Suicide
-
అమ్మా.. నీకు భారమయ్యా.. క్షమించు!
శివ్వంపేట(నర్సాపూర్): జులాయిగా తిరుగుతున్న కుమారుడిని తల్లి మందలించడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మండల పరిధి దంతన్‌పల్లి గ్రామానికి చెందిన కుల్ల లక్ష్మీ నర్సింలు దంపతులకు సంతానం కలగకపోవడంతో ఓ బాబుని దత్తత తీసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత దంపతులకు కూతురు పుట్టింది. పిల్లలు చిన్నతనంలోనే నర్సింలు మృతి చెందాడు. అప్పటి నుంచి లక్ష్మీ కూలి పనులు చేసుకుంటూ దత్తత కుమారుడు వెంకటేశ్(24)తోపాటు కూతురు అఖిలను పోషిస్తుంది. కుమారుడు ఎలాంటి పనులు చేయకుండా జులాయిగా తిరుగుతుండటంతో తల్లి గురువారం మందలించింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. శుక్రవారం ఉదయం గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని కనిపించాడు. అమ్మ నన్ను క్షమించు నీకు భారమయ్యాను. నా చావుకు కారణం ఎవరు కాదు. నీవు, చెల్లి ఆనందంగా ఉండండి అంటూ రాసిన సూసైట్ నోట్ మృతుడి జేబులో లభ్యమైంది. మృతుడు తల్లి లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.ఉరేసుకొని వ్యక్తి..సిద్దిపేటరూరల్: చెట్టుకు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చిన్నకోడూరు ఎస్ఐ బాలక్రిష్ణ కథనం మేరకు.. జక్కాపూర్ గ్రామానికి చెందిన కారంకంటి రాజు (32) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాజుకు నాలుగేళ్లుగా మానసిక స్థితి సక్రమంగా లేదు. ఆస్పత్రుల్లో వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేదు. శుక్రవారం ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని వెళ్లి చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడటం వెనుక.. ఇటీవల గ్రామంలో నూతనంగా నిర్మించబడిన పశు వైద్యశాల ప్రహరీ గోడ నిర్మాణమేనని సమాచారం.పశు వైద్యశాల వెనకాలే సాయిరెడ్డి ఇల్లు ఉండగా, ఆయన ఇంటికి దారి లేకుండా పశు వైద్యశాల ప్రహరీ గోడను నిర్మించారంటూ వివాదం నెలకొంది. దీంతో మనస్తాపానికి గురైన సాయి రెడ్డి కల్వకుర్తి వచ్చి పురుగుల మందు తాగాడు. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపు సాయిరెడ్డి మృతి చెందాడు. సాయిరెడ్డి రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్లో తనను సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు పేర్కొనడం సంచలనంగా మారింది. -
మాదాపూర్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య
-
ప్రేమ.. పెళ్లి.. వేధింపులు.. ఆత్మహత్య
ధారూరు: ఓ అనాథ బాలికకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకోవడంతో పాటు వేధింపులకు గురిచేసి, ఆత్మహత్యకు ప్రేరేపించిన యువకుడు, అతని కుటుంబ సభ్యులపై పోక్సోతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఎస్ఐ వేణుగోపాల్‌గౌడ్, గ్రామస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.. ధారూరు మండల కేంద్రానికి చెందిన కె.మంజుల, యాదయ్య దంపతులకు కొడుకు, కూతురు సంతానం. మంజుల, యాదయ్య కొన్నేళ్ల క్రితం మరణించారు. మూడేళ్ల క్రితం వీరి కొడుకు కూడా మృతిచెందడంతో కూతురు స్వాతి(16) అనాథగా మిగిలింది. దోర్నాల్ గ్రామంలో ఉంటున్న అమ్మమ్మ బాలికను చేరదీసి, స్థానిక కస్తూర్బా విద్యాలయంలో చేరి్పంచింది. ఇదే సమయంలో కుక్కింద గ్రామానికి చెందిన యువకుడు శ్రీకాంత్ తా ను స్వాతిని ప్రేమిస్తున్నానంటూ తీసుకెళ్లి, పెళ్లి చేసుకున్నాడు. ఏడాది పాటు వీరి కాపురం సజావు గానే సాగింది. ఆ తర్వాత భర్త శ్రీకాంత్‌తో పాటు అత్త, మామలు వెంకటమ్మ, యాదయ్య, ఆడపడుచులు స్వాతిని వేధించడం ప్రారంభించారు.వీరి ఆగడాలు భరించలేక ఈనెల 16న సాయంత్రం స్వాతి ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి, స్పృహ కోల్పోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందింది. స్వాతి ఆత్మహత్యకు కారణమైన భర్త, అత్త, మామ, ఆడపడుచులపై బాల్య వివాహం, వేధింపులు, పోక్సో, ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర సెక్షన్ల కింద కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది: రేవంత్ సర్కారుపై కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అసమర్థ పాలనలో తెలంగాణలో రోజుకు ఎంతోమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలకు బడుగు బలహీన వర్గాలు బలైపోతున్నాయని అన్నారు. రైతులు, ఆటోడ్రైవర్లతోపాటు వివిధ వర్గాలకు చెందిన వారు నిత్యం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందిస్తూ..రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోందని, కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతున్నదని మండిపడ్డారు. రాజ్యహింసతో రాష్ట్రం నిత్యం తల్లడిల్లుతోందని, గాయాలతో గోడుగోడునా విలపిస్తోందని విమర్శించారు. రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయెనని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో జీవనోపాధి కరువై బడుగులు బలిపీఠం ఎక్కవట్టెనని ఆయన వాపోయారు. ఇది ఎవడు చేసిన పాపమని, ముమ్మాటికీ మార్పు తీసుకొచ్చిన శాపమేనని పేర్కొన్నారు.రోజుకో చావుతో తెలంగాణ తెల్లారుతోంది కాంగ్రెసోడి కుట్రలకు బలైపోతుంది!రాజ్యహింసతో నిత్యం తల్లడిల్లుతోందిగాయాలతో గోడుగోడునా విలపిస్తోంది!రైతు రారాజుగా బ్రతికిన తెలంగాణలో... అన్నదాతల ఆత్మహత్యలు నిత్యకృత్యమాయే!ఉపాధికి చిరునామాగా మారిన రాష్ట్రంలో..జీవనోపాధి కరువై బడుగులు… pic.twitter.com/KPHWnAg7PN— KTR (@KTRBRS) November 19, 2024 -
