Rajanna Sircilla District News
-
డీఈవోగా జగన్మోహన్రెడ్డి
● నాగర్‌కర్నూల్‌కు రమేశ్‌కుమార్ సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లా విద్యాధికారి రమేశ్‌కుమార్ నాగర్‌కర్నూల్‌కు బదిలీ అ య్యారు. ఆయన స్థానంలో జగిత్యాల జిల్లా డీఈవో జగన్మోహన్రెడ్డి రానున్నారు. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మిడ్‌మానేరులో 26 టీఎంసీలు బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరులో 26.63 టీఎంసీలకు నీటిమట్టం చేరింది. ప్రాజెక్టులోకి పై ప్రాంతం నుంచి ఎలాంటి ఇన్‌ఫ్లో లేదు. ప్రాజెక్టు నుంచి శుక్రవారం కుడికాల్వకు 150 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు.ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలి ● జిల్లా వైద్యాధికారి వసంతరావు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, హైరిస్క్ ప్రెగ్నెసీకి సంబంధించి రెగ్యులర్‌గా ఫాలోఅప్ చేయాలని జిల్లా వైద్యాధికారి వసంతరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో అంజలి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో నేషనల్ హెల్త్ ప్రోగ్రాంలో భాగంగా శుక్రవారం ఎంసీహెచ్, ఎన్సీకి సంబంధించి సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మొదటి 84 రోజుల్లోపే గర్భిణి వివరాలు నమోదు చేసి సంబంధిత ప్రాథమిక, జిల్లా ఆస్పత్రుల్లో క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు జరిపించాలని సూచించారు. ఎంసీహెచ్ కో–ఆర్డినేటర్ బాలచందర్, ఎన్సీడీ కో–ఆర్డినేటర్ సత్యనారాయణ, హెచ్ఈ బాలయ్య, ఇన్చార్జి మెడికల్ అధికారి స్రవంతి, డాక్టర్ చిరంజీవి ఉన్నారు. స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి ● డిప్యూటీ డీఎంహెచ్‌వో రజిత సిరిసిల్లటౌన్: స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో అంజలి సూచించారు. జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను శుక్రవారం తనిఖీ చేసి మాట్లాడారు. స్కానింగ్ సెంటర్లో పీసీపీఎన్డీ టీ పోస్టర్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫి కెట్లు, పొల్యూషన్, శానిటేషన్ సర్టిఫికెట్లు, డాక్టర్లు, సిబ్బంది వివరాలు, ధరల పట్టికను గోడలపై ప్రదర్శించాలని ఆదేశించారు. హెచ్ఈ బాలయ్య, సీహెచ్‌వో బాలచంద్రం పాల్గొన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడాలి గంభీరావుపేట(సిరిసిల్ల): ప్రభుత్వాస్పత్రుల్లో కాన్పులు జరిగేలా చూడాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో అంజలి సూచించారు. మండలంలోని లింగన్నపేట పీహెచ్‌సీని శుక్రవారం తనిఖీ చేసి మాట్లాడారు. ఏఎన్ఎంలు, ఆశకార్యకర్తలు ఇంటింటి సర్వే చేసి గర్భిణీల వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మండల వైద్యాధికారి స్రవంతి, హెచ్ఈ బాలయ్య, సీహెచ్‌వో రమేశ్ ఉన్నారు. ఆలయ ఉద్యోగులకు పదోన్నతులు వేములవాడ: రాజన్న ఆలయంలో రికార్డు అసిస్టెంట్లుగా పనిచేస్తున్న పోతారం శ్రీనివాస్, వై.శివకుమార్, నీలి సుశీల్‌కుమార్, తాళ్లపల్లి అజయ్‌కుమార్‌లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారికి శుక్రవారం పదోన్నతుల పత్రాలు ఈవో వినోద్‌రెడ్డి అందించారు. ఏఈవో శ్రవణ్, పర్యవేక్షకురాలు పూజిత, సీనియర్ అసిస్టెంట్ పురాణం వంశీమోహన్, ఆలయ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్ ఉన్నారు. -
ఆత్మవిశ్వాసంతో నిలబడ్డాడు
● కారు ప్రమాదంలో విరిగిన కాలు ● కూరగాయలు విక్రయిస్తూ ఉపాధిబోయినపల్లి(చొప్పదండి): సాఫీగా సాగిపోతున్న నేతన్న జీవితంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం జీవితాన్ని తలకిందులు చేసింది. కాలు విరగడంతో సాంచాల పని చేయలేని గంగాధర మండలం గర్శకుర్తికి చెందిన చిందం శ్రీధర్ కారులో కూరగాయలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. వృత్తిరీత్య నేతకార్మికుడు అయిన శ్రీధర్ సాంచాల మెకానిక్ పని కూడా చేసేవాడు. నాలుగు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీధర్ కాలు మూడు చోట్ల విరిగింది. పెద్ద మొత్తంలో ఖర్చు చేసి కాలు బాగు చేయించుకున్నాడు. చేతిలో కర్ర లేనిదే నడవలేడు. కాలు విరగడంతో సాంచాలు నడపడానికి ఇబ్బంది అవుతుండడంతో కూరగాయల వ్యాపారం మొదలుపెట్టాడు. కరీంనగర్‌తోపాటు పల్లెల్లోని రైతుల వద్ద కూరగాయల కొని ఇతర గ్రామాల్లో విక్రయిస్తుంటాడు. ఉదయం స్వగ్రామం గర్శకుర్తిలో రాత్రి పూట కారులో బోయినపల్లి మండలం తడగొండ, అనంతపల్లి, బోయినపల్లి, బూర్గుపల్లి తదితర గ్రామాల్లో కూరగాయలు విక్రయిస్తుంటాడు. -
సింగిల్‌విండో చైర్మన్‌పై వీగిన అవిశ్వాసం
● ముస్తాబాద్‌లో సమావేశం నిర్వహించిన డీసీవో ● 9 మందికి 8 మంది డైరెక్టర్లే హాజరు ముస్తాబాద్(సిరిసిల్ల): ముస్తాబాద్ సింగిల్‌విండో చైర్మన్ అన్నం రాజేందర్‌రెడ్డిపై డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. జిల్లా సహకార అధికారి టి.రామకృష్ణ ముస్తాబాద్ సింగిల్‌విండో ఆఫీస్‌లో శుక్రవారం అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటలకు వైస్‌చైర్మన్ నిమ్మల రవి ఆధ్వర్యంలో ఏడుగురు డైరెక్టర్లు ఆరుట్ల భాగ్యమ్మ, బద్దిపడిగె బాల్రాజిరెడ్డి, పెంజర్ల బాలెల్లు, మిడిదొడ్డి దేవేందర్, గాడిచర్ల రామచంద్రం, కొండం వేణు, యారపు భూమయ్యలు హాజరయ్యారు. కోరం ఉండడంతో అవిశ్వాస తీర్మానంపై డీసీవో చర్చ పెట్టారు. అనంతరం ఓటింగ్ నిర్వహించగా.. 8 మంది డైరెక్టర్లు మాత్రమే రాజేందర్‌రెడ్డికి వ్యతిరేకంగా ఓటువేశారు. అవిశ్వాస తీర్మానానికి 9 మంది డైరెక్టర్లు అవసరం ఉందని, 8 మంది మాత్రమే ఓటు వేయడంతో తీర్మానం వీగిపోయిందని ప్రకటించారు. తొలుత 9 మంది డైరెక్టర్లు అవిశ్వాసానికి నోటీసులు ఇవ్వగా.. తీర్మానం రోజున ఒక డైరెక్టర్ కొప్పు రాజవ్వ గైర్హాజరుకావడంతో అవిశ్వాసం వీగిపోయింది. ‘సంఘాన్ని కాపాడుకునేందుకే అవిశ్వాసం’ ముస్తాబాద్ సింగిల్‌విండోను, రైతుల ఆస్తులను కాపాడుకునేందుకు చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టామని వైస్‌చైర్మన్ నిమ్మల రవి, ఏడుగురు డైరెక్టర్లు పేర్కొన్నారు. ముస్తాబాద్ సింగిల్‌విండో చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం అనంతరం శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. నిబంధనలకు విరుద్ధంగా సంఘంలో ఒకరిని నియమించేందుకు చైర్మన్ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. చైర్మన్ ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోయి, అవిశ్వాసం పెట్టినట్లు తెలిపారు. వైస్‌చైర్మన్ నిమ్మల రవి, డైరెక్టర్లు కొండం వేణు, భాగ్యమ్మ, బాలెల్లు, బాల్రాజిరెడ్డి్, మిడిదొడ్డి దేవేందర్, రామచంద్రం, భూమయ్య ఉన్నారు. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ● సూరమ్మ ప్రాజెక్టు పనులు ప్రారంభం రుద్రంగి(వేములవాడ): ఎన్నికల హామీ మేరకు సూరమ్మ ప్రాజెక్టు పనులు ప్రారంభించి మాట నిలబెట్టుకున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి శివారులోని సూరమ్మ ప్రాజె క్టు పనులకు శుక్రవారం భూమిపూజ చేసి మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 ఎన్నికలకు ముందు సూరమ్మ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేసి ఓట్లు దండుకొని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తట్టెడు మట్టి కూడా తీయకుండా పడావు పడగొట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పునర్ ప్రారంభిస్తున్నామన్నారు. గతంలో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని ప్రతీ నెల 22వ తేదీన నిరసనలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అదే 22వ తేదీన ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశామన్నారు. పది నెలల్లోనే రాజన్నసిరిసిల్ల జిల్లా అభివృద్ధికి రూ.వెయ్యి కోట్లు తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, గ్రామాధ్యక్షుడు సామ మోహన్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శులు చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, తర్రె లింగం, నాయకులు ఎర్రం గంగనర్సయ్య, గండి నారాయణ, చిత్తిపాక మల్లయ్య, దేశవేని శ్రీనివాస్, భూమేశ్ పాల్గొన్నారు. -
మార్కెట్ కమిటీలు ఖరారు
వేములవాడరూరల్: ఎట్టకేలకు వేములవాడ నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించారు. వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, నాగాయపల్లికి చెందిన రొండి రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అ య్యాయి. వైస్‌చైర్మన్‌గా పార్టీ వేములవాడ పట్టణ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేశ్‌ను నియమిస్తూ 18 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. విప్ ఆది శ్రీనివాస్ కొన్ని రోజులుగా గ్రామ స్థాయి కార్యకర్త నుంచి మండల స్థాయి నాయకుడి వరకు అందరి అభిప్రాయాలు తీసుకుని కమిటీని నియమించినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. కాగా కొంతమంది సీనియర్లు చైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా వారు నిరాశ చెందకుండా భవిష్యత్‌లో మంచి అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చినట్లు సమాచారం. ఎల్లయ్యకు స్వీటు తినిపిస్తున్న అభిమానులు నిజామాబాద్ చైర్మన్‌గా ఎల్లయ్యకోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కచ్చకాయల ఎల్లయ్య, వైస్‌చైర్మన్‌గా తాళ్లపల్లి ప్రభాకర్ నియమితులయ్యారు. డైరెక్టర్లుగా మాందాల లింబయ్య, వెంగళ వెంకటేశ్వ ర్లు, సాసాల మల్లేశం, అప్పాల నాగభూషణం, ఇస్లావత్ వాల్యా, మహ్మద్ అజీంపాషా, గొట్టిపర్తి లత, ముత్యాల శ్రీనివాస్‌రెడ్డి, మ్యాకల ప్రభాకర్, నాయిని ప్రభాకర్, ఉప్పుల రాజేందర్, బాశెట్టి నాగరాజును నియమించారు.కొలనూర్ సింగిల్‌విండో చైర్మన్, వ్యవసాయ శాఖ ఏడీ, నిజామాబాద్ గ్రామ ప్రత్యేకాధికారులను ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రుద్రంగి చైర్మన్‌గా తిరుపతి రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్‌గా చెలుకల తిరుపతి, పాలకవర్గాన్ని నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ, తన నియామకానికి సహకరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ అభివృద్ధికి, యార్డులో రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. -
సామూహిక ఇంకుడు గుంతలు నిర్మించాలి
సిరిసిల్ల: జిల్లా వాటర్ శానిటేషన్ మిషన్‌లో సామూహిక ఇంకుడుగుంతులు నిర్మించాలని, డీడబ్ల్యూఎస్ఎం లక్ష్య సాధనకు కృషిచేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్లో శుక్రవారం స్వచ్ఛభారత్ మిషన్, గ్రామీణ్ జల్‌జీవన్ మిషన్లపై శుక్రవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశుధ్యం, తాగునీటి సరఫరా విభాగాలను పర్యవేక్షించేందుకు జిల్లా వాటర్ శానిటేషన్ మిషన్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాను ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించామని కొత్త ఇళ్ల నిర్మాణాలకు విధిగా టాయిలెట్ ఉండేలా చూడాలన్నారు. కంపోస్ట్‌షెడ్, సామూహిక ఇంకుడుగుంతలను పూర్తిస్థాయిలో వినియోగించాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా కోసం ఉపాధిహామీలో నిధులు వినియోగించాలన్నారు. డీఆర్డీవో శేషాద్రి, జెడ్పీ సీఈవో వినోద్, డీఏవో అఫ్జల్‌బేగం, డీపీఆర్వో శ్రీధర్, ఇరిగేషన్ ఈఈ అమరేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ జానకీ, డీఈవో రమేశ్‌కుమార్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, స్వచ్ఛ భారత్ మిషన్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. ఆహార పదార్థాల నాణ్యతపై దృష్టి పెట్టండి సిరిసిల్లఎడ్యుకేషన్: గురుకులాల్లో ఆహార పదార్థాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రిన్సిపాల్‌ను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లలోని గురుకుల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూరగాయలు, పండ్ల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలు పాఠాలు బోధిస్తుండగా పరిశీలించారు. నర్సింహులపల్లి, తంగళ్లపల్లిలోని ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలు పరిశీలించారు. డీఈవో రమేశ్‌కుమార్ ఉన్నారు. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వరల్డ్ టాయిలెట్ డే పోస్టర్ ఆవిష్కరణ -
● నేటితో ముగియనున్న వివరాల సేకరణ
97.82 శాతం సర్వే పూర్తిబోయినపల్లి(చొప్పదండి): జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే తుది దశకు చేరింది. ఈనెల 9న ప్రారంభమైన సర్వే శుక్రవారం నాటికి పట్టణాల్లో 98.28 శాతం, గ్రామాల్లో 97.68 శాతం పూర్తయింది. జిల్లాలోని 261 గ్రామాలను 1,531 ఎన్యుమరేషన్ బ్లాకులుగా గుర్తించారు. ఆయా బ్లాకుల్లో 1,92,432 ఇళ్లకు ఇప్పటి వరకు 1,88,246 ఇళ్లలో సర్వే పూర్తి చేశారు. ఈనెల 23వ తేదీతో సర్వే పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. మొదట్లో నత్తనడకన.. గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి మండలాల్లో మొదట్లో సర్వే నత్తనడకన సాగింది. దీన్ని గుర్తించిన కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఈనెల 12న ఒకసారి, 17న మరోసారి అధికారులతో సమీక్ష చేసి, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం 75 ప్రశ్నలు ఉండగా.. ఒక్కో కుటుంబానికి అరగంట నుంచి గంట సమయం పట్టింది. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజల నుంచి అధికారులకు సహకారం అందింది. ఇప్పటికే 97.82 శాతం వరకు సర్వే పూర్తికాగా.. తాళం వేసిన ఇళ్లు మాత్రమే మిగిలి పోయినట్లు సమాచారం. జిల్లాలోని గ్రామాలు : 261ఎన్యుమరేటర్ బ్లాకులు: 1,531సర్వేకు గుర్తించిన కుటుంబాలు : 1,92,43222 వరకు సర్వే చేసిన కుటుంబాలు : 1,88,246పట్టణాల్లో సర్వే : 98.28 శాతం గ్రామీణ ప్రాంతాల్లో.. : 97.68 శాతం -
‘ఎగువ’కు మధ్యమా‘నీరు’!
