Khammam District Latest News
-
బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఆందోళన
● కేఎంసీలో ఈఈని అడ్డుకున్న వైనం ● దశలవారీగా చెల్లిస్తామని నచ్చచెప్పిన అసిస్టెంట్ కమిషనర్ ఖమ్మంమయూరిసెంటర్: మున్నేరు వరదతో ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు భోజనం సమకూర్చడమే కాక పారిశుద్ధ్య పనులు చేయించిన తమకు బిల్లుల చెల్లింపులో తాత్సారం చేస్తున్నారని కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. కేఎంసీ కార్యాలయానికి శుక్రవారం వచ్చిన పలువురు కాంట్రాక్టర్లు అక్కడ మున్సిపల్ ఈఈ కృష్ణాలాల్ను నిలదీశారు. రూ.2.70 కోట్ల నిధులు కేఎంసీ ఖాతాలో జమ అయినా ఇతరు పనులకు వినియోగించడం సరికాదని మండిపడ్డారు. మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో తాము ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఈమేరకు ఈఈ కృష్ణాలాల్ వారిని అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అహ్మద్ షఫీఉల్లా వద్దకు తీసుకొళ్లారు. దీంతో ఆయన మాట్లాడి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దశల వారీగా బిల్లలు చెల్లిస్తామని చెప్పడంతో కాంట్రాక్టర్లు శాంతించారు. కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వరరావుతో పాటు బండి సతీష్, పి.శ్రీధర్, జూగల కిషోర్, శ్రీహరిరాజు, కిషోర్, సీతయ్య తదితరులు పాల్గొన్నారు. -
పలువురి కుటుంబాలకు పరామర్శ
సాక్షి నెట్వర్క్: ఖమ్మం 57వ డివిజన్లోని అభయాంజనేయస్వామి దేవాలయంలో ఈనెల 26న హనుమాన్‌చాలీసా పారాయణం, అన్నదానం చేపట్టనుండగా కార్పొరేటర్ ఎండీ.రఫీదా ముస్తఫా రూ.15వేల విరాళం ప్రకటించారు. ఈ నగదును ఎంపీ రేణుకా చౌదరి చేతుల మీదుగా కమిటీ సభ్యులకు అందజేశారు. కాగా, ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కార్పొరేటర్ మలీదు జగన్ కుటుంబాన్ని ఎంపీ రేణుకాచౌదరి పరామర్శించి అండగా నిలుస్తామని తెలిపారు. అలాగే, శస్త్రచికిత్స చేయించుకున్న రఘునాథపాలెం మండలం చింతగుర్తి మాజీ సర్పంచ్ తమ్మినేని నాగేశ్వరరావును కూడా పరామర్శించారు. కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లుతో పాటు సీతారామయ్య, బండి వెంకన్న, యాసా రమేష్, నగేష్, తారాదేవీ, దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కాగా, కామేపల్లి మండలం తాళ్లగూడెంలో ఎంపీ మాట్లాడుతూ రైతు రుణమాఫీ సహా ఇచ్చిన హామీలన్నింటినీ తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలిపారు. నాయకులు నల్లమోతు లక్ష్మయ్య, గింజల నరసింహారెడ్డి, మద్దినేని నరసింహారావు, గుజ్జర్లపూడి రాంబాబు, లకావత్ సునీత పాల్గొన్నారు. అలాగే, కారేపల్లి మండలంలోని గంగారంతండాకు చెందిన శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ రెండు నెలల క్రితం ఆకేరు వరద ఉధృతితో మృతి చెందగా, వారి కుటుంబాన్ని ఎంపీ పరామర్శించి రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. అంతేకాకుండా వరదల్లో చిక్కుకుని మృతి చెందిన నాయకన్‌గూడెంకు చెందిన యాకూబ్–సైదాబీ కుమారులను పరామర్శించి రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. నాయకులు శ్రీదేవి, మానుకొండ రాధాకిషోర్, కృష్ణ, మంజుల, చిట్టి స్రవంతి, సునీత పాల్గొన్నారు. అంతేకాకుండా ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంకు చెందిన మాజీ సర్పంచ్ కన్నేటి వెంకన్న ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు. నాయకులు కన్నేటి నర్సింహారావు, జ్యోతి, కన్నేటి వెంకటమ్మ పాల్గొన్నారు. కాగా, కొణిజర్ల నుంచి తుమ్మలపల్లి వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని మాజీ జెడ్పీటీసీ దొండపాటి రమేష్, కట్ల సత్యం, గడల శ్రీనివాసరావు, కమతం నాగేశ్వరరావు ఎంపీకి విన్నవించారు. -
ఉద్రిక్తతకు దారి తీసిన దారి పంచాయితీ
నేలకొండపల్లి: మండలంలోని తిరుమలాపురంలో దారి పంచాయితీ కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండేళ్లుగా గ్రామంలోని సన్న, చిన్న కారు తమ భూములకు వెళ్లకుండా ఓ రైతు కంచె ఏర్పాటు చేశాడు. అది ప్రభుత్వ భూమి అని గిరిజనులు.. కాదు సొంత భూమి అని సదరు రైతు చెబుతుండగా వివాదం కొనసాగుతోంది. ఈక్రమాన 33 మంది రైతులు 50 ఎకరాల్లో వరి సాగు చేయగా పంట కోసి ధాన్యం తీసుకొచ్చేందుకు దారి లేకుండా పోయింది. దీంతో వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం తహసీల్దార్ జె.మాణిక్‌రావు, ఎస్పై పి.సంతోష్ క్షేత్ర స్థాయికి వెళ్లి విచారణ చేపట్టారు. కంచె వేసిన రైతు నర్సింహారావును పిలిచి దారి ఇవ్వాలని కోరినా ససేమిరా అనడంతో ముందుగా గిరిజన రైతులు పంట తెచ్చేందుకై నా సహకరించాలని కోరారు. దీంతో ఆయన తమ కుటుంబీకులు అడిగి చెబుతానంటూ వెళ్లిపోయారు. కాగా, సీపీఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, నాయకులు మౌలానా, హేమంతరావు, జమ్ముల జితేందర్‌రెడ్డి, కర్నాటి భానుప్రసాద్, పాల్తీయ శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, కనకబండి సీతారాములు తదితరులు చేరుకుని బాధిత రైతులకు మద్దతుగా అధికారులతో చర్చించారు. అయితే, నర్సింహారావు అంగీకరించినా, లేకున్నా శనివారం తాము కంచె తొలగించి పంట కోసి ధాన్యం తీసుకొస్తామని చెప్పడంతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. -
‘కమ్మ’ వన సమారాధనకు ఏర్పాట్లు పూర్తి