ఆర్ధిక ఇబ్బందులు తాళలేక.. వ్యాపారవేత్త ఆత్మాహుతి
బెంగళూరు: ఆర్థిక ఇబ్బందులు నిండు ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. ఓ వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు తాళలేక బతికుండగానే ఆత్మాహుతికి పాల్పడ్డాడు.పోలీసుల వివరాల మేరకు.. ప్రదీప్ హోటల్ కన్సల్టెంట్ బిజినెస్ చేస్తున్నారు. అయితే వ్యాపారంలో నష్టం రావడంతో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. తీసుకున్న అప్పులకు వడ్డీలు పెరిగిపోవడం, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. దీంతో ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ప్రదీప్ బతికుండగానే ఆత్మాహుతి చేసుకోవడంతో విషాదం చోటు చేసుకుంది.బెంగళూరు నగర శివారు ప్రాంతమైన ముద్దీన్పాళ్యకు ప్రదీప్ తన స్కోడా కారులో వచ్చాడు. అనంతరం కారు సీట్లో ఉన్న ప్రదీప్ కారుకు నిప్పంటించాడు. అయితే కారు నుంచి మంటలు రావడంతో భయాందోళనకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ప్రదీప్ ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. అంనతరం బాధితుడి కుటుంబానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. On Saturday afternoon,a 42 yr old businessman Mr Pradeep was charred to death inside his car at Muddinpalya in Bengaluru. Prima Facie suggests a case of death by suicide.Police have registered the case of Unnatural Death.. pic.twitter.com/JOCTeYLBif— Yasir Mushtaq (@path2shah) November 16, 2024 -
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
సంగారెడ్డి టౌన్: గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి మండలం కొత్లాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 9వ తరగతి చదువుతున్న స్వాతి (14) శనివారం ఉదయం పాఠశాల రెండో అంతస్తు భవనంలోని గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఉంది. సమాచారం అందుకున్న డీఎస్పీ సత్తయ్య ఘటన స్థలానికి చేరుకొని.. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబం మదీనాగూడ ఎంఏ నగర్ కాలనీలో నివాసం ఉంటోంది. స్వాతి తండ్రి పండు రాజు, తల్లి దివ్యవాణి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. కాగా, తమ కూతురు ఆత్మహత్య వెనుక హాస్టల్ వారిపైనే అనుమానం ఉందని మృతురాలి తల్లి ఆరోపించారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆమెతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని వార్డెన్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
మరదలిపై వదిన దుర్మార్గం
అన్న భార్య తల్లితో సమానం అంటారు. అలాంటిది ఆ వదిన తప్పుడు దోవలో వెళ్తుంటే ఆ యువతి ఆపాలని చూసింది. కానీ, అదే ఆ యువతి పాలిట మృత్యువైంది. బేగంపేటలో బలవన్మరానికి పాల్పడిన యువతి సూసైడ్ కేసులో.. వదినతో పాటు ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌కు చెందిన విఠల్ కూతురు స్రవంతి(19) ఈ నెల 11వ తేదీన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొరుగున ఉండే ఓ యువకుడి వేధింపులతోనే కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్రవంతి సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌ల ఆధారంగా.. యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లో ఉంటున్న నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.అయితే.. స్రవంతి వదిన శైలజకు నవీన్‌కుమార్‌తో పెళ్లికి ముందే సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అతను ఇటీవల మళ్లీ శైలజను కలవడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని స్రవంతి గుర్తించింది. అన్నను చెప్పనని, ఇప్పటికైనా తీరు మార్చుకోమని స్రవంతి, శైలజతో మంచిగా చెప్పింది. అయితే.. శైలజ తన తీరు మార్చుకోలేదు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భావించింది. ఈ క్రమంలో.. స్రవంతికి ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడితో సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తూ వేధింపులకు దిగింది. అతను తనకు సోదరుడి వంటివాడని చెప్పినా వినిపించుకోలేదు.పైగా తనతో సంబంధం ఉన్న నవీన్‌కుమార్‌ను రంగంలోకి దించి అతనితో స్రవంతి ఫోన్‌కు సందేశాలు పంపిస్తుండేది. వదిన, నవీన్‌కుమార్‌లు పెట్టే వేధింపులు తట్టుకోలేక స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కోడలే తన కూతురు ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసుల విచారణలో బయటపడటంతో స్రవంతి తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. శైలజతో పాటు నవీన్‌కుమార్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. -
ఏపీలోనూ ‘కోటా ఫ్యాక్టరీ’లు
