Practice
-
#BGT2024 : ప్రాక్టీస్ మొదలు పెట్టిన టీమిండియా (ఫోటోలు)
-
IND vs AUS: ప్రాక్టీస్ మొదలైంది
పెర్త్: వరుసగా మూడోసారి ఆ్రస్టేలియా గడ్డపై ‘బోర్డర్–గావస్కర్ ట్రోఫీ’ని సొంతం చేసుకునే లక్ష్యంతో భారత క్రికెటర్లు తమ సన్నాహాలు మొదలు పెట్టారు. బుధవారం మధ్యాహ్నం వెస్టర్న్ ఆ్రస్టేలియా క్రికెట్ అసోసియేషన్ (వాకా) మైదానంలో భారత జట్టు సభ్యులంతా ముమ్మర ప్రాక్టీస్ చేశారు. ఆ్రస్టేలియాలో అనధికారిక టెస్టులు ఆడేందుకు వచ్చిన పలువురు భారత్ ‘ఎ’ జట్టు ఆటగాళ్లు సీనియర్ జట్టు సభ్యులను కలిశారు. ‘కింగ్ కోహ్లి’ బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో తలమునకలై చెమటోడ్చాడు. అతనికి, రిషభ్ పంత్‌కు సిరాజ్, ఆకాశ్‌దీప్‌లు బౌలింగ్ చేశారు. మిగతా బ్యాటర్లు సైతం నెట్స్‌లో శ్రమించారు. అయితే భారత కెపె్టన్ రోహిత్ శర్మ టీమిండియాతో ఇంకా కలవలేదు. అతని భార్య ప్రసవ తేది సమీపిస్తుండటంతో శ్రీమతికి తోడుగా ముంబైలో ఉన్నాడు. కాగా భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్... తొలిటెస్టు కల్లా తమ కెపె్టన్ అందుబాటులోకి వస్తాడని చెప్పాడు. ఆసీస్ మీడియా అసత్య ప్రచారం అభిమానులు, ప్రేక్షకులకు దూరంగా స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తామని టీమిండియాగానీ, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)గానీ చెప్పలేదు. క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ)ను కోరలేదు. అయినా సరే ఆసీస్ మీడియా పనిగట్టుకొని అసత్య కథనాలు ప్రచురిస్తోంది. ‘వాకా’ గ్రౌండ్లో గేట్లు మూసి నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకే భారత ఆటగాళ్లు మొగ్గుచూపారని, అక్కడి భారతీయులకు దూరంగా, వేరెవరిని అనుమతించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసుకున్నారని ‘ది ఆస్ట్రేలియన్’ పత్రిక రాసింది. నిజానికి ‘వాకా’లో నవీకరణ పనులు జరుగుతున్నాయి. ఏడీసీఓ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఈ పనులు చేస్తోంది. ఇది పక్కనబెట్టి సదరు పత్రిక భారత క్రికెటర్లు ‘నో డ్రోన్ ఫ్లయ్ జోన్’ ఏర్పాటు చేసుకున్నారని, సాధారణ ప్రజానీకం, క్రికెట్ అభిమానులెవర్ని అనుమతించడం లేదని, ఫొటోలు, వీడియోలు తీసేందుకు కఠినమైన ఆంక్షలు విధించారని ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.మంగళవారం నుంచి ఆదివారం వరకు భారత జట్టుతో పాటు, అక్కడే ఉన్న భారత్ ‘ఎ’ ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో పాలుపంచుకుంటున్నారు. శుక్రవారం నుంచి సీనియర్ భారత్, ‘ఎ’ జట్ల మధ్య ‘సెంటర్ వికెట్ ట్రెయినింగ్’లో భాగంగా వార్మప్ మ్యాచ్ జరుగనుంది. దీనికి ప్రేక్షకులను అనుమతించాల్సిందిగా భారత జట్టు మేనేజ్మెంట్ కోరింది. -
మళ్లీ విజయాలు అందించడమే లక్ష్యం
న్యూఢిల్లీ: భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంచుకున్న సింధు దాదాపు గత మూడు వారాలుగా అతనితో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె ఆటలో చాలా మెరుగుదల కనిపిస్తోందని, తన షెడ్యూల్ ప్రకారం శిక్షణ కొనసాగుతోందని శ్రీధర్ వెల్లడించాడు. ‘సింధు ఆటలో కొన్ని చిన్న చిన్న లోపాలను సరిదిద్దడంతో పాటు కొన్ని కొత్త విషయాలు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నా. ఇప్పటి వరకు మేం ఒక్క షెడ్యూల్ కూడా తప్పకుండా పక్కా ప్రణాళికతో సాధన చేస్తున్నాం. ఈ మూడు వారాల్లో ఆమె ఆటలో చాలా మార్పు వచ్చింది. అయితే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సింధులో మరిన్ని విజయాలు సాధించాలనే తపన ఉంది. గతంలోకంటే ఇంకా ఎక్కువగా కష్టపడుతోంది. ఈ సాధనతో వచ్చే టోరీ్నల్లో ప్రత్యర్థితో సంబంధం లేకుండా ఆరంభ రౌండ్లలో బాగా ఆడితే ఆ తర్వాత టైటిల్స్ సాధించడం లాంఛనమే అవుతుంది. ఆమె ఆటలో నిలకడ తీసుకొచ్చి మరిన్ని విజయాలు వచ్చేలా చేయడమే నా లక్ష్యం’ అని అనూప్ శ్రీధర్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను తాత్కాలిక కోచ్‌గానే వచ్చాను కాబట్టి ఒక్కో వారం చొప్పున సమీక్ష చేస్తూ కోచింగ్ కొనసాగిస్తున్నానన్న శ్రీధర్... ఇదే కారణంతో సుదీర్ఘ కాలపు ప్రణాళికలు వేయడం లేదని స్పష్టం చేశాడు. సింధు కన్సల్టింగ్ కోచ్‌గా లీ హ్యూన్పారిస్ ఒలింపిక్స్ తర్వాత మరో టోర్నీ ఆడని భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు మళ్లీ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. వచ్చేనెలలో జరిగే ఫిన్లాండ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్లతో పాటు ఆ తర్వాత యూరోప్ సర్క్యూట్లో వివిధ టోరీ్నల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా మాజీ ఆటగాడు లీ హ్యూన్ ఇల్‌ను కన్సల్టింగ్ కోచ్‌గా సింధు ఎంచుకుంది. ఇప్పటికే భారత మాజీ ఆటగాడు అనూప్ శ్రీధర్ సింధు తాత్కాలిక కోచ్‌గా పని చేస్తున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన సింధు ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం పతకం సాధించడంలో విఫలమైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లోనే చైనా ప్లేయర్ బింగ్జియావో చేతిలో ఆమె ఓటమి పాలైంది. అంతకు కొంత కాలం ముందునుంచి కూడా సింధు చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు. 2022లో సింగపూర్ ఓపెన్ గెలిచిన తర్వాత మరే టైటిల్ నెగ్గని సింధు... గత రెండేళ్ల వ్యవధిలో రెండు టోర్నీల్లో రన్నరప్‌గా మాత్రమే నిలవగలిగింది. రియో ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన సమయంలో సింధు కోచ్‌గా ఉన్న పార్క్ సంగ్ కాంట్రాక్ ముగిసి 2023 ఆరంభంలోనే వెళ్లిపోగా... తాత్కాలికంగా ‘సాయ్’ కోచ్ విధి చౌదరితో కలిసి ఆమె పని చేసింది. దిగ్గజ ఆటగాడు హాఫిజ్ హషీమ్‌ను కోచ్‌గా తీసుకున్నా అదీ కొద్ది రోజులకే ముగిసింది. దాంతో బెంగళూరుకు వెళ్లి సింధు... ప్రకాశ్ పడుకోన్ వద్ద పారిస్ ఒలింపిక్స్‌కు సన్నద్ధమైంది. ప్రస్తుత సీజన్ ఇంకా పూర్తి కాకపోగా... కోచ్‌గా పని చేసిన ఆగస్ సాంటోసో కాంట్రాక్ట్ ఒలింపిక్స్‌తోనే ముగిసింది. దాంతో ఈ సీజన్ చివరి వరకు సింధుకు కొత్త కోచ్ అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అటు శ్రీధర్‌తో పాటు ఇటు లీ హ్యూన్తో కలిసి పని చేసేందుకు ఆమె సిద్ధమైంది. వీరిద్దరు డిసెంబర్ 2024 వరకు సింధుకు శిక్షణనిస్తారు. ‘నా కెరీర్ కీలక దశలో అనూప్, లీ హ్యూన్లు కోచ్‌గా రావడం పట్ల సంతోషంగా ఉన్నా. భారత బ్యాడ్మింటన్‌పై అనూప్‌కు ఉన్న అవగాహన, ఆయన వ్యూహాలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. లీ హ్యూన్‌కు అపార అనుభవం ఉండటం నాకు కలిసొచ్చే అంశం. ఆటకు సంబంధించి ప్రతీ విషయంలో ఆయన సూక్ష్మ పరిశీలన నాకు మేలు చేస్తుంది. రాబోయే కొన్ని వారాల పాటు వీరిద్దరితో కలిసి పని చేసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సింధు వ్యాఖ్యానించింది. మాజీ వరల్డ్ నంబర్‌వన్ లీ హ్యూన్ అంతర్జాతీయ ఆటగాడిగా మంచి రికార్డు ఉంది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన అతను సుదిర్మన్ కప్‌లో స్వర్ణం, 3 కాంస్యాలు గెలిచిన... థామస్ కప్‌లో 2 రజతాలు, 2 కాంస్యాలు గెలిచిన కొరియా జట్లలో సభ్యుడు. ఆసియా క్రీడల్లో లీ హ్యూన్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, కాంస్యం గెలవడంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం అందుకున్నాడు. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) లో సింధు జట్టులో సభ్యుడిగా కలిసి ఆడాడు. ఐదేళ్ల క్రితం ఆటకు రిటైర్మెంట్ పలికిన అనంతరం అతను కోచింగ్ వైపు మారాడు. -
India vs Bangladesh: చెన్నైలో జోరుగా సాధన
చెన్నై: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భాగంగా జరుగుతున్న భారత్, బంగ్లాదేశ్ సిరీస్ కోసం ఇరు జట్ల ప్లేయర్లు కసరత్తులు ముమ్మరం చేశారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా గురువారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుండగా.. మంగళవారం టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఇటీవల శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత స్టార్ ఆటగాళ్లు సైతం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబడ్డ నేపథ్యంలో... ఆ దిశగా మరింత సాధన చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లితో పాటు వికెట్ కీపర్ రిషబ్ పంత్, శుబ్‌మన్‌గిల్, యశస్వి జైస్వాల్ నెట్స్‌లో చెమటోడ్చగా... హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించాడు. పలువురు ఆటగాళ్లతో వ్యక్తిగతంగా మాట్లాడిన గౌతమ్ గంభీర్ తగు సూచనలు చేయగా... సహాయక కోచ్‌లు ర్యాన్ టెన్ డస్కటే, అభిõÙక్ నాయర్ ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ముఖ్యంగా పంత్ బ్యాటింగ్‌పై గంభీర్ ప్రత్యేక దృష్టి పెట్టాడు. 2022 డిసెంబర్లో మిర్పూర్లో బంగ్లాదేశ్‌పై మ్యాచ్ తర్వాత పంత్ టెస్టు మ్యాచ్ ఆడనుండటం ఇదే తొలిసారి. చెన్నై పిచ్ తొలుత బ్యాటింగ్‌కు ఆ తర్వాత స్పిన్‌కు అనుకూలించే అవకాశాలున్నాయి. అందుకే నెట్స్‌లో దాదాపు అందరు ఆటగాళ్లు స్పిన్‌ను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టడం కనిపించింది. తొలి టెస్టులో టీమిండియా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్ల కూర్పుతో బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చెన్నైలో గత రెండు వారాలుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్లేయర్లు ఎర్రమట్టి పిచ్‌తో పాటు నల్లమట్టి పిచ్‌పై ప్రాక్టీస్ సాగిస్తున్నారు. -
ముమ్మర సాధనలో...
