Prakasam District Latest News
-
26న జాబ్ మేళా
ఒంగోలు వన్‌టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ – జిల్లా ఉపాధి కార్యాలయం, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ చీమకుర్తిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 3 కంపెనీలతో జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జె.రవితేజ యాదవ్ తెలిపారు. భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ లిమిటెడ్, జెర్సీ డెయిరీ, బ్రహ్మసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ కంపెనీలు పాల్గొంటాయన్నారు. జిల్లాలోని 19 నుంచి 32 సంవత్సరాల వయసు మధ్య గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు స్కిల్ హబ్ కో ఆర్డినేటర్ షేక్ బాషా (9963005209)ను సంప్రదించాలని కోరారు. నేడు, రేపు ఓటరు నమోదు కార్యక్రమాలు ఒంగోలు అర్బన్: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శని, ఆదివారాల్లో జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రత్యేక ప్రచార రోజులు నిర్వహించనున్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బీఎల్ఓలు ప్రజలకు అందుబాటులో ఉంటారు. 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునే అవకాశంతో పాటు ఫారం 6, 7, 8 కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఎన్నికల విభాగం అధికారులు కోరారు. ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలకే ఉపకార వేతనాలు ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలో డిగ్రీ, పీజీ, అన్ని రకాల టెక్నికల్, నాన్‌టెక్నికల్ కోర్సులు అభ్యసిస్తున్న ఎస్సీ విద్యార్థులకు వారి బ్యాంకు ఖాతాల్లోనే ఉపకార వేతనాల నగదు జమ చేయనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా చెల్లిస్తోందన్నారు. మిగిలిన ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులకు 2024–25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కళాశాలల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందన్నారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఎస్సీ విద్యార్థులకు మినహా మిగిలిన విద్యార్థుల ఉపకార వేతనాలను ఎఫ్ఆర్ఎస్ ఆధారంగా హాజరును పరిగణలోకి తీసుకుని కళాశాల బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నట్లు వివరించారు. నూతన మార్గదర్శకాలు, రెన్యువల్ నూతన ఉపకార వేతనాలకు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఏఆర్ డీఎస్పీగా శ్రీనివాసరావు ఒంగోలు టౌన్: ఏఆర్ డీఎస్పీగా కె.శ్రీనివాసరావును నియమిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన కర్నూలు ఏఆర్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఒంగోలు ఏఆర్‌లో పనిచేస్తున్న పి.చంద్రశేఖర్‌ను తిరుపతి ఏఆర్‌కు బదిలీ చేశారు. మహిళలపై పెరిగిన హింసకు వ్యతిరేకంగా పక్షోత్సవాలు ఒంగోలు టౌన్: రాష్ట్రంలో రోజురోజుకూ మహిళలపై పెరిగిపోతున్న హింసకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు నిర్వహించనున్న పక్షోత్సవాలను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి పిలుపునిచ్చారు. శుక్రవారం ప్రజా సంఘాల కార్యాలయంలో ఐద్వా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై హింస విపరీతంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మత్తు పదార్థాలకు నిలయంగా మారిందన్నారు. లైంగిక దాడులు, భౌతిక దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయేందుకు మత్తు పదార్థాలే కారణమన్నారు. మద్యం, మత్తు పదార్థాలను నిషేధించి పెరుగుతున్న హింసను అరికట్టాలని డిమాండ్ చేశారు. మహిళలపై హింసను వ్యతిరేకించే వారంతా పక్షోత్సవాలలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఎన్.మాలతి, జి.ఆదిలక్ష్మి, కె.రాజేశ్వరి, బి.పెద్ద గోవిందమ్మ పాల్గొన్నారు. -
గ్రామ కంఠంపై టీడీపీ నేతల కన్ను
జరుగుమల్లి (సింగరాయకొండ): జరుగుమల్లి మండలంలోని పీరాపురం గ్రామంలో గ్రామకంఠం భూమిపై అధికార టీడీపీ నాయకుల కన్ను పడింది. పోలేరమ్మ గుడి పేరుతో ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు కుట్రకు తెరతీశారు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది. గ్రామకంఠంలో రైతులకు చెందిన పొగాకు బ్యారన్, స్థలాలు ఉండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... పీరాపురం గ్రామంలో టీడీపీకి చెందిన కొందరు పోలేరమ్మ గుడికి స్థలం కావాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి ఇటీవల వినతిపత్రం సమర్పించారు. ఈ అర్జీని పరిశీలించమని జరుగుమల్లి తహసీల్దార్ జనార్దన్‌కు మంత్రి సూచించారు. దీనిపై శుక్రవారం తహసీల్దార్ జనార్దన్.. సర్వేయర్, ఎన్ఎన్ కండ్రిక పంచాయతీ సెక్రటరీ అశోక్‌కుమార్‌ను వెంటబెట్టుకుని వెళ్లి గ్రామకంఠం స్థలంలో కొలతలు వేసి హద్దులు నిర్ణయించారు. అయితే గ్రామకంఠ స్థలాన్ని ఆనుకుని స్థలాలు, పొగాకు బ్యారన్లు ఉన్నాయని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు ఎలా కొలతలు వేస్తారని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలతలు వేసిన స్థలానికి, బ్యారన్లకు మధ్య మూడు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల లోతులో కాలువ తీశారని, తాము బ్యారన్ల వద్దకు ఎలా వెళ్లాలని రైతు మారంరెడ్డి గంగాధర్‌రెడ్డి అధికారులను నిలదీశారు. రైతులపై ఈ విధంగా కక్షసాధింపు చేస్తారా అని ప్రశ్నించారు. అధికారులు వేసిన కొలతల్లో తమ స్థలం సుమారు 13 సెంట్లు ఉందని, అడిగితే మీ డాక్యుమెంట్లు తెచ్చుకోండి పరిశీలిస్తామని చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ జనార్దన్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి అశోక్‌కుమార్ గ్రామకంఠం స్థలాన్ని కొలిచి హద్దులు నిర్ణయించమని కోరారని, ఆ ప్రకారం తాము వచ్చి స్థలానికి కొలతలు వేసి హద్దులు నిర్ణయించామని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి అశోక్‌కుమార్ మాట్లాడుతూ గ్రామకంఠం స్దలానికి కొలతలు వేస్తున్నాం.. రావాలని తహసీల్దార్ చెప్పారని, ఆయన సూచన మేరకే తాను వచ్చానని పేర్కొనడం గమనార్హం. ఈ వివాదంపై రెవెన్యూ అధికారులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా జరుగుతుంటే.. మధ్యలో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. గ్రామ కంఠానికి అనుకుని ఉన్న స్థలానికి చెందిన రైతులు మారంరెడ్డి గంగాధర్‌రెడ్డి, బండి శ్రీనివాసులరెడ్డి, ఎల్లావుల శ్రీనివాసులరెడ్డికి ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామకంఠం స్థలానికి కొలతలు వేస్తున్నారని, మీరు అక్కడకు వెళ్లవద్దని, పోలీస్‌స్టేషన్‌కు వచ్చి కూర్చోవాలని లేదా గ్రామం వదిలి బయటకు వెళ్లాలని పోలీసులు హెచ్చరించారు. గ్రామంలో ఉంటే కేసులు బనాయిస్తామని హెచ్చరించారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. నాడు ఆందోళన.. నేడు ఆ స్థలం కావాలంటూ డ్రామా..! వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆ గ్రామ టీడీపీ నాయకులు పోలేరమ్మ గుడి స్థలాన్ని వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు ఆక్రమించారని, దానిని కాపాడాలని అప్పట్లో నానాయాగి చేశారు. జరుగుమల్లి మండల కేంద్రంలో ర్యాలీ కూడా చేశారు. తర్వాత ఇదేమని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై ఆడ, మగా తేడా లేకుండా దాడి చేశారు. చివరికి గాయపడిన వారిని కారులో ఆస్పత్రికి తీసుకెళ్తుంటే కారుకు అడ్డంగా నిలబడి మరీ అడ్డుకున్నారు. 108 రావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఇప్పుడు అదే టీడీపీ నాయకులు మంత్రి స్వామికి పోలేరమ్మ గుడికి స్థలం కావాలని దరఖాస్తు చేసుకున్నారు. టీడీపీ నాయకులు అలా అడిగారో లేదో ఇటు రెవెన్యూ, అటు పోలీసు అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి తమను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడి కోసం స్థలం కావాలంటూ మంత్రికి వినతి రెవెన్యూ, పోలీస్ అధికారుల అత్యుత్సాహం హడావిడిగా కొలతలు తీసిన రెవెన్యూ అధికారులు కార్యదర్శి అడిగితే కొలిచామంటున్న తహసీల్దార్ తహసీల్దార్ పిలిస్తే వచ్చానంటున్న గ్రామ కార్యదర్శి స్థలం వద్దకు వెళితే అరెస్టు చేస్తామంటూ పోలీసుల హెచ్చరికలు ఆందోళనలో రైతులు, గ్రామస్తులు -