సాక్షి, అమరావతి: ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షల శిక్షణకు రాజస్థాన్‌లోని కోటా నగరం ప్రసిద్ధి చెందింది. అక్కడ ప్రతి ఇల్లూ ఓ శిక్షణ సంస్థే. కోటా ఇన్స్టిట్యూట్స్లో శిక్షణ తీసుకుంటే ర్యాంక్ గ్యారంటీ అనే ప్రచారం బలంగా ఉండడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యార్థులు వస్తుంటారు. అయితే అక్కడి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ఇతరులకు తెలియదు. శిక్షణ కోసం కోటా వచ్చిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక గతేడాది 26 మంది ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు వదిలారు. వీరంతా 17–19 ఏళ్ల వయసువారే. ఇక సివిల్స్ శిక్షణకు బ్రాండ్ సిటీ లాంటి ఢిల్లీలో ఇటీవల ఓ పేరొందిన స్టడీ సర్కిల్‌ను వరద ముంచెత్తడంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి వీటికి భిన్నంగా ఏమీ లేదు. మన వద్ద కూడా అన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇంటర్, పోటీ పరీక్షల్లో ర్యాంకుల కోసం విద్యార్థులపై ఇదే తరహా ఒత్తిడి నెలకొంది.పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థకోచింగ్ సెంటర్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు ఆధారంగా ప్రత్యేక చట్టాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తేనుంది. శిక్షణ సంస్థలపై పర్యవేక్షణకు 12 మంది అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతత్వంలో పాఠశాల, వైద్య, సాంకేతిక విద్య కార్యదర్శులు, డీజీపీ సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సంస్థల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సెంటర్లు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండుసార్లు వరకు జరిమానా, ఆ తరువాత సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. విద్యార్థి శిక్షణ మధ్యలో మానేస్తే దామాషా ప్రకారం ఫీజు రీఫండ్ చేయాల్సి ఉంటుంది. కోటాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం అనంతరం ఐఐటీ, నీట్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ పేరుతో 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవడం, సాధారణ పాఠశాలల్లో చేరిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.బలవన్మరణాలు..విశాఖ పీఎం పాలెంలోని ఓ కార్పొరేట్ స్కూల్లో ఈ ఏడాది జనవరిలో 9వ తరగతి చదివే ఓ విద్యార్థికి టెన్త్ పాఠ్యాంశాలు బోధిస్తూ టెస్టుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో తిరుపతి జిల్లా గూడూరులో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీల సందర్భంగా రికార్డులు సమర్పించాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో 21 ఏళ్ల విద్యార్థి హాస్టల్ భవనంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు 2021లో ఏపీలో 523 మంది విద్యార్థులు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడినట్లు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య మూడింతలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2014 తరువాత 57 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై మార్కులు, ర్యాంకుల ఒత్తిడి పెరగడంతో అంచనాలను అందుకోలేక సగటున వారానికి ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి కార్పొరేట్ విద్యాసంస్థల వేధింపులను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజస్థాన్‌లో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయడంతో పాటు కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ‘‘కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు–2024’’ పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. -
అమ్మా సారీ.. నేను చదవలేకపోతున్నా
నెల్లూరు సిటీ: ‘అమ్మా.. సారీ నేను చదవలేకపోతున్నాను.. నేను బతికినా ఒకటే.. చచ్చినా ఒకటే’ అంటూ పదో తరగతి విద్యార్థి హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు మండలం ఆర్ఆర్ కాలనీలో దువ్వూరు హరనాథ్‌రెడ్డి, అనిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి జీవనాధారం వ్యవసాయం. ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు పనత్రెడ్డి (15) ధనలక్ష్మీపురంలోని వీబీఆర్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. అతను చిన్నప్పటి నుంచే చదువుల్లో కొంత వెనుకబడ్డాడు. ఇంట్లో ఉంటే ఆటల్లో పడి పుస్తకాలపై శ్రద్ధ పెట్టే అవకాశం తక్కువగా ఉంటుందని, హాస్టల్లో చేర్చితే సహచర విద్యార్థులతో కలిసి మంచి మార్కులు సాధిస్తాడని తల్లిదండ్రులు భావించారు. దీంతో ఎనిమిదో తరగతిలోనే హాస్టల్లో చేర్పించారు. చదువు విషయంలో పనత్పై ఎక్కువ ఒత్తిడి చేయొద్దని, పాస్ మార్కులు వస్తే చాలని అక్కడి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు చెప్పారు. అయితే పనత్రెడ్డికి ఒక పక్క పాఠాలు అర్థం కాక, తల్లిదండ్రులకు చెబితే తిడతారని భయపడ్డాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక తీవ్ర ఒత్తిడికి లోనవుతూనే చదువు కొనసాగించాడు. మంచి మార్కులు రావడం లేదన్న ఆందోళన అతన్ని వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం భోజనం చేశాక పనత్రెడ్డి నేరుగా హాస్టల్లోని తన గదికి వెళ్లాడు. నైలాన్ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన సహచర విద్యార్థులు పాఠశాల సిబ్బందికి సమాచారం అందించారు. వారు కిందకు దించి అతడిని చికిత్స నిమిత్తం నారాయణ హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే పనత్రెడ్డి మృతి చెందాడని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు హుటావుటిన ఘటనా స్థలానికి చేరుకుని విగతజీవిగా పడి ఉన్న పనత్ను చూసి కన్నీటి పర్యంతమయ్యారు.పాఠశాల ఎదుట ఆందోళనపనత్రెడ్డి మృతిపై విద్యార్థి సంఘ నాయకులు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. ఉపాధ్యాయుల ఒత్తిడితోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సర్ది చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమత్తం నెల్లూరు జీజీహెచ్‌కు తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కన్నా.. నువ్వున్న చోటుకే వచ్చేస్తున్నాం!
