సమాజ్‌వాదీ పార్టీ నేత కోడలి ఆత్మహత్య
కాన్పూర్: సమావాజ్వారీ పార్టీ నేత, యుపి ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ వైస్ చైర్మన్ ఆత్మప్రకాష్ శుక్లా కోడలు అనిత ఆత్మహత్య చేసుకుంది. యశోదానగర్‌లోని తమ నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడింది. అనితను భర్త నివేంద్ర హత్య చేసినట్లు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనిత, ఆమె భర్త నివేంద్ర మధ్య సంబంధాలు సరిగాలేవని, తరచూ వారు వాదులాడుకునేవారని అనిత సోదరుడు కమలేష్ పోలీసులకు చెప్పారు. ఇదే తన సోదరి హత్యకు దారి తీసినట్లు అతను ఆరోపించారు. అయితే ఆమె మృతదేహం పోస్ట్ మార్టంకు పంపిన తరువాత, ఉరివేసుకొనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తమ విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.