Krack Movie
-
సంక్రాంతి మూవీస్.. ఆమె నటిస్తే హిట్ కొట్టడం గ్యారంటీనా?
ఈమె ఓ సినిమాలో నటించి.. అది సంక్రాంతికి రిలీజ్ అయితే హిట్ గ్యారంటీ! అబచ్చా.. ఈమె యాక్ట్ చేస్తే హిట్ కొట్టడం ఏంటి బాసూ.. సినిమాలో దమ్ముండాలి. జనాలకు అది నచ్చాలి కదా? అని మీరు అనుకోవచ్చు. కానీ గత మూడు-నాలుగేళ్లుగా చూసుకుంటే మాత్రం పండక్కి వచ్చే చిత్రాలకు ఈమె లక్కీ ఛార్మ్ అయిపోయినట్లు కనిపిస్తుంది. ఇంతకీ ఎవరీ బ్యూటీ? ఈమె అదృష్టం సంగతేంటి? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు వరలక్ష్మి శరత్ కుమార్. సాధారణంగా అలాంటి పొట్టిపొట్టి బట్టల్లో అయితే కనిపించదు. ఎందుకంటే ఈమె హీరోయిన్ కాదు. ఒకప్పుడు హీరోయిన్గా చేసింది గానీ హిట్స్ పడలేదు. దీంతో రూట్ మార్చేసింది. తొలుత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసింది. అవి క్లిక్ అయ్యేసరికి ఇలాంటివే చేస్తూ వచ్చింది. అయితే ఈమెలోని అద్భుతమైన నటిని గుర్తిస్తున్న పలువురు డైరెక్టర్స్.. ఈమెకు డిఫరెంట్ రోల్స్ ఇస్తూ ప్రోత్సాహిస్తున్నారు. (ఇదీ చదవండి: క్లీంకార తొలి సంక్రాంతి సెలబ్రేషన్స్.. మెగా ఫ్యామిలీ అంతా అక్కడికి షిఫ్ట్) అలా తెలుగులోనూ గత నాలుగైదేళ్లలో వరలక్ష్మికి మంచి మంచి రోల్స్ పడ్డాయి. 2021 సంక్రాంతికి రవితేజ 'క్రాక్'లో విలన్ భార్యగా నటించింది. ప్రతినాయక ఛాయలున్న పాత్రలో అదరగొట్టేసింది. ఇక గతేడాది పండక్కి వచ్చిన 'వీరసింహారెడ్డి' చిత్రంలోనూ హీరోకి చెల్లెలి పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టేసింది. తాజాగా 'హను-మాన్'లోనూ హీరోకి అక్క పాత్రలో ఉన్నది కాసేపే అయినా కేక పుట్టించేసింది. అనుకోకుండా జరిగినా సరే 2021, 2023, 2024లో సంక్రాంతికి వచ్చి హిట్ అయిన సినిమాల్లో ఈమె నటించడంతో వరలక్ష్మిని... పండగ సినిమాల లక్కీ ఛార్మ్ అని అంటున్నారు. అయితే ఈమె ఉన్నంత మాత్రాన హిట్ అయిపోలేదు. సినిమాలో కంటెంట్‌కి తోడు వరలక్ష్మి యాక్టింగ్ కూడా కలిసొచ్చి ఇప్పుడు ఈమె.. టాలీవుడ్లో స్టార్ యాక్టర్ అయిపోయిందనొచ్చు. (ఇదీ చదవండి: ఆ జ్ఞాపకాల్లోనే మెగాడాటర్.. ముద్దులిచ్చేస్తున్న 'బిగ్‌బాస్ 7' బ్యూటీ!) -
వరలక్ష్మి వెంటబడుతున్న తెలుగు డైరెక్టర్
తెలుగు సినీ పరిశ్రమలో పవర్ఫుల్ లేడీ విలన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు 'రమ్యకృష్ణ'. నరసింహా, నీలాంబరి చిత్రాల్లో హీరోకు సమానంగా ఆమె నటించిన తీరు అందరినీ మెప్పిస్తుంది. ఇప్పుడు జనరేషన్ మారింది. ఇప్పుడా ప్లేస్‌లోకి వరలక్ష్మి శరత్‌కుమార్ వచ్చేసిందని చాలామంది నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తుంటారు. అంతలా ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. వరలక్ష్మికి తెలుగులో స్టార్ ఇమేజ్ అందించిన చిత్రం ‘క్రాక్’ . గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో జయమ్మగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఆ పాత్రలో ఆమె పలికించిన హావభావాలు తెలుగువారిని మెప్పించాయి. ముఖ్యంగా ఆమె బేస్ వాయిస్ ఈ పాత్రకు హైలైట్‌గా నిలిచింది. తరువాత ఇదే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన 'వీర సింహారెడ్డి' సినిమా తనకు మరింత పేరును తీసకువచ్చింది. ఇదే ఏడాదిలో సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమాతో వరలక్ష్మికి తెలుగులో మరో హిట్ అందుకుంది. ఇందులో ఆమె 'భానుమతి' పాత్రలో బాలయ్యకు సోదరిగా నటించి మరింత స్టార్ ఇమేజ్ను పెంచుకుంది. సీమ యాసలో ఆమె చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌లు సినీ ప్రియులను కట్టిపడేశాయి. ఈసినిమా విడుదలయ్యాకనే ఆమె నటన చూసే టాలీవుడ్ ఇండస్ట్రీకి మరో లేడీ విలన్ వచ్చేసిందంటూ అప్పట్లో వరుస కామెంట్స్ కూడా చేశారు. వరలక్ష్మికి మరో ఛాన్స్ వరసు విజయాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్న డైరెక్టర్ గోపీచంద్ మళ్లీ రవితేజతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన క్రాక్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించింది. దీంతో మళ్లీ మరో ప్రాజెక్ట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇందులో కూడా తన లక్కీ ఛార్మ్ అయిన వరలక్ష్మి కోసం ప్రత్యేక రోల్‌ను ఆయన క్రియేట్ చేస్తున్నాడట. ఈ సినిమా కోసం హీరోయిన్ ఎంపిక చేయడం కంటే ముందు వరలక్ష్మి ఎంపిక జరిగిపోయిందట. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమెను గోపీచంద్ ఇప్పటికే సంప్రదించాడని టాక్. ఇలా తన సినిమాలో జయమ్మ ఉంటే అది సూపర్ హిట్ ఖాయం అని ఆయన భావిస్తున్నారట. -
డెవిల్ కపుల్స్.. భర్తతో కలిసి దుర్మార్గాలు చేసే భ ‘లేడీ విలన్స్’
విలన్.. హీరోయిన్ వెంట పడ్డాడు. లేకపోతే హీరోతో గొడవ పడ్డాడు. ఏదో ఒకటి. హీరోయిన్ విల న్ అసహ్యయించుకుంటుంది. అతన్ని ఛీ కొడుతుంది. హీరో ఏమో చావకొడతాడు. మూకీ నుంచి టాకీ వరకు ఒకటే స్టోరీ లైన్. విలన్ని చూసి భయపడే ఆడవాళ్లు ఉంటారు. చీదరించు కునే ఆడవాళ్లు ఉంటారు…మరి…విలన్‌కి జోడీ మాటేంటి ? ఈడూ జోడూ అంటే హీరో హీరో యిన్స్ మాత్రమేనా ? ఈ డౌట్ సహజంగా అందరికీ వస్తుంది కదా. ఇంతకీ తెలుగు సినిమాల్లో విలన్ జోడీలు లేరా? చిలకాగోరింకల్లా అనోన్యంగా ఉంటూ…కలిసికట్టుగా దుర్మార్గాలు చేసే డెవిల్ కపుల్స్ మీద ఒక లుక్ వేసేద్దామా.. ఏ సినిమా చూసినా హీరోకే జోడి. అది లవర్ కావచ్చు. లేదా భార్య కావచ్చు. కానీ…విలన్ కి మాత్రం జోడి ఉండదు. హీరోయిన్ చేత ఛీ కొట్టించుకునే విలన్లే అందరూ. ఒకవేళ భార్య రూపం లో జోడి ఉన్నా…ఆమె విలన్ని…విలన్ లానే చూస్తుంది. అలా కాకుండా విలన్ చేసే ప్రతి దుర్మార్గాన్ని సపోర్ట్ చేసే జోడి ఉంటే ? ఆమె భార్య కావచ్చు. ప్రేయసి కావచ్చు. తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా విలన్‌కి అలాంటి జోడి దొరుకుతూ ఉంటుంది. అతను చేసే వెధవ పనున్నింటికీ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. విలన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. క్రాక్ సినిమా తో మరోసారి ఈ ట్రెండ్ ఫోకస్‌లోకి వచ్చింది. కఠారి కృష్ణకి అన్ని రకాలుగా అండగా ఉండే జయమ్మ క్యారెక్టర్ అందరినీ ఆకర్షించింది. ఈ చిత్రంలో కటారి కృష్ణ పాత్రని సముద్రఖని పోషించగా, జయమ్మగా వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించింది. అర్జున్.. ఒక్కడు తర్వాత గుణశేఖర్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన చిత్రం. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్ బ్యాగ్రౌండ్లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. మధుర మీనాక్షి టెంపుల్ సెట్ గురించి అప్పట్లో పెద్ద చర్చ జరిగింది. ఈ సినిమాలో విలన్ బాల నాయ గర్ అయితే, అంతకు మించి అన్న టైప్‌లో విలనీజాన్ని పండించింది ఆండాల్ పాత్ర. బాల నాయగర్గా ప్రకాష్ రాజ్, ఆయన సతీమణి ఆండాల్గా సరిత నటించారు. భర్త మనసు తెలు సుకుని మరీ దుర్మార్గపు పనులు చేసే భార్యగా సరిత నటన ప్రశంసలు అందుకుంది. మహేశ్ బాబుతో పాటుగా సరితకు కూడా నంది స్పెషల్ జ్యూరీ అవార్డు లభించింది. విలన్‌కి జోడిగా ఉంటూ యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసే ఆడవాళ్లు తెలుగు సినిమాల్లో తక్కు వే. మహేశ్‌బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో అలాంటి క్యారెక్టర్ని డిజై న్ చేశారు. నిజంలో విలన్‌గా గోపిచంద్ నటించారు. దేవుడు పాత్రలో గోపిచంద్ ప్రదర్శించిన విలనీజం అప్పట్లో పెద్ద సంచలనమైంది. ఈ సినిమాలో గోపిచంద్‌కి జంటగా రాశి నటించింది. హీరోయిన్ పాత్రల నుంచి లేడీ విలన్ క్యారెక్టర్లోకి రాశి జంప్ చేయడంపై కాస్త డిస్కషన్ కూడా సాగింది. మల్లి పాత్రలో గ్లామర్‌కి క్రూరత్వం మిక్స్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది రాశి. సినిమాకి, సినిమాకి పూర్తి భిన్నమైన జానర్స్‌ని ఎంపిక చేసుకునే హీరోల్లో రానా ఒకడు. నేనే రాజు, నేనే మంత్రి అందుకో ఉదాహరణ. జోగేంద్ర, రాధ చూడముచ్చటైన జంట. చివరి వరకు మూవీలో ఈ కపుల్ ట్రావెల్ చేయక పోయినా…కథ మలుపు తిరగడానికి మాత్రం కారణమౌ తుంది. అదే ఊరి సర్పంచ్ జంట. సర్పంచ్‌గా ప్రదీప్ రావత్ నటిస్తే…అతని భార్యగా బిందు చంద్రమౌళి నటించారు. ప్రదీప్ రావత్, బిందు చంద్రమౌళి ఇద్దరూ నెగిటివ్ రోల్స్‌లో తెగ జీవించేశారు. ఒక సినిమా. పది విభిన్నమైన క్యారెక్టర్లు. దశావతారంతో నట విశ్వరూపం చూపించేశారు కమలహాసన్. ఒక్కో పాత్ర పూర్తి భిన్నమైన నేపథ్యంతో సాగుతోంది. కథానాయకుడు, ప్రతికథా నాయకుడుతో పాటుగా కథని మలుపు తిప్పే కీలక పాత్రలన్నీ తానే పోషించారు. అందులో విలన్ పాత్ర ఫ్లెచర్కి జంటగా మల్లికా షరావత్ నటించింది. గోవింద్‌ని పట్టుకునే క్రమంలో ఫ్లెచర్కి మల్లికా షరావత్ అన్ని రకాలుగా సహకరిస్తుంది. అమ్మోరు. పాతికేళ్ల క్రితమే వి.ఎఫ్.ఎక్స్ తో సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతాన్ని ఆవిష్కరించిన చిత్రం. అసలే స్పెషల్ ఎఫెక్ట్స్. ఆ పైన భక్తి చిత్రం. ఒకవైపు భక్తి భావోద్వేగం. మరోవైపు తొలి సారిగా కళ్ల ముందు కనిపిస్తున్న సరికొత్త సాంకేతిక మాయజాలం. అందుకే…అమ్మోరు అం తటి ఘన విజయం సాధించింది. దేశంలోని అన్ని భాషా చిత్ర పరిశ్రమల్లో చర్చ జరిగే చేసింది. అమ్మోరు చిత్రంలో ప్రధాన విలన్‌గా గోరఖ్ పాత్రలో రామిరెడ్డి నటించారు. అదే చిత్రంలో మరో విలన్‌గా బాబూమోహన్ నటించారు. బాబూ మోహన్‌కి జంటగా వడివుక్కరసి నటించారు. హీరో కుటుంబంలో చిచ్చు పెట్టడం దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ భార్యా, భర్తలిద్దరూ కలిసికట్టుగా ప్లాన్ చేస్తూ ఉంటారు. వీరిద్దరి మధ్య కుట్రల కోణంలో కెమిస్ట్రీ చాలా బాగా పండింది. టాలీవుడ్లో దాదాపు పదేళ్ల పాటు ఏలేసిన హీరోయిన్స్‌గా ఒకరు సిమ్రాన్. సహజంగా హీరో యిన్‌గా ఫేడౌట్ అయిన తర్వాత ఏ వదినగానో, అక్కగానో రీఎంట్రీ ఉంటుంది. కానీ…సిమ్రాన్ మాత్రం లేడీ విలన్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తమిళ మూవీ సీమరాజా తెలుగులోనూ అదే పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో విలన్ లాల్ భార్యగా నెగివిట్ షేడ్స్ ఉన్న రోల్ ప్లే చేసింది సిమ్రాన్. హీరోయిన్ సమంతాతో పాటుగా లాల్, సిమ్రాన్ ల విలనీజం కూడా సినిమాకి హైలెట్ గా నిలిచింది. -
