Meera Jasmine
-
ఓటీటీలో విడుదల కానున్న నయనతార, మీరా జాస్మిన్ సినిమా
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార నటించిన చిత్రం 'ది టెస్ట్'. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వైనాట్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. గతేడాదిలో జవాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నయనతార ఈ ఏడాదిలో వరుస సినిమాలతో అభిమానులను మెప్పించనుంది.ది టెస్ట్ సినిమా గురించి తాజాగా చిత్ర యూనిట్ ఒక ప్రకటన చేసింది. జీవితాన్ని ఆడించే ‘టెస్ట్’ ఆట ముగిసిందంటూ ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపింది. ఈ మూవీలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే ప్రధాన కాన్సెప్ట్‌తో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో 'కుముధ' అనే పాత్రలో నయన్ కనిపించనుంది.తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో డైరెక్ట్‌గా ఓటీటీలో ది టెస్ట్ సినిమా విడుదల కానుందని సమాచారం. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ కూడా త్వరలో అధికారికంగా ప్రకటించనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ సినిమా తర్వాత నయన్ చేతిలో డియర్ స్టూడెంట్స్, అమ్మోరు తల్లి 2 చిత్రాలు ఉన్నాయి. -
Swag Movie Review: ‘శ్వాగ్’ మూవీ రివ్యూ
టైటిల్: ‘శ్వాగ్’ నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్రచన-దర్శకత్వం: హసిత్ గోలిసంగీతం: వివేక్ సాగర్సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్ఎడిటర్: విప్లవ్ నైషధంవిడుదల తేది: అక్టోబర్ 04, 2024వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ ఏడాది మార్చిలో ఓం భీమ్ బుష్ సినిమాతో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ‘శ్వాగ్’ అంటూ మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. 'రాజ రాజ చోర' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీవిష్ణువుతో డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కించిన రెండో చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 4)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? శ్రీవిష్ణువు ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. దివాకర్ పేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవనభూతి(శ్రీవిష్ణు) రిటైర్మెంట్ రోజు అతనికి ఒక లెటర్ వస్తుంది. అందులో తనది శ్వాగనిక వంశం అని.. వంశ వృక్ష నిలయంలో పూర్వికుల ఆస్తి ఉందని ఉంటుంది. ఎలాగైన ఆ ఆస్తినికి కొట్టేయాలని భవనభూతి అక్కడికి వెళ్తాడు. ఆ ఆస్తికి రక్షగా నిలుస్తున్న మరో వంశం వ్యక్తి(గోపరాజు రమణ).. పూర్వికుల ఇచ్చిన పలక తీసుకొని వస్తేనే ఆస్తి దక్కుతుందని చెబుతాడు. భవనభూతి దాని వెతుకుతుండగా..మరో యువతి అనుభూతి(రీతువర్మ) ఆ పలకతో వంశవృక్ష నిలయానికి వస్తుంది. శ్వాగనిక వంశం తనదే అంటే తనదే అంటూ ఇద్దరు గొడవపడుతుంటారు. మరోవైపు యూట్యూబర్ సింగ(శ్రీవిష్ణువు) కూడా స్వాగనిక వంశం వాడేనని తెలుస్తుంది. ఆయన కూడా ఆస్తికోసం వంశ వృక్ష నిలయానికి వస్తాడు. అసలు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధ ఏంటి? వీరికి లేఖలు రాస్తున్నదెవరు? ఎందుకు రాశారు? 1550లో మాతృస్వామ్య పాలన సాగిస్తున్న వింజారమ వంశపు స్త్రీ (రితూ వర్మ) నుంచి స్వాగనిక వంశ మూలపురుషుడు భవభూతి(శ్రీవిష్ణు) అధికారాన్ని ఎలా దక్కించుకున్నాడు? మాతృస్వామ్య పాలనకు ముగింపు పలికి పితృస్వామ్య పాలన ఎప్పటికి కొనసాగించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పైన రాసిన కథ చదివితేనే కాస్త గందరగోళంగా అనిసిస్తుంది కదా?. మరి దాన్ని తెరపై అర్థమయ్యేలా చూపించడం చాలా కష్టమైన పని. ఈ విషయంలో డైరెక్టర్ హసిత్ గోలి కొంతమేర సక్సెస్ అయ్యాడు. విభిన్న టైమ్లైన్లలో సెట్ చేయబడిన కథ ఇది. ప్రారంభంలో కాస్త గందరగోళానికి గురైనా.. కాసేపటి తర్వాత అందరూ పాత్రలతో మూవ్ అవుతుంటారు. 1550ల నాటి కథకి ఇప్పటి వ్యక్తులకు ఉన్న సంబంధం ఏంటి అనేది బుర్రపెట్టి చూస్తే తప్ప అర్థం కాదు. అయితే ఉన్న కొద్ది సమయంలో దర్శకుడు అందరికి అర్థమయ్యేలా కథను చెప్పాలనుకున్నాడు. కానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం అది కాస్త గందరగోళానికి గురిచేస్తుంది. పెద్ద కథ కాబట్టి అన్ని విడమర్చి చెప్పడానికి సమయం లేకపోవడంతో సింపుల్‌గా ఒక్కొ సీన్‌తో ముగించేశారు.1550 ల సమయంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగాళ్ల మధ్య ఆడవాళ్ళ ఆధిపత్య పోరు జరుగుతున్న సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. అప్పట్లో స్త్రీలే పరిపాలన చేసేవారని, మగవారు ముసుగు ధరించి ఇంట్లోనే ఉండేవారని చూపించారు. ఆ తర్వాత కథ ప్రస్తుతానికి చేరుతుంది. ఎస్సై భవనభూతి భార్య రేవతి(మీరా జాస్మిన్) ఎందుకు అతన్ని వదిలి వెళ్లిపోయింది అనేది ఆసక్తికరంగా చూపించారు. ఫస్టాఫ్‌లోనే అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి.. ఆ పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కల్పించారు. అయితే మొదటి 30 నిమిషాలు మాత్రం కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని రివీల్ చేస్తూనే ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న ఓ ప్రధానమైన సమస్యపై సీరియస్‌గా చర్చించారు. ముఖ్యంగా విభూతి(శ్రీవిష్ణువు) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. కామెడీతో మొదలైన సినిమా.. చివరకు ఎమోషనల్‌గా ముగుస్తుంది. అయితే ముందుగా చెప్పినట్లు కాస్త బుర్రపెట్టి చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుంది. ఎవరెలా చేశారంటే.. కంటెంట్ కింగ్ అనే బిరుదుకు శ్రీవిష్ణువు మరోసారి న్యాయం చేశాడు. మంచి కథను ఎంచుకోవడమే కాకుండా తనదైన నటనతో ఆ కథకు పూర్తి న్యాయం చేశాడు. విభిన్నమైన ఐదు పాత్రల్లో నటిస్తూ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విభూతి పాత్ర అయితే సినిమాకే హైలెట్. ఆ పాత్రతో శ్రీవిష్ణు నటన అద్భుతం. ఈ పాత్ర గురించి ఎక్కువగా చెబితే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇక రీతూ వర్మ రెండు పాత్రల్లో కనిపించి.. తనదైన నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ తెరపై కనిపించేంది కాసేపే అయితే..ఉన్నంతలో బాగానే చేసింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. సునీల్, గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -Rating: 2.75/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మేకప్‌కే నాలుగున్నర గంటలు.. చాలా కష్టపడ్డా: శ్రీవిష్ణు
శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్వాగ్’. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రీతూ వర్మ హీరోయిన్గా నటించగా, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో శ్రీవిష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ శ్వాగ్.. అంటే శ్వాగనిక వంశానికి సుస్వాగతం. అంత పెద్ద టైటిల్ ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని షార్ట్ గా 'శ్వాగ్' అని టైటిల్ పెట్టాం. ⇢ శ్వాగ్ ఒక వంశానికి సంబధించిన కథ. మాత్రు, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవంత్సవంలో మొదలయ్యే కథ. మగ గొప్పా ? ఆడ గొప్పా ? అనే అంశంపై చిన్న టిట్ ఫర్ టాట్ లాంటి కథ. తెలుగు ప్రేక్షకులు కొత్త కథ ఎప్పుడు చెప్పినా ఆదరించారు. అదే ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది. ⇢ నేను ఎప్పుడూ డ్యుయల్ రోల్స్ చేయలేదు. ఇందులో నాలుగు పాత్రలు చేశాను. అందరూ ఒకే పోలికతో ఉండే ఒకే వంశస్తులే. నాలుగు పాత్రలు ఉన్నప్పడు ఎలా చేయాలనేది ఛాలెంజ్ గా అనిపించింది. వన్స్ గెటప్స్ అన్నీ సెట్ అయ్యాక.. చాలా బాగా కుదిరింది. ⇢ సినిమా చాలా బావొచ్చింది. ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమా ఇది. పెద్దవాళ్ళకి సినిమా విపరీతంగా నచ్చుతుంది. అలాగే యంగ్ ఆడియన్స్ కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. సినిమా చూసి పేరెంట్స్ ని కూడా సినిమాకి తీసుకువెళ్తారు. ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. మన వంశం గురించి, పెద్దల గురించి, తాతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటనేది ఇందులో చాలా చక్కగా చూపించడం జరిగింది.⇢ చాలా పెద్ద కథ ఇది. రెండున్న గంటల్లో ఇంత పెద్ద కథ చెప్పారా అని సినిమా చూసిన తర్వాత దర్శకుడిని ప్రేక్షకులు అభినందిస్తారు. కథలో బాగంగానే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అందరి ఆడియన్స్ కి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. నా కెరీర్ లో ఈ సినిమా వన్ అఫ్ ది టాప్ ఫిల్మ్ గా నిలుస్తుందనే నమ్మకం ఉంది.⇢ రాజ రాజ చేస్తున్నప్పుడు సెకండ్ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కూడా మీరు ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు ప్రాజెక్ట్ చేసుకోమని చెప్పారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మమ్మల్ని నమ్మి రాజరాజ చోర సినిమా ఇచ్చింది. చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కి మంచి సక్సెస్ అవుతుంది.⇢ ఇందులో క్యారెక్టర్ బ్యాక్ స్టోరీస్ బాగా కుదిరాయి. రీతూ వర్మ క్యారెక్టర్ లో చాలా మంచి ట్రాన్స్ ఫర్మేషన్ ఉంటుంది. ఈ సినిమా చూసాక ఆడవాళ్ళని ఒక మెట్టు ఎక్కువ అభిమానం, గౌరవంతో చూస్తాం. భవభూతి క్యారెక్టర్ ని కూడా సినిమా పూర్తయిన తర్వాత ఆడవాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు. ఈ సినిమా చూసినప్పుడు నటులు కాకుండా పాత్రలే గుర్తుంటాయి.⇢ ఇందులో నేను చేసిన నాలుగు క్యారెక్టర్లలో సింగ తప్ప మిగతా మూడు కష్టమైనవే. వాటి గెటప్, బాడీ లాంగ్వెజ్, డైలాగ్ డిక్షన్ దేనికవే ప్రత్యేకం. రోజుకి నాలుగున్న గంటల సేపు మేకప్ వేసుకోవడం, మళ్ళీ దాన్ని తీయడానికి మరో రెండు గంటల సమయం పట్టడం.. ఇదంతా చాలా టఫ్. అయితే రేజర్ టీజర్ రిలీజ్ చేసిన తర్వాత దానికి వచ్చిన మంచి రెస్పాన్స్ మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇచ్చిన అనుభూతి కలిగింది. అందరూ వందశాతం ఎఫర్ట్ పెట్టి సినిమా చేశారు. కింగ్ ఎపిసోడ్స్ కి మోనో లాగ్స్ వున్నాయి. దాని కోసం ప్రత్యేకంగా ప్రాక్టిస్ చేశాం. ఇందులో 90 ఇయర్స్ క్యారెక్టర్ కూడా వుంటుంది. అది చాలా బావొచ్చింది.⇢ ఒక కుటుంబం కథ చెప్పినప్పుడు స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమేయ్యేలా ఉండాలి. ఎలాంటి కన్ఫ్యుజన్ ఉండకూడదు. శ్వాగ్ లో స్క్రీన్ ప్లే అందరికీ అర్ధమయ్యేలా చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. సింపుల్ గా ఉంటునే చాలా కొత్తగా ఉంటుంది.⇢ ఇందులో మీరా జాస్మిన్ గారు చాలా అద్భుతంగా నటించారు. 90లో మదర్ లాంటి క్యారెక్టర్ ఆమెది. ఆ క్యారెక్టర్ ని చూసినప్పుడు అందరి మదర్స్ గుర్తుకు వస్తారు. ఆ పాత్ర చాలా హుందాగా హోమ్లీ గా ఉంటుంది. యునానిమస్ గా అందరికీ నచ్చుతుంది.⇢ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ తో బ్రోచేవారెవరురా, రాజ రాజ చేశాను, ఇది మూడో సినిమా. పాటలు సిట్యువేషన్ కి తగ్గట్టుగా ఉంటాయి. బీజీఎం థియేటర్స్ లో క్రేజీ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా తన కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అవుతుంది.⇢ ఇది కొత్త కథ. ప్రతి ఇరవై నిమిషాలకు అబ్బురపరిచే ట్విస్ట్ ఉంటుంది. సర్ ప్రైజ్ లు ఉంటాయి. ప్యూర్ కంటెంట్ సినిమా. పండగ సినిమాల్లో తప్పకుండా ఫ్యామిలీ అంతా కలసి చూడదగ్గ సినిమా.⇢ కొత్తగా ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. అలాగే గీతా ఆర్ట్స్ లో ఓ ఎంటర్ టైనర్ చేస్తున్నాను. -
ఖతర్నాక్ లుక్‌లో హీరోయిన్.. ఎవరో తెలుసా (ఫొటోలు)
-
సింహాసనం దక్కాలి కానీ...
