నాగమ్మ కుటుంబానికి వైఎస్ షర్మిల పరామర్శ
మహబూబ్ నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర నాలుగోరోజు కొనసాగుతోంది. కొన్నూరు, బాదేపల్లి, కోస్గి, ఆమీన్‌కుంట, ఇందాపూర్ గ్రామాల్లోని పలు కుటుంబాలను ఆమె ఈరోజు పరామర్శించనున్నారు. కొన్నూరులో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మరణించిన నాగమ్మ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. ఆ కుటుంబాని అన్నివిధాలా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు.
అలాగే వైఎస్ షర్మిల...చాంద్‌పాషా, కే బాలరాజు, జే గురబసవయ్య, పకీరప్ప కుటుంబ సభ్యులను కలిసి వారి యోగక్షేమాలు తెలుసుకోనున్నారు. మార్గమధ్యలో అక్కడక్కడ దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాలకు షర్మిల నివాళులర్పిస్తారు. పరామర్శ యాత్ర అనంతరం కొడంగల్‌లో బస చేస్తారు.