సేలం: అనారోగ్యంతో ఏడేళ్ల కుమారుడి మృతి చెందడాన్ని తట్టుకోలేక ఆవేదనతో ఉన్న దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కోవైలో కలకలం రేపింది. వివరాలు.. విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని పూలావూరని గ్రామానికి చెందిన పళని స్వామి (39). ఈయన ఇంటిలో విద్యార్థులకు ట్యూషన్ నిర్వహిస్తూ వస్తున్నాడు. ఆయన భార్య వత్సలా (35). ఈమె అదే ప్రాంతంలో ఉన్న ప్రైవేటు బ్యాంకులో పని చేస్తున్నారు. వీరికి ఏడేళ్ల వయస్సులో కుమారుడు ఉండేవాడు. అయితే గత ఏప్రిల్ నెల మెదడు జ్వరం కారణంగా మృతి చెందాడు. కుమారుడు చనిపోయినప్పటి నుంచి పళనిస్వామి, వత్సలాలు అమిత వేదనతో ఉంటూ వచ్చారు. వారిని బంధువులు సముదాయిస్తూ వచ్చారు. అయినప్పటికీ తీవ్ర ఆవేదనతో ఉన్న దంపతులను కోవైలో ఉన్న బంధువుల ఇంటికి తీసుకువెళ్లారు. కొన్ని రోజులు బంధువుల ఇంటిలో ఉన్న వారు ఇటీవల వేట్టపట్టి వీకేవీ శ్రీనగర్ ప్రాంతంలో అద్దెకు ఇల్లు తీసుకుని నివసిస్తూ వచ్చారు. అయినా కొడుకు పోయాడనే ఆవేదనతో కనిపిస్తూ వచ్చారు.ఆత్మహత్య..ఈ క్రమంలో సోమవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరి గాంధీపురం కోట్టూర్ ప్రాంతంలో ఒక లాడ్జ్‌లో ఇద్దరు బస చేశారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి వరకూ ఇద్దరు గదిలో నుంచి బయటకు రాకపోవడంతో సందేహించిన లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాట్టూర్ పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా గదిలో దంపతులు ఇద్దరు నోటిలో నురగలు కక్కున్న స్థితిలో మృతదేహాలుగా పడి కనిపించారు. దీంతో వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపంచనామా నిమిత్తం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు ఆ గదిని తనిఖీ చేయగా, అక్కడ రెండు కూల్ డ్రింక్స్ బాటిళ్లు ఉన్నాయి. ఒక లేఖ చిక్కింది. ఆ లేఖలో.. తమ మృతికి ఎవరూ కారణం కాదని, తమ కుమారుడి వద్దకే వెళుతున్నామని రాసి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. -
ప్రాణం తీస్తున్న ప్రేమ
ప్రేమ, దాని కారణంగా వివాహేతర సంబంధాలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. హత్యలు,ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. కిడ్నాపులకు దారితీస్తున్నాయి. ప్రేమ కారణంగా గత పదేళ్లలో లక్షకుపైగా హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి.⇒ దేశంలో ప్రేమ, తత్సంబంధ కారణాల వల్ల 201322 మధ్య ఆత్మహత్య చేసుకున్నవారు 74,180⇒ మొత్తం ఆత్మహత్యల్లో ప్రేమ కారణంగా జరిగినవి 76.1%⇒ వివాహేతర సంబంధాల వల్ల జరిగిన ఆత్మహత్యలు 13.3% ⇒ ప్రేమ కారణంగా హత్యకు గురైనవారు 30,012⇒ మొత్తం హత్యల్లో అక్రమ సంబంధాల కారణంగా జరిగినవి 46.6%⇒ పెళ్లిళ్ల కోసం చేసిన కిడ్నాపులు 2.8 లక్షలు⇒ పరువు హత్యలు 517ఆధారం: నేషనల్ర్ కైమ్ రికార్డ్స్ బ్యూరో -
‘నన్ను క్షమించండి’.. జేఈఈ పరీక్ష ఫెయిల్ అవ్వడంతో..!
న్యూఢిల్లీ: చిన్న చిన్న కారణాలతోనే విలువైన ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. అమ్మానాన్న తిట్టారని, మొబైల్ కొనివ్వలేదని, పరీక్షలో ఫెయిల్ అయ్యామని, ప్రేమ విఫలమైందని, డిప్రెషన్ వంటి కారణాలతో తనువు చాలిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా యువత నుంచి పెద్దవాళ్ల వరకు క్షణికావేశంలో తమను తామే చంపేసుకుంటున్నారు. తాజాగా ఓ యువతి కూడా ఇలాంటి తప్పుడు నిర్ణయమే తీసుకుంది.జేఈఈ మెయిన్స్ పరీక్షలో పాస్ కాలేదని మనస్తాపం చెందిన 17 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది. బిల్డింగ్‌పై నుంచి దూకి ప్రాణాలు విడిచింది. దేశ రాజధాని ఢిల్లీలోని జామియా నగర్లో ఈ విషాదం చోటుచేసుకుంది. యువతి తన ఇంటర్ పూర్తికాగానే ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతోంది. అయితే చదువులో ఒత్తిడి కారణంగా పరీక్ష పాస్ కాలేదు. ఆమె అనుకున్న అంచనాలను చేరుకోలేదు. దీంతో తీవ్ర మనస్తాపంతో శుక్రవారం రాత్రి షాహిన్ భాగ్‌లోని బిల్డింగ్‌లోని ఏడో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది.సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి వద్ద సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో‘ నన్ను క్షమించండి.. నేను సాధించలేకపోయాను. జేఈఈ పరీక్షను క్లియర్ చేయలేకపోయాను’ అని రాసి ఉంది. అయితే పరీక్షలో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకుంటానని బాలిక గతంలో తన తల్లికి తెలియజేసిందని పోలీసులు తెలిపారు. ఆమె తండ్రి ప్రైవేట్ ఉగ్యోగి కాగా, ఆమె తల్లి గృహిణి. -
హైదరాబాద్ లో విషాదం.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్...
-
యువతపై కృత్రిమ మేధ ప్రభావం!
