తుపాకులతో సెటిల్మెంట్లు.. అరెస్ట్
సిరిసిల్ల: మారణాయుధాలతో సెటిల్మెంట్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను సిరిసిల్ల పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తుపాకులు, కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ సుధాకర్ తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో సెటిల్మెంట్లు చేస్తున్న పాత నేరస్తులు నాగార్జున, తిరుపతిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామన్నారు. వీరిపై గతంలో అనేక కేసులు ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు.