Palnadu District Latest News
-
పల్నాటి ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు
ఎస్పీ శ్రీనివాసరావు కారెంపూడి: పల్నాటి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 30 నుంచి పల్నాటి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పల్నాటి వీరుల గుడిని ఎస్పీ సందర్శించారు. పీఠాథిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఎస్పీకి లాంఛనంగా స్వాగతం పలికారు. అనంతరం వీరుల గుడిలో పల్నాటి వీరుల ఆయుధాలను ఎస్పీ పరిశీలించారు. ఆయుధాల విశిష్టతను పల్నాటి వీరాచార పీఠం నిర్వాహకుడు విజయ్‌కుమార్ ఎస్పీకి వివరించారు. కన్నమదాసు భైరవ ఖడ్గాన్ని, ఇతర ఆయుధాలను ఎస్పీ పరిశీలించారు. ఆయుధాలన్నీ ఆనాటివేనని, అయితే కొన్నింటికి కర్రలు మార్చడం జరిగిందని పీఠాధిపతి తెలిపారు. వీరాచారం నెరవేర్చలేని వారిచ్చిన కొన్ని ఆయుధాలు వీరుల గుడిలో ఉన్నాయని, మిగిలిన అన్ని ఆయుధాలు వంశపారం పర్యంగా పల్నాటి వీరాచారుల వద్దే ఉంటూ వస్తున్నాయని, ఉత్సవాలకు వారు వంశపారంపర్యంగా వస్తున్న తమ ఆయుధాలతో తరలివచ్చి వీరులను తలుచుకుని తమ వీరాచారాన్ని నెరవేర్చుకుని వెళతారని వివరించారు. ఎస్పీ వీరుల గుడిని, నాగులేరును, పల్నాటి యుద్ధం జరిగిన నాగులేరు తీరాన్ని పరిశీలించారు. ఉత్సవాల నిర్వహణ తీరు ఎలా ఉంటుందనే విషయమై పీఠాధిపతిని అడిగి తెలుసుకున్నారు. డిసెంబరు రెండో తేదీ బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతం అమలు నాడు, 3వ తేదీ కోడిపోరు నాడు ప్రజల రాక ఎక్కువగా ఉంటుందని, ఉత్సవాల చివరిరోజు వీరుల ఆయుధాలు కళ్లికి ఒరిగే సమయంలో తోపులాట, ఉద్రిక్తత ఉంటుందని పీఠాధిపతి వివరించారు. ఉత్సవాలకు లక్షన్నర మంది వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉందని, ఈ ఏడాది ఇంకా ఎక్కువగా రావచ్చని భావిస్తున్నామన్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. గురజాల డీఎస్పీ బి.జగదీష్, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వాసు పాల్గొన్నారు. -
ముత్తూట్ ఫైనాన్స్ రెడ్ బ్రాంచ్ వద్ద ఆందోళన ● పరారీలో గోల్డ్ డిస్పర్మెంట్ ఆఫీసర్ ● మేనేజర్ పాత్రపై అనుమానాలు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ రెడ్ బ్రాంచ్‌లో నగదు మళ్లింపు వ్యవహరంపై ఆందోళన కొనసాగుతోంది. శుక్రవారం ఖాతాదారులు బ్రాంచ్‌కు చేరుకొని తమ బంగారు నగలు ఇవ్వాలంటూ పట్టుబట్టారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వేరే ఖాతాదారుల పేర్లతో రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్ని రోజులైనా ఖాతాదారులకు బంగారం కుదవ పెట్టుకున్నట్లు రశీదు ఇవ్వకుండా, నగదు చెల్లించినా రశీదులు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో పాటు ఖాతాదారులు అప్పు చెల్లించేందుకు వచ్చి బంగారు ఆభరణాలు ఇవ్వమంటే ఆన్లైన్ పనిచేయడం లేదంటూ రోజులు తరబడి తిప్పుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఖాతాదారులు గట్టిగా నిలదీయడంతో అసలు మీ పేరు మీద బంగారం రిజిస్టర్లో లేదని, వడ్డీ ఎక్కువ కట్టాలని పొంతన లేని సమాధానాలు చెబుతూ కాలయాపన చేశారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం ముత్తూట్ విజిలెన్స్ సెల్ 15 మందిని విచారణ చేయగా, రూ.17 లక్షలు అవకతవకలు జరిగినట్టు తేలింది. కాగా, ఇప్పటి వరకు సుమారు రూ.40 లక్షల వరకు మోసం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే గోల్డ్ డిస్పర్మెంట్ ఆఫీసర్ గోపీనాథ్ పరారీలో ఉండగా ఆయనపై బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహరంలో బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ పాత్రపైనా ఖాతాదారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వ్యవహరాలపై ఎలాంటి కేసులూ నమోదు కాలేదు. -
ఒత్తిడి పెరుగుతుంది
పాఠశాల పని వేళల మార్పు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. బోధన సమయానికి ఆటంకంగా ఉన్న యాప్‌ల భారాన్ని తొలగించి బోధనకు సమయాన్ని కేటాయించటం ద్వారా విద్యార్థికి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి. – ఎల్.వి.రామిరెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ఎస్టీయూ పని వేళల పెంపు పూర్తిగా అశాసీ్త్రయమైనది. దూరప్రాంతాల నుంచి ఉన్నత పాఠశాలలకు వచ్చే విద్యార్థినుల భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు. సాయంత్రం 5 గంటల తరువాత రవాణా సౌకర్యాలు లేక బాలికలు ఇబ్బందులు పడతారు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతారు. అన్ని రాష్ట్రాలలోనూ సాయంత్రం 4 గంటల వరకే పాఠశాలలు పని చేస్తాయి. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి. – పి.ప్రేమ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్ -
ప్రతి విద్యార్థికీ హెల్త్ కార్డులు
నరసరావుపేట: డిసెంబర్ ఏడో తేదీన ప్రతి పాఠశాలలో ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‘ నిర్వహించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ చెప్పారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌పై అన్ని జిల్లాల కలెక్టర్లతో అమరావతి నుంచి ఆయన నిర్వహించిన వీడియో సమావేశంలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అరుణ్ బాబు పాల్గొన్నారు. శశిధర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికీ హెల్త్ కార్డులు జారీ చేస్తామని, ప్రయోగాత్మకంగా ప్రతి నియోజకవర్గంలో ఐదు పాఠశాలలను ఎంపిక చేసి అందులోని విద్యార్థులందరికీ హెల్త్ కార్డులు ఇస్తామన్నారు. బడి వైపు ఒక అడుగు–తల్లిదండ్రులతో ముచ్చట్లు కార్యక్రమాల నిర్వహణపై ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులపై చర్చించాలని, విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించాలని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులంతా ఒక పాఠశాలలోనే కాకుండా ప్రతి పాఠశాలలోనూ ఎవరో ఒకరు హాజరయ్యేలా చూసుకోవాలన్నారు. ఆ పాఠశాల నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన పూర్వ విద్యార్థులు, ఆ పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలను ఆహ్వానించాలన్నారు. విద్యార్థుల ప్రోగ్రెస్‌పై తల్లిదండ్రులతో చర్చించిన తదుపరి తల్లులతో రంగవల్లులు తీర్చిదిద్దే ఏర్పాటు చేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో తల్లిదండ్రులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను గుర్తిస్తూ త్రీ స్టార్, టు స్టార్, వన్ స్టార్ క్యాటగిరీల ప్రకారం ఎంపిక చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులపై స్టార్ రేటింగ్ కలెక్టర్లకు సూచించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శశిధర్ -
పల్నాటి ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు
ఎస్పీ శ్రీనివాసరావు కారెంపూడి: పల్నాటి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 30 నుంచి పల్నాటి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పల్నాటి వీరుల గుడిని ఎస్పీ సందర్శించారు. పీఠాథిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఎస్పీకి లాంఛనంగా స్వాగతం పలికారు. అనంతరం వీరుల గుడిలో పల్నాటి వీరుల ఆయుధాలను ఎస్పీ పరిశీలించారు. ఆయుధాల విశిష్టతను పల్నాటి వీరాచార పీఠం నిర్వాహకుడు విజయ్‌కుమార్ ఎస్పీకి వివరించారు. కన్నమదాసు భైరవ ఖడ్గాన్ని, ఇతర ఆయుధాలను ఎస్పీ పరిశీలించారు. ఆయుధాలన్నీ ఆనాటివేనని, అయితే కొన్నింటికి కర్రలు మార్చడం జరిగిందని పీఠాధిపతి తెలిపారు. వీరాచారం నెరవేర్చలేని వారిచ్చిన కొన్ని ఆయుధాలు వీరుల గుడిలో ఉన్నాయని, మిగిలిన అన్ని ఆయుధాలు వంశపారం పర్యంగా పల్నాటి వీరాచారుల వద్దే ఉంటూ వస్తున్నాయని, ఉత్సవాలకు వారు వంశపారంపర్యంగా వస్తున్న తమ ఆయుధాలతో తరలివచ్చి వీరులను తలుచుకుని తమ వీరాచారాన్ని నెరవేర్చుకుని వెళతారని వివరించారు. ఎస్పీ వీరుల గుడిని, నాగులేరును, పల్నాటి యుద్ధం జరిగిన నాగులేరు తీరాన్ని పరిశీలించారు. ఉత్సవాల నిర్వహణ తీరు ఎలా ఉంటుందనే విషయమై పీఠాధిపతిని అడిగి తెలుసుకున్నారు. డిసెంబరు రెండో తేదీ బ్రహ్మనాయుడు చాపకూడు సిద్ధాంతం అమలు నాడు, 3వ తేదీ కోడిపోరు నాడు ప్రజల రాక ఎక్కువగా ఉంటుందని, ఉత్సవాల చివరిరోజు వీరుల ఆయుధాలు కళ్లికి ఒరిగే సమయంలో తోపులాట, ఉద్రిక్తత ఉంటుందని పీఠాధిపతి వివరించారు. ఉత్సవాలకు లక్షన్నర మంది వరకు ప్రజలు వచ్చే అవకాశం ఉందని, ఈ ఏడాది ఇంకా ఎక్కువగా రావచ్చని భావిస్తున్నామన్నారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. గురజాల డీఎస్పీ బి.జగదీష్, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వాసు పాల్గొన్నారు. -
బడిలో గంటశోష!
