక్షి, సెంట్రల్ డెస్క్ సూపర్ జంబో విమానం ఎయిర్‌బస్ ఏ–380 వంటనూనెతో ఆకాశంలోకి ఎగిరి మూడు గంటలపాటు చక్కర్లు కొట్టింది. ఈ విమానం ఇటీవల ఫ్రాన్స్‌లోని టౌలూస్ బ్లాగ్నక్ విమానాశ్రయంలో వంటనూనెతో తయారుచేసిన సస్టెయినబుల్ విమాన ఇంధనాన్ని (ఎస్ఏఎఫ్) 27 టన్నుల వరకు నింపుకుని టేకాఫ్ అయింది. మూడు గంటల తర్వాత నైస్ విమానాశ్రయంలో విజయవంతంగా ల్యాండయింది. ఈ విమానం 100 శాతం ఎస్ఏఎఫ్తో నింగిలోకి ఎగరడం ఇదే తొలిసారి కావడం విశేషం. కొవ్వులు, ఇతర వ్యర్థాలతో.. హరిత, మునిసిపల్ వ్యర్థాలు,కొవ్వులతో తయార య్యే ఈ ఎస్ఏఎఫ్ ఇంధనం దాదాపు 80 శాతం కా ర్బన్‌డయాక్సైడ్‌ను తగ్గిస్తుంది. ఏవియేషన్ పరిశ్రమ 2050 నాటికల్లా కర్భన ఉద్గారాలను జీరో లక్ష్యంగా పెట్టుకోగా,యూకే ప్రభుత్వం 2030 నాటికి 10 శా తం ఎస్ఏఎఫ్ను వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఏడాదికాలంలో ఏ380తోపాటు మూడు విమానాలు 100 శాతం వంటనూనెతో నింగిలోకి ఎగిరాయి. 2021 మార్చిలో ఏ350, అక్టోబర్‌లో ఏ319నియో విమానాలు ఇలా ఎఫ్‌ఏఎఫ్‌తో చక్కర్లు కొట్టాయి. ధర ఐదు రెట్లు ఎక్కువ... సంప్రదాయ విమాన ఇంధనంతో పోలిస్తే ఈ హరిత జెట్ ఇంధనం ధర ఐదు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ ఇంధనాన్ని వాడితే విమాన టికెట్ల ధరలు కూడా ఎక్కువ అవుతాయని, అయితే ప్రభుత్వాలు సబ్సిడీలిచ్చి ఆదుకుంటే ధరలు పెంచాల్సిన అవసరం ఉండదని విశ్లేషకులు అంటున్నారు. 2030 నాటికి 13 హరిత విమాన ఇంధనం ప్లాంట్లను నెలకొల్పాలని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ప్లాంట్‌కు సుమారు రూ.2,280 కోట్లు వ్యయమవుతుంది. ఎస్ఏఎఫ్ వినియోగం పెరిగిందంటే జీరో కర్భన ఉద్గారాల లక్ష్యానికి చేరువవుతున్నట్లే అని ఎయిర్‌బస్ సంస్థ పేర్కొంది. తమ విమానాలన్నింటిని 50శాతం ఎస్ఏఎఫ్–కిరోసిన్ మిశ్రమంతో నడిపేందుకు అనుమతి ఉందని చెప్పింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 200 బిలియన్ లీటర్ల విమాన ఇంధనం అవసరం అవుతుండగా, గత ఏడాది 10–12 కోట్ల లీటర్ల ఎస్ఏఎఫ్ మాత్రమే ఉత్పత్తి అయిందని అంతర్జాతీయ వైమానిక సంస్థ ఐఏటీఏ అంచనావేసింది. ఇది మొత్తం డిమాండ్‌లో 0.05 శాతం మాత్రమేనని చెప్పింది. శిలాజ ఇంధనాలతో పోలిస్తే ఇలాంటి జీవఇంధనాలతో కాలుష్యం తక్కువగా ఉంటుంది. అందుకే ఎస్ఏఎఫ్ వాడకాన్ని పెంచాలని వైమానిక సంస్థలు ప్రణాళికలు వేస్తున్నాయి. ఎలా మారుస్తారు? మనం వాడుతున్న వంటనూనెను అలాగే విమాన ఇంధనంగా వాడలేం. వాడిన వంటనూనెకు కొన్నిరకాల మిశ్రమాలు కలిపి కొంత ప్రాసెస్ చేసి జీవఇంధనంగా మారుస్తారు. జీఎఫ్ కమ్యూనికేషన్స్ సంస్థ ప్రకారం వాడిన ఆలివ్, కనోలా నూనెలు దీనికి బాగా పనికొస్తాయి. ఎందుకంటే అవి తాజా నూనె కన్నా కూడా బాగా చిక్కగా ఉంటాయి. విమాన ఇంధనంగా మార్చేందుకు ముందుగా వాడిన నూనెను వడబోసి అందులో ఉన్న వ్యర్థాలను తొలగిస్తారు. తర్వాత దాన్ని 70ఫారన్‌హీట్ వరకు వేడిచేస్తారు. తర్వాత కొంచెం ఆల్కహాల్, సోడియం క్లోరైడ్ తదితరాలను జతచేస్తారు. ఈ మిశ్రమంతో రెండు రకాల ఉత్పత్తులు అంటే మీథైల్ ఈస్టర్, గ్లిసరిన్ తయారవుతాయి. బయోడీజిల్ (జీవఇంధనం) రసాయన నామం మీథైల్ ఈస్టర్. గ్లిసరిన్ను సబ్బులతోపాటు చాలారకాల ఉత్పత్తుల తయారీకి వాడతారు. -
విమానంలో సాంకేతిక లోపం.. చుట్టూ సముద్రం.. చివరికి..
