results
-
శరద్‌పవార్ శకం ముగిసిందా..?
ముంబయి: ఇటీవలి లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరాఠా ప్రజలు విలక్షణ తీర్పిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్‌ల విషయం పక్కన పెడితే ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలైన శివసేన,ఎన్సీపీల చీలిక వర్గాలకు ప్రజలు జై కొట్టారు. ఇటు శివసేన(షిండే) వర్గానికి, అటు ఎన్సీపీ(అజిత్‌పవార్)వర్గానికి విజయాన్ని కట్టబెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు శివసేన(ఉద్ధవ్),ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీల కంటే వెనుబడడం గమనార్హం. కేవలం 5 నెలల వ్యవధిలో కోలుకుని తమ మాతృ పార్టీలను షిండే,అజిత్ పవార్లు వెనక్కినెట్టేయడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది.శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీలు మహావికాస్అఘాడీ కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో కలిసి మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. రెండు పార్టీలు ఈ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మరాఠా రాజకీయాల్లో యోధుడిగా పేరొందిన శరద్‌పవార్‌కు రాజకీయాల్లో నుంచి రిటైర్ అయ్యే వేళ ప్రజలు భారీ షాక్ ఇచ్చారు. తన రాజ్యసభ ఎంపీ పదవీకాలం పూర్తయ్యాక 2026లో రాజకీయాల్లో నుంచి రిటైరవుతానని శరద్‌పవార్ గతంలోనే హింట్ ఇచ్చారు. ఇదే జరిగితే శరద్‌పవార్ ఆధ్వర్యంలో ఎన్సీపీ(ఎస్పీ)కి చివరి అసెంబ్లీ ఎన్నికలైన ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చినట్లే.ఈ ఎన్నికల్లో ఎంవీఏలో భాగంగా ఎన్సీపీ(శరద్‌పవార్) ఏకంగా 87 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 11 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇదే సమయంలో శరద్‌పవార్ పార్టీని చీల్చి ఆయన పార్టీ గుర్తు గడియారాన్ని కూడా సొంతం చేసుకుని అసలైన ఎన్సీపీగా బరిలోకి దిగిన అజిత్ పవార్ వర్గానికి 41 సీట్లు రావడంతో శరద్‌పవార్‌కు రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలినట్లయింది. ఇప్పుడు అసలైన ఎన్సీపీ తనదేనని చెప్పుకునేందుకు అజిత్‌పవార్‌కు లీగల్‌గానే కాకుండా నైతికంగా కూడా అవకాశం లభించినట్లయింది.శరద్‌పవార్ ఆరు దశాబ్దాల క్రితం మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించి మరాఠా రాజకీయాల్లో యోధుడిగా పేరు తెచ్చుకున్నారు. మహారాష్ట్ర సీఎం పదవిని పవార్ నాలుగుసార్లు చేపట్టి రికార్డు సృష్టించారు. అత్యంత తక్కువ వయసులో కేవలం 38 ఏళ్లకే శరద్‌పవార్ 1978లో మహారాష్ట్ర సీఎం అయ్యారు. సోనియాగాంధీ ఇటలీ మూలాలను ప్రశ్నించినందుకు శరద్‌పవార్‌ను 1999లో కాంగ్రెస్ నుంచి బహిష్కరించారు. దీంతో ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పేరుతో వేరు కుంపటి పెట్టుకున్నారు.మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్, శివసేనలకు ధీటుగా ఎన్సీపీని తీర్చిదిద్ది బలమైన పార్టీగా తయారు చేశారు శరద్‌పవార్. చివరకు 2023లో సోదరుడి కుమారుడు అజిత్‌పవార్ ఎన్సీపీ పార్టీని నిట్టనిలువుగా చీల్చి రాజకీయంగా శరద్‌పవార్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. అయితే అనంతరం జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు శరద్‌పవార్ ఎన్సీపీకి 8 ఎంపీ సీట్లలో విజయం కట్టబెట్టారు. ప్రజలు సానుభూతితో శరద్‌పవార్ వెంటనడిచారనుకునే లోపే తాజాగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆయనకు ఘోర పరాజయాన్ని చవి చూపించాయి. -
UP By Election Results: ఫలితాలకు ముందు అభ్యర్థులకు అఖిలేష్ సూచనలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఈరోజు (శనివారం) వెలువడనున్నాయి. నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారుయూపీలోని మీరాపూర్, కుందర్కి, సీసామవు, కటేహరి, ఫుల్పూర్, మజ్వాన్, ఘజియాబాద్, కర్హల్, ఖైర్ స్థానాలకు నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వంపై ఎలాంటి ప్రభావం చూపవు. అయితే లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), దాని రాజకీయ ప్రత్యర్థుల మధ్య నెలకొన్న ఈ పోటీని 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్నారు. उप्र के विधानसभा उपचुनाव में चुनाव आयोग व इंडिया गठबंधन-सपा के सभी 9 सीटों के उम्मीदवारों से ये अपील है कि कल सुबह ये सुनिश्चित करें कि नियमानुसार पोस्टल बैलेट पहले गिने जाएं और फिर ईवीएम मशीनों के वोटों की मतगणना हो। सभी पूरी तरह मुस्तैद रहें और किसी भी