special edition
-
రూ.10.23 లక్షలకే కొత్త ఫ్రెంచ్ బ్రాండ్ కారు
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ భారతదేశంలో 'ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్' కారును లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్లస్, మ్యాక్స్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధరలు రూ. 10.23 లక్షల నుంచి రూ. 14.79 లక్షల (ఎక్స్ షోరూమ్, ఇండియా) మధ్య ఉన్నాయి.సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ ఎక్స్‌ప్లోరర్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. అయితే ఇది దాని స్టాండర్డ్ వెర్షన్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఇందులో ఎయిర్‌క్రాస్ హుడ్ గార్నిష్, బాడీ డీకాల్స్ వంటివి ఉన్నాయి. లోపల వెనుక సీట్లు ఎంటర్టైన్మెంట్ కోసం డిస్ప్లే కూడా ఉంటుంది. డాష్ కెమెరా, ఫుట్‌వెల్ లైటింగ్, ఇల్యూమినేటెడ్ సిల్ ప్లేట్లు కూడా ఇందులో గమనించవచ్చు.ఇదీ చదవండి: లక్షల ఖరీదైన బైకులు: మరింత కొత్తగా..డిజైన్, ఫీచర్స్ పరంగా అప్డేట్స్ పొందిన ఈ కారు 82 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేసే 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్, 110 హార్స్ పవర్ అందించే 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇంజిన్స్ వరుసగా 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను పొందుతాయి. -
పండక్కి 13 స్పెషల్ ఎడిషన్స్.. మార్కెట్లో కొత్త కార్ల జోరు
ఈ పండుగ సీజన్లో ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నంలో కార్ల తయారీ సంస్థలు స్పెషల్ ఎడిషన్స్ లాంచ్ చేశాయి. ఈ జాబితాలో మారుతీ సుజుకి, టయోటా, మహీంద్రా, జీప్, రెనాల్ట్ మొదలైన కంపెనీలు ఉన్నాయి. ఈ కథనంలో ఇటీవల దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన స్పెషల్స్ ఎడిషన్స్ ఏవనే వివరాలు తెలుసుకుందాం.స్పెషల్ ఎడిషన్స్ ➺మారుతి వ్యాగన్ ఆర్ వాల్ట్జ్ ఎడిషన్➺మారుతి స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్➺మారుతి గ్రాండ్ విటారా డొమినియన్ ఎడిషన్➺మారుతి బాలెనో రీగల్ ఎడిషన్➺టయోటా హైరైడర్ ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా గ్లాంజా ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా రూమియన్ ఫెస్టివల్ ఎడిషన్➺టయోటా టైసర్ ఫెస్టివల్ ఎడిషన్➺మహీంద్రా స్కార్పియో క్లాసిక్ బాస్ ఎడిషన్➺జీప్ కంపాస్ యానివెర్సరీ ఎడిషన్➺రెనాల్ట్ నైట్ అండ్ డే ఎడిషన్➺ట్రైబర్ నైట్ అండ్ డే ఎడిషన్➺క్విడ్ నైట్ అండ్ డే ఎడిషన్దేశీయ మార్కెట్లో లాంచ్ అయిన ఈ స్పెషల్స్ ఎడిషన్స్ కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ మాత్రమే పొందినట్లు సమాచారం. వీటికి అదనంగా యాక్ససరీస్ ఫ్యాక్స్ కూడా ఎంపిక చేసుకోవచ్చు. కాబట్టి ధరలు స్టాండర్డ్ మోడల్స్ కంటే కొంత ఎక్కువగా ఉంటాయి. ధరలు కొనుగోలుదారు ఎంచుకునే యాక్ససరీస్ ప్యాక్ మీద ఆధారపడి ఉంటాయి. ఇందులో కొన్ని కార్లు ఈ నెల చివర వరకు మాత్రమే విక్రయానికి ఉండనున్నట్లు సమాచారం. కాబట్టి ఈ కార్లకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం మీ సమీపంలోనే కంపెనీ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
సరికొత్త ధోని ఎడిషన్.. కేవలం 100 మందికి మాత్రమే
