mohammed rizwan
-
Aus vs Pak: చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా
పాకిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను ఆస్ట్రేలియా విజయంతో ఆరంభించింది. మెల్బోర్న్ వేదికగా సోమవారం జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచింది. పాకిస్తాన్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేసినా.. ఆసీస్ గెలుపు కోసం కష్టపడాల్సి వచ్చింది.చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియాపాక్ విధించిన స్వల్ప లక్ష్యాన్ని(204) ఛేదించే క్రమంలో 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన దశలో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఓవర్ ఓవర్‌కు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో ఆఖరి వరకు అజేయంగా జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇక ఈ గెలుపుతో ఆసీస్ చరిత్ర సృష్టించింది.వన్డే ఫార్మాట్లో పాకిస్తాన్‌తో ఆడిన తక్కువ మ్యాచ్‌లలోనే.. ఎక్కువ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఓవరాల్‌గా ఇప్పటి వరకు పాక్‌తో 109 మ్యాచ్‌లు ఆడిన కంగారూ జట్టు 71 మ్యాచ్‌లలో జయభేరి మోగించింది. ఇక ఈ జాబితాలో వెస్టిండీస్ రెండోస్థానంలో ఉంది. ఆసీస్‌తో సమానంగా 71సార్లు పాక్‌పై గెలుపొందినప్పటికీ.. మ్యాచ్‌ల పరంగా ఆసీస్ కంటే వెనుకబడింది.రిజ్వాన్‌కు కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఓటమికాగా మూడు వన్డే, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ జట్టు ఆసీస్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా సోమవారం(నవంబరు 4) ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. పాక్ వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కు ఇదే తొలి మ్యాచ్.ఇక మెల్బోర్న్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ చేసింది. మిచెల్ స్టార్క్ మూడు వికెట్లతో రాణించగా.. కమిన్స్ రెండు, ఆడం జంపా రెండు, లబుషేన్, సీన్ అబాట్ ఒక్కో వికెట్ తీశారు. ఈ క్రమంలో పాక్ 46.4 ఓవర్లలో కేవలం 203 పరుగులే చేసింది.నసీం షా బ్యాట్ ఝులిపించినాపాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. టెయిలెండర్ నసీం షా 40 రన్స్‌తో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ ఆతిథ్య ఆసీస్ కమిన్స్ ఆఖరి వరకు పట్టుదలగా నిలబడంతో 33.3 ఓవర్లలో పనిపూర్తి చేసింది. పాక్‌పై రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది. స్టార్క్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్లు షఫీక్(12), సయీమ్ ఆయుబ్(1) సహా 19 బంతుల్లోనే 24 రన్స్ చేసిన షాహిన్ ఆఫ్రిదిని అవుట్ చేసి పాక్ బ్యాటింగ్ ఆర్డర్‌ను అతడు దెబ్బకొట్టాడు. పాకిస్తాన్‌పై వన్డేల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లుఆస్ట్రేలియా- 71 (109 మ్యాచ్‌లు)వెస్టిండీస్- 71 (137 మ్యాచ్‌లు)శ్రీలంక- 59 (157 మ్యాచ్‌లు)ఇంగ్లండ్- 57 (92 మ్యాచ్‌లు)ఇండియా- 57 (135 మ్యాచ్‌లు)ఆసీస్ వర్సెస్ పాక్ తొలి వన్డే - ప్లేయింగ్ ఎలెవన్ఆస్ట్రేలియామాథ్యూ షార్ట్, జేక్ ఫ్రేజర్-మెగర్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్వెల్, ఆరోన్ హార్డీ, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.పాకిస్తాన్అబ్దుల్లా షఫీక్, సయీమ్ అయూబ్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్, వికెట్ కీపర్), కమ్రాన్ గులాం, ఆఘా సల్మాన్, ఇర్ఫాన్ ఖాన్, షాహిన్ అఫ్రిది, నసీం షా, హారిస్ రవూఫ్, మహ్మద్ హస్నైన్.చదవండి: ICC: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, జింబాబ్వేలకు భారత్ ఆతిథ్యం -
ఉత్కంఠ పోరులో పాక్‌పై ఆస్ట్రేలియా గెలుపు
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (నవంబర్ 4) జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ సమరంలో పాక్ నిర్దేశించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ (31 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు) ఆడి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. కమిన్స్‌కు మిచెల్ స్టార్క్ (2 నాటౌట్) సహకరించాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 46.4 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటైంది. నసీం షా (39 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (71 బంతుల్లో 44; 2 ఫోర్లు, సిక్స్), బాబర్ ఆజమ్ (44 బంతుల్లో 37; 4 ఫోర్లు), షాహీన్ అఫ్రిది (19 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), ఇర్ఫాన్ ఖాన్ (35 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేసి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. అబ్దుల్లా షఫీక్ (12), సైమ్ అయూబ్ (1), కమ్రాన్ గులామ్ (5), అఘా సల్మాన్ (12) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ తన కోటా 10 ఓవర్లు పూర్తి చేసి 33 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇందులో మూడు మెయిడిన్లు ఉన్నాయి. కమిన్స్, జంపా, అబాట్, లబూషేన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. ఓ దశలో సునాయాసంగా గెలుపొందేలా కనిపించింది. అయితే పాక్ బౌలర్లు మధ్యలో పుంజుకోవడంతో ఆసీస్ త్వరితగతిన వికెట్లు కోల్పోయి, ఓటమి దిశగా పయనించింది. ఈ సమయంలో కమిన్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. కమిన్స్‌తో పాటు స్టీవ్ స్మిత్ (44), జోష్ ఇంగ్లిస్ (49) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆసీస్ 33.3 ఓవర్లలో ఎనిమిది కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో మాథ్యూ షార్ట్ 1, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 16, లబూషేన్ 16, ఆరోన్ హార్డీ 10, మ్యాక్స్‌వెల్ 0, సీన్ అబాట్ 13 పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 3, షాహీన్ అఫ్రిది 2, నసీం షా, మొహమ్మద్ హస్నైన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. వన్డే సిరీస్‌లోని రెండో మ్యాచ్ నవంబర్ 8న అడిలైడ్ వేదికగా జరుగనుంది. -
పాకిస్తాన్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు..!
