Peddapalli District News
-
పకడ్బందీగా రక్షణ చర్యలు
గోదావరిఖని: పని ప్రదేశాల్లో రాజీలేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, సంస్థ ఆస్తులు కాపాడాలని కార్పొరేట్ సెక్యూరిటీ జీఎం సీహెచ్ లక్ష్మీనారాయణ సూచించారు. ఆర్జీ–1, 2 ఏరియాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. పలు ప్రాంతాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులు, ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. జీడీకే–5 ఓసీపీ స్క్రాప్యార్డ్ పరిశీలించారు. పర్సనల్ మేనేజర్లు కిరణ్‌బాబు, రవీందర్‌రెడ్డి, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయప్రసాద్, సీనియర్ పీవో శ్రావణ్‌కుమార్, ఎ స్ అండ్ పీసీ సీనియర్ సెక్యురిటీ అధికారి వీరారెడ్డి, ఐటీ అధికారి రాజేశ్, జూనియర్ ఇన్స్పెక్టర్లు ఉమేశ్, అక్బర్అలీ, జమేదార్ సంక రాజేశ్ పాల్గొన్నారు. కార్పొరేట్ సెక్యూరిటీ జీఎం లక్ష్మీనారాయణ ఆర్జీ–1, 2 ఏరియాల్లో పర్యటన -
గన్నీ సంచుల కొరత ఉండొద్దు
రామగిరి: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గన్నీ సంచులకు కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. ముత్తారం మండలం మచ్చుపేట, మైదంబండ, కేశనపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రా లను శుక్రవారం ఆయన సందర్శించి నిర్వాహ కులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ షఫీ, గిర్దావర్లు రాజబాబు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. గురుకుల విద్యాలయం తనిఖీ ధర్మారం(ధర్మపురి): నందిమేడారం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాన్ని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంటల తయారీని పరిశీలించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో ఇంటింటా సర్వే డాటా నమోదును తనిఖీ చేశారు. ఎంపీడీవో ప్రేమ్‌కుమార్, తహసీల్దార్ అరిఫొద్దీన్, ఎంపీవో శ్రీనివాస్, ప్రిన్సిపాల్ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ప్రత్యూష పాల్గొన్నారు. నేటి నుంచి అయ్యప్పస్వామి ఆలయ వార్షికోత్సవాలు యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): స్థానిక అయ్యప్పస్వామి ఆలయం వార్షికోత్సవానికి ముస్తాబైంది. ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు ప్రధాన గురుస్వామి అద్దెంకి సారంగాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. వేడుకలకు హాజరయ్యే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభమయ్యే ఉత్సవాలు.. 25వ తేదీతో ముగుస్తాయన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడికి సన్మానం జ్యోతినగర్(రామగుండం): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడు బొంకూరి మధు ఆధ్వర్యంలో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డెపల్లి రాంచందర్‌ను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఎన్టీపీసీ జ్యోతిభవన్‌లో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈనెల 26 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు నియోజకవర్గంలో చేపట్టే భారత రాజ్యాంగ ఆమోద సభలకు రాంచందర్‌ను ఆహ్వానించామని మధు తెలిపారు. నాయకులు కొంకటి లక్ష్మణ్, కాంపల్లి సతీశ్, శనిగరపు రామస్వామి, రాజేశ్, కొంకటి సిద్ధార్థ పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’ మంథని: స్థానిక ఆర్టీసీ డిపో పరిధిలో శనివారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనుస్తున్నట్లు మంథని డిపో మేనేజర్ శ్రావణ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. ప్రజా రవాణాలో ఇబ్బందులు, సూచనల కోసం శనివారం ఉదయం 11.00 గంటలకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రజలు, ప్రయాణికులు నిర్దేశిత సమయంలో 73828 25923 మొబైల్ నంబరుకు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. క్వింటాల్ పత్తి రూ.6,912 పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో శుక్రవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.6,912 ధర పలికింది. కనిష్టంగా రూ.5,555, సగటు ధర రూ.6,787గా నమోదైందని ప్రత్యేకశ్రేణి కార్యదర్శి దేవరాజ్ పృథ్వీరాజ్ తెలిపారు. మొత్తం 132 మంది రైతులు తీసుకొచ్చిన 597 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. -
పెద్దపల్లిలోనే కంటి ఆపరేషన్లు
పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోనే ఇకనుంచి కంటి ఆపరేషన్లు, ఇతర వైద్యసేవలు సంపూర్ణంగా పొందవచ్చని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. రూ.15 లక్షల వ్యయంతో స్థానిక ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కంటి ఆపరేషన్ థియేటర్‌ను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ ప్రాంత ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో నేత్రవైద్య నిపుణులు సబీహ, సింధూర తదితరులు పాల్గొన్నారు. సర్కార్ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేలు అందిస్తున్నామని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. కొత్త పేషెంట్ ఫైల్‌ను కలెక్టరేట్లో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. మాతాశిశు కేంద్రం, జిల్లా ఆస్పత్రిలో ఇన్పేషేంట్ల నివేదికలు, డిశ్చార్జి సమ్మరీ భద్రపర్చేందుకు ఫైళ్లను పకడ్బందీగా తయారు చేశా మని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీధర్, డాక్టర్లు వాసుదేవరెడ్డి, స్రవంతి, భార్గవి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం డబ్బులు సకాలంలో చెల్లించాలి మంథని/రామగిరి: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన ధాన్యం డ బ్బులను రైతులకు సకాలంలో చెల్లించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. మంథని మండలం ఎక్లాస్పూర్, రామగిరి మండలం కల్వచర్లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అధికారులు, నిర్వాహకులకు పలు సూచనలిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాంచందర్‌రావు, ఏవో శ్రీకాంత్, ఏపీఎం స్వరూపరాణి, ఏఈవో ఆరవింద్ తదితరులు పాల్గొన్నారు. వారంలో వీ హబ్ ప్రతినిధుల పర్యటన వీ హబ్ ప్రతినిధులు మరోవారం రోజుల్లో మరో సారి ఒక్కో మహిళా సంఘంతో నేరుగా మాట్లాడి వ్యాపారాభివృద్ధికి పాటించాల్సిన పద్ధతులపై స మగ్ర ప్రణాళి రూపొందిస్తారని కలెక్టర్ కోయ శ్రీహ ర్ష తెలిపారు. మంథనిలోని ఏఎల్ఆర్ కన్వెన్షన్హాల్లో జరిగిన మహిళా సంఘాలు, వీ హబ్ సీఈవో సీత, ప్రతినిధుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడా రు. వివిధ రంగాల్లో మహిళల ప్రావీణ్యం, వారి అవసరాలు తదితర అంశాలపై ఆరా తీశారు. తొలిరోజు నాలుగు శస్త్రచికిత్సలు కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి రామగిరి, మంథనిలో విస్తృత పర్యటన -