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన సిట్రోయెన్ కంపెనీ ఇటీవల 'సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్' లాంచ్ చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.11.82 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 5 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలతో వస్తుంది. ఈ కారును కంపెనీ 100 మందికి మాత్రమే పరిమితం చేసింది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ధోని పేరు, 7 నెంబర్ వంటివి ఉండటం చూడవచ్చు.సీ3 ఎయిర్‌క్రాస్ ధోనీ ఎడిషన్.. కుషన్ పిల్లో, సీట్ బెల్ట్ కుషన్లు, ఇల్యూమినేటెడ్ డోర్ సిల్ ప్లేట్లు, ఫ్రంట్ డాష్ కెమెరా వంటివి పొందుతుంది. ఈ కారును కొనుగోలు చేసేవారు ధోని సంతకం చేసిన 'గ్లౌస్' పొందవచ్చు. ఇది 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ద్వారా 110 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.The C3 Aircross 7 - Dhoni Edition comes with a surprise nobody saw coming. This is your cue to walk into the Citroen showroom to test drive the all new C3 Aircross 7 - Dhoni Edition today! What are you waiting for? #CitroenTeamDhoni #DoWhatMatters pic.twitter.com/ImLotpgvUb— Citroën India (@CitroenIndia) June 18, 2024 -
రోల్స్ రాయిస్ కొత్త ఎడిషన్ - కేవలం 25 మందికి మాత్రమే!
గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఖరీదైన కార్లను తయారు చేసే 'రోల్స్ రాయిస్' (Rolls Royce) ఇటీవల ఘోస్ట్ సెలూన్ అనే కొత్త లిమిటెడ్ ఎడిషన్ కారుని లాంచ్ చేసింది. దీనినే కంపెనీ 'బ్లాక్ బ్యాడ్జ్ ఎక్లీప్సిస్' అని పిలుస్తోంది. ఈ కొత్త ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కొత్త రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ ఎక్లీప్సిస్ ఎడిషన్ కేవలం 25 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అద్భుతమైన డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగిన ఈ లగ్జరీ కారు ఇంటిగ్రేటెడ్ పౌడర్ కాపర్ పిగ్మెంట్‌తో కూడిన కస్టమ్ లిరికల్ కాపర్ ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. వైట్ కలర్ అల్లాయ్ వీల్స్, కలర్‌ఫుల్ బ్రేక్ కాలిపర్లు కలిగిన ఈ కారు లేటెస్ట్ ఇంటీరియర్ డిజైన్ అండ్ ఫీచర్స్ పొందుతుంది. లోపల స్టార్‌లైట్ హెడ్‌లైనర్‌ను ప్రత్యేకంగా క్రియేట్ చేశారు. ఇది సూర్యగ్రహణాన్ని కాపీ చేసే కస్టమ్ యానిమేషన్‌ను కలిగి ఉంది. డాష్‌బోర్డ్ టైమ్పీస్లో 0.5 క్యారెట్ డైమండ్ కూడా ఉంది. ఇదీ చదవండి: సాఫ్ట్వేర్ జాబ్.. రూ.3 కోట్లు వేతనం - అయినా వదిలేశాడు! కారణం తెలిస్తే.. రోల్స్ రాయిస్ బ్లాక్ బ్యాడ్జ్ ఘోస్ట్ 6.7 లీటర్ ట్విన్ టర్బో వీ12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 1600 ఆర్పీఎమ్ వద్ద 563 హార్స్ పవర్, 850 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. దీని ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న రోల్స్ రాయిస్ ఘోస్ట్ (రూ. 6.95 నుంచి రూ. 7.95 కోట్లు) కంటే ఎక్కువ ఉంటుందని అంచనా. -
ఫైబర్ నెట్ స్కామ్ లో సంచలనం...100 కోట్లు దారి మళ్లించి దొరికిపోయారు
-
మళ్లీ మొదలైంది..గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్
-
చిన్న లాజిక్ మిస్సయిన చంద్రబాబు నీకు అర్థమౌతోందా!
