Kishan Reddy
-
‘రేవంత్‌రెడ్డి ప్రచారం మహారాష్ట్రలో పని చేయలేదు’
హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని, కాంగ్రెస్‌పై ఎంత వ్యతిరేకతో ఉందో తాజా ఫలితాల్ని బట్టి అర్థమవుతోందన్నారు కిషన్‌రెడ్డి. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కలిపి కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో విపక్షహోదా కూడా కాంగ్రెస్‌కు రాలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు.‘రేవంత్ రెడ్డి ప్రచారం మహారాష్ట్రలో పనిచేయలేదు. ఆయన తెలంగాణ ప్రజల డబ్బును మహారాష్ట్రకు పంపించినా పనిచేయలేదు. తెలంగాణలో రాహుల్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పై కోపంతో వారు పోవాలని, అలాగే అబద్ధపు 6 గ్యారెంటీల కారణంగా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి పూర్తిస్థాయిలో విజయం సాధించడం హర్షనీయం.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేసింది.అయినా ప్రజలు వారిని తిరస్కరించారు.మహారాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనుకున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని, మరాఠీలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధి పొందింది. ఈ 5 నెలల్లో తిరిగి ప్రజలు ఆలోచించి పూర్తిస్థాయిలో ఎన్డీయే కూటమి వైపు మొగ్గుచూపారు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
Kishan Reddy: బీజేపీపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేశారు
-
ది సబర్మతి రిపోర్ట్ సినిమాను వీక్షించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
-
రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు
సాక్షి, న్యూఢిల్లీ: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలో మత పరమైన రిజర్వేషన్లకు స్థానం లేదని... ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో ముస్లింలకు ఇస్తున్నట్టుగానే మహారాష్ట్రలో కూడా 4శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం సరికాదన్నారు. మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఆర్ఎస్ఎస్ వరిష్ట్ ప్రచారక్ నందకుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులు మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేశాయని, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని చెప్పాయని గుర్తు చేశారు.దీనిపై సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చి మతపరమైన రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలో మతపరమైన రిజర్వేషన్లకు స్థానం లేదు..ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని కోర్టు తీర్పు ఇచి్చందని తెలిపారు. ఆ కోర్టు తీర్పును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గౌరవించాలని సూచించారు. లగచర్ల అంశంపై చట్టం తనపని తాను చేస్తుందని, ఇది ముఖ్యంగా శాంతిభద్రతల సమస్య అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను రద్దు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నానని తెలిపారు. హిందూ దేవాలయాల్లో పనిచేసే ఇతర మతాల వారిని వేరేచోట్లకు బదిలీ చేయాలని కిషన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఎక్కువ సార్లు ప్రజలను మోసం చేయలేరు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పాలనతో ఎలాంటి మార్పు రాలేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ నేతల గాలి మాటలతో ప్రజలు విసిగిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు పెద్ద తేడా ఏమీలేదన్నారు.కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘పోలింగ్ బూత్ కమిటీల ఎన్నిక ఈ నెల చివరి నాటికి పూర్తి చేయాలి. సాధారణ సభ్యత్వం తీసుకున్న ప్రతీ కార్యకర్తకు సమాచారం ఇచ్చిన తర్వాతే పోలింగ్ బూత్ కమిటీ వేయాలి. పోలింగ్ బూత్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలి. నేతల వ్యక్తిగత ఇష్టాలకు తావులేకుండా అందరి ఆమోదంతో బూత్ కమిటీలు వేసుకోవాలి. క్రియాశీల సభ్యత్వం ఉన్నవారికే పార్టీ పదవులు. పార్టీ కోసం సమయం కేటాయించి పనిచేసే సమర్ధులకు కమిటీల్లో అవకాశం ఇవ్వాలి. 30 శాతం కొత్త వారికి పార్టీ మండల కమిటీల్లో ఛాన్స్ దక్కేలా చూడాలి.రాష్ర్టంలో కాంగ్రెస్ పాలనతో ఎలాంటి మార్పు రాలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ పాలన సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్కు మధ్య తేడా ఏమీ లేదు. గాలి మాటలతో ప్రజలు విసిగిపోతున్నారు. వ్యక్తులను విమర్శించడమే రాజకీయం అనుకుంటున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయి. రెండు పార్టీ నేతల మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. బాధ్యతారహితంగా ఇరు పార్టీల నేతలు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించింది. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా అబద్దపు ప్రచారం చేస్తున్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి ?కాంగ్రెస్ పార్టీ నేతలు ఇటలీకి గులాం. కిషన్ రెడ్డి ఎవరికి గులాం కాదు.. భారతీయులకు మాత్రమే గులాం. నా తెలంగాణను నిజాం నుంచి కాపాడిన గుజరాత్ నేత సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నేను గులాంనే. కాంగ్రెస్ నేతలు నకిలీ గాంధీలకు గులాంలు. వ్యక్తిగతంగా బురద చల్లే ప్రయత్నం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్నాయి. తాత్కాలికంగా ప్రజలు వారికి జై కొట్టవచ్చు. ఎక్కువసార్లు ప్రజలను ఎవరు మోసం చేయలేరు. నిర్మాణాత్మకమైన రాజకీయాలు చేసే వారికే ప్రజలు అండగా ఉంటారు. తెలంగాణలో ఉన్నంత దిగజారుడు రాజకీయాలు మరే రాష్ట్రంలో లేవు. మూడు వందల రోజులు పూర్తయినా.. హామీల అమలు చేయగలరా? అని ప్రశ్నించారు. అలాగే, బీఆర్ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కాదని కామెంట్స్ చేశారు. -
వేలాదిమంది పేదలనుఎక్కడకు వెళ్లగొడతారు?