ఉత్పలదేవిగా మారిపోయారు మీరా జాస్మిన్. ఉత్పలదేవి దయాగుణం వల్ల రాణి కావాల్సిన ఆమెకు సింహాసనం దక్కదు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ‘శ్వాగ్’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. శ్రీవిష్ణు హీరోగా హసిత్ గోలీ దర్శకత్వంలో ‘శ్వాగ్’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో వింజమర వంశంలోని రాణి రుక్మిణి దేవిగా రీతూ వర్మ ఓ లీడ్ రోల్లో నటిస్తుండగా, మరో లీడ్ రోల్లో ఉత్పలదేవిగా మీరా జాస్మిన్ కనిపిస్తారు. ఆదివారం ఆమె ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. -
మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం
హీరోయిన్ మీరా జాస్మిన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్ ఫిలిప్ (83) అనారోగ్యంతో గురువారం (ఏప్రిల్ 4న) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఎర్నాకులంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. దీంతో మీరా జాస్మిన్ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. జోసెఫ్ ఫిలిప్ భార్య పేరు ఎలియమ్మ. వీరికి సారా, జేని, జార్జ్, జాయ్, మీరా అని ఐదుగురు సంతానం. మీరా జాస్మిన్ అందరిలో కంటే చిన్నది. రీఎంట్రీ మీరా జాస్మిన్.. సూత్రధారన్ అనే మలయాళ చిత్రంలో కెరీర్ ఆరంభించింది. రన్ సినిమాతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది. అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పందెం కోడి, గుడుంబా శంకర్, భద్ర, రారాజు, మహారథి, యమగోల మళ్లీ మొదలైంది, గోరింటాకు, మా ఆయన చంటిపిల్లాడు.. ఇలా అనేక సినిమాలు చేసింది. 2014లో దుబాయ్ ఇంజనీర్ అనిల్ జాన్‌ను పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాల సంఖ్య తగ్గించేసిన మీరా.. గతేడాది విమానం చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది. చదవండి: రౌడీ హీరో కామెంట్స్‌పై ట్రోలింగ్.. నచ్చితే చూడు, లేదంటే మానేయ్ అన్న నిర్మాత -
వేసవిలో మ్యాచ్‌ను ప్లాన్ చేసుకున్న నయనతార
‘ది టెస్ట్’ను పూర్తి చేశారు నయనతార. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో పాటు మాధవన్, సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సింగర్ శక్తి శ్రీగోపాలన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు, ఈ వేసవిలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కాగా ఈ సినిమాను గత ఏడాది నవంబరులో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వేసవికి వాయిదా వేశారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
చూపు తిప్పుకోలేనంత అందంగా నేహా.. ఆ హీరోయిన్ ఇప్పటికే అలానే!
బ్లాక్ డ్రస్‌లో మరింత అందంగా యాంకర్ వర్షిణి ఒంపు సొంపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్ స్రవంతి టూ పీస్ బికినీలో హీరోయిన్ తాన్య హోప్ ఆ సినిమాకు రెండేళ్లు.. హీరోయిన్ సారా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పూలతో బిగ్‌బాస్ అశ్విని.. మీరు వీడియో చూస్తే అంతే ఇక ఉప్పొంగే అందాలతో రచ్చ లేపుతున్న నేహాశర్మ ఎర్రని చీరలో ధగధగా మెరిసిపోతున్న ఐశ్వర్య మేనన్ మనాలి టూర్లో చిల్ అవుతున్న హీరోయిన్ ఆషికా డ్రాగన్ ఫొటోతో అవాక్కయ్యేలా చేస్తున్న రితికా సింగ్ View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by sravanthi_chokarapu (@sravanthi_chokarapu) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by Neha Sharma 💫 (@nehasharmaofficial) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
అందుకే సినిమాలకు గ్యాప్ ఇచ్చా.. భద్ర హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
రవితేజ హీరోగా నటించిన భద్ర సినిమా చూశారా? ఈ చిత్రంలో హీరోయిన్ నటించిన మీరా జాస్మిన్ తన అమాయకపు చూపులతో అదరగొట్టింది. తెలుగులో రన్ చిత్రం ద్వారా పరిచయమైనప్పటికీ.. 'అమ్మాయి బాగుంది' చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ తమిళ చిత్రాల్లోనూ నటించింది. టాలీవుడ్లో గుడుంబా శంకర్, రారాజు, ఆకాశ రామన్న, గోరింటాకు, బంగారు బాబు, మహారథి లాంటి చిత్రాల్లో కనిపించింది. (ఇది చదవండి: లైవ్‌లో సిగరెట్ తాగిన స్టార్ హీరో.. మండిపడుతున్న నెటిజన్స్! ) అయితే కొన్నేళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మీరా.. తాజాగా విమానం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే మరో చిత్రం టెస్ట్ లోనూ నటిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మీరా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తానెందుకు నటనకు దూరం కావాల్సి వచ్చిందో వివరించింది. మీరా జాస్మిన్ మాట్లాడుతూ..'నేను నటిగా ఇప్పటి వరకు అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగించా. హీరోయిన్గా ఆదరణ పొందడం గౌరవంగా ఉంది. ఇంకా మెరుగ్గా రాణించేందుకు కొన్నేళ్లపాటు బ్రేక్ తీసుకున్నా. తాజాగా సినిమాల్లో నటిస్తున్న సమయంలో నా జర్నీ ప్రారంభించినంతగా ఫీలింగ్ కలిగింది.' అంటూ చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ. కాగా.. టెస్ట్ చిత్రంలో మాధవన్, సిద్ధార్థ్, నయనతార నటిస్తున్నారు. దర్శకుడు శశికాంత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. (ఇది చదవండి: చెప్పు తెగుతుందంటూ.. రిపోర్టర్‌పై బేబమ్మ రియాక్షన్) -
ట్రైలర్ చూస్తుంటే కన్నీళ్లొచ్చాయి