పాకిస్తాన్ పరిమిత ఓవర్ల జట్ల నూతన కెప్టెన్‌గా మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మొహిసిన్ నఖ్వి అధికారికంగా ప్రకటించాడు. కొద్ది రోజుల కిందట పాక్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజమ్ వైదొలిగిన విషయం తెలిసిందే. రానున్న ఆస్ట్రేలియా, జింబాబ్వే టూర్లతో రిజ్వాన్ కెప్టెన్‌గా తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఇవాళ ఉదయం ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం పాకిస్తాన్ జట్లను ప్రకటించారు. జట్లను ప్రకటించే సమయంలో కెప్టెన్ పేరును వెల్లడించలేదు. తాజాగా పీసీబీ చీఫ్ మొహిసిన్ నఖ్వి రిజ్వాన్ పేరును ప్రకటించాడు. రిజ్వాన్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) సల్మాన్ అలీ అఘా వ్యవహరిస్తాడని నఖ్వీ తెలిపాడు.పాక్ క్రికెట్ బోర్డు ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం జట్లను ఎంపిక చేయడంతో తమ పాటు తమ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను కూడా ప్రకటించింది. పాక్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో కొత్తగా ఐదుగురికి అవకాశం లభించింది. బాబర్ ఆజమ్‌కు అనుకూలంగా బోర్డుకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన ఫఖర్ జమాన్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు.సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల జాబితా..కేటగిరీ-ఏ: బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్కేటగిరీ-బి: నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, షాన్ మసూద్కేటగిరీ-సి: అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, హరీస్ రవూఫ్, నోమన్ అలీ, సైమ్ అయూబ్, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్కేటగిరీ-డి: అమీర్ జమాల్, హసీబుల్లా, కమ్రాన్ గులాం, ఖుర్రం షాజాద్, మీర్ హంజా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మొహమ్మద్ అలీ, మహ్మద్ హుర్రైరా, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, ఉస్మాన్ ఖాన్ఆస్ట్రేలియా, జింబాబ్వే పర్యటనల కోసం పాక్ జట్లు..ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షాహీన్ షా అఫ్రిదిఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు పాకిస్తాన్ జట్టు..అరాఫత్ మిన్హాస్, బాబర్ ఆజమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా, జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, నసీమ్ షా, ఒమైర్ బిన్ యూసుఫ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అలీ అఘా, షాహీన్ అఫ్రిది, సుఫ్యాన్ మొకిమ్, ఉస్మాన్ ఖాన్జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు పాక్ జట్టు..అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫైసల్ అక్రమ్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), కమ్రాన్ గులామ్, మహ్మద్ హస్నైన్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌కీపర్), ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా, షానవాజ్ దహానీ, తయ్యబ్ తాహిర్జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు పాక్ జట్టు..అహ్మద్ డానియాల్, అరాఫత్ మిన్హాస్, హరీస్ రవూఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), జహందాద్ ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హస్నైన్, ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్, ఒమైర్ బిన్ యూసుఫ్, ఖాసిం అక్రమ్, సాహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా, సుఫ్యాన్ మొఖిమ్, ఉస్మాన్ ఖాన్ -
రెచ్చిపోయిన రీజా హెండ్రిక్స్.. రాణించిన రిజ్వాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో ముల్తాన్ సుల్తాన్స్ ఆటగాడు రీజా హెండ్రిక్స్ భీకర ఫామ్ కొనసాగుతుంది. ఈ సీజన్లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన హెండ్రిక్స్ తాజాగా మరో హాఫ్ సెంచరీ సాధించాడు. క్వెట్టా గ్లాడయేటర్స్తో ఇవాళ (ఫిబ్రవరి 25) జరిగిన మ్యాచ్‌లో హెండ్రిక్స్ మెరుపు అర్ధశతకంతో (47 బంతుల్లో 72; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. ఫలితంగా సుల్తాన్స్ 13 పరుగుల తేడాతో గ్లాడియేటర్స్‌పై విజయం సాధించింది. సుల్తాన్స్ విజయంలో ఆ జట్టు కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్ (51) సైతం కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. హెండ్రిక్స్, రిజ్వాన్‌తో పాటు తయ్యబ్ తాహిర్ (35 నాటౌట్) రాణించాడు. గ్లాడియేటర్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 2, అకీల్ హొసేన్, అబ్రార్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గ్లాడియేటర్స్ నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 9 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి లక్ష్యానికి 14 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సుల్తాన్స్ బౌలర్లలో మొహమ్మద్ అలీ అద్భుత ప్రదర్శనతో (4-1-19-3) విజృంభించగా.. డేవిడ్ విల్లే 3, ఆఫ్తాబ్ ఇబ్రహీం 2, ఉసామా మిర్ ఓ వికెట్ పడగొట్టారు. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో ఖ్వాజా నఫే (36), రిలీ రొస్సో (30) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. -
పాకిస్తాన్ వైస్ కెప్టెన్‌గా మొహమ్మద్ రిజ్వాన్
పాకిస్తాన్ టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా మొహమ్మద్ రిజ్వాన్ ఎంపికయ్యాడు. వన్డే వరల్డ్‌కప్ అనంతరం కెప్టెన్‌గా బాబర్ ఆజమ్ తప్పుకోవడంతో పాక్ టీ20 జట్టుకు కెప్టెన్‌గా షాహీన్ అఫ్రిది ఎంపిక కాగా.. తాజాగా అఫ్రిదికి డిప్యూటీగా రిజ్వాన్ ఎంపిక చేశారు పాక్ సెలెక్టర్లు. త్వరలో న్యూజిలాండ్‌తో జరుగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి అఫ్రిది, రిజ్వాన్ బాధ్యతలు చేపడతారు. .@iMRizwanPak has been appointed vice-captain of Pakistan's T20I team 🚨 pic.twitter.com/0Zu6DcstML — Pakistan Cricket (@TheRealPCB) January 8, 2024 కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం పాక్ న్యూజిలాండ్ గడ్డపై ల్యాండ్ అయ్యింది. జనవరి 12, 14, 17, 19, 21 తేదీల్లో ఆక్లాండ్, హామిల్టన్, డునెడిన్, క్రైస్ట్ చర్చ్ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. బాబర్ ఆజమ్ పాక్ కెప్టెన్‌గా తప్పుకున్న తర్వాత ఆ దేశ టెస్ట్ జట్టుకు షాన్ మసూద్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. టెస్ట్, టీ20 జట్లకు కెప్టెన్లను ప్రకటించిన పీసీబీ వన్డే జట్టు కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఇటీవలే ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడిన పాక్.. 0-3 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది. ఈ సిరీస్ మొత్తం పాక్ పేలవ ప్రదర్శన కనబర్చి దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్‌కు ముందు వరల్డ్‌కప్‌లోనూ పాక్ చెత్త ఆడి సెమీస్‌కు చేరకుండానే మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. న్యూజిలాండ్‌తో ఐదు టీ20లకు పాక్ జట్టు: షాహీన్ ఆఫ్రిది (కెప్టెన్), ఆమిర్ జమాల్, అబ్బాస్ అఫ్రిది, ఆజం ఖాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసీబుల్లా (వికెట్‌కీపర్), ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వైస్ కెప్టెన్) , మహ్మద్ వాసిం జూనియర్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, ఉసామా మీర్, జమాన్ ఖాన్ -
ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది! మేము ‘చోకర్స్’ కాదు.. అర్థమైందా?