చెన్నై: టీమిండియా ప్రాక్టీస్‌లో తలమునకలై శ్రమిస్తోంది. బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు కోసం తీవ్రంగా సాధన చేస్తోంది. నిజానికి భారత్ స్థాయితో పోల్చుకుంటే బంగ్లాదేశ్ ఏమంత గట్టి ప్రత్యర్థి కానప్పటికీ... ఇటీవల పాకిస్తాన్లో పర్యటించిన బంగ్లాదేశ్ 2–0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్లో ఎలాంటి ఆదమరుపునకు తావివ్వకుండా భారత ఆటగాళ్లు చెమటోడ్చుతున్నారు. సోమ వారం పూర్తిస్థాయిలో 16 మంది జట్టు సభ్యులంతా ప్రాక్టీస్ చేశారు. కోహ్లి నెట్స్‌లో ఎక్కువసేపు బ్యాటింగ్ చేశాడు. తర్వాత యువ సంచలనం యశస్వి జైస్వాల్ సాధనకు దిగాడు. ఇద్దరు చాలాసేపు వైవిధ్యమైన బంతుల్ని ఎదుర్కొనేందుకు ఆసక్తి చూపారు. భారత స్పీడ్‌స్టర్ బుమ్రా, స్థానిక వెటరన్ స్పిన్నర్ అశ్విన్ వాళ్లిద్దరికి బంతులు వేశారు. బుమ్రా బౌలింగ్‌లో షాట్లు ఆడే ప్రయత్నంలో జైస్వాల్ పలుమార్లు బౌల్డయ్యాడు. ఆ తర్వాత కెపె్టన్ రోహిత్, ఓపెనర్ శుబ్‌మన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్లు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. అనంతపురంలో దులీప్ ట్రోఫీ మ్యాచ్ అయిపోగానే సర్ఫరాజ్ జట్టుతో కలిశాడు. సారథి రోహిత్ శర్మ ప్రధానంగా స్పిన్నర్లను ఎదుర్కోనేందుకు మొగ్గు చూపాడు. చాలాసేపు స్పిన్ బంతులపైనే ప్రాక్టీస్ చేశాడు. రవీంద్ర జడేజా, రిషభ్ పంత్‌లు కూడా త్రోడౌన్ స్పెషలిస్టుల బంతుల్ని ఆడారు. సోమవారంతో భారత్ జట్టు మూడు ప్రాక్టీస్ సెషన్లను పూర్తి చేసుకుంది. మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉండటంతో మరో రెండు సెషన్లు ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో గడపనున్నారు. ముగ్గురు స్పిన్నర్లతో... చెపాక్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం కావడంతో భారత్ ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశముంది. అనుభవజు్ఞలైన అశి్వన్, జడేజాలతో కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో దాదాపు బెర్త్ ఖాయమనిపిస్తోంది. దీంతో బ్యాటింగ్‌లోనూ మెరిపిస్తున్న స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కు ఈ మ్యాచ్‌లో చోటు లేనట్లే! పేసర్ల విషయానికొస్తే బుమ్రాతో సిరాజ్ బంతిని పంచుకుంటాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ రెండు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో తొలి టెస్టు ఎంఎ చిదంబరం మైదానంలో గురువారం నుంచి జరుగుతుంది. బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా... ఆదివారం చెన్నై చేరుకున్న బంగ్లాదేశ్ జట్టు క్రికెటర్లు కూడా సోమవారం నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. పాక్‌ను వారి సొంతగడ్డపై వైట్‌వాష్ చేసి ఊపు మీదున్న బంగ్లాదేశ్... ప్రపంచ రెండో ర్యాంకర్ భారత్‌ను ఓడించడమే లక్ష్యంగా నెట్స్‌లో చెమటోడ్చుతోంది. బ్యాటర్లు లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, మహ్ముదుల్ హసన్, జాకిర్ హసన్, షాద్మన్ ఇస్లామ్‌లు భారీషాట్లపై కసరత్తు చేశారు. త్రోడౌన్ స్పెషలిస్టులపై స్ట్రెయిట్ డ్రైవ్ షాట్లు ఆడారు. స్పిన్నర్లకు కలిసొచ్చే చెన్నై పిచ్‌పై సత్తా చాటేందుకు తైజుల్ ఇస్లామ్, నయీమ్ హసన్‌లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. -
Ind vs SL: ప్రాక్టీస్ సెషన్లో గంభీర్ కోహ్లి.. ఫొటోలు వైరల్
-
ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, ముంబయి ఆటగాళ్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
-
US: అమెరికాలో భక్తి ఇంతలా ఉంటుందా?
అందరి దేశం అమెరికా. ఏ ఒక్క జాతికో మతానికో పరిమితమైన దేశం అనే పరిస్థితి మాత్రం అక్కడ లేదు. నానా జాతులు, భిన్న మతస్తులు, ఎన్నో సంస్కృతుల వారంతా కలిసి అమెరికా సంయుక్త రాష్ట్రాల పేర ఒక ఆధునికమైన దేశాన్ని నిర్మించుకున్నారు. ఒక కొత్త సంస్కృతికి బాటలు వేశారు. అమెరికాలోని యాభై రాష్ట్రాల్లోనున్న జనాభా దాదాపు దాదాపు 33 లేదా 34 కోట్లు మాత్రమే, మన దేశంతో ( 140 కోట్ల పైనే ) పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. యూ ఎస్ జనాభాలో తెల్లవారు దాదాపు 75 శాతం ( వైట్స్ 57, లాటినోస్ 18 ) నల్లవారు 12 శాతం, మిగతా వారు అమెరికా భూమి పుత్రులైన రెడ్ ఇండియన్స్, ఆసియా, ఫసిఫిక్ వగైరా దేశస్తులు. మత పరంగా చూసినప్పుడు 2022 అంచనా ప్రకారం క్రిస్టియన్ ప్రొటెస్టెంట్లు (34 శాతం ) ముందు వరసలో వారి తర్వాతి స్థానం ( 23 శాతం ) క్యాతోలిక్స్ది. యూదులు 2 శాతం కాగా, ఇతర చిన్న మతాల వారు 3 శాతం లేదా ఏ మతంతో సంబంధం లేదు అనేవారు 38 శాతం అమెరికాలో ఏ పట్టణానికి వెళ్లినా, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రముఖమైన అన్ని మతాల ప్రార్థణా మందిరాలు కనబడతాయి. ముఖ్యంగా మెజారిటీ వర్గానికి సంభందించిన చర్చిలకు కొదవ లేదు. అయితే వీటికి రెగ్యులర్‌గా హాజరు అయ్యేవారి సంఖ్య మాత్రం అంతంతేనని చెప్పవచ్చు. ఇక్కడ భక్తులను ఆకర్షించడానికి నిర్వాహకులు ఎన్నో మార్గాలు వెతుకుతున్నారు. అందులో భాగమే ఉచిత వారాంత లంచ్‌లు, వైద్య శిభిరాలు, ఆస్పత్రులు, అనాథ, వృద్ధ ఆశ్రమాలు, విద్యా సంస్థల నిర్వహణ వంటివి. అవి ఏవైనా, ఏ మతం వారు చేసినా "మానవ సేవే మాధవ సేవ"గా భావించి చేసిన కార్యక్రమాలతో పేద వర్గాలకు అంతో ఇంతో మేలు జరుగుతుంది. అమెరికన్ చర్చిల్లో ఎక్కువగా కనబడేవారు అక్కడ స్థిరపడిన చైనా, దక్షిణ కొరియా ,జపాన్, తైవాన్, థాయిలాండ్, వియత్నాం, మెక్సికో, టర్కి, జర్మనీ తర్వాత మనవారు. అమెరికా వైశాల్యంలో భారత్ కన్నా చాలా పెద్ద దేశం. వాళ్లకు భూమి కొరత లేదు. అందుకే అక్కడి ప్రార్థణా స్థలాలు ఏ మతం వారివైనా విశాలమైన ప్రాంగణాల్లో ఉంటాయి. రోడ్ల పక్క, కూడళ్లలో ఎక్కడ ఉచిత స్థలం దొరికితే అక్కడ ప్రార్థణా స్థలాలు నిర్మించడం, మైకులు పెట్టి శబ్ద కాలుష్యం సృష్టించడం వాళ్లకు నచ్చదు. కాకపోతే కరపత్రాలు వేస్తారు, పత్రికల్లో ప్రకటనలు ఇస్తారు, ప్రచార సాహిత్యాన్ని పంచుతారు, ఎలక్ట్రానిక్ మీడియాను వాడుకుంటారు. అమెరికన్ చర్చిల్లో