అంబర్‌పేట/మలక్‌పేట: దశాబ్దాల తరబడి మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసిస్తూ..కష్టపడి కట్టుకున్న ఇళ్లను ప్రభుత్వం కూలగొడితే తామంతా ఎక్కడకు వెళ్లాలి అనే ఆవేదనలో అక్కడి ప్రజలు ఉన్నారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూసీ పరీవాహక ప్రాంత ప్రజలపై కక్షపూరిత ధోరణి అవలంభిస్తుందని మండిపడ్డారు. వేలాదిమంది పేద ప్రజలను నిరాశ్రయులను చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనులు చేపట్టాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ బాధితుల కోసం బీజేపీ చేపట్టిన మూసీనిద్ర కార్యక్రమంలో భాగంగా గోల్నాక డివిజన్ పరిధిలోని తులసీరామ్‌నగర్‌లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నిద్రించారు. ఆదివారం ఉదయం నిద్ర లేచినంతరం బస్తీ వాసులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. బస్తీల్లో పర్యటించి అక్కడి ప్రజల జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు మూసీతో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని తాను గమనించినట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. వందేళ్ల క్రితం మూసీనదికి నిజాం రాజు ప్రహరీ నిర్మించారని, ప్రస్తుతం అలాంటి ప్రహరీ నిర్మించి పేదల ఇళ్ల జోలికి వెళ్లరాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. తాను మూసీ పక్కన నివసించే శంకరమ్మ ఇంట్లో నిద్రించి వారి ఇబ్బందులను తెలుసుకున్నానని, ఇలాంటి శంకరమ్మలు ఎంతో మంది ఆవేదనతో ఉన్నారన్నారు. పేదల ఇళ్లకు ఇబ్బంది లేకుండా మూసీ సుందరీకరణ చేస్తామంటే బీజేపీ శ్రేణులు శ్రమదానం చేస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చింతల రాంచంద్రారెడ్డి, గౌతమ్‌రావు, అజయ్‌కుమార్, రవీందర్‌గౌడ్ పాల్గొన్నారు. లగచర్ల ఘటన ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం : డాక్టర్ లక్ష్మణ్ లగచర్ల ఘటన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. మూసారంబాగ్ శాలివాహననగర్‌లో మూసీనిద్ర ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూసీ బాధితులకు భరోసా కల్పించడానికి చేపట్టిన మూసీనిద్ర కార్యక్రమాన్ని అపహాస్యం చేస్తూ అధికార మదంతో కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు.మూసీనీటిని శుద్ధి చేయాలని, పరిశుభ్రమైన నీరు ప్రవహించేలా చేసి నల్లగొండ, భాగ్యనగర్ ప్రజలకు ఉపశమనం కలింగించాలన్నారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి, కార్పొరేటర్లు బొక్క భాగ్యలక్ష్మి మధుసూదన్‌రెడ్డి, కొత్తకాపు అరుణా రవీందర్‌రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్‌చందర్ పాల్గొన్నారు. -
‘మూసీ బాధితుల ఆక్రందనలు ఇప్పుడు గుర్తొచ్చాయా?’
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్-బీజేపీలపై మండిపడ్డారు.‘ వారెవా తోడు దొంగల నాటకం. కిషన్ రెడ్డి గారూ.. ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా?,లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?,హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది మేము!,రేవంత్‌ను మొదటి అభినందించింది మీరైతే.. మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేము. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి?, ఎవరిని కాపాడటం కోసం? ఎవరిని ముంచడం కోసం? మరెవరిని వంచించడం కోసం? ,రేవంత్‌ను కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు. లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగానామాలు.. మీ పాలి'ట్రిక్స్' ను గమనిస్తోంది తెలంగాణ..ఆట కట్టిస్తుంది సరైన వేళ’ అంటూ ట్వీట్ చేశారు.రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం దోస్తును కాపాడేందుకు 'చీకటి' రాజకీయంవారెవా తోడు దొంగల నాటకం!కిషన్ రెడ్డి గారూ..ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా?లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర?హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే..బుల్డోజర్ లను అడ్డుకుంటామన్నది…— KTR (@KTRBRS) November 17, 2024 -
అసలు మూసీ ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డికే క్లారిటీ లేదు
-
రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: మూసీ పక్కన ఇళ్లు కూల్చివేస్తారనే భయంతో ఒక్క తులసీ రాంనగర్‌లోనే గుండెపోటుతో 9 నుంచి 10 మంది చనిపోయారని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నట్లు మూసీ ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటే వేలాది ఇళ్లు కూల్చేయాల్సి వస్తుందన్నారు.‘‘కోటిమంది డ్రైనేజీ నీళ్లు మూసీలో వెళ్తుంది.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి. సీఎం ముందుగా చేయాల్సిన పని కాలుష్య జలాలు మూసీలో కలవకుండా చేయండి. డ్రైనేజీ సంగతి తేల్చకుండా ఇల్లు కూల్చడం ద్వారా ప్రాజెక్టు ఎలా చేపడతారు ?. మూసీ డీపీఆర్ ఎప్పుడు పూర్తవుతుంది?. కృష్ణా నీళ్ళు తెస్తారా?. గోదావరి నీళ్లు తెస్తారా?. లక్షా యాభై వేల కోట్లు ఎక్కడ నుంచి తెస్తారా?..