‘క్రాక్ సినిమా కథ నాదే.. నోటీసులు పంపించినా పట్టించుకోవడం లేదు’
సాక్షి, బంజారాహిల్స్: రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా కథ తనదేనని తనను మోసం చేసిన సినీ నిర్మాతతో పాటు ఇతర యూనిట్ సభ్యులపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఓ రచయిత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలివీ... అల్వాల్‌లో నివాసం ఉంటున్న శివ సుబ్రమణ్యమూర్తి అనే వ్యక్తి 2015లో బళ్లెం సినిమా మీడియా డైరెక్టరీ అనే పుస్తకాన్ని రాశారు. ఏడాదిన్నర క్రితం రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాలో సన్నివేశాలు, కథ, కథనం మొత్తం తన పుస్తకంలో ఉన్నదేనని సదరు నిర్మాణ సంస్థతో పాటు దర్శకుడు, హీరోలకు ఫిలించాంబర్ నుంచి నోటీసులు పంపించినా పట్టించుకోవడం లేదని సుబ్రమణ్యమూర్తి గురువారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమా నిర్మాత మధుసూదన్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో నివాసం ఉంటున్న కారణంగా తాను ఇక్కడ ఫిర్యాదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చదవండి: యూట్యూబర్ శ్రీకాంత్‌రెడ్డిని చితక్కొట్టిన కరాటే కల్యాణి -
2021 ఈ హీరోలకు చాలా స్పెషల్.. అద్భుతాలు జరిగాయి!
2021లో బాక్సాఫీస్ రన్ చాలా తక్కువ. కాని ఎక్కువగా అద్భుతాలు జరుగుతున్నాయి. ఫ్లాపుల్లో ఉన్న టాప్ యాక్టర్స్, యంగ్ హీరోస్ హిట్ ట్రాక్ అందుకోవడం ఈ ఇయర్ స్పెషాలిటీ. క్రాక్ టు అఖండ వరకు చూసుకుంటే 2021 కమ్ బ్యాక్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. ‘క్రాక్’తొ కమ్ బ్యాక్ సంక్రాంతి సీజన్ లో రిలీజైన క్రాక్ మూవీతో మాస్ రాజా పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. 2017 లో విడుదలైన రాజా ది గ్రేట్ మూవీ తర్వాత రవితేజ వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఏడాది ప్రారంభంలో విడుదలైన క్రాక్ అనూహ్య రీతిలో విజయాన్ని అందుకున్నాడు. 50 పర్సెంట్ ఆక్యుపెన్సీలోనూ ,ఈ సినిమా భారీ వసూళ్లను కొల్లగొట్టింది. మాస్ రాజా కు బిగ్గెస్ట్ కమ్ బ్యాక్ మూవీగా నిలిచింది. నరేశ్ విజయానికి ‘నాంది’ 2012లో వచ్చిన బ్లాక్ బస్టర్ సుడిగాడు తర్వాత మళ్లీ ఆ స్తాయిలో విజయాన్ని అందుకోవడానికి అల్లరి నరేష్ 2021 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫిబ్రవరిలో విడుదలైన ‘నాంది’ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. పైగా అల్లరి నరేష్ తన అల్లరిని పక్కన పెట్టి పూర్తిగా సీరియల్ సబ్జెక్ట్ లో నటించి మెప్పించాడు. సీటీ కొట్టించిన ‘సీటిమార్’ 2014లో లౌక్యంతో సూపర్ హిట్ కొట్టాడు గోపీచంద్. మధ్యలో చాలా చిత్రాలు చేసాడు కాని కావాల్సిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. 2021లో సీటీమార్ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పక్కా కమర్షియల్ చిత్రాలు చేస్తున్నాడు. అఖిల్ ఖాతాలో భారీ విజయం 2015లో హీరోగా కెరీర్ ప్రారంభించాడు అఖిల్. హెలో, మిస్టర్ మజ్ను లాంటి మూవీస్ చేసినప్పటికీ ఫస్ట్ హిట్ మాత్రం దక్కలేదు. కాని ఈ ఇయర్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఈ అక్కినేని హీరోగా మెమొరబుల్ హిట్ గా నిలిచింది. ‘అఖండ’తో నటసింహం బాక్సాఫీస్ వేట రవితేజ, అల్లరి నరేష్, గోపీచంద్, అఖిల్ తర్వాత నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా ఈ ఏడాదే బాక్సాఫీస్ వేట మొదలు పెట్టాడు. అఖండతో సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ కు బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందించాడు బాలయ్య. 2017లో విడుదలైన గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత మళ్లీ హిట్ కొట్టలేదు బాలయ్య. దాదాపు నాలుగేళ్ల తర్వాత అఖండతో బంపర్ హిట్ కొట్టాడు. -
Ravi Teja: పవర్ఫుల్ డైలాగ్స్‌తో ‘క్రాక్’ స్పెషల్ వీడియో.. వైరల్
వరుస ఫ్లాపులతో సతమతవుతున్న రవితేజకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన సినిమా ‘క్రాక్’.గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్గా శ్రృతీ హాసన్, కీలకపాత్రలో సముద్ర ఖని, వరలక్ష్మి శరత్ కుమార్ నటించారు. సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 9న విడుదలై ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. కొత్త ఏడాది తొలి భారీ విజయం అందుకున్న సినిమాగా రికార్డుకెక్కింది.ఈ సినిమాలో మరోసారి తనకు అచ్చొచ్చిన పోలీసు పాత్రలో కనిపించి అభిమానుల ఫిదా చేశాడు రవితేజ. ఇక ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఓటీటీలో కూడా ‘క్రాక్’కిర్రాక్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ‘బెస్ట్ ఆఫ్ క్రాక్’పేరిట ఆహా ఓ వీడియోను విడుదల చేసింది. అందులో సినిమాలో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు, రవితేజ మాస్ డైలాగులతో పాటు హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చదవండి: అరుదైన ఫోటోను షేర్ చేసిన మేఘనా రాజ్ స్పీడు పెంచిన 'ఏక్ మినీ కథ' హీరో.. ఆ డైరెక్టర్‌తో నెక్స్ట్ సినిమా! -
క్రాక్ సినిమాటోగ్రాఫర్ పెళ్లి: కీర్తి సందడి
కరోనా ఫస్ట్ వేవ్‌లో లాక్డౌన్ విధించగా సినిమా షూటింగ్‌లు అర్ధాంతరంగా ఆగిపోయాయి. దీంతో షూటింగ్‌లు, రిలీజ్లు లేకపోవడంతో సినీతారలకు బోలెడంత సమయం దొరికింది. ఈ క్రమంలో ఎంతోమంది పెళ్లిళ్లు కూడా చేసుకుని కొత్త జీవితం ప్రారంభించారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్‌లో కూడా షూటింగ్‌లు ఆగిపోవడంతో మరోసారి పెళ్లిగంటలు మోగుతున్నాయి. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జీకే విష్ణు ఓ ఇంటివాడయ్యాడు. ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న రవితేజ 'క్రాక్' సినిమాకు ఆయన సినిమాటోగ్రఫీ అందించాడు. దళపతి విజయ్ ప్రధాన పాత్రలో నటించిన 'బిగిల్', 'మెర్సల్' చిత్రాలతో పాటు విశాల్ 'అయోగ్య' సినిమాకు కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేశాడు. ఆదివారం ఉదయం ఆయన పి.మహాలక్ష్మి అనే యువతి మెడలో మూడు ముళ్లు వేసి తన జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. కోవిడ్ కారణంగా తక్కువ మంది సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి వివాహ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ వేడుకకు హాజరైన మహానటి కీర్తి సురేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కలిసి దిగిన సెల్ఫీ సైతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో చూస్తుంటే పెళ్లిలో వీళ్లు బాగానే సందడి చేసినట్లు తెలుస్తోంది. #GKVishnuWedsMaha #Mersal #Bigil Cinematographer@dop_gkvishnu Marriage ❤️#KeerthySuresh #VaralaxmiSarathkumar Attend #GKVishnu Wedding @KeerthyOfficial @varusarath5 pic.twitter.com/nqYUrl9e4a — Actor Kayal Devaraj (@kayaldevaraj) April 25, 2021 చదవండి: ముగ్గురు స్నేహితుల ప్రేమలో హీరోయిన్ మరోసారి ఆ డైరెక్టర్‌తో జతకట్టనున్న ధనుష్ -
బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 8 హిట్ సినిమాలు ఇవే