చాలాచోట్ల ఆటస్థలాలు, ప్లే స్కూల్లు, గ్రంధాలయాలు, సమావేశ మందిరాలు ఉంటాయి. ఇక పార్కింగ్ స్థలాల గురించి చెప్పే పని లేదు. ఆ సౌకర్యం లేకుండా వాళ్ళు అలాంటి నిర్మాణాలను అనుమతించకపోవడం విశేషం. క్రైస్తవేతర మతాలయాల విషయంలో హిందువులు, ముస్లింలు, బౌద్దులు ముందున్నారని చెప్పవచ్చు. అమెరికాలోని ఏ రాష్ట్రానికి వెళ్లినా భారతీయులు కనబడుతారు ముఖ్యంగా మన తెలుగువారికి కొదువ లేదు, అదే విధంగా హిందూ దేవుళ్ళు దర్శన మిస్తారు. ఒక అంచనా ప్రకారం ఆ దేశంలో నున్న హిందువుల సంఖ్య దాదాపు రెండున్నర మిలియన్లు. హిందూ ఆలయాల్లో ప్రసిద్ధమైనవి పిట్స్ భర్గ్ వెంకటేశ్వరాలయం, న్యూ జెర్సీ, అట్లాంటా , హ్యూస్టన్‌లోని స్వామి నారాయణ్ అక్షరధాంలు, వెస్ట్ వెర్జినియాలోని బృందావనం, మేరీలాండ్‌లోని శివ విష్ణు ఆలయం, న్యూయార్క్ గణేష, ఇవేకాక మీనాక్షి , హనుమాన్, సాయిబాబా వంటి మందిరాలు మనకు ఎన్నో చోట్ల దర్శనం ఇస్తాయి. హరే కృష్ణ, రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, గురు రవిశంకర్ గారి ఈషా యోగా ధ్యాన కేంద్రాలు, గతంలో ఒక వెలుగు వెలిగిన మహేష్ యోగి, ఓషో వంటి వారివి ఇలా అక్కడ తమ కార్యకలాపాలు సాగించిన భారతీయ ఆధ్యాత్మిక కేంద్రాలు ఎన్నో. ఇలాంటివి భారతీయులు కలుసుకోడానికి, సేవా కార్యక్రమాలు చేపట్టడానికి, పరస్పరం సహాయ సహకారాలు అందించుకోడానికి కూడా ఉపయోగ పడుతున్నాయి. ఈ మందిరాల నిర్వాహకులు భారత్ నుంచి తరచుగా గురువులను, ప్రభోదకులను ఆహ్వానించి పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇలాంటివాటి వల్ల భారత్ నుంచి అమెరికా వెళ్లిన వాళ్లకు కూడా స్వదేశంలో ఉన్న భావన కలగడం సహజం . నేను 2006 మొదలు 2022 వరకు ఒక దశాబ్దంన్నర కాలంలో పదికి పైగా పర్యాయాలు ఒకసారి జంటగా మరోసారి ఒంటరిగా, అమెరికాలోనున్న మా పిల్లలను చూడడానికి వెళ్ళిన ప్రతిసారి ఏవోకొన్ని పర్యాటక ప్రాంతాలను, అక్కడి హైందవ ఆలయాలను దర్శించు కున్నప్పుడు ఆ దేశస్తుల్లో గమనించిన పరమత సహనం ప్రశంసనీయం ! వేముల ప్రభాకర్ (చదవండి: విమానం కన్నా హాయిగా అమెరికాలో బస్సు జర్నీ!) -
భారత్‌లో యూకే, కెనడా సీఏల ప్రాక్టీస్
న్యూఢిల్లీ: భారత్‌లో విదేశీ సీఏలను ప్రాక్టీస్‌కు అనుమతించే అంశం భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉండాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) తెలిపింది. యూకే, కెనడా దేశాలు తమ దగ్గర భారత సీఏలు ప్రాక్టీస్ చేసుకునేందుకు అనుమతిస్తేనే ఆయా దేశాల సీఏలు కూడా ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించేందుకు (రెసిప్రొకల్) అనుమతించవచ్చని పేర్కొంది. యునైటెడ్ కింగ్డం (యూకే), కెనడాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై (ఎఫ్‌టీఏ) జరుగుతున్న చర్చల్లో ఈ అంశం కూడా పరిశీలనలో ఉంది. ఒకవేళ ఇది సాకారమైతే తొలిసారిగా భారత్‌లో విదేశీ చార్టర్డ్ అకౌంటెంట్లు కూడా ప్రాక్టీసు చేసేందుకు వీలవుతుంది. ఆస్ట్రేలియాతో కూడా ఈ తరహా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నట్లు ఐసీఏఐ కొత్త ప్రెసిడెంట్ రంజిత్ కుమార్ అగర్వాల్ తెలిపారు. రెసిప్రోకల్ సిస్టమ్ అమల్లోకి వచ్చాక విదేశీ సీఏలు భారత్‌లో కార్యకలాపాల నిర్వహణ కోసం ఐసీఏఐలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. యూకే, కెనడా, ఆ్రస్టేలియా మొదలైనవి అభివృద్ధి చెందిన దేశాలని, అక్కడి వారిని ఇక్కడ అనుమతిస్తే, ఇక్కడి సీఏలు కూడా అక్కడికి వెళ్లడానికి వీలుంటుందని అగర్వాల్ పేర్కొన్నారు. వర్ధమాన దేశమైన భారత్ సీఏలు అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లే అవకాశం లభించడం వల్ల మనవారికి ప్రయోజనకరంగా ఉండగలదని చెప్పా రు. సామర్థ్యాలు, అనుభవం కారణంగా భారతీయ సీఏలకు విదేశాల్లో గణనీయంగా డిమాండ్ ఉందన్నారు. మరోవైపు, స్థూల దేశీయోత్పత్తిలో పన్ను వాటాల నిష్పత్తిని మెరుగుపర్చేందుకు కేంద్రానికి సిఫార్సులు చేయనున్నట్లు అగర్వాల్ తెలిపారు. అటు కృత్రిమ మేథ (ఏఐ) వినియోగంతో సీఏలకు గణనీయంగా సమయం ఆదా కాగలదని చెప్పారు. ప్రస్తుతం 42,000 మంది పైచిలుకు భారతీయ సీఏలు విదేశాల్లో పని చేస్తున్నారు. ఐసీఏఐ అంచనా ప్రకారం వచ్చే 20–25 ఏళ్లలో 30 లక్షల మంది పైగా చార్టర్డ్ అకౌంటెంట్లు అవసరమవుతారు. ఐసీఏఐలో ప్రస్తుతం 4 లక్షల మంది సభ్యులు, 8.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. -
మంచుతో నిప్పు పుట్టించవచ్చా? అదెలా సాధ్యం?
నిప్పు- నీరు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి. నిప్పు ఉన్న చోట నీరు ఉండదు. నీరు ఉన్న చోట నిప్పు ఉండలేదు. అయితే ఐస్‌తో కూడా నిప్పు పెట్టొచ్చని చెబితే నమ్ముతారా? సైన్స్ సహాయంతో ఈ అద్భుతం ఎలా జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం. సైన్స్ చేసే ఈ అద్భుతం 6వ తరగతి పుస్తకంలో దాగి ఉంది. ఈ ప్రయోగం కుంభాకార లెన్స్ చుట్టూ తిరుగుతుంది. లెన్స్ ఉపయోగించి సూర్యకాంతి సహాయంతో నిప్పును మండించడాన్ని మీరు చూసే ఉంటారు. మంచుతో నిప్పును పుట్టించే ప్రయోగం కూడా ఇలానే సాగుతుంది. మంచుతో నిప్పు పుట్టించాలంటే ముందుగా పారదర్శక మంచు అవసరం. ఈ పారదర్శక మంచు ముక్క కుంభాకార లెన్స్ మాదిరిగా పని చేస్తుంది. ఈ మంచు ముక్క నుంచి సూర్యకాంతిని బయటకు ప్రసరింపజేసి, అది కాగితంపై పడేలా చేస్తే, కొంత సమయం తరువాత ఆ కాగితం నుండి పొగ రావడం ప్రారంభమవుతుంది. తరువాత కాగితంపై మంటలు వ్యాపించడాన్ని గమనించవచ్చు. మంచును కుంభాకార లెన్స్‌గా ఉపయోగించి, మంటలను పుట్టించవచ్చని తెలుసుకున్నాం. అయితే మంచును కుంభాకార లెన్స్‌గా ఎలా తయారు చేయాలనే ప్రశ్న ఎదురవుతుంది. ఇందుకోసం ముందుగా పారదర్శక మంచు ముక్కను తీసుకోవాలి. చాకు సాయంతో ఆ మంచుకు లెన్స్ ఆకారాన్ని ఇవ్వాలి. తర్వాత చేతులతో రుద్ది లెన్స్ మాదిరిగా తయారు చేయాలి. లెన్స్ ఎంత పెద్దదిగా ఉంటే నిప్పు అంత ప్రకాశవంతంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. లెన్స్ మందం 2 అంగుళాలు, వ్యాసం 6 అంగుళాలు ఉంటే అప్పుడు నిప్పు వేగంగా వ్యాపిస్తుంది. -
సరైన ఆచరణతోనే సంపద సృష్టి!
