నేడు నగరానికి వైఎస్ జగన్ రాక
మధ్యాహ్నం 1.30 గంటలకు : కండ్రికలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ
సాయంత్రం 5.30 గంటలకు : నగరంలో ఇఫ్తార్ విందు
సాక్షి ప్రతినిధి, విజయవాడ : వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నగరంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ దక్షిణ కృష్ణా అధ్యక్షుడు కె.పార్థసారథి తెలిపారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి వస్తారని, అక్కడి నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా సత్యనారాయణపురంలో నుంచి 59వ డివిజన్లో ఉన్న కండ్రిక చేరుకుంటారని పేర్కొన్నారు.
అక్కడ ఏర్పాటుచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మధ్యాహ్నం 1.30 గంటలకు జగన్ ఆవిష్కరిస్తారని, అనంతరం అక్కడి నుంచి నగరానికి వస్తారని తెలిపారు. సాయంత్రం 5.30 గంటలకు పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఎదురుగా స్వగృహ ఫుడ్స వెనుకవైపు ఉన్న తన ఖాళీ స్థలంలో జరిగే ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొంటారని పార్థసారథి వివరించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఆయన కోరారు.
భారీగా తరలిరండి : గౌతంరెడ్డి
విజయవాడ : కండ్రికలో మంగళవారం జరిగే వైఎస్సార్ విగ్రహావిష్కరణకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ర్ట అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. కండ్రికలో వ్యవసాయ ప్రాథమిక సొసైటీ వద్ద ఏర్పాటుచేసిన వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరిస్తారని ఆయన తెలిపారు.