● పెరిగిన గంట పని భారం ● సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు ● 25 నుంచి పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు ● తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు ●నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ పాఠశాలల పని వేళలు మరో గంట పెంచుతూ కూటమి సర్కారు తీసుకున్న నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక వారిపై పనిభారం పెరుగుతోంది. యాప్‌లలో అప్లోడింగ్, అపార్ నమోదు వంటి ఊపిరి సలపని పనులతో ఇప్పటికే వారు సతమతమవుతున్నారు. ఇప్పుడు గంట పని భారం పడుతుండడంతో నిరసన గళం వినిపిస్తున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఐదునెలలు గడుస్తున్నా బకాయిల చెల్లింపు విషయంలో అడుగు ముందుకు పడలేదు. మధ్యంతర భృతి ప్రకటన మృగ్యమైంది. ఒకటో తేదీనే జీతాలు అందుతాయన్న ఆశ ఆగస్ట్ నెలలోనే అడుగంటింది. దీంతో ఉపాధ్యాయ సంఘాలు పోరాటాలకు సిద్ధమవుతున్నాయి. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా.. తొలుత పైలెట్ ప్రాజెక్టుగా జిల్లాలో ఎంపిక చేసిన 11 పాఠశాలల్లో కొత్త పనివేళలు ఈనెల 25 నుంచి అమలు కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమై 5 గంటల వరకు పనిచేస్తాయి. చలికాలంలో సాయంత్రం 5.30 గంటలకే చీకట్లు ముసురుతున్న నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకోవడం సరికాదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అయితే 30వ తేదీ వరకు ఎంపిక చేసిన పాఠశాలల్లో పనివేళలు అమలు చేసి ఫలితాలపై సమీక్షించి ఆ తర్వాత తుది నిర్ణయం ఉంటుందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. భిన్నాభిప్రాయాలు.. పాఠశాలల్లో గంట పని వేళ పెంచటం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చదువుకునేందుకు సమీప గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. ఉదయం 9గంటలకు పాఠశాల ప్రారంభమైతే విద్యార్థులు ఇంటి వద్ద నుంచి ఒక గంట ముందుగా బయలుదేరాల్సి ఉంటుంది. ఉదయం 8గంటలకు ఇంటి వద్ద నుంచి బడికి వచ్చిన విద్యార్థి తిరిగి సాయంత్రం 5గంటలకు పాఠశాల ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి దాదాపు సాయంత్రం 6 గంటలు అవుతుంది. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతారని చెబుతున్నారు. దీంతోపాటు ఒక్కో పీరియడ్ 45 నిమిషాల చొప్పున 8 పీరియడ్లు పెట్టడం వల్ల విద్యార్థులు మరింత అలసిపోయే ప్రమాదముందని పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులపైనా రెట్టింపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయులూ ఉదయం 7 లేదా 8 గంటలకే ఇంటివద్ద నుంచి పాఠశాలకు బయలుదేరి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలోనే ఉండి తిరిగి ఇంటికి చేరుకునేందుకు సాయంత్రం 6 లేదా 7 గంటలు అవుతుందని, ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయినులకు ఇది కష్టంగా మారుతుందని, ఈ ప్రభావం బోధనపై తీవ్రంగా పడుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాలల పని వేళలు మార్చాలంటే విద్యార్థుల మానసిక స్థితి, విద్యార్థి అభ్యాసన సంసిద్ధత, విద్యార్థినుల భద్రత, రవాణా తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఏ రాష్ట్రాలలోనూ పాఠశాలలు ఐదు గంటల వరకు పనిచేయడం లేదని, అత్యధిక అక్షరాస్యతా శాతం ఉన్న కేరళలోనూ సాయంత్రం 3 గంటల వరకే బడులు పనిచేస్తున్నాయని ఉదహరిస్తున్నారు. -
పల్నాడు
శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024సత్యసాయి జయంతి వేడుకలు వినుకొండ(నూజెండ్ల): భగవాన్ సత్య సాయిబాబా జయంతి వేడుకలలో భాగంగా వినుకొండలో శుక్రవారం ఊరేగింపు, నగర ఉత్సవం, భజన హారతి నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి విరాళం తాడేపల్లిరూరల్: కంఠంరాజు కొండూరు మహంకాళీ గుడి అభివృద్ధికి వడ్డేశ్వరానికి కె.శ్రీనివాసరావు, విజయలక్ష్మి దంపతులు రూ.1,00,006 శుక్రవారం అందజేశారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 585.10 అడుగుల వద్ద ఉంది. కుడికాలువకు 10,350 క్యూసెక్కులు వదిలారు.27న జిల్లాస్థాయి సంప్రదాయ నృత్యపోటీలు నరసరావుపేట ఈస్ట్: బోయపాలెంలోని ప్రభుత్వ జిల్లా విద్య శిక్షణ సంస్థ (డైట్ కళాశాల)లో ఈనెల 27వ తేదీన జిల్లాస్థాయి సంప్రదాయ నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి, డైట్ కళాశాల ప్రిన్సిపల్ ఎల్.చంద్రకళ శుక్రవారం తెలిపారు. పల్నాడు జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులు బాలరంగ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ నృత్య పోటీలలో పాల్గొనేందుకు అర్హులని వివరించారు. తప్పెటగుళ్లు, కర్రసాము, చెంచులాట, థింసా, జాలరి, బంజారా అంశాలలో పోటీలు ఉంటాయని తెలిపారు. నృత్య సమయం 10 నిమిషాలు కాగా, ఒక్కో బృందంలో 10 మంది విద్యార్థులు ఉండవచ్చన్నారు. జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ తమ విద్యార్థులు పోటీలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. వివరాలకు డైట్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ కె.ప్రసాద్ ఫోన్ నంబర్ 8019207528 ను సంప్రదించాలని తెలిపారు. వైద్యశాల తనిఖీ రొంపిచర్ల: స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి, జిల్లా మలేరియా వైద్యాధికారి డాక్టర్ రవీంద్ర రత్నాకర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఫ్రైడే, డ్రైడే, ఫ్యామిలీ డాక్టర్స్ ప్రోగ్రాం కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు చేశారు. బీసీ కాలనీలోని అంగన్ వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. పీహెచ్సీ వైద్యాధికారులు డాక్టర్ పోతిరెడ్డి జగన్నరసింహారెడ్డి, డాక్టర్ నిమ్మల సాయిబాబాలతో మాట్లాడారు. సిబ్బంది పనితీరు, ఆరోగ్య కేంద్రంలో రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అమరేశ్వరునికి లక్ష బిల్వార్చన అమరావతి: అమరేశ్వరాలయంలో శుక్రవారం దాతల సహకారంతో అమరేశ్వరునికి లక్ష బిల్వార్చనను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామికి విశేష అలంకరణ చేసి సహస్ర నామాలతో రుత్విక్కులు అమరేశ్వరునికి లక్ష బిల్వ దళార్చన నిర్వహించారు. బాలచా ముండికా అమ్మకు లక్ష కుంకుమార్చన చేశారు. సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లాలో మద్యం వ్యాపారులు బరితెగించారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కారు. మద్యం దుకాణాల వద్ద సిట్టింగ్ ఏర్పాటు చేయకూడదన్న ఖచ్చితమైన నిబంధన ఉన్నా.. ఏకంగా బార్ అండ్ రెస్టారెంట్లను తలపించేలా మందుబాబులకు సకల ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా ప్రవేశపెట్టిన మద్యం పాలసీలో ఆ పార్టీల నాయకులే దుకాణాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. అక్రమార్జనే ధ్యేయంగా మద్యం అమ్మకాల్లో అక్రమాలకు తెరతీస్తున్నారు. కేవలం వైన్‌షాపుల్లో మద్యం మాత్రమే విక్రయించాల్సి ఉంది. దుకాణాల వద్ద మద్యం తాగడానికి నిబంధనలు ఒప్పుకోవు. అయితే దుకాణయజమానులు టేబుళ్లు, కుర్చీలు ఏర్పాటుచేసి మద్యం తాగేందుకు వీలు కల్పిస్తున్నారు. ఎనీ టైం మద్యం పల్నాడు జిల్లాలో మొత్తం 129 మద్యం దుకాణాలు ఉన్నాయి. అందులో దాదాపు అన్ని షాపులు స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనే నడుస్తుండగా మిగిలిన వారు అడిగినంతా ఇచ్చుకొని వ్యాపారాలు చేసుకుంటున్నారు. దీంతో మద్యం వ్యాపారులకు అధికారపార్టీ నుంచి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. నిబంధనలు అతిక్రమించి దుకాణాల వద్దే మద్యం తాగించినా, సమయ పాలన పాటించకుండా 24 గంటలు విక్రయాలు కొనసాగిస్తున్నా అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రాత్రుళ్లు ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటుచేసి మరి మద్యం అమ్ముతున్నారు. బెల్టుషాపులకు సరఫరా మద్యం దుకాణాల నుంచి గ్రామాల్లో బెల్టుషాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. మద్యం బాటిళ్లపై లేబుళ్లను తొలగించి అమ్ముతున్నారు. పట్టుబడ్డా ఏ వైన్‌షాపు నుంచి మద్యం సరఫరా అయ్యిందో తెలుసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో ఎకై ్సజ్ అధికారులు దాడులు చేసి బెల్టుషాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. అయితే మూలాలపై అధికారులు దృష్టి సారించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బెల్టుషాపులకు మద్యం సరఫరాచేస్తే మొదట రూ.5 లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే లైసెన్స్ రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలు నీటపై రాతలేనని అధికారులు వ్యవహరిస్తున్న తీరు స్పష్టం చేస్తోంది. ‘సరుకు మా వద్ద తీసుకోకపోతే కేసే’ నరసరావుపేట ఎమ్మెల్యే వర్గమని చెప్పుకొనే మద్యం దుకాణ నిర్వాహకులు తమ వద్దే బెల్టుషాపుల వారు మద్యం కొనుగోలు చేయాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మాట వినని కొందరిపై అధికారులతో దాడి చేయించి కేసులు బనాయించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న మద్యం సిండికేట్ దక్కించుకున్న దుకాణాల ద్వారా బెల్టుషాపులకు మద్యం వెళ్లకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మద్యం చిచ్చు రాజుకుంటోంది. నరసరావుపేట ఎస్ఆర్కేటీ కాలనీలోని వైన్ షాపు ముందు రాత్రిపూట టేబుల్స్ ఏర్పాటు చేసి మద్యం సరఫరా చేస్తున్న దృశ్యాలు 7ఇలానే ఉంటే వ్యాపారాలు చేయలేం వైన్‌షాపుల నిర్వాహకులు దుకాణాల వద్ద మద్యం సేవించేలా వ్యవహరిస్తే తాము వ్యాపారాలు చేయలేమని, బార్లు మూసి తాళాలు అప్పగిస్తామని కొంతమంది బార్ యజమానులు ఇటీవల ఎకై ్సజ్ ఈఎస్ మణికంఠ వద్దకు వెళ్లి తమ గోడును వెళ్లబోసుకున్నారు. మద్యం దుకాణాల అక్రమాలపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇలానే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వ్యాపారులంతా కలసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించినట్టు తెలుస్తోంది. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని ఈఎస్ హామీ ఇచ్చినట్టు చెప్పుకొస్తున్నారు. న్యూస్రీల్పర్మిట్ రూం తరహా వైన్ షాపుల నిర్వాహకుల దురాగతం ప్రభుత్వ నిబంధనలకు తూట్లు చోద్యం చూస్తున్న అధికారులు ఎకై ్సజ్ అధికారులకు బార్ ఓనర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మద్యం షాపుల్లో 24 గంటలూ లిక్కర్ అమ్మకాలు రాత్రి పూట ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి మరీ విక్రయాలు బెల్టుషాపులకు మందు సరఫరాలో కూటమి నేతల మధ్య గొడవలు గతంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతించారు. పర్మిట్ రూమ్‌కు ప్రభుత్వ నిర్దేశించిన ఫీజు సుమారు రూ.4 లక్షల వరకు ఉండేది. అయితే ప్రస్తుత మద్యం పాలసీలో పర్మిట్ రూమ్‌లకు అనుమతి లేదు. అయినా మద్యం వ్యాపారులు అనధికార పర్మిట్ రూమ్‌లను నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి సైతం గండి పడుతోంది. వైన్‌షాపు యజమానులు దుకాణాల వద్ద గ్లాసులు, లూజ్ మినరల్ వాటర్ అమ్ముకొనేవారికి నెలకు సుమారు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు అద్దెకు ఇచ్చారు. అలాగే అనధికారికంగా వైన్స్‌లకు అనుబంధంగా రెస్టారెంట్లను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారా మందుబాబులకు బిర్యానీ, మాంసాహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు. ఇలా అన్ని వైన్స్ దుకాణాల యజమానులు తమ దుకాణాల వద్ద అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత భారీ మొత్తంలో అద్దె చెల్లించేందుకు ముందుకు వస్తున్నారంటే మద్యం దుకాణాల వద్ద ఏ మేరకు రద్దీ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. -
వేర్వేరు కేసుల్లో పది మంది దొంగల అరెస్టు
నరసరావుపేట: జిల్లాలో పలుస్టేషన్లలో నమోదైన వేర్వేరు చోరీ కేసుల్లో ఒక అంతర్ జిల్లా దొంగతోపాటు తొమ్మిది మంది చోరులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నేరస్తుల నుంచి స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తును ప్రదర్శించి దొంగతనాల వివరాలను వెల్లడించారు. ● పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాలతోపాటు చిలకలూరిపేట పరిధిలో దొంగతనాలకు పాల్పడుతూ ఐదు కేసుల్లో నిందితుడైన అంతరజిల్లా దొంగ నరసరావుపేట ఇస్లాంపేటకు చెందిన షేక్ సుభానిని అరెస్టుచేసి 170 గ్రాముల బంగారం, నాలుగు కేజీల వెండి, రూ.10వేలు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు. ● ఐనవోలు పరిధిలో చోరీలు చేస్తున్న ఐనవోలుకు చెందిన లింగా యలమంద, కొమ్మిరిశెట్టి రామాంజనేయులను అరెస్టుచేసి 8 మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ● ఈపూరు మండలం కొండ్రముట్ల సచివాలయం, ఆయుష్మాన్‌భవ భవనం, రైతు భరోసా కేంద్రం, కొచ్చర్ల హైస్కూలులో జరిగిన చోరీ కేసుల్లో రేమిడిచర్లకు చెందిన జరపాల వెంకటేశ్వర్లునాయక్, నరసరావుపేట పల్నాడు బస్టాండ్ ప్రాంతంలో ఉంటున్న శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం, ముప్పిడి వాసి భూక్య బాలాజీ నాయక్‌తోపాటు పూడివలస గణపతి అలియాస్ గణేష్‌ను అరెస్టుచేసి, వారి వద్ద నుంచి రూ.4 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ చెప్పారు. ● వెల్దుర్తి పరిధిలో దొంగతనాలు చేస్తున్న మాచర్లకు చెందిన మట్టపల్లి హరిబాబు అలియాస్ కమ్మ కాశి, చల్లా భవానిశంకర్ అలియాస్ శంకర్, షేక్ మస్తాన్ వలి అలియాస్ అత్తిలిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసుల దర్యాప్తును పర్యవేక్షించిన నరసరావుపేట డీఎస్పీ కె.నాగేశ్వరరావు, గురజాల డీఎస్పీలతోపాటు సమగ్ర దర్యాప్తు చేసిన చిలకలూరిపేట టౌన్ పోలీస్ సీఐ రమేష్, ఐనవోలు, ఈపూరు, వెల్దుర్తి ఎస్ఐలు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. వీరందరికీ రివార్డులు అందజేయనున్నట్లు చెప్పారు. రూ.40 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం వెల్లడించిన ఎస్పీ శ్రీనివాసరావు -
శాంతిభద్రతలు కాపాడటమే మా బాధ్యత
