Tamil Movie
-
OTT: తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘సట్టమ్ ఎన్ కైయిల్’ రివ్యూ
చట్టమనేది ఎవ్వరి చుట్టమూ కాదు. అదే చట్టాన్ని వ్యక్తిగతంగా ఎవ్వరూ తమ చేతుల్లోకి తీసుకోకూడదు. కాని దీనికి విరుద్ధంగా ఓ తమిళ సినిమా పేరు వచ్చింది. అదే సట్టమ్ ఎన్ కైయిల్. అంటే చట్టం నా చేతుల్లో అని అర్ధం. సెన్సార్ వాళ్ళు ఈ పేరును ఎలా ఓకే చేశారో కాని సినిమా మాత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రైమ్ వీడియో ఓటిటి వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ తమిళ సినిమాకి చాచి దర్శకుడు. సినిమా ప్రధాన పాత్రైన గౌతమ్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు సతీష్ నటించడం విశేషం. మామూలుగా హాస్య పాత్రలతో ఇప్పటిదాకా అలరించిన సతీష్ ఈ సినిమాలో సీరియస్ పాత్రతో ప్రేక్షకులను అలరించాడనే చెప్పాలి.ఇక సట్టమ్ ఎన్ కైయిల్ కథాంశానికొస్తే తమిళనాడు లోని మారుమూల ప్రాంతమైన ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ కి తన బిడ్డ మృతికి కారణమైన హాస్పిటల్ సిబ్బంది మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఓ వ్యక్తి రావడంతో సినిమా ప్రారంభమవుతుంది. నిజానికి ఈ సన్నివేశం ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్సపెక్టర్ బాషా అవినీతిని చూపించడం కోసం రూపొందించారు. దాని తరువాత గౌతమ్ తన కారులో ప్రయాణిస్తూ ఓ వ్యక్తిని ఢీ కొడతాడు. ఈ యాక్సిడెంట్ లో తాను ఢీ కొట్టిన వ్యక్తి చనిపోవడంతో తన కారు డిక్కీలో ఆ వ్యక్తి బాడీని పెట్టుకుని తిరిగి ప్రయాణిస్తుంటాడు. ఇంతలో పోలీస్ చెక్ పోస్టులో అనూహ్యంగా పోలీసులకు కారుతో సహా చిక్కి ఏర్కాడ్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటాడు గౌతమ్. తన పై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టి స్టేషన్ కి తీసుకువస్తారు. కాని తన కారులో ఉన్న శవం గురించి పోలీసులకు తెలియదు. ఇక అక్కడినుండి కథ అనేక అనూహ్య మలుపులు తిరిగి ఉత్కంఠభరితంగా నడుస్తుంది సినిమా. ముఖ్యంగా ఆఖరి సన్నివేశం సినిమా మొత్తానికే హైలైట్. క్రైమ్ థ్రిల్లర్ జానర్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఎలాగూ నచ్చుతుంది, అలాగే మామూలు వాళ్ళకి కూడా ఒక్కసారి కథలోకి లీనమైతే సినిమాలో వచ్చే ట్విస్టులకు వీస్తూ పోతూ కుర్చీలకు అతుక్కుపోతారు. సట్టమ్ ఎన్ కైయిల్ మాత్రం రొటీన్ థ్రిల్లర్ అయితే కాదు. వర్త్ టు వాచిట్. (ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది)-ఇంటూరు హరికృష్ణ -
ప్రభాస్ 'రాజాసాబ్'కి పోటీగా 'ఇడ్లీ' సినిమా
సాధారణంగా ప్రభాస్ సినిమా వస్తుందంటే మిగతా ఏ ఇండస్ట్రీల్లోనూ ఆ టైమ్‌కి వేరే పెద్ద హీరోల చిత్రాలు రిలీజ్‌కి పెట్టుకోరు. ఒకవేళ అలా కాదనుకుంటే షారుక్ 'డంకీ' మూవీకి అయినట్లు కలెక్షన్స్ డ్యామేజ్ అవ్వొచ్చు. కానీ తమిళ హీరో ధనుష్ మాత్రం తన కొత్త మూవీని 'రాజాసాబ్'కి పోటీగా బరిలో నిలబెట్టాడు.సలార్, కల్కి 2898ఏడీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమా 'రాజాసాబ్'. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీస్తున్న ఈ మూవీకి మారుతి దర్శకుడు. చాలావరకు షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ అని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇందులో ఏ మార్పు ఉండకపోవచ్చు.(ఇదీ చదవండి: 'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ)ఇకపోతే ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తమిళ సినిమా 'ఇడ్లీ కడై' (ఇడ్లీ మాత్రమే). ఇప్పుడు ఈ సినిమాని కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 10నే థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ధనుష్ మూవీ అంటే తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రభాస్ మూవీ ఉంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. తమిళంలో మాత్రం థియేటర్ల, కలెక్షన్ దగ్గర 'రాజాసాబ్'కి ఇడ్లీ మూవీ వల్ల ఇబ్బంది ఉండొచ్చు.ధనుష్ అదే తేదీన తన మూవీ రిలీజ్ చేయడానికి కారణముందనే అనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఉగాది ఉన్నట్లే తమిళ న్యూ ఇయర్.. వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ఉంది. దీంతో ఆ లాంగ్ వీకెండే ధనుష్ టార్గెట్. ఇదంతా చూస్తుంటే 'రాజాసాబ్' రిలీజ్‌తోపాటు ధనుష్ మూవీ రిలీజ్ విషయంలోనూ మార్పు ఉండకపోయే అవకాశాలే ఎక్కువ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు హిట్ సినిమాలు.. ఏది ఎందులో?) -
'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ
'స్టార్', 'దాదా' లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు కవిన్. ఇతడు బిచ్చగాడు పాత్రలో నటించిన మూవీ 'బ్లడీ బెగ్గర్'. దీపావళి సందర్భంగా తమిళంలో రిలీజైంది. వారం తర్వాత అంటే ఇప్పుడు (నవంబర్ 7) తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు.. అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). వచ్చిన డబ్బులతో లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఓ రోజు దినం భోజనాల కోసమని చాలామంది బిచ్చగాళ్లతో పాటు ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా దొంగచాటుగా బంగ్లాలోకి వెళ్తాడు. కాసేపటివరకు బాగానే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఊహించని పరిస్థితుల వల్ల లోపల ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బంగ్లా యజమానులు బిచ్చగాడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ?(ఇదీ చదవండి: Amaran Review: ‘అమరన్’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?సినిమాల్లో ఏదైనా పాత్ర చనిపోతే మనం బాధపడతాం. అది ఎప్పుడూ జరిగేదే. కానీ ఓ పాత్ర చనిపోయినప్పుడు కూడా మనకు నవ్వొచ్చింది అంటే అది డార్క్ కామెడీ సినిమా అని అర్థం. 'బ్లడీ బెగ్గర్' కూడా అలాంటి బ్లాక్ లేదా డార్క్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు.ఓ పిల్లాడిని.. బర్త్ డే బంప్స్ పేరుతో మరో నలుగురు పిల్లలు కొట్టి చంపే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే బిచ్చగాడిని చూపిస్తారు. మాయమాటలు చెప్పి జనాల్ని ఎలా మోసం చేస్తున్నాడు? వచ్చిన డబ్బుతో జాలీగా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనేది చూపించారు. ఈ బిచ్చగాడు.. ఓ పెద్ద భవంతిలోకి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది.కొన్నాళ్ల క్రితం చనిపోయిన చంద్రబోస్ అనే స్టార్ హీరోది ఆ బంగ్లా. ఈయనకు కోట్ల ఆస్తి ఉంటుంది. నలుగురు పిల్లలు. డబ్బు, ఈగోలకు పోయి చంపడానికైనా సరే వెనకాడరు. ఆస్తి దక్కుతుందని బంగ్లాకు వచ్చిన వీళ్లకు.. తండ్రి తన సవతి కొడుకు పేరు మీద ఆస్తి అంతా రాసేశారని తెలిసి షాకవుతారు. ఆ సవతి కొడుకుని అప్పటికే లాయర్ చంపేసుంటాడు. వాడి స్థానంలో బిచ్చగాడిని ఇరికిస్తారు. ఆ తర్వాత డబ్బు కోసం ఒకరిని ఒకరు ఎలా చంపుకొన్నారనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)రెగ్యులర్, రొటీన్ సినిమాలతో పోలిస్తే ఇదో డిఫరెంట్ కథ. బిచ్చగాడి చేతిలో డబ్బునోళ్లు కుక్క చావు చావడం అనే కాన్సెప్టే వింతగా ఉంటుంది. ఒక్కో పాత్ర తమ తోటి వాళ్లనే దారుణంగా చంపేస్తుంటారు. కాకపోతే ఆ సీన్స్‌లో మనం భయపడాల్సింది పోయి నవ్వుతాం. అంత వెరైటీగా ఉంటాయి. బిచ్చగాడు.. బంగ్లాలోకి ఎంటర్ అయిన తర్వాత కాసేపు బోర్ కొడుతుంది. కానీ సెకండాఫ్ మొదలైన తర్వాత మాత్రం ఊహించని ట్విస్టులు.. ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తాయి.భారీకాయంతో ఉండే మహిళ, జావెలిన్ త్రో విసిరే భర్త, వీళ్లకు పుట్టిన పిల్లాడు.. ఈ ముగ్గురు ఒక్కో వ్యక్తుల్ని చంపే సీన్స్ ఉంటాయి. ఇవైతే సర్ప్రైజ్ చేస్తాయి. ప్రారంభం నుంచి చూపించిన సన్నివేశాలు, వస్తువులు, ఉండే మనుషులు.. చెప్పాలంటే ప్రతి చిన్న పాయింట్‌ని దర్శకుడు మొదలుపెట్టిన తీరు.. ముగించిన విధానం అరె భలే తీశాడ్రా అనిపిస్తుంది. అలానే మనకు ఎంత డబ్బున్నా సరే కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదనే విషయాన్ని కూడా ఇంట్రెస్టింగ్గా చూపించారు.ఎవరెలా చేశాడు?బిచ్చగాడి పాత్రలో కనిపించిన కవిన్ అదరగొట్టేశాడు. ప్రారంభంలో పది నిమిషాల్లోనే బిచ్చగాడు పాత్ర రూపు మారుతుంది. మరికాసేపు బిచ్చగాడి సీన్స్ ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. అంత ఎంటర్టైనింగ్గా ఉంటాయి. చనిపోయిన నటుడి కొడుకు-కూతుళ్లు, మనవడు-మనవరాళ్లుగా చేసిన పాత్రధారులు ఎవరికి వాళ్లు అదరగొట్టేశారు. కన్నింగ్ లాయర్‌గా చేసిన సునీల్ సుకంద అయితే నచ్చేస్తాడు.టెక్నికల్ విషయాలకొస్తే దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తీసుకున్న పాయింట్ డిఫరెంట్. దాన్ని ప్రెజంట్ చేసిన విధానం అంతే డిఫరెంట్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. సినిమాటోగ్రఫీ-ఎడిటింగ్ బాగున్నాయి. సినిమా అంతా బంగ్లాలోనే జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. డార్క్ కామెడీ జానర్ నచ్చేవాళ్లకు మాత్రం ఎక్కుతుంది.-చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?) -
స్టైల్ మార్చిన మణిరత్నం.. కమల్ 'థగ్ లైఫ్' రిలీజ్ ఫిక్స్
మణిరత్నం సినిమాలంటే క్లాస్, కూల్‌గా ఉంటాయి. చివరగా తీసిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలు మాత్రం పీరియాడికల్ గ్రాండియర్స్. కాకపోతే వీటికి తమిళంలో తప్పితే మిగతా ఏ భాషలోనూ పెద్దగా ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం ఈ దర్శకుడు 'థగ్ లైఫ్' మూవీ చేస్తున్నాడు. తాజాగా కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్ ప్రకటించారు.(ఇదీ చదవండి: 'దేవర'తో పాటు ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 15 సినిమాలు)విడుదల తేదీ ప్రకటిస్తూ ఓ టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో కమల్ హాసన్‌తో పాటు శింబుని కూడా చూపించారు. ఇంట్రెస్టింగ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌కి తోడు యాక్షన్ కట్ వచ్చేలా చూపించారు. విజువల్స్ చూస్తుంటే మణిరత్నం ఈసారి ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైన్ తెరకెక్కించినట్లు కనిపిస్తుంది. వచ్చే ఏడాది జూన్ 5న థియేటర్లలో మూవీ రిలీజ్ కానుంది. ఇందులో కమల్‌తో పాటు శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఐశ్వర్య లక్ష్మీ, జోజు జార్జ్, అభిరామి, నాజర్ తదితరులు కీ రోల్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' కోసం తమన్.. 'కాంతార' మ్యూజిక్ డైరెక్టర్ కూడా?) -
ఓటీటీలోకి వచ్చేసిన చిన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా 'దేవర', 'వేట్టయన్' సినిమాలతో పాటు సమంత 'సిటాడెల్' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. వీటికోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇవి కాదన్నట్లు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇవి అలా ఉండగానే సైలెంట్‌గా ఓ తమిళ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.(ఇదీ చదవండి: డబ్బు లాక్కొని హీరోయిన్ని భయపెట్టిన బిచ్చగాడు)ప్రముఖ కమెడియన్ యోగిబాబు, యువ నటి బ్రిగిడ తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా 'కొళిపన్నై చెల్లదురై'. సెప్టెంబరు 20న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి పర్లేదనిపించే టాక్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎలాంటి ప్రకటన లేకుండా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ పాస్ కావాలంటే ఈ మూవీపై ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: షోలో కన్నీళ్లు పెట్టుకున్న హీరో సూర్య) -
'విడుదల 2' తెలుగు హక్కులు నిర్మాత చింతపల్లి రామారావుకే
