National Conference party
-
ఇక సంపూర్ణ రాష్ట్ర హోదా కోసం పోరాటం
ఊహించినట్లుగానే, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)–ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) కూటమి చక్కటి మెజారిటీతో నూతన జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సమ స్యాత్మకమైన పూర్వ రాష్ట్రం కోసం మనం ఏమి ఆశించగలం? మొదటి ప్రశ్న ఏమిటంటే, కొత్త ప్రభుత్వాన్ని సజావుగా పనిచేయడానికి అనుమతి స్తారా అనేది. లెఫ్టినెంట్ గవర్నర్ నిరంతరం ఎన్నికైన ప్రభుత్వానికి ఆటంకం కలిగించే విధంగా ఢిల్లీ తరహా పరిస్థితిని సృష్టిస్తారా అనే అనుమానం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీ, ఢిల్లీ ప్రభుత్వ విషయంలో బహిరంగంగా చేసినట్లు కాకుండా, 2015–2018 మధ్య పీడీపీతో పొత్తులో ఉన్నప్పుడు చేసినట్లుగా రహస్యంగానే వ్యవహరించే అవకాశం ఉందని నమ్ముతున్నాను. ఆ మూడేళ్ళలో వారు ముఫ్తీ మొహమ్మద్ సయీద్ తలపెట్టిన ప్రజల మధ్య వారధిని నిర్మించే ప్రయత్నాలను అడ్డుకున్నారు. పైగా విడిపోయిన వర్గాలను ప్రేరేపించడానికి పీడీపీ మంత్రులు, శాసనసభ్యులతో తమ కొత్త సంబంధాలను ఉపయోగించారు. వారు ఆ విధానాన్ని పునరావృతం చేయడానికి ప్రయత్నిస్తే, ఎన్సీ–ఐఎన్‌సీ కూటమి భాగస్వాములకు రెట్టింపు భారం ఉంటుంది. అదేమిటంటే ఎన్నికైన ప్రభుత్వంలా కొంత అధికారాన్ని నిలుపుకోవడం, వారి ఎమ్మెల్యేలను కలిపి ఉంచడం.కూటమికి ఈ రెండు పనులు సమాన ప్రాధాన్యం కలిగినవే. అయితే ఓటర్లు మొదటి కర్తవ్యం వైపే ఎక్కువగా చూస్తారు. ఇది నిజ సమయంలో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో విధాన రూపకల్పననూ, దాని అమలును చేపట్టడంతోనూ ముడిపడి ఉంటుంది. దాంతోపాటు అలా చేయడానికి అధికా రాన్ని పొందే పోరాటం కూడా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిసేపటి ముందు ప్రకటించిన కొత్త పాలనా నియమాల ప్రకారం... భద్రత, ఆర్థిక వ్యవహారాలు, పోలీసు శాఖతోపాటు బ్యూరోక్రసీపై అన్ని కీలక అధికారాలు ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్‌కి దఖలుపడ్డాయి. కొత్త ప్రభుత్వ యంత్రాంగం మునిసిపాలిటీ స్థాయికి తగ్గింది. కొత్త ప్రభుత్వం... చిన్నదా పెద్దదా అనే అంశంతో నిమిత్తం లేకుండా ప్రతి అంశంపై లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంతో ఘర్షించవలసి ఉంటుంది.స్వతంత్ర మీడియా, భిన్నాభిప్రాయాలు లేదా నిరసన తెలిపే హక్కు వంటి ప్రాథమిక పౌర హక్కులను కాపాడాలని ఎన్నుకోబడిన ప్రభుత్వం కోరుకుంటుంది. ప్రస్తుతం వాటికి అనుమతి లేదు. భద్రత అనేది ఘర్షణకు ప్రధాన మూలంగా ఉంటుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద వందలాది ఏకపక్ష కేసులు ఉన్నాయి. వాటికి తక్షణ పరిష్కారం అవసరం. నేషనల్ కాన్ఫరెన్స్ మేనిఫెస్టో ప్రజా భద్రతా చట్టాన్ని రద్దు చేస్తామని వాగ్దానం చేసింది. అయితే అలా చేయడానికి వారికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం. సుప్రీం కోర్ట్ 2023 డిసెంబర్లో ఇచ్చిన తీర్పులో సిఫార్సు చేసిన విధంగా పూర్తి రాష్ట్ర హోదాను త్వరగా పున రుద్ధరించడం ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. ఆర్టికల్ 370 పిటిషన్లపై 2023 నాటి సుప్రీంకోర్టు విచారణలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన ప్రకటన ప్రకారం... మోదీ పరిపాలన పూర్తి పునరుద్ధరణ కంటే దశలవారీగా పునరుద్ధ రణ దిశగా ఆలోచిస్తోంది. దశల వారీ విధానానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోని పక్షంలో, పూర్తి రాష్ట్ర హోదా కోసం ఉద్యమం అనేది ప్రతి చిన్న అధికారానికి సుదీర్ఘకాలంపాటు సాగే దశల వారీ పోరాటం కావచ్చు.చట్టపరంగా, దశలవారీగా రాష్ట్ర హోదా పునరుద్ధరణకు వ్యతిరేకంగా చేస్తున్న వాదన బలంగా ఉంది. రాష్ట్ర హోదా పునరుద్ధరింపబడుతుందని చెప్పినందున రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతం స్థాయికి తగ్గించవచ్చా అనే దానిపై కోర్టు తీర్పు ఇవ్వలేదు. సొలిసిటర్ జనరల్ ప్రకటించిన దశల వారీగా పునరుద్ధరణను ఎందుకు సవాలు చేయలేదు అనేది ఎవరికి వారు అంచనా వేసుకోవలసిందే. కానీ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతం స్థాయికి తగ్గించలేకపోతే, రాష్ట్ర హోదాను దశలవారీగా పునరుద్ధరించడం సాధ్యం కాదని అర్థం చేసుకోవచ్చు. రాష్ట్ర హోదా కోసం ఇటీవల ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లో ఇది ఇప్పటికే లేవనెత్తక పోయి ఉంటే... ఇది రాజ్యాంగపరమైన సమస్య అవుతుంది.నిరుద్యోగం దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే జమ్మూ కశ్మీర్లో చాలా ఎక్కువగా ఉంది. కొత్త భూసేకరణ నిబంధనల నుంచి స్థానిక కంపెనీలకు కాకుండా జాతీయ సంస్థ లకు మైనింగ్, వినియోగ వస్తువులు, పర్యాటక లైసెన్సుల మంజూరు వరకు గత ఐదేళ్లలో చేపట్టిన చాలా విధానాలను సమీక్షించి, అవసరమైన చోట వాటిని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది.కేంద్ర ప్రభుత్వ పెద్దలు, లెఫ్టినెంట్ గవర్నర్ తెలివైన వారైతే, కొత్త ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉండి, అది నాయకత్వం వహించడానికి అనుమతిస్తారు. అయితే, ఈ ప్రభుత్వం తాను నిర్వహించాల్సిన విధులను నెరవేర్చడంలో విఫలమైతే, తదుపరి అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్లు బీజేపీనీ లేదా మరింత అనుకూలమైన ప్రాంతీయ వర్గాలనూ ఆశ్రయించవచ్చనే భావనతో ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకునే ప్రలోభం కూడా ఉండవచ్చు.మొత్తం మీద కొత్త ప్రభుత్వానికీ, రాష్ట్ర ప్రజలకూ రాబోయే రోజులు కీలకం కానున్నాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ లేదా ఢిల్లీలో తన తోటి గవర్నర్లు ఆడిన గేమ్‌లు... ఈ అస్థిరమైన సరిహద్దు రాష్ట్రంలో పునరావృతం కాకూడదని లెఫ్టినెంట్ గవర్నర్ అర్థం చేసుకుంటారని మనం ఆశించాలి. ఇక్కడ పాకిస్తాన్ ఆధారిత సాయుధ సమూహాలు ఏ చిన్న తప్పునుంచైనా ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తాయి. అది నిజంగానే జాతీయ ప్రయోజనాలకు భంగకరం.రాధా కుమార్ వ్యాసకర్త ‘ప్యారడైజ్ ఎట్ వార్: ఎ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కశ్మీర్’ రచయిత(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో...) -
J&K: ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ -కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్షనేతగా ఎన్సీ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గురువారం ఎన్సీ సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఎన్నికైన అనంతరం మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.‘‘ఈరోజు నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. అందులో నేను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడ్డాను. పార్టీ ఎమ్మెల్యేలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.#WATCH | Srinagar, J&K: JKNC vice president Omar Abdullah says, "Today in the meeting of the National Conference Legislature Party, I have been elected as the leader of the Legislature Party. I express my gratitude to the MLAs. Talks are going on to get the letter of support from… pic.twitter.com/uM86jG9rc9— ANI (@ANI) October 10, 2024అదేవిధంగా 4 స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఎన్సీ ప్రభుత్వాన్ని ఏర్పాటు తమ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఎన్సీ 42 ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు నలుగురిని కలుపుకొని మొత్తం 46 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్నాం. కాంగ్రెస్ నుంచి మద్దతు లేఖ అందిన వెంటనే మేము జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని రాజ్‌భవన్‌కు వెళ్తాం’ అని అన్నారు. -