● మల్కపేటకు పంపింగ్ ఏర్పాట్లు ● కాళేశ్వరం 9వ ప్యాకేజీపై కదలిక ● నెలాఖరులోగా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షకు సీఎం ఆదేశాలు ● నిధులొస్తే పనులు ముందుకు ● ఎగువ మానేరు నిండితే జిల్లా సస్యశ్యామలం ● వేములవాడలో సీఎం, మంత్రి ప్రకటనతో ఆశలు సిరిసిల్ల: జిల్లాలోని ప్రాజెక్టుల పనుల్లో కదలిక మొదలైంది. కాళేశ్వరం ప్యాకేజీ–9 పనులు పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. బుధవారం నాటి వేములవాడ పర్యటనలో ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలతో పనుల్లో కదలిక వచ్చింది. మల్కపేటను నింపేందుకు ఏర్పాట్లు సిరిసిల్ల మధ్యమానేరు నుంచి కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌ను నింపేందుకు నీటిపారుదలశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. గతేడాది రెండు పంపులను ట్రయల్‌రన్ చేసి ఒక్క టీఎంసీ నీటిని మల్కపేట రిజర్వాయర్‌లో నింపారు. మూడు టీఎంసీల సామర్థ్యం ఉన్న మల్కపేటను పూర్తి స్థాయిలో నింపేందుకు పంపింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. మిషన్లు మరమ్మతు చేస్తూ ఎలక్ట్రికల్ వర్క్‌ను పూర్తి చేస్తున్నారు. మల్క పేట నిండితే.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా గంభీరావుపేట ఎగువమానేరు ప్రాజెక్టుకు గోదావరి జలాలను తరలించవచ్చు. మూడు దశల్లో నర్మాలకు నీరు మధ్యమానేరు(శ్రీరాజరాజేశ్వర) జలాశయం నీటిని సిరిసిల్ల నుంచి మల్కపేటకు 12.03 కిలోమీటర్ల సొరంగం ద్వారా తరలించి, రెండు పంపులతో సర్జిఫూల్ నుంచి నీటిని 130 మీటర్ల ఎత్తులో ఉన్న మల్కపేట రిజర్వాయర్‌లోకి ఎత్తిపోశారు. మల్కపేట ప్రాజెక్టు నుంచి బ్యాక్‌వాటర్‌ను కాల్వ ద్వారా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి మీదుగా మైసమ్మ చెరువులోకి వెళ్తుంది. అక్కడి నుంచి గంభీరావుపేట మండలం సముద్రలింగాపూర్ శివారులోని సింగసముద్రం చెరువులోకి నీటిని మళ్లిస్తారు. రెండో దశలో నాగంపేట తండా వద్ద 2.25 మెగావాట్ల సామర్థ్యంతో రెండు పంపులను ఏర్పాటు చేసి నీటిని పంపింగ్ చేయాల్సి ఉంది. పంపులు, మోటార్లు సిద్ధంగా ఉన్నా బిగించలేదు. సివిల్‌వర్క్ పెండింగ్‌లో ఉంది. ఇది పూర్తయితే మూడో దశలో గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్ బట్టలచెరువులోకి నీరు చేరుతుంది. అక్కడి నుంచి కాల్వ ద్వారా ఎగువమానేరు(నర్మాల)కు గోదావరి జలాలు చేరుతాయి. నాగంపేటతండా వద్ద పనులు ఏడాదిగా సాగడం లేదు. దీంతో ఎగువమానేరుకు గోదావరి నీరు చేరే రెండో, మూడో దశ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లా సస్యశ్యామలం జిల్లాలోని మెట్టభూములకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులు పూర్తయితే జిల్లాలోని 2.78 లక్షల ఎకరాలకు శాశ్వతంగా సాగునీరు అందుతుంది. ఇందులో భాగంగానే కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగులోకి, రంగంపేట చెరువులోకి గోదావరి జలాలను తరలించేందుకు కాల్వలు, పైపులైన్ పనులు చేపట్టారు. ఎగువమానేరుకు గోదావరి జలాలు చేరితే జిల్లా సస్యశ్యామలమవుతుంది. రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం దరి చేరనుంది. వేములవాడ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎగువ మానేరును నింపుతామని ఏడాదిలోగా పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పెద్దల మాటలతో ప్రాజెక్టు పనులపై కమ్ముకున్న నీలినీడలు తొలగిపోయాయి. కాళేశ్వరం 9వ ప్యాకేజీ స్వరూపంపని ప్రారంభం : 2013 ఎక్కడి నుంచి ఎక్కడికి : సిరిసిల్ల నుంచి ఎగువ మానేరు పొడువు : 32 కిలోమీటర్లు సొరంగ మార్గం : 12.03 కిలోమీటర్లు (సిరిసిల్ల–మల్కపేట) వ్యయం : రూ.1,464.42 కోట్లు ప్రధాన జలాశయాలు : మల్కపేట, బట్టలచెరువు కొత్త ఆయకట్టు : 60వేల ఎకరాలు స్థిరీకరణ : 2.78 లక్షల ఎకరాలు సామర్థ్యం : 11.63 టీఎంసీలు(120 రోజులు పంపింగ్) ‘ఏడాదిలోగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ఈనెలాఖరులోగా జిల్లాలోని ప్రాజెక్టులపై సమీక్షించి ఎన్ని నిధులు కావాలో.. వెంటనే ఇచ్చి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.’ – సీఎం రేవంత్‌రెడ్డి ‘మల్కపేట రిజర్వాయర్‌తోపాటు నర్మాల ఎగువమానేరు వరకు అన్ని రిజర్వాయర్లను నింపి కొత్తగా 1.20లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం.’ – ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి పనులు చేయాలని నోటీసులిచ్చాం మల్కపేట రిజర్వాయర్‌లోకి మధ్యమానేరు నీటిని పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులు పూర్తి కాగానే పంపింగ్ ప్రారంభిస్తాం. గంభీరావుపేట మండలం నాగంపేట వద్ద పంపుహౌస్‌లో సివిల్ పనులు చేయాలని, పంపులను, మోటార్లను బిగించాలని కాంట్రాక్టు ఏజెన్సీకి నోటీసులు ఇచ్చాం. అక్కడ పనులు పూర్తయితేనే ఎగువమానేరుకు గోదావరి జలాలు చేరుతాయి. సమగ్ర వివరాలను ప్రభుత్వానికి నివేదించాం. – అమరేందర్‌రెడ్డి, నీటిపారుదలశాఖ ఈఈ, సిరిసిల్ల -
కొత్త డీపీవో నుంచి సేవలు
● ఎస్పీ అఖిల్ మహాజన్సిరిసిల్ల క్రైం: నూతనంగా ప్రారంభించిన జిల్లా పోలీస్ కార్యాలయం భవనం నుంచి పోలీస్ సేవలు అందుతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వివిధ సేవల కోసం వచ్చే వారు బైపాస్‌రోడ్డులోని నూతన పోలీస్ భవనానికి రావాలని సూచించారు.ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సిరిసిల్లటౌన్: ప్రపంచ మత్య్సకారుల దినోత్సవాన్ని సిరిసిల్ల గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ముడారి రాజు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్రడెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, నాయకులు వంగల రాయనర్సు, వంగల రాజు, కూర కిషన్, గడప లక్ష్మణ్, కూర నర్సయ్య, గడప ప్రశాంత్, గడప కృష్ణహరి, ఇటుకల రాయనర్సు, వంగల కనకయ్య పాల్గొన్నారు. -
కాటన్ వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి
● కరెంటు సబ్సిడీపై సర్కారుకు కృతజ్ఞతలు ● పరిశ్రమ నిలదొక్కుకునే చర్యలు తీసుకోవాలి ● కాంగ్రెస్ వస్త్రోత్పత్తి రంగం జేఏసీ నేతలుసిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లలో కాటన్ వస్త్రానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సంఘాల జేఏసీ నేతలు కోరారు. ఈమేరకు గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వస్త్రపరిశ్రమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. గతంలో సిరిసిల్ల కాటన్ వస్త్రపరిశ్రమకు దేశంలోనే పేరెన్నికై ందన్నారు. ఆర్వీఎం వంటి ప్రభుత్వ ఆర్డర్లు పాలిస్టర్ వస్త్రంతోనే కాకుండా కాటన్ వస్త్రాన్ని కూడా కలిపి ఉత్పత్తులను చేపట్టేలా చూడాలని కోరారు. మహిళలకు ప్రభుత్వ చీరలు ఇస్తామని ప్రకటించిందని వాటితో పాటుగా కాటన్ లంగాలు కూడా ఇస్తే సి రిసిల్లలోని కాటన్, పాలిస్టర్ వస్త్రోత్పత్తి పరిశ్రమలు పూర్తిగా బాగుపడతాయన్నారు. తాము పాలిస్టర్ వస్త్రాల ఆర్డర్లకు వ్యతిరేకం కాదని కాటన్ వస్త్రానికి కూడా ప్రాధాన్యతనిస్తే.. గత సిరిసిల్ల వైభవం పునరావృతమైతుందని కోరారు. ఇందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి సిరిసిల్ల పరిశ్రమలోని కాటన్, పాలిస్టర్ ఉత్పత్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఇప్పించాలని కోరారు. గౌడ సురేశ్, యెల్లె దేవదాసు, గాజుల రవి, గౌడ రాజు, గౌడ వాసు పాల్గొన్నారు. -
మా పనులు కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటోంది
● చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్సిరిసిల్ల: బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేసుకుంటోందని చొ ప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. సిరిసిల్ల తెలంగాణభవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. రాజన్న సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాలు మాట్లాడారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నామస్మరణ లేకుండా రేవంత్‌రెడ్డికి పూట గడవడం లేదని ఎద్దేవా చేశారు. రైతుభరోసా ఇవ్వకుండా, రూ.2లక్షల రుణమాఫీ చేయకుండా మోసం చేశారని, ఆసరా పెన్షన్ డబుల్ చేయలేదన్నారు. వేములవాడ ఆ లయానికి 24 గుంటల భూమి ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకరించిన 33 ఎకరాల్లోనే మీటింగ్‌పెట్టి కేసీఆర్ ఏం చేయలేదనడాన్ని ప్రశ్నించారు. బద్దిపోచమ్మ ఆలయానికి 39 గుంటల భూమిని రూ.19కోట్లతో సేకరించామన్నారు. మధ్యమానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్మించి కేసీఆర్ కోటి ఎకరా లకు నీరిస్తే పంటలు బాగా పండాయని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 50వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్య లపై చర్చకు సిద్ధమన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, కుంబాల మల్లారెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్ తదితరులు ఉన్నారు. -
