ssc board
-
‘ప్రత్యేక’ విద్యార్థులకు పాస్‌మార్కులు 10
సాక్షి, అమరావతి: మానసిక వైకల్యం గల విద్యార్థులకు పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత మార్కులను పాఠశాల విద్యాశాఖ కుదించింది. ఇప్పటి వరకు 35 ఉన్న పాస్ మార్కులను 10 మార్కులకు తగ్గించింది. వచ్చే మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల నుంచి ఈ విధానం అమలు చేయనుంది. 4 నుంచి ఎస్జీటీలకు శిక్షణ ఆంధ్రాస్ లెరి్నంగ్ ట్రాన్స్ఫార్మేషన్ (సాల్ట్) ప్రోగ్రామ్‌లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు నిర్వహంచే రెండోవిడత శిక్షణ వచ్చేనెల 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 34 వేలమంది ఎస్జీటీలకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇందులో ఇప్పటికే ఒకవిడత శిక్షణ పూర్తయిందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 9 కేంద్రాల్లో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీలో మొత్తం 14 విడతల్లో ఈ శిక్షణ ఉంటుందని ఆయన తెలిపారు. -
TS SSC Results 2023: బుధవారం టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెన్త్ ఫలితాలు బుధవారం(మే 10) విడుదల కానున్నాయి. 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఇందుకు విద్యాశాఖ, ఎస్ఎస్సీ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. కాగా రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 7,39,493 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షలు జరిగిన నెలలోనే ఫలితాలను విడుల చేస్తోంది. కాగా నేడు(మంగళవారం) ఇంటర్ ఫలితాలను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. మరోనాడే టెన్త్ ఫలితాలు రిలీజ్ కానుండడం విశేషం. కాగా ఈ ఏడాది పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయంటూ రాష్ట్రంలో కలకలం రేగిన విషయం తెలిసిందే. వికారాబాద్ తాండూర్‌లో తెలుగు ప్రశ్నాపత్రం, హన్మకొండ జిల్లాలోని కమలాపూర్‌లో హిందీ పేపర్ లీకైందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా నడిచింది. అంతేగాక హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై వరంగల్ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక పరీక్ష పత్రాల లీక్ నేపథ్యంలో పేపర్ల వాల్యూయేషన్‌ను అధికారులు జాగ్రత్తగా నిర్వహించారు. TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా చెక్ చేసుకోండి.. -
టెన్త్ పేపర్ అవుట్
సాక్షి, హైదరాబాద్/ వికారాబాద్/ తాండూరు: టెన్త్ పరీక్షల తొలిరోజు.. పరీక్ష ప్రారంభమైన 7 నిమిషాలకే ప్రశ్నపత్రం బయటకు వచ్చింది. ఓ పాఠశాలలోని ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఫొటోలు తీసి వాట్సాప్ ద్వారా మరో పాఠశాలలోని టీచర్‌కు పంపాడు. అతను ఇతర గ్రూపులకు పంపడంతో విషయం వెలుగు చూసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఇద్దరు ఉపాధ్యాయులు సహా నలుగురిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు. ప్రైవేట్ స్కూళ్ల పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు విద్యాశాఖ ఆదేశించింది. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి యత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, వికారాబాద్ కలెక్టర్ వివరాలు వెల్లడించారు. అసలేం జరిగింది? పదవ తరగతి పరీక్షలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు తెలుగు పరీక్ష కోసం విద్యార్థులు ఉదయం 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. 9.30 నుంచి 12.30 గంటల వరకు జరిగే పరీక్ష కోసం 9.30కి ఇన్విజిలేటర్లు వారికి ప్రశ్నపత్రాలు ఇచ్చారు. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల–1లోని 5వ నంబర్ పరీక్ష హాల్లో కూడా అలాగే ఇచ్చారు. ఆ గదిలో శ్రీనివాసులు ఇన్విజిలేటర్‌గా పనిచేస్తున్నారు. అయితే అదే పాఠశాలలో రిలీవర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బందెప్ప రూమ్ నంబర్ ఐదుకు వచ్చాడు. గైరుహాజరైన ఓ విద్యార్థికి చెందిన క్వశ్చన్ పేపర్ తీసుకుని శ్రీనివాసులుకు తెలియకుండా తన సెల్ఫోన్లో ఫొటోలు తీసుకున్నాడు. తొలుత పొరపాటున ఓ వాట్సాప్ గ్రూప్‌కు పంపి వెంటనే డిలిట్ చేశాడు. 9.37 సమయంలో చెంగోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు సమ్మప్పకు వాట్సాప్ ద్వారా పంపాడు. అతని ద్వారా ప్రశ్నపత్రం వేరే ఇతర వాట్సాప్ గ్రూపులకు, 11: 30 ప్రాంతంలో ఓ మీడియా వాట్సాప్ గ్రూప్‌కు వెళ్లింది. విలేకరులు కొందరు మండల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు అలాంటిదేమీ లేదని అన్నారు. కానీ పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థుల వద్ద ఉన్న పేపర్‌తో పోల్చి చూస్తే నిజమేనని తేలింది. దీంతో వారు అధికారులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్రిమినల్ కేసుల నమోదు ఈ వ్యవహారంలో నలుగురిని సస్పెండ్ చేశామని, వీరిలో ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారిస్తున్నామని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం సాయంత్రం విలేకరులకు చెప్పారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, విద్యాశాఖ అధికారులు, అదనపు కలెక్టర్‌ను రంగంలోకి దింపామని తెలిపారు. విచారణలో తాండూరు–1 స్కూల్ నుంచి పేపర్ లీకైనట్లు గుర్తించామన్నారు. పేపర్ ఫోటోలు తీసిన బందెప్పతో పాటు అతను పేపర్ సెండ్ చేసిన సమ్మప్పను విధుల నుంచి తొలగించి, క్రిమినల్ కేసులు నమోదు చేశామని చెప్పారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ఫోన్లను అనుమతించిన సెంటర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ శివకుమార్ (ముద్దాయిపేట, యాలాల మండలం), చీఫ్ సూపరింటెండెంట్ కె.గోపాల్ (తాండూరు హైస్కూల్–1)ను కూడా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రశ్నపత్రాన్ని ఫొటోలు తీసిన విషయాన్ని గమనించడంలో విఫలమైన శ్రీనివాస్‌ను ఇన్విజిలేషన్ విధుల నుంచి తొలగించటంతో పాటు అతనిపై కూడా తదుపరి విచారణ చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించామని తెలిపారు. లీకైన పేపర్‌ను ఉపయోగించి మాస్ కాపీయింగ్ చేసినట్లుగా ఎక్కడా ఎలాంటి ఆధారాలు లభించలేదని కలెక్టర్ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్ ఫొటోలు తీసి మరో ఉపాధ్యాయుడికి పంపినప్పటికీ.. విద్యార్థులు ఆ పేపర్ ద్వారా కాపీయింగ్‌కు పాల్పడినట్టు తేలలేదని స్పష్టం చేశారు. ప్రశ్నపత్రం బయటకు వాస్తవమే.. టెన్త్ ప్రశ్నపత్రం లీక్‌పై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన స్పందించారు. తాండూరు హైస్కూల్–1 నుంచి ప్రశ్నపత్రం మరో టీచర్‌కు వెళ్ళిన మాట వాస్తవమేనని ఆమె తెలిపారు. అయితే పరీక్ష సమయంలో ఇతరులెవరూ లోపలికి రాలేదని, లోపలి నుంచి ఎవరూ బయటకు వెళ్ళలేదని స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపారని, బాధ్యులపై చర్యలు తీసుకున్నారని, విచారణ కొనసాగుతోందని చెప్పారు. మిగతా పరీక్షలన్నీ యధాతథంగా జరుగుతాయని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లతో మిలాఖత్? ప్రశ్నపత్రం బయటకు వెళ్లిన వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత స్థాయి అధికారులు కూడా పరీక్ష హాల్లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్ళడం నిషేధం. అలాంటిది ఓ ఇన్విజిలేటర్ ఎలా తీసుకెళ్ళాడనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. అయితే అతని సెల్‌ఫోన్ ద్వారా వెళ్ళిన ప్రశ్నపత్రం ప్రైవేటు స్కూళ్ల నిర్వాహకులకు కూడా వెళ్ళినట్టు అనుమానిస్తున్న పోలీసు వర్గాలు ఈ దిశగా విచారణ చేపట్టాయి. ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి యత్నం టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీపై నిరసన వ్యక్తం చేస్తూ ఎన్ఎస్యూఐ ఎస్సెస్సీ బోర్డు ముట్టడికి ప్రయత్నించింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థి నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీస్టేషన్‌కు తరలించారు. విద్యాశాఖ కార్యాలయం ఎదుట కూడా ఆందోళనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. లీకేజీపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని ఎస్ఎఫ్ఐ నేతలు ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు డిమాండ్ చేశారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. గతంలోనూ వివాదాస్పదుడే.. తాండూరు నంబర్–1 పాఠశాలలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న బందెప్పకు వివాదాస్పదుడిగా పేరుంది. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ.. ఐదేళ్ల క్రితం తల్లిదండ్రులు స్కూల్ ఆవరణలోనే దేహశుద్ధి చేశారు. అప్పట్లో అతనిపై పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదయ్యింది. తాజాగా ప్రశ్నప్రతం లీక్ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
టెన్త్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల 3 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఏర్పాట్లు చేస్తోంది. గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి ముందు నుంచే ఎస్సెస్సీ బోర్డు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోంది. 26 జిల్లాల్లో మొత్తం 3,348 కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకు రిజిస్టరైన విద్యార్థుల సంఖ్య ప్రకారం ఈ పరీక్షలకు 18,601 స్కూళ్ల నుంచి 6,64,153 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థుల్లో ప్రభుత్వ స్కూళ్ల నుంచి 3,97,549 మంది, ప్రైవేటు స్కూళ్ల నుంచి 2,11,521 మంది ఉన్నారు. బాలురు 3,46,542 మంది కాగా బాలికలు 3,17,611 మంది పరీక్ష రాయనున్నారు. ప్రైవేటుగా పరీక్ష రాసే విద్యార్థులు మరో 53,411 మంది ఉన్నారు. వీరితోపాటు ఓఎస్సెస్సీ విద్యార్థులు మరో 1,672 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలు పరీక్ష కేంద్రాలను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ, జడ్పీ స్కూళ్లు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ స్కూళ్లు, మోడల్ స్కూళ్లు, మున్సిపల్ స్కూళ్లు, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థల్లో సీసీ కెమెరాలు ఉన్న వాటినే పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తున్నారు. పరీక్ష ముగిసే వరకు సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటారు. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతాయి. గతంలో విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి ఉదయం 8.30 నుంచి అనుమతించేవారు. ఈసారి ఉదయం 8.45 గంటల తరువాత మాత్రమే అనుమతిస్తారు. చీఫ్ సూపరింటెండెంట్ సహా ఎవరికీ పరీక్ష కేంద్రాల్లో సెల్ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. ప్రశ్న పత్రాలకు 7 అంకెల సీరియల్ నంబర్ ఈసారి పంపిణీ చేసే ప్రశ్నపత్రాలకు కొత్తగా సీరియల్ నంబర్లను ముద్రిస్తారు. 7 అంకెలతో కూడిన సీరియల్ నంబర్ల వారీగానే సెంటర్లలోని విద్యార్థులకు ప్రశ్నపత్రాలను అందిస్తారు. సమాధానాలు రాసేందుకు 24 పేజీల బుక్లెట్ ఇస్తారు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు పరిమితం చేసింది. గతంలో 11 పేపర్లు ఉండగా, కరోనా సమయంలో వాటిని ఏడింటికి తగ్గించారు. ఇకపై ఆరు పేపర్లలో మాత్రమే టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. ఫిజికల్ సైన్సు, బయోలాజికల్ సైన్సుకు కలిపి ఒకే ప్రశ్నపత్రం ఇస్తారు. ఈ రెండు సబ్జెక్టులకు సమాధానాలు వేర్వేరుగా రాసేందుకు రెండు బుక్లెట్లు (12 పేజీలు చొప్పున) ఇస్తారు. పేపర్–1లో ఫిజికల్ సైన్సులో 16 ప్రశ్నలు, పేపర్–2 బయోలాజికల్ సైన్సులో 17 ప్రశ్నలు ఉంటాయి. ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2 (కాంపోజిట్ కోర్సులైన సంస్కృతం, అరబిక్, పర్షియన్, హిందీ), వొకేషనల్ కోర్సులకు కూడా ఈసారి రెండు బుక్లెట్లు ఇస్తారు. ఏప్రిల్ 19 నుంచి ఏప్రిల్ 26 వరకు టెన్త్ మూల్యాంకనాన్ని నిర్వహిస్తారు. ఈసారి కొత్త జిల్లాలను కూడా కలుపుకొని 25 మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. -
టెన్త్ విద్యార్థుల వివరాల సవరణకు ఎడిట్ ఆప్షన్
సాక్షి, అమరావతి: పదో తరగతి ధ్రువపత్రాల్లో తలెత్తే లోపాలు విద్యార్థులకు ఆ తరువాతి కాలంలో పెద్ద సమస్యగా, ఇబ్బందికరంగా మారుతుంటాయి. చివరి నిమిషంలో వాటిని సరిచేయించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతుంటారు. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన నామినల్ రోల్స్‌లో వారి వివరాలను సరైన రీతిలో పొందుపరచకపోతే అవే పొరపాట్లు ధ్రువపత్రాల్లో నమోదవుతుంటాయి. ఈ సమస్యలకు ముందుగానే చెక్‌పెట్టేలా ఎస్సెస్సీ బోర్డు తాజాగా ఎడిట్ ఆప్షన్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు తమ స్కూలు ద్వారా టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాలను సరిచూసుకుని పొరపాట్లు లేకుండా సవరించుకునేందుకు ఈ ఎడిట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చామని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ లాగిన్ నుంచి ఈ ఎడిట్ ఆప్షన్ వినియోగించి నామినల్ రోల్స్‌లోని వివరాలను సరిచేసుకోవాలని సూచించారు. బుధవారం (నేడు) నుంచి ఈనెల 20వ తేదీవరకు ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆలోగా వివరాలు సరిచూసుకోవాలని ఆయన కోరారు. సరిచూసుకోవలసిన అంశాలు ► విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు ► పుట్టిన తేదీ ► విద్యార్థి ఎంచుకున్న ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్ కాంబినేషన్ ► విద్యార్థి ఎంపిక చేసుకున్న మాధ్యమం ► ఓఎస్సెస్సీ సబ్జెక్టు కోడ్ ► వొకేషనల్ ఎస్సెస్సీ సబ్జెక్టు, కోడ్ ► విద్యార్థి ఐడెంటిఫికేషన్ చిహ్నాలు (పుట్టుమచ్చలు) ► విద్యార్థి ఫొటో, సంతకం -
Telangana: ‘టెన్త్’కు కఠిన పరీక్ష!