వెంటనే రోడ్లు నిర్మించాలి
పెద్దపల్లి – వివిధ గ్రామాలను కలుపుతూ రహదారులు నిర్మించేందుకు నిధులు మంజూరైనయి. అయినా, ఇప్పటివరకు రోడ్లు నిర్మించకపోవడం సరికాదు. అధికారులు వెంటనే స్పందించి రోడ్లు నిర్మించి వాహనదారుల ఇబ్బందులు తొలగించాలి. – తమ్మడవేని మల్లేశ్ యాదవ్, మాజీ ఎంపీటీసీ, కుమ్మరికుంట నష్టమే వస్తంది జూలపల్లి – పెద్దపల్లి మధ్య రోజూ టాటాఏస్ నడుపుత. ఇలా వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటున్న. అయితే, రోడ్డు శిథిలమైంది. వాహనాలు చెడిపోతున్నయి. తరచూ మరమ్మతుకు రావడంతో ఆదాయం కన్నా నష్టమే ఎక్కువ వస్తున్నది. – కొట్టే రాజయ్య, టాటాఏస్ యజమాని, వడ్కాపూర్ -
రేపటి వరకు ఏఎంఆర్ వారోత్సవాలు
పెద్దపల్లిరూరల్: ప్రపంచ యాంటీ మైక్రోబియల్ నిరోధికత(ఏఎంఆర్) వారోత్సవాలను ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు డీఎంహెచ్‌వో అన్నప్రసన్నకుమారి తెలిపారు. శుక్రవారం త న కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. యాంటీమైక్రోబియల్ నిరోధకతపై అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ఆర్ఎంపీ, పీఎంపీలకు అవగాహన కల్పించారు. ప్రోగ్రాం అధికారులు సుధాకర్‌రెడ్డి, శ్రీరాములు, అజీజ్, శ్రీనివాస్, రవీందర్, శంకర్ తదితరులు ఉన్నారు. వరి కొయ్యలను నేలలోనే కలియ దున్నాలి పెద్దపల్లిరూరల్: వరి కోతల అనంతరం అవశేషాలకు నిప్పు పెట్టొద్దని, వాటిని నేలలోనే కలియదున్నాలని జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి సూచించారు. నిప్పు పెట్టడం ద్వారా పర్యావరణానికి ము ప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. గతంలో గడ్డిని కుప్పలుగా దాచుకుని పశువులకు మేతగా వాడుకునే వారని, కూలీల కొరత, హార్వెస్టర్ల వినియోగంతో గడ్డి కట్టలు కట్టేందుకు పనికిరాక అలాగే వదిలే సి అవశేషాలను కాలుస్తున్నారని వివరించారు. కానీ, వరికొయ్యలను నేలలో కలియ దున్నితే ఎకరాకి దాదాపు టన్ను ఎరువు తయారవుతుందని తెలిపారు. రొటోవేటర్‌తో దున్ని కొయ్యకాళ్లను చిన్నముక్కలుగా, పౌడర్‌గా మార్చవచ్చన్నారు. -
రహదారులు ఛిద్రం.. ప్రయాణం నరకం
జూలపల్లి: పెద్దపల్లి– జూలపల్లి మధ్య రహదారి శిథిలమైంది. ఈ మార్గంలో అడుగుకో గుంత ఉంది. వాహనదారులకు నరకం చూపుతోంది. రోడ్డు మరమ్మతుకు గత ఎన్నికలకు ఆర్నెల్ల ముందు రూ.26.80 కోట్లు మంజూరయ్యాయి. ఈమేరకు రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజినీర్ ఉత్తర్వులు విడుదల చేశారు. అధికారులు స్పందించి శిలాఫలకం నిర్మించారు. కానీ నేటికీ పనులు ప్రారంభించలేదు. ఈ మార్గాన్ని మూడు విభాగాలుగా విభజించారు. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టర్.. రహదారుల వెంట ఇరువైపులా చెట్లు తొలగించారు. కాచాపూర్ నుంచి నిట్టూరు వరకు రోడ్డు విస్తరించారు. ఆ తర్వాత ప నులు నిలిపి వేశారు. కాచాపూర్ నుంచి జూలపల్లి వరకు రోడ్డుకు ఇరు వైపులా చెట్లు తొలగించినా.. పనులు ప్రారంభించలేదు. కాచాపూర్ – తుర్కలమద్దికుంట – పెద్దపల్లి రోడ్డు పనులకు దిక్కేలేదు. జూలపల్లి – తెలుకుంట, పెద్దాపూర్ – ద్యావన్పల్లిపల్లె మధ్య రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. వాహనదారుల అవస్థలు.. జూలపల్లి నుంచి జిల్లా కేంద్రానికి ప్రతీరోజు వివిధ పనుల నిమిత్తం పది గ్రామాల ప్రజలు రాకాపోకలు సాగిస్తుంటారు. అంతేకాదు.. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి కరీంనగర్, జూలపల్లి నుంచి కరీంనగర్‌ను కలిపే ప్రధాన రోడ్డు కావడంతో వందల సంఖ్యలో వాహనాలు ఇక్కడకు వచ్చివెళ్తుంటాయి. దూర భారం తగ్గడంతోపాటు సమయం ఆదా అవుతుంది. అందుకే అత్యధిక మంది వాహనాదారులు ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. కానీ, సుమారు ఇరవై ఏళ్లుగా ఈ రోడ్డును పట్టించుకోవడం లేదు. ముందుకు సాగని పెద్దపల్లి – జూలపల్లి రోడ్డు నిర్మాణ పనులు శిలాఫలకం ఆవిష్కరించక ముందే ఆగిన జూలపల్లి– తెలుకుంట రహదారి నిర్మాణం రెండు దశాబ్దాలు గడిచినా కార్యరూపం దాల్చని హామీలు -
బోనస్ చెల్లించకుంటే సమ్మె తప్పదు
పాలకుర్తి(రామగుండం): కేశోరాం సిమెంట్ కర్మాగారం యాజమాన్యం దీపావళి బోనస్ చెల్లింపు విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి ఆరోపించారు. కౌశిక హరి, మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్మికులతో కలిసి కంపెనీ ఎదుట బైఠాయించారు. హరి మాట్లాడుతూ రెండు రోజుల్లో కార్మికులకు దీపావళి బోనస్ చెల్లింపు విషయంపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో సోమవారం నుంచి నిరవధిక సమ్మె చేస్తామ ని ఆయన హెచ్చరించారు. కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని, పర్మినెంట్ యూనియన్ నాయకులు, కార్మికులు సమ్మెలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం ముఖ్య సలహాదారు బత్తిని సతశ్గౌడ్, నాయకులు సంపత్, దాడి బాపు, బైరి రామకృష్ణ, మల్కనూరి శ్రీధర్, కుర్ర మల్లయ్య, సాదిక్‌పాషా, కొప్పుల మల్లేశ్, ప్రసాద్, కొమురయ్య, కొమ్ము శ్రీనివాస్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు అందరూ పాల్గొనాలి యాజమాన్యం దిగి వచ్చేంత వరకూ విధుల బహిష్కరణ కేశోరాం కాంట్రాక్టు కార్మిక సంఘం అధ్యక్షుడు కౌశిక హరి -
అక్రమ రవాణాకు ‘వారధి’
