Union Budget 2024-25
-
Union Budget 2024: బడ్జెట్‌కు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: 2024–25 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు సోమవారం లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. గత వారం బడ్జెట్‌పై చర్చ ముగిశాక తాజాగా పార్లమెంట్ దిగువసభ తన ఆమోదం తెలిపింది. దీంతోపాటు సభ ఆమోదించిన బడ్జెట్ పద్దుల మేరకు సంచిత నిధి నుంచి మొత్తాలను వినియోగించేందుకు అనుమతించే ద్రవ్య వినిమయ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. రైల్వే, విద్య, ఆరోగ్యం, మత్స్యరంగాలకు సంబంధించిన గ్రాంట్ల వినియోగానికి సంబంధిన బిల్లుకూ లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రతిపాదించిన పన్ను శ్లాబుల సంబంధ ఫైనాన్స్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరగనుంది. రాజ్యసభలో వ్యవసాయం, పునరుత్పాదక శక్తి, సహకార రంగం, గృహ పట్టణాభివృద్ధికి కేటాయింపులపై చర్చ జరగనుంది. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగినా మార్పులు సిఫార్సు చేయబోదు. కేవలం ఆ బిల్లులను తిరిగి లోక్‌సభకు పంపగలదు. ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందాక బడ్జెట్ తంతు మొత్తం ముగుస్తుంది. ఉద్యానవనాల కోసం రూ.18వేల కోట్లు రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా వచ్చే ఐదేళ్లలో ఎగుమతి కోసం ఉద్దేశించి 100 ఉద్యానవనాల క్లస్టర్ల ఏర్పాటు కోసం మొత్తంగా రూ.18,000 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సోమవారం రాజ్యసభలో చెప్పారు. వంటనూనెల దిగుమతి వ్యయం తగ్గించుకోవడంతోపాటు దేశీయంగా నూనెగింజల దిగుబడి పెంచేందుకు రూ.6,800 కోట్లను ఆయిల్‌సీడ్ మిషన్‌కు కేటాయిస్తున్నట్లు చౌహాన్ వెల్లడించారు. స్వాతంత్య్ర సిద్ధించాక సేద్యరంగం బాగు కోసం కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిందేమీలేదని వ్యాఖ్యానించారు. దీనిపై విపక్ష సభ్యులు తీవ్ర నిరసన తెలిపారు. దిగి్వజయ్‌సింగ్ వంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడేందుకు ప్రయతి్నంచినా ఛైర్మన్ ధన్‌ఖడ్ అనుమతించలేదు. దీంతో విపక్ష సభ్యులు వాకౌట్‌చేశారు. -
మోదీ చక్రవ్యూహంలో దేశం
న్యూఢిల్లీ: మోదీ సర్కారుపై విపక్ష నేత రాహుల్‌గాంధీ సోమవారం ముప్పేట దాడి చేశారు. ‘‘దేశమంతటా తీవ్ర భయోత్పాత వాతావరణాన్ని నెలకొల్పారు. దేశంపై ప్రధాని మోదీ పెను సమస్యల చక్రవ్యూహం పన్నారు. అది దేశమంతటినీ సర్వనాశనం చేస్తోంది’’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర బడ్జెట్‌పై లోక్‌సభలో చర్చలో మాట్లాడిన రాహుల్ మోదీపైనా, ఎన్డీఏ ప్రభుత్వ పాలనపైనా సునిశిత విమర్శలు చేశారు. ఘాటైన పదజాలంతో కూడిన పదునైన వ్యాఖ్యలు చేశారు. అధికార పక్ష సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించినా, నిబంధనలు అనుమతించబోవంటూ స్పీకర్ ఓం బిర్లా పదేపదే వారిస్తున్నా వెనక్కు తగ్గలేదు. బడ్జెట్ కేవలం బడా వ్యాపారవేత్తలకు ప్రయోజనాలకు, సర్కారు రాజకీయ గుత్తాధిపత్యానికి కొమ్ము కాసేలా ఉదంటూ విమర్శించారు. ‘‘ఈ మోదీ మార్కు సమస్యల చక్రవ్యూహాన్ని విపక్ష ఇండియా కూటమి ఛేదిస్తుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతకు, దేశవ్యాప్తంగా కులగణనకు సభ ఆమోదం లభించేలా చేసి తీరుతుంది’’ అని ప్రకటించారు. అభిమన్యుడిలా దేశం... నేటి హరియాణాలోని కురుక్షేత్రలో వేల ఏళ్ల కింద జరిగిన యుద్ధంలో ఆరుగురు ఒక్కటై చక్రవ్యూహం పన్ని బాలుడైన అభిమన్యున్ని పొట్టన పెట్టుకున్నారంటూ మహాభారత గాథను రాహుల్ ఉటంకించారు. ‘‘హింస, భయోద్వేగాలతో కూడిన చక్రవ్యూహమది. దాన్ని పద్మవ్యూహమని కూడా అంటారు’’ అంటూ బీజేపీ ఎన్నికల గుర్తు కమలాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. ‘‘నేడు 21వ శతాబ్దంలో మన దేశంపై మోదీ ఓ నయా చక్రవ్యూహాన్ని పన్నారు. అభిమన్యునికి పట్టిన గతినే దేశానికి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశ యువతను, రైతులను, మహిళలను, చిన్న, మధ్యతరహా వ్యాపారులను సర్వనాశనం చేసేందుకు రాత్రింబవళ్లు ప్రయతి్నస్తున్నారు. ఆరుగురు వ్యక్తులు కేంద్ర స్థానంలో ఉండి చక్యవ్యూహాన్ని నియంత్రిస్తున్నారు. వాళ్లు మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పారిశ్రామికవేత్తలు అంబానీ–అదానీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్’’ అని చెప్పుకొచ్చారు. చివరి నలుగురూ సభలో లేనందున వారి పేర్ల ప్రస్తావనను అనుమతించబోనని స్పీకర్ స్పష్టం చేశారు. దాంతో అనంతరం ఆరుగురి పేర్లనూ రాహుల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రాహుల్ ప్రసంగం పొడవునా అధికార ఎన్డీఏ కూటమి సభ్యులంతా పెద్దపెట్టున నిరసనలకు దిగారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు జోక్యం చేసుకోబోయారు. కానీ రాహుల్ అందుకు అవకాశమివ్వలేదు. సభలో లేనివారి పేర్లు ప్రస్తావించొద్దని స్పీకర్ స్పష్టం చేయడంతో అంబానీ, అదానీలను తన ప్రసంగం పొడవునా ఏ1, ఏ2గా సంబోధించారు. ‘‘ఏ1, ఏ2లను కాపాడేందుకు రిజిజు కూడా ప్రయతి్నస్తున్నారు. మీరిలా చేస్తే మాకే లాభం. వారిద్దరినీ ఇంకెంతగా కాపాడే ప్రయత్నం చేస్తారో చేయండి’’ అంటూ ఎద్దేవా చేశారు. చక్రవ్యూహం... మూడు శక్తులు మోదీ చక్రవ్యూహం వెనక మూడు శక్తులున్నాయని రాహుల్ అన్నారు. ‘‘మొదటిది గుత్తాధిపత్య ధోరణి. దేశ సంపదనంతా ఏ1, ఏ2 (అంబానీ, అదానీ) ఇద్దరికే మాత్రమే దోచిపెట్టే ప్రయత్నం. రెండోది సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు. వీటి సాయంతో విపక్షాలను అణగదొక్కే కుట్రలు. మూడోది అన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని ఆడిస్తున్న రాజకీయ, అధికారస్వామ్యం. మోదీ చక్రవ్యూహానికి గుండెకాయ వంటి ఈ శక్తులు దేశాన్ని నాశనం చేస్తున్నాయి’’ అంటూ దుయ్యబట్టారు.మధ్యతరగతికి వెన్నుపోటు కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతిని దారుణంగా వెన్నుపోటు పొడిచారని రాహుల్ ఆరోపించారు. ‘‘మోదీకి కాస్తో కూస్తో మద్దతుగా నిలిచిన వర్గం మధ్యతరగతి. కొవిడ్ సమయంలో ఆయన మొబైల్ టార్చిలు వేయమంటే వేసింది. పళ్లాలు మోగించండంటే మోగించింది. అలాంటి వర్గంపై బడ్జెట్లో పెను భారం వేశారు. తద్వారా వారి వెన్నులోనూ, ఛాతీలోనూ కత్తులు దింపారు మోదీ’’ అన్నారు. ‘‘ఇదీ మా మంచికే. మధ్యతరగతి ఇక ఇండియా కూటమి వైపు మొగ్గుతుంది’’ అని జోస్యం చెప్పారు. ‘‘మోదీ చక్రవ్యూహపు దు్రష్పభావాన్ని కేంద్ర బడ్జెట్ బలహీనపరుస్తుందని, యువత, రైతులు, కారి్మకులు, చిరు వ్యాపారులను ఆదుకుంటుందని ఆశించా. కానీ వ్యాపార, రాజకీయ గుత్తాధిపత్యాలను కాపాడటమే ఏకైక లక్ష్యంగా బడ్జెట్ రూపొందింది. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశం కలి్పస్తారట! బడ్జెట్లో విత్త మంత్రి పేర్కొన్న ఈ పథకం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 99 శాతం మంది యువతకు అది అందని ద్రాక్షే. నిరుద్యోగ చక్రవ్యూహం, పేపర్ లీకేజీ చక్రవ్యూహం, అగ్నివీర్ చక్రవ్యూహం... ఇలా విద్యార్థులు, యువత, సైన్యంతో పాటు ఏ రంగాన్నీ వదలకుండా సమస్యల సుడిగుండంలో ముంచెత్తారు’’ అంటూ మండిపడ్డారు. ‘‘మీరు సృష్టించిన అన్ని చక్రవ్యూహాలనూ మేం ఛేదించేస్తాం. దేశవ్యాప్త కులగణనే అందుకు సరైన అస్త్రం’’ అన్నారు. ‘‘దేశ యువత, వెనకబడ్డ వర్గాలు అభిమన్యులని ఈ చక్రవ్యూహ సృష్టికర్తలు అపోహ పడుతున్నారు. కానీ నిజానికి వాళ్లంతా ఆ వ్యూహాన్ని ఛేదించే అర్జునులు’’ అని హెచ్చరించారు. అగి్నవీర్ వంటి సున్నితమైన పథకంపై విమర్శలు సరికావంటూ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభ్యంతరం వెలిబుచ్చారు.మాది శివుని ఊరేగింపు ఇండియా కూటమిని శివుని పెళ్లి ఊరేగింపుతో రాహుల్ పోల్చారు. ‘‘అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. మోదీ చక్రవ్యూహం కేవలం ఆరుగురికే పరిమితం. ఆ చక్రవ్యూహానికి, శివుని ఊరేగింపుకు పోరాటమిది’’ అన్నారు.‘హల్వా’ ఫొటోపై విసుర్లు ప్రసంగం సందర్భంగా లోక్‌సభలో రాహుల్ ప్రదర్శించిన బడ్జెట్ హల్వా ఫొటో కలకలానికి దారి తీసింది. బడ్జెట్ ముద్రణకు ముందు దాని తయారీ ప్రక్రియలో పాల్గొన్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర ఆర్థిక మంత్రి హల్వా తయారు చేయడం రివాజు. అలా ఈసారి నిర్మలా సీతారామన్ బృందం బడ్జెట్ హల్వా తయారు చేస్తున్న ఫొటోను చూపిస్తూ, ‘‘ఇందులో కని్పస్తున్న 20 మంది అధికారుల్లో దళితులు, ఆదివాసీలు ఒక్కరు కూడా లేరు. మైనారిటీ, ఓబీసీ వర్గాల నుంచి ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు’’ అంటూ రాహుల్ ఆక్షేపించారు. రాహుల్ ఆ ఫొటోను ప్రదర్శిస్తున్న సమయంలో నిర్మల రెండు చేతుల్లో ముఖం దాచుకుంటూ కని్పంచారు. -
ఆదాయపన్ను.. ఆదా ఎలా!
