Vijay
-
హీరోల్లో రెబల్ స్టార్ టాప్ ప్లేస్.. హీరోయిన్లలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతినెల సినీస్టార్స్‌కు సంబంధించిన రేటింగ్స్ ఇస్తోంది. ఎప్పటిలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన మోస్ట్ పాపులర్ హీరో, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. హీరోల్లో తొలిస్థానంలో రెబల్ స్టార్ నిలవగా.. నటీమణుల్లో సమంత టాప్ ప్లేస్ దక్కించుకుంది. హీరో, హీరోయిన్లకు సంబంధించి టాప్-10 ర్యాంకులను వెల్లడిస్తూ పోస్టర్స్‌ను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది.హీరోల్లో ప్రభాస్ తర్వాత విజయ్, షారూఖ్ ఖాన్, జూనియర్ ఎన్టీఆర్, అజిత్ కుమార్ తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. ఆ తర్వాత వరసగా అల్లు అర్జున్, మహేశ్ బాబు, సూర్య, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. ఇక హీరోయిన్ల విషయానికొస్తే ఇటీవల హన్నీ బన్నీ ప్రేక్షకులను అలరించిన సమంత టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత ఆలియా భట్, నయనతార, దీపికా పదుకొణె, త్రిష టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు. కాజల్ అగర్వాల్, శ్రద్దాకపూర్, సాయిపల్లవి, రష్మిక, కత్రినా కైఫ్ టాప్ టెన్‌లో నిలిచారు.Ormax Stars India Loves: Most popular female film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/aa6SKu5kZB— Ormax Media (@OrmaxMedia) November 21, 2024Ormax Stars India Loves: Most popular male film stars in India (Oct 2024) #OrmaxSIL pic.twitter.com/t1qOxTGkKo— Ormax Media (@OrmaxMedia) November 21, 2024 -
విజయ్ సినిమాలో రోల్.. ఎందుకు వెనక్కి తగ్గారో తెలీదు: శివరాజ్ కుమార్
ది గోట్ సూపర్ హిట్ తర్వాత విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం దళపతి69. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నికల పోటీకి ముందు విజయ్ కెరీర్లో ఇదే చివరి చిత్రం కానుంది. అయితే ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ విపిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ఈ వార్త తెగ వైరలవుతోంది.అయితే ఈ వార్తలపై తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పందించారు. దళపతి69 మూవీ డైరెక్టర్‌తో తాను మాట్లాడిన మాట వాస్తవమేనని తెలిపారు. దర్శకుడు హెచ్ వినోద్ బెంగళూరులో తనను వ్యక్తిగతంగా కలిశాడని.. అంతేకాకుండా నా పాత్రకు సంబంధించి వివరించాడని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అదొక అద్భుతమైన రోల్ అని అన్నారు.అయితే మళ్లీ కొద్ది రోజుల తర్వాత వినోద్ మరోసారి తనతో భేటీ అయ్యారని శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఈ రోల్ ప్రస్తుతానికి వర్కవుట్ కాదని వివరించారని.. మీకోసం భవిష్యత్తులో మరో ఆఫర్‌తో వస్తానని చెప్పాడని శివరాజ్ అన్నారు. అయితే అసలేం జరిగిందో.. ఆఫర్‌ను ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారో కారణాలు మాత్రం తెలియదన్నారు. ఈ ఆఫర్ రాకపోయినప్పటికీ నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని శివరాజ్ కుమార్ తెలిపారు. కాగా.. ఇవాళ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం బైరాతి రనగల్ థియేటర్లలో విడుదలైంది.కాగా.. శివరాజ్ కుమార్‌కు కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా పేరుంది. శాండల్‌వుడ్‌తో పాటు తమిళ సినిమాలలో అనేక చిత్రాలలో నటించారు. మరోవైపు రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మూవీలో శివరాజ్ కుమార్ కనిపించనున్నారు. అంతేకాకుండా మంచు విష్ణు కన్నప్పలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితో పాటు కన్నడ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం శస్త్రచికిత్స కోసం వచ్చేనెల డిసెంబర్లో యుఎస్ వెళ్తున్నట్లు శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుంటున్నట్లు వివరించారు. జనవరి 2025లో ఇండియాకు తిరిగి వచ్చాక సినిమాల్లో నటిస్తానని తెలిపారు. -
హీరో విజయ్‌కు ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్
జట్టుగా వచ్చినా.. సింగిల్‌గా వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్టార్ హీరో విజయ్‌కు పరోక్షంగా సవాల్ విసిరారు ఈ యువనేత. వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని దీమా ప్రదర్శించారు. హీరో విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తొలి బహిరంగ సభలో తమపై పరోక్షంగా విమర్శలు చేసిన విజయ్‌పై డీఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్‌కు కౌంటర్ ఇచ్చారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా తమకు తిరుగులేదని, 2026లోనూ తిరిగి అధికారంలోకి వస్తామంటూ ‘దళపతి’కి పరోక్షంగా జవాబిచ్చారు. తంజావూరులో గురువారం జరిగిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు.తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. అక్టోబరు 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో మానాడు పేరుతో మొదటి బహిరంగ సభ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని ఇన్‌డైరెక్ట్‌గా స్టాలిన్ ఫ్యామిలీపై ఎటాక్ చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలను వదిలేసి తమను మాత్రమే విమర్శించడంతో విజయ్‌పై డీఎంకే నాయకులు మాటల దాడి పెంచారు.ఎంత మంది వచ్చినా మాదే గెలుపుఅయితే తమిళనాడు ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఎంత మంది వచ్చినా డీఎంకే నీడను కూడా తాకలేరని తాజాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రజారంజక పాలన అందిస్తున్నామని, 2026 లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడోసారి డీఎంకే పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని వ్యతిరేకించేవారంతా జట్టు కట్టినా.. ఢిల్లీ నుంచి వచ్చినా, స్థానికంగా ఏ దిక్కు నుంచి వచ్చినా డీఎంకేనే గెలుస్తుంది. మా పార్టీని నాశనం చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతార’ని వార్నింగ్ ఇచ్చారు. కాగా, విజయ్ను ఉద్దేశించే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారని తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే విక్రవండిలో మానాడు సభ సందర్భంలో విజయ్‌కు ఉదయనిధి శుభాకాంక్షలు చెప్పడం విశేషం.చదవండి: హీరో విజయ్.. రాజకీయ ప్రవేశం ఇండియా కూటమికే లాభంవిజయ్ ఓడిపోతాడు..మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ.. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం పార్టీకి గెలుపు అవకాశాలు లేవని, విజయ్ కూడా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. మదురైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదన్నారాయన.చదవండి: ‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?69 సినిమాపై విజయ్ ఫోకస్కాగా, విజయ్ ప్రస్తుతం తన 69 సినిమాపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో ఇదే ఆయన అఖరి సినిమాగా ప్రచారం జరుగుతోంది. దళపతి రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా ఉంటుందని టాక్. హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. -
విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. రజినీకాంత్ సోదరుడు షాకింగ్ కామెంట్స్!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రి కజగం పేరిట పార్టీని కూడా స్థాపించారు. ఇటీవల ఆయన నిర్వహించిన తొలి రాజకీయ సభకు దాదాపు పది లక్షలకు పైగా ప్రజలు, అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. అయితే విజయ్ పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. అతన్ని రానివ్వండి.. గతంలో మక్కల్ నీది మయ్యం పార్టీతో కమల్ హాసన్ కూడా వచ్చాడు. అలాగే విజయ్ కూడా ప్రయత్నించనివ్వండని అన్నారు.విజయ్ గెలుపు అసాధ్యంకానీ తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడం అంత సులభం కాదని సత్యనారాయణ రావు అన్నారు. విజయ్ అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విజయ్ శతవిధాల ప్రయత్నించినా తమిళనాడులో గెలవలేడని షాకింగ్ కామెంట్స్ చేశారు.సత్యనారాయణ రావు మాట్లాడుతూ.. "ఆయనకు రాజకీయ ఆశయాలు ఉన్నాయి. అందుకే ఈ రంగంలోకి దిగాడు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఏం చేస్తాడో నాకైతే కచ్చితంగా తెలియదు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలవడని నేను గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే అది చాలా కష్టం' అని అన్నారు. కాగా.. విజయ్ చివరిసారిగా ది గోట్ మూవీతో అభిమానులను అలరించాడు. త్వరలోనే మరో మూవీలో ఆయన నటించనున్నారు. -
‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?