అసమ్మతి చిందులు
తమ్ముళ్ల..అధికార టీడీపీలో అసమ్మతి, వర్గపోరు తారాస్థాయికి చేరాయి. ఒంగోలు నుంచి గిద్దలూరు వరకు అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు తగాదాలు భగ్గుమంటున్నాయి. నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడిన నేతలు రగిలిపోతున్నారు. కష్టపడి అధికారంలోకి వచ్చేందుకు పనిచేసిన వారిని పక్కన పడేశారని, కనీస గుర్తింపు దక్కడం లేదని ద్వితీయశ్రేణి నాయకులు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. లక్ష్మి దూకుడుకు కళ్లెం... దర్శి నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న గొట్టిపాటి లక్ష్మి దూకుడికి కళ్లెం వేయాలని అధిష్టానం భావిస్తోందని సమాచారం. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పదవి వస్తుందని ఆమె వర్గీయులు ఆది నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకూ విడుదలైన జాబితాల్లో ఆమె పేరును కనీసం పరిశీలనకు కూడా తీసుకోలేదని తెలుస్తోంది. మద్యం దుకాణాల విషయంలో లక్ష్మి పెద్ద మొత్తంలో కమీషన్ డిమాండ్ చేయడం, ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో భారీగా డబ్బులు చేతులు మారడం లాంటివి అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు పార్టీ నాయకులు గుసగుసలాడుకుంటున్నారు. అంతేగాకుండా ఎన్నికల ముందు వచ్చిన ఆమె.. సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదని, వారి మాటలను పరిగణలోకి తీసుకోకుండా తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని కొందరు సీనియర్ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తమను కాదని ఆమె సొంత నిర్ణయాలు తీసుకోవడం చాలా మందికి నచ్చడం లేదని ప్రచారం జరుగుతోంది. అసంతృప్తిని చల్లార్చేందుకు మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావుకు కీలక పదవి ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికార తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి రాజుకుంటోంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య అంతర్గతంగా అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఇన్చార్జి ఎరిక్షన్‌బాబు, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ రవీంద్ర మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండు వర్గాలు ఒకరి మీద ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఎరిక్షన్ బాబుకు వ్యతిరేకంగా నాగేంద్ర అనే సీనియర్ కార్యకర్త ఆత్యహత్యకు ప్రయత్నించడం అక్కడి పరిస్థితికి అద్దంపడుతోంది. జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల సోదరుల పెత్తనంపై తమ్ముళ్లు మండిపడుతున్నారు. దర్శి నియోజకవర్గంలో దిగుమతి నాయకురాలి పెత్తనాన్ని సహించలేమని చెబుతున్నారు. ఒంగోలు నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఎమ్మెల్యే వైఖరిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కొండపి కథ మరోలా ఉంది. ఈ నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు తయారయ్యారని.. ఎవరివైపు ఉండాలో తెలియడం లేదని పార్టీ కేడర్ డోలాయమానంలో పడింది. అసలు ఎమ్మెల్యే కంటే కొసరు ఎమ్మెల్యే పెత్తనం ఎక్కువైందని చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తంమ్మీద జిల్లా టీడీపీలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందని చెప్పవచ్చు. ‘ఒడా’ చుట్టూ పోరు... ఒంగోలు నియోజకవర్గంలో ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఒడా) చైర్మన్ పదవికి తీవ్ర పోటీ నెలకొని ఉంది. ఒడా చైర్మన్ పదవి కోసం టీడీపీలో మంత్రి శ్రీనివాసరావు, శింగరాజు రాంబాబు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, మంత్రి శ్రీనివాసరావుకు ఈ పదవి ఇస్తానంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట ఇచ్చినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. శింగరాజు రాంబాబుకు సైతం దామచర్ల హామీ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఈ ఇద్దరు నాయకులు చైర్మన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. టీడీపీలో ఇలా ఉంటే.. జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకోవడం కొసమెరుపు. ఒంగోలు జనసేన నాయకులకు ఎలాంటి పదవి ఇచ్చేది లేదని, ఒడా పదవిని టీడీపీ నాయకులకు ఇస్తామని లోకేష్ చెప్పినట్లు వార్తలు రావడంతో రియాజ్ అలకపాన్పు ఎక్కినట్లు సమాచారం. ఆయన గత కొద్దిరోజులుగా దామచర్లకు దూరంగా ఉంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గిద్దలూరు జనసేన ఇన్చార్జి బెల్లంకొండ సాయిబాబా కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ పదవిని దర్శి నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మికి ఇప్పించాలని ఆమె బంధువైన మంత్రి గొట్టిపాటి రవి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఒడా పదవి తర్వాత అసంతృప్తి మరింతగా బయటపడే అవకాశం ఉందని తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఎమ్మెల్యే దామచర్లపై పార్టీ నాయకులు గుర్రుగా ఉన్నారు. ఇక, బియ్యం డీలర్షిప్ కోసం ప్రయత్నించిన పలువురు నాయకులు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని మధ్యలో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడుతున్నారు. యర్రగొండపాలెంలో శ్రుతిమించిన అసమ్మతిరాగం... జిల్లాలోని మారుమూల నియోజకవర్గమైన యర్రగొండపాలెంలో టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తి శ్రుతిమించింది. రెండు గ్రూపులుగా విడిపోయిన పార్టీ నాయకులు పోటాపోటీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. రెండు గ్రూపుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. నియోజకవర్గ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ రవీంద్ర గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ఇటీవల రవీంద్ర వర్గానికి చెందిన చెకూరి ఆంజనేయులు, షేక్ జిలాని, వడ్లమూడి లింగయ్య, అంబటి వీరారెడ్డి ఆధ్వర్యంలో 250 మందికిపైగా కార్యకర్తలు మంగళగిరి వెళ్లి ఎరిక్షన్‌బాబు అవినీతి భాగోతంపై ఫిర్యాదు చేసి వచ్చారు. యర్రగొండపాలెం ఇన్చార్జిని మార్చాలని డాక్టర్ రవీంద్ర వర్గం డిమాండ్ చేసింది. ఒకవేళ ఇన్చార్జిని మార్చడం సాధ్యం కాకపోతే కనీసం త్రిసభ్య కమిటీ వేయాలని కోరుతోంది. అయితే అధిష్టానం చూద్దాం..చేద్దాం అంటూ కాలయాపన చేయడం వారికి మింగుడు పడడంలేదు. ఎరిక్షన్‌బాబు ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడంటూ ఆరోపణలు చేస్తూ గురువారం నాగేంద్ర అనే పార్టీ కార్యకర్త ఎన్టీఆర్ విగ్రహానికి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించడం, అక్కడి నుంచి అతడిని కాపాడినప్పటికీ ఆగకుండా లారీ కింద పడి చావడానికి ప్రయత్నించడం పరిస్థితికి అద్దం పడుతోంది. మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో సోదరుల పెత్తనం... పశ్చిమ ప్రకాశం జిల్లాలో కీలకమైన మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలలో సైతం అసంతృప్తి కథ నడుస్తోంది. మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సొంత తమ్ముళ్లు అంతా తామే అన్నట్లుగా వ్యవహారాలు నడపడం కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. పార్టీ విజయం కోసం కష్టపడిన తమకు చివరికి దక్కిందేమీ లేదని పలువురు నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముళ్ల జోరుకు బేజారవుతున్న సీనియర్లు.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కీలకపాత్ర పోషించిన శాసనాల వీరబ్రహ్మం, గునుపూడి భాస్కర్ లాంటి వారు పచ్చకండువా పక్కన పెట్టి తిరుగుతున్నారు. కనిగిరిలో ఎమ్మెల్యే ఏకఛత్రాధిపత్యంతో కొందరు నాయకులు తమ దారి తాము చూసుకుంటున్నారు. కనిగిరిలోని అధికార పార్టీకి చెందిన సామాజికవర్గం రాష్ట్ర మైనింగ్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్యల వద్దకు వెళ్లి పనులు చక్కబెట్టుకుంటున్నారని సమాచారం. ఎమ్మెల్యేల ఏకపక్ష ధోరణిపై రగులుతున్న కేడర్ అన్ని నియోజకవర్గాల్లోనూ అదే తీరు పార్టీ విజయం కోసం కష్టపడితే మొండిచేయి చూపిస్తారా? టీడీపీలో చెలరేగుతున్న అసంతృప్తులు మంగళగిరి చేరిన యర్రగొండపాలెం పంచాయితీ ఒంగోలులో ‘ఒడా’ కోసం సిగపట్లుకొండపిలో అసంతృప్తులకు తాయిలాలు... కొండపి నియోజకవర్గంలో అసంతృప్తి నాయకులను చల్లార్చేందుకు ఇటీవల తాయిలాలు పంపిణీ చేసినట్టు తెలిసింది. డోలా బాలవీరాంజనేయస్వామికి మంత్రి పదవి లభించినా.. ఇక్కడ దామచర్ల సత్య పెత్తనం చెలాయిస్తున్నారనేది బహిరంగ రహస్యం. అధికారులతో మాట్లాడటం, బదిలీలు, పోస్టింగుల దగ్గర నుంచి మద్యం, బియ్యం, మైనింగ్ లావాదేవీలు, పశువుల సంత, ఆక్వాలకు సంబంధించిన వసూళ్లన్నీ సత్య చూసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు సత్య పెత్తనం ఏంటని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన సత్య.. ఇటీవల మండల నాయకులను పిలిపించి వారి వారి స్థాయిని బట్టి తాయిలాలు ఇచ్చి పంపించినట్లు ప్రచారం. తాయిలాలు అందని కొందరు నేతలు మేమేం తక్కువంటూ మండిపడుతున్నట్లు సమాచారం. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా అధికారులు సైతం సత్య పెత్తనంపై లోలోపల చిరాకుపడుతున్నట్లు తెలుస్తోంది. -
