Tank Bund
-
గణనాథుల భారీ క్యూ.. ట్యాంక్ బండ్‌పై కొనసాగుతున్న నిమజ్జనం (ఫొటోలు)
-
గణనాథుడికి ఘన వీడ్కోలు
-
వినాయక విగ్రహాలతో నిండిపోయిన ట్యాంక్ బండ్.. ఫుల్ ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో గణేష్ విగగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ఇంకా కొనసాగుతోంది. నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్ వద్దకు వేలాదిగా విగ్రహాలు తరలి వస్తున్నాయి. ఇప్పటికే విగ్రహాలు నిమజ్జనం కోసం క్యూలోనే ఉన్నాయి. పెద్ద విగ్రహాలు సైతం ఇంకా నిమజ్జనం కాలేదు.ఇక, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్‌లో విగ్రహాలను తరలిస్తున్న వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. కాగా, సోమవారం అర్ధరాత్రి వరకు లక్షకు పైగా నిమజ్జనాలు జరిగాయి. నేడు రోజు కూడా నిమజ్జనాల ప్రక్రియకు మరింత సమయం పట్టనుంది. నిన్నటి నుంచి నిమజ్జనం కోసం గణపతి విగ్రహాలు వస్తూనే ఉన్నాయి. దీంతో, ఖైరతాబాద్, లక్డీకాపూల్ ప్రాంతాల్లో కొంత మేర ట్రాఫిక్ ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ క్రమంలో అధికారులు.. వాహనాలను దారి మళ్లిస్తున్నారు. నేడు పనిదినం కావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డీజీపీ.. పోలీసుల అధికారులను ఆదేశించారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఒక వైపు రోడ్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. గణపతి విగ్రహాలను జలవిహార్, పీపుల్స్ ప్లాజా వైపు మళ్లిస్తున్నారు. అలాగే, విగ్రహాలను నిమజ్జనం కోసం పీపుల్స్ ప్లాజా రోడ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లోని మరో రోడ్లోకి మళ్లిస్తున్నారు. సాధారణ వాహనాల రాకపోకల కోసం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఇక, ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం కోసం ఇంకా ఐదువేల వరకు విగ్రహాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: లంబో‘ధర’ లడ్డూ! -
గణేష్ నిమజ్జనానికి హాజరైన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అరుదైన ఫీట్ సాధించారు. నగరంలో ఇవాళ జరిగిన గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న తొలి సీఎంగా నిలిచారు. ఇవాళ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అటు నుంచి నేరుగా ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనం జరిగే క్రేన్ నెంబర్ 4 వద్ద పరిశీలన జరిపారు. అక్కడి నుంచే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారాయన.క్లిక్ చేయండి: ఖైరతాబాద్ శోభాయాత్ర.. నెవర్ భిపోర్ -
ట్యాంక్‌బండ్‌పై సీఎం రేవంత్‌రెడ్డి.. గణేష్ నిమజ్జనం సమీక్ష (ఫొటోలు)
-
HYD: ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర (ఫొటోలు)
-
#GaneshNimajjanam2024 : హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందడి (ఫొటోలు)
-
ట్రాఫిక్ వలయంలో సాగర్ పరిసర ప్రాంతాలు.. వాహనదారులకు అలర్ట్
హైదరాబాద్, సాక్షి: గణేష్ నిమజ్జనం తో హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. నిమజ్జనానికి గణపయ్యలు క్యూ కట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్యాంక్ బండ్‌వైపు రావొద్దని.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు నగర పోలీసులు సూచిస్తున్నారు.రేపు ‘మహా’ నిమజ్జనం ఉండడం, నిన్న ఆదివారం కావడంతో నగరంలోని చాలా విగ్రహాలు ట్యాంక్‌బంక్‌కు చేరుకున్నాయి. అయితే విగ్రహాలను తరలిస్తున్న వాహనాలను నిన్న రాత్రి నుంచి నియంత్రించేందుకు సిబ్బంది లేకపోవడం, పైగా వాటిల్లో భారీ వాహనాలు ఉండడంతో.. నిమజ్జనానికి గంటల తరబడి టైం పడుతోంది. ఇక.. సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ పోలీసులు లేరన్న మీడియా కథనాలకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వాహనాలను త్వరగతిన పంపించేందుకు యత్నిస్తున్నారు. అయితే.. ఈలోపు వాహనాల రద్దీ పెరిగిపోయింది. ఖైరతాబాద్, టెలిఫోన్ భవన్, నాంపల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ట్యాంక్ బండ్ వైపుగా వెళ్లకపోవడం మంచిదని వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షల నేపథ్యంలో.