సంపద సృష్టికర్తల్లో ఎవరి జీవితాన్ని పరిశీలించి చూసినా.. సమయానికి ఎంతో ప్రాధాన్యత కనిపిస్తుంది. ప్రణాళిక, ఆచరణ, క్రమశిక్షణ కనిపిస్తాయి. సంపద సృష్టించాలంటే కాలం విలువ తెలిసి ఉండాలి. ఇవాళ కాకపోతే రేపు, ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది ఇలాంటి ధోరణి అస్సలు పనికిరాదు. దీనివల్ల కేలండర్లో సంవత్సరాలు మారుతుంటాయే కానీ, ఆశించిన ఫలితాలు కానరావు. కొత్త సంవత్సరం తనకు అనుకూలంగా ఉండాలని, అనుకున్నవి సాధించాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఆచరణ లోపంతో దానికి దూరంగా ఉండిపోతుంటారు. అన్నీ ఒకేసారి సాధించేద్దామని అనుకుంటే, ఫలితాలు ఆలస్యం అవుతాయి. అందుకుని ప్రణాళిక మేరకు అడుగులు వేయాలి. నూతన సంవత్సరంలో ఏం సాధించాలనుకుంటారో, అవి వాస్తవికంగా ఉండాలి. అప్పుడే చక్కని ఫలితాలు కనిపిస్తాయి. ఏడాది కాలానికి కార్యాచరణ ప్రణాళిక అంటే, అందుకు తగినంత సమయం కేటాయించాలి. సంపద సృష్టించాలనే ఆకాంక్ష కలిగిన వారు కొత్త సంవత్సరంలో ఆ దిశగా అమల్లో పెట్టాల్సిన ఆచరణ ఎలా ఉండాలో నిపుణులు తెలియజేస్తున్నారు. మనీ ఒక్కటేనా..? అందరికీ ధనం కావాల్సిందే. అందులో సందేహం లేదు. కానీ, మనిషి ఎప్పుడూ డబ్బు చుట్టూ పరుగెత్తడం సరైనది అనిపించుకోదు. తండ్రి లేదా తల్లి కావచ్చు. కుమారుడు లేదా కుమార్తె కావచ్చు. జీవిత భాగస్వామి, స్నేహితులు, సహోద్యోగులు, శ్రేయోభిలాషులు.. ఇలా మన చుట్టూ పెద్ద ప్రపంచమే ఉంది. దాన్ని కూడా పట్టించుకోవాలి. సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపూ అవసరమే. మనీ లైఫ్‌తోపాటు ఇతరత్రా అన్నీ మేళవించినప్పుడే నిజమైన ఆనందం లభిస్తుంది. అస్తమానం డబ్బు గురించే ఆలోచిస్తూ, వేదన చెందుతుంటే అదొక వైరల్ వ్యాధిగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే జీవితంలో అన్నింటికీ సమతుల్యత అవసరం. దీర్ఘ ప్రయాణం సంపద సృష్టించడం అన్నది ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకున్నంత ఈజీ కాదు. అదొక దీర్ఘకాలిక పరుగు. దశాబ్దాల పాటు స్థిరమైన పెట్టుబడులతో సాగిపోయేది. ప్రణాళిక మేరకు అడుగులు వేసేది. కొత్త సంవత్సరంలో సంపద సృష్టికి బీజం వేసుకోవాలే కానీ, సంపద సృష్టిని ఏడాదిలోనే సాధించేయాలంటే అది ఆచరణసాధ్యం కాదు. క్రమం తప్పకుండా ఆదాయం నుంచి పొదుపు చేస్తూ, ఆ పొదుపును ఏటా పెంచుకుంటూ, మెరుగైన రాబడినిచ్చే సాధనాల్లోకి పెట్టుబడిగా మళ్లిస్తూ సాగిపోవాల్సిన సుదీర్ఘ ప్రయాణం. కనుక షార్ట్ కట్స్, ఇన్స్టంట్స్ అంటూ ఇందులో దారులు వెతుక్కోవడం వల్ల ఫలితం ఉండదు. ఎంత వీలైతే అంత మొత్తంతో మొదట పెట్టుబడిని ఆరంభించాలి. దాన్ని కొనసాగించాలి. సంపద అంటే..? సంపద అంటే డబ్బు, బంగారం, పెట్టుబడులు, ప్రాపరీ్టలే కాదు. మంచి ఆరోగ్యం కూడా గొప్ప సంపదే అవుతుంది. సంపద కోసం ఆరోగ్యం పాడు చేసుకుంటే, ఆ తర్వాత అదే సంపదతో ఆరోగ్యం కొనుక్కుందామంటే సాధ్యపడకపోవచ్చు. ఆరోగ్యంగా ఉంటేనే సంపద సృష్టి కోసం సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించగలరు. తద్వారా మరింత సంపదను సమకూర్చుకోగలరు. అనారోగ్యకర అలవాట్లను విడిచి పెట్టాలి. ఆరోగ్యకరమైన, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. యోగ, మెడిటేషన్, వ్యాయామాలు వంటి వాటికి రోజూ కొంత సమయం కేటాయించాలి. ఆదాయం.. వ్యయం.. ఆదాయం కంటే వ్యయానికి ఆర్థిక శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది ఎలాంటి ప్రణాళిక లేకుండా ఖర్చు చేస్తుంటారు. మంచి డిస్కౌంట్ ఆఫర్లు కనిపించిన వెంటనే కొనుగోలు చేస్తుంటారు. క్రెడిట్ కార్డ్‌పై చాలా తక్కువకే వస్తుందని కొనుగోలు చేస్తుంటారు. ఇవన్నీ విక్రయాలు పెంచుకోవడానికి కంపెనీలు చేసే మార్కెటింగ్ వ్యూహాలు. వాటి ఆకర్షణలో పడకుండా చూసుకోవాలి. సంపద సృష్టించాలనే పట్టుదల ఉన్న వారు మొదట వ్యయాలపై అదుపు సాధించాలి. వస్తున్న ఆదాయంలో వ్యయాలను 60–80 శాతానికి మించకుండా అదుపు చేసుకోవాలి. ఎంత సంపాదించామన్నది కాకుండా, ఎంత పొదుపు చేశామనే తత్వంతో ముందుకు సాగాలి. అవసరాలకే కొనుగోళ్లు పరిమితం కావాలి. అంటే ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, కిరాణా, పాలు, కూరగాయలు, యుటిలిటీ బిల్లులు ఇవన్నీ అవసరాలు. రెస్టారెంట్లో తినడం, సినిమాలు, టూర్లు ఇవన్నీ కోరికలు. వెసులుబాటు ఉంటేనే కోరికలకు బడ్జెట్లో కేటాయింపులు చేయాలి. అవసరాలు, కోరికలకు కేటాయింపుల తర్వాత కూడా ఆదాయంలో 40 శాతాన్ని పెట్టుబడిగా మళ్లించారంటే సంపద సృష్టి అనుకున్నదానికంటే ముందే సాధ్యపడుతుంది. సరైన సాధనాలు సంపాదనలో పొదుపుతోనే ఆగిపోకూడదు. ఆ పొదుపు మదుపుగా మారినప్పుడే సంపద సాధ్యపడుతుంది. ఈ మార్గంలో ఎంపిక చేసుకునే పెట్టుబడి సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి. జీవిత బీమా ఎండోమెంట్ ప్లాన్లు, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లను పెట్టుబడి సాధనాలుగా చూడకూడదు. ద్రవ్యోల్బణం తరుగు తీసిన తర్వాత ఈ సాధనాల్లో మిగిలేదీ ఏమీ ఉండదు. రాబడితోపాటు, అవసరమైనప్పుడు నగదుగా మార్చుకునే లిక్విడిటీ కూడా మెరుగ్గా ఉండాలి. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ మేలైనవి. వీటితోపాటు వెసులుబాటును బట్టి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈక్విటీలతోపాటు, రియల్ఎస్టేట్, బంగారం దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని తెచ్చి పెట్టినట్టు గణాంకాలు చెబుతున్నాయి. పెట్టుబడుల్లో స్థిరత్వం కోసం కొంత డెట్ సాధనాలకూ చోటు ఇవ్వొచ్చు. గ్యారంటీడ్ రాబడి అనే ఉత్పత్తుల ఆకర్షణలో పడొద్దు. పన్ను ఆదా కోరుకునే వారు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్పీఎస్ వంటి పథకాలను పరిశీలించొచ్చు. పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం, రుణంపై ఇల్లు కొనుగోలు చేస్తే, అసలు, వడ్డీపైనా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో వేలాది పథకాలున్నాయి. నిపుణుల సాయంతో నాలుగైదు పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. ఫండ్స్‌లో ఎన్‌ఎఫ్‌వోల కంటే ట్రాక్ రికార్డు ఉన్న పథకాలను ఆశ్రయించడమే మెరుగైనది అవుతుంది. లిస్టింగ్ రోజున లాభాల కాంక్షతో ఐపీవోను ఎంపిక చేసుకోవద్దు. మంచి కంపెనీ, ఆకర్షణీయమైన వ్యాల్యూషన్లలో వస్తే దీర్ఘకాలానికి ఐపీవో మార్గంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు లిస్టింగ్‌లో లాభం వస్తే విక్రయించుకోవచ్చు. రాకపోతే పెట్టుబడిని కొనసాగించుకోవచ్చు. ఇతరులను అనుసరించడం ట్రేడింగ్‌తో రోజులో రూ.10వేలు, రూ.లక్ష సంపాదించుకోవచ్చనే ప్రకటనలు చూసి మోసపోవద్దు. తాము నేరి్పంచే స్ట్రాటజీతో ట్రేడింగ్‌లో రూ.లక్షలు సంపాదించొచ్చనే సోషల్ మీడియా ప్రకటనలకు ఆకర్షితులు కావొద్దు. స్వీయ అధ్యయనంతో పెట్టుబడి సాధనాలను అర్థం చేసుకోవాలి. లేదంటే ఫైనాన్షియల్ ప్లానర్లు లేదా అడ్వైజర్ల సాయం తీసుకోవాలి. సంపన్న ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోని అనుకరించడం సరికాదు.తోటి ఇన్వెస్టర్ల సలహా, సూచనలను గుడ్డిగా అనుసరించొద్దు. ప్రతి ఇన్వెస్టర్ రిస్క్, ఆకాంక్షలు వేర్వేరుగా ఉంటాయి. ఆర్థిక రక్షణ మెరుగైన కవరేజీతో కుటుంబం అంతటికీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మొదట చేయాల్సిన పని. దీనివల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, పొదుపు, పెట్టుబడులకు విఘాతం కలగకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీతో గట్టెక్కొచ్చు. నలుగురు సభ్యుల కుటుంబానికి కనీసం రూ.10 లక్షల కవరేజీ, అపరిమిత రీస్టోరేషన్ సదుపాయంతో తీసుకోవాలి. ఇక అనుకోనిది జరిగితే కుటుంబం ఆర్థిక కష్టాల పాలు కాకుండా ఉండేందుకు, మెరుగైన కవరేజీతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకోవాలి. కనీసం 20 ఏళ్ల కుటుంబ అవసరాలను తీర్చే స్థాయిలో కవరేజీ ఉండాలి. ప్రమాదం కారణంగా ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసే కవరేజీ కూడా ఉండాలి. ఇంటికి, ఇంట్లోని విలువైన వాటికి బీమా ప్లాన్ తీసుకోవాలి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా కనీసం ఆరు నెలల అవసరాలను తీర్చే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. రాబడి ఒక్కటే కాదు.. పెట్టుబడి కోసం ఎంపిక చేసుకునే సాధనం విషయంలో రాబడి ఒక్కటే ప్రామాణికం కాకూడదు. సంబంధిత ఉత్పత్తిలో ఉండే రిస్‌్కను కూడా మదింపు వేయాలి. తమ రిస్క్ సామర్థ్యానికి తగినట్టుగానే ఉందా? అని విశ్లేషించుకోవాలి. ఉదాహరణకు 2020 మార్చి కరోనా విపత్తు సమయంలో ఈక్విటీ మార్కెట్ 40 శాతానికి పైగా పతనమైంది. విడిగా కొన్ని స్టాక్స్ 80–90 శాతం వరకు పడిపోయాయి. అలాంటి