‘సామాజిక స్పృహ టు రాజ్యాధికారం, వయా సినిమా.’ తమిళనాట ఏడున్నర దశాబ్దాలుగా రాజ్యమేలుతున్న రాజకీయ ఫార్ములా! సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని యత్నించి వెనకడుగు వేసిన చోట, సినీ తుఫాన్ విజయ్‌కాంత్ రాజకీయంగా మెరుపు మెరిసి కనుమరుగైన చోట, మరో దిగ్గజ నటుడు కమల్‌హాసన్ పార్టీ పెట్టి ఇప్పటికీ నిలదొక్కుకోలేకపోతున్న చోట... ఇంకో నటుడు ‘దళపతి’ విజయ్ కొత్త పార్టీ పెట్టారు. ‘‘మారా ల్సింది సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్కటేనా? రాజకీయాలు కూడా మారాలి’’ అన్న ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో హోరెత్తాయి. రజనీకాంత్ తర్వాతి తరంలో అత్యధిక అభిమాన గణం ఉన్న నటుడిగా గుర్తింపు పొందిన విజయ్ ఆగమనం తమిళనాడు రాజకీయాల్లో మార్పు తెస్తుందా?తమిళ నటుడు విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘తమిళగ వెట్రి కజగం’ (టీవీకే) పేరిట కొత్త పార్టీని ప్రకటించి, అక్టోబరు 27న విక్రవండిలో మొదటి బహిరంగ సభ నిర్వహించారు. ఒక ఎంజీఆర్, ఒక కరుణానిధి, ఓ జయ లలిత... సినీరంగ నేపథ్యంతో రాజకీయాలకు వచ్చి, తమదైన ముద్ర వేయడమే కాకుండా తమిళనాడు సామాజికార్థిక, రాజకీయ స్థితి గతుల్నే మార్చిన చరిత్ర కొనసాగింపే తాజా పరిణామం. తీవ్రమైన భావోద్వేగాలకు నెలవైన తమిళ నేలలో ‘దళపతి’ ప్రభావమెంత? ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడు రాజకీయాలు భిన్నమైనవి. అసెంబ్లీలో ప్రత్యర్థి సభ్యులు భౌతికదాడికి పాల్పడి అవమానించినపుడు, ‘ఒక్క డీఎంకే సభ్యుడు కూడా లేని సభకే మళ్లీ వస్తా’నని దివంగత ముఖ్యమంత్రి జయలలిత శపథం చేస్తే, అటువంటి సభనే ఏర్పరచిన తమిళ తీర్పు ఒక భావోద్వేగ చరిత్ర! ఆత్మ గౌరవ ఉద్యమాన్ని, జస్టిస్ పార్టీని కలిపి 1944లో రామస్వామి పెరియార్ ‘ద్రావిడర్ కజగం’ (డీకే) ఏర్పాటు చేశారు. అర్ధ శతాబ్ధానికి పైగా తమిళనాడును పాలిస్తున్న ద్రవిడ కజగం పార్టీలన్నీ ఈ డీకే నుంచి పుట్టినవే! పెరియార్‌తో విబేధాలు రావడంతో డీకే నుంచి బయటకొచ్చిన అన్నాదురై... 1949లో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) స్థాపించారు. ద్రవిడ సిద్ధాంతాల ప్రకారం బ్రాహ్మణులు,కాంగ్రెస్, బీజేపీ ఉత్తరాది ఆర్యుల పార్టీల పెత్తనం చెల్లదు. అన్నాదురై తర్వాత డీఎంకేలో ఉంటూ ద్రవిడ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రచయిత కరుణానిధి 1969లో ముఖ్యమంత్రి అయ్యారు. కరుణానిధి తన గురువు అన్నాదురై సిద్ధాంతాలకు విరు ద్ధంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ... నటుడు ఎంజీ రామచంద్రన్ డీఎంకే నుంచి బయటకు వచ్చి 1972లో అన్నా డీఎంకే పార్టీని స్థాపించారు. ఆ రోజుల్లో నటునిగా తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన ఎంజీఆర్, 1977లో అన్నాడీఎంకేని గెలిపించి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఎంజీఆర్ వారసత్వాన్ని జయలలిత కొనసాగించారు. డీఎంకే, అన్నా డీఎంకేలు కేంద్ర ప్రభుత్వాలకు అవసరమైనపుడు ఆ మేరకు మద్దతునిచ్చినా... తమిళనాడులో ఆ యా జాతీయ పార్టీలు బలపడ కుండా అవి నివారించగలిగాయి. దీంతో 5 దశాబ్దాలుగా అక్కడి రాజకీయాలు డీఎంకే వర్సెస్ అన్నా డీఎంకేగా నడుస్తున్నాయి. ఎంజీఆర్ స్ఫూర్తితో చాలామంది నటులు రాజకీయ ప్రవేశం చేశారు కానీ, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ మినహా ఎవరూ అంతటి విజయం సాధించలేకపోయారు. ఎంజీఆర్ కొత్త పార్టీ పెట్టడానికి ముందు నటించిన సినిమాలను తన రాజకీయ ఆశయాలను ప్రచారం చేయడానికి వాడుకున్నారు. ఇటీవల విజయ్ సినిమాల్లో కూడా ఇదే తంతు కనిపించింది. 2018లో విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో... హీరో రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని చూసి షాక్ తిని, రాజకీయ నాయకుడిగా మారుతాడు. ఈ సినిమాలోనే, ఆ సమయంలో అధి కారంలో ఉన్న అన్నాడీఎంకేను అవమానించేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. కానీ, మొదటి బహిరంగ సభలో విజయ్ అన్నాడీఎంకేను ఒక్కమాటా అనలేదు! ఇటీవల విడుదలైన పలు చిత్రాల్లో పరోక్షంగా పంచ్ డైలాగ్స్‌తో డీఎంకేను విమర్శించారు. పెరియార్, అన్నా పేర్లను స్మరిస్తూ ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని విమర్శిస్తూ, ఆ పార్టీయే మన శత్రువని విజయ్ ప్రకటించారు. హేతువాది పెరియారే తన పార్టీకి విధాన మార్గదర్శి, కానీ పెరియార్ నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రమే తాము అంగీకరించమని చెప్పారు. ఈ విషయంలో ‘ఒకటే వంశం – ఒకటే దేవుడు’ అన్న ‘అన్నా’ సూత్రాన్ని పాటిస్తామన్నారు. విధానపరంగా తమ సిద్ధాంతంలో ద్రవిడ, తమిళ జాతీయవాదం మధ్య విభజన లేదని వ్యాఖ్యానిస్తూ, ఆ రెండూ తనకు రెండు కళ్ళు అని చెప్పారు. పరస్పర విరుద్ధాంశాలపై