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్తున్న వాళ్లకు సైతం నరకం కనిపిస్తోంది.రేపు ఖైరతాబాద్ మహా గణపతితో పాటు భారీ విగ్రహాల నిమజ్జనం కొనసాగనుంది. ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది. శోభాయాత్ర భద్రత కోసం పాతికవేల మంది సిబ్బందిని మోహరించినట్లు పోలీస్ శాఖ తెలిపింది. ఇక.. ఖైరతాబాద్ గణేషుడికి ఇవాళ పూజలు నిర్వహించి.. షెడ్డు తొలగింపు పనులు చేపట్టారు. రేపు ఉదయం ఆరు గంటలకు శోభాయాత్ర మొదలుపెడతారు. మధ్యాహ్నాం లోపు నిమజ్జనం చేస్తారు. ఎల్లుండి సాయంత్రంకల్లా నగరంలోని అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి కావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. క్లిక్ చేయండి: భారీ గణపయ్య దగ్గర కోలాహలం చూశారా? -
ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్యాంక్‌బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, భారీ కేడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. ట్యాంక్ బండ్ ఏర్పాటుచేసిన జాలీలను తొలగించిన సమితి నేతలు.. వినాయకుని నిమజ్జనం చేశారు.ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుందని.. కొత్త రూల్స్ తీసుకువచ్చి భక్తుల మనోభావాలను ప్రభుత్వం, పోలీసులు దెబ్బతీస్తున్నారని ఉత్సవ సమితి నేతలు మండిపడుతున్నారు. 2022, 23లో కూడా ఇదే విధంగా చెప్పారు. కానీ చివరకు ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనాలు జరిగాయన్నారు.‘‘ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈ రోజు మధ్యాహ్నం వరకు చేయాలి.. లేని పక్షంలో ఈ రోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగరా వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తాం. ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం’’ అంటూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రాజావర్ధన్ రెడ్డి హెచ్చరించారు.ఇదీ చదవండి: గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు -
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్
#Hyderabadసాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే, హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో లాయర్ వేణుమాధవ్ పిటిషన్ దాఖలు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్.. ప్రతివాదిగా చేర్చాలని కూడా కోరారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. మొదట హైడ్రాను ప్రతివాదిగా చేర్చడాన్ని కోర్టు తిరస్కరించింది. అనంతరం, పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ట్యాంక్ బండ్లో నిమజ్జనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సందర్బంగా కోర్టు ధిక్కరణపై పిటిషనర్ ఆధారాలు చూపించలేకపోయారు అంటూ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. నిమజ్జనం జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలు పాటించాలని కోర్టు స్పష్టం చేసింది. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలి. గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదు. అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను పార్టీ చేస్తాం. ఈ సందర్భంగా అధికారుల చర్యలను హైకోర్టు సమర్థించింది. 2022లో అధికారుల చర్యలపై తృప్తి చెంది రికార్డ్ చేసాము. పీఓపీతో విగ్రహాలు తయారు చేయడంపై నిషేధం ఇవ్వలేం. కానీ, పీఓపీ విగ్రహాలు తాత్కాలిక పాండ్స్‌లో నిమజ్జనం చేసుకోవచ్చు. పిటిషనర్ ప్రత్యేక ఆదేశాల కోసం రిట్ పిటిషన్ వేయవచ్చు అని ధర్మాసనం చెప్పింది. #Tankbundఇదిలా ఉండగా.. కోర్టులో పిటిషన్‌పై విచారణ జరుగుతుండగానే హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతులు లేవంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ట్యాంక్ బండ్ మార్గంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. గణేష్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. మరోవైపు హుస్సేన్ సాగర్‌లో వినాయకుని నిమజ్జనాలకు అనుమతులు ఇవ్వకపోతే ఎక్కడ నిమజ్జనం చేయాలనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయం విషయంలో ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. No idol immersion on Tank bund ✅ pic.twitter.com/ZwQBdao8LQ— Sreekanth B+ ve (@sreekanth324) September 10, 2024 #RajaSingh Comments..