TRS pleanery 2015
-
అట్టహాసంగా టీఆర్ఎస్ ప్లీనరీ
-
జయాలు చూశాం..అపజయాలు చూశాం
-
కార్యకర్తల కష్టంతోనే తెలంగాణ కల సాకారం
-
8వసారి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్..
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వరుసగా ఎనిమిదోసారి ఎన్నికయ్యారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును ప్లీనరీలో శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును అధికారికంగా ప్రకటించగానే పార్టీ నేతలు ఆయనను అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా కేసీఆర్కు తలపాగ, నాగలి బహుకరించారు. -
అట్టహాసంగా టీఆర్ఎస్ ప్లీనరీ
హైదరాబాద్ : హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించి విజయఢంకా మోగించారు. ఆ తర్వాత అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ ఇది. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేని రీతిలో యాభై లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేసిన టీఆర్ఎస్.. నియోజకవర్గానికి 300 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 36 వేల మంది ప్రతినిధులను ప్లీనరీకి ఆహ్వానించింది. ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా.. మరింత ఎక్కువగా యాభైవేల మందికి సరిపడేలా ఏర్పాట్లూ చేసింది. జాతీయ స్థాయిలో అన్ని పార్టీల దృష్టిని ఆకర్షించేలా చర్యలు చేపట్టింది. అంతకు ముందు అమరవీరుల స్తూపం వద్ద కేసీఆర్తో పాటు పార్టీ నేతలు నివాళులు అర్పించారు. -
ఎల్బీ స్టేడియం గుబాళింపు
హైదరాబాద్ : గులాబీ ధూంధాంకు రంగం సిద్ధమైంది. పద్నాలుగేళ్ల ప్రయాణం.. ఉద్యమాల ప్రస్థానం.. ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చిందన్న గౌరవం.. కొత్త రాష్ట్ర తొలి ఎన్నికల్లోనే అధికార పీఠం కైవసం.. వీటన్నింటినీ ప్రతిబింబించేలా, దాదాపు ఏడాది పాలనపై ప్రచారమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని నిర్వహిస్తోంది. అధికారంలోకి వచ్చాక ఇదే తొలి ప్లీనరీ సమావేశం కావడం విశేషం. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మరికాసేపట్లో ప్లీనరీ మొదలు కానుంది. ప్లీనరీలో 12 తీర్మానాలను ఆమోదించనున్నారు. మరోవైపు ప్లీనరీలో సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా కళాకారులతో కలిసి గొంతు కలుపుతున్నారు. పార్టీ నేతలు గులాబీ కండువాలు ధరించి ప్లీనరీ వేదికపై ఆసీనులయ్యారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. మరోవైపు సైకిల్ దిగి కారు ఎక్కిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మెడలో గులాబీ కండువా ధరించి ప్లీనరీకి హాజరయ్యారు. -
టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలకు సర్వం సిద్దం