అభిప్రాయానికి పొంతన లేకపోవడంతో విజయ్ సిద్ధాంతాల్లో స్పష్టత కొరవడినట్టు కనిపిస్తోంది. పార్టీల పేర్లను ప్రస్తావించకుండా, మతోన్మాద బీజేపీ తమ సైద్ధాంతిక ప్రత్యర్థిగా చెప్పినప్పటికీ, డీఎంకేకు వ్యతిరేకంగా మాట్లాడి నంతగా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడకపోవడం పలు ఊహాగానా లకు ఆస్కారం కల్పిస్తోంది. కుల గణన నిర్వహించాలనీ, విద్య ఉద్యో గాల్లో దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించాలనీ చెప్పిన విజయ్, మైనారిటీల గురించి, వారి భద్రత గురించి ఎక్కడా ప్రస్తావించక పోవడమే ఆయనలోని ద్వైదీభావనకు నిదర్శనం! పలు తమిళ ఫ్యాన్ పేజీల్లో ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్‌తో విజయ్‌కు పోలికలు తేవడం చూడొచ్చు. వీరిరువురు ఒకరి సినిమాలు ఇంకొకరు రీమేకులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా కూడా ఇలాంటి రీమేక్ జరుగుతుందనే చర్చను అభిమానులు తెరపైకి తెస్తున్నారు. విజయ్, పవన్ మధ్య సామ్యాలు ఉన్నన్ని వైరుధ్యాలు కూడా ఉన్నాయి. పైగా, తెలుగు, తమిళ రాజకీయాలకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని గమనించాలి. ఏపీలో జనసేన అధికార భాగస్వామ్య పక్షమైన ప్పటికీ, వాస్తవానికి ఆ పార్టీ ఇప్పటికీ క్షేత్రస్థాయిలో బలపడలేదు. ఎన్నికల ఫలితాల్లో నూరు శాతం సక్సెస్ రేట్ సాధించినప్పటికీ, పకడ్బందీ పార్టీ వ్యవస్థ ఏర్పడలేదు. రాజకీయ సిద్ధాంత విధానా ల్లోనూ స్పష్టత లేదు. విజయ్ టీవీకేకూ ఇదే వర్తిస్తుంది. ఎంజీఆర్ పార్టీ పెట్టడానికీ, ఇతర నటులు పార్టీ పెట్టడానికీ తేడా ఉంది. ఎంజీఆర్ డీఎంకేను విడిచిపెట్టినప్పుడు, ఆయన అప్పటికే పార్టీలో నంబర్ త్రీగా ఉన్నారు. పదేళ్లు శాసనసభ అనుభవం గడించి ఉన్నారు. డీఎంకే కోశాధికారిగా పనిచేశారు. తమిళనాడులో కొత్త పార్టీలు పెట్టడానికి ఎవరో ఒకరి సపోర్ట్ ఉంటుందనే వాదన ఉంది. ఎంజీఆర్ వెనుక ఇందిరాగాంధీ ఉన్నారు. కొంతమేరకు విజయం సాధించగలిగిన నటుడు విజయకాంత్ వెనక పన్రుటి ఎస్. రామచంద్రన్ వంటి అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు ఉన్నారు. మరి, విజయ్ వెనుక కూడా ఎవరైనా ఉండొచ్చు అనే అనుమానా లున్నాయి. ‘‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మాకే మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. భావసారూప్య పార్టీలతో పొత్తులకు, కూటమి ఏర్పాట్లకూ సిద్ధమే. మాతో పొత్తు పెట్టుకున్న వారినే అధికారంలో భాగస్వాము లను చేస్తాం’’ అని విజయ్ చెప్పారు. కానీ, సోషల్ మీడియాను దాటి క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తే మెజారిటీ సులభంగా కనిపించదు. మరోవైపు, అన్నాడీఎంకే ముందు పరోక్షంగా పొత్తు సంకేతాలు ఉంచి నట్లయ్యింది. ఒకవేళ ఆయన అన్నాడీఎంకేతో కలిసి నడిస్తే కూటమిగా విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 2021లో అధికార డీఎంకే 37.7 శాతం ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే 33.29 శాతం ఓట్లు సాధించింది. విజయ్ పార్టీ వచ్చే రెండేళ్లు క్షేత్రస్థాయిలో ఉంటే 7 శాతం వరకు ఓట్లు సాధించవచ్చు. అంటే, విజయ్ అన్నా డీఎంకేతో కలిస్తే, డీఎంకేకు నష్టం కలుగుతుంది. ఒకవేళ ఒంటరిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి, డీఎంకేకు లబ్ధి చేకూరుతుంది. అందుకే ఉభయ ద్రవిడ పార్టీలు విజయ్ అడుగులనూ, ఆయనకు లభించే ప్రజాదరణనూ జాగ్రత్తగా గమనిస్తున్నాయి.దిలీప్ రెడ్డి వ్యాసకర్త ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్ -
జమిలి ఎన్నికలపై విజయ్ పార్టీ కీలక నిర్ణయం
చెన్నై: సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాట రాజకీయం హీటెక్కింది. తాజాగా టీవీకే పార్టీ అధినేత విజయ్.. స్టాలిన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ మేరకు టీవీకే(తమిళిగా వెట్రి కగజం) పార్టీ తీర్మానం కూడా చేయడం విశేషం.దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ.. జమిలి ఎన్నికలు సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు చెన్నైలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ ఎజెండాను ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న విషయంపై చర్చించారు. ఇదే సమయంలో జమిలి ఎన్నికలకు తమ పార్టీ వ్యతిరేకమని విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే, నీట్ పరీక్షపై కూడా తాజాగా తీర్మానం చేశారు.