ఈపీడీసీఎల్ సీఎండీగా నాయక్
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) సీఎండీగా ముదావత్ ఎం.నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విశాఖలోని కార్పొరేట్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు డైరెక్టర్లు బి.శేషుకుమార్, టి.వి.ఎస్.చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.రమేష్‌ప్రసాద్‌లు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సీజీఎంలు, జీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఇతర ఉద్యోగులతో పాటు విద్యుత్ ఉద్యోగుల యూనియన్ల ప్రతినిధులు కొత్త సీఎండీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విలేకరులతో నాయక్ మాట్లాడుతూ ఐదు జిల్లాల్లో నాణ్యమైన విద్యుత్‌ను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలను సమర్థవంతంగా అమలుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తామని తెలిపారు.