ఖమ్మంమయూరిసెంటర్: కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యాన ఈనెల 24న ఆదివారం ఖమ్మం వెలుగుమట్లలోని అర్బన్ పార్క్‌లో నిర్వహిస్తున్న వన సమారాధనకు ఏర్పాట్లు పూర్తయ్యాయని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎర్నేని రామారావు, గొడవర్తి నాగేశ్వరరావు తెలిపారు. పార్క్‌లో శుక్రవారం వారు ఏర్పాట్లను పరిశీలించాక మాట్లాడారు. సుమారు 40 వేల మంది హాజరు కానుండగా, నగరంలోని ముఖ్య కూడళ్ల నుంచి పార్క్ వరకు బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిర్వహణ కమిటీ సభ్యులు రావూరి సైదుబాబు, నల్లమల ఆనంద్, బండి మాధవరావు, మందడి నరేష్చౌదరి, నల్లమల రంజిత్చౌదరి, ఊట్ల మురళి, జెట్ల శ్రీను, తూము శివ, చండ్ర రాంబాబు తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి ఫుట్‌బాల్ పోటీలకు కల్లూరు విద్యార్థి కల్లూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన వచ్చేనెల 6నుంచి జమూకాశ్మీర్లో జరగనున్న జాతీయ స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో కల్లూరు శాంతినగర్‌కు చెందిన మాతిపోగు లాస్య పాల్గొననుంది. అండర్–17 విభాగంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర జట్టుకు ఆమె ఎంపికై ంది. హకీంపేటలోని క్రీడా పాఠశాలలో పదో తరగతి చదువుతున్న లాస్య జమ్మూకాశ్మీర్‌కు వెళ్లేందుకు అయ్యే ఖర్చులు సమకూరుస్తామని శాంతినగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగి కిన్నెర ఆనంద్ ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమెను ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదర్శ్‌కుమార్, స్పోర్ట్స్ స్కూల్ ఆఫీసర్ రతన్బోస్, పీఈటీ పసుపులేటి వీరరాఘవయ్య తదితరులు అభినందించారు. విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించిన బ్యాంకు ఉద్యోగులు ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 13 మంది పరీక్ష ఫీజును యూనియన్ బ్యాంక్ ఉద్యోగులు చెల్లించారు. ఈమేరకు ఫీజు మొత్తం రూ.2,600ను బ్యాంకు మేనేజర్ డి.వినోద్ కుమార్ శుక్రవారం హెచ్ఎం ఎన్.జ్యోతికి అందచేశారు. ఉద్యోగులు ముఖేష్, ప్రదీప్‌కుమార్, రవికుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో పాడిగేదెలు మృతి చింతకాని: మండలంలోని పందిళ్లపల్లిలో రెండు పాడి గేదెలు విద్యుదాఘాతంతో మృతి చెందాయి. గ్రామానికి చెందిన బొందుల సత్యనారాయణ పాడిగేడెలను శుక్రవారం మేత కోసం గ్రామ సమీపంలోని మున్నేరు ప్రాంతానికి తీసుకెళ్లాడు. నీళ్లు తాగేందుకు మున్నేరులోకి దిగిన గేదెలు అక్కడ రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్ల వైర్లకు తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. రూ.1.50 లక్షల విలువైన గేదెలను కోల్పోయిన తనను ఆదుకోవాలని సత్యనారాయణ కోరాడు. చికిత్స పొందుతున్న వృద్ధుడు మృతి కారేపల్లి: డెకరేషన్ సామగ్రిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్తుండగా తాకడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మండలంలోని పేరుపల్లికి చెందిన పీకె కోటయ్య(70) ఈనెల 15వ తేదీన రహదారి వెంట వెళ్తున్నాడు. అదేసమయాన ఉసిరికాయలపల్లికి చెందిన ఈశ్వర్, సాయి ద్విచక్రవాహనంపై డెకరేషన్ సామగ్రి తీసుకెళ్తుండగా కోటయ్యకు తాకడంతో తీవ్రగాయాలయ్యాయి. ఆయనను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఘటనపై కోటయ్య కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజారాం తెలిపారు. ఇంటర్ విద్యార్థిపై పోక్సో కేసు నమోదు ఖమ్మంఅర్బన్: ఖమ్మంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ తెలిపారు. ఆ కాలేజీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ద్వితీయ సంవత్సరం విద్యార్థి కొన్నాళ్లుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. దీంతో విద్యార్థిని తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
హాస్టళ్లలో సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఇటికాల రామకృష్ణ ఆరోపించారు. సమస్యలను పరిష్కరించడమే కాక విద్యార్థులకు వసతులు కల్పించాలనే డిమాండ్‌తో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యాన శుక్రవారం రాత్రి కలెక్టరేట్ ఎదుట నిరసన నిద్ర తలపెట్టారు. సంఘం నాయకులు కలెక్టరేట్ వద్దకు రావడంతో పోలీసులు అడ్డుకోగా స్వల్ఫ ఉద్రిక్తత చోటు చేసుకుంది. అనంతరం సంఘం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ వసతిగృహాల్లో మరుగుదొడ్లు, స్నానాల గదులు సక్రమంగా లేవని, అపరిశుభ్రత తాండవిస్తోందని తెలిపారు. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులను సంక్షేమ శాఖల డీడీలు పక్కదారి పట్టిస్తుండడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. చలికాలంలో దుప్పట్లు ఇవ్వకపోగా, విద్యార్థులు చన్నీటితోనే స్నానం చేయాల్సి వస్తోందని తెలిపారు. ఇకనైనా సమస్యలు పరిష్కరించి పెరిగిన మెస్‌చార్జీలకు అనుగుణంగా మెనూ అమలుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. నాయకులు షేక్ నాగుల మీరా, మధు, శివనాయక్, మనోజ్, హరికృష్ణ, ప్రతాప్, బాలాజీ, సుభాష్, సునీల్, రోహిత్, మహేష్, ధోని, రాజు, పవన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ‘నిరసన నిద్ర’ -
ఎఫ్ఆర్ఓ త్యాగం మరువలేనిది
చుంచుపల్లి: అడవుల సంరక్షణనే ధ్యేయంగా పనిచేస్తూ విధి నిర్వహణలో గొత్తిగోయల దాడిలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అమరవీరుడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చలమల శ్రీనివాసరావు త్యాగం మరువలేనిదని భద్రాద్రి జిల్లా అటవీశాఖ అధికారి కిష్టాగౌడ్ అన్నారు. కొత్తగూడెం సీఎస్ఆర్ సెంట్రల్ పార్క్‌లో శుక్రవారం ఆయన రెండో వర్ధంతి నిర్వహించారు. శ్రీనివాసరావు కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డీఎఫ్ఓ మాట్లాడుతూ అడవుల సంరక్షణలో అటవీశాఖ సిబ్బంది, ఉద్యోగుల కృషి ఎనలేనిదని అన్నారు. రాత్రీపగలు తేడా లేకుండా నిరంతరం విధుల్లో ఉంటూ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు సతీమణి భాగ్యలక్ష్మి, పిల్లలు, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్లు కోటేశ్వరరావు, దామోదర్‌రెడ్డి, సుజాత, మక్సూద్‌తో పాటు ఎఫ్‌ఎస్‌ఓలు, ఎఫ్‌బీఓలు తదితరులు పాల్గొన్నారు. -
ఇన్ఫార్మర్ల పేరిట... ఇద్దరిని హతమార్చిన మావోలు