సమయాల్లో పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోతుంది. ఆ నష్టాన్ని చూసి భయపడిపోకూడదు. ఈక్విటీలకు ఆటుపోట్లు సహజం. కాలవ్యవధి అనేది సాధనాలను ఎంపిక చేసుకోవడానికి కీలకం. ఆటుపోట్లు ఎదురైనా, ధైర్యంగా కొనసాగించే వారే వీటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీల్లో అస్థిరతలు ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో మెరుగైన రాబడి వస్తుంది. రిస్క్ వద్దనుకుంటే, రాబడిలో రాజీపడి డెట్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తప్పులకు దూరంగా.. పెట్టుబడుల్లో వీలైనంత వరకు తప్పులకు చోటు లేకుండా చూసుకోవాలి. అయినా కానీ తప్పులు జరగవన్న గ్యారంటీ ఏమీ ఉండదు. ఫండ్ మేనేజర్లు సైతం తమ ప్రయాణంలో తప్పులు చేస్తుంటారు. కాకపోతే చేసిన తప్పును వేగంగా గుర్తించి, దాన్ని సరిదిద్దుకోవడం తెలియాలి. ఫండ్స్‌లో మానవ తప్పిదాలకు చోటు లేకుండా ఉండాలంటే ఇండెక్స్ ఫండ్స్ ఉత్తమమైనవి. నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే వారు ఎంతో ఆచితూచి వ్యవహరించాలి. మెరుగైన స్ట్రాటజీ, చక్కని అవగాహన, స్థూల ఆర్థిక అంశాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వ, ఆర్బీఐ పాలసీలు, కరెన్సీ మారకం తదితర ఎన్నో అంశాలను వేగంగా అర్థం చేసుకునే నైపుణ్యాలు అవసరం. అంత సమయం లేకపోతే ఆ భారం ఫండ్ మేనేజర్లపై వేయాలి. లక్ష్యం.. ప్రణాళిక ప్రతి లక్ష్యానికీ విడిగా ప్రణాళిక అవసరం. సొంతిల్లు, కారు, రిటైర్మెంట్, పిల్లల విద్య, వివా హం ఇవన్నీ అందరికీ ఉండే ముఖ్యమైన భవిష్యత్ లక్ష్యాలు. తమ ఆదాయం నుంచి విడిగా ఒక్కో దానికి ఎంత చొప్పున కేటాయిస్తే, వాటిని చేరుకోవచ్చన్న దానికి స్పష్టత ఉండాలి. అవసరమైతే ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకోవాలి. రుణాలు–చెల్లింపులు తప్పనిసరి అయితేనే రుణం తీసుకోవాలి. తీసుకుంటే దాన్ని తీర్చివేయడానికే మొదట ప్రాధాన్యం ఇవ్వాలి. రుణ చెల్లింపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైఫల్యం లేకుండా చూసుకోవాలి. నామినేషన్ చివరిగా అన్ని ఆర్థిక సాధనాలకూ నామినేషన్ ఇవ్వడం తప్పనిసరి. బ్యాంక్ ఖాతాలు, మ్యూచువల్ ఫండ్స్, బీమా పథకాలు, డీమ్యాట్ ఖాతాలు, ఈపీఎఫ్ ఇలా ప్రతి సాధనానికీ నామినేషన్ లేకపోతే వెంటనే నమోదు చేయాలి. మార్గమిది... లక్ష్యాల్లో వాస్తవికత: జనవరి 1 నుంచే రోజూ 5 కిలోమీటర్ల నడక లేదా పరుగు ఆచరణలో పెట్టాలని కోరుకోవచ్చు. మొదటి రోజే 5 కిలోమీటర్లు సాధ్యం కానప్పుడు ఒక కిలోమీటర్‌తో ఆరంభిస్తే, క్రమంగా కొన్ని రోజుల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు. సామర్థ్యాలకు తగినట్టుగా కార్యాచరణ అవసరం. ఎంత వీలైతే, అంత మొత్తంతో ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించాలి. స్థిరత్వం: పెట్టుబడుల ప్ర పంచంలో ప్రేరణ కంటే స్థిర త్వానికే ప్రాముఖ్యం ఇస్తారు. ప్రేరణ అనేది కొన్ని రోజులు, నెలల పాటే ఉండొచ్చు. కానీ, స్థిరత్వం అన్నది విజయానికి కీలకం . ఇన్స్టంట్ సక్సెస్: స్వల్ప కాలంలో సంపద పోగేయాలన్నట్టుగా కొందరు ఇన్వెస్టర్ల ధోరణి ఉంటుంది. కానీ, జీవితం అందరికీ ఒకే విధంగా నడవదు. ఫలితాలకు తగినంత వ్యవధి ఇచి్చనప్పుడే సాధన సులభమవుతుంది. ఇక్కడ ఓపిక, క్రమశిక్షణ, అంకితభావం కీలకం అవుతాయి. కృషి: ‘కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులు అవుతారు’అని ఓ సినీ కవి చెప్పినట్టు.. చేసుకున్న తీర్మానాలను విజయవంతంగా చేరుకోవడం కంటే కూడా, దాన్ని సాధించడానికి మీరు చేసిన ప్రయత్నాలు, కృషి ఇక్కడ కీలకం అవుతాయి. ప్రతి నెలా ఆదాయంలో 50 శాతాన్ని ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ, అది సాధ్యం కావ డం లేదని దాన్ని పక్కన పెట్టేయడం విజయానికి చేరువ చేయదు. కనీసం 20–30–40 శాతం మేర అయినా ఆదాతో మొదలుపెట్టి, ఆ తర్వాత దాన్ని మరింత పెంచుకోవచ్చు. ఆర్థిక అంశాలపై పట్టు: ఆర్థికంగా విజయం సాధించాలని కోరుకునే వారికి అందుకు సంబంధించి ప్రాథమిక అంశాలు తప్పకుండా తెలిసి ఉండాలి. ఆర్థిక అంశాలను అర్థం చేసుకోవడం, వాటిని అమలు చేయడం, వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణ, బడ్జెట్, పొదుపు, పెట్టుబడులు, రుణాలు వీటన్నింటి గురించి తెలియాలి. ఆర్థిక, పెట్టుబడి సూత్రాలపై అవగాహన ఉండాలి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఈల్డ్స్ తెలిసి ఉండాలి. -
విశాఖలో భారత్ టి20 టీం ప్రాక్టీస్ (ఫొటోలు)
-
భారతీయ వైద్య విద్యార్థులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ: భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ గుడ్ న్యూస్ అందించింది. ఇకపై భారత్‌లో మెడికల్ గ్రాడ్యూయేట్ పూర్తి చేసిన విద్యార్థులు విదేశాల్లో కూడా ప్రాక్టిస్ చేయోచ్చని పేర్కొంది. ఈ మేరకు రల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యూకేషనల్ (WFME) నుంచి జాతీయ వైద్య మండలి (NMC) పది సంవత్సరాల వరకు గుర్తింపు పొందింనట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ గుర్తింపుతో భారత్‌లో వైద్య విద్యనభ్యసించిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్ చేయవచ్చు. 2024 నుంచి భారతీయ వైద్య విద్యార్థులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వెసులుబాటుతో ఇప్పటికే దేశంలో ఉన్న 706 మెడికల్ కాలేజీలతోపాటు రాబోయే 10 ఏళ్లలో కొత్తగా ఏర్పాటు చేయబోయే కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు పొందనున్నాయి. దీని వల్ల దేశంలో వైద్య విద్య ప్రమాణాలు మెరుపడటమే కాకుండా భారతీయ వైద్య విద్యార్థులకు ప్రపంచ వ్యాప్తంగా అపార అవకాశాలు లభించనున్నాయి ఈ సందర్భంగా ఎన్ఎమ్సీలోని ఎథిక్స్ అండ్ మెడికల్ రిజిస్ట్రేషన్ బోర్డు సభ్యుడు యోగేందర్ మాలిక్ మాట్లాడుతూ.. WFME గుర్తింపుతో భారతీయ వైద్య విద్య అంతార్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. దీనివల్ల భారతీయ వైద్య కళాశాలలకు, నిపుణులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. భారతీయ విద్యార్థులు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీన్‌ను కొనసాగించవచ్చని తెలిపారు. ఎన్ఎమ్సీ అంతర్జాయంగా గుర్తింపు పొందడం ద్వారా విదేశీ విద్యార్థులను భారత వైద్య కళాశాలు ఆకర్షిస్తాయని చెప్పారు. కాగా డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ అనేది ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన వైద్య విధ్యను అందించేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ సంస్థ. డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు ప్రక్రియ కోసం ప్రతి వైద్య కళాశాల నుంచి 60 వేల డాలర్లు రుసుము వసూలు చేస్తోంది. దీంతో దేశంలోని 706 వైద్య కళాశాలలు డబ్ల్యూఎఫ్‌ఎమ్‌ఈ గుర్తింపు కోసం మొత్తంగా సుమారు 4,23,60,000 డాలర్లు ఖర్చు చేయనుంది. చదవండి: గణతంత్ర వేడుకలకు బైడెన్!.. ఆహ్వానించిన ప్రధాని మోదీ -
నేటి నుంచి వైజాగ్ ఓపెన్ గోల్ఫ్
విశాఖ స్పోర్ట్స్: ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఇండియా(పీజీటీఐ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి ‘వైజాగ్ ఓపెన్ గోల్ఫ్ 2023’ ప్రారంభం కానుంది. ప్రొఫెషనల్ గోల్ఫ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో పీజీటీఐ టోర్నీలు నిర్వహిస్తుండగా, విశాఖ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. తొలి రోజు ప్రాక్టీస్ రౌండ్స్ రెండో రోజు ప్రోటోర్నీ జరగనున్నాయి. 20 నుంచి 23వ తేదీ వరకు నాలుగు రౌండ్ల పాటు స్ట్రోక్ ప్లే ప్రధాన టోర్నీ జరగనుంది. ఈ సందర్భంగా ఆదివారం క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ప్రోటోర్నీని వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ప్రారంభించనుండగా.. విజేతలకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి బహుమతులు అందించనున్నారన్నారు. భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన మేటి గోల్ఫర్స్ 126 మంది ఈ టోర్నీలో పాల్గొననున్నారని తెలిపారు. ఈ టోర్నీలో సత్తాచాటిన వారు ప్రైజ్‌మనీ పొందటంతో పాటు తమ ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు, అంతర్జాతీయ టోర్నీలో అర్హత సాధించేందుకు దోహదపడుతుందని వివరించారు. యూరోస్పోర్ట్స్, సోషల్ మీడియా, దూరదర్శన్ చానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుందన్నారు. 1984లో నిరి్మంచిన ఈపీజీసీ ఉత్తమ పునఃనిర్మాణ గోల్ఫ్‌కోర్స్‌గానూ గతేడాది అవార్డు అందుకుందని చెప్పారు. -
మీ బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలంటే.. ఇలా చేయండి..