‘పరీక్షల’పై ప్రశ్నలు, ఆందోళనలివీ.. ► టెన్త్ పరీక్షల్లో గతంలో ఇచ్చినట్టుగా ఈసారి రెండు, మూడు మార్కుల సూక్ష్మ ప్రశ్నలకు చాయిస్ ఇవ్వలేదు. ఆరు చొప్పున ప్రశ్నలిచ్చి అన్నీ రాయాలన్నారు. ఏ ఒక్క ప్రశ్న తెలియకపోయినా విద్యార్థి ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. అన్ని చాప్టర్లపై పట్టులేనప్పుడు దీనితో చాలా నష్టం. ► వ్యాసరూప ప్రశ్నల తీరును కఠినం చేశారు. సెక్షన్ మాదిరి కాకుండా, గ్రూపు మాదిరి చాయిస్ ఇవ్వడం విద్యార్థులకు ఇబ్బందేనని నిపుణులు చెప్తున్నారు. సెక్షన్ మాదిరిగా అంటే మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చి అందులోంచి ఆరింటికి సమాధానాలు రాయాలి. దీనిలో విద్యార్థులకు చాయిస్ ఎక్కువగా ఉండి, ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఒక్కో గ్రూప్‌లో రెండు ప్రశ్నల చొప్పున ఆరు గ్రూపులుగా ప్రశ్నలు ఇచ్చారు. ప్రతి గ్రూప్‌లోని రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయాలి. ఆ రెండింటికి సమాధానం తెలియకపోతే.. ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. మిగతా గ్రూపుల్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగినా ప్రయోజనం ఉండదు. ► పరీక్ష సమయం మొత్తం 3 గంటలు.. ఇందులో ఆరు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికే రెండు గంటల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ముందే మిగతా ప్రశ్నలకు జవాబులు రాస్తే.. వ్యాసరూప ప్రశ్నలకు సమయం సరిపోదని అంటున్నారు. అందువల్ల వ్యాసరూప ప్రశ్నలను నాలుగుకు తగ్గించాలని సూచిస్తున్నారు. ► సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్/కెమిస్ట్రీ ఒకటి.. బయాలజీ మరొకటిగా పేపర్లు ఉంటాయి. రెండింటి ప్రిపరేషన్ వేర్వేరుగా ఉంటుంది. వీటన్నింటినీ ఒకేరోజు, ఒకే సమయంలో పెట్టడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రశ్నపత్రంలో చాయిస్ పెంచాలి ప్రశ్నపత్రంలో జవాబుల చాయిస్ పెంచాలి. అన్ని విభాగాల్లో కనీసం 30 శాతమైనా ఇవ్వాలి. విరామం లేకుండా పరీక్షల నిర్వహణ అశాస్త్రీయం. తక్షణమే పరీక్షల తీరుపై అధికారులు సమీక్షించాలి. – రాజా భానుచంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు సాక్షి, హైదరాబాద్: ఎస్సెస్సీ పరీక్షల చుట్టూ వివాదం ముసురుతోంది. పరీక్ష విధానం, నిర్వహణ, సిలబస్, చాయిస్‌లలో చేసిన మార్పులపై పునః సమీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను పరిశీలించిన ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ అభ్యంతరాలు తెలిపాయి. తమ సూచనలను పరిగణనలోకి తీసుకోకుంటే.. విద్యార్థులకు ఇబ్బంది తప్పదని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ అంశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుండటంతో.. విద్యాశాఖ ఉన్నతాధికారులు డోలాయమానంలో పడ్డారు. మోడల్ పేపర్లను చూసి.. ఇటీవల టెన్త్ పరీక్షల టైం టేబుల్ విడుదల చేసిన ఎస్సెస్సీ బోర్డు పరీక్షల మోడల్ పేపర్లనూ ఆన్లైన్లో పెట్టింది. ఈ మోడల్ పేపర్లను బట్టి పరీక్ష విధానం కఠినంగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు నిర్ధారణకు వచ్చాయి. అసలే కోవిడ్ వల్ల రెండేళ్లుగా అభ్యసన నష్టాలు ఉన్నప్పుడు పరీక్షను కఠినతరం చేస్తే విద్యార్థులకు నష్టమని అంటున్నాయి. టెన్త్ పరీక్షలు రాయబోయే దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల్లో.. 2 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లవారు ఉంటారని.. వీరిలో 1.2 లక్షల మంది కనీస స్థాయిలో, మరో 45 వేల మంది అంతకన్నా తక్కువగా సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నట్టు ఇటీవలి అంచనాల్లో వెల్లడైందని పేర్కొంటున్నాయి. కోవిడ్ పరిణామాలతో ప్రైవేటు విద్యార్థుల్లోనూ ప్రమాణాలు తగ్గాయని.. ఇలాంటప్పుడు క్లిష్టమైన ప్రశ్నలు, సంక్లిష్టమైన సమాధాన రూపం ఉండటం సరికాదని స్పష్టం చేస్తున్నాయి. గ్యాప్ ఇవ్వాల్సిందే.. సీబీఎస్సీ సిలబస్‌తో కొనసాగే కేంద్ర విద్యాసంస్థల్లో ప్రతీ పరీక్షకు మధ్య సన్నద్ధతకు సెలవు ఉంటుంది. మన రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డ్ మాత్రం ఈ విధానాన్ని పాటించ లేదు. ప్రభుత్వ సెలవు దినాలు మినహా ప్రతీ సబ్జెక్టు పరీక్షల మధ్య విరామం ఇవ్వలేదు. ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లుగా పరీక్షలు (40 మార్కుల చొప్పున) నిర్వహించినప్పుడు మధ్యలో ఒకరోజు విరామం ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 80 మార్కులతో ఒకే పరీక్ష నిర్వహించనున్నా మధ్యలో విరామం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ విషయాన్ని విద్యామంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. కోవిడ్ నష్టాలున్న కాలం కాబట్టి విరామం, ఇతర వెసులుబాట్లు అమలు చేయాలని కోరినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. చాయిస్ పెంచాలి.. ఒకే పేపర్‌గా పరీక్ష నిర్వహిస్తుండటం వల్ల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. ప్రశ్నపత్రంలోని ఒకటి, రెండు సెక్షన్లలో కూడా చాయిస్ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 2 మార్కులు, 3 మార్కుల ప్రశ్నలకు కనీసం 30శాతం చాయిస్ ఇవ్వాలని అంటున్నారు. మూడో సెక్షన్లో వ్యాస రూప ప్రశ్నలను తగ్గించాలని.. ఫిజిక్స్/కెమిస్ట్రీ, బయాలజీ పరీక్షలు ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని సూచిస్తున్నారు. ఎస్సెస్సీ బోర్డు ఈ సూచనలు పాటించకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ముందుగా బోధన ప్రారంభం కావడం, రివిజన్ రెండు సార్లు చేయడం వల్ల తేలికగా పరీక్షలు రాసే వీలు ఉందని అంటున్నారు. అదే ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికీ సిలబస్ పూర్తి కాలేదని, ఉపాధ్యాయుల కొరత ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. పరీక్షల తీరులో మార్పులు చేయాలి రెండేళ్లుగా కోవిడ్ వల్ల తరగతులే సరిగా జరగలేదు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రశ్నపత్రాలు ఉంటే మంచిది. కానీ మోడల్ పేపర్లు చూస్తే చాలా కఠి నంగా ఉన్నాయి. పరీక్షలపై సంఘాల నేతలతో కలిసి చర్చించి, మార్పులు చేయాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ వ్యాస రూప ప్రశ్నలు తగ్గించాలి మోడల్ పేపర్లను బట్టి చూస్తే వ్యాస రూప ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. వాటిని తగ్గించాలి. భౌతిక, రసాయన శాస్త్రాలు.. జీవశాస్త్రం పేపర్లను ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలి. – బీరెల్లి కమలాకర్‌రావు, పీఆర్టీయూటీఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఏప్రిల్ మొదటి వారంలో టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు–2023 ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభం కానున్నాయి. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ముగింపు తేదీకి అటుఇటుగా ఒకరోజు వ్యవధిలో టెన్త్ పబ్లిక్ పరీక్షలను ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్(ఎస్సెస్సీ బోర్డు) షెడ్యూల్‌ను రూపొందించింది. ఇంటర్ పరీక్షలు మార్చి 15న ప్రారంభమై ఏప్రిల్ 4వ తేదీతో ముగుస్తాయి. రాష్ట్రంలో పాఠశాల విద్యలో సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో.. టెన్త్ పబ్లిక్ పరీక్షలనూ అదే ప్యాట్రన్‌లో చేపట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. సీబీఎస్ఈలో పబ్లికపరీక్షలు రోజు విడిచి రోజు జరుగుతాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షలను కూడా రోజు విడిచి రోజు నిర్వహించాలని ఎస్సెస్సీ బోర్డు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. టెన్త్ పబ్లిక్ పరీక్షలను ఆరు పేపర్లలోనే నిర్వహించేలా ప్రభుత్వం ఇంతకు ముందు ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఆ మేరకు ఆరు పేపర్ల పరీక్షలను రోజు విడిచి రోజు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానందరెడ్డి ఇటీవల పలు విద్యాసంస్థల యాజమాన్యాలతో జూమ్ మీటింగ్ నిర్వహించి.. పలు అంశాలపై చర్చించారు. సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి ఫిజికల్ సైన్స్, నేచురల్ సైన్స్‌లు కలిపి ప్రశ్నపత్రాలిస్తారు. పీఎస్‌లో 16, ఎన్ఎస్లో 17 ప్రశ్నలుంటాయి. సమాధాన పత్రాలు రెంటికీ వేర్వేరుగా రాయాల్సి ఉంటుంది. ముందు పీఎస్, అనంతరం ఎన్ఎస్ ప్రశ్నలుంటాయి. అలానే సమాధానాలూ రాయాలి. పేర్లు, వివరాల్లో తప్పులు సరిచేసుకునేందుకు.. ఎడిట్ ఆప్షన్ పరీక్ష ఫీజును పాఠశాలల యాజమాన్యాలు కట్టినా, లేదా సీఎఫ్ఎంఎస్ ద్వారా ఎవరు కట్టినా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ తదితర వివరాలు తప్పుగా నమోదు చేసి ఉంటే కనుక ఆందోళన చెందాల్సిన పనిలేదని, పరీక్ష ఫీజు చెల్లించిన అనంతరం ఎడిట్ ఆప్షన్ ఇస్తామని దేవానందరెడ్డి ఆయా యాజమాన్యాలకు వివరించారు. -
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..
