Maharashtra Assembly Election 2024
-
‘మహాయుతి’ సీఎం ఎన్నికపై ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు
ముంబయి:మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం,బీజేపీ సీనియర్‌నేత దేవేంద్ర ఫడ్నవిస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం(నవంబర్23) మీడియాతో మాట్లాడారు.‘మహాయుతి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.ముఖ్యంగా మహిళా ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు మహారాష్ట్ర అంతా ఒక్కటిగా ఉంది.మహారాష్ట్ర మొత్తం మోదీ వెంట నిలిచింది. సీఎం పదవిపై మహాయుతి కూటమిలో ఎలాంటి గొడవ లేదు.పరస్పర అంగీకరాంతో సీఎంను ఎన్నుకుంటాం.షిండే శివసేననే అసలు శివసేన అని ప్రజలు తీర్పిచ్చారు. ఈవీఎంలు ఒక్క మహారాష్ట్రలోనే ఎలా ట్యాంపర్ అవుతాయో ఝార్ఖండ్‌లో ఎందుకవవో విపక్షాలే చెప్పాలి’అని ఫడ్నవిస్ ఎద్దేవా చేశారు. -
Devendra Fadnavis: నాడు శపథం చేసి.. నేడు సీఎం రేసులో ముందంజలో..
మహారాష్ట్రకి ఒకసారి ముఖ్యమంత్రిగా పని చేసి.. మరోసారి అధికారం అంచుల దాకా తీసుకెళ్లి.. చివరకు పార్టీ కోసం సీఎం పదవిని సైతం త్యాగం చేశాడన్న పేరు ఉంది దేవేంద్ర ఫడ్నవిస్‌కు. మహారాష్ట్ర ఫలితాల వేళ.. సీఎం రేసులో మొదట వినిపించిన పేరు ఈయనదే. అలాగే.. ఈయనకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ట్రెండింగ్లోకే వచ్చింది. ‘‘నా నుంచి బొట్టుగా నీరుపడుతోందని.. ఇల్లు కట్టుకోవాలని చూడకండి. నేనొక మహాసముద్రాన్ని.. కచ్చితంగా తిరిగి వస్తా.. అంటూ అసెంబ్లీలో ఆయన మాట్లాడిన ఐదేళ్ల కిందటి నాటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.महाराष्ट्र चुनाव के नतीजों के बाद ये वीडियो आज चर्चा में हैंठीक 5 साल पहले देवेंद्र फड़नवीस ने कहा था: मेरा पानी उतरता देखमेरे किनारे पर घर मत बसा लेनामैं समंदर हूँलौटकर वापस आऊँगा#DevendraFadnavis Aditya Thackeray #महाराष्ट्र संजय राउत Ajit Pawar EVMS #ToxicTheMovie pic.twitter.com/KQNhzdalrg— political voices (@politicvoices_) November 23, 2024‘‘కచ్చితంగా మావాడే సీఎం అవుతాడు. అందులో ఎలాంటి అనుమానాలే అక్కర్లేదు. తను 24 గంటలు నిద్రాహారాలు మానేసి కూటమి విజయం కోసం కృషి చేశాడు. ఈ ప్రయాణంలో కోట్లమంది అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదం అతనికి ఉంది’’ అంటూ ఫడ్నవిస్ తల్లి సరిత అంటున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. సోలోగానే బీజేపీ 100కిపైగా సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ అంచనాకు తగ్గట్లు.. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ చెబుతున్నారు. రేపు ఢిల్లీ నుంచి పార్టీ పరిశీలకులు వస్తారని, 25న మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం జరగనుందని చెప్పారాయన. ఆ ప్రకటన వెలువడిన వెంటనే.. ఫడ్నవిస్ అనుచరులు టపాసులు కాల్చి.. మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. -
ఎక్కువ సీట్లు వచ్చినవాళ్లే సీఎం కావాలనేం లేదు: షిండే
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మహాయుతి శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఫలితాలు వన్‌సైడెడ్ కావడంతో.. ఇక ప్రభుత్వ ఏర్పాటుపైకి అందరి దృష్టి మళ్లింది. మహారాష్ట్ర శాసనసభ గడువు నవంబర్ 26వ తేదీతో ముగియనుంది. దీంతో ఆలోపు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అయితే.. ఇంతలోపే సీఎం పీఠం ఎవరికి దక్కబోతుందనే చర్చ మొదలైంది.మహారాష్ట్రలో షిండే వారసుడి ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. కూటమికి సంబంధించిన మూడు పార్టీల నుంచి.. ముగ్గురు కీలక నేతలు రేసులో ఉన్నారు. ఏక్నాథ్ షిండేనే కొనసాగిస్తారా? లేదంటే దేవేంద్ర ఫడ్నవిస్‌ను చేస్తారా? ఇవేవీ కాకుంటే.. ‘మహా’కు సీఎం కావాలన్న అజిత్ పవార్ ఆశయం నెరవేరుతుందా? అనే చర్చ నడుస్తోంది. అయితే..మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 145. సోలోగానే బీజేపీ 100కిపైగా సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆ పార్టీ తరఫున దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ అంచనాకు తగ్గట్లు.. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్ బాధ్యతలు స్వీకరిస్తారని బీజేపీ నేత ప్రవీణ్ ధరేకర్ చెబుతున్నారు. రేపు మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం జరగనుందని చెప్పారాయన. ఆ ప్రకటన వెలువడిన వెంటనే.. ఫడ్నవిస్ అనుచరులు టపాసులు కాల్చి.. మిఠాయిలు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. మరోవైపు.. షిండే ఫిటింగ్ మొదలైంది. గెలుపు సంబురాల్లో మీడియాతో సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడారు. అతిపెద్ద పార్టీకి సీఎం పదవి ఇవ్వాలనే రూల్ ఏం లేదు కదా అన్నారు. సీఎం పదవికి, సీట్లకు ఏం సంబంధం అన్నారు. అలాగే.. కూర్చుని మాట్లాడుకుని సీఎంను నిర్ణయిస్తామని అన్నారాయన. మరోవైపు ఆయన తనయుడు శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ.. గెలుపులో శివసేన పాత్రే సింహభాగం ఉందని, తన తండ్రే సీఎం కావాలని అంటున్నాడు. అదే టైంలో.. అజిత్ పవార్ వర్గం కూడా తమ నేతకే సీఎం పదవి ఇవ్వాలని అంటోంది. ప్రజలు అజిత్ పవార్‌ను సీఎంగా చూడాలని అనుకుంటున్నారని ఆయన భార్య సునేత్ర అంటున్నారు. ప్రభుత్వ ఏర్పాటునకు సమయం పెద్దగా లేకపోవడంతో మహారాష్ట్ర సీఎం ఎవరనేది హైడ్రామాను తలపించే అవకాశమూ లేకపోలేదు. ఇదీ చదవండి: మహారాష్ట్రలో ఎన్డీయే గెలుపునకు అసలు కారణం అదేనా?మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కోసం క్లిక్ చేయండి -
మహారాష్ట్రలో ఎన్డీయే గెలుపునకు అసలు కారణం అదేనా?
