Senior Citizen
-
‘జ్ఞాపకాలు..అనుభవాలు ఎంతో మధురం’
సోలాపూర్: ‘సాధారణంగా పిల్లలు ఆడుకుంటే పెద్దలు చూసి సంతోషిస్తారు. కానీ ఈరోజు మేం ఆటపాటలతో గడుపుతుంటే పిల్లలు చప్పట్లు కొడుతూ ఉత్సాహపరచడం మాకెంతో ఆనందాన్నిచ్చింది’ అని పలువురు సీనియర్ సిటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. పట్టణంలోని పద్మ కమల్ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం ఆధ్వర్యంలో‘బాల్యం అనుభూతులు నెమరు వేసుకోవడం‘అనే పేరుతో సీనియర్ మహిళలు, బాలల కోసం ప్రత్యేకమైన కార్యక్రమం నిర్వహించారు. తమకు పెళ్లిళ్లై 35 నుంచి 40 సంవత్సరాలు పూర్తయ్యాయని, కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్లు , మనవళ్లు, మనవరాళ్ళు ఇలా అందరినీ మరిచి ఈ వయసులో మళ్లీ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునే అవకాశం కల్పించినందుకు పద్మ కమల్ ప్రతిష్టాన్, పద్మశాలీ సఖీ సంఘం సభ్యులు కృతజ్ఞతలు చెబుతున్నామని పేర్కొన్నారు. శ్రీ మార్కండేయ సోషల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరీ శంకర్ కొండ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మశాలి సఖీ సంఘం అధ్యక్షురాలు మేఘ ఇట్టం ముందుగా ప్రాస్తావికోఉపన్యాసం చేస్తూ కార్యక్రమ ఉద్దేశ్యాన్ని గురించి వివరించారు. పద్మ కమల్ ప్రతిష్టాన్ వ్యవస్థాపకుడు గోపీకృష్ణ వడ్డేపల్లి తన చిన్ననాటి జ్ఞాపకాలను అందరితో పంచుకోగా, దయానంద్ కొండ బత్తిని,స్నేహల్ శిందే , ఛత్రపతి అఖేన్, తదితరులు తాము చిన్ననాడు ఆడిన ఆటల గురించి, తమ అనుభవాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా మ్యూజికల్ చైర్ పోటీ నిర్వహించి ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మహిళలు, పురుషుల బృందాలకు పద్మావతి సంఘ, రేణుక చింత, మంజుల ఆడం, కళ చెన్నపట్నం, వనిత సురా, పద్మ మేడిపల్లి తదితరులు బహుమతులను అందజేశారు. -
చలికాలంలో చుండ్రు బాధ, ఒళ్లు పగులుతుంది ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే!
ఈ ఏడాది నవంబరు మాసం వచ్చినా కూడా సాధారణంగా ఉండేంత చలి వణికించకపోయినా, మిగతా సీజన్లతో పోలిస్తే చలి కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. చలిగాలులు సోకకుండా ఉన్ని,ఊలు దుస్తులను ధరించడంతోపాటు, రోగనిరోధక శక్తిని కాపాడుకునేలా ఆహారం విషయంలో జాగ్రత్తపడాలి.చలికాలంలో శ్వాసకోస వాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల మరింత అ ప్రమత్తంగా ఉండాలి. శరీరం వేడిగా ఉండేలా జాగ్రత్తలు పాటించాలి. స్వెట్లర్లు, సాక్సులు, మంకీ క్యాప్‌లు విధింగా ధరించేలా చూడాలి. లేదంటే జలుబు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. తాజా పండ్లు, ఆకుకూరలతో పాటు, తృణధాన్యాలతో కూడిన పోషకాహారాన్ని మన ఆహారంలో చేర్చుకోవాలి. నిల్వచేసిన, ఫ్రిజ్‌లో ఉంచిన ఆహారానికి బదులుగా ఎప్పటికప్పుడు వేడిగా తినడం మంచిది. అలాగే చలిగా ఉంది కదా అని మరీ వేడి నీటితో స్నానం చేయకూడదు. తల స్నానానికి కూడా గోరు వెచ్చని నీరు అయితే మంచిది. చుండ్రు సమస్య రాకుండా ఉండాలంటే, చలికాలంలో జుట్టును శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. మైల్డ్ షాంపూ వాడాలి. చలికాలంలో వేడి నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు ఉండవు. గొంతు నొప్పి లాంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు.ముఖ్యంగా విటమిన్ సీ, ఏ, లభించేలా చూసుకోవాలి. అలాగే చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డీ అందేలా చూసుకోవాలి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఇలా అనేక రకాల సీజనల్ వ్యాధులను, ఇన్ఫెక్షన్ల ప్రమాదం నుంచి ఇది కాపాడతాయి. కొవ్వు చేపలు, కోడిగుడ్డు,మష్రూమ్స్, సోయా మిల్క్ వంటి వాటిలో డీ విటమిన్ పుష్కలంగా ఉంటుంది.రోగనిరోధక శక్తిని పెంచేలా విటమిన్ సీ లభించే సిట్రస్ పండ్లను తీసుకోవాలి. నిమ్మ, నారింజ, బ్రోకలీ, బెర్రీ, వివిధ రకాల సిట్రస్ పండ్లపై దృష్టిపెట్టాలి. నట్స్, సీడ్స్, కోడిగుడ్లు, గుమ్మడి గింజలు, చేపలు వంటివి తీసుకోవాలి.విటమిన్ ఏ ఎక్కువగా లభించే క్యారెట్లు, చిలగడ దుంపలు, పాలకూర, పాలు, చీజ్ బీఫ్ లివర్, క్యాప్సికం, గుమ్మడి కాయ కూరగాయలను తీసుకోవాలి. విటమిన్ ఏ చర్మానికి, కంటి ఆరోగ్యానికి మంచిది. వీటితోపాటు, శరీరానికి అవసరమయ్యే అత్యంత ముఖ్యమైన బీ 12,బీ6ను తీసుకోవాలి. ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులనుంచి రక్షిస్తాయి. సాల్మన్ చేపలు, టునా ఫిష్, చికెన్, కోడిగుడ్లు, పాలు వంటి పదార్థాల్లో విటమిన్ బి 12 లభిస్తుంది. చలికాలంలో చర్మంపై కూడా చాలా ప్రభావం ఉంటుంది. పగలడం, ఎండిపోయినట్టు అవ్వడం చాలా సాధారణంగా కనిపించే సమస్యు. అందుకే దాహంగా అనిపించకపోయినా, సాధ్యమైనన్ని నీళ్లను తాగుతూ ఉండాలి. దీంతో శరీరం డీహైడ్రేట్ అవ్వకుండా, తేమగా ఉంటుంది. రాగుల జావ, తాజా పండ్ల రసాలు తీసుకోవాలి.డ్రై స్కిన్ ఉన్న వారికి చిట పటలాడం, మంట పెట్టడం, దురద పెట్టడం లాంటి ఇబ్బందులు మరీ ఎక్కువగా వస్తాయి. అలాంటి వారు ఖ వింటర్ సీజన్ లో మాయిశ్చ రైజింగ్ క్రీములు వాడాలి. చర్మ సంరక్షణ కోసం రసాయన సబ్బులకు బదులుగా ప్రకృతిసిద్ధంగా లభించే వాటితో తయారు చేసుకున్న సున్ని పిండి వాడితే ఉత్తమం. లేదా ఆయుర్వేద, లేదా ఇంట్లోనే తయారు చేసుకున్న సబ్బులను వినియోగించాలి. లేదంటే గ్లిసరిన్ సబ్బులను ఎంచుకోవాలి. విటమిన్ ఇ లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. -
మోకాళ్లు నొప్పులా? ఎముక పుష్టికోసం ఇలా చేయండి!