కాటన్ వస్త్రానికి ప్రాధాన్యత ఇవ్వాలి
● కరెంటు సబ్సిడీపై సర్కారుకు కృతజ్ఞతలు ● పరిశ్రమ నిలదొక్కుకునే చర్యలు తీసుకోవాలి ● కాంగ్రెస్ వస్త్రోత్పత్తి రంగం జేఏసీ నేతలుసిరిసిల్లటౌన్: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లలో కాటన్ వస్త్రానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సంఘాల జేఏసీ నేతలు కోరారు. ఈమేరకు గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి వస్త్రపరిశ్రమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. గతంలో సిరిసిల్ల కాటన్ వస్త్రపరిశ్రమకు దేశంలోనే పేరెన్నికై ందన్నారు. ఆర్వీఎం వంటి ప్రభుత్వ ఆర్డర్లు పాలిస్టర్ వస్త్రంతోనే కాకుండా కాటన్ వస్త్రాన్ని కూడా కలిపి ఉత్పత్తులను చేపట్టేలా చూడాలని కోరారు. మహిళలకు ప్రభుత్వ చీరలు ఇస్తామని ప్రకటించిందని వాటితో పాటుగా కాటన్ లంగాలు కూడా ఇస్తే సి రిసిల్లలోని కాటన్, పాలిస్టర్ వస్త్రోత్పత్తి పరిశ్రమలు పూర్తిగా బాగుపడతాయన్నారు. తాము పాలిస్టర్ వస్త్రాల ఆర్డర్లకు వ్యతిరేకం కాదని కాటన్ వస్త్రానికి కూడా ప్రాధాన్యతనిస్తే.. గత సిరిసిల్ల వైభవం పునరావృతమైతుందని కోరారు. ఇందుకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి సిరిసిల్ల పరిశ్రమలోని కాటన్, పాలిస్టర్ ఉత్పత్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపించి ప్రభుత్వం నుంచి ఆర్డర్లు ఇప్పించాలని కోరారు. గౌడ సురేశ్, యెల్లె దేవదాసు, గాజుల రవి, గౌడ రాజు, గౌడ వాసు పాల్గొన్నారు. -
అభివృద్ధికి సహకరించండి
● రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుగంభీరావుపేట(సిరిసిల్ల): ప్రతిపక్షాలు అవరోధాలు సృష్టించడం మానుకొని అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. గంభీ రావుపేటలో గురువారం విలేకరులతో మా ట్లాడారు. రానున్న కాలంలో ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న గ్యారంటీలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్ని అవరోధాలు సృష్టించినా అధిగమిస్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. ప్రజా స్వామిక విధానంలో నిరసనలు చేయొచ్చు, కానీ హింసాత్మక సంఘటనలకు పాల్పడడం తగదని సూచించారు. కాళేశ్వరం–9వ ప్యాకే జీ పూర్తి చేయడం, ఎగువమానేరు ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలి పారు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ అధికార ప్రతినిధి క టకం మృత్యుంజయం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, పార్టీ మండలాధ్యక్షుడు హమీద్, ప్రకాశ్, శ్రవణ్‌రావు, అన్నయ్యగౌడ్,శ్రీనివాస్, బాలయ్య, రాజుగౌడ్, రాజశేఖర్ పాల్గొన్నారు. పరామర్శ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మామ గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన మాధవరావు ఇటీవల మృతిచెందారు. మాధవరావు దశదినకర్మకు మంత్రి శ్రీధర్‌బాబు హాజరై, వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మండలంలోని లింగన్నపేటలోని వేద పాఠశాలను మంత్రి సందర్శించారు. రాజన్న ఆలయానికి మహర్దశసిరిసిల్లటౌన్: అశేష రాజన్న భక్తుల ఆకాంక్ష వేములవాడ ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మహర్దశ తీసుకొచ్చారని కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో గురువారం మాట్లాడారు. ఆలయాభివృద్ధికితోపాటు జిల్లాలో వివిధ పనులకు సీఎం రూ.వెయ్యి కోట్ల వరకు మంజూ రు చేశారని కొన్ని పనులు నేరుగా ప్రారంభించారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి జిల్లా సమస్యలు తీసుకెళ్లి నిధులు తీసుకురా వడానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి కృషి అభినందనీయమన్నారు. ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, కత్తెర దేవదాసు, భీమారం శ్రీనివాస్, కిరణ్, కమలాకర్‌రావు ఉన్నారు. -
అభివృద్ధికి సహకరించండి
● రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుగంభీరావుపేట(సిరిసిల్ల): ప్రతిపక్షాలు అవరోధాలు సృష్టించడం మానుకొని అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. గంభీ రావుపేటలో గురువారం విలేకరులతో మా ట్లాడారు. రానున్న కాలంలో ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న గ్యారంటీలు ప్రతిపక్షాలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎన్ని అవరోధాలు సృష్టించినా అధిగమిస్తూ ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తామన్నారు. ప్రజా స్వామిక విధానంలో నిరసనలు చేయొచ్చు, కానీ హింసాత్మక సంఘటనలకు పాల్పడడం తగదని సూచించారు. కాళేశ్వరం–9వ ప్యాకే జీ పూర్తి చేయడం, ఎగువమానేరు ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలి పారు. ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ అధికార ప్రతినిధి క టకం మృత్యుంజయం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మండ్లు, పార్టీ మండలాధ్యక్షుడు హమీద్, ప్రకాశ్, శ్రవణ్‌రావు, అన్నయ్యగౌడ్,శ్రీనివాస్, బాలయ్య, రాజుగౌడ్, రాజశేఖర్ పాల్గొన్నారు. పరామర్శ పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మామ గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన మాధవరావు ఇటీవల మృతిచెందారు. మాధవరావు దశదినకర్మకు మంత్రి శ్రీధర్‌బాబు హాజరై, వారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం మండలంలోని లింగన్నపేటలోని వేద పాఠశాలను మంత్రి సందర్శించారు. రాజన్న ఆలయానికి మహర్దశసిరిసిల్లటౌన్: అశేష రాజన్న భక్తుల ఆకాంక్ష వేములవాడ ఆలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మహర్దశ తీసుకొచ్చారని కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో గురువారం మాట్లాడారు. ఆలయాభివృద్ధికితోపాటు జిల్లాలో వివిధ పనులకు సీఎం రూ.వెయ్యి కోట్ల వరకు మంజూ రు చేశారని కొన్ని పనులు నేరుగా ప్రారంభించారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి జిల్లా సమస్యలు తీసుకెళ్లి నిధులు తీసుకురా వడానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్చార్జి మహేందర్‌రెడ్డి కృషి అభినందనీయమన్నారు. ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, కత్తెర దేవదాసు, భీమారం శ్రీనివాస్, కిరణ్, కమలాకర్‌రావు ఉన్నారు. -
మా పనులు కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటోంది
● చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్సిరిసిల్ల: బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేసుకుంటోందని చొ ప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు. సిరిసిల్ల తెలంగాణభవన్‌లో గురువారం విలేకరులతో మాట్లాడారు. రాజన్న సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి అబద్దాలు మాట్లాడారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నామస్మరణ లేకుండా రేవంత్‌రెడ్డికి పూట గడవడం లేదని ఎద్దేవా చేశారు. రైతుభరోసా ఇవ్వకుండా, రూ.2లక్షల రుణమాఫీ చేయకుండా మోసం చేశారని, ఆసరా పెన్షన్ డబుల్ చేయలేదన్నారు. వేములవాడ ఆ లయానికి 24 గుంటల భూమి ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం సమీకరించిన 33 ఎకరాల్లోనే మీటింగ్‌పెట్టి కేసీఆర్ ఏం చేయలేదనడాన్ని ప్రశ్నించారు. బద్దిపోచమ్మ ఆలయానికి 39 గుంటల భూమిని రూ.19కోట్లతో సేకరించామన్నారు. మధ్యమానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ నిర్మించి కేసీఆర్ కోటి ఎకరా లకు నీరిస్తే పంటలు బాగా పండాయని రేవంత్‌రెడ్డి చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 50వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్న రేవంత్‌రెడ్డి వ్యాఖ్య లపై చర్చకు సిద్ధమన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, కుంబాల మల్లారెడ్డి, గుండ్లపల్లి పూర్ణచందర్ తదితరులు ఉన్నారు. -
No Headline