వెట్రిమారన్ 'విడుదల' సినిమా గతేడాది రిలీజైంది. తెలుగు, తమిళ భాషల్లో మంచి ఆదరణ దక్కించుకుంది. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించిన ఈ చిత్ర సీక్వెల్‌ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్ర తెలుగు థియేటర్ హక్కుల్ని ప్రముఖ నిర్మాత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు. ఈ మేరకు మూవీ టీమ్‌ని కలిశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు.. ఐదు స్పెషల్)నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. 'విడుదల 2' సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నందుకు సంతోషంగా ఉంది. విజయ్ సేతుపతి, సూరి నటన హైలైట్‌గా ఉండనుందని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: గౌతమ్‌కి 'అమ్మతోడు' సవాలు.. ఈసారి నామినేషన్స్‌లో ఎవరెవరు?) -
నటి వనిత నాలుగో పెళ్లి.. అసలు నిజం ఇది
తమిళ ప్రముఖ నటి వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి అని న్యూస్. గత కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్న కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తోనే ఏడడుగులు వేయనుందని అందరూ అనుకున్నారు. కానీ ఇది నిజం కాదని స్వయంగా ఇప్పుడు ఈమెనే తేల్చేసింది. ఎందుకంటే ఇదంతా తమ కొత్త మూవీ కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్. దీంతో అందరూ ఫూల్ అయ్యారని చెప్పొచ్చు.(ఇదీ చదవండి: తల్లిదండ్రులైన రాకింగ్ రాకేష్, సుజాత దంపతులు)రెండు మూడు రోజుల క్రితం రాబర్ట్‌కి ప్రపోజ్ చేస్తున్నట్లు ఉన్న ఫొటోని నటి వనితా విజయ్ కుమార్ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అక్టోబరు 5వ తేదీని గుర్తుంచుకోండి అని రాసుకొచ్చింది. ఇది చూసిన అందరూ నాలుగో పెళ్లికి రెడీ అయిందని ఫిక్స్ అయ్యారు. రాబర్ట్‌తో ఈమె రిలేషన్లో ఉన్నట్లు గత కొన్నాళ్లుగా రూమర్స్ వచ్చాయి. దీంతో అందరూ పెళ్లి వార్త నిజమే అనుకున్నారు. కానీ ఇదంతా 'మిసెస్ & మిస్టర్' కోసమని ఇప్పుడు బయటపెట్టారు.ఈ సినిమాలో వనితా విజయ్ కుమార్, రాబర్ట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వనితనే దర్శకత్వం వహించింది. ఈమె కూతురు జోవికా నిర్మాతగా వ్యవహరించింది. ఇలానే గతంలో తెలుగులో నరేశ్-పవిత్ర కూడా తొలుత పెళ్లి అన్నట్లు హడావుడి చేశారు. తీరా చూస్తే 'మళ్లీ పెళ్లి' సినిమా కోసం చేసిన ప్రమోషనల్ స్టంట్ అని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ ఐడియానే వనిత కాపీ కొట్టేశారా అనిపించింది. కాగా వనిత విజయ్‌కుమార్ తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్, బిగ్‌బాస్ అల్టిమేట్ మొదటి (ఓటీటీ) సీజన్లో పాల్గొంది.(ఇదీ చదవండి: పరారీలో హర్షసాయి.. లుక్అవుట్ నోటీసులు జారీ) View this post on Instagram A post shared by Vanitha (@vanithavijaykumar) -
ఓటీటీలోనే విచిత్రమైన సినిమా.. 'కొట్టుక్కాళి' రివ్యూ
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా తీసే పద్ధతి, చూసే విధానం చాలా మారిపోయింది. కొత్తతరం దర్శకులు ఎలాంటి ప్రయోగాలకైనా వెనకాడటం లేదు. తెలుగులో తక్కువ గానీ తమిళ, మలయాళంలో డిఫరెంట్ కథలు వస్తుంటాయి. అలాంటి ఓ తమిళ మూవీనే 'కొట్టుక్కాళి'. తాజాగా ఇది ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మీనా (అన్నా బెన్) ఓ సాధారణ అమ్మాయి. ఈమె బావ పేరు పాండి (సూరి). వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అంటే చదువుకుంటానని మీనా చెబుతుంది. దీంతో కాలేజీలో చేర్పిస్తారు. అక్కడే మరో కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఇది మీనా ఇంట్లో తెలిసి ఆమెపై పెద్దోళ్లు కోప్పడతారు. దీంతో పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. ప్రేమించిన అబ్బాయి.. తమ కూతురిపై చేతబడి చేశాడని ఈమె తల్లిదండ్రులు భావిస్తారు. ఈమెకు పట్టిన దెయ్యాన్ని వదిలించాలని కుటుంబమంతా కలిసి ఓ చోటుకు వెళ్తారు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?'కొట్టుక్కాళి' అంటే తమిళంలో మొండి అమ్మాయి అని అర్థం. మలయాళ నటి అన్నా బెన్ లీడ్ రోల్ చేసింది. ఈ సినిమా కథ చాలా సింపుల్. దెయ్యం పట్టిందనుకున్న ఓ అమ్మాయిని తీసుకుని, ఈమె కుటుంబం ఓ స్వామి దగ్గరకు వెళ్తారు. ఈ ప్రయాణంలో ఒక్కక్కరు ఎలా ప్రవర్తించారు. అసలు దర్శకుడు మనకు ఏం చెప్పాలనుకున్నాడనేదే తెలియాలంటే మూవీ చూడాలి.సాధారణంగా సినిమా అంటే పాటలు, ఫైట్స్, హోరెత్తిపోయే బీజీఎం.. ఇలా బోలెడంత హంగామా. కానీ 'కొట్టుక్కాళి'లో ఇవేం ఉండవు. ఇంకా చెప్పాలంటే దాదాపు గంటన్నర పాటు ఉండే ఈ మూవీలో హీరోయిన్‌కి ఒక్కటే డైలాగ్. అది కూడా జస్ట్ ఐదే సెకన్లు మాట్లాడుతుంది. అంతే. కోడిపుంజుని తాడుతో బంధించినట్లే.. ఫ్యామిలీ అనే ఎమోషన్స్‌కి తలొగ్గి హీరోయిన్ బంధి అయిపోయి ఉంటుంది. సినిమా చూస్తే ఈ పాయింట్ అర్థమవుతుంది.అలానే పురుషాధిక్యం, దెయ్యాల్ని వదిలించే పేరుతో కొందరు వ్యక్తులు మహిళల్ని అసభ్యకరంగా తాకుతూ ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయాల్ని ఇందులో చూపించారు. ఈ సినిమాకు క్లైమాక్స్ ఓపెన్ ఎండింగ్‌తో వదిలేశారు. అంటే ఎవరికి ఏమనిపిస్తే అదే క్లైమాక్స్ అనమాట.ఎవరెలా చేశారు?ప్రధాన పాత్రలు చేసిన సూరి, అన్నా బెన్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన పాత్రల్లో నటించిన వాళ్లందరూ చాలా నేచురల్‌గా ఉంటారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు పల్లెటూరిలో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. పాండి, మీనా క్యారెక్టర్స్‌తో పాటు అలా ట్రావెల్ అయిపోతాం. దొంగ స్వామిజీల గురించి దర్శకుడు ఏదో మెసేజ్ ఇద్దామనుకున్నాడు. కానీ అందరినీ ఆకట్టుకునేలా తీయలేకపోయాడు.ఇకపోతే 'కొట్టుక్కాళి' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది. కాస్త ఓపిక ఉండి, డిఫరెంట్ సినిమాలు చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి.- చందు డొంకాన -
తమిళ స్టార్ హీరోలు.. కార్తీని చూసి కాస్త నేర్చుకోండి!