ఈ సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ట్యాంక్ బండ్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనం విషయంలో గందరగోళం కనిపిస్తోంది. సీఎం రేవంత్, జీహెచ్ఎంసీ కమిషనర్ దీనిపై వివరణ ఇవ్వాలి. నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్‌కు నిమజ్జనానికి విగ్రహాలు వస్తాయి. నిజంగా హైకోర్టు ఆర్డర్ అమలు చేస్తే ఈ విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయిస్తారు. ఇప్పటికే ప్రజలు ఎన్నో సందేహాలతో ఉన్నారు. వారికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ట్యాంక్ బండ్లో విగ్రహాలు నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అసలు ఎవరు వ్యతిరేకిస్తున్నారో జీహెచ్ఎంసీ కమిషనర్ బయటకు తీసుకురావాలి అని డిమాండ్ చేశారు. There seems to be some confusion regarding the immersion of Ganesh idols at Vinayaka Sagar (Tankbund). I kindly request Telangana CM @revanth_anumula garu and the @GHMCOnline Commissioner to provide clarity on this matter as a priority.Ensuring clear guidelines will help in… pic.twitter.com/JmWthMZyze— Raja Singh (@TigerRajaSingh) September 10, 2024ఇది కూడా చదవండి: సికింద్రాబాద్ నుంచి మరో వందే భారత్ రైలు.. వివరాలివే -
Tank Bund: ఘనంగా మూడో రోజు వినాయక నిమజ్జనాలు (ఫొటోలు)
-
హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం.. ‘హైడ్రా’ ప్రతివాదిగా కోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వినాయకచవితి నవ రాత్రుల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం అంశంపై హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై రేపు(మంగళవారం) విచారణ జరుగనుంది.కాగా, హుస్సేన్‌సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయవద్దని గతంలో ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ తన పిటిషన్లో కోరారు. ఈ క్రమంలో హైడ్రాను కూడా పిటిషనర్.. ప్రతివాదిగా చేర్చాలన్నారు. హుస్సేన్‌సాగర్ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని కోర్టును పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై వాదనలను రేపు(మంగళవారం) వింటామని న్యాయస్థానం తెలిపింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో రేపు వాదనలు జరుగనున్నాయి. -
వరికుచ్చులను మెచ్చుకున్న సీఎం
నిర్మల్: తెలంగాణ దశాబ్ది వేడుకల్లో జిల్లా నుంచి ప్రదర్శనలో ఉన్న ధాన్యపు కుచ్చులు ప్రత్యేక ఆకర్షణగా నిలువడమే కాకుండా.. సీఎం రేవంత్‌రెడ్డి స హా ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వీటిని ప్రదర్శించారు. జిల్లాకు చెందిన డీఆర్డీఓ విజయలక్ష్మి, డీఆర్డీఏ, సెర్ప్ సిబ్బంది కలిసి వరికుచ్చులను ప్రత్యేకంగా తయారు చేశారు.చేనేత, ఇతర కళాకృతుల కంటే ఈసారి ధాన్యపుసిరిని కళ్లకు కట్టించే వరికుచ్చులు అందరినీ ఆకట్టుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఈఓ, కమిషనర్ అనితా రామచంద్రన్, సంగీత దర్శకుడు కీరవాణి పరిశీలించారు. -
TG : ట్యాంక్‌బండ్‌పై ఘనంగా అవతరణ వేడుకలు (ఫొటోలు)
-