-
ఫీజు కట్టాల్సిందే.. ఆ మటా ఉత్తిమాటే..!
సాక్షి, నారాయణపేట రూరల్: పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు మినహాయింపు ప్రక్రియ ఇటు ప్రభుత్వం ప్రకటించడానికి, అటు అధికారులు చెప్పుకోవడానికి మాత్రమే పరిమితమైంది. ఏటా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం నోటిఫికేషన్లో వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు మినహాయింపును చేర్చుతూనే వస్తోంది. కానీ నిబంధనల ప్రకారం ఏ ఒక్కరికీ అది ఉపయోగపడటం లేదు. పొంతనలేని వార్షిక ఆదాయం కారణంగా ప్రతి ఒక్కరూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. టెన్త్ విద్యార్థులు ఇలా.. జిల్లా వ్యాప్తంగా 11 రకాలైన విద్యాసంస్థలు కొనసాగుతున్నాయి. వాటిలో సింగారం క్రాస్‌రోడ్డులో ఉన్న సీబీఎస్ఈ విద్యాలయం మినహాయిస్తే మిగితా వాటిలోని పదో తరగతి విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ పరీక్షలకు హాజరవుతారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 753 మంది, 70 లోకల్‌బాడీ స్కూల్లలో 5,280, మూడు ఎయిడెడ్ స్కూళ్లలో 102 మంది, 45 ప్రైవేటు పాఠశాలల్లో 1,315 మంది, 11 కేజీబీవీల్లో 504 మంది, ఒక జ్యోతిరావుఫూలే స్కూల్లో 73మంది, రెండు మాడల్ స్కూల్లలో 192 మంది, రెండు మైనార్టీ గురుకులలో 135, ఆరు సోషల్ వెల్ఫేర్‌లో 480, ఒక ట్రైబల్ వెల్ఫేర్‌లో 79మందితో కలుపుకుని మొత్తం 4,354 మంది బాలురు, 4,597 మంది బాలికలతో కలిసి 8,961 మంది టెన్త్ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. చదవండి: (రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 706 రోజుల తర్వాత..) వెనకబడిన వారికి మినహాయింపు అన్నిరకాల యాజమాన్య పాఠశాలల్లో ఈ ఏడాది మే 11నుంచి 17వరకు జరిగే టెన్త్ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వార్షిక ఫీజు మినహాయింపు సౌకర్యాన్ని ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఆయా పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లో ఆర్థికంగా వెనకబడిన వారికి ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఫీజు చెల్లింపుతో పాటు విద్యార్థి వారి కుటుంబ ఆదాయ ధ్రువపత్రం అందించాల్సి ఉంటుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.20వేలు, పట్టణ ప్రాంతాల్లోని వారికి రూ.24 వేలలోపు వార్షిక ఆదాయం నిబంధన విధించడంతో ఏ ఒక్కరికీ ఈ ప్రయోజనం చేకూరడంలేదు. రాష్ట్రంలో ఏ పథకమైనా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి ప్రభుత్వం వర్తింపజేస్తుంది. ఇందుకు గరిష్ఠ ఆదాయం రూ.లక్షకు పైగానే ఉంటుంది. కానీ టెన్త్ విద్యార్థులకు వచ్చేసరికి ఇంత తక్కువగా కేటాయించారు. అయితే గత 30ఏళ్లుగా ఇదే డిజిట్ కొనసాగిస్తున్నారని, 2015 నుంచి మార్చాలని ఎస్ఎస్సీ బోర్డు ప్రభుత్వానికి లేఖ రాసిన మార్పు జరగడంలేదని తెలుస్తోంది. దీంతో 8,165 మంది వెనకబడిన కులాల విద్యార్థులకు ప్రయోజనం లేకుండాపోతుంది. హాస్టల్లో చదువుతున్న వారికి ప్రత్యేకం బీసీ విద్యార్థులు ప్రభుత్వ వసతిగృహాల్లో ఉండి చదువుతున్న విద్యార్థులకు ఆ శాఖ కమిషనర్ ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు కొందరు ఫీజు రాయితీ పొందగలిగారు. మక్తల్ గరŠల్స్‌లో 8, బాయ్స్‌లో 17, ఊట్కూర్ బాయ్స్‌లో 9, మద్దూర్ గరŠల్స్‌లో 14, కన్మనూర్ 5, ధన్వాడ మాడల్ స్కూల్లో 1, నారాయణపేట వైదిక పాఠశాలలో 4 చొప్పున 58మంది, అదేవిధంగా కేజీబీవీల్లో చదువుతున్న మొత్తం 504 మంది బాలికలకు ఫీజు రాయితీ వచ్చింది. కానీ పేరెంట్స్ వార్షిక ఆదాయ ధ్రువపత్రంతో మాత్రం కాదనేది విస్పష్టం. అదేవిధంగా 14 సంవత్సరాల వయస్సు కంటే తక్కువగా ఉన్న వారు మెడికల్ సర్టిఫికెట్తో పాటు రూ.300 చెల్లించి ప్రభుత్వ పరీక్షల విభాగానికి చలాన్ కట్టి జిల్లాలో 55మంది పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత తీసుకున్నారు. పరీక్ష ఫీజు చెల్లింపు ఇలా.. ఏటా అక్టోబర్‌లోనే టెన్త్ పరీక్ష ఫీజు షెడ్యూల్డ్ విడుదల చేసే బోర్డు అధికారులు రెండేళ్లుగా కరోనా కారణంగా ఆలస్యంగా విద్యాబోధన ప్రారంభం కావడంతో ఈసారి సైతం పరీక్ష ఫీజు చెల్లింపు నోటిఫికేషన్ టెన్త్ బోర్డు గతనెల చివరన విడుదల చేశారు. అయితే రెగ్యులర్ విద్యార్థులు రూ.125 చెల్లించాల్సి ఉండగా సప్లమెంటరీ విద్యార్థులు 3సబ్జెక్టులోపుకు రూ.110, మూడు దాటితే రూ.125 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు రూ.185 కట్టాల్సి ఉంటుంది. వీటిని సంబందిత హెచ్ఎంలకు ఈనెల 14 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించాల్సి ఉండగా, రూ.50 జరిమానాతో ఫిబ్రవరి 24వరకు చెల్లించాల్సి ఉండింది. ఇక రూ.200తో మార్చి 4వరకు, ఆఖరులో రూ.500 అపరాధ రుసుం చెల్లిస్తే మార్చి 14వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ప్రభుత్వం సూచించిన ఆదేశాల ప్రకారం ఎస్ఎస్సీ బోర్డు ద్వారా నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం జిల్లాలోని అన్నియాజమాన్య పాఠశాలల హెచ్ఎంలకు వాటి ప్రతిని అందించాము. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు పరీక్ష ఫీజు మినహాయింపు పొందాలంటే తప్పకుండా వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కుటుంబానికి రూ.20వేలు, పట్టణాల్లో రూ.24వేలు దాటకూడదు. అలాంటి దరఖాస్తు ఒక్కటి కూడా రాలేదు. కేవలం బీసీ హాస్టల్‌కు చెందిన 58, కేజీబీవీలకు చెందిన 504తో కలిపి 531మంది ఫీజు రాయితీతో పరీక్షకు హాజరవుతున్నారు. – రాజేంద్రకుమార్, జిల్లా పరీక్షల విభాగ అధికారి -
అంతా మా ఇష్టం..!... పబ్లిక్ పరీక్షల ఫీజు పై సైతం బాదుడు
సాక్షి హైదరాబాద్: కరోనా కష్టకాలంలో విద్యా సంస్థలు పబ్లిక్ పరీక్ష ఫీజుపై సైతం బాదేస్తున్నాయి. తాజాగా పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజుపై అదనపు వసూళ్ల ప్రక్రియ బహాటంగా కొనసాగడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలతో పాటు సర్కారు బడుల్లో సైతం ప్రధానోపాధ్యాయుల అండదండలతో పరీక్షల విభాగం బాధ్యులు నిబంధనలకు విరుద్ధంగా నిర్ణీత ఫీజు కంటే అధికంగా బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటీవల 2021–22 విద్యాసంవత్సరం టెన్త్ పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో ఫీజు చెల్లింపు షెడ్యూలును ఎస్ఎస్సీ బోర్డు జారీ అయింది. తొలుత గత నెల 29 వరకు ఫీజు గడువును నిర్ధారించగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సంక్రాంతి సెలవులను పొడిగించడంతో ఫీజు గడువును ఈ నెల 14 వరకు బోర్డు పొడిగించింది. రూ.50 ఆలస్య రుసుంతో 24 వరకు, రూ. 200 ఆలస్య రుసుముతో మార్చి 4 వరకు. రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 14 వరకు పరీక్ష ఫీజు చెల్లించే విధంగా బోర్డు వెసులుబాటు కల్పించింది. పరీక్ష ఫీజు రూ.125 మాత్రమే.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు పేరిట అడ్డగోలు వసూళ్లు వివాదాస్పదంగా తయారయ్యాయి. నిబంధనల ప్రకారం పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బోర్డు ప్రకటించిన నిర్ణీత గడువులోగా రూ. 125 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.