ఆదాయపన్ను పాత, కొత్త విధానాల్లో ఏది అనుకూలం? ఎక్కువ మందిని వేధిస్తున్న సందేహం ఇది. 2024–25 కేంద్ర బడ్జెట్లో కొన్ని సవరణలు ప్రతిపాదించడం ద్వారా ఎక్కువ మందిని నూతన పన్ను విధానం వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు విత్త మంత్రి. శ్లాబుల పరిమితుల్లో మార్పులతోపాటు.. స్టాండర్డ్ డిడక్షన్‌ను కూడా పెంచారు. దీనివల్ల కొత్త విధానంలో రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమయంలో ప్రకటించారు. కానీ, పాత పన్ను వ్యవస్థలో వివిధ సెక్షన్ల కింద పన్ను ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే ఇంతకంటే ఎక్కువే ఆదా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ, అధిక ఆదాయం పరిధిలోని వారికి నూతన పన్ను విధానమే అనుకూలమన్నది విశ్లేషకుల నిర్వచనం. మధ్యాదాయ వర్గాలకు, మినహాయింపు ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకుంటే పాత విధానం అనుకూలం. తమ ఆదాయం, పెట్టుబడులు తదితర వివరాల ఆధారంగానే తమకు ఏది అనుకూలమన్నది నిర్ణయించుకోగలరు. ఇందుకు సంబంధించిన వివరాలను అందించే ప్రాఫిట్ ప్లస్ కథనం ఇది. కొత్త విధానంలో తాజా మార్పులు నూతన విధానంలో 5 శాతం పన్ను, 10 శాతం పన్ను శ్లాబుల్లో రూ.లక్ష చొప్పున అదనంగా పరిమితి పెంచారు. అలాగే నూతన విధానంలో వేతన జీవులు, పెన్షనర్లకు స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచారు. → నూతన విధానంలో మొదటి రూ.3లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. → స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.7.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. రూ.3–7లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటున్న వారికి స్టాండర్డ్ డిడక్షన్ రూ.15,000 ఉంటే రూ.25,000 చేశారు. అంటే ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే వారు రూ.7,25,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు. మినహాయింపులు → నూతన పన్ను విధానంలో కేవలం కొన్ని మినహాయింపులే ఉన్నాయి. సెక్షన్ 80సీసీడీ(2) కింద ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఉద్యోగితోపాటు, ఉద్యోగి తరఫున సంస్థలు ఈపీఎఫ్ చందాలను జమ చేస్తుండడం తెలిసిందే. అదే విధంగా ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాకు సైతం సంస్థలు జమ చేయవచ్చు. ఉద్యోగి మూలవేతనం, కరువు భత్యంలో 10 శాతం గరిష్ట పరిమితి ఇప్పటి వరకు ఉంటే, దీన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 14 శాతం చేశారు. కనుక ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతా తెరిచి, సంస్థ ద్వారా అందులో జమ చేయించుకోవడం ద్వారా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. → సెక్షన్ 24 కింద నూతన పన్ను విధానంలోనూ ఇంటి రుణంపై పన్ను ప్రయోజనం ఉంది. కాకపోతే ఆ ఇంటిని అద్దెకు ఇవ్వాలి. అప్పుడు ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించే వడ్డీ మొత్తంపైనా పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. → కన్వేయన్స్ అలవెన్స్, సెక్షన్ 10(10సీ) కింద స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనం గరిష్టంగా రూ.5లక్షలు, సెక్షన్ 10(10) కింద గ్రాట్యుటీ రూ.20లక్షలపైనా పన్ను లేదు. → ఉద్యోగి రాజీనామా లేదా పదవీ విరమణ సమయంలో సెలవులను నగదుగా మార్చుకోవడం వల్ల వచ్చే మొత్తం రూ.25 లక్షలపైనా సెక్షన్ 10(10 ) పన్ను లేదు. పాత పన్ను విధానం → రూ.5 లక్షల వరకు ఆదాయంపై 87ఏ కింద రిబేట్ ఉంది. దీంతో 60 ఏళ్ల వయసులోని వారికి రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.5.50 లక్షల వరకు పన్ను చెల్లించక్కర్లేదు. → 60–80 ఏళ్ల వయసులోని వారికి రూ.3 లక్షల వరకు, 80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షల వరకు ఆదాయం ఉంటే కనీస పన్ను మినహాయింపు పరిధిలోనే ఉంటారు. మినహాయింపులు →గృహ రుణం తీసుకుని దాని అసలుకు ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా చెల్లించే రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను లేదు. →సెక్షన్ 24(బి) కింద గృహరుణం వడ్డీకి చెల్లించే మొత్తం రూ.2లక్షల వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసిన ఇంటిని వేరొకరికి అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయం నుంచి.. రుణానికి చెల్లించే వడ్డీ మొత్తాన్ని మినహాయించుకోవచ్చు. →సెక్షన్ 80ఈఈ కింద మొదటిసారి ఇంటిని రుణంపై సమకూర్చుకున్న వారు ఏటా రూ.50,000 అదనపు మొత్తాన్ని వడ్డీ చెల్లింపుల నుంచి మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొనుగోలు చేసిన ఇంటి ధర రూ.45 లక్షల్లోపు ఉంటే ఈ పరిమితి సెక్షన్ 80ఈఈఏ కింద రూ.1.50లక్షలుగా ఉంది. → సెక్షన్ 80సీ కింద గరిష్టంగా రూ.1.5 లక్షల ఆదాయపన్ను మినహాయింపు కోసం.. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులతోపాటు, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, ఎన్పీఎస్, ఈపీఎఫ్, పీపీఎఫ్, ఐదేళ్ల ట్యాక్స్‌ఫ్రీ బ్యాంక్ ఎఫ్డీ, ఈఎల్ఎస్ఎస్, యులిప్ ప్లాన్‌లో పెట్టుబడులు, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజులను చూపించుకోవచ్చు. → పెన్షన్ ప్లాన్‌లో (ఎన్పీఎస్)లో పెట్టుబడికి సైతం గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు సెక్షన్ 80సీసీడీ(1) కింద మినహాయింపు పొందొచ్చు. కాకపోతే సెక్షన్ 80సీలో భాగంగానే ఇదీ ఉంటుంది. సెక్షన్ 80సీసీడీ (1బీ) కింద రూ.50,000 వరకు అదనంగా ఎన్పీఎస్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనం ఉంది. అంటే మొత్తం రూ.2లక్షలు. → సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియం గరిష్టంగా రూ.25,000 మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ60 ఏళ్లలోపు తల్లిదండ్రులకు ప్రీమియం చెల్లిస్తుంటే, మరో రూ.25,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లు నిండిన వారికి హెల్త్ ప్రీమియం రూ.50,000 వరకు పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. వ్యాధి నివారణ పరీక్షల కోసం చేసే వ్యయాలు రూ.5,000పైనా అదనపు పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ లేని తల్లిదండ్రుల వైద్య చికిత్సల కోసం చేసే వ్యయం రూ.50,000 మొత్తంపైనా పన్ను మినహాయింపు కోరొచ్చు. → సెక్షన్ 80డీడీబీ కింద కేన్సర్, డిమెన్షియా తదితర తీవ్ర వ్యాధుల్లో చికిత్సలకు చేసే వ్యయాలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. 60 ఏళ్లలోపు వారికి రూ.40వేలు కాగా, అంతకుమించిన వయసు వారి చికిత్స కోసం ఈ పరిమితి రూ.లక్షగా ఉంది. → బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్ 80 టీటీఏ కింద పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80టీటీబీ కింద 60 ఏళ్లు నిండిన వారికి బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్లపై వడ్డీ పరిమితి రూ.50,000గా ఉంది. → సెక్షన్ 80ఈ కింద ఉన్నత విద్య కోసం తీసుకున్న రుణానికి చేసే వడ్డీ చెల్లింపులపై పూర్తి పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. 8 ఏళ్లపాటు ఈ ప్రయోజనం ఉంటుంది. → అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేస్తున్న సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందే వారు, ఆ మొత్తంపై సెక్షన్ 10(13ఏ) కింద పన్ను ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. 1. పనిచేస్తున్న సంస్థ నుంచి ఒక ఏడాదిలో పొందిన వాస్తవ హెచ్ఆర్ఏ మొత్తం. 2. వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తమ వార్షిక వేతనంలో 10 శాతాన్ని తీసివేయగా మిగిలిన మొత్తం. 