బొబ్బిలిలో ‘మంగమ్మగారి మనవరాలు’
బొబ్బిలి : బొబ్బిలిలో ‘మంగమ్మగారి మనువరాలు’ సీరియల్ చిత్రీకరణ ఆదివారం జరిగింది. ‘జీ తెలుగు’లో ప్రసారమయ్యే ఈ సీరియల్లో రాను న్న సీతారామకల్యాణం సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారు. స్థానిక సంస్థా నం హైస్కూలు మైదానంలో కల్యాణానికి సంబంధించిన భారీ సెట్టింగ్‌లు వేశారు. ఆదివారం రాత్రి స్థానిక సూర్య రెసిడెన్సీ నుంచి సీతారాముల విగ్రహాల ను పట్టణంలోకి ఊరేగింపుగా తీసుకువచ్చారు. నటీనటులను, షూటింగ్‌ను చూసేందుకు అధిక సంఖ్యలో పట్టణ వాసులు తరలివచ్చారు.