మంథని: కరీంనగర్ – ఆదిలాబాద్ ఉమ్మడి జి ల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ను కలిపే పార్వతీ బ్యారేజీపై నిర్మించిన బ్రిడ్జి కం బ్యారేజీ అక్రమ రవాణాకు ‘మార్గం’గా మా రింది. ప్రధానంగా వంతెనపై సీసీ కెమెరాలు లేకపోవడంతో అక్రమార్కులకు వరంగా తయారైంది. ప్రజా రవాణా కోసమని బ్యారేజీ – వంతెన నిర్మిస్తే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఆదిలాబాద్ వెళ్లేందుకు గోదావరిఖనే దిక్కు.. ఒకప్పుడు మంథని నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులకు వెళ్లాలంటే సుమారు 30 కి.మీ. దూరంలోని గోదావరిఖని సమీప గోదావరి నదిపై నిర్మించిన వంతెనే ఏకై క దిక్కుగా ఉండేది. అక్కడి నుంచే రాకపొకలు సాగించేవారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మంథని మండలం సిరిపురం గ్రామం వద్ద గోదావరి నదిపై నిర్మించిన బ్రిడ్జి కం బ్యారేజీతో మంచిర్యాల జిల్లా సరిహద్దు ఆవలి వైపు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ బ్యారేజీ – వంతెన పైనుంచి కిష్టాపూర్, జైపూర్, చెన్నూర్, మంచిర్యాల మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ వైపు సులభంగా వెళ్లేందుకు వీలవుతుంది. దీంతో అక్రమ రవాణాదారులు, నేరస్తులు ఈ రహదారినే ఎంచుకుని తమ దందా కొనసాగిస్తున్నాన్నారు. అక్రమ రవాణా.. అసాంఘిక చర్యలకు వారధి అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు దంపతుల ను హత్య చేసిన అనంతరం నిందితులు.. హత్యకు వినియోగించిన కత్తులను పార్వతీ బ్యారేజీలోనే పడవేసి, ఇదే మార్గం నుంచి మహారాష్ట్రకు పారిపోయారని పోలీసులు గుర్తించారు. ఇలా నిందితులకు అడ్డానే కాకుండా.. అసాంఘిక కా ర్యకలాపాలకు వంతెన నిలయంగా మా రు తోంది. జిల్లాలోని కొన్ని రేషన్ షాపు ల్లో సేకరించిన రాయితీ బియ్యం సైతం ఇదే రహదారి గుండా తరలిపోతోంది. అక్రమంగా తరలిపోతున్న రేషన్ బియాన్ని పోలీసులు ఇటీవల ఇక్కడే పట్టుకున్నారు. ఇవేకాకుండా.. ఇసుక, కలప, గంజాయి, గుట్కా రవాణాను నిఘా నేత్రాల నుంచి తప్పించుకునేందుకు అక్రమార్కులు ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. నిరంతరం నిఘా ఉండాల్సి న వంతెనపై కనీసం ఒక్క సీసీ కెమెరా కూడా లేకపోవడం గమనార్హం. ప్రాజెక్టు సమీపంలోని పంప్‌హౌస్ డెలివరీ సిస్టం వద్దే.. అదికూడా ఒకేఒక సీసీ కెమెరా ఏర్పాటుచేశారు. ఇది ప్రాజెక్టుకు దూరంగా ఉండడంతో వంతెనపై రాకపోకలను పసిగట్టే అవకాశం లేకుండా పోతోంది. ఈ వంతెనపై నుంచి పెద్దఎత్తున రాకపోకలు నిరంతరం కొనసాగుతూనే ఉంటున్నాయి. గోదావరిఖని వద్ద ఉన్న వంతెన దాటిన అనంతరం ఇందారం వద్ద చె క్ పోస్టు ఉండడంతో అక్రమార్కులు అటు వెళ్లకుండా.. పార్వతీ బ్యారేజీని ఎంచుకుంటున్నారు. చెక్‌పోస్టుల ఏర్పాటుతోనైనా చెక్.. బ్యారేజీ – వంతెన రెండు జిల్లాలు, సమీప రాష్ట్రాల మధ్య రవాణాకు ఉపయోగపడుతోంది. అయితే, అక్రమ రవాణా, అసాంఘి కార్యకలాపాల నియంత్రణకు ఇక్కడ చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. చెక్‌పోస్టు దాటి వెళ్లడానికి నిందితులు, అక్రమార్కులు భయపడే అవకాశం ఉంటుంది. పోలీసులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన బ్యారేజీ – వంతెన భద్రతను నిర్మాణ ఏజెన్సీ తన సెక్యూరిటీ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తోంది. వారధిని అక్రమంగా దాటుతున్న అక్రమార్కులను నిలువరించే పని పోలీసులు చూసుకోవాల్సి ఉంటుంది. నోటీసులు జారీచేశాం బ్యారేజీ– వంతెన పైనుంచి సాగుతున్న అక్రమ రవాణా గురించి మాకు ఫిర్యాదులు వస్తున్నాయి. నేరస్తులు, అక్రమార్కులు సరిహద్దులు దాటి వెళ్లకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాకుండా బ్యారేజీపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులకు నోటీసులు జారీచేశాం. – రమేశ్, ఎస్సై, మంథని జోరుగా రేషన్ బియ్యం తరలింపు గంజాయి రవాణాకూ మార్గం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా ఎక్కడా కనిపించని సీసీ కెమెరాలు పార్వతీ బ్యారేజీ – వంతెనపై దుస్థితి నిఘా నేత్రాలేవి? ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని చెబుతున్న రక్షక భటులు.. ఈ బ్యారేజీపై నుంచి రాకపోకలు సాగించే వాహనాల గుర్తింపునకు సీసీ కెమెరాలు ఎందుకు ఏర్పాటు చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు అనేక సంఘటనలు చోటుచేసుకొని పోలీస్‌లకు సవాల్ విసురుతున్నా నిర్లక్ష్యం వీడడం లేదనే విమర్శలు ఉన్నాయి. మంథని–గోదావరిఖని ప్రధాన రహదారిలో గుంజపడుగు గ్రామం దాటిన తర్వాత ఓ ఇంటి యజమాని సొంతంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరా మినహా.. బ్యారేజీ దాటే వరకూ నిఘా నేత్రాలు ఎక్కడా కనిపించడంలేదు. బ్యారేజీ దాటిన అనంతరం కిష్టాపూర్ మూలమలుపు వద్ద మరో వ్యక్తి ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరానే నిఘా కాస్తోంది. ఒకవేళ ఆ కెమెరాలు కూడా పనిచేయకపోతే అత్యవసర సమయాల్లో వాహనాల రాకపోకలను ఎలా గుర్తిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. -
ఇసుకాసురులపై ఉక్కుపాదం
పెద్దపల్లిరూరల్: జిల్లాలో ఇసుక అక్రమరవాణాదారులపై ఉక్కుపాదం మోపేలా కఠిన చర్యలు తీసుకున్నామని, అక్రమంగా ఇసుక రవాణా చేసే టిప్పర్‌కు రూ.లక్ష, ట్రాక్టర్‌కు రూ.25వేల వరకు జరిమానా వసూలు చేస్తున్నామని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది నవంబర్ 21 వరకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న 63 టిప్పర్లు, 86 ట్రాక్టర్లు పట్టుకుని రూ.25,99,790 జరిమానా వసూలు చేసినట్లు ఆయన వివరించారు. జిల్లా ప్రజలు ఇసుక కోసం ఆన్లైన్లో సాండ్టాక్సీ ద్వారా బుకింగ్ చేసుకుంటే 24 గంటల్లోగా డెలివరీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. -
రామగుండంలో నర్సింగ్ కాలేజీ
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరం వై ద్య విద్యకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇప్పటికే సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సి మ్స్) కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మెడికల్ కాలే జీకి అనుబంధంగా తాజాగా నర్సింగ్ కళాశాలను మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో జారీచేసింది. 60 మంది విద్యార్థులను కాలేజీలో చేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 13 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలను మంజూరు చేస్తూ జీవో నంబర్ 183ను రాష్ట్ర కార్యదర్శి క్రిస్టినా జెడ్చాంగ్ జారీచేశారు. వీటిలో రామగుండం కాలేజీ కూడా ఉంది. వీటి నిర్వహణ, నిర్మాణం కోసం రూ.338 కోట్లు కూడా మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఒక్కో కాలేజీకి రూ.26 కోట్లు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కాలేజీ నిర్మాణం, ఫర్నీచర్, తదితర వాటిని సమకూర్చడానికి తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్(టీజీ ఎంఎస్ ఐటీసీ)కి బాధ్యతలు అప్పగించారు. జీవో జారీచేసిన ప్రభుత్వం -