వయసు నలభై దాటిందో లేదో చాలామందిలో కీళ్ల నొప్పులు, ఎముకలు బలహీనపడటం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. జీవన శైలి, ఆధునిక అలవాట్లతో పాటు, ఎండ ఎరగని ఉద్యోగాలు, యుక్తవయసు నుంచీ డైటింగ్ పేరుతో పోషకాహారం తీసుకోకపోవడంతో ఎముకలు బలహీన పడుతున్నాయి. ఫలితగా మోకాళ్ల నొప్పులు రికెట్స్ ,బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇది పెద్ద వయసులో తూలి పడిపోవడం, కాళ్లు చేతులు, ప్రధానంగా తుంటి ఎముక విరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. మరి ఎముకల గట్టిదనం కోసం ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.మనిషి వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలహీనపడతాయి. అందుకే ఆరోగ్య కరమైన సమతుల్య ఆహారం చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇది జీవితాంతం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుందని గుర్తు పెట్టుకోవాలి. పెద్దలకు రోజుకు 700మిల్లీగ్రాముల కాల్షియం అవసరం.మెనోపాజ్ఆడవారిలో మెనోపాజ్ తరువాత ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి ఈ విషయాన్ని మరింత అప్రమత్తంగా ఉండాలి. బహిష్టులు ఆగిపోయిన తరువాత ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగిపోవడంతో ఇది ఎముకలపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే కాల్షియం ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలి. శరీరం కాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డీ చాలా అవసరం. నిరంతరం వ్యాయామం చేయాలి. ముఖ్యంగా 40 దాటిన తరువాత కాళ్లు, చేతులు, కండరాలు, ఎముకలను పటిష్టం చేసే వ్యాయామాలను చేయాలి. మోకాళ్లు నొప్పులొచ్చిన తరువాత కచ్చితంగా నడక, యోగా తదితర తేలికపాటి వ్యాయామాలు చేయాల్సిందే. ఏదైనా ఎముకలకి సంబంధించి ఏదైనా సమస్యను గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి, చికిత్స పొందాలి. నిపుణుల సలహా మేరకు సంబంధిత వ్యాయామాలను రెగ్యులర్‌గా చేయాలి. ఎముక పుష్టి కోసం కాల్షియం పుష్కలంగా ఉండే పచ్చని ఆకు కూరలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు తీసుకోవాలి.చేపలు, గుడ్లు, పాలు, బాదం, మొలకెత్తిన ధాన్యాలు ఆహారంలో చేర్చుకోవాలి. బలవర్థకమైన సోయా,నువ్వులతోపాటు విటమిన్ సి లభించే సిట్రస్‌పండ్లను తీసుకుంటే మంచిది. అలాగే విటమిన్ డి కోసం ఉదయం ఎండలో కొద్దిసేపు కూర్చోవాలి. తగినంత నిద్రపోవాలి. -
AB-PMJAY: 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: డెబ్భై ఏళ్లు, ఆ పైబడిన వృద్ధుల ఆరోగ్య సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయంతో నిమిత్తం లేకుండా వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు ప్రతిపాదనలను ఆమోదించింది. అర్హులైన లబి్ధదారులకు త్వరలో కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది.కుటుంబసభ్యులు ఏబీపీఎంజేఏవై కింద లబ్దిదారులుగా ఉన్నా 70 ఏళ్లు, ఆపై వయసు సీనియర్ సిటిజన్లకు విడిగా ఏటా రూ.5 లక్షల ఆరోగ్యబీమా కల్పించనున్నారు. వృద్ధులు ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీలు, ఈఎస్ఐ పథకంలో ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్), మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) పథకాల లబ్ది పొందుతున్న వాళ్లు మాత్రం వాటినో, ఏబీపీఎంజేఏవైనో ఏదో ఒకదానినే ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 4.5 కోట్ల కుటుంబాల్లోని వృద్ధులకు మేలు చేకూరనుంది. ఏబీపీఎంజేఏవై ప్రపంచంలోనే ప్రభుత్వరంగంలో అమలవుతోన్న అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమని కేంద్రం తెలిపింది. 12.34 కోట్ల కుటుంబాల్లోని 55 కోట్ల మందికి ఈ పథకం లబ్దిచేకూరుస్తుందని కేంద్రం పేర్కొంది. వయసుతో సంబంధంలేకుండా కుటుంబంలోని అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథం కింద ఇప్పటికే 7.37 కోట్ల మంది ఆస్పత్రిలో వైద్యసేవలు పొందారు. వీరిలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చుచేసింది. తొలినాళ్లలో జనాభాలో దిగువ తరగతి 40 శాతం మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. తర్వాత 2022 జనవరిలో లబ్దిదారుల సంఖ్యను 12 కోట్ల కుటుంబాలకు పెంచింది. తర్వాత 37 లక్షల ఆశా/అంగన్వాడీ/ఏడబ్ల్యూహెచ్ఎస్లకూ వర్తింపజేశారు. 31వేల మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టులకూ గ్రీన్ సిగ్నల్ రూ.12,461 కోట్ల వ్యయంతో మొత్తంగా 31,350 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ ప్రాజెక్టులకూ కేబినెట్ ఓకే చెప్పింది.→ పీఎం గ్రామ్ సడక్ యోజన–4 కింద అదనంగా 62,500 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి కేబినెట్ సరేనంది. కొత్తగా 25వేల జనావాసాలను కలుపుతూ ఈ రోడ్లను నిర్మించనున్నారు. ఈ మార్గాల్లో వంతెనలనూ ఆధునీకరించనున్నారు. → విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం–ఈబస్ సేవా–పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం పథకాల అమలు కోసం రూ.14,335 కోట్లు కేటాయించేందుకు కేంద్రం అనుమతి ఇచి్చంది. విద్యుత్ ద్విచక్ర, త్రిచక్ర, అంబులెన్స్, ట్రక్కు, ఇతర వాహనాలపై రూ.3,679 కోట్ల మేర సబ్సిడీ ప్రయోజనాలు పౌరులకు కలి్పంచనున్నారు. → ముందస్తు వాతావరణ అంచనా వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నారు. రెండేళ్లలో రూ.2,000 కోట్ల వ్యయంతో ‘మిషన్ మౌసమ్’ను అమలుచేయనున్నారు. భారత వాతావరణ శాఖతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ విభాగాల ద్వారా ఈ మిషన్‌ను అమలు చేయనున్నారు. -
World Elder Abuse Awareness Day : మెయింటెనెన్స్ హక్కులు, ఆసక్తికర సంగతులు
ఈ రోజు (జూన్ 15) ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం (WEAAD, world elder abuse awareness day) జరుపుకుంటారు. ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ ఎల్డర్ అబ్యూస్ (INPEA) జూన్ 2006లో వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డేని స్థాపించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ దీనిని డిసెంబర్ 2011లో అధికారికంగా గుర్తించింది. వృద్ధులపట్ల గౌరవాన్ని పెంపొందిస్తూ, వృద్ధుల పట్ల నిర్లక్ష్యం ఎదుర్కొనే వేధింపులు దోపిడీ గురించి అవగాహన పెంచడమే ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం లక్ష్యం.ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది వృద్ధులు నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్నారు. సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. కుటుంబం సంక్షేమం, అభివృద్ధి కోసం తమ జీవితాన్ని త్యాగం చేసిన వారికి జీవిత చరమాంకంలో సముచిత స్థానం లభించడం లేదు సరికదా, వృద్ధులపై జరుగుతున్న పలురకాల హింస,దాడులు బాధాకరం. భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులను ఎదుర్కొంటున్నారు.ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం, భారతదేశంలో దాదాపు 60 శాతం మంది వృద్ధులు వేధింపులకు గురవుతున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, నాగ్‌పూర్, కాన్పూర్ , మదురై సహా అనేక నగరాలను ఈ సర్వేలో చేర్చారు. అందిన నివేదిక ప్రకారం, 73శాతం మంది యువకులు వృద్ధుల పట్ల చెడుగా ప్రవర్తిస్తున్నారు, దాడికి పాల్పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 మందిలో ఒకరు ఈ వేధింపులకు గురవుతున్నారు.కన్నబిడ్డల్నితల్లిదండ్రులు ఎంత అప్యాయంగా, ప్రేమగా పెంచి, ఆసరాగా ఉన్నట్లే వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడం ప్రతి బిడ్డ విధి. కానీ వృద్ధాప్యంలో తల్లిదండ్రులు చాలా కష్టాలను అనుభవించాల్సి వస్తోంది. ఆస్తి కోసం, శారీరక, మానసిక వేధింపులకు గురవుతున్నారు. సామాన్య మానవుల నుంచి కార్పొరేట్ కుటుంబాల దాకా ఇలాంటి సంఘటనలను ప్రతీనిత్యం చూస్తూనే ఉన్నాంWEAAD 2024 థీమ్: అత్యవసర పరిస్థితుల్లో వృద్ధులపై ప్రత్యేక దృష్టి అనేది ఈ ఏడాది థీమ్. ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు, సాయుధ పోరాటాలు , కోవిడ్ -19 లాంటి సంక్షోభ పరిస్థితుల్లో వృద్ధులు ఎదుర్కొనే ప్రత్యేక సవాళ్లను ఇది నొక్కి చెబుతుంది. అత్యవసర సమయాల్లో వృద్ధుల నిర్దిష్ట అవసరాలు పరిష్కరించడం చాలా కీలకమనే విషయాన్ని తెలియజేస్తుంది.వృద్ధులు లేదా సీనియర్ సిటిజన్ల హక్కులను, కుటుంబ సభ్యులతోపాటు, సమాజం కూడా గుర్తించాలి. వృద్ధులకు విలువనిచ్చి, వారిని గౌరవించే సమాజాన్ని సృష్టించేందుకు కుటుంబ సభ్యులతో పాటు సమాజం, సాంఘిక సంఘాలు ఐక్యంగా ఉంటూ, వృద్ధులు శారీరకంగా, భావోద్వేగంగా, ఆర్థికంగా ఎలాంటి అభద్రతా భావం లేకుండా గౌరవంగా జీవించగలిగే ప్రపంచాన్ని నిర్మించాలి.చట్టాలుసీనియర్ సిటిజన్స్ చట్టం 2007 ప్రకారం సీనియర్ సిటిజన్ల చట్టపరమైన హక్కులు సీనియర్ సిటిజన్‌ను ఎక్కడైనా వదిలిపెట్టడం చట్టరీత్యా నేరం. రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక వృద్ధాశ్రమాన్ని నెలకొల్పాలని, అలాగే సీనియర్ సిటిజన్లకు తగిన వైద్య సంరక్షణను అందించాలని కూడా ఈ చట్టం చెబుతుంది.ఈ చట్టంలోని సెక్షన్ 20 ప్రతి హిందువు తన/ఆమె జీవితకాలంలో తన/ఆమె వృద్ధులైన లేదా బలహీనమైన తల్లిదండ్రులను కాపాడుకోవాల్సిన బాధ్యతను విధిస్తుంది. కాబట్టి, వృద్ధులు లేదా బలహీనంగా ఉన్న తల్లిదండ్రులను కాపాడుకోవడం కొడుకులు, కుమార్తెలు ఇద్దరి బాధ్యత ఉంటుంది.తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం, 2007 కింద, వారు మెయింటెనెన్స్ ట్రిబ్యునల్‌లో దరఖాస్తును ఫైల్ చేయవచ్చు. పిల్లలు లేదా బంధువులు వీరిని జాగ్రత్తగా చూసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు గుర్తిస్తే, వారికి నెలవారీ మెయింటెనెన్స్ చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయవచ్చు. ఎంత మెయింటెనెన్స్ చెల్లించాల్సి ఉంటుందో అనేది కూడా కోర్టు విచారణ చేసిన నిర్ణయిస్తుంది దరఖాస్తు తేదీ నుండి మెయింటెనెన్స్ మొత్తంపై వడ్డీ (5-8 శాతం) తో కలిపి చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించవచ్చు. కోర్టు ఆర్డర్ తర్వాత కూడా మెయింటెనెన్స్ అందకపోతే ఏదైనా ఇలాంటి కోర్టు (మెయింటెనెన్స్ ట్రిబ్యునల్)కి వెళ్లి, ఆర్డర్‌ను అమలు చేయడంలో సహాయం కోసం అడగవచ్చు. -
తెలంగాణలో సకెస్ అయిన ఎల్డర్ లైన్
-
World Senior Citizen Day 2023: లఖోటియా కాలేజ్ ఆఫ్ డిజైన్ ఆధ్వర్యంలో వృద్ధులతో ఫ్యాషన్ షో (ఫోటోలు)
-
పార్కింగ్ సమస్య.. ఏకంగా సీఎం సిద్ధరామయ్య కారునే అడ్డగించి
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసం వద్ద కాసేపు హైడ్రామా నెలకొంది.సీఎం ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఓ సీనియర్ సిటిజన్ ఏకంగా సిద్ధరామయ్య వాహనాన్ని అడ్డగించి నిలదీశాడు. ముఖ్యమంత్రి ఇంటికి వస్తున్న అతిథుల కారణంగా తమ కుటుంబం కొన్నేళ్లుగా పార్కింగ్ సమస్యను ఎదుర్కొంటుందని, దీనిని పరిష్కరించాలని డిమాండ్ చేశాడు. కాగా వీఐపీలు, సెలబ్రిటీలు నివసించే ప్రాంతాలు ఎప్పుడూ బిజీబిజీగా ఉంటాయన్న విషయం తెలిసిందే. వారిని కలిసేందుకు నిత్యం వందలాది మంది తమ నివాసాలకు వస్తుంటారు. ఈ క్రమంలో ఇంటి పరిసర ప్రాంతాల్లో వాహనాలు పార్క్ చేయడం ద్వారా చుట్టుపక్కల నివసించే వారిని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తాజాగా సీఎం సిద్ధరామయ్య ఇంటి వద్ద నివసించే ఓ వృద్ధుడికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో విసిగిపోయిన నరోత్తమ్ అనే పెద్దాయన శుక్రవారం ఉదయం ఇంటి నుంచి వస్తున్న సీఎం కాన్వాయ్‌నే అడ్డుకున్నాడు. ఈ ఘటనతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే తాను సీఎంతో మాట్లాడాలని చెప్పడంతో అధికారులు అనుమతించారు. దీంతో సీఎం కారు వద్దకు వెళ్లిన అతడు.. ‘మీ కోసం వచ్చే వారు తమ వాహనాలను ఎక్కడపడితే అక్క పార్క్ చేస్తున్నారని.. దీంతో అతని గేట్ బ్లాక్ అవుతుందని తెలిపాడు. ఈ కారణంగా నేను, నా కుటుంబ సభ్యులు కార్లు బయటకు తీసే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పాడు. గత అయిదేళ్లనుంచి ఇదే సమస్య ఎదుర్కొంటున్నమని, ఇక భరించలేమంటూ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై స్పందించిన సిద్ధరామయ్య పార్కింగ్ సమస్యను పరిష్కరించాలని తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఇదిలా ఉండగా సీఎం అయినప్పటికీ సిద్ధరామయ్య తన అధికారిక నివాసంలోకి మారలేదు. ఆయన ఇంకా తనకు గతంలో కేటాయించిన ప్రతిపక్ష నాయకుడి బంగ్లాలోనే ఉంటున్నారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పనే ఇప్పటికీ సీఎం అధికారిక నివాసంలో నివసిస్తున్నారు. అయితే వచ్చే నెల ఆగస్టులో సిద్దరామయ్య కొత్త ఇంటికి మారే అవకాశం ఉంది. -
సొంతిల్లు కొంటున్నారా?, అదిరిపోయే ఈ కేంద్ర ప్రభుత్వ స్కీం గురించి తెలుసా?
