పెడదోవ పట్టే మార్గాలను ప్రోత్సహించం: సీఎం
సాక్షి, విశాఖపట్నం: ‘‘కొందరు లేనిపోని సమస్యలు సృష్టిస్తున్నారు. ప్రపంచం లోనే పెద్ద ఎత్తున బికినీలతో లవ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వాటికి విశాఖపట్నంలో ఆస్కారం ఇచ్చే సమస్యే లేదు. మన కల్చర్‌కు వ్యతిరేకంగా, మన సంప్రదాయాలకు విరుద్ధంగా, యువత పెడదోవ పట్టే మార్గాలను ప్రోత్సహించం.
అదే సమయంలో మనకుండే వనరులను సమర్థంగా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ టూరిజాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందరినీ గౌరవిస్తాం తప్ప ఎవరికీ ఇబ్బంది కలిగే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకురాదు’’ అని బాబు అన్నారు. ఆయన గురువారం విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు.