TRS MLAs
-
మళ్లీ తెరపైకి ఎమ్మెల్యేల కొనుగోలు టాపిక్.. రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పొలిటికల్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. కాగా, రేవంత్ ట్విట్టర్ వేదికగా.. ‘కేసీఆర్!.. మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా?. అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా?. ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ సందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు బీఎల్ సంతోష్.. హైదరాబాద్ వచ్చిండటగా.. ఇన్నాళ్లు అడ్రస్ దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి ఇప్పుడైనా ఆయన్ని అరెస్టు చేసే దమ్ముందా? ఆ కట్టుకథను ప్రజలు మర్చిపోతారులే అని అతిథ్యమిస్తారా? లేక సిట్ ను నిద్రలేపి అరెస్టేమైనా చేస్తారా? తెలంగాణ చూస్తోంది.. మీ సమాధానం కోసం..!!’ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్! @TelanganaCMO మీ ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదని తెలంగాణ ప్రజలకు మొర పెట్టుకున్నది యాదికున్నదా? అదే తెలంగాణలో రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా? ఆ కేసుకు ఏడాది కావొస్తున్న శుభ… — Revanth Reddy (@revanth_anumula) October 5, 2023 ఇది కూడా చదవండి: బీజేపీ ఎన్నికల కమిటీల ప్రకటన.. 14 కమిటీలు.. రాజగోపాల్‌రెడ్డి, వివేక్, విజయశాంతిలకు చోటు -
మేం దాడులకు దిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పారిపోతారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రతిదాడులకు దిగితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాష్ట్రం వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అవినీతిపై పోస్టర్లు అంటిస్తున్నారన్న కారణంగా వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ నేత తోట పవన్‌పై దాడి చేయడం హేయమని మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తంచేశారు. తోట పవన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అనుచరులు కిరాతకంగా దాడిచేశారని, హత్య చేసేందుకు యత్నించారని, వినయ్‌భాస్కర్‌తో పాటు ఆయన అనుచరులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మహేశ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దళిత నాయకుడు సాయన్నకు ప్రభుత్వం గౌరవం ఇవ్వదా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి దళితులంటే గౌరవం లేదని, కనీసం అధికారిక లాంఛనాలతో కూడా సాయన్న అంత్యక్రియలు పూర్తి చేయకుండా చావులో కూడా సాయన్నకు బాధను మిగిల్చారని మహేశ్ ఆవేదన వ్యక్తంచేశారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: తీర్పు రిజర్వ్ చేసి ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఇప్పటికే పలు మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో విషయంలో హైకోర్టు కూడా ట్విస్ట్ ఇచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. కాగా, ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి. వాదన సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే.. లిఖితపూర్వక వాదనలకు అనుమతివ్వాలని కోర్టును కోరారు. దీంతో, ఈనెల 30వ తేదీ లోపు లిఖితపూర్వకంగా వాదనలు ఇవ్వాలని కోర్టు సూచించింది. ఇక, ఎమ్మెల్యేల కేసును సీబీఐకి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి అంతకు ముందు కోర్టు సింగిల్ బెంచ్ ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పును ఇచ్చింది. కాగా, సింగ్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. మొయినాబాద్ కేసు వివరాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. సిట్ తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. డాక్యుమెంట్లు ఇస్తే విచారణ ప్రారంభిస్తామని హైకోర్టుకు తెలిపింది. అయితే హైకోర్టులో కేసు విచారణ పూర్తయ్యే దాకా ఆగాలని ధర్మాసనం సీబీఐకి సూచించింది. ఆ తర్వాత సీబీఐ వాదన కూడా వింటామని పేర్కొంది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. అదేవిధంగా నిందితుల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2014 నుంచి 2018 వరకు బీఆర్ఎస్లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేల జాబితాను కోర్టుకు సమర్పించారు. 2014 నుంచి 2018 వరకు 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీలోకి చేర్చుకుందని ఆరోపించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. తదుపరి విచారణనకు జనవరి 9వ తేదీ (సోమవారం)కి వాయిదా వేసింది. చదవండి: మంత్రి పదవి వదులుకుంటా.. కిషన్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ -
ఎమ్మెల్యేల కేసు: గురువారానికి విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై బుధవారం హైకోర్టులో విచారణ ముగిసింది. ప్రభుత్వం వేసిన అప్పీల్ పిటీషన్‌కు విచారణ అర్హత లేదని ప్రతివాదుల లాయర్ అన్నారు. సుప్రీంకోర్టు మాత్రమే విచారించగలదని పేర్కొన్నారు. ఇతదుపరి విచారణను శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.. కాగా, ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారు. అలాంటి సమయంలో పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్‌కు బాధ్యత ఉంటుంది. కేసీఆర్ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడంతో తప్పులేదు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అది పబ్లిక్ డొమైన్‌లోకి వస్తుంది. ప్రజాక్షేత్రంలోకి ఎవిడెన్స్ వచ్చిన తరువాతే సీఎం కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్ ఆధారంగా ఈ కేసును సీబీఐకి ఇవ్వడం సరికాదు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే సీఎం స్పందించకూడదా?. సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ప్రధాని, హెచ్ఎం పేర్లు ప్రస్తావించినందుకే కేసును సీబీఐకి అప్పగిస్తారా?. సిట్‌ను క్వాష్ చేస్తే అసలు కేసు ఎక్కడిది అంటూ బలంగా తమ వాదనలు కోర్టుకు వినిపించారు. -
‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో కీలక పరిణామం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేల కొనుగోలు’ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రభుత్వ అప్పీలుపై హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 455/2022) సీబీఐకి బదిలీ చేయడాన్ని ఆపాలని తెలంగాణ సర్కార్ పిటిషన్లో కోరింది. జీవో 63 రద్దుపై హైకోర్టులో అప్పీల్ చేసింది. సిట్ దర్యాప్తు కొనసాగించాలని డివిజన్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం.. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేయాలని కోరింది. అయితే ఎమ్మెల్యేల కేసును విచారిస్తున్న సిట్ దర్యాప్తును రద్దు చేస్తూ సీబీఐకి బదిలీ చేయాలని ఇటీవల సింగిల్ జడ్జి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 63 రద్దు చేసింది. కేసు (ఎఫ్ఐఆర్ నంబర్ 455/2022) పూర్తి వివరాలను, స్వాధీనం చేసుకున్న మెటీరియల్‌ను సీబీఐకి అందజేయాలని సిట్, దర్యాప్తు అధికారులకు స్పష్టం చేసింది. చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో భారీ ట్విస్ట్ -
ఈడీ విచారణకు రోహిత్ రెడ్డి గైర్హాజరు.. వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: ఈడీ విచారణకు గైర్హాజరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. బుధవారం తన పిటిషన్ విచారణకు రానున్నట్లు తెలిపారు. ఈడీకి సంబంధంలేని కేసులో విచారణ సరికాదని తెలిపారు. అసలు ఎమ్మెల్యే కొనుగోలు కేసులో ఈడీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. తనను ఇబ్బంది పెట్టడానికే ఈడీ సీబీఐ విచారణ పేరుతో వేధిస్తున్నట్లు ఆరోపించారు. న్యాయ నిపుణుల సలహాతో ముందుకు వెళ్తానని తెలిపారు. కాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిరి రెండు సార్లు విచారించిన ఈడీ.. మరోసారి విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే నోటీసులు ఇచ్చింది. నందకుమార్ నుంచి సేకరించిన సమాచారంతో మంగళవారం ఉదయం 11 గంటలకు హాజరుకావాలని రోహిత్‌ను ఆదేశించింది. అయితే ఈడీ ఎదుట హాజరు కాకుడదని రోహిత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ఈడీ అధికారులకు మెయిల్ చేశారు. హై కోర్టులో రిట్ పిటిషన్ వేసిన నేపథ్యంలో.. తాను విచారణకు హాజరు కాలేనని రోహిత్ పేర్కొన్నారు. మరోవైపు బుధవారం హైకోర్టులో రోహిత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉండగా.. హై కోర్టు తీర్పు ఒచ్చాకే తదుపరి విచారణపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. మరోవైపు రోహిత్ రెడ్డి మెయిల్‌కు ఈడీ అనుమతి ఇస్తుందా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. ఎమ్మెల్యే గైర్హాజరుతో ఈడీ తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.. చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. ఈడీ జేడీగా రోహిత్ ఆనంద్ -
బీఆర్ఎస్లో అసంతృప్తి జ్వాలలు.. ప్రజల్లోకి ఎలా వెళ్లాలంటూ ఆవేదన
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో పదవులు వాటంతట అవే నడుచుకుంటూ వస్తాయని దాదాపు నెలరోజుల క్రితం తెలంగాణ భవన్లో జరిగిన హైదరాబాద్ జిల్లా విస్తతస్థాయి సమావేశం ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హామీ ఇచ్చారు. పదవులు నడచుకుంటూ రావడం కాదు కదా.. ఇప్పటివరకు కనీసం జిల్లా, డివిజన్‌స్థాయి కార్యవర్గాలు సైతం ఏర్పాటు కాకపోవడంతో ఆయా నేతల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నా లోలోపలే అణచుకుంటున్నారు. అవి ఏ క్షణాన్నయినా భగ్గుమనేలా నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. పెద్దస్థాయి నేతలు కొందరికి పదవులుంటే సరిపోతుందా? డివిజన్లలో స్థానికంగా పనిచేసే తమకు ఎలాంటి పదవి, గుర్తింపు లేకుంటే తమను గుర్తించేదెవరు? అని పలు డివిజన్ల నేతలు ఆవేదన చెందుతున్నారు. ప్రజల్లోకి వెళ్లేదెలా? గ్రేటర్‌లోనే ఉన్న ఇతర జిల్లాల్లో నామినేటెడ్ పదవులు ఇస్తున్నా హైదరాబాద్ జిల్లా వారికి మాత్రం నామినేటెడ్ పదవులు కాదు కదా కనీసం పార్టీ కమిటీలు కూడా పూర్తిగా భర్తీ చేయకపోవడంతో నేతలు తీవ్ర నిరాశా నిస్పహల్లో మునిగారు. పదవులు నడచుకుంటూ వచ్చేది ఎప్పుడు.. పైస్థాయిలోని కొందరికి మాత్రం పదవులుంటే సరిపోతుందా.. అసెంబ్లీ ఎన్నికలు ఏ క్షణాన వస్తాయో తెలియని పరిస్థితి. ఈలోగా ఎలాంటి పదవులు లేకుంటే తాము ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగాలని అంబర్‌పేట నియోజకవర్గానికి చెందిన ఓ నాయకుడు వ్యాఖ్యానించారు. నోటిఫికేషన్ వస్తే నామినేటెడ్ పోస్టులెలాగూ ఇవ్వరు. అప్పటికప్పుడు డివిజన్ కమిటీలు భర్తీ చేసినంత మాత్రాన ప్రయోజనమేముంటుంది. నియోజకవర్గ స్థాయి నేతలకు నామినేటెడ్ పోస్టులు లేకుంటే తాము ప్రజల తలలో నాలుకలా పనులు చేయాలంటే.. అధికారుల వద్దకు వెళ్లి చేయించాలంటే ఏదో ఒక పదవి కనీసం ఉండాలి కదా? అని గోషామహల్ నియోజకవర్గానికి చెందిన మరో నాయకుడు వేదన వ్యక్తం చేశారు. చదవండి: ‘హస్తం’లో కొత్త కోణం.. ఏళ్లుగా వైరం.. సేవ్ కాంగ్రెస్‌తో ఒక్కటైన వైనం అంతర్మథనంలో పార్టీ శ్రేణులు.. క్రమశిక్షణో, అధిష్టానానికి భయపడో బీఆర్ఎస్లో ఇప్పటి వరకు ఎలాంటి అసమ్మతి సెగలు బయటకు కనిపించలేదు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యే స్థాయి నాయకులే మంత్రి తీరుపై తమ అసమ్మతి, అసంతప్తి గళాల్ని వినిపించడంతో ఎలాంటి హోదా, పదవులు లేని తాము ఎలా పనిచేయగలమని పలు డివిజన్లు, నియోజకవర్గాల స్థాయి నేతలు తీవ్ర అసంతప్తితో ఉన్నారు. ప్రభుత్వం ఏవైనా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినప్పుడు అగ్రనేతలకు క్షీరాభిషేకాలు, భారీ ఊరేగింపులు, కటౌట్ల ఏర్పాట్లవంటి పనులే తమకు సరిపోతున్నాయని, తమను పట్టించునే నాయకుడే లేకుండా పోయారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్ స్థాయి నేతలు సైతం ఏదో ఒకదశలో రగులుతున్న తమ బడబాగ్నిని బహిరత్గం చేసే అవకాశం లేకపోలేదని జిల్లా స్థాయి నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు, జిల్లా మంత్రి డివిజన్ నేతల మనోగతాన్ని అర్థం చేసుకొని వివిధ కమిటీలు భర్తీ చేయాలని, నామినేటెడ్ పోస్టులిప్పించాలని వివిధ స్థాయిల నేతలు కోరుతున్నారు. మేయర్ వర్సెస్ ఎమ్మెల్యే.. మరోవైపు, ఆయా స్థాయిల నేతలకు పొసగడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలోకొచ్చే ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనడం తెలిసిందే. తాజాగా ఎమ్మెల్యే లేకుండా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంతో ఎమ్మెల్యే అనుచరులు మేయర్ గోబ్యాక్ అంటూ ఆందోళనలు చేశారు. నియోజక వర్గాల సమ్మేళనాలెప్పుడో? రెండు మూడు రోజుల్లో నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమ్మేళనాలు ఖరారు చేస్తామని ప్రకటించి నెలరోజులవుతోంది. ఇంతవరకు ఆ ఊసే లేదు. అనేక డివిజన్లలో పార్టీ కమిటీల్లేవు. ఏడాది కిందట ఏర్పాటు చేసిన కమిటీల్లో ఎన్ని పనిచేస్తున్నాయో తెలియదు. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేల నడుమ విభేదాలతో చాలా డివిజన్ల కమిటీలు నిద్రాణంగా ఉన్నాయి. చాలా డివిజన్లలో అసంపూర్ణ కమిటీలున్నాయి. ఆత్మీయ సమ్మేళనాల్లో అన్నీ చర్చించి భర్తీ చేస్తామన్నారు. ఇంతవరకు అతీగతీ లేకపోవడంపై పార్టీ శ్రేణులు నిరాశలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