ఎస్పీ కంచర్ల శ్రీనివాసరావు మాచర్ల: జిల్లాలో శాంతిభద్రతలు కాపాడటానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడి వారి పై ప్రత్యేక దృష్టి సారించి ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి క్రిమినల్స్‌ను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కంచర్ల శ్రీనివాసరావు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం మాచర్ల పోలీసు స్టేషన్ ను సందర్శించిన ఆయన డివిజినల్ సర్కిల్ పోలీసు అధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక చర్యల తీసుకుంటూ పోలీసు శాఖ ముందుకెళ్తుందని వివరించారు. ఆయన వెంట డీఎస్పీ జగదీష్, అర్బన్ సీఐ ప్రభాకర్, వివిధ పోలీసు అధికారులున్నారు. అక్రమ రవాణా అడ్డుకోవాలి దాచేపల్లి: రాష్ట్ర సరిహద్దు చెక్పొస్ట్ల మీదుగా ఇసుక, మద్యం అక్రమ రవాణా అడ్డుకోవాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. దాచేపల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి ఆయన ఆకస్మీక తనిఖీలు చేపట్టారు. స్టేషన్ అధికారులు, సిబ్బందితో మాట్లాడా రు. పలువురు అర్జీదారుల నుంచి అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్ర సరిహద్దు చెక్పొస్ట్లను ఆయన పరిశీలించి స్థానిక పోలీస్ అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. చెక్పొస్ట్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్పమత్తంగా ఉండాలని, ఇతర రాష్ట్రాల నుంచి నిషేధిత గంజాయి, మద్యం, ఇసుక, రవాణా కాకుండా పటిష్టమైన తనిఖీలు చేప ట్టలని ఆయన ఆదేశించారు. దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సమస్యలపై స్టేషన్‌కి వచ్చే అర్జీదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఎస్పీ వెంట గురజాల డీఎస్పీ జగదీష్, సీఐ భాస్కర్, ఎస్ఐలు సౌదర్యరాజన్, పాపారావు ఉన్నారు. -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
విజయవాడస్పోర్ట్స్: గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఘరానా దొంగను సీసీఎస్, పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం, మాదాల గ్రామానికి చెందిన నిందితుడు తమ్మిశెట్టి వెంకటేష్ నుంచి మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వన్‌టౌన్‌లోని సీసీఎస్ పోలీస్ స్టేషన్ వద్ద సెంట్రల్ ఏసీపీ దామోదర్, సీసీఎస్ సీఐ రామ్‌కుమార్, పటమట సీఐ పవన్‌కిశోర్ శుక్రవారం వెల్లడించారు. సీసీఎస్ పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారంతో ఆటోనగర్ చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం వాహనాల తనిఖీలు నిర్వహించామని, తనిఖీలు జరుగుతున్న సమయంలో నిందితుడు అటుగా వస్తూ.. ఒక్కసారిగా బైక్ వెనక్కి తిప్పుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడని వారు తెలిపారు. దీంతో అనుమానం వచ్చి అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో నిందితుడు బైక్‌లను చోరీ చేస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. 24 ఏళ్ల వయసున్న నిందితుడు వెంకటేష్ గంజాయి, మద్యపానానికి అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుడిపై గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఐదు చోరీ కేసులున్నాయని, నిందితుడి నుంచి మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. మూడు బైక్‌లు స్వాధీనం -
ఖోఖోలో కారెంపూడి విద్యార్థుల సత్తా
కారెంపూడి: రాష్ట్రంలో ఏ మండలం నుంచి ఎంపిక కాని విధంగా కారెంపూడి మండలం నుంచి పది మంది రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. నేటి నుంచి పల్నాటి రణస్థలి కారెంపూడిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో సొంత గడ్డపై వారంతా ఆడనున్నారు. మండలంలోని ఒప్పిచర్ల జెడ్పీ హైస్కూల్ నుంచి బొమ్మనబోయిన లక్ష్మీప్రసన్న, షేక్ మహిమున్నీసా, మిద్దెపోగు రవికిరణ్, వీరదాసు మనోహర్‌లు కారెంపూడి బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్ నుంచి ఎస్ వరప్రసాద్, వి.సాయి నాయక్, బి.జాన్ జీవన్, ఎం.కేశవ, డి.అఖిల్, వై అక్షితలు అండర్ 14 ఉమ్మడి గుంటూరు జిల్లా బాల బాలికల జట్లలో ఆడను న్నారు. దాదాపు ఒక్కో మండలం నుంచి ఒక్కరు కూడా లేని పరిస్ధితి చాలా చోట్ల ఉండగా కారెంపూడి విద్యార్థులు మాత్రం ఖోఖోలో తమ సత్తాచాటి ఉమ్మడి జిల్లా జిట్లలో స్థానం సంపాదించా రు. నేడు శనివారం నుంచి బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్లో అట్టహాసంగా స్కూల్ గేమ్స్ ఫెఢరేషన్ ఆఫ్ ఇండియా అండర్ 14 బాల, బాలికల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. -
జూడో పోటీలకు కార్నెల్బాబు ఎంపిక
నరసరావుపేట రూరల్: సౌత్ అండ్ వెస్ట్ జోన్ జూడో పోటీలకు ఎన్ఈసీ విద్యార్థి సి.హెచ్.కార్నెల్బాబు ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. విజయవాడలోని శ్రీ పొట్టిశ్రీరాములు సీఎంరావు ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన జేఎన్టీయూకె అంతర్ కళాశాలల జూడో ఎంపిక పోటీలలో కార్నెల్బాబు ప్రతిభ కనబర్చినట్టు వివరించారు. ఈనెల 27వ తేదీ 30వ తేదీ వరకు భోపాల్‌లోని ఎన్ఎన్సీటీ యూనివర్సిటీలో నిర్వహించనున్న సౌత్అండ్ వెస్ట్‌జోన్ పోటీలలో కార్నెల్బాబు జేఎన్టీయూకెకు ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. వర్సిటీ జట్టుకు ఎంపికై న కార్నెల్బాబును కళాశాల చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, వ్యాయామ అధ్యాపకులు ఎల్. కృష్ణారెడ్డి, ఎన్.ఆంజనేయులు, పి.విజయకుమార్‌లు అభినందనలు తెలిపారు. హిందీ భాషకు ప్రోత్సాహం అవసరం లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో హిందీని ప్రోత్సహించటానికి కృషి చేయాలని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం.రామకృష్ణ అన్నారు. పట్టాభిపురంలోని డీఆర్ఎం కార్యాలయంలో శుక్రవారం ఏడీఆర్ఎం సైమన్ అధ్యక్షతన అధికార భాషా అమలు కమిటీ సమావేశం జరిగింది. ముందుగా ప్రముఖ హిందీ కవి హరివంశ్ రాయ్ బచ్చన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. డీఆర్ఎం మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని అన్ని కార్యాలయాల్లో అధికార భాషకు సంబంధించిన ప్రగతి నివేదికను సమీక్షించారు. -
శాశ్వత పోస్టులు మంజూరు చేయండి
మంత్రికి ఏఐటీయూసీ నాయకుల వినతి నరసరావుపేట: నాగార్జున సాగర్ ప్రాజెక్టు, కాలువలకు శాశ్వత పోస్టులు మంజూరు చేయాలని పీడబ్ల్యూడీ వర్క్‌షాపు అండ్ కెనాల్స్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయుసీ) నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు కార్యాలయంలో మంత్రి ప్రతినిధి శ్రీనివాసరావుకు అధ్యక్షులు టి.శేషయ్య, ప్రధాన కార్యదర్శి ఉప్పలపాటి రంగయ్య వినతిపత్రం సమర్పించారు. సాగర్ ప్రాజెక్టు క్రింద కుడి కాలువల పొడవు 202 కి.మీ, బ్రాంచి, మేజర్, మైనర్లు మొత్తం షుమారుగా 8064 చ.కి.మీ. విస్తీర్ణం పొడవున పల్నాడు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం జిల్లాలలో విస్తరించి ఉన్నాయన్నారు. స్థిరీకరణ ఆయకట్టు 11,74,874 లక్షల ఎకరాలు ఉండగా, అనుమతి లేని, ప్రభుత్వ లెక్కలలో లేని భూమి ఒక లక్ష ఎకరాలు పైబడి మాగాణి, మెట్ట పంటలకు సాగునీరు, కొన్ని వందల చెరువులకు త్రాగునీరు, కొన్ని వేల పశువుల కుంటలకు తాగునీరు అందిస్తూ ఏటా 25 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతుందన్నారు. కాలువల డిజైన్ సమయంలో మెట్ట భూము లుగా స్థిరీకరణ చేసిన 6.81 లక్షల ఎకరాల ఆయకట్టులో సుమారు 3.5 లక్షల ఎకరాలు మాగాణి భూములుగా మారిపోయాయని పేర్కొన్నారు. ప్రతిఏడాది 292.5 మిలియన్ల యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు శాశ్వత ప్రయోజనాల నిమిత్తం అనేక క్షేత్రస్థాయి నిర్వహణ సిబ్బంది. ఉద్యోగులు, శాశ్వత ప్రాతిపదికన అవసరమైందన్నారు. కాని తగిన క్షేత్రస్థాయి సిబ్బంది లేనందున రైతులకు సాగునీరు అందించే సమయంలో వివిధ విభాగాల ఉద్యోగులను ఉపయోగించు కొనే పరిస్థితి నెలకొందన్నారు. 2018 నుంచి పెండింగ్‌లో వున్న అన్నిరకాల బకాయిలను చెల్లింపు చేయాలని, లస్కర్లు, వర్క్ ఇనస్పెక్టర్లు, ఇతర సిబ్బందికి ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని కోరారు. వీటితో పాటు ఇంకా అనేక డిమాండ్లను వారు కోరారు. -