‘కూటమి’ విఫలం
శాంతిభద్రతల పరిరక్షణలో త్రిపురాంతకం/నరసరావుపేట: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. త్రిపురాంతకం మండలంలోని నడిపాలెం పొలాల్లో దాడికి గురై తీవ్రంగా గాయపడి నరసరావుపేట ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్ సీపీ నాయకుడు ఈశ్వరరెడ్డిని శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే పరామర్శించారు. త్రిపురాంతకం మండలం పాత అన్నసముద్రం గ్రామ పంచాయతీ పరిధిలోని నడిపాలెం పొలాల్లో గల తన భూమి వద్ద శుక్రవారం ఈశ్వరరెడ్డి పనులు చేయించాడు. కూలీలు నీరు కావాలనగా, పాత అన్నసముద్రం వెళ్లి తిరిగి రాలేదు. రోడ్డుపై తలకు బలమైన గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఈశ్వరరెడ్డిని అటుగా వచ్చిన వారు గమనించి వినుకొండ వైద్యశాలకు తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నర్సరావుపేట తరలించారు. ఈశ్వరరెడ్డిది పెద్దారవీడు మండలం శివాపురం గ్రామం. కొంత కాలంగా భూవివాదం ఉండగా, ఇటీవల రాజీ చేసుకుని పొలంలోకి దిగాడు. ఈ నేపథ్యంలో అతనిపై మారణాయుధాలతో దాడి జరిగింది. ప్రస్తుతం ఈశ్వరరెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సీఐ అసాన్, ఎస్ఐ శివబసవరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో అరగంటకు ఒక నేరం... నరసరావుపేట ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న ఈశ్వరరెడ్డిని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ వైఫల్యం కారణంగా ప్రతిరోజూ రాష్ట్రంలో ఏదో ఒక మూల అరగంటకో హత్య, దాడి జరుగుతూనే ఉన్నాయన్నారు. నేరస్తులను శిక్షిస్తారనే భయం లేకపోవడం వలనే దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఒక చిన్న పొలం తగాదా విషయంలో గొడ్డలి, కత్తులతో నరకడంతో చావుబతుకుల మధ్య వెంటిలేటర్‌పై ఈశ్వరరెడ్డి ఉన్నాడంటే రాష్ట్రంలో ఏరకమైన పరిపాలన సాగుతుందో అర్థం చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రజలు, ఆడబిడ్డలకు రక్షణ లేదని, నేరం చేయడానికి ఎవరూ భయపడట్లేదని అన్నారు. వందల కేసులు రోజూ నమోదవుతున్నాయన్నారు. కూటమి ప్రభుత్వంలో గత ఐదు నెలల్లో 7,393 మంది మహిళలపై లైంగిక దాడులు, భౌతిక దాడులు జరిగాయని అసెంబ్లీ సాక్షిగా వారే చెప్పారన్నారు. రాబోయే ఐదేళ్లలో 35 వేలకుపైగా సంఘటనలు జరగనిచ్చి ఒక రికార్డు బుక్ చేయాలనుకుంటున్నారా.. అని ఎద్దేవా చేశారు. ప్రజల రక్షణ గొలికొదిలేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తన నియోజకవర్గంలో ఈ క్షతగాత్రుడు ఈశ్వరరెడ్డికి త్రిపురాంతకంలో 14 ఎకరాల పొలం ఉందన్నారు. దానిపై కోర్టులో దావాలు, గొడవలు కూడా జరుగుతున్నాయన్నారు. ఈశ్వరరెడ్డికి ప్రత్యర్థులైన వారిని పోలీసులు ముందుగానే కట్టడి చేసి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని మహిళలకు తాము రక్షణ కల్పించలేమని, వారి కుటుంబ సభ్యులే రక్షణ చేసుకోవాలని వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. దీని అర్థం మేం ఏమీచేయలేమని చెప్పకనే చెప్పినట్లుగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అమలుచేయలేక తమకు ఇవ్వాల్సిన పీఏసీ చైర్మన్ పదవిని ఎగ్గొట్టారన్నారు. స్వతంత్ర భారత చరిత్రలో ఆ పదవి ఇవ్వకపోవడం ఇదే మొదటిసారని అన్నారు. వారు చేసే తప్పులను బయటకు తీస్తారనే ఉద్దేశంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీఏసీ సభ్యులైన తమకు ఆ పదవి రాకుండా చేశారన్నారు. 1981లో బీజేపీకి పార్లమెంటులో రెండే రెండు సీట్లు ఉంటే పీఏసీ పదవి ఇచ్చారన్నారు. పదవీ వ్యామోహం వలనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు మరో పదేళ్లు ఉండాలని పవన్ కల్యాణ్ అన్నారన్నారు. వీరికి పదవీ వ్యామోహం తప్పితే ప్రజల కోసం పోరాటం చేసే ఆలోచన ఏకోశానా లేదన్నారు. ఇప్పటికై నా ప్రజలకు కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. పాలకులకు పదవీ వ్యామోహం తప్ప ప్రజల గురించి ఆలోచన లేదు యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నడిపాలెం పొలాల్లో దాడికి గురైన వ్యక్తికి నరసరావుపేట ఆస్పత్రిలో పరామర్శ -
బాలకార్మిక వ్యవస్థను అరికట్టాలి
ఒంగోలు అర్బన్: బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా అరికట్టి బాల్య వివాహరహిత, బాల కార్మిక రహిత ప్రకాశం జిల్లా ఆవిష్కరణ కోసం అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. శుక్రవారం ప్రకాశం భవనంలో జిల్లా స్థాయి బాండెడ్ లేబర్ విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెట్టిచాకిరి (బాండెడ్ లేబర్) నుంచి బాధితులకు విముక్తి కలిగించి పునరావాసం ఏర్పాటు చేయడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. శ్రమదోపిడీ, లైంగిక దోపిడీ, ఆర్థిక దోపిడీలు ఈ వెట్టిచాకిరీలో ఉంటాయన్నారు. వెట్టిచాకిరిలో పెద్దలు మాత్రమే కాకుండా పిల్లలు ఉంటారని, అటువంటి వారిని గుర్తించి బాధ్యులపై పోలీసు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెట్టిచాకిరి నిర్మూలన చట్టం 1976ను పక్కాగా అమలు చేయాలన్నారు. వెట్టిచాకిరి నుంచి విముక్తి కలిగిన వారికి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. అందుకు అవసరమైన ఆధార్, ఓటరు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు, తదితర సర్టిఫికెట్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి, డీఎస్పీ శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, డీఈఓ కిరణ్‌కుమార్, డీఎస్ఓ పద్మశ్రీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ అర్చన, డీఆర్డీఏ పీడీ వసుంధర, డీసీపీఓ దినేష్‌కుమార్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సునీల్‌కుమార్, ప్రియాంక, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. వెట్టిచాకిరి నుంచి బాధితులను విడిపించాలి కలెక్టర్ తమీమ్ అన్సారియా -
ఖోఖో రాష్ట్ర బాలుర జట్టుకు శిక్షణ పూర్తి
జే.పంగులూరు: జాతీయ స్థాయి ఖోఖోలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు శిక్షణ శిబిరం ముగిసినట్లు రాష్ట్ర ఖోఖో కార్యదర్శి మేకల సీతారామిరెడ్డి తెలిపారు. శుక్రవారం పంగులూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 25 నుంచి 29 వరకు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ పట్టణంలో 43వ జూనియర్ బాలబాలికల జాతీయ స్థాయి ఖోఖో పోటీలు జరగనున్నాయన్నారు. గత 20 రోజుల నుంచి స్థానిక మంగుల సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్ కళాశాలలో ఎస్ఆర్ఆర్ ఖోఖో అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర జట్టుకు శిక్షణ జరుగుతున్నట్లు తెలిపారు. జట్టుకు కోచ్‌గా ప్రకాశం జిల్లా డీఎస్ఏ కోచ్‌గా డీఎల్ రెడ్డి వ్యవహరించారని తెలిపారు. రాష్ట్ర శిక్షణ జట్టుకు భోజన వసతులు కల్పించిన గ్రామ పెద్దలు, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్రావుకి సీతారామిరెడ్డి, క్రీడాకారులు కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు దుస్తులు అందించిన నెల్లూరి పీడీ రాజా, బాలికలకు ఎస్ఆర్ స్పోర్ట్స్ తరుపున సీతారామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులకు గ్రామ పెద్దలు రాయిణి వెంకటసుబ్బారావు, జాగర్లమూడి సుబ్బారావు, బాచిన చౌదరిబాబు, పీడీ మేకల సీతారామిరెడ్డి క్రీడాకారులకు క్రీడాదుస్తులు అందించారు. ఆటలలో రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బాచిన చెంచు గరటయ్య, రాష్ట్ర ఖోఖో చీఫ్ ప్యాట్రన్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి (ఎమ్మెల్యే), రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్, రీఫరీస్ బోర్డు కన్వీనర్ ప్రసాద్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజరాజేశ్వరి వారిని ఆశీర్వదించారు. -
వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించాలి
కొత్తపట్నం: వెనుకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని డీఈవో ఏ కిరణ్‌కుమార్ ఆదేశించారు. కొత్తపట్నం మండలంలోని కొత్తపట్నం, అల్లూరు హైస్కూళ్లను శుక్రవారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. హైస్కూళ్లలో మధ్యాహ్న భోజనం, ఆట స్థలం, ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తపట్నం హైస్కూల్లో 1,376 మంది విద్యార్థులు ఉండటం, బాగా నడపడంపై హెచ్ఎం, ఉపాధ్యాయులను అభినందించారు. హెచ్ఎం పనితీరుపైనే ఉపాధ్యాయుల పనితీరు ఆధారపడి ఉంటుందన్నారు. కొత్తపట్నం హైస్కూల్లో ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయాలని హెచ్ఎంకు సూచించారు. టీచింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అపార్ 80 శాతం పూర్తయిందన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం 149 ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థుల పేర్లు, అడ్రసులు, ఇతర వివరాలు మార్చుకోవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎఫ్ఏ–2 పరీక్షకు సంబంధించి ప్రతి పాఠశాలలో దాదాపు 85 శాతం మార్కులు అప్లోడ్ చేశారని ఉపాధ్యాయులను అభినందించారు. ఈ ఏడాది జరిగే పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని కొత్తపట్నం హైస్కూల్ హెచ్ఎం ఎం.శ్రీదేవికి సూచించారు. ఎఫ్ఏ–2లో కొత్తపట్నం మండలం 85 శాతం, ఒంగోలు మండలం 84 శాతం అప్లోడింగ్ పూర్తి చేసినట్లు చెప్పారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం, కిచన్ షెడ్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల గైర్హాజరు శాతం తగ్గించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. డ్రాపవుట్ తగ్గించేందుకు ఉపాధ్యాయులకు కొంత మంది విద్యార్థులను కేటాయించాలన్నారు. అల్లూరు, కొత్తపట్నం పాఠశాలల్లో వాచ్‌మేన్, ఆయాల పనితీరు బాగుందన్నారు. క్రీడా ప్రాంగణంలో వాలీబాల్, కబడ్డీ కోర్టులను తక్షణమే ఏర్పాటు చేయాలని పీడీలను ఆదేశించారు. విద్యార్థులను నేషనల్ గేమ్స్‌కు పంపించే విధంగా పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇవ్వాల్సిన బాధ్యత వ్యాయామ ఉపాధ్యాయులపై ఉందన్నారు. కొత్తపట్నం హైస్కూల్ ప్లస్‌లో సర్దుబాటు ప్రక్రియలో వచ్చిన కామర్స్, ఎకనామిక్స్ కెమిస్ట్రీ సబ్టెక్టుల టీచర్లను వెంటనే ఆయా మండలాల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైస్కూల్ ప్లస్ టీచర్లపై ఎంఈవోలు మానిటరింగ్ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈవోలు 1, 2 తులసీకుమారి, పద్మావతి, కొత్తపట్నం, అల్లూరు ఇన్చార్జి హెచ్ఎంలు ఎం.శ్రీదేవి, మైధిలి, స్టాఫ్ సెక్రటరీ, హరిబాబు, స్కూల్ ఫస్ట్ అసిస్టెంట్ సాయికిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులతో డీఈవో కిరణ్‌కుమార్ -
ఈవీఎం గోడౌన్లో డీఆర్ఓ తనిఖీ
ఒంగోలు అర్బన్: స్థానిక మామిడిపాలెంలోని ఈవీఎం గోడౌన్‌ను జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్ఓ) చిన ఓబులేసు శుక్రవారం తనిఖీ చేశారు. గోడౌన్ షట్టర్లకు వేసిన సీళ్లు, సీసీ కెమెరాల పనితీరుతోపాటు భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేసి రిజిస్టర్‌ను పరిశీలించారు. డీఆర్ఓ వెంట కలెక్టరేట్ హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్షి, ఇతర రెవెన్యూ అధికారులు ఉన్నారు. ప్రయాణికుడి బ్యాగ్‌లో రూ.1.10 లక్షలు మాయం ● పొదిలి ఆర్టీసీ బస్టాండ్‌లో ఘటన పొదిలి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ ప్రయాణికుని బ్యాగ్‌లో ఉన్న నగదు చోరీ అయిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. విజయవాడకు చెందిన పుల్లెల వెంకటేశ్వర్లు ట్రాక్టర్ల ఫైనాన్స్‌కు సంబంధించి కలెక్షన్ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వినుకొండ నుంచి పొదిలికి వచ్చాడు. పొదిలిలో బస్సు ఎక్కిన తరువాత బ్యాగ్ జిప్ తీసి ఉండటం గమనించాడు. బ్యాగ్‌లో ఉన్న రూ.1.10 లక్షల నగదు కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో మౌఖికంగా ఫిర్యాదు చేశాడు. పోలీస్ సిబ్బంది వచ్చి బస్టాండ్‌లో సీసీ కెమెరాలు పరిశీలించారు. లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే, కేసు నమోదు చేస్తామని పోలీసులు బాధితుడికి స్పష్టం చేశారు. చికిత్స పొందుతూ యువకుడి మృతి ఒంగోలు టౌన్: రైలు కింద పడిన గుర్తు తెలియని యువకుడు ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 13వ తేదీన ఒంగోలులోని రాంనగర్ 6వ లైను వద్ద గల రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని రైలు నుంచి 30 ఏళ్ల యువకుడు జారీ పడ్డాడు. తీవ్రంగా గాయలైన అతడిని వెంటనే జీజీహెచ్‌కు తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్న ఆ యువకుడు 21వ తేదీన మరణించాడు. ప్రమాదం జరిగినప్పుడు సదరు యువకుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒంటి మీద ఆకుపచ్చ చారల లుంగీ ఉంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సమాచారం తెలిసిన వారు ఒంగోలు రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్సై టి.అరుణకుమారి సూచించారు. పోయిన బ్యాగ్‌ను అప్పగించిన పోలీసులు ఒంగోలు టౌన్: ఊరికి వెళ్లే హడావుడిలో ఓ వ్యక్తి ఆటోలో మరిచిపోయిన బ్యాగ్‌ను పోలీసులు స్వల్ప వ్యవధిలోనే గుర్తించి భద్రంగా అప్పగించిన సంఘటన శుక్రవారం ఒంగోలులో చోటుచేసుకుంది. తాలూకా పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన దేవతు శ్రీనివాస్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో వైద్య చికిత్స కోసం బెంగళూరు బయలుదేరారు. ఇంటి వద్ద ఆటో ఎక్కిన ఆయన రంగారాయుడు చెరువు వద్ద దిగారు. ఊరికి వెళ్లే హడావుడిలో ఉన్న ఆయన ఆటోలో తన బ్యాగు మరిచిపోయారు. అందులో వైద్యం కోసం తెచ్చుకున్న లక్ష రూపాయల నగదు, ఇంటి తాళాలు, పలు డాక్యుమెంట్లు ఉన్నాయి. బ్యాగ్ పోయిన విషయమై హుటాహుటిన తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొద్దిసేపటికే ఆ ఆటోను ట్రేస్ చేశారు. అందులోని బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని తాలూకా సీఐ అజయ్‌కుమార్ చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు. -
విద్యుత్ స్మార్ట్ మీటర్ల అడ్డగింత
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో వ్యాపార సంస్థలకు స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. నగరంలోని నాగేంద్ర నగర్లో అద్దాలు తయారు చేసే చిన్న పరిశ్రమకు శుక్రవారం ఉదయం విద్యుత్ శాఖ సిబ్బంది కొందరు స్మార్ట్ మీటర్ బిగిచేందుకు వచ్చారు. అక్కడే ఉన్న సీపీఎం నాయకులు చీకటి శ్రీనివాసరావు, జి.రమేష్, సయ్యద్ హుసేన్, తంబి శ్రీనివాసరావు, టి.మహేష్ తదితరులు మీటర్లు బిగించడాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యుత్ సంస్కరణలో భాగంగా వ్యాపార సమూదాయాలు, చిన్న పరిశ్రమలు, గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించడం అన్యాయమన్నారు. ప్రస్తుతం ఒక్కో మీటర్‌ను 13 వేల రూపాయలకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, ఇప్పుడు ట్రూ అప్ చార్జీల తరహాలోనే రేపు స్మార్ట్ మీటర్ ఖరీదు భారాన్ని కూడా ప్రజలపై వేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. శ్లాబ్ విధానం రద్దయ్యి, ప్రీ పెయిడ్ విధానం అమలులోకి వస్తే మధ్య తరగతి, సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఇప్పటికే ట్రూ అప్ చార్జీల పేరుతో దాదాపు రూ.18 వేల కోట్ల రుపాయల భారాన్ని ప్రజలపై వేశారని, ప్రజలు స్మార్ట్ మీటర్లను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భక్తసింగ్రాజా, రాంబాబు, పావని సుబ్బారావు, సంబయ్య తదితరులు పాల్గొన్నారు. -
పోలేరమ్మ గుడిని తొలగిస్తే ఒప్పుకోం..