ICC WC 2023- South Africa Beat Pakistan By 1 Wicket: భారత్‌లో వన్డే ప్రపంచకప్-2023.. రెండు వరుస విజయాలు.. ఆ తర్వాత హ్యాట్రిక్ ఓటములు.. వెరసి సెమీస్ అవకాశాలు సంక్లిష్టం.. ఇలాంటి దశలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దురదృష్టం వెక్కిరించింది.. ‘చోకర్స్’ అన్న పేరున్న జట్టు చేతిలో ఘోర పరాభవానికి గురై సెమీస్ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించే దుస్థితికి చేరుకుంది.. ఈ ఉపోద్ఘాతమంతా పాకిస్తాన్ జట్టు గురించే అని ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఆరంభ శూరత్వమే! వరల్డ్‌కప్-2023లో నెదర్లాండ్స్‌తో తొలి మ్యాచ్ ఆడిన బాబర్ ఆజం బృందం 81 పరుగులతో జయభేరి మోగించింది. అనంతరం మ్యాచ్‌లో శ్రీలంకను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత గెలుపు అన్న మాటనే మరిచిపోయింది. చిరకాల ప్రత్యర్థి టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన తర్వాత.. పాకిస్తాన్‌ను వరుసగా పరాజయాలే పలకరించాయి. తాజాగా శుక్రవారం నాటి మ్యాచ్‌లో సౌతాఫ్రికా సైతం తమపై జయకేతనం ఎగురవేయడంతో బాబర్ బృందం సెమీస్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. నువ్వా- నేనా.. నరాలు తెగే ఉత్కంఠ అయితే, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అటు పాకిస్తాన్ ఆటగాళ్లు.. తమపై పాక్ ఆధిపత్యాన్ని తగ్గించడం సహా టేబుల్ టాపర్‌గా నిలించేందుకు ఇటు సౌతాఫ్రికా ప్లేయర్లు పోరాడిన తీరు మాత్రం క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకుంది. పాక్ విధించిన 271 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 10 పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన ప్రొటిస్ జట్టు మరోసారి చోకర్స్ అనిపించుకోవడం ఖాయమంటూ విశ్లేషణలు ఓవైపు.. ఆఖరి వికెట్ తీసేందుకు అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్న పాకిస్తాన్ డూ ఆర్ డై మ్యాచ్‌లో గెలిచి నిలుస్తుందా అన్న చర్చలు మరోవైపు.. చివరి వరకు హైడ్రామా.. పాక్ గెలుపు ఖాయమైందన్నంతగా ఆ మధ్యలో 46వ ఓవర్ ఆఖరి బంతికి పాకిస్తాన్ పేసర్ హ్యారిస్ రవూఫ్.. సఫారీ జట్టు టెయిలెండర్ తబ్రేజ్ షంసీని అవుట్ చేసినంత పనిచేశాడు. పాక్‌కు గెలుపు ఖాయమైపోయిందన్నంత నమ్మకంగా ఎల్బీకి అప్పీలు చేశాడు. అయితే అనుభవజ్ఞుడైన అంపైర్ అలెక్స్ వార్ఫ్ అదేమీ లేదన్నట్లు అడ్డంగా తలూపాడు. పాకిస్తాన్‌కు వేరే ఆప్షన్ లేదు. రవూఫ్ ఓవైపు.. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మరోవైపు నమ్మకంగా చెప్పడంతో కెప్టెన్ బాబర్ ఆజం రివ్యూకు వెళ్లాడు. సఫారీల అదృష్టం బాగుంది కానీ.. షంసీ అదృష్టం బాగుంది. బంతి లెగ్ స్టంప్‌ను జస్ట్ అలా ముద్దాడినట్లుగా అనిపించింది గానీ మిస్ అయింది.. అంపైర్స్ కాల్ నాటౌట్ కావడంతో సౌతాఫ్రికాకు ఫేవర్‌గా ఫలితం వచ్చింది. అంతే.. పాక్ ఆటగాళ్లు ఒక్కసారిగా నీరుగారిపోయారు. రవూఫ్ అయితే ఏడ్చినంత పనిచేశాడు. రిజ్వాన్ సైతం ఒక్కసారిగా పరిగెత్తుకు వచ్చి రవూఫ్‌ను హత్తుకుని ‘ఎమోషనల్’ అయ్యాడు. పాకిస్తాన్ శిబిరం మొత్తం నిరాశలో కూరుకుపోయింది. ఓవరాక్షన్ రిజ్వాన్.. అతడి గుండె పగిలింది ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఐసీసీ సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నెటిజన్లలో కొందరు పాక్ ఆటగాళ్లకు సానుభూతి తెలుపుతుండగా.. ‘‘ఓవరాక్షన్ రిజ్వాన్‌ను ఇలా చూడాల్సి వస్తుందని అనుకోలేదు’’ అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. కాగా పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ కాస్త అతి చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ సమయంలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను హడలెత్తించే క్రమంలో మాటిమాటికి గట్టిగా అప్పీలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఆటతో సంబంధంలేని విషయాల్లోనూ తలదూరుస్తూ ఉంటాడు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తున్నారు. మేము చోకర్స్ కాదు.. అర్థమైందా? ఇక చెన్నై మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో పాక్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో 48వ ఓవర్ రెండో బంతికి కేశవ్ మహరాజ్ ఫోర్ బాది పాకిస్తాన్ ఓటమిని ఖరారు చేసి సౌతాఫ్రికాపై ఉన్న ‘చోకర్స్’(అంతా బాగా ఆడి ఆఖరి నిమిషంలో చేతులెత్తేస్తారన్న అర్థంలో) అన్న ట్యాగ్ ఇకపై తమకు వాడొద్దనేలా సంకేతాలు ఇచ్చాడు. ఇక సఫారీల చేతిలో ఓటమితో పాక్ సెమీ ఫైనల్ ఆశలకు దాదాపు గండిపడినట్లే! చదవండి: Ind vs Aus: టీమిండియాతో టీ20 సిరీస్.. జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్ అతడే WC 2023: అతడు అవుట్ అయినట్లు తేలితే మేమే గెలిచేవాళ్లం.. ఓటమికి కారణం అదే: బాబర్ View this post on Instagram A post shared by ICC (@icc) -
భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇరగదీసిన బాబర్ ఆజమ్
భారత గడ్డపై ఆడిన తొలి మ్యాచ్‌లోనే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో ఇరగదీశాడు. వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (సెప్టెంబర్ 29) జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ చెలరేగిపోయాడు. 84 బంతులత్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి మిచెల్ సాంట్నర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. బాబర్‌తో పాటు మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న మొహమ్మద్ రిజ్వాన్ సైతం భారత్‌లో ఆడిన తన తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేశాడు. రిజ్వాన్ 53 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. వీరిద్దరూ అర్ధసెంచరీలతో రాణించడంతో వార్మప్ గేమ్‌లో పాక్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాక్.. 32 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. రిజ్వాన్ (62), సౌద్ షకీల్ (5) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (14), ఇమామ్ ఉల్ హాక్ (1) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, ఈ మ్యాచ్‌కు మధ్యలో కాసేపు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిన్నపాటి వర్షం కావడంతో మ్యాచ్ ఓవర్ల కోతకు గురికాకుండా కొనసాగుతుంది. మరోవైపు ఇవాలే జరుగుతున్న మరో వార్మప్ మ్యాచ్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. గౌహతిలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న శ్రీలంక.. 40 ఓవర్ల తర్వాత 5 వికెట్ల నష్టానికి 202 పరగులు చేసింది. ధనంజయ డిసిల్వ (45), కరుణరత్నే క్రీజ్‌లో ఉన్నారు. తిరువనంతపురంలో ఇవాళ జరగాల్సిన సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దైంది. -
బాబర్ ఆజమ్ శతక్కొట్టినా, సూర్యకుమార్‌ను కదిలించలేకపోయాడు
ICC T20 Rankings: భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ టి20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. గత ఏడాది నవంబర్ 2న సూర్య టాప్ ర్యాంక్‌లోకి దూసుకొచ్చాడు. బుధవారం (ఏప్రిల్ 26) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సూర్య 906 రేటింగ్ పాయింట్లతో అగ్ర స్థానంలోనే ఉన్నాడు. రిజ్వాన్ (811 పాయింట్లు) రెండో ర్యాంక్‌లో, బాబర్ ఆజమ్ (756 పాయింట్లు) మూడో ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. చదవండి: Hardik Pandya: కెప్టెన్ అన్న అహంకారంతో విర్రవీగుతున్నాడు, తీసేయండి..! బాబర్ ఆజమ్ శతక్కొట్టినా, సూర్యకుమార్‌ను కదిలించలేకపోయాడు.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో (5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన రెండో టీ20) సూపర్ సెంచరీతో (58 బంతుల్లో 101) చెలరేగిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. బాబర్ శతక్కొట్టినా అతని ర్యాంకింగ్‌లో ఎలాంటి మార్పు లేదు. అతను ఇంకా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే సిరీస్ మహ్మద్ రిజ్వాన్ కూడా రెండు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ అతని ర్యాంక్ కూడా మారలేదు. అతను రెండో ర్యాంక్‌లోనే కొనసాగుతున్నాడు. చదవండి: Rahane: ఇప్పుడేం చూశారు.. ముందుంది ముసళ్ల పండుగ, సినిమా చూపిస్తా..! -
న్యూజిలాండ్ బ్యాటర్ ఊచకోత.. పాక్‌కు పరాభవం