సాధారణంగా యంగ్‌గా ఉన్నప్పుడు ఉన్నంత జ్ఞాపకశక్తి కాస్తా.. ఉండగా, ఉండగా..అంటే వృద్ధాప్యంకి చేరవయ్యేటప్పటికీ తగ్గిపోతుంది. అలా ఎందువల్ల జరగుతుందని, శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లుగా పరిశోధనాలు చేస్తూ వచ్చారు. ఆ దిశలో ఎంతవరకు పురోగతి సాధించారో తెలియదు గానీ ..వారి అధ్యయనంలో అలా బ్రెయిన్ చురుకుదనం తగ్గిపోకుండా మునుపటిలా షార్ప్‌గా ఉండేలా ఏం చేయాలో కనుగొన్నారు. దీంతో వృద్ధాప్యంలో ఎదురయ్యే బ్రెయిన్‌కి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు అంటున్నారు. అందుకు కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే చాలు మంచి జ్ఞాపకశక్తి మీ సొంతం అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మేరకు వారు 70ల వయసు ఉన్న కొందరూ వృద్ధులపై పరిశోధనలు జరిపారు. వారందరికి ఒకేసారి వారికి ఇష్టమైన రంగాల్లో నైపుణ్యం సంపాదించేలా ట్రైనింగ్ ఇచ్చారు. వారంతా వారానికి 15 గంటలు హోంవర్క్ చేయడం, తరగతి గదుల్లో కూర్చోవడం వంటివి చేశారు. వారు కొత్తభాషలు, ఫోటోగ్రఫీ, వంటి ఇతరత్రా సృజనాత్మక కోర్సులను అభ్యసించడం వంటివి చేశారు. ఆ క్రమంలో వారికి తెలయకుండానే వారి మొదడు 30ల వయసులో ఉండే వారి బ్రెయిన్ మాదిరిగా షార్ప్‌గా ఉండటం గమనించారు. వారి చిన్నప్పటి జ్ఞాపకాలతో సహాఅన్ని చెబుతుండటం. ఠక్కున దేని గురించి అయినా చెప్పేయడం వంటివి జరిగాయి. దీంతో వారు మెదడును ఖాళీగా ఉంచకుండా మంచి వ్యాపకాలతోనే మనకి ఇష్టమైన అభిరుచిలతో బిజీగా ఉండేలా చేయడం చేస్తే.. మన మెదడులో పిచ్చిపిచ్చి ఆలోచనల ప్రవాహం తగ్గి చురుగ్గా ఉండటం ప్రారంభిస్తుందని అన్నారు. అలాగే ఎప్పటికప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించడం అనేది మీ మెదడుకు ఓ వ్యాయామంలా ఉండటమేగాక మీలో దాగున్న స్కిల్స్ బయటకు వస్తాయి. పైగా మీ బ్రెయిన్ కూడా ఆరోగ్యంగా ఉండి యువకుల్లో ఉండే మాదిరిగా చురుగ్గా బ్రెయిన్ ఉంటుందన్నారు. (చదవండి: అంతుతేలని ఇద్దరి యువతుల మిస్టరీ గాథ..చంపేశారా? మరణించారా!..) -
తప్పుడు వీడియో షేర్ చేస్తావా? అంటూ మహిళా అథ్లెట్‌పై కోచ్ భార్య దాడి
కర్ణాటక: కోచ్ భార్య మహిళా అథ్లెట్‌పై దాడి చేసిన ఘటన బెంగళూరులో జరిగింది. బిందురాణి అనే అథ్లెట్ ప్రాక్టీస్ కోసం కంఠీరవ స్టేడియం వెళ్లారు. అక్కడ శ్వేత అనే మహిళ బిందురాణిని నోటికొచ్చినట్లు తిట్టి చేయి చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. కోచ్‌ల గ్రూప్‌లో ప్రైవేట్ కార్యక్రమం వీడియోను బిందు షేర్ చేసిందని, తప్పుడు వీడియోను షేర్ చేస్తావా అంటూ కోచ్ యతీశ్ భార్య శ్వేత దాడి చేసినట్లు తెలిసింది. ఆమైపె తాను అథ్లెటెక్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు బిందురాణి తెలిపింది. -
హీహీహీ... హాహ్హాహ్హా అంతే!
నవ్వు ఆరోగ్యానికి మంచిదని మనందరికి తెలుసు. తీరికలేని లైఫ్‌స్టైల్, బాధ్యతలు, బరువులతో నవ్వడం కూడా మర్చిపోతున్నాం. ఇది చాలదన్నట్లు రెండేళ్లపాటు ప్రపంచాన్ని శాసించిన కరోనా పుణ ్యమా... ముఖానికి మాస్కుల తాళం పడింది. శానిటైజర్లు ఆవిరైపోయినట్లే ముఖాల మీద నవ్వులు మాయ మయ్యాయి. ఇప్పుడు చాలామందికి చక్కగా నవ్వడం ఎలాగో తెలియడం లేదు. ఈ జాబితాలో జపాన్ వాసులు ముందు వరుసలో ఉన్నారు. గత కొద్దికాలంగా నవ్వడం మర్చిపోయిన జపనీయులు ప్రస్తుతం నవ్వులు ్రపాక్టీస్ చేయడం కోసం కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. ఇది కాస్త చిత్రంగా, మనకు నవ్వొస్తున్నా సరే... హహ్హా నవ్వుల కోసం వారు తెగ హడావుడి చేస్తున్నారు. నవ్వు ఆరోగ్యమేగాక, నవ్వడం వల్ల ముఖ కండరాలకు మంచి వ్యాయామం జరిగి ముఖం మరింత గ్లోగా కనిపిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఎక్కడైనా పని లేదా ఉద్యోగం చేయాలన్నా ముఖం మీద చిరునవ్వు తప్పనిసరి. దానితోనే నలుగురితోపాటు ముందుకు సాగగలం. ఇదే విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జపనీయులు శ్రద్ధగా నేర్చుకుని మరీ నవ్వుతున్నారు. అక్కడి స్మైలింగ్ కోచింగ్ సెంటర్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. కోవిడ్ ఆంక్షలు, కొన్ని రకాల ఫ్లూల వల్ల దాదాపు మూడేళ్లపాటు మాస్కులు ధరించిన జపనీయులు నవ్వడం మర్చిపోయారు. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం ఆంక్షలు సడలించడంతో ‘స్మైలింగ్ లెసన్స్’ నేర్చుకుంటున్నారు. చక్కగా నవ్వేందుకు ఏకాగ్రతతో పాఠాలు వింటున్నారు. ఒక్కో స్మైలింగ్ ట్రైనర్ దగ్గర మూడు వేలమంది క్లాసులకు హాజరవుతున్నారంటే అక్కడి డిమాండ్ ఏంటో తెలుస్తోంది. హాలీవుడ్ స్మైల్... గతంలో రేడియో హోస్ట్‌గా పనిచేసిన కైకో క్వానో స్మైలింగ్ ఇన్స్టిట్యూట్ను నడుపుతున్నారు. ‘‘హాలీవుడ్ స్టైల్ స్మైలింగ్ టెక్నిక్’’ను నేర్పించడం ఈమె ప్రత్యేకత. కళ్లను నెలవంకలా తిప్పి, బుగ్గలను గుండ్రంగా పెట్టి పై దవడలోని ఎనిమిది దంతాలు కనిపించేలా నవ్వడమే హాలీవుడ్ స్మైల్. ప్రస్తుతం జపనీస్ విద్యార్థులు ఈ నవ్వుని ఎగబడి నేర్చుకుంటున్నారు. ‘‘విద్యార్థులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో మా దగ్గర క్లాసులు చెప్పించుకుంటున్నారు. భవిష్యత్‌లో చేయబోయే ఉద్యోగాలకు నవ్వు ముఖ్యమని వారంతా క్లాసులకు హాజరవుతున్నారు. స్మైల్ ఎడ్యుకేషన్ గతంలోకంటే ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగింది. ఒక్కోక్లాసుకు మన రూపాయల్లో సుమారు రూ.4,500 తీసుకుంటున్నాము. నవ్వుతూ ఎవరిని పలకరించినా అ΄్యాయంగా దగ్గరవుతారు’’ అని క్వానో చెబుతోంది. నవ్వితే ముత్యాలేమీ రాలిపోవు, నాలుగు రకాలుగా మంచే జరుగుతుంది కాబట్టి మనం కూడ మనసారా నవ్వుదాం. ‘‘నవ్వు అనేది సహజసిద్ధంగా జరగాల్సిన ఒక ప్రక్రియ. ఇది చాలా ముఖ్యమైనది. ఎవరినైనా కలిసినప్పుడు మొదట మన నవ్వే పలకరిస్తుంది. మంచి మర్యాదలు మన నవ్వులోనే కనిపిస్తాయి. నవ్వడం మానేస్తే ముఖ కండరాలను ఎలా వాడాలో మెదడు మర్చిపోతుంది అని నిపుణులు చెబుతున్నారు. అందుకే నవ్వడం చాలా ముఖ్యం’’ అని స్మైలింగ్ ఇన్స్ట్రక్టర్ మిహోకిటానో చెబుతున్నారు. -
డబ్ల్యూటీసీ ఫైనల్.. ప్రాక్టీస్‌లో టీమిండియా బీజీబీజీ (ఫోటోలు)
-
టీమ్ ఇండియా రబ్బరు బంతులతో ప్రాక్టీస్... ఎందుకంటే?
-
గూగుల్ చీకటి ‘గేమ్’! రూ.260 కోట్ల భారీ జరిమానా..
టెక్ దిగ్గజం గూగుల్‌కు దక్షిణ కొరియాకు చెందిన యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ రూ.260 కోట్ల భారీ జరిమానా విధించింది. కొరియన్ మొబైల్ గేమింగ్ యాప్ మార్కెట్లో ఆధిపత్యం కోసం గూగుల్, దాని ప్రాంతీయ అనుబంధ సంస్థలు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన నియంత్రణ సంస్థ 42.1 బిలియన్ల వాన్లు అంటే భారతీయ కరెన్సీలో రూ.260 కోట్లకు పైగా జరిమానా విధించింది. (ఆండ్రాయిడ్ యూజర్లకు కొత్త ఫీచర్.. స్టోరేజ్ సమస్యకు పరిష్కారం) ఫెయిర్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టీసీ) ప్రకారం.. గూగుల్ 2016 జూన్, 2018 ఏప్రిల్ మధ్య కాలంలో దక్షిణ కొరియా మొబైల్ గేమ్ కంపెనీలతో చీకటి ఒప్పందాలను కుదుర్చుకుంది. ఆ మేరకు వన్ స్టోర్‌లో వారి కంటెంట్‌ను విడుదల చేయకుండా అడ్డకుంది. వన్ స్టోర్ అనేది నేవర్ కార్ప్‌తో పాటు దక్షిణ కొరియాకు చెందిన మరో రెండు మొబైల్ క్యారియర్లు 2016 జనవరిలో ప్రారంభించిన ఆ దేశ ప్రధాన స్వదేశీ యాప్ మార్కెట్. ఈ వన్ స్టోర్ ఏర్పాటు దక్షిణ కొరియాలో తమ మార్కెట్‌పై ప్రభావం చూపుతుందని భావించిన గూగుల్ యూఎస్ బెహెమోత్ గేమ్ కంపెనీలను తమ గూగుల్ ప్లే (Google Play)లో ప్రత్యేకంగా విడుదల చేసేలా ఒప్పందం చేసుకుంది. దీనికి బదులుగా వారి కంటెంట్ మార్కెట్లో ‘ఫీచర్డ్’గా కనిపించేలా చేయడంతో పాటు ఆ కంపెనీలకు ఇతర మార్కెటింగ్ ప్రయోజనాలనూ గూగుల్ అందించినట్లు ఎఫ్‌టీసీ పేర్కొంది. న్యాయమైన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు గూగుల్ ఆ ఒప్పందానికి సంబంధించిన ఈమెయిల్‌లను ఉద్యోగుల చేత తొలగింపజేసింది. ఆ విషయాలను ఆఫ్‌లైన్‌లోనే చర్చించాలని కూడా కోరిందని ఎఫ్‌టీసీ తెలిపింది. ఎఫ్‌టీసీ గణాంకాల ప్రకారం.. 2016లో ఖర్చు చేసిన మొత్తంలో స్థానిక యాప్ మార్కెట్లో దాదాపు 80 నుంచి 85 శాతం వాటాను కలిగి ఉన్న గూగుల్ 2018లో 90 నుంచి 95 శాతానికి విస్తరించగలిగింది. మరోవైపు ఈ కాలంలో వన్ స్టోర్ 15 - 20 శాతం నుంచి 5 - 10 శాతానికి మాత్రమే పడిపోయిందని ఎఫ్‌టీసీ పేర్కొంది. కాగా కొరియన్ ఎఫ్‌టీసీ నిర్ణయంతో తాము ఏకీభవించడం లేదని గూగుల్ తెలిపింది. తాము స్థానిక పోటీ చట్టాలను ఉల్లంఘించలేదని పేర్కొంది. రాతపూర్వక నిర్ణయాన్ని సమీక్షించిన తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని వివరించింది. -
PV Sindhu: కోచ్ పార్క్‌తో సింధు కటీఫ్!
సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్‌లో తాను రెండో పతకం సాధించడంలో కీలక పాత్ర పోషించిన కోచ్‌తో బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తెగదెంపులు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన పార్క్ టే సంగ్ వద్ద ఇకపై సింధు ప్రాక్టీస్ చేయబోవడం లేదు. ఇటీవల తాను ఆశించిన విజయాలను సింధు అందుకోలేకపోవడమే అందుకు కారణం. తమ భాగస్వామ్యం ముగిసిందనే విషయాన్ని పార్క్ స్వయంగా ధ్రువీకరించాడు. సింధు పరాజయాల్లో తన పాత్ర కూడా ఉందని అతను పేర్కొనడం విశేషం. గాయంతో ఐదు నెలలు ఆటకు దూరమైన సింధు జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్‌తో మళ్లీ బరిలోకి దిగింది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే కరోలినా మారిన్ (స్పెయిన్) చేతిలో ఓడిన ఆమె, సొంతగడ్డపై జరిగిన ఇండియా ఓపెన్‌లోనూ అనూహ్యంగా మొదటి రౌండ్లోనే పరాజయం పాలైంది. టీమ్ ఈవెంట్ అయిన ఆసియా మిక్స్డ్ చాంపియన్‌షిప్‌లో ఒక మ్యాచ్ గెలవగలిగినా... ర్యాంకింగ్స్‌లో తనకంటే ఎంతో దిగువన ఉన్న గావో ఫాంగ్ జి చేతిలో పరాజయం ఊహించనిది. 2019 నుంచి సింధుకు పార్క్ వ్యక్తిగత కోచ్‌గా వ్యవహరించాడు. ఈ నాలుగేళ్లలో మూడు బీడబ్ల్యూఎఫ్ టైటిల్స్‌తో పాటు కామన్వెల్త్ క్రీడల్లో కూడా సింధు స్వర్ణం సాధించింది. అన్నింటికి మించి టోక్యో ఒలింపిక్స్‌లో సింధు కాంస్యం సాధించడం పార్క్‌కు పేరు తీసుకొచి్చంది. ఈ విజయం తర్వాత అన్ని వేదికల్లోనూ తన పతక సాధనకు పార్క్‌నే కారణంగా చూపిస్తూ సింధు ప్రశంసలు కురిపించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధన ల ప్రకారం పార్క్ ఇప్పటికే గచ్చిబౌలిలో భారత జూని యర్ జట్టుతో చేరి వర్ధమాన ఆటగాళ్ల కోచింగ్‌లో నిమగ్నమయ్యాడు. సుచిత్ర అకాడమీలో... భారత చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ నుంచి విడిపోయిన తర్వాత సింధు ‘సుచిత్ర అకాడమీ’లోనే సాధన చేస్తోంది. భారత ప్రభుత్వం వారి టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం ప్రకారం తన వ్యక్తిగత కోచ్‌ను ఎంచుకునే అవకాశం సింధుకు ఉంది. భారత జట్టు కోచ్‌గా వచ్చిన పార్క్‌ను ఈ సౌలభ్యం కారణంగానే తన వ్యక్తిగత కోచ్‌గా మార్చుకొని ‘సుచిత్ర’లో సింధు ప్రాక్టీస్ కొనసాగించింది. ఇటీవల తమ అకాడమీలోని దాదాపు 35 మంది షట్లర్ల శిక్షణ కోసం ‘సుచిత్ర అకాడమీ’ మలేసియా మాజీ ఆటగాడు హఫీజ్ హషీమ్‌తో మూడేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. దాంతో సింధు కూడా హఫీజ్ వద్ద శిక్షణ తీసుకోవడం ఖాయమైంది. ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ టోర్నీ (మార్చి 14–19)కి ముందు కనీసం రెండు వారాలు హఫీజ్ వద్ద సింధు ప్రాక్టీస్ చేయనుంది. అయితే హఫీజ్‌ను పూర్తి స్థాయిలో అధికారికంగా ‘వ్యక్తిగత కోచ్’గా సింధు నియమించుకుంటుందా అనే విషయంపై స్పష్టత లేదు. హఫీజ్ 2003లో ఆల్ ఇంగ్లండ్ టోర్నీలో విజేతగా నిలిచాడు. సింధుతో నా భాగస్వామ్యం గురించి చాలా మంది అడుగుతున్నారు. ఇటీవల ఆమె ప్రదర్శన బాగాలేదు. ఒక కోచ్‌గా నేను కూడా అందుకు బాధ్యుడనే. అందుకే ఆమె మార్పు కోరుతుంది. కొత్త కోచ్ కావాలని ఆశిస్తోంది. ఆమె నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. వచ్చే ఒలింపిక్స్ వరకు సింధుతో లేకపోవడం కొంత బాధగా ఉన్నా మరో రూపంలో సింధుకు సహకరిస్తా. ఆమెతో కోచింగ్‌లో పాల్గొన్న ప్రతీ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా. –పార్క్ టే సంగ్ -
దేశానికే యువరాణి.. కాబోయే భర్త కోసం.. రాజభోగాలు విడిచి..
ఓస్లో: ఆమె ఒక దేశానికి యువరాణి. కనుసైగ చేస్తే చాలు వందిమాగధులు కోరినదేదైనా కాదనకుండా తెస్తారు. అష్టైశ్వర్యాలతో తులతూగే జీవితం. కానీ ఆమె కాబోయే భర్త కోసం అవన్నీ వదులుకుంది. అతను చేసే ఆల్టర్నేటివ్ మెడిసన్ వ్యాపారాలపై దృష్టి పెట్టడానికి యువరాణి బాధ్యతల్ని నుంచి బయటపడింది. ఆమే నార్వే యువరాణి మార్తా లూయిస్. ఆమెకు కాబోయే భర్త డ్యూరెక్ వెరెట్ మెడికల్ ప్రాక్టీస్ చేస్తూంటారు. ఇదేదో సంప్రదాయ వైద్యం కాదు. ప్రత్యామ్నాయ వైద్యంపై పరిశోధనలు చేయాలి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచడానికి డ్యూరెక్ చేస్తున్న కృషికి అండగా నిలవడానికి మార్తా లూయిస్ రాచరిక విధుల నుంచి బయటకు వచ్చారు ‘‘నా వ్యక్తిగత పనులకి, రాజకుటుంబంలో పోషించే పాత్రకి మధ్య విభజన ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. రాజు హరాల్డ్–5 కూడా ఇందుకు అంగీకరించారు. ప్రిన్సెన్స్ టైటిల్ మాత్రం నాతోనే ఉంటుంది. ప్రత్యామ్నాయ వైద్యం ప్రాముఖ్యతను ప్రజలకు చెప్పడంలో ఎంతో ఆనందముంది’’ అని యువరాణి వెల్లడించారు. మరోవైపు తనని తాను దివ్యశక్తులున్న వ్యక్తిగా చెప్పుకునే డ్యూరెక్పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు ఆయన చేసే వైద్య విధానం మంచిదేనని గొప్పగా చెప్పుకుంటే, మరికొందరు తాంత్రికవాది అంటూ కొట్టి పారేస్తున్నారు. -
వరల్డ్ ఓల్డెస్ట్ ప్రాక్టీసింగ్ డాక్టర్‌గా గిన్నిస్ రికార్డు!
నిండునూరేళ్లు బతకమని ఆశీర్వదిస్తుంటారు.. కానీ నిండునూరేళ్ల వయసులోనూ అలుపెరుగక సేవలందిస్తున్నారు యూఎస్‌కు చెందిన ఓ డాక్టర్. ఓహియోకు చెందిన న్యూరాలజిస్ట్ హోవర్డ్ టక్కర్ 2021 ఫిబ్రవరిలో.. అంటే ఆయనకు 98 ఏళ్ల 231 రోజుల వయసులోనే ఓల్డెస్ట్ ప్రాక్టీసింగ్ డాక్టర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు నూరేళ్ల వయసులోనూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు పనిచేస్తున్నారు. తన 100వ బర్త్‌డే తరువాత జూలైలో కోవిడ్ బారిన పడ్డారు. అప్పుడు కూడా జూమ్‌లో వైద్య సలహాలిచ్చారు. 1922 జూలై 10న జన్మించిన టక్కర్.. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో యూఎస్ నేవీలో సేవలందించారు. 1950 కొరియా యుద్ధ సమయంలోనూ అట్లాంటిక్ ఫ్లీట్‌లో న్యూరాలజీ చీఫ్‌గా పనిచేశారు. విశ్రాంతి తీసుకోవడం దీర్ఘాయువుకు శత్రువు లాంటిదనే ఆయన... చేసే పనిని ప్రేమించినప్పుడు పదవీ విరమణ ఆలోచనే రాదంటున్నారు. ప్రాక్టీసింగ్ సైకోఎనలిస్ట్ అయిన టక్కర్ భార్య 89 ఏళ్ల స్యూ సైతం ఇంకా పనిచేస్తోంది. (చదవండి: ఫార్ములా ఈ రేస్‌తో హైదరాబాద్‌లో ట్రాఫిక్ టెన్షన్) -
పాక్‌తో బిగ్ ఫైట్‌కు ముందు కోహ్లి కఠోర సాధన.. స్పెషల్ మాస్క్‌తో..!