‘విమానం’ ట్రైలర్ చూస్తుంటే మంచి భావోద్వేగాలతో సినిమా ఉంటుందని తెలుస్తోంది. తండ్రీ కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ని దర్శకుడు శివ ప్రసాద్ ట్రైలర్లో అద్భుతంగా చూపించాడు. ట్రైలర్ నా మనసును కదిలించింది.. నాకు కన్నీళ్లొచ్చాయి’’ అని డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు అన్నారు. సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, మాస్టర్ ధ్రువన్ కీలక పాత్రల్లో శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహించిన చిత్రం ‘విమానం’. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి (కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ–‘‘తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ‘విమానం’ సినిమా చూడాలి.. అప్పుడే పిల్లల కోసం తల్లిదండ్రులు పడే తపన ఎలా ఉంటుందో తెలుస్తుంది’’ అన్నారు. జీ స్టూడియో సౌత్ వైస్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ప్రసాద్, సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వివేక్ కాలేపు. -
'విమానం ఎక్కించవా నాన్న ఒకసారి'.. ఆసక్తి పెంచుతోన్న టీజర్
సముద్ర ఖని, అనసూయ భరద్వాజ్, మీరా జాస్మిన్, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'విమానం'. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూన్ 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఫస్ట్‌లుక్, సాంగ్స్‌ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. తండ్రీ, కుమారుల మధ్య ప్రేమే విమానం టీజర్ చూస్తే మాస్టర్ ధ్రువన్ కుమారుడిగా నటిస్తే.. తండ్రి పాత్రలో విలక్షణ నటుడు సముద్ర ఖని నటించారు. వీరి మధ్య సాగే విమానం సంభాషణ ఆసక్తికరంగా, ఫన్నీగా ఉంది. అలాగే సినిమాలో బలమైన ఎమోషనల్ అంశాలు కూడా ఉన్నాయి. ‘నాన్నా ఎప్పుడు దేవుడు కనపడినా దండం పెట్టుకోమంటావు ఎందుకు’ అని అడిగిన కొడుకుతో ‘మనం అడిగినవన్నీ ఇస్తాడు’ కాబట్టి అని తండ్రి చెబుతాడు. దానికి ఆ పిల్లాడు ‘అన్నీ ఇచ్చేవాడిని దేవుడు అనరు.. నాన్నా అంటారు’ అనే ఓ డైలాగ్ చాలు తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బంధాన్ని తెలియజేస్తోంది. ఈ చిత్రంలో రాజేంద్రన్, ధన్‌రాజ్, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
9 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న మీరాజాస్మిన్
హీరోయిన్ మీరా జాస్మిన్ను దక్షిణాది ప్రేక్షకులు అంత ఈజీగా మరచిపోలేరు. ఈ మలయాళీ భామ తమిళం, తెలుగు భాషల్లోనూ కథానాయికగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళంలో ఆమె రన్ చిత్రంతో పరిచయం అయ్యారు. మాదవన్ హీరోగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్గా రాణించారు. ఆ తరువాత నటనకు దూరం అయిన మీరా జాస్మిన్ ఇటీవల తన అందమైన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి రీఎంట్రీకి రెడీ అని సిగ్నల్ ఇచ్చారు. అదే విధంగా మలయాళ చిత్రాల్లో నటిస్తున్న ఈమె తాజాగా కోలీవుడ్‌లోనూ నటించడానికి సిద్ధం అయ్యారు. మీరాజాస్మిన్ కోలీవుడ్‌లో నటించిన చివరి చిత్రం విజ్ఞాని. ఇది 2014 విడుదలైంది. కాగా సుమారు దశాబ్దం తరువాత మళ్లీ కోలీవుడ్‌కు రీఎంట్రీ అవుతున్నారన్న మాట. ఈమె తాజాగా నయనతారతో కలిసి నటించడానికి తయారవుతున్నారు. వైనాట్ స్టూడియోస్ పతాకంపై శశికాంత్ మెగాఫోన్ పట్టి నిర్మిస్తున్న చిత్రం టెస్ట్. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఇందులో మాదవన్, సిద్ధార్థ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. తాజాగా ఇందులో నటి మీరాజాస్మిన్ కూడా నటించబోతున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా వెల్లడించాయి. ఈ సినిమా ద్వారా గాయని శక్తిశ్రీ సంగీత దర్శకురాలిగా పరిచయం అవుతుండటం విశేషం. ఇటీవలే ప్రారంభం అయిన ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. చిత్రాన్ని ఈ ఏడాది ప్రథమార్థంలో కానీ, చివరిలో గానీ తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. చదవండి: మీ పెంపకం ఎలాంటిదోనన్న అనసూయ.. రాహుల్ స్ట్రాంగ్ కౌంటర్ -
'విమానం అంటే నీకెందుకు అంత ఇష్టం నాన్న'.. ఆసక్తిగా ప్రోమో
సముద్ర ఖని, మీరా జాస్మిన్, అనసూయ భరద్వాజ్, ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న చిత్రం 'విమానం'. జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్‌పై సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ప్రోమోను చూస్తే.. అందులో తండ్రీ, కుమారుల కొడుకుల మధ్య అనుబంధం కథాంశంగా తెరకెక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. సముద్ర ఖని అంగ వైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్య లేకపోయినా పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునే వీరయ్య అనే తండ్రి పాత్రలో నటించారు. జీ స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ క్రేజీవాల్ మాట్లాడుతూ..'కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్‌తో అసోసియేట్ కావటం చాలా సంతోషంగా ఉంది. బలమైన కథాంశంతో రూపొందిన విమానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రేక్షకులు మెచ్చే కంటెంట్‌ను అందించటమే మా లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం.' అని అన్నారు. ఈ చిత్రంలో మాస్టర్ ధ్రువన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జూన్ 9 థియేటర్లలో రిలీజ్ కానుంది. -
మీరా జాస్మిన్ టాలీవుడ్ రీ ఎంట్రీ (ఫొటోలు)
-
టాలీవుడ్ రీ ఎంట్రీకి సిద్ధమైన మలయాళ భామ
మీరా జాస్మిన్ ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. రవితేజ జంటగా నటించిన చిత్రం భద్ర సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత గుడుంబా శంకర్, గోరింటాకు సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది మలయాళ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది మీరా జాస్మిన్. దాదాపు పదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీరా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించారు. తన పాత్ర డబ్బింగ్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే సినిమాకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత వేచి చూడక తప్పదు. ‘అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్రహీరోల సరసన నటించింది. ఆమె చివరిగా నటించిన తెలుగు చిత్రం 2013లో విడుదలైన ‘మోక్ష. ఆ తర్వాత ఆమె మలయాళం పలు సినిమాల్లో నటించారు. -