తమిళ దర్శకనిర్మాతలకు తెలుగు ప్రేక్షకులంటే మరీ అలుసు. బయటకు ఆహా ఓహో అని చెబుతారు. కానీ సినిమాల్లో కథ దగ్గర నుంచి టైటిల్ వరకు ప్రతి దానిలోనూ తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. గతంలో ఇలా ఉండేది కాదు. సినిమాకు పెట్టే పేరు దగ్గర నుంచి డబ్బింగ్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకునే వాళ్లు. కానీ రీసెంట్ టైంలో ఆ పద్ధతి పూర్తిగా తగ్గిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు కార్తీ తన కొత్త మూవీతో తెలుగు ఆడియెన్స్‌కి కాస్త గౌరవం ఇస్తున్నాడా అనిపిస్తుంది.రీసెంట్ టైంలో తమిళ డబ్బింగ్ చిత్రాలు తెలుగులోనే చాలానే రిలీజయ్యాయి. వీటిలో అయలాన్, బాక్, రాయన్, తంగలాన్ ఉన్నాయి. ఈ టైటిల్‌కి అర్థం ఏంటంటే ఒక్కడూ చెప్పలేడు. తమిళంలో ఏదైతే పెట్టారే దాన్ని యధాతథంగా అనువదించేశారు. ఏ పేరు పెట్టినా తెలుగు ప్రేక్షకుడు చూస్తాడులే అని అలుసు కావొచ్చు. త్వరలో రిలీజయ్యే రజనీకాంత్ 'వేట్టయాన్', సూర్య 'కంగువ' సినిమాలది కూడా ఇదే తీరు.(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)ఇకపోతే కార్తీ లేటెస్ట్ తమిళ మూవీ 'మైళగన్'. తమిళనాడులోని తంజావుర్‌లో ఓ రాత్రి ఇద్దరు వ్యక్తులు (బావ-బావమరిది) మధ్య జరిగిన స్టోరీతో దీన్ని తీశారు. తెలుగులోనూ దీన్ని రిలీజ్ చేస్తున్నారు. తమిళ పేరుని ఉన్నది ఉన్నట్లు కాకుండా 'సత్యం సుందరం' అని టైటిల్ పెట్టారు. ఉద్దండరాయుని పాలెం ఊరిలో కథని జరిగినట్లు చూపించారు. ఊరి పేర్లతో సహా బండి నంబర్ ప్లేట్ల విషయంలో టీమ్ కాస్త శ్రద్ధ తీసుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ చూస్తే ఇవన్నీ అర్థమవుతున్నాయి.అయితే ఈ సినిమా ఎన్టీఆర్ 'దేవర' సినిమా రిలీజైన ఒకరోజు తర్వాత అంటే సెప్టెంబరు 28న తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కార్తీ తీసే సినిమాలు అంతో ఇంతో తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుంటాయి. అయితే 'దేవర'తో పోటీగా వస్తున్నాడు. ఏం చేస్తాడో చూడాలి? సరే ఇదంతా పక్కనబెడితే తమిళ స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు ఇప్పటికైనా కాస్త టైటిల్స్ విషయంలో శ్రద్ధ తీసుకుంటే బెటర్!(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు లేటెస్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఓటీటీలో స్టార్ హీరో తీసిన పిల్లల సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్
వరస సినిమాలు చేసే తమిళ స్టార్ హీరోల్లో శివ కార్తికేయన్ ఒకడు. నిర్మాతగానూ డిఫరెంట్ సినిమాలు తీస్తుంటాడు. అలా తీసిన చిన్న పిల్లల చిత్రమే 'కురంగు పెడళ్'. మే తొలి వారంలో థియేటర్లలో రిలీజైంది. మంచి టాక్ తెచ్చుకుంది. నెల తర్వాత ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ నేరుగా రిలీజ్ చేసేశారు.(ఇదీ చదవండి: విమానం కొన్న హీరో సూర్య.. రేటు రూ.100 కోట్లు పైనే?)ప్రస్తుతం 'కురంగు పెడళ్' సినిమా తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సైలెంట్‌గా అందుబాటులోకి తీసుకొచ్చేశారు. 1980 బ్యాక్ డ్రాప్ స్టోరీతో చిన్నప్పటి జ్ఞాపకాల్ని గుర్తుచేసేలా ఈ సినిమా ఉంటుంది. కమల కన్నన్ దర్శకత్వం వహించగా.. జిబ్రాన్ సంగీతమందించాడు.'కురంగు పెడళ్' విషయానికొస్తే.. సైకిల్ నడపడం నేర్చుకోవాలని కలలు కన్న ఓ యువకుడు.. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సైకిల్ నడపడం రాని ఈ పిల్లాడి తండ్రి.. కొడుకు కోరికని ఎలా నెరవేర్చాడు అనే పాయింట్ చుట్టూ భావోద్వేగభరితంగా తీశారు. ఇఫితో పాటు పలు అంతర్జాతీయ చిత్రాత్సవాల్లో ఈ మూవీ స్క్రీనింగ్ కావడం విశేషం.(ఇదీ చదవండి: బోల్డ్ సీన్స్ వైరల్.. నన్ను జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు: రుహానీ శర్మ) -
మ్యూజిక్ డైరెక్టర్ లేని సినిమా.. అంతా కోడి అరుపుతోనే