శాంతిభద్రతల పరిరక్షణలో ‘కూటమి’ విఫలం
● నాయకులకు పదవీ వ్యామోహం తప్ప ప్రజల ఆలన లేదు ● అరగంటకు ఒక నేరం ● యర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ● నరసరావుపేటలో క్షతగాత్రుడి పరామర్శ నరసరావుపేట: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. పొలం తగాదాల విషయంలో ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడి పట్టణంలోని ఓ ప్రైవే టు వైద్యశాలలో చికిత్స పొందుతున్న తన నియోజకవర్గంలోని శివపురానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు ఈశ్వర రెడ్డిని శుక్రవారం సాయంత్రం పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యం మూలంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒక మూల హత్యలు, దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. నేరస్తులను శిక్షిస్తారనే భయం లేకపోవటం వలనే దాడులకు పాల్పడుతున్నారని, ఒక చిన్న పొలం తగాదా విషయంలో గొడ్డలి, కత్తులతో నరకటంతో చావు బ్రతుకుల మధ్య వెంటిలేటర్‌పై ఉన్నాడంటే రాష్ట్రంలో ఏరకమైన పరిపాలన సాగుతుందో అర్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు, ఆడబిడ్డలకు రక్షణ లేదని, నేరం చేయడానికి ఎవరూ భయపడట్లేదన్నారు. వందల కేసులు రోజూ నమోదవుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో అరగంటకు ఒక అత్యాచారం చొప్పున జరుగుతున్నాయన్నారు. ఐదు నెలల్లో 7393 మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగాయని అసెంబ్లీ సాక్షిగా వారే చెప్పారన్నారు. ఐదేళ్లలో 35 వేలకు పైగా సంఘటనలు జరగనిచ్చి ఒక రికార్డు బుక్ చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల రక్షణ గొలికి వదిలేసిన పరిస్థితి స్పష్టంగా కన్పిస్తుందన్నారు. తన నియోజకవర్గంలో ఈ క్షతగాత్రుడికి త్రిపురాంతకంలో 14ఎకరాల పొలం ఉందన్నారు. వీటిపై కోర్టులో దావాలు, గొడవలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈశ్వరరెడ్డి ప్రత్యర్ధులను పోలీసులు ముందుగానే కట్టడి చేసి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదన్నారు. డెప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని మహిళలకు తాము రక్షణ కల్పించలేమని, వారి కుటుంబ సభ్యులే రక్షణ చేసుకోవాలని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. దీని అర్ధం మేం ఏమిచేయలేమని చెప్పకనే చెప్పినట్లుగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలుచేయలేక తమకు ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని ఎగ్గొట్టారన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఆ పదవి ఇవ్వకపోవటం ఇదే మొదటిసారి అన్నారు. వారు చేసే తప్పులను బయటకు తీస్తారనే ఉద్దేశ్యంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీఏసీ సభ్యులైన తమకు ఆ పదవి రాకుండా చేశారన్నారు. 1981లో బీజేపీకి పార్లమెంటులో రెండే రెండు సీట్లు ఉంటే పీఏసీ పదవి ఇచ్చారన్నారు. ప్రజాపద్దుల విషయంలో ప్రతిపక్షం ప్రజలవైపు నిలబడుతుందన్నారు. పదవీ వ్యామోహం వలనే ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు మరో పదేళ్లు ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారన్నారు. వీరికి పదవీ వ్యామోహం తప్పితే ప్రజల కోసం పోరాటం చేసే ఆలోచన ఏకోశానా లేదన్నారు. ఇప్పటికై నా ప్రజలకు కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. -
నేడు న్యాయాధికారి సమీక్షా సమావేశం
నరసరావుపేటటౌన్: మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం పోలీస్, ఎల్ఐసీ, బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 14న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకొని సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పోలీసు కస్టడీలోకి ఇంటూరు రవికుమార్ మాచర్ల: మాచర్ల ప్రాంతానికి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరు రవికుమార్ టీడీపీ, జనసేన నేతలపై పెట్టిన పోస్టింగ్‌లకు సంబంధించి విశాఖ పట్టణంలో కస్టడీలో ఉన్న అతనిని రెండు రోజుల పాటు విచారణ నిమిత్తం మాచర్ల పోలీ సులు అనుమతి కోరగా కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాకు చెందిన ఇంటూరు రవిని మాచర్ల పోలీసులు తీసుకొచ్చి విచారించిన అనంతరం తిరిగి కస్టడీకి పంపారు. ఇందుకు సంబంధించి అర్బన్ సీఐ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని విచారించి పంపటం జరిగిందని చెప్పారు. -
నాటుసారా, బెల్టుషాపులపై ప్రత్యేక దృష్టి
● వేర్వేరు ప్రాంతాల్లో 3 వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం ● జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషర్ ఎం.రవికుమార్ రెడ్డి మాచర్ల: రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారా, గంజాయి విక్రయాలు నియంత్రించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషర్ ఎం.రవికుమార్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం పట్టణంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఉమ్మడి జిల్లాల ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రత్యేక దాడుల అధికారులు కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలో మాచర్ల నియోజక వర్గంపై ప్రత్యేక దృష్టి సారించి వెల్దుర్తి, దుర్గి మండలాల్లోని వివిధ తండాల్లో దాడులు నిర్వహించి 3 వేల లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు. దుర్గి మండలంలోని ఓబులేశునిపల్లె గ్రామంలో రెండు లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని ఓ వ్యక్తిని అరెస్టు చేశామన్నారు. నియోజకవర్గంలో 17 మద్యం బెల్టు షాపుల పై దాడులు చేసి 55 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకొని 17 మంది నిర్వాహకుల పై కేసులు నమోదు చేశామన్నారు. రాబోయే రోజుల్లో నాటుసారా, బెల్టుషాపుల నిర్వాహణ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి అమ్మకందారులపై ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఐదు బృందాల ద్వారా తాము దాడులు చేసి తెలంగాణా ప్రాంతం నుంచి అధికంగా మద్యం ఈ ప్రాంతానికి సరఫరా అవుతున్నట్లు ఆయన చెప్పారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మణికంఠ, గద్దె సూర్యనారాయణ, రేఖ, శ్రీనివాసమూర్తి, స్థానిక ఎకై ్సజ్ సీఐ వెంకటరమణలున్నారు. -
ఆధునిక చికిత్సలపై అవగాహన అవసరం