కనిగిరి రూరల్: ఎన్‌హెచ్ 565 హైవే పనులను కనిగిరి వాసులు శుక్రవారం అడ్డగించారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా పురాతనమైన పోలేరమ్మ గుడిని తొలగించాలని అధికారులు ఏకపక్షంగా నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. వివరాలు.. నకరికల్ టు ఏర్పేడు ఎన్‌హెచ్ 565 హైవే రోడ్డు కనిగిరి మీదుగా వెళ్తుంది. ఈ క్రమంలో కనిగిరిలో పట్టణంలోని పెద చెరువు సమీపంలో ఉన్న పొలాల్లో గుండా కొత్తూరు మీదుగా జాతీయ రహదారి కలుపుతున్నారు. అందులో భాగంగా పట్టణంలోని 9వ వార్డుకు వెనుక (వాల్మీకి వీధి) పంట పొలాల్లో నుంచి రోడ్డు నిర్మిస్తున్నారు. అయితే వాల్మీకి కులస్తులు, స్థానికుల గ్రామ దేవత అయిన పొలేరమ్మ గుడిని రోడ్డు నిర్మాణ కోసం తొలగించేందుకు కాంట్రాక్టర్లు ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న స్థానికులు రోడ్డు పనులను అడ్డుకుని ధర్నా చేశారు. వందల ఏళ్లుగా ఉన్న పోలేరమ్మ ఆలయాన్ని రోడ్డు కోసం తొలగిస్తే సహించేది లేదంటూ స్థానికులు తిరుపతయ్య, వెంకట్రావ్, శ్రీను, ఓబయ్య, సాయి, పండు తదితరులు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గుడి ఉన్న ప్రాంతంలో రోడ్డును మలుపు తిప్పాలని డిమాండ్ చేశారు. పెద్ద సంఖ్యలో స్థానికులు, మహిళలు ధర్నాకు దిగడంతో పోలీసులు రంగంలోకి దిగి నచ్చజెప్పారు. రోడ్డు పనులను తాత్కిలికంగా నిలిపివేశారు. గుడి తొలగింపుపై ఎన్హెచ్ఏఐ, రెవెన్యూ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వనట్టు తెలుస్తోంది. బైపాస్ రోడ్డు పనులను అడ్డుకుని ధర్నాకు దిగిన కనిగిరి వాసులు కనిగిరిలో తాత్కాలికంగా ఆగిన ఎన్‌హెచ్ 565 రోడ్డు నిర్మాణం -
ఆధునిక పద్ధతులతో లాభసాటి సాగు
కొనకనమిట్ల: రైతులు ఆధునిక పద్ధతులు పాటించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని వ్యవసాయశాఖ జేడీ కె.శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రం కొనకనమిట్లలో నూతనంగా ఏర్పాటు చేసిన కోరమాండల్ కోరొకేర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల్లో వచ్చే తెగుళ్లు, నివారణ మార్గాలపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. విచ్చలవిడిగా రసాయన మందులు వాడకుండా అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించాలని సూచించారు. కొనకనమిట్లలో కోరమాండల్ తరఫున కోరొకేర్ సెంటర్‌ను అందుబాటులోకి తేవడం రైతులకు ఉపయోగకరమన్నారు. దూరప్రాంతాలకు వెళ్లి పురుగు మందులు కొనుగోలు చేయకుండా స్థానికంగానే మందులు అందుబాటులో ఉండటం రైతులకు అన్నివిధాల బాగుంటుందన్నారు. పంటల బీమా, యంత్ర పరికరాల గురించి రైతులకు వివరించారు. కోరమాండల్ కోరొకేర్ విజయవాడ మార్కెట్ జోనల్ హెడ్ భానుప్రకాష్, సురేష్ మాట్లాడుతూ.. కొనకనమిట్లలో ఏర్పాటు చేసిన సెంటర్ ఏపిలో రెండోదని వివరించారు. పురుగు మందుల పిచికారీకి అవసరమైన డ్రోన్‌ను రైతులకు అందిస్తాన్నారు. కార్యక్రమంలో దర్శి ఏడీఏ బాలాజీనాయక్, స్థానిక ఏఓ ప్రసన్న రంగలక్ష్మి, కోరొకేర్ సెంటర్ ప్రతినిధులు, మాజీ సర్పంచ్ పి.కొండారెడ్డి, యక్కంటి తిరుపతిరెడ్డి, గొలమారి తిరుపతిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు -
స్టాకు సక్రమం.. కేసు అక్రమం
● స్టాక్ సక్రమంగా ఉన్నా కేసు పెట్టారని ఆరోపించిన నల్లగుంట్ల డీలర్ ● ఉన్నత స్థాయిలో ఒత్తిడి ఉందన్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొమరోలు: ౖవెఎస్సార్ సీపీ సానుభూతిపరుడైన రేషన్ డీలర్‌పై ఉద్దేశపూర్వకంగా 6ఏ కేసు నమోదైంది. వివరాలు.. కొమరోలు మండలంలోని నల్లగుంట్ల గ్రామంలో రేషన్ దుకాణాన్ని గిద్దలూరు ఎన్ఫోర్స్మెంట్ డీటీ స్వాతి శుక్రవారం తనిఖీ చేశారు. రేషన్ దుకాణంలో 1560 కిలోల బియ్యానికి బదులు 610 కిలోలే నిల్వ ఉన్నాయని పేర్కొంటూ కేసు నమోదు చేశారు. విచారణకు డీలర్ సహకరించలేదని డీటీ చెప్పారు. ఇదిలా ఉండగా.. రేషన్ డీలర్ జేమ్స్ మాట్లాడుతూ.. రేషన్ దుకాణంలో బియ్యం నిల్వలు సక్రమంగా ఉన్నాయని, తాను వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడిని కావడంతో అధికారులు ఒత్తిళ్లకు లోనై కేసు బనాయించారని ఆరోపించారు. కచ్చితమైన నిల్వలు ఉన్నప్పటికీ కేసు నమోదు చేస్తామని డీటీ స్పష్టం చేయడంతో రేషన్ -
నెలాఖరులోగా సొసైటీల డిజిటలైజేషన్
● కలెక్టర్ తమీమ్ అన్సారియా టంగుటూరు: జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల డిజిటలైజేషన్ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేయాలని పీడీసీసీ బ్యాంకు అధికారులను కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం టంగుటూరు మండలం కొణిజేడు పీఏసీఎస్‌లో చేపట్టిన డిజిటలైజేషన్ ప్రక్రియను జేసీ గోపాల కృష్ణతో కలిసి పరిశీలించారు. కంప్యూటరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన ఎఫ్హెచ్ఆర్, ఎఫ్వీఆర్, సైట్ ప్రిపరేషన్, హార్డ్‌వేర్ పరికరాలు, ఇన్స్టాలేషన్, డీసీటీ డేటా, సభ్యత్వం, డిపాజిట్లు, భూమి, పెట్టుబడులు, రుణాలు, డీసీటీ సైన్ ఆఫ్, టి 8 సర్టిఫికెట్, ప్రీ మైగ్రేషన్ ప్రాసెస్, సొసైటీ ట్రైల్ బ్యాలెన్స్, టి 12 సర్టిఫికెట్ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. డిసెంబర్ నుంచి లావాదేవీలన్నీ ఆన్లైన్లో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఈఓ బిందు ప్రత్యూష, పీడీసీసీ బ్యాంకు ఏజీఎం సుబానీ, బ్రాంచ్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. నేడు ఆట్యాపాట్యా జిల్లా సీనియర్ జట్ల ఎంపిక ఒంగోలు: ఆట్యాపాట్యా జిల్లా పురుష, మహిళల జట్ల ఎంపిక శనివారం స్థానిక ఏబీఎం జూనియర్ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు ఆట్యాపాట్యా జిల్లా అధ్యక్షుడు నంబూరు శ్రీనివాసరావు తెలిపారు. సాయంత్రం 3 గంటలకు ఎంపిక పోటీలు నిర్వహిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న జట్లు ఈనెల 30వ తేదీ నుంచి భీమవరంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
సర్కారీ వైద్యం.. నామమాత్రం!
దర్శి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదలకు వైద్య సేవలందించాల్సిన డాక్టర్లలో కొందరు ప్రైవేట్ సేవల్లో మునిగితేలుతున్నారు. ఆన్ డ్యూటీ పేరుతో వైద్యశాలకు డుమ్మా కొట్టి సొంత ఆస్పత్రులు, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారికి ఇష్టం వచ్చినప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి హాజరు రిజిస్టర్లో దర్జాగా సంతకాలు చేసి వెళ్తున్నారు. జిల్లా ఆస్పత్రులతోపాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కొందరు వైద్యులు అటు ప్రభుత్వం, ఇటు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వేతనం పొందుతూ కాలం గడిపేస్తున్నట్లు తీవ్ర స్థాయిలో విమర్శలొస్తున్నాయి. డీఎంహెచ్ఓ పర్యవేక్షణ కొరవడటంతోనే ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని జీజీహెచ్, మార్కాపురంలోని జీజీహెచ్‌తోపాటు, 64 పీహెచ్‌సీలు, 19 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. ఆస్పత్రి పని వేళల్లో పేద ప్రజలకు అందుబాటులో ఉండకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సేవలందిస్తున్న తీరుపై జిల్లాలో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. ప్రభుత్వ వైద్యులు ప్రైవేటుగా వైద్యశాలలు నిర్వహించడం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయడం నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ.. అడ్డు చెప్పేవారు లేకపోవడంతో సర్కారీ ఆస్పత్రుల్లో సక్రమంగా సేవలందడం లేదు. వైద్యులు లేకపోవడంతో నర్సులు ఇచ్చిన మాత్రలు తీసుకుని తమను తాము నిందించుకుంటూ పేదలు ఇంటి బాట పడుతున్నారు. ఆస్పత్రుల్లో డాక్టర్లు విధులకు డుమ్మా కొడుతున్న తీరు ఇదీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నా ఆ శాఖ ఉన్నతాధికారులు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోవడం ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. చందలూరు పీహెచ్సీలో సేవలు దైన్యం దర్శి మండలంలోని చందలూరు పీహెచ్సీలో వైద్యులు విధులకు సక్రమంగా రాకపోవడంతో రోగులకు నర్సులే మాత్రలు ఇచ్చి పంపుతున్నారు. పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉండగా ఒక్కరు కూడా విధులకు సక్రమంగా హాజరు కావడం లేదు. వైద్యులు ఎందుకు రావడం లేదని స్థానిక సర్పంచ్ భర్త పీహెచ్సీ సిబ్బందిని పలుమార్లు ప్రశ్నించగా మౌనమే సమాధానమైంది. ఇష్టారీతిగా సంతకాలు డాక్టర్ బ్లెస్సీ ఆగస్టులో 15వ తేదీ వరకు మాత్రమే హాజరైనట్లు సంతకాలు ఉన్నాయి. సిబ్బంది మాత్రం ఆగస్టు 25వ తేదీ వరకు సంతకాలు పెట్టారు. డాక్టర్ బ్లెస్సీ మాత్రం నెలాఖరున వచ్చి అన్ని సంతకాలు పెట్టుకుని వెళ్లడం గమనార్హం. సెప్టెంబర్‌లో 10వ తేదీ వరకు డాక్టర్ బ్లెస్సీ సంతకాలు పెట్టి ఉండగా సిబ్బంది 20వ తేదీ వరకు సంతకాలు చేశారు. అక్టోబర్‌లో కూడా ఆమె 7వ తేదీ వరకు మాత్రమే సంతకాలు చేయగా సిబ్బంది మాత్రం 18వ తేదీ వరకు పెట్టారు. నవంబర్‌లో కూడా ఈ డాక్టర్ 15వ తేదీ వరకు మాత్రమే సంతకాలు పెట్టగా సిబ్బంది మాత్రం 20వ తేదీ వరకు సంతకాలు పెట్టారు. సంతకాలు లేని చోట సీఎల్ అని రాయాల్సి ఉన్నా ఖాళీగా వదిలేయడం గమనార్హం. డీఎంహెచ్ఓ తమ బంధువని చెప్పుకుంటూ పీహెచ్‌సీకి రాకుండా ప్రైవేట్ వైద్యశాలల్లో పని చేస్తున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది. తమకు సెలవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కింది స్థాయి సిబ్బంది వాపోతున్నారు. ఈ వైద్యురాలిని చూసి మరో వైద్యుడు కూడా రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోతున్నారు. ఈయన సొంత వైద్యశాల నిర్వహణకే పరిమితం అవుతున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు. వైద్యురాలి భర్త కూడా ఉప్పలపాడు పీహెచ్సీలో డాక్టర్ కాగా దర్శిలోని శివరాజనగర్‌లో ఒక వైద్యశాల నిర్వహిస్తూ మరో ప్రైవేట్ వైద్యశాలలోనూ పనిచేస్తున్నారు. ఈ తరహాలోనే జిల్లాలోని పలువురు ప్రభుత్వ వైద్యులు పనిచేస్తుండటంతో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందని ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. పీహెచ్‌సీల్లో పేదలకు సక్రమంగా అందని వైద్య సేవలు ప్రైవేట్ సేవల్లో తరిస్తున్న కొందరు ప్రభుత్వ వైద్యులు వైద్య సిబ్బందితో రోగులకు మాత్రలు ఇచ్చి పంపిస్తున్న వైనం చుట్టపుచూపుగా వచ్చి రిజిస్టర్లో ఒకేసారి సంతకాలు డీఎంహెచ్ఓ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు నీరుగారిన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం పేదల గడప వద్దకే ఉన్నత వైద్యం అందించాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంను కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా, పదుల సంఖ్యలో డెంగీ మరణాలు నమోదైనా కనీసం వైద్య శిబిరాలు నిర్వహించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అత్యవసర మందుల సరఫరా కాంట్రాక్టును ఇటీవల పాత పద్ధతిలోకి మార్చడంతో ఆస్పత్రుల్లో గందరగోళం నెలకొంది. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాలు నిర్వహించకుండానే రికార్డుల్లో మాత్రం సేవలందించినట్లు చూపెడుతుండటంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. -
అత్యాచారాలు అరికట్టడంలో పాలకుల వైఫల్యం
● విశాఖ లా విద్యార్థినిపై అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన ఒంగోలు టౌన్: రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు విఫలమయ్యారని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. విశాఖలో లా విద్యార్థినిపై జరిగిన లైంగికదాడిని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ, ఐద్వాల ఆధ్వర్యంలో సాయిబాబా గుడి సెంటర్, ప్రకాశం పంతులు విగ్రహం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కలకత్తా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన లైంగిక దాడి ఘటన మరవక ముందే లా విద్యార్థినిపై క్రూరమైన దాడి చేయడం అమానుషం అన్నారు. విశాఖ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరసగా జరుగుతున్న దాడుల్లో మహిళలు బలి పశువులుగా మారారని, ఈ ఘటనల మీద అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏరులై పారుతోందని, విచ్చలవిడిగా మత్తు పదార్థాలను చెలామణి చేయడం వలన యువత మత్తుకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుకు బానిసలై మహిళలపై పాశవికంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారని, వాటిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలకు రక్షణ కల్పిస్తామన్న కూటమి మాటలు గాలిలో కలిసిపోయాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వినోద్ విమర్శించారు. పోర్న్ వెబ్సైట్లను నిషేధించాలని, పోక్సో చట్టం ద్వారా విచారణ చేపట్టాలని, జస్టిస్ వర్మ సిఫారుసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు మాలతి, నాగుర్, ఆదిలక్ష్మి, గోవిందమ్మ, పెద గోవిందమ్మ, ఎస్ఎఫ్ఐ నాయకుల విజయ్ పాల్గొన్నారు. -
అత్యాచారాలు అరికట్టడంలో పాలకుల వైఫల్యం
● విశాఖ లా విద్యార్థినిపై అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన ఒంగోలు టౌన్: రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు విఫలమయ్యారని ఐద్వా జిల్లా కార్యదర్శి కంకణాల రమాదేవి విమర్శించారు. విశాఖలో లా విద్యార్థినిపై జరిగిన లైంగికదాడిని ఖండిస్తూ ఎస్ఎఫ్ఐ, ఐద్వాల ఆధ్వర్యంలో సాయిబాబా గుడి సెంటర్, ప్రకాశం పంతులు విగ్రహం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, విద్యార్థినులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కలకత్తా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన లైంగిక దాడి ఘటన మరవక ముందే లా విద్యార్థినిపై క్రూరమైన దాడి చేయడం అమానుషం అన్నారు. విశాఖ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరసగా జరుగుతున్న దాడుల్లో మహిళలు బలి పశువులుగా మారారని, ఈ ఘటనల మీద అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం ఏరులై పారుతోందని, విచ్చలవిడిగా మత్తు పదార్థాలను చెలామణి చేయడం వలన యువత మత్తుకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుకు బానిసలై మహిళలపై పాశవికంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారని, వాటిని అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలకు రక్షణ కల్పిస్తామన్న కూటమి మాటలు గాలిలో కలిసిపోయాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సీహెచ్ వినోద్ విమర్శించారు. పోర్న్ వెబ్సైట్లను నిషేధించాలని, పోక్సో చట్టం ద్వారా విచారణ చేపట్టాలని, జస్టిస్ వర్మ సిఫారుసులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు మాలతి, నాగుర్, ఆదిలక్ష్మి, గోవిందమ్మ, పెద గోవిందమ్మ, ఎస్ఎఫ్ఐ నాయకుల విజయ్ పాల్గొన్నారు. -
మత్స్యకారుల ఉపాధి మెరుగుపరిచేలా చర్యలు
ఒంగోలు అర్బన్: మత్స్యకారుల సంక్షేమంతో పాటు వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, ఆర్థికంగా అభివృద్ధి చెందేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం ప్రకాశం భవనంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. దీనిలో ఎంపీ, కలెక్టర్‌తో పాటు మేయర్ సుజాత, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. దీనిలో వక్తలు మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేయడం వల్ల మత్స్యకార గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. చేపల ఉత్పత్తిలో దేశంలో 29.1 శాతం వాటాతో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విజయవాడలో వచ్చిన వరదల సమయంలో చెప్పిన వెంటన 35 బోట్లతో 75 మంది మత్స్యకారులు విజయవాడకు వెళ్లి వారంపాటు వరద సహాయక చర్యల్లో పాల్గొనటం అభినందనీయమన్నారు. వారి సహకారం మరువలేనిదని అదే స్ఫూర్తితో ఎప్పుడూ ప్రజలకు సేవలు అవసరమైనా అందించాలని కోరారు. తమిళనాడు నుంచి వస్తున్న సోనా బోట్ల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కొత్తపట్నం, పాకల బీచ్‌లను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మత్స్యకారులు వారు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరారు. వరదల్లో సహాయక చర్యల్లో పాల్గొన్న మత్స్యకారులను సత్కరించారు. కార్యక్రమంలో మత్స్యకారులతో పాటు పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో మత్స్యకారుల సహకారం మరువలేనిది మత్స్యకార దినోత్సవంలో ఎంపీ మాగుంట, కలెక్టర్ తమీమ్ అన్సారియా -
అగ్రగామిగా ఉండటం సంతోషం
ఫిషరీస్ రంగంలో ● ఏకేయూ వీసీ డి.వి.ఆర్.మూర్తి ఒంగోలు సిటీ: ఫిషరీస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా నిలవడం సంతోషకరమని ఏకేయూ వైస్ ఛాన్సలర్ డి.వి.ఆర్.మూర్తి అన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ప్రపంచ మత్స్యకార దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఏకేయూ ఆక్వాకల్చర్ డిపార్టుమెంట్ హెచ్‌వోడీ ప్రొఫెసర్ బి.హరిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వీసీ మూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యవసాయ రంగంతో పాటు చేపల పెంపకం, రొయ్యల పెంపకం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున గుజరాత్ కంటే మన రాష్ట్రం ఆక్వాసాగులో అధికంగా ఉందన్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు మాట్లాడుతూ ఆక్వాసాగు అధికంగా సాగు చేయడానికి ప్రధాన కారణం కోస్తా తీర ప్రాంతం వాతావరణం దృష్ట్యా మంచి వసతులు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో ఆంధ్రకేసరి యూనివర్సిటీలో ఆక్వాకల్చర్ డిపార్టుమెంట్ ను బాగా అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆక్వా కల్చర్ డిపార్టుమెంట్ ద్వారా జాతీయ స్థాయిలో సెమినార్లు నిర్వహించి అధ్యాపకులకు, విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తారన్నారు. వీసీ మూర్తి, రిజిస్ట్రార్ బి.హరిబాబు దేవి సీపుడ్స్ ఫుడ్ డివిజన్ మేనేజరు అన్సారితో పాటు పలువురిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజమోహనరావు, ఆక్వాకల్చర్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు డాక్టర్ బి.సురేష్, డాక్టర్ అశ్వర్ధనారాయణ, మార్కెటింగ్ విభాగం మేనేజరు ఎం.నాగరాజు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ప్రకాశం
30/227గరిష్టం/కనిష్టంసైబర్ నేరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలి సైబర్ నేరాలపై గ్రామ, వార్డు స్థాయిలో మహిళా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. సర్పంచ్ల పవర్‌కు చెక్.. కూటమి ప్రభుత్వం సర్పంచ్ల అధికారానికి చెక్ పెట్టింది. గ్రామాల్లో చేసే పనులకు సర్పంచ్ లతో సంబంధం లేకుండా చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. వాతావరణంలో తేమ శాతం అధికం. రాత్రి చలిగాలులు వీస్తాయి. – 8లో.. శుక్రవారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2024 -
నేడు త్రోబాల్ జిల్లా జట్ల ఎంపికలు