సర్వాంగ సుందరంగా ట్యాంక్‌బండ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవతరణ వేడుకలకు ట్యాంక్ బండ్‌ను ప్రభుత్వం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. జూన్ 2న సాయంత్రం ట్యాంక్ బండ్‌పై పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్ పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. సామాన్య ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులను ఆకట్టుకునే ప్రదర్శనలు, ఆట వస్తువులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. వివిధ జిల్లాల సాంస్కృతిక కళా బృందాలతో కార్నివాల్ ప్రదర్శనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదికపై శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర అధికారిక గేయం ’జయ జయహే తెలంగాణ’ పై పోలీసు సిబ్బందితో ప్రదర్శన నిర్వహించనున్నారు. బాణసంచా పేలుస్తూ ఉత్సవ అనుభూతి పొందేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్యాంక్ బండ్‌పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో రాష్ట్రంలోని హస్తకళలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరంలోని పలు ప్రముఖ హోటళ్ల ఫుడ్ కోర్టులు ఉండనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులు పరిశీలించారు. వేదిక అలంకరణ, వేడుకలకు హాజరయ్యే అతిథులకు, పాల్గొనే ప్రజలకు సీటింగ్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తు తదితర ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల్ క్యాంపులు, మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్ఈడీ స్క్రీన్లతో, లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేస్తున్నారు. -
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం దృష్ట్యా.. శుక్రవారం పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రెండోరోజు నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలు కదులుతుండడంతో.. పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఇంకా అమలు చేస్తున్నారు. నిమజ్జనం కోసం ఇంకా వందల సంఖ్యలో విగ్రహాలు రోడ్ల వెంట బారులు తీరాయి. ఈ క్రమంలో పోలీసులు కీలక సూచన చేశారు. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్‌లో వెళ్లే వాహనాలు.. ఇతర మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. నగరంలో నిన్న(గురువారం) ఉదయం నుంచి విగ్రహాల నిమజ్జనం మొదలైంది. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం తర్వాత చాలాసేపు విగ్రహాల నిమజ్జనం జరగలేదు. సాయంత్రం నుంచి విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు రావడం మొదలైంది. ఈ క్రమంలో ఇవాళ రెండో రోజూ కూడా ట్యాంక్‌బండ్‌లో విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. లిబర్టీ మీదుగా హిమాయత్ నగర్, నారాయణగూడ, తిలక్‌నగర్.. కోరంటి ఆస్పత్రి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. అబిడ్స్, లక్డీకాపూల్ వైపు భారీగానే ట్రాఫిక్ ఉంది. మరోవైపు ట్యాంక్‌బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై గణనాథులు బారులు తీశారు. మధ్యాహ్నాంలోగా నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. -
గణేష్ నిమజ్జనంలో దుమ్మురేపిన పోలీస్ డాన్స్
హైదరాబాద్: భారీ బందోబస్తు మధ్య హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ వెంబడి గణేశుడి నిమజ్జనాలు ఘనంగా జరుగుతున్నాయి. కొద్దిసేపు భారీగా వర్షం కురిసినా కూడా నిమజ్జనాలు కొనసాగాయి. ఇదిలా ఉండగా ఈ సంబరాల్లో ఒక పోలీస్ అధికారి డాన్స్‌తో దుమ్ము రేపారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా విగ్నేశ్వరుడు తొమ్మిది రోజులపాటు మన మధ్య కొలువుతీరి ఘనంగా పూజలు అందుకున్నాడు. నవరాత్రులు ముగిసిన సందర్భంగా గణనాథుడు గంగమ్మ ఒడిలో చేరుతున్న వేళ ట్యాంక్ బండ్ చేరుకున్న భక్తులంతా సంబరాల్లో మునిగితేలారు. మిలాద్-ఉన్-నబీ, గణేష్ నిమజ్జనం ఇకేరోజు రావడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 40000 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేసింది పోలీస్ శాఖ. నిమజ్జనాలకు తరలివచ్చిన భక్తుల్లో పిల్ల, పెద్ద, యువత తేడా లేకుండా తీన్మార్ దరువుకు ధూందాం డాన్సులేశారు. ఇదే సంబరాల్లో ఓ పోలీసాయన కూడా తన్మయత్వంతో చిందులేశారు. ప్రొఫెషనల్ డాన్సర్లా ఈయన వేసిన స్టెప్పులకు చుట్టూ ఉన్నవారు కూడా నివ్వెరపోయి చూస్తుండిపోయారు. ఇంకేముంది మిగతా పోలీసులు కూడా కాసేపు సంబరాల్లో పాలుపంచుకుంటూ సరదాగా డాన్సులు చేశారు. ఈ వీడియో టీవీలో కనిపించిన కొద్దిసేపటికే మొబైల్ ఫోన్లలో చేరి వైరలయ్యింది. #Hyderabad police dance during Ganesh Shoba Yatra pic.twitter.com/rcWNY8wwbL — Naveena (@TheNaveena) September 28, 2023 ఇది కూడా చదవండి: నిమజ్జన వేళ.. స్టెప్పులేసిన సీపీ రంగనాథ్ -