కంటికి కనిపించని కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఈ మహమ్మారి ఎఫెక్ట్‌కు 9 నెలల పాటు థియేటర్స్ మూసేశారు. ఇలాంటి తరుణంలో ప్రేక్షకులు మళ్లీ థియేర్లకు వస్తారా? సినిమా థియేటర్లు మళ్లీ హౌస్‌ఫుల్ అవుతాయా?అని చిత్ర పరిశ్రమ పెద్దలు ఒకింత భయాందోళనకు గురవుతుండగా.. మేము అండగా ఉంటామని ధైర్యాన్ని నూరిపోశారు తెలుగు ప్రేక్షకులు. సినిమాలు విడుదల చేయండి, థియేటర్స్‌కి తప్పకుండా వస్తామని భరోసా ఇచ్చారు. అన్నట్లుగానే గత మూడు నెలలుగా విడుదలైన సినిమాలన్నింటిని ఆదరించి చిత్ర పరిశ్రమే షాకయ్యేలా చేశారు. సినిమా సందడి మళ్లీ మొదలైంది. చూస్తుండగానే ఈ ఏడాదిలో మూడు నెలలు గడిచిపోయాయి. ఈ మూడు నెలల్లో టాలీవుడ్లో దాదాపు 66 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో మంచి సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నేటితో మొదటి మూడు నెలలు ఫినిష్ అయ్యాయి.మరి ఫస్ట్ క్వార్టర్లో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాయో చూద్దాం. కిర్రాక్ అనిపించిన ‘క్రాక్’ థియేటర్లు రీఓపెన్ అయ్యాక వచ్చిన తొలి బిగ్ మూవీ ‘క్రాక్’. కరోనా భయానికి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా రారా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీకి భరోసా ఇచ్చిన చిత్రమిది. జనవరి 9నదసంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించి నిర్మాతలలో నమ్మకం పెంచేసింది. రవితేజ, శ్రుతీహాసన్ హీరోహీరోయిన్లగా నటించిన ఈ సినిమా దాదాపు 38 కోట్లు వసూలు చేసింది. పోలీసు అధికారి పోత రాజు వీర శంకర్‌గా మాస్ మహారాజా రవితేజ చించేశాడు. చాలా రోజుల తర్వాత మాస్ మహారాజాలోని ఫైర్ తెరపై కనిపించింది. గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విజయ్ ‘మాస్టర్’ పాఠాలు బాగున్నాయి విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ హీరో ‘ఇళయదళపతి’ విజయ్ ఈ ఏడాది ‘మాస్టర్’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు సినిమా కాకపోయినా కూడా టాలీవుడ్లో మంచి విజయం సాధించింది మాస్టర్. జనవరి 13న విడుదలైన ఈ సినిమా సినిమా దాదాపు 12 కోట్ల షేర్ వసూలు చేసి, తెలుగులో కూడా విజయ్‌కు భారీ మార్కెట్ ఉందని నిరూపించింది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతికి మంచి మార్కులు పడ్డాయి. పర్వాలేదనిపించిన ‘రెడ్’ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన ‘రెడ్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. ‘నేను శైలజ', ‘ఉన్నది ఒకటే జిందగీ' తర్వాత కిశోర్ తిరుమల,రామ్ కాంబోలో హ్యాట్రిక్‌గా వచ్చిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. సేఫ్‌జోన్‌లోకి వెళ్లింది. యాంకర్ ప్రదీప్ తొలి ప్రయత్నం ఫలించింది యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘30’రోజుల్లో ప్రేమించడం ఎలా. తొలి సినిమాతోనే మంచి హిట్ కట్టాడు. ఈ సినిమా కూడా హిట్ అయిందా అనే అనుమానాలు చాలా మందికి రావచ్చు. కానీ పెట్టిన బడ్జెట్.. అమ్మిన రేట్లతో పోలిస్తే మాత్రం యాంకర్ ప్రదీప్ తొలి సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి.కొందరు డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కూడా తీసుకొచ్చింది. రికార్డులు షేక్ చేసిన జాంబి రెడ్డి కరోనా క్రైసిస్ లో కూడా జాంబీలంటూ.. వచ్చి టాలీవుడ్ రికార్డులు షేక్ చేసింది జాంబి రెడ్డి. హాలీవుడ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిబ్రవరి 5న విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లని రాబట్టి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. మెగా మేనల్లుడి రికార్డు.. ‘ఉప్పెన’లా వచ్చిన కలెక్షన్లు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఉప్పెన. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతోమంది నిర్మాతలకు ధైర్యం నూరిపోసిన సినిమా ఇది. బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఉప్పెన ఏకంగా 51 కోట్లు షేర్ వసూలు చేసింది. అల్లరి నరేశ్ నట విశ్వరూపానికి ‘నాంది’ 8 ఏళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న అల్లరి నరేశ్‌కు ‘నాంది’తో మంచి విజయం దక్కింది. ‘నా ప్రాణం పోయిన పర్వాలేదు.. న్యాయం గెలవాలి.. న్యాయమే గెలవాలి’ అంటూ అల్లరి నరేశ్ చేసిన నటనకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నరేశ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా 6.5 కోట్ల షేర్ వచ్చింది. చేసిన బిజినెస్‌తో పోలిస్తే సినిమా లాభాల్లోకి వచ్చేసింది. బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ‘జాతి రత్నాలు’ నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ జాతిరత్నాలు. అనుదీప్ దర్శకత్వంలో వచ్చినఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించాడు. మహాశివరాత్రి సందర్భంగా మార్చ్ 11న విడుదలైన జాతి రత్నాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అటు ఓవర్సీస్లో కూడా పెద్ద సినిమాలకు రానీ కలెక్షన్స్‌తో రాబట్టింది.నిర్మాతలకు దాదాపు 40 కోట్ల లాభాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. -
ఓటీటీలో ‘క్రాక్’ సత్తా; 25 కోట్ల నిమిషాలకు పైగా
మాస్ మహారాజా రవితేజకు పూర్వవైభవం తీసుకువచ్చిన మూవీ ‘క్రాక్’. గోపీచంద్ మలినేని- రవితేజ కాంబోలో రూపొందిన ఈ హ్యాట్రిక్ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. వసూళ్ల వర్షం కురిపించింది. ఇక సంక్రాంతి కానుకగా విడుదలై అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న ‘క్రాక్’ ఇప్పుడు ఓటీటీలోనూ సత్తా చాటుతోంది. తెలుగు వారి ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో ఈ సినిమా ఫిబ్రవరి 5 నుంచి ఈ సినిమా స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాటికి 250 మిలియన్ నిమిషాల వ్యూయర్ షిప్ సాధించి ‘ఆహా’ పాత రికార్డులను బద్దలుగొట్టాడు పోతరాజు వీరశంకర్. ఈ విషయాన్ని ఆహా టీం అధికారికంగా వెల్లడించింది. బ్లాక్‌బస్టర్ కంటిన్యూస్ అంటూ ఇప్పటివరకు 25 కోట్ల నిమిషాల పాటు స్ట్రీమ్ అయ్యిందంటూ హర్షం వ్యక్తం చేసింది. ఇక అంతకుముందు ఆహాలో హైయ్సెస్ట్ వ్యూస్ రికార్డు కలర్ ఫొటో సినిమా పేరిట ఉండేది. ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన క్రాక్ ఓటీటీలోనూ రికార్డుల వేట కొనసాగిస్తోందంటూ రవితేజ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. చదవండి: రేటు పెంచేసిన మాస్ మహారాజా.. నిర్మాతలకు షాకే! Blockbuster run continues 🔥#KrackOnAHA crosses 250 million viewing minutes of all your love!@RaviTeja_offl @shrutihaasan @megopichand @MusicThaman @TagoreMadhu @TheKrackMovie pic.twitter.com/XoRufQNoR8 — ahavideoIN (@ahavideoIN) February 26, 2021 -
రేటు పెంచేసిన మాస్ మహారాజా.. నిర్మాతలకు షాకే!
‘క్రాక్’తో కిరాక్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు మాస్ మహారాజ రవితేజ. ఈ సినిమా ఇచ్చిన కిక్‌తో వరుస సినిమాలకు ఓకే చెబుతూ.. అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ‘ఖిలాడి’తో బిజీగా ఉన్న ఈ మాస్ హీరో.. తాజాగా తన 68వ చిత్రాన్ని ఫైనల్ చేశాడు. ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఈ సినిమాను చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేర్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే రవితేజ తన 68వ సినిమాకు రెమ్యునరేషన్‌ని భారీగా పెంచారని ఓ వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి వస్తోన్న సమాచారం మేరకు కొత్త సిసిమాలకు రవితేజ రూ.16 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నారట. ‘క్రాక్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. అంతేకాదు, రవితేజకు ఈ సినిమా పూర్వ వైభవం తీసుకొచ్చింది. అందుకే, ఈ సినిమా తరవాత రవితేజ తన రెమ్యునరేషన్‌ని పెంచిట్లు తెలుస్తోంది. మాస్ మహారాజ సినిమాలంటే మినిమం గ్యారెంటీ అనే పేరు ఎలాగో ఉంది.దానికి తోడు ఇటీవల విడుదలైన క్రాక్ కలెక్షన్ల వర్షం కురిపించడంతో నిర్మాతలు కూడా రవితేజ డిమాండ్ చేస్తోన్న రెమ్యునరేషన్ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారట. ‘ఖిలాడీ’ సినిమా పూర్తి అయిన వెంటనే రవితేజ ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించనున్నాడు. చదవండి : ఓటీటీలోకి ఉప్పెన.. రూ.7 కోట్లకు కొనుగోలు ‘ఉప్పెన’పై మహేశ్ బాబు రివ్యూ -
ఠాగూర్ మధుపై ‘క్రాక్’ డైరెక్టర్ ఫిర్యాదు
ఈ ఏడాది క్రాక్ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టాడు డైరెక్టర్ గోపీచంద్ మలినేని. చాలా రోజుల తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. క్రాక్ బాగుందని హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్, దర్శకులు త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడితో పాటు పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. అయితే సినిమా హిట్ సాధించినప్పటికీ ‘క్రాక్’ నిర్మాత ఠాగూర్ మధుకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఆర్థిక వ్యవహారాల కారణంగా క్రాక్ విడుదల రోజు మార్నింగ్, మ్యాట్నీ షోలు నిలిచిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా నిర్మాత ఠాగూర్ మధు మరో వివాదంలో చిక్కుకున్నారు. క్రాక్ సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ రెమ్యూనరేషన్‌ను ఠాగూర్ మధు ఇవ్వలేదంటూ క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి ఫిర్యాదు చేశాడు. దీనిపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన పెండింగ్ రెమ్యూనరేషన్ ఇప్పించేలా చేయాలని కోరాడు. గోపీచంద్ మలినేని ఫిర్యాదు అందుకున్న డైరెక్టర్స్ అసోసియేషన్.. దీనిపై చర్యలు చేపడుతోంది. కాగా సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ బ్లాక్ బస్టర్ విజయం సాధించి తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లను సంపాదించుకుంది. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా 50 కోట్ల క్లబ్లో అడుగు పెట్టి ఇప్పటికీ వసూళ్లు కురిపిస్తూనే ఉంది. అంతేకాకుండా నేటి నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చదవండి: ‘క్రాక్’ విడుదలకు ఎన్నో ఆటంకాలు.. చదవండి: పిట్టకథలు ట్రైలర్: ఎంతమంది మొగుళ్లే నీకు.. -
ఓటీటీ: భారీ రేటు పలికిన క్రాక్!