ముంబై: శరద్ పవార్, ఉద్దవ్ థాక్రే వర్గాలకు మరాఠీలు పెద్ద షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇండియా కూటమి ఘోర పరాభవం చవిచూసింది. మహారాష్ట్రలో మరోసారి ఎన్డీయే పాగా వేయబోతోంది. ఫలితాల వేళ.. మహాయుతి కూటమి శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. మెజారిటీని ఇప్పటికే దాటేయగా.. ప్రభుత్వ ఏర్పాటునకు కసరత్తులు జరుగుతున్నాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. రెండు వందలకు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది మహాయుతి కూటమి(ఎన్డీయే). ఇందులో బీజేపీ 100+తో అతిపెద్ద పార్టీగా నిలవడం గమనార్హం. అయితే.. మహారాష్ట్రలో ఎన్డీయే ఫ్లస్ అయిన అంశాలను పరిశీలిస్తే.. శివసేన(షిండే), ఎన్సీపీ(శరద్ పవార్).. మరికొన్ని పార్టీలను చేర్చుకుని బీజేపీ మహాయుతి కూటమిగా మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్లింది. శివసేన, ఎన్సీపీలో చీలికలతో ఈ ఎన్నికల్లో ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ కొనసాగింది. అయితే మహా ప్రజలు మాత్రం మహాయుతికే పట్టం కట్టారు. ఎన్నికల హామీలు, నినాదాలు మహాయుతి కూటమికి కలిసొచ్చాయి. లాడ్లీ బెహనా యోజన పథకం, మహిళలకు రూ.2,100 ఆర్థిక సాయం ఫ్లస్ అయ్యాయి. పథకం కులగణనను వ్యతిరేకిస్తూ మోదీ ఏక్తో సేఫ్ హై నినాదం బాగా పని చేసింది. ఓబీసీలు, ఆదివాసీలను విభజిస్తే నష్టమంటూ చేసిన ప్రచారం బాగా ప్రజల్లోకి వెళ్లిందనే విశ్లేషణలకు నడుస్తున్నాయి. -
ఎన్నికల ఫలితాల మధ్య బీజేపీ కార్యాలయంలో సిద్ధమవుతున్న జిలేబీలు
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరిగాయి. జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13,20 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరిగింది. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ట్రెండ్ల మధ్య ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో జోరుగా జిలేబీలు తయారు చేస్తున్నారు. VIDEO | Jalebis being prepared at BJP headquarters in New Delhi, ahead of the counting of votes in Maharashtra and Jharkhand. #MaharashtraElection2024 #JharkhandElection2024 #ElectionResults2024WithPTI pic.twitter.com/RD4kKmB5Xx— Press Trust of India (@PTI_News) November 23, 2024మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల కూటమి 'మహాయుతి', కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్)ల మహావికాస్ అఘాడి మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల్లో తమదే విజయమని రెండు కూటములు చెప్పుకుంటున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన ఇప్పటివరకూ వెల్లడైన ట్రెండ్స్‌లో, మహారాష్ట్రలో మహాయుతి ముందంజలో ఉంది. మహావికాస్ అఘాడి వెనుకబడింది. జార్ఖండ్‌లో, జేఎంఎం ప్లస్ ట్రెండ్స్‌లో మెజారిటీలో కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: By Election Results: ఆసక్తికరంగా ఉప ఎన్నికల ఫలితాలు -
కౌంటింగ్ వేళ.. చార్టెడ్ ఫ్లైయిట్స్, సంతకాల సేకరణ!
ముంబై: మహారాష్ట్రలో హో రాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో విజేతలెవరో నేడు(శనివారం) తేలిపోనుంది. ప్రస్తుతం ఈసీ అధికారుల పటిష్ట భద్రత నడుమ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన(షిండే), ఎన్సీపీ(అజిత్ పవార్) మహాయుతి కూటమి ప్రజల మన్ననలు పొంది అధికారాన్ని నిలబెట్టుకుంటుందా.. లేక కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్),ఎన్సీపీ(శరద్ పవార్) మహా వికాస్ అఘాడీ కూటమి సత్తా చాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందా అనే ఉత్కంఠకు నేటి సాయంత్రంతో తెరపడనుంది.అయితే ఫలితాలు వెల్లడికాకముందే మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలో హంగ్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండటంతో మహాయుతి, ఎంవీఏ కూటమిలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ఓట్ల లెక్కింపు కొనసాగుతుండాగానే గెలిచిన అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీలు గాలం వేయకుండా ఉండేందుకు రిసార్ట్ రాజకీయాలు మొదలు పెట్టాయి. అభ్యర్థులు కోసం ఫైవ్ స్టార్ హోటళ్లను బుక్ చేయడం, చార్టర్డ్ విమానాలను ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యాయి.ఎన్నికల్లో విజయం సాధించిన తమ అభ్యర్థులందరినీ వెంటనే ముంబైలో శిబిరానికి తరలించాలని మహా వికాస్ అఘాడీ నిర్ణయించింది. మెజార్టీ వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన ఎమ్మెల్యేల సంతకాల సేకరణకు జాప్యం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న ఎంవీఏ.. తమ అభ్యర్థుల నుంచి డిజిటల్ సిగ్నేచర్లు(సంతకాలు) సేకరిస్తోంది. ఫిరాయింపులను అరికట్టేందుకు కసరత్తుఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, పార్టీ ఫిరాయింపులకు అడ్డుకట్టవేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ శిబిర రాజకీయాలకు తెరలేపింది. ఎన్నికైన ఎమ్మెల్యేలతో నిత్యం టచ్‌లో ఉంటూ, అవసరమైతే వారిని హెలికాప్టర్ ద్వారా శిబిరాలకు తరలించే బాధ్యతను ప్రతిపక్ష నేత విజయ్ వడెట్టివార్‌కు అప్పగించింది. గెలిచిన అభ్యర్థులను బీజేపీ కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున, తమ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్ ఈ వ్యూహాత్మక ఎత్తుగడకు ప్లాన్ వేసింది. ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు తమ ఎమ్మెల్యేలను కర్ణాటక, లేదా తెలంగాణలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. శివసేన ముందు జాగ్రత్త తమ ఎమ్మెల్యేలపై బీజేపీ కూటమి వల విసిరే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా వారిని శిబిరానికి తరలించాలని నిర్ణయించినట్లు శివసేన(యూబీటీ) అగ్రనేత సంజయ్ రౌత్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధిస్తుందని కనీసం 160-165 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించారని తెలిపారు. #WATCH | Mumbai, Maharashtra: On the #MaharashtraElection2024 results coming out tomorrow, Shiv Sena (UBT) leader Sanjay Raut says, "The results will be out tomorrow. We are sure that we are going to get the majority. 160-165 of our MLAs would be elected... The 'Khokha walas'… pic.twitter.com/pQnA8ZeWUi— ANI (@ANI) November 22, 2024 -
Live: ‘మహా’యుతిదే అధికారం.. 25న సీఎం ఎన్నిక?!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మరికాసేపట్లో ఆ ఉత్కంఠకు తెరపడనుంది. -
నేడే మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు
ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో హో రాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమరంలో విజేతలెవరో నేడు తేలిపోనుంది. రెండు రాష్ట్రాల్లో శనివారం ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే 13 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరిగిన 46 అసెంబ్లీ స్థానా ల్లోనూ ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. సాక్షి.కామ్ ఈ ప్రజా తీర్పును.. ఎప్పటికప్పటి ఫలితాలను మీకు ప్రత్యేకంగా అందించబోతోంది.నాందేడ్ లోక్‌సభ స్థానంతోపాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన వయనాడ్‌లో లోక్‌సభ స్థానానికి సైతం ఉప ఎన్నిక నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ పడిన రాహుల్ సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా భవితవ్యం మరికొన్ని గంటల్లో తేటతెల్లం కానుంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌తోపాటు ఉప ఎన్నికలు జరిగిన అసెంబ్లీ స్థానాలు, నాందేడ్, వయనాడ్ లోక్‌సభ స్థానాల్లో శనివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. మహారాష్ట్రలో మొత్తం 288 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలుండగా, 4,136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో మరోసారి మహాయుతి ప్రభుత్వమే ఏర్పాటయ్యే అవకాశం ఉందని సర్వేలు అంచనా వేసిన సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో 1,211 మంది పోటీ మొత్తం 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్‌లో ఈసారి 1,211 మంది పోటీ చేశారు. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మధ్య అసలైన పోటీ నెలకొంది. జార్ఖండ్‌లో మరోసారి అధికారంలోకి వస్తామని ఇండియా కూటమి ధీమా వ్యక్తం చేస్తుండగా, విజయం తమదేనని ఎన్డీయే నేతలు తేల్చిచెబుతున్నారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్డీయేవైపే మొగ్గుచూపాయి. మహారాష్ట్రలో ఎంవీఏ ముందు జాగ్రత్త మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించిన తమ అభ్యర్థులందరినీ వెంటనే ముంబైలో శిబిరానికి తరలించాలని మహా వికాస్ అఘాడీ నిర్ణయించింది. తమ ఎమ్మెల్యేలపై బీజేపీ కూటమి వల విసిరే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తగా వారిని శిబిరానికి తరలించాలని నిర్ణయించినట్లు శివసేన(యూబీటీ) అగ్రనేత సంజయ్ రౌత్ శుక్రవారం వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి కనీసం 160 సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. గెలిచే అవకాశం ఉన్న స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే తమకు మద్దతు ప్రకటించారని తెలిపారు. -
‘మహా’ పోరు: అధికారం పీఠం దక్కించుకునేదెవరు?
సాక్షి ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ప్రధాన కూటముల మధ్య గట్టి పోటీ కనిపించినప్పటికీ మహాయుతి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబరు 23వ తేదీ (శనివారం) వెలుపడను న్నాయి. ఈ నేపథ్యంలో లోక్‌షాహీ, రిపబ్లిక్ , చాణక్య, పోల్‌డైరీ వంటి అనేక సంస్ధలు ఎగ్జిట్‌పోల్ సర్వేలు నిర్వహించాయి. మహాయుతిదే మళ్లీ అధికార పీఠమని కొన్ని సర్వేలు వెల్లడించగా, మరి కొన్ని సర్వేలు మాత్రం మహావికాస్ ఆఘాడి కూటమి అ«ధికారంలో రానుందని పేర్కొన్నాయి. మహా వికాస్ ఆఘా డీకి 124 నుంచి 156 స్థానాలు లభించనున్నాయని, మహాయుతి కూటమికి 129 నుంచి 150 స్థానాలు, ఇతరులు 10 స్థానా ల్లో గెలిచే అవకాశముందని లోక్‌షాహీ నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. ఇదిలాఉండగా మహాయుతికి 137 నుంచి 157 స్థానాలు, మహావికాస్ ఆఘాడీకి 126 నుంచి 146 స్థానాలు లభించే అవకాశాలున్నాయని రిపబ్లిక్ సర్వే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారపీఠమెక్కేదెవరన్న అంశంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు గెలుపు మీద ఎవరికివారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.#WATCH | Delhi | On Shiva Sena (UBT)'s claim that they (MVA) will secure 160 seats in Maharashtra elections, Union Minister Giriraj Singh says, “The election results will be out by this time tomorrow. They (Shiv Sena) are nervous, that’s why they are making such claims.” pic.twitter.com/oQhlxkevZm— ANI (@ANI) November 22, 2024 -
‘మహా’ పోరు: ఇంతకీ రెండు కూటముల ‘సీఎం’ ఎవరంటే..
యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బీజేపీ సారధ్యంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి నువ్వా-నేనా అన్నట్టుగా ఎన్నికల్లో పోరాడాయి. బుధవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన తరువాత వెలువడిన అత్యధిక ఎగ్జిట్స్ పోల్స్ మహాయుతి కూటమే విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. 288 అసెంబ్లీ స్థానాలున్న బీజేపీ, శివసేన (ఉద్దవ్ వర్గం), ఎన్సీపీ(అజిత్ పవార్) నేతృత్వంలోని కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి...మరోవైపు ఎన్నికల్లో విజయంపై అటు ప్రతిపక్ష కూటమి మహ వికాస్ అఘాడీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా లేకపోయినా.. ఫలితాల అనంతరం ఎంవీఏ కూటమే అధికారం చేపడుతుందని భావిస్తోంది. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైన నేపథ్యంలో మహారాష్ట్రలోనూ సర్వేల ఫలితాలు తారుమారు అవుతాయని గట్టిగా నమ్ముతోంది. ఇక మరో 24 గంటల్లో మహారాష్ట్ర భవితవ్యం తేలనుంది. నవంబర్ 23న అధికారికంగా ఫలితాలు వెలువడనున్నాయి.అయితే ఫలితాల ముందే అటు మహాయూతి, ఇటు ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిలోనూ ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ముందు నుంచి ఇరు వర్గాలు తమ సీఎం అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోవడంతో సీఎం పీఠంపై సస్పెన్స్ కొనసాగుతోంది. పోలింగ్ ముగిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే తమ పార్టీ నాయకత్వంలోనే మహారాష్టట్రలో ఎంవీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్‌కు అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయని ఓటింగ్ ట్రెండ్లు సూచిస్తున్నాయని ఆయన అన్నారు.ఈ వ్యాఖ్యలను మిత్రపక్షమైన శివసేన(ఉద్దవ్) ఖండించింది. ఎన్నికల్లో ఎంవీఏ మెజారిటీ పొందిన తర్వాత కూటమి భాగస్వామ్య పక్షాలు సంయుక్తంగా చర్చించ నిర్ణయం తీసుకుంటామని స్పఫ్టం చేశారు. పటోలే ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ హైకమాండ్, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, దాని అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు కూడా అదే విషయాన్ని ప్రకటించాలని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.