ఫ్లోరిడా: సాధారణంగా మనం విమానం ల్యాండింగ్ అంటే నేల పైన ల్యాండ్ అయ్యే సమయంలో చూసుంటాం. మరి నీటి మీద ల్యాండ్ చేయడం ఎప్పడైనా చూశారా? ఇదేంటి కొత్త టెక్నాలజీతో విమానం ఏమైనా మార్కెట్లోకి వచ్చిందా అని ఆలోచిస్తున్నారా. అబ్బే అలాంటిది ఏం లేదండి ఎయిర్ షోలో పాల్గొన్న ఓ విమానం అత్యవసరంగా సముద్రంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ల్యాండింగ్ జరుగుతుండంగా అక్కడి ప్రజలు ఈ సన్నివేశాన్ని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వింత ల్యాండింగ్ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని ఫ్లోరిడా ఎయిర్ షోలో ఒక అపశృతి చోటు చేసుకుంది. షోలో పాల్గొన్న ఓ విమానం ఆకాశంలో ఉండగా అనుకోకుండా సాంకేతిక సమస్య రావడంతో అత్యవసర ల్యాండ్ చేయాలని ఆ విమాన పైలట్ భావించాడు. కాకపోతే ఎయిర్ షో జరుగుతున్న ప్రాంతం సముద్రం పక్కన ఉంది. ఇంకేముంది సమీపంలో ఎక్కడ కూడా నేల కనిపించలేదు. దీంతో ఆ పైలట్ చేసేదేమి లేక అత్యవసరంగా సముద్రంలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. తెలివిగా ఆలోచించిన పైలట్ తన నైపుణ్యాన్ని ఉపయోగించి సముద్రం ఒడ్డున విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశాడు. ఈ క్రమంలో అక్కడ సేదతీరుతున్న ప్రజులు ఆశ్చర్యంగా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సముద్రంలో ల్యాండ్ చేసిన ఈ విమానం రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది. దీని పేరు టీబీఎం అవెంజర్, ఇది ఒక టార్పెడో బాంబర్. దీనిని రెండవ ప్రపంచ యుద్ధంలో యు.ఎస్. నేవీ ఉపయోగించింది. యు.ఎస్. నేవీ ఉపయోగం నుంచి రిటైర్ అయిన తరువాత, ఈ విమానం కాలిఫోర్నియాలోని డేవిస్‌లో 1956 నుండి 1964 వరకు యు.ఎస్. ఫారెస్ట్రీ సర్వీస్ ఫైర్ బాంబర్‌గా ఉపయోగించారు. ( చదవండి: నదిలో పొంగి పొర్లిన పాలు, కారణం తెలియక షాకైన ప్రజలు ) -
విమాన శకలాలు లభ్యం : తీరని విషాదమేనా?