రేవంత్ పాలన ఏడాది పూర్తయ్యింది. డీపీఆర్ రావడానికి రెండేళ్లు పడుతుంది. ఒట్టేసి చెబుతున్నా.. తులసీ రాంనగర్లో దుర్గంధం వాసన రావడం లేదు. పేదల నివాసం ఉంటున్న ఇళ్లపై రేవంత్ కన్ను పడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నారు. పేదల జోలికి వెళ్లకుండా పునర్జీవం చేయండి. మూసీ ప్రక్షాళన అనే వార్త వింటేనే భయంతో వణికిపోతున్నారు. కక్ష పూరితంగా వ్యవహరించవద్దు. హుస్సేన్ సాగర్‌లో కొబ్బరినీళ్లు చేస్తానన్న కేసీఆర్ ఫార్మ్ హౌస్‌కి వెళ్లాడు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన చేయాలి’’ కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు...మహారాష్ట్రలో తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. ఇళ్లు కూల్చకుండా ప్రక్షాళన చేయండి. నల్లగొండ రైతులకు న్యాయం చేయండి. నిజాం రిటైనింగ్ వాల్ కట్టినట్లు హై కోర్టు దగ్గర ఆనవాళ్లు ఉన్నాయి. రేవంత్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేడు. కాంగ్రెస్ పార్టీ నేతలు సహకరిస్తేనే పూర్తికాలం సీఎం గా రేవంత్ పనిచేస్తారు’’ అంటూ కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. -
కిషన్ రెడ్డి అసలు తెలంగాణ బిడ్డనేనా?: మంత్రి పొన్నం
సాక్షి, వరంగల్: కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనతోనే కిషన్ రెడ్డి మూసీ నిద్రకు సిద్ధమయ్యారని విమర్శించారు. నిధులు తేలేని బీజేపీ నేతలు మూసీ వద్దకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. మూసీ కాలువ వాసన చూసిన తర్వాతైనా దైవ సాక్షిగా వాస్తవాలు చెప్పాలని కోరారు. కేంద్రం నుంచి రూపాయి తీసుకొచ్చే శక్తి లేని ఆయన.. తన మొద్దు నిద్ర వీడాలని సూచించారు.కిషన్ రెడ్డి డీఎన్ఏ పరీక్ష చేయించుకోవాలని, ఆయన అసలు తెలంగాణ బిడ్డేనా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ బిల్లు ఎలా పాస్ అయిందో మీకు తెలియదా? అని నిలదీశారు. కలెక్టర్‌ను కొట్టిన వారిని సమర్థిస్తున్న మీరు కేంద్రమంత్రి పదవికి అర్హులేనా? అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఐఏఎస్పైన దాడి జరిగితే ఖండించకపోగా సమర్థించడం బాధాకరమని పొన్నం ప్రభాకర్ అన్నారు. అధికారులను కొట్టిన వాళ్లు, కొట్టించిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఈ దాడి ఘటనపై బీజేపీ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఎంపీగా, కేంద్రమంత్రిగా ఏం చేశారో చెప్పాలన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. -
ఇవాళ బీజేపీ మూసీ నిద్ర కార్యక్రమం
-
‘లోక్‌మంథన్’కు భారత రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: భారతీయ సంస్కృతి..ఏకత్వాన్ని సమున్నతంగా ఆవిష్కరించే ద్వైవార్షిక సాంస్కృతిక మహోత్సవమైన ‘లోక్‌మంథన్’కు భారత రాష్ట్రపతి ద్రౌపదీముర్ము హాజరవుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. బేగంపేటలోని పర్యాటక భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజ్ఞాభారతి అఖిల భారత కన్వీనర్ నందకుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. నవంబర్ 21 నుంచి 24వ తేదీ వరకు నాలుగు రోజులపాటు శిల్పకళావేదిక, శిల్పారామంలో ఈ వేడుకలు జరుగుతాయన్నారు. 22వ తేదీ ఉదయం 9.30 గంటలకు ‘లోక్‌మంథన్ వేడుకలను రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ప్రారంభిస్తారని చెప్పారు.అంతకంటే ముందు 21వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శిల్పకళావేదికలో ఎగ్జిబిషన్, సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభిస్తారన్నారు. వసుదైక కుటుంబమని ప్రపంచానికి చాటిచెప్పిన భారతీయ సాంస్కృతిక విశిష్టతను ఈ వేడుకల్లో వీక్షించొచ్చని పేర్కొన్నారు. జాతీయవాద ఆలోచనాపరులు, ఆచరణీయులు, కళాకారులు, మేధావులు, విద్యావేత్తలు ఈ వేడుకల్లో భాగస్వాములవుతారని కిషన్‌రెడ్డి చెప్పారు. నందకుమార్ మాట్లాడుతూ దేశవిదేశాల నుంచి 2,500 మందికి పైగా ప్రతినిధులు తరిలిరానున్నట్టు చెప్పారు. లిథువేనియా, ఆర్మేనియా, ఇండోనేసియా తదితర దేశాలకు చెందిన విశిష్ట కళారూపాలను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారన్నారు. లోక్మాత నాటకంతోపాటు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి రుద్రమదేవి నాటక ప్రదర్శన కూడా ఉంటుందన్నారు. ముగింపు ఉత్సవాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, నిర్మలాసీతారామన్లు పాల్గొంటారని చెప్పారు. ⇒ ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకలు ఇప్పటివరకు భోపాల్, రాంచీ, గువాహటిల్లో జరిగాయి.‘లోక్–అవలోకన్, లోక్ విచార్–లోక్ వ్యవహార్’అనే ప్రధాన థీమ్‌తో ఈసారి లోక్‌మంథన్–2024 వేడుకలను నిర్వహిస్తున్నారు. ⇒ ఈ వేడుకల్లో ప్రదర్శనలు వీక్షించేందుకు ప్రతి రోజూ లక్ష మందికి పైగా సందర్శకులు తరలిరానున్నట్టు అంచనా.1,500 మందికి పైగా కళాకారులు సుమారు వెయ్యి కళారూపాలను ప్రదర్శించనున్నారు. ⇒ఫొటో జర్నలిస్ట్ అంధేకర్ సతీలాల్ వనవాసీ సంస్కృతి, జీవనశైలిపైన తీసిన ఫొటో ఎగ్జిబిషన్‌తోపాటు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలను ప్రదర్శిస్తారు. -