అమెరికాలో ఓ యువకుని జీవితంలో అలాంటి ఘటనే జరిగింది. తన కొడుకు ఆత్మహత్యకు ఏఐ చాట్‌బాట్ కారణమంటూ ఫ్లోరిడాలో ఓ తల్లి కోర్టుకెక్కారు. తన 14 ఏళ్ల కొడుకు చాట్‌బాట్‌తో మానసికంగా అనుబంధాన్ని ఏర్పరుచుకున్నాడని, దాన్నుంచి భావోద్వేగపూరితమైన మెసేజ్ వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. కృత్రిమ మేధ యాప్‌లతో పొంచి ఉన్న కొత్తతరహా పెను ప్రమాదాలు, ఆయా యాప్‌లపై ఇంకా సరైన నియంత్రణ లేకపోవడాన్ని ఈ అంశం మరోసారి తెరపైకి తీసుకొచి్చంది. పట్టభద్రుడైన థెరపిస్ట్‌లా ప్రభావం చూపింది: తల్లి 14 ఏళ్ల సెవెల్ సెట్జర్ తరచుగా ‘క్యారెక్టర్.ఏఐ’అనే చాట్‌బాట్ యాప్‌ను ఉపయోగిస్తున్నాడు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’పాత్ర డేనెరిస్ టార్గేరియన్ను పోలిన పాత్రను సృష్టించుకుని సంభాషిస్తున్నాడు. చాట్‌బాట్‌తో వర్చువల్ సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. క్యారెక్టర్.ఏఐ చాట్‌బాట్ టీనేజర్ అయిన తన కొడుకును లక్ష్యంగా చేసుకుందని, అతను ఆత్మహత్య ఆలోచనలను వ్యక్తం చేసిన తర్వాత ఆ యాప్ అదేపనిగా ఆత్మహత్య అంశాన్ని లేవనెత్తి పిల్లాడు ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొలి్పందని అతని తల్లి అమెరికాలోని ఓర్లాండోలో ఫిర్యాదుచేశారు. చాట్‌బాట్ తన పిల్లాడిపై ఒక పట్టభద్రుడైన థెరపిస్ట్‌గా తీవ్ర ప్రభావం చూపించిందని ఆమె ఆరోపించారు. చనిపోవడానికి ముందు ఏఐతో జరిగిన చివరి సంభాషణలో సెవెల్ చాట్‌బాట్‌ను ప్రేమిస్తున్నానని, ‘మీ ఇంటికి వస్తాను’అని చెప్పాడని దావాలో పేర్కొన్నారు. తన కుమారుడి మరణంలో క్యారెక్టర్.ఏఐ చాట్‌బాట్ ప్రమేయం ఉందని తల్లి మేగన్ గార్సియా ఆరోపించారు. మరణం, నిర్లక్ష్యం, ఉద్దేశపూర్వకంగా మానసిక క్షోభను కలిగించినందుకు నిర్దిష్ట నష్టపరిహారాన్ని కోరుతూ గార్సియా దావా వేశారు. గూగుల్‌పై దావా ఈ దావాలో సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, దాని మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆగస్టులో క్యారెక్టర్.ఏఐలో గూగుల్ భారీ స్థాయిలో వాటాలను కొనుగోలుచేసింది. గూగుల్ ఆగమనంతో ఈ యాప్ అంకురసంస్థ మార్కెట్ విలువ ఏకంగా 2.5 బిలియన్ డాలర్లకు పెరిగింది. అయిఏత క్యారెక్టర్.ఏఐ అభివృద్ధిలో తమ ప్రత్యక్ష ప్రమేయం లేదని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే తమ యాప్ వినియోగదారుల్లో ఒకరిని కోల్పోవడం హృదయవిదారక విషయమని సంస్థ తన ‘ఎక్స్’ఖాతాలో ఒక ప్రకటన చేసింది. సెవెల్ కుటుంబానికి సంతాపం తెలిపింది. ‘కృత్రిమ మేధ అనేది నిజమైన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని వినియోగదారులకు మరోసారి స్పష్టంగా గుర్తుచేస్తున్నాం. ఈ మేరకు డిస్క్లైమర్ను సవరిస్తున్నాం. భద్రతను పెంచడానికి అదనపు ఫీచర్లను జోడిస్తాం’అని సంస్థ తెలిపింది. అయితే చాట్‌బాట్ కారణంగా వ్యక్తి మరణం అమెరికాలో పెద్ద చర్చను లేవనెత్తింది. ఇలాంటి కృత్రిమమేథ కారణంగా ఎవరికైనా హాని జరిగితే దానికి బాధ్యులు ఎవరు?. ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? అన్న చర్చ మొదలైంది. ఇతర నియంత్రణ చట్టాల వంటి సెక్షన్ 230 అనేది కృత్రిమ మేథకు వర్తిస్తుందా అనే అంశమూ డిజిటల్ నిపుణుల చర్చల్లో ప్రస్తావనకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తొమ్మిదో అంతస్తు నుంచి దూకి టెకీ ఆత్మహత్య
సాక్షి,హైదరాబాద్:సాఫ్ట్వేర్ ఉద్యోగిని హరిత హైదరాబాద్ నగరం ఉప్పల్‌లోని బహుళ అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం(అక్టోబర్21) అర్ధరాత్రి ఉప్పల్ డీఎస్ఎల్ మాల్ పక్కన ఉన్న ఐటీ కంపెనీ భవనం తొమ్మిదవ అంతస్తు నుంచి దూకడంతో ఆమెను చికిత్స కోసం రామంతాపూర్‌లోని మ్యాట్రిక్స్ ఆస్పత్రికి తరలించారు.అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే హరిత మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. ఐటీ ఉద్యోగిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: పెళ్లి చేయడం లేదని తండ్రి హత్య -
బైక్ కొనలేదని విద్యార్థి ఆత్మహత్య
పీఎంపాలెం: పుట్టిన రోజు నాడు విషాద సంఘటన చోటుచేసుకుంది. తండ్రి బైక్ కొనలేదని కోపంతో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ప్రాణస్నేహితులను దుఃఖ సాగరంలో ముంచెత్తాడు. పీఎంపాలెం గాయత్రీనగర్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీలో సోమవారం జరిగిన సంఘటనకు సంబంధించిన సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలు.. పేరిశెట్టి సూర్యనారాయణ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామం నుంచి సుమారు ఆరేళ్ల క్రితం నగరానికి వలస వచ్చాడు. ప్రస్తుతం ఓ కళాశాలలో హాస్టల్ కుక్‌గా పనిచేస్తూ పీఎంపాలెం గాయత్రీనగర్‌లో భార్య గంగ, పెద్ద కుమారుడు గణేష్ , 9వ తరగతి చదువుతున్న చిన్న కుమారుడు లోకేష్‌తో కలిసి నివసిస్తున్నాడు. పెద్ద కుమారుడు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం పుట్టిన రోజు కావడంతో సాయంత్రం కేక్ కట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో ఏమైందో ఏమో ఇంటి తలుపులు వేసుకుని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. అనుకోని పరిణామంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, స్థానికులు వేలాడుతున్న గణేష్‌ను కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ బాలకృష్ణ తెలిపారు.