schools
-
ఆశ్చర్యానికి గురైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
-
అనుకున్నదే జరిగింది పేద పిల్లలపై కక్ష తీర్చుకున్న బాబు
-
సీఆర్పీఎఫ్ స్కూళ్లకు బాంబు బెదిరింపులు
ఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు సీఆర్పీఎఫ్ పాఠశాలలకు ఈ-మెయిల్ ద్వారా వచ్చినట్లు బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ పాఠశాల గోడపై పేలుడు సంభవించిన రెండు రోజుల తర్వాత.. ఒకేసారి దేశవ్యాప్తంగా పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. సోమవారం రాత్రి పాఠశాల అడ్మినిస్ట్రేషన్‌కు ఈ-మెయిల్స్‌ను దుండగులు పంపినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నైట్రేట్ ఆధారిత పేలుడు పదార్థాలను తరగతి గదుల్లో అమర్చినట్లు దుండగులు మెయిల్లో పేర్కొన్నారు. ఢిల్లీ తోపాటు హైదరాబాద్‌లోని అన్ని సీఆర్పీఎఫ్ పాఠశాలలకు ఇమెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపుల సందేశాలు రావటంతో అన్ని స్కూళ్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఫేక్ మెయిల్స్‌గా భద్రత అధికారులు భావిస్తున్నారు.ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులుమంగళవారం ఎక్కువగా అంతర్జాతీయ మార్గాల్లో నడిచే 10 ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఎయిర్‌లైన్ ధృవీకరించింది. దేశీయ సర్వీసులే కాకుండా జెడ్డా, ఇస్తాంబుల్, రియాధ్ లాంటి అంతర్జాతీయ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడారని అధికారులు తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు నిర్వహిస్తున్నామని విమానయాన సంస్థ తెలిపింది. గత వారం నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో నడుస్తున్న పలు భారతీయ విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. టార్గెట్ చేసిన ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా మరియు అకాసా ఎయిర్ ఉన్నాయి.చదవండి: ‘లారెన్స్ బిష్ణోయ్‌ను ఎన్కౌంటర్ చేస్తే రూ. కోటి రివార్డు’ -
‘పోలీసు స్కూల్’కు శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో మంత్రి శ్రీధర్‌బాబుతో కలసి ఈ ‘పోలీస్ స్కూల్’కు శంకుస్థాపన చేశారు. పోలీసు వ్యవస్థలో కొత్త అధ్యాయానికి దీనితో తెరతీసినట్టు సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక ‘‘యూనిఫాం సర్వీసులవారి కుటుంబ సభ్యుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగానే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు శంకుస్థాపన చేశాం.ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో గత ప్రభుత్వం పోలీసులను వారి పార్టీ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తే.. మా ప్రభుత్వం మాత్రం పోలీసు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తోంది..’’ అని ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశామని.. కులమతాలకు అతీతంగా యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం పదేళ్లలో పోలీసులకు ఏమీ చేయలేదని విమర్శించారు. కాగా.. పోలీసు కుటుంబ సభ్యులకు స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని.. ఇవి కేంద్రీయ విద్యాలయాలకు దీటుగా విద్యను అందిస్తాయని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పారు. కేంద్రీయ విద్యాలయాల్లో మాదిరిగా.. పోలీస్ స్కూళ్లలోనూ ఇతర విద్యార్థులకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు.యూనిఫాం సర్వీసుల సిబ్బంది అందరికీ..పోలీస్ శాఖలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితోపాటు ఇతర యూనిఫాం సర్వీసులైన అగ్నిమాపక, ఎక్సైజ్, ఎస్పీఎఫ్, జైళ్లశాఖ సిబ్బంది పిల్లలకు విద్య అందించేందుకు ‘యంగ్ ఇండియా పోలీస్ స్కూల్’ను ఏర్పాటు చేస్తూ.. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సౌదీ మారుతోంది..దేశవ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయులకు..!
అరబ్ దేశాల్లో మహిళలపై ఎలాంటి ఆంక్షలు ఉంటాయో తెలిసిందే. అక్కడ స్త్రీలు తండ్రిగ్గానీ, భర్తగ్గానీ, దగ్గరి మగవాళ్లగ్గానీ చెప్పకుండా, వారి అనుమతి తీసుకోకుండా ప్రయాణాలు చెయ్యకూడదు. పెళ్లి చేసుకోకూడదు. ఆఖరికి జీవితాన్ని ప్రభావితం చేసే ముఖ్య నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ‘స్థాయి తక్కువ’ మగాళ్లను మహిళలు దగ్గరికి చేరనివ్వకూడదు. అలాంటి సౌదీలో ఇటీల కొంతకొంత మార్పులు సంతరించుకుంటున్నాయి. మొన్నటకీ మొన్నఅందాల పోటీల్లో పాల్గొనే విషయంలో కూడా నియమాల్ని సడలించడమే గాక అంతర్జాతీయంగా జరిగే అందాల పోటీల్లో పాల్గొనేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా ఇప్పుడూ ఏకంగా దేశవ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాద్యాయులందరికి సంగీత విద్యలో శిక్షణ ఇస్తున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని సౌదీ సాంస్కృతిక మంత్రిత్వ శాఖలో ప్లానింగ్ డైరెక్టర్ నూర్ అల్-దబాగ్ రియాద్‌లో జరిగిన లెర్న్ కాన్ఫరెన్స్ సందర్భంగా వెల్లడించారు. ఎందుకంటే..ప్రాథమిక తరగతుల నుంచి పాఠ్యాంశాల్లో సంగీత విద్యను చేర్చాలనే యోచనలో ఉండటంతో ఇలా దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఉపాధ్యాయులందరికీ సంగీతంలో శిక్షణ ఇస్తున్నట్లు నూర్ పేర్కొంది. దాదాపు 9 వేల మంది మహిళా ఉపాధ్యాయులకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ద్వారా శిక్షణ ఇస్తున్నట్లు సదరు శాఖ ప్లానింగ్ డైరెక్టర్ నూర్ తెలిపారు. అలాగే కళలు, సంస్కృతిని కూడా విద్యా పాఠ్యాంశాల్లో విలీనం చేసే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అంతేగాదు విద్యార్థుల నాణ్యమైన విద్యను అందించి తద్వారా సౌదీని సుసంపన్న దేశంగా మలచాలన్న దిశవైపుకు అడుగులు వేస్తోంది. ఇది నిజంగా సౌదీ ప్రగతి శిలకు సూచనగా చెప్పొచ్చు. కాగా, 38 ఏళ్ల సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ ఇటీవలి కాలంలో సౌదీని సంస్కరణల బాటలో పయనింపజేస్తున్నారు. ఇప్పటి వరకు మహిళా డ్రైవర్లపై నిషేధం నుంచి అందాల పోటీల్లో పాల్గొనడం వరకు పలు మార్పులు తీసుకురావడం విశేషం.(చదవండి: కొరియన్ నోట భారతీయ సంగీతం.. 'ఔరా' అంటున్న నెటిజన్లు) -
ఆంగ్లం లేకుండా ఎదగ్గలమా?
ప్రపంచమంతా ఇంగ్లిష్ ప్రాధాన్యతను గుర్తిస్తోంది. యూరోపియన్ యూనియన్ ఇకనుంచీ జర్మన్‌కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి. కానీ భారతదేశం మాత్రం కాలాన్ని వెనక్కి తిప్పడానికి ప్రయత్నిస్తోంది. ఇంగ్లిష్ భాషను వలసవాదంతో ముడిపెట్టడం విధానపరమైన తప్పిదం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసేందుకు నడుం బిగించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మొదలైన ఆంధ్ర మోడల్ విద్యా ప్రయోగం దుష్ట రాజకీయ శక్తుల కుట్రవల్ల ఆగిపోకూడదు.యావత్ ప్రపంచం ఇంగ్లిష్‌ను పాఠశాల స్థాయి బోధనా భాషగా స్వీకరిస్తున్న సమ యంలో, భారతదేశం ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఇంగ్లిష్ విద్యకంటే వెనుకటి రోజులకు కాలాన్ని తిప్పుతోంది. ఇంగ్లిష్ భాషను వలస వాదంతో ముడిపెట్టడం ఒక ప్రధాన విధానపరమైన తప్పిదం. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇంగ్లిష్ ఒక వలస భాష అనే సిద్ధాంతాన్ని మరింత స్పష్టంగా తీసుకొస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత, భారతదేశంలోని ప్రభుత్వ పాఠశా లల్లో ఇంగ్లిష్ మాధ్యమ విద్యపై జరిగిన మొట్టమొదటి అతి పెద్ద ప్రయోగాన్ని వెనక్కి తిప్పేశాయి. ఇప్పటికే కొత్త ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తప్పనిసరి చేసిన సీబీఎస్ఈ సిలబస్‌ను ఉపసంహరించుకుంది. ‘అమ్మ ఒడి’ పేరుతో తల్లులకు సంవత్సరానికి ఇచ్చే 15,000 రూపాయల ఆర్థిక సహా యాన్ని నిశ్శబ్దంగా నిలిపివేశారు. సహజంగానే, కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన మూడు పార్టీలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. అవి ప్రైవేట్ రంగ ఇంగ్లిష్ మాధ్యమ విద్యకు గట్టిగా మద్దతు ఇచ్చాయి. ప్రభుత్వ రంగంలోని అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను నిర్వీర్యం చేసి మళ్లీ తెలుగు మీడియం వైపు మళ్లించేందుకు అన్ని విధాలా నడుం బిగిస్తా మన్న స్పష్టమైన సంకేతంతో, ప్రైవేట్ ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, కాలేజీల యజమాని నారాయణను మళ్లీ మంత్రిని చేశారు చంద్ర బాబు. ఈ దిశ స్పష్టంగా ఉంది.కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యను అనుమతించొద్దనే విషయంలో స్పష్టంగా ఉంది. ఎన్డీయేలోని ప్రధాన నేతలు నరేంద్ర మోదీ, అమిత్ షా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు అందరూ ఈ విషయమై ఒకే మాట మీద ఉన్నారు. నితీష్ కుమార్ అయితే తన సమావేశాల్లో పార్టీ నాయ కుడైనా, అధికారి అయినా ఇంగ్లిష్‌లో మాట్లాడినా ఇష్టపడరు.సుప్రీంకోర్టులోనూ, ప్రతి హైకోర్టులోనూ అన్ని వ్యవహారాలుఆంగ్లంలో ఉండాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 348(1)(ఎ) పేర్కొన్నప్పటికీ, ప్రాంతీయ భాషను ఉపయోగించాలంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులను కూడా ఒత్తిడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ రకమైన విద్యా విధానం పట్ల ఆంధ్రప్రదేశ్‌లో లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మౌనంగా ఉంది. రిజర్వేషన్లు ఉన్నా లేకపోయినా, భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న యువత ప్రైవేట్ ఇంగ్లిషు మీడియంలో చదువుకున్న యువతతో పోటీపడే అవకాశం లేదని ఇది చూపుతోంది. అందరూ మాట్లాడిన ‘ఆంధ్రా మోడల్’ సృష్టించిన ఆశ నిరాశగా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం విద్యా విస్తరణకు భారత కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపులు కూడా అడ్డంకిగా మారాయి.దేశంలో ఇంగ్లిష్ విద్య 1817లో ప్రారంభమైంది. ఇది భారతదేశంలో ఆ భాష ప్రవేశించిన 207వ సంవత్సరం. అక్టోబర్ 5న భారతీయ ఇంగ్లిష్ దినోత్సవం అనే విషయం తెలిసిందే.భారతదేశంలో ప్రతి సంవత్సరం ఒక్కో భాషా దినోత్సవ వేడుకలు జరుగు తాయి. కానీ ఇంగ్లిష్‌ను ప్రపంచ, భారతీయ అవకాశాల భాషగా నేర్చుకుని, దాని నుండి ప్రయోజనం పొందినవారు... అధికారం,సంపద, ప్రపంచ చలనశీలత భాషగా దాన్ని ఉపయోగి స్తున్నప్పటికీ ఒక భాషగా ఆంగ్ల దినోత్సవాన్ని జరుపుకోరు. పైగా బహిరంగ వేదికల నుండి దాన్ని వలస భాషగా ఖండిస్తూనే ఉంటారు.ఇంగ్లిషు భాష నుండి అత్యధికంగా ప్రయోజనం పొందిన వ్యక్తులు అగ్రవర్ణాలు, ముఖ్యంగా బ్రాహ్మణులు, బనియాలు, కాయ స్థులు, ఖత్రీలు. చారిత్రకంగా భారతీయ పాలక కులమైన క్షత్రియులు ఈ భాష శక్తిని ఇటీవలే గ్రహించారు. వారి పిల్లలను ఇంగ్లిష్ మాధ్య మంలో చదివిస్తున్నారు.ఆంగ్లం వల్లే ప్రపంచ స్థాయికమలా హ్యారిస్ భారతీయ సంతతికి చెందిన బ్రాహ్మణ మహిళ. 245 సంవత్సరాల రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యం ఉనికిలో ఉన్న అమెరికాకు మొదటి మహిళా అధ్యక్షురాలిగా అవతరించే అవకాశం ఉంది. ఆ దేశంలో ఇప్పటి వరకు ఏ శ్వేతజాతీయురాలూ అధ్యక్షురాలు లేదా ఉపాధ్యక్షురాలు కాలేదు. కమల ఇప్పటికే అమెరికా తొలి ఉపాద్యక్షురాలు అయ్యారు. వలసరాజ్యాల కాలంలో ఇంగ్లిష్ భారత దేశానికి రాకపోతే, ప్రపంచ భాషగా ఇంగ్లిష్ లేకుండా ఉంటే ఇది సాధ్యమయ్యేదా? తమిళ బ్రాహ్మణ సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి అయిన ఆమె తల్లి శ్యామలా గోపాలన్ ఇంగ్లిష్ చదవకుండా ఉండి ఉంటే అమెరికా వెళ్లి తన జీవితాన్ని తీర్చిదిద్దుకుని తన ఇద్దరు కూతుళ్లు