అయితే ప్రైవేటు విద్యా సంస్థలు ఇష్టానుసారంగా వసూళ్ల కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రైవేటు స్కూల్స్‌లో పరీక్ష ఫీజు పేరుతో కనీసం రూ.1000 నుంచి రూ.2000 వరకు వసూళ్లకు పాల్పడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరి కొన్ని యాజామాన్యాలు పాత బకాయి ఫీజులు మొత్తం చెల్లిస్తేనే పబ్లిక్ పరీక్షల ఫీజు కట్టుకుంటామనితేల్చి చెబుతుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సర్కారు బడుల్లో సైతం... ప్రైవేటుకు దీటుగా సర్కారు బడుల్లో సైతం పబ్లిక్ పరీక్షల ఫీజు పై అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని ప్రాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు సహకారంతో ఎగ్జామినేషన్ బ్రాంచ్ బాధ్యులు రూ.125 బదులు రూ.200నుంచి 500 వరకు పరీక్ష ఫీజు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నిలదీస్తే మాత్రం నిర్వహణ ఖర్చులను సాకుగా చూపించడం విస్మయానికి గురిచేస్తోంది. వాస్తవంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు తమ కుటుంబ యజమాని వార్షిక ఆదాయం రూ.25 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు రూ.20 వేల లోపు ఉన్నట్లు ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే పరీక్ష ఫీజులో సైతం రాయితీ లభిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అంత తక్కువ ఆదాయ ధ్రువీకరణ పత్రం జారీ అయ్యే అవకాశం లేకపోవడంతో రూ.125 ఫీజు కట్టేందుకు ఆసక్తి చూపుతున్నా..అదనపు చెల్లింపులు తలకు మించిన భారంగా తయారైంది. కరోనా కష్టకాలంలో పరీక్ష ఫీజుపై అదనపు వసూళ్ల ప్రక్రియ కొనసాగుతున్నా.. విద్యా శాఖాధికారులు ప్రేక్షక పాత్ర పోషించడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
టెన్త్ పరీక్షలు.. ఏప్రిల్ చివర లేదా మేలో
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ చివర లేదా మేలో జరిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్‌పై కసరత్తు చేస్తోంది. కోవిడ్ కారణంగా 2021–22 విద్యాసంవత్సరంలో పాఠశాలలు చాలా ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. జూన్ 12 నుంచి తరగతులు ఆరంభం కావలసి ఉండగా కోవిడ్ కారణంగా అక్టోబర్ వరకు పాఠశాలలు తెరచుకోలేదు. ఈ నేపథ్యంలో విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను పాఠశాల విద్యాశాఖ సవరించింది. అకడమిక్ ఇయర్‌ను ఏప్రిల్ 30 వరకు కొనసాగించేలా క్యాలెండర్‌ను ప్రకటించింది. అందుబాటులో ఉండే పనిదినాలకు అనుగుణంగా సిలబస్‌ను పూర్తి చేసేలా కొంతమేర పాఠ్యాంశాలను తగ్గించింది. టెన్త్ సిలబస్‌ను మార్చి 31 కల్లా పూర్తి చేసేలా ప్రణాళిక ఇచ్చింది. టెన్త్ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేలా రివిజన్ చేయించనున్నారు. ప్రీఫైనల్ పరీక్షలను నిర్వహించి అనంతరం ఏప్రిల్ ఆఖరు, లేదా మే తొలివారంలో టెన్త్ పరీక్షలను చేపట్టే అవకాశాలున్నాయి. మరోపక్క ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నందున వాటి అనంతరం టెన్త్ పరీక్షలు మొదలు కానున్నాయి. ఇలా ఉండగా, పరీక్షల ఫీజు గడువును ఎస్సెస్సీ బోర్డు మరోసారి పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి మంగళవారం ప్రకటన జారీ చేశారు. ఫిబ్రవరి 5 వరకు ఇదివరకు తుది గడువుగా నిర్ణయించగా తాజాగా దాన్ని ఫిబ్రవరి 11వ తేదీ వరకు పొడిగించారు. -
ఎస్ఎస్సీ బోర్డు ఉద్యోగినుల ఫిర్యాదులపై మహిళా కమిషన్ విచారణ
సాక్షి,విజయవాడ: ఎస్ఎస్సీ బోర్డు ఉద్యోగినుల ఫిర్యాదులపై మహిళా కమిషన్ సోమవారం విచారణ చేపట్టింది. ఎస్ఎస్సీ బోర్డులో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు తమపై జరుగుతున్నవేధింపులపై కొద్దిరోజుల క్రితం మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తాజాగా మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆధ్వర్యంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. ఎస్ఎస్సీ బోర్డులో ఉద్యోగిణులు వేధింపులపై వచ్చిన ఫిర్యాదులపై ఆరోపణల వివరాలతో కూడిన విచారణ నివేదికను త్వరలో అందజేస్తామన్నారు. వెంటనే అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా ఉద్యోగులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామన్నారు. వివిధ శాఖల ఉద్యోగ బాధ్యతల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కానీ మహిళలపై ఇతర వేధింపుల సంఘటనలను సీరియస్‌గా పరిగణిస్తామని తెలిపారు. -
రేపు సాయంత్రం ఏపీ పదో తరగతి ఫలితాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదల కానున్నాయి. ఎస్సెస్సి బోర్డు మార్క్స్ మెమోలను కూడా రేపే విడుదల చేయనుంది. 2020–21 విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్లతోపాటు 2019–20 టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు కూడా ప్రకటించనుంది. కోవిడ్ కారణంగా ఈ రెండు విద్యాసంవత్సరాల్లో పబ్లిక్ పరీక్షలను నిర్వహించని సంగతి తెలిసిందే. ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే జీవో 46ను విడుదల చేసింది. ఫలితాలను గణించడానికి అనుసరించనున్న విధివిధానాలను అందులో వివరించింది. గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించనున్నారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఒక సమ్మేటివ్ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ ఇస్తారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరిస్తారు. వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్ ఇస్తారు. -
7లోగా టెన్త్ ఫలితాలు
సాక్షి, అమరావతి: పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల 7వ తేదీలోగా వెల్లడించేందుకు ఎస్సెస్సీ బోర్డు ఏర్పాట్లు చేసింది. 2020–21 విద్యార్థుల ఫలితాలు, గ్రేడ్లతోపాటు 2019–20 టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు కూడా ప్రకటించనుంది. కోవిడ్ కారణంగా ఈ రెండు విద్యాసంవత్సరాల్లో పబ్లిక్ పరీక్షలను నిర్వహించని సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించి ఫలితాలు విడుదల చేయనున్నారు. హైపవర్ కమిటీ సిఫార్సులను ఆమోదిస్తూ పాఠశాల విద్యాశాఖ సోమవారం జీవో 46ను విడుదల చేసింది. ఫలితాలను గణించడానికి అనుసరించనున్న విధివిధానాలను అందులో వివరించింది. గ్రేడ్ల విధానంలో విద్యార్థుల ఉత్తీర్ణతను ప్రకటించనున్నారు. 2019–20 విద్యార్థులు రాసిన మూడు ఫార్మేటివ్ పరీక్షల మార్కులకు 50 శాతం వెయిటేజీ, ఒక సమ్మేటివ్ పరీక్ష మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. మొత్తం 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ ఇస్తారు. అన్ని సబ్జెక్టులకు ఇదే విధానం అనుసరిస్తారు. వొకేషనల్ కోర్సుల విద్యార్థులకు కూడా ఇదే విధానం. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఫెయిలై ఆ తరువాత పరీక్షలకు హాజరైనవారికి వారి ఇంటర్నల్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 20 అంతర్గత మార్కులను 5తో రెట్టింపుచేసి 100 మార్కులుగా పరిగణించి గ్రేడ్ ఇస్తారు. 2020–21 విద్యార్థులకు.. ఈ విద్యార్థులకు వారి ఫార్మేటివ్ పరీక్షల్లోని స్లిప్ టెస్టు మార్కులకు 70 శాతం వెయిటేజీ, ఇతర మూడు కాంపొనెంట్ల మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇచ్చి గ్రేడ్లు ప్రకటిస్తారు. ఎవరైనా ఒక్కటే ఫార్మేటివ్ పరీక్ష రాసి ఉంటే ఆ మార్కులను పరిగణనలోకి తీసుకొని గ్రేడ్ ఇస్తారు. పరీక్షలకు హాజరైనా మార్కులు అప్లోడ్ కాని విద్యార్థుల విషయంలో వారికి కనీస పాస్ గ్రేడ్లను ప్రకటిస్తారు. వొకేషనల్ విద్యార్థులకు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తారు. గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్షలకు రిజిస్టర్ అయిన వారికి వారి టెన్త్ 20 అంతర్గత మార్కులను అయిదుసార్లు రెట్టింపు చేసి ఫలితాలను ప్రకటిస్తారు. -
అన్ని సబ్జెక్టుల మార్కుల ఆధారంగా గ్రేడ్లు