జకార్తా: ఇండోనేషియాకు చెందిన ఎయిర్ బోయింగ్-737 శ్రీవిజయ విమానం సముద్రంలో కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. జావా సముద్రంలో పడిపోయినట్లు గుర్తించారు. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాత విమానం సముద్రంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు సముద్రంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా విమాన శకలాలు కనపించడంతో విమాన ప్రయాణికుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారు. (ఇండోనేషియా విమానం గల్లంతు) 56 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 62 మంది ప్రయాణిస్తున్న ప్యాసింజర్ జెట్ ఇండోనేషియా రాజధాని నుంచి బయలుదేరిన తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సంబంధాలు కోల్పోయాయని అధికారులు తెలిపారు. రాడార్ డేటాబాక్స్ ప్రకారం మధ్యాహ్నం 1.56 గంటలకు జకార్తా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2.40 గంటలకు కంట్రోల్ టవర్‌తో పరిచయం కోల్పోయిందని ఇండోనేషియా రవాణా మంత్రిత్వ శాఖ ప్రతినిధి అదితా ఇరావతి తెలిపారు. ఈ ఘటనపై నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ, జాతీయ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ కమిటీ దర్యాప్తు మొదలుపెట్టిందన్నారు. మరోవైపు జకార్తా సమీపంలోని తంగేరాంగ్‌లోని సూకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. #Indonesia plane crash: #Boeing737 vanishes over sea with 50 on board as debris found. #FlightSj182 https://t.co/pU0qMokV84 pic.twitter.com/3lY2HZlhJi — Atlantide (@Atlantide4world) January 9, 2021 -
యుద్ధ విమానం తేజాస్‌లో రాజ్‌నాథ్ సింగ్
-
యుద్ధ విమానం తేజాస్‌లో రాజ్‌నాథ్
బెంగళూర్ : యుద్ధ విమానం తేజాస్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం ప్రయాణించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్‌లో పైలట్ వెనుక సీటులో కూర్చున్న రాజ్‌నాథ్ సింగ్ హెల్మెట్ ధరించి, ఆక్సిజన్ మాస్క్‌తో ప్రయాణానికి సిద్ధం కాగా బెంగళూర్‌లోని హాల్ ఎయిర్పోర్ట్ నుంచి విమానం టేకాఫ్ తీసుకుంది. అంతకుముందు యుద్ధ విమానం తేజాస్‌లో ప్రయాణానికి సర్వ సన్నద్ధంగా ఉన్నానని రాజ్‌నాథ్ సింగ్ నేవీ యూనిఫాంలో రెండు ఫోటోలను పోస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. తేజాస్ యుద్ధ విమానంలో పర్యటించిన తొలి రక్షణ మంత్రిగా రాజ్‌నాథ్ పేరిట రికార్డ్ నమోదైంది.పూర్తి దేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజాస్‌లో విహారం ఆస్వాదించానని, తేలికపాటి యుద్ధ విమానం తేజాస్ కొనుగోలుకు ఆగ్నేయాసియా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని చెప్పారు. పైలట్ సూచనతో తాను కొద్దిసేపు విమానాన్ని నియంత్రించానని ఈ అనుభవం తనను థ్రిల్‌కు గురిచేసిందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు.కాగా ఈ ఏడాది జనవరిలో అప్పటి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ సుఖోయ్ 30 యుద్ధ విమానంలో జోథ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేఫన్ సుంచి 45 నిమిషాల పాటు ప్రయాణించారు. -
నదిలోకి దూసుకెళ్లిన విమానం
-
ఇలా ఎన్నడూ చూసి ‘తీరం’
అలలకు ప్రాణం పోయడానికి.. దూకుతున్న ఆకాశ గంగలా... సముద్రానికి ఎదురెళ్తున్న నీటిపడగలా... రయ్యిన దూసుకెళ్తున్న ‘నీరా’జువ్వలా.. ఫ్లోరిడాలోని లాడర్డెల్ తీరంలో వైమానిక ప్రదర్శనలో ‘లుకాస్ ఆయిల్ ఏరోబాటిక్’ విమాన విన్యాసం కనువిందు చేసింది. -
ఆఫర్లతో దిగొస్తున్న విమానాలు
♦ జాబితాలో స్పైస్‌జెట్, ఇండిగో, జెట్, ఎయిర్ఏసియా ♦ బుక్ చేసుకోవటానికి మరో నాలుగు రోజుల సమయం ♦ వచ్చే ఏడాది మార్చి వరకూ ప్రయాణించే వీలు న్యూఢిల్లీ: దేశీ విమానయాన రంగంలో మరోసారి ధరల యుద్ధానికి తెరలేచింది. ఎయిర్‌లైన్స్ సంస్థలు పోటీపడి మరీ టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. వార్షికోత్సవ ఆఫర్ అంటూ తొలుత స్పైస్‌జెట్ ఈ పోటీకి తెరతీయగా... ఇండిగో, జెట్ ఎయిర్వేస్, ఎయిర్ఏసియా వంటి సంస్థలన్నీ వరస కట్టాయి. స్పైస్‌జెట్: రూ.12 బేసిక్ ఫేర్‌తో టికెట్ స్పైస్‌జెట్ తన 12వ వార్షికోత్సవమంటూ ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.12ల బేసిక్ ఫేర్‌తో వన్‌వే టికెట్లను ఆఫర్ చేస్తోంది. దీనికి ట్యాక్స్‌లు, సర్‌చార్జ్‌లు అదనం. మే 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు 2017 జూన్ 26 నుంచి 2018 మార్చి 24 మధ్య ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. దేశీ, అంతర్జాతీయ ఫ్లైట్స్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక టికెట్లను బుక్ చేసుకున్న వారు సంస్థ నిర్వహించే లక్కీడ్రాలో ఉచిత టికెట్లతోపాటు పలు ప్రయోజనాలు కూడా పొందొచ్చు. ఇండిగో టికెట @ రూ. 