ఇదే సమయంలో తమిళనాడులోకి స్టాలిన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు విజయ్. రాష్ట్రంలో అబద్దపు హామీలు ఇచ్చి స్టాలిన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. కులగణన ప్రక్రియ జాప్యంపై అధికార డీఎంకే వైఖరిని తప్పుబట్టారు. ఇక, తమిళనాడులో ద్విభాషా సిద్ధాంతమే అమలులో ఉండాలని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో హిందీ అమలుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో హిందీకి రాష్ట్రంలో చోటులేదని స్పష్టం చేశారు. కేంద్రం పెత్తనం లేకుండా రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇటీవలే విజయ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజకీయ ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా టీవీకే పార్టీ పోటీపై క్లారిటీ ఇచ్చారు. తమిళనాడు 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. అలాగే, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో మహిళలకే తమ పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. -
‘నటుడు విజయ్.. రాజకీయ ప్రవేశం ఇండియా కూటమికే లాభం’
చెన్నై: తమిళగ వెట్రి కజగం(టీవీకే)చీఫ్, నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావటంకాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రయోజనకరమని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ)అధ్యక్షుడు కె సెల్వపెరుంతగై అన్నారు. ఇండియా కూటమి మిత్రపక్షాలకు నటుడు విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇవ్వటంపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘‘విజయ్ రాజకీయ ప్రవేశం రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయ రంగంలో ఎటువంటి మార్పులు తీసుకురాదు. ఆయన రాజకీయ ప్రవేశం ఇండియా కూటమి విజయానికి ఉపయోగపడుతుంది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లను, ముఖ్యంగా ప్రతిపక్ష ఓట్లను విజయ్ పార్టీ చీల్చుతుంది. విజయ్ అధికార భాగస్వామ్యం ఆఫర్ ఇండియా కూటమి మిత్రపక్షలు ఎటువంటి అలజడికి గురికాలేదు. ఇండియా కూటమి బలంగానే ఉంది. కాంగ్రెస్ 2004-2014 మధ్య కేంద్రంలో అధికారాన్ని పంచుకుంది. దాని ఆధారంగా.. మేం అధికారం పంచుకునే ఆలోచనతో అంగీకరిస్తున్నాం. అయితే అధికారాన్ని పంచుకోవడంపై జాతీయ నాయకత్వందే తుది నిర్ణయం. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ మద్దతుతో మాత్రమే ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఏర్పడింది. సోనియా గాంధీ మార్గదర్శకత్వంలో.. ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకేకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇచ్చింది. అధికారంలో వాటా కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసి ఉంటే అప్పటి సీఎం కరుణానిధి ఇచ్చి ఉండేవారు. కానీ కాంగ్రెస్ అధికారంలో వాటా కోరలేదు. అధికార భాగస్వామ్యం ప్రజల ఆదేశంపై ఆధారపడి ఉంటుంది. ప్రతి రాజకీయ పార్టీ అధికారం చేజిక్కించుకోవాలని కోరుకుంటుంది. మేం తమిళనాడులో కామరాజ్ పాలనను ప్రారంభిస్తాం’ అని అన్నారు. -
కేటీఆర్ బావమరిది పార్టీ కేసు.. విజయ్ మద్దూరి ఇంట్లో సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన జన్వాడ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడైన విజయ్ మద్దూరి ఇంట్లో మోకిల పోలీసులు సోదాలు చేపట్టారు. రాజ్‌పాకాల ఫాంహౌజ్ పార్టీలో విజయ్ మద్దూరి కొకైన్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. సోమవారం విచారణకు విజయ్ హాజరుకాలేదు. పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.ఈ కేసులో కొకైన్ పాజిటివ్ వచ్చిన విజయ్ మద్దూరికి సంబంధించిన డ్రగ్ టెస్ట్ కిట్‌తోపాటు ఆయన ఫోన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే ఆ పార్టీలో పాల్గొన్న ఓ మహిళ తన ఫోన్ సీజ్ చేశారని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. కేసు కోర్టు పరిధిలోకి ఉన్నందున కోర్టు అనుమతి తర్వాత ఫోన్‌ను తిరిగిస్తామని వెల్లడించారు. విజయ్ను అదుపులోకి తీసుకునే సమయంలో ఆయన తన ఫోన్‌కు బదులు పక్కన ఉన్న మహిళ ఫోన్‌ను ఇచ్చారు. విజయ్ మద్దూరి సెల్‌ఫోన్ సీజ్ చేసేందుకు పోలీసులు వచ్చినట్లు సమాచారం.కాగా, అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహించారనే కారణంతో రాజ్ పాకాల (51)తోపాటు, కొకైన్ తీసుకున్నట్టు నిర్ధారణ అయిన విజయ్ మద్దూరి (56)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి విజయ్ మద్దూరికి 41 సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు ఇచ్చి, స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. విచారణ నిమిత్తం సోమవారం పోలీస్‌స్టేషన్‌కు రావాలని వారు సూచించినా.. ఆయన సాయంత్రం వరకు కూడా స్టేషన్‌కు రాలేదు. ఇక శనివారం రాత్రి పార్టీ నుంచి వెళ్లిపోయిన రాజ్ పాకాల అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలో మోకిల పోలీసులు సోమవారం దర్యాప్తు కోసం రాయదుర్గంలోని రాజ్ పాకాల నివాసానికి వెళ్లారు. తాళం వేసి ఉండటంతో ఇంటి బయట నోటీసులు అతికించారు. -
విజయ్ అద్భుతం చేస్తాడా?