కమల, మాయలను చదివించి ఉండేవారా? ఒక సాధారణ మధ్యతరగతి ఒంటరి తల్లి కుటుంబం నుండి వచ్చిన కమల ఇంగ్లిష్ భాష లేకుండా, తన స్థాయికి తగ్గ లాయర్‌గా ఎదిగి, ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన దేశానికి ఉపాధ్యక్షురాలిగా ఎదిగి, ఇప్పుడు అత్యంత సంపన్నుడైన శ్వేతజాతి అమెరికన్ డోనాల్డ్ ట్రంప్‌ను అధ్యక్ష రేసులో సవాలు చేసే అవకాశాన్ని పొందగలదని మనం ఊహించగలమా? పశ్చిమ భారతదేశానికి చెందిన ఖత్రీ కుటుంబానికి చెందిన రిషి సునాక్ తల్లిదండ్రులు ఇంగ్లిష్ భాషలో విద్య నేర్వకపోయి ఉంటే, రెండు వందల సంవత్సరాలకు పైగా భారతదేశాన్ని పాలించినబ్రిటన్కు ఆయన ప్రధాన మంత్రి కావడం మనం ఊహించగలమా? భారతదేశం స్వాతంత్య్రం సాధించే నాటికి అగ్రవర్ణాల ఇళ్లలోనిసాంస్కృతిక వాతావరణాన్ని ఇంగ్లిష్ మార్చింది. కానీ ఆ భాష పరిధిని, శక్తిని ఉపయోగించి అనేక విధాలుగా ప్రయోజనం పొందిన అదే వ్యక్తులకు ఇప్పుడు రైతులు, కార్మికుల పిల్లలు ఆ భాష నేర్చు కోవడం ఇష్టం లేదు. ఇది వైరుధ్యం కాదా?యూరప్ కూడా ఆంగ్లం దిశగా...యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం ఇకనుంచీ జర్మన్ కు బదులుగా ఇంగ్లిష్ అధికారిక భాషగా ఉంటుందని ప్రకటించింది. ప్రపంచంలోని చాలా దేశాలు తమ మాతృభాషతో పాటు తమ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పాఠశాల విద్యకు మారుతున్నాయి.ఫ్రా¯Œ ్స, జపాన్, చైనా, రెండు కొరియన్ దేశాలు ఒకే జాతీయ భాషతో వ్యవహరిస్తున్నప్పటికీ, మొదటి నుండీ తమ పాఠశాలల్లో ఆంగ్లాన్ని బోధించడం ప్రారంభించాయి. ప్రపంచీకరణ చెందిన ప్రపంచంలో భాషతో ముడిపడి ఉన్న జాతీయవాదం తగ్గుముఖం పట్టింది. రెండవ ప్రపంచ యుద్ధానంతర సందర్భంలో బ్రిటిషేతర దేశాలన్నీ తీవ్రమైన భాషాపరమైన మనోభావాలను కలిగి ఉండేవి. కానీ ప్రతి ఐరోపా దేశం కూడా ఇప్పుడు ఆర్థికాభివృద్ధికి ఇంగ్లిష్ తప్పనిసరి అని గ్రహించింది. మునుపటి ఫ్రెంచ్, స్పానిష్ కాలనీలు కూడా నెమ్మదిగా తమ పాఠశాలల్లో ఆంగ్ల బోధనకు మారుతున్నాయి.భావోద్రేక భరితమైన మాతృభాష సిద్ధాంతంతో భారతదేశం అనేక చిన్న భాషలు మాట్లాడే జాతులుగా విభజించబడింది. శూద్రులు, దళితులు, ఆదివాసీలు తమదైన చిన్న భాషా ప్రపంచంలో ఇరుక్కుపోయారు. ఈ రకమైన భాషాపరమైన నిర్బంధం వారిని సరైన పౌరసత్వ పాత్రలోకి ఎదగనివ్వదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించినటువంటి విద్యా ప్రయోగానికి దుష్ట రాజకీయ శక్తుల కుట్రతో చావుదెబ్బ తగలకూడదు.- ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్, వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త (నేడు ఇండియన్ ఇంగ్లిష్ డే)- -
రేపటి నుంచి దసరా సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరిగి పాఠశాలలు ఈ నెల 14న పునఃప్రాంరంభమవుతాయని పేర్కొన్నారు.వాస్తవానికి ఈ నెల 4వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రకటించినప్పటికీ ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు మార్పులు చేశారు. అయితే, బుధవారం గాంధీ జయంతి కావడంతో మరో రోజు సెలవు కలిసి వచ్చింది. అన్ని జూనియర్ కాలేజీలకు సైతం ఈ నెల 3 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా మరో ప్రకటనలో పేర్కొన్నారు. -
AP: 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు
సాక్షి, అమరావతి: అక్టోబర్ 3వ తేదీ నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు విద్యామంత్రి లోకేశ్ చెప్పారు. ఆయన శుక్రవారం పాఠశాల విద్యపై సమీక్షించారు. ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందు నుంచే సెలవులు ఇస్తున్నామని చెప్పారు. అక్టోబర్ 13 వరకు సెలవులు ఉంటాయని తెలిపారు.ఇదీ చదవండి: నిరుద్యోగులకు సర్కార్ షాక్ -
రాజ రాజ చోర
అది ఓ చిన్న పాఠశాల. విద్యార్థులు టీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోఓ వ్యక్తి తరగతి గది లోపలకు వచ్చాడు. అతడి చేతిలో కత్తెర, బ్లేడు, తాళాలు, స్క్రూడ్రైవర్ వంటి సరంజామా ఉంది.వెంటనే పాఠం మొదలుపెట్టాడు.అంటే ఏవో సైన్స్ ప్రాక్టికల్స్ చెబుతున్నాడేమో అనుకోకండి. అక్కడ జరిగే సంగతి తెలిస్తే నోరెళ్లబెడతారు.పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి? దొంగతనం చేసిన తర్వాత దొరక్కుండాఎలా తప్పించుకోవాలి? తాళాలను ఎలా ఓపెన్ చేయాలి వంటి అంశాల్లోఅక్కడ తర్ఫీదు ఇస్తారు.వినడానికి విడ్డూరంగా విన్నా కొన్నేళ్లుగా అక్కడ జరుగుతున్న తతంగం ఇది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖడియా, గుల్ ఖేడి, హుల్ ఖేడి అనే మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు ఉన్నాయి. 12 సంవత్సరాల నుంచి 17 ఏళ్ల లోపు వయసున్న వారికి దొంగతనాలు, దోపిడీలు ఎలా చేయాలో అందులో శిక్షణ ఇస్తారు. అవసరమైన సందర్భాల్లో హత్యలు ఎలా చేయాలో కూడా నేర్పిస్తారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలను లక్ష్యంగా చేసుకుని ఓ దొంగల ముఠా ఈ స్కూళ్లు నడుపుతోంది. ఏడాదిపాటు సకల చోర కళల్లో శిక్షణ ఇస్తారు. జనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో పిక్ పాకెటింగ్ ఎలా చేయాలి, బ్యాగు ఎలా లాక్కోవాలి? ఆపై ఎవరికీ చిక్కకుండా ఎలా పారిపోవాలి? బ్యాంకులను ఎలా దోచుకోవాలి? పోలీసులకు చిక్కితే వారి లాఠీ దెబ్బలను ఎలా తట్టుకోవాలి? వంటి అన్ని అంశాల్లోనూ సుశిక్షితులను చేస్తారు. ముఖ్యంగా పెద్దింటి పిల్లలు ఎలా వ్యవహరిస్తారో, వారు ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటారో కూడా వివరించి అన్ని విధాలా సన్నద్ధం చేస్తారు. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు దొంగతనాల్లో గ్రాడ్యుయేట్ల కిందే లెక్క. అంతేకాదు.. ఏడాదిపాటు ఇచ్చే శిక్షణ కోసం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు ఫీజుగా తీసుకుంటున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత వారిని గ్యాంగులో సభ్యులుగా చేర్చుకుంటారు. అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాక్టికల్స్‌కు పంపిస్తారు. అలా వారు కొట్టుకొచి్చన సొమ్ము ఈ దొంగల ముఠాయే తీసుకుని, వారి తల్లిదండ్రులకు ఏడాదికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు మాత్రమే ఇస్తుంది. దీంతో ఇదేదో బాగుందని భావిస్తున్న ఆ చుట్టుపక్కల ఊళ్ల జనం నానా తిప్పలూ పడి ఫీజులు చెల్లించి తమ పిల్లలను దొంగల స్కూళ్లలో చేర్పిస్తున్నారు.ఇలా బయటపడింది.. ఈ దొంగల శిక్షణ వ్యవహారం చాలాకాలంగా సాగుతున్నప్పటికీ,ఇటీవల ముంబైలో జరిగిన ఓ దొంగతనంతో వెలుగులోకి వచి్చంది. ఓ బడా పారిశ్రామికవేత్త కుటుంబ వివాహ వేడుక ముంబైలోని ఓ ఖరీదైన హోటల్లో ఘనంగా జరిగింది. ఆ హోటల్లోకి ఈ ముఠాకు చెందిన కుర్రాడు పెద్దింటి బిడ్డగా చొరబడి రూ.కోటిన్నర విలువైన నగలతో మాయమయ్యాడు. నగలు కనిపించకపోవడంతో సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనం విషయం బయటపడింది. ఆ కుర్రాడు ఎవరా అని ఆరా తీసిన పోలీసులు చివరకు మధ్యప్రదేశ్‌లోని ఈ మూలాలుగుర్తించి అవాక్కయ్యారు. పోలీసులు ఏం చేయలేరా? నిజానికి ఆ మూడు గ్రామాల్లో దొంగల స్కూళ్లు నడుస్తున్నాయనే సంగతి స్థానిక పోలీసులకు తెలిసినా వారు ఏమీ చేయలేని పరిస్థితి. ఆ ఊళ్లోకి పోలీసులు వెళ్తే చాలు.. ఊరి జనమంతా ఏకమై అడ్డుకుంటారు. ఎవరైనా అపరిచితులు అక్కడకు వెళ్లినా వదిలిపెట్టరు. దీంతో ఒక్క దొంగను అరెస్టు చేయడానికి వెళ్లాలంటే పోలీసులు పెద్ద ఎత్తున మందీమార్బలంలో వెళ్లాల్సిందే. పైగా దొంగల స్కూల్‌ను మూయించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అది మామూలు పాఠశాలలాగే ఉంటుంది. మేం విద్యార్థులకు ట్యూషన్ చెబుతున్నాం.. అది కూడా తప్పా అని ప్రశ్నిస్తారు. దీంతో పోలీసులు తిరుగుముఖం పట్టడం తప్ప చేసేదేమీ ఉండదు. దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో ఈ ముఠాకు చెందిన 2వేల మందికి పైగా వ్యక్తులపై దాదాపు 8వేల కేసులు నమోదయ్యాయి. - సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆ రెండు స్కూళ్లలో వాళ్లని కాల్చి చంపేస్తా!
ఫ్లోరిడా: రెండు స్కూళ్లలో కాల్పులు జరిపి, చంపాల్సిన ‘కిల్ లిస్ట్‌ను తయారు చేసుకున్నాడు. అందుకు రకరకాల రైఫిళ్లు, పిస్టళ్లతోపాటు, కత్తులను సైతం సిద్ధం చేసుకున్నాడు. కిల్ లిస్ట్‌తోపాటు ఆయుధ సామగ్రి ఫొటోలను ఆన్లైన్లో తన క్లాస్మేట్లకు గొప్పగా చూపించుకున్నాడు. అమెరికాలో ఫ్లోరిడాకు చెందిన 11 ఏళ్ల బాలుడి ఘన కార్యమిది. .! అసలే స్కూళ్లలో కాల్పుల ఘటనలతో జనం గగ్గోలు పెడుతున్న సమయం. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. దీంతో, వారు ‘కార్లో కింగ్స్టన్’ డొరెల్లి’ కాళ్లు, చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్లారు. అతడు పోగేసిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ‘క్రీక్ సైడ్ మిడిల్ స్కూల్లో చదువుకుంటున్న కార్లో అనే బాలుడు క్రీక్ సైడ్, సిల్వర్ శాండ్ మిడిల్ స్కూళ్లలో వాళ్లను కాల్చి చంపేందుకు పథకం వేశాడు. పేర్లు, లక్ష్యాలతో జాబితాను సైతం సిద్ధం చేసుకున్నాడు. వీటిని ఆన్లైన్లో పెట్టాడు. ఇదేమని అడిగితే ఒట్టి జోక్ మాత్రమే అంటున్నాడు’ అని ఒలూసియా కౌంటీ షరీఫ్ మైక్ చిట్వూడ్ తెలిపారు. అధికారులు బాలుడికి సంకెళ్లు వేసి జైలుకు తీసుకెళ్తున్న వీడియోను ఆయన ‘థ్రెడ్’లో షేర్ చేశారు. అతడిపై శిక్షార్హమైన నేరం కింద కేసు నమోదు చేశామన్నారు. ‘ఉత్తుత్తిగా లేదా నిజంగానే బెదిరింపులకు గురిచేసే పిల్లల ఫొటోలతో వివరాలను బహిర్గతం చేస్తాం. మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి’అని తల్లిదండ్రులను హెచ్చరించారు. -
స్కూళ్ల మరుగుదొడ్ల ఫొటోలు అప్లోడ్ చేయాల్సిందే
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్, వార్డు ఎడ్యుకేషనల్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలు ప్రతి వారం వారి పరిధిలోని స్కూళ్లలో మరుగుదొడ్లను పరిశీలించి, ఆ ఫొటోలను యాప్‌లో అప్లోడ్ చేయకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం మరోసారి హెచ్చరించింది. ప్రతి సోమవారం, గురువారం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలను సందర్శించి అక్కడి మరుగుదొడ్లు, యూరినల్స్ గదుల్లో శుభ్రతకు సంబంధించిన ఫొటోలు తీసి యాప్‌లో అప్లోడ్ చేసే బాధ్యతను సచివాలయాల ఉద్యోగులకు అప్పగిస్తూ ప్రభుత్వం గత 16న ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధులకు చాలాచోట్ల ఆ ఉద్యోగులు హాజరు కావడం లేదన్న సమాచారంతో గ్రామ/వార్డు సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు మంగళవారం కూడా ఈ మేరకు అన్ని గ్రామ/వార్డు సచివాలయాల్లోని సెక్రటరీలకు వ్యక్తిగతంగా మెసేజ్ రూపంలో ఈ సమాచారం మరోసారి పంపారు. -