బైక్ కొనమని తండ్రితో గొడవవిద్యార్థి గణేష్ ఎప్పటి నుంచో బైక్ కొనమని తల్లిదండ్రులను వేడుకుంటున్నాడు. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. బైక్ కొనే స్థోమత ఆ కుటుంబానికి లేదు. ఇదే విషయం తల్లిదండ్రులు గణేష్ నచ్చచెప్పినప్పటికీ వినేవాడు కాదు. ఈ విషయంపైనే తండ్రితో గొడవ పడినట్టు స్థానికులు చెబుతున్నారు. బైక్ కొనే స్థోమత లేకపోవడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పెళ్లింట విషాదం.. భార్యకు పురుగులమందు కలిపి
సాక్షి, నల్లగొండ: పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పురుగులమందు కలిపిన కూల్‌డ్రింక్‌ను భార్యకు తాగించి.. ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఏఎస్ఐ ప్రభాకర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం మొసంగి గ్రామానికి చెందిన బడుగుల వెంకటయ్య(43)– జ్యోతి దంపతులు ఈనెల 16న కుమార్తె వివాహం జరిపించారు. ఆదివారం తమ కుమార్తెను అత్తగారి ఇంటి నుంచి తీసుకురావాల్సి ఉండగా, పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్‌ను భార్య జ్యోతికి ఇచ్చి, తాను గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని గడియ పెట్టుకున్నాడు. అప్పటికే కొంచెం కూల్‌డ్రింక్ తాగిన జ్యోతి పురుగుల మందు వాసన ఉండడంతో పారబోసింది. అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు వచ్చి తలుపులు తెరిచారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన నల్లగొండకు తరలించారు. వెంకటయ్య మృతి చెందగా, జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడంలేదని.. చిలుకూరు: ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, దీంతో మార్కులు తక్కువ వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన బీమన శేఖర్ కుమారుడు బీమన వినయ్ (17) చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో చేరాడు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన వినయ్.. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలో సబ్జెక్టులు అర్థంకాక మార్కులు తక్కువగా వస్తున్నాయని కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వినయ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఆదివారం అతడిని మేనమామ, బంధువులు తీసుకొని వచ్చి కళాశాలలో విడిచి పెట్టి వెళ్లారు. ఆ సమయంలో స్టడీ అవర్స్ నడుస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు తరగతి గదుల్లో ఉన్నారు. హాస్టల్ గదిలో లగేజీ పెట్టి వస్తానని వెళ్లిన వినయ్ అక్కడున్న ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరగంట తరువాత గమనించిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వినయ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. దసరా సెలవులు ముగించుకుని తిరిగి వెళ్లిన రోజే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. -
ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడంలేదని..
చిలుకూరు: ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, దీంతో మార్కులు తక్కువ వస్తున్నాయని ఇంటర్ విద్యార్థి మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం సజ్జాపురానికి చెందిన బీమన శేఖర్ కుమారుడు బీమన వినయ్ (17) చిలుకూరు మండల పరిధిలోని కవిత జూనియర్ కళాశాలలో ఎంపీసీ గ్రూప్‌లో చేరాడు. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన వినయ్.. ఇంటర్లో ఇంగ్లిష్ మీడియంలో సబ్జెక్టులు అర్థంకాక మార్కులు తక్కువగా వస్తున్నాయని కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన వినయ్ తిరిగి కళాశాలకు వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఆదివారం అతడిని మేనమామ, బంధువులు తీసుకొని వచ్చి కళాశాలలో విడిచి పెట్టి వెళ్లారు. ఆ సమయంలో స్టడీ అవర్స్ నడుస్తుండటంతో విద్యార్థులు, అధ్యాపకులు తరగతి గదుల్లో ఉన్నారు. హాస్టల్ గదిలో లగేజీ పెట్టి వస్తానని వెళ్లిన వినయ్ అక్కడున్న ఫ్యాన్‌కు టవల్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అరగంట తరువాత గమనించిన తోటి విద్యార్థులు, అధ్యాపకులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం కోదాడలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వినయ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాంబాబు తెలిపారు. దసరా సెలవులు ముగించుకుని తిరిగి వెళ్లిన రోజే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. -
నేను నిన్ను మోసం చేసాను..
జవహర్‌నగర్: ఉరి వేసుకొని ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జవహర్‌నగర్ కార్పొరేషన్ సంతోష్‌నగర్ కాలనీలో దొంతి సంతోష్ (31), భార్య బాలమణి, కుమారుడితో కలిసి నివసించేవారు. 2012 సంవత్సరంలో వీరికి వివాహం అయింది. కాగా గత నాలుగు సంవత్సరాల క్రితం సంతోష్ ట్రాన్స్‌జెండర్‌గా మారి సరితగా పేరు పెట్టుకున్నాడు. అప్పటి నుండి కుటుంబానికి దూరంగా ఉంటూ వికలాంగుల కాలనీ రేణుకానగర్‌లో అద్దె ఇంట్లో ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. కాగా ఇటీవల భార్య కుషాయిగూడలోని పుట్టింటికి వెళ్లిపోయి తల్లితో ఉంటోంది. శుక్రవారం ఉదయం ట్రాన్స్‌జెండర్ సరిత భార్య బాలమణితో వీడియోకాల్‌లో మాట్లాడారు. ‘నేను నిన్ను మోసం చేశానని, నువు లేకుండా ఉండలేకపోతున్నానని, నువ్వు వెంటనే రావాలని, లేకుంటే చనిపోతానని’ చెప్పాడు. వెంటనే ఫోన్ కట్ చేసిన భార్య బాలమణి చుట్టుపక్కల వారికి ఫోన్ చేసి చెప్పింది. అయితే ఇంటి పక్కనవారు వెళ్లి చూసేసరికి సరిత చున్నీతో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. బాలమణి సంఘటన స్థలానికి వచ్చి చూడగా అప్పటికే సరిత మృతిచెందింది. తన భర్త ట్రాన్స్‌జెండర్‌గా మారి కుటుంబానికి ద్రోహం చేశాడని మనస్థాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుననారు. -
ఒకే రోజు ఐఏఎఫ్, ఆర్మీ దంపతుల ఆత్మహత్య..
న్యూఢిల్లీ: భారత సాయుధ దళాల్లో పనిచేస్తున్న ఓ జంట ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, ఆర్మీలో విధులు నిర్వహిస్తున్న వారిద్దరూ.. వేర్వేరు నగరాల్లో ఒకేరోజు ప్రాణాలు కోల్పోయారు. వివరాలు.. బీహార్‌కు చెందిన దీనదయాల్ దీప్ ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో లెఫ్టెనెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతని భార్య రేణు తన్వర్ అదే నగరంలోని సైనిక ఆస్పత్రిలో కెప్టెన్‌గా పనిచేస్తున్నారు. ఈ జంట 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు.ఇటీవల తన్వర్ తన తల్లి, సోదరుడితో కలిసి వైద్య చికిత్స కోసం ఢిల్లీ వెళ్లారు. ఇంతలో ఏమైందో తెలియదు. రాత్రి భోజనం తర్వాత గదిలోకి వెళ్లిన దీప్ మరుసటి రోజు బయటకు రాకపోవడంతో సహోద్యోగులు తలుపు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించారు. భర్త మరణించాడనే విషయాన్ని తట్టుకోలేక అతని ఆర్మీ అధికారి భార్య కూడా ఢిల్లీ కంటోన్మెంట్‌లోని గెస్ట్ హౌస్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వీరిద్దరి చావుకి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అయితే తన్వర్ వద్ద పోలీసులు సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. తన భర్త దీప్తోమృతదేహంతో కలిపి తనకూ దహన సంస్కారాలు నిర్వహించాలని లేఖలో ఆమె కోరారు. తన్వర్ ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె తల్లి, సోదరుడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. దీప్ వద్ద ఎలాంటి సూసైడ్ నోటు లభ్యం కాలేదు. దీంతో అతడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు -
Police Constable suicide: ఇద్దరు పోలీసుల ఆత్మహత్య
బూర్గంపాడు/ఏన్కూరు/మహబూబాబాద్ రూరల్: ఓ కేసులో ఉన్నతాధికారులు తనను బలి పశువును చేశారన్న ఆవేదనతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోగా, కుటుంబ కలహాలతో మరో కాని స్టేబుల్ తుపాకీతో కాల్చుకుని తనువు చాలించాడు. ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన భూక్యా సాగర్ (34) భద్రాద్రి జిల్లా బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌లో గతంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించాడు. ఆ సమయంలో, ఆ తర్వాత లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో పని చేసినప్పుడు గంజాయి అక్రమ రవాణా కేసులో సాగర్ ప్రమేయం ఉందంటూ ఉన్నతాధికారులు ఆయనను అరెస్ట్ చేసి, సస్పెండ్ చేశారు. ఇటీవలే సస్పెన్షన్ ఎత్తివేసి ఏడూళ్ల బయ్యారంలో పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తన తప్పు లేకున్నా ఎస్సైలు సంతోష్, రాజ్‌కుమా ర్, బీఆర్ఎస్ నాయకుడు నాని తనను గంజాయి కేసులో ఇరికించారని.. ఆ నింద మోయలేకపోతున్నా.. చచి్చపోతున్నా అంటూ సాగర్ ఏన్కూరులోని ఎన్ఎస్పీ ప్రధాన కాల్వ వద్ద పురుగు మందు తాగి సెల్ఫీ వీడియో తీసి శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయిని బయట విక్రయించేందుకు ఎస్సైలు త నపై ఒత్తిడి చేశారని, తన సెల్ నుంచే గంజాయి కొనుగోలుదారులకు ఫోన్లు చేయించారని తెలిపాడు. ఇది బయటపడుతుందన్న భయంతోనే తనను అరెస్ట్ చేయించారని ఆరోపించాడు. కాగా, పురుగు మందు తాగిన సాగర్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం సా యంత్రం మృతిచెందాడు. చికిత్స పొందుతున్న సమయంలో కూడా ‘రేవంతన్నా.. నా కుటుంబానికి న్యాయం చేయండి’అని మరో సెల్ఫీ వీడియో తీశాడు. కాగా, ఈ ఘటనలో ఇద్దరు ఎస్సైలు, ఒక సీఐ, బీఆర్ఎస్ నాయకుడిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు ఏన్కూరు ఎస్సై రఫీ తెలిపారు. కుటుంబ విభేదాలతో.. మరో ఘటనలో తుపాకీతో కాల్చుకుని ఓ ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రం ఎన్జీఓస్ కాలనీకి చెందిన గుడిబోయిన