పదవీ విరమణ తీసుకున్నారు. ఉండడానికి సొంతిల్లు ఉంది. కానీ, పింఛను సదుపాయం లేదు. ఉద్యోగం లేదా సంపాదనా కాలంలో పెద్దగా పొదుపు చేయలేకపోయారు. చేసిన పొదుపు ఇప్పటి జీవన అవసరాలను తీర్చే స్థాయిలో లేదు. అదనపు ఆదాయం కావాలి. ఇందుకోసం వృద్ధాప్యంలో ఏం చేయాలి..? ఇలాంటి సందిగ్ధత ఎదుర్కొనే ప్రతి ఒక్కరి ముందున్న ఆప్షన్ రివర్స్ మార్ట్గేజ్ లోన్. వృద్ధాప్యంలో జీవన అవసరాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్ర సర్కారు 2007లోనే దీన్ని తీసుకొచ్చింది. కానీ, మన దేశంలో అంతగా ప్రజాదరణకు నోచుకోలేదు. దీని గురించి తెలిసింది చాలా తక్కువ మందికే. బ్యాంకులు వ్యక్తిగత రుణాలు, గృహ రుణాలు, క్రెడిట్ కార్డుల గురించి ప్రకటనలు ఇవ్వడం గమనించే ఉంటారు. కానీ, ఏ బ్యాంకు కూడా ఎక్కడా రివర్స్ మార్ట్గేజ్ స్కీమ్ గురించి ప్రకటన ఇచ్చినట్టు కనిపించదు. దీనికి కారణం బ్యాంకులకు ఈ ఉత్పత్తిపై ఆసక్తి లేకపోవడమే. వృద్ధాప్యంలో పోషణకు ఎలాంటి ఆదాయం లేని వారిని సొంతిల్లే ఆదుకుంటుంది. ఇంటిని బ్యాంకు తనఖాగా ఉంచుకుని నెలవారీ ఆదాయం సమకూరుస్తుంది. ఈ పథకం ప్రయోజనాలు, అర్హతలపై మరిన్ని వివరాలు అందించే కథనమే ఇది. ఇది ఎలా పనిచేస్తుంది..? రివర్స్ మార్ట్గేజ్ అంటే నివాస యోగ్యమైన గృహంపై తీసుకునే రుణం. మార్ట్గేజ్ అన్నది ఇంటిని సొంతం చేసుకోవడం కోసం తీసుకునే రుణం. దీనికి విరుద్ధంగా ఇంటిపై రుణం తీసుకునేది కనుక రివర్స్ మార్ట్గేజ్ అని పేరు పెట్టారు. ఇంటి కోసం మార్ట్గేజ్ రుణం తీసుకుంటే నెలవారీ ఈఎంఐ ఎలా అయితే చెల్లిస్తారో.. రివర్స్ మార్ట్‌గేజ్‌లో బ్యాంక్ కూడా రుణ గ్రహీతకు అదే విధంగా చెల్లిస్తుంది. అద్దె ఇంట్లో ఉండే వారికి ఈ రుణానికి అర్హత ఉండదు. సొంతిల్లు, దానిపై సంపూర్ణ హక్కులు ఉన్న వారే దీన్ని తీసుకోగలరు. ఇంటి విలువ ఎంత, అది ఏ ప్రాంతంలో ఉంది? తదితర అంశాలను చూసిన తర్వాత బ్యాంక్‌లు ఎంత రుణం ఇవ్వాలన్నది నిర్ణయిస్తాయి. ఇంటి విలువలో రుణంగా (ఎల్టీవీ) 60 నుంచి 80 శాతం మధ్య నిర్ణయిస్తాయి. రివర్స్ మార్ట్గేజ్ కింద చాలా బ్యాంకులు గరిష్టంగా రూ. కోటి రుణ పరిమితిని అమలు చేస్తున్నాయి. అంటే రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా పెట్టే ఇంటి విలువ రూ.2 కోట్లు ఉన్నా సరే గరిష్టంగా రూ.కోటి వరకే పొందగలరు. గరిష్టంగా 20 ఏళ్ల కాలానికి రుణాన్ని బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. చదవండి👉 ధర ఎంతైనా తగ్గేదేలే..హైదరాబాద్‌లో మాకు ఆ ఏరియా ఇళ్లే కావాలి! రుణాన్ని చెల్లించక్కర్లేదు.. వృద్ధాప్యంలో జీవన అవసరాల కోసం ఇంటిని తనఖా పెట్టి రుణం తీసుకుంటున్నారని అనుకుందాం. అలాంటప్పుడు తిరిగి ఎలా చెల్లించగలం? అన్న ప్రశ్న రావచ్చు. నిజమే తీసుకున్న రుణాన్ని తప్పనిసరిగా తిరిగి చెల్లించాలనేమీ లేదు. ఉదాహరణకు వినయ్ (62) 20 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకున్నారని అనుకుందాం. ఆయన 82 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా జీవించే ఉన్నారు. కాల వ్యవధి ముగిసింది కనుక ఆ తర్వాత నుంచి బ్యాంక్ ఎలాంటి చెల్లింపులు చేయదు. అయినా, రుణ గ్రహీత అదే ఇంటిలో నిశ్చింతగా నివసించొచ్చు. ఇంటి యజమాని మరణించిన తర్వాతే అది బ్యాంక్ పరం అవుతుంది. ఒకవేళ భార్యా, భర్త జాయింట్‌గా రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకుంటే వారిద్దరి మరణానంతరమే బ్యాంకులకు హక్కులు లభిస్తాయి. రుణ గ్రహీత మరణానంతరం రుణం, దానిపై వడ్డీ బకాయిలు చెల్లించే ఆప్షన్‌ను బ్యాంక్‌లు వారసులకు కల్పిస్తాయి. వారు ముందుకు రాకపోతే అప్పుడు ఆ ఇంటిని బ్యాంక్ వేలం వేస్తుంది. అన్ని బకాయిలు మినహాయించుకుని ఏమైనా మిగిలి ఉంటే వారసులకు చెల్లిస్తుంది. ఇంటిని విక్రయించగా వచ్చిన మొత్తం బకాయిలు తీర్చేంత లేకపోతే, మిగిలినది బ్యాంక్ నష్టం కింద సర్దుబాటు చేసుకుంటుంది. వారసులకు బాధ్యత ఉండదు. చదవండి👉 హైదరాబాద్: ట్రెండ్ మారింది.. దూరమైనా పర్లేదు, అలాంటిదే కావాలంటున్న నగరవాసులు! రెండు రకాల చెల్లింపులు... రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని రుణ గ్రహీత కోరిక మేరకు బ్యాంక్‌లు రెండు రకాలుగా చెల్లిస్తాయి. ఒకటి ప్రతి నెలా వాయిదాల రూపంలో అందుకోవచ్చు. లేదంటే త్రైమాసికం, ఆరు నెలలు లేదా ఏడాదికోసారి చెల్లింపులు చేస్తుంది. రెండు ఏక మొత్తంలో మంజూరు చేస్తుంది. బ్యాంక్ నుంచి రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని ఏక మొత్తంలో ఒకే విడత అందుకున్నా లేక నెలవారీ వాయిదాల రూపంలో అందుకున్నా, ఆ మొత్తంపై పన్ను పడదు. ఎందుకంటే ఆదాయపన్ను చట్టం దీన్ని ఆదాయం కింద పరిగణించదు. రుణంగానే భావిస్తుంది. దీంతో పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. చెల్లింపుల మొత్తాన్ని పెంచుకునే ఆప్షన్ లేదు. ఉదాహరణకు ప్రాపర్టీ విలువ రూ.కోటి ఉందని అనుకుందాం. లోన్ టు వ్యాల్యూ (ఎల్టీవీ) 80 శాతం అనుకుంటే అప్పుడు రుణం కింద రూ.80 లక్షలు ఖరారు అవుతుంది. ఇందులో వడ్డీ భాగం కూడా ఉంటుందని మర్చిపోవద్దు. రూ.80 లక్షలను 8.5 శాతం రేటుపై 20 ఏళ్ల కాలానికి తీసుకునేట్టు అయితే, అప్పుడు చెల్లించాల్సిన వడ్డీ రూ.45 లక్షలు అవుతుంది. రూ.80 లక్షల్లో రూ.45 లక్షలు పోను రూ.35 లక్షలను బ్యాంక్ రుణ గ్రహీతకు చెల్లిస్తుంది. ఇది నెలవారీ చెల్లింపులకు సంబంధించి అనుసరించే విధానం. ఏక మొత్తంలో చెల్లింపులు కోరుకుంటే అప్పుడు లోన్టు వ్యాల్యూలో 50 శాతం లేదా రూ.15 లక్షలు ఈ రెండింటిలో ఏది ఎక్కువ అయితే అది చెల్లిస్తారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? ఎప్పుడైనా చెల్లించొచ్చు.. రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని ఎప్పుడైనా తిరిగి చెల్లించొచ్చు. కాల వ్యవధి పూర్తి కాక ముందు చెల్లించినా ఎలాంటి చార్జీలు ఉండవు. ‘‘ఒకవేళ మరో బ్యాంక్‌కు రివర్స్ మార్ట్ గేజ్ రుణాన్ని బదిలీ చేసుకోవడం ద్వారా పాత బ్యాంకు వద్ద ముందే తీర్చేస్తున్నట్టు అయితే, అప్పటికి మిగిలి ఉన్న రుణ బకాయి మొత్తంపై 0.5–2 శాతం మధ్య పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది’’అని మైలోన్‌కేర్ డాట్ ఇన్ సంస్థ సీఈవో గౌరవ్‌గుప్తా తెలిపారు. రుణాలపై వడ్డీ రేట్లు గతేడాది నుంచి 2.5 శాతం మేర పెరిగాయి. ఇక ఇక్కడి నుంచి పెరుగుదల పెద్దగా ఉండదన్నది విశ్లేషకుల