అటు మహాయుతి కూటమిలో శివసేన ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ముఖాముఖిగా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్నట్లు పేర్కొననారు. పోలింగ్ నాడు ఓటర్లు షిండేకు తమ ప్రాధాన్యతను చూపించారని ఆయనే మరోసారి సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నారు. షిండేనే తదుపరి ముఖ్యమంత్రి అవుతారని తాము విశ్వసిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు బీజేపీ నుంచి ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్.. సీఎం అవుతారని పార్టీ నేత ప్రవీణ్ దారేకర్ పేర్కొన్నారు. బీజేపీ నుంచి ఎవరైనా సీఎం అయితే.. అది దేవేంద్ర ఫడ్నవీసే అని తెలిపారు.ఇక ఎన్సీపీ నాయకుడు అమోల్ మిత్కారీ తన పార్టీ చీ ఫ్ఉ, ప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పేరును సీఎం చర్చలోకి తీసుకొచ్చారు. ఫలితాలు ఏమైనప్పటికీ, ఎన్‌సిపి కింగ్‌మేకర్ అవుతుందని అన్నారు. మహాయుతి కూటమిలోని అన్ని పార్టీలు కలిసి కూర్చుని సీఎం ఎవరనే నిర్ణయం తీసుకుంటాయని మిస్టర్ ఫడ్నవీస్ తెలిపారు. మొత్తానికి అన్ని పార్టీలు తమ నేతనే సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఏ కూటమి అధికారంలోకి వస్తుందది, ఎవరు సీఎం పీఠంపై కూర్చుంటారనేదానిపై రేపటి(శనివారం) ఫలితాల తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
అది ఎవరూ అంగీకరించరు: కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యలపై సంజయ్ రౌత్
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోనే మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడుతుందని ఆ పార్టీ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నవంబర్ 25న కాంగ్రెస్ నేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆయన తెలిపారు. అయితే కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వ్యాఖ్యలను శివసేన(ఉద్దవ్) రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. ఆయన వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని అన్నారు.ఈ మేరకు ముంబైలో విలేకరుల సమావేశంలో రౌత్ మాట్లాడుతూ.. సీఎం ఎవరన్నదనే విషయం కూటమి భాగస్వామ్యాలతో సమిష్టిగా చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ‘నేను దీన్ని అంగీకరించను. ఎవరూ కూడా అంగీకరించరు. నానా పటోలేకు కాంగ్రెస్ హైకమాండ్ మద్దతు ఉందో లేదో మేము కలిసి కూర్చుని నిర్ణయిస్తాము. పటోలే ముఖ్యమంత్రి అవ్వాలంటే కాంగ్రెస్ హైకమాండ్ చెప్పాలి. రాహుల్ గానీ ప్రియాంక గాంధీ వాద్రాగానీ, సోనియా గాంధీగానీ ప్రకటించాలి’ అని పేర్కొన్నారు.అయితే మహారాష్ట్రలోని ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చీఫ్ నానా పటోలే తెలిపారు. ప్రజల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మహారాష్ట్రలో ఎంవీఏ ప్రభుత్వానికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. నవంబర్ 25న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నారు. ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని అంచనా వేశామని, కానీ తాము ఓడిపోయామని చెప్పారు. ఈసారి కాంగ్రెస్ ఓటమిని వారు అంచనా వేస్తున్నారు కాబట్టి తామే తప్పకుండా గెలుస్తామని పేర్కొన్నారు.ఇదిలా ఉండగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్సీపీ (అజిత్ పవార్), శివసేన (షిండే వర్గం) నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని అనేక ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇక ప్రతిపక్ష కూటమి అయిన ఎంవీఏ(కాంగ్రెస్, శివసేన(ఉద్దవ్), ఎన్సీపీ(శరద్‌పవార్) ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చినప్పటికీ అధికారాన్ని దక్కించుకోలేదని అంచనా వేశాయి. ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరగాల్సి ఉంది. -
ప్రశాంతంగా మహారాష్ట్ర ఎన్నికలు
ముంబై/రాంచీ: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 288 స్థానాల్లో బుధవారం ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. సాయంత్రం 5 గంటలకల్లా 60 శాతం ఓటింగ్ నమోదైంది. నక్సల్స్ ప్రభావిత గడ్చిరోలీ చిల్లాలో 69.63 శాతం, ముంబైలో 51.41 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 1,00,186 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,100 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్, రితేశ్ దేశ్‌ముఖ్, జెనీలియా తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ నాగపూర్‌లో ఓటు వేశారు. శివసేన(యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తన మేనల్లుడికి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే తన కుమారుడికి ఓటు వేయడం విశేషం. మాహిమ్‌లో రాజ్ ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే పోటీ చేస్తున్నారు. బాంద్రా ఈస్ట్ స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే మేనల్లుడు వరుణ్ సర్దేశాయ్ పోటీకి దిగారు. రాష్ట్రంలో ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్, పంజాబ్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బుధవారం ఉప ఎన్నికలు నిర్వహించారు. స్వతంత్ర అభ్యర్థి మృతి మహారాష్ట్ర ఎన్నికల్లో బీడ్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి గా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండే(43) బుధవారం మృతిచెందారు. ఒకవైపు పోలింగ్ కొనసాగుతుండగానే ఆయన ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం సృష్టించింది. బీడ్ పట్టణంలోని ఛత్రపతి సాహూ విద్యాలయ పోలింగ్ బూత్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. జార్ఖండ్ రెండో విడతలో 67.59 శాతం ఓటింగ్ జార్ఖండ్‌లో రెండో/చివరి విడత అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. రెండో విడతలో భాగంగా బుధవారం 38 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలవరకు 67.59 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు. మొత్తం 12 జిల్లాల్లో 14,218 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటల్కు పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ప్రక్రియను ముగించారు. మిగిలిన కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల దాకా పోలింగ్ కొనసాగింది. సమయం ముగిసినప్పటికీ వరుసులో నిల్చున్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. జాంతారా జిల్లాలో అత్యధికంగా 76.16 శాతం ఓటింగ్ నమోదైంది. బొకారో జిల్లాలో అతి తక్కువగా 60.97 శాతం ఓటింగ్ నమోదైంది. జార్ఖండ్‌లో జరుగుతున్న ప్రజాస్వామ్య వేడుకలో ఓటర్లంతా ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పిలుపునిచ్చారు. ప్రజలు వేసే ప్రతి ఓటు రాష్ట్రాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడుతుందని చెప్పారు. జార్ఖండ్‌లో ఈ నెల 13న తొలి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నెల 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
Maharashtra Elections: మళ్లీ మహాయుతి!
న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి మహారాష్ట్రలో అధికారం నిలుపుకోనుందని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. జార్ఖండ్‌లో కూడా ఎన్డీఏ కూటమిదే పై చేయని తేల్చాయి. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం ముగిసింది. ఆ వెంటనే ఆ రాష్ట్రాల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. బీజేపీ, శివసేన (షిండే), ఎన్సీపీ (అజిత్)లతో కూడిన మహాయుతి విజయం ఖాయమని దాదాపుగా అన్ని సంస్థలూ అంచనా వేశాయి. కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)లతో కూడిన విపక్ష మహా వికాస్ అఘాడీ ఓటమి చవిచూడనున్నట్టు చెప్పాయి. ఒక్క లోక్‌పోల్ మాత్రమే ఎంవీఏ గెలుస్తుందని పేర్కొంది. 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఆ కూటమికి 150కి పైగా స్థానాలు వస్తాయని, మహాయుతి 130 లోపే సాధిస్తుందని అంచనా వేసింది. జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగ్గా మహారాష్ట్రలో బుధవారం ఒకే విడతలో ముగియడం తెలిసిందే. రెండు రాష్ట్రాల్లోనూ శనివారం ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడతాయి.జార్ఖండ్‌లో టఫ్ ఫైట్ జార్ఖండ్‌లో అధికార జేఎంఎం–కాంగ్రెస్ కూటమికి, బీజేపీ సారథ్యంలోని విపక్ష ఎన్డీఏ కూటమికి మధ్య హోరాహోరీ సాగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. అత్యధిక పోల్స్ ఎన్డీఏకే మొగ్గుతున్నట్టు పేర్కొన్నాయి. బొటాబొటి మెజారిటీతో అధికారం దక్కించుకోవచ్చని అభిప్రాయపడ్డాయి. ఈ అంచనాల నేపథ్యంలో అక్కడ చివరికి హంగ్ వచి్చనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే జేఎంఎం కూటమి గెలుస్తుందని అంచనా వేసింది. 81 అసెంబ్లీ సీట్లకు గాను దానికి 53 సీట్లొస్తాయని, ఎన్డీఏ కూటమి 25కు పరిమితమవుతుందని పేర్కొంది. మహారాష్ట్రపై తమ అంచనాలను గురువారం ప్రకటించనున్నట్టు సంస్థ తెలిపింది. -
ఎగ్జిట్ పోల్స్ డిబేట్లపై కాంగ్రెస్ కీలక నిర్ణయం!
మహారాష్ట్ర, ఝార్ఖండ్లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహారాష్ట్రలో 45.53శాతం పోలింగ్ నమోదు కాగా.. అటు ఝార్ఖండ్‌లో 61.47శాతం ఓటింగ్ జరిగినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. సామాన్యులతోపాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత సాయంత్రం 6.30 గంటలకు ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్‌పై టీవీ ఛాఆనళ్ల చర్చల్లో పాల్గొనకూడదని హస్తం పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం,గతంలో లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. అయితే ఓటమి భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో బీజేపీ విమర్శలు గుప్పించింది.కాగా మహారాష్ట్రలో ఒకేవిడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా.. ఝార్ఖండ్‌లో రెండోవిడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో పాటు పలు రాష్ట్రాల్లోని కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి పోటాపోటీగా తలపడ్డాయి. నువ్వానేనా? అన్నట్టుగా రెండు పార్టీలు బరిలోకి దిగాయి. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా.. అధికారం చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఇండియా కూటమి భావిస్తోంది. -
ఉదయాన్నే బూత్‌లకు వచ్చి ఓటేసిన ప్రముఖులు.. మహారాష్ట్ర ఎన్నికల పోలింగ్ చిత్రాలు ఇవిగో
-
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ఓటేసిన ప్రముఖులు
-
Maharashtra Election: ఓటు వెయ్యడానికిబారులు తీరిన జనం
-
సుప్రియా సూలేపై క్రిప్టోకరెన్సీ ఆరోపణలు.. కొట్టిపారేసిన ఎంపీ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష ఎంపీ సుప్రియా సూలేపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. క్రిప్టోకరెన్సీ కుంభకోణంలో ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) చీఫ్ శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే ప్రమేయం ఉన్నట్లు బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది ఆరోపించారు. అయితే బీజేపీ ఆరోపణలను ఎంపీ సుప్రియా సూలే బుధవారం తోసిపుచ్చారు. బీజేపీ ఎంపీ విలేకరుల సమావేశంలో ప్లే చేసిన ఆడియో క్లిప్‌లో ఉన్న వాయిస్ తనది కాదని, అవన్నీ కిలీవని పేర్కొన్నారు.కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేందుకు సుప్రియా సూలే, మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, మాజీ పోలీస్ కమిషనర్ ఓ డీలర్‌తో కలిసి అక్రమ బిట్‌కాయిన్ లావాదేవీలకు పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది విలేకరుల సమావేశంలో కొన్ని ఆడియో క్లిప్‌లను ప్లే చేశారు. క్రిప్టో కరెన్సీ కుంభకోణంలో వీరికి ప్రమేయం ఉందని, ఎన్నికల ప్రచారానికి నిధుల కోసం ఇద్దరు నేతలు బిట్‌కాయిన్ మానిప్యులేషన్‌ను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. క్రిప్టోకరెన్సీ లావాదేవీల ద్వారా లభించిన నగదును మహారాష్ట్రలో ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో వినియోగిస్తున్నారని పాటిల్ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి అవకతవకలు జరిగాయని ఆయన అన్నారు.#WATCH | Baramati: On allegations against her and Nana Patole, NCP-SCP MP Supriya Sule says "Yesterday, all these voice recordings were sent to me by the media. The first thing I did was to call the Commissioner of Pune and tell him that some fake videos were running and I wanted… pic.twitter.com/vhoNS3vxLr— ANI (@ANI) November 20, 2024బుధవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన సుప్రియా సూలే.. బీజేపీ ఆరోపణలపై స్పందించారు. ‘అది నా వాయిస్ కాదు. ఆ వాయిస్ నోట్స్, మెసేజ్‌లన్నీ నకిలీవి’ అని స్పష్టం చేశారు.. ఆమె మాట్లాడుతూ.. ఇది తన వాయిస్ లేదా నానా పటోలేది కాదని తెలిపారు. తన పేరు మీద నకిలీ వాయస్ సృష్టించారని, దీనికి వెనక ఉన్నవారిని పోలీసులు పట్టుకుంటారని తెలిపారు.‘నేను బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీకి వ్యతిరేకంగా మాట్లాడాను. దాని గురించి తీవ్రమైన సమస్యలను లేవనెత్తిన వ్యక్తిని నేను. వాటికి (బీజేపీ) సమాధానం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పూర్తి పారదర్శకతను విశ్వసించే వ్యక్తిని కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. బీజేపీ అడిగిన ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. దీనిపై పుణె కమిషనర్‌కు ఈ ఆడియోలు, వీడియోలు పంపించి.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాను. మహారాష్ట్ర పోలీసులపై నాకు నమ్మకం ఉంది. రుజువు లేకుండా ఆరోపణల ఆధారంగా అరెస్టు చేయరని భావిస్తున్నానని తెలిపారు.సుధాన్షు త్రివేదికి పరువు నష్టం నోటీసులు పంపినట్లు తెలిపారు.. ‘నా లాయర్ల ద్వారా సుధాన్షు త్రివేదికి క్రిమినల్ పరువు నష్టం నోటీసులు పంపాను. సుధాన్షు త్రివేదిి ఏ ఊరిలో కావాలన్నా, ఏ ఛానెల్లో కావాలన్నా, ఏ సమయంలో కావాలన్నా, ఎక్కడికి పిలిచినా నేను వచ్చి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాను. నేను లేదు, అబద్ధాలు, ఆరోపణలన్నీ అబద్ధం అని సమాధానం ఇస్తాను’ అని ఆమె అన్నారు. -
‘మహా’ పోరు.. ఓటు వేసిన ప్రముఖులు వీరే..