-
ఆడి క్యూ8 స్పెషల్ ఎడిషన్, ధర చూస్తే..!
Audi Q8 special edition: పండుగల సీజన్ సందర్భంగా లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి ఇండియా స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. తాజాగా క్యూ8లో స్పెషల్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 1,18,46,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. మైథోస్ బ్లాక్, గ్లేషియర్ వైట్, డేటోనా గ్రే రంగుల్లో ఇవి లభిస్తాయి. పరిమిత సంఖ్యలోనే ఈ ఎస్‌యూవీల విక్రయాలు ఉంటాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. (10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ) 3.0-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ మోటార్‌ను పొందుతుంది ఇది కేవలం 5.9 సెకన్లలో సున్నా నుండి 100kmph వరకు వేగవంతం చేస్తుంది మరియు గరిష్టంగా 250kmph వేగాన్ని అందుకోగలదు. ఎక్ట్సీరియర్‌లో, S-లైన్ ఎక్స్టీరియర్ ప్యాకేజీ , బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీతో Q8 స్పెషల్ ఎడిషన్‌ను రూపొందించింది. క్యాబిన్ 'ఏరో-అకౌస్టిక్స్'ని కలిగి ఉన్న అధిక-నాణ్యత క్యాబిన్‌తో, 4 జోన్ ఏసీ, ప్రీమియం సౌండ్ సిస్టమ్, 21 అంగుళాల అలాయ్ వీల్స్, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఇంటీరియర్స్ మొదలైన ప్రత్యేకతలు ఈ ఎస్‌యూవీలో ఉన్నట్లు ధిల్లాన్ తెలిపారు. తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఇది విశిష్టమైన ఎస్యూవీ అని ఆయన పేర్కొన్నారు. -
23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్, ధర ఎంతంటే?
Hyundai Venue Knight Edition హ్యుందాయ్ తన కస్టమర్ల కోసం స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. 23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ దరను రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. టాప్ వేరియంట్ ఎడిషన్ ధర రూ. 13.48 లక్షలుగా ఉంటుంది. స్పెషల్ ఎడిషన్ SUV S(O) , SX వేరియంట్లకు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 1.2 l కప్పా పెట్రోల్ ఇంజన్ అమర్చింది. SX(O) వేరియంట్ కోసం 6MT, 7DCTతో 1.0 l T-GDi పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. వెన్యూ నైట్ ఎడిషన్ 4 మోనోటోన్ , 1 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, ఫియరీ రెడ్ అండ్ ఫియరీ రెడ్ విత్ అబిస్ బ్లాక్ కలర్స్‌లో కొత్త వెన్యూ నైట్ ఎడిషన్ లభ్యం. హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ 23 ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా బ్లాక్ పెయింటెడ్ ఫ్రంట్ గ్రిల్, హ్యుందాయ్ లోగో, బ్రాస్ కలర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ ఇన్సర్ట్లు, ఫ్రంట్ వీల్స్‌పై బ్రాంచ్ కలర్ ఇన్సర్ట్లు, బ్రాంచ్ రూఫ్ రైల్ ఇన్సర్ట్లు, డార్క్ క్రోమ్ రియర్ హ్యుందాయ్ లోగో,వెన్యూ ఎంబ్లం, నైట్ ఎంబ్లం, బ్లాక్ ఉన్నాయి. పెయింట్ చేయబడిన రూఫ్ రెయిల్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, ORVMలు, రెడ్ కలర్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్లు, బ్లాక్ పెయింటెడ్ అల్లాయ్ వీల్/వీల్ కవర్, బ్లాక్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్లతో పాటు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రధానంగా ఉన్నాయి. వెన్యూ నైట్ ఎడిషన్ 82 bhp 1.2-లీటర్ పెట్రోల్ ఇంజీన్, 118 bhp 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ రెండింటితో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వెన్యూ , వెన్యూ ఎన్-లైన్ లా కాకుండా, టర్బో-పెట్రోల్ యూనిట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కొత్త ఎడిషన్ తీసుకొచ్చింది. స్టాండర్డ్ వేరియంట్లు iMTని పొందుతాయి. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఇంటీరియర్ల విషయానికి వస్తే, హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ బ్రాస్ కలర్ ఇన్సర్ట్లతో బ్లాక్ ఇంటీరియర్, బ్రాస్ కలర్ హైలైట్లతో ప్రత్యేకమైన బ్లాక్ సీట్ అప్హోల్స్టరీ, డ్యుయల్ కెమెరాతో డాష్‌క్యామ్, స్పోర్టీ మెటల్ పెడల్స్, ECM IRVM , 3D డిజైనర్ మ్యాట్లను పొందుపర్చింది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
పాప్ స్టార్ బీబర్ స్పెషల్ స్కూటర్.. ధర రూ. 6.45 లక్షలు!
