రేపు కర్నూలులో జాబ్ మేళా
కర్నూలు సిటీ: స్థానిక బిక్యాంపులోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కాలేజీలో ఆదివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆ కాలేజీ ప్రిన్సిపాల్ అయేషాఖాతూన్, జేకేసీ సెంటర్ కో–ఆర్డినేటర్ డా.ఎం.శారదలు శుక్రవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. డిగ్రీ విద్యార్హత (బీటెక్, ఎంబీఏ మినహా), 26 సంవత్సరాల వయస్సు ఉండి, ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు తమ బయోడెటాతో పాటు, ఆధార్ కార్డుతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని వారు పేర్కొన్నారు.