గిరిజన పిల్లలకు నాణ్యమైన విద్య
కన్నాయిగూడెం: దట్టమైన అడవుల్లో జీవిస్తూ విద్య కు దూరంగా ఉంటున్న గిరిజన పిల్లలకు నాణ్య మైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామ పంచాయతీ పరిధి బంగారుపల్లి గ్రామంలో రూ.13.50 లక్షలతో నిర్మించిన కంటైనర్ ప్రభుత్వ పాఠశాల భవనాన్ని మంగళవారం మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ దివాకరతో కలిసి మంత్రి ప్రారంభించారు.అనంతరం సీతక్క మాట్లాడుతూ, అటవీ గ్రామాల్లో పాఠశాలలకు శాశ్వత భవనాలు ఏర్పాటు చేయడానికి కేంద్ర అటవీశాఖ అభ్యంతరాలతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కన్నాయిగూడెం మండలంలో కంటైనర్ భవనం నిర్మించినట్లు తెలిపారు. గత పదేళ్లకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను నాశనం చేసిందని ఆమె ఆరోపించారు. -
పేద పిల్లలకు ఆ అర్హత లేదా ? CBSE రద్దుపై వైఎస్ జగన్ ఆవేదన
-
చదువులూ వరద పాలు!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి, మహబూబాబాద్: భారీ వర్షాలు మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో విద్యార్థుల చదువునూ వరదపాలు చేశాయి. మానుకోటలో 188 పాఠశాలలు, ఖమ్మం జిల్లాలో 72 పాఠశాలలు దెబ్బతిన్నాయి. శ్లాబ్‌లు కూలిపోవడం, పగుళ్లు రావడం, లీకేజీలు, కాంపౌండ్ వాల్ దెబ్బతినడం, కిచెన్ షెడ్ కూలిపోవడం, ఫర్నిచర్ దెబ్బతినడం, పుస్తకాలు, కంప్యూటర్లు, రికార్డులు, సర్టిఫికెట్లు తడిసిపాడైపోవడం వంటివి సమస్యగా మారాయి. అటు ముంపు ప్రాంతాల్లోని ఇళ్లలోనూ విద్యార్థుల బ్యాగులు, పుస్తకాలు తడిసి పాడైపోయాయి. దీనితో వేలాది మంది విద్యార్థుల చదువుపై ప్రభావం పడే పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి బడులు తెరుచుకోనున్న నేపథ్యంలో చదువులు ఎలా సాగుతాయి, మళ్లీ పుస్తకాలు కొనడం ఎలాగని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం రూరల్ మండలం జలగంనగర్‌లోని మండల పరిషత్ ఉన్నత పాఠశాల ఇది. రెండు అంతస్తుల ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ తరగతి గదుల్లో బురద మేటలు వేశాయి. తొమ్మిదో, పదో తరగతి పుస్తకాలు తడిసి పాడైపోయాయి. పాఠశాలను చూసేందుకు వచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థులు రాంచరణ్, వరుణ్‌తేజ్, ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఇక్కడి పరిస్థితి చూసి ఆవేదన చెందారు.బడికి వెళ్లాలంటే.. సర్కస్ ఫీట్లే..మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరు– ఉగ్గంపల్లి మార్గంలో బ్రిడ్జి పక్కన రోడ్డు తెగిపోయింది. దీంతో విద్యార్థులు బడికి వెళ్లేందుకు సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తోంది. తల్లిదండ్రులు బ్రిడ్జి పైనుంచి నిచ్చెన సాయంతో పిల్లలను కిందికి దింపి, రోడ్డుపైకి తీసుకెళ్లి పంపిస్తున్నారు. సాయంత్రం మళ్లీ అదే తరహాలో తిరిగి తీసుకెళుతున్నారు.భయం భయంగా వెళ్లాల్సి వస్తోందిమంగళవారం నుంచి రెండు రోజులు బడికి వెళ్లలేదు. మూడోరోజు మా నాన్న బ్రిడ్జి వద్దకు వచ్చి నిచ్చెన మీది నుంచి కిందికి దింపి రోడ్డు వరకు తీసుకొచ్చి బడికి పంపించాడు. సాయంత్రం మళ్లీ వచ్చి తీసుకెళ్లాడు. బ్రిడ్జి పైనుంచి నిచ్చెనతో దిగాలన్నా.. ఎక్కాలన్నా భయం వేస్తోంది. – ఏనుగంటి శ్రీజ, ఏడో తరగతి, ఉగ్గంపల్లి -
ఫ్రాన్స్ స్కూళ్లలో ఫోన్లు స్విచ్ఛాఫ్
పారిస్: సెల్‌ఫోన్.. ప్రపంచమంతటా కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు సైతం వ్యసనంగా మారిన సమాచార సాధనం. ఫోన్ చేతిలో లేకుండా ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి. హెల్‌ఫోన్ మారిన సెల్‌ఫోన్ పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను దెబ్బతీస్తున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అంతేకాదు ఆధునిక యుగంలో ఎన్నో నేరాలకు ఫోన్లు కారణమవుతున్నాయి. ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నడుం కట్టింది. వచ్చే ఏడాది నుంచి పిల్లలు పాఠశాలలో ఉన్నప్పుడు ఫోన్లు వాడకుండా పూర్తి నిషేధం విధించబోతోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా 50 వేల మందికిపైగా విద్యార్థులకు ఫోన్లు నిషేధిస్తూ ఉత్తర్వు తీసుకొచి్చంది. ఇది ఇప్పటికే అమల్లోకి వచి్చంది. ఫ్రెంచ్ మిడిల్ స్కూళ్లలో చదువుతున్న 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతసేపు ఫోన్లు పూర్తిగా స్విచ్ఛాఫ్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ‘డిజిటల్ విరామం’ అని నామకరణం చేసింది. ఫోన్ల తెరల ముందు విద్యార్థులు సాధ్యమైనంత తక్కువ సమయం గడిపేలా చేస్తే వారిలో కొత్త విషయాలు నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని నర్సరీలు, ఎలిమెంటరీ స్కూళ్లలో మొబైల్ ఫోన్లతోపాటు ఇతర ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ పరికరాల వినియోగంపై 2018 నుంచే నిషేధం అమల్లో ఉంది. ఉన్నత పాఠశాలల్లో చదువుకొనే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలు తరగతి గదిలో ఫోన్ వాడకుండా నిషేధించారు. అయితే, వారు ఫోన్లు తప్పనిసరిగా స్విచ్ఛాఫ్ చేయాలన్న నిబంధన లేదు. -
1864 స్కూళ్లను మూసేస్తారా?
సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యను నిర్లక్ష్యం చేస్తూ పేద, మధ్య తరగతి విద్యార్థులను కాంగ్రెస్ ప్రభుత్వం చదువుకు దూరం చేస్తోందని భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు లేరనే సాకుతో ఈ ఏడాది 1,864 పాఠశాలలను మూసివేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించకుండా మూసివేయాలని చూడటం సిగ్గుచేటు అని విమర్శించారు. విదేశీ పర్యటనలో ఉన్న కేటీఆర్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే 2024– 25 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సుమారు 2.4 లక్షలు తగ్గడం ప్రమాదకర సంకేతమని పేర్కొన్నారు. ఎనిమిది నెలల్లోనే ప్రభుత్వ విద్యను కాంగ్రెస్ సర్కార్ అస్తవ్యస్తం చేసిందని, విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిందో సమీక్ష చేయకుండా ప్రభుత్వం నిద్రావస్థలో ఉందని నిందించారు. సీఎం రేవంత్‌రెడ్డికి విద్యా వ్యవస్థపై ఏమాత్రం పట్టింపు లేకపోవడం దారుణమని కేటీఆర్ విమర్శించారు . 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలిరాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 25 వేల ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడం, స్కూళ్లల్లో మౌలిక వసతుల లేమి, నాణ్యమైన ఆహారం ఇవ్వకపోవడం, పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాల్లో అపరిశుభ్రత, భద్రత లేకపోవడం.. వెరసి ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గడం, ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపై సూచనల కోసం విద్యావేత్తలు, మంత్రులతో కమిటీ వేయాలని సూచించారు. విద్యారంగ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టకపోతే బీఆర్ఎస్ ఉద్యమిస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. -
TG: స్కూళ్లకు సెలవులు..! సీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో వర్షాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) శాంతికుమారి శనివారం(ఆగస్టు31) సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. వర్షాలు ఎక్కువగా కురిసే జిల్లాల అధికారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్కూళ్లకు సెలవులు ఇచ్చే విషయంలో ఆయా జిల్లాల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలని కోరారు. డ్యాములు, చెరువులు, కుంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద వరద తీవ్రతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు. జిల్లాల్లో వర్షం పరిస్థితిని ఎప్పటికప్పుడు సచివాలయానికి అప్డేట్ చేయాలని ఆదేశించారు. -
జగన్ చేసింది నిజం – లోకేశ్ చూసిందే సాక్ష్యం
-
లోకేష్ వస్తే పిల్లలు టైంకు తినొద్దా!
-
కోల్‌కతా ఉదంతం: ప్రభుత్వ అనుబంధ స్కూల్స్‌కు నోటీసులు
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశ వ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనను దేశం నలుమూలల నుంచి ప్రజలు, మెడికల్ కాలేజీ విద్యార్థులు, డాక్టర్లు తీవ్రంగా ఖండించి పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఘటన జరిగిన పశ్చిమ బెంగాల్లో మరింత అధికంగా చిన్నాపెద్ద తేడా లేకుండా నిరసనల్లో పాల్గొని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా బెంగాల్ ప్రభుత్వం పలు ప్రభుత్వ అనుబంధ స్కూల్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా పలు స్కూల్స్ టీచర్లు, విద్యార్థులతో నిరసనలు చేపట్టాయని పేర్కొంది. పాఠశాలలో విద్యార్థులకు క్లాసులు జరగాల్సిన సమయంలో ఇలా నిరసనల్లో వారిని పాల్గొనేలా చేయటంపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.హౌరా, బంకురా, తూర్పు మిడ్నాపూర్, పశ్చిమ మిడ్నాపూర్‌లోని పలు ప్రభుత్వ అనుబంధ స్కూల్స్‌కు నోటీసులు ఇచ్చింది. అందులో హౌరాలోని బలుహతి ఉన్నత పాఠశాల, బలుహతి బాలికల ఉన్నత పాఠశాల, బంట్ర రాజలక్ష్మి బాలికల పాఠశాలు ఉన్నాయి. ‘‘ 23.08.2024న స్కూల్స్‌లో క్లాసులు జరగాల్సిన సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో.. నిరసన ర్యాలీ నిర్వహించినట్లు మా దృష్టికి వచ్చింది. ఇలాంటి చర్యలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తాయి. ఇలా చేయటం సరికాదు.. బాలల హక్కుల ఉల్లంఘన’’ అని నోటీసుల్లో తెలిపింది.ఇదిలా ఉండగా.. ఈ కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే పలువురు నిందితులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేసిన సీబీఐ.. ఇవాళ ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు పాలిగ్రాఫ్ టెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. -
Rajasthan: బంద్‌తో విద్యాసంస్థల మూసివేత.. ఇంటర్నెట్ నిలిపివేత
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ రిజర్వేషన్ బచావో సంఘర్ష్ సమితి ఈరోజు (బుధవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ ప్రభావం రాజస్థాన్‌లోని విద్యాసంస్థలపై కనిపించింది.బంద్ పిలుపు నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. చిత్తోర్‌గఢ్ జిల్లా కలెక్టర్ అలోక్ రంజన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా భరత్‌పూర్‌లో భారత్ బంద్ దృష్ట్యా ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు.భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పోలీసు బలగాలను మోహరించారు. చిత్తోర్‌గఢ్‌లో షెడ్యూల్డ్ కులాలు- తెగల మహార్యాలీ నిర్వహిస్తున్నారు.ఈ ర్యాలీ సందర్భంగా వీరు జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిస్తారు. రాజస్థాన్‌లోని వివిధ విశ్వవిద్యాలయాలలో బుధవారం జరగాల్సిన పలు పరీక్షలను వాయిదా వేశారు. -
బద్లాపూర్ భగభగ!