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో స్టార్స్ సందడి.. బ్యూటీల తళుకులు-మెరుపులు
► క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో కాజల్ సిస్టర్స్ ► యంగ్ లుక్‌తో మెరిసిపోతున్న మీరా జాస్మిన్ ► యాంకర్ నిఖిల్ క్రిస్మస్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు ► అందంతో కేక పుట్టిస్తోన్న హీరోయిన్ శ్రీలీల ► భర్తతో కాజల్ క్యూట్ ఫోటో View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Meera Jasmine (@meerajasmine) View this post on Instagram A post shared by Gautam Kitchlu (@kitchlug) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Are Syamala (@syamalaofficial) View this post on Instagram A post shared by Mehaboob Dil Se (@mehaboobdilse) View this post on Instagram A post shared by Ariaana & Viviana Manchu (@ariviviofficial) View this post on Instagram A post shared by Shilpa Reddy (@shilpareddy.official) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Viranica Manchu (@viranica) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Nikhiluuuuuuuuu (@nikhilvijayendrasimha) View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) -
40 ఏళ్ల వయసులో గ్లామర్ షో చేస్తున్న మీరా జాస్మిన్.. ఫోటోలు వైరల్
తమిళసినిమా: రన్ చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన మలయాళీ బ్యూటీ మీరా జాస్మిన్. ఈ చిత్ర విజయం ఇక్కడ ఈమె స్థానాన్ని పదిలం చేసిందనే చెప్పాలి. అలాగే విశాల్‌కు జంటగా నటించిన సండైకోళి చిత్రం మీరా జాస్మిన్ స్థాయిని మరింత పెంచింది. ఆ చిత్రంలో అందరినీ ఆటపట్టించే అల్లరి పిల్లగా ఆమె నటన ఆకట్టుకుంది. అలా మణిరత్నం దర్శకత్వంలో ఆయుధ ఎళుత్తు చిత్రంతో స్టార్ ఇమేజ్ను తెచ్చుకుంది. ఈమె తెలుగులో పలు చిత్రాల్లో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. అయితే గ్లామర్‌కు దూరంగా పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్న మీరాజాస్మిన్ వ్యక్తిగతంగా పలు సమస్యలను ఎదుర్కొంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో పలు ఒడిదుడుకులను చవి చూడాల్సి వచ్చింది. ఆ ప్రభావం తన నట జీవితంపైనా పడింది. అలా సక్సెస్ఫుల్ నటిగా కొనసాగిన మీరా జాస్మిన్ అనూహ్యంగా నటనకు దూరమైంది. ఈమె తమిళంలో నటించిన చివరి చిత్రం విజ్ఞాని. కాగా చాలా గ్యాప్ తరువాత మీరాజాస్మిన్ మళ్లీ నటించడానికి సిద్ధమైంది. అలా మలయాళం అడపాదడపా అవకాశాలను రాబట్టుకుంటోంది. మలయాళం జయరాంకు జంటగా నటించిన మక్కల్ అనే చిత్రం గత ఏప్రిల్ నెలలో విడుదలైంది. కాగా మరిన్ని అవకాశాలను ఇతర భాషల్లోనూ రాబట్టుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు గ్లామర్ బాట పట్టింది. ఇప్పుడీ అమ్మడి వయసు 40 ఏళ్లు. అయినా 20 ఏళ్ల యువతిలా ఈ తరం హీరోయిన్లకు తగ్గేదేలా అన్నట్లు స్పెషల్ ఫొటో షూట్‌తో గ్లామరస్ పొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తోంది. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే అవి ఆమెకు ఎంతవరకు కథానాయకి అవకాశాలు తెచ్చి పెడుతాయన్నది వేచి చూడాల్సిందే. -
బొద్దుగా ఉండే మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉందో చూశారా?
Meera Jasmine Recent Pictures: మీరా జాస్మిన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఒకప్పుడు ఈమె స్టార్ హీరోయిన్. అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానులకు సంపాదించుకుంది. ఈ భామ ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్కు యువత ఫిదా అయింది. 2001-2010 కాలంలో మీరా స్టార్ హీరోయిన్. పవన్ కల్యాణ్,బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలకు నటించి, మెప్పించింది. డబ్బింగ్ మూవీ ‘రన్’తో టాలీవుడ్‌కి పరిచయమైంది మీరాజాస్మిన్. ఆ తర్వాత 2004లో శివాజీ ‘అమ్మాయి బాగుంది’మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తనదైన అభినయంతో తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పవన్ కల్యాణ్‌తో కలిసి గుడుంబా శంకర్‌లో నటించింది. ఈ చిత్రంలో మీరాకు మంచి గుర్తింపు వచ్చింది. ‘చిట్టినడుమునే చూస్తున్న’ పాటలో పవన్, మీరాల కెమిస్ట్రీ అదిరిపోవడంతో ఈ బ్యూటీకి వరస ఆఫర్లు వచ్చాయి. రవితేజ భద్ర, విశాల్ పందెకోడి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. రాజశేఖర్ గోరింటాకు చిత్రంతో తెలుగింటి ఆడపడచు అయిపోయింది. 2014 లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. కొన్నాళ్ల తర్వాత విభేదాల కారణంగా భర్తతో విడిపోయింది. ఆ తర్వాత కూడా సినిమాల వైపు తిరిగి చూడలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు మీరా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే మలయాళంలో ‘మకల్’అనే చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు తెలుగులో కూడా సినిమాలు చేయాలని ప్రయత్నిస్తుందట. ఇప్పటికే బోయపాటి శ్రీను తెరకెక్కించబోయే చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. తెరపై బొద్దగా ఉండే మీరా.. ఇప్పుడు చాలా సన్నబడింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాలుగు పదుల వయసులో కూడా మీరా..గతంలో కంటే అందంగా కనిపిస్తోంది. రీఎంట్రీ కోసమే ఈ అమ్మడు వెయిట్ లాస్ అయిందట. సన్నబడిన మీరా జాస్మిన్ ఫోటోలు చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. మీరా ఏంటి.. ఇంత సన్నబడింది? సినిమాల్లో రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మీరా జాస్మిన్ మెస్మరైజింగ్ లుక్స్..