ట్యాంక్ బండ్ పరిసరాల్లో భక్తుల కోలాహలం
-
ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనం సందడి
-
Ganesh Nimajjanam 2023 Photos: ఘనంగా వినాయక నిమజ్జనాలు.. భక్తుల సందడి (ఫోటోలు)
-
ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఇసుకేస్తే రాలని జనం
సాక్షి, హైదరాబాద్: వారాంతం కావడంతో ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం జనం పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచే ఖైరతాబాద్ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. ఇసుకేస్తే రాలని జనం.. జైబోలో గణపతి మహా రాజ్ కి జై నినాదాలతో ఖైరతాబాద్ ప్రాంగణం మారుమోగిపోతోంది.ఆదివారం మధ్యాహ్నం వరకే లక్షన్నర మంది భక్తుల దర్శనం చేసుకున్నట్లు అంచనా వేస్తోంది ఖైరతాబాద్ మహా గణపతి నిర్వాహక కమిటీ. సెప్టెంబర్ 28వ తేదీన నగరంలో నిమజ్జనం జరగనుంది. నిమజ్జనానికి ముందు ఆదివారం కావడంతో జనం ఖైరతాబాద్ గణేషుడి దర్శనార్థం క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్నం దాటాక.. జనం రావడం ఒక్కసారిగా పెరిగింది. దాదాపు మూడు కిలోమీటర్ల మేర లైన్లో నిల్చున్నారు భక్తులు. దీంతో.. వీఐపీ దర్శనాలను నిలిపివేసి సాధారణ భక్తులను అనుమతిస్తున్నారు. ఆదివారం సాయంత్రం సమయంలో ఈ సందడి మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఖైరతాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు.. మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. మరోపక్క.. నగరంలో విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే వందల కొద్దీ విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు చేరుకుంటున్నాయి. ఖైరతాబాద్, సోమాజిగూడ, నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు విపరీతమైన రద్దీతో నిండిపోయాయి. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు.. శాంతి భద్రతలను పోలీసులు పరిరక్షిస్తున్నారు. -
ట్యాంక్ బండ్‌పై గద్దర్ విగ్రహం పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలని వైఎస్సా ర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అల్వాల్ భూదేవి నగర్‌లోని గద్దర్ నివాసానికి వెళ్లిన ఆమె ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, సమాధి వద్ద నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెల్పిన షర్మిల... ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ముద్రించాల్సిన అవసరం ఉందని, గద్దర్ సొంత ఊరు తూప్రాన్‌లో ఆయన పేరిట స్మారక భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. గద్దర్ చేత కంటతడి పెట్టించిన కేసీఆర్, ఆయ న కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలన్నా రు. 9 ఏళ్లలో ఒక్కసారి కూడా గద్దర్‌కి కేసీఅర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. ఆయన విష యంలో కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరించారన్నారు. ప్రగతి భవన్ దగ్గర రోజంతా ఎదురు చూసినా లోపలకు పిలవకపోవడంతో.. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అని గద్దర్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్సార్ అంటే గద్దర్‌కి చాలా ప్రేమ అని, నాతో చాలాసార్లు వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారన్నారు. -