‘ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్’ కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లలో వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్ మీడియా ముందు ఫుటేజ్ పెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్ సహా పలువురు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ డివైజెస్ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్లు 65బీ సర్టిఫికెట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపింది. సీఎం మీడియో సమావేశానికి సంబంధించి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారని పిటిషనర్లను న్యాయమూర్తి ప్రశ్నించారు. 65బీ ఇచ్చేందు కు సమయం కావాలని కోరడంతో.. సాయంత్రం 4.30 గం. వరకు న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను సాయంత్రం వరకు వాయిదా వేశారు. పిటిషనర్లు ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోలేం.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలని చట్టంలో లేదని హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాది జోగినపల్లి సాయికృష్ణ వాదించారు. యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసి తీసుకొని వచ్చిన వీడియోను ఎవిడెన్స్‌గా పరిగణించలేమని చెప్పారు. ఐటీ యాక్ట్ సెక్షన్ 65బీ ప్రకారం సర్టిఫికెట్ లేకుండా ఎవిడెన్స్‌ను రికార్డుల్లోకి తీసుకోవడానికి వీలులేదని చెప్పారు. అసలు సీబీఐకి ఈ కేసును బదిలీ చేయాలి అనడానికి.. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్‌కు సంబంధం లేదన్నారు. ఇలాంటి ఎవిడెన్స్‌ను ట్రయల్ కోర్టులో మాత్రమే సమర్పించాల్సి ఉంటుందని నివేదించారు. రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ట్రాప్ చేసి.. నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. అక్టోబర్ 26న ముఖ్యమంత్రి మీడియా భేటీ నిర్వహించగా, నవంబర్ 9న సిట్ ఏర్పాటు జరిగిందని కోర్టుకు దృష్టికి తేచ్చారు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ మెటీరియల్ ఎలా ఇచ్చిందో చెప్పాలని పిటిషనర్లను ప్రశ్నించారు. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీని కోసం సాయంత్రం 4.30 గంటల వరకు న్యాయమూర్తి సమయం ఇచ్చారు. సాయంత్రం వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వు చేశారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు -
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందానికి అప్పగించాలని దాఖలైన కేసులో హైకోర్టు తీర్పు రిజర్వులో పెట్టింది. ఈ కేసులో వాద, ప్రతివాదనలు ముగియడంతో త్వరలో తీర్పును వెలువరిస్తామని పేర్కొంది. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజి, న్యాయవాది బి.శ్రీనివాస్, తుషార్ వెల్లపల్లి ఇతరులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టారు. ఈ కేసును ఏసీబీ అధికారులు మాత్రమే విచారణ చేయాలని.. లా అండ్ ఆర్డర్ పోలీసులకు, సిట్‌కు ఆ అధికారం లేదని బుధవారం బీజేపీ తరఫున హాజరైన జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు. గురువారం మధ్యాహ్నం ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ సూచన మేరకు లేదా వ్యక్తులు ఫిర్యాదు చేసినప్పుడు పబ్లిక్ సర్వెంట్‌పై విచారణ చేసే అధికారం లా అండ్ ఆర్డర్ పోలీసులకు కూడా ఉంటుందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ కేసును తప్పనిసరిగా ఏసీబీనే దర్యాప్తు చేయాల్సి ఉందా అని ప్రశ్నించారు. దీనికి ఏజీ బదులిస్తూ.. అలాంటిదేమీ లేదని అన్నారు. మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత దాన్ని సిట్‌కు బదలాయించారని చెప్పారు. ‘ప్రభుత్వం పూర్తి అధికారాలిస్తూ సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏసీబీ, లా అండ్ ఆర్డర్ కేసులను ఏదైనా సిట్ దర్యాప్తు చేయవచ్చు. ఆ మేరకు సిట్‌కు అన్ని అధికారాలు ఉన్నాయి. సిట్ దర్యాప్తు నిబంధనలకు అనుగుణంగా జరుగుతోంది. నిందితులు విచారణకు సహకరించడం లేదు. కేసులు వేస్తూ తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారు. ఈ కేసులో పలువురు మధ్యంత పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని పట్టించుకోకుండా ప్రధాన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసి తీర్పు చెప్పాలి’అని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, మధ్యంతర పిటిషన్లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే శుక్రవారం తమ దృష్టికి తేవాలన్నారు. ప్రధాన పిటిషన్లపై తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా, అక్టోబర్ 27న ప్రధాన పిటిషన్ దాఖలైంది మొదలు ఇప్పటివరకు వాదప్రతివాదనలు వాడీవేడిగా సాగాయి. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు సైతం హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, సిట్ స్వేచ్ఛగా, పారదర్శకంగా దర్యాప్తు చేయడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు.. సిట్ దర్యాప్తును అడ్డుకోవద్దని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు న్యాయమూర్తిని విజ్ఞప్తి చేశారు. ఇదీ చదవండి: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్ మీడియా ముందు పెట్టిన ఫుటేజ్‌ను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు. హై ప్రొఫైల్ కేసు దర్యాప్తు మధ్యలోనే ఆధారాలు బయటకు ఎలా వెళ్లాయని అన్న పిటిషన్లు.. సిట్ దర్యాప్తు సక్రమంగా లేదని కోర్టుకు తెలిపారు. సీఎం ఇచ్చిన ఎవిడెన్స్‌ను పరిగణనలోకి తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రేపు(శుక్రవారం) తుది వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే కేసుకు సంబంధించిన సీడీలు, పెన్‌డ్రైవ్‌ను సీఎం కోర్టుకు పంపించారు. చదవండి: కామారెడ్డి: గుహలో చిక్కుకున్న రాజు సురక్షితంగా బయటకి.. -