3. మెట్రోల్లో నివసించే వారి మూల వేతనంలో 50 శాతం/ పల్లెల్లో నివసించే వారు అయితే మూల వేతనంలో 40 శాతం. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే అంత మేర తమ ఆదాయంపై పన్ను చెల్లించక్కర్లేదు. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసించే శ్రీరామ్ నెలవారీ స్థూల వేతనం రూ.50,000 (సంవత్సరానికి రూ.6లక్షలు). అతడి మూలవేతనం, డీఏ కలిపి రూ.30,000. హెచ్ఆర్ఏ కింద సంస్థ ప్రతినెలా రూ.10,000 ఇస్తోంది. కానీ శ్రీరామ్ రూ.12,000 కిరాయి ఇంట్లో ఉంటున్నాడు. ఈ ఉదాహరణలో శ్రీరామ్ రూ.84,000ను హెచ్ఆర్ఏ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. → ఇంకా సెక్షన్ 80సీ కింద గుర్తింపు పొందిన సంస్థలకు విరాళాలతోపాటు మరికొన్ని మినహాయింపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిపుణులు ఏమంటున్నారు? ఎంత మేర పన్ను తగ్గింపులు, మినహాయింపులు క్లెయిమ్ చేసుకుంటారన్న అంశం ఆధారంగానే పాత, కొత్త పన్ను విధానంలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది. ఒక పేపర్‌పై తమ ఆదాయం, పెట్టుబడులు, బీమా ప్రీమియం వివరాలను నమోదు చేసుకుని, హెచ్ఆర్ఏ లెక్క తేలి్చన అనంతరం ఏ విధానం అనుకూలమో నిర్ణయించుకోవాలి. మొత్తం ఆదాయంలో ఎంత మేర పన్ను తగ్గింపులను క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఏ విధానం అనుకూలమో స్పష్టత తెచ్చుకున్న తర్వాతే రిటర్నుల దాఖలుకు ముందుకు వెళ్లాలి. సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల మేర ఇన్వెస్ట్ చేస్తూ.. ఇంటి రుణం, విద్యా రుణం తీసుకుని చెల్లింపులు చేస్తూ.. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంతోపాటు, హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అధిక ఆదాయ శ్లాబుల్లో ఉన్న వారికి సైతం పాత విధానమే మెరుగని షేర్ డాట్ మార్కెట్ బిజినెస్ హెడ్ వైభవ్ జైన్ తెలిపారు. ఈ క్లెయిమ్‌లు చేసుకోని వారికి కొత్త విధానాన్ని సూచించారు. నూతన విధానంలో పెద్దగా పన్ను ప్రయోజనాలు లేకపోయినా సరే.. కొత్తగా ఉద్యోగంలో చేరి, రూ.7 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ఎంతో ప్రయోజనమని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లోహిత్భాటియా తెలిపారు. ఎంపికలో స్వేచ్ఛ..ఆదాయపన్ను రిటర్నులు వేసే సమయంలో కొంత శ్రద్ధ వహించక తప్పదు. ఎందుకంటే కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఎంపికై ఉంటుంది. నూతన విధానంలోనే రిటర్నులు వేసే వారు అన్ని వివరాలు నమోదు చేసి సమరి్పంచొచ్చు. పాత విధానంలో కొనసాగాలనుకుంటే కచి్చతంగా ‘నో ఫర్ ఆప్టింగ్ అండర్ సెక్షన్ 115బీఏసీ’’ అని సెలక్ట్ చేసుకోవాలి. వేతన జీవులు ఏటా రిటర్నులు వేసే సమయంలో రెండు పన్ను విధానాల్లో తమకు అనుకూలమైనది ఎంపిక చేసుకోవచ్చు. వ్యాపార ఆదాయం ఉంటే మాత్రం ఇలా ఏదో ఒకటి ఎంపిక చేసుకునే స్వేచ్ఛ లేదు. వీరు పాత విధానంలోనే కొనసాగదలిస్తే ఫారమ్ 10–ఐఈఏ సమరి్పంచాలి. కాకపోతే జీవితంలో ఒక్కసారి మాత్రం నూతన పన్ను విధానానికి మారిపోయే ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి ఈ అవకాశం వినియోగించుకుని నూతన విధానంలోకి మారితే, తిరిగి పాత విధానంలోకి వెళ్లే అవకాశం ఉండదు. ఇప్పటికే 66 శాతం మేర నూతన పన్ను విధానంలో రిటర్నులు వేస్తున్నట్టు సీబీడీటీ చెబుతోంది. ఏది ప్రయోజనం..? → కేవలం స్టాండర్డ్ డిడక్షన్ వరకే క్లెయిమ్ చేసుకునేట్లయితే రూ.7,75,000 లక్షల్లోపు ఆదాయం ఉన్న వేతన జీవులు, పెన్షనర్లకు నిస్సందేహంగా నూతన విధానమే మెరుగని ఇక్కడి టేబుల్ చూస్తే అర్థమవుతుంది. స్వ యం ఉపాధి, ఇతరులకు రూ.7లక్షల వరకు నూతన విధానంలో పన్ను లేదు. పాత విధానంలో అయితే స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని రూ.5.50లక్షల మొత్తంపై వేతన జీవులు, పెన్షనర్లకు పన్ను వర్తించదు. ఆ తర్వాత ఆదాయంపై 20% పన్ను పడుతోంది. → రూ.7,75,000 ఆదాయం కలిగి.. పాత పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ రూ.50వేలతోపాటు, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు కలిపి మొత్తం రూ.7 లక్షల వరకే పన్ను ఆదాయంపై మినహాయింపులను క్లెయిమ్ చేసు కునే వారికీ నూతన పన్ను విధానం లాభం. → రూ.7 లక్షలకు మించకుండా ఆదాయం కలిగిన వారు పాత విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ సహా రూ.2లక్షలకు పైన పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అందులో కొనసాగొచ్చు. క్లెయిమ్ చేసుకోలేని వారికి కొత్త విధానం నయం. → అలాగే, రూ.11 లక్షల ఆదాయం కలిగిన వారు రూ.3,93,700కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.16 లక్షల పన్ను ఆదాయం కలిగిన వారు రూ.4,83,333కు మించి పన్ను మినహాయింపులు (స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుని) క్లెయిమ్ చేసుకున్నప్పుడే పాత విధానం ప్రయోజనకరం. → రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షలు, 24(బీ) కింద గృహ రుణ వడ్డీ రూ.2 లక్షలు, హెచ్ఆర్ఏ ప్రయోజనం రూ.80వేలు (రూ.50వేల వేతనంపై సుమారు), హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం రూ.25వేలు, ఎన్పీఎస్ పెట్టుబడి రూ.50వేలను క్లెయిమ్ చేసుకుంటే పాత విధానంలో నికరంగా రూ.10.55 లక్షల ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన పరిస్థితి ఉండదు. నోట్: మూడు టేబుళ్లలో ఉన్న గణాంకాలు 60ఏళ్లలోపువారికి ఉద్దేశించినవి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రాష్ట్రం కోసం బడ్జెట్ లో ఏమీ సాధించలేకపోయా..
-
ఇల్లమ్మితే... బోలెడు నష్టం!
కేంద్ర బడ్జెట్ 2024లో ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మండిపడ్డారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ను తొలగిస్తే.. రియల్ ఎస్టేట్‌లో భారీగా నల్లధనం వచ్చి చేరుతుంది. కాబట్టి దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రపంచవ్యాప్తంగా, పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ప్రోత్సహించారు. అయితే ఇప్పుడు ఇండెక్సేషన్‌ను తొలగించడం ద్వారా పెట్టుబడిదారీ వర్గం వెనుకడుగు వేస్తుంది. ఇండెక్సేషన్‌ను తీసివేయడం అంటే పన్ను విధించడం కాదు.. పెట్టుబడిదారులకు జరిమానా విధించడంతో సమానం అని అన్నారు.2024 బడ్జెట్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన ప్రతిపాదనలో పాత ఆస్తులను విక్రయించే వ్యక్తులు అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుందని రాఘవ్ చద్దా తెలిపారు.బడ్జెట్లో, ప్రభుత్వం స్థిరాస్తులపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించింది. అయితే ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయడానికి ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించింది. ఇండెక్సేషన్‌ను పునరుద్దరించకపోతే.. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు తగ్గుతాయి, ప్రజలు తమకు నచ్చిన డ్రీమ్ హోమ్‌లను కొనుగోలు చేయడం సాధ్యం కాదని చద్దా అన్నారు.ఇండెక్సేషన్ అనేది బాండ్లు, స్టాక్‌లు, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడులను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు చేసే పద్ధతి. సాధారణంగా ఇందులో పెట్టుబడి ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఉంటాయి. అయితే ద్రవ్యోల్బణం వల్ల వాస్తవ పెట్టుబడి విలువ తగ్గిపోతుంది. ఈ సమయంలో అప్పటికి ఉన్న ధరలకు అనుకూలంగా అడ్జస్ట్ చేయడానికి ఇండెక్సేషన్ ఉపయోగపడుతుంది.Removal of ‘Indexation’ benefit from the Investor is a grave mistake by the Government. I explain in detail. Please watch. pic.twitter.com/AhB7vViy0n— Raghav Chadha (@raghav_chadha) July 25, 2024 -
భారమవుతున్న విద్యారుణాలు!