అంచనా. అంతేకాదు అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు సర్దుకుని, అనిశ్చితులు తగ్గితే తిరిగి రుణ రేట్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక రివర్స్ మార్ట్గేజ్ రుణాన్ని తీసుకునే వారు వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయని వెనుకాడక్కర్లేదని నిపుణులు సూచిస్తున్నారు. రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకోవడానికి అవసరమే ప్రామాణికం. జీవనానికి ఇతరత్రా ఆదాయం లేని వారు, ఉన్నా చాలని వారు, తమ వారసులకు తమ ప్రాపర్టీ అవసరం లేని వారు, మరింత సుఖవంతమైన జీవనం సాగించాలని అనుకునే వారు, అవసరాల్లో రాజీ పడే ఉద్దేశ్యం లేని వారు రివర్స్ మార్ట్గేజ్ రుణానికి వెళ్లొచ్చు. ఎస్బీఐ రివర్స్ మార్ట్గేజ్ రుణంపై రేటును రెపో రేటుతో అనుసంధానిస్తోంది. దాదాపు గృహ రుణం స్థాయిలోనే రేట్లు ఉంటాయి. రెపో రేటుకు అనుసంధానమై ఉండడం వల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు, తగ్గినప్పుడు వెంటనే అది రుణాలపై ప్రతిఫలిస్తుంది. విలువ మదింపు.. రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా ఉంచిన ఇంటి విలువను బ్యాంక్‌లు ఐదేళ్లకోసారి మదింపు వేస్తుంటాయి. తనఖా పెట్టిన ప్రాపర్టీ విలువ రుణం మంజూరు చేసే నాటి విలువ స్థాయిలోనే ఉందా? పెరిగిందా లేక తగ్గిందా? అన్నది సమీక్షిస్తుంటాయి. ఎందుకంటే రివర్స్ మార్ట్గేజ్ రుణాల్లో ఎక్కువ శాతం ఆయా ప్రాపర్టీలు బ్యాంక్‌ల స్వాధీనం అవుతుంటాయి. రుణం తీసుకున్న వారు లేదా వారి వారసులు తిరిగి చెల్లించే దాఖలాలు తక్కువ. దీంతో బ్యాంక్‌లు తాము ఇచ్చిన రుణం, దానిపై వడ్డీ బకాయిల వసూలుకు వాటిని వేలం వేస్తుంటాయి. వేలంలో సరైన విలువను పొందేందుకు వీలుగా బ్యాంక్‌లు రిస్క్ కోణంలో ఇలా ప్రాపర్టీ విలువను ఐదేళ్లకోసారి మదింపు వేస్తాయి. కివర్స్ మార్ట్గేజ్ రుణానికి ఎన్‌బీఎఫ్‌సీల కంటే బ్యాంకులే మెరుగైన ఆప్షన్. సమర్పించాల్సినవి ఇవీ.. రివర్స్ మార్ట్గేజ్ రుణం తీసుకోవాలని అనుకునే వారు.. గుర్తింపు, నివాస గుర్తింపు పత్రాలు ఇవ్వాలి. ప్రాపర్టీ అసలు పేపర్లు, గడిచిన ఆరు నెలల బ్యాంకు ఖాతా స్టేట్మెంట్, అప్పటికే ఏదైనా రుణం తీసుకుని ఉంటే దానికి సంబంధించి చివరి ఏడాది స్టేట్మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. చదవండి👉వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉద్యోగులు, రాకెట్ వేగంతో పెరుగుతున్న ఇళ్ల ధరలు! ఎందుకు ఆదరణ లేదు..? రివర్స్ మార్ట్గేజ్ గురించి అందరికీ తెలియకపోవడం ఇది పెద్దగా విస్తరించపోవడానికి ఒక కారణం. సాధారణంగా ఇంటితో అనుబంధం ఉంటుంది. అంత సులభంగా దాన్ని తెంపుకోలేరు. తమ గుర్తుగా, వారసత్వంగా పరిగణిస్తుంటారు. బ్యాంకులు దీని గురించి ప్రచారం చేయకపోవడం కూడా ఒక ముఖ్య కారణం. ఎక్కడా ప్రకటనలు ఇవ్వవు. కనీసం వాటి వెబ్సైట్లలోనూ వివరాలను అందుబాటులో ఉంచవు. బ్యాంకుకు వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఉదాహరణకు బ్యాంక్ 15 ఏళ్ల కాలానికి రివర్స్ మార్ట్గేజ్ రుణం ఇచ్చిన తర్వాత.. ఇంటి యజమాని 30 ఏళ్లు జీవించారని అనుకుందాం. అప్పటి వరకు ఆ ఇంటిని బ్యాంకులు ఏమీ చేయలేవు. ఇచ్చిన రుణాన్ని స్వచ్చందంగా చెల్లిస్తే తప్ప అవి వసూలు చేసుకోలేవు. రుణ గ్రహీత చనిపోయే వరకు ఆగాల్సిందే. నివసిస్తున్న ఇల్లు వారసులకు అవసరం లేనట్టయితే అప్పుడు దాన్ని విక్రయించే ఆప్షన్‌ను కూడా పరిశీలించొచ్చు. మంచి విలువ పలికే ప్రాంతంలో ఉంటే విక్రయించి, తక్కువ రేటున్న ఇంటిని కొనుగోలు చేసుకోవడం ఒక మార్గం. ఈ రూపంలో మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ పథకాల్లోకి మళ్లించుకుని ప్రతి నెలా ఆదా యం వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. చదవండి👉 మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! వీటిని దృష్టిలో పెట్టుకోవాలి ►60 ఏళ్లు నిండిన ఎవరైనా రివర్స్ మార్ట్గేజ్ రుణానికి అర్హులు. జీవిత భాగస్వామి సహ దరఖాస్తుదారు అయితే ఆమె వయసు 55–58 ఏళ్లకు తక్కువ ఉండకూడదు. బ్యాంకుల మధ్య ఇది వేర్వేరుగా ఉంది. ► గరిష్టంగా రూ.కోటి వరకే రుణం లభిస్తుంది. ఈ మొత్తాన్ని రుణ గ్రహీత ఏ అవసరం కోసం అయినా వినియోగించుకోవచ్చు. ►ఇంటి విలువ, రుణ గ్రహీత వయసు, అమల్లో ఉన్న వడ్డీ రేటు ఆధారంగా రుణం మొత్తాన్ని, కాల వ్యవధిని బ్యాంకులు నిర్ణయిస్తాయి. ►కనీసం పదేళ్లు, గరిష్టంగా 20 ఏళ్ల కాలాన్ని చాలా బ్యాంకులు అమలు చేస్తున్నాయి. ► సొంతిల్లు అయి ఉండి, దాన్ని అద్దెకు ఇవ్వకుండా, అందులో నివసిస్తుంటే రివర్స్ మార్ట్గేజ్ చేసుకోవచ్చు. ► ఇంటిపై ఎలాంటి వివాదాలు ఉండకూడదు. ► వాణిజ్య ఆస్తిపై రివర్స్ మార్ట్‌గేజ్‌కు అవకాశం లేదు. ►తనఖా పెట్టే ఇంటి జీవన కాలం అక్కడి నుంచి 20 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండకూడదు. ► ప్రాసెసింగ్ ఫీజు, స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ ఇన్సూరెన్స్, వీటిపై జీఎస్టీ చార్జీలను చెల్లించాలి. ►పెనాల్టీ లేకుండా ఎప్పుడైనా ఈ రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించొచ్చు. ► ప్రతి ఐదేళ్లకోసారి ప్రాపర్టీ విలువను బ్యాంక్‌లు మదింపు వేస్తాయి. ►రివర్స్ మార్ట్గేజ్ కింద తనఖా పెట్టిన ఇంటిని నవీకరించాలని అనుకుంటే, బ్యాంక్ నుంచి అనుమతి తీసుకోవాలి. ►ఇంటి నిర్వహణకు అయ్యే ఖర్చులను రుణ గ్రహీత (ఇంటి యజమాని) పెట్టుకోవాల్సిందే. అంతేకాదు ఆ ఇంటికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్, ఇతర పన్నులు ఏవైనా ఉంటే అందులో నివసిస్తున్న వారే చెల్లించుకోవాలి. చదవండి👉 తక్కువ ధరకే ప్రభుత్వ ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఎగబడుతున్న జనం! -
చేతిలో రూ.25 లక్షలు ఉన్నాయ్.. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
నాకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో రూ.4 లక్షల పెట్టుబడులు ఉన్నాయి. మూడేళ్ల తర్వాత నా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే పెనాల్టీ చెల్లించాలా? ఇందుకు అనుసరించాల్సిన ప్రక్రియ ఏది? – ధీరజ్ సన్యాల్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. 8 శాతం వార్షిక రాబడిని (హామీతో కూడిన) మూడు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంటారు. కానీ డిపాజిట్ చేసిన రోజు ఉన్న రేటే ఐదేళ్ల కాలానికి అమలవుతుంది. అంటే కొత్తగా ప్రారంభించే ఖాతాలకే సవరించిన రేటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లే అయినా, ఫారమ్–2 సమర్పించడం ద్వారా ముందుగానే ఖాతాను మూసివేయవచ్చు. కాకపోతే ఇన్వెస్ట్ చేసిన కాలవ్యవధి ఆధారంగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకుంటే ఎలాంటి వడ్డీ చెల్లించరు. అప్పటికే మూడు నెలలకు ఒకసారి చెల్లించిన వడ్డీ మొత్తాన్ని అసలు నుంచి మినహాయించుకుంటారు. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్‌ను రద్దు చేసుకుంటే పెట్టుబడిలో 1.5 శాతాన్ని జరిమానా కింద చెల్లించాల్సి వస్తుంది. ఇక రెండు నుంచి ఐదేళ్ల మధ్యలో డిపాజిట్ రద్దు చేసుకుంటే అప్పుడు పెట్టుబడిపై 1 శాతం జరిమానా పడుతుంది. మూడేళ్ల తర్వాత మీ డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు కనుక మీరు మీ పెట్టుబడి మొత్తం రూ.4 లక్షలపై ఒక శాతం చొప్పున రూ.4,000 పెనాల్టీ మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మొదటి ఐదేళ్ల కాలానికే ఈ నిబంధనలు అమలవుతాయి. ఎస్సీఎస్ఎస్ పథకాన్ని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించి కాలంలో ఏడాది నిండిన తర్వాత, అంటే మొత్తంగా ఆరేళ్ల తర్వాత ఎప్పుడు ముందస్తుగా రద్దు చేసుకున్నా, ఎలాంటి పెనాల్టీ పడదు. నా వయసు 74 ఏళ్లు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ త్వరలోనే గడువు తీరి (మెచ్యూరిటీ) రూ.25 లక్షలు చేతికి రానున్నాయి. నేను ఈ మొత్తాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే మెరుగైన రాబడులు వస్తాయి? ప్రభుత్వ పథకాలు అయిన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), ప్రధాన మంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై), పోస్టాఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (ఎంఐఎస్)లో పూర్తి స్థాయిలో నాకు పెట్టుబడులు ఉన్నాయి. – ఎస్.అరుణ్ ఫిక్స్డ్ డిపాజిట్లో రాబడులు మెరుగ్గా ఉండవు. కనుక మీరు మెరుగైన రాబడుల కోసం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎఫ్డీలతో పోలిస్తే ఈక్విటీ ఫండ్స్ అస్థిరతలతో ఉంటాయి. కాకపోతే అచ్చమైన ఈక్విటీ ఫండ్స్‌లో మాదిరిగా అస్థిరతలు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌లో ఉండవు. ఇవి 15–30 శాతం వరకు ఈక్విటీల్లో, మిగిలిన మొత్తాన్ని ఫిక్స్డ్ ఇన్కమ్, ఆర్బిట్రేజ్ అవకాశాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. స్వల్పకాలంలో ఈ ఫండ్స్‌లోనూ రిస్క్ ఎక్కువే ఉంటుంది. అయితే మూడు నుంచి ఐదేళ్లు అంతకుమించిన కాలానికి రిస్కీ అని నేను అనుకోను. షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ మరోక ఆప్షన్. ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరే షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లోనూ రాబడులు ఉంటాయి. వీటిల్లో లిక్విడిటీ ఎక్కువ. పోస్టాఫీసు ఎంఐఎస్, ఎస్సీఎస్ఎస్, పీఎంవీవీవై పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి కనుక క్రమం తప్పకుండా ఆదాయం వస్తుంటుంది. ఈ పథకాల నుంచి రాబడి తీసుకుంటూ ఉంటారు. కనుక పెట్టుబడి విలువ పెరగదు. కనుక మీకు ఉన్న వాటిల్లో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ మెరుగైన ఆప్షన్ అవుతుంది. ఈక్విటీ వద్దనుకుంటే షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌కు వెళ్లొచ్చు. -
సైరా... సైకిల్ సవారీ.. ఆమెకు 74 సంవత్సరాలు అంటే నమ్మడం కష్టం
ఉత్తర కర్ణాటకలోని గోకర్ణకు చెందిన జ్యోత్స్న కాగల్ను చూస్తే ‘74 సంవత్సరాలు’ అని నమ్మడం చాలా కష్టం. దీనికి కారణం ఆమె చలాకీతనం. 74 ఏళ్ల వయసులో కొందరికి నడవడం కష్టం కావచ్చు. అయితే జ్యోత్స్న మాత్రం వేగంగా నడవడంతో పాటు వేగంగా సైకిల్ తొక్కుతూ వీధి వీధీ తిరుగుతుంది. 1968లో తన తొలి సైకిల్‌ను కొన్నది. ఆ రోజుల్లో ఆడవాళ్లు సైకిల్ తొక్కడం అనేది అతి అరుదైన దృశ్యం. అలాంటి రోజుల్లో సైకిల్‌పై మెరుపు వేగంతో దూసుకుపోయే జ్యోత్స్నను చూసి సర్వజనులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టేవారు. ఆమె పేరు తెలియక ‘సైకిల్ అమ్మాయి’ అని పిలిచేవారు. ఆమె గోకర్ణలోని మహాబలేశ్వర్ కో–ఆపరేటివ్ సొసైటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా పనిచేసింది. ధ్యానం, యోగాలతో జ్యోత్స్న దినచర్య మొదలవుతుంది. సైకిల్ సవారీ తన విజయ రహస్యం అని చెబుతున్న జ్యోత్స్న కాగల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
IDBI: సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్, పూర్తి వివరాలు చూడండి!
సాక్షి,ముంబై: ప్రైవేట్ బ్యాంకు ఐడీబీఐ సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పింది. "అమృత్ మహోత్సవ్ ఎఫ్డీ" ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఏడు రోజుల నుంచి ఐదేళ్ల కాల డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. ఇందులో సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై గరిష్టంగా 7.65 శాతం వడ్డీని అందించ నుంది. దీంతోపాటు సాధారణ ప్రజలకు 7.15 శాతం వడ్డీని చెల్లిస్తుంది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం,రెండుకోట్లరూపాయల లోపు డిపాజిట్లపై కొత్త రేట్లు ఏప్రిల్ 1, 2023 నుండి అమల్లో ఉన్నాయి. బ్యాంక్ ప్రస్తుతం సాధారణ ప్రజలకు 7 రోజుల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లకు సీనియర్ సిటిజెన్లకు 3.5 శాతం నుండి 6.75 శాతం వరకు , మిగిలినవారికి 3-6.25 శాతం వడ్డీ రేటును వర్తింప చేస్తుంది. (స్టార్ బ్యాటర్ కోహ్లీ అరుదైన ఘనత: గిఫ్ట్‌గా అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్) ఆరు నెలలు, ఒక రోజు నుండి ఒక సంవత్సరం, ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల (444 రోజులు కాకుండా) మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వరుసగా 5.5 శాతం, 6.75 శాతం వడ్డీని పొందవచ్చు.. ఐదేళ్ల పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లకు సాధారణ ప్రజలకు 6.25 శాతం, సీనియర్లకు 6.75 శాతం వడ్డీ రేటును చెల్లించనుంది. (మహిళా సమ్మాన్ సేవింగ్ స్కీం: 7.5 శాతం వడ్డీరేటు, ఎలా అప్లై చేయాలి?) -
ఈ పథకంతో సీనియర్ సిటిజన్స్‌కు రూ.20 వేల వరకు రాబడి!
