ద్విచక్రవాహనం ఢీ కొని మహిళ మృతి
ముక్కావారిపల్లె(ఓబులవారిపల్లె): ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లె జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం దేవరపల్లె చిన్నమ్మ (35)ను ద్విచక్రవాహనం ఢీ కొనడంతో మృతి చెందింది. మృతురాలి బంధువుల కథనం మేరకు పెద్దఓరంపాడు దళితవాడకు చెందిన దేవరపల్లె చిన్నమ్మ ముక్కావారిపల్లె సిండికేట్ బ్యాంకులో డబ్బులు తీసుకుని జాతీయ రహదారి దాటుతుండగా రైల్వేకోడూరు నుంచి రాజంపేటకు ఏపీ04–బిసి–7695 నెంబరుగల డిస్కవరీ ద్విచక్రవాహనంపై రాజంపేట శింగనవరారిపల్లెకు చెందిన కె.శంకరయ్యనాయుడు వేగంగా వచ్చి ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. మృతురాలికి కుమార్తె, కుమారుడు ఉండగా భర్త జీవనోపాధి నిమత్తం కువైట్‌కు వెళ్లాడు. మృతురాలి మామ దేవరపల్లె నరసయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ పర్వీన్ తెలిపారు.