బ్యాంకులు అందిస్తున్న విద్యారుణాలు భారమవుతున్న తరుణంలో బడ్జెట్ 2024-25 ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందని చాలామంది భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న రూ.4 లక్షల ఉన్నత విద్యారుణాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. గుడ్డి కంటే మెల్ల మేలు అన్నట్లు వడ్డీలపై నిర్ణయాన్ని వెల్లడించకుండా రుణ పరిమాణాన్ని పెంచడం ఒకింత మేలు చేసే అంశమే అయినా, భవిష్యత్తులో క్రీయాశీలకంగా మరిన్ని నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.2047లోపు ‘వికసిత భారత్’ లక్ష్యంగా విత్త మంత్రి నిర్మలా సీతారామన్ మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగకల్పన, రెసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బలోపేతం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలుగా ప్రస్తుతం ఉన్న రుణ సదుపాయాన్ని రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచారు. అయితే బ్యాంకులు ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాలను మంజూరు చేయడం లేదు. రుణాల జారీ అంశాన్ని అకడమిక్ మార్కులకు లింక్ పెడుతున్నారు. దాంతో రుణ గ్రహీతలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గతంలో బ్యాంకులు విద్యా రుణాలను దాదాపు 4 శాతం వడ్డీకే అందించేవి. ప్రస్తుతం అది సుమారు 12.5 శాతానికి చేరింది.ఇదీ చదవండి: 379 అక్రమ రుణ వెబ్సైట్లు, 91 ఫిషింగ్ సైట్ల తొలగింపుప్రభుత్వం స్పందించి 2047 కల్లా ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని చేరుకునేలా విద్యా రుణాలను మరింత సులభతరం చేసి, తక్కువ వడ్డీలకే వాటిని అందిచేలా చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. దాంతోపాటు ఉన్నత విద్య చదువుతున్న సమయంలోనే కళాశాలలు, కంపెనీలు పరస్పరం ఒప్పందం కుదుర్చుకునేలా మరిన్ని ఏర్పాట్లు చేయాలని చెబుతున్నారు. దానివల్ల విద్యార్థి దశలోనే రియల్‌టైమ్ అనుభవం రావడంతో చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. -
Parliament Budget Session 2024: మాటల యుద్ధం
న్యూఢిల్లీ: అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదాలు, నినాదాలతో లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. పలుమార్లు వాయిదా పడింది. కేంద్ర బడ్జెట్‌పై ప్రారంభమైన చర్చ పూర్తిగా పక్కదారి పట్టింది. తొలుత కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి రవనీత్‌సింగ్ బిట్టూ తాత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్‌సింగ్ హత్య ఘటనను ప్రస్తావించారు. దీనిపై బిట్టూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చన్నీ, బిట్టూ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ నేత సోనియా గాం«దీతోపాటు చన్నీపై బిట్టూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. దీంతో విపక్ష ఎంపీలు ఒక్కసారిగా ఆయనపై విరుచుకుపడ్డారు. బిట్టూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుడు అమరీందర్‌సింగ్ రాజా వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయతి్నంచారు. రాహుల్ గాంధీ ఆయనను ఆపేశారు. బిట్టూతోపాటు పలువురు బీజేపీ ఎంపీలు వెల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయతి్నంచగా స్పీకర్ స్థానంలో ఉన్న సంధ్యా రే సభను వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. సభ సజావుగా జరిగేలా చూడాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. సభ్యులంతా సభ గౌరవాన్ని కాపాడాలని స్పీకర్ అన్నారు. నిబంధనలు అతిక్రమించకూడదని చెప్పారు. తర్వాత చన్నీ తన ప్రసంగం కొనసాగించారు. రైతులకు ఇచి్చన హామీలను మోదీ ప్రభుత్వం నిటబెట్టుకోలేదని విమర్శించారు. రైతులను ఖలిస్తానీలు చిత్రీకరించారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. సభను చన్నీ తప్పుదోవ పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. చన్నీ మాట్లాడుతూ రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందిస్తూ చన్నీ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆయనపై సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని అన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మళ్లీ వాగ్వాదం కొనసాగింది. తర్వాత సభ రెండుసార్లు వాయిదా పడింది. పార్లమెంట్ బయట బిట్టూ మీడియాతో మాట్లాడారు. చన్నీ జాతి వ్యతిరేక శక్తిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇండియా నుంచి పంజాబ్‌ను విడదీయాలన్నదే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ: చన్నీ దేశంలో నరేంద్ర మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని చరణ్‌జిత్ సింగ్ చన్నీ మండిపడ్డారు. 20 లక్షల మంది ప్రజలు ఎన్నుకున్న ఎంపీని(అమృత్‌పాల్ సింగ్) జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు వేసిన ప్రజల సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించే అవకాశం ఆయనకు ఇవ్వడం లేదని, ఇది ఎమర్జెన్సీ కాక మరేమిటని ప్రశ్నించారు. చన్నీ లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. అయితే, అమృత్‌పాల్ పేరును నేరుగా ప్రస్తావించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్‌సాహిబ్ నియోజకవర్గం నుంచి వివాదాస్పద సిక్కు మత బోధకుడు, ఖలిస్తాన్ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ స్వతంత్ర అభ్యరి్థగా 2 లక్షల మెజారీ్టతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆంధ్రా–బిహార్ బడ్జెట్: సౌగతా రాయ్ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ లోక్‌సభలో విమర్శలు గుప్పించారు. అది ఆంధ్రా–బిహార్ బడ్జెట్ అని ఆక్షేపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శిక్షణ పొందిన ఆర్థికవేత్త కాదని అన్నారు. ప్రజల ఆకాంక్షలు పట్టించుకోకుండా కేవలం ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచి్చన సూచనల ఆధారంగా బడ్జెట్ రూపొందించారని విమర్శించారు. గతంలో ఆర్థిక మంత్రులుగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, పి.చిదంబరం హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారని, నిర్మలా సీతారామన్ మాత్రం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకున్నారని సౌగతా రాయ్ వ్యాఖ్యానించారు. -
ఆ వాటాల విక్రయమంటే కన్నబిడ్డలను అమ్ముకోవడమే
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయం (డిజ్ ఇన్వెస్ట్మెంట్) ద్వారా ఈ ఏడాది రూ.50 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రస్తావించడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయమంటే కన్నబిడ్డలను మరొకరికి అమ్ముకోవడమే అని విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌పై శ్రీధర్‌బాబు స్పందిస్తూ పీఎస్‌యూలను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త వాటిని స్థాపించకపోగా, లాభాల్లో ఉన్న సంస్థల వాటాలను అమ్మి సొమ్ము చేసుకుంటోందని ఆరోపించారు. బ్యాంకులు కాకుండా పీఎస్‌యూల వార్షిక లాభాలు రూ.2,64,000 కోట్లుగా ఉన్నాయన్నారు. బ్యాంకులను జాతీయం చేసి పేదల దగ్గరికి చేర్చింది స్వర్గీయ ఇందిరాగాంధీ అని, ఇప్పుడా బ్యాంకుల ద్వారా గతేడాది మోదీ ప్రభుత్వానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెంట్ లభించిందని శ్రీధర్‌బాబు తెలిపారు.నష్టాల్లో ఉన్న పీఎస్‌యూలకు అపారమైన ఆస్తులున్నాయని, కానీ అవి దివాలా తీశాయని ప్రధాని చెబుతున్నారని విమర్శించారు. వాటి అప్పుల కన్నా ఆస్తుల విలువ ఎక్కువని పేర్కొన్నారు. 13 మహారత్న, 14 నవరత్న, 72 మినీరత్న పీఎస్‌యూలన్నీ లాభాల్లో ఉన్నాయని, వీటిని నిర్వీర్యం చేసి వాటాలు అమ్ముకుంటే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదని శ్రీధర్‌బాబు హెచ్చరించారు.రక్షణరంగ ఉత్పత్తుల తయారీపై రూ.వెయ్యి కోట్ల పెట్టుబడిముందుకొచ్చిన వెమ్ టెక్నాలజీస్: మంత్రి శ్రీధర్బాబుసాక్షి, హైదరాబాద్: రక్షణరంగ పరికరాల ఉత్పత్తి సంస్థ వెమ్ టెక్నాలజీస్ మొదటి దశ ప్రాజెక్టులో భాగంగా రూ.1,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్‌లో 511 ఎకరాల్లో ఏర్పాటవుతున్న ఈ సమీకృత ఉత్పాదన కేంద్రం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ట్రయల్ ప్రొడక్షన్‌కు సిద్ధమవుతుందని వెల్లడించారు. మొదటి దశ పూర్తయితే 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.గురువారం సచివాలయంలో వెమ్ ఇండస్ట్రీస్ ప్రతినిధులు మంత్రితో సమావేశమయ్యారు. సంస్థకు కేటాయించిన భూమిలో ఇంకా స్వాధీనం చేయాల్సిన 43 ఎకరాలకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతికి.. శ్రీధర్‌బాబు సూచించారు. ఉత్పత్తికి 33 కేవీ విద్యుత్ లైన్లను నాలుగు నెలల్లో ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. సమావేశంలో వెమ్ టెక్నాలజీస్ సీఎండీ వెంకటరాజు పాల్గొన్నారు. -
జీఎస్టీ శ్లాబులు తగ్గింపు..?
జీఎస్టీ శ్లాబులను మరింత సరళతరం చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ ఛైర్మన్ సంజయ్ అగర్వాల్ తెలిపారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) నిర్మాణాన్ని క్రమబద్ధీకరించేందుకు ప్రస్తుతం అమలవుతున్న నాలుగు శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు సాగుతున్నాయని చెప్పారు.ఈ సందర్భంగా సంజయ్ అగర్వాల్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం అమలవుతున్న జీఎస్టీ శ్లాబుల విధానంలో చాలా వస్తువుల వర్గీకరణపై వివాదాలున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పన్ను చెల్లింపులను మరింత సరళతరం చేసేందుకు ప్రస్తుతం ఉన్న నాలుగు జీఎస్టీ శ్లాబులను మూడుకు తగ్గించేలా చర్చలు జరుగుతున్నాయి. జులై 2017లో జీఎస్టీను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆదాయ వృద్ధి మెరుగుపడింది’ అన్నారు.ఇదీ చదవండి: ఈఎస్ఐ పథకంలోకి భారీగా చేరిన ఉద్యోగులుకేంద్ర బడ్జెట్ 2024-25 ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ..‘జీఎస్టీ ప్రయోజనాలను పెంచడం కోసం పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకృతం చేసేందుకు ప్రయత్నిస్తాం. జీఎస్టీ పరిధిని ఇతర రంగాలకు విస్తరిస్తాం’ అని చెప్పారు. మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రాబడుల్లో స్థిరమైన వృద్ధి నమోదైంది. ఏప్రిల్ 2024లో ఆల్ టైమ్హై రూ.2.10 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. ప్రస్తుతం జీఎస్టీ శ్లాబులు 5%, 12%, 18%, 28%గా ఉన్నాయి. -
ఆయనతో పోలిస్తే చంద్రబాబు మరీ అంత వీకా?