గుంటూరు మెడికల్: వైద్యరంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆధునిక పద్ధతుల్లో వ్యాధి నిర్ధారణ, చికిత్సలను వైద్యులు తెలుసుకోవాలని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి అన్నారు. శుక్రవారం గుంటూరు వైద్య కళాశాలలోని జింఖానా ఆడిటోరియంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) 66వ వార్షిక సదస్సు ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్ర సదస్సును గుంటూరు ఐఎంఏ శాఖ నిర్వహించటం అభినందనీయం అన్నారు. వైద్యరంగంలో పరిశోధనకు అవకాశాలు బాగా పెరిగాయని చెప్పారు. యువ వైద్యులు ఇందులో భాగస్వాములు కావాలన్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ మాట్లాడుతూ.. వైద్యులు సీఎంఈ కార్యక్రమాలకు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. ప్రారంభ దశలోనే వ్యాధులను గుర్తించి చికిత్స చేయడం ద్వారా రోగుల రద్దీని నిరోధించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పర్యవేక్షకులు డాక్టర్ ఎం. ఫర్నికుమార్ మాట్లాడుతూ వైద్యులకు సంవత్సరంలో ఆరు చొప్పున ఐదు సంవత్సరాలకు 30 క్రెడిట్ అవర్స్ లేనిదే రిజిస్ట్రేషన్ రెన్యువల్ జరగదని చెప్పారు. వైద్యులందరూ కార్యక్రమాలకు తప్పక హాజరు కావాలని కోరారు. ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పి.ఫణిదర్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ జి.నందకిషోర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ టి.సేవకుమార్, గుంటూరు ఐఎంఏ బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు, కార్యదర్శి డాక్టర్ బాలినేని సాయికృష్ణ, సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ సీహెచ్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆ.. మంత్రులపై చర్యలు తీసుకోండి
ఎంఐఎం నాయకుడు షేక్ మౌలాలీ డిమాండ్ నరసరావుపేట: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకి ముస్లింలపె ప్రేమ ఉంటే హజ్‌యాత్రపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు మంత్రులను సస్పెండ్ చేయాలని ఎంఐఎం పట్టణ అధ్యక్షులు షేక్ మౌలాలీ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురువారం శాసనమండలిలో మంత్రి సత్యకుమార్ యాదవ్ వివాదాస్పద మాటలు మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు. ముస్లిం సోదరులు పవిత్రంగా భావించే హజ్యాత్రని చులకనగా మాట్లాడిందే కాకా సామెత అంటూ మంత్రి సత్యకుమార్ సమర్దించుకుంటే, ఇంకో మంత్రి అచ్చేనాయుడు మంత్రి సత్యకుమార్ అన్నది వివరిస్తూ మరో వివాదాస్పద వాఖ్య చేయటం చూస్తుంటే మన రాష్ట్రాన్ని కూడా ఉత్తరప్రదేశ్ చేయాలని చూస్తున్నట్టుగా ఉందన్నారు. ఇప్పటికి వరకు ఇలా మైనార్టీ వర్గాన్ని కించపరుస్తూ ఏ పార్టీ వారు మాట్లాడలేదని, హజ్ యాత్రపై అనుచితవ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేయాలని, వారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడకపొతే ప్రజాస్వామ్యాయుతంగా తగిన గుణపాఠం చెబుతామని మౌలాలి హెచ్చరించారు. మిర్చి యార్డు ప్రగతికి కృషి ముఖ్యం కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డును అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు సూచించారు. యార్డు ఆవరణలోని సమావేశ మందిరంలో యూనియన్ల నాయకులు, అధికారులు, సిబ్బందితో శుక్రవారం సాయంత్రం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొంతకాలంగా యార్డుపై వస్తున్న ఆరోపణల వల్ల యార్డుకు, తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చిందని పేర్కొన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్, యార్డు పర్సన్ ఇన్చార్జి భార్గవ్ తేజ ఆదేశాలతో అన్ని సంఘాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మిర్చి సీజన్ నాటికి ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. అవినీతికి తావు లేకుండా మిర్చి రైతులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. యార్డులో తాగునీరు, విద్యుత్ వంటి సౌకర్యాలను పెంచనున్నట్టు తెలిపారు. గేట్ల వద్ద ఏళ్ల తరబడి ఉన్న సిబ్బందిని పూర్తిగా తొలగించడంతోపాటు, యార్డు ఆదాయ వనరుల పెంపునకు కృషి చేస్తున్నట్లు వివరించారు. రాత్రి, పగలు గస్తీ నిర్వహించి సరైన పత్రాలు లేని వాహనాలు సీజ్ చేయడంతోపాటు, అపరాధ రుసుం వసూలుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. యార్డులో అక్రమాలకు చోటు లేకుండా చేస్తామని, పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ నేతృత్వంలో మార్కెట్ యార్డు అభివవృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. సమావేశంలో మిర్చి దిగుమతి, ఎగుమతిదారుల అసోసియేషన్ల నాయకులు లేళ్ల పెద్ద అప్పిరెడ్డి, జుగిరాజ్ బండారి, కొత్తూరి సుధాకర్, యార్డు అధికారులు శ్రీకాంత్, సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు. 200 లీటర్ల బెల్లం ఊట, బట్టీ ధ్వంసం నిజాంపట్నం: నాటుసారా తయారు చేసే, అమ్మకాలు చేసే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంటుందని నగరం ఎకై ్సజ్ ిసీఐ మార్టూరి శ్రీరామ్‌ప్రసాద్ తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్, ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒంగోలు ఆదేశాల మేరకు నిజాంపట్నం మండలం దిండి పంచాయతీ పరిధిలోని జంపనివారిపాలెం పరిసర ప్రాంతాల్లో శుక్రవారం దాడులు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ జంపనివారిపాలెం ప్రాంతానికి దక్షణ దిశగా రెండు కిలోమీటర్ల దూరంలోని మడ అడవుల్లో దాడులు చేసినట్లు తెలిపారు. -
No Headline
కారెంపూడిః రాష్ట్ర స్థాయి ఖోఖో క్రీడలకు కారెంపూడి ముస్తాబవుతోంది. ఈనెల 23, 24, 25 తేదీలలో జరగనున్న పోటీలకు స్థానిక బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్ వేదిక కానుంది. ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ కారెంపూడిలో రాష్ట్ర స్థాయి క్రీడలు జరగనుండడం విశేషం. స్కూల్ గేమ్స్ ఫెఢరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్రస్థాయి అండర్ 14 బాల, బాలికల ఖోఖో పోటీలు జరగనున్నాయి. మొదట 1996లో ఏపీఎస్‌డబ్ల్యూఆర్ స్కూల్లో అండర్–18 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు జరిగాయి, ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే రాష్ట్ర స్థాయి పోటీలకు కారెంపూడి వేదికవుతోంది. రాష్ట్ర నలుమూలల నుంచి 400 మంది క్రీడాకారులు కారెంపూడి రానున్నారు. ఉమ్మడి 13 జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు పోటీలలో పాల్గొంటున్నాయి. వంద మంది వరకూ పీఈటీలు పోటీల నిర్వహణలో పాల్గొనబోతున్నారు. వారితోపాటు క్రీడా శిక్షకులు, క్రీడా సంస్థల అధికారుల రాకతో కారెంపూడి జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం సందడిగా మారనుంది. పోటీలు జరగనున్న బ్రహ్మనాయుడు హైస్కూల్ ప్రాంగణం కారెంపూడిలో మూడు దశాబ్దాల తర్వాత రాష్ట్రస్థాయి క్రీడలు రేపటి నుంచి మూడు రోజులపాటు అండర్–14 ఖోఖో పోటీలు ముస్తాబవుతున్న బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్ ప్రాంగణం -
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి
కలెక్టర్ అరుణ్‌కుమార్ వెల్లడి నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నూతన రేషన్ కార్డుల కోసం డిసెంబరు రెండో తేదీ నుంచి 28 లోపల దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్డులకు సంబందించి ఆధార్ సీడింగ్, స్పిట్లింగ్ ఆఫ్ రేషన్‌కార్డు, కార్డులో కుటుంబ సభ్యుల చేర్చడం వంటి పనులు చేస్తారని వివరించారు. జిల్లాలో ప్రస్తుతం 6,45,110 కార్డులు ఉండగా వీటన్నింటినీ మార్చి కొత్త కార్డులు సంక్రాంతి నాటికి అందజేస్తారని వెల్లడించారు. ఎన్ఎంఎంఎస్ మోడల్ పేపర్ ఆవిష్కరణ నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయిలో 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎన్ఎంఎంఎస్ పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. పల్నాడు బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఎన్ఎంఎంఎస్ మోడల్ గ్రాండ్ టెస్ట్ పేపర్‌ను గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డిసెంబర్ 8న జరగనున్న పరీక్షలో అధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణులై స్కాలర్షిప్లు పొందాలని ఆకాంక్షించారు. మోడల్ పేపర్ తయారుచేసిన ఉపాధ్యాయులు ఎం.శివశంకర్, ఎస్.రమేష్‌లను అభినందించారు. జిల్లా బాలికల విద్యాభివృద్ధి అధికారిణి దొండేటి రేవతి, బాలోత్సవ్ కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాలువలో ఇద్దరు చిన్నారులు గల్లంతు వినుకొండ: సాగర్ ప్రధాన కాలువలో పడి ఇద్దరు చిన్నారులు గల్లంతైన ఘటన గురువారం ఈపూరు మండలం ముప్పాళ్ల వద్ద జరిగింది. వనికుంట గ్రామానికి చెందిన విలేకరి వెంకట నాగాంజనేయ శర్మ, తన ఇద్దరు కూతుర్లు యామిని(11), కావ్య(7) ఉదయం 8.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంతో సహా ఎన్ఎస్పీ కాలువలో పడ్డారు. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో చిన్నారులు యామిని, కావ్య నీటమునిగినట్టు తెలుస్తోంది. నీటిలో కొట్టుమిట్టాడుతున్న శర్మ స్థానికుల సహాయంతో బయటపడ్డాడు. విషయం తెలిసిన ఈపూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. చిన్నారులు మునిగిన చోట లోతు అధికంగా ఉండటంతో స్థానిక ఈతగాళ్లు పిల్లల ఆచూకీ తెలుసుకోలేకపోయారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. 23న జెడ్పీ సర్వసభ్య సమావేశం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 23న నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం ఉంటుంది. ఈ మేరకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షత వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. వ్యవసాయ అనుబంధ శాఖలతోపాటు గృహ నిర్మాణం, విద్య, వైద్యారోగ్య, జలవనరులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఉపాధి హామీపై అజెండాలో పొందుపర్చిన అంశాలపై సమీక్ష ఉంటుందని సీఈవో పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే సహించేది లేదు జిల్లా మైనింగ్ అధికారి రాజేష్ బాపట్లటౌన్: జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే సహించేది లేదని జిల్లా మైనింగ్ అధికారి రాజేష్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మండలంలోని వెదుళ్లపల్లి సమీపంలో ఉన్న ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణా చేసినా, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపినా సహించేది లేదన్నారు. -
ఎస్సీ బాలికల వసతి గృహంలో సమస్యల వలయం
297 మందికి ఒకటే మరుగుదొడ్డి ఈ ఎస్సీ బాలికల వసతి గృహాన్ని 2014లో రూ.2.50 కోట్లతో నిర్మించారు. ఈ హాస్టల్లో ఇంటర్మీడియెట్, నర్సింగ్ (జీఎన్ఎమ్, ఏఎన్ఎం), డిగ్రీ విద్యార్థినులు 297 మంది ఉంటున్నారు. కూటమి సర్కారు అధికారం చేపట్టాక ఈ హాస్టల్ నిర్వహణ అధ్వానంగా మారింది. వసతి గృహాలకు బడ్జెట్ కేటాయించకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్న వాదన వ్యక్తమవుతోంది. బ్లీచింగ్, ఇతర వస్తువుల కొనుగోలుకూ వార్డెన్ సొంత డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ హాస్టల్లో కిటికీలకు తలుపులు లేవు. చలికి తోడు దోమల బెడద. దోమ తెరలు లేవు. మరుగు దొడ్లకు తలుపులు లేవు. ఒక మరుగుదొడ్డి పనిచేయడం లేదు. స్తంభించింది. 297 మందికి ఒకటే మరుగుదొడ్డి. అదీ దుర్గంధం వెదజల్లుతోంది. తాగునీటి వసతి లేదు. అన్ని అవసరాలకు మోటార్ నీరే గతి. -
టీడీపీ పెద్దల కుట్ర మేరకే నాపై కేసు
నరసరావుపేట: తెలుగుదేశం పార్టీ పెద్దల కుట్ర, ఆ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆదేశాల మేరకే తనపై అక్రమ కేసు పెట్టారని, దీనికి భయపడేది లేదని, చట్టపరంగా పోరాడతామని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గురువారం గుంటూరు రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అవాస్తవ ఆరోపణలతో ఒక మతి స్థిమితంలేని బ్లాక్‌మెయిలర్ చేస్తున్న ఆరోపణల మేరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన తనపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అక్రమ కేసు బనాయించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఫిర్యాది, పమిడిపాడు గ్రామానికి చెందిన చెందిన కొల్లా సాంబశివరావు ఎవరో తనకు తెలియదని, అతని ముఖం కూడా ఇప్పటివరకు చూడలేదని స్పష్టం చేశారు. అతను ఎవరా అని ఆరా తీస్తే, గుంటూరుకు చెందిన కామరాజు అనిల్‌కుమార్ వద్ద 6.10 ఎకరాల భూమి కొనేందుకు సాంబశివరావు గతంలో అడ్వాన్స్ చెల్లించి 2021 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయా డని, కొందరు రాజకీయ నాయకులను పట్టుకొని అప్పుడు ఉన్న డీఎస్పీ వద్ద పంచాయితీ చేసుకున్నాడని తెలిసిందని పేర్కొన్నారు. ఆ భూమి రిజిస్ట్రేషన్ సమయంలో సాంబశివరావు వద్ద డబ్బులు లేకపోతే నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన రవికిషోర్‌రెడ్డి ఆ డబ్బు ఇచ్చి తన బంధువైన తాటిపర్తి కోటిరెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడని, అప్పుడే అనిల్‌కుమార్‌కు, తనకు ఎలాంటి వివాదాలూ లేవని సాంబశివరావు ఒప్పందపత్రం రాసిచ్చాడని వివరించారు. ఇప్పుడు ఆ భూమిపై ఎలాంటి హక్కు లేని సాంబశివరావు బ్లాక్మెయిల్ చేస్తూ తనపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బిహార్ నుంచి తుపాకీ తెప్పించి తమను కాల్చేస్తానని సాంబశివరావు బెదిరిస్తున్నాడని, చూస్తుంటే అతనికి మతిస్థిమితం లేనట్టు ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండా, ఏం జరిగిందో తెలుసుకోకుండా కేసు పెట్టడం సరికాదని గోపిరెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ పెద్దల ఒత్తిడి మేరకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారన్న సాకుతో పోలీసు ఉన్నతాధికారులపైనా అక్రమ కేసులు పెడుతున్నారని, ఈ పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని గోపిరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో అక్రమ కేసులు పెట్టిన వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. కేసులకు భయపడేది లేదని, చట్టపరంగా పోరాడతామని తేల్చిచెప్పారు. సాంబశివరావు, అనిల్‌కుమార్ రాసుకున్న ఒప్పంద పత్రం, ఆ భూమి రిజిస్ట్రేషన్ పత్రాలను గోపిరెడ్డి విలేకరులకు చూపించారు. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా కేసు నమోదు చేయటం దుర్మార్గం ఫిర్యాదిదారుడు మతిస్థిమితం లేని ఒక బ్లాక్ మెయిలర్ బిహార్ నుంచి తుపాకీ తెచ్చి కాల్చేస్తానని ఫిర్యాది అంటున్నాడు విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి -
టీడీపీ పెద్దల కుట్ర మేరకే నాపై కేసు