సాక్షి, పెద్దపల్లి●: వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కొందరు కుమారులు, కూతుళ్లు పట్టించుకోవడం లేదు.. ఆస్తుల కోసం వేధింపులకు గురిచేయడం, తిండి పెట్టకపోవడం, చేయి చేసుకోవడం, చివరకు చంపేందుకూ వెనకాడకపోవడం వంటి ఘటనలు కృంగిపోయేలా చేస్తున్నాయి.. రెక్కలు ముక్కలు చేసుకొని, పిల్లలను పెంచి, ప్రయోజకులను చేస్తే వృద్ధాప్యంలో పట్టెడన్నం పెట్టకుండా మనోవేదనకు గురిచేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది ఇంటి నుంచి వెళ్లి పోతున్నారు.. మరికొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. ఇంకొందరు కలెక్టరేట్లలో ప్రజావాణిని, ఠాణాల్లో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.. ఇటీవల ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వృద్ధుల మిస్సింగ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. చట్టాలున్నాయి.. న్యాయం పొందొచ్చు పండుటాకులకు సొంత బిడ్డల నుంచే వేధింపులు, నిరాదరణ ఎదురవుతుండటంతో కేంద్రం 2007లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల రక్షణ, పోషణ చట్టం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2011లో ఒక నియమావళి రూపొందించింది. 2019లో కేంద్రం వృద్ధుల సంక్షేమం మరింత మెరుగ్గా ఉండటానికి చట్టానికి సవరణలు చేసింది. వాటి ప్రకారం ప్రతీ రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటైంది. దానికి ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ స్థాయి అధికారి చైర్మన్‌గా, స్వచ్ఛంద సంస్థల నుంచి ఒకరు లేదా ఇద్దరు సభ్యులుగా ఉంటారు. బాధిత వృద్ధులకు ఉచితంగా వారి బిడ్డల నుంచి రక్షణ, పోషణ కల్పిస్తారు. బాధితులకు ఈ తీర్పు నచ్చకపోతే కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటయ్యే అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను 60 రోజుల్లో ఆశ్రయించి, అంతిమ న్యాయం పొందొచ్చు. ఆస్తిని తిరిగి పొందే హక్కు నిరాదరణకు గురైనప్పుడు తమ బిడ్డలకు రాసిచ్చిన ఆస్తిని వృద్ధులు బేషరతుగా తిరిగి పొందే హక్కును చట్టంలో చేర్చారు. కేవలం గిఫ్ట్ డీడ్ చేసిన ఆస్తి మాత్రమే కాదు రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తిని సైతం తిరిగి పొందొచ్చు. ప్రతీ నెల మెయింటెనెన్స్ రూ.10 వేల వరకు ఇప్పిస్తారు. ఇటీవల పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఓ వృద్ధుడికి కలెక్టర్ ఇలాగే న్యాయం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కల్పించిన ఇటువంటి చట్టాలపై వృద్ధులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. కుమారులు నిర్లక్ష్యం చేస్తే టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ 14567 నంబర్‌కు ఫిర్యాదు చేయొచ్చు. లేదా నేరుగా ప్రతీ సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజావాణిలో అధికారులకు విన్నవించుకోవచ్చు. కౌన్సెలింగ్ ఇచ్చి, పోషణ కింద ఆర్థికసాయం అందే ఏర్పాటు చేసి, పోలీసుల ద్వారా రక్షణ కల్పిస్తారు. -
కృంగి‘పోతున్న’
పండుటాకులు● కొడుకుల ఆదరణ కరువై.. వేధింపులు పెరిగి ● ఇంటిని వదిలి వెళ్తున్న కొందరు.. ● ఆత్మహత్య చేసుకుంటున్న మరికొందరు.. ● ప్రజావాణి, ఠాణాల్లో పలువురి ఫిర్యాదు ● ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెరుగుతున్న వృద్ధుల మిస్సింగ్ కేసులు ● చట్టాలపై అవగాహన లేక ఇబ్బందులుఈమె పేరు గుర్రాల అంతమ్మ. మానకొండూరు మండలం కొండపల్కల. 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా కొడుకు లక్ష్మారెడ్డి మాయమాటలు చెప్పి, ఏడెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. 2022లో తన భర్త మల్లారెడ్డి మరణించడంతో కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లగొట్టాడని అంతమ్మ వాపోయింది. కూతురు వద్ద తలదాచుకుంటున్నానని కన్నీటిపర్యంతమైంది. మిగిలిన భూమిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కుమారుడు ప్రయత్నిస్తున్నాడని తెలిపింది. ఈ చిత్రంలో కనిపిస్తున్నది చొప్పదండికి చెందిన ముత్యాల గోపాల్‌రెడ్డి, ఆయన భార్య. వీరికి ఇద్దరు కుమారులు రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 20 ఎకరాల వ్యవసాయ భూమితో దర్జాగా బతికేవారు. పిల్లలను చదివించి, ప్రయోజకులను చేశారు. తీరా కుమారులు మాయమాటలు చెప్పి, భూమిని తమ పేరిట పట్టా చేసుకున్నారు. తర్వాత ఇంట్లో నుంచి గెంటేశారని, ఈ వయసులో తమకు ఇదేం దుస్థితి అంటూ ఆ దంపతులు కంటతడి పెడుతున్నారు.● జగిత్యాల మున్సిపాలిటీలోని ఓ వార్డుకు చెందిన ఒక వృద్ధుడు కొడుకు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మానసికంగా కృంగిపోయాడు. ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని, విచారణ చేపడుతున్నారు. ● సిరిసిల్లకు చెందిన ఓ వృద్ధుడు కుమారుడు ఆస్తి రాయించుకొని, తర్వాత పట్టించుకోకపోవడంతోపాటు వేధింపులకు గురిచేస్తున్నాడని హెల్ప్ లైన్–14567కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేశాడు. అధికారులు తొలుత కౌన్సెలింగ్ ఇచ్చినా అతనిలో మార్పు రాలేదు. దీంతో ఆర్డీవో ఆధ్వర్యంలో మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ తండ్రికి, కుమారుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టంలోని నిబంధనలు, విధించే శిక్షల గురించి వివరించారు. తర్వాత కుమారుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. ● సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని గొల్లపల్లిలో ఆస్తి వివాదం కారణంగా కొడుకు సింగరేణి రిటైర్డ్ కార్మికుడైన తన తండ్రి మధునయ్యను తోసేశాడు. అతను కిందపడి, మృతిచెందాడు.పెద్దపల్లిసిరిసిల్లజగిత్యాల008కరీంనగర్3527ఈ ఏడాది ట్రిబ్యునల్‌కు అందిన ఫిర్యాదులు జిల్లా వచ్చినవి పరిష్కారం విచారణ దశ కరీంనగర్ 48 19 25 జగిత్యాల 66 55 11 సిరిసిల్ల 38 12 26 పెద్దపల్లి 34 19 15 -
గజ..గజ
● పడిపోయిన ఉష్ణోగ్రతలు ● వణుకుతున్న జిల్లా ప్రజలు ● పగటిపూట సాధారణం కన్నా తక్కువే ● రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్న ప్రజలు ● నాలుగు రోజులుగా పెరిగిన చలిజిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు తేదీ గరిష్టం కనిష్టం (సెంటిగ్రేడ్లలో) 15–11–24 32 21 16–11–24 32 20 17–11–24 30 19 18–11–24 30 18 19–11–24 29 16 20–11–24 29 15 21–11–24 29 13సిరిసిల్లటౌన్: జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్టంగా పడిపోయాయి. జిల్లా ప్రజలను చలిపులి భయపెట్టేస్తుంది. మధ్యాహ్నం వరకు చలి వీడడం లేదు. సాధారణం కంటే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈనెల మొదటి వారంలో తుఫాను ప్రభావం విచిత్ర పరిస్థితులు ఏర్పడగా ప్రస్తుతం చలితీవ్రత ఎక్కువైంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు నవంబర్ ఆరంభంలో తుఫాను ప్రభావంతో పగలు, రాత్రి వేళల్లో భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. వాతావరణంలోనూ అనూహ్య మార్పులు కలిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా చలికాలం ప్రారంభమయ్యే అక్టోబర్‌లో వర్షాలు పడ్డాయి. నవంబర్‌లో తుఫాను ప్రభావంతో అఽధిక వర్షాలు పడకపోయినా వాతావరణంలో మార్పులు సంభవించాయి. ఈక్రమంలో వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కన్నా తక్కువ నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా భానుడి ప్రతాపం తగ్గడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రోడ్లపై ఎవరినీ చూసినా మాస్కులు, స్వెట్టర్లు, వెచ్చని దుస్తులు ధరించి కనిపిస్తున్నారు. జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు వారం రోజుల క్రితం మధ్యాహ్నం 32 డిగ్రీలు నమోదవగా గురువారం 28 డిగ్రీలకు పడిపోయింది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 13కు చేరాయి. మరో మూడు రోజులు ఇవే ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు వాతావరణ పరిశీలకులు చెబుతున్నారు. వీర్నపల్లి మండలంలో అత్యల్పంగా 12 డిగ్రీలు నమోదుకాగా.. ఎల్లారెడ్డిపేట 14.5, ఆవునూరు 12.7, కందికట్కూర్ 13.6, నాంపల్లి 13.7, వట్టెంల 14.2, నిజామాబాద్ 12.6, పెద్దలింగాపూర్ 13.6, గజసింగవరం 12.1, నేరెళ్ల 12.6, రుద్రంగి 11.7, బోయినపల్లి 13.2, మల్లారం 12.8, మానాల 13.6, మర్తనపేట 13.4, మర్రిగడ 12.6, వీర్నపల్లి 12, నామాపూర్ 13, గంభీరావుపేట 13.8, పెద్దూరు 13.7, ఇల్లంతకుంట 16.5, సిరిసిల్ల 15.3 చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉన్ని దుస్తులకు గిరాకీ చలి నుంచి రక్షించుకోవడానికి ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రజలు చలిమంటలు కాగుతున్నారు. ఇక ప్రయాణాలు చేసే వారు జర్కిన్లు, మఫ్లర్లు, మంకీక్యాపులు, ష్వట్టర్లు, గ్లౌజులు, షూస్ ధరిస్తున్నారు. అలర్జీ, సైనస్, ఆస్తమా పేషెంట్లు డాక్టర్ల వద్దకు పోయి మందులు వాడుతున్నారు. చలికాలం కావడంతో రాత్రి 9గంటల్లోపే దుకాణాలు మూసివేస్తున్నారు. యువత వ్యాయామంపై దృష్టి సారించారు. -
టీబీపై అవగాహన ఉండాలి