తెలుగులో కమర్షియల్ సినిమాలు వస్తుంటాయి. ఏదో అప్పుడప్పుడు ఒకటి అరా కంటెంట్ ఓరియెంట్ మూవీస్ వస్తుంటాయి. కానీ తమిళ, మలయాళంలో మాత్రం దర్శకులు ఎప్పుడో ఏదో కొత్తదనం ట్రై చేస్తుంటారు. అలా తీసిన తమిళ సినిమా 'కొట్టుకళి'. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవసరమే లేకుండా ఈ చిత్రాన్ని తీయడం విశేషం. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: తల్లి పుట్టినరోజున తిరుమలలో జాన్వీ కపూర్)'కల్కి'లో కైరా పాత్రలో నటించింది మలయాళ నటి అన్నాబెన్. 'కొట్టుకళి'లో ఈమె ప్రధాన పాత్రధారి. సూరి హీరోగా చేశాడు. తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ నిర్మించాడు. గతంలో 'పెబ్బల్స్' అనే అవార్డ్ విన్నింగ్ మూవీ తీసిన పీఎస్ వినోద్ రాజ్ దీనికి దర్శకుడు. ఆగస్టు 23న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్న సందర్భంగా తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.కోడి పుంజు సీన్‌తో ట్రైలర్ మొదలవుతుంది. చుట్టూ ఉన్న సౌండ్స్‌తో పాటు కోడీ అరుపుతోనే ట్రైలర్ అంతా చూపించారు. దెయ్యం పట్టిన ఓ అమ్మాయిని దాన్ని వదిలించడానికి హీరో అండ్ గ్యాంగ్ తీసుకుపోవడం.. పల్లెటూరిలో జరిగే చిన్న చిన్న గొడవలు.. ఇలా ఏదో ఉంది అనేలా ట్రైలర్ చూపించారు. డిఫరెంట్ మూవీస్ చూద్దామనుకునే వాళ్లకు బహుశా ఇది నచ్చొచ్చేమో!(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన వెరైటీ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ) -
స్టార్ డైరెక్టర్-యంగ్ హీరోయిన్ పెళ్లి? షాక్‌లో ఫ్యాన్స్!
ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు. ఏ భాషలో తీసుకున్నా సరే ఇలాంటి జంటలు చాలానే కనిపిస్తుంటాయి. నాలుగైదు రోజుల క్రితం కన్నడ హీరోయిన్ సోనాలి.. దర్శకుడు తరుణ్ సుధీర్‌తో పెళ్లికి రెడీ అయింది. ఆగస్టులో పెళ్లి ఉంటుందని చెబుతూ ఏకంగా ప్రీ వెడ్డింగ్ వీడియోనే పోస్ట్ చేసింది. ఇప్పుడు వీళ్లలానే తమిళ స్టార్ డైరెక్టర్-హీరోయిన్ పెళ్లి దుస్తుల్లో కనిపించడం అందరినీ షాక్‌కి గురిచేసింది.(ఇదీ చదవండి: 'ఈ-మెయిల్స్' వివాదంలో మంచు విష్ణు.. అసలేం జరిగిందంటే?)తమిళంలో 'అడియే', 'తిట్టం ఇరండు', 'హాట్ స్పాట్' సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విఘ్నేశ్ కార్తీక్.. యంగ్ హీరోయిన్ బ్రిగిడ సాగాతో కలిసి సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో కనిపించాడు. ఆ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. సడన్‌గా చూసి నిజంగానే ఈ డైరెక్టర్, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారేమో అనుకున్నారు. కానీ ఇదంతా ఓ సినిమా కోసం జరిగిన షూట్.ఎందుకంటే ఇదివరకే దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్‌కి పెళ్లయింది. మరోవైపు బ్రిగిడ.. తమిళ, తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. అయితే వీళ్లిద్దరూ పెళ్లి డ్రస్సులో కనిపించేసరికి చాలామంది ఇది నిజమేనేమో అనుకున్నారు. అసలు విషయం తెలిసి తాపీగా నవ్వకున్నారు. ఏదేమైనా ఇలా సినిమా ప్రమోషన్ చేయడమంటే ఫస్ట్ షాకవుతారు. ఆ తర్వాత నవ్వుకుంటారు!(ఇదీ చదవండి: హీరో విశాల్‌ని టార్గెట్ చేసిన తమిళ నిర్మాతలు.. అసలేం జరుగుతోంది?) -
రోలెక్స్‌ని గుర్తుచేసిన సూర్య కొత్త సినిమా టీజర్
తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే కొత్త సినిమా వస్తుందంటే చాలు, మనోళ్లు తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. ప్రస్తుతానికి 'కంగువ' చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 10న ఇది థియేటర్లలోకి రానుంది. ఇది కాకుండా స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో మూవీ చేస్తున్నాడు. సూర్య పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ పేరిట ఓ వీడియో వదిలారు.(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')'లవ్, లాఫర్, వార్.. ద వన్' ట్యాగ్ లైన్‌తో రిలీజ్ చేసిన సూర్య 44మూవీ గ్లింప్స్ వీడియో సింపుల్‌గా ఉంది. అదే టైంలో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే ఇందులోనూ సూర్య.. డాన్‌గా కనిపించబోతున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. ఇదివరకు ఈ తరహా పాత్రల్లో సూర్య గతంలో ఒకటి రెండుసార్లు చేశారు. ఈ గ్లింప్స్‌లో సిగరెట్ తాగుతూ, గన్ పట్టుకుని, ఒంటిపై రక్తం మరకలతో నడిచి వస్తుంటే.. 'విక్రమ్' మూవీలో రోలెక్స్.. ఒక్క సెకను అలా వచ్చి వెళ్లిపోయాడా అనిపించింది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బహుశా వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాని రిలీజ్ చేస్తారేమో!(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా)Happy Birthday @Suriya_offl Sir From Team #Suriya44 #HappyBirthdaySuriya #HBDTheOneSuriya pic.twitter.com/PuyM43y4rl— karthik subbaraj (@karthiksubbaraj) July 22, 2024 -
దీపావళి రేసులో కమల్ హాసన్.. కాకపోతే నిర్మాతగా!