IND VS PAK Super 4 Match: ఆసియా కప్-2022 సూపర్-4 మ్యాచ్‌ల్లో భాగంగా రేపు (సెప్టెంబర్ 4) మరో బిగ్ ఫైట్ జరుగనుంది. గ్రూప్ దశలో ఓసారి ఎదురెదురు పడి కత్తులు దూసుకున్న చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాక్‌లు మరోసారి అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. సూపర్-4కు అర్హత సాధించే క్రమంలో పాక్.. పసికూన హాంగ్‌కాంగ్‌పై భారీ విజయం సాధించి, టీమిండియాతో తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అన్న సంకేతాలు పంపగా.. గ్రూప్ దశలో పాక్‌ను మట్టికరించిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా ఉరకలేస్తుంది. ఈ క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు వ్యూహరచనలతో కుస్తీ పడటంతో పాటు ప్రాక్టీస్‌లో చమటోడుస్తున్నారు. మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి వీర లెవెల్లో సాధన చేస్తూ కనిపించాడు. ముఖానికి ప్రత్యేక స్పోర్ట్స్ మాస్క్ (హై అల్టిట్యూడ్ మాస్క్) పెట్టుకొని రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ మాస్క్ పెట్టుకుని రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తే శ్వాస కండరాలను బలోపేతం కావడంతో పాటు ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది. యూఏఈలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇలాంటి మాస్క్‌తో సాధన ఫిట్నెస్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా కాపాడుతుందని కోహ్లి భావిస్తున్నాడు. ఇదిలా ఉంటే, చాలాకాలం తర్వాత కోహ్లి ఇటీవలే తిరిగి గాడిలో పడినట్లు కనిపిస్తున్నాడు. ఆసియా కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 34 బంతుల్లో 35 పరుగులు చేసి పర్వాలేదనిపించిన రన్ మెషీన్.. ఆతర్వాత హాంగ్‌కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో క్లాసీ ఫిఫ్టి కొట్టి పూర్వవైభవం సాధించినట్లు కనిపించాడు. కోహ్లి ఇదే ఫామ్‌ను రేపు పాక్‌తో జరుగబోయే మ్యాచ్‌లోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రాక్టీస్‌లో వినూత్న సాధన చేస్తున్నాడు. కోహ్లి పాక్‌పై భారీ ఇన్నింగ్స్, వీలైతే సెంచరీ సాధించాలని అతని అభిమానులు దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు. చదవండి: భార్యతో కలిసి ఎనిమిదెకరాల భూమి కొనుగోలు చేసిన కోహ్లి.. ధర ఎంతంటే! -
మంచి మాట: సాధన.. ఓ తపస్సు
ఏ విద్యలోనైనా పట్టు రావాలంటే సాధన అవసరం. అది నిరంతరం కొనసాగాలి. ‘అభ్యాసం కూసు విద్య..’ అన్నారు కదా పెద్దలు. అభ్యసించటానికి శ్రద్ధాసక్తులే కాక అకుంఠిత దీక్ష కావాలి. దానికి పట్టుదల కలవాలి. ఇష్టపడి నేర్చుకున్న ఒక విద్యను అభ్యసించవలసి వుంటుంది. ఆ విద్యను సరిగా ఒక గురువు వద్ద నేర్చుకోవాలి. సుశిక్షితులైన పిదప నేర్చిన విద్యను అభ్యసించాలి. అపుడే దానికొక దిశ – దశ ఏర్పడతాయి. సక్రమ మార్గం ఏర్పడుతుంది. నేర్చుకున్న విద్య కరతలామలకమవ్వాలంటే అభ్యాసం వల్లే సాధ్యం. సరైన శిక్షణ లేని విద్య సాధన చేయటం సమయం వృథా. ఇక్కడ జాగరూకత చాలా అవసరం. తపస్సుకు మనో నిశ్చలత అత్యంత ప్రధానమైనది. ఒక దైవాన్ని మనస్సు లో ప్రతిష్టించుకోవాలి. ఆ దేవుడి నామాన్నో.. మంత్రాన్నో ఉచ్చరిస్తూ వుండాలి. జగాన్ని మరవాలి. పెదవుల కదలికలు నెమ్మది.. నెమ్మదిగా అదృశ్యమై మీ ఉచ్ఛ్వాస,.. నిశ్వాసాలే ఆ నామ, మంత్రాలవుతాయి. ఇది తపస్సులో గొప్ప దశ. ఆ అద్భుత స్థితికి చేరగలిగామా.. తపస్సులో అత్యున్నత దశకు చేరుకున్నట్టే. సాధనలో కూడ అంతటి త్రికరణ శుద్ధి కావాలి. అపుడే మనం అభ్యసిస్తున్నా దానిలో గొప్ప ప్రావీణ్యం పొందుతాం. ఎలాగూ మన మనస్సుకు నచ్చిన విద్యను ఎంపిక చేసుకుంటాం కనుక ఆమూలాగ్రంగా నేర్చుకోవాలి. ఏకాగ్రతతో సాధన చేయాలి. మన శక్తియుక్తుల్ని ధారపోయాలి. సంకల్పం... పట్టుదల..మనోనిశ్చలత.. ఏకాగ్రత.. ఈ శక్తుల పిల్ల కాలువలన్నీ సాధన అనే మహా నదిగా మారిన వేళ.. మార్చుకున్న వారికి విద్య స్వాధీనమై.. విద్వత్తు వశమవదా..! సా.. ధ.. న అనే మూడు అక్షరాల వెనుక ఇన్ని శక్తుల కలయిక ఉందని.. ఉంటుందని గ్రహించాలి. అలా గ్రహించిన వారే వాటిని తమలో అంతర్గతంగా వుంటే గుర్తిస్తారు. లేకుంటే అలవరచుకుంటారు. అటువంటి వారే ఆ సాధనా తపస్సులో పరిపూర్ణులవుతారు. ఆ తపోఫలితాన్ని పొందుతారు. సాధారణంగా ఎవరైనా.. నేర్చుకున్న విద్యను సాధన చేస్తారు. ఇది లోకరీతి. గురువు చెప్పిన విద్యను దాని లోతుపాతులను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే బాగా అభ్యసించాలి. జీవితంతో పోల్చి చూసుకోవాలి. స్వీయ అనుభవాలు, ఇతరుల అనుభవాలు పరిశీలించాలి. ఆ సాధనకు విచక్షణ, వివేచనల తోడు చేసి మరింతగా గట్టిపరచుకోవాలి. కొందరికి అద్భుత ప్రతిభా వ్యుత్పత్తులంటాయి. వారి వైఖరే వేరు. అసలు గురువునుండి విద్యను గ్రహించి ఆకళింపు చేసుకునే పద్ధతే విభిన్నం. కౌరవులకు .. పాండవులకు విలువిద్య నేర్పే ఆరంభ దశలోనే.. బాణంతో చేధించవలసిన పక్షికన్ను తప్ప ఇంకేమి కనుపించటంలేదన్న అర్జునుడి మాటలతో అతనే ఆ విద్యకు సరైన అర్హుడని నిర్ణయించుకున్నాడు ద్రోణాచార్యుడు. గొప్ప కలయిక వారిరువురిది. ఏకాగ్రతతో గురువు చెప్పిన విద్యను సాధన చేయసాగాడు. ఓ రాత్రివేళ.. దీపంలేని తరుణాన... భోజనం చేయగలిగిన పార్థుడు ఒక అద్భుతమైన ఆలోచన చేశాడు. చీకటిలో శబ్దాన్ని బట్టి.. ఆ దిశ వైపు బాణం వేసి వేటాడటం నేర్చుకున్నాడు. గొప్పగా సాధన చేసాడు. పట్టు సంపాదించాడు. తన గురువు మెప్పు పొందాడు. గురువు నేర్పిన విద్యను సాధన చేసే క్రమంలో వచ్చే ఆలోచనలకు తన అద్భుత ఊహశక్తిని మేళవించి తాను నేర్చిన.. నేర్చుకుంటున్న విద్యకు ఒక రూపు.. కోణం.. ఓ వైవిధ్యతను.. ఓ విభిన్నతను కలిపి ఆ విద్యను పరివ్యాపితం చేసాడు తన శక్తి యుక్తులతో. తన గురు ప్రశంస పొందాడు. అలా విశేషమైన ప్రతిభ కల శిష్యులుంటారు. ప్రతిభకు వైవిధ్యం తోడైతే అది ఓ అద్భుతమే. అంతే కాదు.. ఓ నవ నవోన్మేషమే అవుతుంది. విశ్వనాథ సత్యనారాయణ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభృతులు అటువంటి ప్రతిభ సంపన్నులే. నిరంతర సాధన మన సామర్థ్యాన్ని పెంచుతుంది. ఎనలేని ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. పొరపాట్లు.. తప్పిదాలను గమనించి వాటిని సరిదిద్దుకునే అవకాశమిస్తుంది. విద్యాప్రతిభను ప్రదర్శించే సందర్భాలు నల్లేరు మీద బండిలా సాగాలంటే అభ్యాసం తప్పదు. భూ గర్భంలోని రత్నం వంటిదే ప్రతిభ. రత్నాన్ని వెలిక్కితీసి సానపెడితే కాని ధగధగద్ధాయమానంగా ప్రకాశించదు. మనలోని పాడగలిగే గొంతుకకైనా.. అద్భుత కవితాశక్తికైనా... చిత్రలేఖనా ప్రతిభకైనా మార్గదర్శకత్వం చేయగల గొప్పగురువు కావాలి. ఆయన నుండి పొందిన మన జ్ఞానానికొక పరిపుష్టి.. పరిపూర్ణత.. అద్భుత స్వాధీనత.. రాణింపు రావాలంటే సాధన కావాలి. ఒక విద్వాంసుడి.. లేదా ఒక కళాకారుడి ప్రతిభ నిజానికి పేరు ప్రఖ్యాతులు ఎంత బాగా వస్తే వారు అంత ఎక్కువగా సాధన చేయాలి. ఒక కళాకారుడు అత్యున్నత స్థాయికి చేరిన తరువాత అతని ప్రదర్శన తిలకించటానికి వచ్చేప్రేక్షకులు అది అత్యున్నతంగా ఉండాలని... ఉంటుందని ఆశించి వస్తారు. అది ఎంతో సహజమైనది. తాను ఎప్పుడూ ఇస్తున్న ప్రదర్శనే కదా.. సాధన ఎందుకు చేయాలన్న ఆలోచన ఏ కళాకారుడికైనా.. పండితుడికైనా వచ్చిన క్షణం అతడి ప్రతిభాభానుడికి మేఘాలు కమ్ముతాయి. కళాకారులు ఎంతటి లోకప్రసిద్ధులైతే అంతటి సాధన కావాలి. చేయాలి. వారి స్థాయికి తగ్గని ప్రదర్శన ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే సాధన చేయక తప్పదు. సాధన చేసే క్రమంలో ఏకాగ్రత.. పట్టుదలలు సడలకూడదు. మనస్సు చంచలం కాకూడదు. సాధన ఎంత కాలం చేయాలి, దీనిని ఎక్కడ ఆపాలి..? అసలు ఆపచ్చా... అన్న ప్రశ్నలు.. సందేహాలు వస్తుంటాయి. సాధన నిలుçపు చేయటం అన్న ఆలోచనే పుట్టకూడదు మనలో. వచ్చిన క్షణం మనలో నేర్చుకునే తపన చనిపోతుంది. చాలానే నేర్చుకున్నామన్న తృప్తి.. ఇంకా నేర్చుకోవలసిన అవసరం లేదన్న ఆలోచనే అందుకు కారణం! సాధనకు దూరమయ్యామంటే నేర్చుకున్న విద్య మీద పట్టు తగ్గచ్చు. అందుకే సాధన ఒక జీవనది కావాలి. ఎంత సాధన చేస్తే. అంత పరిపూర్ణత. అంత అలవోకగా చేయగల సామర్థ్యం వస్తుంది. నేర్చుకునే సమయంలో సాధన చాలా మంది చేస్తారు. ఇది సహజం. ఒక దశకు చేరుకున్న తరువాత శ్రద్ధ పెట్టం. కాని సాధన ఊపిరున్నంత వరకు చేయాల్సిందే. అలా చేసినవారే తమ విద్వత్తును, దానిలోని సారాన్ని అనాయాసంగా చదువరులకు లేదా శ్రోతలకు ఇవ్వగలరు. రంజింప చేయగలరు. ‘మాలో మీరనే ఉత్కృష్టత నిరంతరాభ్యాసం వల్ల ఒక అలవాటుగా మారింది’ అన్నారు గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్.