तरह की गड़बड़ी होने या…— Akhilesh Yadav (@yadavakhilesh) November 22, 2024ఉప ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి అనుకూలంగా వస్తాయని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన ఒక ట్వీట్లో.. ఎన్నికల కమిషన్‌కు, ఇండియా అలయన్స్-ఎస్పీకి చెందిన తొమ్మిదిమంది అభ్యర్థులకు కొన్ని సూచనలు చేశారు. శనివారం ఉదయం జరిగే పోస్టల్ బ్యాలెట్లను నిబంధనల ప్రకారం మొదట లెక్కించేలా చూసుకోవాలని సూచించారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కించనున్నారన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు, నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా అవకతవకలు జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే ఎన్నికల కమిషన్‌కు, పార్టీకి తెలియజేయాలని సూచించారు. అభ్యర్థులు విజయ ధృవీకరణ పత్రాన్ని అందుకునేవరకూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఫుల్పూర్, ఘజియాబాద్, మజ్వాన్, ఖైర్ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. సీసామవు, కటేహరి, కర్హల్, కుందర్కిలో ఎస్పీ విజయం సాధించింది. అప్పుడు ఎస్పీకి మిత్రపక్షంగా ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్డీ), మీరాపూర్ స్థానాన్ని గెలుచుకుంది. ఆ పార్టీ ఇప్పుడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగమైంది. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయలేదు. ఎస్పీకి మద్దతు పలికింది. -
చరిత్రలో లేని గెలుపు: ఫలితాలపై స్పందించిన ట్రంప్
ఫ్లోరిడా: అమెరికా ఎన్నికల ఫలితాలు ఎవరూ ఊహించలేదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లికన్ పార్టీ దూసుకుపోతున్న సందర్భంగా ఫ్లోరిడాలో బుధవారం(నవంబర్ 6) ట్రంప్ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. ట్రంప్ మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ట్రంప్..ట్రంప్ నినాదాలతో హోరెత్తించారు. తన గెలుపు అమెరికాకు ఉపయోగమని ఈ సందర్భంగా ట్రంప్ చెప్పారు. అమెరికా ఇలాంటి విజయం ఎన్నడూ చూడలేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికన్లకు సువర్ణయుగం రాబోతోందన్నారు. రిపబ్లికన్లకు 300కుపైగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. పాపులర్ ఓట్లు కూడా మాకే ఎక్కువ వచ్చాయి. ఇక అమెరికాలోకి అక్రమ వలసలు ఉండవు. అందరూ చట్టబద్ధంగానే రావాల్సి ఉంటుంది. సరిహద్దులు మూసివేస్తా. అక్రమ వలసలు అడ్డుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తా.‘నా విజయంలో నా వెన్నంటి ఉన్న నా కుటుంబానికి కృతజ్ఞతలు. ఇది మొత్తం అమెరికన్లు గర్వించే విజయం. వైఎస్ ప్రెసిడెంట్ అభ్యర్థి జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా చిలుకూరి బాగా పనిచేశారు. ఉపాధ్యక్ష అభ్యర్థిగా వాన్స్ ఎంపిక సరైనదేనని తేలింది. తొలుత వాన్స్ ఎంపికపై వ్యతిరేకత వచ్చింది.’అని ట్రంప్ గుర్తు చేశారు. ట్రంప్ ప్రసంగించిన వేదికపైనే ట్రంప్ కుటుంబ సభ్యులతో పాటు ఉపాధ్యక్ష అభ్యర్థి వాన్స్ కూడా ఉన్నారు.#WATCH | West Palm Beach, Florida | Republican presidential candidate #DonaldTrump says, "...This is a movement that nobody has ever seen before. Frankly, this was, I believe, the greatest political movement of all time. There has never been anything like this in this country and… pic.twitter.com/MEcRDSAI72— ANI (@ANI) November 6, 2024 ఇదీ చదవండి: అమెరికా ఎన్నికల ఫలితాల అప్డేట్స్ -
మంత్రి లేక టెట్ ఫలితాలకు బ్రేక్
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్షల (ఏపీ టెట్ జూలై–2024) ఫలితాలు ఆలస్యం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం ప్రకటించాల్సి ఉండగా, విద్యాశాఖ మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన ఫలితాలకు అడ్డంకిగా మారింది. అక్టోబర్ 3 నుంచి 21వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.వాస్తవానికి గతనెల 27న ప్రకటించాల్సిన ఫైనల్ కీ సైతం రెండు రోజులు ఆలస్యంగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా టెట్ ఫలితాలను సోమవారం ప్రకటించి, 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈనెల 6న విడుదల చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, మంత్రి వచ్చాక టెట్ ఫలితాలు, డీఎస్పీ నోటిఫికేషన్‌పై సోమవారం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. -
కాంగ్రెస్ బలపడింది అని అనుకోవడం లేదు..