మీడియా చేతిలో ఉంటే చాలు తిమ్మిని బొమ్మి చేయవచ్చు. బొమ్మిని తిమ్మి చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఢీ కొట్టగలిగినవారే దేశంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. అమరావతి రాజదాని నిర్మాణానికి కేంద్రం పదిహేనువేల కోట్ల రూపాయల సాయం చేయడానికి ముందుకువచ్చింది కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయం ప్రకటించినప్పుడు ఆంద్రులంతా సంతోషించారు. చంద్రబాబు నాయుడు అమలు చేయతలపెట్టిన స్కీములకు ఈ మేరకు ఉపశమనం కలుగుతుందని అనుకున్నారు. కానీ.. అసలు విషయం తెలిశాక..ఇందులోనూ ఇంత మతలబు ఉందనే అభిప్రాయం కలుగుతుంది. అమరావతికి కేంద్రం గ్రాంట్ గా ఇవ్వడం లేదని, ప్రపంచ బ్యాంక్ నుంచి రుణ సాయం ఇప్పిస్తుందని, ఇందులో మాచింగ్ గ్రాంట్ విషయం కేంద్ర,రాష్ట్రాలు చర్చించి నిర్ణయించుకుంటాయని ఆమె చెప్పారు. అంటే ఇందులోను గ్యారంటీ లేదన్న మాట. అవసరమైతే రాష్ట్రం కూడా భరించవలసి ఉంటుందన్నమాట. ఇక పోలవరం ప్రాజెక్టు పేరు కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావించినందుకే టీడీపీ, జనసేనలు మురిసిపోయాయి. అలాగే పారిశ్రామికవాడలకు ఇచ్చే రాయితీలు గురించి మాట వరసకు చెప్పారు తప్ప ఎంత మేర ఆర్దిక సాయం చేసేది నిర్దిష్టంగా తెలపకపోయినా తెలుగుదేశం మీడియా ఆహో,ఓహో అంటూ ఊదరగొట్టాయి. రాజును మించిన రాజభక్తిని ప్రదర్శించాయి. బీహారు రాష్ట్రానికి మాత్రం కేంద్రం నేరుగా 58,900 కోట్ల రూపాయల ఆర్దిక సాయాన్ని వివిధ ప్రాజెక్టుల రూపేణా ఇవ్వదలచింది. అంటే అదంతా గ్రాంట్ అన్నమాట. రూపాయి అప్పుగా ఉండదు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు సంబంధించిన ఎంపీల మద్దతు లేనిదే మోదీ ప్రభుత్వం నిలబడడం కష్టం. అయినా నితీష్ ధైర్యంగా ప్రత్యేక హోదా అడిగారు. చంద్రబాబు ఆ ఊసే ఎత్తలేదు. బీహారుకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, అంతకు మించిన సాయాన్ని మోదీ ప్రభుత్వం ఇస్తోంది. ఏపీకి మాత్రం అప్పుకు సాయం చేస్తామని అన్నారు. ఎక్కడ ఉంది బలహీనత. కొంతమంది విమర్శిస్తున్నట్లు చంద్రబాబుపై గతంలో కేంద్రం ఇచ్చిన నోటీసుల కత్తి వేలాడుతోందా?లేక చంద్రబాబే కేంద్రంతో గొడవ పెట్టుకుని గతంలో మాదిరి దెబ్బతింటానని భయపడుతున్నారా?. 2014-19 టరమ్ లో తొలుత ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ ఇస్తామని ఆనాటి ఆర్దిక మంత్రి అరుణ్ జైట్లి ప్రకటించారు. దానిని చంద్రబాబు స్వాగతించారు. ఆ తర్వాత కాలంలోమళ్లీ ప్రత్యేక హోదానే కావాలన్నారు. అది వేరే సంగతి.ప్యాకేజీ కూడా అప్పట్లో రుణసాయం కిందే ఇవ్వచూపారు. దానికే చంద్రబాబు అప్పట్లో అంగీకరించడం విమర్శలకు దారి తీసింది. సరిగ్గా అదేరీతిలో ఇప్పుడు అమరావతి నిర్మాణానికి రుణం తీసుకోవడానికి ఒప్పుకున్నారు. స్వయంగా చంద్రబాబే అది అప్పే అని తేల్చి చెప్పారు. జనం అంతా ఏపీకి పప్పన్నం లాంటి సాయం వచ్చిందని అనుకుంటే అది కాస్త అప్పన్నం అని తేలిపోయింది. ఈ మాత్రం దానికే ఈనాడు పత్రిక ఏమని హెడింగ్ పెట్టిందో చూడండి. ‘‘రాజధానికి రాజసం’’ అని పెట్టి తమ రాజభక్తిని ప్రదర్శించుకున్నారు. మరో టీడీపీ పత్రిక ఆంధ్రజ్యోతి ‘‘హ్యాపీ ఏపీ’’ అని ఆనంద తాండవం చేసింది. వారికి ఇష్టం అయితే ఇలా..అదే జగన్ ప్రభుత్వం చేస్తే అప్పుల చిప్ప అని హెడింగ్ పెట్టేవారు. అయితే ఇక్కడ చంద్రబాబు సమర్ధించుకున్న తీరు కూడా ఆసక్తికరమైనదే. పదిహేనువేల కోట్ల మేర కేంద్రం ఇచ్చేది అప్పే అయినా ,ముప్పై ఏళ్లతర్వాత తీర్చేది కాబట్టి ఇబ్బంది ఉండదు అని చెబుతున్నారు. అంటే అప్పటివరకు ఏపీ ప్రజల నెత్తిన ఈ రుణభారం ఉంటుందని అంగీకరించడమే కదా!. వివిధ ఏజెన్సీల నుంచి వచ్చే ఈ అప్పులకు కేంద్రం పూచికత్తు ఇస్తుందని అన్నారు. నిజానికి ఏ విదేశీరుణానికి అయినా కేంద్రం గ్యారంటీలు ఇస్తుందన్నది తెలిసిందే.గతంలో ప్రపంచ బ్యాంక్ ఇదే ప్రాజెక్టుకు రుణం ఇవ్వడానికి నో చెప్పింది.దానికి కారణం అది పర్యావరణ నియమాలకువ్యతిరేకంగా ఉండడం,కొందరు రైతులు నిరసనలు తెలుపుతుండడం. నిధులు ఏ రూపేణా వచ్చినా అది రాష్ట్రానికి ఉపయోగమేనని చంద్రబాబు ఉవాచ. మరి జగన్ ప్రభుత్వంపై తెగ ఆడిపోసుకున్నారు కదా? అని ఎవరైనా అడిగితే అధికారం కోసం ఎన్ని అయినా అంటాం అని సమాధానం ఇస్తారేమో తెలియదు. పోలవరం ప్రాజెక్టు కునిధులు ప్రత్యేకంగా కేంద్ర బడ్జెట్ లో పెట్టకపోయినా, పూర్తి చేసే బాధ్యత తమదేనని కేంద్రం చెప్పిందట.అంటే అది ఎప్పటికి పూర్తి చేస్తారో, ఎంత మొత్తం ఇస్తారో, నిర్వాసితుల సమస్య ఎప్పటికి తీర్చుతారో తెల్చకుండా పోలవరం అంటేనే పులకరించిపోతే ఏమి చేయాలి!. పోనీ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగిస్తున్నట్లు ఏమైనా చెప్పారా?అదేమీ లేదు. వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీ బుందేల్ ఖండ్ తరహాలో ఉంటుందని సమాచారం ఉందని చంద్రబాబు చెబుతున్నారు. కానీ నిర్మలా సీతారామన్ అనడం లేదు. పారిశ్రామిక రాయితీలు ఈ ప్యాకేజీలో భాగమేనని ఆయన అంటు్నారు.చంద్రబాబు వీటన్నిటిపైన ప్రధాని మోదీకి ధన్యవాదాలు కూడా తెలిపేశారు. రాష్ట్ర అవసరాలను గుర్తించి రాజధాని, పోలవరం,పారిశ్రామికరంగంతో పాటు వెనుకబడిన అభివృద్దికి దృష్టి సారించినందుకు మోదీకి, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకీ ఏమి సాధించారని చంద్రబాబు ఇంతగా కేంద్రాన్ని పొగిడారో తెలియదు. .. దీనిని బట్టే చంద్రబాబు రాజకీయంగా ఎంత బలహీనంగా ఉంది అర్దం అవుతుంది.ధైర్యం చేసి నితీష్ మాదిరి గట్టిగా అడగలేకపోయారు.వారు ఇచ్చిందే మహా గొప్ప విషయం అన్నట్లు చంద్రబాబు సరిపెట్టుకున్నారు. కాకపోతే ఏపీ ప్రజలను తనకు ఉన్న మీడియా బలంతో మభ్యపెట్టడానికి మాత్రం యత్నించారు. అబద్దపు వాగ్దానాలనువిని ఓట్లు వేసిన ప్రజలు ఈ ప్రచారాన్ని నమ్మకుండా ఉంటారా? అన్నది వారి విశ్వాసం కావచ్చు.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
బడ్జెట్ కేటాయింపులపై జడ శ్రవణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్
-
Parliament Budget Session 2024: కేంద్ర బడ్జెట్‌పై సభా సమరం
న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయసభల్లో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై అధికార, విపక్షాల తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. సమాఖ్య స్ఫూర్తికి, పేదలకు బడ్జెట్ ఫక్తు వ్యతిరేకంగా ఉందంటూ విపక్షాలు దుయ్యబట్టాయి. అధికార ఎన్డీఏ కూటమి భాగస్వాములను ప్రసన్నం చేసుకోవడానికే మోదీ సర్కారు పరిమితమైందని ఆరోపించాయి. రాజ్యసభ, లోక్‌సభ సమావేశం కాగానే బడ్జెట్ కేటాయింపులపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టాయి. సభాపతులు అందుకు నిరాకరించడంతో ఉభయ సభల నుంచీ కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. కుర్చీ కాపాడుకునే బడ్జెట్! ‘‘బడ్జెట్లో బిహార్, ఆంధ్రప్రదేశ్‌లకు పకోడా, జిలేబీ దక్కాయి. మిగతా రాష్ట్రాలన్నింటికీ మోదీ మొండిచేయి చూపారు’’ అంటూ రాజ్యసభలోవిపక్ష నేత ఖర్గే దుయ్యబట్టారు. ఇతర కార్యకలాపాలను పక్కన పెట్టి ముందుగా బడ్జెట్‌పై చర్చ చేపట్టాలంటూ నోటీసులిచ్చారు. వాటన్నింటినీ చైర్మన్ తిరస్కరించడంపై విపక్ష సభ్యులంతా మండిపడ్డారు. ‘కేవలం ఐదు రాష్ట్రాలకే పరిమితమైన బడ్జెట్’, ‘కురీ్చని కాపాడుకునే బడ్జెట్’ అంటూ నినాదాలకు దిగారు. బడ్జెట్ కేటాయింపులు విపక్షపూరితమంటూ విపక్ష ఎంపీలు బుధవారం ఉదయం లోక్‌సభ ప్రవేశద్వారం వద్ద బైఠాయించి నిరసనకు దిగారు. ఈ అంశాన్నే ముందు చర్చకు చేపట్టాలంటూ సభలో పదేపదే డిమాండ్ చేశారు. వారి తీరుపై స్పీకర్ ఓం బిర్లా ఆగ్రహించారు. బైఠాయించి ఎవరినీ లోనికి రానీయకపోవడం ఏం పద్ధతని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ బి.మహతాబ్ బడ్జెట్‌పై చర్చ ప్రారంభించారు. నయా మధ్యతరగతిని సాధికారతకు బడ్జెట్ పెద్దపీట వేసిందన్న ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్ సభ్యురాలు కుమారి సెల్జా తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర బడ్జెట్ ఎవరి కోసమో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ‘ఇది వికసిత్ బడ్జెట్ కాదు, విచలిత్ బడ్జెట్’ అంటూ ఎద్దేవా చేశారు. తుమ్మితే ఊడేలా ఉన్న సంకీర్ణానికి మోదీ సారథ్యం వహిస్తున్నారంటూ తృణమూల్ నేత అభిషేక్ బెనర్జీ ఎద్దేవా చేశారు. అందుకే కీలక ఎన్డీఏ భాగస్వాములను తృప్తి పరిచేందుకు బిహార్, ఏపీలకే బడ్జెట్లో పెద్దపీట వేశారని ఆరోపించారు. బెనర్జీ వ్యాఖ్యలు తృణమూల్ పాలిత పశి్చమబెంగాల్కే వర్తిస్తాయంటూ కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. దయానిధి మారన్ (డీఎంకే), సుప్రియా సులే తదితరులు బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు. విపక్ష సభ్యులనుద్దేశించి బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ చేసిన విమర్శలు వివాదమయ్యాయి. దాంతో వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నట్టు స్పీకర్ చెప్పారు.పార్లమెంట్ ప్రాంగణంలో విపక్షాల నిరసన కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు తీరుపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పాలిత రాష్ట్రాలకు బడ్జెట్లో మొండిచేయి చూపారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరిపై బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన తెలిపారు. దేశ సమాఖ్య వ్యవస్థ పవిత్రతపై మోదీ ప్రభుత్వం దాడి చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపించారని, ఇదెక్కడి న్యాయమని నిలదీశారు. కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు అఖిలేష్ యాదవ్ సహా డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు నిరసనలో పాల్గొన్నారు.నిర్మల మాతాజీ! ఖర్గే సంబోధన కూతురన్న ధన్‌ఖడ్ రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సంబోధనల సంవాదం జరిగింది. చాలా రాష్ట్రాలకు బడ్జెట్లో అన్యాయం జరిగిందని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతుండగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరణ ఇచ్చేందుకు చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ అవకాశమిచ్చారు. దాంతో ఖర్గే ఆగ్రహించారు. నిర్మలను ఉద్దేశించి, ‘‘మాతాజీ! మీరు మాట్లాడటంలో ఎక్స్పర్ట్ అని నాకు తెలుసు. కానీ ముందుగా దయచేసి నన్ను పూర్తి చేయనివ్వండి’’ అన్నారు. మాతాజీ సంబోధనపై చైర్మన్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఆర్థిక మంత్రికి 64 ఏళ్లు. మీకు 82. ఆమె మీకు మాతాజీ కాదు, కూతురి వంటిది’’ అన్నారు. అనంతరం ఖర్గే చర్చను కొనసాగిస్తూ నిర్మల కర్నాటక నుంచి రాజ్యసభకు ఎన్నికైనందున బడ్జెట్లో ఆ రాష్ట్రానికి ఎంతో ఇస్తారనుకుంటే అసలేమీ ఇవ్వలేదంటూ ఎత్తిపొడిచారు. -