-
బోయపాటి సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతోన్న హీరోయిన్!
Meera Jasmine Reentry: ‘అమ్మాయి బాగుంది’ మూవీతో తెలుగు తెరపై మెరిసింది నటి మీరా జాస్మిన్. ఆ తర్వాత వరస చిత్రాల్లో ఆపర్ అందుకున్న ఆమెకు పెద్దగా సక్సెస్ రాలేదు. చివరిగా గొరింటాకు సినిమాలోరాజశేఖర్ చెల్లెలి పాత్రలో మెప్పించింది, మంచి హిట్‌ను అందుకుంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే తెలుగులో ఆమెకు అవకాశాలు తగ్గడంతో పెళ్లి చేసుకుని సెటిలైపోయింది. చదవండి: అతడే నా భర్త, ఇంట్లో చెప్పే పెళ్లి చేసుకుంటాను: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు ఆ తర్వాత నటకు బ్రేక్ ఇచ్చిన మీరా జాస్మిన్ ఇటీవల ఓ తమిళ చిత్రంలో రీఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ క్రమంలో ఆమెకు తెలుగులో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మాస్ డైరెక్టర్ బోయపాటి తన సినిమాలో మీరాకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యంగ్ హీరో రామ్ పోతినేని బోయపాటి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చర్చలు, స్క్రిప్ట్‌ను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్.. ప్రస్తుతం నటీనటులు ఎంపిక దశలో ఉంది. చదవండి: ఆయనకు చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా: డైరెక్టర్ ఈ క్రమంలో హీరో అక్క పాత్రకు మీరా జాస్మిన్ను సంప్రదించినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే ఆమెకి బోయపాటి కధ,పాత్రను వివరించగా చేసేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇందులో అమెది కీలకమైన పాత్ర అని సమాచారం. కాగా బోయపాటి తెరకెక్కించిన మొదటి సినిమా భద్రలో మీరా జాస్మిన్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. -
బర్త్‌డే స్పెషల్: నటి మీరా జాస్మిన్ ఇప్పుడేం చేస్తుంది.. ఎక్కడుందో తెలుసా?
‘ఓణి వేసిన దిపావళి వచ్చిందా ఇంటికి’ అంటూ ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మీరా జాస్మిన్. మొదట ‘సూత్రదారన్’(2001) అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ‘అమ్మాయి బాగుంది’ చిత్రంతో నేరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక వరస హిట్లు అందుకుని స్టార్ హీరోయిన్గా ఎదిగిన మీరా జాస్మిన్ కొంతకాలంగా తెరపై కనుమరుగైంది. ఈ నేపథ్యంలో నేడు ఆమె బర్త్‌డే సందర్భంగా మారోసారి తెరపైకి వచ్చింది. మంగళవారం (ఫిబ్రవరి 15) ఆమె పుట్టిన రోజు సందర్భంగా తన లెటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా మీరా జాస్మిన్ సినీ ప్రయాణం, ఆమె సినిమాలను మరోసారి గుర్తు చేసుకుందాం. అమ్మాయి బాగుంది చిత్రంలో తెలుగు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సరసన గుడుంబా శంకర్ నటిచింది. ఆ వెంటనే రవితేజతో భద్రలో జోడి కట్టిన మీరా తొలి కమర్షియల్ హిట్ అందుకుంది. పరిశ్రమలో అడుగు పెట్టిన ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. ఇక తర్వాత ఆమెను వరస ప్లాప్ వెంటాడిన చివరి గొరింటాకులో రాజశేఖర్‌కు చెల్లిగా నటించి హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో తమిళ, మళయాళంలో ఆడపాదడపా సినిమాలు చేస్తున్న క్రమంలో దుబాయ్‌కి చెందిన ఇంజనీర్ అనిల్ జాన్ టిటస్ని పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది. ఈ క్రమంలో చాలా కాలం తర్వాత ఆమె లీడ్ రోల్లో మలయాళంలో 'మకల్' అనే చిత్రంలో రీఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఓ ఫొటోషూట్ ఫొటోలను షేర్ చేసి ఫుల్ గ్లామర్ షో చేసి ఫ్యాన్స్‌కు షాకిచ్చింది మీరా జాస్మిన్. -
రీఎంట్రీకి రెడీ..పెళ్లయినా హీరోయిన్స్‌గానే
వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ... ‘బొమ్మరిల్లు’లో ఇలాంటి డైలాగుల్లో జెనీలియా అమాయకత్వాన్ని మరచిపోలేం. అమ్మాయి.. బాగుంది.. చూడచక్కగా ఉంది.. నటన కూడా బాగుంది. ‘అమ్మాయి బాగుంది’తో తెలుగు తెరకు వచ్చిన మీరా జాస్మిన్‌కి లభించిన ప్రశంసలు.గ్లామర్ మాత్రమే కాదు.. మంచి నటి కూడా.. హిందీలో అనుష్కా శర్మకు దక్కిన అభినందనలు. ఈ ముగ్గురు భామలూ పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ చెప్పారు. ఇప్పుడు బ్రేక్‌కి ఫుల్స్టాప్ పెట్టారు. సినిమాలు సైన్ చేశారు. అభిమానులను ఆనందపరచడానికి మళ్లీ వస్తున్నారు. పెళ్లయిన నాయికలకు ‘లీడ్ రోల్స్’ రావు అనే మాటని ఐశ్వర్యా రాయ్ బచ్చన్, జ్యోతిక, రాణీ ముఖర్జీ వంటి తారలు అబద్ధం చేశారు. కథానాయికలుగా చేస్తున్నారు. అంతెందుకు? దాదాపు పద్నాలుగేళ్ల గ్యాప్ తర్వాత శ్రీదేవి రీ–ఎంట్రీ ‘ఇంగ్లిష్–వింగ్లిష్’లో చేసిన లీడ్ రోల్‌తోనే జరిగింది. ఆ తర్వాత ‘మామ్’లోనూ లీడ్ రోల్ చేశారామె. శ్రీదేవి హఠాత్తుగా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. లేకుంటే ఈ ఫిఫ్టీ ప్లస్ తారను మరిన్ని మెయిన్ రోల్స్‌లో చూడగలిగేవాళ్లం. మామూలుగా హాలీవుడ్లో ఫిఫ్టీ, సిక్స్టీ ప్లస్ తారలు కూడా నాయికలుగా చేస్తుంటారు. ఇండియన్ సినిమాలోనూ అది సాధ్యం అని నిరూపించారు శ్రీదేవి. ఇక రీ ఎంటర్ అవుతున్న తారల్లో జెనీలియా గురించి చెప్పాలంటే.. ‘బొమ్మరిల్లు, రెడీ, శశిరేఖా పరిణయం, ఆరెంజ్’.. ఇలా తెలుగులో మంచి సినిమాలు జెనీలియా ఖాతాలో ఉన్నాయి. 2012లో చేసిన ‘నా ఇష్టం’ తర్వాత ఈ నార్త్ బ్యూటీ తెలుగులో సినిమాలు చేయలేదు. అదే ఏడాది హిందీ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రెండు మూడు హిందీ చిత్రాల్లో, ఓ మరాఠీ చిత్రంలో అతిథి పాత్రల్లో కనిపించడంతో పాటు కొన్ని చిత్రాలకు నిర్మాతగా చేశారు. 2014లో ఒక బాబుకి, 2016లో ఓ బాబుకి జన్మనిచ్చారు జెనీలియా. ఇక నటిగా కొనసాగాలనుకుంటున్నారు. మరాఠీ సినిమా ‘వేద్’తో ఆమె రీ ఎంట్రీ షురూ అయింది. మరాఠీలో జెనీలియా కథానాయికగా చేస్తున్న తొలి చిత్రం ఇది. అది కూడా ఆమె భర్త రితేష్ దర్శకత్వం వహించనున్న సినిమా కావడం విశేషం. ‘‘నేను మహారాష్ట్రలో పుట్టి, పెరిగాను. కానీ మరాఠీలో పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర చేయలేదు. ఆ కొరత తీరుతున్నందుకు హ్యాపీగా ఉంది’’ అన్నారు జెనీలియా. ఇక, మీరా జాస్మిన్ విషయానికొస్తే.. ‘అమ్మాయి బాగుంది’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ అంతకు ముందే మలయాళ, తమిళ చిత్రాల్లో నటించారు. వాటిలో తమిళ చిత్రం ‘రన్’ తెలుగులోనూ విడుదలైంది. తెలుగులో ‘గుడుంబా శంకర్’, ‘భద్ర’ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 2014లో అనిల్ జాన్ని పెళ్లాడిన మీరా ఆ తర్వాత నాలుగైదు సినిమాల్లో నటించారు. వాటిలో అతిథి పాత్రలు ఉన్నాయి. బ్రేక్‌కి ముందు ట్రెడిషనల్ హీరోయిన్ క్యారెక్టర్లు చేసిన మీరా జాస్మిన్ రీ–ఎంట్రీలో అందుకు పూర్తి భిన్నమైన ఇమేజ్‌ని కోరుకుంటున్నట్లున్నారు. మళ్లీ వస్తున్న విషయాన్ని తెలియజేస్తూ, గ్లామరస్‌గా ఫొటోషూట్ చేయించుకున్నారు. అంతేకాదు.. అభిమానులకు అందుబాటులో ఉండాలని సోషల్ మీడియాలోకీ ఎంట్రీ ఇచ్చారు. ‘మక్కళ్’ అనే మలయాళ సినిమా అంగీకరించారు మీరా. ‘అందం హిందోళం.. అదరం తాంబూలం’ అంటూ ‘యముడికి మొగుడు’లో స్టైల్‌గా స్టెప్పులేసిన రాధ 30 ఏళ్ల క్రితం స్టార్ హీరోయిన్. తెలుగులో ‘అగ్నిపర్వతం’, ‘సింహాసనం’, ‘రాముడు భీముడు’ వంటి పలు చిత్రాల్లో కథానాయికగా 1980 నుంచి 1990 వరకూ నాటి తరానికి పాపులర్. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్ర హీరోలతో నటించారామె. 1991లో వ్యాపారవేత్త రాజశేఖరన్‌ని పెళ్లాడాక సినిమాలకు బ్రేక్ వేశారు. 30ఏళ్ల తర్వాత ఆమె రీ ఎంట్రీ ఇచ్చారు.. అయితే స్మాల్ స్క్రీన్‌కి. తమిళంలో ఈ మధ్యే ప్రసారం ప్రారంభమైన ‘సూపర్ క్వీన్’కి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు రాధ. మంచి పాత్రలు వస్తే సినిమాల్లోనూ నటించే ఆలోచనలో రాధ ఉన్నారని సమాచారం. అటు హిందీ వైపు వెళితే.. అనుష్కా శర్మ వెండితెరపై కనిపించి దాదాపు మూడేళ్లవుతోంది. 2017లో క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడాక, బ్రేక్ తీసుకున్నారామె. గత ఏడాది ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ ఐదేళ్ల బ్రేక్‌లో నటించలేదు కానీ, నిర్మాతగా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు బ్రేక్‌కి ఫుల్స్టాప్ పెట్టి, హీరోయిన్గా ‘చక్‌ద ఎక్స్‌ప్రెస్’ సినిమాకి సైన్ చేశారు అనుష్క. భారత ప్రముఖ మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. జులన్ పాత్రను అనుష్క చేస్తున్నారు. ‘‘ఇలాంటి ప్రయోజనాత్మకమైన సినిమా ద్వారా వస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు అనుష్కా శర్మ.రాధ, జెనీలియా, మీరా జాస్మిన్, అనుష్కా శర్మ.. వీరి ఎంట్రీ మరికొంతమంది తారలకు ఇన్స్పైరింగ్గా ఉంటుందని చెప్పొచ్చు. ఇక వీలైతే నాలుగు సినిమాలు లేదా అంతకు మించి.. కుదిరితే లీడ్ రోల్స్‌లో తమ అభిమాన తారలను చూడాలని ఫ్యాన్స్ కోరుకోకుండా ఉంటారా! -
ఒక్కరోజులోనే మీరా జాస్మిన్‌కు లక్షమంది ఫాలోవర్లు
Meera Jasmine Re Entry To Films Debuts On Instagram: ‘అమ్మాయే బాగుంది’చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళీ బ్యూటీ మీరా జాస్మిన్. 'గుడుంబా శంకర్', 'భద్ర' వంటి చిత్రాలతో తెలుగులో పాపులర్ అయిన ఈ బ్యూటీ ‘పందెం కోడి’ ‘గోరింటాకు’, ‘ఆకాశ రామన్న’ సహా పలు మలయాళ చిత్రాల్లో నటించింది. కానీ ఆశించిన స్థాయిలో విజయాలు లభించలేదు. దీంతో కొన్నాళ్లకి దుబాయ్‌కి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనిల్ జాన్ టైటాన్‌ని 2014లో పెళ్లి చేసుకుంది. అయితే మనస్పర్థల కారణంగా కొన్నాళ్లకు భర్త నుంచి విడిపోయిన మీరా జాస్మిన్.. మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ఇటీవలె సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మకల్ అనే ఓ మలయాళ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇన్‌స్టాగ్రామ్‌లోకి కూడా అడుగుపెట్టింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉండాలని భావిస్తుందట. అలా ఇన్‌స్టాలో ఆమె ఎంట్రీ ఇచ్చిందో లేదో ఆమెకు ఫాలోవర్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్క రోజులోనే సుమారు లక్షమంది ఆమెను ఫాలో అయ్యారు. -