-
సోలోగా కాదు..మ్యాజిక్ జరగాలంటే : ఆనంద్ మహీంద్ర మరో అద్భుత పోస్ట్, వీడియో వైరల్
పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర ఐకమత్యం గురించి తెలిపే ఒక అద్భుతమైన వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు. వ్యాపార వ్యవహరాల్లో తలమునకలై ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఫాలోవర్స్‌ను ఎడ్యుకేట్ చేయడంలో, మోటివేట్ చేయడంలో ఈ బిజినెస్ టైకూన్ తరువాతే మరెవ్వరైనా అని చెప్పవచ్చు.మట్టిలో మాణిక్యాల్లాంటి వ్యక్తుల ప్రతిభను పరిచయం చేయడమే కాదు, తనవంతుబాధ్యతగా వారికి అండగా నిలుస్తారు. ఇన్స్పిరేషనల్ వీడియోస్, సామాజిక స్పృహతో పాటు ప్రోత్సాహపరిచే వీడియోలు, అప్పుడప్పుడు మరికొన్ని ఫన్నీ విడియోలను పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మండే మోటివేషన్ పేరుతో ఆయన షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. బలం, శక్తి, స్వేచ్ఛకు ప్రతీకలు పక్షులు గుంపుగా ఎగురుతున్న వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఒంటరిగా ఎగరడం, అదీ అందనంత ఎత్తున ఆకాశతీరాన విహరించడం చాలా ఉత్సాహంగా ఉంటుంది. కానీ పనిలో జట్టుగా, జమిలిగా ఎగరడం(ఎదగడం)లో చాలా మేజిక్ ఉంది. దానికి చాలా శక్తి ఉంది అంటూ కలిసికట్టుగా ఉండటంలోని ప్రయోజనాన్ని గురించి ఆనంద్ మహీంద్ర గురించి చెప్పారు. ఇది ఆయన ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటోంది. ‘‘అవును సార్, టీమ్‌వర్క్ అద్భుతమైన ఫలితాలనిస్తుంది. అనుకున్నకలలను నెరవేర్చుకోవచ్చు, కలిసి, కొత్త శిఖరాలను చేరుకోవచ్చు మరపురాని అనుభవాన్ని సాధించవచ్చు! అంటూ ఒక నెటిజన్ కమెంట్ చేయడం విశేషం.Flying solo and soaring high in the skies can be exhilarating. But there is as much magic—and power—in flying together, as a Team….#MondayMotivation#TogetherWeRisepic.twitter.com/ARVcoEJtwM— anand mahindra (@anandmahindra) October 7, 2024 -
TS DSC Results 2024: తెలంగాణ DSC ఫలితాలు విడుదల
-
ఇవాళ తెలంగాణ DSC 2024 ఫలితాలు విడుదల
-
నీట్.. ర్యాంకుల ‘షికార్’
నీట్ యూజీ–2024 పరీక్ష ఫలితాలపై వివాదం కొనసాగుతూనే ఉంది. మే 5న దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించగా.. 23 లక్షల మందికిపైగా హాజరయ్యారు. గత నెలలో ఫలితాలు వెల్లడికాగా..పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ ఆందోళన వ్యక్తమైంది. అనేకమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు పరీక్ష నిర్వహణ సంస్థ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తాజాగా పట్టణాలు, పరీక్ష కేంద్రాల వారీగా ఫలితాలను వెల్లడించింది.700+ స్కోర్‌తో ఆలిండియా కోటా సీటు..నీట్లో 700+ మార్కులు స్కోర్ చేసిన 2,321 మంది విద్యార్థులకు ఆల్ ఇండియా కోటాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో మెడికల్ సీటు లభిస్తుంది. అదేవిధంగా 650+ మార్కులు స్కోర్ చేసిన 30,204 మంది విద్యార్థులకు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశం దక్కుతుంది. అలాగే 600+ మార్కులు స్కోర్ చేసిన 81,550 మంది విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలల్లో ఏదో ఒక చోట సీటు సొంతమయ్యే అవకాశముంది.రీటెస్ట్ తర్వాత ఫలితం..గ్రేస్ మార్కుల వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు.. నీట్ రీటెస్ట్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ రీటెస్ట్ త ర్వాత హరియాణాలోని ఒక పరీక్ష కేంద్రంలో ఆశ్చర్యకర ఫలితాలు వెల్లడయ్యాయి. హిస్సార్‌లోని హరదయాళ్ పబ్లి క్ స్కూల్ పరీక్ష కేంద్రంలో రీటెస్ట్‌కు ముందు వెల్లడించిన ఫలితాల్లో మొత్తం 8 మంది విద్యార్థులకు 720, 719, 718 మార్కులు వచ్చాయి. రీటెస్ట్ ఫలితాలు వెల్లడయ్యాక ఈ పరీక్ష కేంద్రంలో గరిష్ట స్కోర్ 682 మాత్రమే. అంతేకాకుండా కేవలం ఇద్దరు విద్యార్థులకు మాత్రమే 650+ మార్కు లు వచ్చాయి. 