-
‘విజయ్ పార్టీది.. కాపీ, కాక్టెయిల్ భావజాలం’
చెన్నై: తమిళనాడు స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనుంది. ఈ సందర్భంగా ఆదివారం విల్లుపురంలో నిర్వహించిన సభలో.. టీవీకే పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరైన విషయం తెలిసిందే.అయితే.. తాజాగా రాజకీయాల్లో విజయ్ చెప్పిన భావజాలాన్ని డీఎంకే పార్టీ కొట్టిపారేసింది. ఆయన పార్టీ సిద్ధాంతాలపై అధికార డీఎంకే పార్టీ నేత విమర్శలు గుప్పించారు. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని ఇతర పార్టీల నుంచి కాపీ కొట్టారని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. విజయ్ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం.. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే, ఇతర పార్టీల ప్రస్తుత రాజకీయ దృక్కోణాల ‘కాక్టెయిల్’ అని ఎద్దేవా చేశారు. ‘‘అవన్నీ మా విధానాలు, కానీ విజయ వాటిని కాపీ చేశాడు. ఆయన ఏది చెప్పినా.. అది మేం ఇప్పటికే చెప్పాం, ఇప్పటికీ మేం వాటిని అనుసరిస్తున్నాం’’అని అన్నారు.ఇక.. నిన్న( ఆదివారం) విజయ్ తన తొలి బహిరంగ సభ ప్రసంగంలో అధికార డీఎంకే పార్టీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ద్రవిడియన్ మోడల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను తమ పార్టీ అనుసరిస్తామని తెలిపారు. తమిళనాడు గడ్డకు అవీ రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా పార్టీ భావజాలమని ఆయన స్పష్టం చేశారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొలి సభలోనే డీఎంకే, బీజేపీపై విమర్శలు గుప్పించారు. -
విజయ్ తొలి బహిరంగ సభ.. తమిళ హీరోల పూర్తి మద్దతు
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్.. విల్లుపురం సమీపంలో తన తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ మొదటి మహానాడు సభ నిర్వహించాడు. దీనికి దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా హాజరయ్యారని అంచనా. ఇందులో తన పార్టీ ఆలోచనలు, 2026 అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఏం చేయబోతున్నామో అనే విషయాల్ని విజయ్ చాలావరకు చెప్పుకొచ్చారు. వన్ కమ్యూనిటీ, వన్ గాడ్ అనే సిద్ధాంతంతో తమ పార్టీ ముందుకు వెళ్తుందని క్లారిటీ ఇచ్చారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: అవినాష్ ఎలిమినేట్ కాలేదు.. భార్యపై ఒట్టేసి అబద్ధాలు)ఇక రాజకీయంగా తొలి సభ పెట్టిన హీరో విజయ్‌కి తమిళ హీరోల నుంచి పూర్తిస్థాయిలో మద్ధతు లభించింది. శివకార్తికేయన్, విజయ్ సేతుపతి, జయం రవి, దర్శకులు నెల్సన్ దిలీప్ కుమార్, వెంకట్ ప్రభు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నటులు శశి కుమార్, వసంత్ రవి, కమెడియన్ సతీశ్, నిర్మాత అర్చన కళపతి.. ఇలా చాలామంది తమిళ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి విజయ్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)இன்று தனது புதிய பயணத்தை தொடங்கவிருக்கும் விஜய் சாருக்கு எனது மனமார்ந்த வாழ்த்துகள் 🙏❤️ @tvkvijayhq— Sivakarthikeyan (@Siva_Kartikeyan) October 27, 2024தவெக கட்சியின் முதல் மாநில மாநாடு சிறக்க,.தவெக தலைவர் விஜய் சாருக்கும், தொண்டர்களுக்குவாழ்த்துகள் #TVK_maanadu pic.twitter.com/dk9hU9wSDy— VijaySethupathi (@VijaySethuOffl) October 27, 2024Congratulations Thalapathy @actorvijay Anna on this incredible milestone #TVKMaanaadu 👍🏼Bring the same passion and dedication to politics that you’ve shown in cinema. Wishing you a great success on this new journey !!!— Jayam Ravi (@actor_jayamravi) October 27, 2024My hearty wishes to my dear @actorvijay sir for ur new beginning today ❤️💥👍💐— Nelson Dilipkumar (@Nelsondilpkumar) October 27, 2024Best wishes @tvkvijayhq na, as u beginning this inspiring new journey with today’s #Maanaadu !! May your vision bring positive change and light to many na!! 🙏🏽❤️🔥 #TVKMaanaadu pic.twitter.com/6QjxinH5Dx— venkat prabhu (@vp_offl) October 27, 2024Wishing Dearesr Anna ❤️🔥 @actorvijay @tvkvijayhq #TVKFlagAnthem 💥All the Very Best And Super Successfull #TVK_maanadu 💥✨⭐️ pic.twitter.com/tdGVpswl6z— thaman S (@MusicThaman) October 27, 2024உங்கள் வரவு, எளிய மக்களுக்கான பெரிய நம்பிக்கையாக அமையட்டும். 👍நல் வாழ்த்துகள்…விஜய் சார் @actorvijay @tvkvijayhq #TVKMaanaduoct27 #Thalapathy#தமிழகவெற்றிக்கழகம் pic.twitter.com/rAVGa4oj6z— M.Sasikumar (@SasikumarDir) October 27, 2024My heartfelt wishes to @actorvijay sir, for your wonderful start today, You have been truly an inspiration to many of us not only through your films alone, soon will be remembered and appreciated for your political journey too in the coming years…I am sure today will be a…— Vasanth Ravi (@iamvasanthravi) October 27, 2024திரைத்துறையைப் போல் இதிலும் வெற்றிக் கொடி நாட்ட வாழ்த்துக்கள் @tvkvijayhq sir 💪👏❤️ pic.twitter.com/1HdRmQngJV— Sathish (@actorsathish) October 27, 2024Wishing you the very best @tvkvijayhq na for the #TVK_maanadu today 🙌🔥 pic.twitter.com/CZyBS4z2wL— Archana Kalpathi (@archanakalpathi) October 27, 2024#தமிழகவெற்றிக்கழகம் மாற்றத்தை எதிர்பார்த்து வாழ்த்துகிறோம் வெற்றி பெற @actorvijay sir ☺️ pic.twitter.com/nzDH8VYXJZ— சாய் தன்ஷிகா (@SaiDhanshika) October 27, 2024 -
విజయ్ సభకు హోరెత్తిన జనసంద్రం (ఫొటోలు)
-
సినిమా వేరు.. రాజకీయం వేరు.. అయినా తగ్గేదేలే: విజయ్ పవర్ఫుల్ స్పీచ్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో పార్టీని స్థాపించిన ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారు. అందులో భాగంగానే ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించారు. విల్లుపురంలో నిర్వహించిన సభలో తమిళనాడు రాజకీయాలపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సినీరంగంతో పోలిస్తే రాజకీయాలు చాలా సీరియస్ అని విజయ్ కామెంట్స్ చేశారు. అయినా సరే పాలిటిక్స్‌లో భయపడేది లేదని స్పష్టం చేశారు. నా కెరీర్ పీక్స్ దశలో ఉన్నప్పుడే సినిమాలు వదిలేసి వచ్చానని తెలిపారు. తాను ఎవరికీ కూడా ఏ టీమ్.. బీ టీమ్ కాదని అన్నారు. ఈ సందర్భంగా టీవీకే పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ఆయన ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరయ్యారు.ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను అనుసరిస్తామని విజయ్ ప్రకటించారు. తమిళనాడు గడ్డకు అవీ రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా పార్టీ భావజాలమని ఆయన స్పష్టం చేశారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొలి సభలోనే డీఎంకే, బీజేపీపై విమర్శలు చేశారు. గతంలో ఎన్టీఆర్, ఎంజీఆర్ సైతం విమర్శలు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. తనను ఆర్టిస్ట్ అంటూ విమర్శలు చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. తొలి బహిరంగ సభలోనే తన స్పీచ్‌తో అదరగొట్టారు హీరో, టీవీకే అధినేత విజయ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సభ వేదికగా విజయ్ ప్రకటించారు. Tamil Nadu | Actor and TVK President Vijay says "In terms of ideology, we are not going to separate Dravidian Nationalism and Tamil Nationalism. They are two eyes of this soil. We shouldn't shrink ourselves to any specific identity. Secular Social Justice ideologies are our… pic.twitter.com/tclhef2BUk— ANI (@ANI) October 27, 2024 -
నేడు 'విజయ్' తొలి బహిరంగ సభ.. ఎంతమంది రానున్నారంటే..?
తమిళ సినీ రంగం నుంచి మరో అగ్రనటుడు పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారే తరుణం ఆసన్నమైంది. విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలై గ్రామంలో తమిళగ వెట్రి కళగం ఆవిర్భావోత్సవం, సిద్ధాంతాల వేడుకైన పార్టీ తొలి మహానాడు నేడు (అక్టోబర్ 27) జరగనుంది. ఇందుకోసం ఆ పార్టీ నేతలు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. అయితే, ఒకరోజు ముందుగానే నేతలందరూ విల్లుపురానికి చేరుకున్నారు. కాగా మహానాడులో విజయ్ ఏఏ అంశాలను ప్రస్తావిస్తారు.. ఎవరిని టార్గెట్ చేస్తారు.. సిద్ధాంతాలు ఏరకంగా ఉంటాయనే విషయం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.సభ హైలెట్స్ ఇవే..5 నుంచి 7 లక్షల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అంచనా .వేదికపై విజయ్ ఎగుర వేసే పార్టీ జెండా ఐదేళ్ల పాటు ఎగిరే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.చైన్నె – తిరుచ్చి జాతీయ రహదారిలోని వీసాలై వద్ద 85 ఎకరాల విస్తీర్ణంలో సినీ సెట్టింగ్‌లను మించి మహానాడు ఏర్పాట్లు.సభా వేదిక చుట్టూ.. వేలునాచ్చియార్, కామరాజర్, పెరియార్, అంబేడ్కర్, తమిళ తల్లి, చోళ, చేర, పాండ్య రాజుల కటౌట్లను ఏర్పాటు చేయడం.సభా ప్రాంగణంలో విజయ్ అభిమానులకు సమీపంలోకి వచ్చి పలకరించే విధంగా 800 మీటర్లకు ప్రత్యేకంగా ర్యాంప్ ఏర్పాటు.వాహనాల పార్కింగ్ కోసం 207 ఎకరాల స్థలం కేటాయింపు.చైన్నె నుంచి విక్రవాండి వరకు సుమారు 150 కి.మీ దూరంలో విజయ్ కటౌట్లు, పార్టీ జెండాలను తమిళగ వెట్రికళగం వర్గాలు ఏర్పాటు చేశాయి.ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు అభిమానులు, పార్టీ కేడర్ చేరుకునే విధంగా ప్లాన్.. సాయంత్రం 5 గంటలకు మహానాడు మొదలయ్యే రీతిలో షెడ్యూల్ సిద్ధం.మహానాడు భద్రత విధులలో ఇద్దరు డీఐజీలు, 10 మంది ఎస్పీలు, 15 మంది ఏడీఎస్పీలు, 50 మంది డీఎస్పీలు సహా 6 వేల మంది పోలీసులు ఉన్నారు. -
రెండు చేతులు చాచి ఆహ్వానం పలుకుతున్నా అంటూ విజయ్ లేఖ
దళపతి విజయ్ కొన్ని గంటల్లో తన అభిమానులను కలవనున్నాడు. తమిళగ వెట్రి కళగం పార్టీ స్థాపించిన తర్వాత తను తొలిసారి భారీ బహిరంగ సభలో పాల్గొంటున్నాడు. దీంతో రాజకీయాలపై ఆసక్తి ఉన్న దేశ ప్రజలు అందరూ ఆయన ఏం మాట్లాడనున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆదివారం విల్లుపురం జిల్లా విక్రవాండిలోని వీసాలైలో విజయ్ పార్టీ తొలి మహానాడు కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచం కీర్తించే రీతిలో వీసాలైలో పార్టీ ఆవిర్భావం, సిద్ధాంతాల వేడుకను జరుపుకుందామని కేడర్‌కు తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు, నటుడు విజయ్ పిలుపునిచ్చారు. మహానాడుకు కొంత సమయం మాత్రమే ఉండడంతో కేడర్‌కు పిలుపునిస్తూ విజయ్ లేఖ రాశారు. రేపు జరిగే మహానాడు ప్రపంచమే కీర్తించే వేడుకగా నిలవబోతోందని, ఆమేరకు వేడుక జరుపుకుందామని కేడర్‌కు సూచించారు. పార్టీ జెండాలతో తరలిరావాలని, వీసాలైలలో అందరికీ ఆహ్వానం పలికేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. బ్రహ్మాండ ఏర్పాట్లు జరిగాయని, ఈ సిద్ధాంతాల వేడుకకు తన గుండెల్లో గూడు కట్టుకున్న ప్రతి అభిమాని, కేడర్‌ను సగర్వంగా ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.తొలి మహానాడులో అందర్నీ తాను నేరుగా కలవనున్నట్లు వ్యాఖ్యలు చేశారు. ఇది సిద్ధాంతాల విజయపు వేడుక అని, రెండు చేతులు చాచి ఆహ్వానం పలుకుతున్నానని ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో, భద్రత, సురక్షితంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. హృదయం అనే తలుపును వీసాలై సరిహద్దుల్లో తెరచి ఉంచి ఆహ్వానిస్తుంటానని, మహానాడులో కలుద్దాం..తమిళ మట్టి గెలుపు కోసం శ్రమిద్దాం...2026 మన లక్ష్యం అని ముగించారు. కాగా, ఈ మహానాడు కోసం చేసిన ఏర్పాట్లపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. జాతీయ రహదారి వెంబడి ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు హోరెత్తించడంతో వాటిని తొలగించే విధంగా హుకుం జారీ చేశారు. అలాగే, కోయంబత్తూరులో అయితే విజయ్, అన్నాడీఎంకే దివంగత నేత ఎంజీఆర్ చిత్ర పటాలతో ఫొటోలు, ఫ్లెక్సీలు వెలిశాయి. -
మోస్ట్ పాపులర్ హీరోగా విజయ్.. ప్రభాస్ ప్లేస్ ఎంతంటే!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ స్టార్స్‌కు సంబంధించిన ర్యాంకులను ప్రకటిస్తుంది. హీరో, హీరోయిన్ల క్రేజ్ ఆధారంగా ప్రతినెల మోస్ట్ పాపులర్ స్టార్స్ పేరిట టాప్ టెన్ జాబితాను రిలీజ్ చేస్తోంది. తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆ జాబితాను విడుదల చేసింది.తాజాగా రిలీజైన జాబితాలో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్‌లో విజయ్ మొదటిస్థానంలో నిలవగా.. రెబల్ స్టార్ ప్రభాస్, షారూఖ్ ఖాన్ టాప్-3లో నిలిచారు. ఆ తర్వాత అజిత్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన విజయ్ ఇటీవలే ది గోట్ మూవీతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.టాప్‌లో సమంత.. రష్మిక ప్లేస్ ఎక్కడంటే?ఆర్మాక్స్ మీడియా వెల్లడించిన మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ జాబితాలో సమంత టాప్‌లో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్ భామలు ఆలియా భట్, దీపికా పదుకొణెలు నిలిచారు. ఆ తర్వాత వరుసగా..నయనతార, త్రిష, శ్రద్ధాకపూర్, కాజల్ అగర్వాల్, సాయిపల్లవి, రష్మిక మందన్నా, పదో స్థానంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ నిలిచింది.కాగా.. సమంత ప్రస్తుతం సిటాడెల్ హన్నీ బన్నీ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. రెండో స్థానంలో నిలిచిన ఆలియా భట్ ఇటీవలే జిగ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మూడో ప్లేస్‌లో ఉన్న దీపికా పదుకొణె కల్కి సినిమాతో అభిమానులను అలరించింది. Ormax Stars India Loves: Most popular female film stars in India (Sep 2024) #OrmaxSIL pic.twitter.com/wAxa5GF5DP— Ormax Media (@OrmaxMedia) October 22, 2024 Ormax Stars India Loves: Most popular male film stars in India (Sep 2024) #OrmaxSIL pic.twitter.com/ei4bfglzlm— Ormax Media (@OrmaxMedia) October 22, 2024 -
అభిమానులకు విజయ్ పిలుపు.. మొదటి సభకు ఏర్పాట్లు