Omar Abdullah: బీజేపీ నుంచి ఆశించడం మూర్ఖత్వం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ప్రజల ప్రత్యేక హక్కులను లాక్కున్న బీజేపీ నుంచి ఆర్టికల్ 370 పునరుద్ధరణను ఆశించడం మూర్ఖత్వమని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ అంశంపై తమ పార్టీ వైఖరి మారబోదన్నారు. ఆర్టికల్ 370పై మాట్లాడబోమని కానీ, అదిప్పుడు సమస్య కాదని తామెప్పుడూ చెప్పలేదని అబ్దుల్లా స్పష్టం చేశారు. భవిష్యత్‌లో దేశంలో ప్రభుత్వం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఒమర్... అప్పుడు జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించే కొత్త వ్యవస్థ ఏర్పడుతుందని ఆశిస్తున్నామన్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కోరుతూ ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేస్తుందని తెలిపారు. ఢిల్లీ తరహాలో కాకుండా జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వం సజావుగా నడుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీకి జమ్మూకశ్మీర్‌కు చాలా తేడా ఉందని, 2019కు ముందు జమ్మూకశ్మీర్ ఒక రాష్ట్రమని గుర్తు చేశారు. జమ్మూకశ్మీర్‌లో మూడు చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రధాని, హోంమంత్రి, సీనియర్ మంత్రులు చెప్పారని, డీలిమిటేషన్, ఎన్నికలు జరిగాయని, రాష్ట్ర హోదా మాత్రమే మిగిలి ఉందని, దానిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కేంద్రంతో ఘర్షణ పడటం వల్ల సమస్యలను పరిష్కరించలేమన్నారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ఎన్సీ గురువారం శాసనసభాపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తుందని అబ్దుల్లా చెప్పారు. ఆ తర్వాత కూటమి సమావేశంలో నాయకుడిని ఎన్నుకుంటారని, ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుకు హక్కును కోరుతామని తెలిపారు. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో పీడీపీ భాగస్వామ్యం అవుతుందా అన్న ప్రశ్నకు ఎన్సీ నేత సమాధానమిస్తూ ప్రస్తుతానికి దానిపై ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.హిందువుల్లో విశ్వాసాన్నిపెంచుతాం: ఫరూక్జమ్మూకశ్మీర్ మధ్య బీజేపీ సృష్టించిన విభేదాలను తగ్గించి, హిందువుల్లో విశ్వాసాన్ని పెంపొందించడమే ఎన్సీ–కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రెండు ప్రాంతాల మధ్య భేదం చూపబోమని తెలిపారు. కొత్త ప్రభుత్వం ముందు ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అతిపెద్ద సవాళ్లున్నాయన్నారు. యువతకు అవకాశాలు కల్పించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఎవరనేది కూటమి నిర్ణయిస్తుందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించడంపై ఫరూక్ స్పందిస్తూ.. తాను నిర్ణయించిందే జరుగుతుందని స్పష్టం చేశారు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అభ్యర్థని ఫరూక్ అబ్దుల్లా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. -
సరికొత్త అధ్యాయమయ్యేనా?!
అక్టోబర్ 8 నాటి ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికీ, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికీ సమాన స్కోర్లు అందించాయి. హర్యానాలో బీజేపీ, జమ్ము–కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) – కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో లెక్క సమం అయింది. అయితే, ఈ ఫలితాల అసలు ప్రభావం ఈ అంకెల లెక్కకు మించినది. అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ... హర్యానాలో వరుసగా మూడోసారి విజయంతో బీజేపీ రికార్డ్ సృష్టించడం ఒక ఎత్తయితే, జమ్ము–కశ్మీ ర్లో దాదాపు ఆరేళ్ళ పైచిలుకు తర్వాత మళ్ళీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కొలువు తీరనుండడం మరో ఎత్తు. కశ్మీర్ ఎన్నికల ఫలితాలు అనేక కారణాల రీత్యా అత్యంత కీలకమైనవి. వాటి ప్రకంపనలు, ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రాధాన్యమిచ్చి, శాసనవ్యవస్థ అధికారానికి రెక్కలు కత్తిరించిన పరిస్థితుల్లో కశ్మీర్లో ప్రభుత్వాన్ని నడపడం కత్తి మీద సాము కానుంది. అదే సమయంలో రాష్ట్రహోదాను పునరుద్ధరించాలన్న ప్రజాకాంక్ష అక్కడి ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిఫలించడంతో ఎన్సీ కూటమి ఆ దిశగా కృషి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర హోదాపై ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కేంద్ర పెద్దలు, బీజేపీ అధినాయకులు నిలబెట్టుకుంటారా, లేక తమ పార్టీ అధికారంలోకి రాలేదు గనక ‘అంతా తూbŒ ’ అనేస్తారా అన్నది చర్చనీయాంశమైంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత, రాష్ట్రాన్ని జమ్ము – కశ్మీర్, లద్దాఖ్ అంటూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొట్టతొలి ఎన్నికలు ఇవే. ఆసక్తిగా చూస్తుండగా, పోటాపోటీగా, అదే సమయంలో శాంతియుతంగా ఈ ఎన్నికలు సాగడం విశేషం. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల కన్నా 5 శాతం పైచిలుకు ఎక్కువగా, పెద్దయెత్తున 63.9 శాతం వరకు ఓటింగ్ జరగడం గమనార్హం. అంటే, ఎన్నికల ప్రజాస్వామ్యం వైపు ప్రజల మొగ్గు సుస్పష్టం. జనమిచ్చిన మెజారిటీతో కశ్మీర్లో ఇక ఎన్సీ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీ పక్షాన ఒమర్ అబ్దుల్లా సీఎం కానున్నారు. ఇలా కశ్మీర్లో ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం తిరిగి రావడం ఒక శుభసూచన. ఎన్నికైన సర్కారుండడంతో స్థానిక ప్రజలు తమ కష్టనష్టాల పరిష్కారానికై ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించే వీలు చిక్కింది. అతివాద బీజేపీని ద్వితీయ స్థానానికే పరిమితం చేసి, మితవాద దృక్పథమున్న ఎన్సీకి పట్టం కట్టడం ద్వారా ప్రజాపాలనకై తాము తహతహలాడుతున్నట్టు కశ్మీరీలు చెప్పకనే చెప్పారు. ఒమర్ తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ – కాంగ్రెస్ కూటమి కశ్మీర్ లోయ వరకు మొత్తం 47 సీట్లలో 42 స్థానాలను గెలవడం విశేషం. ముస్లిమ్ జనాభా అధికంగా ఉండే లోయలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల స్థానిక ప్రజల వ్యతిరేకతకు అది అద్దం పడుతోంది. ఇక లోయలో ఖాతా తెరవలేకపోయినా, హిందువులు ఎక్కువైన జమ్ములో మాత్రం పోటీ చేసిన 43 సీట్లలో 29 గెలిచి, బీజేపీ తన బలం నిరూపించుకుంది. కాంగ్రెస్ మొత్తం 6 సీట్లలో విజయంతో మూడో స్థానంలో నిలిచింది. మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ 3 సీట్లు, ‘ఇంజనీర్’ రషీద్ సారథ్యంలోని వేర్పాటువాద అవామీ ఇత్తెహాద్ పార్టీ ఒక సీటే గెలిచి, బరిలో చతికిలబడ్డాయి. ఒకప్పుడు ఉమ్మడి కశ్మీర్‌కు సీఎంగా పనిచేసిన ఒమర్ ఇప్పుడు లద్దాఖ్‌ను విడగొట్టిన తర్వాత ఏర్పడ్డ విభజిత కశ్మీర్‌కు తొలి సీఎం. కానీ, ప్రభుత్వాన్ని నడపడం సులభం కాదు. సవాళ్ళు తప్పవు. ఆ మాట అంగీకరిస్తూనే, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకుంటామనీ, అదే సమయంలో రద్దయిన ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూనే ఉంటామనీ ఒమర్ స్పష్టం చేశారు. అది ఆయన అనివార్యత, లోయ ప్రజల ఆకాంక్ష. అయితే అంతకన్నా ముఖ్యం... జనం వర్గాలుగా చీలి, ఓటేసిన నేపథ్యంలో జమ్మూను వేరుగా చూడకుండా కలుపుకొని పోతూ, అక్కడి ప్రజాప్రతినిధులకు క్యాబినెట్లో పెద్దపీట వేయడం! ఆ సంగతి ఒమర్‌కూ తెలుసు. జమ్ముతో పోలిస్తే కశ్మీర్ లోయలోనే ఎక్కువ స్థానాలొచ్చినా రెండు ప్రాంతాలూ తమకు సమానమే ననీ, అందరి ప్రభుత్వంగా ప్రాంతాల మధ్య అంతరాన్ని తొలగిస్తామనీ ఆయన ప్రకటించారు.ఆర్టికల్ 370 పాత చరిత్ర, తప్పొప్పుల మాట అటుంచితే, అంత కన్నా ముఖ్యమైనది జమ్ము – కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం! ఎందుకంటే, కేంద్రపాలిత ప్రాంతమయ్యే సరికి 370 రద్దుకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నన్ని అధికారాలు ఉండవు. చివరకు పోలీసులు సైతం కేంద్రం కనుసన్నల్లోనే ఉంటారు. ఎన్నికలు పూర్తయి, ప్రజాప్రభుత్వం వచ్చింది గనక, తక్షణమే రాష్ట్రహోదా దిశగా అడుగులేయాలి. గత డిసెంబర్లో సుప్రీమ్‌కోర్ట్ సైతం సత్వరమే పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని చెప్పిందన్నది గమనార్హం. అన్ని రాజకీయ పక్షాలూ కోరు తున్నట్టు ఆ విషయంలో కేంద్రం తన హామీని నిలబెట్టుకోవాలి. కశ్మీర్లో సైతం అన్ని రాష్ట్ర ప్రభు త్వాల తరహాలోనే కొత్త సర్కార్ పని చేసే వీలు కల్పించాలి. కశ్మీర్‌కి ప్రత్యేక భౌగోళిక, సాంస్కృతిక చరిత్ర ఉన్న మాట నిజమే కానీ, దాన్ని గుర్తిస్తూనే ఆ ప్రాంతం మిగతా దేశంతో కలసి అడుగులు వేసేలా కృషి సాగాలి. యువతరంలో నిరుద్యోగం దేశంలోనే అధికంగా ఉన్న ఆ ప్రాంత సామాజిక, ఆర్థిక పురోగతి అందుకు కీలకం. అలాగే గత అయిదేళ్ళలో స్థానిక ఆకాంక్షలకు భిన్నంగా తీసుకున్న మైనింగ్, భూసేకరణ లాంటి విధానాల పునఃసమీక్ష అవసరం. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రం సహకరిస్తేనే అది సాధ్యం. లేదంటే, ఢిల్లీలో ఆప్ సర్కార్ తరహా కథే కశ్మీర్లో పునరావృతమవుతుంది. ఎన్నికలు జరిపి కూడా ప్రజాతీర్పును తోసిపుచ్చినట్టే అవుతుంది. పైగా, సరిహద్దులో శత్రు వులు పొంచి ఉండే సున్నితమైన ప్రాంతంలో అలాంటి రాజకీయ క్రీడలు ప్రమాదకరం. -
బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి: ఆప్ సెటైర్లు
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ గెలుపు సొంతం చేసుకుంది. అయితే.. హర్యానా ఫలితాలపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సెటైర్లు వేశారు. హర్యానాలో బీజేపీ గెలుపును అంగీకరించలేనని అన్నారు. బీజేపీ విజయం అనటం కంటే.. కాంగ్రెస్ ఓటమే అధికమని అన్నారు. అధికార బీజేపీ పార్టీకి 39 శాతం ఓట్ల వస్తే.. 61 శాతం ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయని గుర్తు చేశారు.‘‘ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ బీజేపీకి వస్తే నేను ఆ పార్టీ విజయాన్ని అంగీకరించేవాడిని. కానీ, అలా జరగలేదు. హర్యానాలో ఓట్లు బీజేపీకి గెలుపు కోసం పడలేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి. 39 శాతం ఓట్లు బీజేపీకి పడ్డాయి. అదే బీజేపీకి 61 శాతం వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. ఇది బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి’’ అని అన్నారు. మరోవైపు.. జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగిందని, అందుకే బీజేపీని ఓడించగలిగిందని అన్నారు. ‘‘ జమ్ము కశ్మీర్లో ఇండియా కూటమి ఒక యూనిట్‌గా పోరాటం చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి కూటమిగా బరిలో దిగటంతో బీజేపీ ఓడిపోయింది. కానీ, హర్యానాలో దురదృష్టవశాత్తు.. ఇండియా కూటమి పార్టీలు ఒంటరిగా బరిలో దిగటంతో ఫలితం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చింది’’ అని అన్నారు.చదవండి: బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్ -
Peoples Pulse Exit Polls 2024: జమ్ము కశ్మీర్లో బిగ్ ట్విస్ట్.. గెలుపు ఎవరిదంటే?
జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హొదా తొలగింపు తర్వాత తొలిసారిగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మూడు విడతలలో ముగిసిన ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలపై పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ సర్వే నిర్వహించింది. క్షేత్రస్థాయిలో పర్యటించిన సంస్థ బృందం ఎన్నికల ఫలితాలపైనే కాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై కూడా రాష్ట్ర ప్రజల అభిప్రాయాలని సేకరించింది.సర్వే అంచనాల ప్రకారం ఈ ఎన్నికల్లో ఏ పార్టీ కూడా సొంతంగా మ్యాజిక్ ఫిగర్ 46 స్థానాలు పొందే అవకాశాలు లేవు. అయితే జమ్ము కశ్మీర్లో కలిసి పోటీ చేసిన నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పార్టీలకు వచ్చే సీట్లతో ఆ కూటమి ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమి 46-50 స్థానాలు, బీజేపీ 23-27 స్థానాలు, జేకేపీడీపీ 7-11 స్థానాలు, ఏఐపీ 0-1, ఇతరులు 4-5 స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు సర్వేలో తేలింది. జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమిలో జేకేఎన్ఎస్ 33-35, కాంగ్రెస్ 13-15 స్థానాలు గెలవవచ్చు. జేకేఎన్సీ 29 శాతం, కాంగ్రెస్ 14 శాతం, బీజేపీ 24 శాతం, జేకేపీడీపీ 16 శాతం, ఏఐపీ 5 శాతం, ఇతరులు 12 శాతం ఓట్లు పొందవచ్చని సర్వేలో తేలింది. కలిసి పోటీ చేసిన జేకేఎన్సీ-కాంగ్రెస్ కూటమికి 43 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ప్లస్ ఆర్ మైనస్ మార్జిన్ ఉండే అవకాశాలున్నాయి. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తారని సర్వేలో కోరగా జేకేఎన్సీ నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు సుమారు 28 శాతం మంది మద్దతిచ్చారు. ఆయన అనుభవం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందనే అభిప్రాయాన్ని ఓటర్లు వెలిబుచ్చారు. ఒమర్ అబ్దుల్లా తండ్రి, రాష్ట్ర సీనియర్ నేత, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాకు సుమారు 2 శాతం మందే మద్దతిచ్చారు. జేకేపీడీపీ అధినేత, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీకి, ఏఐపీ అధినేత లోక్‌సభ సభ్యులు ఇంజినీర్ రషీద్‌కు చెరో 8 శాతం మద్దతు సర్వేలో కనిపించింది.కాంగ్రెస్-జేకేఎన్సీ మధ్య పొత్తు ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసింది. దాదాపు 46 శాతం మంది కాంగ్రెస్-జేకేఎన్సీ కూటమి తమ ప్రయోజనాలకు ఉత్తమంగా ఉపయోగపడుతుందని విశ్వసించారు. హిందువుల ఏకీకరణతో ప్రయోజనం పొందాలని చూసిన బీజేపీకి జమ్మూ ప్రాంతంలో లబ్ది చేకూరింది. జమ్మూలో కాంగ్రెస్ పేవలమైన ప్రచారం కూడా బీజేపీకి కలిసివచ్చింది. అధిక ప్రచారంతో నిత్యం వార్తల్లో ఉన్న అవామీ ఇత్తేహాద్ పార్టీ (ఏఐపీ) ఒక్క సీటుకే పరిమితం కావచ్చు. పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీ వంటి చిన్న పార్టీలను కలుపుకొని మొత్తం మీద ఇతరులకు దాదాపు 4 నుండి 5 సీట్లు రావచ్చని సర్వేలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉందని సర్వేలో వెల్లడైంది. ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధి పరంగా ఈ ప్రాంతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఓటర్లు ఎత్తి చూపారు. నిత్యవసర వస్తువుల ధరలతో పాటు విద్యుత్ చార్జీల పెరుగుదల, ఆశించిన అభివృద్ధి లేకపోవడం ఎన్నికల్లో కీలకాంశాలుగా మారాయి. అభివృద్ధిలో కొంత మెరుగ్గా ఉందని 30 శాతం మంది అభిప్రాయపడినా, 40 శాతం కంటే ఎక్కువ మంది గత 5-6 సంవత్సరాలలో అభివృద్ధికి సంబంధించి ఎటువంటి మార్పు కనిపించలేదని చెప్పారు. 22 శాతం మంది అభివృద్ధి మరింత దిగజారిందన్నారు. ఇటీవల శాంతిభద్రతలు గణనీయంగా మెరుగుపడ్డాయని 30 శాతం మంది చెప్పగా, మిగతావారు పెదవి విరిచారు. జమ్ము కశ్మీర్ పురోగతిపై కేంద్ర ప్రభుత్వం పలు హామీలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భద్రతకు సంబంధించి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కనిపించింది. మౌలిక సదుపాయల కల్పన, ఆరోగ్య పరిరక్షణ, విద్యాపరంగా అభివృద్ధిపై ప్రజల్లో ఆందోళన కనిపించింది.నరేంద్ర మోదీ ప్రభుత్వం 2019 ఆగస్టులో జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేయడం, రాష్ట్ర హోదాను తొలగించి లడఖ్‌ను వేరు చేస్తూ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడంపై అత్యధిక ప్రజలు ఆగ్రహంగా ఉన్నట్టు సర్వేలో స్పష్టమైంది. రాష్ట్ర హోదాను తిరిగి కల్పించాలని 67 శాతం మంది గట్టిగా కోరారు. జమ్ము కశ్మీర్లో 2014 తర్వాత దాదాపు దశాబ్ద కాలం అనంతరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో రాజకీయంగా అనేక ఆసక్తికరమైన అంశాలున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో బీజేపీ, జేకేపీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అనేక రాజకీయ పరిణామాల మధ్య ఈ సంకీర్ణ ప్రభుత్వం 2018లో రద్దయ్యింది. 2022లో నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అసెంబ్లీ స్థానాల సంఖ్య 83 నుండి 90 పెరగడంతో రాజకీయంగా ఇది కీలకంగా మారింది. బీజేపీ ఆశలు పెట్టుకున్న జమ్మూ ప్రాంతంలో సీట్లు 37 నుండి 43కు పెరగగా, కశ్మీర్ లోయలో సీట్లు 46 నుండి 47కు పెరిగాయి. పీపుల్స్ పల్స్, డిజిటల్ వార్త సంస్థ సౌత్ ఫస్ట్ సంస్థలు సంయుక్తంగా జమ్ము కశ్మీర్ ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు పీపీఎస్ విధానంలో 25 నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని సర్వే నిర్వహించాయి. శాస్త్రీయమైన పద్దతిలో ప్రతి అసెంబ్లీ సెగ్మంట్ నుండి నాలుగు పోలింగ్ స్టేషన్లను ఎంపిక చేసుకున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో ఎలక్ట్రోల్ రోల్స్ నుండి అన్ని ప్రాంతాల్లో కులం, మతం, వయస్సు, పురుషులు, మహిళలు సరిసమాన నిష్పత్తిలో ఉండేలా ఎంపిక చేసుకొని మొత్తం 2016 శాంపిల్స్ సర్వే కోసం సేకరించడం జరిగింది.సర్వే కోసం తయారు చేసిన నిర్మాణాత్మకమైన ప్రశ్నాపత్రంతో సంస్థ తరఫున రీసెర్చ్ స్కాలర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు క్షేత్రస్థాయిలో ఓటర్లను ముఖాముఖిగా కలుసుకొని వారి అభిప్రాయాలను సేకరించింది. జమ్ము కశ్మీర్ ఎన్నికల సర్వే నివేదికను పీపుల్స్ పల్స్ డైరెక్టర్ ఆర్. దిలీప్ రెడ్డి నేతృత్వంలో పీపుల్స్ పల్స్ సీనియర్ పరిశోధకులు జి. మురళీకృష్ణ, ఐ.వి. మురళీకృష్ణశర్మ రూపొందించారు.-ఆర్.దిలీప్ రెడ్డి,డైరెక్టర్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ. -
Farooq Abdullah: వాళ్లు ఢిల్లీ పంపిన వ్యక్తులు..జాగ్రత్త!