నరసరావుపేట: తెలుగుదేశం పార్టీ పెద్దల కుట్ర, ఆ పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఆదేశాల మేరకే తనపై అక్రమ కేసు పెట్టారని, దీనికి భయపడేది లేదని, చట్టపరంగా పోరాడతామని నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గురువారం గుంటూరు రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా అవాస్తవ ఆరోపణలతో ఒక మతి స్థిమితంలేని బ్లాక్‌మెయిలర్ చేస్తున్న ఆరోపణల మేరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన తనపై రూరల్ పోలీస్‌స్టేషన్‌లో అక్రమ కేసు బనాయించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఫిర్యాది, పమిడిపాడు గ్రామానికి చెందిన చెందిన కొల్లా సాంబశివరావు ఎవరో తనకు తెలియదని, అతని ముఖం కూడా ఇప్పటివరకు చూడలేదని స్పష్టం చేశారు. అతను ఎవరా అని ఆరా తీస్తే, గుంటూరుకు చెందిన కామరాజు అనిల్‌కుమార్ వద్ద 6.10 ఎకరాల భూమి కొనేందుకు సాంబశివరావు గతంలో అడ్వాన్స్ చెల్లించి 2021 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయా డని, కొందరు రాజకీయ నాయకులను పట్టుకొని అప్పుడు ఉన్న డీఎస్పీ వద్ద పంచాయితీ చేసుకున్నాడని తెలిసిందని పేర్కొన్నారు. ఆ భూమి రిజిస్ట్రేషన్ సమయంలో సాంబశివరావు వద్ద డబ్బులు లేకపోతే నకరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన రవికిషోర్‌రెడ్డి ఆ డబ్బు ఇచ్చి తన బంధువైన తాటిపర్తి కోటిరెడ్డి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడని, అప్పుడే అనిల్‌కుమార్‌కు, తనకు ఎలాంటి వివాదాలూ లేవని సాంబశివరావు ఒప్పందపత్రం రాసిచ్చాడని వివరించారు. ఇప్పుడు ఆ భూమిపై ఎలాంటి హక్కు లేని సాంబశివరావు బ్లాక్మెయిల్ చేస్తూ తనపై కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బిహార్ నుంచి తుపాకీ తెప్పించి తమను కాల్చేస్తానని సాంబశివరావు బెదిరిస్తున్నాడని, చూస్తుంటే అతనికి మతిస్థిమితం లేనట్టు ఉందని పేర్కొన్నారు. పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండా, ఏం జరిగిందో తెలుసుకోకుండా కేసు పెట్టడం సరికాదని గోపిరెడ్డి అభిప్రాయపడ్డారు. టీడీపీ పెద్దల ఒత్తిడి మేరకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మద్దతు పలికారన్న సాకుతో పోలీసు ఉన్నతాధికారులపైనా అక్రమ కేసులు పెడుతున్నారని, ఈ పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదని గోపిరెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో అక్రమ కేసులు పెట్టిన వారు భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. కేసులకు భయపడేది లేదని, చట్టపరంగా పోరాడతామని తేల్చిచెప్పారు. సాంబశివరావు, అనిల్‌కుమార్ రాసుకున్న ఒప్పంద పత్రం, ఆ భూమి రిజిస్ట్రేషన్ పత్రాలను గోపిరెడ్డి విలేకరులకు చూపించారు. ఎటువంటి సాక్ష్యాలు లేకుండా కేసు నమోదు చేయటం దుర్మార్గం ఫిర్యాదిదారుడు మతిస్థిమితం లేని ఒక బ్లాక్ మెయిలర్ బిహార్ నుంచి తుపాకీ తెచ్చి కాల్చేస్తానని ఫిర్యాది అంటున్నాడు విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి -
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి
కలెక్టర్ అరుణ్‌కుమార్ వెల్లడి నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నూతన రేషన్ కార్డుల కోసం డిసెంబరు రెండో తేదీ నుంచి 28 లోపల దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్డులకు సంబందించి ఆధార్ సీడింగ్, స్పిట్లింగ్ ఆఫ్ రేషన్‌కార్డు, కార్డులో కుటుంబ సభ్యుల చేర్చడం వంటి పనులు చేస్తారని వివరించారు. జిల్లాలో ప్రస్తుతం 6,45,110 కార్డులు ఉండగా వీటన్నింటినీ మార్చి కొత్త కార్డులు సంక్రాంతి నాటికి అందజేస్తారని వెల్లడించారు. ఎన్ఎంఎంఎస్ మోడల్ పేపర్ ఆవిష్కరణ నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయిలో 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎన్ఎంఎంఎస్ పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. పల్నాడు బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఎన్ఎంఎంఎస్ మోడల్ గ్రాండ్ టెస్ట్ పేపర్‌ను గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డిసెంబర్ 8న జరగనున్న పరీక్షలో అధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణులై స్కాలర్షిప్లు పొందాలని ఆకాంక్షించారు. మోడల్ పేపర్ తయారుచేసిన ఉపాధ్యాయులు ఎం.శివశంకర్, ఎస్.రమేష్‌లను అభినందించారు. జిల్లా బాలికల విద్యాభివృద్ధి అధికారిణి దొండేటి రేవతి, బాలోత్సవ్ కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాలువలో ఇద్దరు చిన్నారులు గల్లంతు వినుకొండ: సాగర్ ప్రధాన కాలువలో పడి ఇద్దరు చిన్నారులు గల్లంతైన ఘటన గురువారం ఈపూరు మండలం ముప్పాళ్ల వద్ద జరిగింది. వనికుంట గ్రామానికి చెందిన విలేకరి వెంకట నాగాంజనేయ శర్మ, తన ఇద్దరు కూతుర్లు యామిని(11), కావ్య(7) ఉదయం 8.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంతో సహా ఎన్ఎస్పీ కాలువలో పడ్డారు. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో చిన్నారులు యామిని, కావ్య నీటమునిగినట్టు తెలుస్తోంది. నీటిలో కొట్టుమిట్టాడుతున్న శర్మ స్థానికుల సహాయంతో బయటపడ్డాడు. విషయం తెలిసిన ఈపూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. చిన్నారులు మునిగిన చోట లోతు అధికంగా ఉండటంతో స్థానిక ఈతగాళ్లు పిల్లల ఆచూకీ తెలుసుకోలేకపోయారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టు స్థానిక ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. 23న జెడ్పీ సర్వసభ్య సమావేశం గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 23న నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం ఉంటుంది. ఈ మేరకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షత వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. వ్యవసాయ అనుబంధ శాఖలతోపాటు గృహ నిర్మాణం, విద్య, వైద్యారోగ్య, జలవనరులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఉపాధి హామీపై అజెండాలో పొందుపర్చిన అంశాలపై సమీక్ష ఉంటుందని సీఈవో పేర్కొన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే సహించేది లేదు జిల్లా మైనింగ్ అధికారి రాజేష్ బాపట్లటౌన్: జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే సహించేది లేదని జిల్లా మైనింగ్ అధికారి రాజేష్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మండలంలోని వెదుళ్లపల్లి సమీపంలో ఉన్న ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణా చేసినా, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపినా సహించేది లేదన్నారు. -
వలంటీర్లను నమ్మించి నట్టేట ముంచిన ఎన్డీఏ కూటమి
నరసరావుపేట: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ దేశానికే ఆదర్శమని, అలాంటి వలంటీర్లను ఎన్డీఏ సర్కారు నమ్మించి నట్టేట ముంచడం అమానవీయమని, కుట్రపూరితమని సోషల్ యాక్టివిస్టు, రచయిత ఈదర గోపీచంద్ విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వలంటీర్ల వ్యవస్థ ఆగస్టు 23 నాటికే ఉనికిలో లేదని అసెంబ్లీ సాక్షిగా మంత్రి జంకు లేకుండా అబద్ధాలు వల్లెవేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మరి మొన్నటి బడ్జెట్ ప్రకారం ఏప్రిల్, మే నెలల జీతాలు ఎలా ఇచ్చారని, బుడమేరు వరద బాధితుల సేవలకు చివరి నిమిషంలో వలంటీర్లను వాడుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు వలంటీర్ల జీతం రూ.పదివేలకు పెంచి వారిని కొనసాగిస్తానని చంద్రబాబు ప్రకటించి ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. రెండున్నర లక్షల మందికిపైగా వలంటీర్లకు అన్యాయం చేయడం తగదని పేర్కొన్నారు. వలంటీర్లు ఈ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగించాలని ఈదర గోపీచంద్ పేర్కొన్నారు. సోషల్ యాక్టివిస్టు, రచయిత ఈదర గోపీచంద్