ముంబై: వెస్పా స్కూటర్ల తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ తాజాగా జస్టిన్ బీబర్ ఎక్స్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ స్కూటర్ ధర రూ. 6.45 లక్షల నుంచి (ఎక్స్ షోరూమ్). కెనడాకు చెందిన పాప్ స్టార్ జస్టిన్ బీబర్ పేరిట ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్స్‌ను (పది లోపే) ప్రీ–ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఇవి పూర్తిగా అసెంబుల్ చేసిన యూనిట్‌గా దిగుమతి అవుతాయి. 150 సీసీ ఇంజిన్‌తో ఈ లిమిటెడ్ ఎడిషన్ ఉంటుందని పియాజియో వెహికల్స్ సీఎండీ డీగో గ్రాఫీ తెలిపారు. జస్టిన్ బీబర్ రూపొందించిన కొత్త వెస్పా వైట్ కలర్ ఆప్షన్లో మోనోక్రోమ్ స్టైల్ ఫీచర్‌తో వస్తుంది. ఇందులోని శాడిల్, గ్రిప్స్, రిమ్స్ స్పోక్స్ వంటి ఎలిమెంట్స్ అన్నీ వైట్‌లోనే ఉన్నాయి. బ్రాండ్ లోగో, వెహికల్ బాడీపై ఫ్లేమ్స్ కూడా టోన్-ఆన్-టోన్ తెలుపు రంగులో ఉంటాయి. -
ఎంజీ బుల్లి కామెట్ ఈవీస్పెషల్ గేమర్ ఎడిషన్: ధర పెరిగిందా?
MG unveils Comet EV Gamer Edition ఎంజీ మెటార్ ఇండియా తన బుల్లి ఈవీ కామెట్ లో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ‘గేమర్ ఎడిషన్’గా పేరుతో కామెట్ ఈవీ ఆల్-ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఈసీ సెగ్మెంట్లో ఇది కస్టమైజ్ చేసిన ఫస్ట్కారుగా నిలిచింది. గేమర్ ఎడిషన్ ట్రిమ్ గేమర్లు, యువ కొనుగోలుదారులే లక్ష్యంగా స్టీరింగ్ వీల్ కవర్, థీమ్డ్ మేట్స్ లాంటి స్పెషల్ యాక్ససరీస్‌తో ఆకర్ణణీయంగా తీసుకొచ్చింది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?) కామెట్ ఈవీ బేస్ ధరతో పోలిస్తే ఈ ఎడిషన్ ధర రూ. 64,999 ఎక్కువ. రూ. 8.65 లక్షలతో ఎక్స్‌క్లూజివ్ గేమర్ ఎడిషన్ ఎంజీ కామెట్ ఈవీ - పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు కామెట్ 'గేమర్ ఎడిషన్'ను ఆన్లైన్లో లేదా భారతదేశం అంతటా ఎంజీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్ ) బోల్డ్, వైబ్రంట్, డైనమిక్ , టెక్నో వైబ్ ప్రేరణగా ఈ కామెట్ EV ఎడిషన్, గేమింగ్‌లో అడ్రినలిన్ రష్‌ని ఇష్టపడే Gen Z కోసం డార్క్ అంట్ లైట్ తేలికపాటి థీమ్‌లలో డార్క్ క్రోమ్, మెటల్ ఫినిషింగ్‌తో రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ మెటీరియల్‌తో స్పెషల్ఎట్రాక్షన్గా ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈస్తటిక్ అండ్ డిజైన్ ఓరియంటెడ్‌గా, గేమింగ్ స్ట్రీమర్, ఇన్ఫ్లుయెన్సర్ మోర్టల్ (నమన్ మాథుర్) సహకారంతో దీన్ని రూపొందించింది. సైడ్ మౌల్డింగ్‌లు, కార్పెట్ మ్యాట్లు, ఇంటీరియర్ ఇన్సర్ట్లు, బాడీ గ్రాఫిక్స్, స్టీరింగ్ వీల్ కవర్, సీట్ కవర్లు వంటి ప్రత్యేకతలున్నాయి. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) ఇంకా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS +EBD, ఫ్రంట్ & రియర్ 3 pt తోపాటు, సీట్ బెల్ట్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా & సెన్సార్, TPMS (పరోక్ష) , ISOFIX చైల్డ్ సీట్లు లాంటి ఇతర ఫీచర్లున్నాయి. ఎంజీ కామెట్ EV 17.3 KWH Li-ion బ్యాటరీతో 230 కిమీ (క్లెయిమ్) బ్యాటరీ పరిధితో వస్తుంది మరియు దాదాపు 7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) కాగా ఎంజీ మోటార్స కామెట్ ఎలక్ట్రిక్ వాహనం ఏప్రిల్ 2023లో భారతదేశంలో లాంచ్ చేసింది. దేశీయంగా ఇదే కాంపాక్ట్కారుగా పాపులర్ అయింది. పేస్ వేరియంట్ కోసం 7,98,000 నుండి (ఎక్స్-షోరూమ్), రూ. ప్లష్ వేరియంట్ కోసం 9,98,000 (ఎక్స్-షోరూమ్)గా ఉన్న సంగతి తెలిసిందే. -
వెస్పా మిక్కీ మౌస్ ఎడిషన్ వచ్చేస్తోంది - వివరాలు
Vespa Mickey Mouse Edition: భారతదేశంలో వెస్పా స్కూటర్లకున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మహిళల మనసుదోచే ఈ స్కూటర్ ఇప్పుడు కొత్త ఎడిషన్ రూపంలో విడుదల కావడానికి సన్నద్ధమవుతోంది. దీని కోసం వెస్పా డిస్నీతో చేతులు కలిపింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డిస్నీతో చేతులు కలిపిన వెస్పా మిక్కీ మౌస్ అనే స్పెషల్ ఎడిషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ స్కూటర్ మిక్కీ మౌస్ మాదిరిగానే కలర్స్ కలిగి ఉంటుంది. బూట్లను పోలిన పసుపు రంగు వీల్స్, చెవులును తలిపించే మిర్రర్స్, బాడీని గుర్తు చేయడానికి రెడ్ కలర్ ఇక్కడ గమనించవచ్చు. అంతే కాకుండా మిక్కీ మౌస్ సంతకం కూడా ఈ స్కూటర్ మీద ఉండటం గమనార్హం. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు లేదు, కానీ ఇందులో కాస్మొటిక్ డిజైన్స్ మాత్రం గమనించవచ్చు. అదే ఇంజిన్ కలిగి ఉంటుంది కాబట్టి అదే పర్ఫామెన్స్ అందిస్తుంది. కాగా ఈ లేటెస్ట్ ఎడిషన్ ఎప్పుడు మార్కెట్లో విడుదలవుతుంది, దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
నిలకడ లేని వ్యక్తి రాజకీయాలకు పనికొస్తాడా ?
-
నిస్సాన్ మాగ్నైట్ సరికొత్త ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?