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నేడు పోలింగ్ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే బారామతిలో డిప్యూటీ సీఎం, ఎన్సీపీ అభ్యర్థి అజిత్ పవార్ ఓటు వేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, నాగ్‌పుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు వేశారు. అలాగే, ఎంపీ సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.ముంబైలోని పలు పోలింగ్ బూత్‌లో క్రికెటర్ సచిన్ సహా ఆయన కుటుంబ సభ్యులు ఓటు వేశారు. బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్, సినీ నటుడు రాజ్ కుమార్ రావ్, నటి గౌతమీ కపూర్, నటులు అక్షయ్ కుమార్, అలీ ఫజల్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.#WATCH | | Former Indian Cricketer Sachin Tendulkar, his wife and their daughter cast their votes at a polling station in Mumbai#MaharashtraAssemblyElections2024 pic.twitter.com/JX8WASuy4Y— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Former Indian Cricketer Sachin Tendulkar, his wife Anjali Tendulkar and their daughter Sara Tendulkar, show their inked fingers after casting vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/ZjHix46qmb— ANI (@ANI) November 20, 2024 #WATCH | Filmmaker and actor Farhan Akhtar shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024, at a polling booth in Bandra, Mumbai. pic.twitter.com/R9wyvbphFx— ANI (@ANI) November 20, 2024 #WATCH | Mumbai: Actor Ali Fazal shows his inked finger after casting his vote for #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/GVspi9nAfA— ANI (@ANI) November 20, 2024 #WATCH | NCP-SCP MP Supriya Sule along with her family show their inked fingers after casting a vote for #MaharashtraAssemblyElections2024NCP has fielded Deputy CM Ajit Pawar and NCP-SCP has fielded Yugendra Pawar from the Baramati Assembly constituency. pic.twitter.com/x22KuN8OEI— ANI (@ANI) November 20, 2024 Superstar #AkshayKumar is among the first voters to cast their vote today.pic.twitter.com/EXKGNWZ0pq— Nitesh Naveen (@NiteshNaveenAus) November 20, 2024 -
మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రధాని మోదీ అభ్యర్థన
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నేడు (బుధవారం) జరుగుతున్నాయి. జార్ఖండ్‌లో నేడు రెండో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర, జార్ఖండ్ ఓటర్లకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నవారిని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ‘నేటి పోటింగ్లో సరి కొత్త రికార్డును సృష్టించాలని’ విజ్ఞప్తి చేశారు. తొలిసారిగా ఓటు వేయబోతున్న యువ ఓటర్లకు అభినందనలు తెలిపారు. మహారాష్ట్ర ఓటర్లకు కూడా ప్రధాని మోదీ ఒక సందేశం ఇచ్చారు. ‘ఈ రోజు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్ర ఓటర్లు పూర్తి ఉత్సాహంతో ఇందులో భాగస్వాములు కావాలి. ప్రజాస్వామ్య పండుగను సంపూర్ణం చేయాలని కోరుతున్నాను. యువతీ, యువకులంతా ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలి’ అని విజ్ఞప్తి చేశారు. झारखंड में आज लोकतंत्र के महापर्व का दूसरा और आखिरी चरण है। सभी मतदाताओं से मेरा आग्रह है कि वे इसमें बढ़-चढ़कर भागीदारी करें और वोटिंग का नया रिकॉर्ड बनाएं। इस अवसर पर पहली बार वोट डालने जा रहे अपने सभी युवा साथियों का मैं विशेष अभिनंदन करता हूं। आपका एक-एक मत राज्य की ताकत है।— Narendra Modi (@narendramodi) November 20, 2024మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో భాగమైన బీజేపీ అత్యధికంగా 149 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 81 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 59 స్థానాల్లో పోటీ చేస్తోంది.ఇది కూడా చదవండి: UP By Election 2024: సెమీ ఫైనల్లో యూపీ ఓటర్లు ఎటువైపు? -
ప్రారంభమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
-
బాబాయి Vs అబ్బాయి: ఎన్నికల వేళ అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతున్న వేళ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సంచలన కామెంట్స్ చేశారు. తన కుటుంబ సభ్యులు బరిలో ఉన్నప్పటికీ ఈసారి గెలుపు మాత్రం తనదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తన విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు.మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ బారామతిలోని పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఇదే సమయంలో బారామతి రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈసారి బారామతిలో గెలుపు నాదే. లోక్‌సభ ఎన్నికల సమయంలో కూడా, మా కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పోటీ చేయడం మరియు అందరూ చూశారు. నేను బారామతిలో అందరినీ కలవడానికి ప్రయత్నించాను. ప్రతీ ఒక్కరినీ కలిసి వారితో మాట్లాడాను. ఈసారి బారామతి ప్రజలు నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే, ఓట్ల కోసం డబ్బులు పంచిన వ్యక్తులు ఎవరో ప్రజలకు బాగా తెలుసు అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | After casting his vote, Maharashtra Deputy CM and NCP candidate from Baramati Assembly constituency, Ajit Pawar says "Even during Lok Sabha, members of our family were contesting against each other and everyone has seen that. I tried to meet everyone in Baramati. I am… pic.twitter.com/jC0JbG7zSO— ANI (@ANI) November 20, 2024ఇదిలా ఉండగా.. బారామతి అసెంబ్లీ స్థానం బాబాయి, అబ్బాయి మధ్య రసవత్తర పోటీ నెలకొంది. పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న బారామతి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుంచి శరద్ పవార్, ఆ తర్వాత అజిత్ పవార్ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1967లో తొలిసారి బారామతి అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన శరద్ పవార్ 1990 వరకు ప్రాతినిధ్యం వహించారు. 