సీనియర్ సిటిజన్ల పొదుపునకు సంబంధించి ఓ అద్భుతమైన పథకం ఉంది. దాని పేరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. దీని కింద సంవత్సరానికి 8 శాతం వడ్డీ లభిస్తుంది. మదుపు సొమ్ము 5 సంవత్సరాలకు మెచ్యూర్ అవుతుంది. ఆ తర్వాత మరో మూడేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో గరిష్టంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023 బడ్జెట్ సందర్భంగా పేర్కొన్నారు . అయితే దీనిపై అధికారిక నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఈ పథకంలో రూ. 30 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా సీనియర్ సిటిజన్లు వడ్డీ కింద నెలకు రూ. 20,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఒక వేళ భార్యాభర్తలిద్దరూ కలిపి డిపాజిట్ చేస్తే నెలకు రూ. 40,000 వరకు రాబడి లభిస్తుంది. వడ్డీ రేటు మరింత పెరిగేనా? సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ప్రభుత్వం మరింత పెంచవచ్చని సీనియర్ సిటిజన్లు భావిస్తున్నారు. ఈ నెలాఖరులోగా జరగనున్న చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల తదుపరి సవరణను దృష్టిలో ఉంచుకుని సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ప్రభుత్వం పెంచుతుందని ఆశిస్తున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అంటే డిసెంబర్లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును మార్చింది. ప్రస్తుతం ఇది 8 శాతంగా ఉంది. అయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు మరింత పెరిగే అవకాశం లేదని ఎస్ఏజీ ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా చెబుతున్నారు. మై ఫండ్ బజార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో వినిత్ ఖండారే కూడా ఈ వడ్డీ రేటు మరింత పెంచే అవకాశం లేదన్నారు. గవర్నమెంట్ సెక్యూరిటీస్ దిగుబడిలో పెరుగుదల కారణంగా ప్రభుత్వం స్వల్పకాలిక చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేటును పెంచవచ్చని భావిస్తున్నప్పటికీ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటును ఇటీవలే సవరించిన నేపథ్యంలో మరో సారి సవరణ ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. -
చీరకట్టులో డైవింగ్ చేసిన సీనియర్ సిటిజన్ మహిళలు: వీడియో వైరల్
స్విమ్మింగ్ కాంపిటీషన్లో చూస్తుంటాం తలకిందులుగా నీటిలో దూకడం. ఆ పోటీలో పాల్గొన్న వాళ్లంతా స్విమ్‌సూట్ వేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ చేస్తుంటారు. కానీ ఇక్కడ సీనియర్ సీటిజన్ మహిళలు అలాంటివి ఏమి లేకుండా చీర కట్టులోనే డైవింగ్ చేసి చూపించారు. ఇది అందర్నీ ఆశ్చర్యపరిచడమే గాక చాలా ఆదర్శంగా కూడా ఉంది. ఈ ఘటన తమిళనాడులో కల్లిడైకురిచి వద్ద తామిరబర్నీ నది వద్ద చోటు చేసుకుంది. అక్కడ మహిళలందరికి ఇది నిత్యకృత్యం. ఒక పెద్దావిడ కల్లిడైకురిచిలో పేరుగాంచిన తామిరబరిణి నదిలో చీరకట్టులో డైవింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియోని ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సీనియర్ సిటజన్ మహిళంతా చాలా అలవోకగా బ్రిడ్జిపై నుంచి నదిలో దూకి స్విమ్మింగ్ చేస్తూ..కనిపించారు. అదికూడా చీరకట్టులోనే చేశారు. వారంతా పెద్దవాళ్లే కానీ, ఏమాత్రం బెరుకు లేకుండా చాలా ఉత్సాహంగా డైవింగ్ చేశారు. అయితే నెటిజన్లు ఈ వీడియోని చూసి ఆ నది అంతా లోతు లేదు కాబట్టే చేయగలుగుతున్నారని ఒకరు, కొన్నిగ్రామాల్లోని పురుషులు, మహిళలు, పిల్లలకు ఇలాంటి వాటిల్లో చాలా నైపుణ్యత ఉంటుందని మరోకరు ట్వీట్ చేశారు. Awestruck to watch these sari clad senior women effortlessly diving in river Tamirabarni at Kallidaikurichi in Tamil Nadu.I am told they are adept at it as it is a regular affair.😱Absolutely inspiring 👏 video- credits unknown, forwarded by a friend #women #MondayMotivation pic.twitter.com/QfAqEFUf1G — Supriya Sahu IAS (@supriyasahuias) February 6, 2023 (చదవండి: అరవింద్ కేజ్రీవాల్‌ని పోలిన వ్యక్తి చాట్ అమ్ముతూ..) -
సీనియర్ సిటిజన్ల కోసం బజాజ్ నుంచి సరికొత్త ఇన్సూరెన్స్ ప్లాన్స్
హైదరాబాద్: ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ బజాజ్ అలయాంజ్ తాజాగా సీనియర్ సిటిజన్ల కోసం ’రెస్పెక్ట్ సీనియర్ కేర్’ రైడర్‌ను ప్రవేశపెట్టింది. మూడు ప్లాన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. దీనికి ప్రీమియం రూ. 700 నుంచి రూ. 7,500 వరకూ (జీఎస్టీ కాకుండా) ఉంటుందని సంస్థ తెలిపింది. ప్లాన్‌ను బట్టి ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్ సర్వీస్, స్మార్ట్ వాచ్ ఫాల్ డిటెక్షన్, ఫిజియోథెరపి.. నర్సింగ్ కేర్ తహా హోమ్ కేర్ సర్వీసులు, మెడికల్ టెలీ–కన్సల్టేషన్ సర్వీసులు మొదలైనవి ఈ రైడర్‌తో పొందవచ్చని కంపెనీ ఎండీ తపన్ సింఘెల్ తెలిపారు. 50 ఏళ్లు పైబడి, కంపెనీ అందించే బేస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్న వారు ఈ రైడర్‌ను ఎంచుకోవచ్చు. -
ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ శుభవార్త చెప్పింది. ఇకపై లబ్ధిదారులు బ్యాంకును సందర్శించే అవసరం లేకుండా కొత్త సర్వీసుల్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా పెన్షన్ స్లిప్‌ను లబ్ధి దారుల వాట్సాప్‌కు పంపే సర్వీసును ప్రారంభించినట్లు తెలిపింది. మొబైల్ నంబరు నుంచి 9022690226కి ‘హాయ్’ అని వాట్సాప్ మెసేజ్ పంపాలి. అలా పంపిన యూజర్లకు పెన్షన్ స్లిప్ తో పాటు అకౌంట్లకు సంబంధించిన మినిస్టేట్మెంట్,బ్యాలెన్స్ ఎంక్వైరీ సమాచారం పొందవచ్చు. Now get your pension slip over WhatsApp! Avail hassle-free service at your comfort. Send a "Hi" on +91 9022690226 over WhatsApp to avail the service. #SBI #AmritMahotsav #WhatsAppBanking #PensionSlip pic.twitter.com/rGgXMTup32 — State Bank of India (@TheOfficialSBI) November 17, 2022 ఇందుకోసం వినియోగదారులు వారి బ్యాంక్ అకౌంట్‌కు జత చేసిన ఫోన్ నెంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి.ఆ మొబైల్ నంబర్ నుంచి WAREG అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ అకౌంటర్ నంబర్‌ను టైప్ చేసి 72089 33148 నంబర్‌కు మెసేజ్ చేస్తే సరిపోతుంది. -
63 ఏళ్ల వయసులో 6,000 కిలో మీటర్ల సైక్లింగ్
ఆయన వయసు 63 సంవత్సరాలు. జెట్ స్పీడ్‌తో సైకిల్ తొక్కుతూ రయ్ రయ్ అంటూ దూసుకెళ్తున్నారు. తొక్కుతున్న సైకిల్ స్పీడ్ చూస్తే 25 ఏళ్ల వయసు ఉన్న యువకుడు అనుకుంటారు. తన ఫేస్‌కు ఉన్న మాస్క్ తీస్తే కానీ తెలియదు ఆయన 60 ఏళ్ళకి పైబడిన వ్యక్తి అని. ఆయనే హైదరాబాద్‌కు చెందిన మేజర్ జనరల్ డాక్టర్ ఆలపాటి వెంకటకృష్ణ (ఏవీకే) మోహన్. సోమవారం హైదరాబాద్ నుంచి సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌కు సైక్లింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా సాక్షి పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే... సాక్షి, సిద్దిపేట: మా నాన్న దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తించేవారు. కాకినాడలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. 1984లో సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పిటల్లో డాక్టర్‌గా జాబ్ వచ్చింది. 37 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పుణేలో మెడికల్ హెడ్‌గా మేజర్ జనరల్‌గా ఉద్యోగ విరమణ తీసుకున్నాను. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కౌకూర్‌లో నివాసం ఉంటున్నాను. నా కూతురు ప్రసన్న డెంటల్ స్పెషలిస్ట్ గౌహతిలో ప్రాక్టీస్ చేస్తోంది. పర్వతారోహణ...బైకింగ్: 1991లో ఇటాలియన్లతో కలిసి మౌంట్ సతోపంత్‌కు పర్వతారోహణ యాత్ర చేశా. 2000 సంవత్సరం ప్రారంభంలో కాంగోలోని మౌంట్ నైరాగాంగోలో ప్రత్యక్ష అగ్నిపర్వతం అధిరోహించిన ఆర్మీ బ్రిగేడ్‌లో మొదటి వ్యక్తి నేనే. ఈశాన్యంలోని మొత్తం ఎనిమిది రాష్ట్రాలల్లో బైకింగ్ చేసుకుంటూ తిరిగి వచ్చాను. 2019లో దే«శంలోని మూడు కార్నర్లు తూర్పు, పడమర దక్షణంలో 11,500 కిలో మీటర్లు మోటార్ బైకింగ్ చేశాను. సైక్లింగ్ అంటే ఇష్టంతో: నాకు చిన్నప్పటి నుంచి సైక్లింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. డిసెంబర్ 2014లో చెన్నైకి బదిలీపై వచ్చాను. అప్పటికే చెన్నై నగరంలో ప్రసిద్ధ సైక్లింగ్ గ్రూప్ అయిన చెన్నై జాయ్ రైడర్జ్ ఉంది. అందులో చేరాను. చెన్నై నుంచి విజయవాడ , 2015లో కర్ణాటక, కేరళ , తమిళనాడులో 900 కి.మీ, టూర్ ఆఫ్ నీలగిరీస్ సైక్లింగ్ పర్యటన చేశాను. 2016లో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేశాను. జలశక్తి మిషన్ కింద 2019లో కచ్(గుజరాత్) నుంచి గౌహతి(అస్సాం) వరకు 3,200 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాను. ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ ఈ నెల 20వ తేదీ నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ సైక్లింగ్ చేయనున్నాను. 6 వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. ఔరంగాబాద్‌లో ప్రారంభమై జార్ఖండ్, వెస్ట్‌బెంగాల్, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ మీదుగా మళ్లీ ఔరంగాబాద్‌కు చేరుకుంటాను. ఇలా నెల రోజుల పాటు సైక్లింగ్ చేస్తాను. ఫిట్నెస్ ఔత్సాహికులకు సలహాలు, మెరుగైన జీవనం వైపు అడుగులు వేసేందుకు ఇతరులకు ఆదర్శంగా ఉండాలనేదే ఆలోచన. (చదవండి: గిన్నిస్ రికార్డు...ఒక్క నిమిషంలో 1,140!) -