హీరోయిన్ మీరా జాస్మిన్ ఇప్పుడెలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
Meera Jasmine Lifestory: కొంతమంది హీరోయిన్లు చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ తమదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరకాలం నిలిచిపోతుంటారు. అలాంటి కొద్ది మంది హీరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. తన అభినయం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది ఈ కేరళ కుట్టి. ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ కేవలం హావభావాలతో లక్షలాదిమంది మనస్సును దోచుకుంది. 2001-2010 కాలంలో ఆమె స్టార్ హీరోయిన్. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషల్లో నటించిన జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు పొందింది. కేరళకు చెందిన ఈ బ్యూటీ.. 1982 ఫిబ్రవరి 15న కేరళలోని తీరువల్లలో ఓ సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. ఈమె అసలు పేరు జాస్మిన్ మేరి జోసెఫ్. మీరా సోదరుడు జార్జ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశాడు. మీరా డిగ్రీ చదువుతున్న రోజుల్లో బ్లెస్సి అనే సహాయ దర్శకుడు ఆమెను చూసి సినిమాల్లోకి ఆహ్వానించాడు. ప్రముఖ దర్శకుడు లోహిత్ దాస్‌కు మీరాని పరిచయం చేసి మలయాళం మూవీ ‘సూత్రధారన్’లో అవకాశం ఇప్పించాడు. ఆ తర్వాత పలు కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లో నటించి మెప్పించిన మీరా.. ‘పాదమ్ ఒన్ను ఒరు విలాపం’ మూవీతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును అందుకుంది. (చదవండి: నయనతార, విజయ్ సేతుపతిలతో సమంత సెలబ్రేషన్.. ఫోటోలు వైరల్) ఇలా తనదైన నటనతో దూసుకెళ్తున్న మీరాకు తక్కువ టైమ్‌లోనే టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. తెలుగులోకి రిలీజైన్ డబ్బింగ్ మూవీ ‘రన్’తో టాలీవుడ్‌కి పరిచయమైంది మీరాజాస్మిన్. ఆ తర్వాత 2004లో హీరో శివాజీతో కలిసి ‘అమ్మాయి బాగుంది’లో నటించి మెప్పించింది. పవన్ కళ్యాణ్‌తో గుడుంబా శంకర్, రవితేజతో భద్ర, విశాల్‌తో పందెం కోడి తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఈ భామ. హీరో రాజశేఖర్, మీరా జాస్మిన్ అన్న చెల్లెలుగా నటించిన ‘గోరింటాకు’తో తెలుగింటి ఆడపడుచు అయిపోయింది. ఈ మూవీలోని ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించి ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది. తనదైన నటనతో దక్షిణాదిన స్టార్ హీరోయిన్గా ఎదిగిన మీరా.. 2014 లో దుబాయ్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటాన్‌ని వివాహం చేసుకొని సినిమాలకు దూరమైంది. అయితే వివాహం తర్వాత తలెత్తిన విబేధాల కారణంగా మీరా.. తన భర్తతో విడిపోయింది. అయినప్పటికీ ఆమె సినిమాలపైపు తిరిగి చూడలేదు. జీవితంలో ఉన్న ఒడిదుడుకుల కారణంగా సినిమాలకు దూరమైన ఆమె ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. కొంతకాలం క్రితం ఓ మలయాళం సినిమాలో గెస్ట్ రోల్లో మీరా కనిపించింది. అయితే ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మళ్లీ పూర్తిగా సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకుందట. రీ ఎంట్రీ కోసం ఈ అమ్మడు జిమ్ కి వర్క్ అవుట్స్ చేసి వెయిట్ లాస్ అయిందట. ప్రజెంట్ మీరాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదేమైనా.. భూమిక, స్నేహల మాదిరిగా మీరా సెకండ్ ఇన్సింగ్స్ కూడా సక్సెస్‌ఫుల్‌గా కొనసాగాలని ఆశిద్దాం. -
ఆరేళ్లుగా నటనకు దూరం.. రీ ఎంట్రీకి సిద్ధమైన హీరోయిన్
తన క్యూట్ ఎక్సెప్రెషన్స్, అభినయంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కేరళ భామ మీరా జాస్మిన్ అభిమానులకు గుడ్ న్యూస్. దాదాపు ఆరేళ్లకు పైగా సినిమాలకు గుడ్‌బై చెప్పిన కేరళ భామ మీరా జాస్మిన్ రీ ఎంట్రీకి రెడీ అయ్యారు. ప్రముఖ మలయాళీ దర్శకుడు సత్యన్ అంతికాడ్ రూపొందిస్తున్న సినిమాతో మీరా జాస్మిన్ మరోసారి వెండితెరపై కనిపించనుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ఫేస్బుక్ పేజ్ ద్వారా ప్రకటించారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లో మీరా జాస్మిన్ నటించనున్నట్లు వెల్లడించారు. అల వైకుంఠపురంలో ఫేం జయరాం, మీరా జాస్మిన్లు ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. జూలైలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు. మాధవన్ సరసన రన్ సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్..ఆ తర్వాత భద్ర, గుడుంబా శంకర్, పందెం కోడి వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 2014లో దుబాయ్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న అనిల్ జాన్ టైటస్‌ను పెళ్లి చేసుకుంది. అయితే వివాహం తర్వాత తలెత్తిన విభేదాల కారణంగా వీరు విడాపోయారు. వ్యక్తిగత జీవితంలో ఉన్న ఒడిదుడుకుల కారణంగా నటనకు దూరమైన మీరా జాస్మాన్..మరోసారి వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనుంది. చదవండి : ప్రియుడితో నయనతార.. ప్రత్యేక విమానంలో ఫ్లైట్‌లో తమన్నా: అక్కడ కోహ్లి ఏం చేస్తున్నాడు?