దళపతి విజయ్ రాజకీయ జోరు పెంచనున్నారు. తొలి సభను నిర్వహించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు అభిమానులకు ప్రకటన వెలువడింది. నోటి మాటలతో కాదని, చేతల్లో చూపించడం మన భాష అని పార్టీ కేడర్‌కు తమిళగ వెట్రి కళగం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ పిలుపునిచ్చారు. పార్టీ అజెండా ఏంటో ప్రజలకు చెప్పేందుకు ఈ సభను ఏర్పాటు చేస్తున్నారు. తమిళగ వెట్రి కళగం మహానాడు ఈనెల 27వ తేదీన విల్లుపురం జిల్లా విక్రవాండిలో జరగనున్న విషయం తెలిసిందే. ఇక్కడి వీ సాలై ప్రాంతంలో శరవేగంగా మహానాడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిమానులు, కేడర్‌ను విజయ్ పలకరించేందుకు వీలుగా 800 మీటర్ల మేరకు ప్రత్యేకంగా ర్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. సెయింట్ జార్జ్ కోటను తలపించే విధంగా మహానాడు వేదిక రూపుకల్పన జరుగుతోంది. ఈ మహానాడును విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. అలాగే మహానాడు కోసం ఏర్పాటైన కమిటీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు భారీ జన సమీకరణ దిశగా పరుగు తీస్తున్నారు. ఈ పరిస్థితులలో విజయ్ అభిమానులకు ఒక పిలుపునిచ్చారు. ఈ సభ కోసం వృద్ధులు, గర్భిణులు, చంటి బిడ్డల తల్లులు, పిల్లలు, బాల బాలికలను మహానాడుకు తీసుకు రావద్దు అని సూచిస్తూ కేడర్‌కు లేఖ రాశారు. అయితే, అలాంటి వారందరి కోసం ఇంటి వద్ద నుంచే మహానాడును వీక్షించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
'లియో'కు ఏడాది.. మేకింగ్ వీడియో చూశారా..?
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన లియో చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అయితే, ఈ చిత్రం విడుదలై సరిగ్గా ఏడాది పూర్తి అవుతుంది. దీంతో అభిమానుల కోసం చిత్ర యూనిట్ ఒక కానుకను అందించింది. లోకేశ్- విజయ్ కాంబోలో మాస్టర్ తర్వాత ఈ చిత్రం గతేడాది అక్టోబర్ 19న విడుదలైంది. ఈ సినిమాలో త్రిష కథానాయికగా నటించగా.. సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, మిస్కిన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా లియో రూ. 620 కోట్ల గ్రాస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతటి విజయం సాధించిన సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తి కావడంతో 'లియో క్రానికల్స్' పేరుతో సుమారు 8 నిమిషాల నిడివి ఉన్న వీడియోను మేకర్స్ పంచుకున్నారు. సినిమాలో ట్రెండ్ అయిన సీన్స్‌ను ఎలా తెరకెక్కించారో చూపించారు. నెట్టింట వైరల్‌గా మారిన మేకింగ్ వీడియోను మీరూ చూసేయండి. -
విజయ్ సినిమా చూసి థియేటర్లో నిద్రపోయా: హీరోయిన్
తమిళ నటి అదితి బాలన్ శాకుంతలం మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే వచ్చిన సరిపోదా శనివారం చిత్రంలో హీరో నానికి సోదరిగా నటించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో దళపతి విజయ్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 15 నిమిషాల్లో నిద్రలోకి..విజయ్‌కు నేను పెద్ద అభిమానిని. వింటేజ్ విజయ్ అంటే చాలా ఇష్టం. అతడి అన్ని సినిమాలు చూస్తాను. అన్నింటిలోకెల్లా కిల్లీ నా ఫేవరెట్ మూవీ. ఒకసారేమైందంటే పాండిచ్చేరిలో దాదాపు 20 మంది ఫ్రెండ్స్ కలిసి బీస్ట్ సినిమా చూసేందుకు వెళ్లాం. 15 నిమిషాల వరకు బాగానే చూశాం. నానా హంగామా చేశాం. తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాం. నేనైతే ఏకంగా నిద్రపోయాను. నా ఫ్రెండ్స్ అది కూడా వీడియో తీశారు. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంనిజంగానే బీస్ట్ మూవీ చూస్తుంటే తెలియకుండానే నిద్ర ఆవహించింది అని చెప్పుకొచ్చింది. ఈ మాటలు విన్న విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక నటివి అయ్యుండి హీరో గురించి ఇలాగే మాట్లాడతావా? అని మండిపడుతున్నారు. కాగా అదితి బాలన్.. అరువి సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తమిళ, మలయాళ, తెలుగు భాషల్లో సినిమాలు చేస్తోంది. కథానాయికగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ యాక్ట్ చేస్తోంది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ది గోట్ సరికొత్త రికార్డ్.. కేక్ కట్ చేసిన విజయ్
విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ది గోట్. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సుమారు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటించగా.. ఈ సినిమాలో త్రిష ప్రత్యేక సాంగ్‌లో మెరిశారు.తాజాగా దళపతి విజయ్ తన చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నాఈ చిత్రం తమిళనాడులో రూ. 100 కోట్ల షేర్ సాధించడంతో నిర్మాత అర్చన కల్పాతితో కలిసి కేక్ కట్ చేశారు. అర్చనతో కలిసి నటుడు కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా.. ఈ చిత్రంలో విజయ్ రెండు పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి అమరేన్, యుగేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. Celebrating #TheGreatestOfAllTime moment with @actorvijay na❤️❤️❤️ @archanakalpathi for achieving #100CRORESSHAREINTAMILNADU @vp_offl @Jagadishbliss bro thanks @Ags_production @agscinemas @aishkalpathi pic.twitter.com/JdaTdxpvCq— raahul (@mynameisraahul) October 12, 2024 -
వెట్టయాన్ ఫస్ట్ షో వీక్షించిన స్టార్ హీరో.. వీడియో వైరల్
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న భారీ యాక్షన్ చిత్రం వెట్టైయాన్. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా సినిమా దసరా సందర్భంగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. జైలర్ తర్వాత తలైవా నటించిన చిత్రం కావడంతో థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది. ఈ మూవీతో అమితాబ్‌తో పాటు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కీలక పాత్రలు పోషించారు.అయితే రజినీకాంత్ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఫ్యాన్ బేస్ ఓ రేంజ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తమిళ అభిమానం గురించి చెప్పాల్సిన పనిలేదు. రిలీజ్ మొదటి రోజే ఫస్ట్ షో చూడాలనే ఆతృత అభిమానులకు ఉంటుంది. కానీ ఒక స్టార్ హీరో మూవీ ఫస్ట్ షో చూడడం చాలా అరుదుగా కనిపించే సన్నివేశం. ఇవాళ అలాంటి అరుదైన సంఘటనే చోటు చేసుకుంది.ఇటీవల ది గోట్ మూవీ అభిమానులను మెప్పంచిన విజయ్.. రజినీకాంత్ చిత్రం వేట్టయాన్ ఫస్ట్ షోను వీక్షించారు. ఆయనతో పాటు ది గోట్ డైరెక్టర్ వెంకట్ ప్రభు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్.. రజనీకాంత్‌కు అభిమాని కావడంతో మొదటి ఆటను చెన్నైలో ఓ థియేటర్లో చూశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. வேட்டையன் படம் பார்த்த விஜய்... தலைவருக்காக வந்த தளபதி..!#Chennai #ThalapathyVijay #Vijay #Vettaiyan #VettaiyyanMovie #VettaiyanFDFS #VettaiyanReviews #Rajinikanth #DeviTheatre #NewsTamil #NewsTamil24x7 pic.twitter.com/csFT8A3FUB— News Tamil 24x7 (@NewsTamilTV24x7) October 10, 2024 -
విజయ్ పై ఫ్యాన్స్ ఫైర్..