దర్శి: చందలూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉమ్మడి జిల్లాల త్రోబాల్ అండర్–14, అండర్–17 జిల్లా జట్ల ఎంపికలు శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ ఎండీ హజీరాబేగం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి జరిగే కార్యక్రమానికి పీడీలు, పీఈటీలు హాజరు కావాలని కోరారు. మహిళ కడుపులో 7 కిలోల కణితి తొలగింపు ఒంగోలు టౌన్: నగరంలోని శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక మహిళ కడుపులో నుంచి 7 కిలోల కణితిని తొలగించారు. గురువారం ఆస్పత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరక్టర్ డా.చాపల వంశీకృష్ణ వివరాలు వెల్లడించారు. దర్శి ప్రాంతానికి చెందిన మహిళ ఒకరు కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. ఇటీవల నగరంలోని శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చికిత్స కోసం వచ్చారు. ప్రసూతి, గర్భకోశ వ్యాధుల నిపుణులు డా.చాపల శాంత కుమారిని సంప్రదించారు. ఆల్ట్రా సౌండ్ తదితల పరీక్షలు నిర్వహించగా ఆమె కడుపులో పెద్ద కణితి ఉన్నట్లు నిర్ధారించారు. వెంటనే ఆపరేషన్ చేసి కణితిని తొలగించి ప్రాణాలను రక్షించారు. ఆపరేషన్ చేసి తొలగించిన కణితి 7 కిలోల బరువు ఉంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
వైఎస్ జగన్‌ను కలిసిన వైఎస్సార్ సీపీ నాయకులు
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ని తాడేపల్లిలో జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు కలిశారు. రాజ్యసభ సభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్చార్జ్ చుండూరి రవిబాబు, లిడ్ క్యాప్ మాజీ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, జెడ్పీటీసీ సైకం లక్ష్మీశారద, ఆళ్ల రవీంద్రారెడ్డి, సైకం రాంబాబు, కార్పొరేటర్లు వెన్నపూస కుమారి, ఇమ్రాన్‌ఖాన్, ప్రవీణ్ కుమార్, పార్టీ నాయకుడు వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి, కో ఆప్షన్ మెంబర్లు ఎస్కే.రషిదా, ఎస్కే నాగుర్, శ్యాంసాగర్, పార్టీ నాయకులు కఠారి ప్రసాద్, చావలి శివప్రసాద్, పి.సురేష్, బి.రవణమ్మ, పుల్లయ్య, వెంకటరెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఒంగోలు నియోజకవర్గంలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌ను కలిసిన బూచేపల్లి ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తాడేపల్లిలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. -
కానిస్టేబుల్‌పై దాడి కేసులో రాజీ ప్రయత్నాలు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఒంగోలు తాలూకా పోలీసు కానిస్టేబుల్ శ్రీనివాసరావుపై దాడి కేసులో పలువురు రాజకీయ ప్రముఖులు రంగప్రవేశం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిందితుడు బోడెపూడి రాంబాబుకు మద్దతుగా ఇద్దరు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసు కానిస్టేబుల్ శ్రీనివాసరావుపై దాడి చేసి తీవ్రంగా కొట్టిన నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు తాత్సారం చేస్తున్నట్లు పోలీసు శాఖలోని కొందరు ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. నిందితుడు అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడమే కాకుండా అధికార పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్లనే చర్యలు తీసుకునేందుకు మల్లగుల్లాలు పడుతున్నారని విమర్శిస్తున్నారు. చిన్న చిన్న కేసుల్లో నిందితులను పట్టుకొని కేసులు పెడుతున్న పోలీసులు.. ఏకంగా ఓ పోలీసునే నడిరోడ్డుపై కొట్టిన కేసులో ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టారని కేసులు పెట్టి ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి విచారణ పేరుతో వేధిస్తున్న పోలీసులు సొంత శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌పై దాడి చేసిన నిందితుడి విషయంలో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొంచడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానిస్టేబుల్ శ్రీనివాసరావును అకారణంగా కొట్టడమే కాకుండా చేయి కొరికి, కారును పైకి దూకించి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడి పట్ల మెతకవైఖరి అవలంబించడం సరైన నిర్ణయం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా నిందితుడు గతంలో కూడా పలువురిపై ఇలాగే దాడులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని తెలుస్తోంది. దుందుడుకు స్వభావం కలిగిన నిందితుడిపై తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తవుతున్నాయి. -
ఆపద్బాంధవి
ఆపదలోఆపదలో ఉన్న వారికి అత్యవసర వైద్యం కోసం ఠక్కున గుర్తుకొచ్చే ఆపద్బాంధవి 108కే ఆపద ఎదురైంది. ఓ వైపు సిబ్బంది కొరత వేధిస్తుండగా మరో వైపు ఉన్న వారికీ జీతాలు సక్రమంగా రావడం లేదు. సిబ్బంది లేరన్న సాకుతో సెలవులు లేక ఉద్యోగులు తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించి 108 సర్వీసులను గాడిలో పెట్టాలని ఉద్యోగులు నిరసన తెలిపినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. దీంతో వారు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఒంగోలు టౌన్: 108.. ఈ పేరు వింటేనే చాలు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు కుయ్ కుయ్‌మంటూ వచ్చే అంబులెన్స్ కళ్ల ముందు కదలాడుతుంది. ఎక్కడైనా సరే...ఎవరికై నా సరే ...ఎలాంటి ప్రమాదం ఏర్పడినా, అత్యవసర ఆరోగ్య సమస్య తలెత్తినా వెంటనే 108కు ఫోన్ చేయడం గత 20 ఏళ్లుగా రాష్ట్ర ప్రజలకు అలవాటైపోయింది. ముఖ్యంగా నిరుపేద సామాన్య ప్రజలకు 108 ఇచ్చిన భరోసా అంతా ఇంతా కాదు. అలాంటి 108 ఇప్పుడు సమస్యల సుడిగుండంలో పడిపోయింది. ఒకవైపు సిబ్బంది కొరత వేధిస్తుంటే మరోవైపు సకాలంలో వేతనాలు రాక సిబ్బంది అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్కీంలో భాగంగా అరబిందో ఉద్యోగులుగా పరిగణించబడుతున్న వీరికి రావాల్సిన బకాయిల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఇక వేల కిలో మీటర్లు తిరిగిన వాహనాలు కుయ్యో మొర్రో అని మొరాయిస్తుంటే భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. సెలవులు లేక మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలా 108 ఉద్యోగులను కదిలిస్తే ఎన్నో సమస్యలు... మరెన్నో ఇబ్బందులు చెబుతున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి మాత్రం ఇవేవీ పట్టించుకునే తీరిక లేదు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలన్న బాధ్యత మరిచి రాజకీయాలకు ఎనలేని ప్రాధాన్యత ఇస్తోంది. సిబ్బంది సమస్యలను వదిలేసి అరబిందో వెనకబడింది. దాంతో 108 ఉద్యోగులు మరింతగా సమస్యల్లో కూరుకుని పోయారు. ఈ నేపథ్యంలో గత సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా వేడుకున్నాడు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుకు లేదు పలుకు లేదు. సహనం నశించిన ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. 38 మండలాలు...40 వాహనాలు: జిల్లాలో 38 మండలాలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 40 నూటెనిమిది వాహనాలు ప్రజలకు అత్యవసర సేవలు అందిస్తున్నాయి. మండలానికి ఒకటి చొప్పున 38 వాహనాలు ఉండగా మార్కాపురంలో నవజాత శిశువులు అత్యవసర సేవల కోసం అప్పటి ప్రభుత్వం ఒక వాహనాన్ని కేటాయించింది. సాధారణ ఎన్నికలకు ముందు గిరిజన ప్రాంతాల ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక వాహనాన్ని కేటాయించారు. దాంతో మొత్తం 40 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం 35 వాహనాలు పనిచేస్తుండగా 5 వాహనాలకు మాత్రం మరమ్మతులు జరుగుతున్నాయి. 2023లో అప్పటి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం 14 కొత్త వాహనాలను జిల్లాకు కేటాయించింది. లేకపోతే పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉండేది. ప్రతి అంబులెన్స్‌లోనూ 2.5 రేషియో ప్రకారం ఒక ఎమర్జన్సీ మెడికల్ టెక్నీషియన్, ఒక పైలట్ ఉంటారు. జిల్లాలో 200 మంది సిబ్బందికి గాను 185 మంది మాత్రమే ఉన్నారు. వారిలో 95 మంది ఈఎంటీలు కాగా, 90 మంది పైలట్లు ఉన్నారు. 8 మంది పైలట్లు, ఏడుగురు ఈఎంటీ సిబ్బంది అవసరం ఉంది. సెలవులు లేక ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు... జిల్లాలో 108లో సిబ్బంది కొరత వేధిస్తోంది. రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. లేబర్ యాక్టు ప్రకారం 48 గంటలకు ఒక వీకాఫ్ ఇవ్వాల్సి ఉంది. సిబ్బంది కొరతతో 96 గంటలకు ఒకరోజు సెలవు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిజానికి సిబ్బంది లేరన్న సాకులు చెబుతూ సెలవులు ఇవ్వడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఒకవేళ ఎవరైనా అత్యవసర పనుల మీద సెలవు పెట్టాలంటే తనకు బదులుగా మరొకరిని చూపిస్తేనే కానీ సెలవులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. రిఫర్ కేసులకు ప్రాధాన్యత... జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తీసుకొచ్చిన కేసులను గుంటూరుకు రెఫర్ చేస్తారు. దాంతో వారిని 108 వాహనంలో గుంటూరు తీసుకెళ్తున్నారు. ఇది అత్యవసర సేవలకు ఇబ్బందిగా మారిందని 108 ఉద్యోగులు చెబుతున్నారు. నిజానికి రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, కాన్పులు, పాముకాటు, తేలుకాటు, క్రిమి సంహారక మందులు తీసుకొని ఆత్మహత్యా ప్రయత్నాలు చేసినప్పుడు వారిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలించడం 108 లక్ష్యం. ఇప్పుడు అందుకు విరుద్ధంగా జరుగుతోంది. కిడ్నీ డయాలసిస్ రోగులను తీసుకొచ్చి, తిరిగి ఇంటి దగ్గర వదిలి పెట్టి రావడం, ఇతర చిన్న చితకా కేసుల్లో గుంటూరుకు రోగులను తీసుకెళ్లడం లాంటి పనులకు 108 ను వినియోగించడం వలన అత్యవసర సమయంలో ఏదైనా ఫోను వచ్చినా, ఏమీ చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయని పైలట్లు చెబుతున్నారు. ప్రతి రోజూ ఒంగోలు జీజీహెచ్ నుంచి గుంటూరుకు కేసులను