899 ఈ రేసులో చేరిన ‘ఇండిగో’ తాజాగా రూ.11 బేసిక్ ఫేర్‌తో టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌కు తెరలేపింది. ఈ ప్రమోషనల్ స్కీమ్‌లో భాగంగా కంపెనీ వన్‌వే టికెట్లను రూ.899 ప్రారంభ ధరతో ప్రయాణికులకు ఆఫర్ చేస్తోంది. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు 2017 జూన్ 26 నుంచి 2018 మార్చి 24 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చని కంపెనీ తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఇండిగో తాజా ఆఫర్ కింద విశాఖపట్నం–హైదరాబాద్ టికెట్‌ను రూ.1,104లకు, హైదరాబాద్–విశాఖపట్నం టికెట్‌ను రూ.1,441లకు, బెంగళూరు–హైదరాబాద్ టికెట్‌ను రూ.1,250లకు, శ్రీనగర్–జమ్మూ టికెట్‌ను రూ.899లకు అందిస్తోంది. పలు రూట్లలో ఇలాంటి ఆఫర్లున్నాయి. రేసులోకి జెట్ ఎయిర్వేస్ ఈ విమానయాన సంస్థ కూడా ఎంపిక చేసిన రూట్లలో ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆఫర్లో భాగంగా కంపెనీ రూ.1,079 ప్రారంభ ధరతో టికెట్లను ఆఫర్ చేస్తోంది. ఇది గ్రూప్ బుకింగ్స్‌కు వర్తించదు. ఈ నెల 26 వరకు అందుబాటులో ఉండే ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది జూన్ 15 నుంచి సెప్టెంబర్ 20 వరకు మధ్య ఉన్న కాలంలో ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. ఎయిర్ ఏసియా కూడా.. టాటా–ఎయిర్‌ఏíసియా జాయింట్ వెంచర్ అయిన ఎయిర్ఏసియా ఇండియా కూడా టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. వన్‌వే రూట్లకు మాత్రమే వర్తించే ఆఫర్ ఇది. ఎంపిక చేసిన రూట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఈ నెల 28 వరకు అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్న వారు ఈ ఏడాది నవంబర్ 23 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. దీనికి టికెట్ ప్రారంభ ధర రూ.1,699. -
మాల్యా జెట్ రీ ఆక్షన్ కు కోర్టు అనుమతి
ముంబై: వేలకోట్ల రుణ ఎగవేత దారుడు , వ్యాపార వేత్త విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ విమానం మరోసారి వేలం వేసేందుకు బాంబే హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఎయిర్ బస్ 319 లగ్జూరియస్ విమానాన్ని గత వేలంలో రూ.27.39 కోట్లకు గెలుచుకున్న ఎస్జీఐ కామెక్స్ సంస్థ తాజా వేలాన్ని రద్దు చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. తమ బిడ్‌ను ఉపసంహరించుకుని, తిరిగి వేలం నిర్వహించేందుకు అనుమతించాలంటూ ఎస్జీఐ బాంబే హైకోర్టును కోరింది. దీన్ని విచారించిన కోర్టు ఈ మేరకు అనుమతిని మంజూరు చేస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 6 కు వాయిదా వేసింది. బిడ్ గెలుచుకున్న ఎస్జీఐ కామెక్స్ సంస్థ ..2012 అక్టోబరు నుంచీ తమకు హ్యాంగర్ చార్జీలు చెల్లించాలని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (ఎంఐఏఎల్) హైకోర్టును కోరింది.దీంతో ఈ వేలం ప్రక్రియ నుంచి ఉపసంహరించుకునే వీలు కల్పించాలని ఎస్జీఐ కామెక్స్ కోర్టును అభ్యర్థించింది. ఫ్రెష్ గా మరోసారి వేలం నిర్వహించాలని, అవసరమైతే మళ్లీ బిడ్ వేస్తామని ఆ సంస్థ న్యాయవాది కోర్టును కోరారు. దీంతో న్యాయమూర్తి జస్టిస్ ఎస్సీ ధర్మాధికారి నేతృత్వంలోని బెంచ్ ఇందుకు అంగీకరించింది. దీంతోపాటుగా వేలం నిర్వహణలో నిపుణులైన, ప్రభుత్వ, లేదా ఇతర సంస్థల కంట్రోల్ లేని స్వతంత్ర ఏజెన్సీ సహాయంతో ఈ వేలం నిర్వహించాలని కోరింది. తదుపరి విచారణ సమయానికి కొత్త ఏజెన్సీ పేరును ఎస్జీఐ వెల్లడి చేయాల్సి ఉంది. మరోవైపు 17బ్యాంకులకురూ.9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగ్గొట్టిన కేసులో బ్యాంకుల కన్సార్టియం పిటిషన్ పై సుప్రీంకోర్టులో మంగళవారం మరోసారి విచారణ జరగనుంది. కాగా సీజే లీజింగ్ నుంచి మాల్యాకు లీజుకు తీసుకున్నారు. అయితే మాల్యా బకాయి పడిన రూ.500 కోట్ల వసూలు కోసం సేవా పన్ను శాఖ అధికారులు డిసెంబర్, 2013 లో ఈ విమానాన్ని ఎటాచ్ చేసిన సంగతి తెలిసిందే. -
ఆగస్టు 18న విజయ్ మాల్యా జెట్ వేలం!