సాక్షి, అమరావతి: టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ప్రకటించేందుకు మార్కుల విధానాన్ని హైపవర్ కమిటీ ఖరారు చేసింది. బుధవారం కమిటీ తుది సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకుంది. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి తన నివేదిక సమర్పించనుంది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను అనుసరించి ఎస్సెస్సీ బోర్డు ఫలితాల విడుదలపై తుది కసరత్తు చేపట్టనుంది. ఆపై వారం పది రోజుల్లో ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నాయని అధికార వర్గాలు తెలియజేశాయి. అన్ని మార్కుల యావరేజ్‌తో గ్రేడ్లు ఎస్సెస్సీ పరీక్షల్లో విద్యార్థులకు వారి ఫార్మేటివ్, సమ్మేటివ్ పరీక్షల్లోని అన్ని సబ్జెక్టుల్లో సాధించిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇంతకు ముందు ఆయా సబ్జెక్టుల్లో ఎక్కువ శాతం మార్కులు వచ్చిన(బెస్ట్ 3) సబ్జెక్టుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకుని గ్రేడ్లు ఇవ్వడంపై కమిటీ దృష్టి పెట్టింది. అయితే బెస్ట్ 3 ప్రకారం కాకుండా అన్ని సబ్జెక్టుల మార్కుల యావరేజ్‌ను పరిగణనలోకి తీసుకోవడం వల్ల అందరికీ మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో ఆ ప్రకారం ఫలితాలివ్వాలని కమిటీ చర్చించింది. ఈ విధానంలోనే 2020–21, 2019–20 విద్యా సంవత్సరాల విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటించనున్నారు. ► 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు ఫార్మేటివ్–1, ఫార్మేటివ్–2 మార్కులను తీసుకుని గ్రేడ్లు ప్రకటిస్తారు. ఎఫ్ఏ(ఫార్మేటివ్ అసెస్మెంట్) పరీక్షలకు సంబంధించి లిఖిత పూర్వక పరీక్షలు, ఇతర పరీక్షలను విభజిస్తారు. ఎఫ్ఏ–1లోని లిఖిత పరీక్షకు సంబంధించిన 20 మార్కులను 70 శాతానికి పెంపుచేస్తారు. ఇతర 3 రకాల పరీక్షలకు సంబంధించిన 30 మార్కులను 30 శాతంగా పరిగణిస్తారు. ఉదాహరణకు 2020–21 విద్యాసంవత్సరానికి సంబంధించి ఒక విద్యార్థికి ఎఫ్ఏ–1 లిఖిత పూర్వక పరీక్షలో 20 మార్కులకు 18 మార్కులు వస్తే వాటిని 70 శాతానికి పెంపుచేసి 31.5 మార్కులుగా పరిగణిస్తారు. మిగతా మూడు విభాగాల్లో 30 మార్కులకు 27 మార్కులు సాధించి ఉంటే వాటిని 30 శాతానికి కుదింపుచేసి 13.5 మార్కులు వచ్చినట్టుగా పరిగణిస్తారు. మొత్తంగా ఎఫ్ఏ–1లో ఆ విద్యార్థికి 45 మార్కులు వచ్చినట్టుగా ప్రకటిస్తారు. అదే విధంగా ఎఫ్ఏ–2 మార్కులనూ విభజిస్తారు. ఎఫ్ఏ–2లో ఆ విద్యార్థికి 47 మార్కులొస్తే కనుక ఆ రెంటినీ కలిపి 100 మార్కులకు 92 మార్కులు సాధించినట్టుగా.. గ్రేడును నిర్ణయిస్తారు. ► 2019–20 విద్యాసంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకూ గ్రేడ్లపై కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ విద్యాసంవత్సరంలో విద్యార్థులు ఫార్మేటివ్ అసెస్మెంటు(ఎఫ్ఏ) పరీక్షలు 3, సమ్మేటివ్ అసెస్మెంటు (ఎస్ఏ) పరీక్ష ఒకటి రాసి ఉన్నారు. ఫార్మేటివ్ 1, 2, 3ల మార్కులను 50గా తీసుకుంటారు. సమ్మేటివ్ పరీక్షలు 100 మార్కులకు నిర్వహించినందున వాటిని యావరేజ్ చేసి 50గా తీసుకుంటారు. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులను రెండింటినీ కలిపి 100 శాతానికి యావరేజ్ చేసి గ్రేడ్లు ఇవ్వనున్నారు. -
మూడు రోజుల్లో టెన్త్ మెమోలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను 3 రోజుల్లో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలా ప్రభుత్వ పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. వాటిని ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులు తమ సంతకం చేసి విద్యార్థులకు అందజేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మెమోలతో విద్యార్థులు కాలేజీల్లో చేరొచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. ఇక పూర్తి స్థాయి మెమోలను మరో నెల రోజుల్లో పంపించనున్నట్లు వెల్లడించింది. పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్స్, గ్రేడ్ పాయింట్ యావరేజ్‌తో (జీపీఏ) కూడిన ఫలితాలను సోమవారం ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. విద్యార్థులకు అందజేసే పాస్ మెమోల్లోని వివరాల్లో పొరపాట్లు తలెత్తితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి ద్వారా తెలపాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు పొరపాట్ల వివరాలను ఎస్ఎస్సీ బోర్డుకు పంపించి సవరించేలా చర్యలు చేపడతారని వివరించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను ప్రమోట్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అందరిని పాస్ చేసినట్లు వెల్లడించారు. ఈ పరీక్షలు రాసేందుకు నమోదు చేసుకున్న 5,34,909 మంది విద్యార్థులను పాస్ చేసి, వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్, జీపీఏను కేటాయించినట్లు వెల్లడించారు. విద్యార్థుల జీపీఏ వివరాలతో కూడిన ఫలితాలను వెబ్సైట్లో www.bse. telangana.gov.in ఉంచినట్లు వివరించారు. 1.4 లక్షల మందికి 10/10 జీపీఏ.. పదో తరగతి పరీక్షల ఇంటర్నల్ మార్కుల ఆధారంగా 1.4 లక్షల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది. సాధారణంగా పరీక్షలు నిర్వహించినప్పుడు 10/10 జీపీఏ రాష్ట్రవ్యాప్తంగా 2,500 మందికి మించి ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు ఇంటర్నల్ 20 మార్కుల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల (ఐదింతలు చేసి) ఆధారంగా జీపీఏ నిర్ణయించడంతో ఎక్కువ మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చింది. పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన 5,34,909 మంది విద్యార్థుల్లో దాదాపు 3.74 లక్షల మంది కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. వారిలో ఎక్కువ మందికి పాఠశాలల్లో ఇంటర్నల్ మార్కులు 20కి 20 మార్కులు వేసినట్లు సమాచారం. ఇప్పుడు 10/10 జీపీఏ వచ్చిన 1.4 లక్షల మందిలో 98 శాతం మంది కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులే ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇంటర్నల్స్‌లో ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే వేయడంతో ఈ పాఠశాలల విద్యార్థుల్లో తక్కువ మందికి 10/10 జీపీఏ వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో అధికంగా.. జిల్లాల్లో డీఈవోలు వేసిన లెక్కల ప్రకారం కరీంనగర్ జిల్లాలో 6,446 మందికి 10/10 జీపీఏ వచ్చినట్లు తెలిసింది. అలాగే నల్లగొండలో 6,642 మందికి, సిద్దిపేటలో 4,664 మందికి, వరంగల్‌లో 6,614 మందికి, హైదరాబాద్‌లో దాదాపు 10 వేల మంది విద్యార్థులకు 10/10 జీపీఏ వచ్చినట్లు సమాచారం. -
ఆన్లైన్లో టెన్త్ ‘గ్రేడ్’ వివరాలు