●మృతుల్లో ఒకరు గ్రామపంచాయతీ కార్యదర్శి ●మృతులిద్దరూ వరుసకు అన్నదమ్ములు ●భద్రాచలం నియోజకవర్గం వాజేడులో ఘటనవాజేడు: పోలీసులకు తమ సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలతో మావో యిస్టులు గురువారం రాత్రి ఇద్దరు గిరిజనులను గొడ్డళ్లతో నరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన భద్రాచలం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ములుగు జిల్లా వాజేడులోని పోలీస్‌స్టేషన్‌కు అర కిలోమీటర్ దూరాన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. వాజేడు మండలం బాల లక్ష్మిపురం(పెనుగోలు కాలనీ) గ్రామానికి చెందిన వరుసకు సోదరులైన ఉయికె రమేష్(38), ఉయికె అర్జున్(38)ను మావోయిస్టులు విచక్షణారహితంగా గొడ్డళ్లతో నరికి చంపారు. గురువారం రాత్రి 11 గంటల సమయాన అర్జున్ ఇంటికి ముగ్గురు మావోయిస్టులు వచ్చారు. ఆయనను బయటకు తీసుకువచ్చి గొడ్డళ్లతో నరకగా.. అదే సమయాన మరో ముగ్గురు మావోయిస్టులు గ్రామ కార్యదర్శి అయిన ఉయిక రమేష్ ఇంటికి వెళ్లి అడ్డుగా కట్టిన గుడ్డను కత్తులతో కోసి లోపలికి చొరబడ్డారు. బెడ్‌పై పడుకున్న రమేష్‌ను గొడ్డళ్లతో నరికారు. ఆయన కొన ఊపిరితో ఉండగా స్థానికులు ఏటూరునాగారం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్యం చేస్తుండగానే కన్నుమూశాడు. కాగా, ఈ ఘటనలో ఎందరు మావోయిస్టులు పాల్గొన్నారనది తెలియరాలేదు. రమేష్‌కు భార్య రాంబాయి, ఒక కూతురు, ఇద్దరు అబ్బాయిలు ఉండగా, అర్జున్‌కు భార్య సావిత్రి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మృతులిద్దరూ వరుసకు అన్నదమ్ములు. రమేశ్ పేరూరు గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. లేఖ వదిలిన మావోయిస్టులు పశువులు కాయడానికి వస్తున్న ఉయికె అర్జున్ మావోయిస్టు దళాల సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్నాడని, రమేష్ కూడా ఇదే పనిచేస్తున్నాడని మృతదేహాల వద్ద వాజేడు, వెంకటపురం ఏరియా కమిటీ శాంత పేరుతో లేఖ వదిలారు. తన స్నేహితుల ద్వారా సమాచారం తెలుసుకుని పోలీసులకు చేరవేస్తూ మావోయిస్టులపై పోలీసులు దాడులు చేయడానికి రమేష్ కారణమని ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, మృతదేహాలను ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ గిరిజన సంఘాలు, ఆదివాసీలు శుక్రవారం రాత్రి ఆందోళన నిర్వహించారు. పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాము గుట్టలపై జీవిస్తున్నప్పుడు ప్రశాంతంగా ఉండేదని, బతుకుదెరువు కోసం కిందకు దిగి వస్తే మావోయిస్టులు హత్య చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు పోలీసులు, అటు మావోయిస్టుల నడుమ నలిగిపోతున్నామని వాపోయారు. అడవిలో పనిచేసుకుంటూ బతికే తమను పోలీస్ కొరియర్లుగా చిత్రీకరించి హతమార్చడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. -
బీఆర్ఎస్ హయాంలోనే రైతుల చేతికి బేడీలు
ఖమ్మంవన్‌టౌన్: జిల్లాలో రైతుల చేతులకు బీఆర్ఎస్ హయాంలోనే బేడీలు వేశారని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు జి.రేణుకాచౌదరి అన్నారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు కొందరు జిల్లాలో పర్యటించగా, వాస్తవాలను తెలుసుకోకుండా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కొండలు, గుట్టలు మింగిన వాళ్లు ఈ రోజు నీతులు చెప్పడం గర్హనీయమని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు నిద్రాహా రాలు మాని పనిచేస్తున్నారని తెలిపారు. కాగా, త్వరలోనే స్తంభాద్రి ఉత్సవాలు నిర్వహిస్తామని, కొత్తగూడెం విమానాశ్రయం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోందని ఎంపీ రేణుక వెల్లడించారు. మేయర్ పి.నీరజ, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కార్పొరేటర్ రఫీదాబేగంతో పాటు మానుకొండ రాధాకిషోర్, మహ్మద్ ముస్తఫా, రామసహాయం మాధవీరెడ్డి, కట్ల రంగారావు, నున్నా రామకృష్ణ, కొరివి వెంకటరత్నం, యడ్లపల్లి సంతోష్, జలీల్ పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి -
మృత్యువే వారిని విడదీసింది...
కొణిజర్ల: కలిసిమెలిసి జీవిస్తున్న అన్నాదమ్ముళ్లను రోడ్డుప్రమాదం విడదీసింది. పనుల కో సం రోజు మాదిరి గానే ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మృత్యువు రూపంలో ఎదురొచ్చిన బస్సు ఢీకొట్టడంతో తమ్ముడు కన్నుమూయగా, అన్న తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు. కొణిజర్ల మండలం పల్లిపాడు సమీపాన శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన వివరాలను ఎస్ఐ గుగులోత్ సూరజ్ వెల్లడించారు. వైరా మండలం వల్లాపురానికి చెందిన అన్నాదమ్ముళ్లు కటికల సిల్వరాజు(35), కటికల శోభన్‌బాబు ఖమ్మంలో పెయింటింగ్ పనులు చేస్తుంటారు. రోజుమాదిరిగానే శుక్రవారం ఉద యం వారిద్దరు బైక్‌పై ఖమ్మం బయలుదేరగా, పల్లి పాడు సమీపాన ఖమ్మం నుంచి భద్రాచలం వెళ్తున్న కొత్తగూడెం డిపో అద్దె బస్సు ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా ఓ యువకుడు సిల్వరాజుకు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోగా అక్కడే మృతి చెందాడు. ఆయన అన్న శోభన్‌బాబును ఆస్పత్రికి తరలించారు. కాగా, సిల్వరాజుకు భార్య దేవమణి, కొడుకు సాత్విక్, కూతురు హర్షిత ఉన్నారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కొనుగోలు కేంద్రంలో దళారుల దందానేలకొండపల్లి: వరి సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయగా.. కొన్నిచోట్ల సిబ్బంది సహకారంతో దళారులు అడ్డాగా మార్చుకుంటున్నారని తెలుస్తోంది. నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్లో డీసీఎంఎస్ ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో దళారులదే రాజ్యం నడుస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. రైతు వద్ద క్వింటాకు రూ.1,900 నుంచి రూ.2 వేల వరకు ధాన్యం కొనుగోలు చేసిన ఓ వ్యాపారి అదే రైతు పేరుతో మార్కెట్‌కు తీసుకొచ్చి ఆరబోశాడు. ప్రభుత్వ మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ కలిపి క్వింటాకు రూ.2,820 తీసుకునేందుకు ఇలా చేసినట్లు తెలిసింది. ఫలితంగా రైతు రూ.వెయ్యి మేర నష్టపోతుండ డం గమనార్హం. సదరు వ్యాపారి శుక్రవారం దాదాపు 250 బస్తాల ధాన్యాన్ని కాంటా వేయించినట్లు సమాచారం. అయితే, ఆయనకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత మేర వరి సాగు చేశాడనే వివరాలను అధికారులు ఆరా తీయకపోవడం గమనార్హం. కేంద్రాల వద్దకు వ్యాపారులను రానివ్వొద్దని ఇటీవల పోలీస్ కమిషనర్ సూచించినా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపతున్నారు. రోడ్డు ప్రమాదంలో తమ్ముడి మృతి, అన్నకు తీవ్రగాయాలు -
మత్స్య పాలిటెక్నిక్ ఉందా.. లేదా?!