13 మంది విద్యార్థులు 600+ మార్కులు స్కోర్ చేశారు. దీన్నిబట్టే చూస్తే రీటెస్ట్‌కు ముందు ఈ సెంటర్లో వెల్లడయిన ఫలితం ఆశ్చర్యకరమని చెప్పొచ్చు. సికర్ ఫలితం.. ఆశ్చర్యకరంరాజస్తాన్లోని సికర్ పట్టణంలో మొత్తం 50 కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష జరిగింది. ఈ పట్టణంలోని కేంద్రాల్లో మొత్తం 27,216 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 149 మందికి 700+ స్కోర్ వచ్చింది. 650 + స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్య 2,037. అలాగే 4,297 మంది విద్యార్థులు 600 + స్కోర్ చేశారు. సికర్‌లో నీట్ రాసిన విద్యార్థుల సగటు మార్కులు 362. దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన మొత్తం 23 లక్షల మందిలో 30,204 మంది విద్యార్థులు 650+ స్కోర్ చేశారు. కేవలం 1.3 శాతం మంది. కాని ఒక్క సికర్లోనే 2,037 మంది 650+ స్కోర్ చేశారు. ఇది 6.8 శాతం. అదేవిధంగా దేశవ్యాప్తంగా పరీక్ష రాసిన వారిలో 1.3 శాతం మందికి మాత్రమే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చే అవకాశం లభించగా.. సికర్‌లో పరీక్ష రాసిన వారిలో ఏకంగా 7.48 శాతం మందికి ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ దక్కుతోంది. ఇక్కడే చాలా మందికి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఏదో జరిగిందని నేను అనడం లేదు. కాని కేవలం 50 పరీక్ష కేంద్రాలున్న ఒక్క సిటీలో ఇంత మందికి బెస్ట్ స్కోర్ ఎలా సాధ్యమనే ప్రశ్న చాలా మందికి ఎదురవుతోంది.ఒక్క కేంద్రంలో 12 మందికి 700+» అహ్మదాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పరీక్ష కేంద్రంలో మొత్తం 676 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా.. ఏకంగా 12 మందికి 700 + స్కోర్ వచ్చింది. » నామకల్‌లోని ద నవోదయా అకాడెమీ సీనియర్ సెకండరీ స్కూల్లో 659 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 8 మందికి 700+ మార్కులు వచ్చాయి. » సికర్‌లోని టాగోర్ పీజీ కాలేజీలో 356 మంది పరీక్ష రాయగా.. 5గురికి 700+ స్కోర్ వచ్చింది. టాప్ 50లో 37 సికర్ నుంచే» 650 మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసిన టాప్ 50 పరీక్ష కేంద్రాల్లో 37 సికర్‌లోని పరీక్ష కేంద్రాలే. అలాగే దేశంలో బెస్ట్ ఫలితం వచ్చిన టాప్ 60 పరీక్ష కేంద్రాల్లో 43 సికర్ నుంచే ఉన్నాయి. టాప్ 50లో నామకల్‌లోని ఐదు పరీక్ష కేంద్రాలు, హర్యాన, హిస్సార్‌లోని జఝర్ వంటివి ఉన్నాయి. ళీ రాజ్‌కోట్‌లోని ఒక పరీక్ష కేంద్రంలో ఏకంగా 200 మంది విద్యార్థులకు 600 + మార్కులు వచ్చాయి.రాజస్థాన్ బెస్ట్ ప్రదర్శన» దేశ వ్యాప్తంగా నీట్ యూజీలో ఉత్తమ ఫలితాలు చూపిన టాప్ 10 సిటీలో.. ఐదు రాజస్థాన్ నుంచే ఉన్నాయి. » రాష్ట్రాలు/కేంద్రాలు పాలిత పాంత్రాల వారిగా చూసే.. నీట్లో ఉత్తమ ఫలితం చూపిన టాప్ పది రాష్ట్రాల్లో వరుసగా చండీగఢ్, రాజస్థాన్, హరియాణా కేరళ, ఢిల్లీ, పంజాబ్, ఒడిశా, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. » ఈశాన్య రాష్ట్రాల్లో నీట్ ఫలితాలు నిరాశజనకంగా ఉన్నాయి. కాగా కొన్ని పరీక్ష కేంద్రాలు, కొన్ని సిటీల్లో ఇలా ఎందుకు ఫలితం భిన్నంగా ఉంది. ఇక్కడ ఎక్కువ మందికి బెస్ట్ ర్యాంకులు ఎలా వచ్చాయి అనే సందేహం రావడం సహజం. అయితే దీనికి ఈ సిటీల్లో అందుబాటులో ఉన్న కోచింగ్ సౌకర్యాలు కారణం కావచ్చు. కోచింగ్ వల్ల కొన్ని చోట్ల విద్యార్థులు మంచి ఫలితం సాధించి ఉండొచ్చు.» కోచింగ్‌కు పేరుగాంచిన కోటా పట్టణంలోని పరీక్ష కేంద్రాల్లో హాజరైన విద్యార్థుల డేటాను విశ్లేషించినా.. సికర్‌లో పరీక్ష రాసిన విద్యార్థులు ఎంతో ముందున్నారని అర్థమవుతోంది. కోటాలో 27,118 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే..700+ స్కోర్ చేసింది 74 మంది(0.27శాతం) మాత్రమే. అదే సికర్‌లో ఆ సంఖ్య రెండింతలుగా ఉంది. 650+ స్కోర్ చేసిన విద్యార్థుల సంఖ్య 1,066(3.93 శాతం)గా ఉంది. అలాగే ఇక్కడ 2,599 విద్యార్థులు 600 + స్కోర్ చేశారు. 600+స్కోర్ చేసిన విద్యార్థులు కోటాలో 9.58 శాతం ఉండగా.. సికర్‌లో అది 16 శాతంగా ఉంది.రాష్ట్రాలవారీగా 700కు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులురాజస్థాన్482 కేరళ194హరియాణా146మహారాష్ట్ర 205ఉత్తరప్రదేశ్184తెలంగాణ49 -
నీట్ యూజీ ఫలితాలు: సెంటర్ల వారీగా విడుదల
ఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నీట్-యూజీ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి (NTA) విడుదల చేసింది. నగరాలు, కేంద్రాల వారీగా అందరి ఫలితాలను ఎన్టీఏ నీట్ అధికారిక వెబ్సైట్లో శనివారం ఈ ఫలితాలను అప్లోడ్ చేసింది. అభ్యర్థులు nta.ac.in/NEET/ లేదా neet.ntaonline.in. వెబ్సైట్లో తమ ఫలితాలను నగరాలు, కేంద్రాల వారిగా చూసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది.నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జడ్జిలు జేబీ పార్థివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు నగరాల వారీగా, కేంద్రాల వారీగా అందరి ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది. మరోవైపు.. అభ్యర్థుల వివరాలు బహిర్గతం కాకుండా గుర్తింపుపై మాస్క్ వేసి ప్రచురించాలని సుప్రీంకోర్టు నీట్ కమిటీకి స్పష్టం చేసింది. ఇక.. ఇలా ఫలితాలను విడుదల చేస్తే విద్యార్థుల వ్యక్తిగత వివరాలు బయటపడతాయని సొలిసిటర్ జనరల్ వాదించగా.. సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ పరీక్ష కేంద్రాల వారీగా డమ్మీ రోల్ నంబర్లతో ఎందుకు ప్రకటించకూడదని ప్రశ్నించారు. -
NEET(UG) రీ-టెస్ట్ ఫలితాలు విడుదల
ఢిల్లీ: నీట్ యూజీ రీ-టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు రివైజ్డ్ స్కోర్ కార్డులను కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.నీట్ ఆందోళన నడుమ.. ఆపై సుప్రీంకోర్టు జోక్యంతో 1,563 మందికి గ్రేస్ మార్కుల్ని రద్దు చేసిన ఎన్టీఏ వాళ్లకు మళ్లీ పరీక్ష నిర్వహించింది. అయితే.. జూన్ 23వ తేదీన పరీక్ష నిర్వహించగా.. 813 మంది అభ్యర్థులు మాత్రం తిరిగి పరీక్ష రాశారు. వివాదాల నేపథ్యంలో ఈసారి ఫలితాల్ని పక్కాగా విడుదల చేసింది ఎన్టీఏ. పరీక్ష అనంతరం ఆన్సర్ కీ, ఓఎంఆర్ ఆన్షర్ షీట్లను పబ్లిక్ నోటీస్ ద్వారా అందుబాటులో ఉంచిన ఎన్టీఏ.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల్ని స్వీకరించింది. ఆ అభ్యంతరాలను నిపుణులు పరిశీలించిన అనంతరం.. తుది కీని విడుదల చేసింది. ఇప్పుడు ఆ అభ్యర్థుల ఫలితాల్ని వెబ్సైట్లో ఉంచింది. -
NEET-UG 2024: ఎన్టీఏకు సుప్రీం కీలక ఆదేశాలు
సాక్షి,న్యూఢిల్లీ : నీట్ పేపర్ లీకేజీ అంశంలో గురువారం (ఏప్రిల్27) సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.నీట్ పీజీ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.ఈ తరుణంలో విద్యార్ధులు, పలు ఎడ్యుకేషన్ సంస్థలు(Xylem Learning) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఓఎంఆర్ షీట్లో మార్కుల లెక్కింపు అస్పష్టంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నాయి.అయితే విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు జస్టిస్ మనోజ్ మిశ్రా,ఎస్వీఎన్ భట్టీ బెంచ్ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం.. విద్యార్ధుల పిటిషన్‌పై ఎన్టీఏ వివరణ ఇవ్వాలని సూచించింది. ఆ పిటిషన్‌ను జులై 8న విచారణ చేపడతామని, ఆ లోగా వివరణ ఇవ్వాలని పునరుద్ఘాటించింది. -
