mla uttam kumarreddy
-
24 గంటల కరెంటు కాంగ్రెస్ చలవే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇవ్వడం కాంగ్రెస్ పుణ్యమేనని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్క విద్యుత్ ప్లాంటు అయినా పూర్తిచేశారా? అని ప్రశ్నించారు. ఒక్క యూనిట్ విద్యుత్‌ను కూడా అదనంగా ఉత్పత్తి చేయలేదన్నారు. జైపూర్ (మంచిర్యాల)లో 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీయే ఏర్పాటు చేసిందన్నారు. దీనిని టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు చేసినట్టుగా సీఎం కేసీఆర్ అబద్ధాలు చెప్పుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మిగులు విద్యుత్ ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కృషి, ముందుచూపు వల్లనే ఇప్పుడు మిగులు విద్యుత్ సాధ్యపడిందన్నారు. -
ముగిసిన టీ కాంగ్రెస్ సమన్వయ భేటీ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశం అనంతరం టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చించినట్లు చెప్పారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ఉత్తమ్ తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరోసారి భేటీ అవుతామని ఉత్తమ్ తెలిపారు. -
బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్
-
టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఉత్తమ్
హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా నియామకమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం గాంధీభవన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అలాగే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. అంతకన్నాముందు వీరు బంజారా హిల్స్‌లోని తమ నివాసాలనుంచి భారీ ర్యాలీగా పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లి ఆయనతో కలిసి గాంధీభవన్‌కు వచ్చారు. అయితే, ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం దగ్గర పెట్టిన ప్లెక్సీల్లో పొన్నాల ఫొటో లేకపోవడం విమర్షలకు తావిచ్చింది. అది ఆయనకు జరిగిన అవమానమేనంటూ పొన్నాల వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ ఇటీవలె ఉత్తమ్‌కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా, మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. -
మరికాసేపట్లో టీపీసీసీ చైర్మన్‌గా ఉత్తమ్ బాధ్యతలు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడిగా నియామకమైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం సాయంత్రం 3 గంటలకు గాంధీభవన్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఆయన బంజారా హిల్స్‌లోని తన నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి పొన్నాల నివాసానికి వెళ్లారు. అక్కడ నుంచి పొన్నాలతో కలిసి గాంధీ భవన్ కు వెళతారు. అంతకుముందు ఉత్తమ్ ఇంటికి వెళ్లి మాజీ టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ ఇటీవలె ఉత్తమ్‌కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా, మల్లు భట్టి విక్రమార్కను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.