న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాకిస్తాన్‌కు పరాభవం ఎదురైంది. స్వదేశంలో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి కూడా ఆ జట్టు సిరీస్ గెలవలేకపోయింది. నిన్న (ఏప్రిల్ 24) జరిగిన ఐదో టీ20లో పర్యాటక జట్టు గెలవడం ద్వారా 2-2తో సిరీస్ సమమైంది. ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు పాక్ గెలువగా.. మూడు, ఐదు మ్యాచ్‌లలో కివీస్ నెగ్గింది. నాలుగో టీ20 వర్షం కారణంగా రద్దైంది. చాప్మన్ ఊచకోత.. రిజ్వాన్ మెరుపులు వృధా రావల్పిండి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. మహ్మద్ రిజ్వాన్ (62 బంతుల్లో 98 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ (22 బంతుల్లో 36), ఇమాద్ వసీం (14 బంతుల్లో 31) ఓ మోస్తరుగా రాణించారు. కివీస్ బౌలర్లలో టిక్నర్ 3, సోధి ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో మార్క్ చాప్మన్ (57 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో న్యూజిలాండ్ 19.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి జయకేతనం ఎగురవేసింది. చాప్‌మన్‌కు జతగా నీషమ్ (45 నాటౌట్) రాణించాడు. పాక్ బౌలర్లలోషాహీన్ అఫ్రిది, ఇమాద్ వసీం చెరో 2 వికెట్లు పడగొట్టారు. సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన చాప్‌మన్‌కు (34, 65*, 16*, 71*, 104*) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు కూడా లభించింది. ఇరు జట్ల మధ్య ఏప్రిల్ 27 నుంచి 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. -
సిక్సర్ బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చిన షాహిన్ అఫ్రిది
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ముల్తాన్ సుల్తాన్స్ ఇదివరకే ఫైనల్స్‌కు చేరుకోగా.. నిన్న (మార్చి 17) జరిగిన మ్యాచ్‌లో పెషావర్ జల్మీపై విజయం (4 వికెట్ల తేడాతో) సాధించడంతో లాహోర్ ఖలందర్స్ ఇవాళ జరిగే తుది సమరానికి అర్హత సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ జల్మీ.. మహ్మద్ హరీస్ (54 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ ఆజమ్ (36 బంతుల్లో 42; 7 ఫోర్లు), రాజపక్స (18 బంతుల్లో 25 నాటౌట్; 4 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేయగా.. మీర్జా తాహిర్ బేగ్ (42 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగడంతో ఖలందర్స్ మరో 7 బంతులు మిగిలుండగానే 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఆఖర్లో ఖలందర్స్ కెప్టెన్ షాహీన్ అఫ్రిది (11 నాటౌట్) వరుసగా బౌండరీ, సిక్సర్ బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. సామ్ బిల్లింగ్స్ (28), సికందర్ రజా (23) ఓ మోస్తరుగా రాణించారు. జల్మీ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 2, వాహబ్ రియాజ్, ఆమెర్ జమాల్, సల్మాన్ ఇర్షాద్ తలో వికెట్ దక్కించుకోగా.. ఖలందర్స్ బౌలర్లు జమాన్ ఖాన్, రషీద్ ఖాన్ తలో 2 వికెట్లు, షాహీన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టాడు. -
సామ్ బిల్లింగ్స్ మెరుపు అర్ధశతకం.. రషీద్ ఖాన్ మయాజాలం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023లో భాగంగా ముల్తాన్ సుల్తాన్స్‌తో నిన్న (మార్చి 4) జరిగిన మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఖలందర్స్.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. వికెట్‌కీపర్ సామ్ బిల్లింగ్స్ (35 బంతుల్లో 54; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు అర్ధసెంచరీతో చెలరేగగా.. షఫీక్ (35 బంతుల్లో 48; 6 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్‌తో రాణించాడు. ఫకర్ జమాన్ (0), తలాత్ (9), రషీద్ ఖాన్ (0), షాహీన్ అఫ్రిది (9), హరీస్ రౌఫ్ (0) విఫలం కాగా.. మీర్జా బేగ్ (17), సికందర్ రజా (14), డేవిడ్ వీస్ (15 నాటౌట్) రెండంకెల స్కోర్ చేశారు. సుల్తాన్స్ బౌలర్లలో అన్వర్ అలీ, ఇహసానుల్లా, అబ్బాస్ అఫ్రిది, పోలార్డ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. సమీన్ గుల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సుల్తాన్స్ బౌలర్లు 14 ఎక్స్ట్రా పరుగులు ఇచ్చారు. ఇందులో 11 వైడ్ బాల్స్ ఉండటం విశేషం. అనంతరం 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సుల్తాన్స్.. నిర్ణీత ఓవర్లు పూర్తియ్యేసరికి 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఖలందర్స్ బౌలర్ రషీద్ ఖాన్ (4-0-15-3) తన స్పిన్ మాయాజాలంతో సుల్తాన్స్‌ను భారీ దెబ్బకొట్టగా.. జమాన్ ఖాన్ (1/23), హరీస్ రౌఫ్ (1/30), సికందర్ రజా (1/10), హుసేన్ తలాత్ (1/22) తలో వికెట్ పడగొట్టారు. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో కీరన్ పోలార్డ్ (28 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), మహ్మద్ రిజ్వాన్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించినా ప్రయోజనం లేకుండా పోయింది. మహ్మద్ రిజ్వాన్ సూపర్ ఫామ్‌లో ఉండటంతో సీజన్ ఆరంభంలో వరుసగా విజయాలు సాధించిన సుల్తాన్స్.. రిజ్వాన్ ఒక్కసారిగా లయ తప్పడంతో పరాజయాల బాటపట్టింది. లీగ్‌లో ఇవాళ (మార్చి 5) ఇస్లామాబాద్ యునైటెడ్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. -
షంషి, షోయబ్ మాలిక్ మాయాజాలం.. రిజ్వాన్ జట్టుకు ఊహించని షాక్
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని ముల్తాన్ సుల్తాన్స్‌కు రెండో ఓటమి ఎదురైంది. ప్రస్తుత సీజన్లో తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన సుల్తాన్స్ ఆ తర్వాత వరుసగా 4 విజయాలు సాధించి, ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన 6వ మ్యాచ్‌లో ఓటమిపాలైంది. ప్రస్తుత సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న రిజ్వాన్.. ఈ మ్యాచ్‌లో విఫలం కావడంతో సుల్తాన్స్ ఓటమిపాలైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో వరుసగా 75, 28 నాటౌట్, 66, 50, 110 నాటౌట్, 29 స్కోర్లు చేసిన రిజ్వాన్.. ఈ ఒక్క మ్యాచ్‌లోనే నిరుత్సాహపరిచాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ముల్తాన్ సుల్తాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కింగ్స్.. మాథ్యూ వేడ్ (46), జేమ్స్ విన్స్ (27), తయ్యబ్ తాహిర్ (65) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా, ఛేదనలో సుల్తాన్స్ 101 పరుగులకే చాపచుట్టేయడంతో ఓటమిపాలైంది. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ (25), మహ్మద్ రిజ్వాన్ (29), అన్వర్ అలీ (12), ఉసామా అలీ (10) మినహా మిగతవారు కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేకపోయారు. తబ్రేజ్ షంషి (3/18), షోయబ్ మాలిక్ (3/18), అకీఫ్ జావిద్ (2/8), ఇమాద్ వసీం (2/34) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు సుల్తాన్స్‌ను కట్టడి చేయడంలోనూ సఫలమయ్యారు. అంతకుముందు ముల్తాన్స్ బౌలర్లు ఇహసానుల్లా 2 వికెట్లు, అన్వర్ అలీ ఓ వికెట్ పడగొట్టారు. పీఎస్ఎల్లో ఇవాళ రాత్రి లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ తలపడనున్నాయి. -
మహ్మద్ రిజ్వాన్ విధ్వంసకర శతకం.. 18 బంతుల్లోనే..!
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్ కెప్టెన్, పాక్ స్టార్ ప్లేయర్ మహ్మద్ రిజ్వాన్ భీకర ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటివరకు జరిగిన 4 మ్యాచ్‌ల్లో వరుసగా 75, 28 నాటౌట్, 66, 50 స్కోర్లు చేసిన రిజ్వాన్.. నిన్న (ఫిబ్రవరి 22) కరాచీ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మరింతగా రెచ్చిపోయి ఉగ్రరూపం దాల్చాడు. 60 బంతుల్లోనే శతకం బాది, పీఎస్ఎల్లో తన మొదటి సెంచరీని నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో తొలి హాఫ్ సెంచరీ చేసేందుకు 42 బంతులు తీసుకున్న రిజ్వాన్.. రెండో హాఫ్ సెంచరీని కేవలం 18 బంతుల్లోనే పూర్తి చేసి పీఎస్ఎల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. మొత్తంగా ఈ ఇన్నింగ్స్‌లో 64 బంతులు ఎదుర్కొన్న రిజ్వాన్..10 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ⚠️ Riz-storm! #MohammadRizwan #HBLPSL8 | #SabSitarayHumaray | #MSvKK pic.twitter.com/hWD3IdESrP — Alex Cricket Prediction (@alex_prediction) February 22, 2023 ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన అతని జట్టు నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో కరాచీ కింగ్స్ సైతం అద్భుతంగా పోరాడింది. జేమ్స్ విన్స్ (34 బంతుల్లో 75; 7 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్ ఇమాద్ వసీం (26 బంతుల్లో 46 నాటౌట్; 5 సిక్సర్లు) సునామీ ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడినప్పటికీ ఆ జట్టు లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో కరాచీ కింగ్స్ 5 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేయగలిగింది. కింగ్స్ జట్టులో విన్స్, ఇమాద్ మినహా మిగతా వారెవ్వరూ రాణించలేదు. కాగా, ప్రస్తుత సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న రిజ్వాన్ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో 109.66 సగటున, 144 స్ట్రయిక్ రేట్‌తో సెంచరీ, 3 హాఫ్ సెంచరీల సాయంతో 329 పరుగులు చేసి, సీజన్ టాప్ స్కోరర్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఓవరాల్‌గా రిజ్వాన్ గత 10 టీ20 ఇన్నింగ్స్‌లో 6 హాఫ్‌సెంచరీలు, ఓ సెంచరీ సాధించి కెరీర్లో అత్యుత్తమ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. అతని ఫామ్ కారణంగా ముల్తాన్ సుల్తాన్స్ ప్రస్తుత సీజన్లో వరుసగా నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. -