ముంబై: ముంబై విమానాశ్రయంలో నిలిపి ఉన్న ‘ఉద్దేశ్యపూర్వక’ రుణ ఎగవేతదారు విజయ్ మాల్యా జెట్‌ను తిరిగి వచ్చే నెల 18న సేవల పన్ను శాఖ వేలం వేయనుంది. గతంలో మాల్యా విమానానికి రిజర్వ్ ధర రూ.152 కోట్లు కాగా, బిడ్ రిజర్వ్ ధరలో ఒకశాతంకన్నా తక్కువగా రూ.1.09 కోట్లుకు దాఖలైంది. దీంతో సంబంధిత వేలాన్ని సేవల పన్ను విభాగం రద్దు చేసింది. ఈ దఫా వేలానికి రిజర్వ్ ధరను తగ్గించే అవకాశముంది. -
ట్రూజెట్ సర్వీసు రద్దు
మధురపూడి : హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమానా్రÔ¶ యానికి సాయంత్రం 4–20 గంటలకు రావాల్సిన ట్రూజెట్ విమాన సర్వీసు మంగళవారం కూడా రద్దయింది. సాంకేతిక కారణాల వల్ల ఈ సర్వీసు రద్దయినట్టు స్థానిక ప్రతినిధి తెలిపారు. సాయంత్రం 4–20 గంటలకు ఇక్కడకు చేరే ఈ సర్వీసు 4–40 గంటలకు తిరిగి చెన్నైకు బయలుదేరుతుంది. కొన్ని రోజులుగా ఈ సర్వీసు రద్దవుతున్న సంగతి తెల్సిందే. కాగా వర్షాకాలం ప్రారంభం కావడం, విమాన సర్వీసులకు ఆటంకాలు ఏర్పడటం ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ అధికారులు దీనిని నివారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. -
కొనేవారే కరువయ్యారు!
వేలకోట్ల రుణాలను ఉద్దేశ్యపూర్వకంగా ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త.. విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల అమ్మకానికి సైతం నానా తిప్పలూ పడాల్సివస్తోంది. భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రుణం తీసుకొని మోసగించి, మాల్యా విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సంబంధించి ఆస్తులను కొనేందుకూ ఎవ్వరూ ముందుకు రావడం లేదు. తాజాగా ఆయన కంపెనీకి చెందిన జెట్ విమానం వేలానికి పెట్టగా కనీస ధర కూడ పలకకపోవడంతో వేలం నిలిపివేయాల్సి వచ్చింది. లిక్కర్ కింగ్ విజయమాల్యా ఆస్తుల వేలంలో మరోసారి నిరాశ ఎదురైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏవియేషన్ సపోర్ట్ కంపెనీ.. అల్నా ఏరో డిస్ట్రిబ్యూషన్ వేసిన బిడ్ ను సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ రిజెక్ట్ చేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ ఛైర్మన్ విజయమాల్యాకు చెందిన లగ్జరీ జెట్ విమానం.. వేలానికి పెడితే కనీస ధర 150 కోట్లు వస్తుందని అంచనా వేసిన కంపెనీకి నిరాశే మిగింలింది. బిడ్ కేవలం 1.09 కోట్ల రూపాయల అతి తక్కువ ధర రావడంతో ట్యాక్స్ అధికారులు అమ్మకానికి నిరాకరించారు. కనీస ధర కూడ పలకకపోవడంతో వేలాన్ని నిలిపివేశారు. -
జెట్ ఎయిర్ వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్
బెంగళూరుః కర్నాటక రాజధాని బెంగళూరు విమానాశ్రయంనుంచీ ఉదయం బయల్దేరిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో పొగలు రావడంతో.. విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు బెంగళూరు ఎయిర్ పోర్టులో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. మంగుళూరుకు చెందిన 9W 2839 జెట్ ఎయిర్ వేస్ విమానం ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టునుంచి టేకాఫ్ అయ్యింది. ఆకాశంలోకి ఎగిరిన కొద్దిసేపటికే ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్ లో పొగలు రావడాన్ని సిబ్బంది గమనించి, అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని వెనక్కు రప్పించారు. 9W 2839 జెట్ ఎయిర్ వేస్ విమానం లో సాంకేతిక లోపాలు ఏర్పడటంతో బెంగళూరు ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నట్లు జెట్ ఎయిర్ వేస్ అధికారులు తెలిపారు. -
త్వరలో ఇంటికో జెట్ విమానం!