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం(జూన్25) మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఉత్తీర్ణత శాతం 58.4 శాతం ఉండగా మొత్తం 1,37,903 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. ఎస్జీటీ రెగ్యులర్ పేపర్-1 కు 78,142 అభ్యర్థులు అర్హత సాధించగా ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ -1కు 790 మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ పేపర్ -2 కు 60,846 అభ్యర్థులు అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్- 2కు 1,125 మంది అర్హులయ్యారు. -
AP: ఒక్క క్లిక్‌తో ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు
ఒక్క క్లిక్‌తో జనరల్ ఫలితాలుఒక్క క్లిక్‌తో ఒకేషనల్ ఫలితాలు ఏపీ ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్టు ప్రకటించింది. ఏపీ వ్యాప్తంగా మే 24 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితియ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలునిర్వహించారు. ఈ పరీక్షలకు రెండో సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. -
TS TET Results 2024: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం తెలంగాణ టెట్ ఫలితాలను విడుదల చేశారు. ఒక్క క్లిక్‌తో ఫలితాలుటెట్-2024కు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1 పరీక్షకు 85,996 అభ్యర్థులు హాజరుకాగా.. 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1,50,491 అభ్యర్థులు హాజరుకాగా.. 51,443 అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో 67.13 శాతం మంది అర్హత సాధించారు. పేపర్-2లో 34.18 శాతం అర్హత సాధించారు. -
ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్
సాక్షి, విజయవాడ: ఏపీ ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.శ్యామలరావు ఫలితాలను విడుదల చేశారు. మే 16 నుంచి 23వరకు ఈఏపీసెట్ నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3.39లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి.. వీటి ఆధారంగా ర్యాంకుల్ని ఇచ్చారు.ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు రిజల్ట్ కోసం క్లిక్ చేయండి -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక..ఎలిమినేషన్ ప్రక్రియ
-
ఆధిక్యంలో సీఎం జగన్ సహా పలువురు వైఎస్సార్సీపీ అభ్యర్థులు
-
ఒడిశాలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ!
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార బిజూ జనతాదల్ (బీజేడీ) ఆధిక్యానికి చెక్ పడేలా కనిపిస్తోంది. బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతూ.. ప్రభుత్వ ఏర్పాటు దిశగా దూసుకెళ్తోంది.సుదీర్ఘ కాలంగా పవర్లో ఉన్న బీజేడీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్లు కనిపిస్తోంది. మొత్తం 147 సీట్లున్న ఒడిశా అసెంబ్లీలో తాజా ఫలితాల ప్రకారం బీజేపీ లీడ్‌లో కొనసాగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్‌కు చేరువైంది. మరోవైపు అధికార బీజేడీ మూడు పదుల సీట్లతో రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. -
మౌనం పాటిస్తున్న బాబు
-
జనం తీర్పు ఏం చెప్పనుంది?
జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. నాయకత్వం, గుర్తింపు, ఆర్థిక వ్యవస్థ గురించి భారతీయ ఓటర్లు ఏమి చెబుతున్నారనే అంశంపై దృష్టి పెట్టి ఈ ఫలితాలను చూడాల్సి ఉంటుంది. ప్రస్తుత బీజేపీ పాలన తన వంతు ఉత్తమంగా కృషి చేసిందా? భవిష్యత్తులో ఆదాయాలను మెరుగు పరచడానికి, ఉద్యోగాలు వస్తాయని విశ్వసించడానికి మోదీ ఆర్థిక సంక్షేమ నమూనా సరిపోతుందా? అధికార ప్రతి పక్షాలు రెండూ తమవైన వివరణలను జోడించి చేసిన 85 శాతం–15 శాతం ప్రచారాన్ని ఓటర్లు ఎలా తీసుకున్నారు? ద్రవ్యోల్బణం, మరింత ఉచిత రేషన్‌పై వాగ్దానం వంటివి మార్పు జరగాలనే ఆకాంక్షకు దారితీశాయా? ఇలాంటి ప్రశ్నలకు ఓ రెండ్రోజుల్లో సమాధానం లభిస్తుంది.