పాలేరుకు మంజూరు చేసిన గత ప్రభుత్వం ● అప్పట్లో పదెకరాల స్థలం కేటాయింపు ● రూ.32కోట్ల నిధులు కేటాయించినా విడుదల చేయని వైనం ● ఫలితంగా ముందుకు పడని అడుగులుకూసుమంచి: తెలంగాణలోనే తొలి మత్స్య పరిశోధనా కేంద్రం మండలంలోని పాలేరులో ఉంది. ఇక్కడ చేపల రకాలపై అధ్యయనం, మత్స్యకారులకు శిక్షణ కార్యమ్రాలు నిరంతరం కొనసాగుతున్నాయి. ఇదేక్రమాన కేంద్రానికి అనుబంధంగా విద్యార్థుల కోసం మత్స్య పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు గత ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు 2022లో రూ.32 కోట్ల నిధులను సైతం కేటాయించింది. ఆపై సార్వత్రిక ఎన్నికలు రావడంతో కళాశాల ఏర్పాటు, నిధుల మంజూరు అంశాలు మరుగున పడ్డాయి. ఆతర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావొస్తున్నా కళాశాల ఏర్పాటులో కదలిక లేకపోవడంతో గత రెండేళ్లుగా విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది. అంతేకాక మత్స్య పాలిటెక్నిక్పై ఆసక్తి ఉన్న వారు పొరుగు రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిధులు విడుదలలో ఆలస్యంతో.. గత ప్రభుత్వం కళాశాలను మంజూరు చేసి, నిధులు కేటాయించినా విడుదల చేయలేదు. దీంతో కళాశాల నిర్వహణకు అవసరమైన భవనాల నిర్మాణంలో జాప్యం జరిగింది. అయితే, నిర్మాణం పూర్తయ్యేలోగా తాత్కాలిక భవనాల్లో తరగతులు నిర్వహించాలన్నా పాలనా, తరగతి గదుల గుర్తింపు, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం కనీసం రూ.5 కోట్ల నిధులు అవసరం. అయితే, ఈ నిధులను ప్రస్తుత ప్రభుత్వమైనా విడుదల చేస్తేనే తరగతుల నిర్వహణకు వీలవుతుంది. ఇదే జరిగితే రాష్ట్రంలోనే తొలి మత్స్య పాలిటెక్నిక్ కళాశాల పాలేరులో ఏర్పాటుకానుంది. మంత్రులు స్పందిస్తే.. పాలేరుకు మత్స్య పాలిటెక్నిక్ కళాశాల మంజూరైనా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా కొనసాగుతున్నారు. అంతేకాక జిల్లా నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. వీరు కళాశాల ఏర్పాటు, తరగతుల నిర్వహణకు అనుమతులు ఇప్పిస్తే మత్స్య పాలిటెక్నిక్పై ఆసక్తి ఉన్న తెలంగాణలోని విద్యార్థులు పొరుగున ఉన్న ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఇక్కట్లు తప్పుతాయి. 2022లో స్థలం కేటాయింపు.. మత్స్య పాలిటెక్నిక్ నిర్మాణానికి 2022లో జుజుల్‌రావుపేట రెవెన్యూ పరిధి 355 సర్వే నంబర్లోని పదెకరాల ఎన్నెస్పీ స్థలాన్ని గుర్తించారు. సర్వే అనంతరం ఎన్నెస్పీ అధికారులు ఆ స్థలాన్ని మత్స్యశాఖకు అప్పగించారు. ఆపై 20 సీట్లతో మత్స్య పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పూర్తి చేసిన వారు పాలిసెట్‌లో అర్హత సాధిస్తే ఇక్కడ రెండేళ్ల కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.అన్ని ప్రతిపాదనలు పంపించాం... గత ప్రభుత్వ హయాంలో పాలేరులో మత్స్య పాలిటెక్నిక్ కళాశాల మంజూరు కాగా, తరగతుల నిర్వహణకు అవసరమైన ప్రతిపాదనలను యూనివర్సిటీకి పంపించాం. తరగతులు నిర్వహించేందుకు బోధన సిబ్బంది కూడా సిద్ధంగానే ఉన్నాం. తొలుత తరగతుల నిర్వహణ, ఇతర అవసరాలకు కొంత నిధులు విడుదల చేయాల్సి ఉంది. నిధులు కేటాయించి విద్యార్థులను కేటాయిస్తేతరగతులు ప్రారంభమవుతాయి. – శ్యాంప్రసాద్, ప్రధాన శాస్త్రవేత్త, పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రం -
కుటుంబ సర్వే 75.15 శాతం పూర్తి
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గురువారం నాటికి 75.15శాతం పూర్తయిందని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వెల్లడించా రు. క్యాంపు కార్యాలయానికి శుక్రవారం వచ్చిన ఎన్యుమరేటర్లకు ఆయన తన వివరాలు వెల్లడించి నమోదు చేయించుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 5,67,338 ఇళ్లకు గాను 4,26,333 ఇళ్లలో సర్వే పూర్తయిందని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గంలో 54.96 శాతం, పాలేరులో 80.93, మధిరలో 80.66, వైరాలో 88.54, సత్తుపల్లి నియోజకవర్గంలో 88.54శాతం పూర్తయిందని తెలిపారు. ట్రాన్స్జెండర్ల ఉపాధికి సహకారం ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించేలా సహకరి స్తామని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. కలెక్టరేట్లో ట్రాన్స్జెండర్లతో సమావేశమైన ఆయన మా ట్లాడుతూ ఆధార్ కార్డుల జారీ, పేరు మార్పు, అర్హులకు రేషన్ కార్డులు, ఒంటరి మహిళా కోటా కింద పెన్షన్ల మంజూరుకు కృషి చేస్తామన్నారు. అలాగే, ఖమ్మంలో రెండు చోట్ల క్యాంటీన్లకు ఏర్పాటుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీజ, జిల్లా సంక్షేమ అధికారి కె.రాంగోపాల్ రెడ్డి, డీఆర్డీఓ ఎస్.సన్యాసయ్య, డీఆర్వో ఎం.రాజేశ్వరి పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యంపై అప్రమత్తత ఖమ్మంరూరల్: వాతావరణ పరిస్థితుల్లో మార్పు నేపధ్యాన హాస్టళ్ల విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ముజుమ్మిల్ ఖాన్ సూచించారు. ఖమ్మం రూరల్ మండలం జలగంగనగర్లోని మైనార్టీ బాలుర గురుకులాలన్ని తనిఖీ చేసిన ఆయన హాస్టల్, తరగతి గదుల, వంట గదదిని పరిశీలించి బోధన, భోజనం, తాగునీటి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు తాజా సరుకులు, కూరగాయాలతో చేసిన భోజనం అందించడమే కాక అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే చికిత్స చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే, స్నానానికి వేడినీటి కోసం హీటర్ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు జావేద్, ఇందిర, మహేష్ తదితరులు పాల్గొన్నారు.వివరాలు నమోదు చేయించుకున్న కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ -
ధాన్యం కొనుగోళ్లు, కార్యాలయాల్లో తనిఖీ
తల్లాడ: తల్లాడలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ శ్రీజ శుక్రవారం తనిఖీ చేశారు. పీహెచ్‌సీకి వెళ్లిన సమయంలో ఫార్మసిస్ట్ లేకపోవడం, సిస్టర్ మందులు ఇస్తుండడంతో వైద్యాధికారి రత్న మనోహర్‌ను ప్రశ్నించారు. ఫార్మసిస్ట్ వారం క్రితం పది రోజుల పాటు సెలవు కావాలని లేఖ ఇస్తే మంజూరు చేయకున్నా రావడం లేదన్నారు. ఈ విషయాన్ని డీఎంహెచ్ఓకు చెప్పారా అని ఆరా తీయగా చెప్పలేదనగా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక మందులు వివరాలు ఆన్లైన్లో నమోదు చేయనందున బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆతర్వాత తల్లాడ సొసైటీ కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం, ప్రాథమిక పాఠశాలల్లో తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఎంపీడీఓ చంద్రమౌళి, ఎంపీఓ కె.శ్రీదేవి, ఎంఈఓ దామోదరప్రసాద్, సొసైటీ సీఈఓ నాగబాబు, సూపర్వైజర్ పెద్ద పుల్లయ్య, సీహెచ్ఓ భాస్కర్ పాల్గొన్నారు. విధులు పక్కాగా నిర్వర్తించాలి ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీల సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించేలా అధికారులు పర్యవేక్షించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీజ ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ భవన నిర్మాణాలకు నిబంధనల మేరకు అనుమతులు జారీ చేయాలని, వంద శాతం పన్ను వసూలు చేయాలని తెలిపారు. అలాగే, సెల్ టవర్ల అనుమతులు, పారిశుద్ధ్య నిర్వహణ, సిబ్బందికి వేతనాలపై సూచనలు చేశారు. డీపీఓ ఆశాలత, డీఎల్పీఓ రాంబాబు, ఎంపీడీఓలు, ఎంపీఓఓలు పాల్గొన్నారు.పీహెచ్సీలో లోపాలపై అదనపు కలెక్టర్ ఆరా -
రిటైనింగ్ వాల్స్ పరిశీలనకు నిట్ప్రొఫెసర్లు
ఖమ్మంఅర్బన్: ఖమ్మంలో ముంపు ఎదురుకాకుండా మున్నేటికి ఇరువైపులా నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్స్ పనులను శనివారం వరంగల్ నిట్ ప్రొఫె సర్లు పరిశీలించనున్నారు. నిట్ ప్రొఫెసర్ రమణ మూర్తి నేతృత్వాన బృందం పనులను పరిశీలి స్తుందని అధికారులు తెలిపారు. రూ.690 కోట్ల అంచనా వ్యయంతో మున్నేటికి ఇరువైపులా 17 కి.మీ.మేర రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ సందర్భంగా నా ణ్యతను పరీక్షించి సలహాలిస్తారని వెల్లడించారు. సొరంగ మార్గం పనులు.. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ప్యాకేజీ–16 ద్వారా జిల్లాలో సొరంగ మార్గం నిర్మిస్తున్నారు. ఈ పనులను శనివారం సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన జియాలజిస్ట్ పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. -
దయనీయంగా రైతుల పరిస్థితి
ఖమ్మంవ్యవసాయం: పంటలకు మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఫలితంగా పత్తి, వరి సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి విక్రయాలను ఆయన పరిశీలించారు. మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, బానోతు చంద్రావతి, జెడ్పీ మాజీ చైర్మన్ కమల్‌రాజ్ తదితరులతో కలిసి మార్కెట్‌కు వచ్చిన ఆయన పత్తి దిగుబడి, ధరలు ఎలా ఉన్నాయి, వరి ధాన్యానికి బోనస్ అందుతోందా, పెట్టుబడి సాయం ఇచ్చారా అని రైతులను ఆరా తీశారు. అలాగే, మహిళా కార్మికులతో మాట్లాడిన బతుకమ్మ చీరలు వచ్చాయా, గ్యాస్ సబ్సిడీ అందుతోందా, ప్రభుత్వం నెలనెలా ఇస్తానన్న రూ.2,500 ఇచ్చారా అని అడగగా రాలేదని వారు సమాధానాలు ఇచ్చారు. బోనస్‌ను బోగస్ చేశారు... రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు అడుగడుగునా కష్లాలే ఎదరవుతున్నాయని హరీశ్‌రావు తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ప్రకటించిన ఏ హామీని అమలుచేయలేదన్నారు. రైతుబంధు పూర్తిగా నిలిపివేయగా, రుణమాఫీ కూడా అరకొరగా చేశారని విమర్శించారు. తొలుత అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ఆతర్వాత వరికే పరిమితం చేశారన్నారు. పత్తికి కనీస మద్దతు ధర రూ.7,521గా ప్రకటించినా ఖమ్మం మార్కెట్‌తో పాటు రాష్ట్రంలో అన్ని చోట్ల రూ.6,500 మించి ధర లేక క్వింటాకు రూ.వెయ్యి వరకు రైతులు నష్టపోతున్నారని తెలిపారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు ప్రభుత్వం తీరుతో మరింత అవస్థ పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరికి రూ.500 బోనస్‌ను బోగస్‌గా మార్చి..కనీస మద్దతు ధర చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందనిచెప్పారు. ఇక సీసీఐ కేంద్రాలు దళారులకు ప్రయోజనం కలిగిస్తున్నాయని ఆరోపించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారని పంట ధరలు, రైతుల సమస్యలపై ఎందుకు సమీక్షించడం లేదో చెప్పాలన్నారు. ఇదిపోను రైతుల పక్షాన మాట్లాడే వారిని వేధిస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. పత్తికి మద్దతు ధర కల్పనలో విఫలమైన ప్రభుత్వం సీసీఐ కేంద్రాల్లో దళారులకే పెద్దపీట వరి సాగు చేసిన రైతులకు అడుగడుగునా నష్టాలే ఖమ్మం మార్కెట్ సందర్శనలో మాజీ మంత్రి హరీశ్‌రావు -
రేపు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు
ఖమ్మం సహకారనగర్/మధిర: ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను ఆదివారం మధిర మండలం దెందుకూరులోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఈమేరకు అలేఖ్య సారథ్యంలోని కళాబృందం ఆధ్వర్యాన ఏడాది కాలంలో సాధించిన విజయాలపై ప్రదర్శనలు ఉంటాయని వెల్లడించారు. కాగా, దెందుకూరులో ఆదివారం సాయంత్రం 6గంటలకు మొదలయ్యే విజయోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్యఅతిథిగా పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. అలాగే, ఇతర మంత్రులు, జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ ఓ ప్రకటనలో కోరారు. దెందుకూరులో నిర్వహణకు ఏర్పాట్లు -
ఊరూరా సన్నాలే..
2.62లక్షల ఎకరాల్లో సన్నాల సాగు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర, బోనస్‌తో రైతాంగం సన్నరకాల సాగుకు ప్రాధాన్యత ఇచ్చింది. వర్షాలు సమృద్ధిగా కురవడం, జలాశయాల్లో నీరు ఉండడమే కాక సాగర్ జలాలు సైతం విడుదలయ్యాయి. దీంతో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. జిల్లాలో మొత్తం 2,81,991 ఎకరాల్లో వరికి గాను సన్న రకాలే 2,62,230 ఎకరాల్లో సాగయ్యాయి. దొడ్డు రకాలను 19,761 ఎకరాలకే రైతులు పరిమితం చేశారు. ఈ మొత్తం ద్వారా 67,74,500 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందనే అంచనాతో రైతుల అవసరాలు, మిల్లర్లు, వ్యాపారుల కొనుగోళ్లు పోగా 42,96,300 క్వింటాళ్ల ధాన్యం సేకరణకు అధికారులు సిద్ధమయ్యారు. మద్దతు ధర, బోనస్‌తో.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఖరీఫ్‌లో సాధారణ వరి ధాన్యం రకం క్వింటాకు రూ.2,300 కనీస మద్దతు ధర ప్రకటించింది. గ్రేడ్–ఏ(సన్న రకం) ధాన్యానికి రూ.2,320గా ప్రకటించగా.. రాష్ట్రప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని వెల్లడించింది. దీంతో సన్న రకాల వైపే రైతులు మొగ్గు చూపగా.. మద్దతు ధర, బోనస్ కలిపి క్వింటా సన్నరకం ధాన్యానికి రూ.2,820 లభించనుంది. ఇక బహిరంగ మార్కెట్ కన్నా ప్రభుత్వ మద్దతు ధర ఎక్కువగా ఉండడం, బోనస్ కూడా చెల్లించనున్న అంశంపై అధికారులు విస్తృతంగా ప్రచారం చేశారు. అంతేకాక కొనుగోలు కేంద్రాలను కూడా దొడ్డు, సన్న రకాలకు వేర్వేరుగా ఏర్పాటుచేశారు. ఫలితంగా పదిహేను రోజుల క్రితం మొదలైన కొనుగోళ్లు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఇప్పటివరకు 2,80,895 క్వింటాళ్లు జిల్లాలో డీసీఎంఎస్, డీఆర్డీఏ, పీఏసీఎస్ ఆధ్వర్యాన 330కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశారు. గత 15 రోజులుగా ఈ కేంద్రాలకు ధాన్యం వస్తోంది. ఇప్పటి వరకు 3,773మంది రైతుల నుంచి 2,80,895 క్వింటాళ్ల ధాన్యం సేకరించగా ఇవన్నీ సన్నరకాలే కావడం విశేషం. మొత్తం 38,90,530 క్వింటాళ్ల సన్నరకం ధాన్యాన్ని సేకరించాలని అధి కారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. కాగా, దొడ్డు రకాలను నామమాత్రంగానే సాగు చేయడంతో రైతులు కేంద్రాలకు తీసుకురావడం లేదని తెలు స్తోంది. వచ్చే ఏడాది నుంచి రేషన్‌షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి నిర్ణయించిన ప్రభుత్వం ముందస్తుగా కల్పించిన అవగాహనతో రైతులు ఇటే మొగ్గు చూపారు. పాఠశాలల్లోనూ మధ్యాహ్న భోజ నానికి సన్న బియ్యమే కేటాయించనున్నారు.జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు సన్నరకం ధాన్యమే వస్తోంది. ప్రభుత్వం ముందస్తు ప్రకటనతో ఈ ఏడాది ఖరీఫ్‌లో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు ఎక్కువగా ఈ రకాలే సాగు చేశారు. జిల్లా అంతటా సాగైన వరిలో దాదాపు 93 శాతం సన్నరకాలే ఉండగా.. అదే ధాన్యం ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. జిల్లాలో 330 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. శుక్రవారం నాటికి 2,80,895 క్వింటాళ్ల ధాన్యం తీసుకొచ్చారు. –సాక్షిప్రతినిధి, ఖమ్మంకొనుగోలు కేంద్రాలకు ఈ రకం ధాన్యమే ఎక్కువ సాగైన వరిలోనూ 93 శాతం ఇవే.. ఇప్పటి వరకు 2,80,895 క్వింటాళ్ల సేకరణ మద్దతు ధర, బోనస్‌తో రైతుల ఆసక్తి -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంవన్‌టౌన్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉద యం 11గంటలకు భద్రాచలంలో శ్రీ సీతా రామచంద్రస్వామి దర్శించుకోనున్న మంత్రి, ఆతర్వాత చర్ల రోడ్డు ఏఎంసీ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12గంటలకు భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధితో అధికారులతో సమీక్షించనున్నారు. అలాగే, సాయంత్రం ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి, మద్దులపల్లి, గుర్రాలపాడులో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. వచ్చేనెల 18నుంచి పరీక్షలు ఖమ్మం సహకారనగర్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్ఈడీ) 2023–25 బ్యాచ్‌లో పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించిన మొదటి సంవత్సరం విద్యార్థులకు వచ్చేనెల 18నుంచి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. నిర్ణీత తేదీల్లో ఉదయం 9నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.bse.telangana.gov.in వెబ్సైట్లో పరిశీలించాలని సూచించారు. ప్రసవం సమయాన మరణాలను అరికట్టాలి ఖమ్మంవైద్యవిభాగం: ప్రసవ సమయంలో ఏ ఒక్క తల్లీబిడ్డ మృతి చెందకుండా వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి.కళావతిబాయి సూచించారు. మాతృ మరణాలపై కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గర్భిణులకు ప్రసవం చేసే సమయాన అన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరణాల రేటు తగ్గించొచ్చని తెలిపారు. సుబ్లేడు, మామిళ్లగూడెం, వైరా, కల్లూరు, ముస్తఫానగర్, ఎం.వీ.పాలెం పీహెచ్‌సీల్లో ఇటీవల జరిగిన ఘటన వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ రాజేశ్వరరావు, డీసీహెచ్ఎస్ రాజశేఖర్‌గౌడ్, ఎంసీహెచ్ పీఓ సైదులు, సీహెచ్ఐ పీఓ చందునాయక్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్, వివిధ విభాగాల వైద్యులు యామిని, రెహానా బేగం, సాంబశివరెడ్డి, దుర్గ పాల్గొన్నారు. పాలు, పాల ఉత్పత్తుల రవాణాకు దరఖాస్తుల ఆహ్వానం ఖమ్మంవ్యవసాయం: విజయ డెయిరీ నుంచి పాలు, ఇతర ఉత్పత్తులు రవాణా చేసేందుకు వాహనదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ మోహనమురళి తెలిపారు. సత్తుపల్లి, కల్లూరు, కామేపల్లి, ఎర్రుపాలెం, కొత్తగూడెం, ఇల్లెందు, ఖమ్మంలోని డెయిరీ, పాల శీతలీకరణ కేంద్రాల నుంచి పాలు, పాల ఉత్పత్తులను హైదరాబాద్ ప్రధాన కార్యాలయానికి రవాణా చేసేందుకు వాహనాల యజమానులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్ల డించారు. ఆసక్తి ఉన్నవారు ఖమ్మం రోటరీ నగర్‌లోని తమ కార్యాలయంలో ఈనెల 28లోగా దరఖాస్తులు అందజేయాలని, వివరాలకు 99598 95460 సంప్రదించాలని సూచించారు. 15మంది ఉపాధ్యాయులకు నియామకపత్రాలు ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను కాంట్రాక్టు విధానంలో దశల వారీగా భర్తీ చేస్తున్నారు. ఈమేరకు 23 పోస్టులకు గాను దరఖా స్తులు స్వీకరించగా అర్హులైన 15మందికి శుక్రవారం నియామక పత్రాలు అందించినట్లు జీసీడీఓ తులసి తెలిపారు. తద్వారా గణితం, ఇంగ్లిష్, సోషల్, బాటనీ సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత తీరగా మిగతా పోస్టులు కూడా త్వరలో భర్తీ చేస్తామని వెల్లడించారు.ఆంగ్ల ఉపాధ్యాయులకు శిక్షణ ఖమ్మం సహకారనగర్: ‘వీ కెన్ లెర్న్’ పేరిట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇంగ్లిష్‌లో శిక్షణ ఇస్తుండగా రెండో దశలో 17 పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు ఖమ్మం శాంతినగర్ హైస్కూల్లో శుక్రవారం శిక్షణ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సోమశేఖరశర్మ మాట్లాడుతూ ఆరో తరగతి నుంచి విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ భాషపై పట్టు సాధించి ఇంగ్లిష్‌లో మాట్లాడేలా తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాల హెచ్ఎం డాన్‌బాస్కో, కోఆర్డినేటర్ జె.జగదీష్, రిసోర్స్పర్సన్లు బి.రామనాథం, శ్రీనివాస్, వసంత, సంక్రాంతి రవి తదితరులు పాల్గొన్నారు. -
మద్యంపైనే వారికి శ్రద్ధ
రాష్ట్ర ముఖ్యమంత్రి పంటల ధరలను వదిలేసి మద్యం అమ్మకాలపై సమీక్ష చేయడం గర్హనీయమని హరీశ్‌రావు మండిపడ్డారు. మద్యం అమ్మకాలు తగ్గాయని రాష్ట్రంలో 35 మంది అధికారులకు మెమోలు ఇచ్చిన ప్రభుత్వం, పంటల ధరలు తగ్గడంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు తపించారని హరీశ్‌రావు తెలిపారు. కాగా, మార్కెట్లో మాజీ మంత్రుల పర్యటన సందర్భంగా పలువురు రైతులు తమ ఆవేదనను వెల్లడించారు. రఘునాథపాలెం మండలం పంగిడి రైతు లకావత్ రామా పత్తి దిగుబడి తగ్గగా, క్వింటాకు రూ.6,500కు మించి ధర లభించడం లేదని వాపోయారు. అలాగే, సూర్యాపేట జిల్లా మోతె మండలం రాపాలకు చెందిన మహిళా రైతు బానోత్ కమల మాట్లాడుతూ సాగు ఖర్చులు పెరిగినా పత్తికి కనీస ధర రావడం లేదని గోడు వెళ్లబోసుకుంది. కొణిజర్ల మండలం అమ్మపాలెంకు జడ వీరబాబు పత్తి సాగు చేసి తీవ్రంగా నష్టపోయామని ఆవేదనగా చెప్పారు. సీసీఐ కేంద్రాల్లో రైతుల నుంచి కాకుండా దళారుల వద్దే పత్తి కొనుగోలు చేస్తున్నారని, రైతుబంధు ఊసే లేదని తెలిపారు. చింతకాని మండలం నామారానికి చెందిన చాంద్ బీ మాట్లాడుతూ పత్తి సాగు చేసిన తమను అధిక వర్షాలు దెబ్బతీయగా, కనీస ధర లేకపోవడంతో మరింత నష్టం వస్తోందని వెల్లడించారు. -
పాఠం విని.. చదువు చెప్పి !