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది... అనుకునే వారికి శుభవార్త! ప్రతి ఇంటికీ బైక్, కారు మామూలైపోయిన ఈ రోజుల్లో ప్రతి ఇంటికీ జెట్ విమానం అన్న నినాదంతో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఏఎస్) అడుగులు వేస్తోంది. ట్రాఫిక్ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవినియోగదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించేందుకు త్వరలోనే మొట్టమొదటి వ్యక్తిగత జెట్ విమానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంట్లో కారును వాడినట్లుగానే ఈ కొత్త జెట్ ఫ్లైట్ ను వాడుకునేందుకు వీలుగా దీన్ని వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ పద్ధతిలో రూపొందిస్తోంది. నలుగురు మ్యూనిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయ ఇంజనీర్లు, డాక్టోరల్ విద్యార్థులు స్థాపించిన లిల్లుమ్ ఏవియేషన్ సంస్థ, వ్యక్తిగత వాహనాల మాదిరిగానే, వ్యక్తిగత విహంగాలను అభివృద్ధి చేస్తోంది. జర్మనీ ఆధారిత ఇంజనీర్లు ఈ వీటీవోఎల్ జెట్ విమానాన్ని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఇంక్యుబేషన్ సెంటర్లో డిజైన్ చేసి అభివృద్ధి చేస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ గా ఉండి, తక్కువ శబ్దంతోనూ, హెలికాప్టర్లకన్నా సులభంగా ఎగిరే కొత్త తరహా జెట్ విమానాలను 2018 నాటికి అందుబాటులోకి తేనున్నారు. ఈ నూతన ఆవిష్కరణలో విమానాలను... హెలికాప్టర్ల మాదిరిగానే భూమినుంచి నిలువుగా టేకాఫ్ అవ్వడంతో పాటు, నిలువుగా ల్యాండింగ్ అయ్యే వర్టికల్ టేకాఫ్, ల్యాండింగ్ (వీటివోఎల్) విధానంతో రూపొందిస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే రోడ్లపై ట్రాఫిక్ సమస్యను కొంత అధిగమించే అవకాశం కనిపిస్తోంది. అయితే కార్లు, టూ వీలర్స్ అయితే ఇంట్లోని సెల్లార్, లేదా పార్కింగ్ ప్లేస్ లో పార్క్ చేస్తాం. కానీ ఈ జెట్ విమానాలు ల్యాండ్ అయ్యేందుకు కేవలం ఓ చిన్నగది సైజు స్థలం ఉంటే సరిపోతుంది. వీటివోఎల్ జెట్ ఎగిరేందుకు దీనిలో ఎలక్ట్రిక్ మోటార్లను వినియోగిస్తున్నారు. దీంతో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో 500 కిలోమీటర్ల ఎత్తు వరకు ప్రయాణించవచ్చు. అయితే దీనికి ధర వివరాలను మాత్రం సంస్థ ఇంకా వెల్లడించలేదు. లిల్లుమ్ ఏవియేషన్ ఈ జెట్ విమానాన్ని ప్రజలకు సరసమైన ధరకు అందుబాటులోకి తెస్తే ఇక భవిష్యత్తులో వ్యక్తిగత ప్రయాణ విధానమే మారిపోయే అవకాశం కనిపిస్తోంది. -
యూట్యూబ్ లో 'జెట్' ల్యాండింగ్ హల్ చల్
మనిషి మెదడుకు కాస్త పదును పెడితే అద్భుతాలను ఆవిష్కరించగలడు, చరిత్రను సృష్టించగలడు అనేందుకు ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కెర్లు కొడుతున్న ఓ వీడియో నిదర్శనంగా నిలుస్తోంది. అమెరికన్ యుద్ధ నౌక యూఎస్ఎస్ బతాన్ టేకాఫ్ అవ్వడం ప్రశాంతంగానే జరిగినా... ల్యాండ్ అయ్యే సమయంలో విమానానికి ముందు చక్రాలు తెరచుకోపోవడంతో అత్యంత ఉత్కంఠతను రేపింది. సమయస్ఫూర్తితో ఓ పైలట్ జెట్ విమానాన్ని ల్యాండ్ చేసిన విధానం, చూపరులకు గగుర్పాటును కలిగేట్లు చేస్తోంది. ఎటువంటి సమస్యా లేకుండా టేకాఫ్ అయిన విమానం... ఆకాశంలోకి ఎగిరాక అనుకోని అవాంతరాలు ఏర్పడితే ఏం చేయాలో.. మెరైన్ క్రాప్స్ పైలట్ విలియమ్ మహోనీ సమయస్ఫూర్తిని చూస్తే తెలుస్తుంది. ఎవి-8బి ల్యాండింగ్ సమయంలో ఏర్పడ్డ సాంకేతిక కారణాలతో విమానం ప్రమాదంలో చిక్కుకుందని తెలిసిన పైలట్... సమయస్ఫూర్తితో వ్యవహరించడం పెను ప్రమాదాన్ని తప్పించింది. జెట్ యుద్ధ విమానం ఫ్రంట్ వీల్స్ తెరుచుకోవడం లేదని గమనించిన పైలట్... ఏమాత్రం భయపడకుండా... ధైర్యంగా వ్యవహరించాడు. విమానాన్ని సురక్షితంగా కిందికి దించేందుకు కొత్త ప్లాన్ వేశాడు. తన ప్లాన్ ను అధికారులకు తెలిపి వారివద్ద అనుమతి తీసుకున్నాడు. నౌకపై విమానాన్ని దింపేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయించుకొన్నాడు. విభిన్నంగా స్టూల్ పై విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించి విజయం సాధించాడు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ సమయస్ఫూర్తిని వేనోళ్ళ అభినందించారు. 2014 జూన్ నెలలో ఫైటర్ జెట్ విమానం ల్యాండింగ్ ఘటనకు సంబంధించిన అరుదైన వీడియో... ఇప్పుడు ఇంటర్నెట్లో అందర్నీ ఆకట్టకుంటోంది. లక్షలకొద్దీ కామెంట్లు, వేలకోద్దీ షేర్లతో హల్ చల్ చేస్తోంది. -
ముంబైకి చేరిన బ్రస్సెల్స్ దాడి బాధితురాలు
ముంబైః బ్రసెల్స్ ఎయిర్ పోర్టులో జరిగిన టెర్రర్ దాడిలో గాయపడ్డ జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగిని నిధి ఛాపేకర్ ముంబై చేరుకున్నారు. గాయాలనుంచి కొంతశాతం కోలుకోవడంతో ఆమె శుక్రవారం ఉదయం ముంబైకి తిరిగి వచ్చారు. చీలమండ విరిగి, 15 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన నిధి.. స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్స చేయించుకున్నారు. ఆమెతోపాటు జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది అమిత మోత్వానీ ఇంకా బ్రస్సెల్స్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మార్చి నెలలో బ్రసెల్స్ విమానాశ్రయంలో జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి, అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందిన జెట్ ఎయిర్ వేస్ క్రూ మెంబర్ నిధి ఛాపేకర్ ముంబై చేరుకున్నారు. 42 ఏళ్ళ నిధి ఇంకా కొంతశాతం గాయాలనుంచీ కోలుకోవాల్సిన అవసరం ఉండటంతో పారిస్ నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానంలో ముంబై చేరగానే, ఎయిర్ పోర్టునుంచే ఆమెను ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ఆమె కొంత రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇంకా కొన్ని రోజులు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉండటం మంచిదని డాక్టర్లు తెలిపారు. 1996 ఆగస్టు నుంచి జెట్ ఎయిర్ వేస్ లో పనిచేస్తున్న నిధి ఛాపేకర్... మార్చి 22న బ్రసెల్స్ ఎయిర్ పోర్టునుంచి జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో న్యూయార్క్ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో జరిగిన దాడితో ఆమె శరీరానికి 15 శాతం గాయాలు అవ్వడంతోపాటు, చీలమండ విరిగిపోయింది. అప్పట్నుంచీ బ్రసెల్స్ కు దగ్గరలోని గ్రాండె హాస్పిటల్ డి చెలేరియోలో 25 రోజులపాటు చికిత్స పొందిన ఆమె... గురువారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యి, అక్కడినుంచి పారిస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం పారిస్ నుంచి ముంబైకి చేరారు. నిధి.. ఇప్పటికీ వీల్ ఛైర్ ఆధారంగానే కదలాల్సిన పరిస్థితి ఉండటంతో ఆమె భర్త రూపేష్ ఛాపేకర్, అతని సోదరుడు నీలేష్ ఛాపేకర్ ఎయిర్ పోర్టునుంచి, ఎయిర్ లైన్స్ సిబ్బంది, వైద్యాధికారుల సహాయంతో బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి చేర్చారు. -