ఫాంహౌజ్ కేసు: కీలకంగా మారనున్న హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసులో ఇవాళ(శుక్రవారం) తెలంగాణ హైకోర్టులో జరిగే విచారణ కీలకం కానుంది. సిట్ రివిజన్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ వ్యవహారంలో.. ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు ముగిసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు తీర్పును రద్దు చేయాలంటూ సిట్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు ఏసీబీ కోర్టు తీర్పును సమర్థిస్తూ.. కేసు విచారించే అర్హత లా అండ్ ఆర్డర్ పోలీసులకు లేదంటూ ప్రతివాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐతో విచారణ జరిపించాలని హైకోర్టులో పలు పిటిషన్ లు దాఖలు అయ్యాయి. ఈ అన్ని పిటిషన్లపై మధ్యాహ్నం విచారణ చేపట్టనుంది హైకోర్టు. రామచంద్ర భారతి విడుదల ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో చంచల్ గూడ జైలు నుండి రామచంద్ర భారతి బెయిల్ పై విడుదల అయ్యాడు. ఫాంహౌజ్ కేసులో A1 నిందితుడు రామచంద్ర భారతి. సుమారు 45రోజుల తర్వాత జైల్ నుండి విడుదల. వాస్తవానికి.. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో గురువారమే జైలు నుంచి విడుదల అయ్యాడు. అయితే.. ఆ వెంటనే మరో కేసులో అరెస్ట్ చేశారు. దీంతో గురువారం రాత్రి నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు రామచంద్ర భారతి. ఆ వెంటనే బెయిల్ మంజూరు అయ్యింది. రామచంద్ర భారతిపై ఎమ్మెల్యే ల కొనుగోలు కేసుతో పాటు మరో రెండు కేసులు. ఇదే కేసులో A3 సింహయాజులు ఇప్పటికే బెయిల్ పై విడుదల అయ్యాడు. మరోవైపు A2 నందకుమార్‌ను మరో కేసులో అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఇక A4బిఎల్ సంతోష్, A5తుషార్,A6 జగ్గు స్వామి,A7 శ్రీనివాస్ నిందితుల పై మెమో కొట్టివేసింది ఏసీబీ కోర్టు. -
ఫాంహౌజ్ కేసు: బెయిల్‌పై విడుదల, వెంటనే మళ్లీ అదుపులోకి..
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్ చంచల్ గూడ జైల్ నుండి విడుదల అయ్యారు. అయితే జైలు నుంచి బయటకి రాగానే ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నందకుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో నమోదైన చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్ర భారతిని ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ కేసులో అదుపులోకి తీసుకున్నారు. రామచంద్రభారతి, నందకుమార్ లను పోలీసులు బంజారాహిల్స్ పీఎస్ కి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇప్పటికే సింహయాజీ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించిన కేసులో రామచంద్ర భారతి, సోమయాజీ, నందకుమార్ లకు డిసెంబర్ 1న హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నిందితులు ప్రతి సోమవారం సిట్ ఎదుట హాజరుకావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పాస్ పోర్టులను సిట్ అధికారులకు అప్పగించడంతో పాటు సాక్ష్యులను ప్రభావితం చేసేలా వ్యవహరించవద్దని షరతు విధించింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సింహయాజి విడుదల
సాక్షి, హైదరాబాద్: మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు యత్నం కేసుకు సంబంధించి.. నిందితుడు సింహయాజి స్వామి ఇవాళ చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యాడు. ఈ కేసులో A3నిందితుడిగా ఉన్న సింహయాజికి బెయిల్ దొరికిన విషయం తెలిసిందే. అయితే.. హైకోర్టు బెయిల్ మంజూరు చేసి వారం తర్వాత బుధవారం సింహయాజి విడుదల అయ్యాడు. షూరిటీలు చెల్లింపులో ఆలస్యం కావడంతో.. విడుదలకు ఆటకం ఏర్పడింది. ఇక ఈ కేసులో.. మరో ఇద్దరు నిందితులు జైల్లోనే ఉన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. ముగ్గురు నిందితులకు రామచంద్రళబారతి, నందకుమార్, సింహయాజులు కు వారం క్రితం హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. కేసులు పెండింగ్‌లో ఉండటంతో రామచంద్ర భారతి, నంద కుమార్‌లు జైల్లోనే ఉండాల్సి వచ్చింది. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమవారం సిట్ ముందు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. రూ. 3 లక్షల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురి పాస్‌పోర్టులు పోలీస్ స్టేషన్లో సరెండర్ చేయాలని తెలిపింది. -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు.. 5 గంటల పాటు వాడీవేడిగా వాదనలు
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో హైకోర్టులో వాదనలు వాడీవేడిగా సాగాయి. కిక్కిరిసిన కోర్టు హాల్లో ఉదయం దాదాపు 11 గంటలకు ప్రారంభమైన వాదనలు.. భోజనం విరామం తరువాత.. సాయంత్రం 5 గంటల వరకు (5 గంటలు) కొనసాగాయి. న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి సుదీర్ఘ వాదనలను విన్నారు. తదుపరి విచార ణను ఈ నెల 6కు వాయిదా వేశారు. సిట్ దర్యాప్తునకు సహకరించాలని భారత్ ధర్మ జన సేన (బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లప్పల్లిను ఆదేశించారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు ఆయన్ను అరెస్టు చేయొ ద్దని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి దాఖలైన పిటిషన్‌ను కొట్టివేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బీజేపీతో పాటు నిందితులు, 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు అందుకున్న వారు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. తొలుత వాదనలు ప్రారంభం కాగానే.. అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) రాంచంద్రరావు కౌంటర్ దాఖలు చేశారు. నిందితులకు బీజేపీ నేతలకు మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల ప్రతిని, ఆ పార్టీ పెద్దలతో నిందితులు దిగిన ఫొటోలను కోర్టుకు అందజేశారు. అలాగే కేసు కీలక ఆధారాల ను సిట్ సమరి్పంచింది. తర్వాత.. భారత్ ధర్మ జన సేన (బీడీజేఎస్) అధ్యక్షుడు తుషార్ వెల్లప్పల్లికి నోటీసులు ఇవ్వడంపై ఆయన తరఫు న్యాయవాది హెగ్డే అభ్యంతరం తెలిపారు. అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని, తర్వాత వస్తానని చెప్పినా పట్టించుకోకుండా ఆయనపై లుక్ఔట్ నోటీసులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. సిట్ నోటీసులను నిలుపుదల చేయాలని కోరారు. సిట్.. మీడియాకు లీకులిస్తోంది.. ముగ్గురు నిందితుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వాదిస్తూ.. ‘ఏ కేసులోనైనా దర్యాప్తు పారదర్శకంగా, నిజాయతీగా జరగాల్సిన అవసరం ఉంది. కానీ, ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారు. దర్యాప్తు అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కానీ, దర్యాప్తు అలా సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లోనే సిట్ పనిచేస్తోంది. ఫామ్‌హౌస్ ఘటన జరిగిన రోజే సైబరాబాద్ పోలీస్ కమిషనర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. తెలంగాణ హైకోర్టుతో పాటు ఇతర హైకోర్టులకు దర్యాప్తు సీడీలు, ఇతర వివరాలు సీఎం పంపారు. దర్యాప్తు.. ఏ అంశమైనా బయటకు పొక్కనీయకుండా విచారణ సాగించాలి. కానీ, కీలక సమాచారం మీడియాకు లీక్ చేస్తున్నారు. దర్యాప్తు ఎలా జరగాలనే విషయంపై పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. ఈ కేసులో పలు ఉల్లంఘనలు జరిగాయి. సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు బృందంతో విచారణకు ఆదేశించాలి’ అని న్యాయమూర్తిని కోరారు. సీబీఐ విచారణ అవసరం లేదు... ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగుతోందని, సీబీఐకి అప్పగిస్తే వీగిపోవడం ఖాయమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే పేర్కొన్నారు. సీబీఐ దర్యాప్తు చేసిన కొన్ని కేసులు వీగిపోయిన ఉదంతాలను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ‘ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం తీవ్ర నేరం. ఈ కేసును ఎంతో వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. ఐపీఎస్‌లు కేంద్రం ఆధ్వర్యంలో పనిచేస్తారు. వారు రాజకీయ ఒత్తిడులకు తలొగ్గే అవకాశం లేదు. రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది అనడానికి ఆధారాలు లేవు. ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్న వీడియోలు, వాయిస్ రికార్డులు సీజే, ఇతరులకు పంపడం తప్పే. ఈ విషయంలో క్షమాపణలు చెప్పాం. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే కుట్ర జరిగింది. బీజేపీకి సంబంధం లేదంటూనే నిందితుల తరఫున పిటిషన్లు వేస్తున్నారు. ఈ వ్యవహారంలో కేసు నమోదైన మరుక్షణం నుంచి బలహీనం చేసే ప్రయత్నం జరుగుతోంది. గడిచిన కొన్నేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవాలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. పారీ్టగానీ, ప్రభుత్వంగానీ ప్రమాదంలో పడినప్పుడు పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా స్పందించే హక్కు ఆయనకు ఉంటుంది. అందులో భాగంగానే మీడియా భేటీలో ప్రజలకు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదు’అని నివేదించారు. తమ వద్ద ఆధారాలున్నాయంటూ సిట్ అందరికీ నోటీసులు ఇస్తూ పోతోందని, అవేంటో కోర్టుకు కూడా చెప్పడం లేదని బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ప్రభాకర్ పేర్కొన్నారు. సైబరాబాద్ సీపీ మీడియాకు వివ రాలు వెల్లడించారని, పోలీసుల విచారణ వద్దన్నందుకు.. అదే పోలీస్ ఉన్నతాధికారులతో సిట్ ఏర్పా టుచేయడం సమంజసమా.. అని ప్రశ్నించారు. ఇక, న్యాయవాది శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయ వాది ఉదయ హోల్లా వాదనలు వినిపించారు. చదవండి: మంత్రి గుంగుల ఇంటికి సీబీఐ బృందం.. ఢిల్లీకి రావాలని సమన్లు -
ఎమ్మెల్యేల కేసులో సిట్‌కు ఎదురుదెబ్బ.. తుషార్‌కు భారీ ఊరట!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు ఊరట లభించగా.. తాజాగా తుషార్‌కు సైతం ఉపశమనం కలిగింది. తుషార్ వ్యవహారంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలోనే సిట్ విచారణకు తుషార్ సహకరించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, విచారణ సందర్భంగా సిట్ అధికారులు 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి నిందితుల జాబితాలో తుషార్ పేరు చేర్చారని ఆయన తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. 41ఏ సీఆర్పీసీపై రిప్లై ఇవ్వకుండా లుక్ ఔట్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ క్రమంలో కోర్టు.. తుషార్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో, ఈ కేసులో తుషార్‌కు ఊరట లభించింది. మరోవైపు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐ దర్యాప్తు జరపాలన్న బీజేపీ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా బీజేపీ తరఫున మహేష్ జఠ్మలానీ, ప్రభుత్వం తరఫున ఏజీ ప్రసాద్, సిట్ తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తున్నారు. -
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణలో నందు పొంతనలేని సమాధానాలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు కొర్రె నందుకుమార్ పోలీస్ విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు అతడిని మంగళవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత దగ్గుబాటి సురేష్‌లకు చెందిన ప్లాట్లను లీజు పేరుతో తీసుకొని దుర్వినియోగం చేసిన కేసులో నందుకుమార్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఇందులోభాగంగా పోలీసులు మంగళవారం నందుకు 22 ప్రశ్నలు సంధించారు. తొలుత మీ సొంతూరు ఏది అని ప్రశ్నించగా పరిగి, ఎల్బీనగర్, చైతన్యపురి అని నిర్లక్ష్యంగా చెప్పినట్లుగా తెలిసింది. నీ వృత్తి ఏంటన్న ప్రశ్నకు.. హోటల్ బిజినెస్ అని చెప్పినట్లు సమాచారం. మొదటగా అంబర్‌పేట్‌లో సీజన్ పేరుతో హోటల్ నడిపినట్లు చెప్పారు. ఫిలింనగర్లో డెక్కన్ కిచెన్ హోటల్ ఎలా వచ్చిందని ప్రశ్నించగా 2016 డిసెంబర్లో డబ్లూ3 పేరుతో హోటల్ లీజుకు తీసుకున్నానని, అనంతరం దక్కన్ కిచెన్‌గా మార్చానని బదులిచ్చారు. డెక్కన్ హోటల్‌కు ఎవరెవరు వచ్చే వారు? సదరు ఎమ్మెల్యేలు ఎలా తెలుసు? రామచంద్ర మూర్తితో పరిచయం ఎలా జరిగింది అని ఆరా తీసినట్లు సమాచారం. డబ్లూ 