-
దళపతి ఆరంభం
తమిళ స్టార్ హీరోల్లో ఒకరైన విజయ్ నటిస్తున్న 69వ చిత్రం ‘దళపతి 69’ శుక్రవారం ఘనంగాప్రారంభమైంది. ఈ చిత్రానికి హెచ్ .వినోద్ దర్శకత్వం వహిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. కేవీఎన్ప్రోడక్షన్స్పై ఎన్కే, వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ నటీనటులు, సాంకేతిక నిపుణుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. ‘‘విజయ్ కెరీర్లో హిస్టారిక్ప్రాజెక్ట్ ‘దళపతి 69’. తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ సిల్వర్ స్క్రీన్ మీద చివరిసారిగా కనిపించనున్న చిత్రం మాదే.దళపతి ఫ్యాన్స్‌కి ఇదొక ఎమోషనల్ప్రాజెక్ట్. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. విజయ్ వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను అత్యంత భారీగా, తరాలు గుర్తుపెట్టుకునేలా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో 2025 అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. బాబీ డీయోల్, గౌతమ్ వాసుదేవ మీనన్, ప్రియమణి, ప్రకాశ్‌రాజ్, మమిత బైజు ఇతరపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, కెమెరా: సత్యన్ సూర్యన్. -
ఓటీటీకి వచ్చేసిన 'ది గోట్' మూవీ.. ఎక్కడ చూడాలంటే?
విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ది గోట్. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సుమారు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది.ఈ రోజు నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమాలో త్రిష ప్రత్యేక సాంగ్‌లో మెరిశారు.కథేంటంటే.. గాంధీ(విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పని చేస్తుంటాడు. ఈ విషయం ఆయన భార్య అను(స్నేహ)కూడా తెలియదు. సునీల్(ప్రశాంత్), కల్యాణ్ సుందర్(ప్రభుదేవా), అజయ్(అజ్మల్) అతని టీమ్ సభ్యులు. నజీర్ (జయరాం) అతని బాస్. ఓ సీక్రెట్ మిషన్ కోసం గర్భవతి అయిన భార్య, కొడుకు జీవన్‌తో కలిసి గాంధీ థాయిలాండ్ వెళ్తాడు. మిషన్ పూర్తి చేసే క్రమంలో కొడుకు జీవన్ మరణిస్తాడు. కొడుకు చావుకు తానే కారణమని భావించి, గాంధీ తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు.అయితే కొన్నేళ్ల తర్వాత గాంధీ ఓ పని మీద రష్యాకు వెళ్లగా అక్కడ అతనికి కొడుకు జీవన్(విజయ్) కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న కొడుకు మళ్లీ తిరిగి రావడంతో గాంధీ సంతోషంగా అతన్ని ఇండియాకు తీసుకెళ్లాడు. భార్య, పిల్లలతో కలిసి లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో.. తన బాస్ నజీర్(జయ రామ్)ని ఎవరో చంపేస్తారు. తనకు ఓ సీక్రెట్ చెప్పాలని అనుకున్న సమయంలోనే హత్య జరగడంతో గాంధీ అప్రమత్తం అవుతాడు. దీని వెనుక ఉన్నదెవరని ఎంక్వేరీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి ఆ హత్యలు చేస్తున్నదెవరు? చనిపోయాడనుకున్న జీవిన్ తిరిగి ఎలా వచ్చాడు? మీనన్(మోహన్) ఎవరు? అతనికి గాంధీకి మధ్య ఉన్న వైరం ఏంటి? కన్న తండ్రిపై జీవన్ ఎందుకు పగ పెంచుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.Adavi ki raju simham aithe, ee lokaaniki raju ee GOAT! 🔥Thalapathy Vijay’s The G.O.A.T - The Greatest of all time is coming to Netflix on 3 October in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi! 🐐#TheGOATOnNetflix pic.twitter.com/MQgFkpV6gl— Netflix India South (@Netflix_INSouth) October 2, 2024 -
దళపతి సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసిన బుట్టబొమ్మ..!
దళపతి విజయ్ ఇటీవలే ది గోట్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. సెప్టెంబర్ 5న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ త్వరలోనే ఓటీటీలోనూ సందడి చేయనుంది. ఈ నెల 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.అయితే విజయ్ మరో చిత్రానికి రెడీ అయ్యారు. హెచ్ వినోత్ డైరెక్షన్లో ఆయన నటించనున్నారు. అయితే ఈ మూవీలో దళపతి సరసన బుట్టబొమ్మ ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా ప్రొడక్షన్ హౌస్ పూజా హెగ్డేకి స్వాగతం పలుకుతూ పోస్టర్‌ను విడుదల చేసింది. అంతకుముందు పూజా హెగ్డే బీస్ట్ చిత్రంలో విజయ్ సరసన నటించింది. ఈ చిత్రంలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటిస్తున్నారు. రాజకీయాల్లో పోటీకి ముందు ఈ సినిమానే విజయ్ కెరీర్లో చివరి చిత్రంగా నిలవనుంది.(ఇది చదవండి: ఓటీటీలో విజయ్ 'ది గోట్' సినిమా.. అధికారిక ప్రకటన)దళపతి 69 పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్లో విజయ్ టార్చ్ పట్టుకుని కనిపించారు. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 5న షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. View this post on Instagram A post shared by KVN Productions (@kvn.productions) View this post on Instagram A post shared by KVN Productions (@kvn.productions)