● డీఎంహెచ్‌వో వసంతరావుఇల్లంతకుంట(మానకొండూర్): టీబీ నుంచి విముక్తి పొందిన చాంపియన్లు ఆ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి వసంతరావు కోరారు. ఇల్లంతకుంట మండల పరిషత్‌లో గురువారం టీబీ చాంపియన్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు ఇంపాక్ట్ ఇండియా సంస్థ టీబీ అలర్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తుందని తెలిపారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ప్రతి ఆరోగ్య సబ్‌సెంటర్ నుంచి ఇద్దరు చొప్పున 16 మంది టీబీ చాంపియన్లు పాల్గొన్నారు. ఇంపాక్ట్ ఇండియా ప్రోగ్రాం జిల్లా అధికారి దండుబోయిన శ్రీనివాస్, ఇల్లంతకుంట పీహెచ్సీ డాక్టర్ శరణ్య, వైద్యాధికారి వెంకటరమణ, సూపర్వైజర్ జవహర్, శాంత పాల్గొన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలి విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే రేపటితరం పౌరుల భవిష్యత్ బాగుంటుందని జిల్లా వైద్యాధికారి వసంతరావు పేర్కొన్నారు. ఇల్లంతకుంట హైస్కూల్లో గురువారం రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం(ఆర్బీఎస్కే)లో పాల్గొన్నారు. హెచ్ఎం ప్రేమలత, మెడికల్ ఆఫీసర్ గౌస్‌భాష, ప్రమోద, టీచర్లు పాల్గొన్నారు. నమ్మించి వంచించిన కాంగ్రెస్● తాజామాజీ సర్పంచుల జేఏసీ కన్వీనర్ కరుణాకర్ సిరిసిల్లటౌన్: కాంగ్రెస్ పార్టీ మరోసారి నమ్మించి వంచించిందని తాజామాజీ సర్పంచుల జేఏసీ కన్వీనర్ అక్కెనపల్లి కరుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐదేళ్లు గ్రామాల్లో తమ డబ్బులు పెట్టుకుని అభివృద్ధి చేస్తే ఏళ్లుగా బిల్లులు రాలేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవిషయంలో ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి వేడుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం కనికరించడం లేదన్నారు. సీఎం వేములవాడకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు వినతిపత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ నేతలే సమ్మతించి పాస్‌లు కూడా ఇప్పించారన్నారు. కానీ సీఎం రావడానికి ఒక రోజు ముందే తమను బందిపోట్లు, టెర్రరిస్టుల్లా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి దుమ్మ అంజయ్య, గౌరవ అధ్యక్షుడు చాకలి రమేశ్, బొజ్జం మల్లేశం, మంతెన సంతోష్, చిట్నేని శ్రీనివాస్‌రావు, గున్నాల లక్ష్మణ్, రాజూరి రాజేశం తదితరులు పాల్గొన్నారు. ‘సీఎం గిరి వికాసం’ వినియోగించుకోవాలి కోనరావుపేట(వేములవాడ): గిరిజన పోడు రైతులు సీఎం గిరి వికాసం పథకాన్ని వినియోగించుకోవాలని లంబాడీల ఐక్య వేదిక(లైవ్) రాష్ట్ర ఇన్చార్జి బానోత్ నరేశ్‌నాయక్ కోరారు. కోనరావుపేట మండలం కమ్మరిపేటతండాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లైవ్ రాష్ట్ర ఇన్చార్జి బానోత్ నరేశ్‌నాయక్ మాట్లాడారు. ఈ పథకం కింద భూమి చదును చేయడం, బోరు మోటార్, పంపుసెట్, విద్యుత్ కనెక్షన్ మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దేసాయినాయక్, తిరుపతినాయక్, రాజునాయక్, లక్ష్మీబాయి పాల్గొన్నారు. ముస్లిం, మైనార్టీలకు గ్రూప్–2 మాక్ టెస్ట్‌లు సిరిసిల్ల: జిల్లాలోని ముస్లిం, మైనార్టీ అభ్యర్థులకు గ్రూప్–2 మాక్ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఆర్వీ రాధాబాయి గురువారం తెలిపారు. జిల్లాలోని ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 29లోగా ఆఫీస్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. ఫస్ట్ మాక్‌టెస్ట్ డిసెంబరు 2, 3వ తేదీల్లో, సెకండ్ టెస్ట్‌ను డిసెంబరు 9, 10వ తేదీల్లో నిర్వహిస్తామని వివరించారు. -
వ్యర్థాల శాంపిళ్లు సేకరణ
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): జిల్లాలోని రైస్‌మిల్లులు కాలుష్య కారకాలుగా మారడంతో వాటి నుంచి వస్తున్న వ్యర్థాలతో రైతులు పంటల దిగుబడి కోల్పోతుండగా, పర్యావరణ శాఖ అధికారులు బుధవారం రంగంలోకి దిగి వ్యర్థాల నమూనాలను సేకరించారు. ఈ నెల 6న ‘సాక్షి’లో ‘మిల్లులు.. రైతులకు కన్నీళ్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా అనేక రైస్‌మిల్లులను పంటపొలాల మధ్య ఏర్పాటు చేశారు. రైస్‌మిల్లుల తనిఖీల పేరుతో మిల్లర్ల వద్ద స్థానిక అధికారులు లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లు రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మిల్లర్లు అధికారుల అండతో మిల్లుల పక్కనే బావులు తవ్వి వాటిలోకి వ్యర్థాలను వదులుతున్నారు. ఆ వ్యర్థాల నీరు పక్కన ఉన్న పొలాల్లోకి వెళ్లి పంటలు దెబ్బతింటున్నాయి. రైతుల సమక్షంలో వ్యర్థాల శాంపిళ్లు సేకరించామని, వాటిని ల్యాబ్‌కు పంపిస్తామని పర్యావరణ ఇంజినీర్ బిక్షపతి తెలిపారు. రిపోర్ట్ ఆధారంగా రైస్‌మిల్లులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన వెంట సిబ్బంది కనకాజ్యోతి, వీరేశ్ ఉన్నారు. పోరాటాలతోనే సమస్యలు పరిష్కారంసిరిసిల్లటౌన్: పోరాటాలతోనే కార్మికులు, కర్షకుల సమస్యలు పరిష్కారమవుతాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. బుధవారం సిరిసిల్లలో పార్టీ మూడవ జిల్లా మహాసభల్లో మాట్లాడారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇందిరమ్మ ఇండ్లు, మహిళకు రూ.2,500 పెన్షన్ వంటి ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం పేదలను దోచి బడా కార్పొరేట్లకు పెడుతుందని విమర్శించారు. రాబోయే రోజుల్లో నేత కార్మికుల వర్కర్ టు ఓనర్ పథకం అమలు, ఇందిరమ్మ ఇండ్లు, తదితర సమస్యలపై విస్తృత పోరాటాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్‌బాబు, జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, నాయకులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, గన్నారపు నర్సయ్య, జువ్వాజి విమల, మల్లారపు అరుణ్‌కుమార్, ఎర్రవెల్లి నాగరాజు, సూరం పద్మ తదితరులు పాల్గొన్నారు. ముందస్తు అరెస్టులు.. మిన్నంటిన నిరసనలు సిరిసిల్లటౌన్: ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాల ఆగ్రహం పెల్లుబికింది. బుధవారం వేములవాడకు సీఎం రేవంత్‌రెడ్డి రావడంతో మంగళవారం రాత్రి నుంచే ప్రతిపక్షాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం వేకువజామునే బీఆర్ఎస్ నేతల ఇళ్లకు వెళ్లి ఠాణాకు తరలించారు. ఈసందర్భంగా వారు పోలీస్టేషన్లోనే ధర్నాకు దిగారు. ప్రజల ఆకాంక్షను సీఎం దృష్టికి తీసుకెళ్లకుండా పోలీసులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, అన్నారం శ్రీనివాస్, గుండ్లపెల్లి పూర్ణచందర్, సుంకపాక మనోజ్, సబ్బని హరీశ్ తదితరులున్నారు. సభకు పాస్‌లిచ్చి.. అరెస్టులు సీఎంను కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు అవకాశమివ్వాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను ముందస్తుగానే కోరగా ఆయన సమ్మతించారని, సభకు వచ్చేందుకు తమకు పాస్‌లు కూడా ఇచ్చారని, కానీ పొద్దున్నే పోలీసులు అరెస్టు చేశారని తాజా మాజీ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజా మాజీ సర్పంచుల ఫోరం జిల్లా కన్వీనర్ అక్కెనపల్లి కరుణాకర్‌తో పాటు పలువురిని అరెస్టులు చేయడంతో జిల్లా అంతటా ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేతలు ఆడెపు రవీందర్, గౌడ వాసుతో పాటు పలువురు వస్త్ర పరిశ్రమకు చెందిన నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. -
నేతన్నల దరి చేరిన నూలు డిపో
సిరిసిల్ల: నేతన్నల చిరకాల వాంఛ నెరవేరింది. వ స్త్రోత్పత్తికి అవసరమైన నూలును అరువు (క్రెడిట్) పై అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం రే వంత్‌రెడ్డి బుధవారం వేములవాడలో నూలు డిపో ను ప్రారంభించారు. నేషనల్ టెక్స్టైల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌డీసీ) ద్వారా నూలు కొనుగోలు చేసి వస్త్రోత్పత్తిదారులకు అందిస్తారు. డిపో ప్రారంభానికి ముందు టెస్కో జీఎం వి.అశోక్‌రావు, జౌళిశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వర్రావు సందర్శించారు. ఇప్పటికే కొనుగోలు చేసిన నూలు వైరెటీలను పరిశీలించారు. వారం రోజుల్లో పూర్తి స్థాయిలో నూలు డిపో పని చేస్తుందని, ఆర్వీఎం వస్త్రాల తయారీకి అవసరమైన నూలు అందిస్తామని టెస్కో అధికారులు వెల్లడించారు. -
కోడె మొక్కు.. ప్రత్యేక పూజలు
వేములవాడ: ఎములాడ రాజన్నను బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. హెలికాప్టర్లో వేములవాడకు చేరుకున్న సీఎంకు పోలీసులు గౌరవవందనం సమర్పించారు. సీఎం సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకోగా, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కోడె మొక్కు చెల్లించుకుని, ప్రత్యేక పూజల అనంతరం మహామంటపంలో వేదమూర్తుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి ప్రసాదం, నంది విగ్రహాలను బహూకరించారు. సీఎం తోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, కొండ సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్, విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టతను విప్ ఆది, అర్చకులు శరత్‌శర్మ, రాజు వివరించారు. సీఎంను సన్మానించిన ఆలయ ఉద్యోగులు సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడ రాజన్నను దర్శించుకుని ఆలయ విస్తరణ పనులకు భూమిపూజ చేసిన సందర్భంగా ఆలయ ఉద్యోగుల సంఘం నాయకులు, సభ్యులు సన్మానించారు. -
జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభం
సిరిసిల్లక్రైం: జిల్లాలో నూతనంగా నిర్మించిన పోలీస్ కార్యాలయాన్ని బుధవారం సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడ పర్యటనలో భాగంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం మంత్రులు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు పూజలు నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ నూతన కార్యాలయంలో ఆసీనులు కాగా మంత్రులు, డీజీపీ పుష్పగుచ్ఛం అందించి శాంతిభద్రతలను కాపాడాలని సూచించారు. అనంతరం డీజీపీ జితేందర్ మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ విశాలమైన వాతావరణంలో జిల్లా పోలీస్ కార్యాలయాన్ని అద్భుతంగా నిర్మించిందని వెల్లడించారు. త్వరలోనే ఎస్పీ నివాస భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్, మల్టీజోన్– 1 ఐజీ పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, జీవన్‌రెడ్డి, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్‌రెడ్డి, మురలీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పూర్తి చేస్తాం
● ఈనెల 30న ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ సమీక్ష చేస్తారు ● కాళేశ్వరంతో పనిలేకుండా అత్యధిక వరి ఉత్పత్తి ● పాదయాత్ర సమయంలో వాగ్దానాలు పూర్తి చేస్తున్నామన్న సీఎం ● కేసీఆర్ పాలనపై మంత్రుల విమర్శలు ● ఇందిరమ్మ రాజ్యంతోనే సంక్షేమం, అభివృద్ధని స్పష్టీకరణ ● రూ.679 కోట్ల పనులకు శంకుస్థాపనపెండింగ్ ప్రాజెక్టులుమాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి సీఎం రేవంత్ పర్యటన ఇలా..● ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్ ద్వారా వేములవాడ గుడి చెరువు చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ ద్వారా ఆలయ గెస్ట్‌హౌస్‌కు వెళ్లారు. ● మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ దంపతులు ఒకేచోట కలుసుకుని సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న క్రమంలో అన్నా, వదిన ఒకేచోట అంటూ సీఎం మాట్లాడారు. ● గెస్ట్‌హౌస్ నుంచి సీఎం లుంగీ–కండువా ధరించి రాజన్న దర్శనానికి వెళ్లారు. అంతకుముందు పోలీసులు గౌరవవందనం సమర్పించారు. సాక్షిప్రతినిధి, కరీంనగర్/వేములవాడ/వేములవాడఅర్బన్: అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని, ఈ నెల 30 లోపు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తారని, ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి, ఎన్ని నిధులు కావాలి అనేది సమీక్షలో మాట్లాడుతారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం వేములవాడ రాజన్న దర్శనం అనంతరం ఆలయ గుడి చెరువు ఖాళీ స్థలంలో రూ.679 కోట్లతో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవ సభకు హాజరై మాట్లాడారు. కరీంనగర్ జిల్లా నుంచి పీవీ నరసింహారావు దేశానికి దిశ దశ చూపి, గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు తెలంగాణ బిడ్డ పరిపాలన అంటే ఎంటో చూపించారన్నారు. అలాగే పెద్దలు చొక్కారావు, ఎం.సత్యనారాయణరావు లాంటి వారు కరీంనగర్ నుంచి నాయకత్వం అందించారని గుర్తు చేశారు. అనంతరం వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. వేములవాడ అభివృద్ధికి అన్ని శాఖల మంత్రులు సంపూర్ణ సహకారం అందించారన్నారు. రూ.76 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు శృంగేరిపీఠాధిపతుల సూచనల మేరకు నిర్వహిస్తున్నామని వివరించారు. వేములవాడలో రూ.35 కోట్లతో నిత్య అన్నదానసత్రానికి సీఎం సభకు వచ్చే ముందు ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో నిర్లక్ష్యానికి గురైన వేములవాడ పట్టణ పునర్నిర్మాణం పనులను 10 నెలల కాలంలో ప్రారంభించుకున్నామని వెల్లడించారు. గల్ఫ్ కార్మికులు మరణిస్తే దేశంలోనే రాష్ట్రంలో రూ.5 లక్షల పరహారం అందిస్తున్న ఏకై క ప్రభుత్వం అని పేర్కొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎగవేసిన బకాయిలు చెల్లిస్తూనే 30 ఏళ్ల చిరకాల కోరిక యారన్ డిపో ఏర్పాటు చేశామని వెల్లడించారు. 365 రోజులు నేత కార్మికులకు పని కల్పించే సంకల్పం ప్రభుత్వం తీసుకుందన్నారు. రాజన్న దయతో దేశంలోనే అత్యధికంగా వరిపంట దిగుబడి వచ్చిన రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిందన్నారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, మనందరి కష్టం ఫలితంగా ఇందిరమ్మ రాజ్యం రాష్ట్రంలో ఏర్పడిందన్నారు. రాబోయే నాలుగేళ్లలో రూ.లక్ష కోట్లతో పేదలకు 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రాజకీయాలు, కులాలకతీతంగా పేదలకు ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. బీసీ, రవాణా శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, చిరకాల ఆకాంక్ష నిత్యాన్నదాన సత్రానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గతంలో వాగ్దానాలకు పరిమితమైన వేములవాడ ఆలయానికి నేడు అభివృద్ధి బాటలు వేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో నేత కార్మికుల ఉపాధికి బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తామని ప్రకటించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, నిరంతరం ప్రజల్లో తిరిగే శ్రమజీవి విప్ ఆది శ్రీనివాస్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రతీ ఎకరం సాగయ్యే దిశగా చర్యలు తీసుకుంటామని వివరించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. రుద్రంగి ఇవతల మర్రిపల్లి అమ్మమ్మ ఊరు, అవతల నాన్నమ్మ ఊరని తెలిపారు. పది నెలల కాలంలోనే 50 వేల ఉద్యోగాలు అందించామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాట నిలబెడుతామన్నారు. నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్– 2, ఫేజ్– 1 పనులు పూర్తి చేసి లక్షా 51 వేల 400 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ఎల్లంపల్లి కెనాల్ నెట్వర్క్ ప్యాకేజీ– 2లో పెండింగ్ పనులకు రూ.170 కోట్లు ఖర్చు చేసి వేములవాడ నియోజకవర్గంలో 40,500 ఎకరాలు, కోరుట్లలో 2,500 ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. సిరిసిల్లలో కాళేశ్వరం ప్యాకేజీ 9,10,11 పూర్తి చేసి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులపై వారం రోజుల్లో సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్‌సింగ్, విజయరమణారావు తదితరులు పాల్గొన్నారు. ఆదిపై ప్రశంసల జల్లు.. వేములవాడకు బుధవారం ప్రభుత్వం మంజూరు చేసిన రూ.679 కోట్ల నిధులు, ఆలయ విస్తరణ పనుల విషయంలో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీని వాస్‌పై ప్రశంసల జల్లు కురిసింది. సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, గతంలో వేములవాడ ఎమ్మెల్యేను కలవాలంటే జర్మని వెళ్లాల్సి వచ్చేదని కానీ, ఈ ప్రభుత్వంలో ఆది వేములవాడ ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల వద్దకు స్వయంగా వెళ్తున్నారని ప్రశంసించారు. అసెంబ్లీ సమావేశాలు మినహా ఏనాడు హైదరాబాద్ రాడని, నియోజకవర్గ అభివృద్ధి తప్ప పైరవీలు చేయడని స్పష్టం చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నా రు. అలాగే వేములవాడలో ఆలయ విస్తరణ, సాగునీటి పనుల పూర్తికి ప్రభుత్వం తీసుకుంటున్న చొర వ ఆది శ్రీనివాస్ కృషి అని మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, పొన్నం, శ్రీధర్‌బాబు అభినందించారు. సీఎంకు విప్ ఆది శ్రీనివాస్, ఆయన కుమారుడు కార్తీక్ తలపాగా ధరింపజేసి స్వామివారి చిత్రపటం, త్రిశూలం బహూకరించారు. 2.55 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగాన్ని ప్రారంభించి 3.30 గంటలకు ముగించారు. సభా వేదికపైనుంచి కిందకు దిగిన సీఎంతో పోలీసు ఉన్నతాధికారులు ఫొటో దిగారు. 3.45 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి హెలీకాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. – వేములవాడ 11.41 గంటలకు ఆలయ విస్తరణ పనులకు భూమిపూజ చేశారు. మంత్రులందరికీ ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ కొబ్బరికాయలు అందజేశారు. కార్యక్రమానికి శృంగేరి అర్చకులు హాజరయ్యారు. 11.45 గంటలకు ప్రారంభోత్సవాలు చేసిన సీఎం. 11.55 గంటలకు ఆలయంలోకి ప్రవేశించి మంత్రులతో కలిసి 12.20 వరకు దర్శనాలు పూర్తిచేసుకున్నారు. 12.25 గంటలకు స్వామివారి అద్దాల మంటపంలో సీఎం, మంత్రులకు దేవాదాయశాఖ అధికారులు, ప్రభుత్వవిప్ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అర్చుకులు ఆశీర్వచనం గావించారు. అనంతరం సీఎంతో ఫొటో దిగారు. 12.45 గంటలకు దర్శనాలు పూర్తిచేసుకుని గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 1.20 గంటలకు ప్రారంభోత్సవాలు పూర్తి చేసి, 1.25 గంటలకు సీఎం వేదికపైకి చేరుకున్నారు. 1.35 గంటలకు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం తెలంగాణ గీతం ఆలపించారు. 1.40 గంటలకు యార్నడిప్ వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు. 1.45 గంటలకు ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ స్వాగత వచనాలు చేశారు. -