మాటలు ప్రజలకు.. మూటలు కాంగ్రెస్‌కు..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గ్యారంటీలు, హామీలను అమలు చేయకుండా.. మహారాష్ట్రలో అబద్ధపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్ ఏ మొహం పెట్టుకుని మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కాంగ్రెస్ పాలన మాటలు ప్రజలకు.. మూటలు కాంగ్రెస్ పారీ్టకి అన్నట్టుగా తయారైంది.తెలంగాణలో సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ యాత్రలు చేసి.. ఎన్నో హామీలిచ్చారు. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ పాలన నడుస్తోంది. రేవంత్ వ్యవహారం, దోపిడీ, అబద్ధాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, తెలంగాణ సమాజాన్ని అవమానించే మాటలు.. అచ్చం కేసీఆర్ మాదిరిగానే సాగుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల డీఎన్ఏ ఒకటే. ఒకరిపై మరొకరు డూప్ ఫైటింగ్ చేయడం వారికి అలవాటే. రాష్ట్ర ప్రభుత్వం విఫలం తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. వ్యాపార రంగం విశ్వాసం కోల్పోయింది. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికీ పైసల్లేవు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పెన్షన్లు పెంచలేదు. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదు.. కానీ కొత్త ఉద్యోగాలు ఇచ్చామంటూ జబ్బలు చరుచుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు భారాన్ని కేంద్రమే భరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లలో విఫలమైంది. రైతులకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచి్చంది. కానీ 15 పైసలు కూడా ఇవ్వలేదు. రైతులకు ధాన్యంపై బోనస్ లేదు. సీఎం సొంత నియోజకవర్గంలో ఫార్మా విలేజీకి భూసేకరణ విషయంలో కలెక్టర్‌పై దాడి, రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించేంతగా రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది. రేవంత్ సవాల్‌ను స్వీకరిస్తున్నాం.. మూసీని కొబ్బరినీళ్లలా మారుస్తామన్న కేసీఆర్.. ఏమీ చేయకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి.. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చడం, నల్లగొండలో రైతులను రెచ్చగొట్టడం తప్పితే చేసిందేమీ లేదు. పేదల ఇండ్లు కూల్చొద్దంటే.. బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ అహంకారంతో మాట్లాడుతున్నారు. మూసీ ప్రక్షాళన చేయండి.. పేదల ఇళ్లు కూల్చకండి.. ఇదే మా డిమాండ్. మూసీ పరిసర ప్రాంతంలో ఒక్క రోజు నిద్రపోండి అని సీఎం విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం. శనివారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిద్ర చేయబోతున్నాం. ప్రజలతో కలసి వారి ఇంట్లోనే భోజనం చేసి, అక్కడే నిద్ర చేస్తాం. పోలీసు వ్యవస్థ నిర్విర్యం రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణలో కాంగ్రెస్ సర్కారు విఫలమైంది. పోలీసు వ్యవస్థను నిర్విర్యం చేసింది. మజ్లిస్ పార్టీ, అసదుద్దీన్, రాహుల్ గాంధీ ఆదేశాలతో రాష్ట్రంలో పోలీసు అధికారుల బదిలీలు జరుగుతున్నాయి.’’అని కిషన్‌రెడ్డి ఆరోపించారు. -
రేవంత్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. ‘రాష్ట్ర గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంత జాప్యం జరగడం సహజం. అంతమాత్రానికే తొందరపాటు వ్యాఖ్యలు చేయడం సరికాదు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని చెప్పడం అవివేకం’అని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. గురువారం భారత్ మండపంలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్– 2024లో కేంద్ర గనుల శాఖ, కోలిండియా పెవిలియన్లను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అంతకుముందు పెవిలియన్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల స్టాళ్లను కేంద్రమంత్రి సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అవినీతి ఎక్కడ జరిగినా నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్నదే తమ డిమాండ్ అని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాము హైకోర్టుకు వెళ్లామని, ఈ వ్యవహారాన్ని కూడా సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. విచారణ సరిగ్గా జరిగితేనే తప్పు ఎవరు చేశారో ప్రజలకు అర్థమవుతుంది కదా అని చెప్పారు. కేంద్ర మంత్రులు ఏం చేయాలి? ఏం చేస్తున్నారనే విషయంలో.. కేటీఆర్, కేసీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు మాకు అవసరం లేదని స్పష్టం చేశారు. అనవసరంగా ఒకరిపైఒకరు బురదజల్లుకునే ప్రయత్నంలో బీజేపీ గురించి అసత్యాలు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మీద జరిగిన దాడి ఘటనను ఖండిస్తున్నామన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనపై ఆయన ప్రజలతో మాట్లాడాలి.. అంతే తప్ప ఈ విషయంలో రాజకీయ ప్రయోజనం ఆశించడం సరికాదని సూచించారు. మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రాబోతుందని.. ఇందులో సందేహం అక్కర్లేదని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలం: సముద్రాల్లో ఉన్న మినలర్స్ను సద్వినియోగం చేసుకునేందుకు ఆఫ్‌షోర్ మైనింగ్‌పైనా ప్రత్యేకంగా దృష్టి సారించామని కిషన్‌రెడ్డి తెలిపారు. ఆఫ్‌షోర్‌పై 10 బ్లాకుల వేలానికి అంతా సిద్ధమైందని, రెండుమూడు నెలల్లో ఈ బ్లాకులను వేలం వేస్తామని చెప్పారు. ఇప్పటికే అర్జెంటీనాలో పలు బ్లాక్‌లను వేలంలో దక్కించుకున్నామని, అక్కడ తవ్వకాల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. భారతదేశం బొ గ్గు, గనుల రంగంలో సాధిస్తున్న ప్రగతి, ఆధునిక సాంకేతికత వినియోగం, కా రి్మకుల భద్రత, సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచర ణ తదితర అంశాలను భారత్‌మండపంలో ప్రారంభించిన పెవిలియన్ ద్వారా సందర్శకులకు వివరిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బొగ్గు రంగంలో భారతదేశం ఆత్మనిర్భరత సాధించే దిశగా ముందుకెళ్తోందని వివరించారు. ప్రపంచంలోనే కోలిండియా మూడో అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి సంస్థ అని, అలాంటి ప్రతిష్టాత్మక సంస్థ.. ఈ ఏడాది స్వర్ణోత్సవాలు జరుపుకుంటోందన్నా రు. సంవత్సరంపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని కిషన్‌రెడ్డి తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అధికారులు కృషి చేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దిశా కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైనారిటీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్లు అనేక రాష్ట్రాల్లో సరైన రీతిలో అమలు కావడం లేదని.. అంగన్వాడీ స్కూళ్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ల నిర్మాణానికి భూమి కొరత నెలకొందన్నారు.‘‘నగరంలో మురికివాడలు పెరిగిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలి. దిశా కమిటీ సమావేశంలో అనేక విషయాలపై చర్చించాం. ప్రతి మూడు నెలలకోసారి పథకాల అమలు, కార్యక్రమాలపై అధికారులంతా సమీక్షించుకోవాలి. తెలంగాణలో 70-80 శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచే వస్తోంది. అయినా, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్ మెంట్లకు నిధుల కొరత వేధిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌తో పాటు నగర పరిసర ప్రాంతాల ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత తీసుకోవాలి. రాష్ట్రంలో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ మూతబడే పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వ అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలి’’ అని కిషన్‌రెడ్డి సూచించారు.రేపటి నుంచి పంట కొనుగోలు కేంద్రాలను తెలంగాణ బీజేపీ సందర్శించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వడ్లు, పత్తి కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు పరిశీలించనున్నాయి. 9, 11, 13 తేదీల్లో రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల్లో పంట కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు పరిశిలించనున్నారు. రేపు(శనివారం) ఉమ్మడి నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ బృందాలు పర్యటించనున్నాయి.రేపు(శనివారం) భువనగిరిలో కిషన్‌రెడ్డి, సూర్యాపేటలో లక్ష్మణ్, ఆదిలాబాద్‌లో యేలేటి మహేశ్వర్ రెడ్డి బృందాలు.. 11న కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేపీ బృందాలు సందర్శించనున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ బృందాలు కొనుగోలు కేంద్రాలను పరిశిలించనున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డీకే అరుణ, వరంగల్ జిల్లాలో ఈటల రాజేందర్, మెదక్ రఘునందన్ రావు, ఖమ్మం కాటిపల్లి వెంకట రమణారెడ్డి బృందాలు పరిశీలించనున్నాయి. 13న నిజామాబాద్ జిల్లాలో పంట కొనుగోలు కేంద్రాలను ధర్మపురి అరవింద్ బృందాలు సందర్శించనున్నాయి. -
వచ్చే నెల్లో పాదయాత్రలు, సభలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు ఎన్నికల హామీలను అమలుచేయకపో వటాన్ని ఎండగడుతూ డిసెంబర్ మొదటివారంలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్రలు, సభలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. వచ్చే నాలుగేళ్లపాటు (2028లో అసెంబ్లీ ఎన్నికల వరకు) నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాడాలని తీర్మానించింది. గురువారం నగరంలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికల స్టేట్ లెవల్ వర్క్ షాప్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నందున శనివారం రాష్ట్రంలోని ధాన్యం కోనుగో లు కేంద్రాలను పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలు సందర్శించాలని నిర్ణయించారు. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నివసించాలని ప్రతి పక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో.. ఆ ప్రాంతాల్లోని ఇళ్లల్లో బీజేపీ నేతలు ‘మూసీ నిద్ర’ చేసి అక్కడి ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకురావాలని నిర్ణయించారు. 11 నెలల్లోనే సర్కార్‌పై వ్యతిరేకత: కిషన్రెడ్డికాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీది నుండి పొయ్యిలో పడ్డట్టుగా తయారైందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై 11 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతి రేకత వచ్చిందని తెలిపారు. గతంలో తెలంగాణను పట్టి పీడించిన బీఆర్ఎస్ రూ.7 లక్షల కోట్ల అప్పు చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భూము లు తాకట్టు పెట్టి అప్పుల కోసం అన్వేషణ సాగి స్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లకు బీజేపీనే సరైన రాజకీయ ప్రత్యామ్నాయమని తేలిపోయిందని అన్నారు.పార్టీని సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తూనే, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలతో ప్రజలకు అండగా నిలవాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే నాలుగేళ్లపాటు ప్రజల పక్షాన నిలిచి పోరాడు దామని అన్నారు. ధాన్యం కొనుగోలు కోసం ఎన్ని వేల కోట్లయినా ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగాఉన్నా రాష్ట్ర ప్రభుత్వం దళారులు, మిల్లర్లతో కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నదని ఆరోపించారు. బీజేపీని ప్రజలే కోరుతున్నారు: డా.