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో పదోతరగతి పరీక్షలు రద్దు చేసిన విషయం తెలిసిందే. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ ఉత్తీర్ణత చేశారు. ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కుల ప్రతిపదికన గ్రేడ్లను నిర్ణయించారు. విద్యార్థులకు కేటాయించిన గ్రేడ్ వివరాలను సోమవారం సాయంత్రం 3 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యార్థులు తమకు కేటాయించిన గ్రేడ్ వివరాలను www. bse.telangana.gov.in వెబ్సైట్లో పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పదో తరగతి పరీక్షల కోసం నమోదు చేసుకున్న 5,34,903 మంది విద్యార్థులకు గ్రేడ్ కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు. విద్యార్థులకు సంబంధించిన పాస్ మెమోలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా పొందవచ్చని మంత్రి తెలిపారు. పాస్‌మెమో వివరాల్లో ఎవైనా పొరపాట్లు తలెత్తితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుని ద్వారా ఎస్ఎస్సీ బోర్డుకు పంపిస్తే సరిచేస్తారని మంత్రి తెలిపారు. పని చేయని తెలంగాణ టెన్త్ మార్కుల గ్రేడ్ల సైట్ సోమవారం సాయంత్రం 3 గంటలకు మార్కుల మెమోలు ఆన్లైన్లో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థులంతా సంబంధిత వెబ్సైట్ ఓపెన్ చేశారు. కానీ సాయంత్రం 5 గంటలైనా www.bsc.telangana.gov.in వెబ్సైట్ ఓపెన్ కాలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టెన్త్ మోడల్ పేపర్ల విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను జూలై 10 నుంచి నిర్వహించాలని నిర్ణయించిన విద్యా శాఖ.. కరోనా నేపథ్యంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. 11 పేపర్లను ఆరుకు కుదించిన ఎస్ఎస్సీ బోర్డు అందుకు సంబంధించిన సెక్షన్లు, ప్రశ్నల తీరు, మార్కులు ఎలా ఉంటాయో పేర్కొంటూ ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ మాదిరి పత్రాలను శుక్రవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. శనివారం తెలుగు, హిందీ మార్కుల మాదిరి పత్రాలతో పాటు ఆయా పేపర్లకు సంబంధించిన మాదిరి ప్రశ్నపత్రాలను కూడా విడుదల చేసినట్లు బోర్డు డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. ఆ వివరాలివీ.. ► తెలుగు పేపర్ సమయం 3.15 గంటలు. గతంలోని రెండు పేపర్లను కలిపి 100 మార్కులకు ఒకే పేపర్‌గా ఉంటుంది. విభాగం–1లో అవగాహన, ప్రతిస్పందన కింద 32 మార్కులకు ప్రశ్నలుంటాయి. వీటిలో 4 వ్యాసరూప ప్రశ్నలు కాగా.. ఒక్కో దానికి 8 మార్కులు ఇస్తారు. పేపర్–1 నుంచి 16 మార్కులకు, పేపర్–2 నుంచి 16 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ► విభాగం–2లో వ్యక్తీకరణ, సృజనాత్మకత కింద 36 మార్కులకు ప్రశ్నలుంటాయి. వీటిలో లఘు సమాధాన ప్రశ్నలు ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున 3 ఉంటాయి. ఇదే విభాగంలో ఒక్కొక్కటి 8 మార్కుల చొప్పున 3 వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. ఇందులోనూ పేపర్–1 నుంచి 16 మార్కులకు, పేపర్–2 నుంచి 20 మార్కులకు ప్రశ్నలుంటాయి. ► విభాగం–3లో 36 మార్కులకు పలు భాషాంశాల ప్రశ్నలను అడుగుతారు. అతి లఘు, లక్ష్యాత్మక ప్రశ్నలుగా ఇవి ఉంటాయి. పేపర్–1 మార్కులకు, పేపర్–2 నుంచి 14 మార్కులకు ప్రశ్నలుంటాయి. ► హిందీ పేపర్లోని మార్కుల మాదిరి ప్రశ్నపత్రాన్ని బోర్డు విడుదల చేసింది. ఇందులో 4 నిబంధనాత్మక ప్రశ్నలు 36 మార్కులకు ఉంటాయి. లఘు ఉత్తరాత్మక ప్రశ్నలు 28 మార్కులకు 6 ఉంటాయి. అతి లఘు ఉత్తరాత్మక ప్రశ్నలు 8 ఉప విభాగాలుగా 24 మార్కులకు ఉంటాయి. లక్ష్యాత్మక ప్రశ్నలు 12 మార్కులకు ఉంటాయి. ఇవీ మార్గదర్శకాలు ► టెన్త్ పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఎస్సీ బోర్డు అన్ని జిల్లాల డీఈవోలకు మార్గదర్శకాలు పంపింది. ► కోవిడ్–19 నేపథ్యంలో అదనంగా పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు వీలుగా అనువైన పాఠశాలలతోపాటుజూనియర్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలను కూడా గుర్తించాలని పేర్కొంది. ప్రైవేటు యాజమాన్యాల పరిధిలోని సంస్థలను కూడా గుర్తించాలని స్పష్టం చేసింది. ► డిప్యూటీ డీఈవో, ఎంఈవో, హెడ్మాస్టర్లతో కూడిన బృందం కోవిడ్–19 ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఆయా సంస్థలను గుర్తించాలని, ఒక్కో బృందం 20 సెంటర్లను సందర్శించాలి. ► కోవిడ్–19 కోసం క్వారంటైన్ కేంద్రాలుగా ఉన్న వాటిని మినహాయించాలి. ► ఈనెల 18వ తేదీ నాటికి ఆయా కేంద్రాల సమాచారాన్ని ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్‌కు సమర్పించాలి. -
టెన్త్ పరీక్షల మార్కుల నమూనా పత్రాలు ఇవే
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విభాగాల వారీగా ప్రశ్నల సంఖ్య, మార్కుల విధానాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ ఏ.సుబ్బారెడ్డి శుక్రవారం రాత్రి నమూనా పత్రాలను విడుదల చేశారు. నాలుగు పేపర్ల నమూనా పత్రాలను బోర్డు వెబ్సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. గతంలో 11 పేపర్లకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించగా ఈసారి 6కి కుదించిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు పేపర్ల మార్కుల నమూనా పత్రాలను విభాగాల వారీగా ప్రకటిస్తున్నామని డైరెక్టర్ పేర్కొన్నారు. మిగతావి కూడా త్వరలోనే వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. -
లాక్ డౌన్ ముగిశాకే ‘టెన్త్’పై నిర్ణయం
సాక్షి, అమరావతి: లాక్డౌన్ ముగిశాకే రాష్ట్రంలో టెన్త్ పరీక్షలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ చెబుతోంది. ఈ నెలాఖరు లేదా మే మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుందని భావిస్తోంది. తొలుత మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించేలా ఎస్ఎస్సీ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది. అదే సందర్భంలో స్థానిక ఎన్నికల ప్రకటన వెలువడటంతో మార్చి 31 నుంచి ఏప్రిల్ 17వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేలా షెడ్యూల్‌ను సవరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మార్చి 31 నుంచి జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. కనీసం 15 రోజుల వ్యవధి అవసరం ► కొత్త షెడ్యూల్ ప్రకటించినా కనీసం 15 రోజుల వ్యవధి కావాల్సి ఉంటుందని.. ఆ తరువాతే పరీక్షల తేదీలను నిర్ణయించాల్సి ఉంటుందని ఎస్ఎస్సీ బోర్డు చెబుతోంది. ► కరోనా నేపథ్యంలో విద్యార్థులను దూరదూరంగా కూర్చోబెడతామని ఇంతకుముందే బోర్డు ప్రకటించింది. ► ఈ దూరం పెంచితే పరీక్ష కేంద్రాలు సరిపోవు. ఇంతకుముందు గుర్తించిన పరీక్ష కేంద్రాల ప్రకారం విద్యార్థులకు గూగుల్ మ్యాపింగ్‌తో కూడిన హాల్ టికెట్లను బోర్డు జారీ చేసింది. ► జంబ్లింగ్ విధానంలో ఎవరెవరికి ఏయే పరీక్ష కేంద్రాలు కేటాయించారో కూడా వాటిలో వివరంగా ఇచ్చారు. ► ఇప్పుడు కొత్తగా మరిన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. ఎవరెవరికి ఏయే సెంటర్లు కేటాయించారో తెలియజేస్తూ తిరిగి మళ్లీ హాల్ టికెట్లు జారీ చేయాల్సి వస్తుంది. ► ఇది సమస్యతో కూడుకున్న పని కావడంతో మొత్తం ప్రక్రియ మొదటికొచ్చి పరీక్షల నిర్వహణ మరింత ఆలస్యం అవుతుంది. ► ఈ దృష్ట్యా ప్రస్తుతం గుర్తించిన పరీక్ష కేంద్రాల్లోనే అదనపు సదుపాయాలు కల్పించాలనే ఆలోచనలో ఉంది. సీబీఎస్ఈకి కూడా.. ► రాష్ట్రంలో 1నుంచి 5 తరగతి విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షలు పూర్తయ్యాయి. ► 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షలు లేకుండా అందరూ పాసైనట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ► సీబీఎస్ఈ కూడా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సంవత్సరాంత పరీక్షలు రద్దు చేయాలన్న ఆలోచనకు వచ్చింది. ► సీబీఎస్ఈలో 9, 11 తరగతుల వార్షిక పరీక్షలు ఇంకా నిర్వహించనందున ఆ విద్యార్థులను ప్రాజెక్ట్ వర్క్, టర్మ్ ఎగ్జామ్స్ ఆధారంగా పై తరగతులకు ప్రమోట్ చేయాలన్న ఆలోచన ఉంది. ► 10, 12 తరగతుల పరీక్షలను వాయిదా వేసిన బోర్డు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానుసారం షెడ్యూల్‌ను ప్రకటించనుంది. 29 మెయిన్ పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించే ఆలోచన ఉన్నట్లు కేంద్రం తెలిపింది. -
మేమే రాస్తాం.. సాయం వద్దు!