3 హాస్పిటాలిటీకి ప్రమోద్ కుమార్ రాజీనామా చేయగానే తాను ఎండీగా కొనసాగినట్లు చెప్పారని తెలిసింది. అభిషేక్‌కూడా 2017లోనే డైరెక్టర్‌గా తప్పుకున్నారన్నారు. దక్కన్ కిచెన్ పేరుతో 6 లక్షలు వసూలు చేసినప్పుడు ఏదైనా డాక్యుమెంటేషన్ ఉందా అని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని తెలిపారు. ఈ ప్రాపర్టీని ఎందుకు తీసుకున్నావన్న ప్రశ్నకు.. వ్యాపారనిమిత్తం తీసుకున్నట్లు చెప్పారు. ఏ వ్యాపారం కోసం తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఐస్‌క్రీం షాపులు, మిల్క్‌షేక్ కౌంటర్లు ఏర్పాటు చేశానన్నారు. దక్కన్ కిచెన్ ప్రొప్రైటర్లు ఎలా పరిచయం అని ప్రశ్నించగా వారే తనను సంప్రదించారని చెప్పినట్లు తెలిసింది. కామన్ ఫ్రెండ్ సురేష్‌రెడ్డి ద్వారా ప్రమోద్ కుమార్ పరిచయమైనట్లు చెప్పారు. ఈ హోటల్ ద్వారా పది శాతం రెవెన్యూ వాటా పొందుతున్నానని, ప్రస్తుతం డైరెక్టర్లుగా కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావు, ఆవుల అభిషేక్ ఉన్నారని తెలిపినట్లు సమాచారం. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం -
ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో వెలుగులోకి వస్తున్న అనుమానితులను 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి, విచారిస్తున్న సంగతి తెలిసిందే. ముందస్తు అనుమతి, సహేతుక కారణం లేకుండా విచారణకు గైర్హాజరైతే అరెస్టు చేసేందుకు సిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన పురోహితుడు రామచంద్రభారతి అలియాస్ సతీష్ శర్మ మెయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ప్రధాన నిందితుడు రామచంద్రభారతితో కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గు స్వామి ఫోన్ సంభాషణలు రికార్డయ్యాయి. రామచంద్రభారతి తన ఫోన్లో జగ్గు స్వామికి ‘విటమిన్ సీ’ సిద్ధం చేయాలని సందేశం పంపినట్లు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కస్టడీలో నిందితులు వెల్లడించిన వివరాల మేరకు.. జగ్గు స్వామిని విచారించేందుకు సిట్ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ బృందం కేరళకు వెళ్లగా.. ఆయన అమృత ఆసుపత్రి నుంచి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలోనే ఉన్నాడు. దీంతో సిట్ అధికారులు సాక్ష్యులైన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ లకు 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. నోటీసులు ప్రకారం వీరంతా సిట్ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉండగా... వైద్య కారణాల నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నానని మణిలాల్ సిట్ అనుమతి కోరగా.. మిగిలిన ముగ్గురు అనుమానితులు సిట్ ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజరయ్యారు. దీంతో తీవ్రంగా పరిగణించిన సిట్ బృందం వారిని అరెస్టు చేసేందుకు సిద్ధమవుతుందని భావించిన జగ్గు పీఏలు శరత్, ప్రశాంత్, విమల్ కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు సమాచారాన్ని అక్కడి న్యాయాధికారి సిట్ విచార ణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్‌కు సమాచారం అందించారు. దీంతో తదుపరి కార్యాచరణపై సిట్ ఉన్నతాధికారులు సమావేశం కానున్నట్లు తెలిసింది. చదవండి: Malla Reddy: రూ.వందకోట్ల డొనేషన్లు ఎక్కడ దాచారు? -
ఎమ్మెల్యేలకు ఎర కేసు: ‘బండి సంజయ్ పేరు చెప్పాలని వేధిస్తున్నారు ’
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేరు చెప్పాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తీవ్రంగా వేధిస్తోందని న్యాయవాది భూసారపు శ్రీనివాస్ ఆరోపించారు. సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్ధమన్నారు. ఆ జీవోను రద్దు చేయాలని కోరారు. సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యానని, మూడు రోజులపాటు కేవలం సంజయ్ పేరు చెప్పాలని ఒత్తిడి చేశారన్నారు. సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా సాగడం లేదని వెల్లడించారు. ఈ మేరకు సిట్ దర్యాప్తు ఆపి, సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ అధికారులు, సీబీఐ, ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి, రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్, సీవీ ఆనంద్‌తోపాటు ఇద్దరు సిట్ సభ్యులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో సిట్ ఎదుట హాజరయ్యానని.. రాజేంద్రనగర్ ఏసీపీ, అధికారులు రమా రాజేశ్వరి, కమళేశ్వర్‌లు బండి సంజయ్, కొందరు బీజేపీ ముఖ్య నేతల పేర్లు చెప్పాలని రోజంతా తీవ్ర ఒత్తిడి తెచ్చారన్నారు. వారు కోరిన విధంగా చెప్పేందుకు నిరాకరిస్తే.. తనను నిందితుడిగా(ఏ7)గా పేర్కొంటూ మెమో జారీ చేస్తామని బెదిరించారన్నారు. ఈ విషయాన్ని సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్‌కు చెప్పినా పట్టించుకోలేదని నివేదించారు. విచారణవీడియోను హైకోర్టుకు సమరి్పంచాలని కోరినా.. 23నాటి∙విచారణలో అధికారులు కోర్టుకు అందజేయలేదని చెప్పారు. వీటిని పరిగణనలోకి తీసుకుని సిట్ దర్యాప్తు ఆపాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: హైదరాబాద్‌లో నీరా కేఫ్ రెడీ -
అదంతా కేసీఆర్ డ్రామా.. నడ్డాకు చెప్పిన రాష్ట్ర బీజేపీ నేతలు..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరా తీశారు. శుక్రవారం పారీ్టలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేరిక అనంతరం ఆయనతోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నడ్డాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల ఎర అంశం చర్చకు వచ్చింది. దీనిపై వివరణ ఇచ్చిన రాష్ట్ర నేతలు, ఇదంతా సీఎం కేసీఆర్ డ్రామా అని స్పష్టం చేశారు. ప్రజాబలంలేని పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి, వారితో డ్రామా ఆడించారని, నాటకం బయట పడకుండా ఎమ్మెల్యేలని ప్రగతిభవన్ బయటకు కూడా రానివ్వడం లేదని విశదీకరించారు. సీఎం ఫాంహౌస్‌లో ఉంటే ఎమ్మెల్యేలను అక్కడే ఉంచుతున్నారని, వారిని మీడియా ముందు మాట్లాడనివ్వడంలేదని చెప్పుకొచ్చారు. సరిగ్గా ఇదే సందర్భంలో నడ్డా ‘ఫాంహౌస్ ముఖ్యమంత్రిని ఇకపై అక్కడే కూర్చోనిద్దాం’అని అన్నట్లుగా బీజేపీ నేతలు చెబుతున్నారు. డిసెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల కొనుగోళ్ల విషయమై కేంద్రాన్ని నిలదీసే అవకాశముందని కొందరు నేతలు నడ్డా దృష్టికి తెచ్చారు. అసెంబ్లీలో బీజేపీకి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, మాట్లాడితే సస్పెండ్ చేస్తున్నారని వివరించారు. ఇందుకు నడ్డా స్పందిస్తూ అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే అసెంబ్లీ బయట సీఎం తీరును ఎండగట్టాలని, ఆయన చేసిన ప్రతి ఆరోపణలకు గట్టిగా జవాబివ్వాలని నేతలను ఆదేశించారు. చదవండి: ‘ముందస్తు’ ప్రచారం.. కమలం అప్రమత్తం -