కిల్లర్ మిల్లర్ ఊచకోత.. పోలార్డ్ విధ్వంసం
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. ఇవాళ (ఫిబ్రవరి 19) ఇస్లామాబాద్ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ రెచ్చిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (38 బంతుల్లో 50; 5 ఫోర్లు, సిక్స్), రిలీ రొస్సో (30 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (25 బంతుల్లో 52; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), పోలార్డ్ (21 బంతుల్లో 32 నాటౌట్; 4 ఫోర్లు, సిక్స్) శివాలెత్తడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. Killer Miller time 🤩#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvIU pic.twitter.com/7bfAEfTRAp — PakistanSuperLeague (@thePSLt20) February 19, 2023 ఈ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్, రొస్సో ఓ మోస్తరుగా బ్యాట్ ఝులిపించగా.. మిల్లర్, పోలార్డ్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. మిల్లర్ 4 సిక్సర్లు, 3 ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోస్తే.. పోలార్డ్ చిన్న సైజ్ విధ్వంసమే సృష్టించాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మిల్లర్ హ్యాట్రిక్ సిక్సర్లతో విరుచుకుపడితే.. ఇన్నింగ్స్ ఆఖరి మూడు బంతులను పోలీ బౌండరీలకు తరలించాడు. సుల్తాన్స్ ఇన్నింగ్స్‌లో మసూద్ (3) ఒక్కడే నిరాశపరిచాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో రయీస్, మహ్మద్ వసీం జూనియర్, షాదాబ్ ఖాన్, టామ్ కర్రన్ తలో వికెట్ పడగొట్టారు. A hat-trick of boundaries ⚡ The perfect finish for @MultanSultans 🙌#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvIU pic.twitter.com/5HcJQpxs8h — PakistanSuperLeague (@thePSLt20) February 19, 2023 191 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇస్లామాబాద్.. అబ్బాస్ అఫ్రిది (4/22), మహ్మద్ ఇలియాస్ (2/12), ఇహసానుల్లా (2/19), ఉసామా మిర్ (2/33) చెలరేగడంతో 17.5 ఓవర్లలో 138 పరుగలకు ఆలౌటై, 52 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇస్లామాబాద్ ఇన్నింగ్స్‌లో డస్సెన్ (49) టాప్ స్కోరర్‌గా నిలువగా.. హసన్ (21), మున్రో (31), ఆజం ఖాన్ (16) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో ముల్తాన్ సుల్తాన్స్ హవా కొనసాగుతుంది. తొలి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ చేతిలో ఓడిన ఈ జట్టు, ఆతర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించింది. సుల్తాన్స్ కెప్టెన్ రిజ్వాన్ ఈ సీజన్లో ఇప్పటికే మూడు హాఫ్ సెంచరీలు సాధించి సూపర్ ఫామ్‌లో ఉండగా.. రిలీ రొస్సో 3 మ్యాచ్‌ల్లో రెండు మెరుపు హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌తో కిల్లర్ మిల్లర్ కూడా ఫామ్‌లోకి రావడంతో తదుపరి లీగ్‌లో ప్రత్యర్ధి బౌలర్లకు కష్టాలు తప్పవని విశ్లేషకులు అంటున్నారు. లీగ్‌లో ఇవాళ జరుగబోయే మరో మ్యాచ్‌లో కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్ తలపడనున్నాయి. -
రచ్చరచ్చ చేసిన మహ్మద్ రిజ్వాన్, రిలీ రొస్సో
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో ముల్తాన్ సుల్తాన్స్ వరుసగా రెండో విజయం సాధించింది. పెషావర్ జల్మీతో నిన్న (ఫిబ్రవరి 17) జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సుల్తాన్స్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (42 బంతుల్లో 66; 9 ఫోర్లు, సిక్స్), వన్‌డౌన్ బ్యాటర్ రిలీ రొస్సో (36 బంతుల్లో 75; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) రచ్చరచ్చ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సుల్తాన్స్ 3 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిల్లర్ (14 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్), పోలార్డ్ (6 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు,సిక్స్) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. పెషావర్ బౌలర్లలో సల్మాన్ ఇర్షాద్ 2, సుఫీయాన్ ముకీమ్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం బరిలోకి దిగిన పెషావర్.. సుల్తాన్స్ బౌలర్లు ఉసామా (3/22), ఇహసానుల్లా (3/24), అబ్బాస్ అఫ్రిది (2/33), కార్లోస్ బ్రాత్‌వైట్ (1/22) ధాటికి 18.5 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. అరంభంలో ఓపెనర్ మహ్మద్ హరీస్ (23 బంతుల్లో 40; ఫోర్, 4 సిక్సర్లు), వన్‌డౌన్ బ్యాటర్ సయిమ్ అయూబ్ (37 బంతుల్లో 53; 3 సిక్సర్లు, 3 ఫోర్లు) కాసేపు మెరుపులు మెరిపించి ఔటయ్యారు. వీరు కాక రోవమన్ పావెల్ (23), జేమ్స్ నీషమ్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. సుల్తాన్స్ ప్లేయర్ రొస్సో వరుసగా రెండో మ్యాచ్‌లో మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. లీగ్‌లో ఇవాల్టి (ఫిబ్రవరి 18) మ్యాచ్‌లో కరాచీ కింగ్స్, క్వెట్టా గ్లాడియేటర్స్ తలపడనున్నాయి. -
రఫ్ఫాడించిన రొస్సో.. ఐదేసి ఇరగదీసిన ఇహసానుల్లా
పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 15) క్వెట్టా గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముల్తాన్ సుల్తాన్స్ రెచ్చిపోయారు. తొలుత గ్లాడియేటర్స్‌ను 110 పరుగులకే ఆలౌట్ చేసిన సుల్తాన్స్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ అదే రేంజ్లో రెచ్చిపోయి కేవలం 13.3 ఓవర్లలో వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. సుల్తాన్స్ ఫాస్ట్ బౌలర్ ఇహసానుల్లా ఫైఫర్‌తో (4-1-12-5) గ్లాడియేటర్స్‌ను గడగడలాడించగా.. బ్యాటింగ్‌లో రిలీ రొస్సో మెరుపు హాఫ్‌సెంచరీతో (42 బంతుల్లో 78 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. A special performance from our young quick Ihsanullah as he takes 5 wickets for 12 runs!#SultanAaGayya #LetsPlaySaeen pic.twitter.com/8HVKfheWsu — Multan Sultans (@MultanSultans) February 15, 2023 ఫలితంగా సుల్తాన్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీజన్ తొలి మ్యాచ్‌లో లాహోర్ ఖలందర్స్ చేతిలో భంగపడ్డ సుల్తాన్స్.. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించి బోణీ విజయం దక్కించుకుంది. మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. .@Rileerr gets to his 5️⃣0️⃣ Nothing can go wrong for @MultanSultans today 👏#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/a3lcm44BjR — PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023 ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సుల్తాన్స్.. ఇహసానుల్లా (5/12), అబ్బాస్ అఫ్రిది (2/27), సమీన్ గుల్ (2/20), ఉసామా మిర్ (1/19) చెలరేగడంతో ప్రత్యర్ధిని 18.5 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ చేసింది. గ్లాడియేటర్స్ ఇన్నింగ్స్‌లో జేసన్ రాయ్ (27), ఉమర్ అక్మల్ (11), మహ్మద్ నవాజ్ (14), హఫీజ్ (18), మహ్మద్ హస్నైన్ (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. Cracking shot! @Rileerr making Multan roar 🎉#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/zazLskMwYm — PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023 అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి సుల్తాన్స్.. షాన్ మసూద్ (3) వికెట్ కోల్పోయి సునాయాసంగా విజయతీరాలకు చేరింది. వైవిధ్యమైన షాట్లతో రిలీ రొస్సో రెచ్చిపోగా.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (28 నాటౌట్) నిలకడగా బ్యాటింగ్ చేసి సుల్తాన్స్‌ను గెలిపించారు. షాన్ మసూద్ వికెట్ నువాన్ తుషారకు దక్కింది. లీగ్‌లో ఇవాళ (ఫిబ్రవరి 16) కరాచీ కింగ్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడనున్నాయి. Pace like fire! 🔥#HBLPSL8 | #SabSitarayHumaray | #MSvQG pic.twitter.com/7UFeFx04kz — PakistanSuperLeague (@thePSLt20) February 15, 2023 -
విధ్వంసం.. ఊచకోత.. అంతకుమించి, బీపీఎల్‌లో విండీస్ వీరుడి సునామీ శతకం
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర బ్యాటింగ్ విధ్వంసం నిన్న (జనవరి 31) ఖుల్నా టైగర్స్-కొమిల్లా విక్టోరియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు చెందిన నలుగురు బ్యాటర్లు రికార్డ స్థాయిలో 26 సిక్సర్లు బాదారు. ఇందులో కొమిల్లా విక్టోరియన్స్ ఆటగాడు జాన్సన్ చార్లెస్ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ విండీస్ వీరుడు 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. చార్లెస్ సునామీ శతకం.. విధ్వంసం, ఊచకోత అన్న పదాలను దాటిపోయి, ఇంకే పదం వాడాలో తెలియనంత రేంజ్లో సాగింది. చార్లెస్‌కు పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (39 బంతుల్లో 73; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సమైన హాఫ్ సెంచరీ తోడవ్వడంతో ప్రత్యర్ధి నిర్ధేశించిన 211 పరుగుల భారీ టార్గెట్‌ను కొమిల్లా విక్టోరియన్స్ మరో 10 బంతులు మిగిలుండగానే ఛేదించి రికార్డు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఖుల్నా టైగర్స్.. తమీమ్ ఇక్బాల్ (61 బంతుల్లో 95; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), షాయ్ హోప్ (55 బంతుల్లో 91 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోర్ చేసింది. విండీస్ బ్యాటర్ హోప్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి తమీమ్ కూడా తోడవ్వడంతో చిన్న సైజ్ విధ్వంసమే జరిగింది. వీరిద్దరు ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశారు. నసీం షా, మొసద్దెక్ హొసేన్ తలో వికెట్ తీసి పర్వాలేదనిపించారు. మహ్ముదుల్ హసన్ జాయ్ (1) తక్కువ స్కోర్‌కే ఔట్ కాగా.. ఆఖర్లో ఆజమ్ ఖాన్ (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా మెరుపులు మెరిపించాడు. అనంతరం కష్టసాధ్యమైన 211 లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొమిల్లా విక్టోరియన్స్.. ఆది నుంచే ఎదురుదాడికి దిగింది. ఓపెనర్ లిటన్ దాస్ (4) రిటైర్డ్ హర్ట్‌గా, కెప్టెన్ ఇమ్రుల్ ఖయేస్ (5) త్వరగా ఔటైనప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, జాన్సన్ చార్లెస్ బౌండరీలు, సిక్సర్లతో ప్రత్యర్ధి బౌలర్ల దుమ్ముదులిపారు. వీరిద్దరి ధాటికి కొమిల్లా విక్టోరియన్స్ 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్ సెంచరీతో కొమిల్లాను గెలిపించిన చార్లెస్‌ను మ్యాచ్ అనంతరం ఆటగాళ్లు భుజాలపై మోస్తూ స్టేడియం మొత్తం ఊరేగించారు. కాగా, ఈ విజయంతో కొమిల్లా విక్టోరియన్స్.. సిల్హెట్ స్ట్రయికర్స్, ఫార్చూన్ బారిషల్ జట్లతో సహా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. -
టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో సూర్య
టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్ ఈ ఏడాది అత్యద్భుత ప్రదర్శనతో మెరిశాడు. ముఖ్యంగా టి20ల్లో అతను చెలరేగిన తీరు అద్భుతమనే చెప్పొచ్చు. టి20 వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీస్ వరకు రావడంలో సూర్యకుమార్‌ది కీలకపాత్ర. కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్ విధ్వంసకర ఆటతీరుతో రెచ్చిపోయాడు. ఈ విధ్వంసమే అతన్ని తాజాగా ఐసీసీ అవార్డుకు నామినేట్ అయ్యేలా చేసింది. ఈ ఏడాది టి20 క్రికెట్లో అద్భుత ఫామ్ కొనసాగించిన ఆటగాళ్లను ఐసీసీ అవార్డులతో సత్కరించనుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ మెన్స్ 2022 టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ ఆటగాళ్ల జాబితాను ఐసీసీ గురువారం ప్రకటించింది. అవార్డు రేసులో నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియా నుంచి సూర్యకుమార్‌తో పాటు ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ సామ్ కరన్, పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, జింబాబ్వే ఆల్‌రౌండర్ సికిందర్ రజాలు పోటీ పడుతున్నారు. సూర్యకుమార్: ఇక టి20 వరల్డ్ కప్‌లో ఈ నలుగురు ప్లేయర్స్ తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. టి20ల్లో ఈ ఏడాది సూర్యకుమార్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 31 మ్యాచ్‌ల్లో 187.43 స్ట్రైక్ రేటుతో 1,164 పరుగులు చేశాడు. అంతేకాదు పొట్టి క్రికెట్లో సూర్య అత్యధికంగా 68 సిక్స్‌లు కొట్టాడు. భీకర ఫామ్ కొనసాగించిన అతను రిజ్వాన్‌ను వెనక్కి నెట్టి వరల్డ్ నంబర్ 1 ర్యాంకు సొంతం చేసుకున్నాడు.న్యూజిలాండ్ సిరీస్‌లోనూ సూర్య చెలరేగి ఆడి కెరీర్లో రెండో టి20 సెంచరీ నమోదు చేశాడు. సామ్ కరన్: టి20 వరల్డ్ కప్‌ను ఇంగ్లండ్ అందుకోవడంలో సామ్ కరన్‌ది కీలకపాత్ర. డెత్ ఓవర్ల బౌలింగ్ స్పెషలిస్ట్ అయిన సామ్ ప్రత్యర్థులను దడ పుట్టించాడు. తన ప్రదర్శనతో అదరగొట్టిన సామ్ కరన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న అతడు ఐపీఎల్ 2023 మినీ వేలంలో రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18.50 కోట్లకు దక్కించుకుంది. ఓవరాల్‌గా ఈ ఏడాది సామ్ కరన్ 19 మ్యాచ్‌ల్లో 25 వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ రిజ్వాన్: పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ టి20ల్లో చాలా డేంజరస్ ఆటగాడు. ఒక్కసారి క్రీజులో నిలదొక్కకుంటే అతన్ని ఔట్ చేయడం అంత ఈజీ కాదు. ఈసారి వరల్డ్‌కప్‌లో అంతగా మెరవనప్పటికి ఏడాది ప్రదర్శన మాత్రం అద్భుతంగానే ఉందని చెప్పొచ్చు.ఇక రిజ్వాన్ ఈ ఏడాది 25 మ్యాచ్‌ల్లో 996 పరుగులతో పాటు కీపర్‌గా తొమ్మిది క్యాచ్‌లు, మూడు స్టంపింగ్స్ చేశాడు. ఇందులో 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సికందర్ రజా: ఈ ఏడాది వెలుగులోకి వచ్చిన మరో ఆటగాడు జింబాబ్వే సంచలనం.. పాకిస్తాన్ మూలాలున్న ఆల్‌రౌండర్ సికందర్ రజా. జట్టు ఓటమిపాలైనప్పటికి తన ఇన్నింగ్స్‌లతో అభిమానులను అలరించాడు. మొత్తంగా 24 మ్యాచ్‌ల్లో 735 పరుగులతో పాటు 25 వికెట్లు తీశాడు. ఇక మహిళల విభాగంలో టీమిండియా నుంచి స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన ఐసీసీ వుమెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయింది. మందానతో పాటు పాకిస్తాన్ నుంచి నిదా దార్, న్యూజిలాండ్ నుంచి సోఫీ డివైన్, ఆస్ట్రేలియా నుంచి తాహిలా మెక్‌గ్రాత్ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. చదవండి: WTC: పోతే పోయింది.. మనకు మాత్రం మేలు చేసింది -
వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఓడించినప్పటి నుంచి నాకు అన్ని ఫ్రీ: మహ్మద్ రిజ్వాన్
స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన అనంతరం పాకిస్తాన్ స్టార్ ఓపెనర్, వికెట్‌కీపర్ మహ్మద్ రిజ్వాన్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రిజ్వాన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంగ్లండ్‌తో సిరీస్ గురించి అనుకుంటే పొరపాటు పడ్డట్టే. రిజ్వాన్ మాట్లాడింది టీమిండియాను ఉద్దేశించి. స్కై స్పోర్ట్స్ ఛానల్లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ ఆథర్టన్‌తో రిజ్వాన్ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్‌కప్-2021లో టీమిండియాపై విజయం తన జీవితాన్ని మార్చేసిందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన ఘోర పరాభవాన్ని సైతం పక్కకు పెట్టిన రిజ్వాన్.. ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. వరల్డ్‌కప్‌లో భారత్‌పై విజయం సాధించిన నాటి నుంచి స్వదేశంలో తనకు మర్యాద విపరీతంగా పెరిగిపోయిందని, తాను షాపింగ్‌కు ఎక్కడికి వెళ్లినా షాప్ యజమానులు తన వద్ద డబ్బులు తీసుకోవట్లేదని తెలిపాడు. ఇండియాను ఓడించావు.. అది చాలు, మాకు డబ్బులు వద్దు.. నీకు అన్నీ ఫ్రీ అంటూ షాప్కీపర్లు తెగ మెహమాట పెట్టేస్తున్నారని చెప్పుకొచ్చాడు. తానైతే టీమిండియాపై గెలుపును ఓ సాధారణ గెలుపులానే భావించానని, స్వదేశానికి వెళ్లాక ఆ గెలుపు ప్రత్యేకతేంటో తనకు తెలిసి వచ్చిందని అన్నాడు. కాగా, టీ20 వరల్డ్‌కప్-2021 తొలి మ్యాచ్‌లో టీమిండియాపై పాకిస్తాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పాక్‌కు 152 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా.. రిజ్వాన్ (55 బంతుల్లో 79 నాటౌట్), బాబర్ ఆజమ్ (52 బంతుల్లో 68 నాటౌట్) అజేయ అర్ధశతకాలతో తమ జట్టును గెలిపించుకున్నాడు. -
కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్.. అందనంత ఎత్తులో సూర్యకుమార్
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో బ్యాటింగ్ విభాగంలో టీమిండియా స్టార్ సూర్యకుమార్ అగ్రస్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో సూర్య తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్‌తో రెండో టి20లో సెంచరీతో చెలరేగిన సూర్యకుమార్ 890 పాయింట్లతో కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్లు సాధించి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్‌కు 836 పాయింట్లు ఉన్నాయి. తొలి రెండు స్థానాల్లో ఉన్న సూర్యకుమార్, రిజ్వాన్‌ల మధ్య వ్యత్యాసం 54 పాయింట్లుగా ఉంది. ఇక టీమిండియాతో సిరీస్‌లో ఆకట్టకున్న కివీస్ బ్యాటర్ డెవన్ కాన్వే ఒక స్థానం ఎగబాకి 788 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకోగా.. బాబర్ ఆజం 778 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇక కివీస్‌తో సిరీస్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించిన ఆల్‌రౌండ్ హార్దిక్ పాండ్యా 50వ స్థానానికి చేరుకున్నాడు. ఇక టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి రెండు స్థానాలు దిగజారి 650 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి భువనేశ్వర్ కుమార్ 11వ స్థానంలో ఉండగా.. కివీస్‌తో సిరీస్‌లో రాణించిన అర్ష్‌దీప్ సింగ్ ఒకస్థానం ఎగబాకి 21వ స్థానంలో నిలిచాడు. స్పిన్నర్ చహల్ 8 స్థానాలు ఎగబాకి 40వ స్థానానికి చేరుకున్నాడు. ఇక 704 పాయింట్లో లంక స్పిన్నర్ హసరంగా తొలి స్థానంలో ఉండగా.. రషీద్ ఖాన్, ఆదిల్ రషీద్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. 🔹 Suryakumar Yadav continues to shine 🔹 A host of Australia stars make big gains The latest movements on the @MRFWorldwide ICC Men's Player Rankings ⬇️ https://t.co/3WOEsj9HrQ — ICC (@ICC) November 23, 2022 చదవండి: అల్లర్లకు ఆస్కారం.. టీమిండియాతో వన్డే వేదికను మార్చిన బంగ్లా జాతీయ గీతం పాడనందుకు ఆటగాళ్లను చంపాలనుకున్నారు..! -
రెండులో కొనసాగుతున్న సూర్య.. ఆరో స్థానంలో హార్ధిక్
ఐసీసీ తాజాగా (అక్టోబర్ 19) విడుదల చేసిన పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో పెద్ద మార్పులేవీ లేవు. బ్యాటర్ల విభాగంలో పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (861), టీమిండియా విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (838), పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (808) తొలి మూడు స్థానాల్లో యధాతథంగా కొనసాగుతుండగా.. మార్క్రమ్, డెవాన్ కాన్వే, డేవిడ్ మలాన్, ఫించ్, నిస్సంక, ముహ్మద్ వసీమ్, గ్లెన్ ఫిలిప్స్ నాలుగు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. పదో స్థానంలో ఉన్న గ్లెన్ ఫిలిప్స్ మినహా టాప్-10 జాబితా యధాతథంగా కొనసాగుతుంది. ఇటీవల ముగిసిన ముక్కోణపు సిరీస్‌లో రాణించిన ఫిలిప్స్.. 13 స్థానాలు ఎగబాకి పదో స్పాట్‌కు చేరుకున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. ఈ వారం టాప్-10లో రెండు మార్పులు జరిగాయి. ఆఫ్ఘన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్.. రెండు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకోగా, సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్.. ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని ఎనిమిదిలో నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ పేసర్ హేజిల్‌వుడ్, రషీద్ ఖాన్, హసరంగ, షంషి తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. టీమిండియా బౌలర్ల విషయానికొస్తే.. భువీ 12లో, అశ్విన్, అక్షర్ వరుసగా 22, 23 స్థానాల్లో నిలిచారు. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్.. ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీని వెనక్కు నెట్టి టాప్ ప్లేస్‌కు దూసుకొచ్చాడు. ఈ జాబితాలో మొయిన్ అలీ, జెజె స్మిట్, హసరంగ, హార్ధిక్ పాండ్యా, సికందర్ రజా, జీషన్ మక్సూద్, మ్యాక్స్‌వెల్, దీపేంద్ర వరుసగా మూడు నుంచి పది స్థానాల్లో నిలిచారు. -
'లెగ్ స్పిన్ బౌలింగ్ వేయాలా'.. రిజ్వాన్ అదిరిపోయే రిప్లై
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తన కెరీర్లోనే అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ మ్యాచ్ గెలిచింది అంటే ఆ మ్యాచ్‌లో రిజ్వాన్ మెరిసి ఉంటాడనేలా అభిమానుల్లో పాతుకుపోయింది. పాక్ జట్టుకు రిజ్వానే బలం.. బలహీనత. అతను ఆడని రోజున పాకిస్తాన్ పూర్తిగా విఫలం కావడం గమనించాం. దీంతో రిజ్వాన్ పాకిస్తాన్ బ్యాటింగ్‌కు వెన్నుముకలా మారిపోయాడు. మహ్మద్ రిజ్వాన్‌కు తోడుగా కెప్టెన్ బాబర్ ఆజం కూడా రాణించడం సానుకూలాంశం. ఈ ఇద్దరు విఫలమైతే పాక్ కష్టాల్లో పడినట్లే. టీమిండియాతో తలపడేందుకు పాకిస్తాన్ సిద్ధమవుతుంది. అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా జరగనున్న బ్లాక్బాస్టర్ మ్యాచ్ కోసం అభిమానులతో పాటు ఇరు దేశాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా నుంచి మ్యాచ్‌ను లాగేసింది మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజంలు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈసారి కూడా ఎలాగైనా టీమిండియాతో మ్యాచ్‌లో రాణించాలని రిజ్వాన్ పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే అతని ప్రాక్టీస్ కొనసాగుతుంది. ఈ విషయం పక్కనబెడితే.. రిజ్వాన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు పాక్ ఓపెనర్ ఇచ్చిన సమాధానం క్రికెట్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. రిజ్వాన్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఒక భారత అభిమాని అతని దగ్గరకు వచ్చి.. నేను నీకు లెగ్ స్పిన్ బౌలింగ్ చేయాలా అని అడిగాడు. మొదట రిజ్వాన్ ఆ వ్యక్తిని పట్టించుకోలేదు. కానీ సదరు వ్యక్తి మరోసారి అదే ప్రశ్న వేయడంతో స్పందించిన రిజ్వాన్.. పెషావర్‌కు వచ్చి బౌలింగ్ చెయ్యు అంటూ ఫన్నీగా పేర్కొన్నాడు. దీంతో భారత అభిమాని నవ్వుల్లో మునిగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐసీసీ మేజర్ టోర్నీల్లో(వన్డే వరల్డ్‌కప్, టి20 ప్రపంచకప్) పాకిస్తాన్‌పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్‌లో ఇరుజట్లు తలపడిన ఏడుసార్లు టీమిండియాదే విజయం. ఇక టి20 ప్రపంచకప్‌లోనూ ఆరుసార్లు తలపడితే టీమిండియా నాలుగుసార్లు, పాక్ ఒక్కసారి మాత్రమే నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. చదవండి: భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం 'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తాం' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లిని అధిగమించిన రిజ్వాన్