డాన్ శీను, బలుపు చిత్రాల తర్వాత ముచ్చటగా మూడోసారి కలిశారు గోపీచచంద్ మలినేని, రవితేజ. వీరి కలయికలో వచ్చిన తాజా చిత్రం క్రాక్ బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ అందుకుంది. సినిమా బాగుందని హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్, దర్శకులు త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడితో పాటు పలువురు ప్రముఖులు మెచ్చుకున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా జనవరి 9న రిలీజైంది. 50 కోట్ల క్లబ్లో అడుగు పెట్టిన ఈ చిత్రం ఇప్పటికీ వసూళ్లు కురిపిస్తూనే ఉంది. మరోవైపు దీని డిజిటల్ రైట్స్ నిర్మాత అల్లు అరవింద్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: బాలీవుడ్‌లోకి క్రాక్.. హీరోగా సోనూసూద్!) ఇందుకోసం ఆయన ఏకంగా రూ.8 కోట్లకు పైనే చెల్లించినట్లు టాక్ వినిపిస్తోంది. పైగా ఈ సినిమాను ఆహాలో రిలీజ్ చేసేందుకు జనవరి 29 డేట్‌ను ఫిక్స్ చేశారట. అయితే కంటెంట్ ఉన్న సినిమా, అందులోనూ కలెక్షన్లు కురిపిస్తుండటంతో ఇప్పుడప్పుడే ఓటీటీ వద్దనుకుంటుందట చిత్రయూనిట్. పదిరోజులు ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేయాలని భావిస్తోందట. దీంతో ఇప్పుడే కాకుండా ఫిబ్రవరి 9న క్రాక్‌ను ఓటీటీలో రిలీజ్ చేయమని అల్లు అరవింద్‌ను కోరుతున్నారట. మరి ఈ విన్నపాలకు ఆయన ఏమని స్పందిస్తారో చూడాలి. కాగా ఈ మాస్ ఎంటర్టైనింగ్ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్, సముద్రఖని, మౌర్యానీ కీలక పాత్రలు పోషించారు. (చదవండి: ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు: క్రాక్ దర్శకుడు) -
‘క్రాక్’ విడుదలకు ఎన్నో ఆటంకాలు.. చివరకు
సాక్షి, హైదరాబాద్: ‘‘క్రాక్’ సినిమా చాలా బాగుందని హీరోలు చిరంజీవి, రామ్‌చరణ్, దర్శకులు త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, అనిల్ రావిపూడితో పాటు పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసించారు. సినిమా చూశాక చిరంజీవిగారు ఫోన్ చేసి, ఒంగోలులో నేను విన్నవి గుర్తొచ్చాయని అనడం మరచిపోలేను. మంగళవారం ఆయన్ని కలిశాను’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా జనవరి 9న విడుదలైంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. ‘కరోనా లాక్డౌన్లో దాదాపు 8 నెలలు విరామం వచ్చింది. ‘క్రాక్’ని ఓటీటీలో రిలీజ్ చేయమని ఒత్తిళ్లు వచ్చాయి. కానీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం తీసిన సినిమా అని బలంగా నమ్మి, థియేటర్స్‌లో రిలీజ్ కోసమే పట్టుదలగా ఎదురు చూశాను. సంక్రాంతికి విడుదలైన మా సినిమా పెద్ద విజయం సాధించడం ఆనందంగా ఉంది. మా సినిమా విడుదలకు ముందు రోజు కోర్టు నుంచి స్టే రావడంతో రాత్రంతా నిద్రపట్టలేదు. మూడు షోలు రద్దు కావడంతో బాధపడ్డాను. ఇలాంటి ఇబ్బందులు ఏ దర్శకుడికి రాకూడదు’ అంటూ చెప్పుకొచ్చారు. అంతేగాక ఆ సమయంలో నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, దామోదర్ ప్రసాద్, నాగవంశీలతో పాటు ఇండస్ట్రీ తమకు అండగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా వారిందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక హీరోలు మంచు మనోజ్, సాయితేజ్ సహా పలువురు ఫోన్ చేసి ధైర్యాన్నిచ్చారని చెప్పారు. ఇక ఎన్నో అవాంతరాలు దాటుకుని ‘క్రాక్’ సినిమా విజయం సాధించడంతో మా బాధలన్నీ మరచిపోయామని ఆనందం వ్యక్తం చేశారు. కేవలం 50 శాతం సీటింగ్ కెపాసిటీ అయినా కూడా రవితేజ కెరీర్లోనే బిగ్ హిట్‌గా ‘క్రాక్’ నిలిచిందని, ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందన్నారు. అలాగే హిందీలో రీమేక్ చేసేందుకు కొందరు అడుగుతున్నారని, ఈ రీమేక్ అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ఆయన పేర్కొన్నారు. -
కిల్ రాజు అంటావా..సినిమా ఎవడు ఇస్తాడు?
టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజుపై డిస్టిబ్యూటర్ వరంగల్ శ్రీను చేసిన వ్యాఖ్యల్ని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తీవ్రంగా ఖండించారు. దిల్‌రాజు గురించి మాట్లాడే అర్హత శ్రీను లేదన్నారు. శనివారం ఆయన అల్లుడు అదుర్స్ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. ‘నైజాం డిస్ట్రిబ్యూటర్ శ్రీను అనే వ్యక్తి ఈరోజు దిల్ రాజు గురించి మాట్లాడుతున్నాడు. అసలు శ్రీను అనే వ్యక్తికి దిల్ రాజు గురించి మాట్లాడే అర్హత ఉందా? శిరీష్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత అసలే లేదు. వాళ్లతో మాకు 20 ఏళ్లుగా అనుబంధం ఉంది.. అసలు దిల్ రాజు-శిరీష్ అనేవాళ్లు నైజాం ఏరియాలో లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యుసర్ అనేవాళ్లే ఉండరు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తున్నారు. వాళ్లు కనుక పక్కకు తప్పుకుంటే సినిమాలు చేయలేం బాబోయ్ అనే ప్రొడ్యుసర్లు ఉన్నారు. వాళ్లదగ్గరకు వెళ్లి సినిమా ఆగిపోతుంది.. రిలీజ్ కష్టంగా ఉంది అంటే ఎంత డబ్బు ఇచ్చి అయినా రిలీజ్ చేస్తారు. నాకు కూడా చాలా డబ్బు ఇచ్చారు. నాలా చాలామంది ఉన్నారు. (చదవండి : దిల్ రాజుపై ఫైరైన క్రాక్ డిస్ట్రిబ్యూటర్) ఇప్పుడేదో క్రాక్ డిస్ట్రిబ్యూటర్ శ్రీను మాట్లాడుతున్నాడు.. నేను ఆరేళ్లలో ఆరు సినిమాలు చేశాను అని. నువ్ ఆరు చేస్తే వాళ్లు వంద సినిమాలు చేశారు. మొత్తం ఎగ్జిబిటర్స్‌కి లైఫ్ ఇచ్చారు. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ థియేటర్స్‌కి రప్పించారు. అలాంటి డిస్ట్రిబ్యూటర్స్ మనకి కావాలి. శిరీష్-దిల్ రాజు అనే వ్యక్తులు లేకపోతే.. ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థే నాశనం అయిపోయేది. తెలిసీ తెలియక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. నేను హుషారు సినిమా చేశానంటున్నాడు. హుషారు సినిమా బెక్కం వేణుగోపాల్ అనే చిన్న నిర్మాత చేశారు. ఇప్పటికీ ఆయన డబ్బులు కోసం తిరుగుతూనే ఉన్నాడు. కనీసం జీఎస్టీ కూడా కట్టలేదట. అలాంటి వ్యక్తి నేను ఎడ్యుకేటెడ్, పవర్ ఫుల్ మేన్‌ని అని పక్కన ఓయూ జేఏసీ విద్యార్థుల్ని పెట్టుకుని మాట్లాడుతున్నాడు.ఎప్పుడూ సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్లు ఉన్నారు.. ఇండస్ట్రీ పుట్టకు ముందు నుంచి ఉన్నారు. అన్యాయం జరిగితే వాళ్ల దగ్గరకు వెళ్లొచ్చు.. బోలెడు అసోసియేషన్స్ ఉన్నాయి. బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్. నీ సినిమాలో దమ్ము ఉంది. ఆడుతుంది.. నీ డబ్బు ఎక్కడికీ పోదు. నువ్ కనీసం జీఎస్టీ కట్టలేదు.. నీకు నెక్స్ట్ సినిమా ఎవడు ఇస్తాడు. ఇచ్చినా ఇలాగే ఉంటుంది. ఓయూ జేఏసీ వాళ్లకి చెప్తున్నా.. మీరు అన్నీ తెలుసుకుని ఇలాంటి జీఎస్టీ కట్టని వాళ్లకోసం మాట్లాడొద్దు. మీరు వెనకేసుకుని వస్తున్న ఆ వ్యక్తితో ముందు జీఎస్టీ కట్టించి.. అప్పుడు మాట్లాడండి. నేను ప్రెస్ మీట్ ఈ విషయం మాట్లాడాలని అనుకున్నా. కానీ సందర్భం కాదని అల్లుడు అదుర్స్ సక్సెస్ మీట్లో మళ్లీ చెప్తున్నా.. దిల్ రాజు, శిరీష్ లేకపోతే ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఉండేది కాదు. ఆయనకి ఇంగ్లీష్ రాకపోతే నీకు ఎందుకు? తమిళ్ వస్తే నీకెందుకు? ఆయన మంచి సినిమాలు తీస్తున్నాడు. జనాలు ఆదరించే సినిమాలు చేస్తున్నాడు. అతన్ని పట్టుకుని కిల్ రాజు అంటావా? మేం వాళ్లతో 20 ఏళ్ల నుంచి బిజినెస్ చేస్తున్నాం.. ఇలాంటి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ ఇండస్ట్రీలో ఉండాలి’ అని బెల్లంకొండ సురేష్ ఫైర్ అయ్యారు. కాగా, ఇటీవల క్రాక్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను దిల్‌రాజు తనకు థియేటర్లు ఇవ్వడంలేదని మండిపడ్డ సంగతి తెలిసిందే. క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా తనకు థియేటర్లు ఇవ్వకుండా ‘మాస్టర్’ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇచ్చారని అసహనం వ్యక్తం చేశాడు. దిల్ రాజు నియంతలా వ్యవహరిస్తూ.. డిస్ట్రిబ్యూటర్స్‌ని బానిసలుగా చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. -
బాలీవుడ్‌లోకి క్రాక్.. హీరోగా సోనూసూద్!
‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్, రవితేజ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘క్రాక్’. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న విడుదలై ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అంతేకాదు కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేస్తుంది. కొత్త ఏడాది తొలి భారీ విజయం అందుకున్న ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయనున్నారట. ఇప్పటికే ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం పలువురు బాలీవుడ్ బడా నిర్మాతలు పోటీపడుతున్నట్లు తెలుస్తుంది. (చదవండి : ‘క్రాక్’ మూవీ రివ్యూ) ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రియల్ హీరోగా పేరొందిన సోనూసూద్ 'క్రాక్'ను బాలీవుడ్‌లోకి తీసుకెళ్లబోతున్నాడట. అంతేకాదు ఈ సినిమాను సోనూ సూద్ స్వయంగా నిర్మించబోతున్నారట.హిందీ రీమేక్ రైట్స్ కోసం ఇప్పటికే నిర్మాత బి.మధును సోనూ సూద్ సంప్రదించారని.. ప్రస్తుతం వారిద్దరి మధ్య బేరసారాలు జరుగుతున్నాయని వినికిడి. మరి ఈ వార్త నిజమే అయితే హీరోగా సోనూ సూద్ తొలి హిందీ చిత్రం ‘క్రాక్’ రీమేక్ అవుతుంది. అయితే, దీనికి గోపీచంద్ మలినేనిని దర్శకుడిగా తీసుకుంటాడా? లేక హిందీ పరిశ్రమకు చెందిన వారిని ఎంపిక చేసుకుంటాడా? అన్నది మాత్రం ఇంకా తెలియలేదు. కాగా, సోనూ సూద్ తెలుగులో తాజాగా ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో కనిపించారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. -
దిల్ రాజుపై ఫైరైన క్రాక్ డిస్ట్రిబ్యూటర్
సంక్రాంతి పండుగ అంటే పిండి వంటకాలు, కోళ్ల పందేలతో పాటు కొత్త సినిమాల సందడి కూడా. ముఖ్యమైన పండగ సీజన్లలో స్టార్ హీరోల సినిమాలతో థియేటర్లు నిండిపోతాయి. ఈ క్రమంలో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకక ఆయా సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బందులు పడతారు. అందుకే సంక్రాంతి, దసరా వంటి పెద్ద పండుగలు వస్తే చాలు థియేటర్ల ఇష్యూ ఎక్కువగా ఉంటుంది. బడా నిర్మాతలైన దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్‌ల గుప్పిట్లోనే ఎక్కువగా థియేటర్స్ ఉన్నాయంటూ చిన్న నిర్మాతలు ఆరోపిస్తుంటారు. వీరి వల్ల చిన్న సినిమాల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నామంటూ వాపొతుంటారు. ఈ నేపథ్యంలో ఈ పండగకు వరంగల్‌కు చెందిన క్రాక్ డిస్ట్రిబ్యూటర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఈ సంక్రాంతికి ముందుగా మాస్ మహారాజ రవితేజ ‘క్రాక్’ సినిమా విడులైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను డిస్ట్రిబ్యూట్ చేసిన ‘క్రాక్’ సినిమాకు సరైన థియెటర్లు ఇవ్వలేదంటూ వరంగల్‌కు చెందిన శ్రీను అనే డిస్ట్రిబ్యూటర్ నిర్మాత దిల్ రాజు తీరుపై మండిపడ్డారు. (చదవండి: కేక పుట్టిస్తోన్న ‘వకీల్ సాబ్’ టీజర్.. ఆ డైలాగ్‌లో..) ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. సంక్రాంతికి విడుదలైన రవితేజ క్రాక్ సినిమాకు మంచి టాక్ వచ్చిందని, బాగా నడుస్తోన్న ఈ చిత్రానికి థియేటర్లు బాగా తగ్గించేసి డబ్బింగ్ సినిమా అయిన విజయ్ ‘మాస్టర్’ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇచ్చారని దిల్ రాజుపై అసహనం వ్యక్తం చేశారు. అందుకే దిల్ రాజు పేరును కిల్ రాజుగా మర్చాలని మండిపడ్డారు. అయితే గతంలో హీరో రజినీకాంత్ ‘దర్బార్’ ‘పేట’ వంటి తమిళ డబ్బింగ్ సినిమాల విడుదలపై దిల్ రాజు సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా.. డబ్బింగ్ సినిమాలకు ఎలా థియోటర్లు ఇస్తామని ప్రశ్నించిన ఆయనే ఇప్పుడు ఇలా చేయడం సరికాదన్నారు. ఆయన మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా ‘క్రాక్’ వంటి తెలుగు సినిమాకు ప్రాధాన్యత ఇవ్వకుండా డబ్బింగ్ మూవీ ‘మాస్టర్’కు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ఆరోపించారు. తాను డిస్ట్రిబ్యూట్ చేస్తోన్న క్రాక్ సినిమాకు ఒకవేళ టాక్ బాగాలేకపోయినట్టైయితే.. తాను మాట్లాడేవాడిని కాదని, కానీ క్రాక్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ అనిపించుకుందన్నారు. అలాంటి మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమాను సడెన్‌గా థియేటర్స్లోంచి లేపేశారంటూ అతడు అవేదన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: థియేటర్‌కి వెళితే కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం) -
రవితేజ మొదటి రెమ్మూనరేషన్ ఎంతో తెలుసా!
మాస్ మహారాజ్ రవితేజ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘క్రాక్’. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక సినిమా సక్సెస్‌తో జోష్‌లో ఉన్న రవితేజ పలు ఇంటర్వ్యూ ఇస్తూ బిజీ అయిపోయారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆయనకు తన ఫస్ట్ రెమ్మూనరేషన్ ఎప్పుడు తీసుకున్నారనే ప్రశ్న ఎదురైంది. దీనికి మాస్ రాజా ‘నిన్నే పెళ్లాడతా సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిప్పుడు నా తొలి చెక్కును అందుకున్నాను. అప్పుడు 3500 రూపాయల చెక్కును హీరో నాగార్జున చేతుల మీదుగా తీసుకున్నాను. అదే నా మొదటి రెమ్యూనరేషన్ కావడంతో ఆ చెక్కుని చాలా కాలం వరకు భధ్రంగా దాచుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. (చదవండి: రవితేజ టాప్ ఫాంలో ఉన్నారు: రామ్‌చరణ్) అయితే ఓ సారి డబ్బులు అవసరం పడటంతో ఆ చెక్‌ను బ్యాంక్‌కు వెళ్లి మార్చేశానన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోగా రాణిస్తున్న రవితేజ తన కెరీర్ మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సహానటుడుగా పలు సినిమాల్లో కనిపించిన విషయం తెలిసిందే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమకు వచ్చిన రవితేజ మొదట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత సహానటుడుగా నటించి ఇప్పడు పరిశ్రమలో అగ్రహీరోగా రాణిస్తూ ఒక్కో సినిమా 10 కోట్ల రూపాయలకు మించి తీసుకుంటున్నారు. అంతేగాక టాలీవుడ్ మాస్మహరాజాగా తనకుంటూ ప్రత్యేక గుర్తింపును కూడా తెచ్చుకున్నారు. (చదవండి: రివ్యూ టైమ్: మాస్ మసాలా వయొలెంట్ క్రాక్) -
రవితేజ టాప్ ఫాంలో ఉన్నారు: రామ్‌చరణ్
‘క్రాక్’ చిత్రబృందంపై మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రశంసలు కురిపించారు. సినిమాను చాలా బాగా ఎంజాయ్ చేశానంటూ కితాబిచ్చారు. తన అభిమాన నటుడు రవితేజ ప్రస్తుతం టాప్ ఫాంలో ఉన్నారని, హీరోయిన్ శ్రుతి హాసన్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని ప్రశంసించారు. సముద్రఖని, వరలక్ష్మీశరత్ కుమార్ తమ నటనతో అదరగొట్టారన్నారు. ఇక థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందన్న చెర్రీ.. గోపీచంద్ సినిమాను తెరక్కించిన విధానం అద్భుతం అంటూ మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు స్పందించిన థమన్, డైరెక్టర్ గోపిచంద్ మలినేని రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. క్రాక్ సినిమాతో సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి బహుమతి అందించామని, ఇందుకు గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు.(చదవండి: ‘క్రాక్’ మూవీ రివ్యూ) కాగా మాస్‌రాజా రవితేజ, గోపీచంద్ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం క్రాక్. తొలుత సినిమా విడుదలలో కాస్త జాప్యం నెలకొన్నప్పటికీ అన్ని అవాంతరాలు దాటుకుని రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఇక ఇప్పుడు రామ్‌చరణ్ కూడా ఈ సినిమా గురించి సానుకూలంగా స్పందించడంతో థాంక్స్ అన్నా అంటూ అభిమానం చాటుకుంటున్నారు. కాగా సినిమా రిలీజ్‌కు ముందు మెగా కాంపౌండ్ హీరోలు వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ కూడా రవితేజకు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. Enjoyed #Krack a lot! My fav @RaviTeja_offl garu in top form! @shrutihaasan was at her best. @thondankani & @varusarath5 pulled off their characters with ease. @MusicThaman's BG score held the movie very well! Your execution is top-notch @megopichand. Congrats to the entire team — Ram Charan (@AlwaysRamCharan) January 13, 2021 -
సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది అదే : శ్రుతీహాసన్
‘‘కరోనా అందరినీ చాలా ఒత్తిడికి గురి చేసింది. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఇబ్బంది పెట్టింది. ప్రస్తుతం షూటింగ్స్ని కష్టంగా, కాస్త రిస్క్‌తో చేస్తున్నాం. సినిమా వాళ్లందరం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రేక్షకులు కూడా సినిమాను సపోర్ట్ చేయడానికి రెడీగా ఉండటం చాలా సంతోషంగా అనిపిస్తోంది’’ అన్నారు శ్రుతీహాసన్. రవితేజ, శ్రుతి జంటగా నటించిన ‘క్రాక్’ గత శుక్రవారం రిలీజైంది. మూడేళ్ల తర్వాత తెలుగు తెరపై కనిపించిన శ్రుతీహాసన్ చెప్పిన విశేషాలు. (వారికి బాగా డబ్బులు రావాలి : రవితేజ ) చాలామంది ఇది కమ్‌బ్యాక్ అంటున్నారు. కానీ నేను కమ్బ్యాక్లా భావించడం లేదు. వర్క్ నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నాను. సినిమాలు చేయలేదు కానీ మ్యూజిక్ మీద మరింత శ్రద్ధ పెట్టాను. అలానే కొంచెం గ్యాప్ వచ్చింది కదా ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అని కాస్త టెన్షన్ అనిపించింది. కానీ ఎప్పటిలానే ప్రేమను, అభిమానాన్ని చూపిస్తున్నారు. ఈ మూడేళ్లలోనూ ఎప్పటికప్పుడు నాకు ప్రేమతో మెసేజ్‌లు పంపుతూనే ఉన్నారు. ప్రేక్షకులకు నా మీద ఉన్న ఆ ప్రేమ అలానే ఉంది. ‘క్రాక్’లో భాగమవ్వడం సంతోషంగా అనిపించింది. ‘బలుపు’ తర్వాత గోపీచంద్ మలినేని, రవితేజగారితో కలసి పని చేయడం మంచి అనుభవం. నా పాత్రను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. నా పాత్రలో ఉన్న షేడ్స్‌ను షూటింగ్ అప్పుడు నేనూ బాగా ఎంజాయ్ చేశాను. ‘క్రాక్’ సమ్మర్లో రిలీజ్ కావాల్సింది. సడెన్‌గా కరోనా వైరస్ వచ్చింది. కానీ ప్రతీది ఓ కారణంతోనే జరుగుతుందేమో? థియేటర్స్‌కి ఆడియన్స్ వస్తారా? రారా? అని ఎక్కువ ఆలోచించలేదు. ఎందుకంటే మనం కష్టపడి పని చేస్తే దేవుడు, ప్రేక్షకులు చూసుకుంటారు అనుకున్నాను. అలానే జరిగింది. లాక్డౌన్లో సుహాసినీగారి దర్శకత్వంలో ‘పుత్తమ్ పుదు కాలై’ అనే తమిళ ప్రాజెక్ట్ చేశాను. చిత్రీకరణ స్టార్ట్ అయ్యే ముందు మాస్క్ ఉందా? మొత్తం సేఫ్‌గా ఉన్నామా? అంటూ ఏదేదో ఆలోచించాను. కానీ నా పాత్రలోకి వెళ్ళిపోగానే ఇవేం పట్టించుకోలేదు. ఆ ప్రపంచంలోకి వెళ్లిపోయాను.కొత్త సంవత్సరం ప్రత్యేకంగా నిర్ణయాలేమీ తీసుకోలేదు. ప్రతీ ఏడాదిలానే కష్టపడి పనిచేయాలి. మునుపటి కంటే నన్ను నేను మెరుగుపరుచుకోవాలి. మరింత సంతోషంగా ఉండాలి. సంక్రాంతి అనే కాదు ఏ పండగనూ ఎక్కువగా జరుపుకోను. కానీ సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది మాత్రం ఫుడ్. చాలా రకాల వంటకాలు చేస్తారు ఇంట్లో. అలానే సంక్రాంతి అంటే చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ విశాలం ఆంటీ దగ్గరకు వెళ్లేదాన్ని. అక్కడ సంక్రాంతి జరుపుకునేవాళ్లం. ఇటీవలే ‘వకీల్‌సాబ్’ పూర్తి చేశాను. ఇందులో నాది గెస్ట్ రోల్. అలానే హిందీలో, తమిళంలో సినిమాలు చేస్తున్నాను. అన్ని ఇండస్ట్రీలను బ్యాలెన్స్ చేస్తున్నాను. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో వెబ్‌కి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. (సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. గెలిచేదెవరు? ) -
రివ్యూ టైమ్: మాస్ మసాలా వయొలెంట్ క్రాక్
చిత్రం: క్రాక్; తారాగణం: రవితేజ, శ్రుతీహాసన్; నిర్మాత: బి. మధు; కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని; రిలీజ్: జనవరి 9. ఎట్టకేలకు సంక్రాంతి సినిమా సీజన్ మొదలైంది. థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీతోనే కరోనా కాలంలోనూ సందడి షురూ అయింది. ఈ సంక్రాంతికి తొలి భారీ కానుకగా రవితేజ ‘క్రాక్’ థియేటర్లలో పలకరించింది. ఆర్థిక వివాదాలతో తొలి రోజు సెకండ్ షో నుంచి కానీ ఆటలు పడలేదు. ఆట పడుతుందని పొద్దుటి నుంచి పదే పదే హాళ్ళకు వచ్చి, తిరిగెళ్ళిన జనాన్ని బట్టి చూస్తే, అనుకున్నట్టు రిలీజై ఉంటే, రవితేజ కెరీర్లో ‘క్రాక్’ బిగ్గెస్ట్ ఓపెనింగ్ అయ్యుండేదని ట్రేడ్ టాక్. పోలీస్ యాక్షన్ చిత్రాలు వెండితెరకు కొత్త కాదు కానీ, హాళ్ళు లేక, సినిమాలు లేక జనం ముఖం వాచిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి పక్కా ఊర మాస్ కథ కచ్చితంగా కలిసొచ్చే అంశమే. ఒకింత హింస పాలు ఎక్కువే అయినా, రీలు రీలుకీ ఫైట్లు, మాస్ మెచ్చే పాటలతో ఓ కథ తెరపైకి రావడం పండగ వేళ బాక్సాఫీస్‌కు బలం చేకూర్చే విషయం. కథేమిటంటే..: కర్నూలుకొచ్చిన తీవ్రవాది సలీమ్ భత్కల్కీ, ఒంగోలు జనాన్ని గడగడలాడించే కఠారి కృష్ణ (సముద్రఖని)కీ, కడపలోని గూండా కొండారెడ్డి (పి. రవిశంకర్)కీ ఒకడే శత్రువు – బదిలీల మీద ఊళ్ళు తిరిగిన పోలీస్ సి.ఐ. శంకర్ (రవితేజ). యాభై రూపాయల నోటు, మామిడి కాయ, మేకు – ఈ మూడింటికీ, ఆ ముగ్గురు విలన్ల కథలకూ ఓ లింక్ ఉంటుంది. ఆ లింకేమిటి, వారితో హీరో ఎలా డీల్ చేశాడన్నది ఈ పక్కా మాస్ యాక్షన్ ఫిల్మ్. ఎలా చేశారంటే..: ఈ సినిమాలో రవితేజ ఎప్పటిలానే హుషారైన యాక్షన్, డ్యాన్సులతో కనిపిస్తారు. ఆయన పోషించిన పోలీస్ ఇన్స్పెక్టర్ పోతరాజు వీరశంకర్ మాస్ పాత్ర చూడగానే, అనివార్యంగా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళతాం. దశాబ్దం పై చిలుకు క్రితం రాజమౌళి దర్శకత్వంలో రవితేజ నటించిన ‘విక్రమార్కుడు’ చిత్రం ఛాయలు ఈ పాత్రలో, పాత్రపోషణలో వద్దనుకున్నా కనిపిస్తాయి. కఠారి కృష్ణగా సముద్ర ఖని, అతని నెచ్చెలి జయమ్మగా వరలక్ష్మీ శరత్ కుమార్ బాగున్నారు. చాలాకాలం తరువాత తెలుగులో కనిపించిన హీరోయిన్ శ్రుతీహాసన్‌ది పరిమితమైన పాత్ర. దానికి తగ్గట్టే నటన. ఎలా తీశారంటే..: మాస్ యాక్షన్ ఎనర్జీతో వెండితెరను వెలిగించే రవితేజకు ‘రాజా ది గ్రేట్’ (2017) తరువాత సరైన బాక్సాఫీస్ హిట్ లేదు. ఆ కొరత క్రాక్ తీర్చే ఛాన్స్ పుష్కలం. ‘డాన్ శీను’, ‘బలుపు’ తరువాత దర్శకుడు గోపీచంద్ మలినేనితో రవితేజ చేసిన మూడో సినిమా ఇది. ఒంగోలు ప్రాంతానికి చెందిన దర్శకుడు గోపీచంద్ మలినేని అక్కడ చిన్నప్పుడు కథలు కథలుగా విన్న సంఘటనల్ని ఏర్చికూర్చి, సినిమాటిక్‌గా అల్లుకున్నారు. విజయ్ సేతుపతి తమిళ చిత్రం ‘సేతుపతి’ స్ఫూర్తీ కనిపిస్తుంది. హీరో వెంకటేశ్ వాయిస్ ఓవర్‌తో మొదలయ్యే కథ మధ్యలో అక్కడక్కడే తిరుగుతూ, సెకండాఫ్‌కు వచ్చేసరికి సాగదీత అనిపిస్తుంది. కత్తెరకు కొంత పదును పెట్టలేదనీ కనిపించేస్తుంది. అయినా సరే, ఆడియన్స్‌ను కదలకుండా కూర్చోబెట్టడం దర్శకుడి కథన విశేషం. రామజోగయ్య శాస్త్రి రాసిన ‘భల్లేగా తగిలావే బంగారం...’ పాట (గానం – అనిరుధ్ రవిచంద్ర), అలాగే జానీ మాస్టర్ సారథ్యంలోని ఐటమ్ సాంగ్ ‘భూమ్ బద్దలు నా ముద్దుల సౌండు...’ (గానం – మంగ్లీ, సింహా, శ్రీకృష్ణ) కథలో భాగంగా, మాస్‌ను ఆకట్టుకుంటాయి. బుర్రా సాయిమాధవ్ రాసిన డైలాగులూ ఆ కోవలోనే మెరుస్తాయి. తమన్ నేపథ్య సంగీతం అడపాదడపా పరిమితి దాటినా, మొత్తం మీద మూడ్‌ను క్యారీ చేస్తుంది. రామ్ – లక్ష్మణ్ ఫైట్లు మరో ప్లస్ పాయింట్. జి.కె. విష్ణు కెమేరా పనితనంలో నైట్ ఎఫెక్ట్‌లో బస్ స్టాండ్ లో జరిగే ఫైటు, అలాగే బీచ్‌లో ఫైటు థ్రిల్ చేస్తాయి. కథాకాలమేదో స్పష్టంగా చెప్పని ఈ సినిమాలో – గాడిద రక్తం తాగి, హత్యలకు దిగే వేటపాలెం బ్యాచ్, వారి ప్రవర్తన – ఒకప్పటి వాస్తవమే అయినా, ఇప్పుడు బీభత్సంగా కనిపిస్తుంది. తెరపై యథేచ్ఛగా హింస కనిపించే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్లో ‘ఎ’ బదులు, ‘యు/ ఎ’ అని పడిందేమో అనిపిస్తుంది. దర్శక, రచయితలు సహజంగానే హీరో ఎలివేషన్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. సినిమాలో ఒకటికి మూడు కథలున్నాయి. అన్ని కథలనూ చెప్పే క్రమంలో కఠారి కృష్ణ పాత్రకే తప్ప మిగతా ఇద్దరు ప్రత్యర్థి పాత్రలూ సమగ్రమైన ఫీలింగ్ రాదు. ఆసక్తిగా మొదలైన మూడు కథల కాన్సెప్ట్ పెరిగిన నిడివితో, ఆఖరులో ఆశించిన తృప్తినివ్వకుండా ముగిసిందనిపిస్తుంది. అయితేనేం, పండగకు వినోదం కోసం వెతుకులాటలో ఉన్నవారిని అవన్నీ మరిచిపోయేలా చేస్తుంది. కొసమెరుపు: ఒకే టికెట్ పై ముగ్గురు విలన్ల ఊర మాస్ జాతర బలాలు: ⇔ ఊపిరి సలపనివ్వని మాస్ కథ, కథనం ⇔ రవితేజ హుషారైన యాక్షన్, డ్యాన్సులు ⇔ వినూత్నమైన ఫైట్లు, రీరికార్డింగ్ మెరుపులు బలహీనతలు: ⇔మితిమీరిన హింస ⇔ సాగదీతకు గురైన కథ, క్లైమాక్స్ ⇔ హీరోయిన్ ట్రాక్ పక్కాగా సెట్ కాకపోవడం -