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్@ 2.90 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: వాస్తవిక కోణాన్ని ప్రతిబింబిస్తూనే అదనపు ఆదాయ రాబడులు, ఆర్థిక ప్రగతిని దృష్టిలో ఉంచుకుని 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభు త్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు చేసేందుకు సిద్ధమైంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.2,75,890 కోట్లను ప్రతిపాదించిన ప్రభుత్వం దాని కంటే 5 శాతం మేర కేటాయింపుల పెంపుతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాల ద్వారా తెలిసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో పరిశ్రమలు, ఐటీ, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతకంటే ముందు ఉదయం 9 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. రాబడుల్లో సంస్కరణలు అప్పుల భారం పెరిగిపోతున్న నేపథ్యంలో అదనపు ఆదాయాన్ని రాబట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టింది. జీఎస్టీ లీకేజీలు అరికట్టాలని, గనుల రాయల్టీ చెల్లింపు ఎగవేతలను నిరోధించాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఈ ఏడాదిలో భూముల మార్కెట్ విలువల సవరణ జరిగితే రూ.5 వేల కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తోంది. మరోవైపు ఈ బడ్జెట్లో పన్నేతర ఆదాయం కింద భూముల అమ్మకాలను ప్రతిపాదించే అవకాశం కూడా ఉంది. మద్యం రేట్లు పెంచడం, ఎలైట్ షాపుల ఏర్పాటు లాంటి విధాన నిర్ణయాలను తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో రూ.15 వేల కోట్ల వరకు ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈ పెరిగిన ఆదాయానికి తోడు, ఆర్థిక వృద్ధి కూడా కేటాయింపులకు ఊతమిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని పద్దులూ కీలకమే! ఈసారి బడ్జెట్లో అన్ని శాఖల పద్దులూ భారీగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రుణమాఫీతో కలిపి వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.64 వేల కోట్లు, సాగునీటి శాఖకు రూ.26–28 వేల కోట్లు, విద్యా శాఖకు రూ.21 వేల కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.45 వేల కోట్ల వరకు, సంక్షేమ శాఖలకు రూ.40 వేల కోట్లు, మున్సిపల్ శాఖకు రూ.12 వేల కోట్లు ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి రుణమాఫీకే రూ.31 వేల కోట్లు ఖర్చు కానున్నాయి. అందులో ఇప్పటికే రూ.6 వేల కోట్ల వరకు ఖర్చయింది. ఆగస్టు నెలాఖరు నాటికి మిగిలిన రూ.25 వేల కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఇక ఆరు గ్యారంటీలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.53 వేల కోట్లు కేటాయించారు. మహాలక్ష్మి, గృహజ్యోతి, గృహలక్షి్మ, పథకాలు ఇప్పటికే అమల్లో ఉండగా, మరిన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్న విధంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల ఏర్పాటుకు బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయించవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.20 వేల కోట్లు అవసరం కాగా, అందులో ఏ మేరకు నిధులు ప్రతిపాదిస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. సాగునీటి శాఖకు సంబంధించి రూ.9 వేల కోట్లు ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరం కాగా, అప్పులు, వేతనాలు, ఈ ఏడాది పూర్తి చేయాల్సిన ప్రాధాన్యతా ప్రాజెక్టులకు రూ.28 వేల కోట్లు అవసరమపి ఆ శాఖ కోరింది. శాఖల వారీ కేటాయింపులకు తోడు అప్పుల చెల్లింపు, ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం వేతనాలు, సాధారణ వ్యయం, విద్యుత్ సబ్సిడీలు (గృహజ్యోతి, వ్యవసాయానికి ఉచిత విద్యుత్) తదితర అనివార్య చెల్లింపులు కూడా చేయాల్సి ఉంది. పింఛన్ల పెంపు కష్టమేనా? ఎన్నికలకు ముందు ఆసరా పింఛన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న పింఛన్ ప్రకారం ఏడాదికి రూ.11 వేల కోట్ల నిధులు అవసరమవుతున్నాయి. కాగా హామీ ఇచ్చిన ప్రకారం పెంచితే నెలకు రూ.1,000 కోట్ల చొప్పున ఏడాదికి మరో రూ.12 వేల కోట్లు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్లో పింఛన్ల పెంపు ప్రతిపాదన ఉంటుందా లేదా అన్నది సందేహాస్పదంగా మారింది. అయితే వాస్తవిక కోణంలో బడ్జెట్ రూపకల్పనకు ప్రాధాన్యమిచ్చినందున ఈ ఏడాదికి పింఛన్ల పెంపు ఉండకపోవచ్చనే తెలుస్తోంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.45వేల కోట్ల వరకు ప్రతిపాదించే అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. ఆర్థిక వృద్ధి ఆసరాగా..! పార్లమెంటులో ఇటీవల ప్రవేశపెట్టిన సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం ఈసారి 6.5 నుంచి 7 శాతం వరకు ఆర్థిక వృద్ధి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ స్థాయి వృద్ధి కంటే తెలంగాణ వృద్ధి మరో 2–3 శాతం వరకు ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయి. ఈ వృద్ధికి తోడు రెవెన్యూ రాబడుల్లో చేపడుతున్న సంస్కరణల కారణంగా వచ్చే అదనపు ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటాన్ అకౌంట్లో పెట్టిన రూ.2.75 లక్షల కోట్ల బడ్జెట్‌ను మరో రూ.10 వేల కోట్ల నుంచి రూ.15 వేల కోట్ల వరకు పెంచుతూ పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. -
Union Budget 2024: సైబర్ చోరులూ... హ్యాండ్సప్!
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో 46 శాతం వాటా మనదే. వీటిలో ఏకంగా 80 శాతం యూపీఐ చెల్లింపులే. మరోవైపు సైబర్ నేరగాళ్లు కూడా అదే స్థాయిలో పేట్రేగిపోతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై పదేపదే సైబర్ దాడులు, చిరుతిళ్ల తయారీ దిగ్గజం హల్దీరామ్స్‌పై రాన్సమ్వేర్ దాడి వంటివి ఇందుకు కేవలం ఉదాహరణలే. గీత ఐదేళ్లలో మన దగ్గర సైబర్ దాడుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ఈ ఏడాది ఇప్పటిదాకా సగటున రోజుకు కనీసం 7,000 పై చిలుకు ఫిర్యాదులందాయి. వీటి వాస్తవ సంఖ్య ఇంకా భారీగా ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరాల్లో భారత్ ప్రస్తుతం ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. నానాటికీ తీవ్రరూపు దాలుస్తున్న ఈ బెడదకు అడ్డుకట్ట వేసే దిశగా 2024–25 కేంద్ర బడ్జెట్లో పలు చర్యలకు మోదీ ప్రభుత్వం ఉపక్రమించింది. సైబర్ భద్రతకు నిధులు పెంచింది. కీలకమైన ఆన్లైన్ వ్యవస్థలు, డేటా భద్రత, సైబర్ నేరాల కట్టడి, కృత్రిమ మేధలో పరిశోధనలకు రూ.1,550 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.238 కోట్లు కేంద్ర స్థాయిలో సైబర్ భద్రత, నేరాలకు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్–ఇన్)కు దక్కాయి. మొత్తమ్మీద సైబర్ భద్రత ప్రాజెక్టులకు రూ.759 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇవి ఏకంగా 90 శాతం అధికం కావడం విశేషం! సైబర్ సెక్యూరిటీ కృత్రిమ మేధ ప్రాజెక్టుల కోసం కేంద్ర హోం శాఖకు కేటాయించిన భారీ నిధుల్లోని మొత్తాలను వెచి్చంచనున్నారు. ఆ శాఖ అదీనంలో పని చేసే భారత సైబర్ నేరాల (కట్టడి) సమన్వయ కేంద్రం (ఐ4సీ) ఈ తరహా నేరాలపై ఉక్కుపాదం మోపే విషయంలో నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలకు పూర్తి సహాయ సహకారాలు అందించనుంది. కీలకమైన ఈ ఏజెన్సీకి ఈసారి నిధులను 84 శాతం పెంచారు. గతేడాది కేవలం రూ.86 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.150.95 కోట్లు వెచ్చించనున్నారు. సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్టులకు నిధులను 90 పెంచడమే గాక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సైబర్ దాడుల ముప్పు ఎదుర్కొన్నప్పుడు తక్షణం స్పందించి అప్రమత్తం చేసే హెచ్చరిక సంస్థ సెర్ట్–ఇన్‌కు కూడా నిధులు పెంచారు. మహిళలు, చిన్నారుల రక్షణకు.. మహిళలు, చిన్నారులు సైబర్ వలలో చిక్కుతున్న ఉదంతాలు పెరుగుతున్నందున వాటికి అడ్డుకట్ట వేయడంపైనా కేంద్రం దృష్టి సారించింది. అందుకోసం బడ్జెట్లో రూ.52.8 కోట్లు కేటాయించారు. డిజిటల్ వ్యక్తిగత సమాచార పరిరక్షణ చట్టం, 2023 కింద ఏర్పాటుచేసిన డాటా ప్రొటెక్షన్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు జీతభత్యాలు తదితరాల కోసం రూ.2 కోట్లు కేటాయించారు. ఏఐకి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు కృత్రిమ మేధ రంగం అభివృద్ధి, విస్తరణ కోసం వచ్చే ఐదేళ్లలో రూ.10,300 కోట్లు ఖర్చుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకోసం గత మార్చిలో ప్రారంభించిన ఇండియా ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్‌ను పరుగులు పెట్టించనున్నారు. ఇండియాఏఐ మిషన్‌కు ఈసారి రూ.551 కోట్లు కేటాయించడం ఇందులో భాగమే. మొత్తమ్మీద సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఇన్నోవేషన్‌కు ఈ బడ్జెట్లో రూ.840 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 84 శాతం ఎక్కువ! ఇక ఏఐ, మెషీన్ లెరి్నంగ్పై విస్తృత పరిశోధనలు చేస్తున్న ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ విభాగానికి రూ.255 కోట్ల నిధులిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వెల్లడించారు.ఫిర్యాదుల వరద... భారత్‌లో సైబర్ దాడుల ఉధృతి మామూలుగా లేదు. సొమ్ములు పోయాయంటూ జాతీయ సైబర్ దాడుల నమోదు పోర్టల్‌కు ప్రజలు, సంస్థల నుంచి రోజూ అందుతున్న 7,000 పై చిలుకు ఫిర్యాదుల్లో ఏకంగా 85 శాతం ఆన్లైన్ మోసాలే! మన దేశంలో ఆన్లైన్ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు 2019లో కేవలం 26 వేలు కాగా 2021లో 4.5 లక్షలకు, 2023 నాటికి ఏకంగా 15.5 లక్షలకు పెరిగాయి. ఇక ఈ ఏడాది మే నాటికే 7.4 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి! 2023లో భారత్‌లో ప్రతి 129 మందిలో ఒకరు సైబర్ దాడుల బారిన పడ్డట్టు మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, అనాలిసిస్ గణాంకాల్లో వెల్లడైంది. ఢిల్లీలో అత్యధికంగా ప్రతి లక్ష మందిలో 755 మంది సైబర్ బాధితులున్నారు. ఈ జాబితాలో హరియాణా (381) తర్వాత తెలంగాణ (261) మూడో స్థానంలో ఉంది.మన కంపెనీలే లక్ష్యం కొన్నేళ్లుగా భారత కంపెనీలే లక్ష్యంగా సైబర్ దొంగలు రెచి్చపోతున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో సైబర్ నేరగాళ్లకు భారతీయ కంపెనీలే రెండో అతిపెద్ద లక్ష్యంగా మారాయి. నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, రుణ, గేమింగ్, డేటింగ్ యాప్‌లతో పాటు ఆన్లైన్లో పదేపదే చూసే, వెదికే కంటెంట్‌ను ఎవరగా వేస్తూ మెల్లిగా ముగ్గులోకి దింపి ఖాతాల్లో ఉన్నదంతా ఊడ్చేసే ఘటనలు భారత్‌లో ఎక్కువైనట్టు పారికర్ సంస్థ హెచ్చరించింది. సైబర్ సెక్యూరిటీకి అందరికంటే ఎక్కువగా అమెరికా ఈ ఏడాది రూ.1.08 లక్షల కోట్లు వెచి్చస్తోంది. బ్రిటన్ రూ.7,891 కోట్లు కేటాయిస్తోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