శ్రీనగర్: ‘ఆత్మగౌరవాన్ని కాపాడుకోండి..ఢిల్లీ పంపిన వ్యక్తులతో జాగ్రత్త ఉండండి..! మారు వేషంలో ఉన్న దయ్యాలను తిరస్కరించండి’అంటూ నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఓటర్లను హెచ్చరించారు. ఈ ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్‌ల కూటమి అసెంబ్లీలో మెజారిటీ సీట్లు గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి రాలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి అక్టోబర్ ఒకటో తేదీన జరిగే మూడో, చివరి విడత ఎన్నికలు ఆదివారం సాయంత్రంతో ప్రచారం గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఓటర్లు విజ్ఞతతో ఓటేయాలన్నారు. ‘చేయి (కాంగ్రెస్ ఎన్నికల గుర్తు) కనిపిస్తే చేతికే ఓటేయండి. నాగలి(ఎన్సీ ఎన్నికల గుర్తు) కనిపిస్తే నాగలికే ఓటేయండి’అని కోరారు. బారాముల్లా ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌ను కేంద్రంలోని బీజేపీయే రంగంలోకి దించిందని ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. ఓటర్లలో విభజనలు తెచ్చేందుకే ఆయన ప్రయతి్నస్తున్నారన్నారు. ‘దేశంలోని ముస్లింలను ఎలా చూస్తున్నారో ఆయనకు తెలుసు. అదే వైఖరిని ఇక్కడా తేవాలని బీజేపీ ప్రయతి్నస్తోందన్న విషయం రషీద్ గ్రహించడం లేదు. చివరికి ఆయనకు కూడా అదేగతి పట్టొచ్చు. రషీద్‌ను చూస్తే జాలేస్తోంది.’అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌కు ఎన్నికల తర్వాత రాష్ట్ర హోదా ఇస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై ఆయన..బీజేపీ చెప్పేదొకటి, చేసేదొకటి అని పేర్కొన్నారు. చర్చలతోనే కశ్మీర్‌కు పరిష్కారం ‘ఉగ్రవాదం తీవ్రస్థాయిలో ఉంది. దీనిని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం. ప్రజలందరినీ మనతో కలుపుకుని ముందుకు వెళ్లడం’అని వ్యాఖ్యానించారు. సమస్య పరిష్కారానికి పొరుగుదేశాలతో చర్చలు మేలన్న అభిప్రాయాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ‘పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తే పురోగమిస్తాం, వేగంగా ముందుకు సాగుతాం.. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌పై డబ్బు ఖర్చు చేయడం కంటే మన ప్రజలను మరింత అభివృద్ధి చేయడం ఉత్తమం. ఈ విషయంలో సార్క్‌ను బలోపేతం చేయాలి. భారత్ పెద్దన్న పాత్ర పోషించాలి. ఇరుగుపొరుగుతో స్నేహ సంబంధాలు సాగించలేకుంటే ఇప్పుడున్న పరిస్థితులే కొనసాగుతాయి’అని అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ఎన్నికలకు విదేశీ ప్రతినిధులు రావడంపై ఆయన..కశ్మీర్ భారత్‌లో భాగమని వారనుకుంటున్నారా? భారత్‌లో మేం భాగమే అయితే, కశ్మీర్‌కు మాత్రమే వాళ్లు ఎందుకొస్తున్నట్లు? హరియాణా, జార్ఖండ్, మహారాష్ట్రల్లో ఎన్నికలప్పుడు ఎందుకు వెళ్లరు?’అని ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘విదేశీ ప్రతినిధులను అనుమతిస్తున్న ప్రభుత్వం..విదేశీ జర్నలిస్టులపై ఆంక్షలు పెడుతోంది. నిజాలు బయటకొస్తాయని కేంద్రం భయపడుతోంది’అని వ్యాఖ్యానించారు. -
ఢిల్లీ నేతలకు నేనంటే ద్వేషం : ఒమర్
శ్రీనగర్: జమ్మూకశీ్మర్‌లో ఎన్నికల వేళ బీజేపీ అగ్రనాయకత్వంపై నేషనల్ కాన్ఫెరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా పరోక్ష విమర్శలు చేశారు. శుక్రవారం గాందర్బల్ అసెంబ్లీ స్థానంలో ఎన్నికల ప్రచారంలో ఒమర్ మాట్లాడారు. ‘‘ ఢిల్లీలో ఉన్న నేతలకు నేనంటే ద్వేషం. ఎన్నికల్లో ఓడించి నా నోరు మూయించాలని చూస్తున్నారు. పని గట్టుకుని స్వతంత్య అభ్యర్థులను నాపై పోటీకి నిలుపుతున్నారు. నన్ను ఓడించి చట్టసభల్లో నా గొంతు వినపడకుండా చేయాలని కుట్ర పన్నారు. ఢిల్లీ నేతలపై నేను పోరాడుతున్నది నా కోసమో, నా కుటుంబం కోసమో కాదు. జమ్మూకశ్మీర్ పౌరుల కోసం. నేనేం మాట్లాడిన ప్రజల గొంతుక వినిపిస్తా’’ అని ఒమర్ అన్నారు. -
జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌ల మధ్య కుదిరిన పొత్తు
శ్రీనగర్ : అసెంబ్లీ ఎన్నికల వేళ జమ్మూ కశ్మీర్లో పొత్తు పొడిచింది. జమ్మూ కశ్మీర్లో జరగనున్న 90 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.ఈ తరుణంలో పొత్తుపై ఇరు పార్టీల నేతలు స్పందించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్‌ల మధ్య ఒప్పందం జరిగిందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 51 స్థానాల్లో, కాంగ్రెస్ 32 స్థానాల్లో పోటీ చేయనుందని తెలుస్తోంది. ఈ పొత్తు సంతోషకరం. ఇక్కడ ప్రజలను విభజించి పాలించాలని ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా మేం ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తాం. కశ్మీర్లో ఇండియా కూటమి దేశాన్ని మతతత్వం, విభజించడం, విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులతో పోరాడుతుంది’ అని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. ఇక కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల మధ్య పొత్తు కుదిరినా.. సీట్ల పంపకాల విషయంలో విబేధాలు తలెత్తాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం ట్రబుల్ షూటర్లుగా కేసీ వేణుగోపాల్,సల్మాన్ ఖుర్షీద్‌లను శ్రీనగర్‌కు పంపింది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు సీనియర్ల రాక, ఆపై మంతనాలు.. వెరసి తొలి విడత ఎన్నికల నామిషన్ల దాఖలు ప్రక్రియకు ఒక రోజు ముందే పొత్తు కుదిరిందని కేసీ వేణుగోపాల్ చెప్పారు.ఇరు పార్టీల మధ్య చర్చలు పూర్తయియ్యాయి. ఈ ఎన్నికల్లో కలిసి పోరాడాలని నిర్ణయించుకున్నాం. జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధిస్తాం’ అని వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. Attended @INCIndia-@JKNC_ joint press conference along with AICC GS-Org Shri @kcvenugopalmp ji and NC President Jenab Farooq Abdullah sahib as formal declaration of our pre-poll alliance. Together, we will sweep the upcoming assembly election in #JammuKashmir. pic.twitter.com/TVeXkr6GS1— Bharat Solanki (@BharatSolankee) August 26, 2024 -
నేషనల్ కాన్ఫరెన్స్ యూ టర్న్
శ్రీనగర్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని కలిసికట్టుగా ఎదుర్కొనే లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ దూరమవుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్ని కల్లో తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగు తుందని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా గురువారం ప్రకటించారు. కొద్దిసేపటికే పార్టీ నేత, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా అలాందేమీ లేదంటూ ప్రకటించారు. ఇండియా కూటమిలోనే కొనసాగుతామని జమ్మూకశ్మీర్‌లోని ఎంపీ స్థానాల్లో పోటీపై భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. కశ్మీర్ లోని అతిపెద్ద పార్టీ అయిన ఎన్సీ ఇండియా కూటమితోపాటు ప్రాంతీయ గుప్కార్(పీఏజీడీ) అలయెన్స్‌లోనూ కీలకంగా ఉంది. -
లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ..