‘క్రాక్’ మూవీ రివ్యూ
టైటిల్ : క్రాక్ జానర్ : యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : రవితేజ, శ్రుతీహాసన్, వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని, సుధాకర్ కోమాకుల, వంశీ, రవి శంకర్, సప్తగిరి తదితరులు నిర్మాణ సంస్థ : సరస్వతి ఫిలిం డివిజన్ నిర్మాత : ‘ఠాగూర్’మధు దర్శకత్వం : గోపీచంద్ మలినేని సంగీతం : తమన్ ఎస్ సినిమాటోగ్రఫీ : జీకే విష్ణు ఎడిటర్ : నవీన్ నూలి విడుదల తేది : జనవరి 9, 2021 మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ఆడలేదు. 'రాజా ది గ్రేట్' తర్వాత ఆయన ఖాతాలో బిగ్ హిట్ మూవీ పడిందే లేదు. గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించిన 'డిస్కో రాజా' ప్రయోగం కూడా విఫలమైంది. ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు రవితేజ. ఇందులో భాగంగానే తనకు గతంలో 'డాన్ శ్రీను', 'బలుపు' లాంటి సూపర్ హిట్లు ఇచ్చిన యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో జత కట్టి 'క్రాక్' అనే మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు, పాటలు సినిమాపై పాజిటీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. దీంతో ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా నేడు ‘క్రాక్’ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా రవితేజను హిట్ ట్రాక్ ఎక్కించిందా?, గోపిచంద్ మలినేని, రవితేజ కాంబో హ్యాట్రిక్ విజయం సాధించిందా?, నిజ జీవిత కథలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారు? అనేది రివ్యూలో చూద్దాం. కథ పోత రాజు వీర శంకర్ (రవితేజ) ఒక క్రేజీ పోలీసు. బ్యాగ్రౌండ్ అని ఎవడైనా విర్రవీగితే చాలు వాళ్ల బరతం పడతాడు. ఇలా వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేరస్థులతో తనదైనశైలీలో సీఐ వీర శంకర్ వైరం పెట్టుకుంటాడు. వారిలో ఒంగోలుకు చెందిన కటారి (సముద్రఖని ) అత్యంత శక్తివంతమైనవాడు. అతను అంటే చుట్టుపక్కల 20 ఊర్లకు భయం. అలాంటి వ్యక్తిపై వీరశంకర్ తిరుగుబాటు చేస్తాడు. తన సహోద్యోగి కొడుకు చావుకు కారణాలు తెలుసుకునే క్రమంలో కటారితో వైరం మరింత పెరుగుతుంది. ఈ క్రమంలో వీరశంకర్‌ని చంపడానికి కటారి రకరకలా ప్లాన్ వేస్తాడు. మరి కటారి, వీర శంకర్ ల మధ్య అసలు ఏమి జరిగింది ?, చివరకు వీరశంకర్ ఏమి చేశాడు ? అనేది మిగిలిన కథ. నటీనటులు మాస్ అనే పదానికి పర్యాయపదంలా కనిపిస్తాడు రవితేజ. ఆయన సినిమాలో కథ మొత్తం అతని చుట్టే తిరుగుతుంటుంది. ఇక ఈ సినిమాలో కూడా ఆయన వన్ మ్యాన్ షో నడిచింది. మాస్ మహారాజాలోని ఫైర్‌ను మరోసారి మనం తెరపై చూడొచ్చు. రవితేజ అభిమానులకు అయితే కన్నులపండువలా ఉంటుంది. ఎనర్జీతో పాటు స్టైలిష్‌గా కూడా కనిపించారు. సీఐ పోత రాజు వీర శంకర్ అనే పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర రవితేజ ఒదిగిపోయాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కందాలపై నడిపించారు. అలాగే జయమ్మ అనే నెగెటివ్ పాత్రలో వరలక్ష్మీ శరత్‌కుమార్ మెప్పించారు. రవితేజ తరవాత సినిమాలో బాగా పండిన పాత్ర సముద్రఖనిది. ’కఠారి‘ అనే విలన్ పాత్రకు ఆయన జీవం పోశాడు. తన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. శృతీహాసన్, సుధాకర్,రవి శంకర్, తమ పాత్రల పరిధి మేర నటించారు. విశ్లేషణ రియల్ క్యారెక్టర్స్‌ను కమర్షియల్ సినిమాలోకి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ‘క్రాక్’. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశారు. మాస్ ఆడియన్స్‌కి నచ్చే సినిమా తీయాలనేది దర్శకుడి మెయిన్ టార్గెట్ అనేది సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే అర్థమవుతంది. మావిడికాయలో మేకు గుచ్చి, ఒక యాభై రూపాయల నోటుపై దానిని పెట్టి... కథ మొదలు పెట్టినపుడు ఇదంతా కాస్త సిల్లీగా అనిపిస్తుంది. కానీ సినిమా కథ మొత్తం అదే అని చెబుతూ.. తెరపై చూపించిన విధానం కాస్త కొత్తగా అనిపిస్తుంది. మొత్తానికి దర్శకుడు ఎదో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. కథ నేపథ్యాన్ని హీరో వెంకటేశ్‌తో చెప్పించడం, వేటపాలెం బ్యాచ్ ఒకటి బీచ్‌లో ఇసుకలోంచి బయటకు వచ్చి... గాడిద రక్తం తాగేసి అరగడం కోసం అటు ఇటు పరుగెత్తడం ప్రేక్షకులను కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే కొన్ని సీన్లు మాత్రం కాస్త సిల్లీగా అనిపిస్తుంది. ఇస్త్రీ బట్టలు తీసుకెళుతున్న మహిళ చేతిలోంచి జారి పడ్డ బట్టల్లో బురఖా జారి పడడం చూసి హీరో వెళ్లి ఒక టెర్రరిస్టుని పట్టుకోవడం, అలాగే మెయిన్ విలన్ కేసుకు సంబంధించి పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ వెతుకుతుండగా, అది గోడ మీద నుంచి జారిపడడం అంత కన్వీనియంట్‌గా అనిపించదు. అలాగే సినిమా కథ కూడా కాస్త రొటీన్‌గా సాగుతుంది. నెక్ట్ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఈజీగా గెస్ చెయ్యగలడు. కానీ రోటీన్ కథని దర్శకుడు తెరపై చూపించే విధానం చాలా బాగుంది. ఇక హీరో, హీరోయిన్స్ రొమాంటిక్ ట్రాక్ సైతం పండలేదు. శ్రుతి హాసన్ మంచి సినిమాతోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది, కానీ పాపం, ఆమె మాత్రం పాటలకు మరియు కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం అయిపొయింది. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం సంగీతం. తమన్ తన పాటలతో పాటు.. బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో మ్యాజిక్ చేశాడు. తనదైన బిబీఎంతో యాక్షన్ సీన్లకు ప్రాణం పోశాడు. ఇక రామ్‌లక్ష్మణ్ పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. ఫైట్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సినిమాలో రవితేజ విలన్స్ కి మధ్య జరిగే పోరాటాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయి. యాక్షన్ సీన్లు అన్ని మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. జీకే విష్ణు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు కథానుసారం బాగున్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే సంక్రాంతి సందర్భంగా రవితేజ తన ఫ్యాన్స్‌కి మాస్ మసాలా బిర్యానీని అందించాడు. ప్లస్ పాయింట్స్ : రవితేజ నటన, వరలక్ష్మీ శరత్‌కుమార్, సముద్రఖని పాత్రలు తమన్ మ్యూజిక్ విలన్లకు, హీరోకి మధ్య జరిగే యాక్షన్ సన్నివేశాలు మైనస్ పాయింట్స్ రొటీన్ కథ ఫస్టాఫ్ ఫ్యామిలీ సీన్స్ అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రవితేజ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్; థియేటర్లలో క్రాక్
పక్కా కమర్షియల్ మాస్ ఫిల్మ్ 'క్రాక్' సినిమా రిలీజ్‌కు అడ్డంకులు తొలిగిపోయాయి. సినిమా ఉంటుందో, ఉండదో అన్న అనుమానంలో కొట్టుమిట్టాడుతూ, థియేటర్ల ఎదుటే పడిగాపులు కాస్తున్న అభిమానులకు దర్శకుడు గోపీచంద్ మలినేని శుభవార్త చెప్పారు. అన్ని సమస్యలు తొలిగాయని, దగ్గర్లోని థియేటర్‌కు వెళ్లి నేటి సాయంత్రమే ఫస్ట్ షో చూసేయండని పిలుపునిచ్చారు. దీంతో మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫలితం దక్కినట్లైంది. కొంచెం లేటయ్యిందేమో కానీ కలెక్షన్ల వర్షం పక్కా అంటూ థియటర్ల ముందు బారులు తీరుతున్నారు. పొద్దున టికెట్ క్యాన్సల్ అయినవాళ్లు కూడా ఈ మాస్ చిత్రాన్ని చూసేయాల్సిందేనంటూ థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు 'లేటుగా వచ్చినా లేటెస్ట్గా వస్తాడు. అన్నా కుమ్మేయ్.. కిక్కు వెయిటింగ్‌లోనే ఉంటుంది' అని హీరో మంచు మనోజ్ క్రాక్ సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. పలువురు దర్శకనిర్మాతలు కూడా కొత్త సంవత్సరంలో రిలీజవుతున్న తొలి భారీ చిత్రాన్ని చూసేయండని పిలుపునిస్తున్నారు. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాను సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించాడు. (చదవండి: క్రాక్’ వాయిదా.. నిర్మాతపై రవితేజ సీరియస్!) All problems solved for #Krack release. 🔥🔥👍👍 Let's get Krackified from today's first shows. 💥 Watch it now in your nearest theaters!! pic.twitter.com/50y8HzFLqR — Gopichandh Malineni (@megopichand) January 9, 2021 -
‘క్రాక్’ వాయిదా.. మధుపై రవితేజ సీరియస్!
‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం కావడంతో ‘క్రాక్’. చాలా రోజుల తర్వాత థియేటర్లలో తమ అభిమాన హీరో సినిమా చుద్దామనుకున్న మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్‌కు శనివారం నిరాశ ఎదురైంది. కరోనాని సైతం లెక్కచేయకుండా ఉదయమే థియేటర్లకు వచ్చిన ఫ్యాన్స్ దారుణంగా మోసపోయారు. తమ అభిమాన హీరోని ఈ రోజు బిగ్‌స్రీన్‌పై చూడలేమనే వార్త విని నిరాశలో మునిగిపోయారు. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌లను షాకయ్యారు. ఇక మార్నింగ్ షో పోతే పోనిలే.. మాట్నీస్ నుంచి అయినా ఎంజాయ్ చేద్దామకున్న అభిమానులకు.. ఆ అవకాశం కూడా దక్కలేదు. ‘క్రాక్’ సినిమా ఈ రోజు విడుదల కాదంటూ చావు కబురును చల్లగా అందించారు చిత్రబృందం. దీంతో ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా నిరాశలో మునిగిపోయారు. ఈ ఏడాది విడుదల అవుతున్న తొలి భారీ సినిమా కావడంతో క్రాక్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కరోనా కాలంగా ఇన్నాళ్ల థియేటర్లకు దూరంగా ఉన్న సినీ అభిమానులు సైతం.. మాస్ మహారాజా సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూశారు. దాదాపు 1000 థియేటర్లలో క్రాక్ బొమ్మ కనిపించింది. పైగా ఇటీవల విడుదలైన ట్రైలర్, పాటలకు పాజిటివ్ టాక్ రావుడంతో రవితేజ ఫ్యాన్స్ పుల్ హ్యాపీతో థియేటర్లకు వెళ్లారు. ఇక తమ హీరో సినిమాకి పోటీగా ఇప్పట్లో ఏ సినిమాలు లేవని, కలెక్షన్ల వర్షం కురవడం ఖాయామని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అలాంటి సమయంలో అనుకోకుండా సినిమా వాయిదా పడటంతో అభిమానులు మాత్రమే కాదు.. రవితేజ కూడా హర్ట్ అయ్యాడని తెలుస్తుంది. నిర్మాత ఠాగూర్ మధు తీరు పట్ల రవితేజ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ముందే ఇవన్నీ చూసుకోకపోతే ఎలా అంటూ సీరియస్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. చిన్న పొరపాటు వల్ల భారీ నష్టాలు వస్తాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. వీలైనంత త్వరగా ఆర్థిక ఇబ్బందులను తొలగించి సినిమా విడుదలయ్యేలా చూడాలని నిర్మాతలకు రవితేజ గట్టిగానే సూచించినట్లు తెలుస్తుంది. నిర్మాత మధు డిస్టిబ్యూటర్లతో ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు పూర్తవకపోవడం వల్లే సినిమా వాయిదా పడినట్లు సమాచారం. అలాగే మధు గతంలో నిర్మించిన చిత్రాలకు సంబందించి డిస్టిబ్యూటర్లతో ఒప్పందం చేసుకున్న డబ్బును అందించలేదని, అందుకే వారంతా కోర్టుకు వెళ్లి సినిమా వాయిదా వేయించారని తెలుస్తోంది. ఏదేమైనా.. నిర్మాత తప్పిదానికి రవితేజ బలి అవుతున్నారని మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాయిదా ఎఫెక్ట్.. కలెక్షన్ల మీద పడుతుందని భయపడుతున్నారు. ఈ ఆలస్యం ‘క్రాక్’ కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో త్వరలోనే తెలుస్తుంది. -
రవితేజ సినిమా.. పదే పదే క్యాన్సిల్ ఎందుకు?
మాస్ మహారాజ్ రవితేజ, శ్రుతీహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘క్రాక్’.. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 9న అంటే ఈ రోజు థియేటర్లలో విడుదల కానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 1000 థియేటర్లలో ప్రదర్శించబడేందుకు సిద్ధంగా ఉంది. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో రవితేజ ఉన్నారు. క్రాక్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇలాంటి సమయంలో ఈ సినిమా విడుదల ఆగిపోయింది. ఈ విషయాన్ని థియేటర్ల యజమానులు ట్విటర్ వేదికగా తెలియజేశారు. వాస్తవానికి శుక్రవారం రాత్రి అంటే 8వ తేదీనే అమెరికాలో ప్రీమియర్స్ పడాలి. కానీ, అనివార్య కారణాల వల్ల అవి కాస్తా రద్దు అయ్యాయి. అలాగే, మార్నింగ్ షో విషయాలోనూ సందిగ్ధత నెలకొంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు రవితేజ అభిమానులు. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. అమెరికాలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ‘క్రాక్' మార్నింగ్ షో రద్దయ్యింది. మరీ ముఖ్యంగా మల్టీఫ్లెక్స్ యాజమాన్యాలు చివరి నిమిషంలో చేతులెత్తేసినట్లు ప్రచారం జరుగుతోంది. డిస్టిబ్యూటర్లతో ఫైనాన్షియల్ సెటిల్మెంట్లు పూర్తవకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు సమాచారం. దీనిపై మాస్ మహారాజా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఫైనాన్సియల్ క్లియరెన్స్ అయిపోయిందని.. 9 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో షోలు పడతాయని ‘క్రాక్’ పీఆర్ టీమ్ తొలుత స్పష్టం చేసింది. అంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ థియేటర్లలో ఉదయం 11 గంటల షోకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఫ్యాన్స్ భావించారు. కానీ ఆ షో పడలేదు. మధ్యాహ్నం రెండు గంటలకు ‘ప్రెస్ షో’ వేయనున్నట్లు మరొకసారి పీఆర్ టీమ్ తెలిపింది. షో ఆలస్యం అయినందుకు చింతిస్తున్నామని, ఈ విషయంలో సహకరించిన మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పీఆర్ఓ వంశీ శేఖర్ పేర్కొన్నారు. ‘డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన చిత్రం కావడంతో ‘క్రాక్’పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో రవితేజ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుండగా.. నాలుగేళ్ళ తర్వాత శ్రుతీ హాసన్ టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తోంది. రవితేజ పోలీస్ క్యారెక్టర్ చేయడం, ట్రైలర్ అద్భుతంగా ఉండటంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని విలన్ పాత్ర పోషించారు. వరలక్ష్మీ శరత్‌కుమార్ మరో కీలక పాత్రలో నటించారు. -
సంక్రాంతిని ముందే తెస్తున్నాం
‘‘రవితేజగారితో ఇంతకుముందు ‘డా¯Œ శీను, బలుపు’ వంటి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాను. ప్రస్తుతం రియలిస్టిక్ స్టోరీస్‌కి మంచి ఆదరణ లభిస్తుండటంతో మూడో చిత్రంగా ఒక రియలిస్టిక్ అప్రోచ్‌తో సినిమా చేస్తే బాగుంటుందనిపించి ‘క్రాక్’ చేశా’’ అని డైరెక్టర్ గోపీచంద్ మలినేని అన్నారు. రవితేజ, శ్రుతీహాసన్ జంటగా, సముద్రఖని, వరలక్ష్మీ శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్రాక్’. బి. మధు నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని చెప్పిన విశేషాలు. ► రియల్ క్యారెక్టర్స్‌ను కమర్షియల్ సినిమాలోకి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి తీసిన సినిమా ‘క్రాక్’. నేను చదువుకునే రోజుల్లో ‘ఒంగోలులో రాత్రి కరెంట్ పోతే హత్య జరుగుతుంది’ అని చెప్పుకునే వారు.. మా ఊరి దగ్గరలో కొంతమంది గాడిద రక్తం తాగేవారు. అలా తాగిన తర్వాత ఒళ్లంతా చెమటలు పట్టేలా పరిగెత్తకపోతే రక్తం గడ్డకట్టుకు పోతుందని కొద్దిసేపు వేగంగా పరిగెత్తే వారు. అలా చేస్తే బాడీ స్ట్రాంగ్‌గా తయారవుతుందని వాళ్ల నమ్మకం. అలాంటి కొన్ని అంశాలకు ఒంగోలులో జరిగే మర్డర్స్‌కి లింక్ చేస్తూ థ్రిల్లింగ్‌గా కథ రాసుకున్నాం. ► 2021లో సంక్రాంతికి వస్తోన్న మొదటి చిత్రం మాదే కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాని 2019 మే 8న విడుదల చేద్దామనుకున్నాం. కరోనా ప్రభావం వల్ల వాయిదా వేశాం. అయితే ఒక మంచి సినిమా పండగకి రావాలని రాసిపెట్టిందేమో.. కాకపోతే ఈసారి సంక్రాంతిని కొంచెం ముందుగానే మీ ముందుకు తీసుకువస్తున్నాం. రవితేజగారి కెరీర్లో అత్యధికంగా 1000కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది. ► ఒక సీఐ పాత్రని స్ఫూర్తిగా తీసుకుని రవితేజగారి పాత్ర తీర్చిదిద్దాను. కర్నూల్ నేపథ్యం కూడా సినిమాలో ఉంటుంది. కామెడీ, యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రమిది. ‘బలుపు’ తర్వాత రవితేజగారు అంత అందంగా, ఎనర్జిటిక్‌గా కనిపించిన చిత్రమిదే. ‘మెర్సల్, బిగిల్’ ఫేమ్ జీకే విష్ణుగారు ఈ సినిమాతో తెలుగు పరిశ్రమకు సినిమాటోగ్రాఫర్‌గా పరిచయమవుతున్నారు. ► ఈ సినిమాలో హీరో కొడుకు పాత్రలో మా అబ్బాయి సాత్విక్ నటించాడు.. కావాలని తీసుకోలేదు.. ఆ పాత్రకు సరిపోతాడనే తీసుకున్నాం. సముద్రఖని, వరలక్ష్మి పాత్రలు బాగుంటాయి. నేను అసోసియేట్‌గా ఉన్నప్పుడు మణిశర్మగారి దగ్గర పని చేసేవాడు తమన్. అప్పటి నుండి మా ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది. నా సినిమా అంటే తమన్ కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటాడని నేను నమ్ముతాను. ► ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుదలై బాగా ఆడటం దేశమంతా హాట్ టాపిక్ అయింది. తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాని ఎంత ఇష్టపడతారనేది నిరూపితం అయింది. ఈ సంక్రాంతికి వచ్చే అన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరిస్తారనుకుంటున్నాను. నా తర్వాతి చిత్రం మైత్రీ మూవీ మేకర్స్‌లో ఉంటుంది. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.