సీఎం సారూ.. స్పందించాలి మీరు!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే అత్యంత పురాతన, చారిత్రక ఆలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం. హైదరాబాద్ సంస్థానంలోనూ నిజాంరాజులు పెద్దపీట వేసిన ఏకై క ఆలయం. 1830 లోనే దక్షిణ భారతదేశంలో రోజుకు రూ.4 లక్షల ఆదాయం ఉన్న ఆలయాలు రెండే. ఒకటి తిరుపతి, రెండోది వేములవాడ. అంతటి ఘనచరిత్ర కలిగిన ఆలయంలో బుధవారం కోడెమొక్కులు చెల్లించుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టీటీడీ, యాదాద్రి(ప్రతిపాదన దశ) తరహాలో స్వయం ప్రతిపత్తితో కూడిన ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. అటానమస్ హోదాకు ప్రయత్నాలు రాజన్న ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ, ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల భక్తులకు రాజరాజేశ్వర స్వామివారు ఇలవేల్పు. కోరిన కోర్కెలు తీర్చే దేవునిగా అనాదిగా పూజిస్తున్నారు. ఒకప్పుడు భక్తుల రద్దీని గమనించిన నాగిరెడ్డి అనే ధర్మకర్త వేములవాడలో మరో కోనేరు నిర్మించారు. ఇది నిజామాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చే వారికి అనుకూలంగా ఉండేది. క్రమంగా ఇది పాడవుతోంది. ప్రధాన ఆలయంతోపాటు బద్దిపోచమ్మ, భీమన్న ఆలయాలు కూడా పురాతనమైనవే. దేవస్థానానికి ఉప ఆలయాలుగా ఉన్న నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి, మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి తదితర ఆలయాలను కలిపి క్లస్టర్‌గా అటానమస్ బోర్డును ఏర్పాటు చేసి(వీటీడీఏ కాకుండా), అభివృద్ధి చేయాలని రాజన్న ఆలయ ఉద్యోగులు, భక్తులు కోరుతున్నారు. యాదాద్రికి డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసిన సమయంలో వేములవాడలోనూ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చింది. వెంటనే అప్పటి సీఎం కేసీఆర్ ఇక్కడ వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ)ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు యాదాద్రికి అటానమస్ హోదా కల్పించేందుకు ప్రయత్నాలు మొదలైన దరిమిలా.. వేములవాడకూ కల్పించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదాయం జీతాలు, పింఛన్లకే.. ఆలయానికి ప్రధానంగా కోడె మొక్కులు, హుండీ ద్వారా ఆదాయం వస్తుంది. ఆలయ నిర్వహణ ఖ ర్చు ఏటా రూ.200 కోట్ల పైమాటే. ఇందులో అధికశాతం దాదాపు రూ.30 కోట్ల వరకు జీతాలు, పింఛన్లకే వెచ్చిస్తుండటం వల్ల ఆలయ అభివృద్ధికి నిధులు సరిపోవడం లేదు. ఇవిగాక కరెంటు బిల్లులు, ప్రసాదాలు, శివరాత్రి, ఇతర ఉత్సవాలు కలిపితే వచ్చే ఆదాయం కంటే ఖర్చయ్యేదే ఎక్కువ. అందు కే, ప్రత్యేక అటానమస్ బోర్డు ఉంటే తప్ప అభివృద్ధి ఊపందుకోదని పలువురు భక్తులు అంటున్నారు. తాజా నిర్ణయాలపై హర్షం.. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.127.65 కోట్లు విడుదల చేయడాన్ని స్థానికులు స్వాగతిస్తున్నారు. ఇందులో ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు రూ.76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు ఉన్న రోడ్లను విస్తరించేందుకు రూ.47.85 కోట్లు మంజూరు చేసింది. అలాగే, మూలవాగులో బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు రూ.3.8 కోట్లతో నూతన డ్రైనేజీ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అలాగే, వీటీడీఏ పరిధిని మొత్తం జిల్లాకు విస్తరించడం, పట్టణీకరణకు పెద్దపీట వేయడంపై రాజన్నసిరిసిల్ల జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయంపై చర్చ.. వరంగల్‌లో మామునూరు విమానాశ్రయ నిర్మాణంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసి, నిధులు విడుదల చేసిన నేపథ్యంలో బసంత్‌నగర్ విమానాశ్రయంపై మరోసారి చర్చ మొదలైంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఈ విషయమై సానుకూలత వ్యక్తం చేయడంతో ఆశలు చిగురించాయి. గత ప్రభుత్వ హయాంలో సర్వే చేసి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు నివేదిక సమర్పించినా పురోగతి లేదు. వరంగల్ ఎయిర్‌పోర్టు సాకారమవుతున్న వేళ.. బసంత్‌నగర్ విమానాశ్రయంపైనా స్పష్టమైన హామీ ఇవ్వాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులు కోరుతున్నారు. నిజాం షుగర్స్‌పై గంపెడాశలు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాల్సి ఉంది. వాస్తవానికి రూ.210 కోట్ల బ్యాంకు బకాయిలకు గానూ ప్రభుత్వం ఇప్పటికే రూ.192 కోట్లు చెల్లించింది. మిగతా మొత్తం చెల్లింపు, ఉద్యోగులకు వేతనాలు, పింఛన్ల సర్దుబాటుకు పరిష్కార మార్గాలు వెదుకుతోంది. ఫ్యాక్టరీ పునఃప్రారంభమైతే ఉపాధితోపాటు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని జగిత్యాల జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. దుష్ప్రచారానికి తెర ఒకప్పుడు రాజన్న ఆలయానికి వస్తే పదవీ గండం అన్న దుష్ప్రచారం ఉండేది. కానీ, అదంతా వట్టిదే అని తేలిపోయింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి బండి సంజయ్, సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ల విజయాలే ఇందుకు నిదర్శనం. పాత ప్రచారం పోయి, ఇప్పుడు రాజన్నకు కోడెమొక్కులు చెల్లిస్తే విజయం తథ్యమన్న మాట విస్తృతంగా వాడుకలోకి వచ్చింది.‘రాజన్న’కు స్వయం ప్రతిపత్తి కావాలి టీటీడీ తరహాలో అటానమస్ హోదా కల్పించాలంటున్న భక్తులు హైదరాబాద్ సంస్థానంలో అత్యంత ప్రాచీన ఆలయంగా ఎములాడ వేములవాడ రాజరాజేశ్వరునికి నేడు సీఎం రేవంత్‌రెడ్డి కోడె మొక్కులు బసంత్‌నగర్ విమానాశ్రయం, నిజాం షుగర్స్ హామీలపై చర్చరాజన్న ఆలయం వద్దనే అన్నీ.. ఇదీ వేములవాడలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్ సిరిసిల్ల/వేములవాడఅర్బన్: : వేములవాడ రాజన్న ఆలయం వద్దనే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేశారు. హైదరాబాద్ బేగంపేట నుంచి ఉదయం 9గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి 9.45కు వేములవాడ చేరుకుంటారు. ఉదయం 9.55గంటలకు పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. 10గంటల నుంచి 10.15 వరకు ఆలయ అతిథిగృహంలో రెస్ట్ తీసుకుంటారు. 11గంటలకు రాజన్న ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. 11.45 గంటలకు ధర్మగుండం వద్ద శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. 12.15గంటలు అతిథి గృహానికి చేరుకుంటారు. 12.30నుంచి 1.40 వరకు రాజన్న ఆలయం గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. 1.45 గుడిచెరువు గ్రౌండ్ హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. హైదరాబాద్‌కు హెలీకాప్టర్‌లో బయల్దేరి 2.30 గంటలకు బేగంపేటకు చేరుకుంటారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పకడ్బందీ ఏర్పాట్లువేములవాడలో బుధవారం జరిగే సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటనకు తీసుకోవాల్సిన భద్రత ఏర్పాట్లు, ఇతర చర్యలపై సీఎం సెక్యూరిటీ సిబ్బంది, పోలీస్, ఇతరశాఖల అధికారులతో కలిసి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్షించారు. సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడకు ఉదయం చేరుకుంటారని తెలిపారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుని, పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారని పేర్కొన్నారు. అనంతరం బహిరంగసభలో పాల్గొంటారన్నారు. సభ అనంతరం అతిథిగృహం వద్ద లంచ్‌చేసి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ వెళ్తారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు అందిస్తామని, అవి ఉన్నవారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తారని తెలిపారు. సీఎం కాన్వాయ్‌లో పూర్తి సిబ్బందితో కూడిన అంబులెన్స్ ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగసభ వద్ద మెడికల్‌క్యాంపు పెట్టాలన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, అదనపు ఎస్పీలు చంద్రయ్య, శేషాద్రినిరెడ్డి, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్ పాల్గొన్నారు. ధార్మిక.. కార్మిక క్షేత్రంలో సమస్యలు ఇవీ..రాజన్నసిరిసిల్ల జిల్లా ధార్మిక, కార్మిక, కర్షక క్షేత్రంగా సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు 261 గ్రామాలతో విస్తరించి ఉంది. చిన్నజిల్లాగా పేరున్న ఈ జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలు ప్రజలకు ప్రతిబంధంకంగా మారాయి. ప్రతిపక్ష నేతగా రేవంత్‌రెడ్డి ఇక్కడికి అనేక పర్యాయాలు వచ్చినా.. సీఎం హోదాలో వేములవాడకు తొలిసారి బుధవారం వస్తున్నారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన సీఎం రేవంత్‌రెడ్డిపై జిల్లా ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో రెండు పాయలుగా అటు మానేరు.. ఇటు మూలవాగు పారుతుంది. ధార్మిక క్షేత్రమైన వేములవాడ, కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల, కర్షకుల నిలయాలైన పల్లెల్లో నెలకొన్న ప్రధాన ప్రధాన సమస్యలు ఇవీ.. – సిరిసిల్ల8లోu