1991 ఉప ఎన్నిక నుంచి 2019 వరకు అజిత్ పవార్ గెలిచారు.దాదాపు ఆరు దశాబ్దాల నుంచి పవార్ కుటుంబం కంచుకోటగా ఉన్న బారామతి స్థానంలో ఈసారి ఇరువర్గాలు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న అజిత్ పవార్ మరోసారి బరిలో నిలిచారు. వరుసగా ఏడుసార్లు గెలిచిన అజిత్ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున యుగేంద్ర పవార్ బరిలో నిలిచారు. అజిత్ పవార్ సోదరుడు శ్రీనివాస్ కుమారుడు యుగేంద్ర. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి పవార్ కుటుంబం మధ్య పోరు జరిగింది. బారామతి లోక్‌సభ స్థానంలో అజిత్ భార్య సునేత్ర పవార్ ఓడిపోయారు. ఎన్సీపీ(ఎస్పీ) తరఫున పోటీ చేసిన శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే గెలుపొందారు. సునేత్రపై దాదాపు లక్షన్నర ఓట్ల మెజారిటీతో సుప్రియా విజయం సాధించారు. -
‘మహా’ అసెంబ్లీ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎవరివైపు.. ఓటర్లు తీర్పు... -
Maharashtra Assembly elections 2024: నువ్వా.. నేనా?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) భాగ్యరేఖలను 9.7 కోట్ల మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రమంతటా ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల అధికారులు తెలిపారు. హోరెత్తిన ప్రచారంమహాయుతి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్రలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ముమ్మర ప్రచారంతో హోరెత్తించారు. వారితో పాటు కేంద్ర మంత్రులు, పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు తదితరులు కూడా ప్రచార పర్వంలో చురుగ్గా పాల్గొన్నారు. ఎంవీఏ కూటమి కోసం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వద్రా ప్రచారం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల అనంతర పరిణామాల్లో ముందుగా శివసేన, అనంతరం ఎన్సీపీల్లో చీలిక రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం ద్వారా తమదే అసలైన పార్టీ అని నిరూపించుకునేందుకు షిండే, ఉద్ధవ్ సేనలు; శరద్ పవార్, అజిత్ ఎన్సీపీ వర్గాలు పట్టుదలగా ఉన్నాయి. ఈ ఎన్నికలు వాటికి ఒకరకంగా జీవన్మరణ సమస్యేనని చెప్పాలి. 18–65 ఏళ్ల మధ్య వయసు మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తున్న లడ్కీ బహన్ పథకంపైనే మహాయుతి ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. మళ్లీ గెలిస్తే ఆ మొత్తాన్ని రూ.2,100కి పెంచుతామని పేర్కొంది. దీనికి విరుగుడుగా తాము మహిళలకు ఏకంగా నెలకు రూ.3,000 ఇస్తామని ఎంవీఏ ప్రకటించింది. మతపరమైన మనోభావాలను రేకెత్తించేందుకు కూడా బీజేపీ శాయశక్తులా ప్రయత్నించింది. అందులో భాగంగా బటేంగే తో కటేంగే, ఏక్ హై తో సేఫ్ హై వంటి నినాదాలు ప్రధానితో పాటు ఆ పార్టీ అగ్ర నేతలందరి నోటా ప్రచారం పొడవునా పదేపదే వినిపించాయి. ఇది సమాజంలో మతపరమైన చీలిక యత్నమేనంటూ రాహుల్‌తో పాటు ఎంవీఏ నేతలంతా దుయ్యబట్టారు. పార్టీల కోలాటంమహాయుతి పక్షాల్లో బీజేపీ అత్యధికంగా 149 అసెంబ్లీ స్థానాల్లో బరిలో ఉంది. శివసేన (షిండే) 81, ఎన్సీపీ (అజిత్) 59 చోట్ల పోటీ చేస్తున్నాయి. ఎంవీఏ కూటమి నుంచి కాంగ్రెస్ అత్యధికంగా 101 స్థానాల్లో, శివసేన (యూబీటీ) 95, ఎన్సీపీ (ఎస్పీ) 86 చోట్ల పోటీలో ఉన్నాయి. వీటితో పాటు బరిలో ఉన్న పలు చిన్న పార్టీలు ఈసారి పెద్ద ప్రభావమే చూపేలా కన్పిస్తుండటం విశేషం. జార్ఖండ్‌లో రెండో విడత 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్రాంచీ: జార్ఖండ్‌లో బుధవారం రెండో, తుది విడతలో 38 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. శనివారం మహారాష్ట్రతో పాటే ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెల్లడవనున్నాయి. రాష్ట్రంలో నవంబర్ 13న తొలి విడతలో 43 సీట్లలో పోలింగ్ ముగియడం తెలిసిందే. జేఎంఎం సారథ్యంలోని పాలక ఇండియా కూటమిని ఎలాగైనా ఓడించాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణం పట్టుదలగా ఉంది. ఇరు కూటముల నేతలూ సోమవారం రాత్రి దాకా ఇంటింటి ప్రచారంతో హోరెత్తించారు. -
యుద్ధంలా ‘మహా’ రాజకీయం
నేడు జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ‘మహాయుతి’, ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటముల మధ్య తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఇవి పాత కొత్త పార్టీలకు అస్తిత్వ పోరాటంగా మారాయి. ఎందుకంటే, శివసేన, ఎన్సీపీ రెండింటిలోనూ అతి పెద్ద చీలికలు జరిగాయి. పైగా ఫిరాయింపు వర్గాలే పార్టీల అసలు పేర్లను, చిహ్నాలను ఉంచుకున్నాయి. ఇది ఓటర్లలో గందరగోళాన్ని సృష్టిస్తుంది. దీనికితోడు, డబ్బు, బెదిరింపులు, రాజకీయ అవకాశవాదం ఈ ఎన్నికల్లో గతంలో కంటే పెద్ద పాత్రను పోషిస్తున్నాయి. 2024లో దేశంలో జరిగిన పంటనష్టంలో 60 శాతం మహారాష్ట్రలోనే సంభవించింది. అయినా స్వల్పకాలిక బుజ్జగింపు చర్యలపై పార్టీలు ఆధారపడటం పెరిగింది. ఇది సంక్షేమ ఎజెండాకు ప్రాధాన్యమివ్వడంలో వరుస ప్రభుత్వాల దీర్ఘకాలిక వైఫల్యాన్ని నొక్కి చెబుతోంది.అనేక రాజకీయ ఒడుదొడుకులు, నిట్టనిలువు చీలికలు, ప్రముఖ నాయకుల అడ్డగోలు దారులు, అధికారం కోసం నిరంతర పోరు వంటి వాటిని చూసిన తర్వాత, మహారాష్ట్రలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఆరు ప్రముఖ పార్టీలు నేడు (నవంబర్ 20) అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలు అనేక విధాలుగా విశేషమైనవి. ఎందుకంటే ఇవి రాష్ట్ర రాజకీయాలలో ఎన్నికల, రాజకీయ చర్చను రూపొందించే అవ కాశం ఉన్న కొన్ని కీలకమైన తప్పులను బహిర్గతం చేశాయి. ఈ కథనం అటువంటి ఐదు తప్పులను, అవి విసిరే సంక్లిష్ట సవాళ్లను అందిస్తుంది.1. ఉచితాలపై ఆధారపడటం: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాలన్నీ ‘మాఝీ లడ్కీ బహిన్ యోజన’, ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, సీనియర్ సిటిజన్ లకు ఉచిత తీర్థయాత్రలు వంటి వాటిని లక్ష్యంగా చేసుకున్నాయి. ఉచితాలు ఈ ఎన్నికల్లో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇలాంటి ప్రకట నలపై ‘మహాయుతి’, ‘మహా వికాస్ ఆఘాడీ’ కూటముల మధ్య పోటీ కనిపిస్తోంది. ఈ పథకాలు చాలావరకు రాష్ట్ర ఓటర్లలో దాదాపు సగం మందిగా ఉన్న మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నాయి. స్వల్పకాలిక బుజ్జగింపు చర్యలపై ఆధారపడటం అనేది విపరీతంగా పెరుగుతోంది. ఇది రాష్ట్రంలో సంక్షేమ ఎజెండాకు సమర్థంగా ప్రాధాన్యమివ్వడంలో వరుస ప్రభుత్వాల దీర్ఘకాలిక వైఫల్యాన్ని నొక్కి చెబుతుంది. ఎందుకంటే, గతంలో మహిళల భద్రత, శ్రేయస్సుపై ఆదుర్దా, ఆందోళనలు కనబడేవి.