ప్రతిపక్ష ఇండియా కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు జమ్మూకశ్మీర్‌కు చెందిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రకటించింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా నేషనల్ కాన్ఫరెన్స్ స్వతహాగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత ఫారుక్ అబ్దుల్లా వెల్లడించారు. ‘సీట్ల భాగస్వామ్యానికి సంబంధించినంతవరకు, నేషనల్ కాన్ఫరెన్స్ తన సొంత బలంతో ఎన్నికల్లో పోటీ చేస్తుందని నేను స్పష్టం చేస్తున్నా. దీని గురించి రెండు అభిప్రాయాలు లేవు. ఇకపై దీనిపై ఎలాంటి ప్రశ్నలు లేవు’ అని పేర్కొన్నారు. కాగా మూడుసార్లు జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారుక్ అబ్దుల్లా ఇండియా కూటమిలో బలమైన పార్టీగా ఉంది. ప్రతిపక్ష కూటమి అన్ని సమావేశాలకు ఆయన హాజరయ్యారు. అయితే తన అనూహత్య నిర్ణయం వెనక కారణాలు మాత్రం అబ్దుల్లా వెల్లడించలేదు. చదవండి: బీజేపీ కొత్త వ్యూహం.. వారికి రాజ్యసభకు అవకాశం లేదు! సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ తప్పుకుంటున్నాయి. ఈ కూటమి ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించిన జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. మహాకూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్న ఆయన, ఎన్డీయే మద్దతుతో తొమ్మిదోసారి బిహార్ సీఎంగా ప్రమాణం చేసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేశారు. మరోవైపు ఢిల్లీ, పంజాబ్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అలాగే టీఎంసీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా తమ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని ఇప్పటికే స్పష్టం చేశారు. గత నెలలో అబ్దుల్లా ఇండియా కూటమి సీట్ల షేరింగ్ ఏర్పాట్లపై ఏకాభిప్రాయం లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఒప్పందానికి రావాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. దేశాన్ని రక్షించాలంటే, ముందుగా విభేదాలను మరచిపోయి దేశం గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇటీవలే కేంద్ర దర్యాప్తు సంస్థం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అబ్దుల్లాకు సమన్లు జారీ చేసింది. అయితే వీటిని ఆయన దాటవేసారు. -
Money Laundering Case: ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు
ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమన్లు జారీ చేసింది. జనవరి 11న విచారణకు హాజరు కావాలని ఈడీ కోరింది. శ్రీనగర్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలని స్పష్టం చేసింది. జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (JKCA)లో జరిగిన అవకతవకలపై ఫరూక్ అబ్దుల్లాకు సమన్లు జారీ చేసినట్లు సమాచారం. ఫరూక్ అబ్దుల్లాపై ఈడీ 2022లో అధికారికంగా అభియోగాలు మోపింది. సంబంధం లేని పార్టీలు, JKCA ఆఫీస్ బేరర్లతో సహా వివిధ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలకు నిధులను బదిలీ చేయడం, అలాగే JKCA బ్యాంక్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణలు చేయడం వంటివి ఇందులో భాగంగా ఉన్నాయి. అబ్దుల్లాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దాఖలు చేసిన 2018 ఛార్జిషీట్లో దాఖలు చేసింది. అనంతరం ఈడీ కేసు నమోదు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తర్వాత ప్రస్తుతం ఫరూక్ అబ్దుల్లాకు ఈడీ నోటీసులు దాఖలు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో జమ్మూ కాశ్మీర్ బ్యాంకు మోసం కేసులో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాను ఈడీ ప్రశ్నించింది. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
బలప్రయోగానికీ వెనుకాడం
బీజింగ్: తైవాన్ను చైనాలో ఐక్యం చేసుకొనే విషయంలో బలప్రయోగానికి సైతం వెనుకాడబోమని డ్రాగన్ దేశాధిపతి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) ప్రధాన కార్యదర్శి షీ జిన్‌పింగ్ తేల్చిచెప్పారు. తైవాన్ ముమ్మాటికీ తమదేశంలో ఒక అంతర్గత భాగమేనని ఉద్ఘాటించారు. చైనా జాతీయ సార్వభౌమత్వం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాల కోసం సైన్యాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరిస్తామని ప్రకటించారు. రాజధాని బీజింగ్‌లోని ‘ఆర్నేట్ గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా 20వ జాతీయ సదస్సులో జిన్‌పింగ్ ప్రసంగించారు. తైవాన్ విషయంలో తన వైఖరిని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టంచేశారు. తైవాన్‌లో వేర్పాటువాద ఉద్యమాలకు అడ్డుకట్ట వేయడానికి అన్ని రకాల చర్యలు చేపడతామని వెల్లడించారు. బలప్రయోగానికైనా వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. ‘పూర్తిస్థాయి పునరేకీకరణ’ తప్పనిసరి చైనా పునరేకీకరణను పూర్తి చేస్తామని షీ జిన్‌పింగ్ ప్రతినబూనారు. పునరేకీకరణ అంటే తైవాన్ను చైనా ప్రధాన భూభాగంలో(మెయిన్ ల్యాండ్) కలిపేయడమే. జిన్‌పింగ్ ప్రతిజ్ఞకు సదస్సులో చప్పట్లతో పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. తైవాన్ అంశంలో కమ్యూనిస్ట్ పార్టీ దృఢసంకల్పంతో వ్యవహరించాలని జిన్‌పింగ్ సూచించారు. పునరేకీకరణ విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శించాలన్నారు. ‘‘తైవాన్ సమస్యను పరిష్కరించుకోవడం అనేది పూర్తిగా చైనాకు సంబంధించిన వ్యవహారం. ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందే చైనానే’’ అని వ్యాఖ్యానించారు. పునరేకీకరణ విషయంలో శాంతియుత మార్గంలోనే ముందకెళ్తామని తెలిపారు. అదేసమయంలో బలప్రయోగానికి పాల్పడబోమన్న హామీని తాము ఇవ్వలేమన్నారు. ‘పూర్తిస్థాయి పునరేకీకరణ’ అనేది వాస్తవరూపం దాల్చడం తప్పనిసరి అని ఉద్ఘాటించారు. తైవాన్ సోదరుల సంక్షేమం కోసం తాము పనిచేస్తున్నామని చెప్పారు. వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూనే ఉన్నామన్నారు. చైనా–తైవాన్ మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను ప్రోత్సహిస్తామని వివరించారు. ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలను కోరుకుంటున్నామని జిన్‌పింగ్ తెలియజేశారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) 2027లో వందేళ్లను పూర్తిచేసుకోనుందని అన్నారు. సైన్యాన్ని ఆధునీకరించాలన్న లక్ష్యాన్ని మరో ఐదేళ్లలో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆధునిక సోషలిస్ట్ దేశ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆహారం, ఇంధనం, పరిశ్రమలు, సప్లై చైన్స్, విదేశాల్లోని చైనీయుల హక్కుల విషయంలో మరింత సామర్థ్యంతో పని చేయాల్సి ఉందన్నారు. బ్రిక్స్, షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) వంటి వాటిలో చురుకైన పాత్ర పోషిస్తామని జిన్‌పింగ్ వివరించారు. హాంకాంగ్‌పై స్పష్టమైన ఆధిపత్యం సాధించామని చెప్పారు. అగ్రనేతలకు స్థానచలనం! కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సదస్సు దాదాపు వారం రోజులపాటు జరుగనుంది. చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి ఎన్నుకోనున్నారు. జిన్‌పింగ్ మినహా పార్టీలో అగ్రనేతలందరికీ ఈసారి స్థానచలనం తప్పదని తెలుస్తోంది. నంబర్–2గా పేరుగాంచిన లీ కెఖియాంగ్‌ను సైతం మార్చనున్నారు. ఆయన స్థానంలో మరొకరికి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. తొలిరోజు సదస్సులో 2,300 మందికిపైగా ‘ఎన్నికైన ప్రతినిధుల’తోపాటు కమ్యూనిస్ట్ పార్టీ మాజీ అగ్రనేతలు హూ జింటావో, సాంగ్‌పింగ్ తదితరులు పాల్గొన్నారు. 2002 దాకా అధ్యక్షుడిగా పనిచేసిన 96 ఏళ్ల జియాంగ్ జెమిన్ హాజరు కాలేదు. జిన్‌పింగ్ దాదాపు 45 నిమిషాలపాటు మాట్లాడారు. కీలక అంశాలను ప్రస్తావించారు. ఆయన ప్రసంగం పట్ల ఆహూతులంతా హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. -