చింతకాని: చదువుతోనే సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లాలోని చింతకాని మండలం పందిళ్లపల్లి ఉన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేసిన ఆయన ఆరో తరగతి గదిలో ఉపాధ్యాయురాలు ఇంగ్లిష్ బోధిస్తుండగా విద్యార్థులతో కలిసి విన్నారు. ఆతర్వాత ఇంగ్లిష్‌లో రాణించేలా ఎలా చదవాలో విద్యార్థులకు వివరించారు. ఆపై కంప్యూటర్ ల్యాబ్‌లో విద్యార్థులతో కలిసి డిజిటల్ ల్యాబ్‌లో నేలపై కూర్చొని వీడియో పాఠం వీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తొలి దఫా జిల్లాలోని 50 పాఠశాలల్లో కూరగాయల సాగు కోసం ఏర్పాటుచేసిన కిచెన్ గార్డెన్ల సంరక్షణ బాధ్యత విద్యార్థులే తీసుకోవాలని తెలిపారు. -
పనితీరు మార్చుకోండి..
వాతావరణ ం జిల్లాలో శుక్రవారం ఉదయం, రాత్రి చలి తీవ్రత ఉంటుంది. మిగతా సమయంలోనూ సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి.ఇంజనీర్లపై ఎస్ఈ ఆగ్రహంఖమ్మంఅర్బన్: సాగర్ కాల్వల పరిరక్షణ కోసం ఇంజనీర్లు నిరంతరం పరిశీలించాలని జలవనరులశాఖ ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఈవిషయంలో నిర్లక్ష్యాన్ని విడనాడి పనితీరు మార్చుకోవాలని సూచించారు. సాగర్ ప్రధాన కాల్వను గురువారం ఆయన ఖమ్మం నుంచి ఏన్కూరు వరకు పరిశీలించారు. పలుచోట్ల కాల్వను ఆనుకుని పంటలు సాగు చేస్తుండడాన్ని గుర్తించారు. ఉద్యోగులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్వ వెంటే పంటల సాగుతో కట్టల మట్టి కరిగిపోతోందని తెలిపారు. ఇకనైనా దీన్ని అరికట్టడంతో పాటు పొలాలకు సాగు నీరందేలా పర్యవేక్షించాలని సూచించారు. తనిఖీల్లో ఈఈ అనన్య, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. 28న ఆర్టీసీ కార్గోలో పాత పార్సిళ్ల వేలం ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ఆర్టీసీ డిపో పరిధిలోని కార్గో సెంటర్లో వినియోగదారులు తీసుకెళ్లని పాత పార్సిళ్లను ఈనెల 28న వేలం వేయనున్నట్లు లాజిస్టిక్ మేనేజర్ రామారావు తెలిపారు. ఖమ్మం కొత్త బస్టాండ్ ఆవరణలో 28న సాయంత్రం 4 గంటలకు వేలం మొదలవుతుందని వెల్లడించారు. పార్సిళ్ల క్లియరెన్స్ కోసం ఈ వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
చేపల మార్కెటింగ్‌పై దృష్టి సారించండి
● తద్వారా మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి ● ప్రపంచ మత్స్యకార దినోత్సవంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ఖమ్మంవ్యవసాయం: మత్స్య సంపదతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నందున మార్కెటింగ్‌పై దృష్టి సారిస్తే మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించొచ్చని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చేపల వినియోగం పెరుగుతున్న నేపధ్యాన పెంపకం, మార్కెటింగ్‌పై దృష్టి సారించాలన్నారు. పౌష్టికాహారంలో కీలకమైన చేపలపై అందరూ ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఉచిత చేపపిల్లలు పంపిణీ చేస్తున్నందున మత్స్యకారులు వాటిని కాపాడుకుంటే మంచి లాభాలు వస్తాయని చెప్పారు. జిల్లా ఇన్చార్జ్ మత్స్య శాఖ అధికారి శివప్రసాద్, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, మత్స్యకారులు పాల్గొన్నారు. కాగా, ఆసరా పింఛన్లు, బీమా సౌకర్యం కల్పించడమే కాక లైఫ్ జాకెట్లు సమకూర్చాలని, గంగపుత్ర సంఘం భవనానికి జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాలని సంఘం ప్రతినిధులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కన్నం ప్రసన్నకృష్ణ, దేశబోయిన మంగారావుతో పాటు పెద్దపల్లి సుధాకర్, వంగాల వెంకట్, చేతి కృష్ణ, చింతల మల్లేశం, దేశబోయిన తిరుపతయ్య, మైస శంకర్, సురేష్, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ ఖమ్మం సహకారనగర్: కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భద్రతపై సిబ్బందికి సూచనలు చేయడంతో పాటు ఆవరణను శుభ్రం చేయించాలని తెలిపారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సీహెచ్.స్వామి, డీటీ అన్సారీ ఉన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ఖమ్మంవైద్యవిభాగం: ప్రభుత్వ ఆస్పత్రిపై నమ్మకంతో వచ్చే వారితో మర్యాదగా వ్యవహరిస్తూ నాణ్యమైన వైద్యం అందించాలని.. అలాకాకుండా విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ హెచ్చరించారు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని గురువారం ఆమె తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆరోగ్యశ్రీ ఇన్‌పేషంట్ విభాగం, ఓపీ విభాగం, డైట్ రూంలో రిజిస్టర్లు పరిశీలించి రోజువారీ వైద్యసేవలు, ఎందరికి భోజనం సమకూరుస్తున్నారో తెలుసుకున్నారు. ఆతర్వాత డ్రగ్ స్టోర్‌కు వెళ్లగా రిజిస్టర్లలో నమోదు సక్రమంగా నమోదు చేయడం లేదని గుర్తించారు. గతంలోనూ ఫార్మసీ సూపర్వైజర్కు రెండు సార్లు సూచించినా తీరు మార్చుకోనందున షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వైద్యులు, ఉద్యోగులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని, మందుల కొరత ఎదురుకాకుండా ఎప్పటికప్పుడు తెప్పించుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు, ఆర్ఎంఓ బి.రాంబాబు తదితరులు ఉన్నారు. గ్రూప్–2 మైనార్టీ అభ్యర్థులకు మాక్ టెస్ట్‌లు ఖమ్మంమయూరిసెంటర్: గ్రూప్–2 పరీక్షలకు సిద్ధమవుతున్న మైనార్టీ(ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన్, పార్శి, బౌద్ధులు) అభ్యర్థులకు ఉచిత ఆఫ్‌లైన్ మాక్ టెస్ట్‌లు నిర్వహించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కె.సత్యనారాయణ తెలిపారు. వచ్చేనెల 2, 3, 9, 10వ తేదీల్లో తెలంగాణ మైనార్టీ స్టడీసర్కిల్ ఆధ్వర్యాన పరీక్షలు ఖమ్మంలో ఉంటాయని వెల్లడించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 29లోగా కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని, వివరాలకు 97040 03002 నంబర్లో సంప్రదించాలని సత్యనారాయణ సూచించారు. కోర్సుల్లో ప్రవేశానికి 25, 30న కౌన్సెలింగ్ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని వివిధ కోర్సుల్లో ప్రవేశానికి రెండు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఎస్.