కే లక్ష్మణ్తెలంగాణలో అతి తక్కువ సమయంలో 30 లక్షల మంది బీజేపీ సభ్యులుగా చేరారని, దీన్నిబట్టే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అర్ధమవుతోందని ఆ పార్టీ నేత డా.కె.లక్ష్మణ్ అన్నారు. ఈ వర్క్‌షాపులో ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు హరీష్‌బాబు, రామారావు పటేల్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ యెండల లక్ష్మీనారాయణ, పార్టీనేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, ఎం.ధర్మారావు చంద్రశేఖర్ తివారీ (సంస్థాగత), గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, డి.ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకోం‘మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. శుద్ధ నీళ్లు ఇవ్వాల్సిందే.. కృష్ణా, గోదావరి నుండి నీటిని తీసుకొచ్చినా అభ్యంతరం లేదు. అయితే ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒప్పుకోం’ అని కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. పార్టీ వర్క్‌షాప్ అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించా రు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని, స్థా నిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఖతం చేస్తామని ప్రకటించారు. త్వరలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభిస్తారని తెలిపారు. -
ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన గురువారం మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. ‘‘ మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నిళ్లు ఇవ్వాల్సిందే. కృష్ణా, గోదవారి నుంచి నీళ్లు తీసుకొచ్చినా అభ్యంతరం లేదు. మూసీకి రిటైనింగ్ వాల్ కట్టాలి.. సీటీలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. కులగణనకు మేం వ్యతిరేకం కాదు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి’’ అని అన్నారు. -
రుణమాఫీపై సిట్టింగ్ జడ్జికి నివేదిక ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, తాము ఇచ్చిన హామీ అమలు చేశామని చెప్పే ధైర్యముంటే.. రుణమాఫీ విషయంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జికి నివేదిక సమర్పించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చాక వాటి అమలుకు మధ్య నక్కకు నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. తెలంగాణతో పాటు కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ల్లో సైతం హామీలు, సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం చెందాయని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ధ్వజమెత్తారు. ఏడాది తిరక్కుండానే రూ.లక్ష కోట్ల అప్పులు మిగులు బడ్జెట్‌తో తెలంగాణ ఏర్పడిందని, బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రూ.7 లక్షల కోట్లకు పైగా అప్పులు చేస్తే, కాంగ్రెస్ ఏడాది తిరగకుండానే రూ.లక్ష కోట్ల అప్పులు చేసిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో ‘ప్రచారం ఫుల్ పనులు మాత్రం నిల్’అన్న చందంగా పరిస్థితి తయారైందన్నారు. రాష్ట్రంలో 38 లక్షల మంది రైతులకు గాను 22 లక్షల మందికే రుణమాఫీ చేసి, మొత్తం చేశామంటూ మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ అబద్ధాలు చెప్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగ భృతి, మహిళలకు సాయం ఏదీ?కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా, ప్రియాంక, రాహుల్.. డిక్లరేషన్లు, గ్యారంటీల పేరిట ఇచ్చిన అనేక హామీల అమలు ఏమైందని కేంద్రమంత్రి ప్రశ్నించారు. కర్ణాటక, తెలంగాణలలో మాదిరిగానే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో సైతం మభ్యపెట్టే హామీలు, గ్యారంటీలతో కాంగ్రెస్ మోసం చేసే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా హామీలను ఎప్పటిలోగా, ఏవిధంగా అమలు చేస్తారనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం కరువవుతోందని అన్నారు. నిరుద్యోగులకు రూ.4 వేల భృతి, ప్రతి మహిళకు రూ.2,500 ఆర్థిక సాయం, వివాహం చేసుకున్న అమ్మాయిలకు తులం బంగారం హామీలు ఏమయ్యాయని కిషన్‌రెడ్డి నిలదీశారు. -
చిరంజీవితో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: సినీహీరో చిరంజీవితో కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. శనివారం చిరంజీవి నివాసానికి వెళ్లిన సందర్భంగా ఆయన్ను కిషన్‌రెడ్డి శాలువాతో సన్మానించి అభినందించారు. దీపావళి సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ‘ఎక్స్’ ద్వారా కిషన్‌రెడ్డి వెల్లడించారు.సినీపరిశ్రమతో పాటు సేవా కార్యక్రమాలతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచి ప్రభావితం చేసిన చిరంజీవిని కలుసుకోవడం ఎల్లప్పుడూ ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే కిషన్‌రెడ్డి చిరంజీవిని మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీటీడీ చైర్మన్‌గా నియమితుడైన బీఆర్ నాయుడిని కూడా కిషన్‌రెడ్డి కలిసి అభినందించినట్లు పార్టీ నాయకుల సమాచారం. -
పేదల ఇళ్లు కూల్చితే రణరంగమే...