గత రెండు దశాబ్దాలుగా, కీలక అభివృద్ధి సూచికలలో మహారాష్ట్ర కిందికి జారిపోయింది. ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం, మహారాష్ట్ర స్థూల దేశీ యోత్పత్తి వృద్ధి గత 14 సంవత్సరాలలో రెండు శాతం పాయింట్లు పడిపోయింది. ‘వార్షిక విద్యా నివేదిక– 2022’ ప్రకారం, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అంకగణితం, పఠన నైపు ణ్యాలలో మునుపటి కంటే చాలా పేలవంగా ఉన్నారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ నుండి వెలు వడిన ‘భారతదేశ నిరుద్యోగ నివేదిక–2023’ మహా రాష్ట్రలో విద్యావంతులైన నిరుద్యోగిత నిష్పత్తి 2022లో 15 శాతంగా ఉందని పేర్కొంది. దశాబ్దం క్రితం కంటే ఇది 11 శాతం పెరుగుదల. ఈ ప్రాథ మిక ఆందోళనలను పరిష్కరించడానికి బదులుగా, పార్టీలు ఎన్నికల లాభాల కోసం ఉచితాల మీద దృష్టి పెడుతున్నాయి.2. కరిగిపోయే పొత్తులు, మారుతున్న విధేయతలు: 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాషాయ కూటమి (భారతీయ జనతా పార్టీ, శివసేన) విచ్ఛిన్నం కావడం ‘మహా వికాస్ ఆఘాడీ’ ఏర్పాటుకు దారితీసింది. ఇది చాలా భిన్నమైన సిద్ధాంతాలు గల పార్టీల (కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్–ఎన్సీపీ, శివసేన) మధ్య అసహజ కూటమి. వారి ప్రభుత్వం స్వల్పకాలికంగా పనిచేసింది. పైగా మనం శివసేన, ఎన్సీపీ రెండు పార్టీలలో అతిపెద్ద చీలికలను చూశాం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీతో చేతులు కలిపేందుకు రెండు పెద్ద భాగస్వామ్యాలు సిద్ధమైనాయి. భారత రాజకీయాల్లో ఇలాంటి ఫిరాయింపులు అసాధారణం ఏమీకాదు. కానీ ఫిరాయింపు వర్గాలే పార్టీల అసలు పేర్లను, చిహ్నా లను ఉంచుకున్నాయి. ఇది ఓటర్లలో గందర గోళాన్ని సృష్టించింది. ఇది సాధారణంగా ఎన్నికల ఫలితాలను నిర్ణయించే దీర్ఘకాలిక పొత్తులు, సైద్ధాంతిక ప్రాధాన్యతలు, కేడర్ విధేయతలు వంటి సాంప్రదాయ సమీకరణాలను పూర్తిగా బలహీనపరిచింది. ఇది మహారాష్ట్ర రాజకీయ సంస్కృతిని దెబ్బ తీసింది. డబ్బు, బెదిరింపులు, రాజకీయ అవకాశ వాదం గతంలో కంటే పెద్ద పాత్రను పోషిస్తు న్నాయి.3. వ్యవసాయ సంక్షోభాన్ని, వాతావరణ– ప్రేరిత సవాళ్లను పట్టించుకోకపోవడం: 2024లో దేశంలో జరిగిన పంట నష్టంలో 60 శాతం మహా రాష్ట్రలోనే సంభవించిందని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్’ ఇటీవలి నివేదిక వెల్లడించింది. దాదాపు సగం జనాభా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నప్పటికీ, రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభాన్ని, వాతావరణ ప్రేరిత సవాళ్లను పరిష్క రించడానికి సమష్టి కృషి జరగలేదు. రుణమాఫీ వంటి తక్షణ చర్యలకు మించి దీన్ని పరిష్కరించ డానికి రాజకీయ పార్టీలకు కచ్చితమైన ప్రణాళిక ఉన్నట్లు కనిపించడం లేదు. మరాఠా రిజర్వేషన్ల డిమాండ్ మూలాలు ప్రధానంగా వ్యవసాయా ధారిత మరాఠా సమాజం ఎదుర్కొంటున్న సామా జిక–ఆర్థిక సవాళ్లలో ఉన్నాయి. భారీగా ఉన్నసంఖ్యను బట్టి, ఎన్నికల వేడిలో వీరిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, మూల కార ణాన్ని పరిష్కరించడంలో రాజకీయ పార్టీలు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు.4. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాప్యం: మహా రాష్ట్రలోని పలు స్థానిక సంస్థలకు గత రెండు నుంచి ఐదేళ్లుగా ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 29 మున్సిపల్ కార్పొరేషన్లు (రెండు కొత్తవి), 200 కంటే ఎక్కువ మున్సిపల్ కౌన్సిళ్లు, 27 జిల్లా సమి తులు ఉన్నాయి. బొంబాయి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సర్పంచ్ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ఏడాది గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరగలేదు. స్థానిక సంస్థల ఎన్నికలలో జాప్యం వల్ల స్థానిక పరి పాలనా విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం అధిక నియంత్రణను సాధించేలా చేసింది. ఇది అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్యం క్షీణించడం గురించిన ఆందోళనలకు దారితీసింది. స్థానిక సంస్థల పరిధిలోని కొన్ని విధాన నిర్ణయాలు రాజకీయ పరిశీలనల ద్వారా ఎక్కువగా ప్రభావితమవు తాయి. ‘గట్టర్, మీటర్, నీరు’ (మురుగునీటి పారు దల, విద్యుత్, నీరు)కు సంబంధించిన సాధారణ పౌరుల సమస్యలు పరిష్కారం కాలేదు. ఎందుకంటే వాటిని పరిష్కరించడానికి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేరు.5. అభివృద్ధి విధానం: ఇటీవలి సంవత్స రాలలో, మెట్రో రైలు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, బుల్లెట్ రైలు వంటి ఉన్నత స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మహారాష్ట్ర గణనీయమైన ప్రాధాన్య మిస్తోంది. ఈ విధానం పెద్ద స్థాయి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తుంది. స్థానిక రైల్వేలు, ప్రభుత్వ ఆధీ నంలో నడిచే రోడ్డు రవాణా, అందుబాటులో ఉండే పబ్లిక్ రోడ్లు వంటి విస్తృత జనాభాకు మరింత నేరుగా ప్రయోజనం చేకూర్చే అవసరమైన సేవ లను బలోపేతం చేయాల్సిన ఖర్చుతో ప్రైవేట్, ఉన్నత వర్గాల ఆసక్తులకు ఎక్కువ ప్రాధాన్యత కనబడుతోంది.2024 మహారాష్ట్ర ఎన్నికలు పాత, కొత్త పార్టీలు, నాయకులు, పొత్తులకు అస్తిత్వయుద్ధంగా పరిణమించాయి. కానీ అంతకుమించి, ఇది ఓటర్లకు నిజమైన పరీక్ష అవుతుంది. ఎందుకంటే వారి ఎంపికలే రాబోయే దశాబ్దాల రాష్ట్ర రాజకీ యాల గమనాన్ని నిర్ణయిస్తాయి.– సంజయ్ పాటిల్ ‘ రాజకీయ పరిశోధకుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)