Nissan Magnite Geza Special Edition: ఇప్పటికే దేశీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న 'నిస్సాన్ మాగ్నైట్' ఇప్పుడు సరికొత్త స్పెషల్ ఎడిషన్‌లో విడుదలైంది. జపనీస్ టెక్నాలజీతో రూపొందిన ఈ కారు ఇప్పుడు కొత్త అప్డేట్స్ పొందింది. ఈ ఎడిషన్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధర & కలర్ ఆప్షన్స్ భారతదేశంలో విడుదలైన నిస్సాన్ మాగ్నైట్ స్పెషల్ ఎడిషన్ పేరు 'గెజా'. నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 7.39 లక్షలు. కంపెనీ ఈ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఇది ఒనిక్స్ బ్లాక్, సాండ్స్టోన్ బ్రౌన్, స్టార్మ్ వైట్, ఫ్లేర్ గార్నెట్ రెడ్, బ్లేడ్ సిల్వర్ అనే ఐదు కలర్ ఆప్సన్లలో లభిస్తుంది. డిజైన్ & ఫీచర్స్ కొత్త నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ దాదాపు చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగా ఉంటుంది. అయితే ఫీచర్స్ కొన్ని అప్డేట్ పొందాయి. ఇందులోని 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ప్లే వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే ఈ టచ్‌స్క్రీన్ దాని మునుపటి మోడల్ కంటే కూడా కొంత పెద్దదిగా ఉంటుంది. ఇందులో JBL స్పీకర్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: అత్యంత ఖరీదైన మెక్లారెన్ సూపర్‌కార్ - 330 కిమీ/గం స్పీడ్) ఇప్పటికే నిస్సాన్ మాగ్నైట్ రెడ్ ఎడిషన్ మార్కెట్లో విడుదలైంది. కాగా ఇప్పుడు గెజా ఎడిషన్ అడుగు పెట్టింది. ఇందులో యాంబియంట్ లైటింగ్ ఉంటుంది. దీనిని నిస్సాన్ ఫోన్ యాప్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. అంతే కాకుండా ఇందులో బేజ్ కలర్ సీట్ కవర్స్ ఉండటం కూడా చూడవచ్చు. ఇందులో రియర్ కెమెరా, షార్క్ న్ యాంటెన్నా వంటివి కూడా ఉన్నాయి. ఇంజిన్ కంపెనీ అందించిన సమాచారం మాగ్నైట్ గెజా స్పెషల్ ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు లేదని తెలుస్తోంది. కావున అదే 1.0 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 72 hp పవర్ ప్రోడీసు చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. కావున పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్‌లో రూ. 89.30 లక్షల కారు విడుదల చేసిన బీఎండబ్ల్యూ - వివరాలు) ప్రత్యర్థులు కొత్త నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా ఎక్స్యువి300, మారుతి సుజుకి ఫ్రాంక్స్, రెనాల్ట్ కిగర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కావున మార్కెట్లో అమ్మకాల పరంగా ఇది గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. -
మనుషుల మాటలు అర్ధం చేసుకునేలా యంత్రాల రూపకల్పన
-
ఈ ఏడాది చివర్లో అయిదు రాష్ట్రాల ఎన్నికలపైనా కన్నడ ఫలితాల ప్రభావం
-
చంద్రబాబు అండ్ కో కి సుప్రీం షాక్
-
కర్నాటక ప్రచారంలో విషాలు చిమ్ముకుంటోన్న కాంగ్రెస్-బీజేపీలు
-
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వరకు
-
కర్నాటకలో హోరెత్తిన ప్రచార పర్వం
-
మాఫియాను మట్టిలో కలిపేస్తాం
-
దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
-
ప్రపంచం గర్వించదగ్గ మేథావి అంబేడ్కర్
-
పులి నవ్వింది
-
మూడు పార్టీలకు జాతీయ హోదా రద్దు చేసిన కేంద్రం ఎన్నికల సంఘం