'కల్కి'లో విలన్‌గా హిట్ కొట్టిన కమల్ హాసన్.. రీసెంట్గా 'భారతీయుడు 2'గా ఘోరమైన డిజాస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు నెలల గ్యాప్‌లో నిర్మాతగా యాక్షన్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమరన్'. శివకార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత సాయిపల్లవి చేస్తున్న తమిళ చిత్రమిది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.(ఇదీ చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ)ఇందులో శివకార్తికేయన్ ముకుందన్ అనే సైనికుడిగా పవర్‌పుల్ పాత్రలో కనిపించబోతున్నారు. మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా అక్టోబరు 31న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపోతే విలన్‌గా హిట్ కొట్టి, హీరోగా ఫ్లాప్ అందుకున్న కమల్.. నిర్మాతగా మరి ఎలాంటి ఫలితం అందుకుంటాడనేది చూడాలి?(ఇదీ చదవండి: బాలీవుడ్ మాఫియాకి దెబ్బ మీద దెబ్బ.. షాకిచ్చిన 'కల్కి' మేకర్స్!) -
విజయ్ సేతుపతి ఫ్రీగా నటించిన సినిమా.. ఇన్నాళ్లకు ఓటీటీలో రిలీజ్
విజయ్ సేతుపతి చాలా రోజుల తర్వాత హిట్ కొట్టాడు. 'మహారాజ' మూవీతో తెలుగు, తమిళంలో అద్భుతమైన వసూళ్లు సొంతం చేసుకుంటున్నాడు. మూవీ వచ్చిన రెండు వారాలైనప్పటికీ కలెక్షన్స్ స్టడీగా ఉన్నాయి. మరోవైపు ఇతడు రెమ్యునరేషన్ తీసుకోకుండా నటించిన ఓ తమిళ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఆ మూవీ సంగతేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)సేతుపతి అద్భుతమైన నటుడు. కాకపోతే సరైన హిట్ పడి చాలా కాలమైంది. రీసెంట్గా తన 50వ మూవీ 'మహారాజ'తో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. మరోవైపు ఇతడు అతిథి పాత్రలో నటించిన తమిళ మూవీ 'అళగియ కన్నె'.. గతేడాది జూన్ 23న థియేటర్లలోకి వచ్చింది. ఏమైందో ఏమో గానీ ఏడాది తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చిందే లేటు అంటే మళ్లీ అద్దె విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు.రొమాంటిక్ డ్రామా స్టోరీతో తీసిన ఈ సినిమాలో లియో శివకుమార్, సంచితా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. ఆర్ విజయ్ కుమార్ దర్శకుడు. ఈ మూవీ డైరెక్టర్‌పై ఉన్న అభిమానంతోనే విజయ్ సేతుపతి.. ఎలాంటి డబ్బులు తీసుకోకుండా నటించాడు. ఇందులో నిజ జీవిత పాత్రనే పోషించడం విశేషం. కాకపోతే సినిమా రొటీన్‌గా ఉండేసరికి జనాలు సినిమా పెద్దగా ఆడలేదు. దర్శకుడు కావాలనే ఓ కుర్రాడు.. నాటకాల్లో పరిచయమైన ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ కులాల వేరు కావడంతో పెద్దలు ఇబ్బంది పెడుతుంటారు. అలాంటి ఈ కుర్రాడికి విజయ్ సేతుపతిని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎలా వచ్చింది? చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?) -
ఓటీటీలో స్పోర్ట్స్ డ్రామా చిత్రం.. సైలెంట్‌గా స్ట్రీమింగ్
కోలీవుడ్‌లో 'పీటీ సర్' సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలయి మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో హీరో, మ్యూజిక్ డైరెక్టర్ హిప్హాప్ తమిళన్, యంగ్ బ్యూటీ అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మే 24న విడుదలైంది. అయితే, తాజాగా ఎలాంటి ప్రకటన లేకుండానే సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.'పీటీ సర్' సినిమా ఒక వర్గం వారికి పెద్దగా కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. దీనికి ప్రధాన కారణం నెగటివ్ రివ్యూలు అని టాక్. కానీ, ఐఎమ్‌డీబీ సంస్థ మాత్రం పీటీ సర్ సినిమాకు 7.6 రేటింగ్ ఇచ్చింది. దీంతో సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఓటీటీలో ఈ చిత్రం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అమెజాన్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఎలాంటి ప్రకటన లేకుండానే ఓటీటీలో 'పీటీ సర్' స్ట్రీమింగ్ అవుతుంది. అయితే, తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఈ చిత్రాన్ని చూడొచ్చు.వెల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కార్తీక్ వేణుగోపాలన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రచన, దర్శకత్వం కూడా ఆయనే వ్యవహరించడం విశేషం. ఈ సినిమాకు హీరో అయిన హిప్హాప్ తమిళనే సంగీతం అందించారు. -
హీరోయిన్గా డైరెక్టర్ కూతురి ఎంట్రీ!
ఇండస్ట్రీలోకి వారసులు రావడం కొత్తేం కాదు. వీళ్లలో కొందరు సక్సెస్ అయి స్టార్స్ అయితే మరికొందరు మాత్రం అనామకంగా మిగిలిపోతుంటారు. తాజాగా మరో ఇద్దరు సెలబ్రిటీల వారసుల తెరంగేట్రానికి రెడీ అయ్యాడు. కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలిచే నటి వనితా విజయ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె మాజీ భర్త ఆకాశ్‌కు పుట్టిన కొడుకు విజయ్ శ్రీహరి... ఇప్పుడు హీరో అవుతున్నాడు. తమిళ దర్శకుడు ప్రభు సాల్మన్ కూతురు హేజల్ షైనీ ఇదే మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది.(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్)విజయ్ శ్రీహరి, హేజల్ షైనీ జంటగా ప్రభు సాల్మన్ ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఈ దర్శకుడు ఇంతకు ముందు 'కొక్కీ' మూవీతో కరణ్‌ని, 'మైనా'తో అమలాపాల్, 'కుంకీ'తో విక్రమ్ ప్రభును హీరోగా పరిచయం చేశారు. ఈ మూడు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. 'కాయల్' సినిమాతో ఆనందికి కూడా మంచి పేరు వచ్చేలా చేశారు సాల్మన్. ఇలా చాలామందికి హిట్స్ ఇచ్చిన ప్రభు సాల్మన్ ఇప్పుడు తన కూతురికి కూడా అలానే ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఫిక్సయ్యారు.ఇది 'కుంకీ' తరహాలోనే అడవి బ్యాక్ డ్రాప్లో సాగే డిఫరెంట్ సినిమా అని, ఇందులో సింహాం ప్రధాన పాత్రధారిగా ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా, త్వరలోనే అధికారిక ప్రకటనతో పాటు ఇతర వివరాలు వెల్లడించే అవకాశముందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. ఓటీటీలో తెలుగు మూవీ డైరెక్ట్ రిలీజ్) -
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజై హిట్ కొట్టినప్పటికీ.. పెద్దగా టైమ్ తీసుకోకుండా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. నెలలోపే ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా స్ట్రీమింగ్ చేసేస్తున్నారు. ఇది తమిళ మూవీ. కానీ తెలుగులో నేరుగా అందుబాటులోకి వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఏంటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?)తమిళ హీరో కవిన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'స్టార్'. సినిమా హీరో అవ్వాలనుకునే ఓ యువకుడి కథతో దీన్ని తెరకెక్కించారు. మే 10న తమిళంలో రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీని తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలోకి తీసుకురావాలనుకున్నారు. కానీ ఎందుకో కుదర్లేదు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో 'స్టార్' స్ట్రీమింగ్ అవుతోంది.'స్టార్' కథ విషయానికొస్తే.. పాండియన్ (లాల్) ఓ ఫొటోగ్రాఫర్. కొడుకు కలై (కవిన్)ని సినిమా యాక్టర్ చేయాలని అనుకుంటాడు. తండ్రి ప్రోత్సాహం వల్ల చిన్నప్పటి నుంచే సినిమాలంటే పిచ్చితో కలై పెరుగుతాడు. పెరిగి పెద్దయిన తర్వాత ముంబైలో యాక్టింగ్ కోర్సు పూర్తి చేస్తాడు. హీరోగా అవకాశం వస్తుంది. కానీ ఓసారి యాక్సిడెంట్ అయి ముఖమంతా అందవికారంగా తయారవుతుంది. ఇలాంటి కలై.. చివరకు యాక్టర్ అయ్యాడా? లేదా? అనేదే తెలియాలంటే 'స్టార్' చూసేయాల్సిందే.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
మూడోసారి అలాంటి పాత్రలో కార్తీ.. హిట్ కొడతాడా?