సాక్షి, హైదరాబాద్/కవాడిగూడ: ‘మూసీలో పేదల ఇళ్లు కూల్చితే తెలంగాణ రణరంగంగా మారుతుంది. పేదలు ఆక్రోశంతో తిరగబడితే ఏ పోలీసులూ అడ్డుకోలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేదల ఇళ్ల కూల్చివేతల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. మేం కూడా కూల్చివేతలను అడుగడుగునా అడ్డుకుంటాం. సీఎం రేవంత్‌రెడ్డి విసిరిన సవాల్‌ను మేం స్వీకరిస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజల కోసంవారి ఇళ్లల్లో ఉండేందుకు మేం సిద్ధం..’అని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద మూసీ, హైడ్రా కూల్చివేతలకు నిరసనగా ‘చేయి చేసిన కీడు...మూసీ బాధితులకు బీజేపీ తోడు’పేరిట నిర్వహించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఇళ్లు కూల్చకుండా సుందరీకరణ చేయాలి ‘మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు. అయితే పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా మూసీ సుందరీకరణ చేయాలి. మూసీకి రెండువైపులా రిటైనింగ్‌వాల్ నిర్మించాక సుందరీకరణ చేపట్టాలి. అప్పుడు బీజేపీ కార్యకర్తలు కరసేవ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. అలాకాకుండా పేదల ఇళ్లు కూల్చాలనుకుంటే మాత్రం ప్రభుత్వాన్ని అడుగడుగునా అడ్డుకుంటాం. మూసీ పరీవాహక ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి, వివరాలు సేకరించి రానున్న రోజుల్లో పేదల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.అనేక ఏళ్ల నుంచి ఉంటున్న ఇళ్లను ఎలా కూలుస్తారు ? మూసీ పరీవాహక ప్రాంతం చరిత్ర రేవంత్‌రెడ్డికి తెలుసా? మూసీలో అనేక ప్రాంతాల డ్రైనేజీ నీరు కలుస్తోంది. దాన్ని మళ్లించకుండా, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీలు) నిర్మించకుండా మూసీ ప్రక్షాళన చేయలేరు..’అని కిషన్‌రెడ్డి చెప్పారు. ముందుగా హైదరాబాద్‌లోని అనేకచోట్ల భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, పేద ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాక మూసీ సుందరీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదని, తమ మోసపూరిత వైఖరి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూల్చుతామంటోందని ధ్వజమెత్తారు. మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్: బండి సంజయ్ ‘మూసీ పునరుజ్జీవం అతి పెద్ద స్కామ్. మూసీ దుస్థితికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీఆర్ఎస్లే. లండన్, సియోల్ కాదు.. మూసీ బాధితుల వద్దకు వెళ్లే దమ్ము సీఎంకు, మంత్రులకు ఉందా? మీ అల్లుడి (వాద్రా) కోసం మూసీ దోపిడీకి ప్లాన్ చేస్తారా? మూసీ బాధితులకు మేం అండగా ఉంటాం..’అని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే మూసీ ప్రాజెక్టుకు లక్షన్నరకోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. మూసీ ప్రక్షాళనకు, ఇళ్ల కూలి్చవేతలకు సంబంధం ఏమిటో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. సీఎం మాతో మూసీ పర్యటనకు రావాలి: ఏలేటి మహేశ్వరరెడ్డి సీఎం రేవంత్ తమతోపాటు మూసీ పర్యటనకు రావాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. మూసీ ప్రక్షాళనకు ప్రజల్లో ఒక్కరు ఒప్పుకున్నా తాము వెనక్కి తగ్గుతామని సవాల్ చేశారు. మీ కమీషన్ల కోసం సామాన్య ప్రజలను రోడ్డున పడేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సమన్వయకర్తగా నిర్వహించిన ఈ ధర్నాలో ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, ధన్పాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్, పలువురు పార్టీ నేతలు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. మూసీ ప్రభావిత ప్రాంతాల్లోని పలువురు మహిళలు ఈ సందర్భంగా తమ సమస్యలను వివరిస్తూ కన్నీరు పెట్టుకున్నారు. -
పేదల ఇళ్ల జోలికి రావద్దు: కిషన్ రెడ్డి
-
మూసీ పక్కన టెంపుల్స్ కూల్చే దమ్ముందా?.. కిషన్‌రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా రేవంత్ ఉందా? అని ప్రశ్నించారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.తెలంగాణ బీజేపీ నేతలు ఇందిరా పార్క్ వద్ద మూసీ పరివాహక ప్రాంత బాధితులకు మద్దతుగా ‘చేయి చేసిన కీడు-మూసీ బాధితులకు బీజేపీ తోడు పేరుతో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌కు సవాల్ చేస్తున్నాను. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితులతో నివాసం ఉండటానికి మేం సిద్ధం. చంచల్ గూడ, చర్లపల్లి జైలుకు వెళ్ళడానికి మేం రెడీ. మూసీ ప్రక్షాళనకు, సుందరీకరణకు మేం వ్యతిరేకం. పేద ప్రజల గూడు లేకుండా చేయవద్దని కోరుతున్నాను.మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టండి. రేవంత్ అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా ఒక్క పేద వాడి ఇంటి పనికి కూడా శంకుస్థాపన చేయలేదు. పైసా, పైసా కూడబెట్టుకుని కట్టుకున్న పేదల గూడును కూల్చేస్తున్నారు. కష్టపడి కట్టుకున్న ఇళ్ళు కూల్చివేస్తుంటే ఏం చేయాలో తెలియక బాధితులు బిక్కుబిక్కుమంటున్నారు. పేద ప్రజలకు అండగా నిలబడే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. మహిళలకు, రైతులకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు. మూసీ సుందరీకరణ కోసం గత ప్రభుత్వం కూడా పేదలను భయభ్రాంతులకు గురిచేశారు. బీఆర్ఎస్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారు. బీజేపీ నేతలు మూసీ పరివాహక ప్రాంత ప్రజల్లో పర్యటించి.. వారి బాధలు తెలుసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టాలని రేవంత్‌కు కల వచ్చినట్టుంది.రేవంత్‌కి మరో సవాల్ చేస్తున్నా.. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా?. మూసీ పరివాహక ప్రాంతం గురించి రేవంత్‌కి తెలుసా?. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. వాటిని కూల్చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. -
ఇందిరా పార్క్ ధర్నా చౌక్.. నేడు బీజేపీ నేతల ధర్నా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ ప్రాంత ప్రజలకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద నేడు బీజేపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు.తెలంగాణ బీజేపీ నేతలు రెండు రోజుల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం, వారికి మద్దతుగా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ నేడు ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు బీజేపీ నేతలు ధర్నా చేయనున్నారు. బీజేపీ ధర్నాకు కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ హాజరు కానున్నారు. -