ముదిరాజ్‌ల సంక్షేమానికి కృషి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ముదిరాజ్‌ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెగడపల్లిలో గురువారం ము దిరాజ్ సంఘం లోగో, జెండా ఆవిష్కరించి మా ట్లాడారు. మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి నాణ్యమైన చేపపిల్లల పంపిణీ చేస్తామన్నారు. ఇందుకు అనువు గా జలాశయాలు అభివృద్ధి చేస్తామన్నారు. మాజీ ఎంపీపీ సారయ్యగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అ ధ్యక్షుడు గాజనవేన సదయ్య, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తూడి సదయ్య, పెండెం సతీశ్ పాల్గొన్నారు. ట్రాన్స్‌కో ఎస్ఈగా మాధవరావు పెద్దపల్లిరూరల్: ఎన్పీడీసీఎల్(ట్రాన్స్‌కో) సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా కంకటి మాధవరా వు గురువారం బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ నుంచి పెద్దపల్లికి బదిలీపై వచ్చారు. పెద్దపల్లి ఎస్ఈగా పనిచేసిన బొంకూరి సుదర్శన్ నిర్మల్‌కు బది లీ అయ్యారు. మాధవరావుకు అధికారులు, నాయకులు, ఆయన స్వగ్రామం హన్మంతునిపేటకు చెందిన పలువురు అభినందనలు తెలిపారు. ఆ ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దుకోల్సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామని చె ప్పి రుసుం చెల్లించి డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని అగంతకులు చేస్తున్న ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని అదనపు కలెక్టర్ అరుణశ్రీ కోరారు. డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఉందన్నారు. ఇంటర్నెట్/మీ సేవా కేంద్రం, స్మార్ట్ ఫోన్లో సిటిజన్ బడ్డీ యాప్ లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాల కోసం రామగుండం నగర పాలక సంస్థ లైసెన్స్ విభాగంలో సంబంధిత అధికారి ఫోన్ నంబరు 99666 26680లో సంప్రదించాలని ఆమె సూచించారు. 24న ప్రజాపాలన వేడుకలుమంథని: స్థానిక శివకిరణ్ గార్డెన్స్‌లో ఈనెల 24న ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్చార్జి పౌర సంబంధాల అధికారి జగన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో వేడుకలు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతారని ఆయన వివరించారు. -
మతోన్మాదశక్తులను తరిమేద్దాం
గోదావరిఖని: మతోన్మాదశక్తుల నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలని వామపక్ష పార్టీల నాయకులు కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం మతోన్మాద వ్యతిరేక సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, సీపీఎం కార్యదర్శి వై.యాకయ్య, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర నాయకుడు నంది రామయ్య, సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ నాయకుడు కె.రాజన్న, సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకుడు ఎం.శ్రీనివాస్ మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తోందని దుయ్యబట్టారు. భారత రాజ్యాంగాన్ని ఖూనీచేస్తూ, ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతోందని విమర్శించారు. మతం వ్యక్తిగతమని, కానీ మతం పేరిట రాజకీయాలు చేయడం సరికాదని అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరిట పాలకవర్గ పార్టీలు ప్రజల ఆలోచనలను వక్రమార్గం పట్టిస్తున్నాయని మండిపడ్డారు. మహిళ లు, దళితులు, ఆదివాసీలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేద ని ఆరోపించారు. మతసామరాస్యాన్ని కాపాడ ట మే లక్ష్యంగా ముందుకు సాగాలని వారు కోరారు. వామపక్ష పార్టీల నాయకులు కె.కనకరాజు, ఎం.మహేశ్వరి, జూపాక శ్రీనివాస్, ఇ.నరేశ్, ఇ.రామకృష్ణ, గౌతమ్ గోవర్ధన్, వేల్పుల కుమారస్వామి, ఐ.కృష్ణ, రమేశ్, గుండేటి మల్లేశం, మోహన్, బి.అశోక్, ఉపేందర్, చంద్రశేఖర్, మేరుగు చంద్రయ్య, గుమ్మడి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వామపక్ష పార్టీల పిలుపు -
వేగంగా తూకం వేయాలి
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేగవంతం చేసి వివరాలను వెంటనే ట్యాబ్‌లో నమోదు చేయాలని అడిషనల్ కలెక్టర్ వేణు ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎండీ వకీల్, ఆర్ఐలు, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. సమర్థవంతంగా సర్వే కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని డీపీవో వీరబుచ్చయ్య ఆదేశించారు. మండల కేంద్రంలో చేపట్టిన సర్వేను గురువా రం ఆయన తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతీ కుటుంబాన్ని సర్వే లో చేర్చాలని, విదేశాలు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారి జాబితా నమోదు చేయాలని సూచించారు. ప్రజాసమస్యలను పరిష్కరించా లని అన్నారు. ఎంపీడీవో రామ్మోహనాచారి, ఎంపీవో గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. వర్గీకరణ ఫలాల కోసం.. సుల్తానాబాద్(పెద్దపల్లి): ఎస్సీ వర్గీకరణ ఫలా లు దక్కించుకోవడం లక్ష్యంగా డిసెంబరులో హైదరాబాద్‌లో నిర్వహించే ధర్మయుద్ధం మ హాబహిరంగ సభను విజయవంతం చేయా లని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండా థామస్ మాదిగ కోరారు. గురువారం స్థాని క ఆర్ అండ్ బీ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు సు ప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, ఈమేరకు అసెంబ్లీలో తీర్మానిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినా ఇంకా అమలుకు నోచుకోవడం లేదన్నారు. నాయకులు సిరిసిల్ల శంకర్, తాండ్ర గట్టయ్య, తాడూరు రమేశ్, తాండ్ర శ్రీకాంత్, మినుముల రాజ్‌కుమార్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులను ఆదుకోవాలి మంథని: మత్స్యకారులను ప్రభుత్వం అన్ని వి ధాలా ఆదుకోవాలని మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ పోతరవేణి క్రాంతికుమార్ కోరారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా పట్టణంలోని బోయిన్‌పేట నుంచి అంబేడ్కర్‌చౌక్ వర కు గురువారం ర్యాలీ నిర్వహించారు. విన్యాసా లు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నా రు. సబ్బని సమ్మయ్య, పోలు కనకరాజు, అంకరి కుమార్, గందం వెంకటస్వామి, బయ్య రాజేశ్, కుంట బద్రి, సబ్బని సంతు, బొజ్జ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దరఖాస్తులు ఆహ్వానం పెద్దపల్లిరూరల్: జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఖాళీగా ఉన్న మూడు పోస్టుల