సాక్షి, హైదరాబాద్/వెంగళ్రావునగర్: అవిభక్త కవలలు వీణావాణిలు ఈ నెల 19 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యాశాఖ వేర్వేరుగా జారీ చేసిన హాల్ టికెట్లను పాఠశాల అధ్యాపకులు శుక్రవారం వారికి అందజేశారు. జబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ వీణావాణిలకు మినహాయింపునిచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు వారిద్దరికీ వెంగళ్ రావునగర్ స్టేట్‌హోంకు సమీపంలోని మధురానగర్‌కాలనీలో ప్రతిభా హైస్కూల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. అధికారుల పర్యవేక్షణలో నేలపై కూర్చొని పరీక్ష రాయనున్నారు. వేర్వేరు హాల్‌టికెట్లు.. మహిళా శిశుసంక్షే మ అధికారులు 2018లో వీణావాణిలకు వెంగళ్రావునగర్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కల్పించారు. వీరికి వేర్వేరు అడ్మిషన్ నంబర్లు ఇచ్చారు. ఇటీవల వారు ఎస్ఎస్సీ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా, పరీక్ష రాసే అర్హత, శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నట్లు నిర్ధారించుకున్న అధికారులు ఇద్దరికీ వేర్వేరు హాల్‌టికెట్లు జారీ చేశారు. వారు కోరితే స్క్రైబ్(సహాయకులు)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమకు ఎవరి సహాయం అవసరం లేదని, తామే స్వయంగా పరీక్ష రాస్తామని వీణావాణిలు స్పష్టం చేసినట్లు తెలిసింది. ప్రత్యేక గదిని సిద్ధం చేస్తాం వీణావాణిలు మా పాఠశాలలో పరీక్షలు రాయనున్నట్లు ఈరోజే తెలిసింది. విద్యాశాఖ వారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయమని సూచిస్తే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. – రాంబాబు, ప్రతిభా హైస్కూల్ చైర్మన్ -
నేడు ఏపీ పదో తరగతి ఫలితాలు
-
టెన్త్ ఫలితాల ఆలస్యంపై స్పందించిన ఎస్ఎస్సీ బోర్డ్
-
స్కూల్ యూనిఫాంలో వస్తే నో ఎంట్రీ
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షల్లో భాగంగా శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–1 పరీక్ష జరుగనుంది. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మొత్తం 1,71,731 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతుండగా, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర బంధువులు, స్నేహితులు వీరికి ఆల్ ద బెస్ట్ చెప్పి.. ఎలాంటి ఆందోళనలకు గురికాకుండా ధైర్యంగా పరీక్ష రాయాలని హితబోధ చేస్తున్నారు. స్కూల్ యూనిఫాంలో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను లోనికి అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులంతా సివిల్ డ్రెస్‌లో రావాల్సిందిగా విద్యాశాఖ అధికారులు సూచించారు. అంతేకాదు నిర్ధేశిత సమయం ముగిసిన తర్వాత ఐదు నిమిషాల లోపు 9.35 గంటల వరకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లను నిరాకరించే అవకాశం ఉంది. పరీక్ష కేంద్రంలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని, విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతించనున్నట్టు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి వెంకట నర్సమ్మ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె శుక్రవారం పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. జబ్లింగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఎగ్జామ్ సెంటర్ నిర్వహకులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఎలాంటి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
పోరాడి సాధించింది..
* ఎస్ఎస్సీ రీవాల్యుయేషన్లో సైతం పాత మార్కులే.. * త్రిసభ్య కమిటీ నివేదికలో 10/10 జీపీఏ సాధించిన వైనం * విజయ దరహాసంతో అల్లం భావన భట్టిప్రోలు(గుంటూరు) : పదవ తరగతి పరీక్షల్లో 9.8 జీపీఏ ర్యాంకు పొందిన ఓ విద్యార్థిని ఎస్ఎస్సీ బోర్డుకు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోగా మళ్లీ అవే మార్కులు వచ్చాయని పంపారు. అయితే తనపై తనకు అంచచల విశ్వాసమున్న ఆ విద్యార్థిని అంతటితో తన రాత అంతేలే అని ఊరుకోలేదు. రీవాల్యుయేషన్లో కూడా తప్పు జరిగిందంటూ మళ్లీ ఎగ్జామినేషన్ బోర్డును ఆశ్రయించింది. ముచ్చటగా మూడోసారి ఆ బాలిక సమాధాన పత్రాలు మూల్యాంకనం చేసి చివరకు బోర్డు 10కి10 జీపీఎ ర్యాంకు ఖరారు చేసి పంపింది. విజయగర్వంతో విద్యార్థిని వదనంపై చిరు దరహాసం మెరిసింది. 9 జీపీఏ రావడంతో నిరాశ.. భట్టిప్రోలుకు చెందిన అల్లం వెంకట్రావు కుమార్తె అల్లం భావన ఐలవరం జిల్లా పరిషత్ హైస్కూల్లో గత విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలు రాసింది. మొదటి నుంచి భావన చదువులో మంచి మార్కులు సాధిస్తూ పాఠశాల స్థాయి నుంచి ప్రథమురాలుగా నిలిచేది. అయితే పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 జీపీఏ రావడంతో హతాశురాలైంది. బోర్డుకు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేయగా పరీక్షల్లో 5 సబ్జెక్ట్‌ల్లో 10కి 10 జీపీఎ మార్కులు రాగా సోషల్ సబ్జెక్ట్‌లో 9 జీపీఎ మార్కులు వచ్చినట్టు ఎస్ఎస్సీ బోర్డుకు సమాధాన పత్రాలు పంపినా ఫలితంల లేకపోయింది. చివరికి త్రిసభ్య కమిటీ పరిశీలించగా న్యాయంగా ఆమెకు ఒక మార్కు రావాలని నిర్ధారించింది. ఎట్టకేలకు పరిశీలించిన ఎస్ఎస్సీ బోర్డు దొర్లిన తప్పును సరిచేసి ఈ నెల 9వ తేదీన 1 మార్కు కలిపి ఏ2 గ్రేడ్ నుంచి ఏ1 గ్రేడ్‌కు మార్చి ఉత్తర్వులు పంపినట్టు భావన తండ్రి వెంకట్రావు తెలిపారు.