వేలానికి ముస్తాబైన మాల్యా విమానం
న్యూఢిల్లీ: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా కు చెందిన అత్యంత ఖరీదైన విమానాన్ని వేలం వేసేందుకు రంగం సిద్ధమైంది. భారత్ లో బ్యాంకులకు రూ. 9 వేల కోట్లకు పైగా బకాయిలు పడి, వాటిని చెల్లించడంలో విఫలమై, గత నెలలో విదేశాలకు పారిపోయిన యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యా ఆస్తులను ఇప్పటికే బ్యాంకులు స్వాధీనం చేసుకుని అమ్మకానికి పెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు సర్వీస్ ట్యాక్స్ శాఖ కూడా అదే దారిలో పయనిస్తోంది. సుమారు166 కోట్ల రూపాయలతో నవంబర్ 2006 కొనుగోలు చేసిన స్పెషల్ జెట్ కు మరిన్ని కోట్లు వెచ్చించి హంగులు అమర్చుకున్నాడు మాల్యా. ముఖ్యంగా బార్, భోజనాల గది, బెడ్ రూమ్, వంటగదివాష్ రూం లాంటి విలాసవంతమైన సౌకర్యాలను పొందుపరిచాడు. వజ్రాలు పొదిగిన బాలాజీ చిత్రాపటం, మరో నాలుగు పికాసో చిత్రాలు సహా ఇతర ఖరీదైన కళాఖండాలు లోపల అమర్చాడు. అయితే పన్నులు చెల్లించడంలో విఫలం కావడంతో ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఎయిర్ ఇండియా ఎయిర్ భారతదేశం ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సహకారంతో ఎయిర్ బస్ ఎ 319 ని ముస్తాబు చేశారు. చాలా మరమ్మతులు, హంగులు అమర్చిన అనంతరం ఈ మే 12, 13 తేదీల్లో ప్రభుత్వ నిర్వహణలోని ఎంఎస్టిసి లిమిటెడ్ దీన్ని వేలానికి పెట్టనున్నారు. అయితే ఎయిర్ బస్ లోని మాల్యా పిల్లల ఫోటోలతో పాటు, ఖరీదైన చిత్రాలను మినహాయించి వేలం వేయనుంది. మాల్యా నుంచి తనకు రావలసిన రూ.370 కోట్లకు పైగా పన్ను బకాయిలను రాబట్టేందుకు సర్వీస్ ట్యాక్స్ శాఖ తాజాగా మాల్యా ప్రైవేట్ విమానాన్ని అమ్మకానికి పెట్టింది. మే 12-13 తేదీల మధ్య ఈ -133 సిజె విమానాన్ని వేలం వేయనుంది. ఇంజనీరింగ్ కంపెనీ సిబ్బంది ఇప్పటికే విమానం లోపలా, బయటా శుభ్రం చేసిందనీ, 22 సీట్లు ఎయిర్‌బస్ 319 ని అందంగా తీర్చిదిద్దారని విమానాశ్రయం అధికారి ఒకరు వెల్లడించారు. కాగా దాదాపు 18 నెలల క్రితం ఆదాయపన్ను శాఖ కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్ ప్రైవేట్ జెట్ సర్వీసులను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. పాస్ పోర్టును రద్దు చేసినట్టుగా విదేశాంగ శాఖ ప్రకటన, అరెస్ట్ వారెంట్ జారీ చేయనున్నారనే వార్తల నేపథ్యంలో మాల్యా వ్యవహారం నానాటికీ దిగజారిపోతున్నట్టు కనిపిస్తోంది. -
జెట్ ఎయిర్వేస్ విమానానికి బాంబు బెదిరింపు
అహ్మదాబాద్: బాంబు బెదిరింపు కారణంగా ముంబై బయల్దేరాల్సిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని నిలిపివేశారు. అహ్మదాబాద్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానం బుధవారం ముంబై బయలుదేరాల్సి ఉంది. అయితే బాంబు బెదిరింపు కారణంగా విమానాన్ని నిలిపి వేసి తనిఖీలు చేస్తున్నారు. బాంబు బెదిరింపు సమాచారంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.