ఎమ్మెల్యేల ఎర కేసు: మరో ఐదుగురికి సిట్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరో అయిదుగురికి సిట్ నోటీసులు జారీ చేసింది. కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మణిలాల్‌లోపాటు సిబ్బంది శరత్, ప్రశాంత్, విమల్, ప్రతాపన్‌కు నోటీసులు ఇచ్చింది. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా విచారణకు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించింది. రిమాండ్ పొడిగింపు ఎమ్మెల్యేలకు ఎర కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడువు ముగియడంతో వారిని పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిలకు వచ్చేనెల 9 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు వెల్లడించింది. విచారణకు నందకుమార్ భార్య టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. నంద కుమార్ భార్య చిత్ర లేఖ, న్యాయవాదులు ప్రతాప్ గౌడ్, శ్రీనివాస్‌లు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులతో సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. బ్యాంక్ ఖాతాలు, లావాదేవీలు.. ప్రతాప్ గౌడ్, నందకుమార్ ట్రాన్సెక్షన్‌పై విచారిస్తున్నారు. రామచంద్ర భారతి, సింహయాజులు తో పరిచయాలపై ప్రశ్నిస్తున్నారు. చదవండి: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్.. -
రామచంద్ర భారతి, నందులతో ‘రఘురామ’ చెట్టపట్టాల్!
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి నందుకుమార్‌తో.. ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సత్సంబంధాలు ఉన్నట్టుగా సిట్ గుర్తించినట్లు తెలిసింది. నిందితుల సెల్ఫోన్లలో రఘురామ కృష్ణరాజు దిగిన ఫొటోలు, ఇతర కీలక వివరాలు బయటపడినట్లు సమాచారం. దీంతో ఎంపీని విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు 41–ఏ సీఆర్పీసీ కింద గురువారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 29న ఉదయం 10:30 గంటలకు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపారు. సహేతుక కారణం లేకుండా గైర్హాజరైతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని ఎంపీకి పంపిన ఈ–మెయిల్లో విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ స్పష్టం చేశారు. మరోవైపు ఎంపీకి ప్రత్యక్షంగా నోటీసులు అందించేందుకు సిట్ అధికారులు గురువారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని రఘురామ నివాసానికి వెళ్లగా.. ఆయన ఇంట్లో లేరని, ఢిల్లీకి వెళ్లారని సిబ్బంది తెలిపినట్లు సమాచారం. దీంతో ఢిల్లీ వెళ్లిన సిట్ బృందం ఆయన నివాసంలో నోటీ సులు అందజేసింది. ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి రఘురామ కృష్ణరాజుకు ముందే సమాచారం ఉందేమోనని, ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిన నగదు సమకూర్చడంలో ఎంపీ పాత్ర ఉందేమోనని సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనను విచారించాలని నిర్ణయించింది. ఏడుకు చేరిన నిందితుల సంఖ్య ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తాజాగా మరో నలుగురిని సిట్ అధికారులు నిందితులుగా చేర్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతో‹Ù, కర్ణాటక బీడీజేఎస్ చీఫ్ తుషార్ వెల్లపల్లి, కేరళ వైద్యుడు కొట్టిలిల్ నారాయణ జగ్గు అలియాస్ జగ్గు స్వామి, కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ మేరకు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేశారు. ఈ కేసును పర్యవేక్షిస్తున్న హైకోర్టు సింగిల్ జడ్జికి కూడా ఈ సమాచారం అందజేసినట్లు తెలిసింది. దీంతో ఈ కేసులో మొత్తం నిందితులు సంఖ్య ఏడుకు చేరుకుంది. ఇప్పటికే నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలు అరెస్టయి, చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజా నలుగురు నిందితులకు కూడా 120–బీ, 171–బీ రెడ్ విత్ 171–ఈ, 506 రెడ్ విత్ 34 ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం–1988 సెక్షన్–8 కేసులు వర్తిస్తాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరో ఐదుగురికి మళ్లీ నోటీసులు.. ఈ కేసు వెలుగులోకి వచి్చనప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన జగ్గు స్వామి సోదరుడు మణిలాల్, అతని ముగ్గురు పర్సనల్ అసిస్టెంట్లు శరత్, ప్రశాంత్, విమల్ అలాగే జగ్గు పనిచేస్తున్న అమృత ఆసుపత్రి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ (సీఎస్ఓ) ప్రతాపన్లను విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆ నలుగురు సాక్షులకు సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. అయితే వారు విచారణకు గైర్హాజరు కావటంతో తాజాగా 41–ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. ఈసారి కూడా హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ‘అమృత’తో జగ్గుస్వామి సంబంధాలు నిర్ధారణ! జగ్గు స్వామిని విచారించేందుకు కేరళ వెళ్లిన సిట్ సభ్యురాలు, నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి బృందాన్ని .. అమృత ఆసుపత్రితో జగ్గుకు ఎలాంటి సంబంధాలు లేవంటూ ఆసుపత్రి సీఎస్ఓ తప్పుదోవ పట్టించినట్లు తెలిసింది. దీంతో సిట్ బృందం స్థానిక పోలీసుల సహకారంతో జగ్గు ఇళ్లు, ఆఫీసులపై సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా.. అమృత వైద్య విజ్ఞానసంస్థ (ఎయిమ్స్)లో పరిపాలన విభాగంలో డిప్యూటీ మేనేజర్‌గా జగ్గు స్వామి పనిచేస్తున్నారని తేలింది. ఆసుపత్రి తరఫున బ్యాంక్ చెక్‌లను జారీ చేసే అధికారం కూడా ఆయనకు ఉందని గుర్తించినట్టు తెలిసింది. ఇదీ చదవండి: కక్షతోనే ఆంక్షలు.. కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ. 40,000 కోట్ల గండి -
సంతోష్ ఎప్పుడు వస్తారు?