తమిళ హీరో కార్తీ మరోసారి పోలీసుగా కనిపించబోతున్నాడు. 'ఖాకీ', 'సర్దార్' సినిమాల్లో పోలీస్‌గా ఆకట్టుకున్న ఇతడు ఇప్పుడు మరోసారి అలాంటి రోల్ చేయబోతున్నాడు. ఈ మూవీకి 'వా వాతియార్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. నలన్ కుమార స్వామి దర్శకత్వం వహిస్తున్నాడు. కృతి శెట్టి హీరోయిన్ కాగా సత్యరాజ్, రాజ్ కిరణ్ తదితరులు కీలక పాత్రధారులు.(ఇదీ చదవండి: నన్ను అలాంటి డ్రెస్సుల్లో ఎవరూ చూడొద్దనుకుంటాను.. కానీ!: జాన్వీ కపూర్)కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తున్నాడు. కాగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రీసెంట్గా కార్తీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. పోలీసు దుస్తుల్లో కార్తీ, కూలింగ్ కళ్లజోడు, ఆయన వెనక నిలబడ్డ ఎంజీఆర్ పాత్రలతో కూడిన పోస్టర్ ట్రెండీగా ఉంది.ఇకపోతే కార్తీ ఇంతకుముందు పోలీసుగా చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇది కూడా మంచి విజయం సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.(ఇదీ చదవండి: ఫైనల్లీ 'కల్కి' షూటింగ్ పూర్తయింది.. వాళ్లందరికీ స్పెషల్ గిఫ్ట్స్) -
'96' దర్శకుడితో కార్తీ మూవీ.. మళ్లీ అలాంటి కాన్సెప్ట్
సూర్య తమ్ముడిగా పరిచయమైనప్పటికీ తనదైన యాక్టింగ్‌తో తెలుగులోనూ అద్భుతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు కార్తీ. వరస సినిమాలతో అలరించే ఇతడు ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తున్నాడు. తాజాగా ఇతజి పుట్టిన రోజు సందర్భంగా వాటి నుంచి అప్డేట్స్ వచ్చాయి. కార్తీ-'96' మూవీ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'మెయ్యళగన్' టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో అరవింద స్వామి ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. సూర్య-జ్యోతిక నిర్మిస్తున్నారు.(ఇదీ చదవండి: ఆయన దుస్తులు లేకుండానే పక్కన వచ్చి కూర్చుంటాడు: స్టార్ హీరోయిన్)ఇక షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకొంటోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో కార్తీ ఎద్దుతో ముచ్చటిస్తున్నట్లు ఒకటి ఉండగా, కార్తీ-అరవిందస్వామి సైకిల్లో వెళుతున్నట్లుగా మరో పోస్టర్ కనిపించింది. ఈ రెండింటిని చూస్తుంటే ఈ పోస్టర్లను చూస్తుంటే 'మెయ్యళగన్' గ్రామీణ నేపథ్యంలో సాగే వింటేజ్ మూవీ అనిపిస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
నయనతార వయసు 39 ఏళ్లు. ఇద్దరు పిల్లల తల్లి. కానీ ఇప్పటికీ వరసపెట్టి సినిమాలు చేస్తోంది. కాదు కాదు ఛాన్సులు వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే చాలామంది హీరోయిన్లు.. తమకు స్టార్ హోదా రాగానే భూమ్మీద నిలబడరు. ఎక్కడికో వెళ్లిపోతారు. ఇలాంటి టైంలోనూ నయనతారకు అసలు ఇన్ని ఛాన్సులు ఎలా వస్తున్నాయి? అసలు ఆమె ఏం ఫాలో అవుతోంది?(ఇదీ చదవండి: Love Me If You Dare: ‘లవ్ మీ’మూవీ రివ్యూ)టాలీవుడ్ హీరోయిన్లనే తీసుకోండి. ఒక్కసారి స్టార్ హీరోయిన్ అయిపోతే ఇక చిన్న సినిమాలు చేయడానికి అస్సలు ఆసక్తి చూపించరు. మ్యునరేషన్ అమాంతం పెంచేస్తారు. నయన్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 'జవాన్' లాంటి మూవీతో పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టినా సరే తమిళంలో లోకల్ మూవీస్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. హిట్, ఫ్లాప్ అనేది పక్కనబెడితే లోకల్ నిర్మాతలకు అందుబాటులో ఉంటుంది.కొన్నాళ్ల క్రితం అథర్వ అనే చిన్న హీరోతో కలిసి సినిమా చేసింది. ఇప్పుడు కవిన్ అని మరో యంగ్ హీరోతో కలిసి ఇప్పుడు నటించబోతుందట. లోకేశ్ కనగరాజ్ శిష్యుడు విష్ణు ఎడవన్.. ఈ ప్రాజెక్టుతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది. అయితే మిగతా హీరోయిన్లతో పోలిస్తే అన్ని రకాల సినిమాలు చేస్తుండటమే ఈమె సక్సెస్ సీక్రెట్ అయ్యిండొచ్చు.(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ) -
నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
హీరోయిన్ల జీవితం బయటకు చూడటానికి బాగానే ఉంటుంది. కానీ లోపల మాత్రం వేరేగా ఉంటుంది. ఎంత కష్టమొచ్చినా సరే చాలామంది బ్యూటీస్ తమ బాధల్ని బయటకు చెప్పుకోరు. ఎందుకంటే కొత్త సినిమాలు రావేమోనని భయం. సందర్భం వచ్చినప్పుడు వాటిని బయటపెడుతుంటారు. ఇప్పుడు అలానే హీరోయిన్ నమిత.. తనకు కెరీర్లో ఎదురైన దారుణమైన మోసాల్ని రివీల్ చేసింది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)'మూవీ పేరు చెప్పను కానీ ధనుష్ హీరోగా ప్రాజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఓ నిర్మాత నా కాల్షీట్ తీసుకున్నారు. కానీ చివరకొచ్చేసరికి ఆయన కజిన్ హీరోగా నటించాడు. ఆ విషయం నాకు తెలియగానే చాలా బాధపడి సగంలోనే ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశా. ఆపై ఎలాగోలా సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. దీని గురించి అప్పట్లో నిర్మాతల మండలి, నటీనటుల మండలిలో ఫిర్యాదు కూడా చేశాను. అలానే మలయాళంలో పేరున్న నిర్మాత ఉన్నారు కదా అని ఓ ప్రాజెక్ట్ సైన్ చేశా. కానీ దాన్ని వేరే నిర్మాత తీసుకోవడంతో చాలా ఇబ్బందులు పడుతూనే ఆ మూవీ పూర్తి చేశాను' అని నమిత తనకెదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టింది.గుజరాత్లో పుట్టి పెరిగిన నమిత.. 'సొంతం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించింది. 2020లో చివరగా ఓ చిత్రంలో నటించిన ఈమె.. కొన్నాళ్ల క్రితం బీజేపీ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన గురించి పలు విషయాల్ని బయటపెడుతోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్‌తో ఉన్న ఈమెని గుర్తుపట్టారా? పాన్ ఇండియా డైరెక్టర్ భార్య) -
కమెడియన్ అని చిన్నచూపు చూడొద్దు..
కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు హీరోగా పేరు తెచ్చుకునేంత వరకు వెళ్లిన నటుడు సూరి. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఇతడు గతేడాది 'విడుదలై' మూవీతో హీరోగా మారి హిట్ కొట్టాడు. ఇప్పుడు 'గరుడన్'గా రాబోతున్నాడు. ఉన్ని ముకుందన్, సముద్రఖని, రేవతీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని మే 31న థియేటర్లలోకి రాబోతుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కథ అందించిన ఈ సినిమాకు దురై సెంథిల్ కుమార్ దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. 'గరుడన్' ఆడియో ఈవెంట్ తాజాగా జరగ్గా దీనికి తమిళ స్టార్ హీరోలు విజయసేతుపతి, శివకార్తీకేయన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.'హాస్య నటులని చులకనగా చూడొద్దు. ఓ టైంలో హీరోగా చేయమని సూరికి సలహా ఇచ్చాను. కానీ ఆయన కాస్త భయపడ్డాడు. కొన్నాళ్ల తర్వాత ఫోన్ చేసి.. వెట్రిమారన్ తనని హీరోగా పెట్టి మూవీ చేస్తున్నానని, కానీ కాస్త దడ పుడుతోందని అన్నాడు. అయితే కామెడీ నటులు సీరియస్ పాత్రల్లో నటించగలరు గానీ సీరియస్ నటులు కామెడీ పాత్రలు చేయలేరు. అందుకు సూరినే ఓ ఉదాహరణ' అని శివకార్తికేయన్ చెప్పాడు. తనని హీరోగా మార్చిన వెట్రిమారన్‌కి జీవితాంతం రుణపడి ఉంటానని సూరి ఎమోషనల్ అయ్యాడు.(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్) -
తొలిసారి ఆ ఇండస్ట్రీలోకి కియారా.. స్టార్ హీరోతో కలిసి?
రీసెంట్ టైంలో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో కియారా అడ్వాణీ ఒకరు. హిందీ చిత్రాలతోనే ఇండస్ట్రీలోకి వచ్చింది కానీ తెలుగులోనూ రెండు మూవీస్ చేసి ఇక్కడ క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం చరణ్ 'గేమ్ ఛేంజర్'లో నటిస్తూ బిజీగా ఉంది. అలాంటిది ఇప్పుడు కియారాకు తమిళం నుంచి ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)మిళ హీరోల్లో శింబు స్టైలే వేరు. దాదాపు కొన్నేళ్ల పాటు హిట్ లేక పూర్తిగా కనుమరుగైపోయిన ఇతడు.. కొన్నాళ్ల క్రితం 'మానాడు', 'వెందు తనిందడు' చిత్రాలతో హిట్స్ కొట్టాడు. గతేడాది వచ్చిన 'పత్తు తలా' మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఇతడు కమల్ 'థగ్ లైఫ్'లో కీలక పాత్ర చేస్తున్నాడు. మరోవైపు కమల్ నిర్మిస్తున్న ఓ మూవీలో హీరోగా చేస్తున్నాడు.దేసింగ్ పెరియస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శింబు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని.. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కియారా అడ్వాణీ పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తమిళ చిత్రసీమలోకి కియారా ఎంట్రీ ఇచ్చినట్లు అవుతుంది. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రావొచ్చు.(ఇదీ చదవండి: క్యార్‌వ్యాన్‌లోకి వచ్చి అతడలా చేసేసరికి భయపడ్డా: కాజల్ అగర్వాల్) -
'లవ్ టుడే' హీరో కొత్త సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా?
'కోమాలి' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రదీప్ రంగనాథన్.. తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత హీరోగా మారిపోయి 'లవ్ టుడే' అనే మూవీ తీశాడు. గతేడాది రిలీజైన ఈ చిత్రం ఊహించని సక్సెస్ అందుకుంది. దీంతో ప్రదీప్ రంగనాథన్‌కు క్రేజ్ పెరిగిపోయింది. ప్రస్తుతం డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ తీస్తున్న 'ఎల్ఐసీ' చిత్రంలో హీరోగా చేస్తున్నాడు. ఇందులో నటి నయనతార ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.(ఇదీ చదవండి: This Week In OTT: ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. ఏంటంటే?)కాగా ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో మూవీని మొదలుపెట్టేశాడు. 'ఓ మై కడవులే' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దీనికి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను నిర్మాతలు ఆదివారం ప్రకటించారు. 'డ్రాగన్' అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. అలానే పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. త్వరలో నటీనటుల వివరాలతో పాటు మిగతా విషయాలు చెబుతామని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)#PradeepAshwathCombo fire ah title ketta fire odave title kudukareengale 🤩! @Ags_production #KalpathiSAghoram #KalpathiSGanesh #KalpathiSSuresh are happy to present #DRAGON@pradeeponelife @Dir_Ashwath @archanakalpathi @aishkalpathi @venkat_manickam @malinavin @nikethbommi… pic.twitter.com/dOnTVhveZ1— Archana Kalpathi (@archanakalpathi) May 5, 2024