88వ పెళ్లికి సిద్ధమవుతున్న వృద్ధుడు...మరోసారి మాజీ భార్యతో
పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయమవుతాయి అంటారు. అది ఎంత వరకు నిజమో తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లు నిలబడటం అత్యంత కష్టంగా ఉంది. అలాంటి స్థితుల్లో ఇక్కడొక వ్యక్తి ఒకటి రెండు కాదు ఏకంగా 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే...ఇండోనేషియాలోని వెస్ట్ జావాలోని మజలెంగ్కాకు చెందిన 61 ఏళ్ల ఖాన్ అనే వృద్ధుడు 88వ పెళ్లికి సద్ధమవుతున్నాడు. అది కూడా తన మాజీ భార్యనే వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు ఆయన సుమారు 87 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఖాన్ ఇలా చాలా సార్లు పెళ్లిళ్లు చేసుకున్నందు వల్ల ఆయన్ని ప్లేబాయ్ కింగ్ అని పిలుస్తుంటారు. ఆయన ఒక సామాన్య రైతు. అతను 14 ఏళ్ల వయసులో తొలిసారిగా వివాహం చేసుకున్నాడు. ఐతే ఖాన్ మొదటి భార్య అతని కంటే రెండేళ్లు పెద్దదని, తన పేదరికం గురించి చెప్పకపోవడంతో కేవలం రెండేళ్లలోనే విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని చెబుతున్నాడు. ఈ సంఘటన తర్వాత తనకు చాలా కోపం వచ్చిందని అప్పుడే చాలా మంది మహిళలు తనతో ప్రేమలో పడేలా చేసుకునే తెలివతేటలు సంపాదించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తాను మహిళలకు ఇబ్బంది కలిగించేవి, చేయనని, వారి భావోద్వేగాలతో కూడా ఆడుకోననని అందువల్లే చాలా మంది తన ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను పెళ్లి చేసుకోబుతున్న తన మాజీ భార్య తన నుంచి విడిపోయి చాలా కాలం అయ్యిందని అయినప్పటికీ తనను ఇంకా ప్రేమిస్తూనే ఉందని చెబుతున్నాడు. అలాగే తన కోసం తిరిగి వచ్చే తన మాజీ ప్రేయసులను తిరస్కరించలేనని చెప్పాడు. ఐతే 87 పెళ్లళ్లు చేసుకున్న ఖాన్ తనకు ఎంతమంది పిల్లలున్నారనే దాని గురించి మాత్రం వెల్లడించలేదు. (చదవండి: మాకు సరైన నాయకుడే లేడంటూ 100 ఏళ్ల వ్యక్తి పార్లమెంట్ బరిలోకి) -
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ బంపరాఫర్
సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ బంపరాఫర్ ఇచ్చింది. ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీం ఎస్బీఐ వీకేర్ గడువును మార్చి 31,2023 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఈ స్కీమ్ పథకంలో చేసిన డిపాజిట్లకు అదనపు వడ్డీ లభిస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ ఎఫ్డి స్కీమ్ ఎస్బీఐ వీకేర్ ఎఫ్‌డిలో పెట్టుబడి పెట్టే గడువును మార్చి 31, 2023 వరకు పొడిగించింది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం..సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక “ఎస్బీఐ వీకేర్” డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టబడింది. ఈ స్కీమ్‌లో అర్హత పొందిన సీనియర్ సిటిజన్లు 30 బేసిస్ పాయింట్లు అదనంగా పొందవచ్చు. అంటే సాధారణ ప్రజలకంటే 50 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ ఎస్బీఐ సీనియర్ సిటిజన్లకు లభిస్తుంది. సిటిజన్లకు సాధారణ ప్రజలకు వర్తించే రేటు కంటే 80 బేసిస్ పాయింట్లు అదనపు వడ్డీ ఈ పథకం ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం ఎస్బీఐ సాధారణ ప్రజలకు 5ఏళ్ల ఎఫ్డీకి 5.65శాతం వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుండగా...సీనియర్ సిటిజన్ ప్రత్యేక ఎఫ్డీ పథకంలో చేసిన డిపాజిట్లకు 6.45శాతం వడ్డీ లభిస్తుంది. డిపాజిట్ వ్యవధి : కనిష్టంగా - 5 సంవత్సరాలు. గరిష్టంగా - 10 సంవత్సరాలు వడ్డీ చెల్లింపు : టర్మ్ డిపాజిట్ - నెలవారీ/ త్రైమాసిక వ్యవధిలో ప్రత్యేక టర్మ్ డిపాజిట్ : మెచ్యూరిటీ వడ్డీపై టీడీఎస్ డిడక్ట్ చేసి కస్టమర్ ఖాతాకు జమ చేయబడుతుంది రుణ సౌకర్యం సీనియర్ సిటిజన్లకు పలు బ్యాంకులు ప్రత్యేక ఎఫ్డి పథకాల్ని ఇతర బ్యాంకులు సైతం అందిస్తున్నాయి. వీటిలో ఐసిఐసిఐ బ్యాంక్ , హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో పాటు ఇతర బ్యాంకులున్నాయి. -
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇకపై ఆధార్ కార్డు డిజిటల్ అయినా ఓకే!
సాక్షి, అమరావతి: సీనియర్ సిటిజన్లకు బస్ టికెట్లలో రాయితీ కోసం డిజిటల్ ఆధార్ కార్డును కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ నిర్ణయించింది. సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ టికెట్ల ధరల్లో 25 శాతం రాయితీ ఇస్తోంది. అందుకోసం ఆధార్ కార్డు, సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్ట్, రేషన్‌కార్డులను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తున్నారు. ఇక నుంచి డిజిటల్ ఆధార్‌ను కూడా గుర్తింపు కార్డుగా పరిగణించాలని ఆర్టీసీ ఈడీ కేఎస్ బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సీనియర్ సిటిజన్స్ కోసం అదిరిపోయే స్కీమ్, రిస్క్ లేకుండా అధిక వడ్డీతో..
సీనియర్ సిటిజన్స్ కోసం తక్కువ రిస్క్, అధికరాబడిని అందించే రకరకాల స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో పోస్టాఫీస్ అందించే ఈ స్కీమ్ ప్రత్యేకం. ఎందుకంటే మిగిలిన స్కీమ్స్‌తో పోలిస్తే ఈ పథకంలో రాబడి ఎక్కువగా ఉందని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు. ఇప్పుడు మనం ఆ స్కీమ్ గురించి, ఆ స్కీమ్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పోస్టాఫీస్‌లో ఈ స్కీమ్‌ను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్) అని పిలుస్తారు. 60 ఏళ్లు పైబడిన వ్యక్తులకు తక్కువ రిస్క్‌తో పోస్టల్ స్కీమ్ అందిస్తుంది. అధిక వడ్డీ రేటు, ఆదాయపు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ పథకాన్ని పోస్ట్ ఆఫీస్‌లో లేదా కొన్ని బ్యాంకుల్లో కూడా తెరవవచ్చు. ముఖ్యంగా పథకంలో డబ్బులు పొదుపు చేయాలంటే ఈ ఖాతా తెరిచే సయమానికి సంబంధిత ఖాతాదారుని వయస్సు 60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగి ఉండాలి. అయితే కొన్ని వర్గాలకు చెందిన వ్యక్తులకు వయో సడలింపు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖాతాలో సీనియర్ సిటిజన్లు రూ.15 లక్షల వరకు డిపాజిట్లపై త్రైమాసిక వడ్డీని పొందవచ్చు. ఎవరు అర్హులు పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంక్‌లో సీనియర్ సిటిజన్ లైన అతని/ఆమె విడివిడిగా లేదంటే సంయుక్తంగా ఎస్సీఎస్ఎస్ ఖాతాను ఓపెన్ చేయొచ్చు. వడ్డీ రేటు ప్రస్తుతం ఎస్సీఎస్ఎస్ వడ్డీరేటు 7.4శాతం ఉండగా కేంద్రం త్రైమాసిక ప్రాతిపదికన ఇతర పథకాలతోపాటు ఈస్కీమ్ వడ్డీ రేటును సవరిస్తుందనే విషయాల్ని గుర్తించుకోవాలి. ఇటీవల కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ స్కీమ్ వడ్డీ రేటు 2022 (నూతన సంవత్సరం 2022 మొదటి త్రైమాసికంలో) మారలేదు. ఆదాయపు పన్ను మినహాయింపు ఎస్సీఎస్ఎస్ ఖాతాలో చేసిన పెట్టుబడి ఆదాయపు పన్ను సెక్షన్ 80C కింద మినహాయింపు పొందచవ్చు. అధికారిక పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ నుండి వచ్చిన అప్డేట్ల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని ఎస్సీఎస్ఎస్ ఖాతాలలో మొత్తం వడ్డీ రూ. 50,000 కంటే ఎక్కువ ఉంటే వడ్డీపై పన్ను విధించబడుతుంది. మెచ్యూరిటీ పీరియడ్ ఎస్సీఎస్ఎస్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఐదు సంవత్సరాల కాలవ్యవధికి వడ్డీ లభిస్తుందని డిపాజిటర్లు తప్పనిసరిగా గమనించాలి. డిపాజిటర్ ఖాతా మెచ్యూరిటీ అయిన ఒక సంవత్సరంలోపు, మూడు సంవత్సరాలకు ఒకసారి పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిపాజిట్ పరిమితి సీనియర్ సిటిజన్లు గరిష్టంగా రూ.15 లక్షల వరకు ఎస్సీఎస్ఎస్ ఖాతాలో పెట్టుబడి పెట్టవచ్చు. ఎస్సీఎస్ఎస్ ఖాతాను తెరవడానికి అవసరమైన కనీస మొత్తం రూ.1000గా ఉంది. చదవండి: ఎల్ఐసీకి భారీ షాక్, తగ్గుతున్న ఆదాయం -