అతి భారీ వర్షాలు.. ట్యాంక్‌బండ్ వద్ద వరద ఉధృతి పరిశీలించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో హైదరాబాద్ తాజా పరిస్థితిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి పురపాలకశాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులపైన అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. వరద నీరు నిలిచిన పట్టణాల్లో మరిన్ని సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. శిథిల భవనాల నుంచి జనాలను వెంటనే తరలించాలని ఆదేశించారు. గత ఏడాదితో పోలిస్తే ఆయా ప్రాంతాల్లో వరద సమస్య తగ్గిందన్నారు. మూసీ వరదను మానిటర్ చేస్తున్నాం అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. పురపాలకశాఖ అధికారులతోనూ కేసీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారని తెలిపారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. మూసీ వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని తెలిపారు. వరద ప్రభావం కొంత తగ్గింది కుంభవృష్టిగా, ఎడతెరిపి లేకుండా వర్షం పడటం వలన ప్రజలకు కొంత ఇబ్బంది ఎదురవుతుందని, పలు కాలనీల్లో మాత్రం తాత్కాలికంగా వరదనీరు వచ్చి చేరిందని అన్నారు. నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గిందన్నారు. తమ ప్రధాన లక్ష్యం ప్రాణ నష్టం జరగకుండా చూడమేనని స్పష్టం చేశారు. వాళ్ల సెలవులు రద్దు హైదరాబాద్ నగరంలోనూ జీహెచ్ఎంసీ కమిషనర్ సహా ఇతర ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయిలో ఉన్న కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ పనిచేస్తున్నారని తెలిపారు. పురపాలక ఉద్యోగుల అన్ని సెలవులు రద్దు చేసినట్లు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. ఇప్పటిదాకా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సాధ్యమైన ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 135 చెరువులకు గేట్లు బిగించాం హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. హైదరాబాద్ నగరంలో డిసిల్టింగ్ కార్యక్రమాన్ని ఎప్పుడో పూర్తి చేశాం. దీంతోపాటు చెరువుల బలోపేతం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాము. 135 చెరువులకు గేట్లు బిగించాం. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అధికారులు సిబ్బంది కూడా విస్తృతంగా పనిచేస్తున్నారు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది గతంలో ఇలాంటి భారీ వర్షాలు పడితే అనేక ప్రాంతాలు జలమయం అయ్యేది. అయితే ఈసారి నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా చేపట్టిన కార్యక్రమాల వలన వరద ప్రభావం కొంత తగ్గింది. ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు మాని . భారీ వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. భారీ వర్షాల్లో నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా చిల్లర విమర్శలు చేయవద్దు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు వర్షాన్ని ఎదుర్కొనేందుకు పనిచేస్తున్నాయి. వారి మనో ధైర్యం దెబ్బతినకుండా నాయకులు మాట్లాడితే బాగుంటుంది. చెరువులకు గండి పడే ప్రమాదం వరద పెరిగే ప్రాంతాల్లో ఉన్న పౌరులను అలర్ట్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక షెల్టర్లను ఏర్పాటు చేస్తున్నాం. చెరువులకు గండి పడే ప్రమాదం ఉంటే వాటిని కూడా సమీక్షిస్తున్నాం. వర్షాలు తగ్గుముఖం పట్టగానే వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటాం. వరంగల్ నగరానికి వెళ్లాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించాము. అవసరమైతే రేపు నేను కూడా స్వయంగా వెళ్తాను’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. -
నా మీద జరిగిన దాడి ప్రపంచంలో ఎవరిమీద జరిగి ఉండదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యార్థుల బలిదానాలు బాగా కలిచి వేశాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన పోరాటంలో అమరుల ప్రాణ త్యాగాలకు వెలకట్టలేమని.. 600 మంది అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. హుస్సేన్ సాగర్ తీరాన నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. అనంతరం సభావేదికపైకి చేరుకొని తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత చారి తల్లి శంకరమ్మతోపాటు పలువురి అమరుల కుటుంబాలను సన్మానించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఎన్నిసార్లు రాజీనామా చేశామో లెక్కలేదని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేశామని గుర్తు చేశారు. తెలంగాణ పోరాటంలో హింస జరగకుండా తమ శక్తిమేర చూశామని చెప్పారు. తనపై జరిగిన దాడి ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడిపై జరిగి ఉండదని.. తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఉద్యమానికి బయల్దేరామని చెప్పుకొచ్చారు. చదవండి: అమరుల స్మారక చిహ్నం ప్రారంభం, ప్రత్యేకతలివే ‘నిరసనలతో ఢిల్లీ సర్కార్ దిగి వచ్చింది. అహింసా మార్గంలోనే తెలంగాణ సాధించాం. ఉద్యమంతోనే ఢిల్లీ నుంచి తెలంగాణ ఇస్తున్నామని ప్రకటన వచ్చింది. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే కొట్టే విధంగా దిగజారారు. రాష్ట్రాన్ని విలీనం చేసే సమయంలో అనేక కుట్ర కోణాలున్నాయి. ఆ తరువాత 8 ఏళ్లకే ఇబ్బందులు మొదలయ్యాయి. టీఎన్జీవోలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. తొలి, మలి ఉద్యమాల్లో విద్యార్థులు ఎన్నో పోరాటాలు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది. పోరాటంలో ఎప్పుడూ జయశంకర్ వెనకడగు వేయలే. ఉద్యమాన్ని సజీవంగా ఉంచడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. గాంధీజీ ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు సాగాం. అమరజ్యోతి ఎల్లకాలం ఉండేలా నిర్మించుకున్నాం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా ఉండాలి. అందరి అంచనాలు తలకిందులు చేశాం. పంజాబ్‌ను తలదన్నేలా ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం. హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్‌గా ట్యాంక్‌బండ్ తయారైంది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అనంతరం 800 డ్రోన్లతో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రదర్శన నిర్వహించారు. -
అమరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. అమర వీరులకు నివాళిగా పోలీసులు గౌరవ వందనం చేశారు. 12 తుపాకులతో గన్ సెల్యూట్ నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం కేసీఆర్, సీఎస్ శాంతాకుమారి, డీజీపీ అంజనీకుమార్ స్వీకరించారు. పిడికిలి ఎత్తి జై తెలంగాణ అంటూ నినదించిన సీఎం.. లోపల అమరుల స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసి, అమర జ్యోతిని సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధా కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అమరుల కుటుంబాలను సత్కరించిన సీఎం కేసీఆర్ అనంతరం సభావేదికపైకి సీఎం కేసీఆర్ చేరుకోనున్నారు. అమరులకు నివాళిగా గేయాలను ఆలపించారు. సభలో 10 వేల మంది క్యాండిల్ లైట్స్ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పించారు. అనంతరం అమరుల కుటుంబాలను సీఎం కేసీఆర్ సన్మానించారు. తరువాత లేజర్, 800 డ్రోన్లతో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై ప్రదర్శన నిర్వహించనున్నారు. చదవండి: మళ్లీ గెలిపిస్తే పటాన్చెరు వరకు మెట్రో పొడిగిస్తాం: సీఎం కేసీఆర్ అమరుల స్మారక కేంద్రంలో విశాలమైన సభా మందిరం, ఉద్యమ ప్రస్థాన చిత్ర ప్రదర్శన కోసం థియేటర్, ఉద్యమ ప్రస్థానాన్ని వివరించే ఫోటో గ్యాలరీ, ఉద్యమ చరిత్రకు సంబంధించిన గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశారు. అమరుల స్థూపం ప్రత్యేకతలు ►హుస్సేన్ సాగర్ తీరాన లుంబినీ పార్క్ వద్ద 3.29 ఎకరాల్లో అమర వీరుల స్మారక జ్యోతి నిర్మాణం ►రూ. . 177 కోట్లు, మొత్తం ఆరు ఫ్లోర్లతో నిర్మాణం ►26,800 చ.మీ. విస్తీర్ణంలో ప్రమిద ఆకారంలో స్మారక నిర్మాణం. ► ప్రజ్వలన దీపం నమూనాను కళాకారుడు రమణారెడ్డి రూపొందించారు, ►స్టెయిన్లెస్ స్టీల్‌తో అమరవీరుల స్థూపం తయారు. ►16 వందల టన్నుల స్టెయిన్ స్టీల్ వాడకం. ►మొదటి 2 బేస్మెంట్లలో 2.14 లక్షల చదరపు అడుగుల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు ►335 కార్లు 400 బైక్‌లకు పార్కింగ్ సదుపాయం. ►150 అడుగుల స్మారకం, 26 అడుగుల దీపం ►మొదటి అంతస్తులో అమరుల ఫోటో గ్యాలరీ, మినీ థియేటర్ ►రెండో అంతస్తులో 500 మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్ ►మూడో అంతస్తులో చుట్టూ అద్దాలతో అద్దాల పైకప్పు నిర్మాణం (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)