దుస్తులు లేకపోతేనే సౌఖ్యమట!
అహ్మదాబాద్: బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ సినిమాలకు, నిజజీవితానికి ఓ దగ్గరి లంకె ఉంది. సల్మాన్ వెండితెర మీద చొక్కా విప్పి.. కనిపించగానే అభిమానులు వెర్రెత్తిపోతారు. అభిమానుల విజిల్స్‌తో, ఆనందంతో థియేటర్లు ఊగిపోతాయి. అదేవిధంగా నిజజీవితంలోనూ ఆయన దుస్తులు వేసుకోవడం అసౌకర్యంగా భావిస్తారట. ఇంటి వద్ద తాను, తన తండ్రి సలీంఖాన్ (సినీ రచయిత) అతి పొదుపుగా దుస్తులు వేసుకుంటామని ఆయన తెలిపారు. ఖాదీ దుస్తులు ధరించడాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌డీసీఐ) అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సల్మాన్ పాల్గొన్నారు. 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో'లో సల్మాన్‌తో జోడీకట్టిన సోనం కపూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ 'దుస్తులు అంటే నాకు చాలా చికాకు. దుస్తులు వేసుకోవాలంటేనే నాకు ఏదో అయిపోతుంది. కావాల్సిందంటే మీరే ఒకరోజు మా ఇంటికి వచ్చి చూడండి. నేనే కాదు మా నాన్న కూడా అతి తక్కువ దుస్తుల్లో ఉంటాం. ప్యాంటు, బనియన్ లేదా కొన్ని సందర్భాలు చొక్కా తొడగకుండా ఛాతిని అలా ఉత్తిని వదిలేస్తాం' అని తెలిపారు. ఇక సల్మాన్ నటించిన 'ప్రేమ్‌రతన్ ధన్‌పాయో' సినిమా తెలుగులో 'ప్రేమలీల'గా డబ్ కానుంది.