no teachers
-
రోడ్డెక్కిన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు
పెద్దవూర(నాగార్జునసాగర్) : తరగతులు సక్రమంగా నిర్వహించాలని మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నాగార్జునసాగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై మంగళవారం రోడ్డెక్కి గంటకు పైగా రాస్తారోకో నిర్వహిం చారు. 2015 నవంబర్ 1వ తేదీన జిల్లాలోని ఆరు గిరిజన వసతి గృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మార్చి 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఏర్పాటు చేశారు. దశల వారీగా ఈ యేడాది 10వ తరగతి నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో 258 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికి ప్రభుత్వం రూ.5వేల వేతనంతో అకడమిక్ ఇన్‌స్ట్రక్లర్లను నియమించి పాఠశాలలను నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో పనిచేస్తున్న అకడమిక్ ఇన్‌స్ట్రక్లర్లు(పార్ట్‌టైం టీచర్లు) వేతనాలు పెంచాలని ఈ నెల 2,3,4 తేదీల్లో సమ్మెలో పాల్గొని చాక్‌డౌన్ నిర్వహించారని తెలిపారు. ఈ మూడు రోజులు తమకు పాఠాలు బోధించలేదని దీంతో తరగతుల్లో ఖాళీగా కూర్చోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సమ్మె విరమించినా తమ సమస్యలు పరిష్కారం కాకుంటే మళ్లీ సెప్టెంబర్ 2వ తేదీ నుంచి సమ్మె చేస్తామని ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు తెలిపారు. ఏటీడీనో, పాఠశాల హెచ్ఎం పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య ఇలా ఉందని మీరు వేరే పాఠశాలకు వెళ్లండని తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఇన్నాళ్లు ఇక్కడ చదివి పాఠశాల ప్రారంభమైన రెండు నెలల తర్వాత ఎలా వెళ్తామని, ఈ పాఠశాల నుంచి వెళ్లేది లేదని, సక్రమంగా తరగతులను నిర్వహించాలని పాఠశాల నుంచి ప్రధాన సెంటర్‌కు వెళ్లి రాస్తారోకోకు దిగారు. ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వర్తించేలా చూడాలని, పాఠశాల పనిదినాల్లోనే తరగతులు నిర్వహించాలని, పార్ట్‌టైం కాకుండా ఫుల్‌టైం విధులు నిర్వహించేలా చూడాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ తరి రాము సంఘటన స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లిన విద్యార్థులు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఉపాధ్యాయులు సక్రమంగా రావడం లేదని, పాఠ్యాం శాలు సరిగా కావడం లేదని, పాఠశాలకు వచ్చినా పాఠ్యాంశాలు బోధించడం లేదని, ఈ పాఠశాలలోనే ఉంటామని, వేరే పాఠశాలకు ఎట్టి పరిస్థితులలో వెళ్లమని, సక్రమంగా పాఠాలు నిర్వహించేలా చూడాలని తహసీల్దార్‌కు విన్నవించారు. తహసీల్దార్ కార్యాలయం వద్దకు వచ్చిన ఏటీడీఓ జటావత్ లాల్‌సింగ్ విద్యార్థులతో మాట్లాడి సర్దిచెప్పి పాఠశాలకు తీసుకువెళ్లారు. అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి ఇకనుంచి సక్రమంగా తరగతులు నిర్వహించేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
తెలంగాణలో ఉపాధ్యాయుల కొరత
-
ఎలిమెంటరీ దాటితే ఇంటికే!
గాజులపల్లె(మహానంది),న్యూస్‌లైన్ : జిల్లాలో ఉర్దూ విద్యా బోధనను ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. ప్రాథమిక పాఠశాలల పరిస్థితి పర్వాలేదనిపించినా హైస్కూళ్ల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఉపాధ్యాయులు లేకపోగా విద్యా శిక్షకులను కూడా నియమించకుండా ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారు. ఫలితంగా అప్పటి దాకా ఉర్దూ మీడియంలో చదువు సాగించిన విద్యార్థులు ఇతర మీడియంలోకి వెళ్లలేక, ఇదే మీడియంలో హైస్కూల్లో చదివేందుకు ఉపాధ్యాయులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మహానంది మండలం గాజులపల్లె ఉన్నత పాఠశాల పరిస్థితే ఇందుకు నిదర్శనం. ఈ స్కూల్లో మూడేళ్లుగా ఉపాధ్యాయులు లేకపోయినా జిల్లా అధికారులు ఏ మాత్రం స్పందించడంలేదు. ఫలితంగా విద్యార్థులు ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు చదివేందుకు పడిన కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారుతోంది. కొందరు ఇతర మీడియంలోకి వెళ్తున్న అక్కడ ఇమడలేకపోతున్నారు. అప్పటిదాకా నేర్చుకున్న ఉర్దూను పూర్తిగా మరిచిపోతున్నారు. జిల్లా అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులతో మొరపెట్టుకున్నా పట్టించకునే నాథుడు లేకపోవడంతో విద్యార్థులు నిత్యం పాఠశాలకు వెళ్లి సాయంత్రం వరకు కూర్చొని తిరిగి ఇంటికి వస్తున్నారు. స్వాతంత్య్రం రాకముందే ఏర్పాటు 20-07-1944లో ఏర్పాటైన గాజులపల్లె ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో వేలాదిగా విద్యార్థులు ఉర్దూను అభ్యసించారు. ప్రస్తుతం 1నుంచి ఐదో తరగతి వరకు 83 మంది విద్యార్థులు, వారికి ముగ్గురు ఉపాధ్యాయులున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాతే విద్యార్థులను ఇబ్బందులు పీడిస్తున్నాయి. ఐదు దాటితే కష్టాలే.. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళ్లే సరికి టీచర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. 2010-11, 2011-12లో ఒక వాలంటీర్‌ను, 2012-13లో డిప్యూటేషన్‌పై ఇద్దరు ఉపాధ్యాయులతో నెట్టుకొచ్చినప్పటికీ ఈ ఏడాది ఇప్పటి వరకు ఉ పాధ్యాయులను నియమించకపోవ డం గమనార్హం. జిల్లాలో 14 ఉర్దూ హైస్కూళ్లుండగా నాలుగు మినహా మిగతా వాటి పరిస్థితి ఇదేనని తెలుస్తోంది. చదువు మానేస్తున్న విద్యార్థులు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉర్దూ విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. 120 మందికి పైగా ఉన్న విద్యార్థులు ప్రస్తుతం 76కు తగ్గిపోయారు. టీచర్లు లేకపోవడంతో కొందరు చదువు మానేస్తుండగా మరికొందరు ఇతర మీడియంలోకి వెళ్తున్నారు. విషయంపై ఎంఈఓ జయమ్మ మాట్లాడుతూ పబ్లిక్ పరీక్షలున్న దృష్ట్యా పదో తరగతి విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులతో బోధన చేయిస్తామని తెలిపారు.