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) బీఎల్ సంతోష్ విచారణకు ఎప్పుడు వస్తారో చెప్పేదెవరని హైకోర్టు ధర్మాసనం.. బీజేపీ తరఫు న్యాయ వాదిని ప్రశ్నించింది. హాజరుపై స్పష్టత ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ–మెయిల్, వాట్సాప్ ద్వారా మళ్లీ నోటీసులు అందజేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. సిట్ విచారణను ఆపాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, నిందితులు రామచంద్ర భారతి, నందు, సింహయాజి, కరీంనగర్ న్యాయవాది బి.శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్లతో పాటు ఇతర పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్, ఏఏజీ రామచంద్రరావు, కేంద్రం తరఫున గాడి ప్రవీణ్‌కుమార్, నిందితుల తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ, బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్ చిదంబరేశ్, ఎన్.రామచంద్రరావు హాజరయ్యారు. పార్టీ ప్రతినిధుల్లా మాట్లాడకూడదు.. ‘సంతోష్‌కు నోటీసులు ఇవ్వడం కోసం 16వ తేదీ నుంచి సిట్ ప్రయత్నిస్తోంది. ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. సంతోష్ కావాలనే నోటీసులు తీసుకోకుండా తప్పించుకుంటున్నారు. దీంతో ఆయన కార్యాలయంలోని వారికి సిట్ వాటిని అందజేసింది. ఆయనపై అనేక అనుమానాలున్నాయి. విచారణకు రాకుండా జాప్యం చేయడం మూలంగా సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉంది’ అని ఏజీ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై ఎన్. రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆధారాలు మొత్తం బహిరంగపర్చిందని ఆరోపిం చారు. బీఎల్ సంతోష్ సీనియర్ సిటిజన్ అని.. ఏం చేయలన్నదానిపై న్యాయసలహా తీసుకుంటున్నా రని తెలిపారు. ఈ క్రమంలో సంతోష్ అసలు విచా రణకు ఎందుకు హాజరుకావడం లేదు.. ఎప్పుడు హాజరవుతారని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తమ కు సమాచారం లేదని బీజేపీ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఇంకా వ్యక్తిగతంగా ఆయనకు నోటీసులు అందలేదని ఆయన చెప్పడంపై ఏజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. నోటీసుల విషయం తెలియనప్పుడు 70 ఏళ్ల వయసులో విచారణకు హాజరుకా లేనని సిట్‌కు సంతోష్ ఎలా లేఖ రాశారని ప్రశ్నించారు. కాగా, ఈ సందర్భంగా బీజేపీ, ప్రభుత్వ న్యాయవాదుల తీరు పట్ల న్యాయమూర్తి అభ్యంత రం వ్యక్తం చేశారు. బీజేపీ, టీఆర్ఎస్ ప్రతినిధుల్లా మాట్లాడకూడదని.. రాజకీయ నాయకుల్లా వాదించుకోవడం సరికాదన్నారు. వృత్తి నిపుణుల్లా ప్రవర్తించాలని వ్యాఖ్యానించారు. ఆవేశానికి లోనుకావొద్దన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఇవ్వాలని ఏజీని న్యాయమూర్తి కోరగా, ఇంకా రాలేదని చెప్పారు. ఉత్తర్వులు వచ్చాకే విచారణ జరుపుతామంటూ మధ్యాహ్నం 2:30కి వాయిదా వేశారు. సిట్‌పై తేల్చాల్సింది ఈ ధర్మాసనమే.. తిరిగి విచారణ ప్రారంభం సందర్భంగా సుప్రీంకోర్టు ఉత్తర్వుల కాపీని ఏజీ న్యాయమూర్తికి అందజేశారు. ‘సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చినా సంతోష్ విచారణకు హాజరుకాలేదు. బీఎల్ సంతోష్ తరఫున న్యాయవాదులెవరూ ప్రాతినిధ్యం వహించడం లేదు. ఈ నెల 19న అరెస్టు చేయకూడదని ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు సిట్ స్వతంత్రంగా, స్వేచ్ఛగా విచారణ సాగించే వెసులుబాటు కల్పించాలి’ అని ఏజీ విజ్ఞప్తి చేశారు. విచారణ కోసమే 41ఏ నోటీ సులు ఇచ్చామని చెప్పి.. ఇప్పుడు అరెస్టు చేయకూడదన్న ఆదేశాలు రద్దు చేయాలని కోరడం సరికాదని న్యాయమూర్తి పేర్కొన్నారు. బీజేపీ కీలక నేత అయిన సంతోష్‌ను అరెస్టు చేస్తే.. దేశవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని చిదంబరేశ్ నివేదించారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఏజీ బదులిచ్చారు. సిట్ దర్యాప్తును సింగిల్ జడ్జి పర్యవేక్షించాలని డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసిందని మహేశ్ జఠ్మలానీ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సిట్ భవితవ్యాన్ని తేల్చే అధికారం ఈ ధర్మాసనానిదేనని చెప్పారు. సిట్ ఉండాలా?. వద్దా ? కొత్త సిట్‌ను ఏర్పాటు చేయాలా? లేదా సీబీఐకి బదిలీ చేయాలా?.. ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఈ ధర్మాసనానికి ఉందన్నారు. హైకోర్టు జడ్జి దర్యాప్తును పర్యవేక్షించగలరా? అని ధర్మాసనం అడిగిన ప్రశ్నకు జఠ్మలానీ బదులిస్తూ.. పర్యవేక్షించవచ్చని.. దీనికి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముగ్గురు నిందితులు గురువారం హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సంతోష్‌కు మళ్లీ నోటీసులు జారీ చేయాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. సిట్ వేధిస్తోంది: శ్రీనివాస్ విచారణ పేరుతో సిట్ అధికారులు వేధిస్తున్నారని పేర్కొంటూ న్యాయవాది భూసారపు శ్రీనివాస్ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిరోజూ తమ ఎదుట హాజరుకావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ నెల 25న సిట్ ఎదుట హాజరైతే సరిపోతుందని తెలిపింది. అలాగే తనకు సిట్ సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇవ్వడంపై అంబర్‌పేటకు చెందిన హైకోర్టు న్యాయవాది ప్రతాప్‌గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సింహయాజీ స్వామితో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వేధిస్తున్నారని, ఈ నోటీసులను కొట్టేయాలని కోరారు. ఇదీ చదవండి: రెండో రోజూ ఐటీ వేట: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో కొనసాగిన దాడులు