భర్తీకో సం డిసెంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని అథారిటీ చైర్మన్ హేమంత్‌కుమార్ తెలిపారు. స్టెనో, టైపిస్ట్, టైపిస్టు కం అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రూప్–2 అభ్యర్థుల కోసం.. పెద్దపల్లిరూరల్: జిల్లాకు చెందిన మైనార్టీ గ్రూ ప్–2 అభ్యర్థుల కోసం మైనార్టీ స్టడీ సర్కిల్ కెరీ ర్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో షార్ట్, లాంగ్‌టర్మ్ మాక్ టెస్ట్‌లు నిర్వహిస్తోందని ఇన్చార్జి జిల్లా అధికారి రంగారెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు ఈనెల 29లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారులకు డిసెంబర్ 2, 3, 9, 10వ తేదీల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. మొండి బకాయిలు వసూలు కోల్‌సిటీ(రామగుండం): రామగుండం నగరపాలక సంస్థలో రెవెన్యూ రికవరీ యాక్ట్ అమ లు చేస్తుండడంతో ఆస్తిపన్ను బకాయిలు వసూలవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఓ బకాయిదారు రూ.24.81 లక్షల ఆస్తిపన్నును ఆయన తరఫున హర్ష, వెంకటేశం, నూరుల్ హుస్సేన్.. కమిషనర్ అరుణశ్రీకి చెల్లించారు. -
6 గంటల్లో వ్యాధి నిర్ధారణ
● పేషెంట్ మొబైల్‌కు ఫలితాల మెసేజ్ ● సత్వర సేవలు అందిస్తున్న టీ–హబ్ ● రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచిన ‘పెద్దపల్లి’మెరుగైన సేవలు లక్ష్యం డయాగ్నొస్టిక్ సేవలు అందించడంలో పెద్దపల్లి టీ హబ్ అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం 6.8 గంటల్లో ఫలితాలు అందిస్తున్నాం. సిబ్బంది, వైద్యాధికారులకు అభినందనలు. అయితే ప్రస్తుత సమయాన్ని 4 గంటలకు తగ్గించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. పల్లెల నుంచి టీ హబ్‌కు నమూనాలతో చేరే వాహనాల రూట్‌మ్యాప్ మార్చి సమయం ఆదా అయ్యేలా చూడాలి. – కోయ శ్రీహర్ష, కలెక్టర్ పెద్దపల్లిరూరల్: వైద్య రంగంలో సాంకేతికతతో కూడిన సేవలు వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి. వ్యాధుల బారినపడి వైద్య చికిత్సల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించకుండా, ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వమే వారికిఅన్నిరకాల వైద్యసేవలు అందిస్తోంది. అంతేకాదు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వ్యాధుల నిర్ధాణకు టీ హెబ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలోనే పెద్దపల్లి టాప్.. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన టీ హబ్ సత్వర సేవలు అందించడంలో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత అక్టోబర్‌లో 6.8 గంటల్లోనే వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలను అందించి టాప్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో నిర్మల్, సూర్యాపేట, గద్వాల, జనగాం, ఉట్నూరు, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, నాగర్ కర్నూలు, నిజామాబాద్ జిల్లాలు నిలిచాయి. సిద్దిపేట జిల్లా 25.3 గంటల్లో ఫలితాలు అందిస్తూ చిట్టచివరన నిలిచింది. వేగంగా వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితాలు కాలానుగుణ, జ్వరాలు, రకరకాల వ్యాధులతో బాధపడుతూ ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, ఆరోగ్య సబ్ సెంటర్లు, మహిళా ఆరోగ్య ఆస్పత్రులను ఆశ్రయించే పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చికిత్స అందించేందుకు వ్యాధి నిర్ధారణ అత్యంత కీలకం. ఇందుకోసం టి హబ్ (తెలంగాణ డయాగ్నొస్టిక్స్) ద్వారా వ్యాధులను నిర్ధారిస్తున్నారు. ఇందులో ఆధునిక యంత్ర పరికరాలు, అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉంది. ఇందులో సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ సకాలంలో వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. అంతేకాదు.. పేషెంట్ల మొబైల్ నంబరుకు ఫలితాలను మెసేజ్‌ల ద్వారా శరవేగంగా చేరవేస్తున్నారు. అందుబాటులో 56 సేవలు.. టీహబ్ ద్వారా 139 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. ప్రస్తుతం పెద్దపల్లి టీ హబ్‌లో 56 రకాల సేవలే అందుబాటులో ఉన్నాయి. గుండె, కిడ్నీ, లివర్, థైరాయిడ్ తదితర వ్యాధుల నిర్ధారణ పరీక్షలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీల) నుంచి సేకరించిన రక్త నమూనాలను వాహనాల ద్వారా టీహబ్‌కు చేరవేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడి ల్యాబొరేటరీల్లోని టెక్నీషియన్లు పరీక్షలు చేసి ఫలితాలను అందిస్తున్నారు. సిబ్బంది కొరత ఉన్నా.. జిల్లా కేంద్రంలోని టీ హబ్‌లో అవసరమైనంత మంది వైద్యులు, సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం టీ హబ్‌లో పనిచేస్తున్న వారిపై కొంత పనిభారం పడుతోంది. మొత్తం నలుగురు వైద్యులు ఉండాల్సి ఉన్నా.. ప్రస్తుతం ఒక్కరే పనిచేస్తున్నారు. అలాగే ల్యాబ్టెక్నిషియన్ల కొరత కూడా వేధిస్తోంది. అయితే, అవసరాన్ని బట్టి జిల్లా అధికారులే డెప్యుటేషన్‌పై కొందరు సిబ్బంది, వైద్యులను ఇక్కడకు పంపిస్తూ వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఆటంకం తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. -
No Headline
సాక్షి, పెద్దపల్లి●: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురిచేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లి పోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చు పండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ స్థాయి అధికారి చైర్మన్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు. ఆస్తిని తిరిగి పొందే హక్కు నిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు. -
కృంగిపోతున్న
శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024పండుటాకులు● కొడుకుల ఆదరణ కరువై.. వేధింపులు పెరిగి ● ఇంటిని వదిలి వెళ్తున్న కొందరు.. ● ఆత్మహత్య చేసుకుంటున్న మరికొందరు.. ● ప్రజావాణి, ఠాణాల్లో పలువురి ఫిర్యాదు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న వృద్ధుల మిస్సింగ్ కేసులు ● చట్టాలపై అవగాహన లేక ఇబ్బందులుఈమె పేరు గుర్రాల అంతమ్మ. మానకొండూరు మండలం కొండపల్కల. 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొడుకు లక్ష్మారెడ్డి మాయమాటలు చెప్పి, ఏడెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2022లో తన భర్త మల్లారెడ్డి మరణించడంతో కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంతమ్మ వాపోయింది. కూతురు వద్ద తలదాచుకుంటున్నానని కన్నీటిపర్యంతమైంది. మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుమారుడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. ఈ చిత్రంలో కనిపిస్తున్నది చొప్పదండికి చెందిన ముత్యాల గోపాల్‌రెడ్డి, ఆయన భార్య. వీరికి ఇద్దరు కుమారులు రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో దర్జాగా బతికేవారు. పిల్లలను చదివించి, ప్రయోజకులను చేశారు. తీరా కుమారులు మాయమాటలు చెప్పి, భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి గెంటేశారని, ఈ వయసులో తమకు ఇదేం దుస్థితి అంటూ ఆ దంపతులు కంటతడి పెడుతున్నారు.● జగిత్యాల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు చెందిన ఒక వృద్ధుడు కొడుకు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మానసికంగా కృంగిపోయాడు. ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నారు. ● సిరిసిల్లకు చెందిన ఓ వృద్ధుడు కుమారుడు ఆస్తి రాయించుకొని, తర్వాత పట్టించుకోకపోవడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని హెల్ప్ లైన్–14567కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. అధికారులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆర్డీవో ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రికి, కుమారుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, విధించే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ● సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో ఆస్తి వివాదం కారణంగా కొడుకు సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన తన తండ్రి మధునయ్యను తోసేశాడు. అతను కిందపడి, మృతిచెందాడు.పెద్దపల్లిసిరిసిల్లజగిత్యాల008కరీంనగర్2735ఈ ఏడాది ట్రిబ్యునల్‌కు అందిన ఫిర్యాదులు జిల్లా వచ్చినవి పరిష్కారం విచారణ దశ కరీంనగర్ 48 19 25 జగిత్యాల 66 55 11 సిరిసిల్ల 38 12 26 పెద్దపల్లి 34 19 15న్యూస్‌రీల్ -
50 పడకలతో మరో భవన నిర్మాణం
పెద్దపల్లిరూరల్: జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ఆవరణలో మరో 50 పడకల సామర్థ్యం గల భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టిన వివిధ నిర్మాణాలపై గురువారం క లెక్టర్ సమీక్ష నిర్వహించారు. గోదావరిఖని జనరల్ ఆస్పత్రి, మంథని, పెద్దపల్లి, నందిమేడారం పరిధి లో చేపట్టిన పనులను సత్వరమే పూర్తిచేయాలన్నా రు. జిల్లా ఆస్పత్రిని సందర్శించి అందుబాటులో ఉ న్నస్థలంలో మరో 50 పడకల కోసం భవనాల ని ర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ఎస్ఈ దేవేందర్, డీఈ రవీందర్, సూపరింటెండెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రూ.100 కోట్ల ధాన్యం కొనుగోలు.. జిల్లాలో ఇప్పటివరకు రూ.100 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గతేడాది కన్నా ఈసారి 60 శాతం అధికంగా వడ్లు కొనుగోలు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. 45,438 మెట్రిక్ ఽటన్నుల ధాన్యం కొనుగోలు చేసి 1,762 మంది రైతులకు రూ.25.10 కోట్లు చెల్లించామని ఆయన వివరించారు. పీఎం అజయ్ పథకానికి దరఖాస్తు చేసుకోండి జిల్లాలో పీఎం అజయ్ పథకం కింద లబ్ధిపొందేందుకు ఎస్సీ రైతులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష సూచించారు. ప్రభుత్వం ద్వారా వ్యవసా య భూమి పొందిన ఎస్సీ కులాల లబ్ధిదారులు ప్రధానమంత్రి అనుచిత్ జాతి అభ్యుదయ యోజన పథకం కింద ఆయా భూముల్లో బోరుబావులు వేసి నీటివసతి కల్పించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఇంకో 950 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు వచ్చే ఏడాది జనవరి వరకు జిల్లాలో మరో 950 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్కలు నాటాలని కలెక్టర్ కో య శ్రీహర్ష ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయిల్‌పా మ్ సాగుపై సమీక్షించారు. ఆయిల్‌పామ్ సాగుతో కలిగే ప్రయోజనాలు, లాభాలపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని సూచించారు. వ్య వసాయ, ఉద్యానవన శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ అన్నారు. సమావేశంలో ఉద్యానవన జిల్లా అధికారి జగన్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెంటనే అన్లోడ్ చేయాలి సుల్తానాబాద్(పెద్దపల్లి): రైస్‌మిల్లుల్లో ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. స్థానిక వసుంధర రైస్ మిల్లును ఆయన తని ఖీ చేశారు. కేటాయించిన కోనుగోలు కేంద్రాలు, సే కరించిన ధాన్యం తదితర అంశాలపై ఆరా తీశారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, అధికారులు రాజేందర్, మహేశ్ పాల్గొన్నారు. ప్రతిపాదనలు సిద్ధం చేయాలి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు -
మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం
నేను బీటెక్ పూర్తి చేశాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా రెండేళ్లు క ష్టపడి, చదివాను. మొదటి ప్ర యత్నంలోనే కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. రాతపరీక్ష కంటే ఫిజికల్ పరీక్షే కఠినంగా అనిపించి ంది. భవిష్యత్తులో ఎస్సై కొలువు సాధిస్తా. అమ్మానాన్న రేణుక–వెంకటేశ్వర్లు వ్యవసాయం చేస్తుంటారు. – కడెం శ్రవణ్‌కుమార్, బోనగిరి, యాదాద్రి భువనగిరి అమ్మానాన్న కోరిక నెరవేరింది మా అమ్మానాన్న అనిత–కుమార్ కూలీ పనులు చేస్తూ నన్ను డిగ్రీ వరకు చదివించారు. నేను ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న వారి కోరిక నెరవేరింది. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మరింత కష్టపడి, ఎస్సై ఉద్యోగం సాధించేందుకు ప్రయత్నిస్తా. – కె.మహేశ్‌కుమార్, కాప్రా, మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్‌లో పోస్టింగ్ మాది హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్. నాకు పోస్టింగ్ కూడా హైదరా బాద్లోనే వచ్చింది. చిన్న ప్పుడు పోలీస్ కావాలని అనుకునేవాన్ని. ఆ కోరిక ఈరోజు నెరవేరింది. నాన్న వ్యవసాయం చేస్తాడు. నాకు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో అమ్మానాన్న సంతోషంగా ఉన్నారు. – కుమ్మరి శ్రీకాంత్, హైదరాబాద్ -
మాకు దిక్కెవరు కొడుకా..