బీజేపీనే నెం.1.. థాక్రే ఖేల్ ఖతం: ఫడణవీస్
ముంబై: మహారాష్ట్రలో రెండు రోజుల క్రితం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం తమదంటే తమదే అని అధికార బీజేపీ-శివసేన, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ ప్రకటించుకున్నాయి. మొత్తం 16 జిల్లాల్లోని 557 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. తాము 259 చోట్ల గెలిచామని బీజేపీ చెబుతోంది. అలాగే తమ మిత్రపక్షం, సీఎం ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన బలపర్చిన 40 అభ్యర్థులు గెలిచినట్లు పేర్కొంది. ఈ ఫలితాలపై స్పందిస్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో బీజేపీనే నెంబర్-1 పార్టీ అన్నారు. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన పని అయిపోయిందన్నారు. బాలాసాబెహ్ థాక్రే ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న షిండే వర్గమే అసలైన శివసేన అని స్పష్టం చేశారు. ఈ సమయంలో షిండే పక్కనే ఉన్నారు. అయితే మహావికాస్ అఘాడీ మాత్రం బీజేపీ ప్రకటనను తోసిపుచ్చింది. 494 గ్రామ పంచాయతీల ఎన్నికల ఫలితాలు మాత్రమే వచ్చాయని, అందులో తామే ఎక్కువ చోట్ల గెలిచినట్లు లెక్కలు చెప్పింది. వీటి ప్రకారం బీజేపీ 144 స్థానాల్లో, ఎన్సీపీ 126, కాంగ్రెస్ 62, షిండే-శివసేన 41, థాక్రే-శివసేన 37 సీట్లు గెలుపొందింది. దీంతో మొత్తంగా తాము 494కి 225 స్థానాలు గెలిచినట్లు ఎంవీఏ వివరించింది. అయితే గ్రామపంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగవు కాబట్టి వీటిని రాజకీయ పార్టీలు తమ విజయంగా చెప్పుకోవడం సరికాదని ఎన్పీపీ నేత అజిత్ పవార్ అన్నారు. ఒకవేళ గెలిచిన అభ్యర్థులు తాము ఈ పార్టీకే మద్దతిస్తామని చెబితే అప్పుడు లెక్కలోకి తీసుకోవచ్చన్నారు. 300 స్థానాల్లో గెలిచామని బీజేపీ-షిండే వర్గం చెబుతోందని ప్రశ్నించగా.. అలా అయితే నేను 400 స్థానాల్లో గెలిచామని చెబుతా అని బదులిచ్చారు. ఇవి పార్టీల గుర్తుపై జరిగే ఎన్నికలు కావు కాబట్టి లెక్కలు ఎంతైనా చెప్పుకోవచ్చని బీజేపీపై సెటైర్లు వేశారు. చదవండి: పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానయాన శాఖ దర్యాప్తు! -
చిన్న పార్టీలకు అధికారం దక్కకుండా చేయడమే బీజేపీ ఎజెండా
థానే/ముంబై: బీజేపీయేతర రాజకీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఏకం చేసి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఎన్సీపీ అధినేత శరద్ పవార్(81) చెప్పారు. అయితే, వయోభారం దృష్ట్యా ఈ విషయంలో ఎలాంటి బాధ్యతను తీసుకునే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. థానేలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేందుకు బీజేపీయేతర పారీ్టలను ఏకం చేసే విషయంలో తన సహకారం మాత్రం ఉంటుందన్నారు. 2014 సాధారణ ఎన్నికలు మొదలుకొని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయిందన్నారు. ‘ప్రతి గృహానికి కరెంటు, నీరు, మరుగుదొడ్లు వంటివి కల్పించడం, గ్రామాలను ఇంటర్నెట్తో అనుసంధానించడం వంటి ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు మాత్రం, 2024 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ స్థాయికి తీసుకెళ్తానంటూ కొత్తగా వాగ్దానం చేస్తోంది’అంటూ విమర్శించారు. చిన్న పార్టీలకు అధికారం దక్కకుండా చేయడమే బీజేపీ ఎజెండాగా మారిందన్నారు. ప్రతిపక్ష పార్టీలను భయపెట్టేందుకు సీబీఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖ వంటి వాటిని వాడుకుంటోందని చెప్పారు. ‘మహారాష్ట్ర ఎన్సీపీ నేత అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ, ఈడీ, ఐటీ విభాగాలు 110 దాడులు చేశాయంటే మీరు నమ్మగలరా? ఈ కేసులో రూ.100 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పారు. ఆ తర్వాత రూ.4.07 కోట్లు, ఇప్పుడు రూ.1.71 కోట్లు మాత్రమేనని అంటున్నారు. నిజాలన్నీ కోర్టులోనే తేలుతాయి’అని పవార్ అన్నారు. ‘రాజకీయ ప్రత్యర్థులపై బీజేపీ చేస్తున్న దాడి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపైనే తప్ప మరొకటి కాదు. ఇది ఆందోళన కలిగించే అంశం. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను చీల్చి అధికారం చేజిక్కించుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందుకు మహారాష్ట్ర తాజా ఉదాహరణ’అని అన్నారు. తమ తమ పార్టీల తరఫున గట్టిగా మాట్లాడినందుకే ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్, శివసేన నేత సంజయ్ రౌత్‌లను మోదీ ప్రభుత్వం జైలుపాలు చేసిందన్నారు. బిలి్కస్బానో కేసులో జీవిత ఖైదు పడిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సిగ్గుచేటుగా ఆయన అభివర్ణించారు. చదవండి: ఏం రాహుల్.. ఏం మాట్లాడుతున్నావ్.! -
స్థానికేతరులకు ఓటు హక్కు ఇస్తే ఖబడ్దార్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఓటర్ల జాబితాలో స్థానికేతరుల పేర్లను చేరుస్తూ నిర్ణయం తీసుకుంటే సహించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా హెచ్చరించారు. కోర్టుకు వెళ్లయినా సరే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. స్థానికేతరులకు ఓటు హక్కును ఎలా అడ్డుకోవాలన్న అంశంపై చర్చించేందుకు ఆయన సోమవారం అఖిలపక్ష నాయకులతో సమావేశయ్యారు. ఈ భేటీకి 9 పార్టీల నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేకతను, గుర్తింపును దెబ్బతీసే చర్యలకు పాల్పడొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇక్కడ బయటి వ్యక్తులు ఓటు హక్కు ఇవ్వడం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీని స్థానికేతరుల చేతుల్లో పెట్టొద్దని డిమాండ్ చేశారు. -
ఒమర్ అబ్దుల్లా కుటుంబం గృహనిర్బంధం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ పోలీసులు తనని, తన కుటుంబ సభ్యుల్ని, తన తండ్రి ఎంపీ అయిన ఫరూక్ అబ్దుల్లాని గృహ నిర్బంధంలో ఉంచార ని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆదివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. శ్రీనగర్‌లోని గుప్కార్ ప్రాంతం లో తన ఇంటి బయట ఉన్న పోలీసు వాహనా లకు సంబంధించిన ఫోటోల ను కూడా ఆయన షేర్ చేశారు. ‘‘ఆగస్టు, 2019 తర్వాత కనిపిస్తున్న కొత్త కశ్మీర్ ఇది. ఎలాంటి కారణం లేకుండా మమ్మల్ని మా ఇంట్లో ఉంచి తాళాలు వేశారు. పార్లమెంటు సభ్యుడైన నా తండ్రిని కూడా నిర్బంధించడం దారుణం. నా సోదరి, పిల్లల్ని కూడా పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు’’ అని ఒమర్ అబ్దుల్లా ఆ ట్వీట్లో వెల్లడించారు. తమ ఇంట్లో పని చేసే సిబ్బం దినెవరినీ కూడా లోపలికి రానివ్వడం లేదని తెలిపారు. ‘‘ఎలాంటి కారణాలు లేకుండానే ఇంట్లో బంధించి ఉంచారు. ఇంటిలో పనులు చేసుకునే వారిని లోపలికి రానివ్వడం లేదు. మీ కొత్త ప్రజాస్వామ్యం అంటే ఇదేనా’’ అని ఒమర్ ప్రశ్నించారు. అయితే పోలీసులు మాత్రం పుల్వామా దాడి జరిగి రెండేళ్లయిన సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా, కొందరు వీఐపీలు, భద్రత కల్పించాల్సిన వారిని గృహనిర్బంధంలో ఉంచినట్టుగా తెలిపారు. వాళ్లు బయటకొచ్చి తిరిగితే ఎలాంటి వ్యతిరేకత వస్తుందోనని అలా చేసినట్టుగా శ్రీనగర్ పోలీసులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. -
తన వ్యాఖ్యలతో నవ్వుల్లో ముంచిన మాజీ సీఎం