వైద్యులు రెఫర్ చేస్తున్నారు. ఏ మాత్రం క్రిటికల్ కేసులు వచ్చినా గుంటూరుకు రెఫర్ రాసేసి చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. అలాగే మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు నుంచి ఒంగోలుకు రెఫర్ చేస్తున్నట్లు సమాచారం. దానివలన ప్రాణాపాయంలో ఉన్న ఇతర రోగులకు అంబులెన్సు అందుబాటులో లేకుండా పోతోంది. జీజీహెచ్ అధికారులు ఈ విషయం మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 108 ఉద్యోగుల చేత వెట్టిచాకిరి చేయించడం దారుణం 108 ఉద్యోగుల చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారు. కార్మిక చట్టాల ప్రకారం రోజుకు 8 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంది. కానీ 108లో మాత్రం 12 గంటలు పని చేయిస్తున్నారు. అదనపు పనికి ఎలాంటి అదనపు వేతనం కూడా చెల్లించకపోవడం దుర్మార్గం. కార్మికుల దగ్గర నుంచి పీఎఫ్, ఈఎస్ఐ తాలుకు సొమ్మును వసూలు చేయడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలి. రాష్ట్రంలో వందలాది సంస్థలను నిర్వహిస్తున్న ప్రభుత్వానికి 108 ను నిర్వహించడం ఒక లెక్కలోనిది కాదు. సొంత వ్యక్తులకు సంపాదించి పెట్టడం కోసమే ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారు. దానికి బదులుగా ప్రభుత్వమే 108ను నిర్వహించాలి. – వెన్నా గాలిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, 108 కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె బాటలో 108 ఉద్యోగులు 108 సర్వీసులోని ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని, 108ను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతున్నారు. పీఎఫ్, ఎర్న్డ్ లీవులకు సంబంధించి బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, వార్షిక ఇంక్రిమెంట్లు చెల్లించాలని కోరుతున్నారు. ప్రతి నెలా 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టే నియామకాల్లో వెయిటేజి మార్కులు ఇచ్చి 108 ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సమస్యల సాధన కోసం ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న 108 ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో ఈ నెల 24 లోపు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే 25వ తేదీ తరువాత ఏ క్షణంలోనైనా సమ్మెలోకి వెళ్లాలని 108 కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ముందస్తు నోటీసులు అందజేశారు. సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్న 108 జీతాలు సక్రమంగా రాకపోవడంతో ఉద్యోగులకు తప్పని తిప్పలు సెలవులు లేక ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగులు ప్రభుత్వమే 108ను నిర్వహించాలని విన్నపం 108 ఉద్యోగుల సమస్యలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం 25 తరువాత సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయం అడ్రసు లేకుండా పోతున్న 108 వాహనాలు ప్రమాదం జరిగిన వ్యక్తిని కానీ, గుండెపోటు లాంటివి వచ్చిన వ్యక్తిని కానీ సాధ్యమైనంత త్వరగా ఆస్పత్రికి చేర్చాలి. అప్పుడే బాధితుడు బతికే అవకాశాలు మెరుగుపడతాయి. స్వతహాగా వైద్యుడైన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పరిస్థితిని గమనించి 108 అత్యవసర సేవలకు రూపకల్పన చేశారు. లక్షల మంది ప్రాణాలను 108 వాహనాలు కాపాడుతున్నాయి. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. అత్యవసర సమయంలో ఫోన్లు చేస్తే 108 వాహనాలు అందుబాటులో ఉండడం లేదు. కొన్ని చోట్ల చాలా ఆలస్యంగా వస్తున్నాయి. అప్పటికే సమయం మించిపోతుంది. బాధితులు ప్రాణాలు కోల్పోతారు. అందుకే ఇప్పుడు 108 వాహనాల కోసం ఎదురు చూడడం మాని ప్రైవేటు వాహనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అత్యవసరమైతే ఆటోల్లో బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వలన 108 కునికిపాట్లు పడుతుందని ప్రజలు విమర్శిస్తున్నారు. -
24న కబడ్డీ జట్ల ఎంపిక
ఒంగోలు: జిల్లా సీ్త్ర, పురుష కబడ్డీ జట్ల ఎంపిక ఈ నెల 24న స్థానిక డాక్టర్ పర్వతరెడ్డి ఆనంద్ మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కుర్రా భాస్కరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మ్యాట్‌పై ఎంపిక జరుగుతుందని, ఆసక్తి ఉన్న వారు నేరుగా ఎంపికకు హాజరుకావాలన్నారు. పురుషుల విభాగంలో 85 కేజీల లోపు, మహిళల విభాగంలో 75 కేజీల లోపు బరువు కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఎంపికై న జట్లు త్వరలో సంతనూతలపాడులో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పూర్ణచంద్రరావు 9948343232, 7780497696 నంబర్లను సంప్రదించాలని కోరారు. 24న స్విమ్మింగ్ జిల్లా జట్ల ఎంపిక ఒంగోలు: సబ్ జూనియర్, జూనియర్ స్విమ్మింగ్ జిల్లా జట్ల ఎంపిక ఈ నెల 24న నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా అమెచ్యూర్ అక్వాటిక్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.చంద్రశేఖరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక నెక్ట్స్ జెన్ ఇంటర్నేషనల్ స్కూలు ఆవరణలో ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుందన్నారు. ఆసక్తి ఉన్న వారు తమ వయస్సు ధృవీకరణ పత్రం, ఆధార్‌కార్డుతో నేరుగా రిపోర్టు చేయాలన్నారు. ఫ్రీస్టైల్ 50మీ, 100మీ, 200మీ, బ్యాక్ స్ట్రోక్ 50మీ, 100మీటర్లు, బ్రెస్ట్ స్ట్రోక్ 50మీ, 100 మీటర్లు, బటర్ ఫ్లై 50మీటర్లు, 100 మీటర్లు ఈవెంట్స్‌లో ఎంపిక ఉంటుందని, ఎంపికై న వారు డిసెంబర్ 7,8 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపిక సంతనూతలపాడు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 3, 4 , 5 తేదీల్లో పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగిన అండర్ 17 రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో మైనంపాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. పాఠశాల విద్యార్థులు టి.శృతి, కె.చరణ్‌కుమార్ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని ప్రధానోపాధ్యాయుడు డీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 22 నుంచి 27 వరకు హర్యానాలో జరగనున్న జాతీయస్థాయి హాకీ టోర్నమెంట్లో పాల్గొంటారని పీఈటీ తిరుమలశెట్టి రవికుమార్ తెలిపారు. పేరెంట్స్ కమిటీ చైర్మన్ ఆకుల బ్రహ్మయ్య, పీడీ కె.వనజ, సిబ్బంది పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులను హాకీ క్లబ్ మైనంపాడు సభ్యులు, గ్రామస్తులు అభినందించారు. 24న కార్తీక వనభోజనాలు ఒంగోలు వన్‌టౌన్: రెడ్డి జనాభ్యుదయ సంఘ కార్తీక వనభోజనాలను ఈ నెల 24న కందుల ఓబుల్ రెడ్డి రిజర్వాయర్, మల్లవరం డ్యాం, గుండ్లాపల్లి వద్ద ఉదయం 8 గంటలకు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహక సభ్యులు గుడిపాటి చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలులోని రెడ్డి హాస్టల్లో కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యుల సమావేశం గురువారం నిర్వహించారు. లింగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 2012 నుంచి కార్తీక వనభోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సప్త హోమాల కార్యక్రమంలో పాల్గొనే దంపతులు ముందుగా 9440265670 అనే నంబరుకు ఫోన్‌చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి, వెన్నపూస వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా వ్యవహరించాలి
ఒంగోలు టౌన్: ౖసెబర్ నేరాలపై గ్రామ, వార్డు స్థాయిలో మహిళా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని, నేరాల నియంత్రణతో పాటుగా అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడంలో క్రియాశీల పాత్ర పోషించాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయం నుంచి గురువారం వీడియా కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పాఠశాలలకు చెందిన విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు, సోషల్ మీడియాలో పరిచయాలు, ఆన్లైన్ ప్రేమలు, వేధింపుల విషయాల్లో చట్టాల గురించి వివరించాలని తెలిపారు. మహిళలు, పిల్లలు నేరాలకు గురికాక ముందే అవగాహన కల్పించడం మేలన్నారు. సోషల్ మీడియా వేదికను దుర్వినియోగం చేస్తూ జరుగుతున్న సైబర్ నేరాలపై ముందస్తు జాగ్రతలు తీసుకోవాలన్నారు. ప్రజల అత్యాశ, భయాందోళనలను ఆసరా చేసుకొని వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని, వాటిపై మహిళలకు సరైన అవగాహన కల్పించడం ద్వారా ఆ నేరాల బారిన పడకుండా కాపాడాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత పడేలా చూడాలన్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ప్రభావం ఆయా కుటుంబాలపై తీవ్రంగా ఉంటుందన్నారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం నేరమని, ట్రాఫిక్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రతలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. మాదక ద్రవ్యాల కేసుల్లో పట్టుపడి పోలీసు రికార్డుల్లో పేరు ఎక్కితే భవిష్యత్‌లో ఉద్యోగాలు రావని, జీవితాలు దెబ్బతింటాయని చెప్పారు. విద్యార్థు లు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండే విధంగా చూడాలన్నారు. మంచి వాతావరణంలో ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అలవరుచుకోవాలని సూచించారు. గ్రామ స్థాయిలో శాంతి భద్రలకు విఘాతం కలిగించే వ్యక్తుల సమాచారాన్ని సేకరించి ఉన్నతాధికారులకు తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, ఎస్బీ ఇన్స్పెక్టర్ కేవీ రాఘవేంద్ర, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ ఏఆర్ దామోదర్