జూన్ 4న వెల్లడి కానున్న సార్వత్రిక ఎన్నికల లెక్కల్లో బీజేపీ 303 స్థానాలకు పైగా గెలుచుకోవచ్చు. లేదా దాని స్థానాలు 272 నుంచి 303 మధ్య ఉండవచ్చు. లేదా మెజారిటీ మార్కు కంటే తక్కువగా ఉండవచ్చు. వీటి గురించి ఇప్పటికైతే ఎవ్వరికీ తెలియదు. అయితే నాయకత్వం, గుర్తింపు, ఆర్థిక వ్యవస్థ గురించి భారతీయ ఓటర్లు మనకు ఏమి చెబుతున్నారనే అంశంపై దృష్టి పెట్టి ఆ ఫలితాలను పరిశీలించండి.గత దశాబ్దం గురించిన స్పష్టమైన మొదటి పరికల్పనను ఇక్కడ చూద్దాం. నరేంద్ర మోదీ రాజకీయాలను పునర్నిర్వచించారు. ప్రతి ఎన్నికా స్థానిక, జాతీయ సమతూకంతో ఉంటుంది. అయితే సంక్షేమ పథకాల పంపిణీ, ఎడతెగని జాతీయ సందేశపు ప్రదర్శనతో మోదీ జాతీయతను, స్థానికతను అనుసంధానించారు. దీంతో 2014, 2019 ఎన్నికల్లో భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతాల్లో కూడా బీజేపీ అభ్యర్థులు ఎదుర్కొన్న ప్రతికూలతలను పూడ్చడానికి మోదీ ప్రజాదరణ సరిపోయింది. మరోవైపున ఓటర్లు కూడా తమ శాసనసభా కార్యకలాపానికి ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు అనే అంశానికన్నా, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు అనేదానికి ప్రాధాన్యతను ఇచ్చారు.2024 తీర్పు ఈ ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. బీజేపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాలలో, కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఇంకా ఎక్కువ మంది ఓటర్లను మోదీ ఆకర్షిస్తున్నారా, లేదా? బీజేపీ అభ్యర్థి స్వభావం లేదా కుల సమీకరణలు లేదా ఆర్థిక ఆందోళన నుండి ఉత్పన్నమయ్యే స్థానిక బలహీనతలను పూడ్చడానికి మోదీ ఇమేజ్ సరిపోతుందా? ఓటర్లు భారత ప్రభుత్వ అధికారంలో ఒక బలమైన నాయకుడిని కోరుకుంటున్నారా లేక బలమైన తనిఖీలతో 1989–2014 మధ్యకాలపు తరహా ఏర్పాటు తిరిగి రావాలని కోరుకుంటున్నారా?ఇక రెండో పరికల్పన హిందూ మత–రాజకీయ గుర్తింపునకు పెరుగుతున్న భావన గురించి. దీన్ని బీజేపీ స్పష్టమైన అవగాహనతోనే పెంచి పోషించింది. హిందూ మత గుర్తింపునకు సంబంధించిన రాజకీయ ప్రకటనకు ప్రభుత్వ మద్దతు ఉంది. కల్పిత మనోవేదనల సమాహారం ద్వారా ముస్లింలను ఇతరులుగా మార్చే భావన మరొకటి. వెనుకబడిన, దళిత ఉప సమూహాలకు సాంస్కృతిక, రాజకీయ ప్రాతినిధ్యాన్ని అందించడం ద్వారా సమ్మిళిత హిందూ గుర్తింపును నిర్మించడం కూడా దీని వెనుక ఉంది. అయోధ్యలో లేదా కశ్మీర్లో లేదా దేశ విభజన సమయంలో జరిగిన చారిత్రక అన్యాయాల ‘సవరణ’ ఉంది. హిందువులు ఐక్యంగా ఉంటే, వారు ముస్లిం ఓట్లను అసంగతం చేయగలరనీ, ముస్లిం ప్రాతినిధ్యాన్ని చాలావరకు తగ్గించగలరనీ చూపించడానికి ఒక ఎన్నికల నమూనా కూడా దీని వెనుక ఉంది.కులాలకు అతీతంగా హిందుత్వ సామాజిక గాఢత కనబడటం, ‘లౌకికవాదం’ ప్రతిధ్వనులు ఎక్కడా వినిపించకపోవడం, ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీలు) మద్దతు వంటివి తనకు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నీరుగారిపోయింది. బీజేపీ తరహా రాజకీయ మతపరమైన గుర్తింపును సవాలు చేసే కథనం తన దగ్గర లేకపోవడంతో కుల గణన, మరిన్ని రిజర్వేషన్లు, అన్ని రంగాలలో అన్ని కుల సమూహాలకు దామాషా ప్రాతినిధ్యాన్ని వాగ్దానం చేసింది. ఇది చారిత్రాత్మకం!జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్... దేశాన్ని కుల సమూహాలు, మతాలు, జాతుల మొత్తంగా కాకుండా హక్కులతో కూడిన, వ్యక్తిగత పౌరులతో కూడిన ఒక పెద్ద సమూహంగా భావించింది. మౌలికమైన అస్తిత్వ ఆధారిత విధానాల కంటే సామాజిక ప్రయోజనాలను సమతుల్యం చేసే క్రమానుగతమైన మార్పును విశ్వసించింది. ఈ రెండు అంశాలకు సంబంధించినంతవరకూ నెహ్రూ పార్టీని రాహుల్ గాంధీ భారత రాజకీయాలను సామ్యవాద స్రవంతి వైపు తిరిగి మళ్లించారు. పైగా కమ్యూనిస్ట్ స్రవంతి నుండి అరువు తెచ్చుకున్న బలమైన పెట్టుబడిదారీ వ్యతిరేక వైఖరిని దానికి జోడించారు.