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో తాను గడిపిన జీవితాన్ని వివరిస్తూ జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా నవ్వులు పూయించారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో తన భార్యకు ముద్దు కూడా పెట్టలేకపోయానని చెప్పారు. ఇటీవల జరిగిన ఓ సభలో ఆయన తన లాక్డౌన్ జీవితాన్ని వివరించారు. లాక్డౌన్ సమయంలో ప్రజలతో పాటు తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. ఇతరులతో చేతులు కలపడానికి.. ఆలింగనం చేసుకోవడానికి భయపడ్డామని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. నిజాయతీగా చెబుతున్నాననంటూ ఆ భయంతోనే తన భార్యకు ముద్దు కూడా పెట్టలేదని చెప్పి అందరినీ నవ్వుల్లో ముంచారు. ఏమో ఏమైనా జరగొచ్చనే భయంతో మనసెంత కోరుకున్నా సరే తాను నియంత్రణలో ఉన్నట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి పూర్తిగా అంతమవ్వాలని ఆకాంక్షిస్తూనే కోవిడ్ టీకా రావడంపై మాజీ సీఎం హర్షం వ్యక్తం చేశారు. -
రిపబ్లికన్ ఉపాధ్యక్ష అభ్యర్థిగా మైక్‌పెన్స్
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీదారుగా రిపబ్లికన్ పార్టీ తరఫున మైక్ పెన్స్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ సదస్సునుద్దేశించి పెన్స్ మాట్లాడుతూ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జియో బైడెన్ చైనా తొత్తు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కమ్యూనిస్ట్ చైనాకి చీర్ లీడర్ అయిన ఆయన లెఫ్ట్ పార్టీతో రహస్యంగా స్నేహ సంబంధాలు కొనసాగిస్తారని ఆరోపించారు. శ్వేత సౌధంలో మరో నాలుగేళ్ల పాటు ట్రంప్ కొనసాగుతారని, అమెరికా ప్రజలు మళ్లీ రిపబ్లికన్లకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. ‘‘బైడెన్ అధికారంలోకి వస్తే చైనా కంపెనీలపై విధించిన సుంకాలన్నీ రద్దు చేయాలని చూస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో చైనా నుంచి ప్రయాణాలు రద్దు చేసిన ట్రంప్ సర్కార్‌ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదేం పద్ధతి’’అంటూ పెన్స్ విరుచుకుపడ్డారు. బైడన్ నాయకత్వంలో అమెరికన్లు సురక్షితం కాదన్నారు. ఈ సదస్సుకు అధ్యక్షుడు ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ఆకస్మికంగా హాజరై పార్టీ శ్రేణుల్ని ఆశ్చర్య పరిచారు. మరోవైపు భారత సంతతికి చెందిన డెమొక్రాటిక్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ తన తల్లి శ్యామల గోపాలన్ 19 ఏళ్ల వయసులోనే భారత్ నుంచి అమెరికాకు వచ్చారని చిన్నతనం నుంచి సమానత్వ సాధన గురించి తనకు పాఠాలు బోధించారని చెప్పారు. మహిళా సమానత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని కమలా హ్యారిస్ చిన్న వీడియో రూపంలో తన సందేశాన్ని ఇచ్చారు. తన తాతతో కలిసి చెన్నై వీధుల్లో ఉదయం వేళల్లో నడుచుకుంటూ తన తల్లి మహిళా సమానత్వం, ప్రజాస్వామ్య పరిరక్షణ, మానవ హక్కుల గురించి తెలుసుకున్నారని, ఆమే తనకు స్ఫూర్తి అని చెప్పారు. -
కేంద్ర నిర్ణయం : ఏకమైన విపక్షాలు
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నీ ఒకటవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు ప్రధాన పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, కాంగ్రెస్, వామపక్షలు, అవామీ నేషనల్ కాన్ఫరెన్స్‌లు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఎన్నో ఏళ్లుగా కశ్మీర్‌కు కొనసాగుతున్న స్వయం ప్రతిపత్తి హోదాను కొనసాగించాలని, అలాగే కశ్మీర్ విభజనను రద్దు చేయాలని ఆయా పార్టీల అధినేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్‌ను బీజేపీ సర్కార్ ముక్కలుగా చేసిందని, ఇది స్థానిక ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది ఆగస్ట్ 5న కేంద్ర ప్రభుత్వం తీసుకునన ఏకపక్ష నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు అన్ని పార్టీల నేతలు కలిసి కట్టుగా పోరాటం చేయాలని శ్రీనగర్‌లో శనివారం నిర్వహించిన ఓ సమావేశంలో తీర్మానించారు. అంతేకాకుండా పబ్లిక్ సేఫ్టీ చట్టం కింద అరెస్ట్ కాబడిన నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్ నేతలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా లాంటి నేతలు విడుదలైనా కశ్మీర్ మాజీ సీఎం మహబూబా ముఫ్తీ ఇప్పటికీ నిర్బంధంలోనే ఉన్నారు. -
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఒమర్ అబ్దుల్లా
-
చంద్రబాబుపై నిప్పులు చెరిగిన ఒమర్ అబ్దుల్లా
సాక్షి, ఢిల్లీ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఢిల్లీలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవకాశవాది అని విమర్శించారు. చంద్రబాబు కోసం తన తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా తన సొంత ఎన్నికలు వదులుకొని ఏపీకీ ప్రచారానికి వెళ్లారని గుర్తుచేశారు. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి క్లీన్‌స్వీప్ చేస్తారని తెలిసినా తన తండ్రి బాబు తరపున ప్రచారం చేయడానికి వెళ్లారన్నారు. బాబు ఓడిపోతున్నారన్న విషయం ఆయనకు తప్ప అందరికి తెలుసన్నారు. కానీ తాము హౌజ్ అరెస్ట్‌లో ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు కనీసం ఒక్క మాట మాట్లాడకపోగా కనీస మద్దతుగా ఒక ప్రకటన కూడా చేయలలేకపోయారన్నారు. అందుకే చంద్రబాబు నమ్మదగిన నేత కాదంటూ అబ్దుల్లా మండిపడ్డారు.(‘వేల ఏళ్లుగా ఉన్న రామ మందిరాన్ని ఎవరు ధ్వంసం చేశారు’) ఒమర్ అబ్దుల్లా మార్చి నెలలో నిర్బంధం నుంచి విడుదలయ్యారు. పబ్లిక్ సేఫ్టీచట్టం కింద ఆయనను 8నెలల కింద గృహ నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. 370 అధికరణ కింద జమ్మూ, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసిన అనంతరం గతేడాది ఆగస్టు 5 నుంచి ఆయన ఆ రాష్ట్ర గెస్ట్ హౌస్ హరినివాస్‌లో ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా కూడా 221 రోజుల నిర్బంధం నుంచి ఈ ఏడాది మార్చి 13న విడుదలయ్యారు. -
బీజేపీలో చేరిన అత్యంత సంపన్న ఎంపీ
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయపాలైన విపక్షాలకు ఫలితాల అనంతరం కూడా వరుస షాకులు తగులుతున్నాయి. అనేక మంది కీలక నేతలు బీజేపీకి గూటికి చేరుతున్నారు. తాజాగా కీలకమైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు విపక్షా పార్టీలకు మరో షాక్ తగిలింది. ఎస్సీపీ ఎంపీ, ఛత్రపతి శివాజీ 13వ వారసుడు సతారా సిట్టింగ్ ఎంపీ ఉదయన్‌రాజ్ భోంస్లే బీజేపీలో చేరారు. ఇటీవల ఎస్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన భోంస్లే.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో శనివారం కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ, అమిత్ షా నాయకత్వంలో దేశ అభివృద్ధి పథకంలో దూసుకుపోతోందని అన్నారు. ఫడ్నవిస్‌తో కలిసి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామినైతానని తెలిపారు. కాగా ఆయన రాజీనామాతో ఎస్సీపీ, కాంగ్రెస్ శ్రేణులు విస్మయానికి గురయ్యారు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల ముందు సీనియర్ నేతలు ఇలా పార్టీని వీడటం నేతలను కలవరానికి గురిచేస్తోంది. కాగా రాష్ట్ర అసెంబ్లీకి త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరి కంటే సంపన్నుడిగా ఎంపీ ఉదయన్‌రాజే భోంస్లే నిలిచిన విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరఫున సతారా నుంచి మళ్లీ పోటీ చేస్తున్న ఆయన.. తనకు రూ.199 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. రూ.185.5 కోట్ల విలువైన స్థిరాస్తులు, రూ.13.38కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల పేరిట రూ.89 లక్షల డిపాజిట్, రూ.1.45 కోట్ల మేర షేర్లు ఉన్నాయి. -
సత్వర ఆచరణే కీలకం