వేములవాడరూరల్: నాడు కన్న కొడుకు.. నేడు దత్తత తీసుకున్న కొడుకు చనిపోయాడు.. మాకు దిక్కెవరు కొడుకా.. అంటూ వృద్ధ దంపతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇది చూసిన స్థానికులు కంటతడి పె ట్టారు. పోలీసుల వివరాల ప్రకారం.. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లికి చెందిన మ్యా కల నర్సయ్య–లచ్చవ్వ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పదేళ్ల క్రితం తేలు కుట్టి, చనిపోయాడు. దీంతో వారు వృద్ధాప్యంలో ఎవరైనా ఒకరు తోడు ఉండాలని భావించారు. నర్సయ్య చెల్లెలు చందుర్తి మండలంలోని రామారావుపల్లికి చెందిన గుడిసె సుగుణకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కు మారుడైన రమేశ్(25)ను మూడేళ్ల దత్తత తీసుకున్నారు. అతనికి రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. రమేశ్ వట్టెంల పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం రాత్రి పని ముగించుకొని, బైక్‌పై మరో ఇద్దరితో కలిసి ఇంటికి వస్తున్నాడు. మార్గమధ్యలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతన వెంట ఉన్న కట్కూరి సంసాన్, గుర్రం సాయికుమార్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వేములవా డ పట్టణ సీఐ వీరప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీ లించారు. మృతుడి తల్లి సుగుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నాడు కన్న కొడుకు.. నేడు దత్తత తీసుకున్న కొడుకు మృతి బైక్‌ను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం కన్నీరుమున్నీరైన వృద్ధ దంపతులు -
వాట్సాప్ లింక్.. రూ.1.59 లక్షలు మాయం
● పీఎం కిసాన్ పేరిట రావడంతో ఓపెన్ చేసిన ముగ్గురు రైతులు ● బాధితులు కోనరావుపేట, మంగళ్లపల్లివాసులు కోనరావుపేట(వేములవాడ): వాట్సాప్‌కు పీఎం కిసాన్ ఏపీకే పేరిట వచ్చిన లింక్‌ను ఓపెన్ చేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నుంచి డబ్బులు మాయమయ్యాయి. దీంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వారి వివరాల ప్రకారం.. పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బుల జమ వివరాలు తెలుసుకోవాలంటే ఈ యాప్‌ను ఇన్స్టాల్ చేయాలని కోనరావుపేటకు చెందిన ఇద్దరు, మంగళ్లపల్లికి చెందిన ఒక రైతు వాట్సాప్‌కు లింక్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే ముగ్గురి ఖాతాల్లో నుంచి రూ.32 వేలు, రూ.57 వేలు, రూ.70 వేల చొప్పున కట్ అయ్యాయి. దీంతో బాధితులు బుధవారం సంబంధిత బ్యాంకుకు వెళ్లి, విషయాన్ని అధికారులకు తెలిపారు. వారు పరిశీలించి, ఖాతాల్లో నుంచి డబ్బులు బదిలీ అయ్యాయన్నారు. ట్రాన్స్ఫర్ అయిన ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు అప్పటికే డబ్బులు తీసేసుకున్నారని, తామేమీ చేయలేమని పేర్కొన్నారు. పీఎం కిసాన్ పేరిట వాట్సాప్‌కు వస్తున్న యాప్‌ను ఓపెన్ చేయొద్దని సూచించారు. -
అంజన్న హుండీ ఆదాయం రూ.కోటి
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయానికి 75రోజులకుగాను హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని గురువారం అధికారులు లెక్కించారు. 12 హుండీలను లెక్కించగా రూ.1,04,36,365తోపాటు 60 గ్రాముల మిశ్రమ బంగారం, మూడు కిలోల మిశ్రమ వెండి, 78విదేశీ కరెన్సీ సమకూరాయని పేర్కొన్నారు. అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఈవో రామకృష్ణారావు, ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్ సునీల్, చంద్రశేఖర్, హరిహరనాథ్ పాల్గొన్నారు. ఇసుక ట్రాక్టర్ ఢీకొని దంపతులకు తీవ్ర గాయాలు మంథని: మంథని–గోదావరిఖని ప్రధాన రహదారి విలోచవరం మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. మంథనికి చెందిన గీట్ల అగజ గుంజపడుగు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. గురువారం ఆమె విధులు ముగించుకొని, భర్త గంగారెడ్డితో కలిసి బైక్‌పై మంథనికి వస్తోంది. మార్గమధ్యలో విలోచవరం నుంచి నాగారం వైపు వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అగజ, గంగారెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయని కుటుంబసభ్యులు తెలిపారు. మంథనిలో ప్రథమ చికిత్స చేయించి, కరీంనగర్ తరలించారు. రేచపల్లిలో గంజాయి సాగుసారంగాపూర్: మండలంలోని రేచపల్లికి చెందిన ఓ రైతు తన పొలంలో గంజాయి సాగుచేస్తుండడంతో పోలీసులు తనిఖీలు చేశారు. ఎస్సై దత్తాద్రి కథనం ప్రకారం గ్రామానికి చెందిన పోతుగంటి తిరుపతి తన వ్యవసాయ క్షేత్రంలో గంజాయి సాగు చేస్తున్నాడని పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు తనిఖీలు చేయగా తొమ్మిది చెట్లు కనిపించాయి. అలాగే 300 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. చెట్ల విలువ రూ.90 వేలు, ఎండిన గంజాయి విలువ రూ.7,500 ఉంటుందని, నిందితుడిని అరెస్ట్ చేశామని ఎస్సై తెలిపారు. -
ఉపాధి వేటలో ఆగిన ఊపిరి
మల్లాపూర్: ఉన్న ఊరిలో ఉపాధి కరువై ఏడారి దేశానికి వెళ్లిన వలస జీవి ఊపిరి ఇక్కడే ఆగిపోయింది. స్థానికులు, కు టుంబ సభ్యుల కథనం ప్రకా రం.. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేటకు చెందిన దండ్ల శ్రీనివాస్ కొన్నాళ్లుగా దుబాయి వెళ్లి వస్తున్నాడు. భార్య అనిత, ముగ్గురు కుమార్తెలు కావ్య, అశ్విత, వైష్ణవిని పోషించుకుంటున్నాడు. అక్కడ జీతం తక్కువగా ఉండడంతో చేసిన అప్పులు తీర్చలేకపోయాడు. పైగా కుటుంబ పోషణ నిమిత్తం మరింత అప్పు చేశాడు. వీటిని ఎలా తీర్చాలి అని నిత్యం ఫోన్లో మదనపడేవాడు. జీవితంపై విరక్తి చెంది దుబాయిలోని తన గదిలో బుధవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తోటి కార్మికులు గురువారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వదేశానికి త్వరగా తీసుకురావాలని ప్రజాప్రతినిధులు, నాయకులను కుటుంబ సభ్యులు కోరుతున్నారు. దుబాయిలో మొగిలిపేటవాసి ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని అఘాయిత్యం -
ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి దుర్మరణం
మానకొండూర్: శంకరపట్నం మండలంలోని చింతగట్టు గ్రామానికి చెందిన కర్క మల్లారెడ్డి(68) రోడ్డు ప్రమాదంలో మృతిచెందా డు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. మల్లారెడ్డి గురువారం ఉదయం ద్విచక్రవాహనంపై మానకొండూర్ మండలంలోని గట్టుదుద్దెనపల్లిలో గల పెట్రోల్ బంకుకు వెళ్లాడు. పె ట్రోల్ కొట్టించుకొని, తిరిగి వస్తుండగా శంషా బాద్ స్టేజి వద్ద వరంగల్ నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వద్ద ఢీకొట్టింది. ఈ ఘటనలో మల్లారెడ్డి రోడ్డుపై ఎగిరిపడ్డాడు. తలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడికి ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. చికిత్స పొందుతూ మహిళ మృతికాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఇదులాపూర్కు చెందిన శివరాత్రి స్వప్న(35) చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. స్వప్నకు ఓ వ్యక్తి తరచూ ఫోన్ చేస్తున్నాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై, ఈ నెల 18న ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగింది. కుటుంబసభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం చనిపోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. మానేరు వాగులో పడి వ్యక్తి.. సిరిసిల్ల క్రైం: తంగళ్లపల్లి మండలంలోని మండెపల్లికి చెందిన జంగిలి అనిల్(37) మానేరు వాగులో పడి మృతిచెందాడు. సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ వివరాల ప్రకారం.. అనిల్ కోనరావుపేట మండలంలోని నిజామాబాద్‌కు చాలా ఏళ్ల క్రితం ఇల్లరికం వెళ్లాడు. సెంట్రింగ్ పనిచేస్తూ జీవిస్తున్నాడు. స్వగ్రామం మండెపల్లిలో నాన్న ఆరోగ్యం బాగాలేదని తెలిసి, చూసేందుకు వచ్చాడు. ఈ నెల 18న మానేరు వాగు కరకట్ట ప్రాంతానికి వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో గురువారం మానేరు వాగులో మృతదేహం తేలడంతో అనిల్‌దేనని గుర్తించారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య గీత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. గంజాయి విక్రేతల అరెస్టుమంథని: ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. గురువారం మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లి వద్ద ఇద్దరు వ్యక్తులు గంజాయితో ఉన్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో మంథని సీఐ రాజు ఆధ్వర్యంలో ఎస్సై రమేశ్, పోలీసు సిబ్బంది వెంటనే అక్కడికి వెళ్లారు. అనుమానాస్పదంగా కనిపించిన కూచిరాజ్‌పల్లికి చెందిన నక్క ప్రేమస్, లక్కేపూర్కు చెందిన మహమ్మద్ అర్షద్‌లను తనిఖీ చేయగా 1,232 గ్రాముల గంజాయి లభ్యమైంది. విచారణలో తాము ఐదేళ్లుగా గంజాయి తీసుకుంటున్నామని, మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి, స్నేహితులకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారని ఏసీపీ పేర్కొన్నారు. ఆ ఇద్దరినీ అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. -
జైలులో రీజినల్ లెవెల్ రిట్రీట్ ప్రోగ్రాం
కరీంనగర్ క్రైం: కరీంనగర్‌లోని జిల్లా జైలులో రీజినల్ లెవెల్ రిట్రీట్ మొదటి విడత కార్యక్రమాన్ని వరంగల్ రేంజ్ డీఐజీ(జైళ్ల శాఖ) ఎం.సంపత్, శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ యు.ఉమేశ్‌కుమార్ గురువారం జ్యోతిప్రజ్వలన చేసి, ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. జైళ్ల శాఖ సిబ్బంది సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో అధునాతన టెక్నాలజీతో జైలు నిర్మిస్తున్నామని, ఇతర జిల్లాల్లోనూ నిర్మాణాలు చేపట్టి, ఖైదీల రద్దీని తగ్గిస్తామన్నారు. వీసీ మాట్లాడుతూ.. జైళ్ల శాఖ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించి, జైళ్లను మెరుగుపర్చుకోవాలని సూచించారు. సైకియాట్రిస్ట్ ఎల్.వర్ణి, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్రావు, జిల్లా జైలు పర్యవేక్షణాధికారి కె.శ్రీనివాస్, జైలు వైద్యాధికారి వేణుగోపాల్, జైలర్లు శ్రీనివాస్, రమేశ్, పర్శరాం తదితరులు పాల్గొన్నారు. -
ప్యాంక్రియాటిక్ కేన్సర్ ప్రాణాంతకం
కరీంనగర్‌టౌన్: ప్యాంక్రియాటిక్ కేన్సర్ ప్రాణాంతకమని, తక్కువ మందికే వస్తున్నప్పటికీ, దీని నుంచి బయటపడటం అసాధ్యమని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వరల్డ్ ప్యాంక్రియాటిక్ కేన్సర్ డే సందర్భంగా గురువారం కరీంనగర్‌లోని దవాఖానాలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్యాంక్రియాటిస్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుందని, షుగర్‌ను సమతుల్యంగా ఉంచుతుందన్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో అన్నం అరగకపోవడం, ఆకస్మికంగా బరువు తగ్గడం, జాండిస్, డిప్రెషన్, డయాబెటిస్, వాంతులు, వెన్ను, నడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నారు. అంతేకాకుండా, తిన్న వెంటనే పొట్టలో, బొడ్డుపై నొప్పి వస్తుంటే అజీర్తి చేసిందని భావించి, సొంత వైద్యం చేసుకోకుండా.. వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ప్యాంక్రియాటిక్ కేన్సర్‌ను ముందుగానే గుర్తిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందన్నారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైద్యులు దిలీప్‌రెడ్డి, ప్రణీత్, నటరాజ్, వినయ్‌కుమార్, రవిమల్లారెడ్డి, కర్ణాకర్ పాల్గొన్నారు.