వచ్చే ఆగస్టుకల్లా కాజీపేట యూనిట్
సాక్షి, హైదరాబాద్: కాజీపేట రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ)ను వచ్చే ఆగస్ట్ నాటికి పూర్తి చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ యూనిట్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్‌హెచ్‌బీ (లింక్‌హాఫ్‌మన్ బుష్) కోచ్‌లు, ఈఎంయూ (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్) కోచ్‌లను తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏటా 600 కోచ్‌ల నిర్మాణ సామర్థ్యంతో కాజీపేట యూనిట్ పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. గురువారం దక్షిణమధ్య రైల్వే పరిధిలోని పార్లమెంట్ సభ్యుల సమావేశం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జరిగింది.ఈ సందర్భంగా పలు పెండింగ్ సమస్యలను ఎంపీలు ప్రస్తావించారు. అనంతరం దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్‌తో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మొదట్లో రూ.250 కోట్లతో కాజీపేట్‌లో ఓవర్‌హాలింగ్ వర్క్‌షాప్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని, ప్రస్తుతం దానిని రూ.680 కోట్లతో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల సుమారు మూడువేల మందికిపైగా ఉపాధి లభిస్తుందన్నారు. అమృత్ భారత్ పథకం కింద చేపట్టిన 40 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని, రూ.780 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ పునరాభివృద్ధి ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని తెలిపారు. 15 ప్రాజెక్టులకు ఫైనల్ లొకేషన్ సర్వే దక్షిణమధ్య రైల్వేలో 15 ప్రాజెక్టులను చేపట్టేందుకు ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. సుమారు రూ.50 వేల కోట్లతో 2647 కి.మీ. రైల్వేలైన్లను చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రూ. 17,862 కోట్ల అంచనాతో 1,447 కి.మీ. డబ్లింగ్ చేయనున్నట్లు చెప్పారు. ఢిల్లీ తరువాత హైదరాబాద్ కేంద్రంగానే అత్యధికంగా 5 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సకాలంలో భూమి లభించకపోవడం వల్ల ఎంఎంటీఎస్ రెండో దశతోపాటు పలు ప్రాజెక్టుల్లో జాప్యం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం రూ.650 కోట్లతో రాయగిరి నుంచి యాదాద్రి వరకు 31 కి.మీ. వరకు ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును రైల్వేశాఖ సొంతంగా చేపట్టనుందన్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ నిర్మించాలని ప్రతిపాదించిన రైల్రింగ్రోడ్డుకు సర్వే చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ప్రాధాన్యతల కోసం కసరత్తురానున్న కేంద్ర బడ్జెట్లో రైల్వే ప్రాధాన్యతలను లక్ష్యంగా చేసుకొని దక్షిణమధ్య రైల్వే నిర్వహించిన ఈ ఎంపీల సమావేశంలో తెలంగాణ ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి, డీకే అరుణ, కడియం కావ్య, బలరాంనాయక్, రఘురాంరెడ్డితోపాటు సాగర్ ఈశ్వర్ ఖండ్రే (బీదర్), రాధాకృష్ణ దోడ్డమణి (కలబురిగి) పాల్గొన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన ఆర్‌యూబీలు, ఆర్ఓబీలు నత్తనడకన సాగుతున్నాయని, సకాలంలో పూర్తయ్యేలా గడువు విధించాలని ఈటల సూచించారు.ఈదుల నాగులపల్లి స్టేషన్‌ను అభివృద్ధి చేయాలని, జర్నలిస్టులకు, దివ్యాంగులకు రైల్వే పాస్‌ల ను పునరుద్ధరించాలని రఘునందన్‌రెడ్డి కోరా రు. ఏటా రెండుసార్లు ఎంపీల సమావేశం పెట్టి సమస్యలపై చర్చించాలని సురేశ్‌రెడ్డి సూచించా రు. దేవరకద్ర, కౌకుంట్ల, జడ్చర్ల ప్రాంతాల్లోని ఆర్‌యూబీలు, ఆర్ఓబీలను సకాలంలో పూర్తి చేయాలని డీకే అరుణ కోరారు. కాజీపేట రైల్వే ఆసుపత్రిలో కనీస సదుపాయాలు కలి్పంచాలని కడియం కావ్య కోరారు. ఎంపీల ప్రతిపాదనలకు ప్రాధాన్యత ఉంటుందని జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌జైన్ చెప్పారు. 2023–24 ఆర్థిక ఏడాదిలో 141 మిలియన్ టన్నుల సరుకు రవాణాద్వారా అత్యధికంగా రూ.13,620 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. -
వచ్చే నెలలో చర్లపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే అధికారుల భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎంపీలు సురేష్ రెడ్డి, కావ్య, రఘునందన్, డీకే అరుణ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా రైల్వే అభివృద్ధిపై చర్చించారు. రైళ్ల హోల్డింగ్, కొత్త రైల్వే లైన్లతో పాటు అండర్ పాసులు, బ్రిడ్జిల నిర్మాణంపై చర్చ జరిగింది.ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 90 శాతం రైల్వేలైన్ల విద్యుదీకరణ ప్రక్రియను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామని.. 40 రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్‌లో రూ.650 కోట్లతో రైల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.గతంలో ఎన్నడూ లేని విధంగా దక్షిణ మధ్య రైల్వేకు బడ్జెట్లో కేటాయింపులు పెంచాం. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 5 వందే భారత్ రైళ్లు ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని వందే భారత్ రైళ్లు తీసుకొస్తాం. రూ.720 కోట్లతో సికింద్రబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు వేగవంతగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తవుతాయి. రూ. 430 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తాం. కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ సేవలు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు మరో రూ.650 కోట్లు కావాల్సి ఉంటుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు.జంట నగరాల నుంచి యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయ దర్శనానికి వెళ్లే భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎంఎంటీస్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 800 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. రైల్వే అభివృద్ధి పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేసి, చేతులెత్తేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించకపోయినా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కింద సర్వీసును పొడిగిస్తున్నాం. మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రూ.33 వేల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది రైల్వే పనుల కోసం సుమారు 6 వేల కోట్లు బడ్జెట్ మంజూరు అయింది’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.