హిందూ గొడుగులోని సంకీర్ణ కూటమిని విచ్ఛిన్నం చేయడానికి, ప్రతిపక్షాలు ఎన్నికలను 85%–15% యుద్ధంగా మలిచాయి. ఇక్కడ బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న 15 శాతం అంటే ‘ఇతరులైన’ ఉన్నత కులాలు. దళితులు, ఓబీసీలు, గిరిజనుల రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ ఉద్దేశించినట్లు అది తప్పుగా పేర్కొంది. మరోవైపున తన సొంత హిందూ సామాజిక సంకీర్ణాన్ని కొనసాగించడానికి, బీజేపీ ఈ ఎన్నికలను 85% వర్సెస్ 15% యుద్ధంగా రూపొందించింది. ఇక్కడ 15 శాతం అంటే ‘ఇతరులైన’ ముస్లింలు ఇండియా కూటమికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఆరోపించింది. అట్టడుగు హిందువుల రిజర్వేషన్లను రద్దు చేసి, వాటిని ముస్లింలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ఉద్దేశించినట్లు బీజేపీ తప్పుగా ఆరోపించింది. అన్ని ప్రశ్నల పరంపరకు ఈ ఎన్నికల తీర్పు సమాధానం ఇస్తుంది. ఏకీకృత హిందూ రాజకీయ గుర్తింపునకు చెందిన ఆలోచన భౌగోళికంగా దక్షిణాదిలో కూడా విస్తరించి, సామాజికంగా దళితులు, గిరిజనులలో లోతుగా పాతుకుపోయిందా? రిజర్వేషన్ నిర్మాణాన్ని మరింత విస్తరించడానికి ఈ తీర్పు పార్టీలను ఎంతవరకు ఒత్తిడికి గురి చేస్తుంది?మూడవ పరికల్పన రాజకీయ ఆర్థిక వ్యవస్థ గురించి. మోదీ నమూనా మౌలిక సదుపాయాలలో తయారీపై, పెట్టుబడులు పెంచడంపై ఆధారపడినది. ప్రైవేట్ వ్యవస్థాపకతను ముందుకు తీసుకుపోవడానికి డిజిటల్ ప్రభుత్వ మౌలిక వసతులను ఉపయోగించడం; ఆర్థిక మార్కెట్లను విస్తరించడం; పరపతిని సరళీకరించడం; ఆర్థిక వ్యవస్థను లాంఛనప్రాయంగా మార్చడం; సేవలలో భారతదేశ బలాన్ని పెంచడం; నగదు, గృహాలు, నీరు, ఆహారం, విద్యుత్, వంటగ్యాస్ వంటి వాటిని అందుకునే కోట్లాది మంది ప్రజలతో కూడిన సంక్షేమ వలయాన్ని సృష్టించడం ఈ నమూనాలో భాగం. సంక్షేమం ఒక తరగతి లబ్ధిదారులను సృష్టించింది, గుర్తింపులు, ప్రాంతాల వ్యాప్తంగా మహిళా ఓటర్ల మద్దతును గెలవడానికి ఇవి మోదీకి సహాయపడ్డాయి. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడంపై ప్రజల్లో కోపం, బాధ పెరుగుతున్నాయని కూడా స్పష్టమైంది. గరిష్ఠంగా నగదు బదిలీలు, ప్రభుత్వ రంగ ఉపాధి, ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ ప్రణాళికతో సహా మరింత సంక్షేమానికి ప్రతిపక్షాలు వాగ్దానం చేశాయి. ప్రస్తుత పాలన తన వంతు ఉత్తమంగా కృషి చేసిందా? భవిష్యత్తులో ఆదాయాలను మెరుగుపరచడానికి, ఉద్యోగాలు వస్తాయని విశ్వసించడానికి మోదీ ఆర్థిక సంక్షేమ నమూనా సరిపోతుందా? ఓటర్లను, ముఖ్యంగా మహిళలను, యథాతథ స్థితికి కట్టుబడి ఉండటానికి లేదా బీజేపీ రాజకీయ ప్రయోజనాలు నెరవేరడానికి సంక్షేమం ప్రేరేపణ కలిగించిందా? రాజకీయ–క్యాపిటల్ నెట్‌వర్క్‌పై ప్రజలకు ఆగ్రహం ఉందా? మహమ్మారి అనంతరం వివిధ రూపాల్లో దేశం కోలుకోవడం జరిగిందా? ద్రవ్యోల్బణం, మరింత ఉచిత రేషన్‌పై వాగ్దానం వంటివి మార్పు జరగాలనే ఆకాంక్షకు దారితీశాయా?తమను ఎవరు నడిపించాలనుకుంటున్నారు, తమను ఎలా నిర్వచించాలనుకుంటున్నారు, తమ ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించి వారు ఎవరిని విశ్వసిస్తారు అనే కీలకాంశాలను రెండ్రోజుల్లో ఓటర్లు ప్రకటిస్తారు. ఇది 2024కి సంబంధించిన అసలైన కథ.- వ్యాసకర్త సీనియర్ పాత్రికేయుడు(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -ప్రశాంత్ ఝా -
ఎన్నికల ఫలితాలపై ఉష శ్రీ చరణ్ కీలక వ్యాఖ్యలు
-
ఏపీ ఎన్నికల తొలి ఫలితం ఆ నియోజకవర్గానిదే..
-
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్
ఏపీ ఈసెట్ ఫలితాలు కోసం రిజల్ట్ కోసం క్లిక్ చేయండి -
ఎన్నికల కమిషన్ పై న్యాయ పోరాటం