తెలంగాణపై వివక్ష.. కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష చూపారంటూ రాష్ట్ర శాసనసభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడ్జెట్‌కు సవరణలు చేసి తెలంగాణకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బుధవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం ముగిశాక.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల చూపిన వివక్షపై విస్తృతంగా చర్చించారు. మంత్రి శ్రీధర్‌బాబు చర్చను ప్రారంభించగా.. తర్వాత కేటీఆర్, బీజేపీపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజిద్ హుస్సేన్ (ఎంఐఎం), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), వివేక్ వెంకటస్వామి (కాంగ్రెస్) తదితరులు మాట్లాడారు. చివరగా ఈ తీర్మానాన్ని శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం సభను స్పీకర్ ప్రసాద్‌కుమార్ గురువారానికి వాయిదా వేశారు. అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానం ఇదీ.. ‘‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం.. భారతదేశం అన్ని రాష్ట్రాల సమాఖ్య. అన్ని రాష్ట్రాల సమీకృత, సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఈ ఫెడరల్ స్ఫూర్తిని కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచీ ఇదే ధోరణి కొనసాగుతోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రెండు రాష్ట్రాల సుస్థిర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి. కానీ విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైంది. ఇది తెలంగాణ ప్రగతిపై తీవ్ర ప్రభావం చూపింది. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి, మంత్రులు పలు దఫాలుగా ప్రధాన మంత్రిని, ఇతర కేంద్ర మంత్రులను కలసి వివిధ విజ్ఞప్తులు చేశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరటంతోపాటు చట్ట ప్రకారం రావాల్సిన నిధులు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై అనేక అభ్యర్థనలు అందించారు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా.. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష చూపింది. తెలంగాణ పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై శాసనసభ తీవ్ర అసంతృప్తిని, నిరసనను తెలియజేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ చర్చల్లోనే కేంద్ర బడెŠజ్ట్కు సవరణలు చేసి.. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సభ తీర్మానం చేస్తోంది..’’ -
డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహకాలు తగ్గింపు
రూపే డెబిట్ కార్డ్‌లు, యూపీఐ ద్వారా చేసే డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారు. ఫిబ్రవరిలోని మధ్యంతర బడ్జెట్లో ప్రతిపాదించిన రూ.3,500 కోట్లతో పోలిస్తే ఇటీవల ప్రవేశపెట్టిన పూర్తికాల బడ్జెట్లో కేటాయింపులను రూ.1,441 కోట్లకు తగ్గిస్తున్నట్లు చెప్పారు.గత ఏడాది బడ్జెట్లో రూపే డెబిట్ కార్డులు, తక్కువ మొత్తంలో జరిగే బీహెచ్ఐఎం-యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు యూనియన్ రూ.2,485 కోట్లును కేటాయించారు. ఫిబ్రవరి, 2024లో విడుదల చేసిన మధ్యంతర బడ్జెట్లోనూ ఇందుకోసం రూ.3,500 కోట్లను ప్రతిపాదించారు. కానీ తాజా కేంద్ర పద్దుల లెక్కల్లో మాత్రం ఈ ప్రోత్సాహకాలను రూ.1,441 కోట్లకు తగ్గించారు.ఇదీ చదవండి: బడ్జెట్ 2024-25.. రియల్టీ ఇన్వెస్టర్లకు చుక్కెదురు..?బడ్జెట్లో కేంద్రం విడుదల చేసే డిజిటల్ పేమెంట్ ప్రోత్సాహక నిధులు ఫిన్‌టెక్, బ్యాంకింగ్ పరిశ్రమపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని థర్డ్‌పార్టీ పేమెంట్ యాప్‌లు ఈ విభాగంలో ఆధిపత్యం సాగిస్తున్నాయని ఆర్బీఐ హెచ్చరించింది. ఆ సంస్థలు అందించే సేవల్లో ఏదైనా అంతరాయం ఏర్పడినప్పుడు వినియోగదారులు ఇబ్బందులుపడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. భారతీయ వ్యాపారుల లావాదేవీలు 69 శాతం డిజిటల్ చెల్లింపుల ద్వారానే జరుగుతున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పాన్ షాపులు, పండ్లు, పూల విక్రయదారులు, ఫుడ్ స్టాల్స్, కిరాణా దుకాణాలు వంటి వీధి వ్యాపారులు కూడా డిజిటల్ పేమెంట్స్ మీద ఆసక్తి చూపుతున్నారు. రాబోయే రోజుల్లో డిజిటల్ లావాదేవీలు మరింత పెరుగుతాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
ఇక బీఎస్ఎన్ఎల్కు తిరుగుండదు!!
ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ పునర్వైభవాన్ని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రైవేటు టెలికం సంస్థలు టారిఫ్‌లను పెంచడంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. దీనికితోడు కేంద్ర బడ్జెట్లో అధికంగా నిధులు కేటాయించడంతో మరింత వినియోగదారులు ఇటువైపు వస్తారని ఇక తిరుగుండదని భావిస్తున్నారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెలికాం ప్రాజెక్ట్‌లు, ప్రభుత్వ రంగ సంస్థలకు రూ.1.28 లక్షల కోట్లు కేటాయించారు. మొత్తం కేటాయింపులో సింహభాగం నిధులు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంబంధిత ఖర్చుల కోసమే కేటాయించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, పునర్నిర్మాణం కోసం రూ.82,916 కోట్లు కేటాయించడం విశేషం.“బడ్జెట్ అంచనా 2024-25లో ఈ డిమాండ్ కోసం మొత్తం నికర కేటాయింపు రూ.1,28,915.43 కోట్లు ( రూ.1,11,915.43 కోట్లు, మరో రూ.17,000 కోట్లతో కలిపి). ఇందలో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ కింద లభించే నిల్వల నుంచి రూ.17,000 కోట్ల అదనపు కేటాయింపు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు పరిహారం, భారత్‌నెట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వంటి పథకాలకు ఉద్దేశించినది” అని బడ్జెట్ పత్రంలో పేర్కొన్నారు.ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి సిద్ధమైన బీఎస్ఎన్ఎల్ దీనికి ముందే యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసింది. 4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఇన్స్టాల్ చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న బీఎస్ఎన్ఎల్కు బడ్జెట్ కేటాయింపులు మరింత ఊపును ఇవ్వనున్నాయి. -
బడ్జెట్ 2024-25.. రియల్టీ ఇన్వెస్టర్లకు చుక్కెదురు..?
కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రసంగంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్థిరాస్తి విక్రయంపై సూచిక(ఇండెక్సెషన్)ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. రియల్ ఎస్టేట్ విక్రయాలకు సంబంధించిన దీర్ఘకాలిక మూలధన లాభం (ఎల్టీసీజీ)పై పన్నును 20 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గిస్తున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో రియల్టీ ఇన్వెస్టర్లకు తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదం ఉందని నిపుణులు భావిస్తున్నారు.ఇప్పటివరకు రియల్ఎస్టేట్ పెట్టుబడులపై ఇండెక్సేషన్‌ను సర్దుబాటు చేసి దానికి అనుగుణంగా ఆస్తి విక్రయం సమయంలో 20 శాతం పన్ను విధించేవారు. ఉదాహరణకు..20 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన స్థలాలను విక్రయించేపుడు ఆ ఇరవై ఏళ్లకు అనువుగా ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేసి(ఇండెక్సెషన్), ఆ స్థలానికి ప్రభుత్వ విలువను లెక్కించి దానిపై 20 శాతం పన్ను విధించేవారు. కొత్త నిబంధనల ప్రకారం..ఇండెక్సెషన్ను పూర్తిగా తొలగించారు. మార్కెట్ విలువ ప్రకారం స్థలాన్ని విక్రయిస్తే దానిపై 12.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు జులై 23, 2024 నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి చెప్పారు.ఇదీ చదవండి: క్లీన్ ఎనర్జీకి బడ్జెట్లో ప్రతిపాదనలు.. ఎవరికి లాభమంటే..ప్రస్తుత ఆస్తిని విక్రయించి, కొత్త దానిపై తిరిగి పెట్టుబడి పెట్టే వారికి కేంద్ర నిర్ణయం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రియల్టీ రంగం ఏటా చెందుతున్న అభివృద్ధి సూచీ ప్రకారం ఐదేళ్ల కంటే తక్కువ కాలవ్యవధితో ఇన్వెస్ట్ చేసే పెట్టుబడిదారులకు ప్రభుత్వ నిర్ణయం ప్రతికూలంగా ఉంటుందని నిపుణులు విశ్వసిస్తున్నారు. ఇదిలాఉండగా, కొత్త నిబంధనలు తక్షణం అమలులోకి వచ్చినప్పటికీ 2001కి ముందు ఉన్న పాత ఆస్తులకు ఇండెక్సేషన్ ప్రయోజనాలను తొలగించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఏపీకి కేంద్ర నిధులపై అసలు నిజాలు బయట పెట్టిన కృష్ణంరాజు
-
బడ్జెట్ ప్రకటన.. టాటా కంపెనీకి రూ.19,000 కోట్లు లాభం!
తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన టాటాకు చెందిన కంపెనీ టైటాన్‌కు ఒక్కరోజులో దాదాపు రూ.19,000 కోట్ల లాభాన్ని తెచ్చింది. బంగారం, వెండిపై దిగుమతి పన్నును 6% తగ్గించడంతో టైటాన్ షేర్లు దాదాపు 7% పెరిగాయి. టాటా గొడుగు కింద ఉన్న జువెలరీ సంస్థ టైటాన్ బ్రాండ్ తనిష్క్ కారణంగా దాని స్టాక్ విలువలో వృద్ధిని సాధించింది.బీఎస్ఈ డేటా ప్రకారం, టైటాన్ షేరు 6.63 శాతం పెరిగి రూ.3,468.15 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సెషన్లో, షేర్లు 7.30% పెరుగుదలతో ఒక రోజు గరిష్ట స్థాయి రూ.3,490కి చేరుకున్నాయి. ప్రారంభంలో టైటాన్ షేర్లు రూ.3,252 వద్ద ప్రారంభమయ్యాయి. రానున్న రోజుల్లో కంపెనీ షేర్లు మరింత పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు.పెట్టుబడిదారుల ధృక్కోణంలో ఇది చాలా లాభదాయకం. ఉదాహరణకు, ఒక వ్యక్తి 10,000 టైటాన్ షేర్లను కలిగి ఉంటే, ఒక్కో షేరుకు రూ. 215.55 పెరుగుదలతో, వారు ఆ 10,000 షేర్లపై రూ.21,55,500 లాభం పొందుతారు. గతంలో టైటాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,88,757.16 కోట్లుగా ఉండగా, మంగళవారం (జూలై 23) నాటికి రూ.3,07,897.56 కోట్లకు పెరిగింది. అంటే కంపెనీ వాల్యుయేషన్ రూ.19,140.4 కోట్లు పెరిగింది.బంగారం, వెండిపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 6 శాతానికి, ప్లాటినంపై 6.4 శాతానికి తగ్గించాలని తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. బంగారం, వెండి, ప్లాటినంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలన్నది రత్నాలు, ఆభరణాల పరిశ్రమ నుంచి చాలా కాలంగా ఉన్న డిమాండ్. ఈ నిర్ణయం తర్వాత, దేశ ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధరలు 5% పైగా తగ్గాయి. ట్రేడింగ్ సెషన్లో వెండి రూ. 5,000 పైగా క్షీణించింది. -
KSR Live Show: కేసుల భయం.. బాబు సైలెంట్.. బడ్జెట్ లో ఏపీ కి టోపీ..
-
నిర్మలమ్మ తక్కువసేపు చదివిన పద్దుల చిట్టా.. (ఫొటోలు)
-
క్లీన్ ఎనర్జీకి బడ్జెట్లో ప్రతిపాదనలు.. ఎవరికి లాభమంటే..
దేశీయంగా చిన్న, మధ్య తరహా న్యూక్లియర్ రియాక్టర్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపడుతామని బడ్జెట్ సమావేశాల్లో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు. 2070 నాటికి జీరో ఉద్గారాలతో క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.న్యూక్లియర్ రియాక్టర్ల ద్వారా విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం, ప్రైవేట్ కంపెనీలు కలిసి పనిచేయాలని సూచించారు. భారతీయ మార్కెట్‌పై దృష్టి సారించే విదేశీ కంపెనీలు ఈ రంగంలో అభివృద్ధి చెందేందుకు చాలా అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్లో ప్రతిపాదించిన ‘భారత్ స్మాల్ రియాక్టర్లు’, ‘భారత్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల’కు సమీప భవిష్యత్తులో చాలా గిరాకీ ఏర్పడుతుందంటున్నారు. బడ్జెట్లో ప్రకటించిన విధంగా న్యూక్లియర్ టెక్నాలజీలో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు ప్రభుత్వం నిధులు అందుబాటులో ఉంచుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.కార్బన్ నిర్మూలన ప్రణాళికల్లో భాగంగా అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే 1000 MWe(మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కెపాసిటీ) సామర్థ్యం ఉన్న సంప్రదాయ అణు కర్మాగారాలు భారీ ఇంజినీరింగ్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. భద్రతా సమస్యల కారణంగా భూమి లభ్యత, స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇదీ చదవండి: కేంద్ర మంత్రుల జీతాలకు కేటాయింపులుఇదిలాఉండగా, వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ ప్రకారం 300 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యం ఉండే వాటిని స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లగా నిర్వచించారు. వీటిని ఏర్పాటు చేసేందుకు తక్కువ సమయమే పడుతుంది. వీటి ద్వారా వచ్చే విద్యుత్తును సులభంగా సరఫరా చేయవచ్చు. మాడ్యులర్ డిజైన్ ప్లాంట్లను రిమోట్ ఏరియాల్లో నిర్మించేలా అనుమతులు కూడా త్వరితగతినే లభిస్తాయి. అందుకే ప్రభుత్వం బడ్జెట్లో ఈమేరకు ప్రతిపాదనలు చేసినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ రియాక్టర్ల నిర్మాణం, ఇంజినీరింగ్ టెక్నాలజీ, విద్యుత్ పరికరాలు, భద్రత సేవలందించే సంస్థలు ప్రభుత్వ నిర్ణయంతో లాభపడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. -
‘వందేభారత్‌పైనే శ్రద్ధనా?’ రైల్వే మంత్రి ఏమన్నారంటే..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన 2024-25 బడ్జెట్లో ఉద్యోగ కల్పన, గ్రామీణాభివృద్ధిపై అధికంగా దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. ఆర్థిక మంత్రి తన 83 నిమిషాల సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంలో రైల్వే అనే పదాన్ని ఒక్కసారి మాత్రమే ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వం రైల్వేలకు ఏమి చేస్తున్నదనే ప్రశ్న పలువురి మదిలో మెదిలింది. అలాగే ప్రభుత్వం వందేభారత్‌పై పెడుతున్న శ్రద్ధ.. పేదల రైళ్ల విషయంలో పెట్టడం లేదంటూ పలు ఆరోపణలు వినవస్తున్నాయి. వీటిపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు.బడ్జెట్ వెలువడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో తక్కువ ఆదాయవర్గానికి చెందినవారు అధికంగా ఉన్నారని, వీరికి సంబంధించిన రైళ్ల విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. అటు వందేభారత్పైన, ఇటు సాధారణ ప్రయాణికులు రైళ్లపైన కూడా దృష్టి పెడుతున్నదన్నారు. రైలును రూపొందించే విధానం ప్రతి రైలుకు ప్రామాణికంగా ప్రత్యేకంగా ఉంటుందని, దానికి అనుగుణంగా నిర్దిష్ట సంఖ్యలో ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు, నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు ఉంటాయన్నారు. అల్ప ఆదాయ వర్గానికి చెందినవారు తక్కువ చార్జీలకే ప్రయాణించేలా చూడటమే రైల్వేల ప్రధాన లక్ష్యమన్నారు. దేశంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, డబ్లింగ్‌లో గణనీయమైన పెట్టుబడితో సహా గత ఐదేళ్లలో రైల్వేలపై మూలధన వ్యయం 77 శాతం పెరిగిందని 2023-24 ఆర్థిక సర్వే తెలిపిందన్నారు. 2014కు ముందు రైల్వేలకు మూలధన వ్యయం సుమారు రూ. 35,000 కోట్లు అని, నేడు ఇది రూ. 2.62 లక్షల కోట్లు అని, ఈ తరహా పెట్టుబడులు పెట్టినందుకు ప్రధానికి, ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు చెబుతున్నానని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. -
పాత పన్ను విధానం రద్దు? ఆర్థిక మంత్రి చెప్పిందిదే..
Union Budget 2024: పన్ను చెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూసిన 2024-25 కేంద్ర బడ్జెట్‌ను ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించేలా కొన్ని చర్యలను ఈ బడ్జెట్లో ఎన్డీఏ సర్కారు ప్రకటించింది.ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి పాత పన్ను విధానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తుందా అనుమానం సర్వత్రా నెలకొంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పాత పన్ను విధానాన్ని ఎప్పుడు రద్దు చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక మంత్రి తెలిపారు."పాత పన్ను విధానాన్ని ఏం చేయాలన్నదానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పన్ను విధానాన్ని సరళీకృతం చేయాలన్నదే మా ఉద్దేశం అని మాత్రమే చెప్పగలం. పాత పన్ను విధానం ఉంటుందో లేదో చెప్పలేను" అన్నారామె.కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహిస్తూ తాజా బడ్జెట్లో పలు ప్రయోజనాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ రూ. 50,000 నుంచి రూ. 75,000కి పెంచడం, స్లాబ్‌లను విస్తరించడం వంటివి ఉన్నాయి. దీంతో జీతం పొందే పన్ను చెల్లింపుదారులు సంవత్సరానికి రూ.17,500 వరకు ఆదా చేసుకోవచ్చని ఆమె చెప్పారు.కొత్త పన్ను విధానాన్ని 2020లో ప్రవేశపెట్టారు. గత సంవత్సరం బడ్జెట్లో దీన్ని డిఫాల్ట్ చేశారు. పాత పన్ను విధానం ఇంటి అద్దె, సెలవు ప్రయాణ భత్యాలు, అలాగే సెక్షన్లు 80C, 80D, 80CCD(1b), 80CCD(2) కింద తగ్గింపులతో సహా అనేక తగ్గింపులు, మినహాయింపులను అందిస్తుంది. కొత్త పన్ను విధానంలో ఈ మినహాయింపులు, తగ్గింపులు లేవు.