జమ్మూ–కశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక హక్కులు, అధికారాలను రద్దు చేయాలని, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని నిర్ణయించిన మూడురోజుల తర్వాత ఆ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దాదాపు 40 నిమిషాలు సాగిన ఆ ప్రసంగంలో సాధ్యమైనంత త్వరగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పరిస్థితులు చక్కబడ్డాక మళ్లీ రాష్ట్ర ప్రతిపత్తి, స్థానిక యువతకు విద్య, ఉద్యోగావకాశాలు వగైరాలు ప్రస్తావనకొచ్చాయి. ప్రభుత్వాలు ప్రకటించే ఏ విధాన నిర్ణయంపైన అయినా అనుకూల, ప్రతికూతలు వ్యక్తం కావడం సర్వసాధా రణం. ప్రస్తుత నిర్ణయం కశ్మీర్‌కి సంబంధించింది కనుక వాటి తీవ్రత అధికంగానే ఉంది. అయితే జమ్మూ–కశ్మీర్లో వర్తమాన స్థితిగతులెలా ఉన్నాయో, కేంద్రం తీసుకున్న చర్యలపై అక్కడి పౌరుల మనోభావాలెలా ఉన్నాయో, వారి స్పందనేమిటో తెలియడానికి మరికొంతకాలం పడుతుంది. పరి స్థితులన్నీ కుదుటపడి, ఇప్పుడు విధించిన ఆంక్షలన్నీ రద్దయ్యాక మాత్రమే అవి తెలిసే అవకాశం ఉంది. జనం కదలికలపై ఆంక్షలు విధించాక గత అయిదురోజులుగా సాధారణ ప్రజానీకం అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చానెళ్లలో వస్తున్న కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆంక్షల్ని క్రమేపీ సడలిస్తామని ఈ ప్రసంగంలో మోదీ హామీ ఇచ్చారు గనుక పరిస్థితులు త్వరలోనే కుదుటపడతాయని ఆశించాలి. వచ్చే సోమవారం బక్రీద్ పర్వదినం. ఈలోగానే అంతా చక్కబడితే సాధారణ ప్రజానీకం ఉత్సాహంగా పండుగ చేసుకోగలుగుతారు. దేశ విభజన నాటినుంచీ కశ్మీర్‌పై కన్నేసిన పాకిస్తాన్ అక్కడ ఏదో విధంగా చిచ్చు రేపాలని ప్రయత్నిస్తూనే ఉంది. 35 ఏళ్లక్రితం కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరించిన అపసవ్య విధానాలు ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికి తోడ్పడ్డాయి. ఇదే అదునుగా పాకిస్తాన్ తన కోరలు చాచడం మొదలుపెట్టింది. తదనంతరకాలంలో వచ్చిన ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు కూడా ఫలించకపోగా పరిస్థితులు మరింత వికటించడానికి కారణమయ్యాయి. భద్రతాబలగాలపై దాడులు, నిరవధిక ఉద్యమాలు, ఆందోళనలు యధావిధిగా సాగుతూనే వచ్చాయి. అంతర్గతంగా కశ్మీర్లో అధికారం చలాయించడానికి సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ ఉన్నా అంతర్జాతీయంగా కశ్మీర్ సమస్యలో మూడో పక్షం జోక్యాన్ని అవి గట్టిగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రద్దు చేసిన రాజ్యాంగ అధికరణలు 370, 35ఏ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగకపోగా అవి ఉగ్రవాదాన్ని, వేర్పాటువాదాన్ని విస్తరింపజేసేందుకు పాకిస్తాన్‌కు తోడ్పడ్డాయ న్నది మోదీ అభియోగం. కనుక కేంద్రం ఈ సమస్య మూలాల్ని కొత్త కోణం నుంచి చూస్తున్నదని అర్ధమవుతుంది. ఈ రెండు అధికరణల తొలగింపుతో పరిస్థితులు చక్కబడి, అభివృద్ధికి బాటలు పడతాయని ఆయన ఆశిస్తున్నారు. అక్కడ నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు, రోడ్డు రవాణా తదితర మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యమిస్తామని ఆయన ఇచ్చిన హామీ అయినా... ఐఐటీ, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటు చేస్తామని, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చేసిన వాగ్దానమైనా ఆచరణలోకొస్తే యువతకు ఎంతో మేలు కలుగుతుంది. ఇటీవలికాలంలో సివిల్ సర్వీసులకు జమ్మూ–కశ్మీర్ నుంచి ఎంపికవుతున్న యువత సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే అక్కడివారికి దేశంలోని ఇతర ప్రాంతాల్లో చదువుకునేందుకు ఇప్పుడు కల్పిస్తున్న అవకా శాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఉపాధి కల్పించడంలోనూ ఆ దృక్పథమే ఉండాలి. అలాంటి చర్యలు ఈ దేశంలో తామూ భాగమేనన్న విశ్వాసాన్ని వారికి కలిగిస్తాయి. కశ్మీర్ లోయలో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు అందరికీ ఆందోళన కలిగి స్తూనే ఉన్నాయి. ప్రధాన స్రవంతి పార్టీల నేతలంతా ఈపాటికే ఈ సంగతి గ్రహించారు. మధ్యేవాద హుర్రియత్ కాన్ఫరెన్స్ వంటి సంస్థలకే దిక్కుతోచని స్థితి ఏర్పడితే నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీడీపీ వంటి పార్టీల గురించి చెప్పనవసరం లేదు. ఎన్సీ, పీడీపీలది స్వయంకృతం. అవి రెండూ గతంలో కేంద్రంతో తాము పోరాడుతున్నామని, రాష్ట్రానికి అవసరమైనవి సాధిస్తున్నామని చెప్పేం దుకు ప్రయత్నించేవి. కానీ ఇటీవలి కాలంలో ఆ పార్టీలు కేంద్రంలో ఎవరుంటే వారితో పొత్తు కుదుర్చుకోవడానికి, రాజీ పడేందుకు సిద్ధపడ్డాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులుగా హోరాహోరీ సంఘర్షించిన పీడీపీ, బీజేపీలు ఎన్నికలయ్యాక కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పర్చటం వీటన్నిటికీ పరాకాష్ట. ఇదే సమయంలో ఐఎస్ వంటి ఉగ్ర సంస్థల జాడలు నేరుగా కనబడకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభావితులైనవారు అనేకులు ఈమధ్యకాలంలో సాయుధ బాట పట్టారు. ఈ నేపథ్యంలో కేంద్రం కఠిన చర్యలు తీసుకోవడం అవసరమని భావించింది. ఒక రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీయడమన్నది స్వాతంత్య్రం వచ్చాక మొట్టమొదటిసారి జమ్మూ–కశ్మీర్ విషయంలోనే జరిగింది. సాధారణంగా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటపుడు ప్రభుత్వాలు ఆ దిశగా ప్రజాభిప్రాయాన్ని మలిచేందుకు అవసరమైన రాజకీయ ప్రచారాన్ని ముమ్మరం చేస్తాయి. కానీ జమ్మూ–కశ్మీర్ రక్షణపరంగా సున్నితమైన ప్రాంతం. దాని సరిహద్దుల్లో పాకిస్తాన్, చైనా ఉన్నాయి. కనుకనే ఆ తరహా చర్య సమస్యాత్మకంగా మారే అవకాశం ఉందన్న సందేహం కేంద్రా నికి కలిగి ఉండొచ్చు. అయితే తీసుకునే చర్య ఎలాంటిదైనా స్థానికులను విశ్వాసంలోకి తీసుకోవాలి. అప్పుడే దానికి సార్థకత చేకూరుతుంది. మెరుగైన ఫలితాలు వస్తాయి. ఏదేమైనా జనానికి మేలు కలిగించే భిన్న చట్టాల అమలు, భారీ యెత్తున ఉద్యోగాల భర్తీ, మౌలికసదుపాయాల కల్పన, ఉన్నత శ్రేణి విద్యాసంస్థలు, క్రీడల కోసం శిక్షణ కేంద్రాలు వంటివి ఏర్పాటు చేస్తామన్న మోదీ వాగ్దానాలు సాధ్యమైనంత త్వరగా ఆచరణరూపం దాలిస్తే నిజంగానే నయా కశ్మీర్‌కు ఆ చర్యలు దోహదపడతాయి. -
సీపీఐ కొత్త సారథి డి.రాజా
సాక్షి, హైదరాబాద్: సీపీఐ జాతీయ స్థాయి నాయకత్వంలో మార్పు చోటు చేసుకుంది. సురవరం సుధాకర్‌రెడ్డి స్థానంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా ఎన్నికయ్యారు. ఈ మేరకు శనివారం సీపీఐ జాతీయ సమితి ఆమోద ముద్ర వేసింది. ఢిల్లీలో జరుగుతున్న జాతీయ కార్యవర్గ, జాతీయ సమావేశాలు ఆదివారంతో ముగుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం సీపీఐ ప్రధానకార్యదర్శిగా పార్టీ అత్యున్నత బాధ్యతలను సురవరం సుధాకర్‌రెడ్డి నుంచి డి.రాజా స్వీకరిస్తారు. పార్టీ అత్యున్నత పదవి కోసం డి.రాజాతో పాటు సీనియర్ నేతలు అతుల్ కుమార్ అంజాన్, అమర్జిత్ కౌర్ పేర్లను నాయకత్వం పరిశీలించింది. తమిళనాడు నుంచి ఎంపీగా కొనసాగుతున్న రాజా రాజ్యసభ సభ్యత్వం త్వరలోనే ముగియనుంది. దళిత వర్గ నేతగా, రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా ఉండడంతో జాతీయస్థాయిలో రాజకీయ పార్టీల అగ్రనేతలతో ఆయనకు పరిచయాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొత్త రక్తం నింపడంతో పాటు వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువ కావాలనే వ్యూహంలో భాగంగానే రాజా వైపు జాతీయ సమితి మొగ్గు చూపినట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలుపొందడంతో పాటు దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడం, క్రియాశీలంగా మార్చడం వంటివి రాజాకు సవాళ్లేనని పరిశీలకులు అంటున్నారు. సురవరం ఎందుకు వైదొలిగారంటే.. ఆరోగ్యం సహకరించని కారణంగా ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించాలని మేలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో సురవరం సుధాకర్ రెడ్డి(77) కోరినట్టు పార్టీ వర్గాల సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల వరకే పదవిలో ఉంటానని పార్టీకి ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఆ పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించి, నిర్ణయం తీసుకున్నారు. జాతీయ ›ప్రధాన కార్యదర్శిగా 2012లో బాధ్యతలను చేపట్టిన సురవరం, వరసగా మూడు పర్యాయాలు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుత పదవీకాలం 2021 వరకు ఉంది.