శ్రీనివాస్ (59)కు భార్య, కుమారుడు ఉన్నారు. అయితే, విబేధాల కారణంగా ఐదేళ్ల నుంచి వారికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ ఐడీఓసీ ఆవరణలోని స్ట్రాంగ్‌రూం వద్ద ఆదివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో తన ఎస్ఎల్ఆర్ తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం నల్లబెల్లి: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం పెంబర్తికి చెందిన ధరణికి 2020లో కానిస్టేబుల్ ఉద్యోగం రాగా, వరంగల్ జిల్లా నల్లబెల్లి లోని పోలీస్ క్వార్టర్స్‌లో నివనిస్తోంది. నాలుగు నెలల క్రితం తన పెద్దన్నకు వివాహం అయింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు తన పెళ్లి విషయమై తరచుగా ఆలోచిస్తూ మనస్తాపానికి గురైన ధరణి.. పోలీస్ క్వార్టర్స్‌లోని తన నివాసంలో ఆదివారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన పోలీసులు మంటలార్పి.. చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. -
టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్య
జగ్గయ్యపేట/జగ్గయ్యపేట అర్బన్: టీడీపీ నాయకుల బెదిరింపులను తాళలేక మనస్తాపానికి గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. జగ్గయ్యపేటలోని నాగమయ్య బజారుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త గుగ్గిళ్ల శ్రీను (31) సమీపంలోని స్టీల్ ప్లాంట్‌లోని మినరల్ వాటర్ ప్లాంట్‌లో రోజువారీ కూలీగా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పది రోజుల క్రితం టీడీపీ నేత వీర్ల వెంకన్న ఇంటివద్ద విద్యుత్ స్తంభం అడ్డుగా ఉండటంతో దానిని తొలగించి.. శ్రీను ఇంటి ఎదుట అధికారులకు తెలియకుండా రాత్రికి రాత్రే కొత్త విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశాడు.తన ఇంటిముందు స్తంభం ఎందుకు పెట్టారని, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారని, విద్యుత్ తీగలు కిటికీలకు తగిలితే ప్రమాదం జరుగుతుందని శ్రీను ప్రశి్నంచాడు. దీంతో శ్రీను, అతడి కుటుంబ సభ్యులను టీడీపీ నాయకులు దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో శ్రీను ఆ సమస్యను విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. అధికారుల నుంచి సమాధానం రాకపోగా.. వెంకన్నతో పాటు టీడీపీ నాయకులు షేక్ చాంద్సాహెబ్, మద్దం నరసింహారావు, నాగబాబు, సరస్వతి, రహంతుల్లా శ్రీను ఇంటికి వచ్చి మరోసారి బెదిరించి వెళ్లారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీను ఈ నెల 11న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు అతడు పనిచేసే ప్లాంట్ వద్దకు వెళ్లి చూడగా ఉరి వేసుకుని మృతిచెంది ఉన్నాడు. ఎస్ఐ వెంకటేశ్వరరావు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతుడి భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శనివారం జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్ (చిన్నా) తదితరులు శ్రీను మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.టీడీపీ కౌన్సిలర్లు కావేటి కృష్ణ, గొట్టె నాగరాజు ప్రోద్బలంతోనే వీర్ల వెంకన్న, షేక్ చాంద్, మద్దం నరసింహారావు, నాగబాబు, షేక్ బబేబీ, బషీర్, రహీంతుల్లా, వీర్ల సరస్వతి కలిసి తన భర్తను మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్య చేసుకున్నారని శ్రీను భార్య గోవిందమ్మ మీడియా ఎదుట కన్నీటి పర్యంతమైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారని, నాకు దిక్కెవరంటూ ఆవేదన వ్యక్తం చేసింది. గుగ్గిళ్ల శ్రీను కుటుంబ సభ్యులను ఆదివారం వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పరామర్శించారు. -
దసరాకి భర్త చీర కొనలేదని వివాహిత ఆత్మహత్య
దుమ్కా: జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో దసరా పండుగపూట విషాదం చోటుచేసుకుంది. భర్త చీర కొనివ్వలేదని 26 ఏళ్ల వివాహిత రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతి చెందిన మహిళను బాగ్జోపా నివాసి సెండో దేవిగా గుర్తించారు. దసరా సందర్భంగా భర్త తనకు కొత్త చీర కొనివ్వలేదని, ఆగ్రహించిన ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త ట్రాక్టర్ డ్రైవర్ అని, వారికి ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారని పోలీసు అధికారి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: తాను కన్నుమూస్తూ... మరో ఐదుగురికి ప్రాణదానం -
ఆన్లైన్ బెట్టింగ్‌లకు కుటుంబం బలి
సాక్షి,నిజామాబాద్ జిల్లా:జిల్లాలోని ఎడపల్లి మండలం వడ్డేపల్లిలో శనివారం(అక్టోబర్5) విషాదఘటన చోటుచేసుకుంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మ హత్య చేసుకున్నారు.కొడుకు హరీష్ ఆన్లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకోని అప్పుల పాలు కావడంతో తల్లి తండ్రితో పాటు హరీష్ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మ హత్య చేసుకున్నారు.కొడుకు హరీష్ ఆన్లైన్లో రూ.20 లక్షల వరకు పోగొట్టుకున్నట్లు సమాచారం.ఈ అప్పులు తీర్చేందుకు తల్లిదండ్రులు పొలం కూడా అమ్మారని, అయినా అప్పులు తీరకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.ఇదీ చదవండి: ప్రియుడితో కలిసి మరో ప్రియుడి హత్య