హైదరాబాద్‌లో దారుణం.. 72 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి.. ఆపై
సాక్షి హైదరాబాద్: 72 ఏళ్ల వృద్ధుడు 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుజాత లా పబ్లిషింగ్ హౌస్ రచయిత అయిన గాదె వీరారెడ్డి (72) బర్కత్‌పురలోని గోకుల్ధామ్ అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నాడు. 2010లో అతడి ఇంట్లో బాధితురాలి తల్లి పని మనిషిగా పని చేసేది. 2017లో ఆమెను బడంగ్‌పేటలోని తన ఓపెన్ ప్లాట్‌కు వాచ్‌మెన్‌గా నియమించుకున్నాడు. ఆ తర్వాత బాధితురాలి తల్లి, ఆమె మేనమామ ఇద్దరు కలిసి మీర్‌పేట పీఎస్ పరిధిలో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వారు అక్కడే ఉండేవాళ్లు. ఇంటి పనులు మానేసి జీవనోపాధి కోసం టైలరింగ్ చేస్తుండేది. ఈ నేపథ్యంలో నిందితుడు వీరారెడ్డి తన న్యాయ పుస్తకాలను భద్రపరిచేందుకు సంచులు కావాలన్న నెపంతో తరచూ బాధితురాలి ఇంటికి వెళ్తుండేవాడు. గతేడాది డిసెంబర్లో బాధితురాలి తల్లి కుమార్తెను ఇంట్లో వదిలి సొంతూరికి వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేని విషయం తెలుసుకున్న వీరారెడ్డి అక్రమంగా చొరబడి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఊరి నుంచి తిరిగొచ్చిన తల్లికి బాధితురాలు విషయం చెప్పడంతో ఆమె మీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు వీరారెడ్డి కేసు ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో మీ పేర్లు రాసి ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలి తల్లిని బెదిరించాడు. తనను వేధిస్తున్నారని పేర్కొంటూ నాన్–జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లపై వివరాలు రాసి బాధితురాలి తల్లి, ఆమె మేనమామకు వాట్సాప్ ద్వారా పంపించాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అతడి నుంచి రెండు నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లు, స్కూటర్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. -
విమానంలో వృద్దుడిపై మహిళ అమానుష దాడి
ఇటీవల కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది మాస్క్ ధరించకుండా బయటకు వస్తే ఊరుకోవడం లేదు. ఆఖరికి తమ స్నేహితులను, బంధువులను సైతం మాస్క్ ధరించకపోతే ఊరుకోవటం లేదు. ఎవరికివారుగా స్వచ్ఛందంగా ఇలా సురకక్షితంగా ఉండటం మంచిదే గానీ అది సృతి మించితే ఇతరులకు, మన తోటివారికి కూడా ఇబ్బందే. అచ్చం అలానే ఒక మహిళ తింటున్నప్పుడూ మాస్ ఎందుకు ధరించవంటూ ఒక వృద్దుడిపై దాడి చేసింది. (చదవండి: నా భార్య, బిడ్డను వెతికి తీసుకువచ్చిన వారికి రూ.5000 బహుమతి!!) అసలు విషయంలోకెళ్లితే...డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ మాస్క్ ధరించకుండా భోజనం చేస్తున్న వృద్దుడిపై దాడి చేసింది. పైగా చాలా అమానుషంగా తిట్టడం వంటివి చేసింది. అయితే నిజానికి ఆమె మాస్క్ ధరించకుండా వృద్దుడుని తిట్టడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది అక్కడ ఉన్నవాళ్లందరికీ. పైగా వాళ్లంతా కూర్చొమని వారిస్తున్న వినకుండా ఆ వృద్దుడిని కొడుతుంది. దీంతో ఆ విమాన సిబ్బంది ఆమెను అడ్డుకుని అక్కడ నుంచి తీసుకువెళ్తారు. ఆ తర్వాత ఆ వృద్దుడు ఆమెను నువ్వు జైలుకు వెళ్తావు అంటాడు. ఈమేరకు ఆ విమానం అట్లాంటాలో ల్యాండ్ అయిన వెంటనే అక్కడి పోలీసులు ఆ వృద్దుడిపై దాడి చేసిన మహిళ ప్యాట్రిసియా కార్న్‌వాల్‌గా గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే ఈ సంఘటన తర్వాత విమానయాన సంస్థలు ఇలాంటి వికృత ప్రవర్తనను సహించేది లేదని ప్రకటించడం విశేషం. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!) -
KBR Park: కేబీఆర్ పార్కు టికెట్టు ధర పెంపు
సాక్షి, బంజారాహిల్స్(హైదరాబాద్): బంజారాహిల్స్‌లోని ప్రతిష్టాత్మక కేబీఆర్ పార్కు ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్ ధరలను అటవీశాఖాధికారులు భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జనవరి 1 నుంచి అమలు కానున్న ఈ ప్రవేశ రుసుముతో పాటు వార్షిక పాస్‌లను ఆన్లైన్లో రెన్యూవల్ చేసుకోవాలని నోటీసును అతికించారు. వార్షిక ఎంట్రీపాస్(జనరల్) 2021లో రూ. 2250 ఉండగా 2022 నుంచి రూ. 2500 చేశారు. అలాగే సీనియర్ సిటిజన్ వార్షిక ఎంట్రీ ఫీజు పాస్ కోసం గతంలో రూ. 1500 ఉండగా వచ్చే ఏడాది నుంచి రూ. 1700 వసూలు చేయనున్నారు.ఇప్పటి వరకు నెలవారి ఎంట్రీఫీజు రూ. 600 మాత్రమే ఉండగా వచ్చే నెల 1వ తేదీ నుంచి రూ. 700 ఉండనుంది. అలాగే రోజువారి ప్రవేశ రుసుము పెద్దలకు గతంలో రూ. 35 ఉండగా ఇప్పుడది రూ. 40కి చేరింది. పిల్లలకు మొన్నటి వరకు ఎంట్రీఫీజు రూ. 20 ఉండగా ఇప్పుడది రూ. 25కు చేరింది. అలాగే పార్కు వేళలను కూడా కుదించారు. ఉదయం 5 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మాత్రమే వాకింగ్, సందర్శకులకు అనుమతిస్తారు. చదవండి: భార్య, ప్రియుడి హత్య కేసు: భర్త అరెస్ట్ -
4 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు భారంగా రైల్వేశాఖ నిర్ణయం!
అవసాన దశలో ఇతరులపై ఆధారపడి జీవించే వారికి శాపంగా మారింది రైల్వేశాఖ నిర్ణయం. అరకొర ఆదాయంతోనే పొదుపు చేసుకున్న సొమ్ముతోనో ప్రయాణం చేసే సీనియర్ సిటిజన్స్‌కి రైల్వేశాఖ నిర్లక్ష్య వైఖరి భారంగా మారింది. కరోనా సంక్షోభం సమయంలో ఎత్తి వేసిన రాయితీలు నేటికి పునరుద్ధరించకపోవడంతో తమకు ఇబ్బందిగా మారిందంటున్నారు సీనియర్ సిటిజన్లు. రాయితీలకు కోత సామాజిక బాధ్యతగా రైల్వేశాఖ సమాజంలోని సీనియర్ సిటిజన్లు, ఉద్యోగార్థులు, రోగులు, జర్నలిస్టులు, ఆర్మీ తదితర వర్గాలకు రైలు ప్రయాణం సందర్భంగా రాయితీలు కల్పిస్తోంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు సంబంధించి 58 ఏళ్లు దాటిన స్త్రీలకు 50 శాతం 60 ఏళ్లు దాటిన పురుషులకు 40 శాతం రాయితీ ఉంది. అయితే కరోనా కారణంగా దేశవ్యాప్తంగా రైళ్ల సర్వీసులను 2020 మార్చి 24 నుంచి రద్దు చేశారు. ఆ తర్వాత మూడు నెలల తర్వాత రైళ్లు క్రమంగా ప్రారంభం అయ్యాయి. అయితే రాయితీ మాత్రం పునరుద్ధరించలేదు. అధిక ఛార్జీలు రైలు సర్వీసులు ప్రారంభమైనా రాయితీల విషయంలో రైల్వేశాఖ మౌనముద్ర వహించింది. దీంతో గత ఏడాది కాలంగా అన్ని రైళ్లలో ప్రయాణిస్తున్న సీనియర్ సిటిజన్లు టిక్కెట్టు ఛార్జీలు పూర్తిగా చెల్లించాల్సి వస్తోంది. పైగా ప్రస్తుతం నడుస్తున్నవి ప్రత్యేక రైళ్లు కావడంతో అన్నింటా అధికంగానే సొమ్ములు చెల్లించాల్సి వస్తోంది. ఆదాయం తగ్గిపోయి, అనారోగ్యాలకు చేరువైన సీనియర్ సిటిజన్లకు రైలు ప్రయాణాలు భారంగా మారాయి. ముఖ్యంగా హెల్త్ చెకప్‌ల కోసం క్రమం తప్పకుండా ప్రయాణాలు చేసే వారు మరీ ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు కోట్ల మంది లాక్డౌన్ తర్వాత స్పెషల్ ట్యాగ్‌తో రైల్వే సర్వీసులు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఎంత మంది సీనియర్ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించారనే వివరాలు కావాలంటూ మధ్యప్రదేశ్‌కి చెందిన చంద్రశేఖర్ గౌర్ అనే ఆర్టీఐ కార్యకర్త దరఖాస్తు సమర్పించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. 2021 సెప్టెంబరు 31 నాటికే దేశవ్యాప్తంగా రిజర్వ్డ్ రైళ్లలోనే 3,78,50,668 మంది ప్రయాణం చేసినట్టు రైల్వే రికార్డులు వెల్లడించాయి. ఈ రోజు వరకయితే ఈ సంఖ్య నాలుగు కోట్లకు తక్కువగా ఉండదు. మంత్రి కేటీఆర్ ట్వీట్ ఆర్టీఐ ద్వారా సమాచారం వెల్లడి కావడంతో ఒక్కసారిగా రైల్వేశాఖపై విమర్శలు పెరిగాయి. కరోనా వంటి సంక్షోభం సమయంలో ఓ వైపు ఆదాయం తగ్గిపోయి అనేక కుటుంబాలు ఇబ్బంది పడుతుంటే రాయితీలకు కోత పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సమాజానికి సర్వం ధారపోసిన వృద్ధుల పట్ల నిర్థయగా వ్యవహరించడం సరికాదంటూ సుతిమొత్తగా హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సైతం రైల్వేశాఖ తీరును తప్పు పట్టారు. రాయితీలు పునరుద్ధరించాలంటూ రైల్వేమంత్రికి విజ్ఞప్తి చేశారు. VerY unfortunate situation Railway Minister @AshwiniVaishnaw Ji Please review the decision in the interest of crores of senior citizens who deserve our assistance and respect https://t.co/cNvbyHx0oH — KTR (@KTRTRS) November 23, 2021 చదవండి: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..