పాకిస్తాన్‌తో ఆదివారం (సెప్టెంబర్ 11) జరిగిన ఆసియా కప్-2022 తుది సమరంలో శ్రీలంక 23 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసి ఆరో సారి ఆసియా ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక జట్టు.. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో భంగపడినప్పటికీ, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని భారత్, పాక్‌లపై వరుస విజయాలు సాధించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఫైనల్లో శ్రీలంక.. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చి పాక్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లో షాకిచ్చింది. అద్భుతమైన హాఫ్ సెంచరీతో లంకకు డిఫెండింగ్ టోటల్ అందించిన భానుక రాజపక్ష (45 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకోగా.. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా బౌలింగ్ చేసిన వనిందు హసరంగకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు లభించింది. And with that, we close the DP World #AsiaCup 2022, with Sri Lanka as CHAMPIONS! 🇱🇰🏆 What a tournament we've had! 🤩 Here are the overall performers who have impressed us with their incredible displays 👏#ACC #AsiaCup2022 #GetReadyForEpic pic.twitter.com/M5v6p5QGEw — AsianCricketCouncil (@ACCMedia1) September 11, 2022 ఇక ఈ టోర్నీ మొత్తంలో 'టాప్' లేపిన ఆటగాళ్ల విషయానికొస్తే.. పాక్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (281 పరుగులు).. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిని (276) అధిగమించి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రిజ్వాన్ 6 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు చేయగా.. కోహ్లీ 5 మ్యాచ్‌ల్లో రెండు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీతో 92 సగటున పరుగులు సాధించాడు. వీరి తర్వాత టాప్-5లో ఆఫ్ఘాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (196), శ్రీలంక హిట్టర్ భానుక రాజపక్స (191), పతుమ్ నిస్సంక (173) ఉన్నారు. బౌలర్ల విషయానికొస్తే.. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు సాధించిన ఘనత టీమిండియా స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌కు దక్కింది. భువీ 5 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. భువీ తర్వాతి ప్లేస్‌లో లంక స్పిన్నర్ హసరంగ (9 వికెట్లు), పాక్ బౌలర్లు హరీస్ రౌఫ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్ ఉన్నారు. ఈ ముగ్గురు తలో 8 వికెట్లు సాధించారు. ఈ టోర్నీలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా భువీ పేరిటే నమోదై ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఓ మెయిడిన్ కూడా ఉంది. ఇక, టోర్నీలో నమోదైన ఏకైక సెంచరీ విరాట్ సాధించినదే కావడం విశేషం. -
పాక్ కెప్టెన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లిన స్టార్ ఓపెనర్
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ దుమ్మురేపాడు. ఆసియాకప్‌లో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న రిజ్వాన్.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ తన స్థిరత్వాన్ని నిలబెట్టుకున్నాడు. ఆసియా కప్‌లో మూడు మ్యాచ్‌లాడిన రిజ్వాన్ ఒక అర్థసెంచరీ సాయంతో 197 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం ఐసీసీ ప్రకటించిన తాజా టి20 ర్యాంకింగ్స్‌లో రిజ్వాన్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. 815 పాయింట్లతో తొలి స్థానంలో రిజ్వాన్ ఉండగా.. నిన్నటివరకు టాప్ ప్లేస్‌లో ఉన్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 794 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. ఇక సౌతాఫ్రికా స్టార్ మార్క్రమ్ 792 పాయింట్లతో మూడు.. టీమిండియా నుంచి సూర్యకుమార్ యాదవ్ 775 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక ఐదో స్థానంలో ఇంగ్లండ్ బ్యాటర్ డేవిడ్ మలాన్ ఉన్నాడు. ఇక ఆసియాకప్‌లో భాగంగా సూపర్-4లో మంగళవారం శ్రీలంకతో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో మెరిసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 612 పాయింట్లతో 14వ స్థానంలో నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన లంక ఓపెనర్ పాతుమ్ నిసాంక ఒక స్థానం ఎగబాకి 675 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా తరపున ఆసియాకప్‌లో టాప్ స్కోరర్‌గా ఉన్న కోహ్లి మాత్రం రెండు స్థానాలు దిగజారి 29వ స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో జోష్ హాజిల్‌వుడ్ 792 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. తబ్రెయిజ్ షంసీ రెండు, ఆదిల్ రషీద్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఆల్‌రౌండర్ల విభాగంలో అఫ్గానిస్తాన్ కెప్టెన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ 256 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. 248 పాయింట్లతో షకీబ్ అల్ హసన్ రెండు.. 221 పాయింట్లతో మొయిన్ అలీ మూడో స్థానంలో ఉన్నాడు. On 🔝 of the @MRFWorldwide ICC Men’s T20I Batting Rankings 👑 Congratulations, @iMRizwanPak 👏 👉 https://t.co/mvY3tc8Zdi — ICC (@ICC) September 7, 2022 చదవండి: ఆసియా కప్‌లో వరుస పరాజయాల నేపథ్యంలో భారత అభిమానుల ఆక్రోశం Asia Cup 2022: అంతా అయిపోయింది .. వెళ్లి లాగేజీ సర్దుకోండి! టాటా బై బై! -
'ఆసియా కప్‌లా లేదు.. బెస్ట్ ఆఫ్ త్రీ ఆడుతున్నట్లుంది'
టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లుకు ఆస్కారం లేకపోవడంతో కేవలం మెగాటోర్నీల్లో మాత్రమే తలపడుతూ వస్తున్నాయి. తాజాగా ఆసియా కప్‌లో వారం గ్యాప్ వ్యవధిలో రెండోసారి ఎదురుపడుతున్నాయి. మరి లీగ్ దశలో టీమిండియాతో చేతిలో ఓడిన పాకిస్తాన్ సూపర్-4 దశలో భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే పాకిస్తాన్ స్టార్ మహ్మద్ రిజ్వాన్ టీమిండియాతో మ్యాచ్‌కు ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రిజ్వాన్ మాటల మధ్యలో జోకులు వేసి నవ్వించాడు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్నుద్దేశించి.. '' వారం వ్యవధిలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరగడం రెండోసారి. రెండుజట్లు ఎప్పుడు తలపడినా రసవత్తర పోరు ఖాయం. అయితే ముచ్చటగా మూడోసారి కూడా మ్యాచ్ జరగాలని.. అది వచ్చే ఆదివారం ఫైనల్ మ్యాచ్ కావాలని ఇరుదేశాల అభిమానులు కోరుకుంటున్నారు. వారి కల ఫలించాలని నేను గట్టిగా కోరుకుంటున్నా. ఇది చూసిన తర్వాత ఒక జోక్ చెప్పాలనిపిస్తుంది. నాకైతే ఆసియా కప్ ఆడుతున్నట్లు లేదు.. బెస్ట్ ఆఫ్ త్రీ మ్యాచ్ సిరీస్ ఆడుతున్నట్లుగా ఉంది'' అంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. అయితే యాదృశ్చికమో లేక అలా జరగాలని రాసిపెట్టి ఉందో తెలియదు కానీ.. రిజ్వాన్ చెప్పిన వ్యాఖ్యలు నిజమేననిపిస్తున్నాయి. పేరుకే ఆసియా కప్ టోర్నీగా పెట్టి.. భారత్, పాకిస్తాన్ల మధ్య దైపాక్షిక సిరీస్‌కు బదులు ఇలాంటివి ప్లాన్ చేస్తున్నారని అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. అన్ని సక్రమంగా జరిగితే.. కచ్చితంగా వచ్చే ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్-పాకిస్తాన్‌లు ముచ్చటగా మూడోసారి తలపడే అవకాశం ఉందని ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఇక టీమిండియాతో మ్యాచ్‌లో 36 పరుగులు చేసిన రిజ్వాన్.. హాంగ్ కాంగ్‌తో మ్యాచ్‌లో 78 పరుగులు నాటౌట్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా ఫఖర్ జమాన్ ఫిప్టీ చేయగా.. చివర్లో కుష్దిల్ షా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఫలితంగా 193 పరుగుల భారీ స్కోరు చేసిన పాక్.. అనంతరం హాంగ్ కాంగ్‌ను 38 పరుగులకే కుప్పకూల్చి 155 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో సూపర్-4లో అడుగుపెట్టిన పాక్.. భారత్‌తో మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. చదవండి: భారత్-పాక్ మ్యాచ్; నోటి దాకా వచ్చినా.. 'బూతు పదం' కావడంతో Chamika Karunaratne: 'నాలుగేళ్ల పగను మనసులో దాచుకున్నా'.. అందుకే నాగిన్ డ్యాన్స్