థానె/ముంబై: మహారాష్ట్రలోని థానె జిల్లా బద్లాపూర్‌లో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులను లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. స్థానిక కిండర్‌గార్టెన్ స్కూల్లో రెండేళ్లు, నాలుగేళ్ల చిన్నారులపై అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. ఘటనపై పోలీసులు సకాలంలో స్పందించలేదంటూ మంగళవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు వందలాదిగా స్థానిక రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపై బైఠాయించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, ఆ మార్గంలో 8 గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.బద్లాపూర్ పోలీస్ స్టేషన్ అధికారులు బాధితుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు 11 గంటలపాటు జాప్యం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వేధింపుల ఘటన చోటుచేసుకున్న స్కూల్ ప్రిన్సిపాల్‌తోపాటు ఇద్దరు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. బాధిత చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ఈ నెల 17న అటెండర్‌ను అరెస్ట్ చేశారు. ఘటనకు బాధ్యులుగా చేస్తూ సోమవారం రాత్రి పాఠశాల యాజమాన్యం çస్కూల్ ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, మహిళా అటెండర్‌ను సస్పెండ్ చేసింది.వేధింపుల ఘటనపై పాఠశాల యాజమాన్యం క్షమాపణ చెప్పింది. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదుపై స్పందించలేదంటూ స్థానిక పోలీస్‌స్టేషన్ ఇన్చార్జిని ప్రభుత్వం బదిలీ చేసింది. సీనియర్ ఇన్స్పెక్టర్తోపాటు అసిస్టెంట్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. దర్యాప్తునకు ఐజీ స్థాయి అధికారి సారథ్యంలో సిట్‌ను ఏర్పాటు చేశామన్నారు. కేసుపై సత్వర విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆ ఆరోపణలు అవాస్తవం కేసు నమోదు చేసేందుకు పోలీసులు 12 గంటలపాటు ఆలస్యం చేశారంటూ వచి్చన ఆరోపణలను డీసీపీ సుధాకర్ పఠారే చెప్పారు. కేసు నమోదు ప్రక్రియ రాత్రి 11.30 గంటలకు మొదలుకాగా, నిందితుడిని మూడున్నర గంటల్లోపే 3.30 గంటలకు అరెస్ట్ చేశామన్నారు. అభంశుభం తెలియని బాధిత చిన్నారుల నుంచి సమాచారం రాబట్టడం క్లిష్టమైన, సున్నితమైన వ్యవహారమని, ఈ ప్రక్రియ వల్లే కేసు నమోదు ఆలస్యమైందని వివరించారు. ఒక మహిళా అధికారి సహా మొత్తం ముగ్గురు అధికారులు దర్యాప్తు ప్రక్రియలో పాలుపంచుకుంటున్నారన్నారు. మంత్రి చెప్పినా ససేమిరా.. వేధింపుల ఘటనకు నిరసనగా కొన్ని సంస్థలు మంగళవారం బద్లాపూర్ బంద్‌నకు పిలుపునిచ్చాయి. ఉదయం భారీ సంఖ్యలో కిండర్‌గార్టెన్ విద్యార్థుల తల్లిదండ్రులు, ముఖ్యంగా మహిళలు తరలివచ్చి పాఠశాల గేట్లు విరగ్గొట్టారు. ఫర్నిచర్, తలుపులు, కిటికీలు ధ్వంసం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్థానిక రైల్వే స్టేషన్‌పైకి రాళ్లు రువ్వారు. బ్యానర్లు, ప్లకార్డులు చేతబూని పట్టాలపై బైఠాయించారు. రాష్ట్ర మంత్రి గిరీశ్ మహాజన్ అక్కడికి చేరుకుని నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. బాధిత బాలికలకు న్యాయం చేయాలని, దోషులకు ఉరివేయాలని పట్టుబట్టారు.చివరికి సాయంత్రం పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీచార్జితో ఆందోళనకారులను చెదరగొట్టారు. రాత్రి 6 గంటల సమయానికి రైళ్ల రాకపోకలకు లైన్ క్లియర్ చేశారు. ఉదయం 8.30 గంటల నుంచి పట్టాలపైనే తిష్ట వేయడంతో సబర్బన్ సహా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బద్లాపూర్‌లో రైల్ రోకో కారణంగా అంబర్నాథ్–కజ్రట్ మార్గంలో 30 వరకు సబర్బన్ రైళ్లను రైల్వే శాఖ పాక్షికంగా రద్దు చేసింది. మరో 12దూరప్రాంత రైళ్లను దారి మళ్లించింది. మార్గమధ్యంలో చిక్కుకుపోయిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు 55 బస్సులను ఏర్పాటు చేసింది. -
పథకాలకు డబ్బులు లేవు సరే... మరి అన్న క్యాంటీన్లకు ఎక్కడివి..?
-
‘జన్మభూమి 2’లో స్కూళ్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: త్వరలో ప్రారంభించే ‘జన్మభూమి 2’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ముందుకొచ్చే వారిని ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులకు చెప్పారు. విద్యా రంగ నిపుణులు, మేధావులతో చర్చించి విద్యా శాఖలో, సిలబస్‌లో మార్పులు చేయాలని ఆదేశించారు. విద్యా శాఖపై మంగళవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్కూళ్లలో తెలుగుకూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థికీ కేంద్ర ప్రభుత్వ ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) ఐడీ ఇవ్వాలన్నారు.పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్‌లు నిర్వహించాలని, వీటిలో తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలంతా హాజరవుతారని అన్నారు. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని, స్పోర్ట్స్ రిపోర్ట్స్ కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య వివరాలను హెల్త్ ప్రోగ్రెస్ కార్డులో నమోదు చేయాలన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రతిభ అవార్డులు అందజేయాలని చెప్పారు. జీవో నం.117పై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్కూళ్లలో ఆయాల పెండింగ్ జీతాలు చెల్లించాలని చెప్పారు. మధ్యాహ్న భోజనంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్ల నుంచి ఐవీఆర్ఎస్ విధానంలో అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. డైట్ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేయాలని చెప్పారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ విద్యా శాఖలో నూతన విధానాలు, సంస్కరణలను వివరించారు. నైపుణ్య గణనపై అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాల్లో 3.54 కోట్ల మంది పనిచేసే వయసున్న వారి నైపుణ్యాన్ని గణన చేయాల్సి ఉందని చెప్పారు. ఇందుకోసం 40 వేల మంది ఎన్యూమరేటర్లు అవసరమని, 8 నెలలు పడుతుందని వివరించారు. పారిశ్రామిక రంగ ప్రతినిధులతో కూడా సంప్రదించి నైపుణ్య గణన చేపట్టాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో ఆహార శుద్ధి, ఆక్వా ఇండ్రస్టియల్ పార్కులు రాష్ట్రంలో ఓడరేవులు, పారిశ్రామిక పార్కుల అభివృద్ధిపైనా సీఎం సమీక్షించారు. ఆహారశుద్ధి, ఆక్వా, ఉద్యాన రంగాలతో పాటు ఖనిజ ఆధారిత పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వెనుకబడిన ప్రాంతాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కును వెంటనే పునరుద్ధరించాలన్నారు. పీపీపీ విధానంలో ఇంటిగ్రేటెడ్ ఓడరేవులు అభివృద్ధి చేయాలని అన్నారు. రాష్ట్ర, రా్రõÙ్టతర ప్రాంత హింటర్ ల్యాండ్ అనుసంధానంతో కూడిన ఓడరేవుల నిర్మాణం ద్వారా ఎగుమతి ఖర్చులు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పారు. కరోనాకంటే గత ప్రభుత్వమే టూరిజాన్ని దెబ్బతీసింది ఏపీలో ఎకో, టెంపుల్, బీచ్ టూరిజం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని పర్యాటక శాఖపై జరిగిన సమీక్షలో సీఎం చంద్రబాబు చెప్పారు. టూరిజం అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికతో రావాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా రాష్ట్రంలో కొత్త టూరిజం పాలసీ తీసుకురావాలన్నారు. కరోనాకంటే గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో పర్యాటకం ఎక్కువగా దెబ్బతిందని అన్నారు. టీడీపీ గత ప్రభుత్వం ఐదేళ్లలో పర్యాటక రంగంపై రూ.880 కోట్లు ఖర్చు చేయగా.. గత ప్రభుత్వం రూ.213 కోట్లే ఖర్చు చేసిందన్నారు. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 20.6 శాతం నుంచి 2019–24 మధ్య 3.3 శాతానికి పడిపోయిందన్నారు. రుషికొండపై గత ప్రభుత్వం సీఎం నివాసం కోసం రూ.500 కోట్లతో నిరి్మంచిన ప్యాలెస్‌ను ఏం చేయాలన్న విషయంపై వివిధ వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. -
మేం చెప్పిన వారే చైర్మన్
సాక్షి అమరావతి/ సాక్షి, నెట్వర్క్: పాఠశాలలు, విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్య కమిటీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ–ఎస్ఎంసీ) ఎన్నికలు పూర్తి ఏకపక్షంగా జరిగేలా అధికార టీడీపీ నేతలు యథేచ్ఛగా దౌర్జన్యకాండ సాగించారు. తాము చెప్పిన వారినే చైర్మన్ చేయాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయం సాధించినప్పటికీ, ఆ మేరకు అధికారికంగా ప్రకటించకుండా అడ్డుపడ్డారు. పోలీసుల కనుసన్నల్లోనే ఎన్నికలు జరిగినప్పటికీ టీడీపీ నేతల రౌడీయిజాన్ని వారు ఏమాత్రం అడ్డుకోలేకపోయారు. 24 జిల్లాల పరిధిలోని 40,781 పాఠశాలలకు గాను 40,150 (98.45%) పాఠశాలల్లో గురువారం టీడీపీ మూకల దౌర్జన్యం మధ్య ఎన్నికలు పూర్తయ్యాయి. 631 పాఠశాలల్లో వివిధ కారణాలతో వాయిదా పడ్డాయి. ఎన్నికలు నిర్వహించని పాఠశాలలకు రీ షెడ్యూల్ ప్రకటించినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు తెలిపారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో ఈ నెల 17న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.అడుగడుగునాదౌర్జన్యం» వైఎస్సార్ జిల్లా అట్లూరు మండలం కమలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సభ్యులందరూ చిట్టిబోయిన కవితను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఇంతలో అదే గ్రామానికి చేందిన టీడీపీ నేత వడ్డమాను సుధర్శన్‌రావు, మరి కొంత మంది పాఠశాలకు వచ్చారు. మోపూరి పార్వతి అనే మహిళను చైర్మన్‌గా చేస్తున్నట్లు ప్రకటించారు. బ్రహ్మంగారి మఠం మండలంలో పలు పాఠశాలల్లో తల్లిదండ్రులతో సంబంధం లేకుండా టీడీపీ నేతలే చైర్మన్లను నియమించారు. » శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం మండలం మలుగూరు ప్రాథమిక పాఠశాలలో వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు లావణ్య పూర్తి మెజార్టీతో గెలిచారు. అయినా ఆమె గెలుపును అధికారికంగా ప్రకటించకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. రెండవసారి ఎన్నిక జరపాలని పట్టుబట్టారు. దీంతో 30 మంది సభ్యుల్లో 22 మంది లావణ్యకు మద్దతు తెలిపారు. అయినా టీడీపీ నాయకులు హెచ్ఎంతో గొడవ పెట్టుకున్నారు. సమాచారం అందుకుని అక్కడకు వచ్చిన రూరల్ సీఐ కూడా టీడీపీ నాయకులకే మద్దతు తెలిపారు. దీంతో ఎన్నికను శుక్రవారం నాటికి వాయిదా వేశారు. » ధర్మవరం రూరల్ మండలం రేగాటిపల్లి మహాత్మాగాంధీ జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాలలో టీడీపీ వర్గీయులు మాత్రమే పాఠశాలలోకి ప్రవేశించి, ఇతరులెవ్వరూ లోపలకు రాకుండా అడ్డుకున్నారు. పలువురు పాఠశాల బయట గొడవ చేయగా, ఎన్నికను వాయిదా వేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సొంతూరు తోపుదుర్తి గ్రామంలో డీఎస్పీ శివారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వైఎస్సార్సీపీ మద్దతుదారులైన తల్లిదండ్రులను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి పంపకుండా అడ్డుకున్నారు. టీడీపీ మద్దతుదారులను సభ్యులుగా ఎన్నుకున్న తర్వాత వీరిని లోపలికి అనుమతించారు. » డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం పెద్ద దళితవాడ మండల పరిషత్ పాఠశాలలో వైఎస్సార్సీపీ మద్దతుదారు గెలుపొందినా, టీడీపీ నేతల హెచ్చరికలతో టీడీపీ మద్దతుదారు గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటి కేశవరం ప్రాథమిక పాఠశాలలో వైఎస్సార్సీపీ మద్దతుదారు గుడాల వసంతకుమార్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే ఎస్ఐ ఆనందకుమార్ జోక్యం వల్ల టీడీపీ మద్దతుదారు పి.అచ్చియ్యమ్మ ఒక్క ఓటు మెజార్టీతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. » తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ జెడ్పీ ఉన్నత పాఠశాలలో.. కమిటీలో లేని వారిని ఎలా అభ్యర్థిగా నియమిస్తారని వైఎస్సార్సీపీ నేతలు నిలదీయడంతో టీడీపీ నేతలు గొడవకు దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. » సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ముందుగానే తమకు అనుకూలమైన వ్యక్తుల పేర్లను ఇచ్చి ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారు. దీంతో పోటీలో నిలబడాలనే ఆశతో వచ్చిన పలువురు తల్లిదండ్రులు నిరాశతో వెనుదిరిగారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలంలోని గంగమాంబపురం జెడ్పీ హైస్కూల్లో టీడీపీ మద్దతుదారును ఏకపక్షంగా ఎంపిక చేశారు. » గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వైఎస్సార్సీపీ బలపరిచిన బూసి ఏసుమరియమ్మ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీంతో టీడీపీ నేతలు జోక్యం చేసుకుని, వారి మద్దతుదారులు ఎన్నికైనట్లు ప్రకటించారు. » విశాఖ జిల్లా చంద్రంపాలెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరులు ప్రధానోపాధ్యాయుడి చాంబర్లో తిష్టవేసి మొత్తం వ్యవహారం వారికి అనుకూలంగా నడిపించారు.» శ్రీకాకుళం జిల్లా జలుమూరు బాలికల ఉన్నత పాఠశాలలో వైఎస్సార్సీపీకి చెందిన కింజరాపు పద్మ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీన్ని సహించలేని స్థానిక టీడీపీ నేత మునుకోటి దామోదరరావు.. పోలీసులు తమకు సహకరించలేదని పోలీసు స్టేషన్‌పై దాడికి యత్నించారు.