రాజేశ్వరరావు తెలిపారు. రెండేళ్ల కాలపరిమితితో డిప్లొమా ఇన్ అనస్తీషియా, మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సుల్లో ప్రవేశాలకు కళాశాలలో కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. ఈనెల 25, 30వ తేదీల్లో జరిగే కౌన్సెలింగ్‌లో బైపీసీ విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత, ఎంపీసీ విద్యార్థులకు ఆ తదుపరి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అసంక్రమణ వ్యాధుల కట్టడికి కృషి ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో అసంక్రమణ వ్యాధుల కట్టడికి వైద్య సిబ్బంది కృషి చేయాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి ఆదేశించారు. అర్బన్ హెల్త్ సెంటర్ల వైద్యులు, సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లతో గురువారం సమీక్షించిన ఆమె పలు అంశాలపై సమీక్షించారు. పట్టణ ప్రాంతాల్లో సిబ్బంది వివరాల నమోదులో వేగం పెంచి వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మాతా శిశు సంక్షే మం, వ్యాక్సినేషన్, ఆన్లైన్ నమోదును సూపర్వైజర్లు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ సత్యేంద్రనాధ్ మాట్లాడుతూ లక్ష్యాల సాధనపై వైద్యులు దృష్టి సారించాలన్నారు. ఆతర్వాత జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ చందునాయక్ పలు అంశాలపై సూచనలు చేశారు. ఈ సమీక్షలో ఎన్సీడీ పీఓ డాక్టర్ రామారావు, డెమో సాంబశివరెడ్డి, హెచ్ఈఓ సత్యనారాయణ, హెచ్ఈ మురళి తదితరులు పాల్గొన్నారు. ఇన్చార్జ్ ఏసీగా రాములు ఖమ్మం సహకారనగర్: డీఈఓ కార్యాలయంలో పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్(ఏసీ)గా బి.రాములుకు బాధ్యతలు అప్పగించా రు. ఇన్నాళ్లు ఏసీగా ఉన్న ధనా సెలవుపై వెళ్లటంతో రఘునాథపాలెం ఎంఈఓ రాములుకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యా యి. కాగా, విద్యార్థుల్లో ఇంగ్లిష్ పరిజ్ఞానం పెంచేందుకు ప్రారంభించిన ‘వీ కెన్ లెర్న్’ కార్యక్రమాన్ని రెండో దశగా 17 పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఆయా పాఠశాలల ఇంగ్లిష్ ఉపాధ్యాయులకు శుక్రవారం శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. -
రైల్వేలైన్‌కు భూసేకరణ పూర్తి
మధిర: కాజీపేట–విజయవాడ రైల్వే మార్గంలో మూడోలైన్ నిర్మాణం చేపడుతుండగా మధిర పట్ట ణంలో నెలకొన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఇప్పటికే మూడో లైన్ ఎర్రుపాలెంలో పూర్తయినా మధిర పట్టణంలో మాత్రం స్థల సేకరణ విషయమై అభ్యంతరాలతో ముందుకు సాగడం లేదు. రైల్వే అధికారులు, ఇళ్ల యజమానుల నడుమ వివాదంతో ఈ పరి స్థితి నెలకొనగా పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో రెవెన్యూ అధికారులు మరోమారు సర్వే చేసి అభ్యంతరాలను పరిష్కరిస్తూ కొలతలను సరిచేశా రు. అంతేకాక గృహ యజమానులు కోల్పోయిన స్థలానికి పరిహారం అందజేయగా వారు స్థలాలను అప్పగించారు. దీంతో మధిరలో కూడా రైల్వే మూడో లైన్ పనులు త్వరలోనే మొదలుకానున్నాయి. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, రైల్వేశాఖల ఉద్యోగులు మురళి, ఉషారాణి, కె.అశోక్ పాల్గొన్నారు. -
పౌష్టికాహారం ప్రతీ పౌరుడి హక్కు
● కోడిగుడ్ల కాంట్రాక్టర్‌కు మెమో జారీ చేయండి ● రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఆనంద్, జ్యోతి ఖమ్మం సహకారనగర్: పౌరులంతా పౌష్టికాహారం అందుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, భూక్యా జ్యోతి తెలిపారు. ఈ మేరకు అమల్లో ఉన్న ఆహార భద్రత చట్టాన్ని అధికారులు పక్కాగా అమలు చేయాలని సూచించారు. కలెక్టరేట్లో ఆహార భద్రత చట్టం అమలుపై అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డితో కలిసి వారు అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అమలు, పాఠశాలలో ఏర్పా టు చేస్తున్న న్యూట్రీ గార్డెన్ల వివరాలను అధికారులు వెల్లడించారు. అనంతరం సభ్యులు ఆనంద్, జ్యోతి మాట్లాడుతూ విద్యార్థుల శారీరక అభివృద్ధికి అవసరమైన పోషకాలు అందేలా భోజన మెనూ రూపొందించినందున అమలుచేయాలన్నారు. అయితే, వెజిటబుల్ బిర్యానీ, కోడిగుడ్ల సరఫరాలో లోపాలు గుర్తించామని తెలిపారు. ఈ మేరకు గురుకులాలకు చిన్న సైజ్ కోడిగుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్ మెమో జారీ చేయడమేకాక తీసుకున్న చర్యలపై 15రోజుల్లో నివేదిక అందించాలని సూచించారు. ప్రతీ పాఠశాలలో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటుచేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, డీసీఓ చందన్‌కుమార్, జిల్లా మేనేజర్ జి.శ్రీలత, వివిధ సంక్షేమ శాఖల అధికారులు కె.సత్యనారాయణ, రాంగోపాల్‌రెడ్డి, జ్యోతి, విజయలక్ష్మి, డీఈఓ సోమశేఖరశర్మ, డీఎంహెచ్ఓ కళావతి బాయి, రేషన్‌డీలర్ల సంఘం నాయకులు వెంకన్న, జానీమియా తదితరులు పాల్గొన్నారు. పెద్దాస్పత్రిలో తనిఖీ ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ తనిఖీ చేశారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని విభాగాలను పరిశీలించి గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహరంపై ఆరా తీశారు. డీఎంహెచ్ఓ కళావతిబాయి, ఆస్పత్రి సూపరింటెండెంట్ ఎల్.కిరణ్‌కుమార్, ఆర్ఎంఓ బి.రాంబాబు, పీడియాట్రిక్ హెచ్ఓడీ బాబు రత్నాకర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సైదులు పాల్గొన్నారు. -
భయపెట్టడంతోనే గిరిజనుల తిరుగుబాటు
● హామీలు అమలు చేసేవరకు వదిలేది లేదు ● మాజీ మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ మధు ● లగచర్ల గిరిజనులకు సంఘీభావంగా ర్యాలీ ఖమ్మంమయూరిసెంటర్: భూములు ఇచ్చేది లేదని గిరిజనులు రైతులు తొమ్మిది నెలలుగా పోరాడుతున్నా భయపెట్టి లాక్కునేందుకు యత్నించడంతోనే లగచర్లలో తిరగబడ్డారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. లగచర్ల గిరిజనులకు సంఘీభావంగా బీఆర్ఎస్ ఆధ్వర్యాన ఖమ్మం పెవిలియన్ మైదానం నుండి జెడ్పీసెంటర్ వరకు గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు గిరిజనులు పాల్గొనగా మాజీ మంత్రి పువ్వాడ మాట్లాడుతూ వరంగల్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి 1,100 ఎకరాలేగా అని అన్నారని.. ఆయనకు ఇది సాధారణమే అయినా గిరిజనులకు ఆ భూమే జీవనాధారమని తెలిపారు. కేటీఆర్‌ను ఊచలు లెక్కబెట్టిస్తానంటున్న రేవంత్‌రెడ్డి ఆయన ఏం పాపం చేశారో చెప్పాలన్నారు. కాగా, తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను ఎవరూ ఏం చేయలేరని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేసే వరకు పోరాడుతామని పువ్వాడ స్పష్టం చేశారు. 25న మానుకోటలో ధర్నా.. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యాన మహబూబాబాద్‌లో ధర్నాకు సిద్ధమైతే ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. కానీ కోర్టు అనుమతితో ఈనెల 25న అక్కడే ధర్నా చేపట్టనున్నామని తెలిపారు. లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్ మాట్లాడుతూ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో గిరిజనులపై దమనకాండ కొనసాగిందని విమర్శించారు. ఆయన అల్లుడి కంపెనీ కోసం గిరిజన రైతులను వేధిస్తున్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ అమలు చేయకపోగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, నాయకులు ఏనుగుల రాకేష్‌రెడ్డి, గుండాల కృష్ణ, కూరాకుల నాగభూషణం, పగడాల నాగరాజు పాల్గొన్నారు.